ఫ్లోరిడా: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో అస్వస్థతకు గురయ్యారు. కత్తిపోటుకు గురైన పొత్తికడుపు భాగంలో నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్లు ఆయన భార్య వెల్లడించారు. అమెరికా ఫ్లోరిడాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే, ఆయన మద్దతుదారులు రాజధాని నగరం బ్రసీలియాలో అధ్యక్ష భవనం, కాంగ్రెస్, సుప్రీం కోర్టు భవనాల వద్ద అల్లర్లు సృష్టించిన మరుసటి రోజునే బోల్సోనారో అస్వస్థతకు గురవటం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రెజిల్ అధ్యక్షుడిగా తన పదవీకాలం ముగిసేందుకు రెండు రోజుల ముందే డిసెంబర్ 31, 2022 రోజున అమెరికా వెళ్లారు బోల్సోనారో.
67 ఏళ్ల బోల్సోనారో ఫ్లోరిడా ఓర్లాండోలోని అడ్వెంట్‌హెల్త్ సెలబ్రేషన్ అక్యూట్ కేర్ హాస్పిటల్‌లో చేరినట్లు బ్రెజిల్‌కు చెంది ఓ గ్లోబో న్యూస్‌పేపర్ తెలిపింది. ‘ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో బోల్సోనారో చికిత్స తీసుకుంటున్నారు. 2018 విజయోత్సవ ర్యాలీలో కత్తిపోటుకు గురైనప్పటి నుంచి పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు.’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు ఆయన భార్య మిచెల్ బోల్సోనారో. మరోవైపు.. ఓర్లాండో ఆసుపత్రి ఎలాంటి ప్రకటన చేయలేదు.
- Após facada sofrida em Juiz de Fora/MG, fui submetido à 5 cirurgias. Desde a última, por por 2x tive aderências que me levaram à outros procedimentos médicos.
— Jair M. Bolsonaro 2️⃣2️⃣ (@jairbolsonaro) January 10, 2023
- Ontem nova aderência e baixa hospitalar em Orlando/USA.
- Grato pelas orações e mensagens de pronto restabelecimento. pic.twitter.com/u5JwG7UZnc
మద్దతుదారుల దురాక్రమణ..
బ్రెజిల్ రాజధాని నగరం బ్రసీలియాలో మాజీ దేశాధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులు దురాక్రమణకు దిగారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో లూయిజ్ ఇన్సియో లూలా డ సిల్వా చేతిలో బోల్సోనారో ఓడిపోవడం జీర్ణించుకోలేని ఆయన మద్దతుదారులు ఆదివారం రాజధానిలోని అత్యంత కీలకమైన భవనాలపై దాడికి తెగించారు. దేశాధ్యక్షుడి అధికారిక నివాసం, కాంగ్రెస్, సుప్రీం కోర్టు ముందున్న బారికేడ్లను బద్దలుకొట్టి, భవనాల గోడలెక్కి అద్దాలు, కిటికీలు ధ్వంసం చేశారు.
ఇదీ చదవండి: బ్రెజిల్ అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టు భవనాల ఆక్రమణ.. ప్రపంచ దేశాధినేతల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment