Jonathan
-
గర్ల్‌ఫ్రెండ్‌పై దాడి.. మార్వెల్ స్టార్ నటుడు అరెస్ట్
మార్వెల్ స్టార్, హాలీవుడ్ నటుడు జోనాథన్ మేజర్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన ప్రియురాలిపై దాడి చేసిన కేసులో న్యూయార్క్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బ్రూక్లిన్‌లోని బార్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా టాక్సీలో ఇద్దరి మధ్య గొడవ జరిగనట్లు జోనాథన్ ప్రియురాలు పోలీసులకు తెలిపింది. తనపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దాడిలో ప్రియురాలి తల, మెడకు గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అసలేం జరిగిందంటే.. జోనాథన్ తన మొబైల్ ద్వారా మరొక మహిళకు మేసేజ్ పంపడం ప్రియురాలు చూసింది. దీంతో అతని ఫోన్‌ను పరిశీలించాలని ఆమె అడిగింది. దీనికి అతని కోపం కట్టలు తెచ్చుకుంది. ఆమెను చేయి పట్టుకుని విచక్షణారహితంగా కొట్టాడు. వెంటనే అతని ప్రియురాలు పోలీసులను కాల్ చేసింది. జోనాథన్ మేజర్స్ చివరిగా క్రీడ్-3, యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమానియాలో కనిపించారు. అతను రెండు వారాల ముందు ఆస్కార్స్‌లో తన క్రీడ్-3 సహనటుడు మైఖేల్ బి. జోర్డాన్‌తో పాటు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. కానీ జోనాథన్ ప్రతినిధి మాట్లాడుతూ అతను ఏ తప్పు చేయలేదని అన్నారు. -
ఆర్ఆర్ఆర్ ఎక్కవ సార్లు చూశా.. హాలీవుడ్ నటుడు ప్రశంసలు
హాలీవుడ్ నటుడు జోనాథన్ మేజర్స్ రాజమౌళి బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్ఆర్ఆర్ సినిమాను చాలా సార్లు చూశానని తెలిపారు. చూడటంతో తన అనుభవాన్ని తెలిపారు. ఈ వారంలో జోనాథన్ నటించిన యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాన్టుమేనియా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమానియా మూవీ అడ్వాన్స్ బుకింగ్ ఇవాళ భారత్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన టాలీవుడ్ సినిమా ఆర్ఆర్ఆర్ను ఆయన కొనియాడారు. జోనాథన్ మేజర్స్ భారతీయ చిత్రాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జోనాథన్.. తాను భారతీయ సినిమాలకు అభిమానినని.. అలాగే బ్లాక్ బస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్ చాలాసార్లు చూశానని వెల్లడించారు. జోనాథన్ జేమ్స్ మాట్లాడుతూ.. 'నేను భారతీయ సినిమాలు ఎక్కువగా చూస్తాను. ఎస్ఎస్ రాజమౌళి చిత్రం కాంగ్ ది కాంకరర్ దృష్టిని 'జయించిందని' చెప్పడం విశేషం. నేను ఆర్ఆర్ఆర్ చాలాసార్లు చూశాను. ఈ చిత్రాన్ని బాగా ఆస్వాదించా. ఇద్దరు హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తెరపై చూడటం నాకు చాలా నచ్చింది.' అని అన్నారు. భారతీయ చిత్రాలను చూడటానికి నేను ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పుకొచ్చారు. జోనాథన్ మేజర్స్ ప్రకటనతో ప్రపంచ స్థాయిలో భారతీయ సినిమాకు పెరుగుతున్న ప్రజాదరణ, అంతర్జాతీయ ప్రేక్షకులపై చూపుతున్న ప్రభావానికి నిదర్శనంగా చెప్పవచ్చు. కాగా.. మార్వెల్ స్టూడియోస్ ఇండియా నిర్మించిన యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమేనియా సినిమా ఫిబ్రవరి 17 ఆంగ్లం, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది. -
