hospitalized
-
ఆస్పత్రిలో చేరిన నోబెల్ గ్రహీత నర్గీస్ మొహమ్మదీ
దుబాయ్: జైలు శిక్ష అనుభవిస్తున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గీస్ మహమ్మదీని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేందుకు ఇరాన్ అధికారులు అనుమతించారు. మొహమ్మదీ తొమ్మిది వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒక సంస్థ ఈ సమాచారాన్ని మీడియాకు అందించింది. మొహమ్మదీకి చికిత్స కోసం మెడికల్ లీవ్ మంజూరు చేయాలని ఫ్రీ నార్వే కూటమి ఒక ప్రకటనలో కోరింది. ఇరాన్‌లోని ఎవిన్ జైలులో మొహమ్మదీ ఇప్పటికే 30 నెలలుగా శిక్ష అనుభవిస్తున్నారు. గత జనవరిలో ఆమె శిక్ష కాలాన్ని మరో 15 నెలలు పొడిగించారు. ఆగస్టు 6న ఎవిన్ జైలులోని మహిళా వార్డులో మరో రాజకీయ ఖైదీకి ఉరిశిక్ష విధించడాన్ని నిరసించినందుకు ఇరాన్ అధికారులు ఆమెకు అదనంగా ఆరు నెలలపాటు శిక్షను విధించారు.నర్గీస్ మొహమ్మది గుండె జబ్బుతో బాధపడుతున్నారు. ఇరాన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు నర్గీస్ మహమ్మదీని 2021లో అరెస్టు చేశారు. మహిళలపై ఇరాన్ ప్రభుత్వం విధించిన అనేక ఆంక్షల గురించి మొహమ్మదీ గళం విప్పారు. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆమె ఉద్యమించారు. నర్గీస్ మొహమ్మదీకి 2023లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఈ అవార్డును అందుకున్న 19వ మహిళగా ఆమె పేరొందారు. 2003లో మానవ హక్కుల కార్యకర్త షిరిన్ ఎబాడి తర్వాత ఈ అవార్డును అందుకున్న రెండవ ఇరాన్ మహిళగా గుర్తింపు పొందారు. ఇది కూడా చదవండి: స్పెయిన్ ప్రధానితో పీఎం మోదీ మెగా రోడ్ షో -
మెక్‌డొనాల్డ్స్‌లో ఫుడ్ పాయిజన్.. ఒకరు మృతి
మెక్‌డొనాల్డ్స్ ఔట్లెట్లో ఫుడ్ పాయిజన్ ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. డజన్ల కొద్దీ కస్టమర్లు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. మెక్‌డొనాల్డ్స్ క్వార్టర్ పౌండర్ హాంబర్గర్లో తిన్న ఒకరు ఈ.కోలి (E.coli) బ్యాక్టీరియా సోకి చనిపోయారని, పది మందికిపైగా అస్వస్థతకు గురయ్యారని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) మంగళవారం వెల్లడించింది. సెప్టెంబరు చివరి వారంలో ప్రారంభమైన వ్యాప్తి, 10 పశ్చిమ రాష్ట్రాలలో విస్తరించింది. మొత్తం 49 కేసులు నమోదుకాగా.. ఎక్కువగా కొలరాడో, నెబ్రాస్కాలో కేంద్రీకృతమై ఉన్నాయని సీడీసీ తెలిపింది.సీడీసీ ప్రకటన వెలువడి కొద్ది గంటల్లోనే మెక్‌డోనాల్డ్స్ షేర్లు 6 శాతానికిపైగా పతనమయ్యాయి. అస్వస్థతతకు గురైనవారిలో 10 మంది ఆసుపత్రిలో చేరారని, వీరిలో తీవ్రమైన కిడ్నీ సంబంధిత వ్యాధి హేమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్‌తో బాధపడుతోన్న చిన్నారి కూడా ఉంది. కొలరాడోలో ఓ వ్యక్తి మృతిచెందినట్టు సీడీసీ తెలిపింది. అస్వస్థతకు గురైన వ్యక్తులందరిలోనూ ఈ.కోలి బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నాయని, అనారోగ్యం బారిన పడటానికి వీరు ముందు మెక్‌డొనాల్డ్స్‌లో ఆహారం తీసుకున్నట్లు పేర్కొంది.వీరి అనారోగ్యానికి కారణమైన ఖచ్చితమైన పదార్ధాన్ని పరిశోధకులు ఇంకా గుర్తించనప్పటికీ, ఉల్లిపాయ ముక్కలు, బీఫ్‌ల(గొడ్డు మాంసం) కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిపై విచారణ పెండింగ్‌లో ఉన్న ప్రభావిత రాష్ట్రాల్లోని రెస్టారెంట్లు ఈ రెండింటి వాడకాన్ని తొలగించాయి. ‘నాకు, మెక్‌డొనాల్డ్స్‌లోని ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత చాలా ముఖ్యం. ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని మా ఔట్లెట్లలో ముక్కల చేసి ఉల్లిపాయల వినియోగించరాదని నిర్ణయం తీసుకున్నాం’ అని ఆ సంస్థ అమెరికా విభాగం ఛైర్మన్ జో ఎర్లింగర్ ఒక వీడియో విడుదల చేశారు.మెజార్టీ రాష్ట్రాలు ఈ.కోలికి ప్రభావితం కాలేదని, వ్యాధి ప్రభావిత రాష్ట్రాల్లో బీఫ్ ఉత్పత్తుల సమా ఇతర ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక, క్వార్డర్ పౌండర్‌లో ఆహారం తిని, డయోరియా, తీవ్రమైన జ్వరం, వాంతులు వంటి ఈ-కోలి లక్షణాలు బయటపడితే వైద్య సహాయం తీసుకోవాలని సీడీసీ సూచించింది. ఈ బ్యాక్టీరియా సోకిన మూడు నాలుగు రోజుల తర్వాత లక్షణాలు బయటపడతాయి. అయితే చాలా మంది నాలుగు నుంచి ఏడు రోజుల్లోపే ఎలాంటి చికిత్స లేకుండానే కోలుకుంటారు. అయినప్పటికీ కొన్ని కేసులు తీవ్రంగా మారడం వల్లపరిస్థితి విషమించి ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తుంది. -
కన్నడ నటుడు దర్శన్‌కు సర్జరీ
