వెనుకబడిన ప్రాంతాల ఆకాంక్షలు నెరవేరినప్పుడే సమగ్ర అభివృద్ధి జరిగినట్లు. అలా కాకుంటే ప్రాంతాల మధ్య అసమా నతలు పెరిగిపోతాయి. అంటే పేదరికం, నిరుద్యోగం ప్రబలడం, పెత్తందారులు, బలవంతులు పేట్రేగిపోవడంజరుగు తుంది. దాని ఫలితంగా తీవ్రవాదం వైపు పీడితులు ఆకర్షితులు అవుతారు.
అత్యంత వెనుకబడిన 1.59 కోట్ల జనాభా కలిగిన రాయలసీమకు హైకోర్టు బెంచ్ ఇచ్చి సమా నాభివృద్ధి సాధించామని శాసనసభలో చెప్పడం సరికాదు. విభజన చట్టంలో పొందుపరచిన ఎయిమ్స్, రైల్వే జోన్, కడప ఉక్కు పరిశ్రమ,బుందేల్‌ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ, హార్టికల్చర్ హబ్, హైకోర్టు, లా యూనివర్సిటీ, లా అకాడమీ, కియా లాంటి పరిశ్రమల ఏర్పాటుతో పాటు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేయడం వల్లనే రాయ లసీమ అభివృద్ధి చెందుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం తదితర చర్యల ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికీ కృషి చేయాలి.
అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఉమ్మడి సంప దను అన్ని ప్రాంతాలవారికీ సమానంగా పంచడం. అది భిక్ష కాదు. అభివృద్ధి ఫలాలు పొందడం ప్రతి పౌరుని హక్కు. ఇప్పటికే ఏడాదికి మూడు పంటలు పండుతూ అభివృద్ధి చెందిన కోస్తా ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన అమరావతి నిర్మాణానికి ఐదేళ్లలో 50 వేల కోట్లు ఖర్చు పెట్ట పూను కోవడం ఏ పాటి వికేంద్రీకరణో, ఎటువంటి న్యాయమో పాలకులే చెప్పాలి.
అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైనది కాదని మేధావులు చెప్పినా వినకుండా ఒక వర్గం, కేవలం 29 గ్రామాల ప్రాంత ప్రయో జనాల కోసమే లక్ష కోట్లు ఖర్చు పెడతామని టీడీపీ ప్రభుత్వం అనడం సమంజసమేనా? 2014 నుండి 2019 వరకు 5,000 కోట్లు తాత్కాలిక నిర్మా ణాల కోసం చేసిన ఖర్చు నీటిపాలు అయ్యింది.
నేడు మరలా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ)ల నుంచి 15 వేల కోట్లు, హడ్కో నుంచి 12 వేల కోట్లు, ఇతర సంస్థల నుండి రుణాలు, బాండ్ల ద్వారా 23 వేల కోట్లు... మొత్తం 50 వేల కోట్లు అప్పులు చేసి, ఐదేళ్లలో ఖర్చు పెట్టాలని ప్రభుత్వం పూనుకుంది. 2024 నవంబర్ నుంచి 2025 మార్చి వరకు అనగా ఐదు నెలల కాలంలోనే మూడు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి బడ్జెట్‌లో నిధులు కేటా యించింది ప్రభుత్వం.
కేంద్ర ప్రభుత్వం ష్యూరిటీతో ఏడీబీ ద్వారా తీసుకుంటున్న 15 వేల కోట్ల రూపాయలలో కేవలం అమరావతి రక్షణ చర్య లకే... అంటే కొండవీటి వాగు, బుడమేరు వంక నీటి మళ్లింపు కాలువలు; కృష్ణా నది కరకట్ట, వివిధ రిజర్వాయర్ల నిర్మాణం, డైవర్షన్, డ్రైనేజీ కెనాల్స్, లిఫ్ట్ స్కీములకే రూ. 8000 కోట్లు ఖర్చు చేయాలని... అప్పు ఇచ్చే ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు నిర్మాణ ప్రాంతాన్ని పడవలలో ప్రయాణం చేసి తనిఖీ చేసిన తర్వాత నిర్ణయించడాన్ని బట్టి అది ‘నేల మీద నిర్మించే రాజధాని కాదు, నీటి మీద నిర్మించే తేలియాడే (ఫ్లోటింగ్) రాజధాని’ అని అర్థమయిపోతుంది. రాష్ట్రంలో సువిశా లమైన భూములు ఉండి కూడా తేలి యాడే రాజధాని నగరాన్ని నిర్మించడం వెర్రితనం.
కాబట్టి టెక్నాలజీకి మేమే ఆదిగురువులమని చెప్పుకునే కూటమి నాయకులు శాస్త్రీయ పద్ధతులలో ఆలో చన చేసి అమరావతిలో శాసనసభ,సచి వాలయం నిర్మాణాలకు పరిమిత మైతే కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవుతుంది. రాష్ట్రంలో ఉండే విశాఖపట్నం, తిరుపతి, కర్నూల్, అనంతపురం, విజయవాడ, గుంటూరు లాంటి నగరాలను పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్ది, ఆదాయ వనరులుగా మార్చుకోవాలి. అప్పుడే సంపద సృష్టికి వీలుంటుంది. లేకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు చెబుతున్న 2047 విజన్ సాకారం కాక పోగా, రాష్ట్రం అప్పులపాలై తాకట్టు పెట్టే పరిస్థి తులు తప్పవు, తస్మాత్ జాగ్రత్త!
– కె.వి. రమణ ‘ అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు
నీటిలో తేలియాడే రాజధానా?
Published Thu, Nov 28 2024 5:46 AM | Last Updated on Thu, Nov 28 2024 5:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment