Ajay Jain
-
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కనీసం 8 మంది ఉద్యోగులు ఉండేలా ప్రభుత్వం సర్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇటీవలి బదిలీల అనంతరం కొన్ని సచివాలయాల్లో నిర్ణీత సంఖ్య 8మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండగా మరికొన్నింటిలో తక్కువ మంది ఉన్నారు. అన్ని చోట్లా సమాన సంఖ్యలో ఉద్యోగులు ఉండేలా ప్రభుత్వం రేషనలైజేషన్ (సర్దుబాటు)కు చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలతో గ్రామ, వార్డు సచివాలయాలు – వలంటీర్లు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.34 లక్షల మంది ఉద్యోగులున్నారు. ప్రస్తుతం దాదాపు 7,900 సచివాలయాల్లో 8 మందికంటే ఎక్కువగానే ఉద్యోగులు ఉన్నారు. సుమారు 3,300 సచివాలయాల్లో 8 మంది కంటే తక్కువ సంఖ్యలో ఉన్నారు. మిగిలిన చోట్ల 8 మంది చొప్పున పనిచేస్తున్నారు. ఎక్కువ మంది సిబ్బంది ఉన్న సచివాలయాల నుంచి తక్కువ సంఖ్యలో ఉన్న సచివాలయాలకు ఉద్యోగులను సర్దుబాటు చేయనున్నారు. 8 మంది పనిచేస్తున్న చోట ఎవరికీ బదిలీలు ఉండవని అధికారులు తెలిపారు. ఈ çసుమారు 5,000 మందికి స్థానచలనం కలుగుతుందని వెల్లడించారు. జిల్లాల ప్రాతిపదికన కలెక్టర్ల ఆధ్వర్యంలో సర్దుబాటు జరుగుతుందని తెలిపారు. ఏ జిల్లాలోని వారికి ఆ జిల్లాలోనే బదిలీ ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే రానున్న పది పదిహేను రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. విధివిధానాలివీ.. ♦ ఏ కేటగిరీ ఉద్యోగుల ఖాళీలో అదే కేటగిరీ ఉద్యోగితోనే సర్దుబాటు ♦ జిల్లా ప్రాతిపదిక జిల్లాల పరిధిలోనే సర్దుబాటు ♦ఎక్కువ మంది సిబ్బంది ఉన్న సచివాలయాల నుంచి తక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉన్న సచివాలయాలకే బదిలీ ♦ ఎక్కడైనా భార్య, భర్త వేర్వేరు సచివాలయాల్లో పనిచేస్తుంటే, వారి అభ్యర్ధన మేరకు ఇరువురికీ ఒకే చోటకు బదిలీకి అవకాశం కల్పిస్తారు. వీరికి ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు కూడా అవకాశం కల్పిస్తారు. ♦ గ్రామ సచివాలయాల్లో నాలుగు కేటగిరీల ఉద్యోగులు, వార్డు సచివాలయాల్లో మూడు కేటగిరీ ఉద్యోగులకు మాత్రమే పరిమితమై ఈ సర్దుబాటు ఉంటుంది. ♦ గ్రామ సచివాలయాల్లో నాలుగు కేటగిరీల్లో.. మొదట ప్రాధాన్యతగా గ్రామ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లతో సర్దుబాటు ప్రక్రియ సాగుతుంది. అప్పటికీ సర్దుబాటు చేయాల్సిన సచివాలయాలు మిగిలితే రెండో ప్రాధాన్యతగా గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి (మహిళా పోలీసు)తో సర్దుబాటు చేస్తారు. మూడో ప్రాధాన్యతలో డిజిటల్ అసిస్టెంట్లు, అప్పటికీ మిగిలిపోతే నాలుగో ప్రాధాన్యతగా పంచాయతీ కార్యదర్శి విభాగాలు ఉంటాయి. ఇలా ప్రాధాన్యతల వారీగా సర్దుబాటు చేస్తారు. ♦ వార్డు సచివాలయాల్లో మొదటి ప్రాధాన్యతగా వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, రెండో ప్రాధాన్యతలో మహిళా పోలీసు, మూడో ప్రాధాన్యతగా వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ విభాగాలు ఉన్నాయి. ♦ ఉద్యోగులతో నేరుగా కౌన్సెలింగ్ ద్వారా ఈ సర్దుబాటు ప్రక్రియ చేపడతారు -
దేశానికే ఆదర్శంగా జగనన్న కాలనీల్లో ఇంధన పొదుపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్–జగనన్న కాలనీల్లో పేదల కోసం నిర్మిస్తున్న గృహాల్లో ఇంధన సామర్థ్య చర్యలను దేశానికే రోల్ మోడల్‌గా అమలు చేయనున్నట్లు ఏపీ గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) సీఈవో విశాల్ కపూర్ తరఫున సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు అనిమేష్ మిశ్రా, నితిన్భట్, సావిత్రిసింగ్, పవన్‌లు అజయ్ జైన్‌ను కలిసినట్లు ఈఈఎస్ఎల్ దక్షిణాది రాష్ట్రాల సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం... హౌసింగ్ ఎండీ లక్ష్మీశా, జేడీ శివప్రసాద్, హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్ గురించి ఈఈఎస్ఎల్ అధికారులకు వివరించారు. అజయ్ జైన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈఈఎస్ఎల్, కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అతిపెద్దదైన ఇంధన సామర్థ్య కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించనుందని తెలి పారు. సీఎం జగన్ సూచన మేరకు వైఎస్సార్–జగ నన్న కాలనీల్లోని ఇళ్లకు అత్యంత నాణ్యమైన స్టార్ రేటెడ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ పరికరాలను గృహనిర్మాణశాఖ ఆధ్వర్యంలోనే ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అందించనుందని తెలిపారు. ప్రతి ఇంటికి 4 ఎల్ఈడీ బల్బులు, 2 ఎల్ఈడీ ట్యూబ్‌లైట్లు, 2 ఎనర్జీ ఎఫిషియెన్సీ బీఎల్డీసీ ఫ్యాన్లను మార్కెట్ ధర కన్నా తక్కువకు ఈఈఎస్ఎల్ సహకారంతో సమకూర్చనున్నట్లు చెప్పారు. అయితే ఇది స్వచ్చందమేనని, లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ పరికరాలు తీసుకోవాలని లేదన్నారు. ఈ పరికరాలను వినియో గించడం వల్ల ప్రతి ఇంట్లో ఏటా 734 యూనిట్ల ఇంధనం ఆదా అవుతుందని ఈఈఎస్ ఎల్ అంచనా వేసిందని తెలిపారు. దాని ప్రకారం ఫేజ్–1లోని 15.6 లక్షల ఇళ్లకు రూ.352 కోట్ల వార్షిక ఇంధనం ఆదా అవుతుందని అజయ్ జైన్ వివరించారు. -
అమరావతిలో 47వేల గృహాలకు జూలై 8న శంకుస్థాపన: అజయ్‌జైన్
సాక్షి, అమరావతి: సీఆర్డీఏ పరిధిలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన నిరుపేదల సొంతింటి కల సాకారం దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సీఆర్డీఏ పరిధిలో 50,793 మంది అక్కచెల్లెమ్మలకు ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇంటి స్థలాలను ఇప్పటికే ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 47వేల గృహాలకు జూలై 8న శంకుస్థాపన చేయనున్నట్టు గృహనిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ తెలిపారు. ఈ సందర్భంగా అజయ్ జైన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో 50వేల మంది నిరుపేదలకు మే 26వ తేదీన సీఎం జగన్ చేతులమీదుగా ఇళ్ల పట్టాలిచ్చాం. కేంద్రం తొలిదఫాగా 47వేల ఇళ్లను మంజూరు చేసింది. రెండో దశలో మరో 3వేల ఇళ్లు మంజూరవుతాయి. ఇప్పటికే ల్యాండ్ లెవెలింగ్ కోసం సీఆర్డీఏకి రూ.30కోట్లు ఇచ్చాం. ఎల్లుండి గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లతో సమావేశం జరుగనుంది. తాగునీరు, విద్యుత్, డ్రైనేజ్ తదితర మౌలిక సదుపాయాల కల్పనపై నిర్ణయాలు తీసుకుంటాం. లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాల జారీ సహా మ్యాపింగ్, జియో ట్యాగింగ్, షేర్వాల్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు చేపడతాం. దశలవారీగా ఆరు నుంచి 9 నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం’ అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: వృత్తి నిపుణుల జాబితాలోకి కౌలు రైతులు -
గ్రీన్‌కార్డులపై ‘కంట్రీ లిమిట్’ తొలగించండి
వాషింగ్టన్: గ్రీన్‌కార్డులపై 7 శాతంగా ఉన్న కంట్రీ లిమిట్‌ను తొలగించాలని సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రముఖ భారత–అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ జైన్ భుతోరియా అమెరికా పాలకులకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పరిమితి వల్ల గ్రీన్‌కార్డుల కోసం అర్హులైన వారు సుదీర్ఘీకాలం నిరీక్షించాల్సి వస్తోందని చెప్పారు. అమెరికా రాజధాని వాషింగ్టన్లో భారతఅమెరికన్ పార్లమెంట్ సభ్యుడు రో ఖన్నా ఆధ్వర్యంలో తాజాగా జరిగిన యూఎస్–ఇండియా సదస్సులో అజయ్ జైన్ మాట్లాడారు. హెచ్–1 వీసాలపై లేని కంట్రీ లిమిట్ గ్రీన్‌కార్డులపై ఎందుకని ప్రశ్నించారు. అమెరికాలో ఇప్పుడు 8,80,000 మంది గ్రీన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని తెలియజేశారు. వీరిలో భారత్, చైనా నుంచి వచ్చినవారి సంఖ్య అధికంగా ఉందన్నారు. పదేళ్లకుపైగా నిరీక్షిస్తున్నవారు చాలామంది ఉన్నారని గుర్తుచేశారు. చట్టాన్ని మార్చకపోతే మరో 50 సంవత్సరాలు ఎదురు చూడక తప్పదని తేల్చిచెప్పారు. -
ఇందులో తప్పేంటి బాబూ?
సాక్షి, అమరావతి : ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా పని చేయడానికే ‘వలంటీర్ల’ వ్యవస్థ పుట్టుకొచ్చింది. ప్రభుత్వ పథకాలను మరింత సమర్థంగా ప్రజలకు చేరవేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పానికి ప్రతిరూపమే ఈ వ్యవస్థ. దాన్ని వారు సమర్థంగా నెవరేరుస్తూ వస్తున్నారు కూడా!!. నెలవారీ పింఛన్ల నుంచి మొదలుపెడితే... వివిధ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నది వారే. పైపెచ్చు వారేమీ రెగ్యులర్ పేస్కేళ్లలో ఉండే ప్రభుత్వ ఉద్యోగుల్లాంటి వారు కారు. ఇది... గౌరవ వేతనంపై సేవలందిస్తున్న వ్యవస్థ. అసలు వీరిని నియమించిందే ప్రభుత్వానికి– ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా అయినపుడు వారు ప్రజల వద్దకు వెళ్లటం తప్పెలా అవుతుంది? ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? దీనిపై మీరెంత సంతృప్తిగా ఉన్నారు? వంటి అంశాలను తెలుసుకోవటానికి వారు ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు, గృహ సారథులతో పాటు ప్రజల వద్దకు వెళితే తప్పేమయినా ఉందా? అసలెందుకు చంద్రబాబు నాయుడు ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తున్నారో తమకర్థం కావటం లేదని అటు ప్రభుత్వ యంత్రాంగం, వలంటీర్ల వ్యవస్థతో పాటు ఇటు బాబు తీరును నిశితంగా గమనిస్తున్న వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. నిజానికి చంద్రబాబు నాయుడి హయాంలో జన్మభూమి కమిటీల పేరిట పార్టీ కార్యకర్తలను నియమించి మొత్తం గ్రామాల్లోని వాతావరణాన్ని రాజకీయ పూరితం చేసేశారు. ఈ కమిటీల్లో ఉన్నది తెలుగుదేశం నాయకులే కావటంతో... వారు ఏ పథకాలనైనా ఇతర అర్హతలన్నీ పక్కనబెట్టి టీడీపీ వారికే ఇచ్చేవారు. టీడీపీ సానుభూతిపరులు కాని వారికి అప్పటిదాకా ఉన్న పథకాలను కూడా నిలిపేసి దారుణమైన పరిస్థితులు సృష్టించారు. ఇలాంటి పరిస్థితులు ఉండకూడదని, అర్హులైన వారికి పార్టీలకతీతంగా పథకాలు అందాలనే ఉద్దేశంతో... వలంటీర్ల వ్యవస్థకు రూపకల్పన చేశారు ముఖ్యమంత్రి జగన్. ప్రభుత్వ పథకాలను సమర్థంగా ప్రజలకు చేరవేస్తున్న వీరు... ఆ క్రమంలో సహజంగానే ఆయా పథకాల ప్రచార కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, గృహసారథులతో మమేకమై పాల్గొంటున్నారు. దీన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేయటమెందుకో... అసలు వలంటీర్లంటే అంత వణుకెందుకో ఎవ్వరికీ అర్థం కాదు. ప్రజలకు మరింత మేలు.. ప్రజలకు పథకాలు అందాయా లేదా అనే విషయంపై గ్రామ, వార్డు వలంటీర్లు సర్వే చేయడాన్ని తప్పుపట్టా ల్సిన అవసరం లేదు. అర్హులైన వారికి పథకాలు అందకపోతే ఆ వివరాలను వారు నమోదు చేస్తారు. అర్హులైన వారికి పథకాలు అందకపోతే, అలాంటి వారికి ఏడాదిలో రెండుసార్లు.. జూన్, డిసెంబర్ నెలల్లో ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ప్రభుత్వ సేవలపై అవగాహన కల్పించడం, సర్వే చేయడం ఇది కొత్త కాదు. రెండేళ్లుగా ప్రతి నెల చివరి శుక్ర, శనివారాల్లో సిటిజన్ ఔట్ రీచ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా ప్రతినిధుల సమక్షంలో సర్వే చేస్తే ఎక్కడైనా తప్పులుంటే తెలుస్తాయి. ప్రజలకు మరింత మేలు జరుగుతుంది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో ప్రజాప్రతినిధులతో పాటు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు పాల్గొంటున్నారు. అలాగే ఇప్పుడు ఈ సర్వేలో కూడా పాల్గొంటున్నారు. – అజయ్ జైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
భారతీయుల అమెరికా వీసా ప్రక్రియలో పురోగతి
వాషింగ్టన్: అమెరికా వీసాల కోసం నెలల తరబడి నిరీక్షిస్తున్న భారతీయుల ఇబ్బందుల్ని తొలగించేందుకు అధ్యక్ష అడ్వైజరీ కమిషన్ చేసిన సిఫార్సులను ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ ఆచరణలో పెడుతోంది. భారతీయుల వీసా దరఖాస్తులను విదేశాల్లోనూ త్వరగా తేల్చేలా అదనంగా దౌత్య కార్యాలయాలు, కౌంటర్లు తెరుస్తున్నారు. కోవిడ్ అనంతరం ప్రయాణ ఆంక్షలు తొలగించాక అమెరికా వీసాల కోసం భారత్ నుంచి దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడటం తెల్సిందే. అమెరికాలో అభ్యసించనున్న విద్యార్థులు, పర్యటించే సందర్శకులు చాలాకాలంపాటు వేచి ఉండాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారని ప్రెసిడెన్షియల్ కమిషన్ సభ్యుడు అజయ్ జైన్ భుటోరియా వ్యాఖ్యానించారు. భారతీయ వీసా దరఖాస్తుదారులకు ప్రపంచంలో ఏ దేశంలో కుదిరితే ఆ దేశం నుంచే అక్కడి అమెరికా ఎంబసీ సిబ్బంది వర్చవల్‌గా ఇంటర్వ్యూలు చేసి వీసా జారీ/నిరాకరణ ప్రక్రియను పూర్తిచేయడంలో సాయపడతారు. విదేశాల్లోని అమెరికా ఎంబసీల్లో ఎక్కువ వీసా అపాయ్మెంట్ కౌంటర్లను తెరుస్తారు. సిబ్బంది సంఖ్యను పెంచుకుంటారు. ఎంబసీల్లో కొత్తగా సిబ్బందిని నియమించుకుంటారు. 400 రోజులకుపైబడిన వెయిటింగ్ సమయాన్ని 2–4 వారాలకు కుదించడమే వీరి లక్ష్యం. -
పేదల ఇళ్ల నిర్మాణంలో చిత్తూరు టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద నిరుపేదల ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఇళ్ల నిర్మాణంలో చిత్తూరు జిల్లా ఉత్తమ పనితీరుతో రాష్ట్రంలోనే తొలినుంచి మొదటి స్థానంలో నిలుస్తోంది. ఈ జిల్లాలో 73,496 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇప్పటివరకు 63,517 ఇళ్లకు శంకుస్థాపన చేశారు. ఇందులో 52,386 ఇళ్లు (82 శాతం) పునాది, ఆపై దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. శంకుస్థాపన చేసిన 67,437 ఇళ్లలో 42,964 (64 శాతం) ఇళ్లు, 70,221 ఇళ్లలో 42,554 (61 శాతం) ఇళ్లు పునాది, ఆపై దశల నిర్మాణంతో అన్నమయ్య, విజయనగరం జిల్లాలు రెండు, మూడుస్థానాల్లో ఉన్నాయి. విశాఖ జిల్లాలో 1.35 లక్షల ఇళ్లకు ప్రభుత్వం అనుమతులు జారీచేసింది. వీటిలో 63,389 ఇళ్లకు శంకుస్థాపన చేయగా 9,043 ఇళ్లు పునాది, ఆపై దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. దీంతో ఈ జిల్లా ప్రస్తుతం ఇళ్ల నిర్మాణంలో చివరిస్థానంలో ఉంది. న్యాయపరమైన చిక్కులు వీడటంతో విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలో నిర్మిస్తున్న 1.24 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఈ ఏడాదిలోనే అనుమతులు లభించాయి. ఈ ఇళ్ల నిర్మాణాలు ఇటీవల ప్రారంభం కావడం విశాఖ చివరిస్థానంలో ఉండటానికి ప్రధాన కారణం. పుంజుకున్న నిర్మాణాలు రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీవర్షాల ప్రభావం ఇళ్ల నిర్మాణంపై పడింది. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టి, వాతావరణం కూడా సహకరిస్తుండటంతో ఇళ్ల నిర్మాణాలు పుంజుకున్నాయి. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ప్రభుత్వం రెండుదశల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతోంది. ఇందులో 2.62 లక్షలు టిడ్కో ఇళ్లు. మిగిలిన 18.63 లక్షల ఇళ్లకుగాను 15.15 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీటిలో 8.70 లక్షల ఇళ్లు పునాది ముందుదశలో, 2.85 లక్షల ఇళ్లు పునాది, 73,622 ఇళ్లు రూఫ్ లెవల్, 1.05 లక్షల ఇళ్లు ఆర్సీ దశలో నిర్మాణంలో ఉన్నాయి. 1,79,263 ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఇందులో 95 వేలకుపైగా ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలు కరెంటు, నీటిసరఫరా కనెక్షన్లు ఇప్పటికే ఇచ్చారు. మిగిలిన ఇళ్లకు ఇస్తున్నారు. హౌసింగ్ డే రోజు సచివాలయ సిబ్బంది నుంచి కలెక్టర్ వరకు లేఅవుట్ల సందర్శన పేదల ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం తొలినుంచి ప్రత్యేకదృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రతి శనివారాన్ని హౌసింగ్ డేగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో శనివారం కలెక్టర్లు, జేసీలు, డివిజన్, మండలస్థాయి అధికారులు, సచివాలయాల సిబ్బంది లేఅవుట్లను సందర్శిస్తున్నారు. అధికారులు తాము లేఅవుట్లను సందర్శించిన ఫొటోలను గృహనిర్మాణ సంస్థ రూపొందించిన హౌసింగ్ డే యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేఅవుట్లలో తమదృష్టికి వచ్చిన సమస్యలు, ఇబ్బందులను యాప్ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చే అవకాశం కల్పించారు. ఆన్లైన్లో వచ్చిన సమస్యలు, ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 19న 961 లేఅవుట్లను 5,548 మంది మండల స్థాయి అధికారులు, 3,051 మంది సచివాలయాల స్థాయి అధికారులు సందర్శించారు. రోజువారీ లక్ష్యాలు ఇస్తున్నాం ఇళ్ల నిర్మాణాలు మరింత వేగంగా చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాల వారీగా రోజువారీ లక్ష్యాలను ఇస్తున్నాం. వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేకదృష్టి పెడుతున్నాం. స్వయంగా ఆయా జిల్లాలకు రాష్ట్రస్థాయి అధికారులం వెళ్లి నిర్మాణాలు ఆలస్యం అవడానికి కారణమైన సమస్యల్ని తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నాం. హౌసింగ్ డే రోజున పథకంతో ముడిపడి ఉన్న అధికారులు రెండు లేఅవుట్లు సందర్శించాల్సి ఉంటుంది. లేఅవుట్లో సందర్శించినట్టుగా ఫొటోలను హౌసింగ్ డే యాప్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించాం. – అజయ్‌జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గృహనిర్మాణ శాఖ -
మహిళలు, పిల్లలకు ఆరోగ్య భద్రత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మహిళలు, పిల్లల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాలను నివారించి, ఆరోగ్యంగా ఉంచాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మస్థాయిలో కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. తొలి దశలో 8 అంశాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు కేంద్ర బిందువుగా సుస్థిర ప్రగతి లక్ష్యాల సూచికలను సాధించడం ద్వారా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచేందుకు ఈ నెల 16 నుంచి ఇంటింటి సర్వే చేపట్టింది. వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేసి, రక్తహీనత, పౌష్టికాహార లోపం ఉన్న మహిళలు, పిల్లలను గుర్తించి, వారికి అవసరమైన మందులు, పౌష్టికాహారాన్ని అందించి ఆరోగ్యంగా తీర్చీదిద్దడానికి చర్యలు చేపట్టింది. వారికి ముందులు, ఆహారం సరఫరాను గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు నిరంతరం పర్యవేక్షిస్తారు. ఇప్పటికే 40 లక్షల ఇళ్లలో సర్వే పూర్తయింది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఈ సర్వే కోసం వలంటీర్లకు ప్రాధాన్యత గల 8 సుస్థిర ప్రగతి లక్ష్యాల సూచికలతో ఓ అప్లికేషన్ కూడా రూపొందించింది. 2,65,979 క్లస్టర్ల వారీగా 1,59,29,858 కుటుంబాలను వీరు కలుసుకుంటున్నారు. రక్తహీనత, బరువు తక్కువ, పౌష్టికాహార లోపాలతోపాటు పిల్లల్లో స్కూల్ డ్రాపవుట్స్ పాఠశాలల్లో మహిళా టాయిలెట్ల నిర్వహణ, విద్యుత్, తాగునీటి సదుపాయాలపై సర్వే చేస్తున్నారు. ఆ వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. వాటిని పరిశీలించిన అధికారులు తదనుగుణంగా చర్యలు చేపడతారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, 11, 12 తరగతుల్లో పిల్లల ఎన్రోల్మెంట్ రేషియోతోపాటు డ్రాపవుట్స్ లేకుండా ఆ ఈడు పిల్లలందరూ విద్యా సంస్థల్లో ఉండేలా సర్వే ద్వారా చర్యలు చేపడుతున్నారు. పిల్లలు ఎవ్వరైనా స్కూల్‌కు రాకపోతే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసి, మళ్లీ బడిలో చేర్పించేందుకు వలంటీర్లు చర్యలు తీసుకుంటారు. స్కూళ్లలో కనీస మౌలిక వసతుల వివరాలు సేకరించి, లోపాలుంటే వెంటనే సరిచేస్తారు. కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇంటింటి సర్వే పురోగతిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ సమీర్ శర్మ సమీక్షించారు. సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. 8 సుస్థిర ప్రగతి సూచికల లక్ష్యాల సాధనకు సర్వే అంశాలు ఇవే ► కౌమారదశలో ఉన్న 10 ఏళ్ల నుంచి 19 ఏళ్లలోపు మహిళల్లో రక్తహీనత కలిగిన వారు ఎంత శాతం ఉన్నారు? ► 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల గర్భిణుల్లో రక్తహీనత కలిగిన వారు ఎంత శాతం ఉన్నారు? ► ఎదుగుదల లేక కుచించుకపోయిన ఐదేళ్ల లోపు పిల్లలు ఎంత మంది ఉన్నారు? ► తక్కువ బరువుగల ఐదేళ్లలోపు పిల్లలు ఎంత మంది ఉన్నారు? ► ఎలిమెంటరీ స్కూల్స్‌లో 1 నంచి 10వ తరగతి వరకు ఎన్రోల్మెంట్ రేషియో ► ఉన్నత విద్యలో 11, 12 తరగతుల్లో స్థూల నమోదు నిష్పత్తి ► స్కూళ్లలో విద్యుత్, తాగునీరు అందుబాటు ఎంత శాతం ఉన్నాయి? ► స్కూళ్లలో ప్రధానంగా బాలికల టాయిలెట్ల నిర్వహణ, స్థితి ఎలా ఉంది? ఈ నెల 25లోగా సర్వే పూర్తి మహిళలు, పిల్లల ఆరోగ్యం.. ప్రధానంగా రక్తహీనత, పౌష్టికాహార లోపాలను గుర్తించేందుకు రాష్ట్రం అంతటా తొలిసారిగా పెద్ద ఎత్తున ఇంటింటి సర్వే చేపట్టాం. ఈ నెల 25కి సర్వే పూర్తవుతుంది. సర్వే కోసం ప్రత్యేకంగా నమూనా ఫారమ్‌ను రూపొందించాం. సర్వేలో వివరాల ఆధారంగా రక్త హీనత, పౌష్టికాహార లోపాలు గల, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారిపై దృష్టి సారించి, వ్యాధుల నివారణకు చర్యలు తీసుకుంంటాం. తద్వారా 8 అంశాల్లో సుస్థిర ప్రగతి సూచికల లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించడమే ధ్యేయం. – గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ -
డిసెంబర్ 23 నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి
కర్నూలు(సెంట్రల్): రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీల్లో డిసెంబర్ 23 నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతాయని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. కర్నూలు కలెక్టరేట్లో గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 21 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్టు తెలిపారు. మూడో ఆప్షన్ కింద ఇళ్లు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకొస్తే లబ్ధిదారులతో ఎంవోయూ చేయిస్తామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.15 లక్షలు ఖర్చుచేస్తుండగా.. ఇందులో రూ.1.80 లక్షలు సబ్సిడీ పోగా, మిగిలిన రూ.35 వేలను లబ్ధిదారుడికి పావలా వడ్డీ కింద ఇప్పిస్తామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కింద ప్రజా ప్రతినిధులు 15 వేల సచివాలయాల పరిధిలో తిరిగి వివిధ పనుల కోసం ప్రతిపాదనలు పంపారని, వాటిలో 3,344 పనులకు ఆమోదం తెలిపామని, ఇందులో 2,317 పనులు ప్రారంభమయ్యాయని కూడా చెప్పారు. -
ఇళ్ల నిర్మాణాలకు రోజుకు రూ.23 కోట్ల ఖర్చు
కర్నూలు(అర్బన్): రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ జగనన్న లేఅవుట్లలో గృహ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రోజు రూ.23 కోట్లు ఖర్చు చేస్తున్నదని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతిని సమీక్షించేందుకు ఆయన బుధవారం కర్నూలు వచ్చారు. జిల్లా కలెక్టర్ పీ కోటేశ్వరరావుతో కలిసి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణాల్లో పురోగతి చూపితే రోజుకు రూ.50 కోట్లు కూడా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత ఏడు నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ‘నవరత్నాలు–పేదలందరికి ఇళ్లు’ కార్యక్రమంలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలను వచ్చే ఎనిమిది నెలల్లోపు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇంటి పట్టాలను ఇవ్వడం జరిగిందని, ఇందులో మొదటి విడతలో 18 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామని వివరించారు. -
గ్రామాలు, వార్డుల్లో పనుల జోరు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వేగం పుంజుకుంటోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శిస్తూ.. ప్రాధాన్యత పనులను గుర్తిస్తున్నారు. వాటిని మంజూరు చేసి, పనులు ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తోంది. రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే 4,199 సచివాలయాలను ఎమ్మెల్యేలు, మంత్రులు సందర్శించారు. ఈ సందర్భంగా వాటి పరిధిలో 12,428 ప్రాధాన్యత పనులను గుర్తించగా, వాటి వివరాలను అప్లోడ్ కూడా చేశారు. ఇందులో 7,329 పనులను అధికారులు మంజూరు చేయగా, ఇప్పటి వరకు 1,044 పనులను ప్రారంభించారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 305 పనులు, తూర్పుగోదావరిలో 202, బాపట్లలో 200, శ్రీకాకుళంలో 157, కాకినాడ జిల్లాలో 152 పనులు ప్రారంభమయ్యాయి. అత్యధికంగా పార్వతిపురం మన్యం జిల్లాలో 513 పనులు, ప్రకాశంలో 483, అనకాపల్లిలో 443, కాకినాడలో 440, పల్నాడులో 423, బాపట్ల జిల్లాలో 404 పనులు మంజూరు చేశారు. ఈ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున రూ.3,000.88 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. గుర్తించిన మరుసటి రోజే పనులు అప్లోడ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు సచివాలయాలను సందర్శించిన మరుసటి రోజే ప్రాధాన్యతగా గుర్తించిన పనులను వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా చర్యలు తీసుకున్నాం. వారంలోగా మంజూరు చేసి, నెలలోనే పనులు ప్రారంభించేలా చూస్తున్నాం. వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నూరు శాతం పూర్తయ్యే వరకు ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ఇప్పటికే ప్రాధాన్యత పనులుగా గుర్తించిన వాటిలో మిగిలిన 5,099 పనులను ఈ నెల 5వ తేదీలోగా మంజూరు చేసి, ఈ నెలాఖరులోగా ప్రారంభిస్తాం. – అజయ్ జైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
మీ ఇల్లు చల్లగుండ!
సాక్షి, అమరావతి: కూల్ రూఫ్ పెయింట్ ద్వారా జగనన్న కాలనీల్లోని ఇళ్లలో ఉష్ణోగ్రతలు తగ్గించడంపై ప్రయోగం చేపడుతున్నట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సహకారంతో ఇండో–స్విస్ బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్ (బీఈఈపీ) ద్వారా జగనన్న కాలనీల్లోని ఇళ్లల్లో ఇంధన సామర్ధ్య కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం), అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) చేపడుతున్న కూల్ రూఫ్ ప్రాజెక్టుపై మంగళవారం విజయవాడలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. దీనికి అజయ్‌జైన్ వర్చువల్‌గా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం వార్షిక విద్యుత్ డిమాండ్ 60,943 మిలియన్ యూనిట్లు ఉంటే, అందులో భవనాలకు వాడుతున్నది 17,514 మిలియన్ యూనిట్లు (28 శాతం) ఉందన్నారు. దీన్ని తగ్గించేందుకు జగనన్న ఇళ్లల్లో విద్యుత్ ఆదా చర్యలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. కూల్ రూఫ్‌ను విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ జిల్లాల్లోని పన్నెండు ఇళ్లపై వేసి వచ్చే ఫలితాలను అధ్యయనం చేస్తామన్నారు. -
ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణానికి అవసరమైన పనులను వారంలోగా పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆప్షన్–3 ఎంచుకున్న లబ్ధిదారులను కాంట్రాక్టర్లకు మ్యాపింగ్ చేయడం, అవగాహన ఒప్పందాలు, బ్యాంక్ ఖాతాలను ప్రారంభించడం తదితర పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పారు. విశాఖపట్నంలో సుమారు 1.24 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నందున.. లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలు ప్రారంభించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్టర్లు సకాలంలో నిర్మాణాలు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని, ఇందుకోసం ప్రతి లేఅవుట్లో ఇటుకల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణ సంస్థ ఎండీ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా మాట్లాడుతూ.. నిర్మాణాలకు సకాలంలో సామగ్రి సరఫరాతో పాటు బిల్లులు చెల్లిస్తామన్నారు. -
పేదల ఇళ్లలో రూ.350 కోట్ల విద్యుత్ ఆదా
సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఇంధన సామర్థ్యంతో కూడిన గృహోపకరణాలను పేదలకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటోందని గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. తద్వారా ఏటా రూ.350 కోట్ల విలువైన విద్యుత్ ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఇంధన శాఖకు చెందిన ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ సీడ్కో), హౌసింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో అజయ్ జైన్ మాట్లాడారు. ఆ వివరాలను రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి ఆదివారం వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు.. నవరత్నాలు–పేదలందరికి ఇళ్లు పథకం కింద మొదటిదశలో నిర్మించే 15.60 లక్షల ఇళ్లకు విద్యుత్ పొదుపు చేయగల గృహోపకరణాలను మార్కెట్ ధరల కన్నా తక్కువకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనివల్ల ఒక్కో ఇంటికి ఏడాదికి 734 యూనిట్ల విద్యుత్ ఆదా అయ్యే అవకాశం ఉందని అజయ్ జైన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి లబ్ధిదారుడికి నాలుగు ఎల్ఈడీ బల్బులు, రెండు ఎల్ఈడీ ట్యూబ్‌లైట్లు, రెండు ఇంధన సామర్థ్య ఫ్యాన్లు అందజేస్తామన్నారు. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) నుంచి ఏపీ సీడ్కో ద్వారా వీటిని సేకరిస్తామని చెప్పారు. నాణ్యతలో రాజీపడొద్దన్న సీఎం నాణ్యతలో రాజీపడకుండా అత్యుత్తమ ఇంధన సామర్థ్య గృహోపకరణాలను లబ్ధిదారులకు అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని తెలిపారు. మార్కెట్ ధరతో పోలిస్తే 30 నుంచి 35 శాతం తక్కువ ధరకు ఉపకరణాలను ఏపీకి అందచేసేందుకు ఈఈఎస్ఎల్ సూత్రప్రాయంగా అంగీకరించిందన్నారు. ఎల్ఈడీ బల్బుల వినియోగం వల్ల 90 శాతం విద్యుత్, ఎల్ఈడీ ట్యూబ్‌లైట్ వల్ల 60 శాతం, ఇంధన సామర్థ్య ఫ్యాన్ వల్ల 50 శాతం విద్యుత్ ఆదా అవుతుందని ఈఈఎస్ఎల్ అంచనా వేసిందని చెప్పారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చే లబ్ధిదారులకే ఈ ఉపకరణాలు అందచేస్తామన్నారు. జగనన్న కాలనీల్లో విద్యుదీకరణ, ఇంటర్నెట్ కోసం రూ.7,989 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. గృహనిర్మాణ పథకంలో ఇండోస్విస్ ఇంధన భవన నిర్మాణ సాంకేతికతను వినియోగిస్తున్నందున ఇంటిలోపల రెండుడిగ్రీల ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉంటుందని అజయ్ జైన్ చెప్పారు. ఈ సమావేశంలో హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ నారాయణ్‌భరత్ గుప్తా, హౌసింగ్ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే, హౌసింగ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.శివప్రసాద్, చీఫ్ ఇంజనీర్ జి.వి.ప్రసాద్, ఏపీసీడ్కో అధికారులు పాల్గొన్నారు. -
‘హౌసు’ ఫుల్లు..!
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది నిరుపేద అక్క చెల్లెమ్మల సొంతింటి కలలు నెరవేరుతున్నాయి. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో తొలిదశ ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ‘నవరత్నాలు–పేదలం దరికీ ఇళ్లు’ పథకం కింద 31 లక్షల మందికిపైగా పేదలకు ప్రభుత్వం పక్కా గృహాలను నిర్మిస్తోంది. తొలిదశలో 15.60 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఈ ఏడాది పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ.13,100 కోట్లు వెచ్చిం చనుండటంతో నిర్మాణాలు జోరందుకున్నాయి. ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా 1.54 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా కోసం రూ.1,121.12 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రాయితీ కింద ఇచ్చే 3.46 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్ కోసం రూ.2,425.50 కోట్లు, 35 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ సరఫరాకు రూ.1,575.27 కోట్లు వ్యయం కానుంది. మిగిలిన నిధులను బిల్లుల చెల్లింపులు, ఇతర అవసరాలకు వెచ్చించనున్నారు. రాయితీపై నిర్మాణ సామగ్రి ఒక్కో ఇంటి నిర్మాణానికి ఉచితంగా 20 టన్నుల ఇసుక సరఫరా చేస్తున్నారు. రాయితీపై మార్కెట్ ధర కన్నా తక్కువకు 140 బస్తాల సిమెంట్, 480 కిలోల ఐరన్ సహా ఇతర సామగ్రిని ప్రభుత్వమే సమకూరుస్తోంది. గతంలో 90 బస్తాల సిమెంట్ ఇవ్వగా ఇప్పుడు అదనంగా మరో 50 బస్తాలు ఇస్తున్నారు. అదనపు చేయూత సొంతిళ్లు నిర్మించుకునే అక్క చెల్లెమ్మలకు అదనంగా చేయూతనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకుల ద్వారా స్వయం సహాయక బృందాల మహిళలకు పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేస్తున్నారు. రూ.35 వేల నుంచి ఆ పైన రుణ సాయం అందుతోంది. ఇప్పటివరకూ 3,59,856 మంది లబ్ధిదారులకు రూ.1,332.09 కోట్ల రుణం మంజూరైంది. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అత్యధికంగా చిత్తూరులో 69,170, అనంతపురంలో 49,918, తూర్పు గోదావరిలో 36,462 మంది రుణాలు పొందారు. లబ్ధిదారులపై భారం తగ్గించేలా ఊరికి దూరంగా ఉండే లేఅవుట్లలోకి సిమెంట్, ఐరన్, ఇతర సామాగ్రి తరలింపు భారం లబ్ధిదారులపై పడకుండా స్థానికంగా గోడౌన్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. 66 పెద్ద లేఅవుట్లలో గోడౌన్ల నిర్మాణం చేపట్టగా ఇప్పటికే 47 అందుబాటులోకి వచ్చాయి. ఇటుకల తయారీ యూనిట్లు కూడా లే అవుట్లలోనే ఏర్పాటు చేసి తక్కువ ధరలకు సరఫరా చేసేలా చర్యలు చేపట్టారు. ఆప్షన్–3 ఇళ్లపై పర్యవేక్షణ.. ప్రభుత్వమే నిర్మించే ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. 3.27 లక్షల మంది లబ్ధిదారులు ఆప్షన్–3ను ఎంచుకోగా గ్రూపులుగా విభజించి కాంట్రాక్టర్ల ద్వారా నిర్మాణాలు చేపడుతున్నారు. మొత్తం 25,430 గ్రూపులు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రూపులో కనీసం పదిమంది లబ్ధిదారులు ఉంటారు. వెయ్యి ఇళ్లకు ఒక వార్డు అమెనిటీ సెక్రటరీని కేటాయించి ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తున్నారు. లేఅవుట్ల నుంచే హాజరు నమోదుకు వీరికి అవకాశం కల్పిస్తున్నారు. రుణాల మంజూరుకు బ్యాంకులు, ఇతర అధికారులతో సమన్వయంతో వ్యవహరించే బాధ్యత అప్పగించారు. నున్నలో నిర్మిస్తున్న పాపాయమ్మ ఇల్లు వేగంగా నిర్మాణాలు పేదల ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లబ్ధిదారుల కోసం లే అవుట్లలోనే ఇటుకల తయారీ యూనిట్లతో పాటు సామగ్రి రవాణా భారం లేకుండా గోడౌన్లు నిర్మించాం. ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి వెయ్యి ఇళ్లకు అమెనిటీ సెక్రటరీ, లే అవుట్‌కు డిప్యూటీ ఈఈలను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తున్నాం. – అజయ్‌జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కష్టాలు తీరాయి.. కూలి పనులు చేసుకుంటూ మా అమ్మతో కలసి ఎన్నో ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నా. గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్తు దరఖాస్తు చేసుకున్నా నిరాశే ఎదురైంది. ఇప్పుడు ఇంటి స్థలం రావడంతోపాటు నిర్మాణం కూడా పూర్తైంది. సుదీర్ఘ కల నెరవేరుతోంది. నా కష్టాలు తీరాయి. – ఇందూరి మంగతాయమ్మ, చెరువుకొమ్ముపాలెం, ఎన్టీఆర్ జిల్లా మరో 40 రోజుల్లో.. శ్రీకాళహస్తిలో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నా. సంపాదనలో చాలావరకు అద్దెలకే ఖర్చవుతోంది. గతంలో ఇంటిపట్టా కోసం ఎంతో ప్రయత్నించినా రాలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక వలంటీర్ మా ఇంటికే వచ్చి వివరాలు నమోదు చేసుకున్నాడు. మాకు స్థలం, ఇల్లు మంజూరైంది. మరో 40 రోజుల్లో ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. – రెడ్డిపల్లి సుబ్రహ్మణ్యం, ఊరందూరు, తిరుపతి జిల్లా సొంతింట్లోకి దర్జీ కుటుంబం.. దర్జీగా పనిచేసే నా భర్త సంపాదనతో ఇద్దరు పిల్లలను చదివించి అద్దెలు కట్టేందుకు ఎంతో అవస్థ పడేవాళ్లం. మాకు స్థలంతో పాటు ఇల్లు మంజూరైంది. తక్కువ ధరకే సిమెంటు, ఐరన్, ఇతర సామాగ్రి ఇవ్వడంతో ఇంటిని నిర్మించుకున్నాం. – రహీమా, బైరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లా గృహ ప్రవేశం చేశాం ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. రాయితీపై సిమెంట్ అందించారు. గృహ ప్రవేశం కూడా చేశాం. చాలా సంతోషంగా ఉంది. సీఎం జగన్ మాకు సొంత గూడు సమకూర్చారు. – ఇస్సాకుల శేషారత్నం, నేమాం, కాకినాడ జిల్లా రేకుల షెడ్డు నుంచి.. చక్కెర కర్మాగారంలో కూలీగా పనిచేసే నా భర్త సంపాదనలో నెలకు రూ.4 వేలు ఇంటి అద్దెకు ఖర్చయ్యేవి. ఒకదశలో అద్దె భారాన్ని భరించలేక ఫ్యాక్టరీ సమీపంలోని రేకుల షెడ్డులో తలదాచుకున్నాం. ఇప్పుడు మాకు ప్రభుత్వం సొంత గూడు కల్పించింది. ఈ ఏడాది జనవరిలో ఇంటి నిర్మాణం పూర్తైంది. తొమ్మిది నెలల్లో సొంతిల్లు కట్టుకున్నాం. బిల్లులు సక్రమంగా అందాయి. ఇటీవలే కొత్త ఇంట్లోకి వచ్చాం. – మామిని పాడి, పాలకొండ అర్బన్, పార్వతీపురం మన్యం జిల్లా అదనంగా 50 బస్తాల సిమెంట్ .. బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసి లెంటల్ లెవెల్ వరకు ఇంటిని నిర్మించుకున్నాం. ఉచితంగా ఇసుక, రాయితీపై సిమెంటు, స్టీలు ఇస్తున్నారు. ఇప్పటి వరకూ 90 బస్తాల సిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు అదనంగా మరో 50 బస్తాలు ఇస్తున్నట్లు తెలిసింది. ఇది మాకెంతో ఉపయోగపడుతుంది. – ఖైరున్నిసాబీ, పార్నపల్లె, నంద్యాల జిల్లా సొంతిల్లు కడుతున్న మేస్త్రి విజయవాడలోని నున్నలో నివసించే భూలక్ష్మి మిషన్ కుడుతూ.. భర్త శ్రీనివాసరావుకు తోడుగా నిలుస్తోంది. వీరు 20 ఏళ్లకుపైగా అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. చాలాసార్లు ఇంటి నిర్మాణానికి ప్రయత్నించినా అక్కడ సెంటు స్థలం రూ.10 లక్షల వరకు పలుకుతుండటంతో ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఇంటి స్థలం మంజూరైంది. శ్రీనివాసరావు తాపీ మేస్త్రీ కావడంతో తనే స్వయంగా దగ్గరుండి ఇంటిని నిర్మించుకుంటున్నాడు. ఇటీవల స్లాబ్ వేశారు. స్థలంతో పాటు రూ.1.80 లక్షలు ఆర్థిక సాయం అందిందని, పొదుపు సంఘం ద్వారా రూ.50 వేలు లోన్ తీసుకున్నానని.. ఇంటి నిర్మాణం పూర్తి కావచ్చిందని భూ లక్ష్మి ఆనందంగా చెబుతోంది. తరతరాల కోరిక తీరింది.. విజయవాడ నున్న ప్రాంతంలో ఇళ్లలో పనులకు వెళ్లే పాపాయమ్మ కొద్ది నెలల క్రితం పక్షవాతం బారిన పడటంతో మంచానికే పరిమితమైంది. భర్త అప్పారావు రిక్షా కార్మికుడు. వీరికి తరతరాలుగా సొంతిల్లే లేదు. ఇంటి స్థలం, ఇల్లు కోసం ఎన్నోసార్లు విఫలయత్నం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక చివరి ప్రయత్నంగా వలంటీర్ ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో పాపాయమ్మకు రూపాయి ఖర్చు లేకుండా సొంతిల్లు మంజూరైంది. ఇల్లు నిర్మించుకుంటున్నారు. త్వరలో గృహ ప్రవేశం చేయనున్నారు. -
1.79 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద 2021–22 సంవత్సరానికి సంబంధించి మరో 1,79,060 ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. యూనిట్‌కు రూ.1.80 లక్షల చొప్పున రూ.3,223.08 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. 1.79 లక్షలలో అత్యధికంగా గుంటూరు జిల్లాకు 27,330, కర్నూలుకు 21,494, పశ్చిమగోదావరికి 19,146 ఇళ్లు కేటాయించారు. ప్రభుత్వం రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు 30 లక్షలకు పైగా ఇళ్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి దశ కింద చేపట్టిన 15.65 లక్షల ఇళ్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జూన్ నాటికి తొలి దశ నిర్మాణాలన్నీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. -
సచివాలయాల్లో ఏటీఎంలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పల్లె ప్రజానీకానికి మరిన్ని సేవలు విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే వీటి ద్వారా ఉన్న ఊళ్లోనే వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 540 రకాలకు పైగా సేవలను అందిస్తున్న సర్కారు.. ఇప్పుడు కొత్తగా వాటిల్లో ఏటీఎం సేవలను అందించేందుకు చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా.. తొలి దశలో వచ్చే ఉగాది నాటికి కార్యకలాపాలు ఎక్కువగా జరిగే ఒక్కో జిల్లా నుంచి ఒక్కో సచివాలయంలో ఈ ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత ఆయా జిల్లాల్లో కూడా ఒక సచివాలయంలో ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకొస్తారు. ఇక రెండో దశలో రెవెన్యూ డివిజన్లో కార్యకలాపాలు ఎక్కువగా సాగే ఒక సచివాలయంలోను.. మూడో దశలో మండల కేంద్రాల్లో కార్యకలాపాలు అత్యధికంగా జరిగే ఒక సచివాలయంలోను ఏటీఎం సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ చర్యలను చేపట్టింది. ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఇక రాష్ట్రంలో 9,160 రైతుభరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఏర్పాటుచేయాలని నిర్ణయించగా.. 4,240 కేంద్రాల్లో ఇప్పటికే వీరు సేవలందిస్తున్నారు. రాష్ట్రంలో 500 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలందిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నాటికి మొత్తం 2,95,925 మందికి ఆధార్ సేవలందించారు. మరో 2,500 సచివాలయాల్లో వచ్చే ఉగాది నాటికి ఈ సేవలనూ అందుబాటులోకి తేనున్నారు. సచివాలయాల్లో తొలిదశ కింద ఇప్పటికే 51చోట్ల రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించగా రెండో దశలో మరో 613చోట్ల అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దశల వారీగా ఏటీఎంలు గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు రైతుభరోసా కేంద్రాల కార్యకలాపాలు అత్యధికంగా ఉన్నచోట తొలిదశలో ఉగాది నాటికి జిల్లాకొక సచివాలయంలో ఏటీఎంలను ఏర్పాటుచేయనున్నాం. వ్యవసాయానికి అవసరమైన కొనుగోళ్లు చేసే రైతులతోపాటు ఇతరులకూ ఈ ఏటీఎంలు ఉపయోగపడతాయి. క్రమంగా రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాల్లోని ఒక్కో సచివాలయంలో వీటి సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం. – అజయ్ జైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక సీఎస్ -
Andhra Pradesh: త్వరలో 14,493 పోస్టుల భర్తీ..
సాక్షి, అమరావతి: వచ్చే జూన్ నెలాఖరులోగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. గ్రామ, వార్డు వలంటీర్, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. సచివాలయంలో గురువారం గ్రామ, వార్డు వలంటీర్, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థపై మంత్రి పెద్దిరెడ్డి అధ్యక్షతన కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మునిసిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, గ్రామ, వార్డు సచివాలయాలు, స్పందన సలహాదారు ధనుంజయరెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. రోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలి మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీలను త్వరితగతిన భర్తీచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారని తెలిపారు. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది పనితీరుకు సంబంధించి ఆయా శాఖల వారీగా సర్టిఫికెట్లు తీసుకోవాలని గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్‌ను ఆదేశించారు. మునిసిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు వీలుగా సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ (ఏపీ సేవా పోర్టల్)ను గురువారం సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారని తెలిపారు. దీంతో ప్రజలు వివిధ సేవలకు ఏ సచివాలయం నుంచి అయినా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. గ్రామ, వార్డు వలంటీర్, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ.. ప్రస్తుతం గ్రామాల్లో 11,162, పట్టణాల్లో 3,842.. మొత్తం 15,004 సచివాలయాలు పనిచేస్తున్నాయని తెలిపారు. గ్రామ సచివాలయాల్లో 11, వార్డు సచివాలయాల్లో 10 ఫంక్షనరీలకు సంబంధించిన సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పారు. ఈ సచివాలయాల్లో ఉన్న 14,493 ఖాళీలను త్వరితగతిన భర్తీచేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఇప్పటివరకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు 3.50 కోట్ల సేవలు అందించినట్లు వివరించారు. -
జగనన్న కాలనీలను మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దుతాం: అజయ్ జైన్
సాక్షి, తాడేపల్లి: జగనన్న కాలనీల మొదటి దశ పనులు శరవేగంగా సాగుతున్నాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సుమారు 15లక్షల ఇళ్ల నిర్మాణం సాగుతోందని తెలిపారు. వర్షాకాలం పూర్తికావడంతో పనులు ఊపందుకున్నాయని చెప్పారు. మౌలిక వసతుల కల్పన కోసం 34వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అజయ్ జైన్ తెలిపారు. పేదలనే చిన్న చూపు లేకుండా కాలనీల్లో అన్నీ మౌలిక వసతులు కల్పించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని పేర్కొన్నారు. దీనికోసం కేంద్ర పథకాలతో పాటు ఇతర ఆర్థిక సాయం తీసుకుంటున్నామని చెప్పారు. జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ 1000 నుంచి 1500 కోట్ల ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. అండర్ గ్రౌండ్ విద్యుత్, విద్యుత్ పొదుపు చర్యలు తీసుకుంటున్నందుకు ఆ సంస్థ ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. కాలనీల్లో మౌలిక వసతులపై కీలక దృష్టి పెట్టామని, సీఎం జగన్ ఆదేశాల మేరకు అక్కడ కావాల్సిన ప్రతి ఒక్క వసతి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జగనన్న కాలనీలు ఒక మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దుతామని అజయ్ జైన్ తెలిపారు. చదవండి: మంత్రి పెద్దిరెడ్డి, అధికారులకు సీఎం జగన్ అభినందనలు -
కాలనీల్లో మౌలిక వసతులపై దృష్టి సారించాం: అజయ్ జైన్
-
Andhra Pradesh: ఇళ్ల నిర్మాణాలు వేగవంతం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వైఎస్సార్ జగనన్న కాలనీల్లో వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 15.65 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో ఇప్పటికే 10.87 లక్షల ఇళ్ల శంకుస్థాపనలు పూర్తయ్యాయి. వాటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. గత ఏడాది కోర్టు కేసుల కారణంగా కొద్దినెలలపాటు వీటి పనులు నిలిచిపోయాయి. ఇటీవల ఆ అడ్డంకులు తొలగిపోవడంతో డిసెంబర్ నుంచి నిర్మాణాలు తిరిగి గాడినపడ్డాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు రూ.30 కోట్లకు పైగా విలువైన పనులు జరుగుతున్నాయి. మిగిలిన ఇళ్ల శంకుస్థాపనకు చర్యలు తొలిదశలో శంకుస్థాపనలు కాని ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికీ గృహ నిర్మాణ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు లేఅవుట్లలో రీలెవలింగ్, గోడౌన్ల నిర్మాణం, నీటి సరఫరా, ఇతర సౌకర్యాల కల్పన నిమిత్తం రూ.228.6 కోట్ల పనులకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ మొత్తంలో రూ.62.81 కోట్లు అప్రోచ్ రోడ్లు, లేఅవుట్లలోని ఎలక్ట్రికల్ లైన్లు మార్చడానికి రూ.6.60 కోట్లు, లేఅవుట్లలో లెవలింగ్ కోసం రూ.132 కోట్లు, గోడౌన్ల నిర్మాణానికి రూ.3.25 కోట్లు, ఇతర పనుల కోసం రూ.23.94 కోట్లు కేటాయించారు. ఇప్పటికే రూ.30 కోట్ల నిధులను జిల్లాలకు విడుదల చేశారు. అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రెండు జిల్లాలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాం. వీరు అక్కడ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు కలెక్టర్లు, జేసీలతో సమీక్షలు నిర్వహిస్తున్నాం. తొలి నుంచి చిత్తూరు జిల్లా ఇంటి నిర్మాణాల్లో ముందంజలో ఉంది. ఇటీవల రూ.228 కోట్లతో లేఅవుట్లలో వసతుల కల్పనకు అనుమతులిచ్చాం. – అజయ్ జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జర్మనీ సంస్థ ఆసక్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకం అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోంది. పేదలకు నిర్మించే ఇళ్లలో అత్యుత్తమ ఇంధన ప్రమాణాలు అమలు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని జర్మనీకి చెందిన అంతర్జాతీయ బ్యాంక్ కేఎఫ్‌డబ్ల్యూ అధికారులు అభినందించారు. ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఇళ్లలో ఇంధన సామర్థ్య ప్రమాణాలు అమలు చేసేందుకు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు కేఎఫ్‌డబ్ల్యూ ఆసక్తిని వ్యక్తం చేసింది. రాష్ట్ర గృహ నిర్మాణ, ఇంధన శాఖ అధికారులతో ఆదివారం వర్చువల్‌గా జరిగిన సమావేశంలో కేఎఫ్‌డబ్ల్యూ అధికారులు ఈ ప్రతిపాదన చేశారు. 152 మిలియన్ యూరోల సాయం కేఎఫ్‌డబ్ల్యూ ఎనర్జీ ఎఫిషియెన్సీ విభాగం అధిపతి మార్టిన్ లక్స్ మాట్లాడుతూ.. గృహ నిర్మాణ పథకంలో నిర్మించే ఇళ్లలో ఇంధన సామర్థ్య ప్రమాణాల అమలుకు సంబంధించి ప్రాజెక్ట్ తయారీ, అధ్యయనం తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్‌పై అధ్యయనం అనంతరం ఇంధన సామర్థ్య ప్రమాణాలతో కూడిన ఇళ్ల నిర్మాణ కోసం 150 మిలియన్ యూరోలు , సాంకేతిక సహకారం కోసం మరో 2 మిలియన్ యూరోలు అందచేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా జగనన్న కాలనీల్లో విద్యుత్ పంపిణీ మౌలిక సదుపాయాలు, విద్యుత్ సరఫరా నెట్వర్క్ బలోపేతానికి కూడా ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. -
త్వరలోనే సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్
నెల్లూరు (అర్బన్): రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ఇష్టంతో ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థ ఉద్యోగులకు త్వరితగతిన ప్రొబేషన్ పీరియడ్‌ను డిక్లేర్ చేసి పీఆర్సీ అమలు చేయనున్నారని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. నెల్లూరులో పలువురు సచివాలయ ఉద్యోగులు మంగళవారం విధులు బహిష్కరించి, తమకు ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ చేయాలంటూ స్థానిక కలెక్టరేట్లో అజయ్‌జైన్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యపాలన తీసుకుని రావడంలో భాగంగా రాష్ట్రంలో ఒకే దఫా 1.20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. వారికి ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ చేసేందుకు లెక్కలు తీసుకుంటున్నామన్నారు. డిపార్ట్మెంట్ పరీక్ష పాసయిన ప్రతి ఒక్కరికి ప్రొబేషన్ డిక్లేర్ చేస్తారని చెప్పారు. ఎక్కువ శాఖల నుంచి వివరాలు సేకరించాల్సి ఉన్నందున కాస్త ఆలస్యం అయిందన్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులు జూన్‌నాటికి డిక్లేర్ చేస్తామని తెలపగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇంకా ముందుగా వీలైనంత త్వరగా ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ చేయాలని అధికారులను ఆదేశించారని చెప్పారు. అధికారులు అదే ప్రయత్నంలో ఉన్నారన్నారు. సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వడంలో తప్పులేదని, విధులు బహిష్కరించి రోడ్డెక్కడం మంచిపద్ధతి కాదని చెప్పారు. ఎవరో రెచ్చగొడితే ఇలా రోడ్డెక్కితే అంతిమంగా సచివాలయ ఉద్యోగులకే నష్టం జరుగుతుందన్నారు. ఇకనైనా విధులకు హాజరై ప్రజలకు మంచిగా సేవలందించాలని కోరారు. సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం వందశాతం న్యాయం చేస్తుందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన చెప్పారు. -
నిరసనలొద్దు.. వెంటనే విధుల్లో చేరండి
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ ఎలాంటి నిరసనలు చేపట్టకుండా మంగళవారం నుంచి విధులకు హాజరు కావాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. సోమవారం వెలగపూడిలోని రాష్ట్ర తాత్కాలిక సచివాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై, ప్రొబేషన్ ప్రకటన తదితర సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడానికి చాలా దారులున్నాయి. మీరు ఇంకా 30 ఏళ్లు ఉద్యోగాలు చేయాలి. మొదట్లోనే ఇలా చేస్తే మీపై తప్పుడు భావనలు వెళతాయి. మీరంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి అభిప్రాయం ఉంది. కానీ, ఈ మూడు రోజుల పరిణామాలు తప్పు దారిలో వెళ్తున్నాయి. ఎలాంటి వినతులు లేకుండా విధులకు హాజరుకాకపోవడం, అధికారిక గ్రూపుల నుంచి వైదొలగడం, రోడ్లపైకి వచ్చి స్లోగన్లు వంటివి ఉద్యోగులకు కుదరదు. మీరు ఆశిస్తున్నవి కొంతవరకైనా జరగాలంటే మంచి వాతావరణం తేవాలి. పరిస్థితులు చక్కబడితేనే మీరు చెప్పిన అంశాలు సీఎం దృష్టికి తీసుకెళ్లగలను. 13 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై 2018 నుంచి చర్చలు జరుగుతున్నాయి. వాళ్లు అన్నిసార్లూ చర్చలు, వినతుల ద్వారా డిమాండ్లు ప్రభుత్వం ముందుంచారు. మీరు మంచిగా అడిగితే సీఎం ఒకటికి రెండు చేసే అవకాశం ఉంటుంది. తలకు బులెట్ పెట్టి ఇవ్వాలని కోరితే ఇచ్చేది కూడా ఇవ్వరు’ అని స్పష్టం చేశారు. అధికారులు అక్టోబరన్నా, సీఎం జూన్ కల్లా ఇవ్వాలన్నారు గతంలో ప్రొబేషన్‌పై జరిగిన సమావేశంలో 60 వేల మంది ఉద్యోగులే డిపార్టమెంట్ పరీక్షలు పాసయ్యారని అధికారులు సీఎంకు చెప్పారు. ఈ ఏడాది అక్టోబరుకల్లా అందరికీ ఒకేసారి ప్రొబేషన్ డిక్లేర్ చేద్దామని సూచించారు. కానీ, ముఖ్యమంత్రి జూన్ 30వ తేదీ ప్రొబేషన్ ప్రకటనకు చివరి తేదీ కావాలని చెప్పారు. ఉద్యోగులు మంచిగా అడిగితే ఇంకా ముందే వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరూ అడగకుండా ఒకేసారి 1.34 లక్షల మందికి ఉద్యోగాలిచ్చిన ముఖ్యమంత్రి.. మంచి విధానంలో అడిగితే మీ మాట వినే అవకాశం ఎందుకు ఉండదు? అందరికీ ఒకే రోజు సీఎం గారి చేతుల మీదుగా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని అనుకున్నారు. అది అర్ధం చేసుకోకుండా తప్పు దారిలో వెళితే చట్ట ప్రకారం చర్యలకు అవకాశం ఉంది. ప్రభుత్వం ఆ ఉద్దేశంతో లేదు. ఆ పరిస్థితులు మీరు తెచ్చుకోకూడదు. ఎవరన్నా మీకు ప్రొబేషన్ ప్రకటించరంటే నమ్మకండి. ఈ సీఎం ఉండగా మీ ప్రొబేషన్ని ఎవరూ ఆపలేరు. కాకపోతే ఇలాంటివి చేసుకొని మీకు మీరే ప్రొబేషన్‌ను ఆపుకొనే అవకాశం ఉంటుంది’ అని చెప్పారు. ఇందుకే ప్రొబేషన్ ఐఏఎస్ అధికారిగా 30 ఏళ్ల సర్వీసులో ఏ ముఖ్యమంత్రికి నేరుగా మెసేజ్ చేయలేదని, కానీ, కొందరు సచివాలయ ఉద్యోగులు సోషల్ మీడియా ద్వారా నేరుగా మేసేజ్‌లు పంపారని జైన్ తప్పుపట్టారు. తాము ఏ సమాచారాన్నయినా సీఎంవో అధికారులు, సీఎస్ ద్వారా సీఎంకు చేరవేస్తామన్నారు. ఇలాంటి సర్వీసు రూల్స్‌పై అవగాహన కలిగించి, విధుల్లో శిక్షణ ఇవ్వడానికి ప్రొబేషన్ ఉంటుందని చెప్పారు. 77 వేల మంది విధులకు హాజరు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉదయం నిర్ణీత సమయానికే 55,515 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విధులకు హాజరయ్యారని ఆ శాఖ ప్రధాన కార్యాలయం వర్గాలు తెలిపాయి. సాయంత్రానికి మొత్తం 77,409 మంది విధుల్లో పాల్గొన్నట్టు వెల్లడించాయి. సీఎం జగన్‌పై మాకు నమ్మకం ఉంది: అంజన్‌రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పూర్తి న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రతి నిధి అంజన్‌రెడ్డి చెప్పారు. అజయ్‌జైన్‌తో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆందోళన వెనుక కొన్ని శక్తులు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఉద్యోగులు వాటి జోలికి పోకుండా వెంటనే విధుల్లో చేరాలని కోరారు. ఎవరికీ నష్టం జరగదు: జానీ పాషా ప్రొబేషన్ విషయంలో సచివాలయ ఉద్యోగులెవరికీ ఎలాంటి నష్టం జరగదని అజయ్‌జైన్ హామీ ఇచ్చారని ఉద్యోగుల మరో ప్రతినిధి జానీ పాషా చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులెవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అందోళనలు చేయవద్దని సూచించారు. -
జగనన్న కాలనీల్లో ఇం‘ధన’ ఆదా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో ఏటా రూ.539.7 కోట్ల విలువైన విద్యుత్‌ను ఆదా చేయొచ్చని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు తెలిపారు. స్టార్ రేటెడ్ ఉపకరణాలు అమర్చడం ద్వారా భారీగా విద్యుత్ ఆదా చేయడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను కూడా మరింత మెరుగుపరచవచ్చన్నారు. ఇంధన శాఖను సమన్వయం చేసుకుంటూ ఇందుకు అవసరమైన ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, హౌసింగ్ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ నారాయణ్ భరత్ గుప్తా తదితరులతో మంత్రి ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడమే కాకుండా.. రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ, విద్యుదీకరణ, తాగు నీరు, పాఠశాలలు, ఆస్పత్రులు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమేనన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తోందని మంత్రి చెప్పారు. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. వీటిలో 10.72 లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం తొలి దశ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల ఆమోదంతో ఫైవ్ స్టార్ రేటెడ్ విద్యుత్ ఉపకరణాలు అందజేస్తామని మంత్రి చెప్పారు. ప్రతి ఇంటికి నాలుగు ఎల్ఈడీ బల్బులు, రెండు ట్యూబ్ లైట్లు, రెండు ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్లు అందించాలనుకుంటున్నట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. వీటి వల్ల ప్రతి ఇంటికి ఏటా రూ.3,598 విలువైన విద్యుత్ ఆదా అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. 15 లక్షల ఇళ్లలో ఇంధన సామర్థ్య ఉపకరణాలు అమర్చడం వల్ల ఏడాదికి 1,674 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఆదా అవుతుందని చెప్పారు. కేంద్ర సంస్థలైన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ, ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సహకారంతో ఏపీ ఇంధన సంరక్షణ మిషన్ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తోందని అజయ్ జైన్ తెలిపారు. -
క్షేత్రస్థాయి ఉద్యోగులకు బయోమెట్రిక్‌లో వెసులుబాటు
సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయి విధులకు హాజరయ్యే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విషయంలో కొంత వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ప్రొబేషనరీ సహా ఉద్యోగుల ఇతర సమస్యలపై చర్చించేందుకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ బుధవారం పలు ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించింది. విజయవాడలోని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, డైరెక్టర్ షాన్‌మోహన్‌లతోపాటు ఆరు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. అర్హులైన సచివాలయ ఉద్యోగుల ప్రొబేషనరీ ప్రకటన ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, వీలైనంత త్వరలో పూర్తవుతుందని అజయ్‌జైన్ తెలిపారు. ప్రత్యేక సందర్భాల్లో వెసులుబాటు సచివాలయాల్లో పనిచేసే కొంతమంది ఉద్యోగులు ఉదయాన్నే క్షేత్ర స్థాయిలో విధులకు హాజరు కావాల్సి ఉంటుందని సంఘాల నేతలు ఈ సందర్భంగా ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. బయోమెట్రిక్ హాజరు వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ఏఎన్ఎంలతో పాటు ప్రత్యేకించి వ్యవసాయ అసిస్టెంట్, సర్వేయర్ తదితర క్షేత్రస్థాయి విధులలో పాల్గొనే ఉద్యోగులు సంబంధిత రోజుల్లో ఉదయమే కచ్చితంగా బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు చేయాల్సిన అవసరం లేదని, అయితే అలాంటి రోజుల్లో ఆయా ఉద్యోగులు సాయంత్రం 3–5 గంటల మధ్య తప్పనిసరిగా హాజరై వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు బయోమెట్రిక్ వేసేలా వెసులుబాటు కల్పిస్తామని అజయ్ జైన్ ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఏఎన్ఎం లాంటి ఉద్యోగులు సాయంత్రం పూట ప్రసూతి విధులకు హాజరైతే అన్‌డ్యూటీకి అనుమతిస్తామని హామీ ఇచ్చారు. గ్రేడ్–5 గ్రామ కార్యదర్శులకు పూర్తి స్థాయిలో అధికారులు కల్పించే అంశంతో పాటు ఉద్యోగుల జాబ్ చార్టు రూపొందించని సెరికల్చర్ అసిస్టెంట్ తదితరులపై శాఖాధిపతులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ప్రభుత్వ అనుమతి తీసుకొని డిజిటల్ అసిస్టెంట్ కేటగిరి ఉద్యోగుల పేరును డిజిటల్ సెక్రటరీగా మార్పు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మూడు నెలలకు భేటీ.. ప్రతి మూడు నెలలకొకసారి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించనున్నట్టు అజయ్‌జైన్ చెప్పారు. ప్రమోషన్ చానల్‌పై స్పష్టత కోరాం ఉద్యోగుల ప్రమోషన్ చానల్‌ను స్పష్టం చేయాలని సమావేశంలో కోరినట్లు గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అంజనరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని శాఖలకు ఇప్పటికీ సర్వీస్ రూల్స్ లేని విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తెచ్చామన్నారు. సెరికల్చర్, ఏఎన్ఎం, మహిళా పోలీస్ కేటగిరీ ఉద్యోగాలకు సంబంధించి సర్వీస్ రూల్స్ వెంటనే రూపొందించాలని కోరామన్నారు. కోవిడ్‌తో మృతి చెందిన వారి కుటుంబాలలో ఒకరికి ఉద్యోగ అవకాశం క ల్పించాలని కోరామన్నారు.