రేణుకాస్వామి హత్య కేసులో రెండవ నిందితుడు, ప్రముఖ నటుడు దర్శన్ ఆరోగ్యం గురించి నివేదిక ఇవ్వాలని జైలు అధికారులకు హైకోర్టు ఆదేశించింది. బెయిల్ కోరుతూ దర్శన్ సమర్పించిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ విశ్వజిత్ శెట్టి విచారించారు. పిటిషన్ గురించి అభ్యంతరాలుంటే తెలపాలని ప్రభుత్వ ప్రాసిక్యూటర్ ప్రసన్నకుమార్‌కు సూచించారు. బళ్లారి జైలులో దర్శన్ వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఆపరేషన్ అవసరముందని వైద్యులు తెలిపారు. అందుచేత బెయిల్ ఇవ్వాలని దర్శన్ వకీలు కోరారు. నేర విచారణలో అనేక లోపాలు ఉన్నాయని, అన్ని ఆధారాలను పోలీసులే సృష్టించారంటూ పలు ఆరోపణలు వినిపించారు. తదుపరి విచారణ అవసరం కూడా లేనట్లుందని పేర్కొన్నారు. దీంతో వైద్య నివేదిక ఇవ్వాలని జడ్జి ఆదేశించి కేసును వాయిదా వేశారు.100 రోజులు దాటిందిదర్శన్, పవిత్రలు జూన్ 10 నుంచి అరెస్టయి కారాగారంలో ఉన్నారు. వారిద్దరూ జైలుకు వెళ్లి 100 రోజులు దాటింది. ఇటీవల సిట్ చార్జిషీట్లు దాఖలు చేయడంతో బెయిలు వస్తుందని ఆశించారు. దర్శన్ భార్య విజయలక్ష్మి, సన్నిహితులు బెయిలు కోసం ప్రముఖ లాయర్లతో ముమ్మరంగా ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో దర్శన్ బళ్లారి, పవిత్ర బెంగళూరు సెంట్రల్జైల్లో ఇంకొన్ని రోజులు ఉండక తప్పదు. ఈ క్రమంలో మరోసారి వారు బెయిల్ పిటీషన వేశారు. -
ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం చంపయ్ సోరెన్
రాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్ ఆస్పత్రిలో చేరారు. బ్లడ్ షుగర్‌కు సంబంధించిన సమస్యల కారణంగా చంపయ్ ఆసుపత్రిలో చేరినట్లు ఆదివారం ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆయన జంషెడ్‌పూర్‌లోని టాటా మెయిన్ ఆసుపత్రిలో చేరారు.स्वास्थ्य संबंधित परेशानियों की वजह से आज वीर भूमि भोगनाडीह में आयोजित "मांझी परगना महासम्मेलन" में वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से शामिल रहूंगा।डॉक्टरों के अनुसार चिंता की कोई खास बात नहीं है। मैं शीघ्र पुर्णतः स्वस्थ होकर, आप सभी के बीच वापस आऊंगा। जोहार ! pic.twitter.com/rUrCzCd7lK— Champai Soren (@ChampaiSoren) October 6, 2024‘‘చంపయ్ రక్తంలో చక్కెర స్థాయి తగ్గింది.దీంతో వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. చంపయ్ పరిస్థితి మెరుగుపడుతోంది’ అని టాటా మెయిన్ హాస్పిటల్ జీఎం డాక్టర్ సుధీర్ రాయ్ తెలిపారు.ఆగస్టు 30న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ సమక్షంలో చంపయ్ సోరెన్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా.. చంపయ్ సీఎంగా ఫిబ్రవరి 2న ప్రమాణం చేశారు. హేమంత్ బెయిల్‌పై విడుదలైన తర్వాత చంపయ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. జూలైలో హేమంత్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అప్పటి నుంచి చంపయ్ సోరెన్ జేఎంఎం పార్టీకి దూరంగా ఉండి.. అనంతరం బీజేపీలో చేరారు.చదవండి: రూ. 1,800 కోట్ల విలువైన భారీ డ్రగ్స్ పట్టివేత -
అర్ధరాత్రి ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ (73) సోమవారం అర్ధరాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అక్టోబర్ 1 మంగళవారం నాడు ఆయనకు పలు వైద్య పరీక్షలను చేయనున్నారు. ఈ క్రమంలో ఎలెక్టివ్ ప్రొసీజర్ ట్రీట్మెంట్ ఆయనకు అందించనున్నట్లు తెలుస్తోంది. గుండెకు సంబంధించిన పరీక్షలు ఆయనకు చేయనున్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఉదయం 8 గంటలకు హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు. రొటీన్ చెకప్ కోసం అడ్మిట్ అయ్యారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సతీమణి లతా రజనీకాంత్ వెళ్లడించారు.జైలర్ సినిమా తర్వాత రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 10న దర్శకుడు జ్ఞానవేల్ రాజా తెరకెక్కించిన వేట్టైయన్ విడుదల కానుంది. ఇటీవలే లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ షూటింగ్ షెడ్యూల్ ముగించుకుని రజనీ చెన్నై వచ్చారు. ఇంతలో ఆయన ఆరోగ్యంపై ఇలాంటి వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనలో ఉన్నారు. సుమారు పదేళ్ల క్రితం సింగపూర్‌లో రజనీకాంత్ కిడ్నీ మార్పిడి చేయించుకున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి: 'హీరోతో విడాకులు.. నన్ను తప్పుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం' -
హాస్పిటల్లో చేరిన టీఎంసీ సీనియర్ నేత
కోల్‌కతా: టీఎంసీ సీనియర్‌నేత ముకుల్ రాయ్ గురువారం ఆస్పత్రిలో చేరారు. తన నివాసంలోని బాత్రూంలో జారిపడి స్పృహ కోల్పోవటంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్పత్రిలో చేరిన ఆయన పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 70 ఏళ్ల ముకుల్ స్పృహ కోల్పోయే ముందు వాంతులు చేసుకున్నారని కుటంబసభ్యులు తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన బాత్రూంలో జారిపడటంతో తలకు గాయం అయింది. దీంతో ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ పలు టెస్ట్‌ల రిపోర్టుల కోసం ఎదురు చేస్తున్నామని డాక్టర్లు తెలిపారు.టీఎంసీ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ముకుల్.. 2017లో బీజేపీలో చేరిన ఆయన 2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నార్త్ కృష్ణానగర్‌లో గెలుపొందారు.అనంతరం ఆయన మళ్లీ టీఎంసీలో చేరారు. -
ముగిసిన ఆతిశి నిరాహార దీక్ష
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నీటి సమస్యను పరిష్కరించాలంటూ ఈనెల 21వ తేదీ నుంచి మంత్రి ఆతిశి కొనసాగిస్తున్న నిరాహార దీక్ష అర్ధంతరంగా ముగిసింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను లోక్‌నాయక్ ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న మంత్రి ఆతిశి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ కుమార్ తెలిపారు.అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన మంత్రి ఆతిశి దాదాపు ఐదు రోజులుగా సాగిస్తున్న నిరాహార దీక్షను విరమించారని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ చెప్పారు. ఢిల్లీకి న్యాయబద్ధంగా అందాల్సిన నీటిని హరియాణా నుంచి విడుదల చేయించాలంటూ ప్రధానికి ఆప్ ఎంపీలు లేఖ రాస్తారన్నారు. -
మండి బిర్యానీ రూ.వెయ్యి.. ట్రీట్మెంట్ రూ.లక్ష!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ సాయిబాబా హోటల్లో దారుణం చోటుచేసుకుంది. మండి బిర్యానీ తిని కుటుంబం ఆసుపత్రి పాలైంది. కలుషిత బిర్యానీ తినడంతో వాంతులు, విరోచనాలతో అనారోగ్యానికి గురైయ్యారు. శంషాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. కలుషిత ఆహారం తినడం వల్లనే ఫుడ్ పాయిజన్ అయ్యిందని వైద్యులు చెబుతున్నారు.ఖమ్మంలో..ఖమ్మం నగరంలోని కొన్ని ప్రముఖ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. బైపాస్ రోడ్డులో ఉన్న ఒక హోటల్లో వంటకు ఉపయోగించే కొబ్బరి పొడి, నూడుల్స్ వంటి రా మెటీరియల్‌లో కల్తిని గుర్తించారు.వినియోగదారులకు విక్రయించేందుకు తయారు చేసి నిల్వ ఉంచిన పలు చికెన్ కబాబ్‌లో ఫంగస్‌ను గుర్తించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నఇలాంటి హోటల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
ఆస్పత్రి నుంచి అజిత్ డిశ్చార్జ్
ప్రముఖ నటుడు అజిత్ గురువారం ఆస్పత్రిలో చేరడంతో ఆయన గురించి రకరకాల ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అజిత్‌కు ఏమైంది అంటూ ఆయన అభిమానులు ఆందోళన చెందారు. త్వరలో మిడాముయర్చి చిత్రం షూటింగ్ కోసం విదేశాలకు పయనం కానున్న నేపథ్యంలో ఇదంతా రెగ్యులర్ చెకప్‌లో భాగం అంటూ అజిత్ కార్యనిర్వాహకుడు పేర్కొనడంతో అభిమానుల మనసులు కుదుటపడ్డాయి. అసలు విషయం ఏమిటంటే అజిత్ చెవి కింద భాగంలో పల్జ్ అనే చిన్న బుడుపు ఏర్పడింది. దానివల్ల ఎలాంటి బాధ లేకపోయినా వైద్యులు చిన్న శస్త్ర చికిత్స చేసి, దాన్ని తొలగించినట్లు తెలిసింది. దీంతో అజిత్ శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. త్వరలోనే మిడాముయర్చి చిత్రం షూటింగ్ కోసం అజర్‌బైజాన్‌కు బయలు దేరనున్నట్లు సమాచారం. కాగా అజిత్ ఆస్పత్రిలో చేరారన్న వార్త వినగానే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి తన ఎక్స్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు. అందులో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సహోదరుడు, నటుడు అజిత్ త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని ఆయన పేర్కొన్నారు. -
ప్రియాంక గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర త్వరలో యూపీలో ప్రవేశించనుంది. ఈ యాత్రలో రాహుల్‌తో పాటు ప్రియాంక కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతం అనారోగ్యం కారణంగా ప్రస్తుతానికి బ్రేక్ ఇస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఆరోగ్యం కుదుటపడిన తరవాత మళ్లీ యాత్రలో పాల్గొంటానని ఎక్స్ వేదికగా ప్రియాంక వెల్లడించారు. ‘‘యూపీలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనాలని చాలా ఆసక్తిగా ఎదురు చూశాను. కానీ అనారోగ్యంతో హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. కాస్త ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మళ్లీ యాత్రలో పాల్గొంటాను. ఈలోగా యూపీలోకి యాత్ర కోసం అడుగు పెడుతున్న అందరికి నా అభినందనలు. రాహుల్ గాంధీకి కూడా శుభాకాంక్షలు చెబుతున్నాను’’ అంటూ ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. I was really looking forward to receiving the BJNY in UP today but unfortunately, have ended up admitted to hospital. I will be there as soon as I am better! Meanwhile wishing all the yatris, my colleagues in UP who have worked hard towards making arrangements for the yatra and… — Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 16, 2024 ఇదీ చదవండి: కేజ్రీవాల్‌కు గుజరాత్ హైకోర్టు షాక్ -
మహిళ చెవిలోనే గూడు కట్టేసిన సాలీడు! వేడినూనె పోయడంతో..
ఒక్కొసారి చీమలు, మిడతలు, సాలీడు వంటివి చెవిలోకి ఎలా వెళ్తాయో తెలియదు గానీ వెళ్లిపోతాయి. ఆ తర్వాత ఫేస్చేసే నరకం అంతా ఇంత కాదు. అచ్చం అలానే ఇక్కడో మహిళ కూడా అదే సమస్యే ఎదుర్కొంది. అయితే ఏ కీటకం అయిన మనిషి శరీరంలోకి వెళ్లితే చనిపోవడం ఖాయం. కానీ ఈ సాలీడు మహిళ చెవిలోనే ఏకంగా గూడు కట్టుకుని జీవిస్తోంది. అయితే ఆమె ఆస్పత్రికి వెళ్లకుండా ఇంటి వైద్యం తీసుకోవడంతో నరకయాతన చవిచూసింది. చివరికీ పరిస్థితి క్రిటికల్ అయ్యి ఆస్పత్రి పాలయ్యింది. ఈ విషాదకర ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..బ్రిటన్‌కి చెందిన లూసీ వైల్డ్ అనే మహిళకి ఒక రోజు ఉన్నటుండి చెవిలో వింత శబ్దాలు రావడం ఒకటే నొప్పిగా అనిపించింది. ఇంక లాభం లేదనుకుని తన భర్త సాయంతో మైక్రోస్కోపిక్ కెమెరాతో ఏం ఉందో తెలుసుకుంటారు. లోపల సాలీడు ఉన్నట్లు అర్థమై భయంతో కేకలు పెట్టింది. అయితే ఆమె భాగస్వామి వేడి నూనె వంటివి వేసి తీయాలనుకుంటాడు. అయితే అవేమీ తన బాధను తగ్గించకపోగా చెవి నుంచి రక్తస్రావం అవ్వడం మొదలైంది. ఇక దీంతో ఈఎన్టీ ఆస్పత్రికి హుటాహుటినా ఆ మహిళలను తరలిస్తారు. అక్కడ వైద్యులు ఆపరేషన్ చేసి ఆ సాలీడు, దాని గూడుని తొలగించి యాంటి బయోటిక్ మందులతో ఇన్ఫెక్షన్లు తగ్గిస్తారు. ఇప్పుడు లూసీ పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ అలా సొంత వైద్యం తీసుకోవడంతో ఇంకా చెవిలో ఏదో అసౌకర్యంగా ఉన్నట్లే అనిపిస్తోంది లూసీకి. ఇలాంటప్పుడూ ఏం చెయ్యాలంటే.. ఇలా చెవిలో ఏదైన కీటకం దూరినట్లయితే వెంటనే చెవిని ఒకవైపుకి వంచి ఉంచండి. అయినప్పటికీ అది కొరుకుతూ ఇబ్బంది పెడుతున్నట్లయితే వెంటనే వైద్యుడు వద్దకు వెళ్లిపోండి. ఆలస్యం చేశారో ఇన్ఫెక్షన్కు దారితీసి చీము వంటి ద్రవాలు వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. మీ సొంత వైద్యంతో చెత్త పరికరాలతో తీసేందుకు యత్నిస్తే ఈయర్ డ్రమ్‌కి సమస్య ఏర్పడవచ్చు ఒక్కోసారి వైద్యుడి వద్దకు వెళ్లి కీటకాన్ని తీయించుకున్నా కూడా వినికిడి శక్తి కోల్పోయిన వాళ్లు కూడా ఉన్నారు. అలాగే క్రిమి పూర్తిగా తొలగించబడలేనట్లు అసౌకర్యంగా ఉన్న మళ్లీ వైద్యుడిని సంప్రదించండి. ఇలాంటప్పుడూ సొంత ప్రయోగాల కంటే వైద్యుడిని సంప్రదించడమే ఉత్తమం (చదవండి: తన పెదవులే అందరికంటే పెద్దవిగా ఉండాలని ఏకంగా 26కి పైగా..!) -
షేన్ వార్న్ బయోపిక్ రొమాంటిక్ సీన్ షూట్లో ఏం జరిగిందో చూడండి..!
-
ఆస్పత్రిలో చేరిన బెలారస్ అధ్యక్షుడు..పుతిన్‌తో సమావేశం తర్వాతే..
బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ని కలిసిన తర్వాతే ఆస్పత్రిలో చేరినట్లు వార్త కథనాలు గుప్పుమన్నాయి. ఈ మేరకు అమెరికన్ వీక్లీ న్యూస్ మ్యాగజైన్ లుకాషెంకో మాస్కోలోని సెంట్రల్ క్లినికల్ ఆస్పత్రిలో చేరినట్లు ఆ బెలారస్ ప్రెసిడెంట్ అభ్యర్థి వాలెరీ సెప్కలో ఓ టెలీగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నట్లు తెలిపింది. అంతేగాదు లుకాషెండో పుతిన్‌తో సమావేశం అనంతరం అత్యవసరంగా మాస్కోలోని ఆస్పత్రిలో చేరారని, అక్కడే చికిత్స పొందుతున్నట్లు తెలిపారు వాలేరీ. ఐతే అక్కడ అతని పరిస్థితి విషమంగా ఉందని, అందువల్ల అతనిని తీసుకువచ్చేలా వైద్య నిపుణలతో సహా అధికార బృందాన్ని పంపినట్లు తెలిపారు. అక్కడ లుకాషెంకోపై మాస్కో విషప్రయోగం జరిపినట్లు ఊహాగానాలు హల్చల్ చేస్తున్నట్లు కూడా వివరించారు వాలేరీ. అందువల్ల తాము అతనని సతర్వరమే రక్షించేలా అన్ని రకాల వ్యవస్థీకృత చర్యలు తీసుకుంటున్నట్లు వాలేరీ పేర్కోన్నట్లు అమెరికా వీక్లీ న్యూస్ తెలిపింది. నిజానికి మే 9ప మాస్కోలో రెడ్ స్క్వేర్‌లో జరిగిన విక్టరీ డే వేడుకలో లుకాషెంకో కనిపించిన కొన్ని వారాల తర్వాత ఆయన ఆరోగ్యంపై పుకార్లు రావడం మొదలైంది. ఐతే లుకాషెంకో వాటిని తోసిపుచ్చారు. అంతేగాదు బెలారస్లో వ్యూహాత్మక క్షిఫణుల విస్తరణను లాంఛనప్రాయంగా చేయడానికి లుకాషెంకో ప్రభుత్వంతో రష్యా ఒప్పందం కుదుర్చకున్నట్లు రష్యా మీడియా పేర్కొంది. అందుకు సంబంధించిన పత్రాలపై ఇరు దేశాల నాయకులు సంతకం చేసినట్లు బెలారసియన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా, ఆ రెండు దేశాలు తీసుకున్న చర్యలు అంతర్జాతీయ చట్టపరమైన బాధ్యతలకు అనుగుణంగా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే సమావేశంలో ఇరు దేశాల నాయకులు సైనిక, రాజకీయ పరిస్థితుల తోపాటు సాంకేతిక సహకార సమస్యలపై చర్చించనట్లు అని బెలారసియన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. (చదవండి: దిగుతున్న టైంలో విమానం డోర్ లాక్ అయ్యింది!.పాపం ఆ ప్రయాణికుడు..) -
తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన ప్రముఖ డైరెక్టర్!
ఆదాశర్మ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఇటీవల మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న సుదీప్తో సేన్ ఆస్పత్రిలో చేరారు. విరామం లేకుండా ప్రయాణాలు చేయడం వల్లే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో ఈ సినిమాపై నిరసనలు వస్తున్నప్పటికీ ప్రమోషన్లలో పాల్గొన్నారు. (ఇది చదవండి: బేబీ బంప్‌తో ఇలియానా సెల్ఫీ.. మొత్తానికి ఆ విషయం బయట పెట్టేసిందిగా!) మే 5న విడుదలైన 'ది కేరళ స్టోరీ' బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల మార్కును అధిగమించింది. అస్వస్థతకు గురైన ఆస్పత్రిలో చేరిన సుదీప్తో సేన్ కొన్ని ప్రచార కార్యక్రమాలకు విరామం ప్రకటించారు. ఈ చిత్రంలో అదా శర్మతో పాటు యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రల్లో నటించారు. కేరళకు చెందిన అమ్మాయిలు బలవంతంగా ఐసిస్‌లో చేరారన్నకథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. (ఇది చదవండి: సొంతింటి కల సాకారం చేసుకున్న రీతూ చౌదరి) -
ఆస్పత్రిలో ప్రముఖ సింగర్.. కుమారుడు చేసిన పనికి తీవ్ర భావోద్వేగం!
ప్రముఖ సింగర్ అంగారాగ్ మహంత అలియాస్ పాపోన్ ఆస్పత్రిలో చేరాడు. తీవ్ర అస్వస్థతకు గురైన ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. తన కుమారుడు కూడా పక్కనే ఉన్న ఫోటోను షేర్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు. (ఇది చదవండి: ఉపాసనపై కామెంట్స్.. ఓ వ్యక్తిని చితకబాదిన చెర్రీ ఫ్యాన్స్!) పాపోన్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'మనమందరం ఈ చిన్న చిన్న యుద్ధాలను ఒంటరిగా పోరాడుతున్నాం. ఇలాంటి సంఘటనలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు. కానీ నిన్న రాత్రి జరిగింది మాత్రం వేరు. ఎందుకంటే మొదటిసారి 13 ఏళ్ల నా కుమారుడు ఆసుపత్రిలో రాత్రి నాకు కాపలాగా ఉన్నాడు. ఈ భావోద్వేగ క్షణం గురించి నా స్నేహితులు, శ్రేయోభిలాషులతో పంచుకోవాలనుకుంటున్నా. నా తల్లితండ్రుల కోసం నేను ఇలాగే చేసినట్లు నాకు గుర్తుంది. ఇప్పుడు వారి మనవడు పుహోర్ తన బాధ్యతను తీసుకోవడం చూసేందుకు వారు చుట్టూ ఉన్నారని అనుకుంటున్నా. నా కోసం ప్రార్థించిన మీ అందరికీ ధన్యవాదాలు! నేను ఇప్పుడు చాలా బాగున్నా.' అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. (ఇది చదవండి: Prabhas: ప్రభాస్ పేరుతో రూ.4 వేల కోట్ల దందా!) కాగా.. పాపోన్ 1998లో తన మ్యూజిక్ కెరీర్‌ను మొదలుపెట్టారు. అస్సామీలో మంచి ఆల్బమ్స్ చేశారు. 2006లో స్ట్రింగ్స్ అనే సినిమాలో ఓం మంత్ర అనే పాట పాడి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అస్సామీతో పాటు హిందీ, తమిళం, మరాఠీ భాషల్లో సాంగ్స్ ఆలపించారు. సినిమాలతో పాటు పలు టీవీ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. View this post on Instagram A post shared by Papon (@paponmusic) -
బ్రెజిల్ రణరంగం: మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు అస్వస్థత
ఫ్లోరిడా: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో అస్వస్థతకు గురయ్యారు. కత్తిపోటుకు గురైన పొత్తికడుపు భాగంలో నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్లు ఆయన భార్య వెల్లడించారు. అమెరికా ఫ్లోరిడాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే, ఆయన మద్దతుదారులు రాజధాని నగరం బ్రసీలియాలో అధ్యక్ష భవనం, కాంగ్రెస్, సుప్రీం కోర్టు భవనాల వద్ద అల్లర్లు సృష్టించిన మరుసటి రోజునే బోల్సోనారో అస్వస్థతకు గురవటం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రెజిల్ అధ్యక్షుడిగా తన పదవీకాలం ముగిసేందుకు రెండు రోజుల ముందే డిసెంబర్ 31, 2022 రోజున అమెరికా వెళ్లారు బోల్సోనారో. 67 ఏళ్ల బోల్సోనారో ఫ్లోరిడా ఓర్లాండోలోని అడ్వెంట్‌హెల్త్ సెలబ్రేషన్ అక్యూట్ కేర్ హాస్పిటల్లో చేరినట్లు బ్రెజిల్‌కు చెంది ఓ గ్లోబో న్యూస్‌పేపర్ తెలిపింది. ‘ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో బోల్సోనారో చికిత్స తీసుకుంటున్నారు. 2018 విజయోత్సవ ర్యాలీలో కత్తిపోటుకు గురైనప్పటి నుంచి పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు.’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు ఆయన భార్య మిచెల్ బోల్సోనారో. మరోవైపు.. ఓర్లాండో ఆసుపత్రి ఎలాంటి ప్రకటన చేయలేదు. - Após facada sofrida em Juiz de Fora/MG, fui submetido à 5 cirurgias. Desde a última, por por 2x tive aderências que me levaram à outros procedimentos médicos. - Ontem nova aderência e baixa hospitalar em Orlando/USA. - Grato pelas orações e mensagens de pronto restabelecimento. pic.twitter.com/u5JwG7UZnc — Jair M. Bolsonaro 2️⃣2️⃣ (@jairbolsonaro) January 10, 2023 మద్దతుదారుల దురాక్రమణ.. బ్రెజిల్ రాజధాని నగరం బ్రసీలియాలో మాజీ దేశాధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులు దురాక్రమణకు దిగారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో లూయిజ్ ఇన్సియో లూలా డ సిల్వా చేతిలో బోల్సోనారో ఓడిపోవడం జీర్ణించుకోలేని ఆయన మద్దతుదారులు ఆదివారం రాజధానిలోని అత్యంత కీలకమైన భవనాలపై దాడికి తెగించారు. దేశాధ్యక్షుడి అధికారిక నివాసం, కాంగ్రెస్, సుప్రీం కోర్టు ముందున్న బారికేడ్లను బద్దలుకొట్టి, భవనాల గోడలెక్కి అద్దాలు, కిటికీలు ధ్వంసం చేశారు. ఇదీ చదవండి: బ్రెజిల్ అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టు భవనాల ఆక్రమణ.. ప్రపంచ దేశాధినేతల ఆందోళన -
Heeraben Modi: తల్లి చెంతకు నరేంద్ర మోదీ
అహ్మదాబాద్: దేశ ప్రధాని నరేంద్ర మోదీ తన తల్లి హీరాబెన్ మోదీ దగ్గరకు వెళ్లారు. మంగళవారం రాత్రి ఆమె అస్వస్థతకు గురి కావడంతో అహ్మదాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఆమెను చేర్పించిన విషయం తెలిసిందే. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు కూడా. అయితే.. తల్లి అనారోగ్యం నేపథ్యంలో ఆమెను చూసేందుకు ఢిల్లీ నుంచి వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లిన ఆయన.. సుమారు గంటపాటు తల్లితో గడిపారు. ఆరోగ్యంగా ఉండమని, అధైర్య పడొద్దని ఆమెకు సూచించారాయన. గుజరాత్ ఎమ్మెల్యేలు దర్శనాబెన్ వఘేలా, కౌశిక్ జైన్ సైతం ఆస్పత్రికి వెళ్లారు. 99 ఏళ్ల హీరాబెన్ ఆరోగ్య స్థితి నిలకడగానే ఉందని అహ్మదాబాద్ యూఎన్ మెహతా ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి తల్లి దగ్గరకు వెళ్లిపోవడం తగ్గినట్లు.. తరచూ ఆయన ఇంటర్వ్యూలో నరేంద్ర మోదీ బాధపడడం తెలిసిందే. ఈ క్రమంలో గుజరాత్ ఎన్నికల సమయంలో ఆయన ఆమె దగ్గరకు వెళ్లారు. అంతేకాదు తన తల్లి వందవ పుట్టినరోజు కోసం ‘మదర్’ అనే బ్లాగ్‌ను సైతం ఆయన రాశారు. మరోవైపు నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ.. ఆయన కుటుంబం ప్రయాణిస్తున్న వాహనం మంగళవారం మైసూర్(కర్ణాటక) వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అందరికీ స్వల్ఫ గాయాలు అయ్యాయి. -
దిగ్గజం పీలే పరిస్థితి విషమం.. వార్తలను ఖండించిన కూతురు
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే బుధవారం రాత్రి ఆసుపత్రిలో చేరాడు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న పీలే పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయం హల్చల్ చేయడంతో పీలే కూతురు కెలీ నాసిమెంటో వార్తలను ఖండించింది. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం లేదని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఆ తర్వాత తండ్రి ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చింది. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ హాస్పిటల్లో చేరిన పీలేకు పరీక్షలు జరుగుతున్నాయని.. ఆ తర్వాతే అతని ఆరోగ్య పరిస్థితిపై ఒక స్పష్టత వస్తుందని తెలుస్తోంది. "మా నాన్నా ఆరోగ్యం గురించి మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. చికిత్స కోసమే ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. ఇందులో ఎమర్జెన్సీ ఏమీ లేదు. భయపడాల్సింది కూడా లేదు. న్యూఇయర్‌ను నాన్నతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. దానికి సంబంధించిన ఫొటోలు కూడా పోస్ట్ చేస్తాను" అని నాసిమెంటో ఇన్‌స్టాలో పేర్కొంది. గతేడాది సెప్టెంబర్‌లో 82 ఏళ్ల పీలే పెద్ద పేగు నుంచి ట్యూమర్‌ను తొలగించారు. అప్పటి నుంచి హాస్పిటల్లో అడ్మిట్ అవుతూ, వస్తూ ఉన్నాడు. అతనికి కీమో థెరపీ కూడా నిర్వహిస్తున్నారు. అయితే అతనికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని, కీమో థెరపీ ఆశించిన ఫలితం ఇవ్వడం లేదని ఈఎస్పీఎన్ బ్రెజిల్ తన కథనంలో పేర్కొంది. ఇక ఆల్‌టైమ్ గ్రేట్ ఫుట్‌బాలర్స్‌లో ఒకడిగా పీలే పేరుగాంచాడు. తన కెరీర్లో మొత్తం 1363 మ్యాచ్‌లు ఆడి 1279 గోల్స్ చేశాడు. ఇందులో ఫ్రెండ్లీ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఇదొక గిన్నిస్ రికార్డు కావడం విశేషం. ఇక బ్రెజిల్ తరఫున 92 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 77 గోల్స్ చేశాడు. -
పిడుగుపాటుకు ఒంటికి అతుక్కున్న స్వర్ణం
ఆదిలాబాద్ రూరల్: పిడుగుపాటుకు మృతి చెందడం.. గాయపడటం సాధారణం. కానీ పిడుగుపాటు వేడికి ఒక మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసు కరిగి పోయి ఆమె శరీరానికి అతుక్కుపోయి ఆమెను ఆస్పత్రిపాల్జేసింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలంలో జరిగింది. మండలంలోని పొచ్చర గ్రామ సమీపంలోని దిమ్మ గ్రామ శివారులో శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో భారీ పిడుగు పడింది. సమీపంలోనే వ్యవ సాయ పనుల్లో శ్వేత నిమగ్నమై ఉండగా.. పిడుగు పడింది. దీంతో వెలువడిన వేడిమికి ఆమె మెడలోని బంగారు గొలుసు కరిగిపోయి శరీరానికి అతుక్కు పోయింది. వెంటనే స్థానికులు ఆమెను 108లో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
భర్తతో గొడవ.. ఆస్పత్రిలో చేరిన జయలలిత మేనకోడలు దీప
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మేనకోడలు దీప ఆస్పత్రిలో చేరారు. భర్త మాధవన్‌తో గొడవ కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఇంటికే ఆమె పరిమితం అయ్యారు. ఈ పరిస్థితుల్లో నగరంలోని ఓ ఆస్పత్రిలో ఆమె అడ్మిట్ కావడంతో చర్చ బయలుదేరింది. భర్త మాధవన్ – దీపల మధ్య ఇప్పటికే పలు మార్లు అభిప్రాయ భేదాలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో భర్తతో గొడవ కారణంగానే ఆమె ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం. అయితే, ఆమె భర్త మాధవన్ దీనిని ఖండించారు. తానే ఆమెను ఆస్పత్రిలో చేర్పించినట్లు పేర్కొనడం గమనార్హం. చదవండి: (అంధుడైన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు.. మైక్రోసాఫ్ట్‌లో 47 లక్షల వేతనం) -
Bhagwant Mann: ఆస్పత్రిలో చేరిన పంజాబ్ సీఎం
ఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(48) ఆస్పత్రి పాలయ్యారు. అస్వస్థతతో ఆయన బుధవారం ఉదయమే ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. కడుపు నొప్పి రావడంతో ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరారు పంజాబ్ సీఎం మాన్. ఆయనకు ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే.. దగ్గరి బంధువైన డాక్టర్ గురుప్రీత్ కౌర్(32)ను మాన్ ఈమధ్యే రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆస్పత్రిలో ఉండగానే సీఎం భగవంత్ మాన్ ఓ ప్రకటన విడుదల చేశారు. సింగర్ సిద్ధూ మూసేవాలా హంతకుల్లో ఇద్దరిని, యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్ బుధవారం అమృత్‌సర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మట్టుపెట్టినందుకు అభినందనలు తెలియజేశారు. ఇదీ చదవండి: పంజాబ్ ఎన్కౌంటర్: సిద్ధూ హంతకులకు మట్టుబెట్టారిలా.. -
జోష్‌లో వంతెన ఓపెనింగ్.. పాపం బొక్కలు విరగ్గొట్టుకున్నారు
Mexican Footbridge Collapses: నేటీకి కొన్ని దేశాల్లో పురాతన కట్టడాలు, బ్రిడ్జీలు, భవనాలు చక్కుచెదరకుండా ఉన్నాయి. కానీ, నేటి ఇంజనీర్లు కట్టిన కట్టడాలు, బ్రిడ్జీలకు గ్యారెంటీ లేకుండా పోతోంది. తాజాగా ఓ బ్రిడ్జీ కట్టి.. ఓపెనింగ్ చేసిన కాసేపటికే కూలిపోయింది. దీంతో అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. క్యూర్నావాకా నగరం కట్టిన ఓ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం రోజునే కూలిపోయింది. ఫుట్ బ్రిడ్జ్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మేయర్ జోస్ లాయిస్ ఉరియో స్టెగుయ్కు ఊహించని షాక్ తగిలింది. వంతెన ప్రారంభం తర్వాత మేయర్ సహా సిటి కౌన్సిల్ సభ్యులు బ్రిడ్జీపై నడుచుకుంటూ వెళ్లారు. ఇంతో వంతెన ఒక్కసారిగా కూలిపోవడంతో వారందరూ కింద పడిపోయారు. Footbridge collapse during reopening ceremony in Mexico pic.twitter.com/Kn4X554Ydk — Adrian Slabbert (@adrian_slabbert) June 9, 2022 సుమారు 10 అడుగుల ఎత్తులో ఉండే ఆ ఫుట్ బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో బ్రిడ్జీ మీద ఉన్నవారంతా కింద నీటిలో ఉన్న రాళ్లపై పడిపోయారు. ఈ ఘటనలో మేయర్, 20 మంది సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఎనిమిది మందికి ఎముకలు విరిగిపోయాయినట్టు స్థానిక మీడియో తెలిపింది. వంతెన ప్రారంభం రోజునే ఇలా జరగడంతో ఇంజనీర్‌పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కోమాలోనే సౌతాఫ్రికా యువ క్రికెటర్.. అండగా నిలబడిన క్రికెట్ బోర్డు
గత ఆదివారం(మే 29న) దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్న సౌతాఫ్రికా క్రికెటర్ మొండ్లీ ఖుమాలోకు ఆ దేశ క్రికెట్ బోర్డు(క్రికెట్ సౌతాఫ్రికా) అండగా నిలబడింది. ఖుమాలో కుటుంబసభ్యులకు ఆర్థిక సహాయం అందించిన బోర్డు తన పెద్ద మనసు చాటుకుంది. ''యూకేలో దుండగుల చేతిలో గాయపడిన మొండ్లీ ఖుమాలో త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఈ దాడిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. అతని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం. అతని కుటుంబసభ్యులకు మా అండ ఎప్పటికి ఉంటుంది.'' అని పేర్కొంది. కాగా దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడిన ఖుమాలో ఇప్పటికి కోమాలోనే ఉన్నాడు. ప్రస్తుతం యూకేలోని సౌత్‌మెడ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఖుమాలోకు బుధవారం మూడో సర్జరీ నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. తలలో రక్తం గడ్డకట్టడంతో ఖుమాలో కోమాలోకి వెళ్లిపోయాడని.. బ్లడ్‌ప్రెషర్ కూడా ఎక్కువగా ఉందన్నారు. దీంతో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించడానికి మూడు సర్జరీలు చేశామని.. మరొక సర్జరీతో అతనికి పూర్తిగా నయమయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా ఖుమాలో కోమాలోనే ఉన్నప్పటికి అతని ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని తెలిపారు. కాగా మే29(ఆదివారం) తెల్లవారుజామున తన పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న మొండ్లీ ఖుమాలోపై కొందరు దుండగులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కాగా ఖుమాలోపై దాడికి దిగిన వారిలో ఒక 27 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఇక 20 ఏళ్ల మొండ్లీ ఖుమాలో 2018లో క్వాజులు-నాటల్ ఇన్లాండ్ తరపున టి20 అరంగేట్రం చేశాడు. 2020 అండర్-19 ప్రపంచకప్ సౌతాఫ్రికా జట్టులో మొండ్లీ ఖుమాలో చోటు దక్కించుకున్నాడు. ఇక 2020 మార్చి 7న లిస్ట్-ఏ, 2021 మార్చి 4న ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఐదు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, రెండు లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 4 టి20 మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: యూకేలో సౌతాఫ్రికా క్రికెటర్‌పై దాడి.. పరిస్థితి విషమం -
యూకేలో సౌతాఫ్రికా క్రికెటర్‌పై దాడి.. పరిస్థితి విషమం
సౌతాఫ్రికా క్రికెటర్ మొండ్లీ ఖుమాలోపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతానికి అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. మరొక రోజు గడిస్తే కానీ ఖుమాలో పరిస్థితి చెప్పలేమన్నారు. విషయంలోకి వెళితే.. సౌతాఫ్రికాకు చెందిన మొండ్లీ ఖుమాలో యూకేలో కౌంటీ క్రికెట్ ఆడేందుకు వచ్చాడు. అతను నార్త్ పెర్తర్టన్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా మొండ్లీ ఖుమాలో మే 29(ఆదివారం) మ్యాచ్ ముగించుకొని ఇంటికి బయల్దేరాడు. బ్రిడ్జ్‌వాటర్ సమీపంలోకి రాగానే ఫ్రియర్న్ స్ట్రీట్‌లో గ్రీన్ డ్రాగన్ పబ్ వద్ద కొందరు వ్యక్తులు మొండ్లీ ఖుమాలోకు అడ్డువచ్చారు. తనకు ఎందుకు అడ్డువచ్చారని అడిగేలోపే ఖుమాలోపై దాడికి పాల్పడ్డారు. అతన్ని విచక్షణారహితంగా కొట్టిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో తీవ్ర గాయాలపాలైన మొండ్లీ ఖుమాలోను అక్కడి స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దెబ్బలు బాగా తగలడంతో ఖుమాలో పరిస్థితి సీరియస్‌గానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా ఖుమాలో స్నేహితుడు.. తోటి క్రికెటర్ టియాన్ కోకెమోర్ ట్విటర్ వేదికగా తన స్నేహితుడు కోలుకోవాలని.. అందుకు మీరంతా ప్రార్థించాలంటూ ట్వీట్ చేశాడు.''మనం నీచమైన ప్రపంచంలో బతుకు జీవనం సాగిస్తున్నాం. నా స్నేహితుడు.. జట్టు సభ్యుడు మొండ్లీ ఖుమాలో త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. గత ఆదివారం ఇంటికి వస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని.. ప్రస్తుతం యూకేలోని ఆసుపత్రిలో మృత్యువు నుంచి తప్పించుకోవడానికి పోరాటం చేస్తున్నాడు''. అంటూ పేర్కొన్నాడు. కాగా విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ఖుమాలోపై దాడికి దిగిన వారిలో ఒక 27 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా ఖుమాలోపై దాడి విషయాన్ని పోలీసులు సౌతాఫ్రికాలో ఉన్న తన కుటుంబసభ్యులకు తెలియజేశారు. ఖుమాలో ప్రాతినిధ్యం వహిస్తున్న నార్త్ పెర్తర్టన్ క్రికెట్ క్లబ్ దాడిని ఖండించింది. ''దుండగుల చేతిలో గాయపడి ఆసుపత్రిలో కోలుకుంటున్న మొండ్లీ ఖుమాలోకు మా మద్దతు ఉంటుంది. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం.'' అని తెలిపింది. కాగా 20 ఏళ్ల మొండ్లీ ఖుమాలో 2018లో క్వాజులు-నాటల్ ఇన్లాండ్ తరపున టి20 అరంగేట్రం చేశాడు. 2020 అండర్-19 ప్రపంచకప్ సౌతాఫ్రికా జట్టులో మొండ్లీ ఖుమాలో చోటు దక్కించుకున్నాడు. ఇక 2020 మార్చి 7న లిస్ట్-ఏ, 2021 మార్చి 4న ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఐదు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, రెండు లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 4 టి20 మ్యాచ్‌లు ఆడాడు. చదవండి: Darren Sammy: వెస్టిండీస్ మాజీ కెప్టెన్‌కు పాకిస్తాన్ ప్రతిష్టాత్మక అవార్డు What a sick world we live in! 😡Please pray for my teammate Mondli Khumalo! 🙏🏻🙏🏻❤️🐘 He was brutally assaulted while heading home from a night out and he is currently fighting for his life in hospital in the UK. pic.twitter.com/94MrXhArs4 — Tian Koekemoer (@TianKoekemoer07) May 30, 2022 -
విషాదం: ఆశల దీపాన్ని దేవుడు ఆర్పేశాడు..
కురుపాం/విజయనగరం ఫోర్ట్: రాత్రి 10 గంటల వరకు అందరూ ఒక్కచోటే కూర్చొని శ్రద్ధగా చదువుకున్నారు... 8వ తరగతికి చెందిన 12 మంది విద్యార్థులు ఒకే గదిలో నిద్రకు ఉపక్రమించారు.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.. కట్ల పాము రూపంలో మృత్యువు గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో వారి గదిలోకి ప్రవేశించింది. వరుసగా నిద్రపోతున్న విద్యార్థుల్లో ముగ్గురిని కాటేసింది. విద్యార్థులు వెంటనే మేల్కొన్నారు. పామును గమనించారు. కేకలు వేయడంతో మిగిలిన విద్యార్థులు కర్రతో దానిని హతమార్చారు. వసతిగృహ సిబ్బంది సహాయంతో వెంటనే ఆస్పత్రికి చేరుకున్నా ఒక విద్యార్థి మృత్యు ఒడికి చేరుకున్నాడు. మిగిలిన ఇద్దరు విద్యార్థులు విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వసతిగృహ సిబ్బంది, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం... కురుపాం మండల కేంద్రంలో ఉన్న మహా త్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదు వుతున్న కొమరాడ మండలం దళాయిపేటకు చెందిన మంతిని రంజిత్‌కుమార్, సాలూరు మండలం జీగిరాం గ్రామానికి చెందిన ఈదుబిల్లి వంశీ, సీతానగరం మండలం జగ్గునాయుడు పేటకు చెందిన వంగపండు నవీన్‌లతో పాటు మరో 9 మంది వసతిగృహం డార్మిటరీ గదిలో నిద్రపోతున్నారు. అర్ధారాత్రి తర్వాత కట్లపాము వరుసగా నిద్రపోతున్న రంజిత్‌కుమార్, వంశీ, నవీన్‌ల ముక్కు, కంటి, వీపుమీద కాటేసింది. వారు వసతిగృహంలో ఉన్న ప్రిన్సిపాల్ బిర్లంగి సీతరామ్, ఉపాధ్యాయ సిబ్బందికి తెలియజేశారు. వసతిగృహ సిబ్బంది వెంటనే ద్విచక్రవాహనంపై కురు పాం సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి, అక్కడ నుంచి విజయనగరంలోని తిరుమల ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రంజిత్‌కుమార్ (13) మృతి చెందాడు. మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆశల దీపాన్ని దేవుడు ఆర్పేశాడు.. మహాశివరాత్రికి ఇంటికి వచ్చావు.. అందరితో కలిసి సరదాగా గడిపావు.. పామునోట పడేందుకే వసతిగృహానికి వెళ్లావా అంటూ రంజిత్‌కుమార్ తల్లి సన్యాసమ్మ విలపిస్తున్న తీరు అక్కడివారిని కన్నీరుపెట్టించింది. నా ఆశలన్నీ కొడుకుపైనే పెట్టుకున్నాను.. నాకు దేవుడు అన్యాయం చేశాడు.. మంచి వాళ్లనే తీసుకుపోతాడంటూ బోరున విలపిస్తోంది. విద్యార్థి తండ్రి కృష్ణ ఆస్పత్రి వద్దే కుప్పకూలిపోయారు. రంజిత్ మృతితో వసతిగృహంతో పాటు స్వగ్రామం దళాయిపేటలో విషాదం అలముకుంది. విద్యార్థుల ఆరోగ్యంపై కలెక్టర్ ఆరా: కలెక్టర్ సూర్యకుమారి శుక్రవారం రాత్రి ఆస్పత్రిని సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీశారు. కోలుకునేలా సేవలందించాలని వైద్యులకు సూచించారు. విద్యార్థి మృతి బాధాకరం పాముకాటుకు గురై తిరుమల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణితో పాటు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందజేయాలని వైద్యులకు సూచించారు. ఒక విద్యార్థి మృతిచెందడం బాధాకరమన్నారు. రంజిత్‌కుమార్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఘటనను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేస్తామని తెలిపారు. పాముకరిచిందని విద్యార్థులు తెలిపిన వెంటనే ప్రిన్సిపాల్ స్పందించారన్నారు. విద్యార్థులను కాపాడుకునేందుకు శక్తివంచన లేకుండా కృషిచేశారన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం బీసీ గురుకులాల ఏర్పాటుకు ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందని, వసతులు లేని అద్దె భవనాల్లో ఏర్పాటు చేసిందని, అందువల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని జెడ్పీ చైర్మన్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం విద్యాసంస్థలన్నింటికి సదుపాయాలతో కూడిన శాశ్వత వసతి కల్పించేందుకు కృషిచేస్తోందన్నారు.