భూ వివాదం.. దాయాదుల మధ్య చిచ్చుపెట్టింది. ఇరు వర్గాల వారు ఒకరిపై మరొకరు ఘర్షణకు దిగారు. ఈ విషయం పై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక వర్గం వారిని మరో వర్గం వారు మార్గ మధ్యలో పట్టుకొని చితకబాదారు. కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో.. ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.
గ్రామనికి చెందిన మహబూబ్‌సాబ్‌కు రహీంబాబాకు మధ్య భూమికి సంబంధించిన విషయంలో తరచూ తగాదాలు జరుగుతుండేవి. ఈ క్రమంలో శుక్రవారం కూడా వీరి మధ్య వివాదం తలెత్తడంతో.. దాని పై ఫిర్యాదు చేయడానికి వెళ్తున్న మహబూబ్‌సాబ్(55), హసీమొద్దీన్(32), హాజుద్దీన్(25)లపై రహీంబాబా అనుచరులతో కలిసి వారిపై దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీస్‌స్టేషన్‌కు వెళ్తుండగా..
Published Sat, Nov 7 2015 12:05 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement