Hollywood Actor Jonathan Majors Praises SS Rajamouli RRR Movie - Sakshi
Sakshi News home page

RRR Movie: ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన అద్భుతం: జోనాథన్

Feb 13 2023 9:33 PM | Updated on Feb 14 2023 8:54 AM

Hollywood Actor Jonathan Majors Praises SS Rajamouli RRR Movie - Sakshi

హాలీవుడ్ నటుడు జోనాథన్ మేజర్స్ రాజమౌళి బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్ఆర్ఆర్ సినిమాను చాలా సార్లు చూశానని తెలిపారు.  చూడటంతో  తన  అనుభవాన్ని తెలిపారు. ఈ వారంలో జోనాథన్ నటించిన యాంట్-మ్యాన్ అండ్‌ ది వాస్ప్: క్వాన్టుమేనియా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమానియా మూవీ అడ్వాన్స్ బుకింగ్‌ ఇవాళ భారత్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన టాలీవుడ్ సినిమా ఆర్ఆర్ఆర్‌ను ఆయన కొనియాడారు. జోనాథన్ మేజర్స్ భారతీయ చిత్రాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జోనాథన్.. తాను భారతీయ సినిమాలకు అభిమానినని.. అలాగే బ్లాక్ బస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్ చాలాసార్లు చూశానని వెల్లడించారు. 

జోనాథన్ జేమ్స్ మాట్లాడుతూ..  'నేను భారతీయ సినిమాలు ఎక్కువగా చూస్తాను. ఎస్ఎస్ రాజమౌళి చిత్రం కాంగ్ ది కాంకరర్ దృష్టిని 'జయించిందని' చెప్పడం విశేషం. నేను ఆర్ఆర్ఆర్ చాలాసార్లు చూశాను. ఈ చిత్రాన్ని బాగా ఆస్వాదించా. ఇద్దరు  హీరోలు జూనియర్ ఎన్టీఆర్,  రామ్ చరణ్ తెరపై చూడటం నాకు చాలా నచ్చింది.' అని అన్నారు.  భారతీయ చిత్రాలను చూడటానికి నేను ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పుకొచ్చారు. 

జోనాథన్ మేజర్స్  ప్రకటనతో ప్రపంచ స్థాయిలో భారతీయ సినిమాకు పెరుగుతున్న ప్రజాదరణ, అంతర్జాతీయ ప్రేక్షకులపై చూపుతున్న ప్రభావానికి నిదర్శనంగా చెప్పవచ్చు. కాగా.. మార్వెల్ స్టూడియోస్ ఇండియా నిర్మించిన యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమేనియా సినిమా  ఫిబ్రవరి 17 ఆంగ్లం, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement