brazil president
-
G20 Summit: ఆర్ఆర్ఆర్ అద్భుతం: బ్రెజిల్ అధ్యక్షుడు
న్యూఢిల్లీ: గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించిన తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’పై బ్రెజిల్ అధ్యక్షుడు లూలా మనసు పారేసుకున్నారు. తనకెంతో నచ్చిన సినిమా అని మెచ్చుకున్నారు. జీ20 సదస్సు కోసం ఢిల్లీకి వచ్చిన లూయిజ్ ఒక ఆన్లైన్ పోర్టల్‌కు ఇచి్చన ఇంటర్వ్యూ వివరాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఆ ఇంటర్వ్యూలో ‘ మీకు నచి్చన భారతీయ సినిమా పేరు చెప్పండి’ అన్న ప్రశ్నకు ఆయన ఠక్కున ఆర్ఆర్ఆర్ అని చెప్పారు. ‘ఇది చక్కని ఫీచర్ ఫిల్మ్. సరదా సన్నివేశాలు, అలరించే డ్యాన్స్‌లతో కట్టిపడేస్తుంది. బ్రిటిషర్లు భారతీయులను ఎంతగా అణచివేశారనేది కళ్లకు కట్టింది’అని అన్నారు. -
ఆర్ఆర్ఆర్పై బ్రెజిల్ ప్రెసిడెంట్ ప్రశంసలు.. రాజమౌళి ఏమన్నారంటే?
ఆర్ఆర్ఆర్ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ చిత్రంతో టాలీవుడ్ స్థాయి ఏకంగా గ్లోబల్‌వైడ్‌గా మార్మోగిపోయింది. హాలీవుడ్ దర్శక దిగ్గజం కామెరూన్ సైతం ప్రశంసల వర్షం కురిపించారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. అయితే తాజాగా ఈ చిత్రంపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా ప్రశంసలతో ముంచెత్తారు. ఢిల్లీలో జరుగుతున్న జీ20 సమావేశానికి హాజరైన ఆయన.. రాజమౌళిని సైతం కొనియాడారు. లులా మాట్లాడుతూ..'ఆర్ఆర్ఆర్ సినిమా బాగా నచ్చంది. ఈ చిత్రంలోని అద్భుతమైన సన్నివేశాలు, అందమైన డ్యాన్సులు ఆకట్టుకున్నాయి. భారత్‌పై బ్రిటిష్ పాలనను చూపించినప్పటికీ.. చాలా అర్థవంతంగా ఉంది. ఆ సినిమా చూసి తెలిసిన వాళ్లందరిని ఆర్ఆర్ఆర్ అని మొదట అడిగేవాన్ని. దర్శకుడు రాజమౌళి, నటీనటులకు నా అభినందనలు' అని అన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ తాజాగా ట్విటర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రాజమౌళి ట్వీట్ అయితే లులా ప్రశంసలపై రాజమౌళి స్పందించారు. ఈ మేరకు ఆయనకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. ట్వీట్లో రాస్తూ.. 'ఆర్ఆర్ఆర్ పట్ల మీ మాటలకు చాలా ధన్యవాదాలు. మీరు భారతీయ సినిమా గురించి ప్రస్తావించడం చాలా ఆనందంగా ఉంది. ఆర్ఆర్ఆర్ను ఆస్వాదించారని చెప్పడం చాలా గర్వకారణం. మీ ప్రశంసలతో మాచిత్రబృందం సంతోషంగా ఉంది. మీరు మా దేశంలో విలువైన సమయాన్ని ఆనందంగా గడుపుతున్నారని ఆశిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. కాగా.. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలోని నాటునాటు సాంగ్‌ను ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. Sir… @LulaOficial 🙏🏻🙏🏻🙏🏻 Thank you so much for your kind words. It’s heartwarming to learn that you mentioned Indian Cinema and enjoyed RRR!! Our team is ecstatic. Hope you are having a great time in our country. https://t.co/ihvMjiMpXo — rajamouli ss (@ssrajamouli) September 10, 2023 -
G20 Summit: జీ20 సమావేశాల ముగింపు వేళ ప్రధాని ప్రసంగం
న్యూఢిల్లీ: ఢిల్లీ వేదికగా కన్నులపండుగగా జరిగిన 18వ జీ20 సమావేశాలు ఈరోజు విజయవంతంగా ముగిశాయి. ఈ సమావేశాలకు అధ్యక్షత వహించిన భారత దేశం తదుపరి సమావేశాలకు బ్రెజిల్ ఆతిధ్యమివ్వనున్న నేపథ్యంలో ఆ దేశాధినేత లూలా డా సిల్వా చేతికి బ్యాటన్ అప్పగించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. నమ్మకముంది.. జీ20 సమావేశాల ముగింపు సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇండోనేషియా, భారత్, బ్రెజిల్ త్రయం స్ఫూర్తిపై మాకు పూర్తి నమ్మకముంది. బ్రెజిల్‌కు మేము పూర్తి సహాయసహకారాలు అందిస్తామని మా తదనంతరం వారి నాయకత్వంలో జీ20 భాగస్వామ్య లక్ష్యాలను మరింత ముందుకు తీసుకువెళుతుందని విశ్వసిస్తున్నామన్నారు. ఓవర్ టు బ్రెజిల్.. బ్రెజిల్ అధ్యక్షుడు నా స్నేహితుడు లూలా డా సిల్వాకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకు అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తున్నాను. అయితే నవంబర్‌లో జరగబోయే వర్చువల్ సెషన్ వరకు భారత్ జీ20 ప్రెసిడెన్సీ దేశంగానే కొనసాగుతుందన్నారు. ఆ సమావేశానికి సంబంధించిన వివరాలను మా బృందం అతిత్వరలోనే మీతో పంచుకుంటుందన్నారు. ఈ విడత సమావేశాల్లో మీరంతా అనేక అంశాలపై మీ అభిప్రాయాలను తెలిపారు మన పురోగతిని వేగవంతం చేయడానికి కొన్ని విలువైన సలహాలు ఇచ్చారు, మరెన్నో ప్రతిపాదనలు చేసారు. థాంక్ యూ.. మిత్రులారా..! దీంతో ఈ జీ20 సమావేశం ముగిసిందని నేను ప్రకటిస్తున్నాను. 'ఒక్కటే భూమి, ఒక్కటే కుటుంబం, ఒక్కటే భవిష్యత్తు' అనే నినాదంతో మనం వేసుకున్న బాటను కొనసాగించాలని కోరుతున్నానన్నారు. 140 కోట్ల మంది భారతీయుల శుభాకాంక్షలతో మీ అందరికీ కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. #WATCH | G 20 in India | Prime Minister Narendra Modi hands over the gavel of G 20 presidency to the President of Brazil Luiz Inácio Lula da Silva. pic.twitter.com/ihEmXN9lty — ANI (@ANI) September 10, 2023 శభాష్ భారత్.. రెండ్రోజుల పాటు ఢిల్లీలో జరిగిన జీ20 సమావేశాలను అధ్యక్ష హోదాలో భారత్ దిగ్విజయంగా నిర్వహించిందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ అన్నారు. దక్షిణ బౌగోళానికి చక్కటి ప్రాతనిధ్యం లభించిందని అన్నారు. #WATCH | G 20 in India: "I think it (craft exhibition) is wonderful...I think the presidency has done a very good job of being a voice of the global south & the fact that they managed to get a consensus is a testament to the leadership of G 20...," says Stephane Dujarric,… pic.twitter.com/ooYqTqGfKy — ANI (@ANI) September 10, 2023 ఇక నుంచి జీ21.. భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న జీ20 సదస్సులో ఆఫ్రికా యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించే విషయమై ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదన చేయగా సభ్యదేశాలు ఆమోదాన్ని తెలిపాయి. అనంతరం భారత విదేశాంగ శాఖమంత్రి జైశంకర్ ఆఫ్రికన్ యూనియన్ (AU) ఛైర్పర్సన్ అజాలి అసోమానిని ఆయనకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు. దీంతో 20 సభ్యుల జీ20లో ఆఫ్రికా యూనియన్ చేరికతో 21 సభ్యులయ్యారు. నిన్న(శనివారం) 55 దేశాల సమూహమైన ఆఫ్రికా యూనియన్ వారికి జీ20లో శాశ్వత సభ్యత్వం విషయాన్ని ప్రధాని మోదీ ప్రకటించగా.. సభ్యదేశాలు ఈ ప్రతిపాదనను ఆమోదించాయి. దాంతో ఇక నుంచి జీ20 కాస్తా జీ21 కానుంది. ఇది కూడా చదవండి: జీ20 సమ్మిట్: కనువిందు చేస్తున్న రిషి సునాక్ దంపతులు.. -
అడవికి ఊపిరి.. తుపాకీకి ఉరి
కొత్త సంవత్సరంలో ముచ్చటగా మూడోసారి బ్రెజిల్ గద్దెనెక్కిన లూలా డ సిల్వా రెండు కీలక అంశాలపై దృష్టి సారించారు. జనవరి 1న దేశాధ్యక్షుడిగా ప్రమాణం చేసినప్పుడు తుపాకుల సంస్కృతిని కట్టడి చేస్తానని, అమెజాన్‌లో బంగారం తవ్వకాలకు అడ్డుకట్ట వేసి అడవులకి కొత్త ఊపిరిలూదుతానని ప్రకటించారు. ఈ రెండు అంశాలు లూలా ప్రభుత్వానికి ఎందుకంత ప్రాధాన్యంగా మారాయి ? వామపక్ష భావజాలం కలిగిన నాయకుడైన లూలా రెండు పర్యాయాల పాలనలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చి జన హృదయాలను గెలుచుకున్నారు. వీటిని కూడా నెరవేరిస్తే ఆయన పేరు మరోసారి ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోవడం ఖాయం. సరిగ్గా 20 ఏళ్ల కిందట బ్రెజిల్ అధ్యక్షుడిగా లూలా డ సిల్వా తొలిసారి అధ్యక్షుడైనప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఈ సారి ఎన్నికల్లో లూలా అత్యంత స్వల్ప మెజార్టీతో నెగ్గారు. 50.9% ఓటు షేర్ లూలాకు వస్తే, మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకి 49.1% ఓట్లు వచ్చాయి. కేవలం రెండు శాతం ఓట్లతో తేడాతో నెగ్గిన లూలా తాను అనుకున్నవీ ఎంత సాధించగలరో అన్న అనుమానాలైతే ఉన్నాయి. ఇప్పటికే బోల్సోనారో మద్దతుదారులు రోడ్లపైకెక్కి తిరిగి తమ నాయకుడినే అధ్యక్షుడిని చేయాలంటూ దేశాన్ని రణరంగంగా మారుస్తున్నారు. శాంతి భద్రతలకే సవాల్ విసురుతున్నారు. ఈ నేపథ్యంలో లూలా తన పీఠాన్ని కాపాడుకోవడానికే సర్వశక్తులు ఒడ్డాల్సి వస్తోంది. దేశానికి ఒకప్పుడు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 4.4 కోట్ల మంది ప్రజల్ని పేదరికం నుంచి బయటపడేసి ప్రపంచవ్యాప్తంగా అందరి మన్ననలు అందుకున్న లూలా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక అవినీతి ఆరోపణలపై జైల్లో గడపడంతో ఆయనపైనున్న విశ్వాసం కొంతవరకు ప్రజల్లో సన్నగిల్లింది. ఆ తర్వాత కేసుల నుంచి విముక్తుడైనప్పటికీ తుపాకుల సంస్కృతిని, అమెజాన్ అడవుల్ని కాపాడితే మరోసారి లూలా పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోవడం ఖాయం. అందుకే తన ప్రమా ణ స్వీకారం రోజే బోల్సోనారో తుపాకులు సులభంగా కొనుక్కోవడానికి వీలుగా జారీ చేసిన డిక్రీలను రద్దు చేశారు. తుపాకుల నియంత్రణకు, బంగారం తవ్వకాలకి సంబంధించి కొత్త డిక్రీలు జారీ చేసి అభిమానుల నుంచి జేజేలు అందుకున్నారు. పెచ్చు మీరుతున్న తుపాకుల సంస్కృతి బ్రెజిల్లో మార్కెట్‌కి వెళ్లి బీన్స్ కొనుక్కోవడం ఎంత తేలికో తుపాకుల కొనుగోలు కూడా అంతే సులభం. జైర్ బోల్సోనారో 2019 జనవరి 1న దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాక తుపాకుల నియంత్రణ చట్టాలను సులభతరం చేశారు. గన్ లైసెన్స్లకుండే గడువుని అయిదేళ్ల నుంచి పదేళ్లకు పెంచారు. దీంతో ఆత్మరక్షణ పేరుతో తుపాకుల్ని విచ్చలవిడిగా కొనేవారి సంఖ్య పెరిగిపోయింది. తుపాకుల మరణాల్లో ప్రపంచంలో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉంది. సగటున ఏడాదికి 40 వేల మంది మృత్యువాత పడడం చట్టాలను కఠినతరం చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల్ని బహిరంగంగా ప్రశంసించే బోల్సోనారో అమెరికా బాటలో విచ్చలవిడి తుపాకుల విక్రయానికి తెరతీశారు. దీంతో బ్రెజిల్ తుపాకుల కాల్పుల ఘటనతో రక్తమోడుతోంది. లూలా డ సిల్వా అధ్యక్షుడయ్యాక తుపాకుల నియంత్రణకి చేపడుతున్న చర్యలు ప్రజల్ని ఆకర్షిస్తున్నాయి. ఒక సర్వే ప్రకారం దేశంలో మూడింట రెండు వంతుల మంది ప్రజలు తుపాకులు ప్రజల చేతుల్లో ఉండడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అమెజాన్ అడవుల్లో గోల్డ్ మైనింగ్ అమెజాన్ అటవీ ప్రాంతంలో 60శాతానికిపైగా బ్రెజిల్లో ఉంది. భూమ్మీద ఉండే ఆక్సిజన్‌లో 10శాతం ఇక్కడ నుంచి వస్తూ ఉండడంతో భూమాతకి ఊపిరితిత్తులుగా అమెజాన్‌ను అభివర్ణిస్తారు. ప్రపంచంలో అతి పెద్ద అన్‌రిజిస్టర్డ్ మైనింగ్ ఇండస్ట్రీకి ఈ అడవులే వేదికయ్యాయి. గనుల నుంచి బంగారాన్ని వెలికి తీయడానికి పాదరసాన్ని వాడుతుంటారు. ఈ పాదరసంతో అమెజాన్ నదుల్లో నీరు విషతుల్యంగా మారుతున్నాయి. దీంతో ఈ అడవుల్లో ఉన్న 25 లక్షల రకాల జీవజాలానికి ముప్పు ఏర్పడుతోంది. అడవుల్లో నివసించే స్థానిక గిరిజనులకు గోల్డ్ మైనర్ల నుంచి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. బ్రెజిల్ అటవీ ప్రాంతంలో బంగారం స్మగ్లర్లను గారింపీర్స్ అని పిలుస్తారు. వీరందరి వెనకాల మాజీ అధ్యక్షుడు బోల్సోనారో ఉన్నారనే ప్రచారం ఉంది. బోల్సోనారో తండ్రి కూడా గారింపీర్ కావడంతో అమెజాన్ అడవులు నాశనం కావడానికి బోల్సోనారో కుటుంబమే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కరోనా సంక్షోభ సమయంలో అయిదు నెలల కాలంలో బంగారం ధరలు 40% పెరిగిపోవడంతో గోల్డ్ స్మగ్లర్లు ఈ ప్రాంతంలో తమ పట్టు పెంచుకున్నారు. వీరికి రాజకీయ నేతల అండదండలు ఉండడంతో వీరిని కాదని చర్యలు తీసుకోవడం అంత సులభం కాదు. అధ్యక్ష ఎన్నికల్లో అమెజాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అన్ని జిల్లాల్లోనూ బోల్సొనారో కంటే లూలా వెనుకబడ్డారు. అందుకే ఆయన ప్రతీ నిర్ణయం ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది. ► ప్రపంచ మార్కెట్లో లభ్యమయ్యే బంగారంలో 20% అమెజాన్ అడవుల నుంచే వస్తుంది. ► ఈ గోల్డ్ మైనింగ్‌లు 2 లక్షల మందికి జీవనాధారంగా ఉన్నాయి. ► అమెజాన్‌లో బంగారం తవ్వకాల కోసం 2017 నుంచి అడవుల నరికివేత పెరిగిపోతోంది. ► అమెజాన్ అటవీ విస్తీర్ణం ఇప్పటికే 20% తగ్గిపోయింది. అంటే ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల సైజుతో ఇది సమానం. ఇందులో మైనింగ్ కోసమే 90% చెట్లను నరికేశారు. ► పర్యావరణ పరిరక్షణ చట్టాలను మాజీ అధ్యక్షుడు బోల్సోనారో తుంగలో తొక్కడంతో 2019లో అమెజాన్ అడవుల్లో 10,500 హెక్టార్ల విస్తీర్ణం తగ్గిపోయింది. ► 2018 సంవత్సరంతో పోలిస్తే గోల్డ్ మైనింగ్ కోసం 2019లో 23% అధికంగా, 2020 నాటికి 80శాతం అధికంగా అడవుల్ని నరికివేశారు. ► ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో తుపాకుల సంఖ్య దాదాపుగా 20 లక్షలకి చేరుకుంది. ► 2018తో పోల్చి చూస్తే తుపాకుల్ని వినియోగించే ప్రజల సంఖ్య రెట్టింపైంది. ► గత ఏడాది జులైలో తుపాకులకి లైసెన్స్ ఇచ్చే సంస్థ సీఏసీ దగ్గర 6 లక్షలకు పైగా తుపాకుల లైసెన్స్ మంజూరు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ► 2018తో పోల్చి చూస్తే ఇది ఏకంగా 500% ఎక్కువ. ► 2019లో అత్యధికంగా 49,436 మంది తూటాలకు బలయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బ్రెజిల్ రణరంగం: మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు అస్వస్థత
ఫ్లోరిడా: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో అస్వస్థతకు గురయ్యారు. కత్తిపోటుకు గురైన పొత్తికడుపు భాగంలో నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్లు ఆయన భార్య వెల్లడించారు. అమెరికా ఫ్లోరిడాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే, ఆయన మద్దతుదారులు రాజధాని నగరం బ్రసీలియాలో అధ్యక్ష భవనం, కాంగ్రెస్, సుప్రీం కోర్టు భవనాల వద్ద అల్లర్లు సృష్టించిన మరుసటి రోజునే బోల్సోనారో అస్వస్థతకు గురవటం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రెజిల్ అధ్యక్షుడిగా తన పదవీకాలం ముగిసేందుకు రెండు రోజుల ముందే డిసెంబర్ 31, 2022 రోజున అమెరికా వెళ్లారు బోల్సోనారో. 67 ఏళ్ల బోల్సోనారో ఫ్లోరిడా ఓర్లాండోలోని అడ్వెంట్‌హెల్త్ సెలబ్రేషన్ అక్యూట్ కేర్ హాస్పిటల్లో చేరినట్లు బ్రెజిల్‌కు చెంది ఓ గ్లోబో న్యూస్‌పేపర్ తెలిపింది. ‘ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో బోల్సోనారో చికిత్స తీసుకుంటున్నారు. 2018 విజయోత్సవ ర్యాలీలో కత్తిపోటుకు గురైనప్పటి నుంచి పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు.’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు ఆయన భార్య మిచెల్ బోల్సోనారో. మరోవైపు.. ఓర్లాండో ఆసుపత్రి ఎలాంటి ప్రకటన చేయలేదు. - Após facada sofrida em Juiz de Fora/MG, fui submetido à 5 cirurgias. Desde a última, por por 2x tive aderências que me levaram à outros procedimentos médicos. - Ontem nova aderência e baixa hospitalar em Orlando/USA. - Grato pelas orações e mensagens de pronto restabelecimento. pic.twitter.com/u5JwG7UZnc — Jair M. Bolsonaro 2️⃣2️⃣ (@jairbolsonaro) January 10, 2023 మద్దతుదారుల దురాక్రమణ.. బ్రెజిల్ రాజధాని నగరం బ్రసీలియాలో మాజీ దేశాధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులు దురాక్రమణకు దిగారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో లూయిజ్ ఇన్సియో లూలా డ సిల్వా చేతిలో బోల్సోనారో ఓడిపోవడం జీర్ణించుకోలేని ఆయన మద్దతుదారులు ఆదివారం రాజధానిలోని అత్యంత కీలకమైన భవనాలపై దాడికి తెగించారు. దేశాధ్యక్షుడి అధికారిక నివాసం, కాంగ్రెస్, సుప్రీం కోర్టు ముందున్న బారికేడ్లను బద్దలుకొట్టి, భవనాల గోడలెక్కి అద్దాలు, కిటికీలు ధ్వంసం చేశారు. ఇదీ చదవండి: బ్రెజిల్ అధ్యక్ష భవనం, సుప్రీంకోర్టు భవనాల ఆక్రమణ.. ప్రపంచ దేశాధినేతల ఆందోళన -
బోల్సోనారో ఓటమి.. బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా లులా డ సిల్వా
బ్రెసిలియా: బ్రెజిల్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారో ఓటమిపాలయ్యారు. కొత్త అధ్యక్షుడిగా వర్కర్స్ పార్టీ నేత లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా అలియాస్ లులా(77) ఎన్నికయ్యారు. ఆదివారం(అక్టోబర్ 30) జరిగిన ఎన్నికల్లో జైర్ బోల్సోనారోను ఓడించి బ్రెజిల్ 39వ అధ్యక్షుడిగా గెలుపొందారు. ఇరువురి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. స్వల్ప తేడాతో బోల్సోనారోపై లులా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో లులాకు 50.9శాతం ఓట్లు రాగా.. ప్రస్తుత అధ్యక్షుడు బోల్సోనారోకు 49.1 శాతం ఓట్లు వచ్చినట్లు ఆ దేశ అత్యున్నత ఎన్నికల విభాగం తెలిపింది. తాజా ఎన్నికతో లులా డ సిల్వా బ్రెజిల్ అధ్యక్షుడిగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో 2003 నుంచి 2010 వరకు ప్రెసిడెంట్‌గా చేశారు. సరిగ్గా 20 ఏళ్ల కిందట తొలిసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన లులా డ సిల్వా.. అధికారం కోల్పోయి తర్వాత అవినీతి ముద్రతో జైలుకు వెళ్లారు. బయటకు వచ్చి రాజకీయ పోరాటంలో మళ్లీ అధ్యక్షుడిగా గెలిచి చరిత్ర సృష్టించారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడారు లులా డ సిల్వా. ‘దేశం మొత్తాన్ని ఏకం చేసేందుకు కృషి చేస్తాను. ఆయుధాల వినియోగాన్ని తగ్గించేందుకు పాటుపడతాం. అలాగే అమెజాన్ అడవులను రక్షించేందుకు అంతర్జాతీయ సహకారం కావాలి. ప్రపంచ దేశాలు అందుకు సహకరించాలి. ప్రపంచ వ్యాణిజ్యం మరింత పారదర్శకంగా చేస్తాం.’ అని పేర్కొన్నారు లులా. అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లిన క్రమంలో 2018లో పోటీ చేసేందుకు అనర్హులుగా మారారు లులా. 2021లో ఆయనపై ఉన్న కేసును సుప్రీం కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన మళ్లీ పోటీ చేసేందుకు అవకాశం లభించింది. ప్రధాని మోదీ శుభాకాంక్షలు.. బ్రెజిల్ 39వ అధ్యక్షుడిగా ఎన్నికైన లులా డ సిల్వాకు శుభాకాంక్షలు తెలిపారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇరు దేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఆయనతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే.. అంతర్జాతీయ అంశాలపై సహకారం అందిస్తామన్నారు. Congratulations to @LulaOficial on winning the Presidential elections in Brazil. I look forward to working closely together to further deepen and widen our bilateral relations, as also our cooperation on global issues: PM @narendramodi — PMO India (@PMOIndia) October 31, 2022 ఇదీ చదవండి: Morbi Tragedy: కేబుల్ బ్రిడ్జి దుర్ఘటనపై పుతిన్ సంతాపం -
ఆస్పత్రి పాలైన బోల్సోనారో.. కోలుకోవద్దంటూ నెటిజనుల ఆగ్రహం!
సావో పాలో: బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో అస్వస్థతకు గురై సోమవారం ఆస్పత్రిలో చేరారు. కడుపులో పేగుకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చేరినట్లు ట్వీటర్లో పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, పేగుకు శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్లు వెల్లడించారు. 66 ఏళ్ల జైర్ బోల్సోనారో 2018 అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో కత్తిపోటుకు గురైనప్పటి నుంచి పలుమార్లు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే కరోనా టైంలో బోల్సోనారో నిర్ణయాల వల్ల బ్రెజిల్ తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. మాస్క్ అక్కర్లేదంటూ, వ్యాక్సినేషన్ వద్దంటూ నిర్ణయాలు తీసుకుని విమర్శలపాలయ్యాడు. చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే మొసళ్లలా మారిపోవచ్చు తద్వారా బ్రెజిల్లో లక్షల్లో కరోనా మరణాలు సంభవించగా.. బోల్సోనారో తీరును వ్యతిరేకిస్తూ జనాలు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేయడం ప్రపంచం మొత్తం వీక్షించింది. ఈ తరుణంలో బోల్సోనారో కోలుకోవద్దంటూ పలువురు సోషల్ మీడియాలో కోరుకుంటుండడం గమనార్హం. - Comecei a passar mal após o almoço de domingo. - Cheguei ao hospital às 03h00 de hoje. - Me colocaram sonda nasogástrica. - Mais exames serão feitos para possível cirurgia de obstrução interna na região abdominal. pic.twitter.com/NPgv6HwoHj — Jair M. Bolsonaro (@jairbolsonaro) January 3, 2022 సంబంధిత వార్త: బోల్సోనారో ఓ ‘రక్తపిశాచి’ అంటూనే.. నిరసనకారుల ఘోర తప్పిదం -
Covaxin: రాజకీయ దుమారం.. బ్రెజిల్ డీల్ క్యాన్సిల్!
అవినీతి ఆరోపణలు, రాజకీయ విమర్శల కారణంగా.. భారత్ బయోటెక్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. బ్రెజిల్‌తో కుదుర్చుకున్న కోవిడ్ వ్యాక్సిన్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బ్రెజిల్లో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కరోనా కారణంగా 2లక్షల మందికి పైగా మరణించడంతో అధ్యక్షుడిపై విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ త్వరగతిన సరఫరా కోసం బ్రెజిల్ అధ్యక్షుడు జైరో బొల్సొనారో మనదేశానికి చెందిన భారత్ బయోటెక్‌తో ఒప్పందం కుదర్చుకున్నారు. భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్‌ను బ్రెజిల్ మార్కెట్లో విడుదల చేసేందుకు బొల్సొనారో మధ్యవర్తిగా ప్రముఖ ఫార్మసంస్థ ప్రెసిస మెడికామెంటోస్,ఎన్విక్సియా ఫార్మాసూటికల్స్ అనుమతించారు. ఈ క్రమంలో... ఒక్కోడోసు 15 డాలర్ల చొప్పున 300 మిలియన్ డాలర్లు విలువ చేసే 20 మిలియన్ డోసులను తెప్పించుకునేందుకు బొల్సొనారో సర్కార్ ఒప్పందం చేసుకుంది.. అయితే ఈ వ్యాక్సిన్ ఒప్పందంలో బొల్సొనారోపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. కోవాగ్జిన్‌ను తన సన్నిహితులకు చెందిన ఫార్మా సంస్థ ప్రెసిసా మెడికామెంటోస్‌కు అప్పగించడం ద్వారా ఏకంగా 10 కోట్ల డాలర్లు (రూ. 734 కోట్లు) ముడుపులు అందుకున్నారని ఆయనపై విమర్శలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు కూడా విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో టీకా అనుమతుల్ని రద్దు చేసుకుంటున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. ఆ వెంటనే.. బ్రెజిల్ సైతం తమ దేశంలో కోవాగ్జిన్ క్లినికల్ ట్రయిల్స్ మూడోదశ నిర్వహించడాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. అయితే ఒప్పందం రద్దైనప్పటికీ .. కోవాగ్జిన్‌ను సరఫరా చేయడానికి అవసరమైన అనుమతులు పొందడానికి బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ సంస్థ అనివిసాతో భారత్ బయోటెక్ కలిసి పని చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. -
బ్రెజిల్ అధ్యక్షుడి వినూత్న అభినందన
జెనీవా: కరోనా వైరస్‌తో అతలాకుతలమైన బ్రెజిల్‌కు భారత్ 20 లక్షల డోసుల్ని పంపడంపై బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో హర్షం వ్యక్తం చేశారు. భారత ప్రధాని మోదీని వినూత్నంగా అభినందించారు. కరోనా వ్యాక్సిన్‌ను హనుమంతుడు మోసుకొచ్చిన సంజీవిని పర్వతంతో పోల్చారు. ‘నమస్కార్ ప్రధాని మోదీ, ప్రపంచాన్ని పీడిస్తున్న ఒక మహమ్మారిని జయించడంలో ఒక అద్భుతమైన భాగస్వామిని పొందడం గౌరవంగా భావిస్తున్నాం. టీకా డోసుల్ని మాకు పంపించినందుకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఈ సందేశంతో పాటు సంజీవిని పర్వతం స్థానంలో వ్యాక్సిన్ పర్వతాన్ని హనుమంతుడు మోసుకొస్తున్నట్టుగా ఒక చిత్రాన్ని ట్వీట్ చేశారు. భారత్ వ్యాక్సిన్ మైత్రి భేష్: డబ్ల్యూహెచ్ఓ ఇరుగు పొరుగు దేశాలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఉద్దేశించిన వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమంపై డబ్ల్యూహెచ్ఓ ప్రశంసల జల్లు కురిపించింది. భారత్ మాదిరిగా ప్రపంచదేశాలు ఒకరికొకరు సహకరించుకుంటే త్వరలోనే కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చునని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అన్నారు. కోవిడ్–19 వ్యాక్సిన్ అంశంలో నైబర్ ఫస్ట్ విధానాన్ని అవలంబిస్తున్న ప్రధాని మోదీని అభినందించారు. ‘‘కోవిడ్–19పై మీరు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు. ప్రపంచ దేశాలు ఒకరికొకరు అన్నీ పంచుకుంటూ ఉంటేనే ఈ మహమ్మారికి అడ్డుకట్ట పడుతుంది. ఎన్నో ప్రాణాలను కాపాడిన వాళ్లం అవుతాం’ అని టెడ్రోస్ ట్వీట్ చేశారు. బోల్సనారో ట్వీట్ చేసిన చిత్రం -
టీకా తీసుకుంటే మొసళ్లుగా మారతారు!
బ్రెసీలియా: కరోనాపై తొలి నుంచి నిర్లక్ష్య ధోరణి ప్రదరిస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో మరోమారు తన వ్యంగ్య ధోరణిని ప్రదర్శించారు. బ్రెజిల్లో భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించిన ఆయన.. ఫైజర్ ఇచ్చిన కాంట్రాక్టులో స్పష్టంగా కంపెనీ ఏ సైడ్ ఎఫెక్ట్స్‌కు బాధ్యత వహించదని ఉందని, అందువల్ల టీకా తీసుకున్న తర్వాత ఎవరైనా మొసలిగా మారితే అది వారి సమస్యని హెచ్చరించారు. వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు సూపర్ హ్యూమన్‌గా మారినా, మహిళలకు గడ్డాలు వచ్చినా, మొగవాళ్ల గొంతులు మారినా, ఫైజర్ పట్టించుకోదని గుర్తు చేశారు. సోమవారం బైడెన్‌కు వాక్సిన్ వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ ఆయన భార్య జిల్ బైడెన్‌కు సోమవారం కరోనా వ్యాక్సిన్ తొలి డోసు ఇస్తారని అధికారులు వెల్లడించారు. ప్రజల్లో చైతన్యం పెంచేందుకు, నమ్మ కం కలిగించేందుకు బహిరంగంగా వ్యాక్సిన్ తీసుకుంటానని ఇప్పటికే బైడెన్ చెప్పారు. శుక్రవారం ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఆయన భార్య కరెన్‌కు, హౌస్ స్పీకర్ నాన్సీపెలోసికి తొలిడోసు ఇచ్చారు. తనకు ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కనిపించలేదని పెన్స్ చెప్పారు. -
ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుంటే అంతేనట!
