Photo Courtesy: IPL
AB De Villiers To Reunite With RCB: తన ఐపీఎల్ రీ ఎంట్రీపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారంపై సౌతాఫ్రికా లెజెండరీ ఆటగాడు ఏబీ డివిలియర్స్ స్పందించాడు. తాజాగా వీయూ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏబీడీ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ (2023)కు తాను తప్పక అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. తన కోర్ జట్టైన ఆర్సీబీతో తన బంధం కొనసాగిస్తానని పక్కా చేశాడు. అయితే, క్రికెటర్‌గా ఎంట్రీ ఇస్తాడా లేక ఇతర పాత్రలో కనిపిస్తాడా అన్న అంశంపై ఎలాంటి క్లూ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు.
వయసు రిత్యా ఏబీడీ ఆటగాడిగా బరిలోకి దిగే అవకాశాలు లేవు కాబట్టి కోచ్‌గానో లేక మెంటార్‌గానో బాధ్యతలు చేపట్టవచ్చని ఆర్సీబీ అభిమానులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఏబీడీ ఆర్సీబీ తరఫున రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్త తెలిసి ఆర్సీబీ ఫ్యాన్స్ తెగ సంబురపడిపోతున్నారు. ఏబీడీ రీ ఎంట్రీపై అతని సహచరుడు విరాట్ కోహ్లి కొద్ది రోజుల కిందటే క్లూని వదిలాడు. కాగా, 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన మిస్టర్ డిగ్రీస్ ప్లేయర్.. గతేడాది ఐపీఎల్ నుంచి కూడా వైదొలిగిన విషయం తెలిసిందే.
2011 సీజన్‌లో ఆర్సీబీతో జతకట్టిన ఏబీడీ.. 11 సీజన్ల పాటు నిర్విరామంగా ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతకుకుందు అతను మూడు సీజన్ల పాటు ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు ఆడాడు. ఆర్సీబీ తరఫున 156 మ్యాచ్‌లు ఆడిన ఈ విధ్వంసకర ఆటగాడు 2 శతకాలు, 37 అర్ధ శతకాల సాయంతో 4491 పరుగులు చేశాడు. ఇటీవలే ఆర్సీబీ ప్రకటించిన హాల్ ఆఫ్ ఫేమ్‌లోనూ ఏబీడీ చోటు దక్కించుకున్నాడు. ఓవరాల్‌గా 184 మ్యాచ్‌లు ఆడిన ఏబీడీ 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీల సాయంతో 5162 పరుగులు చేశాడు. అతని స్ట్రయిక్ రేట్ 151.7గా ఉంది.
చదవండి: వాటి మోజులో పడి దారుణంగా మోసపోయిన రిషబ్ పంత్
Comments
Please login to add a commentAdd a comment