swimming pool
-
స్విమ్మింగ్ పూల్‌లో గంతులేస్తూ..
దొడ్డబళ్లాపురం: మంగళూరు వద్ద ఘోర విషాదం చోటుచేసుకుంది. సెలవులు గడుపుదామని వచ్చిన యువతులు నీట మునిగిపోయారు. స్విమ్మింగ్ పూల్‌లో మునిగి ముగ్గురు యువతులు మృతిచెందిన సంఘటన మంగళూరు శివారులోని ఉచ్చిల బీచ్‌ను ఆనుకుని ఉండే వాజ్కో బీచ్ రిసార్ట్‌లో చోటుచేసుకుంది. మైసూరుకు చెందిన ఎన్. నిశిత (21), పార్వతి (20), ఎండీ కీర్తన (21) మృతులు. వీకెండ్ కావడంతో వీరు శనివారం నాడు రిసార్ట్‌కు వచ్చారు. ఆదివారం ఉదయం 10 గంటలకు స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టసాగారు. కొంతసేపటికే నీట మునిగిపోయారు. యువతులకు ఈత రాకపోవడం, స్విమ్మింగ్ పూల్ ఆరు అడుగుల కంటే లోతుగా ఉండడం వల్ల మునిగిపోయినట్లు అనుమానాలున్నాయి. ఉళ్లాల పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఘటనాస్థలిని నగర పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ పరిశీలించారు. గంతులేస్తూ ఆడుతూనే..మొదట అందరూ ఈత కొలనులో గంతులేస్తూ సరదాగా ఆడుకుంటూ ఉన్నారు. అయితే కాస్త లోతైన చోట నిశిత మునిగిపోవడంతో ఆమెను కాపాడాలని పార్వతి ముందుకు వెళ్లింది. ఇదంతా చూస్తున్న కీర్తన కూడా వెళ్లింది. ఇలా వరుసగా మునిగి చనిపోయారని కమిషనర్ చెప్పారు. అక్కడి సీసీ కెమెరాలలో ఈ ఘోరం దృశ్యాలు నమోదయ్యాయి. అమ్మాయిల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు మధ్యాహ్నం కల్లా చేరుకుని విగతజీవులుగా ఉన్న కూతుళ్లను చూసి పెద్ద పెట్టున రోదించారు. వేలకు వేల ఫీజులు వసూలు చేసి రిసార్టులు, హోటళ్లలో కనీస భద్రతా వసతులు లేవని, ఫలితమే ఈ ఘోరమని ఆరోపణలున్నాయి. -
అమెరికాలో సూర్యాపేట జిల్లావాసి మృతి
ఆత్మకూర్ (ఎస్): అమెరికాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన తప్సి ప్రవీణ్‌కుమార్ (39) ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతిచెందాడు. భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం సుమారు 8 గంటల సమయంలో ప్రవీణ్‌కుమార్ వారి ఇంటి సమీపంలోని స్విమ్మింగ్ పూల్ వద్ద కాలక్షేపం కోసం వెళ్లి అందులో పడి మృతి చెందినట్లు అతడి భార్య శాంతి ఆదివారం ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపారు. పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన నాగయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. మృతుడు ప్రవీణ్ చిన్న కుమారుడు. ఎమ్మెస్సీ చేసిన ప్రవీణ్ హైదరాబాద్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఉపాధ్యాయ వృత్తిలో మంచి నైపుణ్యం ఉన్న ప్రవీణ్ ఆ్రస్టేలియా ఇతర దేశాల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఐదేళ్ల క్రితం మిత్రులతో కలిసి అమెరికాకు వెళ్లిన ప్రవీణ్‌కుమార్ అట్లాంటా ప్రాంతంలో పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రవీణ్‌కుమార్ మృతితో పాతర్లపహాడ్ గ్రామంలో విషాదం నెలకొంది. -
8 రోజుల అనంతరం తెనాలికి చేరిన రవితేజ మృతదేహం
తెనాలిరూరల్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతి చెందిన గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌కు చెందిన తాడిబోయిన రవితేజ భౌతికకాయం శుక్రవారం సాయంత్రం తెనాలి చేరుకుంది. అమెరికా నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న రవితేజ భౌతికకాయాన్ని అంబులెన్స్ ద్వారా తెనాలి తీసుకు వచ్చారు. ఈ నెల 18న అమెరికాలోని టెక్సాస్‌లో ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్‌లో పడి రవితేజ మృతి చెందిన విజయం తెలిసిందే. రవితేజ తండ్రి గతంలోనే మృతి చెందగా తల్లి జయలక్ష్మి కొడుకుకు మంచి చదువు చెప్పించి పెంచి పెద్ద చేసింది. ఓవైపు చదువుకుంటూనే కోకోకోలా కంపెనీలో ఉద్యోగం చేస్తూ డబ్బులు కూడపెట్టుకున్న రవితేజ ఎంఎస్ కోసం గత ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లాడు. అక్కడ టెక్సాస్‌లో ట్రైన్ యూనివర్శిటీలో ఎంఎస్ చేస్తూ పార్ట్‌టైం జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 18న స్నేహితులతో కలిసి అక్కడ స్విమ్మింగ్‌పూల్‌లో దిగి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. దాదాపు ఎనిమిది రోజుల అనంతరం శుక్రవారం సాయంత్రం రవితేజ భౌతికకాయం తెనాలి చేరుకుంది. తెనాలిలో భారీ ఊరేగింపుగా రవితేజ భౌతికకాయాన్ని ఐతానగర్‌లోని నివాసానికి తీసుకువెళ్లారు. రజక చెరువు సెంటర్ నుంచి లింగారావు సెంటర్ మీదుగా రవితేజ నివాసానికి రాత్రికి భౌతికకాయం చేరుకుంది. రవితేజ భౌతిక భౌతికకాయాన్ని చూసి తల్లి జయలక్ష్మి, సోదరుడు కన్నీటి పర్యంతమయ్యారు. పేద కుటుంబానికి చెందిన తాము కొడుకు ప్రయోజకుడవుతాడని అమెరికా పంపిస్తే అనుకోని ప్రమాదంలో అతడు మృతి చెందాడంటూ కొడుకు మృతదేహాన్ని చూసి తల్లి జయలక్ష్మి గుండెల విసేలా రోదించారు. శనివారం ఉదయం రవితేజ భౌతికకాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. -
స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు రాగానే బాలుడు మృతి!
ఓ టీనేజ్ బాలుడు(15) స్విమ్మింగ్ చేసి.. పూల్ నుంచి పైకి ఎక్కి నడుస్తునే కుప్పకూలి మృతి చెందాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో విషాదం చోటు చేసుకుంది. బాలుడు ఒక్కసారిగా కుప్పకూలి పడిపోవటంతో అక్కడ ఉన్నవారు.. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.In UP’s meerut a 17-Year-old collapses and dies after coming out of the swimming pool. The teenager played cricket before coming for swimming and after swimming for sometime the boy collapses as soon as he steps out and was later declared dead at the hospital. pic.twitter.com/qIFWLSX8Kz— Tanishq Punjabi (@tanishqq9) June 21, 2024 దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిమ్మింగ్ పూల్ మేనెజర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతిపై తల్లిదండ్రులు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఘటన చోటు చేసుకున్న వెంటనే స్విమ్మింగ్ పూల్ వచ్చేవారి రాకను మూసివేశారు. -
Swimming Pool: అయ్యో శివశౌర్య
మొయినాబాద్: వేసవి సెలవుల్లో సరదాగా గడుపుదామని.. ఆటలో మెలకువలు నేర్చుకుందామని వెళ్లిన చిన్నారి విగతజీవిగా మారాడు. స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి ఒకటో తరగతి చిన్నారి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మొయినాబాద్ మండలం సుజాత స్కూల్లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సురంగల్‌కు చెందిన గాండ్ల విక్రమ్ చిన్న కుమారుడు గాండ్ల శివశౌర్య (7) నాగిరెడ్డిగూడ రెవెన్యూ పరిధిలోని సుజాత స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో స్కూల్లో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు క్రికెట్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, యోగాతో పాటు స్విమ్మింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. విక్రమ్ తన కుమారుడు శివశౌర్యను బ్యాడ్మింటన్ నేరి్పంచేందుకు క్యాంపులో చేరి్పంచాడు. శుక్రవారం ఉదయం 9.30 గంటల సమయంలో శివÔౌర్య స్విమ్మింగ్ చేస్తూ నీటిలో మునిగాడు. సిబ్బంది గమనించి విద్యారి్థని బయటకు తీశారు. నీళ్లు మింగి అపస్మారకస్థితిలో ఉండటంతో వెంటనే స్థానిక భాస్కర ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే.. పిల్లలకు, పెద్దలకు వేర్వేరుగా స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. నాలుగు రోజులుగా పిల్లల స్విమ్మింగ్ పూల్ రిపేర్‌లో ఉంది. దీంతో పెద్దల స్విమ్మింగ్ పూల్‌లోనే పిల్లలను స్విమ్మింగ్ చేయిస్తున్నారు. పిల్లలకు సేఫ్టీ బెలూన్స్ లేవని.. అవి తేవాలని కోచర్లు యాజమాన్యానికి సూచించినా వారు పట్టించుకోలేదని తెలిసింది. గుండెలు బాదుకున్న తల్లిదండ్రులు సమ్మర్ క్యాంపులో భాగంగా బ్యాడ్మింటన్ శిక్షణకు పంపామని.. స్విమ్మింగ్ చేయిస్తున్నట్లు తమకు తెలియదని చిన్నారి తండ్రి విక్రమ్ రోదించారు. తమ కుమారుడి మరణానికి పాఠశాల యాజమాన్యమే కారణమని వాపోయారు. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. -
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
మంచిర్యాలక్రైం/నస్పూర్: తమ ఇద్దరు కుమారులకు ఈతనేర్పించేందుకు స్విమ్మింగ్ పూల్‌కు తీసుకెళ్లిన ఆ తండ్రి అదే స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ ఊపిరాడక కొడుకుల కళ్లెదుటే మృతి చెందిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది. నస్పూర్ ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల మేరకు గద్దెరాగడికి చెందిన పంజాల సతీష్‌గౌడ్ (41) మంచిర్యాల పోలీస్ స్టేషన్లో బ్లూకోర్ట్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కొద్దిరోజులుగా తన ఇద్దరు కుమారులతో కలిసి సీసీసీలోని సింగరేణి స్విమ్మింగ్‌పూల్‌కు వెళ్తున్నాడు. ఆదివారం స్విమ్మింగ్ చేస్తుండగా అధిక రక్తపోటుకు గురికావడంతో నీటిలో మునిగిపోయి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. తోటి స్విమ్మర్లు, సిబ్బంది మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య స్వప్న, ఇద్దరు కుమారులు యశ్వంత్(12) వేయాన్(10) ఉన్నారు. స్పప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. నివాళులర్పించిన డీసీపీ అశోక్ కుమార్ కానిస్టేబుల్ సతీష్ మృతిని జిల్లా పోలీస్ అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. శనివారం రాత్రి తమతో కలిసి బ్లూకోర్ట్ పెట్రోలింగ్ విధుల్లో ఉత్సాహంగా పాల్గొన్న సతీష్ మృతి చెందిన వార్త తెలియగానే డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ ప్రకాశ్, ఎస్సైలు, సీఐలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలివచ్చి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆర్నెళ్ల క్రితమే గృహప్రవేశం కొత్తగా ఇంటిని నిర్మించుకున్న సతీష్ ఆర్నెళ్ల క్రితమే గృహప్రవేశం కూడా చేశాడు. కొత్త ఇంట్లోకి ప్రవేశించి ఏడాది కూడా పూర్తికాకముందే కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో మృతుని కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. స్విమ్మింగ్ పూల్‌లో ఈతకొడుతూ కానిస్టేబుల్ మృతి నివాళులర్పించిన డీసీపీ అశోక్‌కుమార్ -
క్లాస్ రూంలో స్విమ్మింగ్ పూల్: పిల్లల సంబరం, వైరల్ వీడియో
ఉదయం ఎనిమిది గంటలకే వేడి గాలులు వణుకు పుటిస్తున్నాయి. ఎండ వేడిమికి బయటకు రావాలంటేనే పెద్ద వాళ్లు సైతం భయపడిపోతున్న పరిస్థితి. ఇక పిల్లల్ని బడికి పంపించాలంటే చాలా కష్టం. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కనౌజ్‌లోని ఒక స్కూలు యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. దీంతో స్విమ్మింగ్ పూల్ పిల్లలు సంబరపడిపోతున్న వీడియో వైరల్ గా మారింది.Vaibhav Kumar, Principal says, " As the weather department informed about the heat wave, we were asking students to drink water and cool drinks...we also told them that people in cities bathe in swimming pools. Students asked us what swimming pools look like and when will they… pic.twitter.com/oyFqbpTI5V— ANI (@ANI) May 1, 2024 రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య పిల్లల్ని బడికి రప్పించేందుకు, వారి సౌకర్యార్థం ఒక ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదిలోనే స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది. ఎండలు, వడగాల్పుల వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ప్రిన్సిపాల్ వైభవ్ కుమార్.క్లాస్ రూంలో, స్మిమ్మింగ ప్రస్తుతం గోధమ పంటపనులు నడుస్తున్నాయి కనుక చాలా కుటుంబాలు విద్యార్థులను పాఠశాలకు పంపడం లేదు. వారిని తిరిగి పిలవడానికి వెళ్ళాము, కానీ సరైన స్పందన లభించలేదు అందుకే ఈ వినూత్న ఆలోచనతో చేశాం. దీంతో హాజరు శాతం పెరిగింది. .. విద్యార్థులు ఆనందంగా ఉన్నారని చెప్పారు.#WATCH | Uttar Pradesh: A govt school in Kannauj makes a swimming pool inside the classroom, amid rising temperature. pic.twitter.com/rsXkjDFa7a— ANI (@ANI) May 1, 2024 ఎండలనుంచి ఉపశమనం పొందేలా నీళ్లు, చల్లని పానీయాలకు తాగమని విద్యార్థులకు చెప్పాం. అయితే నగరాల్లో మాదిరిగా తమకు స్విమ్మింగ్ పూల్ కావాలని పిల్లలు అడిగారు. దీంతో తల్లిదండ్రుల అనుమతి తసీఉకొని క్లాస్రూమ్ లోపల ఈత కొలను ఏర్పాటు చేశమన్నారు అసిస్టెంట్ టీచర్ ఓం తివారీ. -
తరగతి గదిని స్విమ్మింగ్ ఫూల్ చేసిన హెడ్మాస్టర్!
ప్రస్తుతం దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు ఉక్కపోత, వేడి గాలులకు తల్లడిల్లిపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్రమైన ఎండల కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ పరిస్థితులను గుర్తించిన ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వినూత్న ఆలోచనతో విద్యార్థులను పాఠశాలకు రప్పిస్తున్నారు.ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలోని ఒక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిల్లలను పాఠశాలకు రప్పించడానికి ఒక ప్రత్యేకమైన విధానాన్ని ఆశ్రయిస్తున్నారు. పాఠశాలలోని తరగతి గదిని స్విమ్మింగ్ పూల్‌గా మార్చివేశారు. ఇది విజయవంతమయ్యింది. దీంతో చిన్నారులంతా పాఠశాలకు క్రమంతప్పక వస్తున్నారు. తరగతి గదిలోని స్విమ్మింగ్ పూల్‌లో చిన్నారులు సరదాగా ఆడుకుంటున్న వైనానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇది కన్నౌజ్ జిల్లాలోని మహసోనాపూర్లోని ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన ఉందంతం. ఇక్కడ ఉష్ణోగ్రతలు 40 నుండి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటున్నాయి. దీంతో ఎండ వేడిమి నుంచి తమ పిల్లలను రక్షించేందుకు తల్లిదండ్రులు వారిని పాఠశాలలకు పంపడం లేదు. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిల్లల హాజరు శాతాన్ని పెంచేందుకు తరగతి గదిలోనే స్విమ్మింగ్ పూల్‌ను ఏర్పాటు చేశారు.పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైభవ్ రాజ్‌పుత్ మీడియాతో మాట్లాడుతూ ‘పాఠశాలలోని ఒక తరగతి గదిని నీటితో నింపేసి, స్విమ్మింగ్ పూల్‌గా మార్చివేశాం. దీనిని చూసి పిల్లలు ముచ్చట పడ్డారు. ఆ స్విమ్మింగ్ ఫూల్లో ఆడుకోవడం మొదలు పెట్టారు. వారి ఆనందానికి అంతులేకుండా పోతోంది. ఆ నీటిలో ఈత కొడుతూ ఆడుకుంటున్నారు. ఇలా ఎంజాయ్ చేసేందుకు విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తున్నారు’ అని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో విద్యార్థులకు వేసవి సెలవులు మే 21 నుంచి జూన్ 30 వరకూ ఉంటాయి. -
మద్యం మత్తు.. సిమ్మింగ్ పూల్‌లో పడి యువకుడి మృతి
అచ్యుతాపురం(అనకాపల్లి): మద్యం మైకంలో ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో తోటి స్నేహితుని మరణానికి కారణమయ్యాడు మరో స్నేహితుడు. పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన కొండకర్లలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో శనివారం రాత్రి స్విమ్మింగ్ పూల్‌లో పడి విజయనగరానికి చెందిన సాయివర్మ అనే యువకుడు మృతి చెందాడు. దీనికి సంబంధించి పరవాడ డీఎస్పీ శ్రీనివాసరావు అందించిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న 30 మంది స్నేహితులు కొండకర్లలో ప్రైవేట్ రిసార్టులో శనివారం సందడి చేశారు. స్నేహితుల్లో కొందరు మద్యం సేవించి స్విమ్మింగ్ పూల్ వద్ద నృత్యాలు చేశారు. ఆ సమయంలో సాయివర్మను మరో స్నేహితుడు సిమ్మింగ్ పూల్‌లోకి తోసేశాడు. నీటిలో పడిపోయిన సాయివర్మకు ఈత రాకపోవడమో లేక మద్యం మత్తు కారణమో గానీ కొంత సేపటికి స్విమ్మింగ్ పూల్‌లో తేలిపోయాడు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. సాయివర్మను ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. తొలుత అతిగా మద్యం సేవించడం వల్లే నీటిలో మునిగి చనిపోయాడని భావించినప్పటికీ సీసీ ఫుటేజ్ దృశ్యాలను చూసిన తర్వాత పోలీసులు ఘటనకు కారణాన్ని గుర్తించారు. పార్టీలో ఎంజాయ్ చేస్తూ స్నేహితుడే సాయివర్మను నీటిలోకి తోసేసినట్టు గుర్తించారు. అయితే ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన ఘటన కాదని భావించిన పోలీసులు సాయంత్రం తర్వాత కేసు నమోదు చేశారు. ఆస్పత్రి వద్ద మృతుని కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. ఇక్కడి రిసార్ట్‌లో గతంలోనూ కొందరు స్నేహితులు పార్టీ చేసుకొన్న తర్వాత ఒక వ్యక్తి స్విమ్మింగ్ పూల్‌లో పడి చనిపోయాడు. అయితే ఆ సంఘటనకు సంబంధించి ఎటువంటి సీసీ ఫుటేజ్‌లు లేకపోవడంతో కేసు తీవ్రత గుర్తించలేకపోయారు. తాజా ఘటనతో కొండకర్ల పరిసరాల్లో జరిగే పార్టీలపై నిఘా పెట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. -
స్విమ్మింగ్‌తో ఓ మహిళ కంటి చూపు మాయం!
చాలామందికి ఈత కొట్టడం సరదా. నదుల్లోనూ, చిన్ని చిన్న కాలువాల్లో పిల్లలు, పెద్దలు ఈత కొడుతుంటారు. నిజానికి అలాంటి నీటిలో అమీబా వంటి పరాన్న జీవులు ఉంటాయని అందరికీ తెలిసిందే. కానీ అవే ఓ మహిళ కంటి చూపు పోవడానికి కారణమైంది. సాధారణ నొప్పిగా మొదలై ఏకంగా కంటిలోని కార్నియాను తినేసింది. దీంతో ఆమె శాశ్వత అంధురాలిగా మారిపోయింది. వివరాల్లోకెళ్తే..ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. యూకేలో కెంట్కు చెందిన 38 ఏళ్ల షెరీన్ ఫే గ్రిఫిత్ ఎప్పటిలానే పబ్లిక్ స్మిమ్మింగ్పూల్లో ఈత కొట్టింది. ఐతే రెండు రోజుల తర్వా నుంచి కంటి ఇన్ఫెక్షతో విలవిలలాడింది. తొలుత సాధారణమైందిగా భావించి ఐ డ్రాంప్స్ వంటివి వేసుకుంది. వైద్యులు కూడా నార్మల్ ఇన్ఫెక్షన్గానే పరిగణించారు. కానీ రోజురోజుకి ఇన్ఫెక్షన్ తీవ్రమైందే గానీ తగ్గలేదు. పైగా కన్ను చుట్టూ ఉన్న ప్రాంతమంతా వాచి కనురెప్ప తెరవలేని స్థితికి వచ్చేసింది. దీంతో వైద్యులు కంటికి సంబంధించిన అని వైద్య పరీక్షలు నిర్వహించగా అకాంతమీబా కారణంగా ఈ ఇన్ఫెక్షన్ వచ్చినట్లు గుర్తించారు. దీంతో ఈ నొప్పి, దురద, పుండ్లు కూడిని ఇన్ఫెక్షన్న వస్తుందని బాధితురాలు షెరీన్కి తెలిపారు. ఈ ఇన్ఫెక్షన్ని తగ్గించేందుకు స్టెరాయిడ్స్, యాంటీ బ్యాక్టీరియల్ ఐ డ్రాప్స్ వంటివి ఇచ్చి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. దురద నొప్పి ఎక్కువై విలవిలలాడింది. ఎందువల్ల ఇలా అయిందని పరీక్షించగా ఆ పరాన్న జీవి అకాంతమీబా షెరీన్ కంటిలోని కార్నియాను తినేసినట్లు గుర్తించారు. దీంతో ఆమె కంటి చూపుని కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆమె ఆమె నొప్పి, దురద పుండ్లు వంటి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు తెలిపింది. అంతేగాదు తాను కంటి చూపుని కోల్పోడం వల్ల తన దైనందిన కార్యక్రమాలను వేటిని చేసుకోలేకపోతున్నట్లు ఆవేదనగా వివరించింది. కాగా, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం అకాంతమీబా సాధారణంగా సరస్సులు, మహాసముద్రాలు, మట్టి వంటి నీటి వనరుల్లో కనిపిస్తుంది. ఇది పంపు నీరు, వెంటిలేటింట్ , ఎయిర్ కండిషనింగ్ యూనిట్లు, కొలనుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కంటికి కాంటాక్ట్ లెన్స్ ధరించడం వల్ల గానీ చిన్న చిన్న కంటి గాయాల ద్వారా గానీ కన్నులోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలుగజేస్తుందని పేర్కొంది. ఇవి నేరుగా కళ్లపై దాడి చేసి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. అయితే నీరు తాగడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ రాదని, అలాగే ఇది అంటువ్యాధి కూడా కాదని వైద్యులు చెబుతున్నారు. ఐతే ఈ ఇన్ఫెక్షన్కి చికిత్స అందించడం చాల కష్టమని అన్నారు. ఈ ఇన్షెక్షన్ సోకే ముందు కనిపించే లక్షణాలు.. అస్పష్టంగా కనిపించడం లేదా దృష్టి కోల్పోవడం మేఘావృతమైన కార్నియా తీవ్రమైన కంటినొప్పి కళ్లలో ఎరుపు నీళ్లు నిండిన కళ్లు కంటి ఉపరితలంపై తెల్లటి వలయాలు అయితే అకాంతమీబా కంటిలోకి ప్రవేశించిన చాలా రోజుల వరకు దాని లక్షణాలు బయటపడవని వైద్యుల చెబుతున్నారు. (చదవండి: భోజనం చేసిన వెంటనే పండ్లు తింటున్నారా? ఆరోగ్య నిపుణుల ఏం చెబుతున్నారంటే..) -
ప్రాణాలు కాపాడే.. ప్రపంచంలోనే తొలి ‘AI’ కెమెరా.. ధర ఎంతంటే?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే తొలి అండర్‌వాటర్ కెమెరా ఇది. ఈత కొట్టేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్లు ప్రమాదాలకు గురైతే, ఈ కెమెరా వెంటనే గుర్తిస్తుంది. ఇందులోని డ్రౌనింగ్ డిటెక్షన్ సిస్టమ్ మునిగిపోతున్న వారిని ముందుగానే పసిగట్టి అప్రమత్తం చేస్తుంది. ఇళ్లలోను, హోటల్స్‌లోను ఉండే స్విమింగ్‌పూల్స్‌లో ఉపయోగించడానికి ఇది పూర్తిగా అనువుగా ఉంటుంది. అమెరికన్ గృహోపకరణాలు, స్విమింగ్‌పూల్ రక్షణ పరికరాల తయారీ సంస్థ ‘కోరల్’ ఈ అండర్‌వాటర్ సెక్యూరిటీ కెమెరాను ‘మైలో’ పేరుతో ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. ‘మైలో’ కెమెరా నిరంతరం స్విమింగ్‌పూల్‌ను కనిపెడుతూనే ఉంటుంది. ఈతకొడుతూ ఎవరైనా మునిగిపోతున్నట్లు గుర్తిస్తే, దీని యాప్ ద్వారా అనుసంధానమైన కుటుంబ సభ్యులు, సంబంధీకుల స్మార్ట్ఫోన్లకు తక్షణమే సమాచారం పంపుతుంది. దీని ధర 1499.15 డాలర్లు (సుమారు రూ.1.25 లక్షలు). -
ఈత రావాలి ప్రాణం నిలవాలి
