సౌతాఫ్రికా క్రికెటర్ మొండ్లీ ఖుమాలోపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతానికి అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. మరొక రోజు గడిస్తే కానీ ఖుమాలో పరిస్థితి చెప్పలేమన్నారు. విషయంలోకి వెళితే.. సౌతాఫ్రికాకు చెందిన మొండ్లీ ఖుమాలో యూకేలో కౌంటీ క్రికెట్ ఆడేందుకు వచ్చాడు. అతను నార్త్ పెర్తర్‌టన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా మొండ్లీ ఖుమాలో మే 29(ఆదివారం) మ్యాచ్ ముగించుకొని ఇంటికి బయల్దేరాడు.
బ్రిడ్జ్‌వాటర్ సమీపంలోకి రాగానే ఫ్రియర్న్ స్ట్రీట్‌లో గ్రీన్ డ్రాగన్ పబ్ వద్ద కొందరు వ్యక్తులు మొండ్లీ ఖుమాలోకు అడ్డువచ్చారు. తనకు ఎందుకు అడ్డువచ్చారని అడిగేలోపే ఖుమాలోపై దాడికి పాల్పడ్డారు. అతన్ని విచక్షణారహితంగా కొట్టిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో తీవ్ర గాయాలపాలైన మొండ్లీ ఖుమాలోను అక్కడి స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దెబ్బలు బాగా తగలడంతో ఖుమాలో పరిస్థితి సీరియస్‌గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కాగా ఖుమాలో స్నేహితుడు.. తోటి క్రికెటర్ టియాన్ కోకెమోర్ ట్విటర్ వేదికగా తన స్నేహితుడు కోలుకోవాలని.. అందుకు మీరంతా ప్రార్థించాలంటూ ట్వీట్ చేశాడు.''మనం నీచమైన ప్రపంచంలో బతుకు జీవనం సాగిస్తున్నాం. నా స్నేహితుడు.. జట్టు సభ్యుడు మొండ్లీ ఖుమాలో త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. గత ఆదివారం ఇంటికి వస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని.. ప్రస్తుతం యూకేలోని ఆసుపత్రిలో మృత్యువు నుంచి తప్పించుకోవడానికి పోరాటం చేస్తున్నాడు''. అంటూ పేర్కొన్నాడు.
కాగా విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ఖుమాలోపై దాడికి దిగిన వారిలో ఒక 27 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా ఖుమాలోపై దాడి విషయాన్ని పోలీసులు సౌతాఫ్రికాలో ఉన్న తన కుటుంబసభ్యులకు తెలియజేశారు. ఖుమాలో ప్రాతినిధ్యం వహిస్తున్న నార్త్ పెర్తర్‌టన్ క్రికెట్ క్లబ్ దాడిని ఖండించింది. ''దుండగుల చేతిలో గాయపడి ఆసుపత్రిలో కోలుకుంటున్న మొండ్లీ ఖుమాలోకు మా మద్దతు ఉంటుంది. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం.'' అని తెలిపింది.
కాగా 20 ఏళ్ల మొండ్లీ ఖుమాలో 2018లో క్వాజులు-నాటల్ ఇన్లాండ్ తరపున టి20 అరంగేట్రం చేశాడు. 2020 అండర్-19 ప్రపంచకప్ సౌతాఫ్రికా జట్టులో మొండ్లీ ఖుమాలో చోటు దక్కించుకున్నాడు. ఇక 2020 మార్చి 7న లిస్ట్-ఏ, 2021 మార్చి 4న ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఐదు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, రెండు లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 4 టి20 మ్యాచ్‌లు ఆడాడు.
చదవండి: Darren Sammy: వెస్టిండీస్ మాజీ కెప్టెన్‌కు పాకిస్తాన్ ప్రతిష్టాత్మక అవార్డు
What a sick world we live in! 😡Please pray for my teammate Mondli Khumalo! 🙏🏻🙏🏻❤️🐘
— Tian Koekemoer (@TianKoekemoer07) May 30, 2022
He was brutally assaulted while heading home from a night out and he is currently fighting for his life in hospital in the UK. pic.twitter.com/94MrXhArs4
Comments
Please login to add a commentAdd a comment