
సాక్షి, అమరావతి: సీఆర్‌డీఏ పరిధిలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన నిరుపేదల సొంతింటి కల సాకారం దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సీఆర్‌డీఏ పరిధిలో 50,793 మంది అక్కచెల్లెమ్మలకు ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇంటి స్థలాలను ఇప్పటికే ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 47వేల గృహాలకు జూలై 8న శంకుస్థాపన చేయనున్నట్టు గృహనిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ తెలిపారు.
ఈ సందర్భంగా అజయ్ జైన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో 50వేల మంది నిరుపేదలకు మే 26వ తేదీన సీఎం జగన్ చేతులమీదుగా ఇళ్ల పట్టాలిచ్చాం. కేంద్రం తొలిదఫాగా 47వేల ఇళ్లను మంజూరు చేసింది. రెండో దశలో మరో 3వేల ఇళ్లు మంజూరవుతాయి. ఇప్పటికే ల్యాండ్ లెవెలింగ్ కోసం సీఆర్‌డీఏకి రూ.30కోట్లు ఇచ్చాం. ఎల్లుండి గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లతో సమావేశం జరుగనుంది.
తాగునీరు, విద్యుత్, డ్రైనేజ్ తదితర మౌలిక సదుపాయాల కల్పనపై నిర్ణయాలు తీసుకుంటాం. లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాల జారీ సహా మ్యాపింగ్, జియో ట్యాగింగ్, షేర్‌వాల్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు చేపడతాం. దశలవారీగా ఆరు నుంచి 9 నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం’ అని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: వృత్తి నిపుణుల జాబితాలోకి కౌలు రైతులు
Comments
Please login to add a commentAdd a comment