
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి తొలి దశలో రూ.45 వేల కోట్లు అవసరమని ప్రభుత్వం తేల్చింది. ఇంతమొత్తం విలువైన పనులను ఇప్పటికే చేపట్టినట్లు తెలిపింది. గతంలో పలుమార్లు రకరకాల అంచనాలు రూపొందించగా, తాజాగా వచ్చే నెలలో నిర్వహించే హ్యాపీ సిటీస్ సదస్సు కోసం ప్రత్యేకంగా ఒక నివేదిక తయారు చేసింది.
అందులో మొదటి దశలో రాజధాని నిర్మాణానికి రూ.45,253 కోట్ల విలువైన పనులు ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ నిధుల్ని రకరకాల మార్గాల్లో సమీకరిస్తున్నట్లు వివరించింది. గతంలో రాజధాని నిర్మాణానికి రూ.58 వేల కోట్లు అవసరమని అందులో రూ.29,676 కోట్లు తొలి మూడేళ్లలోనే ఖర్చు పెట్టాల్సి ఉంటుందని పలు నివేదికల్లో సీఆర్‌డీఏ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment