South African cricketer
-
యూకేలో సౌతాఫ్రికా క్రికెటర్‌పై దాడి.. పరిస్థితి విషమం
సౌతాఫ్రికా క్రికెటర్ మొండ్లీ ఖుమాలోపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతానికి అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. మరొక రోజు గడిస్తే కానీ ఖుమాలో పరిస్థితి చెప్పలేమన్నారు. విషయంలోకి వెళితే.. సౌతాఫ్రికాకు చెందిన మొండ్లీ ఖుమాలో యూకేలో కౌంటీ క్రికెట్ ఆడేందుకు వచ్చాడు. అతను నార్త్ పెర్తర్టన్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా మొండ్లీ ఖుమాలో మే 29(ఆదివారం) మ్యాచ్ ముగించుకొని ఇంటికి బయల్దేరాడు. బ్రిడ్జ్‌వాటర్ సమీపంలోకి రాగానే ఫ్రియర్న్ స్ట్రీట్‌లో గ్రీన్ డ్రాగన్ పబ్ వద్ద కొందరు వ్యక్తులు మొండ్లీ ఖుమాలోకు అడ్డువచ్చారు. తనకు ఎందుకు అడ్డువచ్చారని అడిగేలోపే ఖుమాలోపై దాడికి పాల్పడ్డారు. అతన్ని విచక్షణారహితంగా కొట్టిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో తీవ్ర గాయాలపాలైన మొండ్లీ ఖుమాలోను అక్కడి స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దెబ్బలు బాగా తగలడంతో ఖుమాలో పరిస్థితి సీరియస్‌గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా ఖుమాలో స్నేహితుడు.. తోటి క్రికెటర్ టియాన్ కోకెమోర్ ట్విటర్ వేదికగా తన స్నేహితుడు కోలుకోవాలని.. అందుకు మీరంతా ప్రార్థించాలంటూ ట్వీట్ చేశాడు.''మనం నీచమైన ప్రపంచంలో బతుకు జీవనం సాగిస్తున్నాం. నా స్నేహితుడు.. జట్టు సభ్యుడు మొండ్లీ ఖుమాలో త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. గత ఆదివారం ఇంటికి వస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని.. ప్రస్తుతం యూకేలోని ఆసుపత్రిలో మృత్యువు నుంచి తప్పించుకోవడానికి పోరాటం చేస్తున్నాడు''. అంటూ పేర్కొన్నాడు. కాగా విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ఖుమాలోపై దాడికి దిగిన వారిలో ఒక 27 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా ఖుమాలోపై దాడి విషయాన్ని పోలీసులు సౌతాఫ్రికాలో ఉన్న తన కుటుంబసభ్యులకు తెలియజేశారు. ఖుమాలో ప్రాతినిధ్యం వహిస్తున్న నార్త్ పెర్తర్టన్ క్రికెట్ క్లబ్ దాడిని ఖండించింది. ''దుండగుల చేతిలో గాయపడి ఆసుపత్రిలో కోలుకుంటున్న మొండ్లీ ఖుమాలోకు మా మద్దతు ఉంటుంది. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం.'' అని తెలిపింది. కాగా 20 ఏళ్ల మొండ్లీ ఖుమాలో 2018లో క్వాజులు-నాటల్ ఇన్లాండ్ తరపున టి20 అరంగేట్రం చేశాడు. 2020 అండర్-19 ప్రపంచకప్ సౌతాఫ్రికా జట్టులో మొండ్లీ ఖుమాలో చోటు దక్కించుకున్నాడు. ఇక 2020 మార్చి 7న లిస్ట్-ఏ, 2021 మార్చి 4న ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఐదు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, రెండు లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 4 టి20 మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: Darren Sammy: వెస్టిండీస్ మాజీ కెప్టెన్‌కు పాకిస్తాన్ ప్రతిష్టాత్మక అవార్డు What a sick world we live in! 😡Please pray for my teammate Mondli Khumalo! 🙏🏻🙏🏻❤️🐘 He was brutally assaulted while heading home from a night out and he is currently fighting for his life in hospital in the UK. pic.twitter.com/94MrXhArs4 — Tian Koekemoer (@TianKoekemoer07) May 30, 2022 -
ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే వార్త.. స్టార్ ప్లేయర్ రీ ఎంట్రీ కన్ఫర్మ్
AB De Villiers To Reunite With RCB: తన ఐపీఎల్ రీ ఎంట్రీపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారంపై సౌతాఫ్రికా లెజెండరీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ స్పందించాడు. తాజాగా వీయూ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏబీడీ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ (2023)కు తాను తప్పక అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. తన కోర్ జట్టైన ఆర్సీబీతో తన బంధం కొనసాగిస్తానని పక్కా చేశాడు. అయితే, క్రికెటర్‌గా ఎంట్రీ ఇస్తాడా లేక ఇతర పాత్రలో కనిపిస్తాడా అన్న అంశంపై ఎలాంటి క్లూ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. వయసు రిత్యా ఏబీడీ ఆటగాడిగా బరిలోకి దిగే అవకాశాలు లేవు కాబట్టి కోచ్‌గానో లేక మెంటార్‌గానో బాధ్యతలు చేపట్టవచ్చని ఆర్సీబీ అభిమానులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఏబీడీ ఆర్సీబీ తరఫున రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్త తెలిసి ఆర్సీబీ ఫ్యాన్స్ తెగ సంబురపడిపోతున్నారు. ఏబీడీ రీ ఎంట్రీపై అతని సహచరుడు విరాట్ కోహ్లి కొద్ది రోజుల కిందటే క్లూని వదిలాడు. కాగా, 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన మిస్టర్ డిగ్రీస్ ప్లేయర్.. గతేడాది ఐపీఎల్ నుంచి కూడా వైదొలిగిన విషయం తెలిసిందే. 2011 సీజన్లో ఆర్సీబీతో జతకట్టిన ఏబీడీ.. 11 సీజన్ల పాటు నిర్విరామంగా ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతకుకుందు అతను మూడు సీజన్ల పాటు ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు ఆడాడు. ఆర్సీబీ తరఫున 156 మ్యాచ్‌లు ఆడిన ఈ విధ్వంసకర ఆటగాడు 2 శతకాలు, 37 అర్ధ శతకాల సాయంతో 4491 పరుగులు చేశాడు. ఇటీవలే ఆర్సీబీ ప్రకటించిన హాల్ ఆఫ్ ఫేమ్‌లోనూ ఏబీడీ చోటు దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా 184 మ్యాచ్‌లు ఆడిన ఏబీడీ 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీల సాయంతో 5162 పరుగులు చేశాడు. అతని స్ట్రయిక్ రేట్ 151.7గా ఉంది. చదవండి: వాటి మోజులో పడి దారుణంగా మోసపోయిన రిషబ్ పంత్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
డేవిడ్ మిల్లర్ సెంచరీ
పోర్ట్ ఎలిజబెత్: వెస్టిండీస్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. విండీస్ ముందు 263 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. డేవిడ్ మిల్లర్ ఒంటరి పోరాటం చేసి సెంచరీ సాధించాడు. 133 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 130 పరుగులతో అజేయంగా నిలిచాడు. డుమిని 43, వాన్ విక్ 18, డీవిలియర్స్ 19, పార్నెల్ 12, బెహర్ డీన్ 12 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో హోల్డర్ 4 వికెట్లు నేలకూల్చాడు. కాట్ రెల్ 2 వికెట్లు తీశాడు. రస్సెల్, స్యామీ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
మిస్టర్ పర్ఫెక్ట్
ఏబీ డివిలియర్స్...దక్షిణాఫ్రికా క్రికెటర్. మన లో చాలామందికి అంతవరకే తెలుసు. కానీ తనో అసాధారణ ఆల్‌రౌండర్ అనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. సాధారణంగా ఏ క్రీడాకారుడైనా తాను ఎంచుకున్న క్రీడలో ప్రావీణ్యం సాధించేందుకు తీవ్రంగా చెమటోడుస్తాడు. ప్రొఫెషనల్‌గా మారాలంటే చాలా ఏళ్లు పడుతుంది. ఇక జాతీయ జట్టులో చోటు సంపాదించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే తల ప్రాణం తోకకొస్తుంది. అయితే మనవాడు మాత్రం ఒక్క క్రికెట్లోనే కాదు.. చాలా క్రీడల్లో అందె వేసిన చెయ్యి. ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్, రగ్బీ, స్విమ్మింగ్, గోల్ఫ్, బ్యాడ్మింటన్ ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కకు మిక్కిలి క్రీడల్లో మాంచి ప్రావీణ్యం ఉంది. అంతేకాదు.. అతడు ఆడే ఏ ఆట అయినా తన ప్రతిభతో అందరి మన్ననలు అందుకోవడం ప్రత్యేకత. క్రీడ ఏదైనా బరిలోకి దిగాడంటే మెడలో పతకం పడాల్సిందే. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిలియర్స్ గతంలో చాలా క్రీడల్లో బరిలోకి దిగి అదుర్స్ అనిపించుకున్నాడు. డివిలియర్స్ ఘనతలు క్రికెట్లో ఎదురులేని ఆటగాడు. అన్ని ఫార్మాట్లలోనూ నిలకడగా ఆడతాడు. కెప్టెన్‌గానూ విజయవంతం. దక్షిణాఫ్రికా హాకీ, ఫుట్‌బాల్ జట్ల సెలక్షన్‌కు షార్ట్‌లిస్ట్‌లో చోటు జూనియర్ రగ్బీ జట్టు కెప్టెన్ బ్యాడ్మింటన్ అండర్-19 చాంపియన్ స్కూల్ గేమ్స్ స్విమ్మింగ్‌లో ఆరు రికార్డులు. 100మీ. స్విమ్మింగ్‌లో రికార్డు ఇప్పటికీ తన పేరు మీదే ఉంది. టెన్నిస్ ఆటలోనూ దిట్టే గోల్ఫ్ ఆటలోనూ మాంచి ప్రావీణ్యం.