కరోనావైరస్కు సంబంధించి సంచలన వ్యాఖ్యలతో మొదటినుంచీ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సనారో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకుంటే మనుషులు మొసళ్లలా మారిపోవచ్చంటూ సరికొత్త వివాదానికి తెర తీసారు. అంతేకాదు ఆడవాళ్లకు గడ్డం మొలిచే అవకాశాలున్నాయంటూ కోవిడ్ వ్యాక్సిన్‌పై సంచలన కామెంట్స్ చేశారు. అమెరికా ఆమోదం తెలిపిన ఫైజర్ టీకాపై ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు. (టీకా భద్రత : బైడైన్ దంపతుల ముందడుగు) ఒకవైపు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు అంతానికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు పలు దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు బోల్సనారో వ్యాఖ్యలు వివాదాస్పదమౌతున్నాయి. కోవిడ్ టీకా కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఆయన ఫైజర్ టీకా తయారీ కంపెనీలపై తన దాడిని ఎక్కుపెట్టారు. ఈ టీకా తీసుకుంటే మనుషులు మొసళ్లలా మారే అవకాశాలున్నాయన్నారు. అయితే ఇలాంటి దుష్ప్రభావాలకు తాము బాధ్యత వహించమనీ, మీరు (ప్రజలు) మొసళ్లుగా మారితే, అది మీ సమస్య అని పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత సూపర్ హూమన్‌గా మారినా, మహిళలకు గడ్డం మొలిచినా, పురుషులు వేరేవిధంగా మాట్లాడినా ఔషధ తయారీదారులకు ఎలాంటి సంబంధం ఉండదంటూ వారిపై దాడిచేశారు. టీకా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది కానీ తాను మాత్రం కరోనా టీకా వేసుకొనేది లేదని మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే తనకు కరోనా సోకిన కారణంగా ఇప్పటికే తన శరీరంలో యాంటిబాడీస్ ఉన్నాయి.. ఇక తానెందుకు టీకా తీసుకోవాలంటూ ప్రశ్నించారు. అలాగే టీకాను తాము ఉచితంగా ఇవ్వబోతున్నామని, అలాగని టీకా తప్పనిసరి కాదన్నారు. టీకా తీసుకోని వారికి జరిమానాలు విధించబోమని, ఒత్తిడి చేసే ప్రసక్తే ఉండదని బోల్సనారో స్పష్టం చేశారు. (వ్యాక్సిన్ షాట్: కుప్పకూలిన నర్సు : వీడియో వైరల్) కాగా బ్రెజిల్లో ఇప్పటి వరకు 7.1 మిలియన్లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. లక్షా 85 వేల మంది మృతి చెందారు. గతంలో కరోనా వైరస్, లాక్‌డౌన్‌పై విభిన్నంగా స్పందించిన బ్రిజిల్ అధ్యక్షుడు కరోనా సాధారణ ఫ్లూమాత్రమేనంటూ వ్యాఖ్యానించారు. మాస్క్ ధరించేందుకు నిరాకరించి వివాదంలో నిలిచారు. ఆ తరువాత ఆయన కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. -
కరోనా వ్యాక్సిన్ తీసుకోను: బోల్సొనారో
న్యూఢిల్లీ, సాక్షి: కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ తాను తీసుకోబోనని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో తాజాగా స్పష్టం చేశారు. కోవిడ్-19ను ఎదుర్కొనే అంశంలో తొలి నుంచీ వ్యాక్సినేషన్లను వ్యతిరేకిస్తూ వస్తున్న ఆయన వ్యాక్సిన్‌ను తీసుకోనంటూ మరోసారి ప్రకటించారు. ఇది నా హక్కు అంటూ బోల్సొనారో పేర్కొన్నారు. కోవిడ్-19ను నిరోధించేందుకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ తాను వీటిని వినియోగించబోనని తెగేసి చెప్పారు. అంతేకాకుండా బ్రెజిల్ దేశ ప్రజలకు సైతం వ్యాక్సిన్ల అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యధిక కోవిడ్-19 కేసులు నమోదైన దేశాలలో బ్రెజిల్ మూడో స్థానంలో నిలుస్తుండటం గమనార్హం! (విలేకరులు పిరికి వాళ్లు: బోల్సొనారో) కరోనా బారిన పడినా.. కాగా బోల్సొనారో సైతం జులైలో కరోనా వైరస్‌బారిన పడ్డారు. అయితే ఇప్పటికే వ్యాక్సినేషన్ల ప్రోగ్రామ్‌లపై బోల్సొనారో పలుమార్లు అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. కాగా.. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో మాస్క్‌లు అంత ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు స్పష్టం కాలేదని అభిప్రాయపడ్డారు. వైరస్‌ను మాస్క్‌లు అడ్డుకుంటున్నట్లు స్వల్ప ఆధారాలు మాత్రమే ఉన్నట్లు చెప్పారు. కోవిడ్-19 వ్యాక్సిన్ తన పెంపుడు కుక్కకు మాత్రమే అవసరమున్నట్లు అక్టోబర్‌లో ట్విటర్ ద్వారా బోల్సొనారో జోక్ చేశారు. బ్రెజిల్ ప్రెసిడెంట్ ప్రకటనలు పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో విస్తృతంగా ప్రచారమవుతున్నట్లు ఈ సందర్భంగా ఆంగ్ల వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. (బోల్సొనారోకు మళ్లీ కరోనా పాజిటివ్!) -
బొల్సొనారో ఆసుపత్రికి వెళ్లింది అందుకేనా !
బ్రెసిలియా : భారత్‌లో జరిగిన గణతంత్ర వేడుకలకు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి బ్రెసిలియాలోని ఆసుపత్రికి వచ్చిన బొల్సొనారో మీడియాతో మాట్లాడేందుకు విముఖత చూపించారు. కాగా బొల్సొనారో ఆసుపత్రికి రావడంపై వివిధ ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆయన వ్యక్తిగత అధికారులు స్పందించారు. గత కొద్దికాలంగా బ్రెజిల్ అధ్యక్షుడు ఉదర సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఈ మధ్యనే జరిగిన హెర్నియా చికిత్స సమయంలో తన శరీరం భాగంలో ఉంచిన మెష్ భాగం రీప్లేస్‌కు సంబంధించిన విషయం తెలుసుకునేందుకు వైద్యులను కలిసి వెళ్లినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో బొల్సొనారోను పరీక్షించిన వైద్యులు మెష్ భాగం రీప్లేస్ అంశంపై వైద్యులు ధృవీకరించనున్నట్లు తెలిపారు. కాగా 2018లో బొల్సొనారో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఒక వ్యక్తి బ్రెజిల్ అధ్యక్షుడిపై కత్తితో ఉదర భాగంలో దాడికి పాల్పడ్డాడు. దీంతో బొల్సొనారో శరీర భాగానికి నాలుగు సర్జరీలు జరిగాయని, ఈ మధ్యనే హెర్నియా చికిత్స కూడా చేయించుకున్నారని పేర్కొన్నారు. -
నారీ శక్తి సైనిక శక్తి
న్యూఢిల్లీ: భారతదేశ 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాజధాని న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ఘనంగా జరిగాయి. శీతాకాలం వేళ ఆదివారంనాడు సూర్యకిరణాల వెచ్చదనం మధ్య త్రివిధ బలగాలు నిర్వహించిన 90 నిమిషాల పెరేడ్ అణువణువునా దేశభక్తిని నింపుతూ రోమాలు నిక్కబొడిచేలా సాగింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, మన సైనిక సత్తాని ప్రపంచానికి చాటి చెప్పే ఆయుధ ప్రదర్శనలు, సామాజిక, ఆర్థిక పురోగతిని తెలిపే శకటాలు, మహిళా సాధికారతను చాటి చెప్పే విన్యాసాలతో పెరేడ్ దేశానికే గర్వకారణంగా నిలిచింది. రాజ్‌పథ్‌లో గోవా, మేఘాలయ తదితర రాష్ట్రాల శకటాల ప్రదర్శన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారక కేంద్రం దగ్గర నివాళులర్పించడం దగ్గర్నుంచి గగనతలంలో త్రివిధ బలగాలకి సంకేతంగా హెలికాప్టర్లు చేసే విన్యాసాల వరకు ఎన్నో తొలి ఘటనలకు ఈ వేడుకలు సాక్షీభూతమయ్యాయి. బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సనోరా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసి పెరేడ్ని తిలకించారు. రాజ్‌పథ్‌లో పెరేడ్ మొదలు కావడానికి ముందు జాతీయ గీతం బ్యాండ్‌ని వాయించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించే సమయంలో 21 సార్లు గాల్లోకి తుపాకులు పేల్చి సైనికులు గౌరవ వందనం సమర్పించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా ఇతర ప్రముఖులు ఈ ఉత్సవానికి హాజరయ్యారు. యుద్ధస్మారక కేంద్రం వద్ద ప్రధాని నివాళులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ఉదయం పెరేడ్ ప్రారంభం కావడానికి ముందు కొత్తగా నిర్మించిన జాతీయ యుద్ధ స్మారక కేంద్రం వద్ద నివాళులర్పించారు. ఏటా ఇండియా గేట్ దగ్గరున్న అమర్ జ్యోతి జవాన్ వద్ద నివాళుల ర్పించడం సంప్రదాయంగా వస్తోంది. కాషాయ బాందినీ ప్రింట్ తలపాగాతో.. జాతీయ వేడుకల సమయంలో ప్రధానమంత్రి మోదీ రంగుల తలపాగా ధరించే సంప్రదాయాన్ని కొనసాగించారు. తెల్ల రంగు పైజామా, కుర్తా, దానిపైన నీలం రంగు జాకెట్, కాషాయ రంగులో వీపు మీదుగా జారేలా ఉండే బాందినీ ప్రింట్ తలపాగా ధరించారు. రాజస్తాన్, గుజరాత్‌లలో ఇలాంటి తలపాగాలను ధరిస్తారు. ఆకట్టుకున్న శకటాలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాల మేళవింపుతో, సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లేలా, మన సైనిక పాటవాన్ని చాటేలా మొత్తం 22 శకటాల ప్రదర్శన ఆద్యంతం మనోహరంగా సాగింది. కప్పల్ని కాపాడాలని గోవా శకటాన్ని రూపొందిస్తే, హిమాచల్ ప్రదేశ్ కులు దసరా ఉత్సవాన్ని, ఒడిశా రథయాత్రను ప్రతిబింబించేలా శకటాల్ని రూపొందించాయి. వాయుసేనకు చెందిన శకటం తేజస్ యుద్ధ విమానాలు, ఆకాశ్, అస్త్ర క్షిపణుల్ని ప్రదర్శించింది. ఇక జల్ శక్తి మంత్రిత్వ శాఖ 2024కల్లా ప్రతీ గ్రామానికి కుళాయి కనెక్షన్ ఇస్తామని చాటిచెప్పే శకటాన్ని ప్రదర్శించింది. ఎన్నో ఫస్ట్లు రాజ్‌పథ్‌లో జరిగిన పెరేడ్ని మహిళా కమాండర్ కెప్టెన్ తాన్యా షెర్గిల్ ముందుండి నడిపించారు. అందరూ పురుషులే పాల్గొన్న ఈ మార్చ్‌కి ఒక మహిళా అధికారి నేతృత్వం వహించడం ఇదే తొలిసారి. ► సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కు చెందిన మహిళా బైకర్లు తొలిసారిగా ఇచ్చిన ప్రదర్శన ఉత్కంఠభరితంగా సాగింది. ఇన్స్పెక్టర్ సీమ నాగ్ నేతృత్వంలో డేర్ డెవిల్ స్టంట్ ప్రదర్శన సాగింది. నడుస్తున్న బైక్ పైభాగాన నిల్చొని సీమ సెల్యూట్ సమర్పించడం ఈ షోకే హైలైట్. ► జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొని ‘‘తిరిగి గ్రామానికి’’అన్న థీమ్‌తో శకటాన్ని ప్రదర్శించింది. ఈ శకటం ముందుభాగంలో కశ్మీర్ చేతి వృత్తులను ప్రతిబింబించేలా శాలువా అల్లుతున్న కార్మికుడ్ని ఉంచారు. ► రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఒ) గత ఏడాది రూపొందించిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి (ఏశాట్)ని ఈ సారి పెరేడ్లో తొలిసారిగా ప్రదర్శించారు. మిషన్ శక్తిలో భాగంగా మన క్షిపణి వ్యవస్థ సత్తా దీంతో తెలుస్తుంది. ► ధనుష్ శతఘ్నులను తొలిసారిగా రిపబ్లిక్ డే పెరేడ్లో ప్రదర్శించారు. 155ఎంఎం/45 కాలిబర్ సామర్థ్యం కలిగిన ఈ శతఘ్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. 36.5కి.మీ. దూరం వరకు ధనుష్ కచ్చితంగా లక్ష్యాలను ఛేదిస్తుంది. ► కొత్తగా మన అమ్ముల పొదిలో వచ్చి చేరిన చినూక్, అపాచీ భారీ యుద్ధ హెలికాప్టర్లు తొలిసారిగా పెరేడ్లో ప్రదర్శించాయి. మారుమూల ప్రాంతాల్లో భారీ లోడ్లను కూడా చినూక్ మోసుకుపోగలదు. ఇక అపాచి హెలికాప్టర్ గగనతలం నుంచి గగనతలానికి, నింగి నుంచి నేలకి కూడా క్షిపణుల్ని ప్రయోగించే సత్తా ఉంది. ► నీలాకాశంలో జరిగే వైమానిక విన్యాసాలు రోమాలు నిక్కబొడుచుకునేలా సాగాయి. 40 విమానాలు త్రిశూల్ ఆకారంలో విన్యాసాలు చేయడంతో మొదలై త్రివిధ దళాలకి గుర్తుగా మూడు ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లు ’VIP’ ఆకారంలో వచ్చాయి. ఈ ప్రదర్శనని ఇలా నిర్వహించడం ఇదే తొలిసారి. 17 వేల అడుగుల ఎత్తులో.. న్యూఢిల్లీ: 17 వేల అడుగుల ఎత్తు.. మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత.. మోకాళ్ల లోతు మంచు.. జాతీయ జెండాను ఎగురవేసేందుకు ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)లకు ఇవేవీ అడ్డంకి కాలేదు. 71వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా లదాఖ్‌లో ‘వందేమాతరం.. భారత్ మాతా కీ జై’ నినాదాల నడుమ మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ట్విట్టర్లో వైరల్‌గా మారింది. సైనికులను కీర్తిస్తూ పలువురు యూజర్లు కామెంట్లు చేశారు. దేశానికి నిజమైన హీరోలు మీరే అంటూ ఒకరు.. మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది.. గణతంత్ర వేడుకలు జరుపుతున్న హీరోలు అంటూ ఇంకొకరు అని కొనియాడారు. గణతంత్ర వేడుకల్లో మోదీ ధరించిన తలపాగాలు పరేడ్‌లో ఆకాశ్ క్షిపణి బైక్‌పై సీఆర్పీఎఫ్ మహిళా జవాన్ల విన్యాసం -
‘మతి’ పోయింది..ఇపుడు ఓకే!
సావోపోలో : బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో (64) తాత్కాలికంగా జ్ఞాపకశక్తిని కోల్పోయారట. ఈ విషయాన్నిస్వయంగా అధ్యక్షుడు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. చికిత్స అనంతరం ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానేవుందని చెప్పొకొచ్చారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ హాస్పిటల్లో చికిత్స అనంతరం తన అధికారిక నివాసంలో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాని ఆయన తెలిపారు. బొల్సొనారో అందించిన వివరాల ప్రకారం తన అధికారిక నివాసంలో జారి కిందపడటంతో ఆయన తలకు బలంగా దెబ్బ తగిలింది. అల్వొరాడా ప్యాలెస్‌లో బాత్రూమ్లో జారిపడ్డారు. అయితే పడిపోయిన వెంటనే ఏమీ గుర్తు లేదు..జ్ఞాపకశక్తిని కోల్పోయాననీ అధ్యక్షుడు తెలిపారు. ఉదాహరణకు నిన్న ఏం చేశానో, ఏం జరిగిందో గుర్తు లేదు. ఆ తర్వాతి రోజు నుంచి నెమ్మదిగా, పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోగలుగుతున్నా..ఇప్పుడు క్షేమంగానే ఉన్నానని బ్యాండ్ టెలివిజన్‌కు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య పరిస్థితిని ఆయన వివరించారు. కానీ వయసుతోపాటు, కత్తిపోటు (అధ్యక్ష పదవికి పోటీ సందర్భంగా 2018 సెప్టెంబర్‌లో గుర్తు తెలియని వ్యక్తి కత్తితోదాడి చేశాడు) గాయం వల్ల కొన్ని సమస్యలు ఇంకా వున్నాయన్నారు. కాగాఈ ఏడాది జనవరిలో బొల్సొనారో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఎన్నికల ప్రచార సమయంలో ఆయన్ను గుర్తు తెలియని వ్యక్తి కడుపులో కత్తితో పొడిచారు. ఈ గాయానికి చికిత్సలో భాగంగా ఇప్పటికే నాలుగు సార్లు సర్జరీ కూడా చేయించుకున్నారు. అలాగే స్కిన్ క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్నానని ఈ నెల ప్రారంభంలో బోల్సొనారో వెల్లడించిన సంగతి తెలిసిందే. -
బ్రెజిల్ అధ్యక్షుడిగా జైర్ బొల్సొనారో ఎన్నిక
రియో డి జెనీరో : బ్రెజిల్ అధ్యక్షుడిగా మాజీ ఆర్మీ కెప్టెన్ జైర్ బొల్సొనారో ఎన్నికయ్యారు. 55.13 శాతం ఓట్లతో బొల్సనారో నెగ్గగా, 44.87 శాతం ఓట్లు ప్రత్యర్థి ఫెర్నాండో హదద్కు పోలయ్యాయి. రాజధాని రియో డి జెనీరోలో అభిమానులు, మద్దతుదారులు భారీ ర్యాలీ తీశారు. 'సమిష్టిగా అందరం కలిసి బ్రెజిల్ తలరాతను మారుద్దాం' అని ఎన్నికల ఫలితాల తర్వాత బొల్సొనారో తన ఫేస్బుక్లో పేర్కొన్నారు. జనవరి 1న అధ్యక్షపదవిని బొల్సొనారో చేపట్టనున్నారు. -
‘దేవుడు ఆదేశించాడు.. నేను పాటించాను’
బ్రెజీలియా : ఎన్నికల ప్రచారంలో భాగంగా మినాస్ గ్రేస్ రాష్ట్రంలో పర్యటిస్తున్న బ్రెజిల్ అధ్యక్ష అభ్యర్థి జేర్ బోల్సోనారోపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. మినాస్ గ్రేస్‌కు చెందిన అడెలియో డీ ఒలివిరాగా నిందితుడిని గుర్తించారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల(అక్టోబర్)లో పోలింగ్ జరగనున్న క్రమంలో జేర్‌పై దాడి జరగడంతో.. ఇది ప్రత్యర్థుల పనేనంటూ సోషల్ లిబరల్ పార్టీ ఆరోపించింది. కాగా తన చర్య వెనుక దేవుడు తప్ప ఎవరూ లేరని, ఆయన ఆదేశించడం వల్లే తానిలా చేశానంటూ ఒలివిరా పేర్కొన్నాడు. అతడి తరపు లాయర్ మాట్లాడుతూ...‘ ఒలివిరా ఆవేశంలో దాడి చేశాడని, రాజకీయ, మత పరమైన నాయకులకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించాడు. ఒలివిరా మానసిక స్థితి సరిగా లేనందువల్లే ఇలా చేసి ఉండవచ్చని పేర్కొన్నాడు. బాగానే ఉన్నారు.. ఆందోళన వద్దు ఒలీవిరా దాడిలో జేర్ తీవ్రంగా గాయపడ్డారు. కత్తితో కడుపులో పొడవడంతో పెద్దపేగుకు తీవ్ర గాయమైందని వైద్యులు పేర్కొన్నారు. 40 శాతం రక్తం పోయిందని, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. అయితే జేర్ ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన ఆయన కుమారుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం జేర్ కోలుకుంటున్నారని, ఆయనకు విజయాన్ని బహుమానంగా ఇవ్వాలంటూ కోరారు. కాగా గతంలో బ్రెజిల్ మిలిటరీ అధికారిగా పనిచేసిన జేర్కు వివాదాస్పద నేతగా పేరుంది. 1964- 85 మధ్య బ్రెజిల్లో సైనిక నియంత పాలన కొనసాగడాన్ని ఆయన బహిరంగంగానే సమర్థించేవారు. అదే విధంగా పలుమార్లు జాతి విద్వేష వ్యాఖ్యలు చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే జేర్‌పై దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఒలీవిరా ఫేస్బుక్ పోస్టుల ఆధారంగా విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
బ్రెజిల్లో మళ్లీ ‘గులాబీ’ ధగధగ!
దశాబ్దన్నర క్రితం లాటిన్ అమెరికా ఖండాన్ని ఊపేసిన ‘గులాబీ విప్లవం’ ప్రభావం ఇంకా తగ్గలేదని బ్రెజిల్ ఎన్నికలు మరోసారి చాటిచెప్పాయి. అధ్యక్ష పదవికి నువ్వా నేనా అన్నట్టు ఆదివారం సాగిన ఎన్నికల్లో వర్కర్స్ పార్టీ(పీటీ)కి ప్రాతినిథ్యం వహిస్తున్న దేశాధ్యక్షురాలు, ఒకనాటి కమ్యూనిస్టు గెరిల్లా దిల్మా రోసెఫ్ స్వల్ప మెజారిటీతోనే అయినా విజయాన్ని సొంతం చేసుకోగలిగారు. ఈ నెల 5న జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో ఏ పార్టీకీ నిబంధనల ప్రకారం 50 శాతం ఓట్లు లభించకపోవడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. రోసెఫ్ 51.6 శాతం ఓట్లు తెచ్చుకుని గెలుపొందగా, ఆమె ప్రత్యర్థి, బ్రెజిల్ సోషల్ డెమొక్రటిక్ పార్టీ (పీఎస్‌డీబీ) నేత నెవెస్ 48.4 శాతం ఓట్లతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. బ్రెజిల్ చరిత్రనూ, దాంతో పెనవేసుకున్న వర్కర్స్‌పార్టీ నేపథ్యాన్ని గుర్తుతెచ్చుకుంటే రోసెఫ్ ఇలా స్వల్ప మెజారిటీతో గెలుపొందడం ఆశ్చర్యం కలిగించేదే. బ్రెజిల్ సుదీర్ఘకాలం వలసపాలనలో మగ్గి, అటు తర్వాత మరిన్ని దశాబ్దాలు సైనిక పదఘట్టనలకింద నలిగింది. 1989లో తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినా అంతకు ముందూ, ఆ తర్వాతా అది అమెరికా కనుసన్నల్లోనే నడిచింది. ఆకలి, నిరుద్యోగం, అనారోగ్యం, అధిక ధరలు ఒకపక్కా... ప్రత్యర్థి రాజకీయ పక్షాల నాయకులను కిడ్నాప్ చేసి ప్రాణాలు తీసే హంతకముఠాలు మరోపక్కా చెలరేగిపోతున్న దశలో 2002లో వామపక్ష వాది లూలా డి సిల్వా నాయకత్వంలోని వర్కర్స్ పార్టీ అధికారపగ్గాలు చేపట్టింది. మూడు పూటలా తిండి, గౌరవప్రదమైన కనీస వేతనం వాగ్దానాలుగా గద్దెనెక్కిన లూలా వెనువెంటనే అందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకున్నారు. తన ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలొచ్చినా ఈ చర్యల కారణంగానే ఆయన నిలదొక్కుకుని 2006 ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం మూడోసారి ఆ పదవి చేపట్టడం సాధ్యంకాదు గనుక 2010లో ఆ పార్టీ తరఫున రోసెఫ్ పోటీచేసి విజయం సాధించారు. అమెరికా నీడలో, దాని ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందే ఆర్థిక విధానాల స్థానంలో దేశీయ వనరులను సంపూర్ణంగా వినియోగించుకుని ప్రగతి సాధించేలా బ్రెజిల్‌ను తీర్చిదిద్దడంలో వర్కర్స్ పార్టీ ఈ పుష్కరకాలంగా చేసిన కృషి అనితరసాధ్యమైనది. దీని ఫలితాలు అన్నిటా ప్రతిఫలించాయి. 2003-14 మధ్య బ్రెజిల్ దేశీయ స్థూల ఉత్పత్తి(జీడీపీ) సగటున ఏడాదికి 2.5 శాతం చొప్పున పెరిగింది. పింఛన్ల పంపిణీతోసహా పలు సామాజిక సంక్షేమ పథకాలను విస్తృతంగా అమలుచేసిన కారణంగా పేదరికం గణనీయంగా తగ్గింది. లూలా తొలిసారి గద్దెనెక్కిన నాటికి నిరుద్యోగం 12.3 శాతం ఉంటే ఇప్పుడది 4.9 శాతం. రోజుకు ఒక డాలర్ సంపాదన కూడా అసాధ్యమయ్యే దుర్భర పరిస్థితులు పోయి కనీస వేతనాలు భారీగా పెరిగాయి. ఇళ్లల్లో పనిచేసేవారిని కార్మికులుగా గుర్తించి, వారికి కనీస వేతనాలు, సెలవులు వంటివి అమలు చేసే నిబంధనలు వచ్చాయి. సంపద పంపిణీలో ఇప్పటికీ వ్యత్యాసాలున్నా గతంతో పోలిస్తే అది చాలా మెరుగుపడింది. జనాభాలో 40 శాతం మంది వాటా గతంతో పోలిస్తే రెట్టింపయింది. ఒక్కమాటలో చెప్పాలంటే దివాలా స్థితినుంచి పన్నెండేళ్లలో బయటపడటమేకాక ప్రపంచంలోని ఆరవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అది రూపుదిద్దుకుంది. భద్రతామండలి శాశ్వత సభ్యత్వానికి సైతం ప్రయత్నించింది. ఇవన్నీ నాణేనికి ఒకవైపు. తన పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా 2008లో వచ్చిన ఆర్ధిక సంక్షోభంనుంచి ప్రపంచాన్ని కాపాడినా, దాని ఛాయలనుంచి బ్రెజిల్ తప్పించుకోలేకపోయింది. దేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడినట్టు ఈ ఏడాదే అధికారికంగా ప్రకటించారు. 6.5 శాతం ద్రవ్యోల్బణంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ గడ్డు స్థితిని గుర్తించి రోసెఫ్ వడ్డీ రేట్ల పెంపు, ప్రభుత్వ వ్యయం కుదింపువంటి చర్యలనూ ప్రారంభించారు. ఈమధ్యే జరిగిన ప్రపంచ సాకర్ పోటీలు పుండుమీద కారం చల్లాయి. ఆర్థికమాంద్యం ఉందంటున్న సర్కారు ఈ పోటీలు జరపడంలోని ఔచిత్యమేమిటని నిరసనలు వెల్లువెత్తాయి. ఇంత ఆర్భాటంగా నిర్వహించినా జర్మనీపై తమ ఆటగాళ్లు చిత్తుగా ఓడిపోవడం కుర్రకారుకు ఆగ్రహం కలిగించింది. పైగా మరో రెండేళ్లలో అది ఒలింపిక్ క్రీడలకు కూడా సిద్ధమవుతున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో సాగిన అధ్యక్ష ఎన్నికల్లో మీడియా మొత్తం సోషల్ డెమొక్రాట్లకు వత్తాసుగా నిలబడింది. అమెరికాతో వైరం తెచ్చుకున్న పర్యవసానంగానే ఈ దుస్థితి దాపురించిందని హోరెత్తించింది. అయితే ఆకలిని, నిరుద్యోగాన్ని మాత్రమే మిగిల్చే...అసమ్మతి గొంతు నులిమే పాత వ్యవస్థ జ్ఞాపకాలు ఆ దేశ పౌరుల్లో ఇంకా పచ్చిగానే ఉన్నాయి. వర్కర్స్ పార్టీ సంక్షేమ పథకాల్లో, అది కల్పించిన ప్రజాస్వామ్య సంప్రదాయంలో ఎదిగివచ్చిన తరానికి, ముఖ్యంగా మధ్యతరగతికి ఇవి పెద్దగా తెలియకపోవచ్చు. అందువల్లే నెవెస్ నేతృత్వంలో సోషల్ డెమొక్రాట్లు ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వగలిగారు. మీడియా చేసిన ప్రచారం మాటెలా ఉన్నా నెవెస్ మాత్రం ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలను తాను కొనసాగిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పుడున్న కష్టాలనుంచి దేశాన్ని గట్టెక్కించడమే తన ధ్యేయమని చెప్పారు. అయితే తమ జీవితాలు ఇంకాస్త మెరుగుపడాలని సామాన్యులు తాపత్రయపడుతున్నా అందుకోసం పాత రోజుల్లోనికి పలాయనం కావడానికి వారు సిద్ధంగా లేరు. కనుకనే మరోసారి సైతం వర్కర్స్ పార్టీనే ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల సందేశమేమిటో రోసెఫ్ కూడా సరిగానే గ్రహించారు. కనుకనే ‘మెరుగైన’ అధ్యక్షురాలిగా పేరు తెచ్చుకునేందుకు ఈసారి కృషిచేస్తానని, అన్నీ సరిచేస్తానని బ్రెజిల్ ప్రజలకు ఆమె హామీ ఇచ్చారు. రోసెఫ్ గెలుపు తర్వాత మార్కెట్ దిగ్భ్రాంతికి లోనుకావడం, బ్రెజిల్ కరెన్సీ పడిపోవడంవంటి పరిణామాల నేపథ్యంలో ఈ ‘మెరుగుదల’ ఎలా ఉండబోతున్నదో ప్రపంచమంతా గమనిస్తుంది. -
ఫుట్‌బాల్‌లోనూ జాతి వివక్షా!
వరుసపెట్టి బ్రెజిలియన్ క్రీడాకారులతో పాటు.. అధికారుల విషయంలో కూడా అవాంఛనీయ సంఘటనలు జరగడంతో, ఫుట్‌బాల్‌లో జాతి వివక్షను బ్రెజిల్ అధ్యక్షుడు డిల్మా రౌసెఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆయనకు బ్రెజిల్ మాజీ మిడ్ ఫీల్డర్ అరౌకా కూడా మద్దతుపలికాడు. అరౌకా మార్చి 6వ తేదీన సావో పౌలో స్టేట్ ఛాంపియన్షిప్ పోటీలలో ఆడుతుండగా ఓ అభిమాని అతడిని జాతిపేరుతో దూషించాడు. ఆఫ్రికా ఖండం వెలుపల అత్యంత ఎక్కువగా నల్లజాతి జనాభా ఉన్న బ్రెజిల్ లాంటి దేశంలో ఇలా జాతివివక్ష ఉండటం ఏమాత్రం సరికాదని, దీన్ని అంగీకరించలేమని రౌసెఫ్ చెప్పారు. ఈ సంవత్పరం ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీలు జరుగుతున్నప్పుడు జాతివివక్ష వ్యతిరేక సందేశాన్ని థీమ్‌గా తీసుకోవాలని కూడా ఆయన కోరారు. ఈ విషయమై ఇప్పటికే తాము ఐక్యరాజ్య సమితితోను, ఫిఫాతోను కూడా మాట్లాడినట్లు చెప్పారు.