నల్లజాతి లేడీ జస్టిస్
టీనేజ్‌లో అతడికి శిక్ష పడింది. యాభై ఏళ్ల జైలు శిక్ష! నల్లవాడికి పడిన శిక్ష. ఇరవై మూడేళ్లు గడిచాయి. మిగతా ఇరవై ఏడేళ్లూ లోపల ఉండేవాడే! మాయా మూర్ వెళ్లి తీసుకొచ్చింది. బాస్కెట్‌బాల్ స్టార్ ప్లేయర్ తను. రెండేళ్లు ఆటను పక్కన పెట్టింది. నల్లజాతి ‘లేడీ జస్టిస్’ అయింది. వీడియో క్లిప్ ఆన్ అయింది. ఇ.ఎస్.పి.ఎన్. స్పోర్ట్స్ సైన్స్ క్లాస్ అది. స్క్రీన్‌పై క్లిప్‌ను చూపించి చెబుతున్నారు సీనియర్ స్పోర్ట్స్ ప్రొఫెసర్. ‘‘ఈ ప్లేయర్‌ను చూడండి. తన వెర్టికల్ లీప్, కోర్టు విజన్, మజిల్ మెమరీ, స్టీలింగ్! ఫాలో అవుతున్నారా? చేతుల కదలికలు త్రాచు కన్నా వేగం..’’ వీడియో క్లిప్ చూస్తున్న వారికి ఆ ప్లేయర్ మాయా మూర్ అని తెలుసు. తమ సిలబస్‌లో ఉన్న బాస్కెట్ బాల్ ప్లేయర్. పాఠ్యాంశాల్లోకి వచ్చిందంటే రిటైర్ అయిన క్రీడాకారిణి అయి ఉండాలి. కానీ కాదు! కెరీర్ ఆరంభంలో ఉన్న స్టార్ ప్లేయర్ మాయా. వయసు ముప్పై. నిలువుగా పైకి లేవడం (వెర్టికల్ లీప్), క్షణం క్రితానికి, మరుక్షణానికి మధ్య ‘తక్షణం’లో బంతిని ఎగరేయడానికి (కోర్టు విజన్), మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్ వెళ్లిపోవడం (మెమరీ మజిల్).. బాగా సీనియర్లు మాత్రమే చేయగలిగినవి. మాయా చేస్తోంది! ఇంతవరకు చాలు. ఇక ఈమె గురించి మరికొంచెం కూడా చెప్పుకునే పని లేదు. ‘ది గ్రేటెస్ట్ విన్నర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఉమెన్స్ బాస్కెట్‌బాల్’ అని మూడేళ్ల క్రితమే ‘స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్’ చెప్పేసింది. అమెరికాలోని జఫర్సన్ సిటీలో (మిస్సోరీ) ‘కరెక్షనల్ సెంటర్’ ఉంది. మామూలు భాషలో జైలు! బుధవారం (జూలై 1) జైలు తలుపులు తెరుచుకోగానే సన్నటి ద్వారం నుంచి బయటికి వచ్చాడు జొనాథన్ ఐరన్స్. 1997లో అరెస్ట్ అయ్యాడు అతడు. 23 ఏళ్ల తర్వాత ఇప్పుడు బయటికి వచ్చాడు. అతడికి పడిన శిక్షయితే 50 ఏళ్లు! ఇంకా 27 ఏళ్ల శిక్షాకాలం మిగిలే ఉంది. సాధారణంగా అమెరికాలో ఒక నల్లజాతి మనిషి.. శిక్ష పూర్తి కాకుండా బయటికి వచ్చాడంటే అందుకు అతడి సత్ప్రవర్తన మాత్రమే కారణం అయి ఉండదు. వేరే ప్రధాన కారణం ఉంటుంది. జొనాథన్ విషయంలో ఆ.. ప్రధాన కారణం.. మాయా మూర్! మన బాస్కెట్‌బాల్ హీరోయిన్. అతడిని బయటికి రప్పించేందుకు పన్నెండేళ్లుగా ప్రయత్నిస్తోంది. అందుకోసం అమెరికన్ న్యాయవ్యవస్థతో పోరాడుతోంది. న్యాయం కోసం పోరాడటం వేరు. న్యాయవ్యవస్థతో పోరాడటం వేరు. న్యాయం కోసం పోరాడి గెలిస్తే