గ్రాఫిక్స్‌తో దొంగనాటకాలు ఆడింది చంద్రబాబు కాదా?: కొడాలి నాని | Kodali Nani Slams On Chandrababu Over Capital Development | Sakshi
Sakshi News home page

గ్రాఫిక్స్‌తో దొంగనాటకాలు ఆడింది చంద్రబాబు కాదా? కొడాలి నాని విమర్శలు

Published Fri, Feb 23 2024 7:42 PM | Last Updated on Fri, Feb 23 2024 8:07 PM

Kodali Nani Slams On Chandrababu Over Capital Development - Sakshi

సాక్షి, కృష్ణా జిల్లా: రాష్ట్రానికి మేలు జరుగుతుంటే చంద్రబాబు ఓర్వలేడని మాజి మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.  రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తప్ప.. రాజధాని రైతులు ఏ త్యాగం​ చేశారని దుయ్యబట్టారు. ‘రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో సీఎం జగన్‌కు తెలుసు. ఏ రాజధానిలోనైనా 150 ఎకరాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలుంటాయి. మిగిలిన 99 శాతం ప్రైవేట్‌ ఆస్తులుగా ఉంటాయి. 33 వేల ఎకరాలు తీసుకున్న బాబు.. పిట్టలదొర కబుర్లు చేబుతున్నాడు. గ్రాఫిక్స్‌తో దొంగనాటకాలు ఆడింది చంద్రబాబు కాదా? అని మండిపడ్డారు.

దేశంలో ఉన్న రాష్ట్ర రాజధానులన్నీ వందల ఏళ్ల క్రితం ఏర్పడి.. ఇప్పుడు మెగా సిటీలుగా మనకు దర్శనమిస్తున్నాయి. రాజధాని రైతులు ఏం త్యాగం చేశారు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప.  మద్రాస్, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ కోల్‌కత్తా  ఏ రాజధానిలో అయినా 150 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి. ప్రజల సమస్యలు నేరుగా పరిష్కారమయ్యే వ్యవస్థను క్రియేట్ చేసిన జగన్ గొప్పవాడా?. రాజధాని కడతానంటూ గ్రాఫిక్స్‌తో దొంగ నాటకాలు ఆడిన చంద్రబాబు గొప్పవాడా?. దేశంలో రాజధాని కట్టిన నేత ఎవరైనా ఉన్నారా?. ఒక్కడే రాజధాని కట్టడం అనేది సాధ్యం కాదు. 25 లక్షల జనాభా, పోర్టు, అన్ని రకాల హంగులు ఉన్న వైజాగ్‌లో ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన భూమి సేకరిస్తే మహానగరంగా అయ్యి తీరుతుంది.

... వైజాగ్‌ను వ్యాపార, వర్తక, వాణిజ్య రాజధానిగా అభివృద్ధి చేస్తే, వచ్చే సంపద ద్వారా పేద ప్రజలకు మరింత మేలు చేయొచ్చని సీఎం జగన్ ఆలోచిస్తున్నారు. ప్రజలకు మేలు చేస్తే సహించలేని చంద్రబాబు అండ్ కో ఇక్కడే రాజధాని ఉండాలని కోర్టులకు వెళ్లి స్టే తెచ్చారు. సీఎం జగన్ రెండు లక్షల 57వేల కోట్ల రూపాయలు, 120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజల ఖాతాల్లో వేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ వెయ్యి సార్లు బటన్ నొక్కి డబ్బంతా చంద్రబాబుకు చెందిన రాజదాని  రైతులు ఖాతాల్లో జమ చేసేవారు. కోట్లాదిమంది ప్రజలు ఏమైపోయినా వారికి అనవసరం. నేనైతే సంపద సృష్టించే వాడిని, సీఎం జగన్‌కు అది చేత కావడం లేదని చంద్రబాబు అంటున్నాడు. సీఎం జగన్ రాజకీయ నాయకుడి కంటే కూడా.. ఓ సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మాన్‌. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి సీఎం జగన్’అని కొడాలి  అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement