CRDA
-
స్కామ్‌ల పరం.. అమరావతి పురం!
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం ముసుగులో అమరావతిని కూటమి ప్రభుత్వం కుంభకోణాల మయంగా మార్చేస్తోంది. అడుగడుగునా కమీషన్ల దందాతో ఖజానాకు చిల్లు పెడుతూ అమరావతిని అక్రమాల పురంగా తీర్చిదిద్దుతోంది. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచేసిన ప్రభుత్వం ఆ భారాన్ని ఇప్పటికే అడ్వాన్సు చెల్లించి ఫ్లాట్లు బుక్ చేసుకున్న వారిపై మోపితే వ్యతిరేకత వస్తుందని పసిగట్టి దాన్ని రాష్ట్ర ఖజానా నుంచే సర్దుబాటు చేస్తోంది. అంటే.. ప్రభుత్వ ఖజానా నుంచి కాంట్రాక్టు సంస్థకు దోచిపెట్టి, వాటినే కమీషన్లు రూపంలో వసూలు చేసుకునేందుకు ‘ముఖ్య’నేత చక్రం తిప్పినట్లు స్పష్టమవుతోందని బిల్డర్లు చెబుతున్నారు. ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారి అవతారం ఎత్తి చేపట్టిన హ్యాపీ నెస్ట్ రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్టు టెండర్లలో భారీ ఎత్తున జరిగిన అక్రమాలను గెజిటెడ్ ఆఫీసర్ల హౌసింగ్ ప్రాజెక్టు బహిర్గతం చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు. షీర్ వాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ రెండింటి డిజైన్లు, నిర్మాణ రీతి, సౌకర్యాలు ఒకటే అయినా హ్యాపీ నెస్ట్ నిర్మాణ వ్యయం చ.అడుగుకు రూ.2,500కిపైగా అదనంగా ఉండటమే అక్రమాలకు నిదర్శనమని ఉదహరిస్తున్నారు.షెడ్యూళ్లకు 8వ తేదీ తుది గడువుఅమరావతిలో 2018లో నాటి టీడీపీ సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీసింది. నేలపాడు వద్ద 14.46 ఎకరాల్లో జీ+18 అంతస్తుల్లో 1,200 ప్లాట్లతో హ్యాపీ నెస్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్నారైలు, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజల నుంచి అడ్వాన్సులు సేకరించింది. హ్యాపీ నెస్ట్ పనులను అప్పట్లో రూ.658 కోట్లకు సీఆర్డీఏ కాంట్రాక్టు సంస్థకు అప్పగించింది. అయితే అది ముందుకు కదల్లేదు. ఇప్పుడు అదే ప్రాజెక్టును టీడీపీ కూటమి ప్రభుత్వం చేపట్టింది. గత టెండర్‌ను రద్దు చేసింది. తాజాగా రూ.818.03 కోట్ల వ్యయంతో 24 నెలల్లో పూర్తి చేయాలని గడువు నిర్దేశించింది. మూడేళ్ల పాటు నిర్వహించాలనే నిబంధనతో ఎల్ఎస్ (లంప్సమ్ ఓపెన్) విధానంలో టెండర్లు పిలిచింది. టెండర్ల షెడ్యూళ్ల దాఖలుకు ఈనెల 8వ తేదీని తుది గడువుగా పేర్కొంది. అదే రోజు టెక్నికల్ బిడ్ తెరుస్తారు. ఆర్థిక బిడ్లను పదో తేదిన తెరిచి తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన సంస్థకు పనులు అప్పగించే దిశగా సీఆర్డీఏ అడుగులు వేస్తోంది. జీఎస్టీ, ఎన్ఏసీ, సీనరేజీ లాంటి పన్నులు రూ.153.05 కోట్లు రీయింబర్స్మెంట్ చేస్తామని పేర్కొంది. షీర్ వాల్ టెక్నాలజీతో అల్యూమినియం ప్రేమ్‌వర్క్, పోడియం, ఆర్కిటెక్చరల్ ఫినిషెస్.. బయట, లోపల విద్యుదీకరణ, ఎల్పీజీ లాంటి సౌకర్యాలతో హ్యాపీ నెస్ట్ ఫ్లాట్లను నిర్మించాలని టెండర్లలో పేర్కొంది. తగ్గిన ధరలు.. అంచనాల్లో వంచనహ్యాపి నెస్ట్ ప్రాజెక్టుకు 2018లో తెరతీసిన ప్రభుత్వం.. అప్పట్లో పనులను కాంట్రాక్టర్‌కు రూ.658 కోట్లకు అప్పగించింది. కానీ.. ఆ ప్రాజెక్టు అప్పట్లో ముందుకు కదల్లేదు. ఇప్పుడు ఆ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. భవన నిర్మాణాల్లో వినియోగించే స్టీల్, సిమెంట్, కంకర తదితరాలతోపాటు విద్యుత్, శానిటరీ ఉపకరణాల దగ్గర నుంచి లిఫ్ట్‌ల వరకూ గతంతో పోలిస్తే ధరలలో పెద్దగా వ్యత్యాసం లేదు. నిజానికి 2018తో పోలిస్తే కొన్నిటి ధరలు ఇప్పుడు బాగా తగ్గాయి. ఇక ఇసుక పూర్తి ఉచితమని ప్రభుత్వమే చెబుతోంది. అలాంటప్పుడు హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు అంచనా వ్యయం పెరగడానికి ఆస్కారమే ఉండదని ప్రముఖ బిల్డర్లు స్పష్టం చేస్తున్నారు. అలాంటిది హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు కాంట్రాక్టు విలువను రూ.818.03 కోట్లుగా నిర్ణయించి తాజాగా సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం, రూ.153.05 కోట్లను పన్నుల రూపంలో రీయింబర్స్మెంట్ చేస్తామని పేర్కొనడంపై బిల్డర్లు విస్తుపోతున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.971.08 కోట్లకు చేరుతోంది. ప్రాజెక్టులో మొత్తం నిర్మిత ప్రాంతం 21,52,349 చ.అ. ఈ లెక్కన చదరపు అడుగు నిర్మాణానికి రూ.4,511.76 చొప్పున వ్యయం చేస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన డిజైన్ కంటే మరిన్ని అధునాతన సదుపాయాలతో నిర్మాణం చేపట్టినా చదరపు అడుగుకు అన్ని పన్నులతో కలిపినా రూ.1,800 నుంచి రూ.2వేల లోపే నిర్మాణ వ్యయం అవుతుందని బిల్డర్లు చెబుతున్నారు. ప్రాజెక్టు అంచనాల్లో భారీగా అక్రమాలు జరిగాయని పేర్కొంటున్నారు.అక్రమాలు ఇలా బహిర్గతం..హ్యాపీ నెస్ట్ రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణ రీతిలోనే.. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో గెజిటెడ్ ఆఫీసర్లకు టైప్–1, టైప్–2 విధానంలో జీ+12 అంతస్తులతో 14 టవర్లలో 1,440 ఫ్లాట్ల నిర్మాణానికి రూ.492.04 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. గెజిటెడ్ ఆఫీసర్ల హౌసింగ్ ప్రాజెక్టు మొత్తం నిర్మిత ప్రాంతం 27,24,080 చ.అ. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.1,806.29 అవుతుంది. ఇక సీనరేజీ, ఎన్ఏసీ, జీఎస్టీ పన్నుల రూపంలో రూ.93.2 కోట్లను రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. ఇవన్నీ కలిపినా గెజిటెడ్ ఆఫీసర్ల హౌసింగ్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం చ.అడుగుకు రూ.2,148.45 దాటదు. దీన్ని బట్టి హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగినట్లు సీఆర్డీఏ పిలిచిన టెండర్ల సాక్షిగా బట్టబయలైందని బిల్డర్లు చెబుతున్నారు.సర్కారు రియల్ ఎస్టేట్ వెంచర్ ‘హ్యాపీ నెస్ట్’ టెండర్లలో అక్రమాలు⇒ రాజధాని అమరావతిలో గెజిటెడ్ ఆఫీసర్ల కోసం జీ+12 అంతస్తులతో 14 టవర్లలో 1,440 ఫ్లాట్ల నిర్మాణానికి రూ.492.04 కోట్లతో సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.1,806.29 మాత్రమే. ఇక హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో జీ+18 అంతస్తులతో 12 టవర్లలో 1,200 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. ఇక్కడ మాత్రం నిర్మాణ వ్యయం ఏకంగా చ.అ.కు రూ.4,511.76 చొప్పున నిర్దేశించారు. నిజానికి అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గాల్సింది పోయి ఇక్కడ అమాంతం పెరిగిపోయింది. హ్యాపీ నెస్ట్.. గెజిటెడ్ ఆఫీసర్ల క్వార్టర్లు.. ఇవి రెండూ షీర్ వాల్ టెక్నాలజీతోనే నిర్మాణాలు చేపడతారు. వాటి డిజైన్లు, నిర్మాణ రీతి, సౌకర్యాలు ఒకటే. కానీ నిర్మాణ వ్యయం మాత్రం వేర్వేరు.⇒ అధునాతన సదుపాయాలు, నాణ్యమైన నిర్మాణ సామగ్రి వినియోగించి కట్టే బహుళ అంతస్తుల భవనాల్లోనూ (టవర్స్) నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించదని (జీఎస్టీ, సీనరేజీ లాంటి అన్ని పన్నులతో కలిపి) విజయవాడ–గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు తదితర ప్రాంతాల్లో అత్యంత ప్రతిష్టాత్మక రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసిన పేరు మోసిన బిల్డర్లు చెబుతున్నారు. కానీ.. ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారి రాజధాని అమరావతిలో చేపట్టిన హ్యాపి నెస్ట్ రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్టులో మాత్రం చదరపు అడుగు నిర్మాణ వ్యయం ఏకంగా రూ.4,511.76 ఉంది. దీన్ని బట్టి ఒక్కో చ.అడుగుకు రూ.2,500కిపైగా అంచనా వ్యయాన్ని పెంచేసినట్లు స్పష్టమవుతోందని బిల్డర్లు చెబుతున్నారు.⇒ రెండు మూడు సంస్థలు జాయింట్ వెంచర్(జేవీ)గా ఏర్పడి షెడ్యూలు దాఖలు చేయడానికి వీల్లేదని హ్యాపీనెస్ట్ టెండర్ నోటిఫికేషన్లో సీఆర్డీఏ నిబంధన విధించింది. కానీ ఆ ప్రాజెక్టు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ 25 శాతం పనులను సబ్ కాంట్రాక్టు కింద అప్పగించే వెసులుబాటు కల్పించింది. దీన్ని బట్టి ముందే ఎంపిక చేసిన బడా కాంట్రాక్టు సంస్థకు హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును అధిక ధరలకు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకునే వ్యూహంతో ‘ముఖ్య’నేత చక్రం తిప్పినట్లు వెల్లడవుతోంది. -
అమరావతిలో అడ్డగోలు దోపిడీకి మళ్లీ స్కెచ్..!
సాక్షి, అమరావతి: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను కూటమి నాయకులు తిరగరాస్తున్నారు. పదవిలో ఉండగానే డబ్బు దండుకోవాలన్న సూత్రంతో చెలరేగిపోతున్నారు. అందుకు అనుగుణంగానే అమరావతిని మళ్లీ బంగారు బాతులా మార్చుకున్నారు. ఇందులో భాగంగా.. సీఆర్డీఏ ప్రాంతంలో చేపట్టే నిర్మాణల పనుల వ్యయాన్ని అడ్డగోలుగా పెంచి దోపిడీకి పెద్దస్కెచ్చే వేశారు. వ్యయాన్ని భారీగా పెంచడంతో పాటు టెండర్ల కాంట్రాక్టును కూడా పనుల ప్రకారం కాకుండా ఏకమొత్తంగా ఇచ్చేందుకు నిర్ణయించి ఆ మేరకు జీఓ కూడా విడుదల చేశారు. ఇటీవల జరిగిన రెండు సీఆర్డీఏ అథారిటీ సమావేశాల్లో మొత్తం రూ.20,292.46 కోట్ల పనులకు అనుమతులిచ్చిన ప్రభుత్వం.. పనులను బట్టి వీటి విలువను ఏకంగా 28 నుంచి 55 శాతం మేర పెంచింది. అంటే.. అనుమతులిచ్చిన పనుల్లో సరాసరి రూ.10 వేల కోట్ల మేర పెంపు చూపడంపై నిర్మాణరంగ నిపుణులే నోరెళ్లబెడుతున్నారు. ఐదేళ్లలో పనుల విలువ ఇంత భారీగా పెంచడం దేశ చరిత్రలో ఎక్కడా చూడలేదంటున్నారు.ధరలు పెద్దగా పెరగకపోయినా..గత టీడీపీ ప్రభుత్వం సీఆర్డీఏలో 2017–18 మధ్య ఈ ప్రాంతంలో నిర్మాణ పనులు చేపట్టింది. అప్పటికి ఇప్పటికీ నిర్మాణ సామాగ్రి ధరలు పెద్దగా పెరగకపోయినా పనుల వ్యయాన్ని మాత్రం అమాంతం పెంచడం ఆలోచించాల్సిన విషయమేనని వారంటున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం పనుల్లో పారదర్శకత, వ్యయం తగ్గింపుపై ప్రత్యేక దృష్టిపెట్టి రివర్స్ టెండర్ల విధానం అమల్లోకి తెచ్చింది. అయితే, ఈ విధానం కొనసాగితే తాము అనుకున్నట్లు సాగదని.. పైగా తమ లక్ష్యం నెరవేరదని భావించిన కూటమి సర్కారులోని పెద్దలు ఆ విధానాన్ని ఏకంగా రద్దుచేసి పారేశారు. అలాగే, గతంలో కాంట్రాక్టర్లకు ఇచ్చిన టెండర్లను సైతం రద్దుచేసి, ఇప్పుడు కొత్తగా తమ వారికి చెప్పిన రేటుకు కట్టబెట్టేందుకు వీలుగా లంప్సమ్ విధానం అనుసరించడం గమనార్హం. రాజధాని ప్రాంతంలో 2014–19 మధ్య రూ.41 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి రూ.5వేల కోట్ల మేర పనులు పూర్తిచేసినట్లు ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. తాజాగా.. 41, 42 సీఆర్డీఏ అథారిటీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయం మేరకు కొత్తగా రూ.20,292.46 కోట్ల పనులకు అనుమతులిచ్చారు. ఇందులో రూ.11,467.27 కోట్లతో పనులకు అనుమతినిస్తూ జీఓ సైతం జారీచేశారు. తాజాగా.. మరో రూ.8,821.44 కోట్ల మేర ట్రంక్ రోడ్లు, లేఅవుట్లలో వేసే రోడ్లకు అనుమతిచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అమరావతి ప్రాంతంలో రోడ్ల నిర్మాణ వ్యయాన్ని 28 శాతం వరకు పెంచగా, భవన నిర్మాణాల ఖర్చును ఏకంగా 35 నుంచి 55 శాతం పెంచడం విశేషం. -
సీఆర్డీఏలో మళ్లీ కన్సల్టెంట్ల రాజ్యం
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలన అంటేనే కన్సల్టెంట్లు, విదేశీ సంస్థలకు వందల కోట్లు దోచిపెట్టడమనే విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు గత పాలనంతా కన్సల్టెంట్ల మయం. ఇప్పుడూ అదే జరుగుతోంది. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ)లోనూ కన్సల్టెంట్ల రాజ్యానికి గేట్లు తెరుచుకున్నాయి. అభివృద్ధి పనుల కోసం ప్రోగ్రామ్ మేనేజ్మెంట్కు, అమరావతి ఆర్థికాభివృద్ధిలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఇలా రెండు రకాల కన్సల్టెంట్ల కోసం సీఆర్డీఏ వేర్వేరుగా రెండు ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఈ కన్సల్టెంట్లకు రూ.70.64 కోట్లు చెల్లించనున్నట్లు వెల్లడించింది.ఇందులో అభివృద్ధి పనుల ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కింద 63 మందికి రెండేళ్లలో రూ.62.36 కోట్లు చెల్లిస్తారు. అమరావతి ఆర్థికాభివృద్ధిలో ప్రైవేటు రంగం భాగసామ్యాన్ని ప్రోత్సహించేందుకు నియమితులయ్యే ఐదుగురు కన్సల్టెంట్లకు మూడేళ్లలో రూ.8.28 కోట్లు చెల్లించనున్నట్లు సీఆర్డీఏ పేర్కొంది. ఒక్కో కన్సల్టెంట్‌కు నెలకు రూ. 2 అక్షల నుంచి రూ. 5 లక్షల వరకు చెల్లించనున్నట్లు ప్రతిపాదనల ఆహ్వాన పత్రంలో సీఆర్డీఏ తెలిపింది. పనుల్లో నాణ్యత, సాంకేతికతకు ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్లు సహకారం అందిస్తారు.పనుల కాల వ్యవధిని ఏకీకృతం చేయడం, సమయానికి పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించడం, గడువులోగా బడ్జెట్ విడుదల ప్రణాళికను వీరు రూపొందిస్తారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులతో అమలు చేసే కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, పురోగతి నివేదికలను సమర్పించాలి. పనులకు అవసరమైన మెటీరియల్ సేకరణ కోసం ఐటీ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాలి. పర్యావరణ, సామాజిక పర్యవేక్షణ, ఆస్తి నిర్వహణ కార్యకలాపాలను నిర్వహించడం వీరి విధులని సీఆర్డీఏ తెలిపింది.ప్రైవేటు రంగాన్ని భాగస్వామ్యం చేయడం కోసంఅమరావతి ఆర్థికాభివృద్ధిలో ప్రైవేటు రంగాన్ని భాగస్వామ్యం చేయడం, ప్రపంచంలో అగ్రశ్రేణి పెట్టుబడి గమ్యస్థానంగా రాజధానిని బ్రాండింగ్, ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి మార్కెటింగ్, ఔట్రీచ్ వ్యూహం అమలు వీరి విధి. ప్రభుత్వ, ప్రైవేటు ఆర్థిక వనరుల వినియోగంతోపాటు, ప్రైవేటు రంగాన్ని ప్రభావితం చేయడానికి పీపీపీ విధానంలో వినూత్న ఆర్థిక విధానాలతో పెట్టుబడులను తేవాలి. పారిశ్రామిక రంగంలో పోటీతత్వ పెట్టుబడి వాతావరణాన్ని సృష్టించాలి. ఆర్థిక అభివృద్ధి వ్యూహం ఆధారంగా రోడ్ మ్యాప్‌ను రూపొందించాలి. ఆర్థిక, ఆర్థికేతర ప్రోత్సాహకాల కోసం అవసరమైన నిధులు, పద్ధతులను గుర్తించి, వీటి అమలుకు వ్యూహాన్ని అభివృద్ధి చేయాలని సీఆర్డీఏ ఆ పత్రంలో పేర్కొంది. -
రాజధానిలో దళితులపై ‘సీఆర్డీయే’ దాష్టీకం!
తాడికొండ: కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు.. రాజధానిలో పనుల్లేక ఇబ్బందులు పడుతున్న పేదలు, దళిత రైతులను మాత్రమే టార్గెట్‌గా చేసి అక్రమ కేసులు బనాయిస్తున్న సీఆర్డీయే అధికారులు.. టీడీపీకి చెందిన రైతులకు మాత్రం వత్తాసు పలుకుతుండడం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది. తాజాగా శాఖమూరు గ్రామానికి చెందిన జొన్నకూటి ప్రశాంత్ అనే దళిత రైతు సీఆర్డీయే అధికారుల ఆదేశాల మేరకు మినుము పైరును రోటోవేటర్‌తో దున్ని అప్పగించిన తరువాత కూడా అక్రమ కేసు నమోదు చేయడం పట్ల పలువురు విస్తుపోతున్నారు. ఇదంతా ఓ ఎత్తయితే టీడీపీకి చెందిన నాయకులు భారీగా సాగు చేసుకుంటూ, కౌలుకు ఇచ్చుకుంటున్న పంట పొలాల వైపు కన్నెత్తి చూడకపోవడం వారి పక్షపాత వైఖరికి అద్దం పడుతున్నది . తుళ్లూరు మండల పరిధిలో పూలింగ్‌కు ఇచ్చి రిటర్న్‌బుల్ ప్లాట్లు పొంది వార్షిక కౌలు తీసుకుంటున్న రైతులు పొలాలను దున్ని సాగు చేసుకుంటున్నారు. మరి కొంతమంది ఎకరా రూ.30 వేలకు కౌలుకు ఇచ్చుకుంటున్నారు. అయితే ఇలా.. సాగు చేసుకుంటున్న వారిలో కేవలం దళిత రైతులపై సీఆర్డీయే అధికారులు ఉక్కుపాదం మోపుతూ.. మిగిలిన వారిని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నాయకుల చేతుల్లో వందలాది ఎకరాలు బందీగా మారినప్పటికీ అధికారులు అటువైపు తొంగి చూసిన దాఖలాలు లేవు. శుక్రవారం వారాంతపు గ్రీవెన్స్‌లో భాగంగా వైఎస్సార్సీపీ నాయకులు కాకర్ల నాగేశ్వరరావు, గద్దర్ చెన్నకేశవ తదితరులు సీఆర్డీయే అడిషనల్ కమిషనర్ జి సూర్యసాయి ప్రవీణ్ చంద్‌ను కలిసి టీడీపీ నాయకుల ఆక్రమణలో ఉన్న పంట పొలాలపై ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన స్పందించలేదని వారు తెలిపారు. పనుల్లేక పస్తులుండలేక ఖాళీగా ఉన్న భూముల్లో పేదలు ఎస్సీ, ఎస్టీ రైతులు పంటలు సాగు చేసుకుంటే కేసులు నమోదు చేసి వేధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. టీడీపీకి చెందిన నాయకుల చేతిలో ఉన్న భూములను కూడా దున్నడంతో పాటు కేసులు నమోదు చేయకపోతే తాము న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. -
సీఆర్డీఏలో భూ కేటాయింపులపై మంత్రులతో బృందం
సాక్షి, అమరావతి: సీఆర్డీఏలో పలు సంస్థల భూ కేటాయింపుల సమస్యలను పరిశీలించడానికి మంత్రుల బృందం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులిచ్చారు. మంత్రుల బృందంలో పయ్యావుల కేశవ్, నారాయణ, కొల్లు రవీంద్ర, సంధ్యారాణి, దుర్గేశ్, టీజీ భరత్ ఉన్నారు. మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక సీఎస్ కన్వీనర్‌గా వ్యవహరిస్తూ ఈ బృందం ప్రొసీడింగ్స్‌ను సమన్వయం చేస్తారు. బృందంలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఆర్థిక, ప్రణాళిక, ఉన్నత విద్యా, వైద్య ఆరోగ్య, పరిశ్రమలు, యువజన సర్వీసు శాఖల ముఖ్య కార్యదర్శులు ఉన్నారు. మంత్రుల కమిటీ అప్పగించిన బాధ్యతలను వీరు నిర్వహిస్తారు. మంత్రులు బృందం ఎప్పటికప్పుడు తమ సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ బృందం ప్రధానంగా ఈ అంశాలపై దృష్టి పెట్టాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అవేంటంటే..» సీఆర్డీఏలో గతంలో పలు సంస్థలకు చేసిన భూ కేటాయింపులను సమీక్షించి ఇప్పటికే ఉన్న వాటి కేటాయింపులను కొనసాగించడంపై నిర్ణయం తీసుకోవాలి. ఇందివరకే కేటాయించిన భూమి వినియోగం లేదా ఇతర అంశాలను అంచనా వేయడంతోపాటు అవసరమైన మార్పులను పరిశీలన చేయాలి.» భూ కేటాయింపుల కోసం కొత్త అభ్యర్థనలను పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవాలి. పలు రంగాల్లో ప్రపంచస్థాయి సంస్థలను గుర్తించి వాటిని అమరావతిలో తమ కార్యాకలాపాలను నెలకొల్పడానికి చర్యలు తీసుకోవాలి. సీఆర్డీఏ ప్రాంతంలో పలు సంస్థలకు మొత్తం భూముల కేటాయింపుల పురోగతిని పర్యవేక్షించాలి. 17 నుంచి ‘స్వచ్ఛతా హి సేవా’ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛతా హి సేవా సన్నాహక కార్యక్రమం ఈ నెల14న ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో సీఎస్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ, జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కమిటీలు ఏర్పాటు చేసి ప్రచారాన్ని పర్యవేక్షించడానికి నోడల్ అధికారిని నియమిస్తామని తెలిపారు.తక్కువ బడ్జెట్‌తో నాణ్యమైన రోడ్లు నిర్మించాలి తక్కువ వ్యయంతో ఎక్కువకాలం మన్నేల రోడ్లు నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆర్ అండ్ బి అధికారులను సీఎస్ ఆదేశించారు. ఆ శాఖ అధికారులతో వెలగలపూడిలోని సచివాలయంలో గురువారం సీఎస్ సమీక్ష నిర్వహించారు. -
హైవేతో అమరావతి అనుసంధానం
సాక్షి, అమరావతి: రాజధాని(అమరావతి) ప్రాంతాన్ని చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి(ఎన్‌హెచ్–16)తో కలిపేందుకు సీఆర్డీఏ చర్యలు చేపట్టింది. ఇక్కడి గ్రామాల మీదుగా ఆరు లేన్లతో నాలుగు ప్రధాన రహదారులను నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఆరు లేన్ల రోడ్ల పనులకు సంబంధించి అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను సైతం సిద్ధం చేశారు. త్వరలో సీఎం చంద్రబాబుతో సమావేశమై నిర్ణయం తీసుకుని టెండర్లకు వెళ్లాలని సీఆర్డీఏ యోచిస్తోంది. రాజధాని అభివృద్ధిలో భాగంగా గతంలోనే ఈ రోడ్లకు అలైన్మెంట్ కూడా చేశారు. ఆ ప్రణాళిక ప్రకారమే వీటిని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. అమరావతిలోని ప్రధాన రహదారులను తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి గ్రిడ్ విధానంలో నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. తూర్పు నుంచి పడమరకు వెళ్లే రహదారులు ఈ–1 నుంచి ఈ–16 వరకు, ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్లే మార్గాలు ఎన్–1 నుంచి ఎన్–18 వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ–5, ఈ–11, ఈ–13, ఈ–15 రోడ్లు నిర్మించి.. పడమర వైపు ఉన్న ఎన్‌హెచ్–16తో అనుసంధానం చేస్తారు. కాగా, రాజధాని నుంచి గ్రామాల మీదుగా వెళ్తున్న ఈ రహదారుల నిర్మాణానికి పలుచోట్ల భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ–5 రహదారి ఈ రోడ్డు నిర్మాణం ఉండవల్లి నుంచి ప్రారంభమవుతుంది. ఉండవల్లి, మందడం, రాయపూడి, తుళ్లూరు, అనంతవరం మీదుగా జాతీయ రహదారికి అనుసంధానం చేస్తారు. మొత్తం 18 కి.మీలు మేర ఈ రోడ్డును నిర్మిస్తారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమాంతరంగా ఉండే ఈ మార్గం.. గ్రామాల మీదుగా వెళ్తుంది. ఈ క్రమంలో పలుచోట్ల భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ–11 రహదారి నీరుకొండ నుంచి నవులూరు వరకు 6.3 కి.మీ మేర.. జాతీయ రహదారితో అనుసంధానించేందుకు మరో 4.50 కి.మీ మేర ఈ రోడ్డును నిర్మిస్తారు. ఈ రోడ్డును నీరుకొండ, కురగల్లు, నవులూరు మీదుగా మంగళగిరిలోని ఎయిమ్స్ ముందు నుంచి ఎన్‌హెచ్–16తో అనుసంధానం చేస్తారు. ఈ–13 రహదారి నీరుకొండ నుంచి నవులూరు వరకు 7.5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మిస్తారు. అనంతరం మంగళగిరి వద్ద ఎన్‌హెచ్–16తో అనుసంధానించేందుకు మరో 2.5 కి.మీ మేర రోడ్డును విస్తరించి ఎయిమ్స్ వెనుక నుంచి జాతీయ రహదారితో కలుపుతారు. ఈ రోడ్డు నీరుకొండ డౌన్ నుంచి నిడమర్రు, ఎర్రబాలెం, నవులూరు, మంగళగిరి మీదుగా వెళుతుంది. ఈ–15 రహదారి నిడమర్రు నుంచి జగనన్న లేఅవుట్, నవులూరు, క్రికెట్ స్టేడియం మీదుగా ఎయిమ్స్ వద్ద ఉన్న పాత హైవేకు అనుసంధానం చేస్తారు. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రస్తుతం అసెంబ్లీ, సచివాలయాలకు వెళ్లేందుకు వినియోగిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు(ఈ–3)ను.. దొండపాడు నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 21 కి.మీ.ల మేర నిర్మించతలపెట్టారు. అయితే, దొండపాడు నుంచి మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వరకు 14 కి.మీ మేర రోడ్డు పూర్తయ్యాక అనేక వివాదాలతో పనులు నిలిచిపోయాయి. రెండో ప్యాకేజీగా బ్యారేజీ నుంచి మణిపాల్ ఆస్పత్రి వరకు 3 కి.మీ మేర రోడ్డును నిర్మించనున్నారు. మరో 4 కి.మీ మేర మార్గంలోని రైతులను ఒప్పించి మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తి చేయాలని సీఆర్డీఏ భావిస్తోంది. ముఖ్యమంత్రి ఆమోదం తెలపడంతో ఈ నెలలోనే టెండర్లకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. -
మళ్లీ సింగపూర్ కంపెనీలకే అమరావతి!
సాక్షి, విజయవాడ: అమరావతిని మళ్లీ సింగపూర్ కంపెనీలకే కూటమి ప్రభుత్వం కట్టబెట్టింది. అమరావతి విషయంలో సీఆర్డీఏ తొలి సమావేశంలోనే చంద్రబాబు ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. సింగపూర్‌తో మళ్లీ చర్చిస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్‌లో సింగపూర్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. అసెండాస్, సింగ్ బ్రిడ్జ్, సెంబ్ కార్బ్ కంపెనీలను మళ్లీ తేవాలని తాజాగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవినీతి మోడల్‌గా గతంలో సింగపూర్ ఒప్పందంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అవినీతి కేసుల్లో జైలుకి వెళ్లిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఒప్పందం చేసుకున్నారు. .. ఈశ్వరన్ దోపిడీపై ఆయన్ను సింగపూర్ ప్రభుత్వం జైలుకి పంపింది. భూమి, నిధులు మనవి లాభాలు సింగపూర్ కంపెనీలవి అన్నట్లు ఉండేది. ఇదే సింగపూర్ సీడ్ క్యాపిటల్ ఒప్పందం సీక్రెట్. 58 శాతం వాటా సింగపూర్ కంపెనీలదే ఉంది. 1691 ఎకరాలను మళ్లీ సింగపూర్ కంపెనీలకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీడ్ క్యాపిటల్ డెవలపర్‌గా మళ్లీ సింగపూర్ కంపెనీలనే తేవాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. .. స్విస్ ఛాలెంజ్ పేరుతో గ్లోబల్ టెండర్లు లేకుండానే ప్రభుత్వం కట్టబెట్టింది. స్విస్ ఛాలెంజ్ ఎంపికపై గతంలోనే మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తప్పుపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, ఏపీ ఐడీఐ చట్టానికి విరుద్ధమని ఐవైఆర్ అభ్యంతరం తెలిపారు. రూ. 66 వేల కోట్ల దోపిడీ మోడల్ అంటూ గతంలోనే ఆరోపణలు చేశారు. అదే సింగపూర్ మోడల్‌కి మళ్లీ సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
8,352 చ.కి.మీ.లలో సీఆర్డీఏ పరిధి
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) 8,352 చదరపు కిలో మీటర్ల పరిధిలోనే ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2015లో ఇచ్చిన జీవో 207 ప్రకారం.. అప్పట్లో గుర్తించిన విస్తీర్ణం మేరకు సీఆర్డీఏ పరిధిని కొనసాగిస్తామన్నారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 36వ సమావేశాన్ని నిర్వహించారు. ల్యాండ్ పూలింగ్‌లో భూములిచ్చిన రైతులకు ఇచ్చే కౌలును మరో ఐదేళ్లు పొడిగించాలని సూచించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం, నాలుగు లైన్లుగా కరకట్ట రోడ్డు విస్తరణపై వేగంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గతంలో 130 సంస్థలకు కేటాయించిన భూములు, వాటి ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. సంపద సృష్టి కేంద్రంగా అమరావతి ప్రాంతాన్ని మార్చే వారికే భూమి కేటాయించాలన్నారు. గతంలో భూములు పొందిన వ్యక్తులు మళ్లీ ఎన్ని రోజుల్లో నిర్మాణాలు చేపట్టాలి.. అనే అంశంపైనా చర్చించారు. అమరావతిని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చేందుకు కృషి చేయాలని కోరారు. దేశంలో టాప్ 10 కళాశాలు, టాప్ 10 స్కూల్స్, టాప్ 10 ఆస్పత్రులను రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసేలా దృష్టి సారించాలన్నారు. మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్లో కలిపిన పలు గ్రామాలను తిరిగి రాజధాని పరిధిలోకి తీసుకురావాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు. సమావేశంలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తదితరులు పాల్గొన్నారు.మళ్లీ సింగపూర్ ప్రభుత్వంతో చర్చిస్తాం : మంత్రి నారాయణ రాష్ట్రంలో సీడ్ క్యాపిటల్ నిర్మాణం కోసం మళ్లీ సింగపూర్ ప్రభుత్వంతో చర్చిస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశానంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘సీడ్ క్యాపిటల్‌ను చెన్నై–కలకత్తా హైవేకు అనుసంధానిస్తాం. ఇందుకు ప్రస్తుతం నిర్మిస్తున్న సీడ్ యాకిŠస్స్ రోడ్డుతో పాటు మరో నాలుగు రోడ్లను అభివృద్ధి చేస్తాం. గతంలో రాజధాని మాస్టర్ ప్లాన్‌లో అనుకున్న విధంగా హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ వంటి నవ నగరాలు నిర్మిస్తాం’ అని తెలిపారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి అమరావతికి వెళ్లే కరకట్ట రోడ్డును సెంట్రల్ డివైడర్ ఉండేలా నాలుగు లేన్లతో నిర్మించేలా వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అమరావతిలో ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల ద్వారా మరో నాలుగు ఐకానిక్ బ్రిడ్జిలు వస్తాయన్నారు. 2019కు ముందు రాజధానిలో పలు కేంద్ర, రాష్ట్ర సంస్థల ఏర్పాటుకు భూములు కేటాయించామని.. ఆయా సంస్థలు వీలైనంత త్వరగా సంస్థలను నెలక్పొలేలా చర్చిస్తామని తెలిపారు.సీఆర్డీయే పరిధిలోకి బాపట్ల, పల్నాడు జిల్లాలురాజధాని ప్రాంతంలో మధ్యలో నిలిచిపోయిన కట్టడాల పరిశీలనకు ఐఐటీ హైదరాబాద్ బృందం అమరావతిలో పర్యటించిందని, శనివారం ఐఐటీ మద్రాస్ నిపుణులు ఐకానిక్ భవనాల కట్టడాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని తెలిపారు. వచ్చే వారంలో అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపడతామని చెప్పారు. అమరావతి హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ కూడా తిరిగి ప్రారంభించేలా దృష్టి సారిస్తున్నట్టు తెలిపారు. ఆర్5 జోన్ అంశం న్యాయస్థానంలో ఉండటంతో న్యాయ సలహాలు తీసుకుని ముందుకెళ్తామని తెలిపారు. ఇప్పుడున్న వారితో పాటు మరో 32 మంది కన్సల్టెంట్స్ను నియమిస్తామని వెల్లడించారు. సీఆర్డీయే పరిధిలోకి కొత్తగా పల్నాడు, బాపట్ల జిల్లాలు కూడా వస్తున్నట్టు మంత్రి వివరించారు. పథకాలు.. ఫలితాలుప్రజలకు కేవలం పథకాలు అందించడమే కాదని, వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికతో పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం మహిళా శిశు సంక్షేమం, విద్యుత్ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా శిశు మరణాలు, మిషన్ వాత్సల్యతో చిన్నారుల సంరక్షణ కార్యక్రమాలను సమీక్షించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో వీలైనన్ని మహిళా హాస్టళ్లు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో మంచి ఫలితాలు సాధించేలా సరికొత్త ఆలోచనలతో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రైతులకు పగటిపూటే 9 గంటల విద్యుత్ అందాలి వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఇంధన శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఫీడర్ల సామర్థ్యాన్ని మెరుగు పరచడంతో పాటు కొత్తవి ఏర్పాటు చేయాలని సూచించారు. తక్కువ ఖర్చుతో డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుదుత్పత్తితోపాటు సరఫరా మెరుగు పరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. సోలార్ విద్యుత్తుకు ప్రాధాన్యత క ల్పించే ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. అంతకు ముందు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో విద్యుదుత్పత్తి పరిస్థితిని వివరించారు. ఇంధన శాఖమంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎం కార్యదర్శి రాజమౌళి, ఏపీ జెన్కో ఎండీ చక్ర«దర్ బాబు, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ కీర్తి తదితరులు పాల్గొన్నారు. ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలిరాష్ట్రంలో నిత్యావసరాల ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖల సమన్వయంతో పనిచేస్తే ధరల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. సచివాలయంలో శుక్రవారం పౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం ధాన్యం సేకరణను అస్తవ్యస్తంగా మార్చిందని ఆరోపించారు. ధాన్యం సొమ్మును చెల్లించడంలోనూ తీవ్ర జాప్యం చేశారని, ఇకపై ఎలాంటి అవరోధాల్లేకుండా ధాన్యం సేకరణ చేయాలని సూచించారు. బియ్యం డోర్ డెలివరీ పేరుతో చేపట్టిన ఎండీయూ విధానం లోప భూయిష్టంగా సాగిందని ఆరోపించారు. సమావేశంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కమిషనర్ సిద్ధార్థ్‌జైన్, పౌర సరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్ తదితరులు పాల్గొన్నారు. సమగ్ర అధ్యయనం తర్వాతే కొత్త మద్యం విధానం సమగ్ర అధ్యయనం తర్వాతే కొత్త ఎక్సైజ్ విధానాన్ని ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ఎక్సైజ్ శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న ఎక్సైజ్ విధానాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ వ్యవహారాలపై సీఐడీ విచారణ జరిపిస్తామని, గత ఐదేళ్లలో జరిగిన లావాదేవీల ఫైళ్లను సీజ్ చేయాలని ఆదేశించారు. -
CRDA అధికారులపై రైతుల ఆగ్రహం
-
పతాకస్థాయికి టీడీపీ కక్షసాధింపు 'పార్టీ ఆఫీసు కూల్చేశారు'
సాక్షి ప్రతినిధి, గుంటూరు/మంగళగిరి: తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన పది రోజుల్లోనే కక్ష సాధింపు చర్యలకు దిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్సీపీ నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాన్ని శనివారం తెల్లవారుజామున పొక్లయిన్లు, బుల్డోజర్లతో కూల్చి వేసింది. దీనిపై శుక్రవారం హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వాటిని ధిక్కరించి పార్టీ కార్యాలయాన్ని కూల్చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యాలయ నిర్మాణంపై ప్రొసీజర్ ప్రకారం వ్యవహరించాలని కోర్టు చెప్పింది. దీని ప్రకారం మరో రెండుసార్లు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, కోర్టు ప్రొసీడింగ్ అందలేదంటూ కూల్చి వేయడం ప్రభుత్వ కక్ష సాధింపుకు నిదర్శనం. నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం నుంచే పొక్లయిన్లు, బుల్డోజర్లతో మోహరించారు. భవనం కూల్చివేతకు బందోబస్తు కావాలని పోలీసులను కోరగా, అసెంబ్లీ విధుల్లో ఉన్నందున తమ వద్ద తగిన సిబ్బంది లేరని వారు సమాధానం ఇచ్చారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో శనివారం ఉదయానికి పార్టీ కార్యాలయాన్ని కూల్చి వేయాలని సీఎంఓ నుంచి ఒత్తిడి రావడంతో శనివారం ఉదయం ఐదున్నర గంటలకు ప్రారంభించి ఏడున్నర గంటలలోపు పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారు. సీఆర్డీఏ అధికారులు, మున్సిపల్ అధికారులు ఈ కూల్చివేతను పర్యవేక్షించారు. పక్కాగా లీజున్నా దౌర్జన్యం గుంటూరు జిల్లా తాడేపల్లి గ్రామంలోని బోట్ యార్డు వద్ద సర్వే నంబర్ 202/ఎ–1లోని రెండు ఎకరాల స్థలాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణం కోసం 33 ఏళ్లకు లీజుకు ఇస్తూ గత ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ఆదేశాలు జారీ అయ్యాయి. 2012లో రాష్ట్రంలో పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులకు సంబంధించి విడుదల చేసిన జీవో నంబర్ 571 ఆధారంగా ఈ కేటాయింపులు జరిగాయి. స్థలం కేటాయించిన మూడేళ్లలో దేనికి కేటాయించారో ఆ విధంగా ఉపయోగించని పక్షంలో రద్దు చేస్తామని పేర్కొన్నారు. దీనికి భిన్నంగా భూమిని ఖాళీగా ఉంచితే ఆ భూమి కేటాయింపును జిల్లా కలెక్టర్ రద్దు చేసి వెనక్కు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది మార్చి 31న జీవో–52 ప్రకారం కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఈ భూమిని అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాదరావుకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. భూమిని కేటాయించినందుకు ప్రభుత్వానికి గత ఏడాది జూలై 26న రూ.66 వేలు చలానా కట్టారు. మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌కు ఈ నెల 15న రూ.4,44,312 ఆస్తి పన్ను కూడా చెల్లించారు. ఈ మేరకు అన్ని వివరాలతో సీఆర్డీఏకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో మొదటి అంతస్తు శ్లాబ్ పూర్తి అయ్యి, రెండో అంతస్తు శ్లాబ్ వేసే సమయంలో ఈ నెల 10న సీఆర్డీఏ అధికారులు నోటీసు జారీ చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ శుక్రవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ ప్రొసీజర్ పాటించాలని, తొందరపాటు చర్యలు వద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ సమాచారాన్ని వెంటనే సీఆర్డీఏ న్యాయవాదులతో పాటు సీఆర్డీఏ కమిషనర్‌కు వైఎస్సార్సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి ఫోన్ ద్వారా చేరవేశారు. దీంతో కోర్టు ఆదేశాలు తమకు అందడానికి ముందే పడగొట్టాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో శుక్రవారం సాయంత్రం నుంచే అక్కడ బుల్డోజర్లను మోహరించారు. దీనిపై సీఆర్డీఏ అధికారులతో మాట్లాడటానికి వైఎస్సార్సీపీ నాయకులు ప్రయతి్నంచినా వారు అందుబాటులోకి రాలేదు. శనివారం ఉదయం 5.30 గంటలకు అధికారులు కూల్చి వేశారు. నిర్మాణ దశలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని జేసీబీతో కూల్చివేస్తున్న దృశ్యం రైతుల నుంచి లాక్కున్న భూమిలో టీడీపీ కార్యాలయం నిర్మాణంగుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆత్మకూరులో జాతీయ రహదారిని ఆనుకుని కాలువ పోరంబోకు భూమిలో రైతులకు ఇచ్చిన పట్టా భూమిని ఆక్రమించుకుని టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించారు. ఆత్మకూరులో 1974లో రైతులు బొమ్మి రామిరెడ్డి (0.65 ఎకరం), కొల్లు రాఘవరావు (1.75 ఎకరాలు), కొల్లు భాస్కరరావు (1.75 ఎకరాలు)లకు ప్రభుత్వం మొత్తం 4.15 ఎకరాలకు డీకేటీ పట్టాలు ఇచ్చింది. టీడీపీ ఆ భూముల్ని స్వాధీనం చేసుకుని, ఇది సరిపోదన్నట్టు పక్కనే ఉన్న రెండెకరాల కాల్వ పోరంబోకును ఆక్రమించుకుని పార్టీ కార్యాలయాన్ని నిర్మించింది. టీడీపీ రాష్ట్ర కార్యాలయం మొత్తంగా 6.15 ఎకరాల భూమిని అక్రమంగా దక్కించుకుంది. ఏటా ఎకరాకు రూ.వెయ్యి చొప్పున 99 ఏళ్ల పాటు ప్రభుత్వానికి లీజు చెల్లించేలా జీవో జారీ చేయించుకుంది. ఈ భూమి ధర దాదాపు రూ.100 కోట్లకు పైమాటే. టీడీపీ భూ దందాపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి తహసీల్దారు జి.వి.రామ్‌ప్రసాద్.. ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలపై నోటీసులు జారీ చేశారు. కేవలం రోడ్డును ఆక్రమించి నిర్మించిన రేకుల షెడ్లను మాత్రమే తొలగించారు. కానీ నేడు వైఎస్సార్సీపీ నిర్మిస్తున్న కార్యాలయం మొత్తం కూల్చేయడం చంద్రబాబు కక్షపూరిత చర్యలకు అద్దం పడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నీకింత..నాకింత...భూ‘దండు’ పాళ్యం బ్యాచ్–4
చంద్రబాబుది పైకి అభివృద్ధి మంత్రం.. లోన కుట్ర, కుతంత్రం. అరచేతిలో సింగపూర్‌ను చూపించి.. అమరావతిని చంద్రబాబు అండ్ కో ముక్కలు చేసి పంచుకుంది. పచ్చదండు బినామీలు పచ్చని భూముల్ని గద్దల్లా తన్నుకుపోయారు. ఈ డ్రామాలో నారాయణ, లింగమనేని ఇలా ఎవరికి వారే వీర లెవల్లో రక్తి కట్టించారు. క్విడ్ ప్రోకోతో అనుమానం రాకుండా కథంతా నడిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట లింగమనేనికి భూముల లబ్ధి, నారాయణ కోసం అష్టవంకర్లుగా రింగ్ రోడ్డు ఎసిసోడ్ ఈ డ్రామాకే హైలైట్. బాబు, నారాయణ ద్వయం లింగమనేని రమేశ్‌తో ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్లో బేరం కుదుర్చుకుని క్విడ్ ప్రోకోకు బరితెగించారు. తిలా పాపం.. తలా పిడికెడు.. అన్నట్లు ఈ దోపిడీలో తన దత్తపుత్రుడికీ చంద్రబాబు కొద్దిపాటి వాటా పంచారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను తమకు భూములు కానుకగా ఇచ్చిన వారికి అనుకూలంగా చేయడమే ఈ క్విడ్ ప్రోకో కథ. ప్రతిఫలంగా హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు, బాబుకు కరకట్టపై బంగ్లా కానుక. రాజధానిలో కాగితాలపై ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్‌మెంట్‌ను ఇష్టమొచ్చినట్టుగా మెలికలు తిప్పుతూ తమ భూముల ధరలు వేల కోట్లకు పెంచుకోవడంలో చంద్రబాబు బరితెగింపునకు బాబోయ్ అనాల్సిందే. లింగమనేని రమేశ్ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.887.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చేశారు. ఈ కుంభకోణాన్ని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం పూర్తి ఆధారాలతో సహా వెలికితీసి చంద్రబాబు, నారాయణ, లింగమనేని రమేశ్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ కేపీవీ అంజని కుమార్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, నారా లోకేశ్‌లపై కేసు నమోదు చేసింది. సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు సాగించిన దోపిడీ కాండ గురించి రెండు మూడు సీజన్లతో వెబ్ సిరీస్ తీయొచ్చు. ఈ కుంభకోణంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పుల ఘట్టం అత్యంత కీలకం. సీఆర్డీఏ అధికారుల 94 కి.మీ. అలైన్మెంట్ ప్రకారం లింగమనేని, నారాయణ కుటుంబాలకు చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి ఐఆర్ఆర్ నిర్మించాలి. అయితే చంద్రబాబు ఆదేశాలతో సీఆర్డీఏ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారు. చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని ఐఆర్ఆర్ నిర్మించేలా అలైన్మెంట్ ఖరారు చేశారు. దీనిని గోప్యంగా ఉంచిన చంద్రబాబు, నారాయణలు తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేశ్ తన సంస్థల పేరిట ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు. అనంతరం సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చారు. అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్‌ను అమరావతి మాస్టర్ ప్లాన్‌లో చేర్చారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించారు. మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగానే డిజైన్ ఉండాలని ఈ కన్సల్టెన్సీకి షరతు విధించారు. అంటే... అప్పటికే సీఆర్డీఏ అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీని అడ్డం పెట్టుకొని ఆమోదించేలా చేశారు. ఇదేం పని నారాయణ! సీఆర్డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డును గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి కృష్ణా జిల్లాలోని నున్న మీదుగా నిర్మించాలి. గుంటూరు జిల్లాలోని నూతక్కి – కృష్ణా జిల్లా పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించి అక్కడ నుంచి తాడిగడప – ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు కొనసాగిస్తారు. ఇలాగైతే నారాయణ విద్యా సంస్థల భవనాలను భూసేకరణ కింద తొలగించాలి. దీంతో సీఆర్డీఏ అధికారులపై నారాయణ తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాలతో అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు. దీని ప్రకారం గుంటూరు జిల్లాలో రామచంద్రపురం– కృష్ణా జిల్లా చోడవరం మధ్య వంతెన నిర్మిస్తారు. అక్కడి నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మిస్తారు. హెరిటేజ్‌కు భూ సంతర్పణ అలైన్‌మెంట్‌ను మెలికలు తిప్పి లింగమనేని కుటుంబానికి కల్పించిన ప్రయోజనానికి క్విడ్ ప్రోకోగా హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు సమకూరాయి. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకునే కంతేరులో హెరిటేజ్ ఫుడ్స్‌కు 10.4 ఎకరాల లబ్ధి కలిగింది. 2014 జూన్–సెపె్టంబర్ మధ్యలో ఈ భూములను హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసినట్టు చూపించారు. ఈ వ్యవహారంలో హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ హోదాలో లోకేశ్ ఉన్నారు. లింగమనేని కుటుంబం నుంచి మరో 4.55 ఎకరాలను కొనుగోలు పేరిట హెరిటేజ్ ఫుడ్స్ దక్కించుకుంది. ఇదిలా ఉండగా క్విడ్ ప్రో కోలో భాగంగా లింగమనేని రమేశ్ కృష్ణా నది కరకట్ట మీద ఉన్న తమ బంగ్లాను చంద్రబాబుకు బహుకరించారు. పవన్ కల్యాణ్‌కు ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌కు సమీపంలోనే 2.4 ఎకరాలు ధారాదత్తం చేశారు. ఐఆర్ఆర్లో అవినీతి విశ్వరూపం ఐఆర్ఆర్ అలైన్మెంట్ ఖరారుకు ముందు ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.50 లక్షలుండేది. ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు తర్వాత ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ రూ.887.50 కోట్లకు పెరిగింది. అమరావతి పూర్తయితే ఎకరా విలువ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో రూ.4 కోట్లకు చేరుతుందని చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని ఆయన అంచనా వేశారు. అమరావతి నిర్మాణం పూర్తయితే లింగమనేని కుటుంబ సభ్యులకు చెందిన 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. మార్కెట్ ధర ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ 10.4 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి పూర్తయితే అది రూ.54 కోట్లకు చేరుతుందని లెక్క తేలింది. హెరిటేజ్ ఫుడ్స్‌తో ఒప్పందం చేసుకున్న మరో 4.5 ఎకరాల విలువ సైతం రూ.24 కోట్లకు చేరుతుంది. -
వార్షిక కౌలు జీవో అమలును నిలిపేయండి
సాక్షి, అమరావతి : రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతులకు వార్షిక కౌలును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలన్న సీఆర్డీఏ చట్ట నిబంధనను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. అమరావతి రైతులకు వార్షిక కౌలు చెల్లింపు నిమిత్తం రూ.240 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం గతేడాది మే 5న జారీ చేసిన జీవో 286 అమలును నిలిపేయాలని కోరుతూ విశాఖపటా్ననికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ యునైటెడ్ ఫ్రంట్ నార్త్ ఆంధ్రా జిల్లాల అధ్యక్షుడు పాక సత్యనారాయణ ఈ పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వీఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ.. ఏపీ క్యాపిటల్ సిటీ ల్యాండ్ పూలింగ్ స్కీం (ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్) రూల్స్ 2015, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ 2017ను శాసనసభ ఆమోదం లేకుండానే అప్పటి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. ఈ నిబంధనలను రాజధాని కోసం భూములిచ్చిన రైతులను ఆదుకునేందుకు తెచ్చారని తెలిపారు. అయితే వీటిని శాసనసభ ముందు ప్రవేశపెట్టనందున ఇవి చట్ట విరుద్ధమవుతాయన్నారు. వాస్తవానికి సీఆర్డీఏ 2014 చట్టంలో ఎక్కడా రైతులకు వార్షిక కౌలు చెల్లించాలని లేదని, అందువల్ల రాష్ట్ర ఖజానా నుంచి వార్షిక కౌలు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై లేదని వివరించారు. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 53(1)(డీ) ప్రకారం మొత్తం భూమిలో 5 శాతం భూమిని పేదల నివాసం కోసం గత ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా కేటాయించలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ చట్టం తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అందులో రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు రక్షణ కల్పించిందని గుర్తు చేసింది. అయితే ఆ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత ఉపసంహరించుకుందని వీఆర్ రెడ్డి తెలిపారు. అలా అయితే ఉపసంహరణ వల్ల చట్ట నిబంధనలు ఏ విధంగా ప్రభావితం అవుతాయో తెలియజేయాలని వీఆర్ రెడ్డికి ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. రైతుల తరఫున ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసేందుకు ధర్మాసనం అంగీకరించింది. -
ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న వైఎస్సార్ పింఛను కానుక పంపిణీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 65.92లక్షల మంది సామాజిక పింఛను లబ్ధిదారులకు నేటి ఉదయం(శుక్రవారం) నుంచి పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. ఈ నెల నుంచి సీఆర్డీఏ పరిధిలో ఉన్న భూమి లేని నిరుపేదల పెన్షన్‌ను రూ.2,500 నుంచి రూ.5,000లకు పెంచినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి నెల పింఛన్‌ను మార్చి ఒకటో తేదీన నేరుగా లబ్ధిదారుల చేతికి వారి ఇంటి వద్దే అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పంలో భాగంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. కాగా, శుక్రవారం తెల్లవారుజాము నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని వలంటీర్లు ప్రారంభించారు ఈ మేరకు పింఛన్ల కోసం ప్రభుత్వం రూ.1,958.52 కోట్లను ఇప్పటికే విడుదల చేసింది. ఇందుకోసం 2.66 లక్షల మంది వలంటీర్లు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. లబ్ధిదారులకు పింఛను అందజేసే సమయంలో గుర్తింపు కోసం ఆధార్ నిర్ధారిత బయోమెట్రిక్, ఐరిస్, ముఖ ప్రమాణీకరణ విధానాలను అమలు చేస్తున్నారు. అలాగే ఆర్బీఐఎస్ విధానం కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పింఛను అందలేదనే ఫిర్యాదు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది ఏపీ ప్రభుత్వం.. ఐదు రోజుల్లో పింఛన్లను నూరు శాతం పంపిణీ చేయాలని వలంటీర్లను ప్రభుత్వం ఆదేశించింది.. -
CRDA: నిరుపేదలకు ఇక డబుల్ పెన్షన్
సాక్షి, గుంటూరు: అమరావతి ఏపీ సీఆర్డీఏ పరిధిలో నివసించే నిరుపేదలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భూమి లేని పేదలకు పెన్షన్ రెట్టింపు చేస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పెంచిన పెన్షన్‌ను మార్చి 1వ తేదీ(ఎల్లుండి) నుంచే అందించనున్నట్లు పేర్కొంది. సీఆర్డీఏ పరిధిలో భూమిలేని నిరుపేదలకు ప్రస్తుతం రూ.2,500 పింఛను అందిస్తోంది. ఇప్పుడు దానిని రూ.5,000 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి ఒక గెజిట్‌ను విడుదల చేశారు. ఈ పెంపుతో సీఆర్డీఏ పరిధిలోని గ్రామాల్లో 17, 215 మంది లబ్ధిదారులకు మరింత మేలు జరగనుంది. -
ప్లాట్ల కేటాయింపు వెనుక వాస్తవాలకు ఈనాడు తూట్లు
సాక్షి, అమరావతి: అమరావతి సీఆర్డీఏ ప్రాంతంలో రైతులకు ప్లాట్ల కేటాయింపు వ్యవహారంపై ‘ఈనాడు’ దినపత్రిక మరోసారి తన దివాళాకోరు తనాన్ని బయటపెట్టింది. గత ప్రభుత్వంలో రైతులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంటే తట్టుకోలేక బురద జల్లేందుకు పూనుకుంది. ‘ప్లాట్లు రద్దు చేసుకోవాలంటూ రైతులకు లేఖలు’ శీర్షికన వాస్తవాలను దాచేసి పూర్తిగా వక్రీకరణకు దిగింది. వాస్తవానికి అమరావతి సీఆర్డీఏ ప్రాంతంలో గత ప్రభుత్వం భూ సమీకరణ ద్వారా 34,400 ఎకరాలను సమీకరించింది. ఈ భూములిచ్చిన రైతులకు 63,462 నివాస/వాణిజ్య ప్లాట్లు కేటాయించింది. అయితే.. కొందరు రైతులు భూ సమీకరణకు భూములిచ్చేందుకు నిరాకరించగా, ఇలాంటి చోటా గత ప్రభుత్వం భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై ఆ ప్రాంత రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించి స్టే కూడా తెచ్చుకున్నారు. ఈ వివాదాలు పరిష్కారం కాకుండానే ఆ భూముల్లోనూ ప్లాట్లను కేటాయించేశారు. గత ప్రభుత్వం భూసేకరణను, ప్లాట్ల కేటాయింపు ఎంత అస్తవ్యస్తం చేశారో చెప్పడానికి ఇదో నిదర్శనం. రైతులకు మేలు చేస్తుంటే తప్పుడు రాతలు సీఆర్డీఏ ప్రాంతంలో భూములిచ్చిన వారికి కేటాయించిన ప్లాట్లలో 3,356 ప్లాట్లు ఈ విధంగా భూ సేకరణ ప్రక్రియలో, కోర్టు తగాదాలతో రైతులకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు లేకున్నా 953 ప్లాట్లను రిజిస్టర్ చేసేశారు. అంటే భూమి లేకుండానే రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. ఈ సమస్యను సరిదిద్ది, ల్యాండ్ పూలింగ్‌కు భూములిచ్చిన వారికి మేలుచేసే ఉద్దేశంతో భూ సేకరణ, కోర్టు వివాదాల్లో ఉన్న ప్లాట్లకు ప్రత్యామ్నాయంగా వేరే ప్లాట్లను కేటాయించేందుకు ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్లాట్ల తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వుల్లోని 3వ నిబంధన మేరకు కేటాయించిన ప్లాటు విషయంలో ఏదైనా సమస్య ఉంటే నిర్ణీత కాలంలో పరిష్కరించేందుకు లేదా ప్రత్యామ్నాయ ప్లాటు కేటాయించేందుకు ఏపీ సీఆర్డీఏ బాధ్యత తీసుకుంది. అందుకు అనుగుణంగానే పూలింగ్‌కు భూములిచ్చిన యజమానుల అంగీకారం కోసం వారికి కేటాయించిన ప్లాట్లలో భూసేకరణ/కోర్టు వివాదాల సమస్య ఉన్నందున ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించేందుకు వారికి సమాచారం ఇచ్చి అంగీకారం తీసుకుంటోంది. ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించేందుకు ఈ ప్రక్రియ చేపడితే ఎల్లో మీడియా వక్రీకరించి ప్రభుత్వంపై బురద జల్లుతూ దిగజారుడు కథనాన్ని ప్రచురించింది. -
సెప్టెంబర్ 30 నుంచి ఆరోగ్య సురక్ష: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యసురక్షపై బుధవారం సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా.. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా? అనే బ్రోచర్ ని విడుదల చేశారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో మంత్రి విడదల రజని, సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆరోగ్య సురక్ష తర్వాత.. సీఆర్డీఏపై కూడా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అధికారుల సమీక్షలో సీఎం జగన్ ప్రకటించారు. జగనన్న సురక్ష తరహాలోనే ఈ ఆరోగ్య సురక్షని కూడా చేపట్టాలన్నారు. సురక్ష తరహాలో ప్రతి ఇంటికి వెళ్లి, వారి సమస్యలను తెలుసుకోవాలి. ఒక నిర్ణీత రోజున వారికి మంచి జరిగేలా హెల్త్ క్యాంపు నిర్వహించాలి. సురక్ష ద్వారా ప్రతి ఇంట్లో జల్లెడ పట్టి.. ఆరోగ్య సమస్యలను తెలుసుకోవాలి. వాటికి పరిష్కారమిచ్చే గొప్ప బాధ్యతను మనం తీసుకుంటున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘గ్రామంలో జల్లెడ పట్టి.. ఒక పర్టిక్యులర్ రోజు నాడు ఆ గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహిస్తాం. అందులో వారికి అవసరమైన పరీక్షలు చేయడం పాటు, మందులు, కళ్లద్దాలు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. అలా జల్లెడ పట్టిన ఆ గ్రామాన్ని మ్యాపింగ్ చేసి... ఆ గ్రామంలో ఏ సమస్యలున్నాయన్నది తెలుసుకుని ఫ్యామిలీ డాక్టర్ విలేజ్ క్లినిక్ ద్వారా వాటిని పరిష్కరిస్తారు. ఆ తర్వాత ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో ఎవరకి ఎలాంటి ట్రీట్ మెంట్ జరగాలి, ఎలాంటి మందులు కావాలో సూచిస్తాం. ఒకవైపు తనిఖీలు చేస్తూనే.. మందులు కూడా ఇవ్వబోతున్నాం. ఇది చాలా పెద్ద మార్పు. దీనికి సంబంధించిన బాధ్యత మీరు తీసుకోవాలి’’ అని సీఎం చెప్పారు. ‘‘ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో ప్రతి ఇళ్లు కవర్ కావాలి. క్రానిక్ పేషెంట్ల ఉన్న ఇళ్లను మరింత ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని పనిచేయడంతో పాటు వారిని చేయిపట్టుకుని నడిపించాలి. ఈ కార్యక్రమంలో గర్భవతులు, బాలింతలతో పాటు రక్తహీనత ఉన్నవాళ్లను కూడా గుర్తించాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, నియోనేటల్ కేసులతో పాటు బీపీ, షుగర్ వంటి వాటితో బాధపడుతున్నవారికి కూడా చికిత్స అందించాలి. ప్రతి మండలంలో నెలకు 4 గ్రామాల్లో ఈ క్యాంపులు నిర్వహించాలి. దీనివల్ల ప్రతి 6 నెలలకొకమారు ఆ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ హెల్త్ క్యాంపు నిర్వహించినట్లవుతుంది. సెప్టెంబరు 30 న కార్యక్రమం ప్రారంభమవుతుంది. రూ.1 ఖర్చు కూడా లేకుండా ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడం ప్రభుత్వ ఉద్దేశ్యం’’ అని సీఎం స్పష్టం చేశారు. చదవండి: ఈ నెల 20న ఏపీ కేబినెట్ సమావేశం -
నోటీసుల దశలో అప్పీల్ ఏంటి?
