Capital Amaravathi
-
ఏపీ కూటమి: ఉత్తరాంధ్రలో ఒకలా.. బెజవాడలో మరోలా!
సాక్షి, అమరావతి: ఏ ఎండకు ఆ గొడుగు!.. ఏ రోటికాడ ఆ రోటి పాట! ఏరు దాటాక తెప్ప తగలేయడమే తన ఆనవాయితీ అని టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి మరోసారి విస్పష్టంగా చెప్పింది! ప్రజాక్షేత్రంలో మరోసారి ఘోర పరాజయం ఖాయమని నిర్ధారణకు రావడంతో ఉనికి కోసం ఒక్కో ప్రాంతంలో ఒక్కో డ్రామాలాడుతోంది. రాజధానిపై బుధవారం దినపత్రికల్లో కూటమి ఇచ్చిన ప్రకటనలే ఇందుకు తార్కాణం. ప్రజలను మభ్యపుచ్చి ఓట్లు పొందేందుకు రాజధానిపై ప్రాంతాల వారీగా రెండు రకాల ప్రకటనలు ఇచ్చే స్థాయికి దిగజారింది. సాధ్యం కాదన్న బాలయ్య అల్లుడువిశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఎం.శ్రీభరత్ ఓట్ల కోసం విశాఖే రాజధాని గ్రోత్ ఇంజన్ అని పేర్కొన్నారు. అమరావతి రాజధాని కాదని స్పష్టం చేస్తూ.. అమరావతిని అభివృద్ధి చేయాలంటే చాలా పెట్టుబడి అవసరమని ఓ ప్రైవేట్ చానల్‌కు ఇచ్చిన ఇండర్వ్యూలో భరత్ తేల్చి చెప్పారు. అన్ని డబ్బులు వెచ్చించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు. అదే విశాఖ అయితే వేగంగా అభివృద్ధి చెందుతుందని, గ్రోత్ ఇంజన్ ఏమిటనేది చూడాలని వ్యాఖ్యానించారు. గ్రోత్ ఇంజన్ విశాఖతో రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందంటూ ఓట్ల కోసం రెండు నాలుకల ధోరణితో మాట్లాడారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ పాలనలో రాష్ట్ర అప్పులు మూడున్నర లక్షల కోట్ల రూపాయలకు చేరుకోగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో రూ.వేల కోట్లు పెట్టుబడి పెట్టే స్థితిలో లేదని భరత్ చెప్పారు. అమరావతి అనేది 20 సంవత్సరాల తరువాత మాట అని, అదే విశాఖ మనకు వెంటనే గ్రోత్ ఇంజన్ లాంటిదని బాలకృష్ణ అల్లుడు భరత్ తెలిపారు. టీడీపీతో పాటు బీజేపీ, పవన్ అమరావతే రాజధాని అని చెబుతుండగా విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్న భరత్ మాత్రం విశాఖ రాజధాని గ్రోత్ ఇంజన్ అని పేర్కొనటాన్ని బట్టి కూటమి లక్ష్యం ప్రజలను మభ్యపుచ్చి ఓట్లు పొందడమేనని స్పష్టమవుతోంది. రెండు ప్రాంతాలు.. రెండు నాలుకలు!తాజాగా ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా విజయవాడ, విశాఖ ఎడిషన్లలో ఆయా ప్రాంతాల ప్రజలను మభ్యపుచ్చేలా కూటమి వేర్వేరు ప్రకటనలు ఇవ్వడం గమనార్హం. ఈమేరకు విజయవాడ, విశాఖలో ఈనాడు, హిందూ దినపత్రికల తొలి పేజీల్లో కూటమి ప్రచార ప్రకటనలు జారీ చేసింది. వీటిలో ప్రధాని మోదీతో పాటు బాబు, పవన్ ఫొటోలున్నాయి. విజయవాడ ఎడిషన్‌లో మన కలల రాజధాని అమరావతిని కాపాడుకోవడానికి అంటూ పత్రికల్లో ప్రకటన ఇవ్వగా విశాఖలో మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వికాసం కోసం అంటూ ముగ్గురి ఫొటోలతో ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఓ విధానం లేకుండా..జాతీయస్థాయిలో ఎనీడీఏ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న పార్టీలు రాజధాని విషయంలో ఒక విధానం లేకుండా ప్రాంతానికో రకంగా వ్యవహరించడం అంటే ఓటర్లను మోసం చేయడమేనని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఓటమి భయంతోనే ప్రాంతాలవారీగా మభ్యపెడుతున్నట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమరావతిని రాజధాని చేయాలంటే రూ.లక్షల కోట్లు అవసరమని, అంత ఖర్చు చేసినా చాలా ఏళ్లు పడుతుందని తొలి నుంచీ వైఎస్సార్సీపీ వాస్తవిక దృక్పథంతో చెబుతోంది. అదే విషయాన్ని ఇప్పుడు ఓట్ల కోసం భరత్ వల్లె వేయడం గమనార్హం. రాజధాని అమరావతి సాధ్యం కాదని పేర్కొనడం విశేషం. రాష్ట్రంలో విజయవాడ భాగమైనప్పటికీ ఉత్తరాంధ్ర ఎడిషన్లలో మాత్రం అమరావతి ప్రస్తావన లేకుండా ప్రచార ప్రకటనలు జారీ చేయటాన్ని బట్టి ఇదంతా ఓట్ల రాజకీయమేనని స్పష్టమవుతోంది. -
గ్రాఫిక్స్‌తో దొంగనాటకాలు ఆడింది చంద్రబాబు కాదా?: కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: రాష్ట్రానికి మేలు జరుగుతుంటే చంద్రబాబు ఓర్వలేడని మాజి మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప.. రాజధాని రైతులు ఏ త్యాగం చేశారని దుయ్యబట్టారు. ‘రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో సీఎం జగన్‌కు తెలుసు. ఏ రాజధానిలోనైనా 150 ఎకరాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలుంటాయి. మిగిలిన 99 శాతం ప్రైవేట్ ఆస్తులుగా ఉంటాయి. 33 వేల ఎకరాలు తీసుకున్న బాబు.. పిట్టలదొర కబుర్లు చేబుతున్నాడు. గ్రాఫిక్స్‌తో దొంగనాటకాలు ఆడింది చంద్రబాబు కాదా? అని మండిపడ్డారు. దేశంలో ఉన్న రాష్ట్ర రాజధానులన్నీ వందల ఏళ్ల క్రితం ఏర్పడి.. ఇప్పుడు మెగా సిటీలుగా మనకు దర్శనమిస్తున్నాయి. రాజధాని రైతులు ఏం త్యాగం చేశారు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప. మద్రాస్, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ కోల్కత్తా ఏ రాజధానిలో అయినా 150 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి. ప్రజల సమస్యలు నేరుగా పరిష్కారమయ్యే వ్యవస్థను క్రియేట్ చేసిన జగన్ గొప్పవాడా?. రాజధాని కడతానంటూ గ్రాఫిక్స్‌తో దొంగ నాటకాలు ఆడిన చంద్రబాబు గొప్పవాడా?. దేశంలో రాజధాని కట్టిన నేత ఎవరైనా ఉన్నారా?. ఒక్కడే రాజధాని కట్టడం అనేది సాధ్యం కాదు. 25 లక్షల జనాభా, పోర్టు, అన్ని రకాల హంగులు ఉన్న వైజాగ్‌లో ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన భూమి సేకరిస్తే మహానగరంగా అయ్యి తీరుతుంది. ... వైజాగ్‌ను వ్యాపార, వర్తక, వాణిజ్య రాజధానిగా అభివృద్ధి చేస్తే, వచ్చే సంపద ద్వారా పేద ప్రజలకు మరింత మేలు చేయొచ్చని సీఎం జగన్ ఆలోచిస్తున్నారు. ప్రజలకు మేలు చేస్తే సహించలేని చంద్రబాబు అండ్ కో ఇక్కడే రాజధాని ఉండాలని కోర్టులకు వెళ్లి స్టే తెచ్చారు. సీఎం జగన్ రెండు లక్షల 57వేల కోట్ల రూపాయలు, 120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజల ఖాతాల్లో వేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ వెయ్యి సార్లు బటన్ నొక్కి డబ్బంతా చంద్రబాబుకు చెందిన రాజదాని రైతులు ఖాతాల్లో జమ చేసేవారు. కోట్లాదిమంది ప్రజలు ఏమైపోయినా వారికి అనవసరం. నేనైతే సంపద సృష్టించే వాడిని, సీఎం జగన్‌కు అది చేత కావడం లేదని చంద్రబాబు అంటున్నాడు. సీఎం జగన్ రాజకీయ నాయకుడి కంటే కూడా.. ఓ సక్సెస్ఫుల్ బిజినెస్‌మాన్. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి సీఎం జగన్’అని కొడాలి అన్నారు. -
అమరావతి మాస్టర్ ప్లాన్ మార్పు కేసు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: అమరావతి మాస్టర్ ప్లాన్ మార్పులో అక్రమాల కేసుపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి నారాయణ సహకరించపోతే బెయిల్ రద్దు చేయాలని తమను ఆశ్రయించాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు ముందస్తు బెయిల్ తీర్పుతో దర్యాప్తుపై ప్రభావం పడకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. మాస్టర్ ప్లాన్ మార్పు కేసులో మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఈ కేసుపై జస్టిస్, గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్నం ధర్మాసనం విచారణ జరిపింది. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మౌఖిక ఆదేశాలతో మార్చారని ఏపీ ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. నారాయణ తన మంత్రి పదవిని దుర్వినియోగం చేశారన్నారు. తీవ్రమైన ఆర్థిక నేర కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని న్యాయవాది విజ్ఞప్తి చేశారు. చదవండి: రామోజీరావుపై ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన ఆరోపణలు -
Amaravati: ఇదీ.. అమరావతి రాజధాని అసలు కథ
సాక్షి, విజయవాడ: ఈ ఫోటోలు చూశారా? అమరావతికి అన్యాయమంటూ చంద్రబాబు చెప్పినప్పుడు గానీ, ఆయన అనుకూల మీడియా గానీ ఇలాంటి ఫోటోలు ఎప్పుడూ ప్రచురించవు. ఇప్పటిదాకా అక్కడ నిర్మించిన హైకోర్టు భవనమో, సచివాలయ, అసెంబ్లీ భవనాలనో మాత్రమే చూపిస్తాయి. కానీ ఇక్కడి ప్లాను గానీ, కట్టడాలు గానీ ఎంత దారుణమో తొలి చినుకుకే చిల్లులు పడ్డ అసెంబ్లీ భవనం, పైకప్పు నుంచి నీళ్లు కారే సచివాలయ ఛాంబర్లు చెప్పేశాయి. ఇక అమరావతి ఏ స్థాయిలో ఉంటుందో వర్షం పడ్డ ప్రతిసారీ కళ్లకు కడుతూనే ఉంటుంది. తాజాగా మూడు రోజుల కిందటి వరకూ వర్షాలు పడ్డాయి. అప్పట్లో అక్కడికి వెళ్లే పరిస్థితే లేదు. మూడు రోజుల తరవాత మంగళవారం అక్కడి పరిస్థితికి అద్దం పట్టే చిత్రాలివిగో... ఇది చెరువు కాదు. పొలమూ కాదు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్లే 100 అడుగుల రోడ్డు.. వర్షం పడ్డ మూడు రోజుల తరవాత కూడా నడుంలోతు నీళ్లలో మునిగే స్థితిలో ఉందీ రోడ్డు. వాహనాల సంగతి సరే. కనీసం నడిచి కూడా వెళ్లలేని పరిస్థితి. ఇది రాజధాని కోర్ ఏరియాలోని నీరుకొండ గ్రామం. రోడ్డుకు అటూ ఇటూ ఉన్నవి ప్రస్తుతానికి పొలాలు. వివిధ నిర్మాణాలు రావాల్సిన స్థలాలవి. కానీ అవి చెరువుల్ని మించిపోయాయి. ఆ రోడ్డుపై వెళ్లటమే దుస్సాధ్యంగా మారిందిప్పుడు. నీరు కొండ గ్రామంలో అటూ ఇటూ ఉన్నవారు మెయిన్ రోడ్డుకు చేరుకునే ప్రాంతం మొత్తం చెరువును మించిపోయింది. దాంతో రోడ్డుమీదకు రావటానికి ఇలా పాట్లు పడక తప్పటం లేదు. (క్లిక్ చేయండి: అమరావతి యాత్రలో.. ప్రాణం కాపాడిన పోలీస్) -
‘చందాలు దండుకునేందుకే అమరావతి పేరుతో యాత్రలు’
తాడికొండ: అమరావతి పేరుతో చందాలు దండుకునేందుకు కులవాదులు యాత్రలు చేయడం సిగ్గుచేటని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 689వ రోజు రిలే నిరాహార దీక్షలకు బుధవారం పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు అవినీతిని కప్పిపెట్టి, ప్రజలను మభ్యపెట్టేందుకే రాష్ట్రంలోని ఓ సామాజికవర్గం ఈ పాదయాత్రలు చేస్తోందని దుయ్యబట్టారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు రాష్ట్రమంతా తిరిగి చందాలు వసూలు చేసుకుంటూ ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉంటూ వీరు చేస్తున్న ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. పేదల సమస్యలను పక్కన పెట్టిన రాజకీయ పార్టీలు అమరావతి చుట్టూ చక్కర్లు కొడుతూ చంద్రబాబు అవినీతిని కాపాడేందుకు పాట్లు పడుతుండటాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. ఎల్లో మీడియాలో తమ ఉద్యమాన్ని చూపనప్పటికీ.. బహుజన హక్కుల కోసం పోరాడుతున్న తమకు, మూడు రాజధానులకు ప్రజా మద్దతు ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాదిగాని గురునాథం, బేతపూడి సాంబయ్య, బొలిమేర శ్యామ్యూల్, ఇంటూరి రాజు పలువురు దళిత నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఇదీ చదవండి: అమరావతిపై ‘డబ్బుల్’ గేమ్! -
రాజధానిపై ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
-
పెత్తందారీ పొలికేక
అన్నిభాషల్లో కూడా కొన్ని పదాలకు ఒక క్యారెక్టర్ స్థిర పడిపోయి ఉంటుంది. కొన్ని పదాల్లో హీరోయిజం కన బడుతుంది. కొన్ని పదాలు విలనిజాన్ని ప్రదర్శిస్తాయి. మరికొన్ని మాటల్లో శక్తిమంతుడైన ఒక సాఫ్ట్ విలన్ కనిపిస్తాడు. ఇంగ్లీష్ మాట ‘హెజెమొనీ’ (Hegemony) దీనికి మంచి ఉదాహరణ. తెలుగులో దీనికి సమానార్థకంగా ‘ఆధిపత్యం’ అనే మాటను ఉపయోగిస్తున్నాం. ఆధిపత్యం శ్రుతిమించినపుడు కొండొకచో... పెత్తందారీతనం అనే మాటను కూడా ఆశ్రయిస్తున్నాం. అనేక దేశాలున్న ప్రపంచంలో కొన్ని దేశాల ఆధిపత్యం, భిన్న వర్గాలతో కూడిన సమాజంలో ఒకటి, రెండు వర్గాల ఆధిపత్యం సమ్మతమేనా? అటువంటి సమ్మతి స్వచ్ఛందంగా వస్తుందా? లేక కండబలంతో, కత్తులు కటార్లతో, తుపాకీ తూటాలతో సాధిస్తారా? ఆదియందు కండబలంతోనే ఆధిపత్యాన్ని ప్రోది చేసుకున్నప్పటికీ కాలక్రమంలో బుద్ధిబలం ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఈ విషయాన్ని తొలుత గుర్తించి సిద్ధాంతీకరించిన వ్యక్తి ఇటాలియన్ తత్త్వవేత్త ఆంటోనియో గ్రామ్సీ. యథేచ్ఛగా కార్మికుల శ్రమశక్తిని దోపిడీ చేస్తున్నప్పటికీ పశ్చిమ యూరప్ దేశాల్లో పెట్టుబడిదారీ విధానం స్థిరపడి పోవడానికి కారణాలను ఆయన అన్వేషించారు. ఆధిపత్య వర్గాలు ప్రవేశపెట్టిన నీతినియమాలు, సాంఘిక కట్టుబాట్లు, కథలూ, సామెతలు, సంప్రదాయాలన్నీ కలిసి ఒక ఆధిపత్య భావజాలం ఏర్పడుతుందని ఆయన గుర్తించారు. మనదేశంలో కర్మ సిద్ధాంతం ఈ భావజాలాన్ని బలంగా నిలబెట్టింది. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా?’ (కాపీరైట్: చంద్రబాబు) అనే వాక్యంలో ఎంత మహిళా విద్వేషం దాగి ఉన్నప్పటికీ చలామణి కావడానికి కారణం ఆధిపత్య భావజాల ప్రభావమే! ‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ (కాపీరైట్: చంద్రబాబు) అనే వాక్యం సామాజిక ఉన్మాదంలోంచి దూసుకొచ్చింది. సమాజంలో ఉన్న ఆధిపత్య భావజాలం కారణంగా ఇటువంటి అమానుష వ్యాఖ్యానాలన్నీ నిర్లజ్జగా ప్రవహిస్తూనే ఉన్నాయి. ప్రపంచంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులుగా ముందు కొచ్చిన కమ్యూనిస్టు, సోషలిస్టులు కూడా ఈ ఆధిపత్య భావజాలాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో ఆధిపత్య భావజాలం వల్ల అణచివేతకు గురవుతున్న వర్గాలు, ప్రాంతాల్లో ఒక చైతన్యం ప్రారంభమైంది. ఈ చైతన్యం అస్తిత్వ పోరాటాల రూపాన్ని, సాధికారత సాధన ఉద్యమాల రూపాన్ని తీసుకుంటున్నది. ఈ పరిణామాన్ని మనం ప్రపంచమంతటా చూడగలుగుతున్నాం. ఒకప్పటి మన ఉమ్మడి రాష్ట్రం, ప్రస్తుత తెలుగు రాష్ట్రాలు కూడా ఈ పరిణామానికి అతీతం కాదు. తెలుగువారి ఆధునిక చరిత్రను రెండున్నర కోస్తా జిల్లాల ఆధిపత్య వర్గ ప్రయోజనం, దాని భావజాలం చాలాకాలంగా ప్రభావితం చేస్తున్నది. పత్రికలు, పుస్తకాల ప్రచురణ, సినిమాలతో మొదలైన సాంస్కృతిక ఆధిపత్యం మొత్తం మీడియాను గుప్పెట్లోకి తీసుకునే దాకా నిరాటంకంగా సాగిపోయింది, సాగుతూనే ఉన్నది. ఆ రెండున్నర జిల్లాల తెలుగు యాసనే వారు ప్రామాణిక భాషగా స్థిరపరిచారు. మిగిలిన ఇరవై జిల్లాల వారు అంగీకరించక తప్పలేదు. ఎందుకంటే పాఠ్యపుస్తకాల దగ్గర నుంచి సమస్త గ్రంథాలు, పత్రికల ప్రచురణ మొత్తం వారి చేతుల్లోనే ఉన్నది. సినిమాల్లో, నవలల్లో... పనివాళ్లకూ, కమెడియన్లకూ మాత్రమే తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర యాస ఉండేది. వారితో మాట్లాడించి రెండున్నర జిల్లాల నాయికానాయకులు పడిపడి నవ్వేవారు. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర, హైదరాబాద్ పాతబస్తీలో, విశాఖ షిప్‌యార్డ్ సమీపంలో ఉండే దుర్మార్గులు, దుష్టులైన విలన్లకు రెండున్నర జిల్లాల కథానాయకులు తాట తీసే సన్నివేశాలను ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఒక వర్గపు ఆధిపత్య భావజాలం తెలుగునాట గజ్జెకట్టి నర్తించిన వైనాన్ని మొత్తంగా రాస్తే రామాయణ మంత! చెబితే భారతమంత!! అస్తిత్వ పోరాటాల యుగం ఇది. అణచివేతకు గురైనవారు సాధికారత శంఖం పూరిస్తున్న కాలం ఇది. ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా మొదలైన అస్తిత్వ పోరాటానికి రాజకీయ వేదిక తోడవటంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఇప్పుడు మిగిలిన ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం 1953–56 మధ్యకాలం నాటిది. ఈ సమయంలో రాష్ట్రానికి కర్నూలు రాజధాని. హైకోర్టు గుంటూరులో ఉండేది. మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి ముందు అన్ని ప్రాంతాల నేతల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధాని ఏర్పాటైంది. ‘విశాలాంధ్ర’ అనే ఉమ్మడి ప్రయోజనం కోసం 1956లో రాజధాని హోదాను కర్నూలు త్యాగం చేసింది. ఇప్పుడు విశాలాంధ్ర రద్దయిన నేపథ్యంలో పూర్వపు ఆంధ్రరాష్ట్రం పునరుత్థానమైంది. తాను గతంలో త్యాగం చేసిన హోదాను ఇప్పుడు కర్నూలు డిమాండ్ చేస్తే తప్పెట్లా అవుతుంది? ఆధిపత్య భావజాలం ఇప్పుడు అమరావతి రూపంతో అస్తిత్వ పోరాటాలకు, సాధికారత ఉద్యమాలకు ఒక సవాల్‌ను విసురుతున్నది. న్యాయబద్ధంగా పూర్వపు రాజధాని హోదా దక్కవలసిన కర్నూలుకు న్యాయరాజధాని హోదాను కూడా ఇవ్వడానికి వీలులేదని వాదిస్తున్నది. ఎందుకు వీల్లేదో హేతుబద్ధంగా వివరించడానికి అది నిరాకరిస్తున్నది. రాయలసీమ ప్రాంత అస్తిత్వ గౌరవాన్నీ, ఆత్మగౌరవ ఆకాంక్షనూ అది తృణీకరిస్తున్నది. రాజధాని మొత్తం ఒకేచోట... అదీ అమరావతిలోనే ఉండాలనే వితండవాదాన్ని ముందుకు తెచ్చింది. ఈ ఆధిపత్య భావజాలం రాష్ట్రంలోని అన్ని జెండాలనూ ఏకం చేసింది. ఆధిపత్య వర్గాలకు జెండాలు ఎన్ని ఉన్నా ఎజెండా ఒక్కటేనని నిన్నటి తిరుపతి సభ నిర్ద్వంద్వంగా నిరూపించింది. కమ్యూనిస్టు నారాయణుడు, కాషాయ లక్ష్మీనారాయణుడూ చేతులు కలిపి భుజం, భుజం కలిపి నిలబడిన దృశ్యం భేష్. ఈ రాష్ట్రంలో అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, సాధికారత కోసం ఎదురుచూస్తున్న కోట్లాది కష్టజీవుల కళ్లలో ఈ దృశ్యం ముద్రితమైంది. వారిక తుది నిర్ణయం తీసుకుంటారు. చిరకాలంగా మన మెదళ్లను ఆధిపత్య భావజాలం నియంత్రిస్తున్న కారణంగా, తన ప్రచార–ప్రసార సాధనాల ద్వారా మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తున్న కారణంగా రాజధాని విషయంలో తటస్థ మేధావుల ‘సమ్మతి’ని తనకు అనుకూలంగా ‘ఉత్పత్తి’ చేసే కార్యక్రమాన్ని ఆధిపత్య వర్గాలు చేపట్టాయి. ‘మ్యాన్యుఫ్యాక్చరింగ్ కన్సెంట్– ది పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ది మాస్ మీడియా’ పేరుతో సుప్రసిద్ధ అమెరికన్ మేధావి నోమ్ చోమ్స్కీ ఒక పుస్తకాన్నే రాశారు. ఇక్కడ మాస్ మీడియా ఉండేది... ఆధిపత్య వర్గం చేతుల్లోనే. తమకు అనుకూలమైన విధంగా ప్రజాభిప్రాయాన్ని మాస్ మీడియా ద్వారా ఎలా ఉత్పత్తి చేస్తారో చోమ్స్కీ ఈ పుస్తకంలో వివరించారు. ఆధిపత్య భావజాలాన్ని ప్రచారం చేసే మన మీడియా చోమ్స్కీ చెప్పిన పద్ధతులకు మరిన్ని ‘మెరుగులు’ దిద్ది, అధిక ‘ఉత్పత్తి’ని ఇప్పటికే సాధించింది. రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉండాలి కదా! మూడు చోట్ల ఎందుకు? ఒక్కచోటనే ఉంచి ఒక మహానగరాన్ని నిర్మించి నట్లయితే రాష్ట్రానికి ప్రయోజనం కదా? చంద్రబాబుకు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవం ఉన్నది కదా? ఆ అనుభవంతో ఇక్కడా అటువంటి నగరాన్ని నిర్మించలేరా? ఇటువంటి అభిప్రాయాలను ఉత్పత్తి చేసి ప్రజల మెదళ్ళలో జొప్పించడానికి ఆధిపత్య వర్గాలు శాయశక్తులా ప్రయ త్నిస్తున్నాయి. తటస్థులూ, బుద్ధిజీవులు, ఉద్యోగ–వ్యాపార, మధ్యతరగతి ప్రజలందరూ ఇక్కడొక రెండు విషయాలను గమనంలోకి తీసుకోవాలి. మొదటిది కర్నూలులో న్యాయరాజధాని సంగతి. ఇది అస్తిత్వ పోరాటాల యుగమని ముందుగానే చెప్పుకున్నాం. వెనకబాటుతనానికి గురైన రాయలసీమ ప్రాంతం తరఫున కర్నూలు పోటీలో నిలబడింది. గతంలో రాజధానిని త్యాగం చేసిన అనుభవంతో అర్హతల రీత్యా మొదటిస్థానంలో నిలబడి ఉన్నది. అటువంటి నగరానికి న్యాయ రాజధానినైనా కేటాయించకపోతే ఆ ప్రాంతంలో అసంతృప్తి రేకెత్తకుండా ఉంటుందా? ప్రాంతీయ ఆకాంక్షలను గుర్తించకుండా ఇప్పటికే భారీ మూల్యం చెల్లించిన సంగతిని విస్మరించడం సరైనదేనా? కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేసినట్లయితే ఈ రాష్ట్రానికి వచ్చే నష్టమేమిటో సహేతుకంగా ఎవరైనా చెప్పగలరా? హైకోర్టును ఏర్పాటు చేయవచ్చును గానీ, న్యాయ రాజధానిగా చెప్పడానికి వీల్లేదని బీజేపీ మరొక వింత వాదన లేవదీసింది. అలా అనడం ఆ ప్రాంత ఆత్మగౌరవాన్ని కించపరచడం కాదా? ఇక రెండో విషయం విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు గురించి! ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూడా అస్తిత్వ సమస్య వెన్నాడుతున్నది. తరతరాలుగా వివక్షకు గురవుతన్నామన్న ఆవేదన ఈ ప్రాంతానికి ఉన్నది. పైగా ఇప్పుడు రాష్ట్రంలో అతిపెద్ద నగరం విశాఖ. వివిధ భాషలు, సంస్కృతులు, మతాల ప్రజలు కలిసి జీవించే కాస్మోపాలిటన్ నగరం. అమరావతి ప్రాంతంలో ఉన్నట్టుగా ఇల్లు అద్దెకు కావాలని వచ్చేవారిని కులం అడిగే సంప్రదాయం ఇక్కడ లేదు. అన్ని వర్గాల ప్రజలనూ అక్కున చేర్చుకునే స్వభావం. కొంత రాజకీయ సంకల్పం తోడైతే చాలు, తూర్పుతీరంలో ఒక మహానగరంగా అవతరించడానికి అనేక భౌగోళిక అనుకూలతలు ఉన్న నగరం. కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించి కొంత ఫోకస్ పెడితే రెండు మూడేళ్ళలోనే రాష్ట్ర ఆర్థిక రంగానికి ఆలంబనగా నిలబడగల అభివృద్ధి ఇంజన్‌గా విశాఖ అవతరించగలదు. విశాఖతో పోలిస్తే ఆర్థికంగా అందుబాటులోకి రాగల అవకాశాలు అమరావతిలో మృగ్యం. రోమ్ నగరం ఒక్క రోజులో నిర్మాణం కాలేదన్న నానుడిని గమనంలో ఉంచుకోవాలి. హైదరాబాద్ నగరానికి పునాది వేసినప్పుడు ఖులీ ఖుతుబ్షా, అల్లాను వేడుకున్నాడు. నీళ్లలో చేపల్ని కలిపినట్టు నగరం జన సమ్మర్దంతో నిండేలా చూసే భారాన్ని ఆయన అల్లా దయకే వదిలేశారు. భవనాలు నిర్మించినంత మాత్రాన జరిగేది ఏముండదనీ, జనం నివసించాలంటే అక్కడ ఉపాధి అవకాశాలు లభించే, ఆర్థిక కార్యక్రమాలు పెరగాలనే విచక్షణ గలవాడు కనుకనే ఖులీ... అల్లాను ప్రార్థించాడు. మలేషియాలో కొత్త రాజధానిగా పుత్రజయను నిర్మించినప్పటికీ ఆర్థిక భారాన్ని మోస్తున్నది ఇప్పటికీ కౌలాలంపూరే! హైకోర్టు ఒక చోట, అసెంబ్లీ మరోచోట ఉన్న రాష్ట్రాలు మనదేశంలోనే అరడజన్ దాకా ఉన్నాయి. ఇదేమీ కొత్త విషయం కాదు. అస్తిత్వ సమస్యను పరిష్కరించడానికీ, ఆర్థిక చోదకశక్తిని తయారుచేసుకోవడానికి కూడా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదిత మూడు రాజధానులు అత్యావశ్యకం. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినట్టుగా చంద్రబాబు అమరావతిని అభివృద్ధి చేస్తారనేది కూడా ఒక బోగస్ ప్రచారం. హైదరాబాద్ అభివృద్ధిని చంద్రబాబు ఖాతాలో వేయడం కూడా ఆధిపత్య వర్గాలు ‘ఉత్పత్తి’ చేసిన అభిప్రాయమే. హైదరాబాద్ వయసు 430 సంవత్సరాలు. పుట్టినప్పటి నుంచీ ఇది రాజధాని నగరమే. ప్రపంచంలోనే విలువైన వజ్రాలకూ, మేలి ముత్యాలకూ కేరాఫ్ అడ్రస్. కోహినూర్, జాకబ్ వజ్రాలను సానబట్టిన నగరం. దేశానికి స్వాతంత్య్రం రాక మునుపు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచినవాడు – హైదరాబాద్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్. చంద్రబాబు రాజకీయాల్లోకి రాకముందే డజన్‌కు పైగా భారీ ప్రభుత్వరంగ పరిశ్రమలు వెలసిన నగరం. మరో డజన్ రక్షణ, పరిశోధనా సంస్థలకు ఆవాసం. ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల కూడలి. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేసింది కూడా వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో! ఔటర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ ఖరారు, భూసేకరణ, నిర్మాణం వైఎస్సార్ హయంలోనే జరిగాయి. అలైన్మెంట్ ఖరారు సమయంలోనే కదా ఎల్లోమీడియా మొఘల్ రాజశేఖర్ రెడ్డిపై కత్తి కట్టింది?. కానీ ఇప్పుడు ఔటర్ రింగ్‌రోడ్డునూ, ఎయిర్‌పోర్టునూ చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. జనాన్ని పిచ్చివాళ్ళను చేయగల సామర్థ్యం ఆధిపత్య భావజాలానికి ఉన్నదని వారి గట్టి నమ్మకం. ఆ నమ్మకంతోనే వారు అమరావతి రూపంలో ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నారు. ఆ నమ్మకంతోనే ఇతర ప్రాంతాల అస్తిత్వ ఆకాంక్షలను అవహేళన చేస్తున్నారు. ఆ నమ్మకంతోనే నిరుపేదలకు, సామాన్యులకు, అమరావతిలో నివాసయోగ్యత లేదని న్యాయస్థానం దాకా వెళ్ళి అడ్డు కున్నారు. ఇప్పుడు ఆధిపత్య వర్గాల జెండాలన్నింటినీ ఏకం చేసి సామాన్య ప్రజల మీద వారి ఆకాంక్షల మీద యుద్ధాన్ని ప్రకటించారు. పెత్తందార్లంతా ఒక్కటై తిరుపతిలో పొలికేక పెట్టారు. సామాన్య ప్రజల సాధికార పోరాటశక్తిని వారు తక్కువగా అంచనా వేస్తున్నారు. ఒక సామాన్య మహిళ కణ్ణగి శపిస్తేనే మదురై నగరం దగ్ధమైందని ప్రాచీన తమిళ కావ్యం ‘శిలప్పదికారం’ మనకు బోధిస్తున్నది. అరడజన్ జెండాలు చూసి మురిసిపోతే భంగపాటు తప్పదు. అటువైపు ఐదుకోట్ల జనం. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
‘రాజకీయ లబ్ధికోసమే కొందరు ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు’
గుంటూరు: అసమానతలు తలెత్తకూడదనే అభివృద్ధి వికేంద్రీకరణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారని హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు.. ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. అమరావతి కూడా ఒక రాజధానిగా ఉంటుందని తెలిపారు. భవిష్యత్ తరాలకు అభివృద్ధి ఫలాలు లభించాలనే లక్ష్యంతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా విశాఖ, అమరావతి,కర్నూలు సహా.. రాష్ట్రంలోని అన్నిప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మేకతోటి సుచరిత తెలిపారు. రాజకీయ లబ్ధికోసమే కొందరు ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ఎయిడెడ్ స్కూల్స్ విషయంలో ఎవరిపైనా ఒత్తిడిలేదు: మంత్రి అవంతి -
అమరావతికి ఎంత ఖర్చుచేశారు?