జొనాథన్ ఒక్కడే జైలు నుంచి బయటికి వస్తాడు. న్యాయ వ్యవస్థతో పోరాడి గెలిస్తే.. జొనాథన్ లాంటి వాళ్లకు మరీ అంత అన్యాయంగా శిక్ష పడదు. తన పోరాటాన్ని జొనాథన్‌తో ప్రారంభించింది మాయ. అతడెవరో తనకు తెలీదు. అమెరికన్ జస్టిస్ సిస్టమ్ ఎందుకిలా ఉందో స్టడీ చెయ్యడానికి 2007లో ఒకసారి జఫర్సన్ కరెక్షనల్ సెంటర్లోకి వెళ్లే అవకాశాన్ని లోపల పని చేస్తున్న జైలు సిబ్బందితో తెప్పించుకుంది మాయ. అప్పుడు తన కథ చెప్పుకున్నాడు జొనాథన్. అప్పటికి అతడి వయసు 27. మాయ వయసు 17. మిస్సోరీలోని ఒకరి ఇంట్లో జరిగిన దోపిడీ, కాల్పుల కేసులో ఒక నిందితుడు జొనాథన్. ‘నేనక్కడ లేనే లేను అంటాడు’ జొనాథన్. ‘ఉన్నాడు, తుపాకీతో కాల్చాడు’ అని అవతలి వైపు లాయర్. చివరికి అంతా తెల్లవాళ్లే జడ్జిలుగా ఉన్న కోర్టులో జొనాథన్ దోషి అయ్యాడు. ఎంత దోషి అయితే మాత్రం టీనేజ్లోనే ఒక జీవితానికి సరిపడా శిక్ష వెయ్యడం న్యాయ మాయ వాదన. సిస్టమ్‌ని మార్చాలనుకుంది. ఈ పదమూడేళ్లలో జొనాథన్‌ను విడిపించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. చివరి రెండేళ్లు కెరీర్‌ను పక్కనపెట్టి, కెరీర్ వల్ల వచ్చే లక్షల డాలర్లను పక్కకు నెట్టి అతడిని విడిపించడం కోసమే తిరిగింది. మిన్సెసోటా లింక్స్ జట్టు ప్లేయర్ మాయా. ఆ జట్టు మేనేజర్ మాయ నిర్ణయానికి ఆశ్చర్యపోయారు. కెరీర్లో మాయ పీక్స్‌లో ఉన్న సమయం ఈ రెండేళ్లూ. డబ్లు్య.ఎన్.బి.కె. కు అయితే ఆమె బంగారమే. ఉమెన్స్ నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్. అందులో పన్నెండు టీములు ఉంటాయి. వాటిల్లో ఒకటి మిన్నెసోటా లింక్స్. మాయ స్కిల్స్ కారణంగానే యు.ఎస్.కి టర్కీలో గోల్డు, చెక్‌లో గోల్డు, రియో ఒలింపిక్‌లో గోల్డు, లండన్ ఒలింపిక్స్‌లో గోల్డు వచ్చింది. 2019లో, 2020లో మాత్రం ఏ ఆటలోనూ మాయా మూర్ లేదు. ఇప్పుడు జొనాథన్ ఐరన్స్ విడుదల కావడం డబ్లు్య.ఎన్.బి.కె. కూడా ఆనందించవలసిన విషయమే. మాయ మళ్లీ బ్యాక్ టు ఆట. జైలు నుంచి బయటి రాగానే జోనాథన్, బయట తనకోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులను కావలించుకుని ఉద్వేగానికి లోనవడం దూరం నుంచి చూస్తూ ఉంది మాయ. తర్వాత అతడు ఆమె దగ్గరికి వచ్చాడు. ‘ఐ ఫీల్ లైక్.. ఐ కెన్ లివ్ లైఫ్ నౌ’ అన్నాడు. తన జీవితం తన చేతికొచ్చింది. ధన్యవాదాలు తెలిపాడు మాయకు. అతడిని పక్కన పెట్టి, అతడిని విడిపించిన మాయతో మాట్లాడ్డానికే అమెరికన్ మీడియా ఆసక్తి చూపింది. మాయ ‘ఎండ్ ఇట్ మూవ్మెంట్’లో కూడా ఉంది. ఆధునిక సమాజంలోని బానిసత్వాన్ని నిర్మూలించేందుకు ఆ సంస్థ పని చేస్తుంటుంది. మాయ పుట్టింది కూడా జెఫర్సన్ సిటీలోనే. అమ్మ, అక్క, చెల్లి.. ముగ్గురే ఇంట్లో. తండ్రి వారితో ఉండటం లేదు. క్రిస్టియన్ ఫ్యామిలీ. ‘‘ఈ అవార్డులు, పేరు, డబ్బు.. దేవుడిచ్చిన జీవితం కంటే విలువైనవి కావు’’ అంటుంది మాయ. మనం, మన జీవితం అంటూ ఉండిపోకుండా.. సాటి మనుషులకు