Severe injuries
-
యూకేలో సౌతాఫ్రికా క్రికెటర్‌పై దాడి.. పరిస్థితి విషమం
సౌతాఫ్రికా క్రికెటర్ మొండ్లీ ఖుమాలోపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతానికి అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. మరొక రోజు గడిస్తే కానీ ఖుమాలో పరిస్థితి చెప్పలేమన్నారు. విషయంలోకి వెళితే.. సౌతాఫ్రికాకు చెందిన మొండ్లీ ఖుమాలో యూకేలో కౌంటీ క్రికెట్ ఆడేందుకు వచ్చాడు. అతను నార్త్ పెర్తర్టన్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా మొండ్లీ ఖుమాలో మే 29(ఆదివారం) మ్యాచ్ ముగించుకొని ఇంటికి బయల్దేరాడు. బ్రిడ్జ్‌వాటర్ సమీపంలోకి రాగానే ఫ్రియర్న్ స్ట్రీట్‌లో గ్రీన్ డ్రాగన్ పబ్ వద్ద కొందరు వ్యక్తులు మొండ్లీ ఖుమాలోకు అడ్డువచ్చారు. తనకు ఎందుకు అడ్డువచ్చారని అడిగేలోపే ఖుమాలోపై దాడికి పాల్పడ్డారు. అతన్ని విచక్షణారహితంగా కొట్టిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో తీవ్ర గాయాలపాలైన మొండ్లీ ఖుమాలోను అక్కడి స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దెబ్బలు బాగా తగలడంతో ఖుమాలో పరిస్థితి సీరియస్‌గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా ఖుమాలో స్నేహితుడు.. తోటి క్రికెటర్ టియాన్ కోకెమోర్ ట్విటర్ వేదికగా తన స్నేహితుడు కోలుకోవాలని.. అందుకు మీరంతా ప్రార్థించాలంటూ ట్వీట్ చేశాడు.''మనం నీచమైన ప్రపంచంలో బతుకు జీవనం సాగిస్తున్నాం. నా స్నేహితుడు.. జట్టు సభ్యుడు మొండ్లీ ఖుమాలో త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. గత ఆదివారం ఇంటికి వస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని.. ప్రస్తుతం యూకేలోని ఆసుపత్రిలో మృత్యువు నుంచి తప్పించుకోవడానికి పోరాటం చేస్తున్నాడు''. అంటూ పేర్కొన్నాడు. కాగా విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ఖుమాలోపై దాడికి దిగిన వారిలో ఒక 27 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా ఖుమాలోపై దాడి విషయాన్ని పోలీసులు సౌతాఫ్రికాలో ఉన్న తన కుటుంబసభ్యులకు తెలియజేశారు. ఖుమాలో ప్రాతినిధ్యం వహిస్తున్న నార్త్ పెర్తర్టన్ క్రికెట్ క్లబ్ దాడిని ఖండించింది. ''దుండగుల చేతిలో గాయపడి ఆసుపత్రిలో కోలుకుంటున్న మొండ్లీ ఖుమాలోకు మా మద్దతు ఉంటుంది. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం.'' అని తెలిపింది. కాగా 20 ఏళ్ల మొండ్లీ ఖుమాలో 2018లో క్వాజులు-నాటల్ ఇన్లాండ్ తరపున టి20 అరంగేట్రం చేశాడు. 2020 అండర్-19 ప్రపంచకప్ సౌతాఫ్రికా జట్టులో మొండ్లీ ఖుమాలో చోటు దక్కించుకున్నాడు. ఇక 2020 మార్చి 7న లిస్ట్-ఏ, 2021 మార్చి 4న ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఐదు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, రెండు లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 4 టి20 మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: Darren Sammy: వెస్టిండీస్ మాజీ కెప్టెన్‌కు పాకిస్తాన్ ప్రతిష్టాత్మక అవార్డు What a sick world we live in! 😡Please pray for my teammate Mondli Khumalo! 🙏🏻🙏🏻❤️🐘 He was brutally assaulted while heading home from a night out and he is currently fighting for his life in hospital in the UK. pic.twitter.com/94MrXhArs4 — Tian Koekemoer (@TianKoekemoer07) May 30, 2022 -
వ్యక్తిపై కొడవలితో దాడి
కొండాపురం: మండల పరిధిలోని చౌటిపల్లె గ్రామానికి చెందిన లింగేశ్వర్‌రెడ్డిపై సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి కొడవలితో దాడి చేసినట్లు కొండాపురం ఎస్ఐ రవికుమార్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు రోజుల నుంచి వర్షం కురవడంతో ఇళ్ల మధ్య బురదమయమైందన్నారు. అక్కడే పశువులు కూడా కట్టేయడంతో మరింత రొచ్చుగా తయారైందన్నారు. ఈ విషయమై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిందన్నారు. దీంతో లింగేశ్వర్రెడ్డి తలపై మచ్చుకొడవలితో సుధాకర్‌రెడ్డి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయన్నారు. వెంటనే అతన్ని అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
పోలీస్‌స్టేషన్‌కు వెళ్తుండగా..
భూ వివాదం.. దాయాదుల మధ్య చిచ్చుపెట్టింది. ఇరు వర్గాల వారు ఒకరిపై మరొకరు ఘర్షణకు దిగారు. ఈ విషయం పై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక వర్గం వారిని మరో వర్గం వారు మార్గ మధ్యలో పట్టుకొని చితకబాదారు. కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో.. ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామనికి చెందిన మహబూబ్‌సాబ్‌కు రహీంబాబాకు మధ్య భూమికి సంబంధించిన విషయంలో తరచూ తగాదాలు జరుగుతుండేవి. ఈ క్రమంలో శుక్రవారం కూడా వీరి మధ్య వివాదం తలెత్తడంతో.. దాని పై ఫిర్యాదు చేయడానికి వెళ్తున్న మహబూబ్‌సాబ్(55), హసీమొద్దీన్(32), హాజుద్దీన్(25)లపై రహీంబాబా అనుచరులతో కలిసి వారిపై దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి పనులు కోసం వెళ్ళి
పెళ్ళి పనులు కోసం వెళుతున్న తాతా మనవళ్లను టెంపో ఢీకొట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఉలవ పాడు మండలం వీరేపల్లి వద్ద జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఉలవపాడుకు చెందిన తన్నీరు వెంకటేశ్వరరావుతన మనవడు అనిల్ పెళ్లి పనుల కోసం బయలు దేరారు. వీరు వెళుతున్న బైక్ ను వీరేపల్ఇ వద్ద టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. అనిల్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. -
వ్యక్తిపై ఎలుగుబంటి దాడి
వ్యవసాయ పొలంలో పనుల కోసం వెళ్లిన ఓ వ్యక్తిపై ఎలుగు బంటి దాడి చేసింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం ఉంకుటూరు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఉంకుటూరు గ్రామంలోని సింహాచలం అనే రైతు తెల్లవారు జామున తన పొలానికి వెళ్లాడు... దారిలో ఒక ఎలుగు అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఇది గమనించిన సమీప పోలాల్లోని వ్యక్తులు ఎలుగు బంటిని తరిమి.. తీవ్రంగా గాయపడ్డ సింహాచంలాన్ని అసుపత్రికి తరలించారు. -
వీధికుక్కల స్వైర విహారం
మెదక్ జిల్లా దుబ్బాకలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. కుక్కల దాడిలో ఆరుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. చిన్నారులను చికిత్స నిమిత్తం హుటాహుటిన సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు -
పిడుగు పాటుకు ఇద్దరు మృతి
పిడుగు పాటుకు గురై రాష్ట్రంలో ఇద్దరు వృద్దులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కుందూరు లక్ష్మమ్మ(65) సోమవారం గ్రామ సమీపంలోని వరి పొలంలో కలుపు తీస్తోంది. మధ్యాహ్నం హఠాత్తుగా వర్షం కురవడంతో అంతా దగ్గర్లోని చెట్టుకిందకు చేరారు. చెట్టుమీద పిడుగు పడటంతో లక్ష్మమ్మ అక్కడికక్కడే మరణించింది. సమీపంలో ఉన్న మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో ఘటనలో వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం కొమ్మివారిపల్లెకు చెందిన మేడికొండూరు నారాయణ(62) పిడుగు పాటుతో మరణించాడు. భార్యతో కలసి సోమవారం నిమ్మతోటలో కాయలు కోస్తుండగా.. నారాయణపై పిడుగు పడింది. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. ఆయన భార్య షాక్‌కు గురైంది. ఆమెను వెంటనే తోటి రైతులు రాజంపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
బాబోయ్.. కుక్కలు!
ఇద్దరు చిన్నారులపై దాడి.. తీవ్ర గాయాలు హైదరాబాద్: రాజధాని నగరంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నారులు కనిపిస్తే చాలు రెచ్చిపోయి మీద పడుతున్నాయి. గురువారం ఆరేళ్ల చిన్నారితోపాటు ఓ హాస్టల్ విద్యార్థిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. మహబూబ్‌నగర్ జిల్లా జాతరపల్లికి చెందిన శ్రీకాంత్ బోయిన్‌పల్లిలోని బాపూజీనగర్‌లో గిరిజన సంక్షేమ హాస్టల్లో ఉంటూ సమీపంలోని పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. హాస్టల్లో నీరు లేకపోవడంతో సాయంత్రం దగ్గర్లోని ఓ హోటల్‌కు వెళ్లాడు. ఈ సమయంలో శ్రీకాంత్‌పై పిచ్చికుక్క దాడి చేసి నుదురు, కంటిరెప్పపై కరిచింది. స్థానికులు కుక్కను తరిమికొట్టి బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరో ఘటన రామంతాపూర్‌లో చోటుచేసుకుంది. ధృతి అనే ఆరేళ్ల చిన్నారి ఉదయం స్కూల్‌కు వెళ్లేందుకు తయారై ఇంటి ముందు గేట్ వద్ద నిల్చుంది. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వీధి కుక్క ధృతిపై దాడి చేసింది. చిన్నారి కుడి కన్నుపై తీవ్రంగా గాయపర్చింది. తల్లిదండ్రులు చికిత్స కోసం పాపను ఆసుపత్రిలో చేర్చారు. -
ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదం
ట్రక్కును ఢీకొట్టిన తాండూరు డిపో బస్సు పింప్రి, న్యూస్‌లైన్ : ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ హైవేపై సోమవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు డ్రైవరుతో సహా 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం తాండూరు (మంచర్ల) నుంచి ముంబైలోని కుర్లాకి బయల్దేరిన ఏపీ 21జెడ్437 బస్సు సోమవారం ఉదయం నాలుగు గంటలకు పుణేకు చేరుకుంది. అక్కడినుంచి తిరిగి ముంబైకి వెళుతుండగా లోనావాలా సమీపంలోని మాలవలి-దేవలే గ్రామం వద్ద ఆగి ఉన్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న 17 మంది గాయపడగా వీరిని చికిత్స నిమిత్తం నిగిడిలోని లోకమాన్య తిలక్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న తాండూరు ఆర్టీసీ డిపో అధికారులు నిగిడికి వెళ్లారు. క్షతగాత్రుల్లో బస్సు డ్రైవర్లు సి.బాలారెడ్డి (34), తాండూరుకు చెందిన జి.నరేంద్రరెడ్డి (38) ఉన్నారు వీరితోపాటు గాయపడిన వారిలో సునీత ఆంజనేయులు కోతళ్లు (30), నర్సింగ్ కొల్లప్ప (40), కొల్లప్ప తాయప్ప మదార్ (28), అనంతమ్మ కొత్తకొళ్ల (30), చెన్నమ్మ కర్తాల్ (50), చంద్రప్ప ముద్రరాజ్ కర్తల్ (20), వెంకటప్ప కర్తాల్ (40), లక్ష్మి వెంకటప్ప కర్తాల్ (35), అనిత అంజప్ప కడక్కోండ్ర (30), లాలెప్ప కనకప్ప ముద్రరాజ్ (38), అనంతమ్మ కొరక్రోడ (30)లు ఉన్నారు. వీరితోపాటు నవీముంబైలోని పన్వేల్‌కు చెందిన రమేష్ రామచంద్ర వి.సుధ (21), భయందర్‌కు చెందిన అనురాధా చిన్నప్ప పకోల్ (26)లు కూడా ఉన్నారు. క్షతగాత్రుల్లో మరో ఇద్దరి పేర్లు తెలియరాలేదు. లోనావాలా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.