సాక్షి, అమరావతి: అమరావతిలో రాజధాని నిర్మాణాల కోసం ఇప్పటివరకు ఎంత ఖర్చుచేశారు.. నిర్మాణాలన్నింటినీ ఆపేయడం వల్ల ఖజానాకు వాటిల్లిన నష్టం ఎంత.. తదితర వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని పిటిషనర్లకు హైకోర్టు స్పష్టంచేసింది. అమరావతిలో చేపట్టిన నిర్మాణాలన్నింటినీ మాస్టర్ ప్లాన్ ప్రకారం పూర్తిచేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలన్న అభ్యర్థనతోపాటు పలు ఇతర అభ్యర్థనలతో గతంలో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన త్రిసభ్య ధర్మాసనం, వాటిపై గురువారం మరోసారి విచారణ జరిపింది. నిర్మాణాలపై చేసిన వ్యయం ప్రజల డబ్బు అని.. అది దుర్వినియోగమైతే చూస్తూ ఉండలేమని వ్యాఖ్యానించింది. ఖజానాకు వాటిల్లిన నష్టానికి బాధ్యులెవరు.. దానిని ఎలా రాబట్టాలన్న విషయాలను తదుపరి విచారణల్లో తేలుస్తామని తేల్చిచెప్పి తదుపరి విచారణను ఈనెల 14కి వాయిదా వేసింది. రాజధాని తరలింపు వ్యవహారానికి సంబంధించిన అన్ని వ్యాజ్యాలను కూడా 14న విచారణకు రానున్న వ్యాజ్యాలతో జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. అనంతరం.. వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై గతంలో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలూ విచారణకు రాగా, బిల్లులు చట్టాలుగా మారాయని, అందువల్ల ఈ వ్యాజ్యాలు నిరర్థకమని అసెంబ్లీ సెక్రటరీ బాలకృష్ణమాచార్యుల తరఫు సీనియర్ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి తెలిపారు. అయితే, ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని 14న రానున్న వ్యాజ్యాలకు జతచేసింది. ఇలా మిగిలిన అన్ని వ్యాజ్యాలను కూడా 14వ తేదీ వ్యాజ్యాలకు జతచేస్తూ ఉత్తర్వులిచ్చింది. అయితే, నవరత్నాల ఇళ్ల పట్టాల వ్యాజ్యాలను మాత్రం వాటితో జతచేయలేదు. -
9వ రోజు రిలే దీక్షలు
-
రాజాధానిలో ధనవంతులు మాత్రమే ఉండాలా?
-
ఏపీ నష్టపోవాలన్నదే ఆయన ఆలోచన..!
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం కంటే పెన్షన్లు అదనంగానే ఇచ్చామని..7 లక్షల పింఛన్లు తొలగించామని టీడీపీ ప్రచారం చేయడం దారుణమన్నారు. ఆరు లక్షలకు పైగా కొత్త వారికి పెన్షన్లు మంజూరు చేశామని.. అనర్హుల జాబితా మరోసారి పరిశీలించి అర్హులైన వారికి పింఛన్లు ఇస్తామని వివరించారు. ప్రభుత్వంపై బురద చల్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. ఆయన కుతంత్రాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. ఏపీ అభివృద్ధి నిరోధకుడు చంద్రబాబు కియా పరిశ్రమ తరలిపోతుందనే టీడీపీ నేతల దుష్ప్రచారం పై మంత్రి బొత్స తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి ఇప్పుడు కొత్త డ్రామాలాడుతున్నారని నిప్పులు చెరిగారు. రోడ్డు మీద వెళ్లే వాళ్లకు సూటు,బూటు వేసి సమ్మిట్లు నిర్వహించారని.. రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా నష్టపోవాలన్నదే చంద్రబాబు ఆలోచన అని దుయ్యబట్టారు. రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఆయన దుర్మార్గపు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెట్టకూడదని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు అలా చెప్పటం దారుణం.. పార్లమెంటులో టీడీపీ ఎంపీలు అబద్ధాలు చెప్పటం దారుణమని.. మిలీనియం టవర్స్‌లో ఉన్న కంపెనీలను ఖాళీ చేయమని తాము నోటిసులు ఇవ్వలేదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ఎప్పుడైతే అసెంబ్లీ లో పెట్టామో... అప్పటి నుంచే ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు. తదుపరి కార్యక్రమాలన్నీ అడ్మినిస్ట్రేషన్ లో అంతర భాగాలేనని వివరించారు. రాజ్యాంగ పరంగానే జీవో లు ఇస్తున్నామని పేర్కొన్నారు. కోర్టులను గౌరవిస్తూనే కార్యక్రమాలు చేపడుతున్నామని.. ఉద్యోగులకు సమస్యలు ఉంటే తమతో చర్చిస్తారని వెల్లడించారు. ప్రజలు అదే కోరుకుంటున్నారు.. ‘ప్రజలందరూ రాజధాని త్వరగా తరలించాలని కోరుకుంటున్నారు. కార్యాలయం ఎక్కడ ఉండాలనేది ప్రభుత్వం ఇష్టం. గత ప్రభుత్వం నోటి మాట తో ముందుకు వెళ్ళింది. విజిలెన్స్ కార్యాలయం విజయవాడలో ఉండాలని చట్టం లో ఉందా?.. పరిపాలన సౌలభ్యం కోసమే విజిలెన్స్ కార్యాలయం తరలిస్తున్నామని’ బొత్స పేర్కొన్నారు. బలవంతపు భూ సేకరణ చేసిన భూములు వెనక్కి ఇవ్వమని రైతులు కోరారని.. రోడ్లు కింద పోయే భూములు వేరేచోట ఇవ్వమని రైతులు అడిగారని తెలిపారు. దీన్ని పరిశీలించమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారని మంత్రి బొత్స వెల్లడించారు. (చదవండి: కియాపై మాయాజాలం) -
పగటి వేషగాడు చంద్రబాబు: కొడాలి నాని
సాక్షి, గుడివాడ: రాజధాని పేరిట రైతుల నుంచి భూములను లాక్కునేందుకు చంద్రబాబు తన ప్రభుత్వంలో పగటి వేషగాడిలా సొల్లు మాటలను చెబుతూ వచ్చారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) విమర్శించారు. ఆదివారం ఆయన డోకిపర్రులోని వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కనుమూరి రామిరెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు సాధ్యమైనంత వరకు మేలు చేసేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. రాష్ట్రానికి రాజధానిని నిర్మించే విషయంలో దొంగల లాగా బాబు ప్రవర్తించారని పేర్కొన్నారు. 33వేల ఎకరాలను రైతుల నుంచి కొల్లగొట్టేందుకే మాయ మాటలు చెప్పారన్నారు. రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనా విధానం ఉందని కొడాలి నాని అన్నారు. షిప్ యార్డ్, రైలు, విమాన సౌకర్యాలు ఉన్న వైజాగ్‌ను ముంబాయిలా త్వరలో చూడనున్నామని అభిప్రాయపడ్డారు. రాయలసీమలో కోర్టులను ఏర్పాటు చేసి అభివృద్ధి చేయనున్నారని తెలిపారు. జీఎన్ రావు, బోస్టెన్ కమిటీలు ఇచ్చిన నివేదికలను బోగీ మంటల్లో వేయమని బాబు వ్యాఖ్యానించటం తగదన్నారు. ఆయన పాలనా విధానాలు నచ్చక రాష్ట్ర ప్రజలు బాబుకు బుద్ధి చెప్పిన మార్పు రాలేదని చెప్పారు. 74ఏళ్ల చరిత్ర కలిగిన బోస్టన్ కంపెనీ నివేదికను తప్పు బట్టే చంద్రబాబు ఎందుకు సింగపూర్ కంపెనీతో రూ.800కోట్లకు ఒప్పందం చేసుకున్నారని ప్రశ్నించారు. కరెన్సీ నోట్లు మారినపుడు ఆ కంపెనీ నివేదికకు బాబు ఎందుకు తలొగ్గారని అడిగారు. చదవండి: బాబు చూపిన రాజధాని గ్రాఫిక్స్ సాధ్యం కాదు : కొడాలి నాని ఇప్పటికైనా పిట్టల దొరలా రాజధాని రైతులకు దొంగ మాటలు చెప్పవద్దని హితవు పలికారు. రాజధాని రైతులు తమ కోర్కెలతో తమ ప్రభుత్వాన్ని కలిస్తే జగన్ మేలు చేకూరుస్తారని చెప్పారు. అంతేగాని బాబు మాటలు నమ్మి ఇంకా మోస పోవద్దన్నారు. టీడీపీకి చెందిన సుజనా చౌదరి బ్యాంకులను లూటీ చేయటంతో ఎక్కడ జైల్లో వేస్తారోనని బీజేపీలోకి వెళ్లాడని కొడాలి నాని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మెయిల్ డైరెక్టర్ పురిటిపాటి వీరారెడ్డి, కేడీసీసీబీ జిల్లా డైరెక్టర్ పడమటి సుజాత, వైఎస్సార్ సీపీ నేతలు కోగంటి ధనుంజయ, కనుమూరి రామిరెడ్డి, దుగ్గిరాల శేషుబాబు, అల్లూరి ఆంజనేయులు, కోటప్రోలు నాగు, శాయన రవి, బలుసు జితేంద్ర పాల్గొన్నారు. -
బాహుబలి కట్టడాలు కాదు..
సాక్షి, ఒంగోలు: రాష్ట్రానికి 30 ఏళ్లపాటు జగన్మోహన్రెడ్డే సీఎంగా ఉంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎస్వీబీసీ చైర్మన్ బి.పృథ్వీరాజ్ అన్నారు. ఆదివారం ఒంగోలులో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతి పరిస్థితులను కళ్లారా చూస్తే అక్కడ 5 సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేశారో అర్థం అవుతుందన్నారు. సీఎం కాన్వాయ్ వెళుతుంటే దారి పొడవునా ఉండే పోలీసులకు కనీసం అత్యవసరం అయితే టాయిలెట్‌కు వెళ్లేందుకు కూడా సౌకర్యాలు లేవన్నారు. బాహుబలి కట్టడాలంటూ సింగపూర్‌ను తలపిస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు కనీసం కార్లు పెట్టుకునేందుకు స్టాండ్లు సైతం లేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. చదవండి: పగటి వేషగాడు చంద్రబాబు: కొడాలి నాని రేకుల షెడ్లు నిర్మించి ఇంధ్రభవనాలను కట్టినట్లు ధర్నాలు చేయడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ఇప్పటివరకు కనీసం ఎలాంటి రాజకీయ సభలలోను పాల్గొనని భువనేశ్వరిని సైతం తీసుకువచ్చి ధర్నా చేపించడంతోపాటు చివరకు రెండు ప్లాటినం గాజులు అమరావతికి దానం చేసినట్లుగా పేర్కొనడం చూస్తుంటే రెండు గాజుల కథను తలపిస్తుందన్నారు. తాను తిరుపతి అలిపిరివద్ద రాష్ట్రవ్యాప్తంగా దర్శనానికి వచ్చే రైతులను పలకరిస్తే వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు భూమి పులకించిందని, మళ్లీ నేడు చూస్తున్నామని ఆనందం వ్యక్తం చేస్తుంటే చంద్రబాబు అండ్‌కోకు మాత్రం ఉక్రోషం, కడుపుమంట పెరిగిపోతున్నాయన్నారు. వేలాది ఎకరాలను ఇష్టం వచ్చినట్లుగా కొనుగోలు చేసి పేద రైతులను నిలువునా దగా చేసి నేడు రైతుల కోసం అంటూ ఉద్యమించడం దారుణం అన్నారు. అమరావతిలో ధర్నా చేస్తున్న వారిని చూస్తే ఆడి కార్లలో, ఖద్దరు దుస్తులు ధరించి చేతులకు బంగారు గాజులు ధరించి వస్తుంటే కార్పొరేట్ మాయాజాలం కాక, నిజమైన రైతులు చేస్తున్న ఉద్యమమేనా అని ప్రశ్నించారు. నిజంగా అమరావతి రాజధాని కావాలంటే దేశానికి రెండో రాజధాని కోసం కేంద్రం ఎదురుచూస్తుందని, అందుకు సంసిద్ధత వ్యక్తం చేయాలన్నారు. ఇందుకు అవసరమైతే తాను ఢిల్లీ వరకు పాదయాత్ర చేసేందుకు సైతం సిద్ధమన్నారు. కేవలం సామాజికవర్గ సామ్రాజ్యస్థాపన కోసం భూములు కొన్నారని, దేశ రెండో రాజధానికి సిద్ధపడితే బినామీల భూములకు నష్టం వాటిల్లుతుందనే భయమే వెనుకడుగుకు కారణం అంటూ విమర్శించారు. చెడు ప్రక్షాళన చేయడమే వైఎస్సార్ సీపీ లక్ష్యమన్నారు. గత ఐదేళ్లలో జనసేన ఎందుకు ప్రశ్నించలేదు? రైతుల మీద అంత ప్రేమే ఉంటే గత ఐదేళ్లలో రైతులను ఎందుకు పట్టించుకోలేదని జనసేన ఎందుకు ప్రశ్నించలేదని పృథ్వీ ప్రశ్నించారు. రైతులంటే అంత ప్రేమ ఉంటే కరకట్టమీద నివాసం ఉంటూ రోడ్లకోసం పచ్చనిపొలాలను నాశనం చేస్తున్నారంటూ రైతులు గగ్గోలు పెట్టినా ఎందుకు పట్టించుకోలేదన్నారు. గగ్గోలు పెట్టడం తెలుగుదేశం, జనసేన నైజంగా మారిందని, మసిపూసి మారేడు కాయ చేయడం చంద్రబాబు సహజలక్షణం అన్నారు. పరిపాలనా వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు ఏర్పాటు అని, అంతే తప్ప లక్షకోట్లు ఒకేచోట పెడితే మిగితా ప్రాంతాల అభివృద్ధి మాటేంటన్నారు. లక్షకోట్లు ఖర్చుపెట్టాలనడమే తప్ప ఖజానాలో చిల్లిగవ్వ లేకుండా ఎందుకు చేశారో ప్రజలు నిలదీయాలన్నారు. ఈ నెల 9న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానులకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేస్తారని, అంతే కాకుండా నాలుగైదు రోజుల్లో ప్రతి జిల్లా అభివృద్ధికి సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీల నివేదికలు కూడా వెల్లడిచేస్తారన్నారు. ప్రకాశం ప్రగతి పథంలోకి తీసుకువెళ్లడానికి తీసుకుంటున్న చర్యలు కూడా ప్రకటిస్తారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్‌తోపాటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా వైఎస్సార్ సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని, ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను పర్యటిస్తూ కార్యకర్తలకు అండగా నిలుస్తానని పేర్కొన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, గోవర్ధన్‌రెడ్డి, దాట్ల యశ్వంత్‌వర్మ, తోటపల్లి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
అమరావతి నుంచి రాజధాని మార్చనివ్వం
సాక్షి, అమరావతి బ్యూరో/తుళ్లూరు రూరల్/ మంగళగిరి: అమరావతి నుంచి రాజధానిని మార్వనివ్వబోమని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. మంగళగిరి మండలం యర్రబాలెం, తుళ్లూరు మండలం మందడంలో చేస్తున్న నిరసన ప్రదర్శనలకు చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి బుధవారం హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజధానిని మార్చాలని చూస్తే కాలి భస్మమవుతారని వ్యాఖ్యానించారు. రాజధాని వస్తుందంటే ప్రశాంత వాతావరణానికి ఎక్కడ భంగం వాటిల్లుతుందోనని విశాఖ ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. కులం పేరుతో రాజధాని మార్చాలని చూస్తే సహించేది లేదన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత తనదేనని, ఇక్కడ అలాంటి అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతోనే అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం వద్ద మొత్తం 55 వేల ఎకరాలున్నాయని, అన్ని నిర్మాణాలు పూర్తయిన తర్వాత 10 వేల ఎకరాలు మిగులుతుందని పేర్కొన్నారు. వాటిని విక్రయించి ఆ డబ్బులతో రాజధానిని అభివృద్ధి చేయొచ్చని చెప్పారు. నాతోనే సీఎం మైండ్ గేమ్ ఆడుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తనతోనే మైండ్ గేమ్ ఆడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగి ఉంటే చర్యలు తీసుకోవాలని కోరారు. పాలన వికేంద్రీకరణపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను తప్పుబట్టారు. జీఎన్ రావుకు ఏమీ తెలియదని, అలాంటి వ్యక్తి ఇచ్చిన నివేదిక ఆధారంగా పాలనను వికేంద్రీకరించాలనుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. తాను నిర్మించిన అసెంబ్లీలో జగన్ కూర్చొని తననే దూషిస్తున్నారన్నారు. సీఎంగా జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. జగన్ పాలనను చూసి పారిశ్రామికవేత్తలు భయపెడి పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్లిపోతున్నారని చెప్పారు. విశాఖలో ఆదాన్ గ్రూప్, ప్రకాశం జిల్లాలో పేపరు పరిశ్రమ, తిరుపతిలో రిలయన్స్ పరిశ్రమలు ఇప్పటికే వెనక్కి వెళ్లిపోయాయన్నారు. రాజధానిలో పవన్ కల్యాణ్ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ వచ్చే సమయంలో రోడ్లపై ఎవరూ ఉండకూడదా అని ప్రశ్నించారు. రైతులు గట్టిగా నిలబడితే జగన్ పులివెందులకు పారిపోతారన్నారు. రైతుల తరఫున ఎంతవరకైనా పోరాడతానని, అవసరమైతే జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. పోలీసులపై అక్కసు ‘పోలీసు అధికారులు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. మీరు ఉద్యోగం వదిలి వెళ్లినా నా నుంచి తప్పించుకోలేర’ని చంద్రబాబు బెదిరించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ కావాలనే తనను టార్గెట్ చేశారని, ఆయనను వదలమని హెచ్చరించారు. విరాళాలిచ్చి మరీ.. రాజధానిలో రైతులు చేస్తున్న పోరాటాలకు టీడీపీ తరఫున రూ.లక్ష విరాళం ఇస్తున్నట్లు మందడంలో ప్రకటించిన చంద్రబాబు.. యర్రబాలెంలో వ్యక్తిగతంగా రూ.50 వేల విరాళం ప్రకటించి తక్షణమే అందజేశారు. కృష్ణాయపాలెంలో మరో రూ.50 వేలను ఓ నాయకుడి తరపున ఇస్తున్నట్లు ప్రకటించారు. ముందెన్నడూ లేనివిధంగా ధర్నాలు, ఆందోళనలు చేయడానికి చంద్రబాబు విరాళాలు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఆందోళనల్ని ఉధృతం చేయాలని, దానికోసం ఎంత ఖర్చయినా పార్టీ నాయకులు భరిస్తారని చంద్రబాబు ప్రకటించడం స్థానికులతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే సందర్భంలో ఆయన సతీమణి భువనేశ్వరి సైతం తన వంతుగా బంగారు గాజులను విరాళంగా అందజేసి.. రాజధాని అమరావతి తరలిపోకుండా మరింత ధర్నాలు ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. -
రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకోదు
రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు. నేను ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి.. కేంద్ర ప్రభుత్వ ఆలోచన మేరకే చెబుతున్నా. జాతీయ అధికార ప్రతినిధిగా ఐదేళ్లలో నేను చెప్పిందేదీ మా పార్టీ కాదనలేదు. – జీవీఎల్ నరసింహారావు సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. ఇది పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా అధికారికంగా చెప్పే మాట అని పేర్కొన్నారు. ఇతర ఎంపీలు, నేతల ప్రకటనలు వారి వ్యక్తిగతం అని స్పష్టీకరించారు. దక్షిణాదిలో ఉండే ఐదు రాష్ట్రాలలో తానొక్కడినే పార్టీ అధికార ప్రతినిధినని, తాను చెప్పే విషయాలే అధికారికం అని అన్నారు. విజయవాడలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఇది (రాజధాని తరలింపు అంశం) కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదు. కేంద్రం జోక్యం చేసుకొని ఏదో చేయాలనే ఆలోచన ఉంటే.. అది మన వ్యవస్థకు లోబడి చేయడానికి విరుద్ధమైనది. దీనికే కట్టుబడి ఉన్నాం. నేను అధికారికంగా ఈ విషయం చెబుతున్నా. మీరు బాండ్ రాసివ్వమంటే ఆ అవసరం మాకు లేదు’ అని జీవీఎల్ అన్నారు. తమ పార్టీలో పార్లమెంట్లో సభ్యులు కాని వారు చాలా మంది ఈ విషయంలో ఏం మాట్లాడినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమేనన్నారు. రాజధాని తరలింపు గురించి రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం దృష్టికి తీసుకొస్తే అప్పుడు ఏదైనా సూచన చేయొచ్చేమో గానీ, కేంద్రం తనంతట తాను జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలోనే పెట్టండని నాడు కేంద్రం చెప్పిందా? పార్టీలో నేతలు ఒకే మాటపై లేరన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. టీడీపీలోనూ ఈ అంశంపై ఒక మాట మీద లేరు కదా అని ఆయన ప్రశ్నించారు. గంటా శ్రీనివాసరావు మరో రకంగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. అన్నదమ్ములు (చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లు) ఒక మాట మీద లేరన్నారు. అయినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒక స్పష్టమైన ప్రతిపాదనను వెల్లడించలేదని చెప్పారు. ‘వ్యవస్థలో తనకున్న అధికారాలకు లోబడే కేంద్రం పని చేస్తుంది. రాజధాని అమరావతిలోనే పెట్టండని అప్పుడు కేంద్రం చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి మార్చండని, మార్చ వద్దని చెప్పదు. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఎక్కడా చెప్పలేదు. రాజధాని తరలింపు జరిగితే రైతులకు న్యాయం జరగాలని ఒక పార్టీ నేతగా, వ్యక్తిగా చెబుతున్నానన్నారు. రైతులకు న్యాయం చేసే అంశం, రాజధాని తరలించకుండా కేంద్రం జోక్యం చేసుకునే అంశం.. రెండూ వేర్వేరు అని చెప్పారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, ఎన్పీఆర్ ప్రక్రియలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
రాజధాని గ్రామాల్లో బంద్ ప్రశాంతం
సాక్షి, అమరావతి బ్యూరో: అభివృద్ధి వికేంద్రీకరణ దృష్ట్యా రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొనడంతో రాజధాని అమరావతి ప్రాంతంలో ఆందోళన మొదలైంది. సీఎం తన ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు మండలాల పరిధిలోని 29 గ్రామాల ప్రజలు గురువారం బంద్ నిర్వహించారు. ఉదయాన్నే రోడ్లమీదకు వచ్చి పాఠశాలలు, వ్యాపార సంస్థలు, బ్యాంకులను మూసివేయించారు. సచివాలయం, హైకోర్టుకు వెళ్లే వాహనాలను అడ్డుకున్నారు. తుళ్లూరు, మందడంలో రైతులు రోడ్లపై బైఠాయించారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. బంద్ పాక్షికం రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చినా, కొన్ని గ్రామాల్లో ప్రజలు బంద్‌కు మద్దతునివ్వలేదు. తాడేపల్లి పరిధిలోని ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో బంద్ ప్రభావం కనిపించలేదు. మంగళగిరి పరిధిలోని యర్రబాలెం, నవలూరులోనూ బంద్ పాక్షికంగానే కొనసాగింది. తుళ్లూరు మండల పరిధిలోని వెంకటపాలెం, మందడం, తుళ్లూరులో మాత్రమే బంద్ సంపూర్ణంగా సాగింది. పాలన వికేంద్రీకరణపై రైతుల్లోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అమరావతిలో రాజధానిని టీడీపీ నాయకులు స్వలాభం కోసం ఉపయోగించుకున్నారు తప్పితే సామాన్యులెవరూ లబ్ధి పొందలేదని వారు పేర్కొంటున్నారు. రాజధాని గ్రామాల్లో బంద్ నేపథ్యంలో అనూహ్య సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్‌ను అమలు చేశారు. -
విమర్శలు ఆపి.. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి
-
ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వికేంద్రీకరణ దిశగా ఆలోచించి అడుగులు వేయాలని, ఇందులో భాగంగా మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని (ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్), కర్నూలులో హైకోర్టు (జ్యుడిషియల్ క్యాపిటల్), అమరావతిలో చట్ట సభలు (లెజిస్లేటివ్ క్యాపిటల్) ఏర్పాటు చేసేందుకు వీలుందన్నారు. రాజధానిపై ప్రతిష్టాత్మక సంస్థలతో వేసిన కమిటీ నివేదిక రాగానే ఈ అంశాలపై చర్చించి పిల్లల భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాజధానిపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా సీఎం ఈ మేరకు వివరించారు. ఇంకా సీఎం ఏమన్నారంటే.. రాజధాని ముసుగులో అంతా అవినీతే.. ‘గత ఐదేళ్లలో జరిగిన కుంభకోణాలు, మోసాలు, కుట్రలను మంత్రులు, సభ్యులు వివరించారు. స్కామ్‌ల గురించి ఆర్థిక మంత్రి బుగ్గన స్లయిడ్స్ కూడా చూపించారు. 2014 జూన్ నుంచి డిసెంబర్ వరకు కేవలం ఆరు నెలల కాలంలో 4,070 ఎకరాలను అప్పటి పాలకుల బినామీలు, బంధువులు ఏరకంగా తక్కువ రేటుకు కొన్నారు? ఎవరెవరు కొన్నారు? అనే అంశాలను పేర్లతో సహా ప్రదర్శించారు. రాజధాని పేరుతో జరిగిన స్కామ్‌లు, అన్యాయాలు, చట్టాల ఉల్లంఘనలను సభ్యులు ధర్మాన, గుడివాడ అమర్నాథ్, మంత్రులు బొత్స, బుగ్గన రాజేంద్రనాథ్ తదితరులు ఆధారాలతో సహా వివరించారు. చంద్రబాబు.. రాజధాని అని ఒక ప్రాంతాన్ని ఎంపిక చేశారు. అక్కడ ముందుగానే బినామీ పేర్లతో తక్కువ ధరతో భూములు కొన్నారు. తర్వాత అక్కడ రాజధాని అని ప్రకటించారు. ఆ తర్వాత ఆ భూముల రేట్లు పెంచుకునేందుకు ఏం చేశారో కూడా సభ్యులు వివరించారు. చదవండి: ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో లంచాలకు తావుండదు సాగు, తాగునీరు అందించడం ముఖ్యం కదా? ‘బొల్లాపల్లిలో రిజర్వాయర్ కట్టి.. తద్వారా రాయలసీమలోని బనకచర్లకు గోదావరి నీటిని తెచ్చే భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం రూ.55 వేల నుంచి రూ.60 వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనాతో ప్రాజెక్టు నివేదిక సిద్ధమైంది. ఈ ఏడాది భారీ వర్షాలు పడ్డా, వరదలు వచ్చినా రాయలసీమలో ప్రాజెక్టులు నిండలేదు. నీరు తీసుకెళ్లే కాలువల సామర్థ్యం సరిపోవడం లేదు. సహాయ పునరావాస ప్యాకేజీలు అమలు చేయలేదు. రాయలసీమలో ప్రాజెక్టుల కోసం రూ.23 వేల కోట్లు కావాలి. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీరివ్వాలి. రాష్ట్రంలో తాగడానికి స్వచ్ఛమైన మంచినీరు లేని పరిస్థితి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆక్వా వల్ల నీరు కలుషితమైంది. బోర్లు వేస్తే ఉప్పు నీరు వస్తోంది. పోలవరం, ధవళేశ్వరం నుంచి వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేసి, ప్రతి ఊరికి పైప్లైన్లు వేసి.. తాగు నీటిని తీసుకు రావాలంటే.. ఒక్కో జిల్లాకు రూ.4 వేల కోట్లు చొప్పున ఉభయ గోదావరి జిల్లాలకు రూ.8 వేల కోట్లు కావాలి. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా తాగు నీటి కోసం రూ.40 వేల కోట్లు కావాలి. స్కూళ్లు, ఆసుపత్రుల మాటేంటి? మరోవైపు నాడు–నేడు కార్యక్రమం కింద శిథిలావస్థలో ఉన్న స్కూళ్లు, ఆసుపత్రులు అభివృద్ధి చేస్తున్నాం. స్కూళ్లలో నీళ్లు, కరెంటు, ఫ్యాన్లు, ఫర్నీచర్ తదితర కనీస మౌలిక సదుపాయాలు లేవు. ఆసుపత్రుల్లో సెల్ఫోన్ల లైట్లలో ఆపరేషన్లు చేస్తున్నారు. ఎలుకలు కొరికి పిల్లలు చనిపోయిన దుస్థితి. ఈ పరిస్థితిలో స్కూళ్ల బాగు కోసం రూ.14 వేల కోట్లు, ఆస్పత్రుల బాగు కోసం రూ.16 వేల కోట్లు కలిపి ‘నాడు – నేడు’కు రూ.30 వేల కోట్లు కావాలి. ఇన్ని కార్యక్రమాలకు మన దగ్గర డబ్బులున్నాయా? ఇవన్నీ కాదని రాజధాని కోసం లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయగలమా అని ఆలోచించాలి. ప్రతి అడుగూ ఆలోచించి వేయాలి ఈ పరిస్థితుల్లో వేసే ప్రతి అడుగూ ఆలోచించి, ఆచితూచి వేయాల్సిన అవసరం ఉంది. దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయి. మనమూ మారాలి. సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చెప్పినట్టు వికేంద్రీకరణ అనేది ఉత్తమ నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ కు బహుశా మూడు క్యాపిటల్స్ వస్తాయేమో. ఇలా రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటువంటి ఆలోచనలు చేయడానికే పేరెన్నికగన్న నిపుణులతో, ప్రఖ్యాతి గాంచిన బీసీజీతో పాటు మరో కన్సల్టెన్సీని నియమించాం. ఈ సంస్థలు సుదీర్ఘంగా అన్ని విధాలా పరిశీలించి, పరిశోధించి నివేదిక వారం పది రోజుల్లో నివేదిక ఇవ్వనున్నాయి. అధికార వికేంద్రీకరణ దిశగా పలు సూచనలు, సలహాలు చేయనున్నాయి. నివేదిక ఫలానా విధంగా ఉండాలని మేమైతే చెప్పలేదు. ఈ నివేదికలు రాగానే పరిశీలించి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం తీసుకోవాలి. నేను ఈ అంశంలో స్పష్టత ఇచ్చినట్లే భావిస్తున్నా. ఇంత కంటే మంచి సలహా ఉంటే.. ఇస్తే తప్పకుండా తీసుకుంటాం’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. రూ.లక్ష కోట్లు ఎక్కడి నుంచి తేవాలి? రాజధానిలో కేవలం 20 కిలోమీటర్ల పరిధిలో కనీస మౌలిక సదుపాయాలకు రూ.1.09 లక్షల కోట్లు అవుతుందన్నది బాబు లెక్క. ఇలా నిర్మిస్తూ పోతే వడ్డీతో కలిపి ఇది రూ.3 లక్షల కోట్లో.. 4 లక్షల కోట్లో ఖర్చయ్యే పరిస్థితి ఉంది. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు అయిదేళ్లలో రూ.5,800 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇందులో రాజధాని బాండ్ల పేరుతో 10.35 శాతం వడ్డీకి కూడా అప్పు తెచ్చారు. ఈ అప్పులకు ఏటా రూ.700 కోట్లు వడ్డీ చెల్లించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు ఇన్నిన్ని వేల కోట్లు కావాలని లెక్కలున్నాయి. పలు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిలో రాజధాని నిర్మాణం కోసం అంటూ లక్ష కోట్ల రూపాయలకు పైగా ఎక్కడి నుంచి తేవాలి? ఈ పరిస్థితిలో రాజధానిలో కేవలం 20 కిలోమీటర్ల పరిధిలో రోడ్లు, కరంటు లాంటి పనుల కోసం రూ.లక్ష ఖర్చు పెట్టడం అవసరమా? ►గత ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిని డిసైడ్ చేశారు. ఆయన (చంద్రబాబు)లెక్క ప్రకారం 53 వేల ఎకరాల్లో రాజధాని కట్టాలంటే.. ఎకరాకు కనీస మౌలిక సదుపాయాల కోసం రూ.2 కోట్ల లెక్కన రూ.లక్షా ఆరు వేల కోట్లవుతుందని తేల్చారు. ఇది కనీస మౌలిక వసతుల ఏర్పాటుకు మాత్రమే. రాష్ట్రంలో ఇతరత్రా అభివృద్ధి పనులు, ఖర్చుల మాటేమిటి? ►రాజధాని కోసం లక్ష కోట్లకు పైగా ఎక్కడ నుంచి తేవాలి? అప్పు తెస్తే దానికి వడ్డీ ఎంత అవుతుంది? వడ్డీ అయినా కట్టే పరిస్థితిలో రాష్ట్రం ఉందా? నాకు కూడా రాజధాని కట్టాలనే ఉంది. కానీ లక్ష కోట్లు ఎక్కడ నుంచి తేవాలి? ఒకవేళ రూ. లక్ష కోట్లు తెచ్చినా దానిని ఎక్కడ ఖర్చు పెట్టాలని కూడా ఆలోచించాలి. ►ఈ పరిస్థితిలో వికేంద్రీకరణే మేలు. పెద్దగా ఖర్చు పెట్టకుండానే రాజధాని సమస్యలు కొలిక్కి వస్తాయి. విశాఖపట్నం ఇప్పటికే బాగా అభివృద్ధి చెందిన నగరం. అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా సరిపోతుంది. రోడ్లు కాస్త వెడల్పు చేసి, ఒక మెట్రో రైలు తీసుకొస్తే చాలు. అటు కర్నూల్లో జ్యుడిషియల్ క్యాపిటల్ ఉంటుంది. లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడే (అమరావతి) ఉంటుంది. – సీఎం వైఎస్ జగన్ చదవండి: పరిపాలనా రాజధానిగా విశాఖ సరైన నిర్ణయం -
ఏపీ రాజధానిలో మరో భూ కుంభకోణం
-
కాపిటల్ స్కామ్!
-
అర్థవంతమైన చర్చతోనే అసలైన రాజధాని
ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్లే వరద కన్నా పై నుంచి వచ్చే వరద ఎక్కువగా ఉన్నప్పుడు నీటి మట్టం పెరిగి లోతట్టు ప్రాంతాలు మునిగి పోవడం సహజం. ఈనాడు అదే జరిగి రాజధానిలో పల్లపు ప్రాంతాలు మునిగిపోయాయి. స్థల అనుకూలతను పరిగణలోకి తీసుకోకుండా అమరావతికి స్థల ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంత ప్రజలు ఈ నిర్ణయం మోసపూరితంగా తమ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా జరిగిందని గట్టిగా నమ్మారు. రాజధాని ఎంపికలో నిష్పాక్షికత లేనప్పుడు ప్రభుత్వానికి విశ్వసనీయత ఉండదు. ఆంగ్లో సాకసన్ దేశాలైన ఆస్ట్రేలియా, అమెరికాలాంటి దేశాలలో రాజధాని ఏర్పాటు భిన్న వర్గాల మధ్య సర్దుబాటు రాజీ ఫలితంగా ఏర్పడింది. చివరకు నిర్ణయం ఏ రకంగా ఉన్నా, ఈ అంశంపై ఒక అర్థవంతమైన చర్చ అవసరం అయితే ఎంతైనా ఉంది. ఈమధ్య కృష్ణానదిలో వచ్చిన వరదల తర్వాత రాజధాని ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలం సరి అయినదా కాదా అనే అంశంపై చర్చ మొదలైంది. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంతకన్నా పెద్ద వరద రాదనే నమ్మకం ఏమీ లేదని పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న భూ స్వభావాన్ని పట్టి ఇక్కడ నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ఈ మధ్య వచ్చిన వరదలలో అధికంగా 9 లక్షల క్యూసెక్కుల దాకా ప్రకాశం బ్యారేజ్ దగ్గర వదిలారు. 2009లో దాదాపు 11 లక్షల క్యూసెక్కుల దాకా ప్రవహించింది. ఇక మొన్నటి దాకా టీడీపీలో ఉన్న ఒక ముఖ్య నాయకుడు, ప్రస్తు్తతం బీజేపీ నాయకుడు అయిన టీజీ వెంకటేష్ రాష్ట్రానికి నాలుగు రాజధానులను నాలుగు ప్రాంతాలలో ఏర్పాటు చేయటానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వెంకటేష్ రాయలసీమకు చెందిన ఒక ముఖ్య నాయకుడు. సాధారణంగా రాయలసీమ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చి మాట్లాడుతుంటారు. రాజధాని స్థల ఎంపికను గురించి నా పుస్తకం ‘ఎవరి రాజధాని అమరావతి‘ లో విపులంగా చర్చించా. అందులో ఒక అంశాన్ని ఉటంకిస్తున్నాను. ‘ముందుగా అనుకూలతను అధ్యయనం చేయకుండానే సర్వే చేయకుండానే రాజధాని స్థలాన్ని నిర్ధారణ చేసిన ఏకైక ప్రాంతంగా అమరావతి చరిత్రలో నిలిచిపోతుంది‘. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలకు అనుగుణంగా ఏర్పాటుచేసిన శివరామకృష్ణన్ కమిటీ ఒక మహా నగర నిర్మాణ ప్రయత్నం ఆత్మహత్యా సదృశం అవుతుందని, అటువంటి ప్రయత్నాలు మానుకోవాలని చెపుతూ రాజధాని వికేంద్రీకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైన మార్గమని సూచించింది. ఈ సిఫార్సులను పూర్తిగా బేఖాతరు చేస్తూ ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది ఒడ్డున ఒక మహానగరాన్ని ఏర్పాటు చేయటానికి ప్రయత్నాలు ఆరంభించింది. ఆనాటి పురపాలక శాఖామాత్యులు నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తల కమిటీ ఎటువంటి సిఫార్సులు ఇవ్వలేదు. ఈ రకంగా స్థల అనుకూలతను పరిగణనలోకి తీసుకోకుండా అమరావతికి స్థల ఎంపిక చేయడం జరిగింది. ఆనాటి పాకిస్తాన్ అధ్యక్షులు అయూబ్ ఖాన్ దేశ రాజధానిని తన స్వస్థలమైన అబ్బోత్తాబాద్‌లో ఏర్పాటు చేయాలని సంకల్పించారు. స్థల నిర్ధారణ సమయంలో ఆ ప్రాంతం భూకంపాల ప్రభావిత ప్రాంతంగా గుర్తించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించి ఇస్లామాబాద్ రాజధానిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని ఎంపికకు కొంత చారిత్రక నేపథ్యం కూడా ఉంది. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ అంశంపై సుదీర్ఘమైన చర్చ జరిగి వివిధ ప్రాంతాల మధ్య రాజీ మార్గంగా ఏకాభిప్రాయంతో ఆనాడు రాజధానిని కర్నూలులో, హైకోర్టును గుంటూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి చర్చ ఏకాభిప్రాయం కోసం ప్రయత్నం లేకుండా వ్యూహాత్మకంగా విజయవాడ పరిసర ప్రాంతాలలో రాజధాని నిర్మాణానికి అసెంబ్లీ ఆమోదం తీసుకొని ముందు అనుకున్న విధంగా కృష్ణా నది తీర ప్రాంతంలో బాబు గారు రాజధానిని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంత ప్రజలు తమ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా జరిగిందని గట్టిగా నమ్మారు. అందుకనే 52మంది ఎమ్మెల్యేలు ఉన్న రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి కేవలం మూడు స్థానాలు మాత్రమే రావడం జరిగింది. ఆ ప్రాంత ప్రజలు రాజధాని ఎంపికలో తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు అని గట్టిగా భావించారు కాబట్టే అటువంటి ఫలితాలు రావడం జరిగింది. ఇదేరకమైన భావన ఉత్తరకోస్తా ప్రాంతాల్లో కూడా లేకపోలేదు. రాజధానులు వాటి నిర్మాణం గురించి కూలంకషంగా అధ్యయనం చేసి వాదిం రాస్మన్ ‘క్యాపిటల్ సిటీస్ వెరైటీస్ అండ్ పేట్రన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ రీ లొకేషన్ ‘అనే పుస్తకం రాశారు. దానిలో ఆయన రాజధాని ఎంపికలో నిష్పాక్షికత లేనప్పుడు ప్రభుత్వానికి విశ్వసనీయత ఉండదన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలకు రాజధానిలో సరైన ప్రాతినిధ్యం ఉందా? రాజధానిలో తమకు ఉనికి ఉందని వారు భావిస్తున్నారా? రాజధాని నుంచి వచ్చే ప్రయోజనాలు అన్ని ప్రాంతాలకు లభిస్తున్నాయా? అనేవి ముఖ్యమైన అంశాలని ఈ నిష్పాక్షికత అందరినీ కలుపుకుపోవడం అన్నదే ప్రభుత్వానికి న్యాయసమ్మతం ఇస్తుందని ఆయన పేర్కొన్నాడు. పైఅంశాలలో వేటినీ అమరావతి స్థల సమీకరణలో పాటించలేదనేది తేటతెల్లమవుతుంది. విజయవంతంగా నిర్వహించబడుతున్న రాజధానుల విషయంలో స్థల ఎంపిక విషయంలో ఎటువంటి ప్రక్రియను అనుసరించారో పరిశీలిద్దాం. ఆంగ్లో సాకసన్ దేశాలైన ఆస్ట్రే లియా, అమెరికాలాంటి దేశాలలో రాజధాని ఏర్పాటు భిన్న వర్గాల మధ్య సర్దుబాటు రాజీ ఫలితంగా ఏర్పడింది. ఈ దేశాలలో ఏర్పడిన రాజధానులు కేవలం పరిపాలన రాజధానులుగానే ఉన్నాయి. ఆ దేశాలలో ఆర్థిక కేంద్రాలుగా మహానగరాలుగా ఇతర నగరాలు అభివృద్ధి చెందాయి. రాజధానులుగా ఈ పట్టణాలు విజయవంతంగా నడవటానికి కారణం వీటి ఏర్పాటు వివిధ వర్గాలు ప్రాంతాల మధ్య సర్దుబాటు ఫలితంగా ఏర్పడటమే. ఇటువంటి విశాల విధానాన్ని అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసినప్పుడు అనుసరించలేదు. అటువంటప్పుడు ఈ అంశాన్ని పునఃపరిశీలించి అర్థవంతమైన చర్చ అనంతరం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చారిత్రకంగా జరిగిపోయింది కాబట్టి ఈ అంశాన్ని తిరగతోడడం సరికాదు అనేవాళ్ళు వినిపించే వాదనలు వేరే ఉన్నాయి. భూ సమీకరణ ద్వారా రైతుల భూములను తీసుకున్నారని, నిర్ణయంలో మార్పు వల్ల వాళ్లకు నష్టం జరుగుతుందని ఒక వాదన. ప్రభుత్వ ధనాన్ని చాలా ఖర్చు చేయడం జరిగిందని ఇప్పుడు ఈ అంశాన్ని పునః పరిశీలించటం సరికాకపోవచ్చని రెండవ వాదన. ఈ రెండు వాదనలు ఇక్కడ పరిశీలిద్దాం. భూ సమీకరణ కేవలం స్వచ్ఛందంగానే ఇవ్వలేదని చాలా వరకు ప్రభుత్వం బలవంతం చేయడం ద్వారా, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం ద్వారా, మభ్యపెట్టడం ద్వారా భూ సమీకరణ పూర్తి చేసిందని ఆ రోజుల్లోనే ఈ అంశాన్ని పరిశీలించిన కొందరు పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి వాస్తవాలను ప్రజలతో పంచుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. తీసుకున్న భూమిలో ప్రభుత్వానికి రిజిస్టర్ అయినది ఎంత, రైతుల చేతిలోనే ఉన్న భూమి ఎంత, ప్రభుత్వ అవసరాలకు కానీ, వివిధ సంస్థలకుగాని కేటాయించిన భూములు ఎంత, పనులు మొదలు పెట్టిన భూములు ఎంత అనే వివరాలు వెల్లడిస్తే ఈ అంశంపై అర్థవంతమైన చర్చ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాజధాని స్థల ఎంపికకు ముందు పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. కనుక ఆ అంశంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి సమాచారాన్ని ప్రజలతో పంచుకోవాలి. ఇక రెండో అంశం పెద్దఎత్తున ప్రభుత్వ నిధులు ఇక్కడ ఇప్పటికే వెచ్చించడం జరిగింది కాబట్టి ఈ సమయంలో రాజధాని తరలింపు చర్చ అర్థరహితం అనేది కొందరి వాదన. కానీ రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో నమూనాల పరిశీలన, నిర్ధారణ లోనే పుణ్యకాలం అంతా వెచ్చించింది. పెద్ద స్థాయిలో నిర్మాణ కార్యక్రమాలు కేవలం ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచే జరిగాయి. ఈ అంశంపై కూడా ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎంత స్థాయి లో ప్రభుత్వ నిధులు ఇప్పటికే వినియోగం అయినాయి. దానికి అను గుణంగా పూర్తయిన భవనాలు ఎన్ని? ఈ సమాచారం ఆధారంగా ఈ అంశంపై అర్థవంతమైన చర్చ జరిపే అవకాశం ఉంటుంది. చివరకు నిర్ణయం ఏ రకంగా ఉన్నా, ఈ అంశంపై ఒక అర్థవంతమైన చర్చ అవసరం అయితే ఎంతైనా ఉంది. ఆనాడు రాజధానికి స్థల సేకరణ సమయంలో ఈ అర్థవంతమైన చర్చ పూర్తిగా లోపిం చింది. అటువంటి చర్చ జరిగితే అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించే అవకాశం ఎంతైనా ఉంది. ఈనాడు రాజధానిని మార్చాలి అనే ప్రతిపాదన తుగ్లక్ ప్రతిపాదనగా వర్ణించే వారికి నా సమాధానం ఒక్కటే. తుగ్లక్ కొన్ని శతాబ్దాలుగా దేశ రాజధానిగా ఉన్న ఢిల్లీని మార్చటానికి ప్రయత్నించాడు. ఈనాడు ఇక్కడ జరుగుతున్న చర్చ ఏకపక్షంగా రాజధాని ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించాలని. దీనిని తుగ్లక్ చర్యతో పోల్చటం భావ్యం కాదు. పోల్చాలి అనుకుంటే బ్రిటిష్ ప్రభుత్వం రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి తరలించిన చర్యతో పోల్చవచ్చు. వ్యాసకర్త: ఐవైఆర్ కృష్ణారావు ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఈ–మెయిల్ : iyrk45@gmail.com -
రాజధాని భూములను ఎక్కడ తాకట్టు పెట్టారు?
సాక్షి, మంగళగిరి : రాజధాని పేరుతో ప్రజల ఆస్తుల్ని దోపిడీ చేసిన చంద్రబాబు వ్యవస్థలతో పాటు మీడియానూ మేనేజ్ చేసి నిజాలు బయటకు రాకుండా తొక్కిపెట్టారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మండిపడ్డారు. రాజధాని కోసం తీసుకున్న భూములను ఎక్కడ తాకట్టు పెట్టారో? ఎంత వడ్డీకి ఎన్ని కోట్లు తీసుకున్నారో అన్ని లెక్కలూ తేలాల్సి ఉందన్నారు. మంగళగిరి మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజధాని పేరుతో తీసుకున్న భూములకు చట్టపరంగా ఇస్తామని చెప్పిన అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు చంద్రబాబు ఇంతవరకూ ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు రైతులతో పాటు ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు, తీసుకున్న 33 వేల ఎకరాల్లో ఎన్ని ఎకరాల్లో నిర్మాణాలు చేశారో చెప్పాలని సవాల్ చేశారు. కృష్ణా కరకట్టపై నిర్మించిన అక్రమకట్టడాల మీద ఇప్పటికే న్యాయ స్థానం 60 మంది నిర్మాణదారులకు నోటీసులు జారీ చేసిందని, వారంతా న్యాయస్థానానికి సమాధానం చెప్పిన అనంతరం న్యాయస్థానం ఇచ్చే తీర్పు ప్రకారం అక్రమకట్టడాలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
రాజధానికి భూములిచ్చి మోసపోయాం: రైతులు
-
రాజధాని నిర్మాణానికి 1,09,023 కోట్లు
సాక్షి, అమరావతి : రాజధాని అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణానికి ప్రాథమికంగా రూ.1,09,023 కోట్ల వ్యయమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ట్రంక్–1, ట్రంక్–2 మౌలిక వసతులతో పాటు ప్రభుత్వ కాంప్లెక్స్ ఇతర సదుపాయాల కల్పనకు ప్రాథమికంగా ఈ మొత్తం అవసరమని ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. అయితే, కేంద్ర ప్రభుత్వానికి రూ.39,937 కోట్లతో సవివరమైన ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సమర్పించింది. రాజధానికి వచ్చే మూడేళ్లలో రూ.39,937 కోట్లు అవసరమని ఆ నివేదికలో పేర్కొంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్, అసెంబ్లీ, హైకోర్టు, రాజ్‌భవన్, ముఖ్యమంత్రి, మంత్రుల బంగ్లాలు.. సచివాలయం, ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయాలకు ఈ మొత్తం అవసరమవుతుందని అంచనా వేసినట్లు డీపీఆర్‌లో పేర్కొంది. వచ్చే మూడేళ్లకు సంబంధించి.. తొలి ఏడాదిలో రూ.10,610 కోట్లు, రెండో ఏడాదిలో రూ.22,578 కోట్లు, మూడో ఏడాదిలో రూ.6,749 కోట్లు అవసరమని నివేదికలో తెలిపింది.