పోరాటాలకు ఆదివాసీలు సిద్ధం కావాలి | Tribal conflict should be ready | Sakshi
Sakshi News home page

పోరాటాలకు ఆదివాసీలు సిద్ధం కావాలి

Published Wed, Aug 10 2016 12:24 AM | Last Updated on Sat, Sep 15 2018 2:27 PM

Tribal conflict should be ready

నర్సంపేట : ఆదివాసీలపై ప్రభుత్వ నిర్భందాలు, దోపిడీ, అణచివేతలకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు ఆదివాసీలు సిద్ధం కావాలని సీపీఐ(ఎంఎల్‌)న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు చం ద్రన్న అన్నారు. ఈ మేరకు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ ఆదివాసీ పోరాటదినం సందర్భంగా మంగళవారం సదస్సు నిర్వహించారు.
 
ముందుగా పాకాల రోడ్‌ నుంచి వరంగల్‌ రోడ్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలను హరిస్తూనే వారి గురించి గొప్పలు మాట్లాడుతున్న పాలకులను ఆదివాసీ సమాజం నిలదీయాలన్నారు. హరితహారం పేరుతో పోడు భూములను లాక్కుంటున్నారన్నారు. కార్యక్రమంలో ప్రభాకరన్న, లావుడ్య రాజు, నర్సక్క, జీవన్, కట్టన్న, ఉపేందర్, తిరుపతక్క, నర్సన్న, నర్సింహారావు, అభి, పాణి, రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement