
కర్నూలు(అర్బన్): రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ జగనన్న లేఅవుట్లలో గృహ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రోజు రూ.23 కోట్లు ఖర్చు చేస్తున్నదని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతిని సమీక్షించేందుకు ఆయన బుధవారం కర్నూలు వచ్చారు. జిల్లా కలెక్టర్ పీ కోటేశ్వరరావుతో కలిసి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణాల్లో పురోగతి చూపితే రోజుకు రూ.50 కోట్లు కూడా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత ఏడు నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ‘నవరత్నాలు–పేదలందరికి ఇళ్లు’ కార్యక్రమంలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలను వచ్చే ఎనిమిది నెలల్లోపు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇంటి పట్టాలను ఇవ్వడం జరిగిందని, ఇందులో మొదటి విడతలో 18 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment