సాక్షి, విజయవాడ: ఈ ఫోటోలు చూశారా? అమరావతికి అన్యాయమంటూ చంద్రబాబు చెప్పినప్పుడు గానీ, ఆయన అనుకూల మీడియా గానీ ఇలాంటి ఫోటోలు ఎప్పుడూ ప్రచురించవు. ఇప్పటిదాకా అక్కడ నిర్మించిన హైకోర్టు భవనమో, సచివాలయ, అసెంబ్లీ భవనాలనో మాత్రమే చూపిస్తాయి. కానీ ఇక్కడి ప్లాను గానీ, కట్టడాలు గానీ ఎంత దారుణమో తొలి చినుకుకే చిల్లులు పడ్డ అసెంబ్లీ భవనం, పైకప్పు నుంచి నీళ్లు కారే సచివాలయ ఛాంబర్లు చెప్పేశాయి.
ఇక అమరావతి ఏ స్థాయిలో ఉంటుందో వర్షం పడ్డ ప్రతిసారీ కళ్లకు కడుతూనే ఉంటుంది. తాజాగా మూడు రోజుల కిందటి వరకూ వర్షాలు పడ్డాయి. అప్పట్లో అక్కడికి వెళ్లే పరిస్థితే లేదు. మూడు రోజుల తరవాత మంగళవారం అక్కడి పరిస్థితికి అద్దం పట్టే చిత్రాలివిగో...
ఇది చెరువు కాదు. పొలమూ కాదు. ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి వెళ్లే 100 అడుగుల రోడ్డు.. వర్షం పడ్డ మూడు రోజుల తరవాత కూడా నడుంలోతు నీళ్లలో మునిగే స్థితిలో ఉందీ రోడ్డు. వాహనాల సంగతి సరే. కనీసం నడిచి కూడా వెళ్లలేని పరిస్థితి.
ఇది రాజధాని కోర్ ఏరియాలోని నీరుకొండ గ్రామం. రోడ్డుకు అటూ ఇటూ ఉన్నవి ప్రస్తుతానికి పొలాలు. వివిధ నిర్మాణాలు రావాల్సిన స్థలాలవి. కానీ అవి చెరువుల్ని మించిపోయాయి. ఆ రోడ్డుపై వెళ్లటమే దుస్సాధ్యంగా మారిందిప్పుడు.
నీరు కొండ గ్రామంలో అటూ ఇటూ ఉన్నవారు మెయిన్ రోడ్డుకు చేరుకునే ప్రాంతం మొత్తం చెరువును మించిపోయింది. దాంతో రోడ్డుమీదకు రావటానికి ఇలా పాట్లు పడక తప్పటం లేదు. (క్లిక్ చేయండి: అమరావతి యాత్రలో.. ప్రాణం కాపాడిన పోలీస్)
Comments
Please login to add a commentAdd a comment