ఆర్ఆర్ఆర్‌పై బ్రెజిల్ ప్రెసిడెంట్ ప్రశంసలు.. రాజమౌళి ఏమన్నారంటే? | Brazil President Lula Praises RRR Movie In G20 summit In Delhi | Sakshi
Sakshi News home page

RRR Movie: ఆర్ఆర్ఆర్ చూశారా అని అడిగేవాన్ని: బ్రెజిల్ అధ్యక్షుడు

Sep 10 2023 6:09 PM | Updated on Sep 10 2023 6:23 PM

Brazil President Lula Praises RRR Movie In G20 summit In Delhi - Sakshi

ఆర్ఆర్ఆర్ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ చిత్రంతో టాలీవుడ్‌ స్థాయి ఏకంగా గ్లోబల్‌వైడ్‌గా మార్మోగిపోయింది. హాలీవుడ్‌ దర్శక దిగ్గజం కామెరూన్ సైతం ప్రశంసల వర్షం కురిపించారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ వద్ద రికార్డ్‌ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. అయితే తాజాగా ఈ  చిత్రంపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా ప్రశంసలతో ముంచెత్తారు. ఢిల్లీలో జరుగుతున్న జీ20 సమావేశానికి హాజరైన ఆయన.. రాజమౌళిని సైతం కొనియాడారు.
 
లులా మాట్లాడుతూ..'ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా బాగా నచ్చంది. ఈ చిత్రంలోని అద్భుతమైన సన్నివేశాలు, అందమైన డ్యాన్సులు ఆకట్టుకున్నాయి. భారత్‌పై బ్రిటిష్‌ పాలనను చూపించినప్పటికీ.. చాలా అర్థవంతంగా ఉంది. ఆ సినిమా చూసి తెలిసిన వాళ్లందరిని ఆర్‌ఆర్‌ఆర్‌ అని మొదట అడిగేవాన్ని. దర్శకుడు రాజమౌళి, నటీనటులకు నా అభినందనలు' అని అన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ తాజాగా ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

రాజమౌళి ట్వీట్

అయితే లులా ప్రశంసలపై రాజమౌళి స్పందించారు. ఈ మేరకు ఆయనకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్‌ చేశారు. ట్వీట్‌లో రాస్తూ.. 'ఆర్ఆర్ఆర్ పట్ల మీ మాటలకు చాలా ధన్యవాదాలు. మీరు భారతీయ సినిమా గురించి ప్రస్తావించడం చాలా ఆనందంగా ఉంది. ఆర్ఆర్ఆర్‌ను ఆస్వాదించారని  చెప్పడం చాలా గర్వకారణం. మీ ప్రశంసలతో మాచిత్రబృందం సంతోషంగా ఉంది. మీరు మా దేశంలో విలువైన సమయాన్ని ఆనందంగా గడుపుతున్నారని ఆశిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు.  కాగా.. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలోని నాటునాటు సాంగ్‌ను ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ అవార్డ్ దక్కించుకున్న  సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement