Submerge
-
Amaravati: ఇదీ.. అమరావతి రాజధాని అసలు కథ
సాక్షి, విజయవాడ: ఈ ఫోటోలు చూశారా? అమరావతికి అన్యాయమంటూ చంద్రబాబు చెప్పినప్పుడు గానీ, ఆయన అనుకూల మీడియా గానీ ఇలాంటి ఫోటోలు ఎప్పుడూ ప్రచురించవు. ఇప్పటిదాకా అక్కడ నిర్మించిన హైకోర్టు భవనమో, సచివాలయ, అసెంబ్లీ భవనాలనో మాత్రమే చూపిస్తాయి. కానీ ఇక్కడి ప్లాను గానీ, కట్టడాలు గానీ ఎంత దారుణమో తొలి చినుకుకే చిల్లులు పడ్డ అసెంబ్లీ భవనం, పైకప్పు నుంచి నీళ్లు కారే సచివాలయ ఛాంబర్లు చెప్పేశాయి. ఇక అమరావతి ఏ స్థాయిలో ఉంటుందో వర్షం పడ్డ ప్రతిసారీ కళ్లకు కడుతూనే ఉంటుంది. తాజాగా మూడు రోజుల కిందటి వరకూ వర్షాలు పడ్డాయి. అప్పట్లో అక్కడికి వెళ్లే పరిస్థితే లేదు. మూడు రోజుల తరవాత మంగళవారం అక్కడి పరిస్థితికి అద్దం పట్టే చిత్రాలివిగో... ఇది చెరువు కాదు. పొలమూ కాదు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్లే 100 అడుగుల రోడ్డు.. వర్షం పడ్డ మూడు రోజుల తరవాత కూడా నడుంలోతు నీళ్లలో మునిగే స్థితిలో ఉందీ రోడ్డు. వాహనాల సంగతి సరే. కనీసం నడిచి కూడా వెళ్లలేని పరిస్థితి. ఇది రాజధాని కోర్ ఏరియాలోని నీరుకొండ గ్రామం. రోడ్డుకు అటూ ఇటూ ఉన్నవి ప్రస్తుతానికి పొలాలు. వివిధ నిర్మాణాలు రావాల్సిన స్థలాలవి. కానీ అవి చెరువుల్ని మించిపోయాయి. ఆ రోడ్డుపై వెళ్లటమే దుస్సాధ్యంగా మారిందిప్పుడు. నీరు కొండ గ్రామంలో అటూ ఇటూ ఉన్నవారు మెయిన్ రోడ్డుకు చేరుకునే ప్రాంతం మొత్తం చెరువును మించిపోయింది. దాంతో రోడ్డుమీదకు రావటానికి ఇలా పాట్లు పడక తప్పటం లేదు. (క్లిక్ చేయండి: అమరావతి యాత్రలో.. ప్రాణం కాపాడిన పోలీస్) -
నడుంలోతు నీళ్లు, అయినా మేం ఎక్కడకీ వెళ్లం!
సాక్షి, విజయవాడ: రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణమ ఉగ్రం రూపం దాల్చింది. విపరీతంగా కృష్ణనదిలోకి నీరు చేరడంతో ప్రజలు వణికిపోతున్నారు. వరదనీరు పోటెత్తడంతో జనజీవానం అతలాకుతలం అవుతోంది. అధిక వర్షాల కారణంగా కృష్ణలంక లోతట్టు ప్రాంతం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. భూపేష్ గుప్తా నగర్లోకి నడుం లోతు నీరు చేరుకుంది. దీంతో అక్కడ ఉన్నవారిని ముంపు పునరావాస కేంద్రాలకు తరలించాడనికి అధికారులు ప్రత్నిస్తున్నారు. అయితే దొంగల భయంతో వారు తమ ఇళ్లను విడిచి వచ్చేందుకు ఇష్టం పడటం లేదు. వీరంతా గట్టుమీద గుడారాలు ఏర్పాటు చేసుకొని తలదాచుకుంటున్నారు. ట్యూబుల సహాయంతో ఇళ్ల నుంచి సామాన్లు తరలిస్తున్నారు. కరుణించి కాపాడమంటూ కృష్ణమ్మను వేడుకుంటున్నారు. ఈ ప్రాంతంలో సహాయక చర్యలు అందిస్తున్నామని అధికారులు తెలిపారు. చదవండి: యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ -
కార్ వాష్ ఇలా చేస్తారా..?
-
కార్ వాష్ ఇలా చేస్తారా..?
ఫ్లోరిడా : స్విమ్మింగ్ పూల్‌లో కారు మునిగిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం సదరు కారు డ్రైవర్ అనుకోకుండా ఫ్లోరిడా హోటల్లోని స్విమ్మింగ్‌పూల్‌లోకి కారును వెనక్కి తీసుకున్నాడు. దీంతో వాహనం స్విమ్మింగ్ పూల్‌లో పూర్తిగా నీట మునిగింది. కారు నుంచి ప్రయాణీకుడు, డ్రైవర్ సురక్షితంగా బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు. వెస్ట్‌పామ్ పోలీసులు తమ ఫేస్బుక్ పేజీలో హాలిడేఇన్ ఎక్స్‌ప్రెస్ హోటల్ స్విమ్మింగ్‌పూల్‌లో మునిగిన కారు ఫోటోను షేర్ చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. వైరల్‌గా మారిన ఈ ఫోటోలపై నెటిజన్లు తలోరకంగా స్పందించారు. కార్‌పూలింగ్‌కు వినూత్న నిర్వచనం ఇచ్చారని ఓ ఫేస్బుక్ యూజర్ కామెంట్ చేయగా, మరికొందరు పూల్‌సైడ్ పార్కింగ్‌కు ఇదే సరైన నిర్వచనమని వ్యాఖ్యానించారు. కార్వాష్కు వెళ్లారని మరో యూజర్ కామెంట్ చేశారు. -
నేవీ అమ్ములపొదిలోకి డీఎస్ఆర్వీ
ముంబై: భారత నావికాదళం అమ్ములపొదిలోకి మొట్టమొదటి జలాంతర్గామి సంరక్షణ వాహ నం వచ్చి చేరింది. ‘డీప్ సబ్‌మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ (డీఎస్ఆర్వీ)’గా వ్యవహరించే ఈ వాహనం పాడైపోయిన జలాంతర్గామి, అందులోని సిబ్బందిని రక్షించడంతోపాటు రహస్య మిషన్లను సైతం సమర్థవంతంగా నిర్వహించగలదు. అతి త్వరలోనే ఇలాంటి మరో వాహనం నేవీలో చేరనుందని, అది విశాఖపట్నంలోని నావల్ బేస్ ఆధారంగా పనిచేయనుంది. ఈ రెండు వాహనాలు హిందూ మహాసముద్ర ప్రాంతంతోపాటు అవతల కూడా తన విధులు నిర్వహిస్తాయి. ఐఎన్ఎస్ సబర్మతి నౌకపై మోహరించిన ఈ డీఎస్ఆర్వీ ముంబై కేంద్రంగా పనిచేయనుంది. దీనిని స్కాట్లాండ్లోని జేఎఫ్‌డీ సంస్థ తయారు చేసింది. -
ముంపునకు గురవుతున్న పంటలు
భారీగా నష్టపోతున్నామని రైతుల మొర బషీరాబాద్: కష్టపడి పండించిన పంటలు నీట మునగడంతో నష్టపోతున్నామని మంగళవారం గిరిజన రైతులు అధికారులకు మొర పెట్టుకున్నారు. మండలంలోని కుప్పన్‌కోట్ గ్రామానికి చెందిన గోవిందప్ప, హీర్యానాయక్, మున్యానాయక్, శివ్యానాయక్ల తదితర రైతులు మండల కార్యాలయాల్లో ఉన్న అధికారులను కలిశారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ప్రమీలకు వినతిపత్రం సమర్పించారు. సర్వే నంబర్ 30లో ఉన్న 14.39 ఎకరాల పట్టా భూమిలో పండిస్తున్న పెసర, కంది పంటలు కుంటలో నిలిచిన నీటి కారణంగా ముంపునకు గురయ్యాయని అధికారుల ఎదుట మొరపెట్టుకున్నారు. ఏపుగా పెరిగిన పంటలు కళ్లెదుటే ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సంబంధం లేదని ఎంపీడీఓ రైతులకు తెలిపారు. అనంతరం రైతులు తహసీల్దార్ తులసీరాంను కలిశారు. రైతులు తమ గోడును వినిపించారు. కుంటలు చెరువులు ఉన్న చోట్ల పంటలు వేయవద్దని, చెరువుల్లో నీరు లేనప్పుడే పంటలను సాగు చేయాలని తహసీల్దార్ రైతులకు చెప్పారు. తమ పంటలను పరిహారం అందించాలని రైతులు కోరడంతో.. వర్షాకాలంలో పంటలు వేసుకోవద్దని తెలిసిన ఎందుకు వేసుకున్నారని ప్రశ్నించారు. కుంటలో ఉన్న నీటిని తోడేసి పంటలను కాపాడుకుంటామని రైతులు అడిగారు. కుంటలో ఉన్న నీటిని తొలగిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రైతులకు చెప్పారు.