ఇది వానల కాలం. వరదల కాలం. కేరళలో ఈ సమయంలో పడవ ప్రమాదాలు సాధారణం. ప్రమాద తీవ్రత కంటే ఈత రాకపోవడం వల్ల జనం మరణిస్తున్నారని సాజి వెలస్సిరల్ అనే వ్యక్తికి అనిపించింది. చిన్న ఫర్నిచర్ షాపు నడుపుకునే ఇతడు గొప్ప ఈతగాడు కూడా. ఇంకేముంది. ఊళ్లో ఉన్న పెరియార్ నదిని స్విమ్మింగ్ పూల్‌గా చేసుకుని అందులోనే ఈత నేర్పుతున్నాడు. ఇప్పటికి 6000 మంది ఈత నేర్చుకున్నారు. వీళ్లందరి ప్రాణాలను నీళ్ల నుంచి ఇతడు రక్షించినట్టే. ప్రతి చోటా ఇలాంటి వాళ్లుంటే వేల ప్రాణాలు బతుకుతాయి. గత మే నెలలో కేరళలోని తానురు దగ్గర బ్యాక్ వాటర్స్‌లో పడవ మునిగి 27 మంది చనిపోయారు. ‘వాళ్లకు ఈత వచ్చి ఉంటే అందరూ బతికి ఉండేవారు. తుఫాను లేదు.. సముద్రమూ కాదు. ఈత వచ్చి ఉంటే పడవ బోల్తా పడినా ఆ బ్యాక్ వాటర్స్‌లో హాయిగా ఈదుకుంటూ గట్టెక్కవచ్చు. లేదా సహాయకబృందాలు చేరేవరకూ మెల్లగా తేలుతూనే ఉండొచ్చు’ అంటాడు సాజి వెలస్సిరల్. ఈ ప్రమాదం కాదు ఇరవై ఏళ్ల క్రితం ఇతడు చూసిన ప్రమాదమే ఇతడి మనసు మార్చింది. కుమర్కోమ్లో పడవ బోల్తా పడి 29 మంది చనిపోయారు. అప్పుడు సాజి యువకుడు. తండ్రి మంచి స్విమ్మర్ కావడంతో ఆయన నుంచి ఈత నేర్చుకుని అద్భుతంగా ఈదుతున్నాడు. ఆ ప్రమాదంలో చనిపోయిన వారికి ఈత వచ్చి ఉంటే ప్రాణాలు మిగిలి ఉండేవి అనిపించింది. ‘ఈత ఎందుకు రాదు’ అని ప్రశ్నించుకున్నాడు. ‘నేర్పేవారు లేకపోవడం వల్ల’ అనే జవాబు వచ్చింది. ‘నేనెందుకు నేర్పకూడదు’ అనుకున్నాడు. అలా అతని ఈత సేవ మొదలైంది. పెరియార్ నదిలో సాజి వెలస్సిరల్ అలువా అనే చిన్న ఊరిలో ఉంటాడు. ఇది ఎర్నాకుళంకు 40 నిమిషాల దూరం. ఆ ఊళ్లో చిన్న ఫర్నీచర్ షాపు నడుపుకుంటూ జీవిస్తుంటాడు సాజి. అయితే అదే ఊరి నుంచి పెరియార్ నది ప్రవహిస్తూ ఉంటుంది. దాదాపు నిలువ నీరులా ఉంటుంది ప్రవాహం. ‘దీనినే స్విమ్మింగ్‌పూల్‌గా చేసుకుని ఈత నేర్పిస్తాను’ అని నిర్ణయించుకున్నాడు సాజి. ‘ముందు నా కుటుంబం నుంచే మొదలెట్టాలి’ అనుకుని తన ఇద్దరు పిల్లల్ని, స్నేహితుడి పిల్లల్ని తీసుకుని నదిలో ఈత నేర్పడం మొదలెట్టాడు. మూడు వారాల్లోనే పిల్లలు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు (780 మీటర్లు) ఈదడం నేర్చుకున్నారు. దాంతో ఊరి దృష్టి సాజి మీద పడింది. అతడి దగ్గర ఈత నేర్చుకోవడానికి అందరూ క్యూ కట్టారు. వెలస్సిరల్ రివర్ స్విమ్మింగ్ క్లబ్ నేర్చుకునేవారు పెరిగే కొద్దీ సాజికి ఉత్సాహం వచ్చింది. తన ఈత కేంద్రానికి వెలస్సిరల్ రివర్ స్విమ్మింగ్ క్లబ్ అనే పేరు పెట్టాడు. ప్రత్యేక దినాల్లో, పండగ వేళల్లో సామూహిక ఈత కార్యక్రమాలు నిర్వహిస్తాడు. నది ఈదే పోటీలు నిర్వహిస్తాడు. విశేషం ఏమిటంటే 70 ఏళ్ల ఆరిఫా అనే మహిళ ఇతని దగ్గర ఈత నేర్చుకుని చేతులు వెనక్కు కట్టుకుని మరీ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు ఈదింది. శారీరకమైన అవకరాలు ఉన్నవారికి కూడా ఈత నేర్పే టెక్నిక్స్ ఇతని దగ్గర ఉన్నాయి. ఇతను ఈత నేర్పేటప్పుడు ఒక అంబులెన్సు ఒడ్డున, నదిలో రక్షణకు ఒక పడవ సిద్ధంగా ఉంటాయి. ‘ఈత నేర్వాలి. ప్రాణాలు నిలుపుకోవాలి. ప్రమాదవశాత్తు నీళ్లల్లో పడితే ఈదలేక మరణించడం దురదృష్టకరం’ అంటాడు సాజి. అతని హెచ్చరిక వినదగ్గది. -
గంటపాటు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి జలాసనాలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: గంట పాటు నీటిపై తేలియాడుతూ..పలు యోగాసనాలు వేసి రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి(64) అందరినీ ఆకట్టుకున్నారు. జాతీయ స్విమ్మింగ్ పూల్ డేను పురస్కరించుకుని క్రీడారంగ విశిష్టత, స్విమ్మింగ్ సాధన, యోగాసనాల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడానికి విజయనగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న ఆక్వా స్విమ్మింగ్ పూల్‌లో మంగళవారం ఆయన కార్యక్రమం చేపట్టారు. ఈ ప్రదర్శనను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు ప్రారంభించారు. నిర్విఘ్నంగా గంట పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం దేశ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ ముగించారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కోలగట్లను సత్కరించారు. చదవండి: బాబు, సోనియా ఏపీకి అన్యాయం చేశారా? ఇదిగో ఇలా బయటపడింది..! -
64 ఏళ్ల వయసులో... డిప్యూటీ స్పీకర్ సాహసం! గంట పాటు నీటిపై తేలియాడుతూ..
సాక్షి, విజయనగరం: స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి వయసును సైతం లెక్క చేయకుండా సాహసం చేశారు. గంట పాటు నీటిపై తేలియాడుతూ యోగ సాధన చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. క్రీడా రంగ విశిష్టతను, క్రీడల ప్రాధాన్యతను యువతరానికి తెలియజేయాలనే సంకల్పంతో ఆయన చేపట్టిన కార్యక్రమం విజయవంతంగా సాగింది. జాతీయ స్విమ్మింగ్ పూల్ డే సందర్భంగా మంగళవారం స్థానిక ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో డిప్యూటీ స్పీకర్ జలాసన ప్రక్రియ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రీడల ఆవశ్యకతను తెలుపుతూ డిప్యూటీ స్పీకర్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం భావితర క్రీడాకారుల్లో తప్పకుండా స్ఫూర్తి నింపుతుందని.. చైతన్యం తీసుకొస్తుందని అభిప్రాయపడ్డారు. సామాజిక చైతన్యానికి, ప్రజల ఆరోగ్యానికి ఇలాంటి ప్రక్రియలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్ చేపట్టిన సాహసాన్ని ఈ సందర్భంగా అభినందించారు. అట్టహాసంగా కార్యక్రమం కాగా వందలాది మంది ప్రజలు, ఆయన అభిమానులు విచ్చేసి వీక్షించారు. కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు. స్థానిక ప్రజలు, అభిమానుల సౌకర్యార్థం ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్సు ఆవరణలో, నగరంలో పలు చోట్ల ఎల్.ఈ.డి. స్క్రీన్లు ఏర్పాటు చేశారు. క్రీడల ప్రాధాన్యతను తెలియజేయాలన్నదే నా ఉద్దేశం జలాసనం వేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి క్రీడల ప్రాధాన్యతను నేటి యువతరానికి తెలియజేయాలన్నదే తన ముఖ్య ఉద్దేశమని అందుకే ఈ వయసులో కూడా ఇలాంటి సాహసాన్ని చేశానని పేర్కొన్నారు. సెల్ ఫోన్లు, టీవీల మోజులో పడి యువత క్రీడలకు దూరం అవుతున్నారని వాటి ఆవశ్యకతను తెలుసుకొని క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రయోజనకర నిర్ణయాలు తీసుకుందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తన వంతుగా నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని వివరించారు. మహిళల కోసం ప్రత్యేకంగా పార్కును నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ప్రజలు కూడా వారి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ నిత్యం క్రీడా సాధన చేయాలని డిప్యూటీ స్పీకర్ హితవు పలికారు. వయసుతో సంబంధం లేని క్రీడ.. స్విమ్మింగ్ అని దీనిని రోజూ సాధనం చేయటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం రాజన్నదొర, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసు, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ సురేష్ బాబు, ఎమ్మెల్యేలు శంబంగి చిన వెంకట అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, జిల్లా ఎస్పీ ఎం. దీపికా, స్థానిక కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
స్విమ్మింగ్ పూల్ గా మారిన రైల్వే స్టేషన్
ముంబై: కొద్దిరోజులుగా ఆగకుండా కురుస్తున్న వానలకు నవీ ముంబైలో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే స్టేషన్లోకి నీళ్లు చేరాయి. దీంతో స్థానిక యువత అక్కడ నీటిలో జలకాలాడుతూ వీడియో తీసి వర్షం పడితే ఆ లోకల్ రైల్వే స్టేషన్ పరిస్థితి ఏంటనేది కళ్ళకు కట్టారు. రుతుపవనాల రాకతో కొద్ది రోజులుగా ముంబైలో కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ రోడ్ల మీద వరదనీరు నిలిచిపోగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇదిలా ఉండగా నవీ ముంబైలోని ఉరాన్ లోకల్ రైల్వే స్టేషన్ ఐతే స్విమ్మింగ్ పూల్ ని తలపిస్తూ నిండుగా నీళ్లు చేరాయి. దీంతో యువత అందులో హాయిగా జలకాలాడారు. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో ఎక్కడెక్కడో విహరిస్తోంది. నూతనంగా నిర్మిస్తున్న ఈ రైల్వే స్టేషన్లో నీరు లీక్ అవుతుండడంతోనే ఇంతగా నీరు చేరిందంటున్నారు స్థానికులు. పైగా ఇక్కడి డ్రైనేజి వ్యవస్థ అయితే అత్యంత అధ్వానంగా ఉండడంతో నీరు బయటకు పోయే మార్గమే లేదంటున్నారు స్థానికులు. ఈ వీడియో చూసైనా సిగ్గు తెచ్చుకోండని అధికారులని ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. नवीन नेरूळ - उरण लोकल रेल्वे स्टेशन बोकडविरा @CMOMaharashtra @PMOIndia @AshwiniVaishnaw @Dev_Fadnavis @mieknathshinde #uran_local_navi_mumbai pic.twitter.com/mb0Wp5fF1j — Jeetendra N. Thale (@JeetendraThale) July 4, 2023 ఇది కూడా చదవండి: రైలుకు వేలాడుతూ బిత్తిరి చర్య.. పట్టుతప్పితే అంతే సంగతులు! -
Anchor Anasuya : స్విమ్మింగ్ పూల్‌లో ఫ్యామిలీతో అనసూయ, మొదటిసారి బికినీలో (ఫొటోలు)
-
తీవ్ర విషాదం: చిన్నారిని మింగేసిన స్విమ్మింగ్ పూల్.. తండ్రి కళ్లెదుటే
మునగపాక/అనకాపల్లి టౌన్ (విశాఖ): వేసవి సెలవుల్లో సరదాగా పిల్లలను స్విమ్మింగ్ పూల్‌కు తీసుకెళ్లిన తల్లిదండ్రులు క్షణాల్లో కుమారుడిని కోల్పోయారు. భగవంతుడా.. ఏమిటీ ఘోరమని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మునగపాక మండలం అరబుపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు బుధవారం ఈతకు దిగి, నీట మునిగారు. అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో అన్న రాపేటి పవన్ (8) తిరిగిరాని లోకాలకు చేరుకోగా తమ్ముడు చరణ్ ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డాడు. ఆటో డ్రైవర్ రాపేటి గంగునాయుడు (చంటి) దంపతులు వేసవి సెలవులు కావడంతో పిల్లలను తీసుకొని అనకాపల్లి బైపాస్ దరి స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లారు. తన పిల్లలకు ఈత నేర్పించేందుకు తండ్రి పూల్‌లోకి దిగారు. సరదాగా ఆడుకుంటున్న పిల్లలు అంతలోనే నీట మునిగి ప్రమాదానికి లోనయ్యారు. సంఘటన జరిగిన సమయంలో ఒడ్డున ఉన్న తల్లి మాధవి ఏం చేయలేని నిస్సహాయ స్థితిని ఎదుర్కొంది. కళ్లెదుటే చనిపోయిన కుమారుడిని చూసి బోరున విలపించడంతో స్థానికులు కూడా కంటతడి పెట్టారు. ఫిర్యాదు చేయకుండా పవన్ మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడంతో.. పట్టణ ఎస్ఐలు దివాకర్, సత్యనారాయణ, ఎస్.ప్రసాద్ అరబుపాలెం గ్రామానికి చేరుకొని పవన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించారు. ఈ ఘటనతో అరబుపాలెంలో విషాదం నెలకొంది. -
‘పార్వతి’ కోసం స్విమ్మింగ్ పూల్
సాక్షి, చైన్నె : మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ ఏనుగు పార్వతి కోసం అతిపెద్ద స్విమ్మింగ్ పూల్‌ను నిర్మించారు. రూ. 23 లక్షలతో 3,500 చదరపు అడుగుల స్థలంలో నిర్మించిన ఈ స్విమ్మింగ్ పూల్ పార్వతి ఆనంద తాండవం చేస్తూ జలకాలాటలో మునిగింది. వివరాలు.. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మదురై మీనాక్షి అమ్మవారి ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఆలయం ప్రవేశ మార్గంలో పార్వతి అనే ఏనుగు ప్రత్యేక ఆకర్షణతో కనిపిస్తుంటుంది. 2000 సంవత్సరంలో ఈ ఏనుగును ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చారు. అమ్మవారి సేవలో నిమగ్నమైన ఈ ఏనుగు ఆరోగ్య సంరక్షణలో అధికారులు ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. పార్వతిలో మరింత ఉత్సాహాన్ని ఆనందాన్ని నింపేవిధంగా ఆలయం తూర్పు గోపురం ప్రవేశ మార్గం సమీపంలోని స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. రూ. 23 లక్షల వ్యయంతో 3,500 చదరపు అడుగుల స్థలంలో ఐదు అడుగుల లోతులో స్విమ్మింగ్ పూల్ నిర్మించారు. ఆదివారం జరిగిన పూజాది కార్యక్రమాలతో ఈ స్విమ్మింగ్ పూల్‌ను ఆర్థిక మంత్రి పళణి వేల్ త్యాగరాజన్ ప్రారంభించారు. ఆలయ ఏనుగుకు ప్రత్యేకపూజలు , ఆహారం అందజేశారు. అనంతరం స్విమ్మింగ్ పూల్‌లోకి ఏనుగును పంపించారు. స్విమ్మింగ్ పూల్‌లో అటు ఇటు చక్కర్లు కొడుతూ ఆనంద తాండవంతో గజరాజు జలకాలాటలలో మునిగింది. అలాగే భక్తుల సౌకర్యార్థం రూ.కోటితో నిర్మించిన షెల్టర్‌ను మంత్రి ప్రారంభించారు. -
ఆమె పోరాడింది.. టాప్‌లెస్ సమానత్వం సాధించింది
జర్మనీ రాజధాని నగరం బెర్లిన్‌లోని బహిరంగ ప్రదేశాల్లోని స్విమ్మింగ్ పూల్స్‌లో ఇకపై ఆడామగా తేడా లేకుండా టాప్‌లెస్‌గా ఈత కొట్టొచ్చు. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేశారు అధికారులు. దీనికి ఓ మహిళ చేసిన పోరాటమే కారణం. తాజాగా నగరంలోని ఓ స్విమ్మింగ్ పూల్ వద్ద టాప్‌లెస్‌గా సన్‌బాత్ చేసింది ఒకావిడ. అది గమనించిన నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆమెను బలవంతంగా బయటకు పంపించేశారు. దీంతో ఆమె సెనేట్ ఆంబుడ్స్పర్సన్ ఆఫీస్‌ను సంప్రదించింది. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లను చూడాలని.. టాప్‌లెస్‌గా ఈతకు అనుమతించాలని పోరాటానికి దిగింది. ఆమె డిమాండ్‌కు అధికారులు దిగొచ్చారు. వివక్షకు పుల్‌స్టాప్ పెడుతున్నట్లు బెర్లిన్ అధికారులు ప్రకటించారు. బెర్లిన్‌లో స్మిమ్మింగ్ పూల్స్ నిర్వాహణ చూసుకునే బెర్లినర్ బేడర్బెట్రీబే.. తమ నిబంధనలను సవరిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశాయి. అయితే ఆ మహిళ వివరాలను మాత్రం బయటకు వెల్లడించలేదు. జర్మనీ సాధారణంగా న్యూడిటీ విషయంలో పెద్దగా పట్టింపులు లేని దేశం. కాకపోతే పూర్తి నగ్నత్వాన్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ప్రోత్సహించదు. -
విజయవాడలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి శ్రీకారం
-
షర్ట్ లేకుండా షాకిచ్చిన మహేశ్ బాబు.. క్షణాల్లో ఫోటో వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చారు.గుబురు గడ్డంతో షర్ట్ లేకుండా కనిపించి షాక్ ఇచ్చారు. ఈ ఫోటోలను స్వయంగా మహేశ్ భార్య నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఈ పోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. సాధారణంగా మహేశ్ తన బాడీని ఎక్స్ పోజింగ్ చేయరు. సినిమాల్లోనూ షర్ట్‌లేకుండా కనిపించాలని మేకర్స్ కోరినా మహేశ్ దాన్ని సున్నితంగా తిరస్కరిస్తారు. చదవండి: మహేశ్ సోదరి మంజులకు పిల్లలను కనడం ఇష్టమే లేదట.. కానీ! ఇలాంటి లుక్‌లోనూ మహేశ్ చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఇటీవలి కాలంలో తన లుక్‌పై ఫుల్ ఫోకస్ పెట్టారు మహేశ్. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB28 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం లుక్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న మహేశ్ ఇందులో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో మహేశ్ షర్ట్ లేకుండా కనిపించడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 'ఫైనల్లీ.. మహేశ్ బాడీని ఫస్ట్ టైమ్ చూస్తున్నాం' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: కొంపముంచిన విజయ్ కామెంట్స్.. ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ 'లైగర్' View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
వివాదంలో రిషి సునాక్.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
లండన్: యూకే ప్రధాని ఎన్నికలకు మరో నెలరోజుల టైం కూడా లేదు. మాజీ చాన్స్‌లర్ రిషి సునాక్, యూకే ఫారిన్ సెక్రెటరీ లిజ్ ట్రస్ ప్రధాని రేసులో తుదిగా మిగిలారు. లిజ్ ట్రస్ పైచేయి సాధిస్తూ వెళ్తుండగా.. ఈలోపు భారత సంతతికి చెందిన రిషి సునాక్ చుట్టూ వివాదాలు, విమర్శలు అల్లుకుంటున్నాయి. యూకే ప్రధాని రేసులో నిలిచిన రిషి సునాక్‌ని ఇరకాటంలో పడేసేందుకు అక్కడి మీడియా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆయన లైఫ్ స్టైల్లోని ప్రతీ అంశాన్ని తెర మీదకు తెస్తోంది. తాజాగా.. ఆయన తన మాన్షన్‌లో ఏర్పాటు చేసుకున్న స్విమ్మింగ్‌పూల్‌ను వివాదానికి కేంద్రంగా మార్చేశాయి అక్కడి మీడియా హౌజ్‌లు. ఇందులో వివాదం ఏముంది అంటారా? ప్రస్తుతం యూకేలో వడగాల్పులు, కరువుతో తీవ్ర నీటిఎద్దడి తాండవిస్తోంది కాబట్టి. ది ఇండిపెండెంట్ కథనం ప్రకారం.. నార్త్ యార్క్‌షైర్‌లో సునాక్‌కు ఓ మాన్షన్ ఉంది. వీకెండ్లలో ఆయన, భార్య అక్షత మూర్తి, పిల్లలతో కలిసి అక్కడికి వెళ్తుంటారు. అయితే ఏరియల్ ఫుటేజీల ద్వారా అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులకు సంబంధించిన ఫొటోలను ప్రముఖంగా ప్రచురించింది ది ఇండిపెండెంట్. అంతేకాదు ఆ ఫొటోలు సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ పట్టణంలోని స్విమ్మింగ్ పూల్స్‌ను బలవంతంగా అధికారులు మూసేసిన విషయాన్ని సైతం లేవనెత్తుతున్నారు కొందరు. నీటి కొరత ఉన్న సమయంలో.. ఇలా భారీగా ఖర్చు చేపట్టి స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేపట్టడం పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. RIshi Sunak's huge swimming pool, gym and tennis courts are nearing completion in the grounds of his Manor House near Northallerton. @RishiSunak @trussliz @yorkpress @TeessideLive #Ready4Rishi pic.twitter.com/QlqgNVcLCJ — TeesPix.Photos - Teesside Photos (@TeesPix) August 12, 2022 అయితే ఈ కుటుంబం ఈమధ్యకాలంలో ఇలా వరుసగా వివాదాలు, విమర్శల్లో చిక్కుకుంటోంది. రిషి సునాక్ భార్య అక్షత మూర్తి.. తన ఇంటికి వచ్చిన జర్నలిస్టులకు టీ ని స్వయంగా ఇచ్చారు. అయితే అందుకోసం కాస్ట్లీ కప్పులు, ట్రేను ఉపయోగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. పన్నుల పెంపు వల్ల ప్రజా జీవనం భారంగా మారిన ఇలాంటి సమయంలో.. ఇలాంటి కాస్ట్లీ చేష్టలు అవసరమా? అంటూ నిందించారు ఆమెను. ఇదీ చదవండి: భార్యకాని భార్య.. భర్తకానీ భర్త.. ఇదేం పెళ్లి!! -
కోకాపేటలోని ఓ అపార్ట్ మెంట్ స్విమ్మింగ్ పూల్ లో పడి బాలుడు మృతి
-
నార్సింగిలో విషాదం: ఫంక్షన్‌కు వచ్చి స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోయిన బాలుడు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. కోకాపేటలోని ఓ అపార్ట్మెంట్ స్విమ్మింగ్‌పూల్‌లో పడి శ్యామ్ అనే బాలుడు మృతి చెందాడు. కుటుంబంతో కలిసి బంధువుల ఇంట్లో ఫంక్షన్‌కు వచ్చిన శ్యామ్... స్విమ్మింగ్‌పూల్ వద్ద ఆడుకుంటూ నీటిలో పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని ఆసుత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయవాడకు చెందిన శ్యామ్ తొమ్మిదో తరగతి చదువుతున్నట్లు తెలిసింది. (చదవండి: మహిళా సర్పంచ్‌కు వరకట్న వేధింపులు) -
షాకింగ్ వీడియో.. వ్యక్తిని లాగేసిన స్విమ్మింగ్‌పూల్ సింక్‌హోల్!
జెరుసలేం: ఓ ఇంట్లో నిర్వహించిన పార్టీ విషాదాంతంగా మారింది. ఆనందంగా గడుపుతున్న బంధువులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతుండగా ఒక్కసారిగా మధ్యలో సింక్‌హోల్ ఏర్పడింది. పూల్‌లోని నీరు వేగంగా సింక్‌హోల్‌లోకి వెళ్లగా.. ఓ వ్యక్తి అందులో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి అతడిని కాపాడే ప్రయత్నం చేసినా భయంతో వెనక్కి వెళ్లాడు. బాధితుడు సుమారు 43 అడుగుల లోతైన గుంతలో పడిపోయినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తిని సింక్‌హోల్ లాక్కెళుతున్న షాకింగ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సంఘటన ఇజ్రాయెల్‌లోని కర్మీ యోసెఫ్ నగరంలో గురువారం జరిగింది. సింక్‌హోల్ తెరుచుకున్న ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. మృతుడు 30 ఏళ్ల కిమ్హీగా పోలీసులు గుర్తించారు. అతడిని కాపాడేందుకు యత్నించిన 34 ఏళ్ల వ్యక్తికి స్వల్పగాయాలైనట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో స్విమ్మింగ్ పూల్‌లో మొత్తం ఆరుగురు ఉన్నారు. అయితే.. మిగిలిన వారు ప్రమాదాన్ని గుర్తించటం వల్ల ఎలాంటి హాని జరగలేదు. “One man has been injured and another is missing after a sinkhole opened up in a inground pool at a home in central Israel. The incident occurred during a pool party." pic.twitter.com/S9cByAFebx — natureismetal (@NIMactual) July 21, 2022 నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయేందుకు కారణమైన ఆ విల్లా యజమానులైన ఆరవై ఏళ్ల దంపతులను హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఐదురోజుల తర్వాత కోర్టు ఆదేశాల మేరకు విడుదల చేయనున్నట్లు చెప్పారు. వృద్ధ దంపతులు తమ ఇంట్లో గురువారం పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి సుమారు 50 మంది వరకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆరుగురు స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతూ సరదాగా గడిపారు. అయితే.. ఒక్కసారిగా పూల్ మధ్యలో భారీ గొయ్యి ఏర్పడటం వల్ల వారు గమనించలేకపోయారని పోలీసులు తెలిపారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే స్విమ్మింగ్ పూల్ నిర్మించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: డ్రైవర్ తప్పిదం.. వరదలో చిక్కుకున్న స్కూల్ బస్సు 24 మంది విద్యార్థులు..