సహాయం చేస్తేనే.. జీవితాన్ని ఇచ్చినందుకు దేవుడి రుణం తీర్చుకున్నట్లు’’ అని కూడా అంటుంది. ఎలా సాధ్యం అయింది?! ఒక సాధారణ అమెరికన్ పౌరురాలు అయి ఉంటే, జొనాథన్‌ను విడిపించడానికి మాయ చేసిన ప్రయత్నాలేవీ ఫలించేవి కాకపోవచ్చు. మొదట అతడి కథను జైల్లో వినే నాటికి మాయ తన కాలేజ్ టీమ్ తరఫున ఆడుతున్న ఒక బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి మాత్రమే. ఆ తర్వాతి కాలంలో పదేళ్ల పాటు ఆమె సాధించిన అంతర్జాతీయ విజయాలు, ఆమెపై ఫోర్బ్స్ కథనాలు, పెప్సీ మాక్స్ కమర్షియల్ సిరీస్‌లోని ‘అంకుల్ డ్రూ: చాప్టర్ 3’లో బెట్టీ లియూగా ఆమె నటించడం.. అన్నీ ఆమెను స్టార్‌ను చేశాయి. ఆ యువ స్టార్.. న్యాయ సంస్కరణలకు కృషి చేస్తున్నారని తెలియగానే అన్ని రంగాలలోని ప్రముఖులు, న్యాయకోవిదులు కలిసి వచ్చారు. ఆమెకు సహకరించారు. ఆరంభ విజయంగా జొనాథన్ ఐరన్స్ బయటికి వచ్చాడు. జైలు బయట జొనాథన్‌తో మాయా మూర్ -
వేగాస్ కాల్పుల్లో రియల్ హీరో
లాస్ వేగాస్: ఎదుటి వారి ప్రాణం కళ్లముందే పోతున్నా మనకు ఎందుకులే అనుకునే ఈ రోజుల్లో ఓవ్యక్తి అసమాన ధైర్యసాహసాలు చూపించాడు. సోమవారం లాస్వేగాస్లో జరిగిన కాల్పుల్లో వందలాది మంది ప్రాణాలు కాపాడాడు. కాలిఫోర్నియాకు చెందిన జొనాథన్ స్మిత్(30) కాఫీ మెషిన్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. సోమవారం నాడు తన సోదరుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడానికి లాస్‌వేగాస్ వచ్చాడు. దేశీయ సంగీత ఉత్సవం జరుగుతున్న మాండలై బే హోటల్లో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు. అంతలోనే కాల్పుల మోత ప్రారంభమైంది. దీంతో తన 9మంది కుటుంబ సభ్యులను కాపాడుకునే ప్రయత్నంలో వారందరని అక్కడ నుంచి సురక్షితంగా బయటకు పంపించగలిగాడు. అనంతరం కాల్పులు జరుగుతున్నయంటూ గట్టిగా అరుస్తూ, అక్కడ ఉన్న వారిని తనతో పాటు రావాలంటూ సూచించాడు. ఎయిర్‌పోర్టు మార్గంలో ఉన్న వికలాంగుల కార్‌పార్కింగ్ ప్రాంతానికి అక్కడ ఉన్న చాలా మందిని సురక్షితంగా తరలించగలిగాడు. ఈప్రయత్నంలో దుండగుడి గన్‌లోంచి స్మిత్ మెడలోకి ఓబుల్లెట్ దూసుకుపోయింది. అయినా ఏమాత్రం భయపడకుండా ప్రజల ప్రాణాలు కాపాడగలిగాడు. ఈ సందర్భంగా స్మిత్ మాట్లాడుతూ తనకు బుల్లెట్ తగిలినందుకు ఏమాత్రం బాధలేదని కొంతమందినైనా రక్షించింనందుకు సంతోషంగా ఉందన్నాడు. మెడలో బుల్లెట్ తగలడంతో స్మిత్ పక్కటెముకలు పాక్షింగా దెబ్బతిన్నాయని, జీవిత కాలం బుల్లెట్ స్మిత్ శరీరంలోనే ఉంటుందని వైద్యులు ప్రకటించారు. తనకు ఎటువంటి ప్రమాదం లేదని, త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతానని స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈసంఘటనతో స్మిత్ సోషల్‌మీడియాలో హీరో అయిపోయాడు. గాయాలతో ఉన్న ఫోటో 75వేల సార్లు షేర్ అవగా, లక్షా 77వేల లైకులను సాధించింది. -
అమెరికా విశ్వవిద్యాలయాలు సురక్షితం
జాత్యహంకార దాడులు పెరిగాయనడంలో నిజం లేదు - అమెరికాలో అభ్యసించే భారతీయుల సంఖ్య తగ్గలేదు - వీసాల జారీ, విద్యా విధానంలో మార్పుల్లేవు - విద్యార్థులు ఎటువంటి భయాందోళనలకు గురికావొద్దు - ‘సాక్షి’తో అమెరికన్ కాన్సులేట్ వైస్ కౌన్సెల్ జొనాథన్ అక్లీ సాక్షి, హైదరాబాద్: అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ సురక్షితమేనని, జాత్యహంకార దాడులపై తగు చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ వైస్ కౌన్సెల్ జొనాథన్ అక్లీ. అమెరికన్ వర్సిటీల్లో చేరేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్న నేపథ్యంలో యూనివర్సిటీల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి.. అక్లీతో ‘సాక్షి’ ప్రత్యేకంగా ముచ్చటించింది. ప్ర: అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది కదా.. విద్యా విధానానికి సంబంధించి, వీసా జారీలో మార్పులు జరిగాయా? జవాబు: అలాంటివేవీ లేవు. విద్యకు సంబంధించి గత ప్రభుత్వ విధానాలే కొనసాగుతున్నాయి. అమెరికన్ పౌరుల రక్షణ.. చట్టబద్ధంగా ఈ దేశంలో చదువుకునేందుకు వచ్చిన వారు, పర్యటించేందుకు వచ్చిన వారిని భద్రంగా చూసుకోవడమన్నది అన్ని ప్రభుత్వాలూ అనుసరిస్తున్న విధానం. ఇందులో ఎలాంటి మార్పూ లేదు. తగిన విద్యార్హతలు, చదువును కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక వనరులు, వీసాలు ఉన్న వారెవరైనా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అమెరికాలో చదువుకోవచ్చు. ప్ర: ఒకట్రెండేళ్ల క్రితం కొంతమంది తెలుగు విద్యార్థులను వెనక్కి పంపారు. కొన్ని వర్సిటీలు చేసిన పొరబాట్ల వల్ల విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారా? జ: అమెరికాలో దాదాపు ఆరు వేల కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో అమెరికా ఉన్నత విద్యా సంస్థ గుర్తించినవి 4,500 మాత్రమే. వేటికి గుర్తింపు ఉంది? వేటికి లేదన్న వివరాలు www.chea.org వెబ్సైట్లో ఉన్నాయి. కాలేజీ ఎంపిక సమయంలో విద్యా ర్థులు ఈ జాబితా పరిశీలించి నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు ఉండవు. ప్ర: ఇటీవలి కాలంలో అమెరికాలో జాత్యహంకార దాడులు పెరిగినట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు అక్కడ సురక్షితంగా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? జ: వేర్వేరు దేశాల నుంచి వచ్చే విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్రభుత్వం, వర్సిటీలు ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. అయినా అక్కడక్కడా కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకున్న మాట నిజమే. కొంతమంది వ్యక్తులు చట్టాలను ఉల్లంఘించడం వల్ల ఇలా జరుగుతూంటుంది. ఇలాంటి వారిని అదుపు చేసేందుకు తగిన చట్టాలున్నాయిక్కడ. జాత్యహంకార దాడుల్లాంటివి జరిగినప్పుడల్లా మా న్యాయ వ్యవస్థ ద్వారా దోషులకు శిక్ష పడేలా చేయగలుగుతున్నాం. కొన్ని విశ్వవిద్యాలయాలు ఇలాంటి సంఘటనలకు ఎలా స్పందిచాలన్న విషయంలో తమదైన ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాయి కూడా. వర్సిటీలను ఎంపిక చేసుకునే సమయంలో విద్యార్థులు రక్షణకు సంబంధించిన ఏర్పాట్లనూ ఒకసారి పరిశీలించడం మేలు. ప్ర: అమెరికన్ వర్సిటీల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది..? జ: ఇది నిజం కాదు. గత మూడేళ్ల గణాంకాలు తీసుకుంటే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలు మూడేళ్లలో 22 శాతం పెరిగాయి. హైదరాబాద్ నుంచి ఈ రకమైన వీసాల జారీ 48 శాతం వరకూ పెరిగింది. విద్యార్థి వీసాల విషయానికొస్తే.. 2014తో పోలిస్తే 2016 నాటికి 122 శాతం పెరిగింది. 2016లో దేశం మొత్తమ్మీద జారీ చేసిన విద్యార్థి వీసాల సంఖ్య దాదాపు 48 వేల వరకూ ఉంది. హెచ్–1బీ వీసాల విషయంలోనూ పెరుగుదలే కనిపిస్తోంది. 2014లో మొత్తం 60 వేల వీసాలు జారీ కాగా.. గత ఏడాది ఇవి 80 వేల కంటే ఎక్కువగా ఉన్నాయి. ‘‘అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 1.66 లక్షల వరకూ ఉంది. అమెరికాలోని ఉన్నత విద్యావకాశాలను భారతీయ విద్యార్థులకు మరింత చేరువ చేసేందుకు ఎడ్యుకేషన్ యూఎస్ఏ అన్ని చర్యలు తీసుకుంటోంది. అమెరికాలోని ప్రతి ఆరుగురు విద్యార్థుల్లో ఒకరు భారతీయులై ఉండటం సంతోషకరం. ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న విద్వేష దాడులను అధ్యక్షుడు ట్రంప్‌తోపాటు ఉన్నతాధికారులందరూ ఖండించారు. కాబట్టి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇక్కడకు రావాలనుకునే వారు ఎలాంటి భయాందోళనలకూ గురికావాల్సిన అవసరం లేదు’’ – కేథరీన్ హడ్డా, యూఎస్ కాన్సులేట్ జనరల్, హైదరాబాద్. ‘‘అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించాలనుకునేవారు హైదరాబాద్‌లోని కాన్సులేట్‌ను సంప్రదిస్తే.. మేము ఉచితంగా కౌన్సెలింగ్ ఇస్తాం. అక్రిడెటేడ్ కళాశాలల వివరాలు మొదలుకుని ఏ కాలేజీలో ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి? అడ్మిషన్ విధానాలు తదితర అన్ని అంశాలకు సంబంధించిన వివరాలు అందిస్తాం. విద్యార్థులు చేయాల్సిందల్లా కాన్సులేట్‌కు ఫోన్ చేసి ముందస్తు అపాయింట్మెంట్ తీసుకోవడం మాత్రమే’’ – పియా బహదూర్, రీజనల్ ఆఫీసర్, యునైటెడ్ స్టేట్స్–ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ -
స్విమ్మింగ్ పూల్‌లో పడి బాలుడి మృతి
ఈత నేర్చుకోవడానికి స్విమ్మింగ్‌పూల్‌కు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కోరుట్లలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక అల్లమయ్యగుట్టకు చెందిన జోనధన్(12) ఈత కొలనులో ఈత నేర్చుకోవడానికి వచ్చి ప్రమాదవశాత్తు అందులోపడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
గుండె చప్పుడును బట్టి పాట టెంపో..
సప్తస్వరాల సమ్మేళనమైన సంగీతం మనసుకు హాయినీ, ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. శిశువులు, పశువులు కూడా సంగీతాన్ని విని ఆనందిస్తాయని చెప్తారు. అటువంటి సంగీతం మన మానసిక స్థితిని బట్టి, మనం ఉన్న పరిసరాలను బట్టి మారడం నిజంగా అద్బుతం. మన గుండె చప్పుడును బట్టి టెంపోను నియంత్రించే నూతన వీడియోను సంగీతజ్ఞుడు జోనాథన్ నూతనంగా సృష్టించాడు. మనసును ఆకట్టుకునేట్టుగా ఈడీఎం ట్రాక్ తో అద్భుత సంగీతాన్నిరూపొందించాడు. డీఎన్ ఏ ప్రాజెక్ట్ 'జె. వ్యూజ్' ద్వారా జోనాథన్ దగాన్.. విడుదల చేసిన 'ఆల్మోస్ట్ ఫర్ గాట్' మ్యూజిక్ వీడియో ఇప్పుడు సంగీత ప్రేమికులనే కాక సాధారణ జనాన్నీ అమితంగా ఆకట్టుకుంటోంది. యూట్యూబ్ తోపాటు యాప్ గా విడుదలైన వీడియో... మనుషుల మానసిక స్థితికి తగ్గట్టుగా ప్లే అవుతూ అద్బుతాన్ని తలపిస్తోంది. ఫోన్ లోని కెమెరా ద్వారా మన హృదయ స్పందనలను స్కాన్ చేసే మ్యూజిక్ యాప్.. అప్పటి మన మానసిక స్థితికి అనుగుణంగా గుండె చప్పుడును బట్టి పాట టెంపోను మారుస్తుంది. ఉదాహరణకు మనం జిమ్ లోని ట్రెడ్ మిల్ పై పరుగెడుతుంటే పాట టెంపో కూడా వేగంగా మారిపోతుంది. అదే మన హార్ట్ రేట్ నెమ్మదిగా మారినప్పుడు ఆ టెంపో స్లో అవుతుంది. అయితే ప్రస్తుతం ఈ అనువర్తనం ఒక్క ఐవోఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. అండ్రాయిడ్ యూజర్లు మాత్రం 'ఆల్మోస్ట్ ఫర్ గాట్' వెబ్ సైట్ నుంచి పొందే అవకాశం ఉంది. గతంలో ఇటువంటి ప్రయత్నాలు ఎన్నో జరిగి, 'స్పోర్టిఫై రన్' వంటివి అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటిలో వినియోగదారులు వారికిష్టమైన టెంపోను స్వయంగా సెట్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు గుండె చప్పుడును బట్టి దానంతటదే టెంపో మార్చుకునే అవకాశం ఈ కొత్త ప్రయోగంలో పొందుపరచబడింది. ఆల్మోస్ట్ ఫర్ గాట్ వీడియో యాప్ ను డౌన్ లోడ్ చేసుకొనేవారు ఐ ట్యూన్స్ యాప్ స్టోర్ నుంచి ఉచితంగా చేసుకునే అవకాశం ఉంది. -
బాటిల్ బాక్సులా..
ఇన్నాళ్లూ వాటర్ బాటిల్ అంటే మనం చూసింది వేరు. ఇది వేరు.. చూశారుగా.. బాటిల్ బాక్సులా మారిపోయింది. దీన్ని ఆస్ట్రేలియాకు చెందిన డిజైనర్లు జెస్సీ లీవర్తీ, జోనాథన్లు తయారుచేశారు. ‘మెమోబాటిల్’లో మూడు సైజులున్నాయి. అవి ఏ5, ఏ4, లెటర్. వీటిల్లో ఏ5 సామర్థ్యం 750 మి.లీ. కాగా.. ఏ4, లెటర్ల సామర్థ్యం 1.25 లీటర్లు. వీటిని బ్యాగులో లేదా వెనుక జేబులో ఈజీగా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఆఫీసుకు వెళ్లేవారి కోసం వీటిని తయారుచేశారట. పాశ్చాత్య దేశాల్లో యూజ్ అండ్ త్రో టైపు వాటర్ బాటిళ్ల వినియోగం ఎక్కువ. వీటిల్లో 20 శాతం మాత్రమే రీసైకిలింగ్ చేస్తున్నారట. ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు ఇది చెక్ పెడుతుందని జెస్సీ, జొనాథన్లు చెబుతున్నారు. దీన్ని ఎన్నిసార్లైనా వినియోగించుకోవచ్చని.. శుభ్రపరచడం కూడా చాలా ఈజీ అని అంటున్నారు. మెమోబాటిళ్లు ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి రానున్నాయి.