సాక్షి, ఢిల్లీ: అమరావతి మాస్టర్ ప్లాన్ మార్పులో అక్రమాల కేసుపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి నారాయణ సహకరించపోతే బెయిల్ రద్దు చేయాలని తమను ఆశ్రయించాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు ముందస్తు బెయిల్ తీర్పుతో దర్యాప్తుపై ప్రభావం పడకూడదని కోర్టు వ్యాఖ్యానించింది.
మాస్టర్ ప్లాన్ మార్పు కేసులో మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఈ కేసుపై జస్టిస్, గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్నం ధర్మాసనం విచారణ జరిపింది. సీఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మౌఖిక ఆదేశాలతో మార్చారని ఏపీ ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. నారాయణ తన మంత్రి పదవిని దుర్వినియోగం చేశారన్నారు. తీవ్రమైన ఆర్థిక నేర కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని న్యాయవాది విజ్ఞప్తి చేశారు.
చదవండి: రామోజీరావుపై ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment