కార్ వాష్‌ ఇలా చేస్తారా..? | Watch, Pics of car submerged in hotel pool in Florida go viral | Sakshi
Sakshi News home page

కార్ వాష్‌ ఇలా చేస్తారా..?

Published Wed, Jan 8 2020 3:31 PM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM

ఫ్లోరిడా : స్విమ్మింగ్‌ పూల్‌లో కారు మునిగిన ఫోటోలు ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అయ్యాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం సదరు కారు డ్రైవర్‌ అనుకోకుండా ఫ్లోరిడా హోటల్‌లోని స్విమ్మింగ్‌పూల్‌లోకి కారును వెనక్కి తీసుకున్నాడు. దీంతో వాహనం స్విమ్మింగ్‌ పూల్‌లో పూర్తిగా నీట మునిగింది. కారు నుంచి ప్రయాణీకుడు, డ్రైవర్‌ సురక్షితంగా బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు. వెస్ట్‌పామ్‌ పోలీసులు తమ ఫేస్‌బుక్‌ పేజీలో హాలిడేఇన్‌ ఎక్స్‌ప్రెస్‌ హోటల్‌ స్విమ్మింగ్‌పూల్‌లో మునిగిన కారు ఫోటోను షేర్‌ చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. వైరల్‌గా మారిన ఈ ఫోటోలపై నెటిజన్లు తలోరకంగా స్పందించారు. కార్‌పూలింగ్‌కు వినూత్న నిర్వచనం ఇచ్చారని ఓ ఫేస్‌బుక్‌ యూజర్‌ కామెంట్‌ చేయగా, మరికొందరు పూల్‌సైడ్‌ పార్కింగ్‌కు ఇదే సరైన నిర్వచనమని వ్యాఖ్యానించారు. కార్‌వాష్‌కు వెళ్లారని మరో యూజర్‌ కామెంట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement