ఈత నేర్చుకోవడానికి స్విమ్మింగ్‌పూల్‌కు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు.
ఈత నేర్చుకోవడానికి స్విమ్మింగ్‌పూల్‌కు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కోరుట్లలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక అల్లమయ్యగుట్టకు చెందిన జోనధన్(12) ఈత కొలనులో ఈత నేర్చుకోవడానికి వచ్చి ప్రమాదవశాత్తు అందులోపడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.