సాక్షి, అమరావతి: తమకు వార్షిక కౌలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీసీఆర్‌డీఏలను ఆదేశించాలని కోరుతూ హైకోర్టు సింగిల్ జడ్జి ముందు అమరావతి రాజధాని రైతు సంఘాలు దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే తమ ముందు ఆ సంఘాలు అప్పీల్ దాఖలు చేయడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. కోరిన విధంగా సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదన్న కారణంతో అప్పీల్ దాఖలు చేయడం ఎంత వరకు సబబని పిటిషనర్లను ధర్మాసనం ప్రశ్నించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదన్న కారణంతో అప్పీళ్ల దాఖలుకు అనుమతినిస్తే, ఇకపై అలా దాఖలయ్యే అప్పీళ్లకు అంతూ పొంతూ ఉండదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నోటీసు దశలో దాఖలయ్యే అప్పీళ్లు ప్రస్తుతం హైకోర్టు కొనసాగిస్తున్న సంప్రదాయ విధి విధానాలకు భంగం కలిగించినట్లు అవుతుందని తెలిపింది. అప్పీల్ దాఖలు చేసి అత్యవసరంగా విచారించాల్సినంత అవసరం ఇందులో ఏముందని, ఇదేమీ ఇళ్ల కూల్చివేత వ్యవహరం కాదు అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదే సమయంలో సీఆర్డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి సైతం ఈ అప్పీల్‌ను వ్యతిరేకించారు. ఈ అప్పీల్‌కే కాక, సింగిల్ జడ్జి ముందు దాఖలు చేసిన పిటిషన్‌కు సైతం విచారణార్హత లేదన్నారు. వార్షిక కౌలు చెల్లించాల్సింది రైతులకే తప్ప, రైతు సంఘాలకు కాదని ఆయన వివరించారు. సీఆర్డీఏ ఒప్పందాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రైతు సంఘాల తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు స్పందిస్తూ, నోటీసు దశలో అప్పీల్ దాఖలు చేయవచ్చునన్నారు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులున్నాయని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, కౌలు చెల్లించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని సీఆర్డీఏను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 12కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ వడ్డిబోయన సుజాతలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తమకు చెల్లించాల్సిన వార్షిక కౌలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఆర్డీఏలను ఆదేశించాలని కోరుతూ అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య, రాజధాని రైతు పరిరక్షణ సమితి హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశాయి. సీఆర్డీఏ అధికారులు అభ్యర్థించిన విధంగా వార్షిక కౌలు చెల్లింపుల మొత్తాలను ఆమోదించేలా పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరాయి. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ప్రభుత్వానికి, సీఆర్డీఏకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. తాము కోరిన విధంగా సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో, రైతు సంఘాలు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశాయి. ఈ అప్పీల్ గురించి ఉన్నం మురళీధరరావు గత వారమే సీజే ధర్మాసనం ముందు ప్రస్తావించారు. సీజే సైతం నోటీసుల దశలో అప్పీల్ దాఖలుపై అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
‘బాబువి గాలి కబుర్లు.. ఈయన్ని చూసి తెలుసుకోండి’
సంపద సృష్టి అనే మాటను తరచూ వింటుంటాం. ప్రత్యేకించి ఏపీలో ఒక నాయకుడు తనకే సంపద సృష్టించడం తెలుసు అని ఏదేదో చెబుతుంటారు. కానీ, మరో నాయకుడు సంపద సృష్టించి చూపించారు. తనకు మళ్లీ అధికారం ఇస్తే పేదలను ధనికులను చేస్తానని పద్నాలుగేళ్లు సీఎంగా పనిచేసిన టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెబుతుంటే, ముఖ్యమంత్రి జగన్ తాను అధికారంలో ఉన్న సమయంలోనే పేదలకు లక్షల విలువైన ఆస్తి సమకూర్చి ‘ఇదీ.. పేదలను ఆదుకోవడం’’ అని రుజువు చేసుకుంటున్నారు. అమరావతి రాజధాని గ్రామాలలో ఇరవైఐదు లే అవుట్లలో పేదలకు ఇళ్ల నిర్మాణానికి శ్రీకారంచుట్టిన సందర్భంగా జగన్ చేసిన ప్రసంగం చూస్తే కొన్ని స్పష్టమైన నినాదాలు, విధానాలతో ఆయన ముందుకు వెళుతున్నట్లు అర్ధం అవుతుంది. తొలుత ఒక లబ్దిదారు మాట్లాడుతూ తనకు కేటాయించిన సెంటు భూమి విలువ ఇప్పుడు పది లక్షలకు పైనే ఉంటుందని ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. దానికి తోడు ఇప్పుడు ఇంటి నిర్మాణానికి మరో మూడు లక్షలు, అక్కడ మౌలిక వసతులకు ఖర్చు పెట్టబోయే నిదులను లెక్క వేసుకుంటే మొత్తం పదిహేను లక్షల వరకు ఆమెకు సమకూరినట్లవుతుంది. నిజంగానే సంపదను సృష్టించడం అంటే ఇది కదా అని అనిపిస్తుంది. ✍️ గతంలో అమరావతి గ్రామాలలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. రాజధాని అని ప్రకటించినప్పుడు భూములు కలిగిన ఆసాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు లబ్ది పొందితే.. ప్రస్తుతం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నిరుపేదలకు ఆ ప్రాంతంలో లబ్ది పొందడం గమనించదగిన అంశమే అవుతుంది. అందుకే ఆయన పెత్తందారులే అక్కడ పాగ వేయాలని అనుకున్నారని, కాని తాము పేదలకు అవకాశం ఇచ్చామని, దీనిని సామాజిక అమరావతిగా. మనందరి అమరావతిగా మార్చామని జగన్ ప్రకటించారు. అంతేకాదు.. ఉపన్యాసం ఆరంభంలోనే ఈ ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా, ఆ తర్వాత ఇళ్ల నిర్మాణం జరగకుండా చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు అడ్డుపడ్డారంటూ ధ్వజమెత్తారు. ✍️ అయినప్పటికీ మీ బిడ్డ మీ తరపున మూడేళ్లపాటు న్యాయపోరాటం చేసి, పేదలకు ఇళ్లు కట్టించడం వరకు తెచ్చామని, ఇది చరిత్రాత్మకమైన రోజు అని జగన్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు ఇళ్లు కట్టవద్దంటూ ఏపీలోనే ప్రతిపక్షం అడ్డుపడిందని ఆయన మండిపడ్డారు. హైకోర్టులో 18 కేసులు, సుప్రీం కోర్టులో ఐదు కేసులు వేసి అడ్డుకునే యత్నంచేశారని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు తన మనుషుల ద్వారా కేంద్ర మంత్రులను, అధికారులను కలిసి పేదలకు ఇళ్లు రాకుండా చేయాలని, నిధులు రాకుండా అడ్డుపడాలని చూశారని ఆయన తెలిపారు. ఊరుపేరులేని సంఘాలను కూడా ఇందుకోసం ఏర్పాటు చేశారని ఆయన చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ✍️ ఒకప్పుడు అమరావతి రాజధానిలోకి జగన్ రాకూడదని కొందరు పసుపు నీళ్లు చల్లి అవమానించే యత్నం చేస్తే.. ఇప్పుడు అదే ప్రాంతంలో జగన్ యాభై నాలుగువేల మందికి ఇళ్లు కట్టిస్తుండడం విశేషం. చంద్రబాబు ఆధ్వర్యంలోని తెలుగుదేశం, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన , అలాగే ఈనాడు తదితర ఎల్లో మీడియా పేదలకు ఎలా వ్యతిరేకంగా ఉన్నారో ఆయన ఆధారసహితంగా వివరించడం ద్వారా రాష్ట్రం అంతటికి ఒక మెస్సేజ్ పంపించారు. తాను పేదల ప్రతినిధినని.. చంద్రబాబు, పవన్ లు పెత్తందార్ల ప్రతినిధులని, పేదల కోసం తాను పలు స్కీములు అమలు చేస్తుంటే, చంద్రబాబు తదితరులు వాటిని అడ్డుకుంటున్నారని.. తాను చేస్తున్న వాదనకు ఆయా ఉదాహరణలను కూడా జగన్ ఇచ్చారు. ప్రత్యేకించి పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం వద్దంటున్నారని ఆయన గుర్తు చేశారు.అదే టైమ్ లో ఆ పెత్తందార్లంతా తమ పిల్లలను ఇంగ్లీష్ బడులలో చదివిస్తున్నారని ఎద్దేవ చేశారు. ✍️ పేదవారికి తాను మేలు చేస్తుంటే వీరు ఓర్వలేకపోతున్నారని చెప్పడానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. వలంటీర్ల వ్యవస్థ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. కాకపోతే వెంకటగిరిలో చేసిన వ్యాఖ్యలను ఇక్కడ ఆయన మాట్లాడలేదు. మొత్తం స్పీచ్ లో పెత్తందార్లు, పేదల మధ్య పోరాటం గురించే ఆయన చెప్పే యత్నం చేశారు కాని, ఇతరత్రా రాజకీయ అంశాల జోలికి వెళ్లలేదు. ✍️ అమరావతి ప్రాంతంలో గజం విలువపదిహేను వేల వరకు ఉన్న విషయాన్ని ప్రస్తావించి , ఆ స్థలాలతో పాటు,రోడ్లు, నీరు, పార్కులు, తదితర సదుపాయాలు సమకూర్చుతున్న సంగతిని ఆయన వివరించి 12 లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయల మేర ఆస్తిని సమకూర్చినట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి పేదలకు సంబంధించి ఇంత భారీ కార్యక్రమం చేపట్టలేకపోయారు. సంపద సృష్టి అంటే ఆయన ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్నే చూస్తారన్న భావన ఉంది. అదికూడా బాగా డబ్బున్నవారికే అదనంగా వచ్చే ఆదాయవనరుగా మార్చడం మినహాయించి పేదల పక్షాన ఆయన ఉండేవారు కాదన్న విమర్శ ఎప్పటినుంచో ఉంది. అమరావతిని ఒక వర్గం రాజధానిగా, ధనికుల రాజధానిగా మార్చడానికి చంద్రబాబు ప్రయత్నించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నిరసనకు గురయ్యారు. అందుకే అమరావతిని జగన్ పేదలు కూడా నివసించే రాజధానిగా మార్చినట్లయింది. ఇక్కడ కొందరు ఒక విషయం ప్రస్తావిస్తున్నారు. ✍️ జగన్ ఇక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది వాస్తవమేకాని, ఇతరత్రా అభివృద్ది ఎందుకు చేయడం లేదని అడుగుతున్నారు. దానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టమైన జవాబు ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో ఏ పని చేద్దామన్నా కేసులు వేసి అడ్డుకుంటున్నవారే ఈ ప్రశ్నలు వేస్తున్నారని , తమకు అన్ని ప్రాంతాలు సమానమేనని, కేసుల గొడవ లేకపోతే అమరావతిని కూడా అభివృద్ది చేసి చూపిస్తామని ఆయన అన్నారు. రాజధాని గ్రామాలలో కొంతమంది తెలుగుదేశం, తదితర కొన్ని రాజకీయ పక్షాల ట్రాప్ లో పడి , అక్కడ అభివృద్ది కన్నా, ఆందోళనలకే ప్రాధాన్యం ఇచ్చారు. అది వాస్తవం. ✍️ చంద్రబాబు నాయుడు పరాజయం చెందినా, ఆయన మాట ప్రకారమే నడుచుకుని వాళ్లు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. అదే జగన్ ముఖ్యమంత్రి కాగానే అనవసర నిరసనలకు పోకుండా, వారంతా ఒక కమిటీగా ఏర్పడి, జగన్ ను కలిసి తమకు కావల్సిన అభివృద్ది పనులను చేయించుకుని ఉంటే బాగుండేది!. పైగా ఒకేసారి 55 వేల ఎకరాల భూమిని అభివృద్ది చేయడం ఎవరి వల్లా కాదు. చంద్రబాబు నాయుడు ప్రచారం కోసం అలివికాని పనిని భుజాన వేసుకుని చతికిలపడ్డారు. పైగా ఆయన టైమ్ లో రాజధాని ప్రాంతంలో పేదలకు ప్రాతినిధ్యమే లేదన్నట్లుగా వ్యవహారాలు సాగాయి. చివరికి అస్సైన్డ్ భూములను కూడా తమ అధీనం చేసుకున్నారు. దానికి ఆనాటి ప్రభుత్వం సహకరించి అప్రతిష్టపాలైంది. ఏది ఏమైనా జగన్ ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి కొత్త టౌన్ షిప్ లు నిర్మించడం కూడా అభివృద్దిలో భాగమే అవుతుంది. ఇదే మాదిరి ఇతరత్రా అభివృద్ది పనులు కూడా జరిగేలా అందరు సహకరిస్తే మంచిది. లేకుంటే ఎప్పటిమాదిరి పెత్తందారి పోకడలతోనే,కుట్రలలోనే భాగస్వాములవుతామని ప్రతిపక్షం అనుకుంటే అది వారికే నష్టం అని వారు తెలుసుకోవాలి. ::: కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
అమరావతి అందరిదీ
పేద వర్గాలపై పెత్తందారుల దోపిడీలను సహించి భరించే కాలం పోయింది. ఈ మార్పు ఇక మీదట రాజకీయాలను శాసిస్తుంది. అలాంటి మార్పులకు మనసా వాచా కర్మణా సహకరించే ప్రభుత్వంగా, మీ అన్నగా.. నిరుపేద అక్కచెల్లెమ్మల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనతో ‘సామాజిక అమరావతి’కి పునాదిరాయి వేస్తున్నా. ఇక నుంచి అమరావతి మనందరిది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పేదలకు మేలు జరిగే ప్రతి విషయంలో మనందరి ప్రభుత్వానికి, చంద్రబాబు పెత్తందారుల కూటమికి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. పేదలకు మంచి జరగకూడదని రాక్షస బుద్ధితో అడ్డుకుంటున్న వారితో పెద్ద యుద్ధమే చేస్తున్నామన్నారు. సోమవారం సీఆర్డీఏ పరిధిలో పేదలకు 50,793 ఇళ్ల నిర్మాణం, 45 సామాజిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో సీఎం జగన్ మాట్లాడారు. తొలుత తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం లేఅవుట్ వద్దకు చేరుకున్న సీఎం జగన్ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం వెంకటపాలెం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుని లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... వెంకటపాలెంలో జరిగిన సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం ఆ తర్వాత కూడా బుద్ధి మారలేదు.. సీఆర్డీఏలో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద కుటుంబ సభ్యులందరికీ ఇళ్లç స్థలాలు ఇవ్వకుండా, ఇళ్లు కట్టించకుండా చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు సృష్టించిన ఊరుపేరూ లేని సంఘాలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ – 5 అడ్డు తగిలాయి. వీరంతా మొదట పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు వీల్లేదన్నారు. ఇందుకోసం ఏకంగా హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లిన దౌర్భాగ్యమైన పరిస్థితిని మన రాష్ట్రంలో మాత్రమే చూస్తున్నాం. ఈ పెద్దమనుషులు, పెత్తందార్లు, పేదల వ్యతిరేకులంతా హైకోర్టులో 18 కేసులు, సుప్రీం కోర్టులో 5 కేసులు వేశారు. ఈ కేసులను పరిష్కరించేందుకు మీ తరపున మీ బిడ్డ మూడేళ్ల పాటు పోరాటం చేస్తూ వచ్చాడు. దేవుడు, ప్రజల చల్లని ఆశీస్సులు ఎప్పుడూ మంచికే ఉంటాయి. హైకోర్టు, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వమే కేసులు గెలిచింది. అనుమతులు తెచ్చుకుని మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఆ తర్వాత కూడా వారి బుద్ధి మారలేదు. ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఆపలేకపోయారు కాబట్టి పేదల ఇళ్ల నిర్మాణానికి అడ్డు తగిలేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో వారు ఎక్కని గడప దిగని గడప లేదు. కలవని కేంద్ర మంత్రీ, కేంద్ర సెక్రటరీలు కూడా లేరు. ఇంతమందిని కలిశాక చివరి ప్రయత్నంగా మళ్లీ హైకోర్టులో కేసు వేశారు. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఎప్పుడూ ఎక్కడా ఉండదు. చరిత్రలో నిలిచిపోయే రోజు ఇంతమంది పెత్తందార్లు ఒక్కటై పేదవాడికి ఇళ్లు రాకూడదని అడ్డుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నించిన పరిస్థితులు దేశ చరిత్రలో ఎప్పుడూ గుర్తుండిపోతాయి. ఇలా పేదల శత్రువులతో ఎంతో సంఘర్షణ, ఎన్నెన్నో అవరోధాలను అధిగమించి విజయం సాధించి పేదల ఇళ్లకు శంకుస్థాపన చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. మీ ఇళ్ల నిర్మాణానికి, మీ ఇంటి కలల సాకారానికి ఇవాళ ఇక్కడ పునాదులు కూడా వేస్తున్నాం. అక్కచెల్లెమ్మల సొంతింటి కలల సాకారానికి మనం చేసిన సామాజిక న్యాయ పోరాటం చరిత్ర ఉన్నంత వరకూ ఎప్పడూ మర్చిపోలేనిది. పెత్తందారులపై పేదవాడు, పేదల ప్రభుత్వం సాధించిన విజయంగా చరిత్రలో పదిలంగా ఉంటుంది. గతంలో ఎన్నడూ చూడలేదు అమరావతిని పేరుకేమో రాజధాని అంటారు. రాజధానిలో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఒక సెంటు స్థలం ఇచ్చి ఇళ్లు కట్టిస్తామంటే అడ్డుపడి కోర్టులకు వెళ్లారు. పేదలకు ఇళ్లు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ (సామాజిక అసమతుల్యత) వస్తుందని, కులాల సమతుల్యం దెబ్బతింటుందని న్యాయస్థానాల్లో వాదించిన చరిత్ర వీళ్లది. ఇలాంటి పెత్తందారులున్న వ్యవస్థతో మనం యుద్ధం చేస్తున్నాం. ఇంత దుర్మార్గమైన మనుషులను, మనస్తత్వాలను, వాదనలను, రాతలను, టీవీల్లో డిబేట్లను, రాజకీయ పార్టీలను గతంలో ఎప్పుడూ చూడలేదు. నయా జమీందార్ల మొసలి కన్నీరు పేద పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుంటే ఈ నయా జమీందార్లు, పెత్తందార్లంతా అడ్డుతగిలే కార్యక్రమం చేశారు. తెలుగు భాష ఏమైపోతుందని మొసలి కన్నీరు కారుస్తారు. ఈ పెత్తందార్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లను మాత్రం ఇంగ్లీష్ మీడియం బడులకే పంపిస్తారు. మన పిల్లలు మాత్రం తెలుగు బడులకే పోవాలంటారు. నా అక్కచెల్లెమ్మలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు అడుగులు ముందుకు వేస్తే రకరకాల కోర్టు కేసులు వేశారు. పేదవాడు ఎప్పుడూ పేదవాడుగానే మిగిలిపోవాలన్న పెత్తందారీ ఆలోచనకు ఇవొక నిదర్శనాలు. మీ బిడ్డ పేదల కోసం అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఎలాంటి లంచాలు, వివక్షకు చోటివ్వకుండా బటన్ నొక్కి రూ.2.25 లక్షల కోట్లు పంపిస్తే దాన్ని కూడా అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. మీ బిడ్డ మాదిరిగా పరిపాలన చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని గగ్గోలు పెడుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించండి గతంలోనూ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్. చంద్రబాబు హయాంలో కన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల వృద్ధి రేటు తక్కువ. మరి మీ బిడ్డ ఈ రోజు ఎలా చేయగలుగుతున్నాడు? ఆ రోజు గజదొంగల ముఠా ఎందుకు చేయలేకపోయింది? మీ బిడ్డ హయాంలో ఎటువంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు ఎలా వస్తున్నాయి? చంద్రబాబు హయాంలో ఎందుకు రాలేదు? ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఏ పేదవాడు, అవ్వాతాతలు ఇబ్బంది పడకూడదని వలంటీర్, సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చాం. లంచాలు, వివక్షకు తావివ్వకుండా ఒకటో తారీఖునే అది ఆదివారమైనా, పండగరోజైనా సరే తెల్లవారుజామునే తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి చేతిలో పెన్షన్ డబ్బులు పెడుతున్నారు. ఈ వ్యవస్థను కూడా పెత్తందార్లు, పేదల వ్యతిరేకులు అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు. హీరోయిజంగా చిత్రీకరిస్తున్నారు ఏ సమాజమైనా, కుటుంబమైనా నిన్నటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్ బాగుండాలని కోరుకుంటుంది. అలాంటి వారి ఎదుగుదలకు సహకరిస్తే దాన్ని మంచి ప్రభుత్వం అంటారు. అలాంటి ఎదుగుదలను, అభివృద్ధిని అడ్డుకుంటే, వ్యతిరేకిస్తే దాన్ని దుర్మార్గం, అమానుషత్వం, రాక్షసత్వం అంటారు. విచిత్రమేంటంటే పేదలకు మంచి చేయడాన్ని అడ్డుకుంటూ దాన్ని వారు హీరోయిజంగా చిత్రీకరిస్తున్నారు. ఈ రోజు ఉదయాన్నే ఈనాడు పేపర్లో చూశా. వాళ్లు రాసిన రాతలు చూసి ఆశ్చర్యం అనిపించింది. దిగజారుడుతనం ఏ స్థాయికి వెళ్లిందంటే చంద్రబాబు బినామీల అమరావతిలో ఉండేందుకు అమెరికా, సింగపూర్ల నుంచి మనుషులు రావచ్చట. కానీ ఇదే అమరావతిలో చుటు్టపక్కల ఉన్న పేదలకు మాత్రం ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని ఈనాడులో రాస్తారు. ఇంత దిక్కుమాలిన పెత్తందారులు, పేదల వ్యతిరేక భావజాలం ఎక్కడైనా ఉంటుందా? జగనన్నను టచ్ కూడా చేయలేరు ఎన్నికల సీజన్ రాగానే కొందరు రోడ్డెక్కి మాట్లాడుతున్నారు. చంద్రబాబునాయుడు పేదలను పీక్కుతిన్నాడు. పవన్‌కళ్యాణ్ ఎన్నో పార్టీలు మార్చాడు. బీఎస్పీ, బీజేపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం.. ఇలా ఎన్ని పార్టీలైనా మార్చగలడు. మా జగనన్నను ఓడిస్తారా.. ఎంతమంది వచ్చినా ఆయన్ను టచ్ కూడా చేయలేరు.ఇంకొకడు జగనన్నతో పోటీ అంటూ నడుస్తున్నాడు. నువ్వెంత నీ స్థాయి ఎంత? పెత్తందార్ల కోటలను బద్దలుకొట్టి, పేదల పక్షాన నిలిచి సుప్రీంకోర్టు దాకా వెళ్లి వారిని గెలిపించి జగన్ చరిత్రను తిరగరాశారు. పేదలకు ఇళ్ల స్థలాలు వద్దు అని కోర్టుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు. – జోగి రమేష్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మీరొచ్చాకే బడుగు వర్గాలకు ధైర్యం వచ్చింది మీరు పాదయాత్ర చేస్తే రోడ్లపై పసుపు నీళ్లు చల్లిన వ్యక్తులను ఇక్కడ చూశాం. మా సమస్యలు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. జగనన్న వచ్చిన తర్వాత మాకు ధైర్యం, భరోసా వచ్చింది. జగన్ పేదల పక్కనుంటే చంద్రబాబు పెత్తందార్ల తరఫున యుద్ధం చేస్తున్నాడు. కోర్టులలో సైతం జగన్ గెలిచి ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం చేపట్టారు. జీవితకాలం పేద వాడి గుండెల్లో మీ పేరు నిలిచిపోతుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి పేదలను లక్షాధికారులను చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుంది. – బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పాలకుడంటే ప్రజల కన్నీటిని తుడిచేవాడు.. పాలకుడంటే పాలించేవాడే కాదు, ప్రజల సంక్షేమాన్ని కోరుతూ వారి కన్నీటిని తుడిచేవాడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త అర్థం చెప్పారు. మేం మీకు రుణపడి ఉంటాం. మీరే మా ధైర్యం అన్నా. మీకు పక్కనే ఉన్న వెంకన్న స్వామి, కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. మాకు పట్టాలు ఇచ్చినప్పుడు చాలా సంతోషం వేసింది, ఇప్పుడు ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. మేం అనేక పథకాల ద్వారా కూడా లబ్ధిపొందుతున్నాం. నగదు రూపంలో మొత్తం రూ.1,89,250, స్థిరాస్తి రూపంలో రూ.పది లక్షల నుంచి రూ. పదిహేను లక్షలు వరకు లబ్దిపొందాను. – రోజా, లబ్ధిదారు, మంగళగిరి వలంటీర్లపై బురద జల్లుతున్నారు నేను సొంత ఇల్లులేక, అద్దెలు కట్టుకోలేక ఇబ్బందులు పడ్డాను, నాకు ఏ ప్రభుత్వంలో ఇల్లు రాలేదు, కానీ, మీరు రాగానే మంజూరైంది, మా పేదల తరఫున మీరు నిలబడి చేసిన న్యాయపోరాటానికి మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. నేను వైఎస్సార్ ఆసరా ద్వారా లబ్ధి పొందాను, నా కొడుకు ఈ రోజు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడంటే మీరే కారణం. అన్నా.. నేను నాలుగేళ్లుగా వలంటీర్‌గా సేవలు అందిస్తున్నాను, ఈ మధ్యకాలంలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మాపై బురద జల్లుతున్నారు. మీరు మాకు ధైర్యం ఇచ్చారు, థాంక్యూ అన్నా. – స్వప్న, లబ్దిదారు, రాణిగారితోట, విజయవాడ తూర్పు నియోజకవర్గం -
ఇంత దుర్మార్గులను ఇక్కడే చూస్తున్నాం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా.. ఇళ్లు కట్టించి ఇవ్వకుండా అడ్డుతగిలిన ప్రబుద్ధులు ఉన్నారు. ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక దత్తపుత్రుడు.. వీళ్లకు తోడు చంద్రబాబు పుట్టించిన ఊరు-పేరు లేని సంఘాలు. వీళ్లంతా పేదవాడికి ఇల్లు రాకూడదని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలోనే చూశాం. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయ పార్టీలను ఎక్కడా చూడలేదు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కృష్ణాయపాలెంలో ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి.. పట్టాలు అందించి.. మోడల్ హౌజ్‌లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారాయన. అనంతరం వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘‘ఇవాళ రాష్ట్ర చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయే రోజు. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు.. పేదలందరికీ ఈరోజు మరిచిపోలేనిది. పేదల శత్రువులపై పేదలు సాధించిన విజయం ఇది. ఇళ్లు కట్టిస్తానని గతంలో చంద్రబాబు మోసం చేశారు. పేదవాడికి ఇల్లు రాకూడదని.. అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. దీనికోసం సుప్రీం కోర్టు దాకా వెళ్లి మరీ ప్రయత్నించారు. ఇలాంటి పరిస్థితి మరెక్కడా రాకూడదు’’.. ఇవాళ పేదల విజయంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. పేదల వ్యతిరేకులంతా 18 కేసులు వేశారు. ఇందుకోసం ఎక్కడని గడపంటూ లేదు. మూడేళ్ల తరపున మీ కోసం పోరాటం చేశాం. అందుకే.. ఇది పెత్తందారుల మీద పేదల ప్రభుత్వం సాధించిన విజయం. రాక్షస బుద్ధితో ఉన్నవారితో మనం యుద్ధం చేస్తున్నాం. ఈ పెత్తందారులు.. పేదవాడికి ఇంగ్లీష్ మీడియం అవసరమా? అని ప్రశ్నించిన వాళ్లు.. తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదివిస్తారు. సంక్షేమం అందిస్తుంటే రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ ప్రచారం చేస్తారు. మరి చంద్రబాబు తన హయంలో పేదలకు ఉపయోగపడే పనులు ఎందుకు చేయలేదు అని సీఎం జగన్ నిలదీశారు. పేద పిల్లలు బాగుపడడం వాళ్లకు ఇష్టం లేదు. పెత్తందారుల బుద్ధి ఎలా ఉందో గమనించండి అంటూ ఏపీ ప్రజలకు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఇక సామాజిక అమరావతి.. మనందరిది పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తే రాజధాని అభివృద్ధి చెందదని కొందరు వాదించారు. పేరుకు ఇది రాజధాని.. అలాంటిది పేదలు ఇక్కడ ఉండకూడదా?. అందుకే.. ఇప్పుడు పేదలకు అండగా మార్పు మొదలైంది. అమరావతిని సామాజిక అమరావతిగా ఇవాళ పునాది రాయి వేస్తున్నా. ఇక నుంచి అమరావతి మన అందరిది. ఎన్నో అవరోధాలను అధిగమించి ఇళ్లు నిర్మిస్తున్నాం. పేదల విజయంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. మహిళా సాధికారకతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాం. అక్కచెల్లెమ్మల పేరిటే ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షలు ఖర్చు చేస్తున్నాం. 793 ఇళ్ల నిర్మాణం కోసం రూ.1,370 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అన్ని సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తున్నాం. నాలుగేళ్లుగా ఎంతో మంచి చేశాం. గత ప్రభుత్వం చేయని మంచి చేశాం. మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఉండాలి అని ఆయన ప్రజలను కోరారు. పేదవాడి సొంతటి కల సీఆర్డీఏ పరిధిలో పేదల ఇళ్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. కృష్ణాయపాలెంలో పేదల ఇళ్ల నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రూ. 1,829. 57 కోట్ల వ్యయంతో.. 50 వేల మందికి పైగా పేదలకు స్థిర నివాసాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 1,402.58 ఎకరాల్లో.. 50, 793 మంది పేదలకు ఉచితంగా ఇళ్ల పంపిణీ చేయనుంది జగనన్న ప్రభుత్వం. -
పేదల ఇళ్లపై ప్రేమంటే ఇదే.. తొలి ఇల్లు అందుకున్న ఈపూరి జీవరత్నం
సాక్షి, గుంటూరు: పేదరికంపై యుద్ధం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ సమరంలో పెత్తందారులనే శత్రువులు ఎన్ని ఆంటకాలు కల్పిస్తున్నా మొక్కవోని సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో.. అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి నేడు(సోమవారం) శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో పర్యటించి.. సీఆర్డీఏ జోన్లో పేదల ఇళ్ల కోసం చేపట్టిన నిర్మాణాలకు స్వయంగా భూమి పూజ నిర్వహించి.. తొలి ఇంటి పట్టా పత్రాలను అందించారు. సీఆర్డీఏలో పూర్తైన తొలి ఇల్లు కృష్ణాయపాలెంకు చెందిన ఈపూరి జీవరత్నందే. చంద్రబాబు హయాంలో రెండుసార్లు దరఖాస్తు చేసుకున్న సొంతింటి కల నెరవేరలేదట. కానీ, సీఎం జగన్ హయంలో ఒక్కసారి దరఖాస్తు చేయగానే కేటాయించారని చెబుతున్నారామె. జీవరత్నం భర్త వ్యవసాయ కూలీ. పేద కుటుంబానికి చెందిన ఈమె వాలంటీర్ కూడా. ఆమె పిల్లలకు అమ్మ ఒడి కింద సాయం.. పొదుపు సంఘంలో ఉన్న ఈమెకు నాలుగు విడతల్లో రూ. 10వేల చొప్పున రుణమాఫీ కూడా జరిగింది. అయితే.. తన పుట్టింటి వాళ్లు కూడా జగనన్నలా ఆలోచించలేదని అంటున్నారామె. ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా.. ఒక అన్నలా(సీఎం జగన్‌ను ఉద్దేశించి..) లక్షల రూపాయల విలువ చేసే ఆస్తి అందించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారామె. తన మెడలోని కండువా తీసి లబ్ధిదారుల కూతురి మెడలో కప్పిన సీఎం జగన్ జీవితాంతం రుణపడి ఉంటా లేఅవుట్లో తొలుత నాకు కేటాయించిన స్థలంలో మోడల్ హౌస్ నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. సెంటు స్థలంలో ఇల్లు బాగా వచ్చింది. ఇల్లు కట్టుకోవడమే కలగా మిగిలిపోతుందని అనుకున్నా. కానీ, జగనన్న స్థలం ఇవ్వడమే కాక ఇల్లు కట్టించి నా కలను సాకారం చేశాడు. సెంటు స్థలంలో ఇల్లు ఎలా వస్తుందని అన్న వారు దీనిని చూడాలి. సొంతింటి కల సాకారం చేసిన సీఎం జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. :::ఈపూరి జీవరత్నం, కృష్ణాయపాలెం అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందన్న పెత్తందారుల వితండ వాదాలకు.. యెల్లో మీడియా వత్తాసు పలుకుతోంది. పైగా ఒకవైపు కార్యక్రమం జరుగుతున్న సమయంలోనూ ‘పేదల ఇళ్లపై ప్రేమంటే ఇదేనా?’ అంటూ విషం చిమ్ముతోంది. కానీ, వాటన్నింటికి చెక్ పెడుతూ నిరుపేద అక్కచెల్లెమ్మల సొంతింటి కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేసింది. ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం పండుగలా సాగుతోంది. సొంతింటి కల నెరవేరుతుండడంతో.. బస్సుల్లో కృష్ణాయపాలెంకు తరలివచ్చిన లబ్ధిదారులు.. అంతకు ముందు దివంగత మహానేత వైఎస్సార్, జననేత వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. -
ప్రజాప్రభుత్వ ఆవిష్కరణలో మరో మైలురాయి
-
అమరావతిలో ఇళ్ల నిర్మాణం.. సీఎం సంకల్పానికి తార్కాణం
మంగళగిరి/సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు కట్టడం ఒక ఎత్తయితే.. అమరావతి రాజధానిలో అది మరొక ఎత్తని, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృఢ సంకల్పానికి ఇది తార్కాణమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ఎంపీ నందిగం సురేష్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలోని జగనన్న లేఅవుట్లో ‘నవరత్నాలు–పేదలందరికే ఇళ్లు’ పథకం ద్వారా నిర్మిస్తున్న గృహాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న ప్రాంతాన్ని ఆదివారం వారు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఆర్డీఏ పరిధి అమరావతి రాజధానిలో పేద, బడుగు, బలహీనవర్గాలు ఉండటానికి వీల్లేదని.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని చంద్రబాబు, ఆయన సామాజికవర్గం మాత్రమే ఇక్కడ నివసించాలని కుట్రతో కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. అయినా.. ముఖ్యమంత్రి పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు 50 వేలకు పైగా ఇళ్ల పట్టాలను ఇవ్వడమే కాక అక్కడ ఇళ్లను సైతం నిర్మించి ఇచ్చేందుకు చేస్తున్న కృషి ఆయన దృఢ సంకల్పానికి నిదర్శనమని మంత్రులు కొనియాడారు. ఇక్కడ ఇళ్ల నిర్మాణం జరగదని, పేదలకు ఇళ్లు రావని టీడీపీతో పాటు ఆయన తోక పారీ్టలు చెప్పినా, ఎన్ని కుట్రలు చేసినా పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చి తీరుతున్నామన్నారు. ఇది రాష్ట్రంలో చారిత్రక ఘట్టమని, రాష్ట్ర ప్రజలంతా పండుగ చేసుకుంటుంటే చంద్రబాబు మాత్రం కడుపుమంటతో రగలిపోతున్నాడన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇళ్లు.. ఇక అమరావతిలో ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజతో పాటు సామాజిక మౌలిక వసతులకు సంబంధించి అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, డిజిటల్ లైబ్రరీ, ఈ–హెల్త్ సెంటర్ల భవన నిర్మాణాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని మంత్రులు తెలిపారు. గ్రీన్ సోషల్ ఫారెస్ట్‌లో భాగంగా లేఅవుట్లో అభివృద్ధి చేసిన చెరువు వద్ద, ఇతర ప్రాంతాల్లో 30వేల మొక్కలు నాటే కార్యక్రమం కూడా జరుగుతుందన్నారు. సీఆర్డీఏ పరిధిలోని 25 లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలను అతి త్వరలోనే పూర్తిచేసేందుకు అత్యంత నాణ్యతా ప్రమాణాలతో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన షీర్వాల్ టెక్నాలజీతో ఇళ్లను శరవేగంగా నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారన్నారు. సీఆర్డీఏ పరిధిలో దాదాపు 35వేల ఇళ్లను ఈ టెక్నాలజీతో నిర్మిస్తారని వారు చెప్పారు. ఇక్కడ ప్రతి ఇంటికీ నీరు, విద్యుత్ సౌకర్యంతో పాటు పూర్తిస్థాయిలో రహదారులు, డ్రైనేజి వ్యవస్థలను ఏర్పాటుచేసి గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్లుగా ఆరు నెలల్లో తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండీ లక్ష్మీశా తదితరులు పాల్గొన్నారు. -
నేడు సీఆర్డీఏలో పేదల ఇళ్లకు శ్రీకారం
సాక్షి, అమరావతి: అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందన్న పెత్తందారుల వితండ వాదాలకు చెక్ పెడుతూ నిరుపేద అక్కచెల్లెమ్మల సొంతింటి కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్డీఏలో 50వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి సోమవారం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. గూడు లేని పేద అక్కచెల్లెమ్మలకు స్థిరనివాసం సమకూర్చి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎల్లో ముఠా కుట్రపూరితంగా సృష్టించిన అడ్డంకులను అధిగమించి సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాలు, 25 లేఅవుట్లలో 50,793 మంది పేద అక్కచెల్లెమ్మలకు ఈ ఏడాది మే 26న ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించిన విషయం తెలిసిందే. ఒక్కో ప్లాట్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే రూ.1,371.41 కోట్ల ఖరీదైన భూమిని పేదలకు ఉచితంగా పంపిణీ చేయడమే కాక.. ఆయా లేఅవుట్లలో రూ.384.42 కోట్లతో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. అలాగే.. విద్య, ఆరోగ్య సేవలు అందించేందుకు రూ.73.74 కోట్లతో 11 అంగన్వాడీ కేంద్రాలు, 11 పాఠశాలలు, 11 డిజిటల్ లైబ్రరీలు, 12 ఆస్పత్రుల నిర్మాణం కూడా చేపట్టనుంది. లేఅవుట్ల పరిధిలో పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటుచేసేందుకు రెండు దశల్లో రూ.168 లక్షలతో 28,000 మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోనున్నారు. ఒకొక్కరికి రూ.10 లక్షల నుంచి రూ.15లక్షల ఆస్తి.. ఇలా ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల ఏర్పాటుతో ఒక్కో పేద అక్కచెల్లెమ్మ చేతుల్లో దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పైగా విలువైన స్థిరాస్తిని పెట్టబోతోంది. ఈ లెక్కన ఏపీ గృహ నిర్మాణ సంస్థ ద్వారా సీఆర్డీఏలోని ఈడబ్ల్యూఎస్ లేఅవుట్లలో రూ.1,829.57 కోట్ల వ్యయంతో పేదలకు పక్కా గృహాలను సమకూరుస్తోంది. మహిళా సాధికారతే లక్ష్యంగా.. నిజానికి.. సీఎం జగన్ ప్రభుత్వం తొలి నుంచి మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ వస్తోంది. మహిళలు తమంతట తాము నిలదొక్కుకునేలా వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తోంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద మహిళల పేరిట స్థలాలు, ఇళ్లు అందిస్తోంది. ఇందులో భాగంగా.. దేశంలో ఎక్కడాలేని విధంగా 71,811 ఎకరాల్లో 30.65 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరిట ఉచితంగా రూ.76,625 కోట్ల మార్కెట్ విలువైన భూములను పంపిణీ చేశారు. ఇలా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో 17వేలకు పైగా ఊళ్లనే కొత్తగా నిర్మిస్తున్నారు. పంపిణీ చేసిన స్థలాల్లో ఇప్పటికే రూ.57,375 కోట్ల వ్యయంతో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది. కాలనీల్లో రూ.32,909 కోట్ల వ్యయంతో నీటి సరఫరా, విద్యుత్, ఇంటర్నెట్, డ్రైనేజీ, సీవరేజీ, రోడ్లు వంటి మౌలిక వసతులను కల్పిస్తున్నారు. రూ.లక్షల కోట్ల సంపద సృష్టి మరోవైపు.. ప్రతి పేద అక్కచెల్లెమ్మకు ఇంటి స్థలం, ఇల్లు సమకూర్చడం ద్వారా రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపదను రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తోంది. ఇంటి స్థలం ఉచితంగా ఇవ్వడమే కాక.. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం సమకూరుస్తోంది. అంతేకాక.. ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్స్ ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని సబ్సిడీపై అందించడంతో మరో రూ.40 వేల మేర లబ్ధి చేకూరుస్తోంది. మోడల్ హౌస్ చాలా బాగా వచ్చింది లేఅవుట్లో తొలుత నాకు కేటాయించిన స్థలంలో మోడల్ హౌస్ నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. సెంటు స్థలంలో ఇల్లు బాగా వచ్చింది. ఇల్లు కట్టుకోవడమే కలగా మిగిలిపోతుందని అనుకున్నా. కానీ, జగనన్న స్థలం ఇవ్వడమే కాక ఇల్లు కట్టించి నా కలను సాకారం చేశాడు. సెంటు స్థలంలో ఇల్లు ఎలా వస్తుందని అన్న వారు దీనిని చూడాలి. సొంతింటి కల సాకారం చేసిన సీఎం జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. – ఈపూరి జీవరత్నం, కృష్ణాయపాలెం -
రేపు సీఎం జగన్ గుంటూరు జిల్లా పర్యటన
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ సోమవారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. సీఆర్డీఏ పరిధిలో (కృష్ణాయపాలెం జగనన్న లే అవుట్) పేదల ఇళ్ల నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కృష్ణాయపాలెం హౌసింగ్ లే అవుట్‌కు చేరుకుంటారు. వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటు చేసిన మోడల్ హౌస్‌ను పరిశీలిస్తారు. అనంతరం వెంకటపాలెం చేరుకుని లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాల పంపిణీకోసం ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొంటారు.