YSR Jagananna Colonies
-
పేదల ఇళ్లపై కూటమి సర్కార్ కుట్ర: మల్లాది విష్ణు
సాక్షి, విజయవాడ: పేదల ఇళ్లపై కూటమి సర్కార్ కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. మంగళవారం ఆయన.. నున్న, సూరంపల్లిలో జగనన్న కాలనీలను సందర్శించారు. లబ్ధిదారులతో మాట్లాడి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. తాగునీరు, వీధి దీపాలు లేక ఇబ్బందులు పడుతున్నామని గృహ యజమానులు తెలిపారు.నిరుపేదల సొంతింటి కల సాకారం కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలనీల పేరుతో ఏకంగా మినీ సిటీలనే నిర్మించిందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా 31.70 లక్షల ఇళ్లపట్టాలు అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. సెంట్రల్ నియోజకవర్గంలో 23,490 మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు కేటాయించాం. తొలిదశలో 14,986 ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా.. 2,712 ఇళ్లు పూర్తి అయ్యాయి. మరో 2 వేల ఇళ్లు చివరి దశలో ఉన్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత ఆ ఇళ్లన్నింటినీ పాడుబెడుతోంది.’’ అని మల్లాది విష్ణు మండిపడ్డారు.‘‘పైగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్లు ఇస్తామని కేబినెట్ మీటింగ్‌లో ప్రభుత్వ పెద్దలు చెప్పడం హాస్యాస్పదం. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి.. ఇప్పటివరకు ఒక్కరికి కూడా సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. అమరావతిలో పేదలెవరు ఉండకూడదనే రీతిలో ఈ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వంలో నియోజకవర్గంలోని 8,504 మంది పేదలకు అమరావతిలో స్థలాలు కేటాయించాం.ఇదీ చదవండి: కూటమిలో ‘లోకేష్’ రాగం.. మరోసారి బాబు మైండ్ గేమ్?..కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్దాక్షిణ్యంగా నిర్మాణాలను నిలిపివేసింది. దీంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరగడం, మరోవైపు అద్దెల భారంతో లబ్ధిదారులు ఆర్థిక వెతలను ఎదుర్కొంటున్నారు. తక్షణమే పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలి. లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలి. లేనిపక్షంలో పేదల తరపున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతుంది’’ అని మల్లాది విష్ణు తెలిపారు. -
పేదలకు ఇళ్లు కాలనీలు కాదు ఊళ్లు
నిన్నటి కన్నా ఈ రోజు బాగుండాలి...ఈ రోజు కన్నా రేపు బాగుండాలి...ఎవరైనా కోరుకునేది ఇదే...సగటు మనిషి కాస్తంత నీడ కోసం పరితపిస్తాడు...తన సంపాదన ఓ చిన్న గూడును కట్టుకోవడానికీ చాలకపోతే ప్రభుత్వం సాయపడుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తాడు...ప్రభుత్వం ఓట్ల కోసం తప్పుడు వాగ్దానం చేసి అధికారంలోకి వస్తే మోసపోయానే...అని తనలో తానే మథనపడతాడు...మోసమనే ఇటుకతో గాలిలో మేడలు కట్టిన చంద్రబాబు ప్రభుత్వం నిరుపేదలను ఇలాగే వంచించింది... ఆ వంచనకు శాస్తిగా బాబును చిత్తుగా ఓడించింది జనసామాన్యం...ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలకు ఆచరణ రూపమిస్తే జననీరాజనం ఎలా ఉంటుందో నేడు జగన్ మేం సిద్ధం యాత్ర సాక్ష్యంగా నిరూపిస్తోంది... ఆ హామీ పేరు పేదలకు ఇళ్లు...అర్హతే ప్రాతిపదికగా దేశంలోనే రికార్డుగా...ఒక ఘనతగా చెప్పేలా 31 లక్షల మంది అక్కచెల్లెమ్మల సొంతింటి కలకు గాలిలో కాదు...నేలపైనే మేడలు...ఇంకా చెప్పాలంటే ఊళ్లకు ఊళ్లను నిర్మిస్తూ...నవ్యాంధ్ర చరితను సీఎం జగన్ తిరగరాస్తున్నారు... స్థలం విలువ ఆధారంగా చూస్తే ఒక్కొక్కరికి రూ.6 లక్షల నుంచి రూ.20 లక్షల ఆస్తిని ఉచితంగా కట్టబెట్టిన ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామని జనసామాన్యమే ఉప్పొంగిపోతోంది...ఇది కదా మాటకు కట్టుబడి...మడమ తిప్పని ప్రభుత్వానికి సార్థకత. –వడ్డే బాలశేఖర్, సాక్షి ప్రతినిధిప్రతి పేదవాడు ఏం కోరుకుంటాడు? ‘కడుపు నింపుకోవడానికి గుప్పెడు మెతుకులు, తలదాచుకోవడానికి ఓ సొంత గూడు’.. అయితే దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా తమకంటూ ఓ సొంత గూడు లేని పేదలు ఎందరో ఉన్నారు. ఆ కోవకు చెందిన వేళంగిణి, దుర్గ తరహాలనే రాష్ట్రంలో తమకంటూ ఓ పక్కా ఇల్లు ఉండాలనే ప్రతి పేదింటి అక్క చెల్లెమ్మల చిరకాల స్వప్నాన్ని తోబుట్టువుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేశారు. రాష్ట్ర, దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా పేదలకు పెద్ద ఎత్తున ఉచితంగా ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇంటి నిర్మాణానికి సాయం, కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన ఇలా ప్రతి అడుగులోనూ చేయి పట్టి అక్కచెల్లెమ్మలను ముందుకు నడిపారు. ఇదిలా ఉండగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ, విజనరీ లీడర్ అని చెప్పుకునే చంద్రబాబు పేదల ఇళ్ల స్థలాలను శ్మశానాలతో పోల్చిన దుస్థితి. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, విభజిత ఏపీలో ఒక పర్యాయం సీఎంగా పనిచేసిన ఈ పెద్ద మనిషి ఏనాడు పేదల గూడు గోడును పట్టించుకోలేదు. అడ్డంకులను అధిగమిస్తూ... రాష్ట్రంలో పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం రూపంలో ఏకంగా కొత్తగా ఊళ్లకు ఊళ్లనే సీఎం జగన్ గడిచిన ఐదేళ్లలో నిర్మించ తలపెట్టారు. 71,811 ఎకరాల్లో 31.19 లక్షల మంది నిరుపేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. తద్వారా 17,005 వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లనే నెలకొల్పారు. పేదలకు పంపిణీ చేసిన ఒక్కో ప్లాట్ విలువ రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ ఉంటుంది. ఈ లెక్కన ఏకంగా పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన ప్లాట్ల మార్కెట్ విలువ రూ.76 వేల కోట్లకు పైమాటే. నిరుపేదల దశాబ్దాల సొంతింటి కల సాకారానికి చిత్తశుద్ధితో సీఎం జగన్ అడుగులు వేస్తుండటంతో తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని అడుగడుగునా పథకాన్ని చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీడీపీ, తమ మద్దతుదారుల ద్వారా కోర్టుల్లో 1,000 కేసులను వేయించి, ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలను పలు సందర్భాల్లో అడ్డుకున్నారు. ఈ అడ్డంకులేవీ జగన్ మనోధైర్యాన్ని సడలనివ్వలేదు. దేశంలోనే తొలిసారిగా ఉచితంగా పంపిణీ చేసిన స్థలాలపై లబ్ధిదారులకు సర్వహక్కులను సీఎం జగన్ ప్రభుత్వం కల్పించింది. వారి పేరిట ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ అందించింది. 2024లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు పెట్టి 15 లక్షల మందికి రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో మిగిలిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. పేదల తరపున పెత్తందారులతో యుద్ధం అమరావతిలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాలకు చెందిన నిరుపేదలకు సీఎం జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక అసమతుల్యత (డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్) ఏర్పడుతుందని టీడీపీ కోర్టులకు వెళ్లి స్టే తెచ్చింది. అయినా జగన్ మనోబలం సడలిపోలేదు. పేదల తరపున పెత్తందారులతో సీఎం జగన్ ప్రభుత్వం యుద్ధం చేసింది. హైకోర్టు, సుప్రీం కోర్టులకు వెళ్లి విజయం సాధించి గత ఏడాది 50,793 ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడంతో పేదలకు అమరావతిలో ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వద్దంటూ కేంద్ర ప్రభుత్వానికీ టీడీపీ మద్దతుదారులు అనేక ఫిర్యాదులు చేశారు. ఈ అడ్డంకులను సైతం అధిగమించి అనుమతులు రాబట్టి పేదల ఇళ్ల నిర్మాణానికి గత ఏడాది జూలై 24న సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అయినప్పటికీ టీడీపీ పేదల ఇళ్లకు అడ్డుపడుతూ తన కపటబుద్ధిని ప్రదర్శించింది. మరోమారు కోర్టుకు వెళ్లి పేదల ఇళ్ల నిర్మాణంపై స్టే తెచ్చి నిర్మాణాలను అడ్డుకుంది. కోర్టులనూ మోసం చేసిన టీడీపీ... మహిళల పేరిటే ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఎందుకివ్వాలనే అభ్యంతరాలతో హైకోర్టులో తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది పిటిషన్ వేశారు. దీనిపై విచారణæ జరిపిన న్యాయస్థానం 2021లో ఇళ్ల నిర్మాణంపై స్టే ఇచ్చింది. కొద్ది రోజుల తర్వాత తాము కోర్టులో పిటిషన్ వేయలేదంటూ వారు వెల్లడించారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ దళారులు పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామంటూ ఆధార్, రేషన్ కార్డులతో పాటు, వారి సంతకాలు, రూ.5 వేల నుంచి రూ.40 వేల వరకూ డబ్బు వసూళ్లు చేశారు. ఇలా మా నుంచి తీసుకున్న ధ్రువపత్రాలతో మాకే తెలియకుండా కోర్టుల్లో టీడీపీ నాయకులే కేసులు వేశారంటూ అప్పట్లో పేదలు బయటకు వచ్చి చెప్పారు. యర్రజర్ల కాల్వ సమస్యకు ఫిర్యాదు చేద్దామంటూ బల్లి ప్రభాకర్‌రావు, జాజుల హరికృష్ణ అనే ఇద్దరు వ్యక్తుల నుంచి తెల్ల కాగితంపై సంతకం, ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు తీసుకుని ఇళ్ల పట్టాల పంపిణీపైనా టీడీపీ నాయకులు కోర్టులో కేసులు వేశారు. తమను టీడీపీ నాయకులు మోసగించినదానిపై లిఖితపూర్వకంగా వివరించారు. రికార్డు స్థాయిలో 31.19 లక్షల ఇళ్ల పట్టాలు రికార్డు సృష్టించడమే కాకుండా, కరోనా, కోర్టు కేసులు, ఇతర అడ్డంకులను ఎదురొడ్డి అనతికాలంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలను చేపట్టి మరో సరికొత్త రికార్డును సీఎం జగన్ కైవసం చేసుకున్నారు. 2020 డిసెంబర్లో ఇళ్ల స్థలాల పంపిణీ అనంతరం వివిధ దశలుగా 21.75 లక్షల ఇళ్ల (19.13 లక్షలు సాధారణ ఇళ్లు, 2.62 లక్షలు టిడ్కో ఇళ్లు) నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వీటిలో ఇప్పటికే 9 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, మిగిలినవి శరవేగంగా నిర్మితమవుతున్నాయి. సాధారణ ఇళ్లలో 11.61 లక్షల గృహాలు వివిధ దశల్లో నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయి. 2020 డిసెంబర్ 25న కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో పట్టాలను పంపిణీ చేయడంతో పాటు పేదల ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. కేవలం మూడేళ్ల నాలుగు నెలల్లోనే రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి పేదలకు అందించారు. ఉచితంగా స్థలం... ఆపై అమిత సాయం ఇళ్ల లబ్ధిదారులకు ఖరీదైన స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన సీఎం జగన్ ప్రభుత్వం అక్కడితో ఆగలేదు. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షల బిల్లు మంజూరు చేయడంతో పాటు, ఎస్‌హెచ్‌జీల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేల రుణ సాయం అందించింది. ఉచితంగా ఇసుకను పంపిణీ చేయడం ద్వారా రూ.15 వేలు, స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా చేయడం ద్వారా మరో రూ.40 వేల చొప్పున మొత్తంగా రూ.2.70 లక్షల చొప్పున ప్రయోజనం చేకూర్చింది. గేటెడ్ కమ్యూనిటీల తరహాలో... పేదలకు సొంత గూడు కల్పించడమే కాకుండా కాలనీలను ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీల తరహాలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. విశాలమైన రోడ్లు, విద్యుత్ సరఫరా, డ్రైనేజీ, పార్కులు, ఇంటర్నెట్ సహా అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. ఈ క్ర మంలో మౌలిక సదుపాయా ల కల్పన కోసమే ఏకంగా రూ.32,909 కోట్లను వెచ్చిస్తోంది. చంద్రబాబు రూ.8,929.81కోట్ల అవినీతి చంద్రబాబు తన అక్రమాలకు పట్టణాల్లో ఇల్లు లేని నిరుపేదల జీవితాలను ‘తాకట్టు’ పెట్టారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టించేందుకు 2016–17లో రాష్ట్రంలో అధికంగా నిర్మాణ వ్యయాన్ని చూపి లబ్ధిదారులను దోచుకున్నారు. ఏపీ టిడ్కో ద్వారా రాష్ట్రంలోని పట్టణాల్లో నివశిస్తున్న ఇళ్లు లేని 5 లక్షల మందికి ప్రభుత్వ స్థలాల్లో 300, 365, 415 చ.అ విస్తీర్ణంలో జీ+3 విధానంలో ఫ్లాట్లు కట్టిస్తామని చెప్పారు. 300 చ.గ విస్తీర్ణం గల ఫ్లాట్‌కు రూ.2.60 లక్షల ధర నిర్ణయించి బ్యాంకు రుణాలు ఇప్పించి, నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు చెల్లించాలని (రూ.7.20 లక్షలు) షరతు పెట్టారు. ఇలా నిర్మాణ కంపెనీల నుంచి ముడుపులు తీసుకుని, అధికంగా ముడుపులు ఇచ్చుకున్న కంపెనీకి అధిక ధరకు, తక్కువగా ఇచ్చిన కంపెనీకి తక్కువ ధరకు నిర్మాణ అనుమతులు కట్టబెట్టింది. 2016–17లో మార్కెట్లో చ.అడుగు నిర్మాణ ధర రూ.900 నుంచి రూ.1,000 మధ్య ఉండగా... కంపెనీలకు రూ.2,534.75 నుంచి రూ.2034.59గా నిర్ణయించి సగటు చ.అ నిర్మాణ ధర రూ.2,203.45గా చెల్లించారు. అంటే అప్పటి మార్కెట్ ధరతో పోలిస్తే రూ.1,203.45 అదనంగా నిరుపేదల నుంచి వసూలు చేశారు. ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు మార్కెట్ ధర కంటే తగ్గాల్సింది పోయి భారీగా పెంచేశారు. ఇలా తలపెట్టిన 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు చాలినంత భూమి లేదని 3.15 లక్షల ఇళ్లకే శ్రీకారం చుట్టింది. తొలి విడతగా 2,08,160 యూనిట్లను 7,42,01,820 చ.అ. విస్తీర్ణంలో నిర్మించేందుకు అనుమతులిచ్చి రూ.8,929.81 కోట్ల అవినీతికి పాల్పడింది. పేదలు 300 చ.అ. ఇంటికి బాబు ప్రభుత్వం రూ.7.20 లక్షల భారం మోపి, 20 ఏళ్ల పాటు వాయిదాలు కట్టాలని షరతు పెట్టింది. దీని ప్రకారం లబ్ధిదారులపై రూ.3,805 భారం మోపింది. ఇంకా 365 చ.అ. ఇంటికి రూ.50 వేలు, 430 చ.అ. ఇంటికి రూ.లక్ష వసూలు చేసింది. వాళ్లిప్పుడు లక్షాధికారులుఒకప్పుడు అద్దె ఇళ్లలో, పూరిగుడిసెల్లో ఎన్నో అగచాట్లు, ఇబ్బందులు పడ్డ మహిళలు, నిరుపేద కుటుంబాలు సీఎం జగన్ చొరవతో లక్షాధికారులుగా మారారు. అది ఎలాగంటే... మహిళల పేరిట రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ విలువ చేసే స్థలాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణానికీ సాయం చేశారు. స్థలం, ఇంటి రూపంలో ప్రతి పేదింటి అక్కచెల్లెమ్మ పేరిట ప్రాంతాన్ని బట్టి రూ.6 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ మార్కెట్ విలువ చేసే స్థిరాస్తి సమకూరినట్లయింది. ఇలా రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల మేర సంపదను ప్రభుత్వం సృష్టించింది. సమాజంలో గౌరవం పెరిగింది. నా భర్త భవన నిర్మాణ కార్మికుడు. మాకు సొంత ఇల్లు లేకపోవడంతో అద్దె ఇంటిలో ఉంటున్నాము. ఓ వైపు పిల్లల చదువులు, మరోవైపు ఇంటి అద్దెలు. కుటుంబ పోషణ భారం. మా అద్దె ఇంటి కష్టాల నుంచి ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. ఎటువంటి సిఫార్సులు లేకుండా ఇంటి స్థలాన్ని ప్రభుత్వం కేటాయించి ఇంటిస్థలం రిజిస్ట్రేషన్ చేశారు. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. జగనన్న దయతో సొంతింటి భాగ్యం కలిగింది. గతంలో మాకంటూ సొంతిల్లు లేదని బంధువులు, సన్నిహితుల్లో చిన్న చూపు ఉండేది. ప్రస్తుతం ఆ సమస్య లేదు. సమాజంలో మాకు గౌరవమూ పెరిగింది. – మీసాల వనజాక్షి, వైఎస్సార్ జగనన్న కాలనీ, పాలకొండ, పార్వతీపురం మన్యం జిల్లా మాగోడు విన్న నేత సీఎం కావాలి నా భర్త భానుప్రసాద్ పెయింటింగ్ పని చేస్తారు. మా ఇద్దరు పిల్లలతో కలిసి మా అత్తమ్మ వాళ్లింట్లో ఉండేవాళ్లం. ఒకే ఒక గది. ఆ గదిలోనే వంట చేసుకోవాలి. ఇరుకు ఇంట్లో ఉండడం వల్ల అనేక ఇబ్బందులు పడ్డాం. మా కష్టాలను సీఎం జగన్ ప్రభుత్వం ఆలకించింది. ఇంటి స్థలంతో పాటు, ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల రుణమూ ఇచ్చింది. ఇప్పుడు మాకు రూ.15 లక్షలకు పైగా విలువైన సొంత ఆస్తి ఉంది. మా గూడు గోడు విని, గోడు తీర్చిన నేతనే సీఎంగా మళ్లీ కావాలి. ఆయన్ని మేం సీఎం చేసుకుని తీరుతాం. – బుడితి బాలామణి, దగ్గులూరు, పశ్చిమగోదావరి జిల్లా పథకం అమలులో కీలక ఘట్టాలు► 2020 డిసెంబర్: 25 లక్షల ఇళ్ల స్థలాల పంపిణీ. తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు. ► 28 ఏప్రిల్ 2022: పథకంలో రెండో దశకు శ్రీకారం. 1.24 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ. 3.53 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు. ► 27 మే 2023: సీఆర్డీఏలో రూ.3,506 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 1,402.58 ఎకరాల భూమి 50,793 మంది అక్కచెల్లెమ్మలకు పంపిణీ. ► 24 జూలై 2023: సీఆర్డీఏలో 47,071 పేదల ఇళ్ల నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన. బాబు చేతిలో దగాపడ్డ టిడ్కో లబ్ధిదారులకు అండగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 88 పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) పరిధిలోని 163 ప్రాంతాల్లో జీ+3 విధానంలో ప్రభుత్వం 2,62,212 టిడ్కో ఇళ్లను నిర్మిస్తోంది. పేదలకు కేటాయించిన 300 చ.అ. ఇంటిని ఉచితంగా (రూ.1కి) ఇవ్వడంతో 1,43,600 మంది లబ్ధిదారులకు ఈఎంఐ రూపంలో చెల్లించే రూ.10,339 కోట్లను ప్రభుత్వమే చెల్లిస్తోంది. 365 చ.అ ఇళ్లలో 44,304 మంది లబ్ధిదారులు రూ.50 వేలు, 430 చ.అ. ఇళ్లలో 74,312 మంది లబ్ధిదారులు రూ. లక్ష చొప్పున వాటా చెల్లించాలనే నిబంధనలో సగానికి తగ్గించి, మిగతా సగం వాటా నగదు రూ.482.32 కోట్లను ఈ ప్రభుత్వమే చెల్లించింది. దీంతో రెండు, మూడు కేటగిరీల పేదలు గత ధరల ప్రకారం చెల్లించాల్సిన రూ.10,797 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఆ మొత్తం రూ.4,590 కోట్లకు ఈ సర్కారు తగ్గించింది. విద్యుత్, రోడ్లు వంటి అన్ని వసతుల కేటగిరీల ఇళ్ల లబ్ధిదారులకు సేల్‌డీడ్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు, యూజర్ చార్జీలు భరించడంతో లబ్ధిదారులు మొత్తం రూ.5,487.32 కోట్ల మేలు పొందారు. మొత్తం ఇళ్లలో ఫేజ్–1 కింద 1,51,298 ఇళ్లను నూరు శాతం నిర్మాణం పూర్తి చేసి, 1.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించింది. ► ఈ ఫొటోలో సెల్ఫీ తీసుకుంటున్న టి.తిరుపతి స్వామి, వేళంగిణిలది బాపట్ల జిల్లా, భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామం. వీరు రెండేళ్ల క్రితం గ్రామంలోని కృష్ణా కెనాల్‌కు సంబంధించిన పిల్లకాలువ గట్టుపై పూరి గుడిసెలో నివసించేవారు. ఆ గుడిసెలోనే వేళంగిణి అమ్మ, అన్నయ్య కుటుంబాలూ ఉండేవి. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ...ఈ కుటుంబం ప్రత్యక్ష నరకాన్ని అనుభవించింది. గత ప్రభుత్వంలో ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకున్నా...ఇంటి స్థలం మంజూరు కాలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద వేళంగిణికి ఇంటి స్థలం, ఇంటిని మంజూరు చేసి నిర్మించి ఇచ్చింది. 2022 సెప్టెంబర్‌లో ఈ కుటుంబం ఆ ఇంటిలోకి మారింది. ‘నా చిన్నప్పటి నుంచి కాలువ గట్టుపై మురికి కూపంలో గుడిసెల్లోనే బతికాను. దీపం వెలుతురు తప్ప కరెంటు కనెక్షన్ ఉండేది కాదు. వర్షాలు కురిస్తే మా గుడిసె వరదనీటిలో మునిగిపోయేది. మురుగు నీరు బయటకు వెళ్లిపోయి, సాధారణ పరిస్థితి నెలకొనే వరకూ రోడ్డు పక్కనే ఉండేవాళ్లం. సాధారణ రోజుల్లోనూ మురికి నీటి కారణంగా దోమల బెడద తీవ్రంగా ఉండేది. పాములు, తేళ్లు, కీటకాలు గుడిసెల్లోకి వచ్చేసేవి. సీఎం జగన్ ప్రభుత్వం మా గోడును ఆలకించింది. ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు, ఇంటినీ నిర్మించి ఇచ్చింది. గుడిసెల్లో నివాసం దినదినగండమే. కంటి నిండా నిద్రపోయిన రోజులే లేవు. ఇప్పుడు మాకంటూ ఓ సొంత ఇల్లుంది. గుడిసె కష్టాలన్నీ తొలగిపోయాయి..’ అని వేళంగిణి సంతోషం వ్యక్తం చేస్తోంది. ► పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని మెంటేవారితోటకు చెందిన మేడిశెట్టి దుర్గ భర్త సంచులు కుడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. దుర్గ కూలి పనులకు వెళుతుంటారు. వారికి ఇద్దరు పిల్లలు. సొంత ఇల్లు లేదు. 20 ఏళ్లుగా అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. దంపతుల అరకొర సంపాదన ఇంటి అద్దె, కుటుంబ పోషణకే సరిపోతుంది. సీఎం జగన్ ప్రభుత్వంలో దుర్గకు విస్సాకోడేరు జగనన్న లే అవుట్లో స్థలంతో పాటు ఇల్లు మంజూరయింది. ప్రభుత్వ సాయం రూ.1.80 లక్షలకు, కొంత సొంత నగదు జోడించి ఇంటి నిర్మాణం పూర్తిచేసుకున్నారు. ఇప్పుడు అద్దె బాధలు తప్పాయని ఆ కుటుంబం సంబరంగా చెబుతోంది. ఇక్కడ సెంటు స్థలం రూ.4 లక్షలు ఉంటుందని, జగనన్న దయతోనే తమ కల నెరవేరిందని ఈ దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లలైనా సొంతింటిలో జీవించాలని మాకు కోరిక. సీఎం జగన్ మా కోరికను నెరవేర్చారని భావోద్వేగానికి గురయ్యారు. -
Anakapalle: సొంతింటి కల నెరవేర్చిన ప్రభుత్వం
పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వడం అంటే.. కేవలం వారు తలదాచుకోడానికి గూడు కల్పించడమే కాదు.. సమాజంలో సగౌరవంగా తలెత్తుకొని బతికేలా ఆత్మవిశ్వాసాన్ని కల్పించడమే. అందుకే.. సొంత ఇల్లు పేదల ఆత్మ గౌరవానికి సూచిక. మన అక్కచెల్లెమ్మలకు ఒక అన్నగా ఇస్తున్న కానుకే ఈ జగనన్న ఇల్లు’ -ఇదీ.. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బడుగుల ఆత్మ గౌరవానికి సౌధాలుగా చెప్పుకునే ఇంటి గురించి చెప్పిన మాటలు. ‘ఒక సెంటు భూమిలో ఇల్లు కట్టిస్తామని జగన్ చెబుతున్నాడు. ఆ సెంటు భూమి బరియల్ గ్రౌండ్‌కి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎవరైనా చనిపోతే అందులో పూడ్చడానికి మాత్రమే ఈ సెంటు భూమిని ఉపయోగించవచ్చు’ -ఇవీ.. 40 ఏళ్లు సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు పేదల సౌధాలపై చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలు. నిజమే సెంటు స్థలంలో ఇల్లు చిన్నదే. కానీ.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన చంద్రబాబు.. ఎన్ని సెంట్ల స్థలాల్లో నిరుపేదలకు ఇళ్లు కట్టారో ఆయనకే ఎరుక. సాక్షి, అనకాపల్లి: సొంత ఇల్లు... పేదల ఆత్మగౌరవ సూచిక. పేద, బడుగు, బలహీన వర్గాలకు ఇంటి స్థలం కాగితం చేతికివ్వడం అంటే ఆత్మగౌరవ పతాకాన్ని వారి చేతికిచ్చినట్లే. ఎందరో అభాగ్యుల దుర్భర జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’పథకం వెలుగులు నింపుతోంది. ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలో 58,626 మంది మహిళల పేరిట ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లను నిర్మింపజేస్తోంది. ఇదంతా ఉచితమే. పేదల మీద భారం లేకుండా సొంత ఇంటి కలను నిజం చేసే బాధ్యతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్నారు. ఒక్క రూపాయి ఖర్చులేకుండా ప్రభుత్వం వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. 682 లే అవుట్లలో నిర్మాణాలు అనకాపల్లి జిల్లాలో మొత్తం 682 లేఅవుట్లలో జగనన్న ఇళ్లు నిర్మిస్తున్నారు. 34,431 ఇళ్ల పట్టాలను ఉచితంగా పంపిణీ చేశారు. 24,195 మంది లబ్ధిదారులు తమ సొంత స్థలాల్లో నిర్మాణం చేపడుతున్నారు. అంతేకాకుండా ఒక్కో ఇంటికి రూ.30 వేల చొప్పున ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించింది. 18,738 ఇళ్లు పూర్తవ్వగా.. పురోగతిలో 36,029 ఇళ్లు ఉన్నాయి. పూర్తయిన ఇళ్లకు ఇప్పటివరకూ రూ.445.54 కోట్లు ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వం కల్పించే మౌలిక వసతుల వ్యయం కలిపితే ఇంటి స్థలం, ఇల్లు ఖరీదు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది. ఈ కాలనీలు ఊర్లుగా రూపుదిద్దుకుంటున్నాయి. మెరుగైన జీవితం కోసం.. ఒక పేద కుటుంబం అన్ని సంక్షేమ పథకాలనూ అందుకుంటూ సొంత ఇంట్లో ఉంటే... మెరుగైన జీవితం వారికి తప్పకుండా దక్కుతుంది. ఆయా కుటుంబాల అభ్యున్నతికి బాటలు పడతాయి. దశాబ్దం తిరిగేసరికి... సమాజంలో గణనీయమైన మార్పు కచ్చితంగా కనిపిస్తుంది. అభివృద్ధికి నిర్వచనం... నేటి కంటే రేపు బాగుండటం అని వైఎస్ జగన్ పదేపదే చెబుతుంటారు. దానికి సాక్ష్యంగా ‘వైఎస్సార్ జగనన్న కాలనీలు’ సగర్వంగా తలెత్తుకుని నిలబడుతున్నాయి. సమగ్ర సౌకర్యాలతో... ళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 లక్షల ఆర్థిక సాయంతో పాటు డ్వాక్రా మహిళలకు రూ.35 వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలు అందిస్తోంది. నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తోంది. సిమెంట్, స్టీల్‌ను రాయితీపై ఇస్తోంది. ఐఎస్ఐ మార్కు ఉన్న నాణ్యమైన సిమెంట్, స్టీల్, ఇతర వస్తువులను మార్కెట్ ధరల కంటే తక్కువకే అందిస్తోంది. కేవలం ఇళ్లను నిర్మించి ఇవ్వడమే కాకుండా.. పూర్తిస్థాయి సౌకర్యాల్ని ప్రభుత్వం కల్పిస్తోంది. సీసీ రోడ్లు, తాగునీటి సరఫరా పైపులైన్లు, భూగర్భ డ్రెయినేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు అన్ని కాలనీల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్నెట్ సదుపాయం కల్పించడానికీ భూగర్భ కేబుళ్లు వేస్తున్నారు. పేదలకు ‘క్వాలిటీ లైఫ్’ అందించడానికి ప్రభుత్వం చేపట్టిన మహాయజ్ఞంలా నిర్మాణాలు సాగుతున్నాయి. బాబు హయాంలో బేల చూపులే... 14 సంవత్సరాల పాటు సీఎంగా ఉన్న చంద్రబాబు ఏనాడు పేదల గురించి ఆలోచించలేదు. అధికారంలో ఉన్నప్పుడు.. సీఎం స్థాయి నుంచి జన్మభూమి కమిటీ వరకూ దోచుకునేందుకు ఎక్కడ దారి దొరుకుతుందో చూడటమే తప్ప.. పేద ప్రజలకు ఒక గూడు ఇద్దామన్న ఆలోచనే వారికి కనిపించలేదు. 2014లో హుద్‌హుద్ ధాటికి వేల మంది ప్రజలు ఇళ్లు కోల్పోయారు. 2016 ఏప్రిల్ నాటికి బాధితులకు ఇళ్లు అప్పగిస్తామని చెప్పారు. 2019 ఎన్నికలు వచ్చేంత వరకూ కూడా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయలేకపోయారు. బాధితుల జాబితా అధికారుల వద్ద ఉన్నా.. దానితో సంబంధం లేకుండా టీడీపీ జన్మభూమి కమిటీలే అర్హుల జాబితాని సిద్ధం చేశాయి. ఇళ్ల కేటాయింపులో 80 శాతం వరకూ టీడీపీ కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యమిచ్చారు. ఇతర పార్టీల వారు బాధితుల జాబితాలో ఉన్నా.. వారిని పక్కకు తప్పించారు. ఇలా ఒక్క ఇంటిని కూడా నిరుపేదకు ఇవ్వని చరిత్ర తెలుగుదేశం పార్టీది. సొంతిల్లు.. చీకూచింతా లేని జీవితం నా పేరు వారాది కృష్ణవేణి, నేను ఒంటరి మహిళను. అనకాపల్లి మండలంలోని రేబాక గ్రామంలో నా తల్లితో కలిసి ఉండేదాన్ని. నా తల్లి మరణించాక చాలా కాలం నుంచి ఒంటరి బతుకే నాది. గత ప్రభుత్వంలో బతుకు చాలా భారంగా ఉండేది. జగనన్న ప్రభుత్వంలో నా కష్టాలన్నీ తీరాయి. మా ఊరికి చేరువగానే జగనన్న లేఅవుట్ వేశారు. నాకు సొంతిల్లు లేదని తెలుసుకున్న మా వలంటీర్ నా ఆధార్, ఇతర వివరాలతో మా ఊరి సచివాలయంలో దరఖాస్తు పెట్టారు. రోడ్డుకు ఆనుకుని లేఅవుట్లో ముందు వరుసలోనే నా పేరున స్థలం మంజూరైంది. వెంటనే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాను. సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ వచ్చి పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఫోటోలు తీసుకునేవారు. నిర్మాణ దశల మేరకు నాలుగు విడతల్లో బి ల్లును నా బ్యాంకు ఖా తాలో జమ చేశారు. ఇసు క, సిమెంట్, ఇనుముతో కలిపి మొత్తం రూ.లక్షా, 80 వేలు లబ్ధి చేకూరింది. దీంతో చాలా వేగంగా నా ఇంటి పనులు పూర్తి చేసుకున్నా. ఇప్పుడు జగనన్న ఇచ్చిన స్థలంలో నిర్మించుకున్న ఇంటిలోనే ధైర్యంగా బతుకుతున్నా. పేదల కోసం ఆలోచించే మనసున్న నాయకుడు జగనన్న. ఈ ప్రభుత్వం నన్ను ఓ ఇంటికి యజమానికి చేసింది. ప్రతి నెలా ఒకటో తేదీనే ఒంటరి మహిళ పింఛన్ ఇంటికే వచ్చి వలంటీర్ అందిస్తున్నారు. జగనన్న దయతో ఎలాంటి చీకూచింత లేకుండా సంతోషంగా బతుకుతున్నా. పాకల్లో బతుకులు.. పక్కా ఇంటికి మాది చోడారం మండలంలోని సాయిపల్లి (చాకిపల్లి). నా పేరు పోలేపల్లి లచ్చిమి. మాది సేనా పేద కుటుంబం. నేను, మా ఆయన అప్పలనాయుడు కూలి పనులకు, సెరువు పనికి ఎల్తాం. రోజూ పనికెల్లకపోతే పూట గడివని బతుకులు మావి. మాకు ఇద్దరు పిల్లలు. మా కష్టం మీదే ఆల్లని పోసించుకోవాల. సొంతంగా నాణ్ణెమైన ఇల్లు లేదు. దీంతో పూరిపాకలోనే ఉంతన్నాం. కూలాడితే గానీ కుండాడని మాలాంటోళ్లం సొంతిల్లు కట్టుకోగలమా. ఎన్ని పెబుత్వాలు మారినా మా బతుకులు పాకల్లోనే గడిసిపోతాయనుకునేటోళ్లం. జగనన్న సీఎం అయ్యాక మాలాంటోళ్ల బతుకుల్లో వెలుగులొచ్చాయి. మా ఊర్లో సచివాలయం ఆపీసోళ్లు, వలంటీరు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి మా పేర్లు రాసుకెళ్లారు. ఇల్లు లేనోళ్లకి ఇంటి స్థలాలు ఇచ్చారు. కొన్ని రోజులకి మా ఊరు చివర్లో ఏసిన జగనన్న కోలనీలో మాకూ ఓ స్థలం ఇచ్చారు. ఇల్లు కట్టుకోడానికి లచ్చా ఎనబయ్యేల రూపాయలు, సిమెంటు, తలుపులు, కిటికీలు, దారమందాలు, కరెంటు సామాన్లు అన్నీ ఇచ్చారు. దానికితోడు మావు కష్టపడి దాచుకున్న కొంత డబ్బు జతచేసి మా తాహతు మేరకు ఇల్లు కట్టుకున్నాం. జగనన్న దయవల్ల మాకూ సొంతగూడు ఏర్పడింది. ఇపుడు మీరెక్కడుంతన్నారని మా సుట్టాలడిగితే సాయిపల్లి జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకొని ఉంతన్నామని ధైర్నెంగా సెప్తున్నాం. జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. నెరవేరిన సొంతింటి కల నా పేరు పోలమూరి సత్యవతి. మాది మునగపాకలోని తిమ్మరాజుపేట. నేను గృహిణిని. నా భర్త బాబూరావు స్థానిక హైస్కూల్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం మాది. ఇద్దరు సంతానం. అమ్మాయికి పెళ్లి చేశాం. కొడుకు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మాకు సొంతిల్లు లేదు. ఇరవయ్యేళ్లుగా అద్దె ఇళ్లలోనే ఉంటున్నాం. చాలా సార్లు అద్దె చెల్లించేందుకు మేం పడ్డ కష్టాలు మర్చిపోలేం. గత ప్రభుత్వ హయాంలో సొంతింటి కోసం పనులు మానుకుని తిరగడం తప్ప ఫలితం లేకపోయింది. ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట మేరకు వలంటీరే మా ఇంటికొచ్చి, అవసరమైన పత్రాలు తీసుకుని సచివాలయంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేశారు. వెంటనే నాకు ఇంటి పట్టా మంజూరు చేశారు. అధికారులు స్వయంగా వచ్చి హద్దులతో సహా స్థలం చూపించి, మాకు అప్పగించారు. ఆ స్థలంలోనే ఇల్లు కట్టుకున్నా. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.లక్షా 80 వేలు సాయం అందించింది. దీనికి తోడు ప్రభుత్వం ద్వారా వివిధ సంక్షేమ పథకాల రూపంలో కలిగిన లబ్ధి, ఇతరుల నుంచి కొంత అప్పు తీసుకుని సొంతింటి కల నెరవేర్చుకున్నాం. సీఎం జగన్ పుణ్యమా అని ఏళ్లనాటి కల నెరవేరింది. మాకంటూ శాశ్వత చిరునామా వచ్చిందంటే జగనన్న చలవే. మాలాంటి పేదోళ్లకు మేలు జరగాలంటే మళ్లీ మళ్లీ జగనే సీఎం కావాలి. -
పేదల ఇళ్లకు రూ.4,376 కోట్లు
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.4,375.82 కోట్లు వెచ్చించింది. రాష్ట్రంలో ఇళ్లులేని పేదలకు పక్కా గృహ యోగం కల్పించేందుకు 30.75లక్షల మంది పేద మహిళల పేరిట విలువైన ఇంటి స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అంతేకాక.. 21.75 లక్షల (19.13 లక్షల సాధారణ + 2.62 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చారు. గత నెల 12వ తేదీ నాటికి 7.42 లక్షల (5.85 లక్షల సాధారణ + 1.57 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేశారు. ఇలా స్థలం, ఇంటితో కలిపి పేదింటి మహిళల పేరిట రూ.10లక్షలు, ఆపైన విలువైన స్థిరాస్తిని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తోంది. రూ.3,694 కోట్ల మేర బిల్లుల చెల్లింపులు ఇళ్ల లబ్ధిదారులకు ఖరీదైన స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన సీఎం జగన్ ప్రభుత్వం అక్కడితో ఆగకుండా ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షల చొప్పున సాయం చేస్తోంది. యూనిట్‌కు రూ.1.80 లక్షలు బిల్లు మంజూరు చేస్తోంది. స్వయం సహాయక బృందాల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేలు రుణ సాయం కూడా చేస్తోంది. ఉచితంగా ఇసుకను పంపిణీ చేయడం ద్వారా రూ.15 వేలు, స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై ఇవ్వడం ద్వారా మరో రూ.40 వేలు చొప్పున మేలు చేస్తోంది. 17వేలకు పైగా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో నిర్మిస్తున్న కొత్త ఊళ్లల్లో ఉచితంగా నీటి, విద్యుత్ సరఫరా కనెక్షన్లు ఇవ్వడం, డ్రెయిన్లు, రోడ్లు లాంటి వసతులను ప్రభుత్వం సమకూరుస్తోంది. ఇలా సబ్సిడీపై 4,69,897 మెట్రిక్ టన్నుల సిమెంట్ సరఫరాకు రూ.247.23 కోట్లు, 33,303 టన్నుల ఇనుముకు రూ.224 కోట్లు వెచ్చించింది. ఉచితంగా ఇసుక పంపిణీతో పాటు, ఇతర సామాగ్రిని సబ్సిడీపై అందించేందుకు మరో రూ.210.59 కోట్లు ఖర్చుచేసింది. దీంతో ఈ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.4,375.82 కోట్లు ఖర్చుచేయగా ఇందులో రూ.3,694 కోట్ల మేర లబి్ధదారులకు బిల్లుల రూపంలో చెల్లింపులు చేపట్టారు. -
ఇళ్ల సౌకర్యాలు బాగుండాలి
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా నిరుపేద అక్కచెల్లెమ్మల ఇంటి నిర్మాణం కోసం మంజూరు చేసిన బ్యాంకు రుణాలకు సంబంధించి వడ్డీ డబ్బుల విడుదలకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను సీఎంవైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఇళ్ల లబ్ధిదారులపై భారం పడకుండా అదనపు సాయం కింద పావలా వడ్డీకి రూ.35 వేల చొప్పున బ్యాంకు రుణాలను అందిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ మంజూరు చేసిన రుణాలకు సంబంధించి ప్రభుత్వం భరించే వడ్డీ మొత్తాన్ని జమ చేసేందుకు సన్నాహాలు చేయాలని సూచించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే సరిదిద్దేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. గృహ నిర్మాణ శాఖపై గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం పురోగతిని పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రతి ఇంటినీ ఆడిట్ చేయండి జగనన్న కాలనీల రూపంలో ఏకంగా 17 వేలకు పైగా ఊళ్లనే కొత్తగా నిర్మిస్తున్నాం. ఈ క్రమంలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. నిర్మాణాలు పూర్తి చేసుకున్న ప్రతి ఇంటిని ఆడిట్ చేయాలి. అందులో భాగంగా విద్యుత్, తాగునీరు కనెక్షన్లు ఇచ్చారా? ఇంకుడు గుంత ఉందా? తదితర అంశాలను పరిశీలించాలి. ఇంటి నిర్మాణంలో పేదలపై భారం పడకూడదు అదనపు సాయం కింద పావలా వడ్డీకి బ్యాంకు రుణాలను మంజూరు చేశాం. మిగిలిన వడ్డీని ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పటి వరకూ మంజూరు చేసిన రుణాలపై వడ్డీ డబ్బుల విడుదలకు సన్నద్ధం కావాలి. గృహ నిర్మాణ శాఖపై ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిబ్రవరికి మరో ఐదు లక్షల ఇళ్లు నవరత్నాల పథకం కింద 21.25 లక్షల పేదల ఇళ్లకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా ఈ ఏడాది అక్టోబర్ నాటికి 7.43 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేసి పేదింటి అక్కచెల్లెమ్మలకు అందించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టామని, ఇందుకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు. గత సమీక్షలో సీఎం నిర్దేశించిన ప్రకారం నిర్మాణాలు పూర్తై లబ్ధిదారులకు అందించిన ఇళ్లకు సంబంధించి మౌలిక సదుపాయాలపై నిశితంగా పరిశీలన చేసినట్లు వివరించారు. విద్యుత్, తాగునీరు సౌకర్యాలను సమకూర్చడంతోపాటు ఇంకుడు గుంతలు, ఇతర సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం అదనపు సాయం కింద 12,72,143 మంది మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున రుణాలను అందించామన్నారు. ఇలా రూ.4,483 కోట్ల మేర రుణాలను మహిళలు అందుకున్నట్లు సీఎం దృష్టికి తెచ్చారు. సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దవులూరి దొరబాబు, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి దీవాన్ మైదీన్, టిడ్కో ఎండీ శ్రీధర్, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పట్టణ ప్రాంత పేదలకు అందించిన టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన అసోసియేషన్లు సమర్థంగా పనిచేసేలా చూడాలి. వారికి తగిన అవగాహన కల్పించి ప్రభుత్వం అందించిన రూ.లక్షల విలువైన ఆస్తిని ఎలా సమర్థంగా నిర్వహించుకోవాలో దిశానిర్దేశం చేయాలి. తద్వారా భవనాలు నాణ్యతగా ఉండటంతోపాటు పరిసరాలు నిరంతరం పరిశుభ్రంగా ఉండేలా పర్యవేక్షణ ఉంటుంది. -
‘జగనన్న గృహ నిర్మాణ యజ్ఞం’.. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలెవరూ ఉండకూడదన్నదే లక్ష్యం..!
-
జగనన్న మా అద్దెల భారం తొలగించి సొంతింటి కలను నెరవేర్చి అక్క చెల్లెమ్మలను యజమానురాలుగా చేశారు..!
-
గతంలో అద్దె ఇళ్లలో చాలా కష్టాలు పడ్డాం..కానీ ఇప్పుడు మా కల నెరవేరింది..!
-
పేదవారి చిరకాల స్వప్నం సాకరం
-
ఒంటరి మహిళనైన నాకు జగనన్న వల్ల నా సొంతింటి కల నెరవేరింది
-
అక్కచెల్లెమ్మల సాధికారతే లక్ష్యంగా ఒక్కో ఇంటికి ₹2.70 లక్షలు ఖర్చు చేస్తున్నాం..!
-
ప్రతి అక్కచెల్లెమ్మ సొంతింటి కల నెరవేరిన శుభ క్షణాలే.
-
‘జగనన్న గృహ నిర్మాణ యజ్ఞం’. పేద అక్కచెల్లెమ్మల సొంతింటి కలను నెరవేరుస్తున్న
-
సొంత వాళ్లే వదిలేశారు.. కానీ జగనన్న వచ్చాక మా జీవితం మారిపోయింది
-
జగనన్న వలన మా సొంత ఇంటి కల నెరవేరింది.. మాకంటూ ఒక స్థిరాస్తిని కల్పించారు
-
పేదల సొంతింటి కలను మనం సాకారం చేశామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అక్కచెల్లెమ్మల కళ్లల్లో సంతోషాన్ని చూస్తున్నా..
రాష్ట్రంతో బాబు బంధం ఇదీ.. ‘‘ఆ పెద్దమనిషి చంద్రబాబుకు రూ.వేల కోట్ల సంపద ఉన్నా ఆయన ఎమ్మెల్యేగా ఉన్న కుప్పంలో సైతం పేదలకు ఒక్క సెంటు స్థలాన్ని కూడా ఇవ్వలేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేశాడు. 35 ఏళ్లుగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు. మూడుసార్లు సీఎంగా చేశాడు. ఆయనకు ప్రజల మీద, రాష్ట్రం మీద, చివరికి కుప్పం మీద గానీ అభిమానం, అనురాగం, బాధ్యత లేదు. రాష్ట్రంలో కానీ, కుప్పంలో కానీ ఇల్లు కట్టుకున్న పరిస్థితి లేదు. చంద్రబాబు ఇల్లు పక్క రాష్ట్రం హైదరాబాద్‌లో కనిపిస్తుంది. అదీ ఈ రాష్ట్రంతో ఆ పెద్దమనిషికి ఉన్న అనుబంధం. కుప్పంలో దాదాపు 20 వేల మందికి ఇళ్ల పట్టాలు, 8 వేల గృహ నిర్మాణాలు ఈరోజు జరిగాయి అంటే అది మీ బిడ్డ ప్రభుత్వంలోనే. పేదవాడి గడపకు మంచి జరిగిందంటే అది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే’’ – సామర్లకోట సభలో సీఎం జగన్ సామర్లకోట నుంచి సాక్షి ప్రతినిధి: ‘‘నిరుపేద అక్కచెల్లెమ్మల కళ్లల్లో ఎనలేని సంతోషాన్ని చూశా. బహుశా దేశ చరిత్రలో ఎక్కడా జరగని మహాయజ్ఞం పేదల సొంతింటి కలను మనం సాకారం చేశాం. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 31 లక్షల కుటుంబాల్లో అంటే రాష్ట్ర జనాభాలో 20 శాతం పైచిలుకు ఉన్న ఇళ్లు లేని నిరుపేదల ముఖాల్లో చిరునవ్వులు చూడాలని తాపత్రయపడ్డా. మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికి మంచి చేశాం. దేవుడి దయతో నా పేద అక్కచెల్లెమ్మలకు దాదాపు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు దాదాపు 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 13 వేల గ్రామ పంచాయతీలు ఉంటే ఈ రోజు 17 వేల వైఎస్సార్ జగనన్న కాలనీలు వస్తున్నాయి. కాసేపటి క్రితం ఇక్కడ కాలనీలలో ఇళ్లను చూశా. అవి ఇళ్లు కాదు ఊళ్లు అని గర్వంగా చెబుతున్నా. ఇవాళ్టి వరకు రాష్ట్రవ్యాప్తంగా 7.43 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి మీ బిడ్డగా మీతో ఆనందాన్ని పంచుకుంటున్నా’’ అని సీఎం వైఎస్ జగన్ సంతోషం వ్యక్తం చేశారు. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద తొలి విడతగా 7.43 లక్షల గృహ నిర్మాణాలను పూర్తి చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ గురువారం కాకినాడ జిల్లా సామర్లకోట ఈటీసీ లేఅవుట్లో జరిగిన పేదల సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. అనంతరం స్థానిక జూనియర్ కాలేజీ ఆవరణలో నిర్వహించిన సభలో లబ్ధిదారులైన మహిళలు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేవుడిని ఇంతకన్నా ఏం అడగగలను? మన ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు ఉచితంగా ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో 5.85 లక్షల సాధారణ ఇళ్లు, టిడ్కో కింద మరో 1,57,566 లక్షలు కలిపి మొత్తం సుమారు 7.43 లక్షల గృహాల నిర్మాణాన్ని ఇప్పటివరకు పూర్తి చేశాం. రాష్ట్రవ్యాప్తంగా మరో 14,33,000 ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ప్రతి పేదవాడి ముఖంలోనూ, అక్కచెల్లెమ్మల ముఖంలోనూ చిరునవ్వులు చూస్తున్నాం. దేవుడిని నేను ఇంతకన్నా ఏం అడగగలను? దేవుడు నాచేత పేదింటి అక్కచెల్లెమ్మలకు ఇంత మంచి చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. సామర్లకోటలో పేదల కోసం నిర్మించిన ఇళ్లను చూశా. ఆ ఇళ్లను చూసి లే అవుట్లో నాన్న గారి విగ్రహాన్ని ప్రారంభించి వస్తున్నప్పుడు ఇక్కడ ఇంటి స్థలం ధర ఎంత ఉందని దొరబాబును (హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్) అడిగా. కేవలం ఇంటి స్థలం విలువ అక్షరాలా రూ.12 లక్షలు పలుకుతోందని దొరబాబు చెప్పాడు. అక్కడ 54 ఎకరాల లేఅవుట్లో పేదలకు 2,412 ఇళ్ల స్థలాలిచ్చాం. ఇప్పటికే వెయ్యికిపైగా ఇళ్లు పూర్తై గృహ ప్రవేశాలు చేశారు. రూ.32 వేల కోట్లతో కనీస వసతులు.. రాష్ట్రంలో 21.76 లక్షల గృహ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ప్రతి పేదవాడికీ ఇచ్చే ఇల్లు కట్టడానికి అయ్యే ఖర్చు రూ.2.70 లక్షలు. ఇందులో రూ.1.80 లక్షలు ఇంటి నిర్మాణానికి ఇస్తూ మరో రూ.35 వేలు పావలా వడ్డీకే రుణాలు వచ్చేటట్టు చేశాం. ఉచితంగా ఇసుక సరఫరా చేస్తున్నాం. దాని విలువ మరో రూ.15 వేలు ఉంటుంది. సిమెంట్, మెటల్ ఫ్రేమ్స్, స్టీల్ తదితర నిర్మాణ సామగ్రి అంతా కూడా ధర తగ్గించి ఇవ్వడం వల్ల ప్రతి అక్కచెల్లెమ్మకు మరో రూ.40 వేల దాకా మేలు జరుగుతోంది. మొత్తం కలిపి ఒక్కో ఇంటికి రూ.2.70 లక్షలవుతుంది. ఇంటి స్థలం, ఇళ్లు కట్టించి ఇవ్వడంతో పాటు డ్రెయినేజీ, రోడ్లు, నీటి సరఫరా, కరెంట్ సరఫరా లాంటి కనీస వసతుల కోసం మరో రూ.32 వేల కోట్లను ఖర్చు చేస్తున్నాం. మనసున్న ప్రభుత్వం... ఇంతకు ముందెప్పుడూ జరగనిది ఈరోజు జరుగుతోందంటే అందుకు కారణం.. కేవలం ముఖ్యమంత్రి మారాడు. ఆనాడు ఉన్న ముఖ్యమంత్రికి, ఈనాడు ఉన్న ముఖ్యమంత్రికి మధ్య తేడా చూడండి. నేడు ఉన్న ముఖ్యమంత్రికి మనసు ఉంది. మీపట్ల అభిమానం, బాధ్యత ఉంది. ఇదొక్కటే గత ప్రభుత్వానికి, మీ బిడ్డకు ఉన్న తేడా. అలాంటి మనసున్న ప్రభుత్వం మనందరిది కాబట్టే ప్రతి అక్కచెల్లెమ్మకూ ఒక శాశ్వత చిరునామా ఉండాలని అనుకున్నా. ఆ శాశ్వత చిరునామా విలువ తెలిసిన ప్రభుత్వంగా నా పాదయాత్రలో చూసిన ప్రతి కష్టానికీ పరిష్కారాన్ని చూపుతూ ఈ 52 నెలలుగా పరిపాలన సాగింది. పేదింటి అక్కచెల్లెమ్మలకు మంచి చేసేందుకు తపనపడుతూ మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తున్నాడు. ఇలాంటి మనసు గత పాలకులకు లేదు. 2014–19 మధ్య చంద్రబాబు పాలన చూస్తే పేదవాడికి ఒక్కటంటే ఒక్క సెంటు స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. తేడాను మీరే ఒకసారి గమనించండి. రాక్షసులు యాగాలను భగ్నం చేసినట్లుగా.. బుుషులు, మునులు, దేవతలు మంచి కోసం యజ్ఞం చేస్తుంటే రాక్షసులు భగ్నం చేయడానికి దుర్మార్గంగా కుట్రలు చేస్తారని విన్నాం. అలాగే మనందరి ప్రభుత్వం పేదలకు ఇళ్లపట్టాలు ఇస్తున్నప్పుడు, అక్కచెల్లెమ్మలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే తపనతో అడుగులు వేస్తున్నప్పుడు ఆ పెద్ద మనిషి చంద్రబాబు వాటిని అడ్డుకుంటూ ఏకంగా కోర్టులకు వెళ్లి కేసులు వేసి ఎన్ని ప్రయత్నాలు చేశారో, ఎన్ని అవరోధాలు తలెత్తాయో మీకు తెలుసు. ఒకవైపు చంద్రబాబు లాంటి దుర్మార్గులు కోర్టుకు వెళ్లి ఆపాలని ప్రయత్నం చేయగా మరోవైపు మీ బిడ్డ ప్రభుత్వం రాగానే కోవిడ్ వచ్చి పడింది. కోవిడ్ కారణంగా రాష్ట్రానికి రెండేళ్ల పాటు రావాల్సిన వనరులు తగ్గిపోయాయి. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు పెట్టాల్సిన ఖర్చు పెరిగిపోయింది. అయినా కూడా మీ బిడ్డ ఎక్కడా సాకులు చెప్పలేదు. కారణాలు వెతకలేదు. మీ బిడ్డ కింద మీదా పడి ఏదో ఒకటి చేశాడు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే తపనతో అడుగులు వేశాడు. 31 లక్షల ఇళ్ల స్థలాలలో దాదాపు 22 లక్షల ఇళ్లు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. 7.43 లక్షల ఇళ్లు ఇప్పటికే పూర్తయిన పరిస్థితుల మధ్య ఆ సంతోషాన్ని మీ అందరితో పంచుకునేందుకు ఇక్కడికి వచ్చా. నా అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల కోసం ఎప్పుడూ జరగని విధంగా రాష్ట్రంలో 72 వేల ఎకరాలను సేకరించి 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. వీటి మార్కెట్ విలువ ప్రాంతాన్ని బట్టి ఒక్కో ఇంటి స్థలం కనీసం రూ. 2.5 లక్షలతో మొదలు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా కనిపిస్తోంది. కనీసం రూ.2.50 లక్షలే అనుకున్నా దాదాపు 31 లక్షల ఇళ్ల పట్టాల రూపంలో సుమారు రూ.75 వేల కోట్లు విలువైన స్థిరాస్తిని నా అక్కచెల్లెమ్మలకు ఇంటి స్థలాల రూపంలో ఇవ్వగలిగాం. ఇళ్ల పట్టాలివ్వడమే కాకుండా ఇళ్లు కూడా కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నాకు ఇంత అదృష్టాన్ని ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడి ఉంటా. పేదలపై ప్రేమ, బాధ్యతతో 35 కార్యక్రమాలు ఒక్క ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణమే కాదు.. నవరత్నాల్లోని ఏ పథకాన్ని చూసినా, డీబీటీని తీసుకున్నా అంతే ప్రేమ, బాధ్యతతో అడుగులు వేశాం. అమ్మఒడి, ఆసరా, చేయూత, సున్నావడ్డీ పథకం, అవ్వాతాతలకు పెన్షన్లు, రైతు భరోసా.. ఇలా రాష్ట్రంలో 35 పైచిలుకు కార్యక్రమాలు మన ప్రభుత్వంలో అమలవుతున్నాయి. పేదవాడి మీద ప్రేమతో, వారి జీవితాలు మారాలి, మార్చాలనే తపన, తాపత్రయంతో 52 నెలలుగా అడుగులు వేస్తూ వస్తున్నాం. ఇంతకు ముందున్న ప్రభుత్వం ఏనాడూ ఇలా పేదల మీద ప్రేమ, బాధ్యత చూపలేదు. కాబట్టే మనం అధికారంలోకి వచ్చేటప్పటికి 31 లక్షల కుటుంబాలు అంటే రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి పైగా సొంత ఇళ్లు లేని నిరుపేదలుగా మిగిలిపోయిన పరిస్థితి ఉంది. నాడు కూడా ఇదే రాష్ట్రం, కేవలం సీఎం మాత్రమే మారాడు. ఇవాళ 31 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలను అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేశాం. -
కడుతున్నవి ఇళ్లు కాదు..ఊళ్లు
-
Live: సామర్లకోట జగనన్న కాలనీలో సామూహిక గృహ ప్రవేశాలు
-
పేదింటి పండుగ.. నేడు సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాలు
సాక్షి, అమరావతి: తమకంటూ ఓ పక్కా ఇల్లు ఉండాలనేది ప్రతి పేదింటి అక్క చెల్లెమ్మల చిరకాల స్వప్నం. వారి తోబుట్టువుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దీన్ని సాకారం చేస్తూ నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద మహిళల పేరిటే ఏకంగా 30.75 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి దేశంలో రికార్డు సృష్టించారు. అంతేకాకుండా పంపిణీ చేసిన స్థలాల్లో పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం తరపున అండగా నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలా రూపుదిద్దుకున్న ఇళ్లలో గురువారం పండుగ వాతావరణంలో సామూహిక గృహ ప్రవేశాలకు పేదలు సిద్ధమయ్యారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం జగన్ స్వయంగా పాల్గొననున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు,ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగనున్నాయి. అడ్డంకులను అధిగమిస్తూ.. రాష్ట్రంలో 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీల రూపంలో ఏకంగా కొత్త ఊళ్లనే సీఎం జగన్ నిర్మిస్తున్నారు. 71,811.49 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిన స్థలాల మార్కెట్ విలువ రూ.2.5 లక్షల నుంచి ప్రాంతాన్ని బట్టీ రూ.5 లక్షల పైనే ఉంది. అంటే ఈ లెక్కన కనిష్టంగా రూ.75 వేల కోట్లు నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల కోట్ల విలువైన భూమిని పేదలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది. ఈ తరహాలో పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టి గతంలో ఏ ప్రభుత్వమూ పేదలకు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. టీడీపీ, ఎల్లో మీడియా, దుష్ట పన్నాగాలను ఛేదిస్తూ కరోనా అడ్డంకులను అధిగమించి సీఎం జగన్ పేదల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేసరికి ప్రతి మహిళకు కనిష్టంగా రూ.7 లక్షలు, గరిష్టంగా రూ.10 లక్షలకుపైగా విలువైన స్థిరాస్తిని ప్రభుత్వం సమకూరుస్తోంది. 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి పేదలందరికీ ఇళ్ల పథకం కింద రెండు దశల్లో కలిపి 21.75 లక్షలకుపైగా (19.13 లక్షల సాధారణ ఇళ్లు + 2.62 లక్షల టిడ్కో ఇళ్లు) గృహ నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇప్పటివరకూ సాధారణ ఇళ్లు 5,85,829, టిడ్కో ఇళ్లు 1,57,566 నిర్మాణం పూర్తయ్యాయి. మరో 13.27 లక్షల సాధారణ ఇళ్లు, 1.04 లక్షల టిడ్కో ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నిర్దేశించిన లక్ష్యం లోగా నిర్మాణాలను పూర్తి చేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఉచితంగా స్థలం.. ఆపై అమిత సాయం ఇళ్ల లబ్ధిదారులకు ఖరీదైన స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన సీఎం జగన్ ప్రభుత్వం అక్కడితో సరిపుచ్చకుండా మరో అడుగు ముందుకు వేసింది. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు బిల్లు మంజూరు చేస్తోంది. స్వయం సహాయక బృందాల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు పావలా వడ్డీకి రూ.35 వేలు రుణ సాయం చేస్తున్నారు. ఉచితంగా ఇసుకను పంపిణీ చేయడం ద్వారా రూ.15 వేలు, స్టీల్, సిమెంట్, ఇలా 12 రకాల నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై సరఫరా చేయడం ద్వారా మరో రూ.40 వేలు చొప్పున మొత్తంగా రూ.2.70 లక్షల చొప్పున అదనంగా లబ్ధి చేకూరుస్తున్నారు. వసతుల రూపంలో మరో రూ.1.5 లక్షలు ఉచితంగా స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.2.70 లక్షల చొప్పున ప్రయోజనం చేకూరుస్తూనే ప్రతి ఇంటికి ఉచితంగా మౌలిక సదుపాయాల కల్పన ద్వారా మరో రూ.1.70 లక్షల మేరకు అదనపు లబ్ధిని ప్రభుత్వం కల్పిస్తోంది. జగనన్న కాలనీల్లో ఉచితంగా నీటి, విద్యుత్ సరఫరా కనెక్షన్లు ఇవ్వడం, డ్రైన్లు, రోడ్లు లాంటి సకల వసతులను ప్రభుత్వం సమకూరుస్తోంది. పార్కులు.. జిమ్.. కళ్లు చెదిరే కాలనీ! పిల్లల కోసం ప్రత్యేకంగా పార్కులు.. వ్యాయామం కోసం జిమ్ సదుపాయాలతో కాకినాడ జిల్లా సామర్లకోట–ప్రత్తిపాడు రోడ్డులో అందంగా రూపుదిద్దుకున్న జగనన్న కాలనీని చూస్తే కళ్లు తిప్పుకోలేరు! లే అవుట్ అభివృద్ధికి ఏకంగా రూ.15 కోట్లు కేటాయించారు. రూ.4 కోట్లతో విద్యుత్తు సబ్ స్టేషన్, మూడు అంగన్వాడీ కేంద్రాల భవనాలను నిర్మించారు. పిల్లలకు ఆహ్లాదం కోసం ఏకంగా ఏడు పార్కులను నిర్మించడం విశేషం. ఇందులో ఓపెన్ జిమ్, చిల్డ్రన్ పార్కులు కూడా ఉన్నాయి. సామర్లకోట ఈటీసీ లేఆవుట్‌లో సుమారు 52 ఎకరాల్లో 2,412 మందికి మొదటి విడతలో ఇళ్లు మంజూరు చేశారు. 824 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. షేర్వాల్ టెక్నాలజీ ద్వారా నిర్మాణాలను పూర్తి చేశారు. కాలనీలో ఇళ్లను సీఎం జగన్ సందర్శించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫోటో ఎగ్జిబిషన్‌ను కూడా తిలకిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. నవరత్నాలు–పేదలకు ఇళ్లు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన జగనన్న ఇళ్లలో సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమాన్ని గురువారం ఉదయం ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. – సామర్లకోట -
సామర్లకోట 54 ఎకరాల్లో జగనన్న కాలనీల నిర్మాణం
-
కళ్లెదుటే ఖరీదైన లోగిళ్లు!
కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన అప్పారావు దినసరి కూలి. ఆర్నెళ్ల క్రితం వరకూ నెలకు రూ.2,500 అద్దె చెల్లించాల్సి రావడంతో కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉండేది. ఆయన భార్య రత్నం సొంత ఇంటి కలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా నెరవేర్చింది. సామర్లకోట నుంచి ప్రత్తిపాడుకు వెళ్లే రోడ్డులో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఆమె కుటుంబానికి ప్రభుత్వం ఉచితంగా స్థలాన్ని ఇవ్వడంతోపాటు గృహ నిర్మాణానికి ఆర్థికంగా చేదోడుగా నిలిచింది. ఏమ్మా ఈ ఇల్లు మీదేనా? చాలా బాగుందంటూ ఎవరైనా పలకరిస్తే చాలు.. ‘అవునండీ సీఎం జగన్ మాకిచ్చిన కానుక ఈ ఇల్లు. ఇన్నాళ్లూ అద్దెలు కట్టలేక, పిల్లల చదువులు, కుటుంబ పోషణకు చాలా ఇబ్బందులు పడ్డాం. కొత్త ఇంటిలోకి వచ్చాక చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతున్నా. వేడినీళ్లకు చన్నీళ్లలా మా సంపాదన ఉంది’ అని ఆనందంగా చెబుతోంది. సామర్లకోట లేఔట్లో ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న కృష్ణకుమారి అనే మహిళను ఇక్కడికి వచ్చి ఎన్నిరోజులు అయింది? అని పలుకరించగా ‘నా భర్త చిరు వ్యాపారి. వివాహం అయిన రోజు నుంచి అద్దె ఇంటిలోనే ఉంటున్నాం. సంపాదన ఖర్చులకే సరిపోయేది కాదు. స్థలం కొనడానికే రూ.10 లక్షలు దాకా ఉండాలి. దీంతో ఇక ఇంటి కల నెరవేరదని ఆశ వదులుకున్న తరుణంలో ప్రభుత్వం పేదలకు స్థలాలు ఇచ్చి ఇంటిని కూడా మంజూరు చేస్తోందని తెలియడంతో దరఖాస్తు చేసుకున్నాం. ఎనిమిది నెలల క్రితం గృహ ప్రవేశం కూడా చేశాం. నా బిడ్డ చదువులకు కూడా ప్రభుత్వం సాయం చేస్తోంది. ఇప్పటివరకు మూడుసార్లు అమ్మఒడి వచ్చింది. రూ.75 వేలు పొదుపు సంఘం రుణం వచ్చింది’ అని సంతోషం వ్యక్తం చేస్తోంది. (వడ్డే బాలశేఖర్ – సామర్లకోట నుంచి సాక్షి ప్రతినిధి): ఒకేసారి 30 లక్షల మందికిపైగా ఇళ్ల స్థలాలు.. అది కూడా ఖరీదైన ప్రాంతాల్లోనే.. ఆపై గృహ నిర్మాణాలను కూడా చేపట్టడం దేశ చరిత్రలోనే ఒక సంచలనం. అక్క చెల్లెమ్మల సొంతింటి స్వప్నాన్ని సాకారం చేసేందుకు భూ సేకరణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.75,670 కోట్లను వ్యయం చేసింది. అంత విలువైన స్థిరాస్తిని మహిళల చేతుల్లో పెట్టింది. పేదల పక్కా ఇళ్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 68,677 ఎకరాలను పంపిణీ చేసిందని కేంద్ర గృహ నిర్మాణ శాఖ సైతం ప్రశంసించింది. 17,005 జగనన్న కాలనీల్లో సకల సామాజిక, కనీస సదుపాయాలను కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం దశలవారీగా దాదాపు రూ.30 వేల కోట్లను వ్యయం చేస్తోంది. ఇక ఆగస్టు నెలాఖరు వరకు 21.31 లక్షల ఇళ్ల నిర్మాణాల కోసం మరో రూ.12,295.97 కోట్లను అక్క చెల్లెమ్మల ఖాతాలకు పారదర్శకంగా జమ చేసింది. ఉచితంగా ఇచ్చే ఇసుకతోపాటు రాయితీపై సామగ్రిని సమకూరుస్తోంది. తద్వారా మరో రూ.40 వేల మేరకు లబ్ధిదారులకు ప్రయోజనాన్ని చేకూరుస్తోంది. ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన ప్రాంతాన్ని బట్టి స్థలం, ఇంటి విలువ రూ.15 లక్షలు, ఆపైన పలుకుతుండటం విశేషం. ఇళ్ల లబ్ధిదారుల్లో బీసీ మహిళలే అత్యధికంగా ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల ఇళ్ల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికార యంత్రాంగానికి మార్గ నిర్దేశం చేస్తున్నారు. పూర్తైన ఇళ్లకు మంచినీటి, విద్యుత్ సరఫరాపై క్షేత్రస్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా తనిఖీలు జరిపి నిర్థారించేలా చర్యలు తీసుకున్నారు. రోజు వారీ లక్ష్యాలను నిర్ధారించి ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షిస్తుండటంతో ఐదు లక్షలకుపైగా పేదల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తయ్యాయి. ఖరీదైన ప్రాంతంలో పేదలకు ఇళ్లు కాకినాడ జిల్లా సామర్లకోట – ప్రత్తిపాడు రోడ్డులో 2,412 నిరుపేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 54 ఎకరాల్లో ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది. రెండు కాలనీలుగా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇప్పటివరకు 800 వరకూ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. మరో 1,408 ఇళ్లు పునాదిపై దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఈ నెల 5వ తేదీన సామర్లకోట వైఎస్సార్ జగనన్న కాలనీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శించి పేదల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో సామర్లకోట మునిసిపాలిటీలోని జగనన్న కాలనీల్లో ‘సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టింది. సామర్లకోట నుంచి ప్రత్తిపాడు వెళ్లే ప్రధాన రహదారికి పక్కనే ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఇక్కడ సెంటు స్థలం మార్కెట్ విలువ రూ.10 లక్షలపైన పలుకుతోందని చెబుతున్నారు. విద్యుత్, నీటి సరఫరాతో పాటు, ఇతర సదుపాయాలను కూడా ప్రభుత్వం సమకూరుస్తోంది. స్థలం, ఇంటి రూపంలో ఒక్కో పేద మహిళకు రూ.15 లక్షలకుపైగా విలువైన ఆస్తిని సీఎం జగన్ సమకూర్చారు. అత్యంత నాణ్యత ప్రమాణాలతో.. పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన స్థలాలను స్మశానాలతో పోల్చుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు విషం కక్కారు. నిత్యం పేదల ఇళ్ల పథకంపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోంది. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా కాలనీల్లో అత్యంత నాణ్యత ప్రమాణాలతో పేదల ఇళ్ల నిర్మాణాలున్నాయి. ప్రతి ఇంటికీ హాల్, కిచెన్, బెడ్రూమ్, వరండా, స్టేర్ కేస్ లాంటి వసతులు ఉండటం విశేషం. సామర్లకోటలో మెజారిటీ లబ్ధిదారులు తామే ఇళ్లు నిర్మించుకునే ఆప్షన్ ఎంచుకున్నారు. ఆప్షన్–3 లబ్ధిదారుల ఇళ్లను షీర్వాల్ టెక్నాలజీలో అజయ వెంచర్స్ లేబర్ ఏజెన్సీ నిర్మిస్తోంది. ఉచితంగా ఇసుక.. సబ్సిడీపై సామగ్రి నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ రెండు విడతల్లో 21.25 (టిడ్కోతో కలిపి) లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. పావలా వడ్డీకే రూ.35 వేలు బ్యాంక్ రుణం, రూ.15 వేలు విలువైన ఉచిత ఇసుక, సబ్సిడీపై సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామాగ్రిని అందించడం ద్వారా మరో రూ.40 వేల మేర లబ్ధిదారులకు ప్రయోజనాన్ని చేకూరుస్తోంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా.. పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఈ ఏడాది ఆగస్టు నాటికి ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు నిర్మాణం పూర్తయిన ఇళ్లు 5,24,850కి చేరుకున్నాయి. మిగిలినవి శరవేగంగా కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 43,602 ఇళ్లు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లాలో 37,141 ఏలూరు జిల్లాలో 26,815 ఇళ్లు పూర్తయ్యాయి. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ బిల్లులను ప్రభుత్వం వేగంగా చెల్లిస్తోంది. నిర్మాణాలు పూర్తయిన వెంటనే ఇళ్లకు చకచకా విద్యుత్, నీటి సరఫరా కనెక్షన్లు అందచేస్తోంది. 5న సామర్లకోట లే అవుట్లో ఇళ్లకు సీఎం జగన్ ప్రారంభోత్సవాలు పేదలందరికి ఇళ్లు–నవరత్నాల్లో భాగంగా పూర్తయిన ఐదు లక్షల గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 5వ తేదీన సామర్లకోటలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా జరుగుతుందని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్ జైన్ తెలిపారు. అదే రోజు జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన లే అవుట్లలో ఇళ్లను మంత్రులు, ప్రజా ప్రతినిధులు ప్రారంభిస్తారని, సామూహిక గృహ ప్రవేశాలు ఉంటాయని అజయ్ జైన్ ‘సాక్షి’కి వెల్లడించారు. ఐదు లక్షల గృహాల లే అవుట్లలో నూటికి నూరు శాతం మంచినీటి, విద్యుత్ సదుపాయాలను కల్పించినట్లు చెప్పారు. రహదారులు, అంతర్గత రహదారులు, స్వాగత తోరణాలు కూడా పూర్తైనట్లు తెలిపారు. ఇప్పటి వరకు 5.24 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయని చెప్పారు. తిరగకుండానే మంజూరైంది.. టీడీపీ హయాంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకుంటే పట్టించుకోలేదు. ఆ పార్టీ సానుభూతిపరులం కాదని సంక్షేమ పథకాల నుంచి తొలగించారు. తమ పార్టీ జెండా పట్టుకుంటే అన్నీ వస్తాయని ఆ పార్టీ నాయకులు చాలాసార్లు ఆశ పెట్టారు. ఇప్పుడు ఏ నాయకుడు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండానే మాకు ఇంటి స్థలం మంజూరైంది. త్వరలో గృహప్రవేశం కూడా చేయనున్నాం. ప్రభుత్వం మాకిచ్చింది సెంటు స్థలమేనని హేళనగా మాట్లాడుతున్న టీడీపీ నాయకులు వారి ప్రభుత్వంలో గజం స్థలం కూడా ఇచ్చిన పాపాన పోలేదు. – సూర్య భాస్కర్ కుమార్, సామర్లకోట, కాకినాడ జిల్లా దశాబ్దాల కల నెరవేరింది.. మా ఆయన చిరు వ్యాపారి. ఆయన సంపాదనంతా ముగ్గురమ్మాయిల చదువులు, కుటుంబ పోషణకే సరిపోయేది. వారికి పెళ్లిళ్లు చేయడానికి తలకు మించిన భారమైంది. దీంతో మాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలన్న కోరిక అలాగే మిగిలిపోయింది. ఇప్పుడు సీఎం జగన్ మా దశాబ్దాల ఇంటి కలను నెరవేర్చారు. ఆయన రుణం ఈ జన్మకు తీర్చుకోలేం. – లంక లక్ష్మి, వైఎస్సార్–జగనన్న కాలనీ సామర్లకోట, కాకినాడ జిల్లా ఇంతకన్నా మేలు ఏ ప్రభుత్వం చేయలేదు.. నెలకు రూ.3,500 చెల్లించి అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. సుమారు 10 ఇళ్లు మారాం. గత ప్రభుత్వంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలంలో ఇల్లు నిర్మించుకుని ఆత్మగౌరవంతో జీవిస్తున్నాం. మా పిల్లల చదువులకు కూడా అమ్మఒడి ద్వారా సీఎం జగన్ అండగా నిలుస్తున్నారు. ఇంతకన్నా మేలు మాకు ఏ ప్రభుత్వం చేయలేదు. – వి.సతీష్, పద్మావతి, వైఎస్సార్, జగనన్న కాలనీ సామర్లకోట పేదరిక నిర్మూలనే లక్ష్యంగా.. రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా సీఎం జగన్ పాలిస్తున్నారు. ప్రజల కనీస అవసరాల్లో ఒకటైన గూడు కోసం ఏ ఒక్కరు బాధ పడకుండా చర్యలు చేపట్టారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనిధంగా పేదలకు ఏకంగా 30 లక్షలకు పైగా ఇంటి పట్టాలు ఇచ్చారు. ఐదు లక్షల ఇళ్లను త్వరలో లబ్ధిదారులకు అందిస్తున్నాం. శరవేగంగా మిగిలిన నిర్మాణాలను కూడా పూర్తి చేస్తాం. – దవులూరి దొరబాబు, పెద్దాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఎప్పటికప్పుడు పురోగతి పరిశీలన పేదల ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నాం. జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షిస్తున్నాం. సామర్లకోటలో త్వరలో సీఎం జగన్ పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నాం. – డాక్టర్ లక్ష్మీశా, ఎండీ, ఏపీ గృహనిర్మాణ సంస్థ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి సమాజంలో సముచిత స్థానం లభిస్తుంది. ఇది కేవలం గృహ నిర్మాణంగానే చూడకూడదు. ఇళ్ల నిర్మాణంతో అనుబంధ రంగాల కార్మికులకు కూడా ఉపాధి లభిస్తుంది. సిమెంట్, ఇనుము, ఇటుకలు.. ఇలా వివిధ పరిశ్రమల ఉత్పత్తిలో వృద్ధి పెరుగుతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం జరుగుతుంది. పేదలు తమ సంపాదనలో తిండికి పెట్టే ఖర్చుతో సమానంగా ఇంటి అద్దెలు చెల్లించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారికి పక్కా ఇళ్లు సమకూరితే అద్దెల భారం తగ్గుతుంది. ఆ మొత్తాన్ని మంచి ఆహారం, ఆరోగ్యం, పిల్లల భవిష్యత్ కోసం ఖర్చు చేస్తారు. దీంతో మానవ వనరుల అభివృద్ధి సాధ్యమవుతుంది. – ప్రొఫెసర్ కె.మధుబాబు, ఆర్థిక శాస్త్రం విభాగాధిపతి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం -
నేడు సీఆర్డీఏలో పేదల ఇళ్లకు శ్రీకారం
సాక్షి, అమరావతి: అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందన్న పెత్తందారుల వితండ వాదాలకు చెక్ పెడుతూ నిరుపేద అక్కచెల్లెమ్మల సొంతింటి కల సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద సీఆర్డీఏలో 50వేలకు పైగా ఇళ్ల నిర్మాణానికి సోమవారం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. గూడు లేని పేద అక్కచెల్లెమ్మలకు స్థిరనివాసం సమకూర్చి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలన్న కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎల్లో ముఠా కుట్రపూరితంగా సృష్టించిన అడ్డంకులను అధిగమించి సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాలు, 25 లేఅవుట్లలో 50,793 మంది పేద అక్కచెల్లెమ్మలకు ఈ ఏడాది మే 26న ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించిన విషయం తెలిసిందే. ఒక్కో ప్లాట్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే రూ.1,371.41 కోట్ల ఖరీదైన భూమిని పేదలకు ఉచితంగా పంపిణీ చేయడమే కాక.. ఆయా లేఅవుట్లలో రూ.384.42 కోట్లతో మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. అలాగే.. విద్య, ఆరోగ్య సేవలు అందించేందుకు రూ.73.74 కోట్లతో 11 అంగన్వాడీ కేంద్రాలు, 11 పాఠశాలలు, 11 డిజిటల్ లైబ్రరీలు, 12 ఆస్పత్రుల నిర్మాణం కూడా చేపట్టనుంది. లేఅవుట్ల పరిధిలో పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటుచేసేందుకు రెండు దశల్లో రూ.168 లక్షలతో 28,000 మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకోనున్నారు. ఒకొక్కరికి రూ.10 లక్షల నుంచి రూ.15లక్షల ఆస్తి.. ఇలా ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల ఏర్పాటుతో ఒక్కో పేద అక్కచెల్లెమ్మ చేతుల్లో దాదాపు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పైగా విలువైన స్థిరాస్తిని పెట్టబోతోంది. ఈ లెక్కన ఏపీ గృహ నిర్మాణ సంస్థ ద్వారా సీఆర్డీఏలోని ఈడబ్ల్యూఎస్ లేఅవుట్లలో రూ.1,829.57 కోట్ల వ్యయంతో పేదలకు పక్కా గృహాలను సమకూరుస్తోంది. మహిళా సాధికారతే లక్ష్యంగా.. నిజానికి.. సీఎం జగన్ ప్రభుత్వం తొలి నుంచి మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ వస్తోంది. మహిళలు తమంతట తాము నిలదొక్కుకునేలా వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలుచేస్తోంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద మహిళల పేరిట స్థలాలు, ఇళ్లు అందిస్తోంది. ఇందులో భాగంగా.. దేశంలో ఎక్కడాలేని విధంగా 71,811 ఎకరాల్లో 30.65 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరిట ఉచితంగా రూ.76,625 కోట్ల మార్కెట్ విలువైన భూములను పంపిణీ చేశారు. ఇలా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో 17వేలకు పైగా ఊళ్లనే కొత్తగా నిర్మిస్తున్నారు. పంపిణీ చేసిన స్థలాల్లో ఇప్పటికే రూ.57,375 కోట్ల వ్యయంతో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణం కొనసాగుతోంది. కాలనీల్లో రూ.32,909 కోట్ల వ్యయంతో నీటి సరఫరా, విద్యుత్, ఇంటర్నెట్, డ్రైనేజీ, సీవరేజీ, రోడ్లు వంటి మౌలిక వసతులను కల్పిస్తున్నారు. రూ.లక్షల కోట్ల సంపద సృష్టి మరోవైపు.. ప్రతి పేద అక్కచెల్లెమ్మకు ఇంటి స్థలం, ఇల్లు సమకూర్చడం ద్వారా రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపదను రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తోంది. ఇంటి స్థలం ఉచితంగా ఇవ్వడమే కాక.. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం సమకూరుస్తోంది. అంతేకాక.. ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్స్ ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రిని సబ్సిడీపై అందించడంతో మరో రూ.40 వేల మేర లబ్ధి చేకూరుస్తోంది. మోడల్ హౌస్ చాలా బాగా వచ్చింది లేఅవుట్లో తొలుత నాకు కేటాయించిన స్థలంలో మోడల్ హౌస్ నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. సెంటు స్థలంలో ఇల్లు బాగా వచ్చింది. ఇల్లు కట్టుకోవడమే కలగా మిగిలిపోతుందని అనుకున్నా. కానీ, జగనన్న స్థలం ఇవ్వడమే కాక ఇల్లు కట్టించి నా కలను సాకారం చేశాడు. సెంటు స్థలంలో ఇల్లు ఎలా వస్తుందని అన్న వారు దీనిని చూడాలి. సొంతింటి కల సాకారం చేసిన సీఎం జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. – ఈపూరి జీవరత్నం, కృష్ణాయపాలెం -
సంకల్పం సడలొద్దు
మనిషి కనీస అవసరాల్లో ఒకటైన గూడును నిరుపేదలకు సమకూర్చడానికి మనం ఆరాట పడుతుంటే, ఈ గృహ యజ్ఞానికి ఆటంకాలు ఏర్పరుస్తూ పేదల కడుపు కొట్టడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం అవుతున్నాయి. పేదలకు ఇళ్లు రాకూడదన్నదే వారి ఆలోచన. ఈ క్రమంలో మన సంకల్పం సడలడానికి వీల్లేదు. న్యాయ పరమైన, ఇతర అడ్డంకులన్నీ అధిగమించడానికి అన్ని చర్యలూ తీసుకోండి. ఏం కావాలన్నా వెనువెంటనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థిర నివాసం లేకుండా ఒక్క పేద కుటుంబం కూడా ఉండటానికి వీల్లేదనే సంకల్పంతో మన ప్రభుత్వం ముందుకు వెళుతోంటే, ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డు తగులుతున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్లు రానివ్వకుండా నిరంతరం అడ్డంకులు సృష్టిస్తున్నాయని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, వాటన్నింటినీ అధిగమించి ఇళ్ల నిర్మాణ వేగాన్ని ఇదే రీతిలో కొనసాగించాలని ఆదేశించారు. గురువారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన గృహ నిర్మాణ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం పురోగతి గురించి మాట్లాడుతూ.. వైఎస్సార్– జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతున్న కొద్దీ అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు కావాలని చెప్పారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు వెనువెంటనే కరెంటు, నీటి సరఫరా కనెక్షన్లు ఇవ్వాలన్నారు. ఒక్క విశాఖపట్నంలోనే 1.24 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని, డిసెంబర్‌లోగా ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి తగిన కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. ఇందుకు ఏం కావాలన్నా వెంటనే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వీలైనంత త్వరగా అక్కడ పేదలకు నివాసం కల్పించాలని ఆదేశించారు. పలు చోట్ల కోర్టు కేసుల కారణంగా పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ నిలిచిపోయిందని, అక్కడ ప్రత్యామ్నాయ భూముల సేకరణపై దృష్టి పెట్టి.. ఈ ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని చెప్పారు. కొత్తగా ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పట్టాలు ఇచ్చేందుకు భూములను సేకరించడంపై నిర్ధేశిత కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లాలని ఆదేశించారు. వీటన్నింటినీ అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వచ్చే నెలలో 5 లక్షల ఇళ్లు పూర్తి వచ్చే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల పేదల ఇళ్ల నిర్మాణం పూర్తవుందని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ఇప్పటి వరకు 4,24,220 ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు. రూఫ్ లెవల్, ఆపై స్థాయి నిర్మాణంలో 5,68,517, వివిధ స్థాయిల్లో 9,56,369 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి పేదల గృహ నిర్మాణాల కోసం రూ.2,201 కోట్లు ఖర్చు చేశామన్నారు. సీఆర్డీఏలో పేదల ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించిన అంశాలను కూడా సీఎంకు వివరించారు. 45,101 మంది లబ్ధిదారులు ఆప్షన్–3 ఎంపిక చేసుకున్నారని తెలిపారు. ఆ ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే కాంట్రాక్టర్లను ఎంపిక చేశామన్నారు. లే అవుట్లలో ఇంటి నిర్మాణాలు చేపట్టడానికి నీటి సరఫరా, అప్రోచ్ రోడ్లు, విద్యుత్ సరఫరా తదితర పనులపై దృష్టి పెట్టామన్నారు. ఇప్పటి వరకు 71,452 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించామని అధికారులు వెల్లడించారు. ఈ నెలలో మరో 29,496, వచ్చే నెలలో 49,604 ఇళ్లను అప్పగించనున్నామని చెప్పారు. 300 చదరపు అడుగుల ఇళ్లను ఉచితంగా ప్రభుత్వం ఇస్తున్నందున మిగిలిన కేటగిరీల్లోని (365, 430 చ.అ) లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా దాదాపు రూ.2 వేల కోట్లు రుణాలుగా ఇప్పించామన్నారు. సీఆర్డీఏ ప్రాంతంలో పేదలకు ఇళ్ల నిర్మాణంపై కోర్టులో పిటిషన్లు, వాటిపై విచారణ అంశాన్ని ప్రస్తావించారు. వాణిజ్య సముదాయాల ఏర్పాటు వందలు, వేల సంఖ్యలో ఇళ్లు ఉన్న టిడ్కో కాలనీల్లో వాణిజ్య సముదాయాల ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొలి దశలో 15 టిడ్కో కాలనీల్లో ఏర్పాటు చేయాలన్నారు. మహిళల ఆధ్వర్యంలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఏర్పాటయ్యేలా చూడాలని సూచించారు. దీంతో అందుబాటు ధరలలో సరుకులు అక్కడి పేదలకు అందుతాయని, మహిళలకూ ఉపయోగం ఉంటుందన్నారు. గృహాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. టిడ్కో గృహ సముదాయాలను స్వయం సమృద్ధి దిశగా నడిపించాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన వివిధ ప్రతిపాదనలను పరిశీలించాలన్నారు. ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్ దీవాన్, టిడ్కో ఎండీ శ్రీధర్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ జి లక్ష్మీశా, ఏపీ జెన్కో ఎండీ చక్రధర్ బాబు, మైన్స్,æ జియాలజీ డైరెక్టర్ వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
Fact Check: ఏపీలో రోజుకు 2,000 ఇళ్ల నిర్మాణాలు.. రామోజీ బురద వార్తలు
సాక్షి, అమరావతి: ఒకేసారి 30 లక్షల మందికిపైగా మహిళలకు ఇళ్ల పట్టాలను అందించడం దేశ చరిత్రలోనే ఓ రికార్డు కాగా అడ్డంకులను అధిగమిస్తూ పేదల గృహ నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా సాకారం చేస్తోంది. పేదల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడంలో ఏపీ దేశంలో నాలుగో స్థానంలో ఉంది. అత్యధికంగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ (12.85 లక్షలు), గుజరాత్ (8.78 లక్షలు), మహారాష్ట్ర (8.10 లక్షలు) ఉండగా ఏపీలో 7.93 లక్షలు పూర్తైనట్లు కేంద్ర గృహ నిర్మాణ శాఖ గణాంకాల్లోనే స్పష్టంగా ఉంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా సీఎం జగన్ చేస్తున్న గృహ యజ్ఞంపై కేంద్ర మంత్రులు సైతం పలు సందర్భాల్లో ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న రామోజీ మాత్రం అట్టడుగున ఉందంటూ యథావిధిగా వక్రీకరణ కథనాలను ప్రచురించారు. దేశంలోనే అత్యధిక ఇళ్లు పేదలకు పక్కా గృహాల కల్పనలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. 30.6 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.75 వేల కోట్ల మార్కెట్ విలువ కలిగిన 71,811.49 ఎకరాల భూమిని వైఎస్ జగన్ ప్రభుత్వం పంపిణీ చేసింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హత ఒక్కటే ప్రామాణికంగా పారదర్శకంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. దీంతో ఏపీలో అత్యధిక ఇళ్ల నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. మంజూరైన ఇళ్ల పనులను మొదలు పెట్టడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. వేగంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి అవసరమైన వనరులను వైఎస్సార్ జగనన్న కాలనీల్లో కల్పించడం, లబ్ధిదారులకు సబ్సిడీపై నిర్మాణ సామాగ్రి సరఫరా చేయడం వంటి చర్యలను ప్రభుత్వం తీసుకుంది. పేదల ఇళ్ల నిర్మాణాల పట్ల ప్రభుత్వం కనబరుస్తున్న చిత్తశుద్ధిని చూసి ఇటీవలే సీఆర్డీఏ పరిధిలో 47వేల ఇళ్ల నిర్మాణాలకు కేంద్ర గృహ నిర్మాణ శాఖ అనుమతులు ఇచ్చింది. కుట్రలను అధిగమించి నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకునేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేసింది. కోర్టులను ఆశ్రయించి న్యాయ వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నించింది. ఈ అవరోధాలను అధిగమించి 2020 డిసెంబర్లో 30.6 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. రిజిస్ట్రేషన్, జియో ట్యాగింగ్ పూర్తి చేసి ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించే సమయంలో కోవిడ్ రెండో విడత ప్రారంభం అయింది. దీంతో కొన్ని నెలల పాటు కార్యకలాపాలు నిలిచిపోయాయి. 2021 జూలైలో మెగా గ్రౌండింగ్ మేళా నిర్వహించి తొలి దశలో 15.6 లక్షల గృహ నిర్మాణాలను ప్రారంభించారు. నిర్మాణాలు చురుగ్గా సాగుతున్న సమయంలో మరోమారు టీడీపీ కోర్టుల్లో కేసులు వేయడంతో కొద్ది నెలలు పనులు నిలిచిపోయాయి. విశాఖ, సీఆర్డీఏ పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీని కూడా కోర్టుల ద్వారా అడ్డుకోవాలని ప్రయత్నించారు. విశాఖ కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో గత ఏడాది ఏప్రిల్ నెలలో 1.24 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి నిర్మాణాలు ప్రారంభించారు. రోజుకు రెండు వేలకు తగ్గకుండా రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇళ్ల నిర్మాణాలు ప్రస్తుతం చురుగ్గా కొనసాగుతున్నాయి. నిత్యం రెండు వేల ఇళ్లకు తగ్గకుండా నిర్మాణాలు పూర్తవుతున్నాయి. పనుల్లో వేగాన్ని పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేదలకు ఉచితంగా స్థలాలను పంపిణీ చేయడంతో పాటు యూనిట్‌కు రూ.1.80 లక్షల చొప్పున ఇంటి నిర్మాణానికి అందచేస్తోంది. మరోవైపు పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంకు రుణం ఇస్తున్నారు. దీంతోపాటు ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, ఇతర నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై అందించడంతో రూ.40 వేల మేర లబ్ధి చేకూరుస్తున్నారు. -
అద్దె ఇళ్లలో ఏళ్లుగా ఇబ్బంది పడ్డాం.. ఇల్లు లేక చనిపోదామనుకున్నా, జగనన్న ఇల్లు ఇచ్చి బ్రతికించాడు..!
-
వెలుగులు నింపిన నవరత్నాలు - పేదలందరికీ ఇళ్ల పథకం
-
ఇదీ మార్పు అంటే.. వెల్లటూరులో మారిన బతుకు చిత్రం
ఈ ఫొటోలో సొంతింటి ముందు సంతోషంగా సెల్ఫీ తీసుకుంటున్న టి.తిరుపతిస్వామి, వేళంగిణి కుటుంబం ఏడాది క్రితం వరకు బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరులో కృష్ణా కెనాల్ పిల్లకాలువ గట్టుపై పూరి గుడిసెలో నివసించింది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ దశాబ్దాల పాటు దుర్భర జీవితాన్ని అనుభవించింది. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇంటి స్థలం మంజూరు కాలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద వేళంగిణికి ఇంటి స్థలంతో పాటు ఇంటిని కూడా నిర్మించి ఇచ్చింది. దీంతో గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ కుటుంబం గృహ ప్రవేశం చేసింది. ‘నా చిన్నప్పటి నుంచి కాలువ గట్టుపై మురికి కూపంలో గుడిసెల్లోనే బతికా. దీపం వెలుతురు మినహా కరెంటు కనెక్షన్ లేదు. వర్షాలు పడితే గుడిసె వరదనీటిలో మునిగిపోయేది. మురికి నీటి కారణంగా దోమలు బెడద తీవ్రంగా ఉండేది. పాములు, తేళ్లు, కీటకాలు గుడిసెలోకి వచ్చేవి. సీఎం జగన్ ప్రభుత్వం మా గోడును ఆలకించింది. మాకంటూ ఓ సొంతిల్లు ఉంది. ఇప్పుడు కంటి నిండా నిద్ర పోతున్నాం’ అని వేళంగిణి కృతజ్ఞతలు తెలిపింది. పాకల్లోకి పందులు.. ఇదే కాలనీలో కంతేటి పైడమ్మకు కూడా ఇల్లు మంజూరైంది. ఆమె కుటుంబం కూడా కొన్ని దశాబ్దాలు కాలువ గట్లపైనే మగ్గింది. ఆ కుటుంబానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సొంత ఇంటిని సమకూర్చింది. ప్రతి నెలా ఒకటో తేదీనే పైడమ్మ ఇంటి వద్దే పెన్షన్ అందుకుంటోంది. మీ బతుకు చిత్రంలో ఎలాంటి మార్పు వచ్చిందని పైడమ్మను ప్రశ్నిస్తే ఆమె కళ్లు చెమర్చాయి. ‘ఒకప్పుడు కాలువ పక్కన జంతువులతో కలిసి జీవించాం. పని కోసం బయటికి వెళితే పందులు మా పాకల్లోకి దూరి వండుకున్న అన్నం తినేసి కకావికలం చేసిన ఘటనలు కోకొల్లలు. ఆ జీవితం పగోడికి కూడా రాకూడదని దేవుడిని కోరుకుంటా. ఎంత కష్టం చేసినా మేం గజం స్థలం కూడా కొనలేం. అలాంటిది ఈ రోజు మాకంటూ సొంతిల్లు ఉందంటే సీఎం జగన్ చలువే’ అని పైడమ్మ చెప్పింది. (వడ్డే బాలశేఖర్ – వెల్లటూరు వైఎస్సార్, జగనన్న కాలనీ నుంచి సాక్షి ప్రతినిధి): రూ.లక్ష కోట్లు.. 30 లక్షల మందికిపైగా సొంతింటి యోగం! ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాల కోసం దేశంలోనే తొలిసారిగా భారీ మొత్తంలో వ్యయం చేస్తూ లక్షల మంది అక్క చెల్లెమ్మల ఆకాంక్షలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నెరవేరుస్తోంది. వైఎస్సార్ జగనన్న కాలనీల రూపంలో ఏకంగా 17 వేలకు పైగా ఊర్లను, లక్షల్లో గృహాలను నిర్మిస్తోంది. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇప్పటివరకూ రెండు దశల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణానికి (టిడ్కో ఇళ్లతో కలిపి) అనుమతులిచ్చింది. ఇందులో 3.40 లక్షల గృహాల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. 4.67 లక్షల ఇళ్లు రూఫ్ లెవల్ పై దశలో నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు చకచకా నీటి సదుపాయం, కరెంట్ కనెక్షన్లను ప్రభుత్వం సమకూరుస్తోంది. రూపాయి ఖర్చు లేకుండా.. అద్దెలు కట్టలేక దశాబ్దాల పాటు కాలువ గట్లపై పాకల్లో మగ్గిపోయిన నిరుపేద కుటుంబాలు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో సంతోషంగా జీవిస్తున్నాయి. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా బాపట్ల జిల్లా వెల్లటూరులో రూ.96 లక్షలతో 3.18 ఎకరాలను సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం 115 ప్లాట్లు లబ్ధిదారులకు అందించింది. 28 మంది ఎస్సీలు, 85 మంది ఎస్టీలు, ఒక బీసీ కుటుంబానికి ఇళ్ల స్థలాలను కేటాయించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల చొప్పున నగదు అందచేసింది. అయితే ప్రభుత్వం స్థలంతోపాటు నిర్మాణానికి బిల్లులు ఇచ్చినప్పటికీ సొంతంగా ఇంటిని నిర్మించుకోలేని దీనస్థితిలో ఈ కుటుంబాలు ఉండటంతో విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ (వీఆర్వో) ముందుకొచ్చి చేయూత అందించింది. దీంతో నిరుపేదలు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇళ్లు సిద్ధమయ్యాయి. స్థలాల మంజూరు, నిర్మాణ బిల్లులు, లేఅవుట్లలో రోడ్లు, మంచినీరు, కరెంట్ సరఫరా లాంటి కనీస వసతుల కల్పన కోసం ఈ ఒక్క లేఅవుట్‌కు రూ.7.46 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. నిరుపేదలకు పక్కా ఇంటిని సమకూర్చడం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.6.73 లక్షల మేర లబ్ధి చేకూర్చింది. పేదల ఇళ్ల కోసం వ్యయం ఇలా ► 30.25 లక్షల మందికి 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పంపిణీకి రూ.56,102.91 కోట్లు ► వైఎస్సార్ జగనన్న కాలనీల్లో సదుపాయాల కల్పన కోసం రూ.36,026 కోట్లు (తాత్కాలిక సదుపాయాలకు రూ.3,117 కోట్లు, శాశ్వత సదుపాయాల కోసం రూ.32,909 కోట్లు) ► లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా కింద చెల్లింపులు, ఇతర రాయితీల రూపంలో ప్రయోజనం రూ.13,758 కోట్లు అటు ఇల్లు.. ఇటు చదువులు నా భర్త కూలి పనులకు వెళ్తే రోజుకు రూ.500 వరకూ వస్తుంది. పిల్లలతో ఇబ్బంది పడుతూ పూరి గుడిసెల్లోనే జీవించాం. ఇప్పుడు ప్రభుత్వం మాకు పక్కా ఇంటిని సమకూర్చడంతోపాటు నా బిడ్డ చదువుకు కూడా సాయం చేస్తోంది. – జ్యోతి, వైఎస్సార్ జగనన్న కాలనీ, వెల్లటూరు నేను, చెల్లి ఆడుకుంటున్నాం మేం గుడిసెలో ఉన్నప్పుడు చుట్టూ ఎప్పుడు బురదే. దోమలు విపరీతంగా కుట్టేవి. వర్షం పడితే గుడిసెలోకి నీళ్లు వచ్చేవి. పైనుంచి వర్షం కారేది. అమ్మనాన్న నన్ను, చెల్లిని ఒళ్లో పడుకోబెట్టుకునే వాళ్లు. ఇప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చాం. ఎంత వర్షం వచ్చినా ఇబ్బంది లేదు. ఇక్కడ అంతా బాగుంది. నేను చెల్లి బాగా ఆడుకోగలుగుతున్నాం. – వెంకట్నాథ్ (జ్యోతి కుమారుడు) తరతరాల దుస్థితికి తెర మా పూర్వీకులు, మేం పూరి గుడిసెల్లోనే పుట్టాం. అక్కడే పెరిగాం. తరతరాలుగా పూరి గుడిసెల్లోనే జీవిస్తున్నాం. మా పిల్లల సగం జీవితం కూడా వాటిల్లోనే గడిచింది. సీఎం జగన్ మా కోసమే ఇళ్ల పథకం తెచ్చినట్లున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంటి స్థలం, ఇల్లు మంజూరు చేశారు. మాతో పాటు మా ఇద్దరు బిడ్డలకు వేర్వేరుగా మూడు ఇళ్లు వచ్చాయి. – తుమ్మ రాముడు, లక్ష్మి, వైఎస్సార్ జగనన్న కాలనీ, వెల్లటూరు పక్కా ఇల్లు.. పెన్షన్ నా వయసు 60 పైనే ఉంటుంది. ఇన్నేళ్లలో నాకు, నా పిల్లలకు ఓ చిరునామా అంటూ లేదు. సీఎం జగన్ మాలాంటి వాళ్ల గోడును ఆలకించి పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చారు. ఇవాళ మాకు పక్కా ఇల్లు, శాశ్వత చిరునామా ఉంది. – ఇళ్ల సాంమ్రాజ్యం, వైఎస్సార్, జగనన్న కాలనీ, వెల్లటూరు భావి తరానికి విలువైన స్థిరాస్తి పూరిపాకల్లో బతికిన మాకు ఇది కొత్త జీవితమే. మురికి కుంటల్లో మగ్గిపోతున్న మా తలరాతలను సీఎం జగన్ మార్చారు. పెద్దల నుంచి మాకు ఎటువంటి ఆస్తులు రాలేదు. మా పిల్లలకు విలువైన ఈ ఇంటిని ఆస్తిగా అందిస్తాం. – కలగంటు జ్యోతి, వైఎస్సార్, జగనన్న కాలనీ, వెల్లటూరు -
జగనన్న కాలనీల్లో శర వేగంగా ఇళ్ల నిర్మాణ పనులు
-
ఏది నిజం?: చూడు బాబూ... ఇవిగో ఇళ్లు.. కలలోనైనా ఇది ఊహించారా?
72 ఏళ్ల వయసు. 45 ఏళ్ల రాజకీయ జీవితం. 14 ఏళ్ల ముఖ్యమంత్రిత్వం. కానీ ప్రజలకు చేసిందేంటి? ఓ సెల్ఫీ ఛాలెంజ్!!. మేం లక్షల ఇళ్లు కట్టాం? మీరెన్ని కట్టారో చెప్పండంటూ ప్రభుత్వానికో సవాలు!!. ఏం... తెలీదా చంద్రబాబు గారూ? ఈ రాష్ట్రంలో సొంతిల్లు లేని పేదలుండకూడదనే దృఢ సంకల్పంతో ఒకేసారి 30.25 లక్షల మందికి ఇళ్ల స్థలాలివ్వటం మీరు కలలోనైనా ఊహించారా?.. మీ 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలా అందరికీ నీడ కల్పిస్తే బాగుంటుందనే ఆలోచన కూడా రాలేదెందుకు? 30.25 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలివ్వటమే కాక... అందులో 21.25 లక్షల ఇకుపైగా ఇళ్ల నిర్మాణాలకు అనుమతిచ్చి ఆరంభించటం చరిత్ర ఎరుగని వాస్తవం కాదా? స్థలాలిచ్చి రెండున్నరేళ్లు కూడా తిరక్కుండానే... ఈ నెలాఖరుకల్లా 5 లక్షల మంది ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేస్తున్నారంటే... ఆ గృహ యజమానులంతా మీకెన్ని సెల్ఫీ చాలెంచ్లు విసరాలి? మీ 14 ఏళ్ల పాలనలో కట్టని ఇళ్లు ఈ రెండున్నరేళ్లలోనే పూర్తయ్యాయంటే... మీకు ఇంకా ఈ దౌర్భాగ్యపు రాజకీయాలు అవసరమా? 30.25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు. వీటికోసం 17, 005 వైఎస్సార్, జగనన్న కాలనీల రూపం ఏకంగా ఊళ్లే రూపుదిద్దుకుంటున్నాయి. ఒక్కో ప్లాటూ కనీసం రూ.2.50 లక్షలనుకున్నా ఏకంగా రూ.75 వేల కోట్లు. పైపెచ్చు ఇంటికి రూ.1.8 లక్షల సాయం. ఉచిత ఇసుక, సబ్సిడీ సిమెంటు, మెటీరియల్స్ రూపంలో మరో రూ.55వేలు అదనం. అంటే ప్రతి ఇంటికోసం అందజేస్తున్న సాయం రూ.2.35 లక్షలు. అంటే 70వేల కోట్లకు పైనే. ఇవికాక ఈ కాలనీల మౌలిక సదుపాయాల కోసం దశలవారీగా పెడుతున్న ఖర్చు ఏకంగా రూ.33వేల కోట్లు. అంటే మొత్తంగా ఈ గృహ యజ్ఞం కోసం చేస్తున్న ఖర్చు ఏకంగా 1.78 లక్షల కోట్లు. ఇంతటి బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకోవాలంటే... అందరికీ నిలువ నీడ కల్పించాలన్న ఆశయం ఎంత బలంగా ఉండాలి? వాస్తవరూపం దాలుస్తున్న ఆ ఆశయబలం ముందు మీ జిత్తులమారి రాజకీయాలు సరితూగుతాయనే అనుకుంటున్నారా? విజయవాడ రూరల్ మండలంలో జక్కంపూడినే తీసుకుందాం. అక్కడ పూరి గుడిసెల్లో తలదాచుకుంటున్న గిరిజన కుటుంబాలు... వర్షం పడితే కొండ మీద నుంచి గుడిసెల్లోకి పారే వరద నీరు... దోమలు, కీటకాలు, తేళ్లు, పాముల సంచారంతో బిక్కు బిక్కుమంటూ గడిపే కుటుంబాలు... ఇవన్నీ చంద్రబాబు నాయుడి పాలనలో అక్కడి వారందరికీ అనుభవం. అసలు అలాంటి ప్రాంతమొకటి ఉన్నదని, అక్కడి గిరిజన కుటుంబాలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాయనే విషయమే నారా వారి దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు అక్కడో ఊరు రూపుదిద్దుకుంటోంది. ఎందుకంటే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాగానే... ఇళ్ల నిర్మాణానికి అనుగుణంగా ఆ ప్రాంతాన్ని చదును చేసి, వరద ముప్పు లేకుండా తీర్చిదిద్దింది. ఎన్నో ఏళ్లుగా అక్కడ ఉంటున్నవారికి స్థలాలు ఇవ్వడంతో పాటు ఒక్క రూపాయి కూడా భారం మోపకుండా ప్రభుత్వమే పూర్తిగా ఇళ్లను నిర్మించి ఇచ్చింది. తమ బతుకు చిత్రాన్ని ముఖ్యమంత్రి జగన్ మార్చేశారని చెబుతున్న రోజు కూలీ తలుపుల కవితలాంటి స్థానికుల భావోద్వేగం ముందు బాబు సెల్ఫీలు ఎన్ని సరితూగుతాయి? షమీ కుటుంబంలో సంబరం షేక్ షమీ భర్త రసూల్ కూలి పనులు చేస్తాడు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నివసిస్తున్న ఈ కుటుంబం ఇంటద్దె కోసం నెలకు రూ.3 వేలు చెల్లిస్తోంది. రసూల్ సంపాదన ఇంటద్దె, ముగ్గురు పిల్లల పోషణకు చాలక నానా అవస్థలూ తప్పడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక పసుమర్రు వద్ద వైఎస్సార్ జగనన్న కాలనీలో ఇంటి స్థలం మంజూరైంది. సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే రసూల్ కూలి పనులు మానాలి. అందుకని ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇచ్చే ఆప్షన్‌ను ఎంచుకున్నారు. ప్రస్తుతం స్లాబ్ దశ పూర్తయింది. త్వరలో ఆ కుటుంబం సొంతింట్లోకి మారనుంది. ఎలాంటి ప్రయాస లేకుండా తమకు స్థలం, ఇల్లు వచ్చిందని చెబుతున్న షమీ సంతోషం ముందు... చంద్రబాబు రాజకీయాలు ఎన్నయినా దిగదుడుపే కదా? లేఅవుట్‌కు వెళ్లి సొంతింటిని చూసుకున్నప్పుడు ఒక్కోసారి ఇదంతా కలేమో అనిపిస్తుందని భావోద్వేగంతో చెబుతుంది షమీ. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ కర్నూలు జిల్లా నందవరం మండలం కొత్త కైరవాడి గ్రామానికి చెందిన కురువ సరోజమ్మ చాలా ఏళ్లుగా గుడిసెలోనే జీవిస్తోంది. వ్యవసాయ కూలీ పనులకు వెళ్లే సరోజమ్మ గతంలో చాలా సార్లు దరఖాస్తు చేసుకున్నా సొంతింటి కల నెరవేరలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఉచితంగా స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు అందించింది. ఇటీవలే సొంతింట్లోకి మారారు. ‘అద్దె కట్టుకునే స్థోమత లేక చాలా ఏళ్లు గుడిసెలోనే ఉన్నాం. వర్షాలకు తడుస్తూ, చలికి వణుకుతూ ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాం. భగవంతుడు మా మొర ఆలకించాడు. అందుకే సీఎం జగన్ ఇళ్ల పథకం ప్రవేశపెట్టారు. ఈరోజు దర్జాగా సొంతింట్లో ఉంటున్నాం’ అంటున్న సరోజమ్మ ఆనందాన్ని మాటల్లో చెప్పడం సాధ్యం కాదేమో!!. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఏకంగా 30.25 లక్షల మంది పేద మహిళలకు 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పంపిణీని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు. అసలింతటి విలువైన స్థలాన్ని ప్రజలకు అందించటమే ఓ చరిత్ర. వేరెవరైనా అయితే అంతమందికి స్థలాలిచ్చామని ఘనంగా ప్రచారం చేసుకోవటంతో పాటు... అక్కడితో వదిలిపెట్టేసేవారు. కానీ వై.ఎస్.జగన్ ఓ అడుగు ముందుకేశారు. స్థలాలివ్వటంతో సరిపెట్టకుండా వెనువెంటనే దశలవారీగా ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం 21.25 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. సొంతింటి ద్వారా ఒకో పేదింటి అక్క చెల్లెమ్మల చేతికి రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే స్థిరాస్తి అందుతోంది. తద్వారా రూ.2.5 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల మేర సంపద సృష్టి జరుగుతోంది. ఇటు ఇళ్ల నిర్మాణం.. అటు సదుపాయాలు రెండు దశల్లో 21.25 లక్షలకుపైగా (టిడ్కో ఇళ్లతో కలిపి) గృహ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. 20.28 లక్షల ఇళ్ల నిర్మాణాలు (95 శాతం) వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే 3,37,631 గృహ నిర్మాణాలు పూర్తయి గృహ ప్రవేశాలు జరిగాయి. మరో 1.27 లక్షల ఇళ్లు పైకప్పు, ఆపై దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటి నిర్మాణం ఈ నెలాఖర్లోగా పూర్తయి... వారూ గృహ ప్రవేశాలకు సిద్ధమవుతున్నారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 28,377, విజయనగరంలో 27,895, శ్రీకాకుళంలో 23,611 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. 2020 డిసెంబర్లో ఇళ్ల స్థలాలను పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరుసటి ఏడాది నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. రెండున్నరేళ్ల వ్యవధిలో ఐదు లక్షల వరకూ ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతున్నాయి. ఒకవైపు ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతూనే మరోవైపు కనీస సదుపాయాల కల్పన పనులను ప్రభుత్వం కొనసాగిస్తోంది. నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లకు చకచకా కరెంట్, నీటి సరఫరా కనెక్షన్లను సమకూరుస్తోంది. ప్రభుత్వమే నిర్మించి ఇస్తోంది ప్రభుత్వం ఉచితంగా స్థలాన్ని అందించడంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు, తక్కువ ధరలకు నిర్మాణ సామగ్రి సమకూరుస్తుండగా కొందరు నిరుపేద లబ్ధిదారులు ఇంటి నిర్మాణానికి సంకోచించారు. దీంతో వీరి కోసం ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇచ్చే ఆప్షన్–3ని ప్రవేశపెట్టారు. 3.27 లక్షల మంది లబ్ధిదారులు ఈ ఆప్షన్–3 ఎంచుకున్నారు. లబ్ధిదారులను గ్రూపులుగా చేసి, వారికి లాభాపేక్ష లేని నిర్మాణ సంస్థలను ఎంపిక చేసి అనుసంధానించడం ద్వారా ఆప్షన్–3 ఇళ్లను నిర్మిస్తున్నారు. 3.03 లక్షల ఇళ్లు పునాది, ఆపై దశలో నిర్మాణంలో ఉన్నాయి. 1,923 ఇళ్లు లింటెల్ లెవెల్, 12,252 ఇళ్లు స్లాబ్ దశలో నిర్మాణంలో ఉన్నాయి. షీర్ వాల్ టెక్నాలజీతో చకచకా నా భర్త హోల్‌సేల్ మెడికల్ షాపులో సేల్స్‌మెన్‌గా చేస్తారు. చాలా ఏళ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. గతంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక వెంటనే స్థలం మంజూరు చేయడంతో పాటు ఇంటి నిర్మాణానికి అనుమతులిచ్చారు. నా భర్త పనిచేసే చోట పెద్దగా సెలవులివ్వరు. నేను ఇంటి వద్ద చిన్న వ్యాపారం చేస్తుంటా. మాకున్న ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వమే ఇంటిని నిర్మించి ఇవ్వాలని కోరాం. షీర్వాల్ టెక్నాలజీ విధానంలో మా ఇంటిని నిర్మిస్తున్నారు. స్లాబ్ అయిపోయింది. వేగంగా ఇంటి నిర్మాణం పూర్తవుతోంది. ఈ జన్మకు సొంతిల్లు అనేది ఉంటుందో ఉండదోనని ఆవేదన చెందేవాళ్లం. ముఖ్యమంత్రి జగన్ మా కలను నెరవేర్చారు. నా బిడ్డ చదువు కోసం అమ్మ ఒడి కింద సాయం కూడా అందిస్తున్నారు. ఇంకా పలు రకాలుగా ప్రభుత్వం మాకు అండగా నిలుస్తోంది. – జి.శోభారాణి, ఆప్షన్–3 లబ్ధిదారురాలు, అమలాపురం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వివక్ష లేకుండా మంజూరు గత ఏడాది డిసెంబర్ 15న ప్రభుత్వం ఇచ్చిన సొంతింటికి మారాం. కరెంట్, నీటి కనెక్షన్.. ఇలా అన్ని వసతులనూ కల్పించారు. వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన నేను గత ప్రభుత్వంలో ఇంటి పట్టా కోసం దరఖాస్తు చేసుకున్నా టీడీపీ సానుభూతిపరులకే ఇచ్చారు తప్ప రాజకీయాలతో సంబంధం లేని మాకెవ్వరికీ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కులం, మతం, పార్టీలు చూడకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్థలం మంజూరు చేసింది. ఇంటిని కూడా నిర్మిస్తున్నారు. – ఎం.హరిత, ఆరూరు ఎస్టీ కాలనీ, నిండ్ర మండలం, చిత్తూరు జిల్లా అంతా కలలా.. ఆర్నెల్లలోనే నాకు 11 ఏళ్ల క్రితం పెళ్లయింది. అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. వడ్రంగి పని చేసే నా భర్త సంపాదనతో కుటుంబ పోషణే భారంగా ఉండేది. గత ప్రభుత్వ హయాంలో తహశీల్దార్ ఆఫీస్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఇంటి స్థలం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక వలంటీర్ ఇంటి వద్దకే వచ్చి దరఖాస్తు తీసుకున్నారు. కొద్ది రోజులకే స్థలం మంజూరైంది. ఆర్నెల్లలో సొంతిల్లు కట్టుకున్నాం. అంతా కలలా ఉంది. సొంతింట్లో ఉంటున్నామంటే నాకే నమ్మకం కలగటం లేదు. – నాగేశ్వరమ్మ, శనివారపుపేట జగనన్నకాలనీ ఏలూరు రూ.9 లక్షల విలువైన స్థలం ఇచ్చారు మా గ్రామం జాతీయ రహదారి 26ని అనుకుని ఉండటంతో సెంట్ స్థలం రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షలు పలుకుతోంది. అంత విలువైన స్థలాన్ని ప్రభుత్వం మాకు ఉచితంగా ఇచ్చింది. నిర్మాణం పూర్తవడంతో గత ఫిబ్రవరిలో గృహ ప్రవేశం చేసి సొంతింట్లో ఉంటున్నాం. – బోడసింగి సీత, బోడసింగి పేట గ్రామం, బొండపల్లి మండలం, విజయనగరం జిల్లా -
మిలమిల.. జగనన్న కాలనీ ఇలా..
పేదలందరికీ పక్కా ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న కాలనీలు క్రమంగా కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఇడుపూరు వద్ద 88 ఎకరాల విస్తీర్ణంలోని జగనన్న కాలనీలో పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమారు 3 వేల గృహాల నిర్మాణాలు వివిధ దశలలో ఉండగా.. ప్రభుత్వం రూ.3 కోట్లతో విద్యుదీకరణ పనులు పూర్తి చేసింది. ట్రాన్స్ఫార్మర్లు పెట్టి.. వీధి లైట్లు ఏర్పాటు చేయటంతో ఆ ప్రాంతమంతా జిగేల్మంటూ మెరిసిపోతోంది. – మార్కాపురం (ప్రకాశం జిల్లా) -
చకచకా సదుపాయాలు.. జోరుగా ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు చకచకా విద్యుత్, నీటి సరఫరా కనెక్షన్లను అందచేస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా పేద కుటుంబాలకు పక్కా నివాసాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్పిస్తున్న విషయం తెలిసిందే. దీంతో వైఎస్సార్–జగనన్న కాలనీల రూపంలో ఏకంగా పట్టణాలే నిర్మితమవుతున్నాయి. ఇప్పటివరకూ రెండు దశల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఇందులో 2.62 లక్షలు టిడ్కో ఇళ్లు కాగా, మిగిలిన 18.63 లక్షలు సాధారణ గృహాలు. సాధారణ ఇళ్లలో 16.67 లక్షల గృహాల శంకుస్థాపనలు పూర్తి కాగా, నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న 17 వేల కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఏకంగా రూ.32 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. 8,485 లేఅవుట్లలో విద్యుత్ సర్వే పూర్తి ఇంటి నిర్మాణాలు కొనసాగుతున్న 8,485 లేఅవుట్లలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన సర్వే పూర్తయింది. 3,248 లేఅవుట్లలో విద్యుత్ స్తంభాలు నాటడం, వైర్లు లాగడం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు లాంటి పనులు చకచకా కొనసాగుతున్నాయి. 1,411 లేఅవుట్లలో పనులు పూర్తయ్యాయి. నీటి సరఫరాకు సంబంధించి 1,561 లేఅవుట్లలో పనులు ప్రారంభించారు. 6,012 లేఅవుట్లలో పనుల కోసం టెండర్లు ఆహ్వానించారు. 1.40 లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్, నీటి కనెక్షన్లు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ 2.09 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటిలో 1,46,440 ఇళ్లకు విద్యుత్, 1,40,986 ఇళ్లకు నీటి కనెక్షన్లు ఇచ్చారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్మాణాలు పూర్తయిన వెంటనే విద్యుత్, నీటి సరఫరా కనెక్షన్లు ఇచ్చేలా గృహ నిర్మాణ శాఖ చర్యలు చేపట్టింది. వైఎస్సార్–జగనన్న కాలనీలకు స్వాగత ఆర్చ్‌లను ప్రభుత్వం నిర్మిస్తోంది. 50 ఇళ్లకు పైగా ఉన్న లేఅవుట్లలో స్వాగత ఆర్చ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రూ.50 కోట్లతో 1,127 లేఅవుట్లలో ఆర్చ్‌ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. వసతులపై ప్రత్యేక దృష్టి వైఎస్సార్–జగనన్న కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాం. నిర్మాణం పూర్తయిన ప్రతి ఇంటికి వెంటనే నీరు, విద్యుత్ సరఫరా కనెక్షన్లు ఇవ్వాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు లబ్ధిదారులతో సమన్వయం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. నిర్మాణం తుదిదశకు చేరుకున్న సమయంలో నీరు, విద్యుత్ కనెక్షన్ల కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. డ్రెయిన్ల నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. – అజయ్ జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాకినాడ జిల్లా జగ్గంపేట డివిజన్ మురారి గ్రామంలోని వైఎస్సార్–జగనన్న కాలనీలో ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్న సిబ్బంది -
విద్యుత్తు, నీళ్లు, డ్రైనేజీ తప్పనిసరి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేకొద్దీ కరెంట్, నీటి సరఫరా, డ్రైనేజీ లాంటి కనీస సదుపాయాలను అందుబాటులోకి తేవాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కొత్త ఇళ్లలోకి ప్రవేశించే ముందు ఎవరైనా తొలుత వీటినే కోరుకుంటారని, అందువల్ల ఈ మూడింటిని తప్పనిసరిగా కల్పించాలని సూచించారు. పేదల గృహ నిర్మాణాలకు సంబంధించి నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని స్పష్టం చేశారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. నిర్ణీత దశకు రాగానే కరెంట్ కనెక్షన్ నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టిడ్కో ఇళ్లు కాకుండా రూ.6 వేల కోట్లకు పైగా నిధులను ఇప్పటికే ఇళ్ల నిర్మాణాల కోసం ఖర్చు పెట్టాం. గృహ నిర్మాణాలు పూర్తవుతున్నకొద్దీ కనీస సదుపాయాలను కల్పించాలి. ఇళ్ల లబ్ధిదారులతో క్షేత్ర స్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలి. నిర్మాణం నిర్ణీత దశకు చేరుకోగానే ఇళ్లకు కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి. ఇందుకు తగ్గట్టుగా తగిన ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. ప్రత్యామ్నాయ స్థలాలు.. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో ఏర్పాటైన కాలనీల్లో లక్షల ఇళ్లను నిర్మించడం ద్వారా నిరుపేదలకు గృహ యోగం కల్పిస్తున్నాం. కొన్ని చోట్ల న్యాయ వివాదాల కారణంగా ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. వాటిపై దృష్టి సారించాలి. కోర్టు వివాదాలతో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయిన చోట్ల వెంటనే ప్రత్యామ్నాయ స్థలాలను అన్వేషించి ఆ స్థలాల్లో పేదల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించాలి. గృహనిర్మాణశాఖపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఔట్ల సందర్శన.. 4 రకాల పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం ప్రగతిని సమీక్షలో అధికారులు వివరించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోందని తెలిపారు. టిడ్కో ఇళ్లు కాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో గృహ నిర్మాణాల కోసం ఇప్పటివరకు రూ. 6,435 కోట్లు ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. క్రమం తప్పకుండా లేఔట్లను సందర్శించి ఇళ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలిస్తున్నామని, డిసెంబర్లో రాష్ట్రవ్యాప్తంగా నాలుగు దఫాలు లేఔట్లను పరిశీలించినట్లు వెల్లడించారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టి మొత్తం నాలుగు రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అన్ని లేఔట్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకు అవసరమైన ల్యాబ్‌లను కూడా సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు. సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, ప్రత్యేక కార్యదర్శులు అజయ్‌జైన్, సాయిప్రసాద్, విజయానంద్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, సీసీఎల్ఏ కార్యదర్శి ఇంతియాజ్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మీ షా, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్ దివాన్ తదితరులు పాల్గొన్నారు. -
‘ముందస్తు ఎన్నికలంటూ చంద్రబాబు కొత్తడ్రామా’
తాడేపల్లి: ముందస్తు ఎన్నికలంటూ చంద్రబాబు కొత్తడ్రామాకు తెరలేపారని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. చచ్చిపోతున్న టీడీపీని బతికించుకునేందుకు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని, దానిలో భాగమే ముందస్తు ఎన్నికల డ్రామా అని మంత్రి విమర్శించారు. చంద్రబాబు నైజాన్ని ప్రజలు గమనించాలని, రాష్ట్రంలో టైమ్ ప్రకారమే ఎన్నికలు వస్తాయని స్పష్టం చేశారు మంత్రి. ‘31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది. ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. చంద్రబాబు హయాంలో ఎంతమంది పేదలకు ఇళ్లు నిర్మించారు. రామోజీ దిగజారి తప్పుడు రాతలు రాస్తున్నారు. 24 మార్చిలోపు లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయిస్తాం. ఇళ్ల నిర్మాణాల పురోగతిపై చర్చకు సిద్ధం. సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని మంత్రి ధ్వజమెత్తారు. -
వైయస్సార్ జగనన్న కాలనీ గృహ లబ్ధిదారులతో కొడాలి నాని ,జోగి రమేష్
-
స్వగృహప్రాప్తిరస్తు.. నిర్మాణం శరవేగం
సాక్షి, భీమవరం(ప.గో. జిల్లా): పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను చేపట్టింది. త్వరితగతిన గృహాలు నిర్మించేందుకు అన్నిరకాల ప్రోత్సాహకాలు అందిస్తోంది. అలాగే సొంతంగా ఇళ్లు నిర్మించుకోలేని లబ్ధిదారులకు ఆప్షన్–3లో భాగంగా కాంట్రాక్టర్లతో నిర్మించి ఇచ్చేందుకు ప్రజాప్రతినిధులు, హౌసింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ మేరకు జిల్లాలో భీమవరం, ఆకివీడు, పాలకొల్లు, తణుకు పట్టణాల్లో సుమారు 15 వేల గృహనిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేసి వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించారు. ఈ మేరకు కాంట్రాక్టర్లతో లబ్ధిదారులు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల చొరవతో.. జిల్లాలో పేదలకు ప్రభుత్వం 77,688 ఇళ్లను మంజూరు చేయగా ఇప్పటికే పలువురు సొంతంగా నిర్మాణాలు ప్రారంభించారు. పలువురు గృహప్రవేశాలు కూడా చేసుకున్నారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేయగా డ్వాక్రా మహిళలకు బ్యాంకుల నుంచి రూ.35 వేలు రుణం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే వ్యవసాయ కార్మికులు, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారికి ఇంటి నిర్మాణం కష్టం కావడంతో కాంట్రాక్టర్లు, తాపీమేస్త్రీలను పురమాయించి నిర్మాణాలు చేపట్టేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషిచేస్తున్నారు. నిబంధనల మేరకు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం కోసం 10 అడుగుల లోతులో గోతులు తవ్వి వాటికి ఆర్సీసీ కాంక్రీట్, ఫైల్ క్యాప్ వేస్తారు. ఆర్సీసీ ప్లి్లంత్ బీమ్‌తో కలిసి 4 అడుగుల ఎత్తు సిమెంట్ రాయి కట్టుడు బేస్మెంట్, బేస్మెంట్ను ఇసుకతో నింపడం, రూఫ్ బీమ్, 4 అంగుళాల స్లాబ్ వంటి పనులు చేస్తారు. యంత్రాల వినియోగం కాంట్రాక్టర్లు నిర్మాణ పనులకు యంత్రాలు వినియోగిస్తున్నారు. ట్రాక్టర్‌కు డిగ్గర్‌ను అమర్చి పిల్లర్లకు గోతులు తవ్వుతున్నారు. దీంతో పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. అలాగే కాంక్రీట్ కలపడానికి మిక్చర్ యంత్రం, శ్లాబ్‌కు లిఫ్ట్ మెషీన్‌ను వినియోగించేలా ఏర్పాట్లు చేశారు. లబ్ధిదారులతో ఒప్పందం ఇంటిని నిర్మించుకోవడానికి కాంట్రాక్టర్లతో లబ్ధిదారులు స్వచ్ఛందంగా ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా ఉండటంతో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంట్, ఇనుము కాంట్రాక్టర్లకు అందుబాటులో ఉంచుతున్నాం. దీనిలో భాగంగానే 20 వేల టన్నుల ఇసుక నిల్వ చేస్తున్నాం. వచ్చే జూన్ నాటికి నిర్మాణ పనులు పూర్తిచేసేలా కృషిచేస్తున్నాం. –ఎ.శివరామరాజు, హౌసింగ్ పీడీ, భీమవరం భీమవరంలో 3 వేల ఇళ్లు భీమవరంలోని విస్సాకోడేరు జగనన్న కాలనీలో 3 వేల ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే 1,200 మందికి పైగా లబ్ధిదారులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. కాలనీలో ఆర్సీసీ కాంక్రీట్, ఫైల్‌క్యాప్ వేసే పనులు చేపట్టాం. పనులు చూసిన మిగిలిన లబ్ధిదారులు కూడా ఇళ్ల నిర్మాణానికి ఒప్పందం చేసుకుంటున్నారు. త్వరితగతిన పనులు పూర్తిచేసి గృహప్రవేశాలు చేయిస్తాం. – పళ్ల ఏసుబాబు, కాంట్రాక్టర్, భీమవరం ఇళ్ల నిర్మాణం ఇలా.. జిల్లాలో పెద్ద కాలనీలు ఉన్న ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు, తాపీమేస్త్రీలతో ఇళ్లు నిర్మించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. భీమవరంలో 3 వేలు, పాలకొల్లులో 3,500, తణుకులో 5,500, ఆకివీడులో 2,700 ఇళ్లను కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. అలాగే నరసాపురం, తాడేపల్లిగూడెంలో నిర్మాణానికి చర్యలు చేపట్టారు. నిర్మాణాలకు కొరత లేకుండా అధికారులు 20 వేల టన్నుల ఇసుకను నిల్వ చేశారు. కాంట్రాక్టర్లకు అవసరమైన సిమెంట్, ఇనుమును ముందుగానే అందిస్తున్నారు. నిర్మాణానికి రూ.3.30 లక్షలు ఇంటి నిర్మాణానికి మొత్తం రూ.3.30 లక్షల ఖర్చవుతుండగా ప్రభుత్వం రూ.1.80 లక్షలు మంజూరు చేస్తుంది. అలాగే డ్వాక్రా మహిళలకు రూ.35 వేలు బ్యాంకు రుణం ఇస్తున్నారు. మిగిలిన రూ.1.15 లక్షలను లబ్ధిదారులు చెల్లిస్తే సరిపోతుంది. -
అక్రమాలకు అడ్డుకట్ట.. ఇసుక కోరినంత
అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ.. పారదర్శకంగా జిల్లా ప్రజలకు కోరినంత ఇసుకను జిల్లా యంత్రాంగం సరఫరా చేస్తోంది. కృష్ణా, పెన్నా తీర ప్రాంతాల నుంచి ఉప్పునీటి తాకిడి లేని ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో ఉన్న స్టాక్ పాయింట్లను రెట్టింపు చేసి భారీగా నిల్వ చేసింది. జగనన్న కాలనీలకే కాకుండా ఇతర కట్టడాలకు సరిపడా ఇసుకను సరఫరా చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఇసుక అక్రమార్కుల చెర నుంచి వినియోగదారులను గట్టున పడేసినట్లు అయింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇసుక నిల్వ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటి ద్వారా అన్ని రకాల నిర్మాణాలకు ఇసుక సరఫరా చేసేలా చర్యలు తీసుకుంది. ప్రధానంగా పెన్నా నది ఇసుక సంగం రీచ్ ద్వారా జిల్లాకు సరఫరా అవుతోంది. ప్రతి నెలా 40 నుంచి 50 వేల టన్నుల ఇసుకను జిల్లాలోని వినియోగదారులకు అందించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలో ఒంగోలుతో పాటు కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెంలలో ప్రధాన ఇసుక స్టాక్ పాయింట్లు ఉండేవి. పుష్కలంగా ఇసుక నిల్వలను అందుబాటులో ఉంచేందుకు అదనంగా ఏడు స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. త్వరలో కృష్ణా నది ఇసుకను జిల్లాకు తరలించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. 500 ఇళ్లకుపైగా ఉన్న జగనన్న కాలనీలకు ప్రత్యేకంగా.. రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీలకు కూడా జిల్లా వ్యాప్తంగా ఇసుక ఉచితంగా సరఫరా అవుతోంది. అందులోనూ ప్రత్యేకంగా 500 ఇళ్లకు పైగా ఉన్న జగనన్న కాలనీల్లోనే జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు ప్రత్యేకంగా నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేశారు. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ఆయా కాలనీల సమీపంలో పాయింట్లను ఏర్పాటు చేశారు. దీంతో జగనన్న కాలనీలకు సకాలంలో నాణ్యమైన ఇసుక ఉచితంగా సరఫరా చేస్తున్నారు. సింగరాయకొండలోని నిర్మిత కేంద్రం, కనిగిరి పట్టణం, పొదిలి, దర్శి, గిద్దలూరు టిడ్కో ఇళ్ల పక్కన, యర్రగొండపాలెం మండలంలోని మిల్లంపల్లి, బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండంలలో స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లోని జగనన్న కాలనీలతో పాటు పరిసర ప్రాంతాల్లోని జగనన్న కాలనీలకు కూడా అక్కడ నుంచే ఇసుక సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరకే ఇసుక జిల్లాలో ఇతర కట్టడాలకు, వ్యక్తిగత గృహాల నిర్మాణాలకు ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఇసుక ఉంచేలా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసింది. పారదర్శక విధానంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరకే నాణ్యమైన ఇసుకను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. జిల్లాలోని నియోజకవర్గాల వారీగా రీజనబుల్ రవాణా చార్జీలతో కలిపి టన్నుకు ప్రభుత్వం నిర్దేశించిన ధరకు సరఫరా చేస్తోంది. ఎవరైనా ఎక్కువ ధరకు ఇసుక అమ్మితే ఎస్ఈబీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. నెలకు 20 వేల టన్నులకు పైగా... జిల్లాలో నిర్మిస్తున్న జగనన్న కాలనీలకు, ప్రభుత్వం మంజూరు చేసిన వ్యక్తిగత ఇళ్ల నిర్మాణాలకు నెలకు దాదాపు 20 వేల టన్నులకు పైగా ఇసుకను గృహ నిర్మాణ శాఖ సరఫరా చేస్తోంది. ఇంకా కొన్ని ఇళ్ల నిర్మాణాలు కోర్టు కేసుల వలన నిలిచిపోయాయి. అవి కూడా ప్రారంభమైతే మరో 5 నుంచి 10 వేల టన్నుల వరకు అదనంగా ఇసుక వాడకం పెరుగుతుంది. జిల్లాలో మొత్తం 570 జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వాటిలో మొత్తం ప్రస్తుతం 50,813 గృహాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. నాణ్యమైన ఇసుకతో ఇళ్లు నిర్మించుకున్నాం గ్రామంలో జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నాం. గృహ నిర్మాణ శాఖ అధికారులు నెల్లూరు జిల్లా, సంగం ప్రాంతంలోని పెన్నా నది నుంచి తీసుకొచ్చిన ఇసుకను ఉచితంగా అందజేశారు. హాండ్లింగ్ చార్జీల కింద టన్నుకు రూ.175 చొప్పున మాత్రమే ఇచ్చిన ఇసుక తెచ్చుకున్నాం. నాణ్యమైన ఇసుక కావటంతో నిర్మాణం కూడా బాగా వచ్చింది. పటిష్టంగా నిర్మించుకున్నాం. జగనన్న కాలనీ వల్ల సొంతింటి కల నెరవేరింది. అందుకే ఇంటిపై జగనన్న ఫొటోను కూడా ఏర్పాటు చేసుకొని శాశ్వతంగా మా కుటుంబంలో జగనన్నను ఒక సభ్యునిగా చేసుకున్నాం. – ధారా నందిని భవానీ, రామాయణ కండ్రిక, పొదిలి ఇబ్బందులు లేకుండా ఇసుక సరఫరా... ప్రభుత్వం అందిస్తున్న ఇసుకను లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా సరఫరా చేస్తున్నాం. జగనన్న కాలనీలతో పాటు ప్రభుత్వం మంజూరు చేసిన వ్యక్తిగత ఇళ్లకు కూడా అందిస్తున్నాం. ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు సరఫరా చేస్తున్నాం. ప్రతి నెలా 20 నుంచి 25 వేల టన్నుల వరకు సరఫరా చేస్తున్నాం. జగనన్న కాలనీలకు అందుబాటులోనే ఇసుక సరఫరా చేస్తున్నాం. – ఈమని పేరయ్య, పీడీ, జిల్లా గృహ నిర్మాణ శాఖ -
పేదల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయద్దు
పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వడం అంటే కేవలం వారు తలదాచుకోవడానికి గూడు కల్పించడమే కాదు... సమాజంలో సగౌరవంగా తలెత్తుకు బతికే ఆత్మవిశ్వాసాన్ని కూడా కల్పించడమే. అందుకే సొంత ఇల్లు పేదల ఆత్మగౌరవ సూచిక. పేద, బడుగు, బల హీన వర్గాలకు ఇంటిస్థలం కాగితం చేతికివ్వడం అంటే ఆత్మగౌరవ పతాకాన్ని వారి చేతికిచ్చినట్లే. ప్రభుత్వం రాష్ట్రంలో 31 లక్షల మంది మహిళల పేరిట ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్లను నిర్మింపజేస్తోంది. ఇదంతా ఉచితమే. పేదల మీద భారం లేకుండా సొంత ఇంటి కలను నిజం చేసే బాధ్యతను ముఖ్యమంత్రి జగన్ తీసుకున్నారు. ఫలితంగా 31 లక్షల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించింది. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి వెళ్లి చూసినా... ప్రభుత్వం కల్పించే మౌలిక వసతుల వ్యయం కలిపితే ఇంటి స్థలం, ఇల్లు ఖరీదు రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఉంటుంది. పట్టణాలుగా రూపు దిద్దుకోనున్న 17 వేల ‘జగనన్న కాలనీ’లలో ఇళ్ల ఖరీదు మనం చూస్తుండగానే రెట్టింపు కావడం తథ్యం. ఒక పేద కుటుంబం అన్ని సంక్షేమ పథకాలనూ అందుకుంటూ సొంత ఇంట్లో ఉంటే... మెరుగైన జీవితం వారికి తప్పకుండా దక్కుతుంది. ఆయా కుటుంబాల అభ్యున్నతికి బాటలు పడతాయి. దశాబ్దం తిరిగే సరికి... సమాజంలో గణనీయమైన మార్పును మనం చూస్తాం. అభివృద్ధికి నిర్వచనం... నేటి కంటే రేపు బాగుండటం అని ముఖ్యమంత్రి పదేపదే చెబుతుంటారు. దానికి సాక్ష్యంగా ‘వైఎస్సార్ జగనన్న’ కాలనీలు సగర్వంగా తలెత్తుకుని నిలబడతాయి. పేదల ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవ సూచీలుగా నిలిచే జగనన్న కాలనీలు... మహిళా సాధికారతకు శాశ్వత చిరునామా కానున్నాయి. 31 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరిటే ప్రభుత్వం ఇవ్వడం ముఖ్యమంత్రి ముందుచూపునకు నిదర్శనం. స్త్రీ ఆలోచనకు అనుగుణంగా నడిస్తే ఆ కుటుంబాలు తప్పకుండా బాగుపడతాయి. బాగుపడ్డ కుటుంబాల సమాహా రంగా జగనన్న కాలనీలు రూపుదిద్దుకోనున్నాయి. రాష్ట్రంలో ప్రతి నలుగురిలో ఒకరు వైఎస్సార్ జగనన్న కాలనీవాసి కానున్నారు. ఒక్కో ఇంట్లో నలుగురు సభ్యులు ఉంటారనుకున్నా.. కోటీ పాతిక లక్షల మంది ఈ కాలనీల్లో నివసిస్తారు. రాష్ట్ర జనాభాలో నాలుగోవంతు మందికి ఆవాసం కల్పించే కాలనీలకు సకల సౌకర్యాల కల్పన బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంది. పేరుమోసిన రియల్ ఎస్టేట్ సంస్థల వెంచర్లలో కూడా కల్పించలేనన్ని మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తోంది. సీసీ రోడ్లు, తాగునీటి సరఫరా పైపులైన్లు, భూగర్భ డ్రెయినేజీ, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు అన్ని కాలనీల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్నెట్ సదుపాయం కల్పించడానికీ భూగర్భ కేబుళ్లు వేస్తున్నారు. పేదలకు ‘క్వాలిటీ లైఫ్’ అందించడానికి ప్రభుత్వం చేపట్టిన మహాయజ్ఞం ఇది. పేదలు ఆత్మగౌరవంతో జీవిస్తూ అభివృద్ధి పథంలో అడుగులు వేయడానికి రంగం సిద్ధమవు తున్న తరుణంలో... వాస్తవాలు గ్రహించకుండా, రాజకీయాల కోసం పేదల ఇళ్ల నిర్మాణాన్ని వాడుకోవడం సమంజసం కాదని పవన్ కల్యాణ్ గ్రహించాలి. ఆత్మ గౌరవంతో జీవించడానికి తొలి అడుగు పడుతున్న సమయంలో పేదల ఆత్మవిశ్వాసాన్ని రాజకీయాల కోసం దెబ్బతీస్తే భవిష్యత్ తరం ఆయన్ని క్షమించదు. ఇంటిని కేవలం ఇటుకలు, సిమెంట్‌తో నిర్మితమైన ఓ కట్టడంగా మాత్రమే కాకుండా... పేదల జీవితంగా పవన్ గుర్తించాలి. నిరుపేదల జీవితాలను రాజకీయం చేయడం వల్ల నష్టపోయేది పేదలే కాదు... పవన్ కూడా. నిర్మాణాత్మకంగా వ్యవహరించే ఆలోచన ఆయ నకు ఉంటే... బడుగుల జీవితాలు బాగుపడుతున్న తీరును అభినందించాలి. పేదల ఆత్మగౌరవానికి భంగం కలిగించవద్దని వినయంగా మనవి చేస్తున్నా. (క్లిక్ చేయండి: వికేంద్రీకరణ శ్రీబాగ్ ఒప్పందంలోనే ఉంది) - కైలే అనిల్ కుమార్ ఎమ్మెల్యే; పామర్రు, కృష్ణా జిల్లా -
Fact Check: ఖర్చు రూ.11 వేల కోట్లు..అవినీతి రూ.15 వేల కోట్లా?
సాక్షి, అమరావతి: బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్లుగా జనసేనాని ఆరోపణల్లో డొల్లతనం బయట పడింది. జగనన్న కాలనీల పేరుతో ప్రభుత్వం రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలు పూర్తి అవాస్తవమని తేలింది. రాష్ట్రంలో ప్రతి నిరుపేదకు సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో దాదాపు 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలివ్వగా అందుకోసం 71,811 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. ప్రభుత్వ భూమి పోగా 25,374 ఎకరాలను రైతుల నుంచి కొనుగోలు చేసింది. అందుకోసం సుమారు రూ.11 వేల కోట్లు ఖర్చు చేసింది. అలాంటప్పుడు ఖర్చు చేసిందే రూ.11 వేల కోట్లయితే ఇక రూ.15 వేల కోట్ల అవినీతికి పాల్పడటం ఎలా సాధ్యం? రైతుల నుంచి ఎకరా రూ.2 లక్షలు, రూ.4 లక్షలకు కొనుగోలు చేసి వైఎస్సార్సీపీ నేతలు రూ.20 లక్షలు, రూ.30 లక్షలకు విక్రయించారన్న ఆరోపణలోనూ నిజం లేదు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన భూ సేకరణ చట్టం ప్రకారమే జగనన్న కాలనీల కోసం భూ సేకరణ జరిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బేసిక్ వాల్యూ రిజిస్టర్లో నిర్దేశించిన విలువ ప్రకారమే విక్రయాలు, కొనుగోళ్లు జరిగాయి. దీనికంటే బహిరంగ మార్కెట్లో రేటు ఎక్కువగా ఉంటే కేంద్ర భూ సేకరణ చట్టం ప్రకారం ముందుకెళ్తారు. రిజిస్ట్రేషన్ విలువ కన్నా రూరల్‌లో రెండున్నర రెట్లు, అర్బన్‌లో రెట్టింపు విలువను అధికంగా చెల్లిస్తారు. అప్పటికీ రైతులు సంతృప్తి చెందకుంటే కలెక్టర్లు జిల్లా కమిటీలకు ఆ కేసులను అప్పగిస్తారు. ఇలాంటి సందర్భాల్లో బేసిక్ వాల్యూ రిజిస్ట్రేషన్ కన్నా అధిక ధరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న ధరను, డాక్యుమెంట్లలో పేర్కొన్న విలువను పరిగణలోకి తీసుకుంటారు. ఇదంతా కేంద్రం రూపొందించిన భూ సేకరణ చట్టం ప్రకారమే అనుసరిస్తారు. ఆ డాక్యుమెంట్లో పేర్కొన్న సేల్ వాల్యూను పరిగణలోకి తీసుకుని హైవేలు, ఇతర కమర్షియల్ స్థలాలు, మేజర్ ప్రాజెక్టులకు సమీపంలో ఉన్న స్థలాల రైతులతో సంప్రదింపులు జరిపి మరో 10 నుంచి 20 శాతం ధర పెంచుతారు. అప్పటికీ రైతులు సంతృప్తి చెందకపోతే ఇలాంటి కేసులు రాష్ట్ర కమిటీలకు వెళతాయి. ధర ఖరారైన తర్వాత నేరుగా రైతు బ్యాంకు ఖాతాల్లోకి సీఎంఎఫ్ఎస్ నుంచి డబ్బులు జమ అవుతాయి. ఇందులో ఎక్కడా మధ్యవర్తులు ఉండరు. భూ సేకరణ కోసం కలెక్టర్లు రెండు ప్రధాన పత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చి అభ్యంతరాలు స్వీకరిస్తారు. రైతులతో మాట్లాడిన తర్వాతే డిక్లరేషన్ చేసి అవార్డును ఎంక్వైరీ చేస్తారు. అనంతరం ఫైనల్ అవార్డును డిక్లేర్ చేస్తారు. ఈ ప్రక్రియ ముగిసేందుకు కనీసం 3 నుంచి 6 నెలల సమయం పడుతుంది. ఇంత పారదర్శకంగా భూసేకరణ జరిపి కాలనీలను నిర్మిస్తుంటే అందులో అవినీతికి ఎక్కడ ఆస్కారం ఉంది? -
ఈ ఆనందం వెలకట్టలేనిది!
(నానాజీ అంకంరెడ్డి), సాక్షి, అమరావతి: మంగళగిరి వైఎస్సార్ జగనన్న నగర్ (టిడ్కో)లో వందల కుటుంబాల వారు తమ సొంతింటి ఆనందాన్ని పంచుకున్నారు. ఇక్కడ నిర్మించిన 1,728 టిడ్కో ఇళ్లల్లో దాదాపు 400 మంది ఉంటున్నారు. డిసెంబర్లో మంచి ముహూర్తాలు ఉండడంతో మిగిలిన వాళ్లు గృహ ప్రవేశాలకు ఏర్పాట్లుచేసుకుంటున్నారు. ఇళ్లు పొందిన వారి పిల్లలు చిల్డ్రన్స్ డే సందర్భంగా సోమవారం టిడ్కో ప్రాంగణంలోని తమ ఫ్లాట్లలో కలియదిరుగుతూ గదుల్లోని గోడలను తడిమి చూసుకుని ఆనందంగా గడిపారు. విశాలమైన 60, 40 అడుగుల రోడ్లు.. చక్కటి డ్రైనేజీ వ్యవస్థ, ప్రతిబ్లాక్‌కు 20 అడుల సెట్‌బ్యాక్, ఆధునిక టెక్నాలజీతో నిర్మించిన 0.8 ఎంఎల్డీ సామర్థ్యమున్న ఎస్టీపీతో చక్కటి ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు అందించింది. సిరామిక్ టైల్స్‌తో ప్రతి గదినీ ముచ్చటగా తీర్చిదిద్దారు. ‘ఇలాంటి చోట ఇంతమంచి ఇల్లు మా జీవితంలో కట్టుకోలేం’ అని లబ్ధిదారులు అంటున్నారంటే వారెంత ఆనందంగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘దగ్గర్లోనే పట్టణ ఆరోగ్య కేంద్రం ఉంది, ఎవరికి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా మంచిగా వైద్యం చేస్తున్నారంటూ స్థానిక మహిళ జ్యోతి చెప్పారు. ఇక పిల్లల కోసం ప్రత్యేకంగా ఆట స్థలం సిద్ధమవుతోంది. అందరికీ ఉపయోపడేలా పార్కును కూడా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడే కాదు.. రాష్ట్రంలో 88 స్థానిక సంస్థల్లో నిర్మిస్తున్న 163 జీ+3 టిడ్కో అపార్ట్మెంట్లను ఇదే రీతిలో తీర్చిదిద్దుతున్నట్లు టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ తెలిపారు. పచ్చదనం కోసం త్వరలో మొక్కలు విశాలమైన ఈ ఇళ్ల ప్రాంగణంలోని ప్రతి అపార్ట్మెంట్ సెట్బ్యాక్లోను పళ్ల మొక్కలు, రోడ్లకు ఇరువైపులా నీడనిచ్చే మొక్కలు నాటనున్నారు. నివాసితుల అవసరాలకు అనుగుణంగా దుకాణాల నిర్మాణం కూడా చేపట్టాలని నిర్ణయించారు. వైఎస్సార్ జగనన్న నగరాల నిర్వహణకు సంక్షేమ సంఘాలను కూడా ఏర్పాటుచేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఇళ్లల్లో ఇన్ని వసతులు ఉంటాయని ఊహించలేదని, ఇక్కడి నిర్మాణాలు చూశాక జగనన్న ప్రభుత్వం తమకెంత మేలుచేసిందో తెలిసిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తంచేశారు. ‘జగనన్న మాకు సొంతిల్లు ఇచ్చి ఆత్మ విశ్వాసాన్ని పెంచారు. ఇప్పుడు అందులో ఆనందంగా అడుగుపెట్టాం. బయటి వారు ఎవరో వచ్చి మా ఆనందాన్ని నాశనం చేయాలని చూస్తే ఎలా సహిస్తాం!’ అంటూ గుంటి రాజలక్ష్మి (బి–6 బ్లాక్) అన్నారు. చిన్న రేకుల షెడ్డులో ఉండేవాళ్లం తెనాలి రోడ్డులోని రేకుల షెడ్డులో ఉండేవాళ్లం. చిన్నపాటి వర్షానికి కారిపోయేది. మా నాన్న ఎలక్ట్రీషియన్‌గా పనిచేసి కుటుంబాన్ని పోషిస్తారు. మాకు ఇక్కడ బి–21 బ్లాక్‌లో ఫ్లాట్ ఇచ్చారు. ఇప్పుడు సొంతింట్లో ఉంటున్నాం. దగ్గర్లోనే ప్లేగ్రౌండ్ కూడా ఉంది. చాలా ఆనందంగా ఉంది. – ఎండీ యాకూబ్ బేగ్, 8వ తరగతి అన్ని సౌకర్యాలు ఉన్నాయి మా అమ్మ షాపులోను, నాన్న టైలర్గాను పనిచేస్తారు. చిన్న గది, ఇంటికి ఎవరొచ్చినా ఉండేందుకు అవకాశం ఉండేదికాదు. నా స్నేహితుల సొంతిళ్లను చూసినప్పుడు అలాంటి ఇల్లు మేం కొనుక్కోగలమా అని అనిపించేంది. జగన్నన పుణ్యమా అని ఇప్పుడు మాకూ ఇల్లు వచ్చింది. – గుమ్మడి జ్యోతిక, ఇంటర్ సెకండియర్ మాటల్లో చెప్పలేని ఆనందం ప్రైవేటు ఆస్పత్రిలో క్లర్క్‌గా పనిచేసే నేను సొంతిల్లు సంపాదించడం అసాధ్యం. చిన్న గదిలో అద్దెకుండేవారం. బంధువులొస్తే ఉండే అవకాశంలేదు. ఇప్పుడు అన్ని వసతులతో ఇల్లు ఇచ్చారు. మా అబ్బాయి ఎంతో మురిసిపోతున్నాడు. జగనన్న పుణ్మమాని అద్దె ఇంటి కష్టాలు తప్పాయి. – షేక్ పర్హీన్, ప్రైవేట్ ఉద్యోగి చిత్రంలో కనిపిస్తున్నామె పేరు షేక్ షహీనా. మంగళగిరి ఇస్లాంపేటలో అద్దె ఇంట్లో ఉండేవారు. ఈమె తల్లిదండ్రులు, అత్తమామలకు కూడా సొంతిల్లు లేదు. ఇప్పుడు మంగళగిరిలో నిర్మించిన వైఎస్సార్ జగనన్న నగర్‌లోని బి–16 బ్లాక్‌లో ఫ్లాట్ పొందారు. ఇద్దరు పిల్లలతో సరైన ఇల్లులేక ఏడ్చిన సందర్భాలను ఈమె గుర్తుచేసుకున్నారు. ‘నా భర్త నిస్సార్ చెప్పుల దుకాణంలో పనిచేస్తారు. అరకొర జీతం. బంధువులు రాకూడదని షరతు. దీంతో ఎన్ని ఇళ్లు మారానో అల్లాకే తెలుసు. ఇప్పుడు నా సొంతిట్లో ఉంటున్నాను. ఇదంతా జగనన్న చలవే’ అని చెమర్చిన కళ్లతో చెప్పారు. ఇక షహీనా తల్లి ఫైజాన్ మాట్లాడుతూ.. ‘అద్దె ఇంట్లో నీరు ఎక్కువ వాడుతున్నారని తిట్టేవారు. దాంతో మనవలను చూడాలన్న ఆశ ఉన్నా వెళ్లడానికి ఉండేది కాదు. ఇప్పుడు నా బిడ్డకు జగన్‌బాబు ఇల్లిచ్చారు. నేను ఇక్కడకు ఎప్పుడైనా రావొచ్చు. ఆయన మా పాలిట అల్లాహ్’.. అన్నప్పుడు కళ్లల్లో ఆనంద బాష్పాలు కనిపించాయి. – ఈ తల్లీ బిడ్డల ఆనంద బాష్పాలకు ఖరీదుకట్టే షరాబు ఉన్నాడా? నేను స్వేచ్ఛగా ఆడుకోవచ్చు.. ఇక్కడ చిత్రంలోని తల్లి జె.రాజ్యలక్ష్మితో కనిపిస్తున్న పిల్లాడి పేరు మోక్షజ్ఞ. ఏడో తరగతి. వీరు గతంలో చిన్న గదిలో అద్దెకుండేవారు. కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న తల్లి తెచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే ఇల్లు గడిచేది. ఇప్పుడు వీరికి టిడ్కో ప్రాజెక్టులో ఏ–7 బ్లాక్‌లో ఇల్లిచ్చారు. దీనిపై మోక్షజ్ఞ స్పందిస్తూ.. ‘ఇంతకుముందు ఆడుకునేందుకు ఏమీ ఉండేది కాదు. ఇప్పుడిక్కడ ప్లేగ్రౌండ్ ఉంది. పార్కు కూడా కడతారట’.. అన్నప్పుడు బాబు కళ్లల్లో కనిపించిన మెరుపు వెలకట్టలేం. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. ‘జగనన్న వచ్చాక నాకుంటూ సొంతిల్లు వచ్చింది’ అని చెప్పింది. – ఈ తల్లీకొడుకుల్లో సంతోషం, ధీమా కనిపించాయి. ఇరుకు గది నుంచి విశాల ప్రపంచానికి.. ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి పేరు కరిష్మా. నాలుగో తరగతి చదువుతోంది. నాన్నలేని ఈ బిడ్డకు ఓ తమ్ముడు ఉన్నాడు. వంట పనిచేసి తల్లి తెచ్చే కొద్దిపాటి సంపాదనతో మంగళగిరి ఐదో వార్డులోని చిన్నరేకుల షెడ్డులో వీరుంటున్నారు. ఇక్కడ బి–37లో ఫ్లాట్ ఇచ్చారు. ఈ చిన్నారిని పలకరించినప్పుడు ‘మేం అద్దెకుండే రేకుల ఇల్లు వర్షం వస్తే కారిపోయేది. ఇక్కడ ఇల్లు వచ్చిందని తెలియగానే అమ్మ ఎంతో సంతోషపడింది. అమ్మను అంత ఆనందంగా ఎప్పుడూ చూడలేదు’. – ఆ చిన్నారి కళ్లల్లో వెలకట్టలేని వెలుగు కనిపించింది. మా పిల్లలకు గర్వంగా చెబుతున్నా.. తాపీ మేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న షేక్ జానీది కష్టాల కథే. పదుల సంఖ్యలో ఇళ్లు కట్టిన ఈ మేస్త్రీకి నిన్నా మొన్నటిదాకా సొంత గూడులేదు. ‘మనం సొంతిల్లు కట్టుకోలేమా నాన్నా.. అని నా పిల్లలు అడిగినప్పుడు మనసు చివుక్కుమనేది. ఎన్నో ఇళ్లు కట్టిన నేను నా పిల్లలకు సమాధానం చెప్పలేకపోయేవాడిని. జగనన్న చలవవల్ల ఇప్పుడు నాకు పది లక్షల విలువైన ఇల్లు (బి–5)వచ్చింది. ఇంతకంటే ఇంకేం కావాలి? ఇదంతా జగన్ బాబు పుణ్యమే’ అంటున్నప్పుడు మేస్త్రీ జానీ కళ్లలో కృతజ్ఞత కనిపించింది. -
జనసేన కార్యకర్తలకు మరోసారి గట్టి షాక్..
సాక్షి, అనకాపల్లి: వరుసగా జనసేన శ్రేణులకు చుక్కెదురైంది. మొన్న ఇప్పటం, నిన్న పెడన, తాజాగా గోలుగొండలో జనసేన కార్యకర్తలకు ఎదురుదెబ్బ తగిలింది. జనసేన నేతలకు మరోసారి ఊహించని షాక్ తగిలింది. జనసేన కార్యకర్తలపై మహిళలు తిరగబడ్డారు. దీంతో చేసేదేమీ లేక తెల్లముఖం వేశారు. వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా గోలుగొండలో జగనన్న కాలనీల్లోకి జనసేన కార్యకర్తలు వెళ్లారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలపై స్థానిక మహిళలు తిరగబడ్డారు. దీంతో, జనసేన శ్రేణులు బిక్కమొహంతో వెనుదిరిగారు. కాగా, జగనన్న కాలనీలోకి వచ్చిన జనసేన నేతలు.. అక్కడ అవినీతి జరిగిందంటూ ఓవరాక్షన్ చేశారు. ఇళ్లు నిర్మించేందుకు డబ్బులు సరిపోలేదని.. ప్రభుత్వాన్ని డబ్బులు అడగాలని వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో, స్థానికంగా ఉన్న లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇక్కడ ఎలాంటి అవినీతి జరగలేదని వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు.. మీరు(జనసేన శ్రేణులు) ఇక్కడికి వచ్చి ఎలాంటి రాజకీయం చేయాల్సిన పనిలేదు. ఇక్కడి నుంచి తక్షణమే వెళ్లిపోవాలని తెగేసి చెప్పారు. ముఖ్యమంత్రి జగనన్న.. ఎలాంటి అవినీతి జరగకుండా, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మాకు ఇళ్లు ఇచ్చారు. దీనిలో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. మీరు వచ్చి ప్రభుత్వం నుంచి డబ్బులు అడగాలని మాకు చెప్పే పనిలేదు. మాకు ఏం కావాలో జగనన్నకు తెలుసు. జగనన్న మాకు అన్ని ఇచ్చారు. ప్రభుత్వాన్ని మేము ఒక్క రూపాయి కూడా అడగము. కావాలంటే మీరే మాకు లక్ష రూపాయలు ఇవ్వాలని కౌంటర్ ఇచ్చారు. దీంతో బిక్కమొహం వచ్చిన జనసేన శ్రేణులు అక్కడి నుంచి వెనుదిగారు. మరోవైపు.. టీడీపీ, జనసేనలపై ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ఫైరయ్యారు. తాజాగా ఎమ్మెల్యే రోశయ్య మీడియాతో మాట్లాడుతూ.. తమ ఉనికి కోసమే టీడీపీ, జనసేన పార్టీలు అబద్ధపు ప్రచారం చేస్తున్నాయి. వైఎస్సార్సీపీకి వస్తున్న ఆదరణను ఓర్పలేకే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి అని అన్నారు. -
శాటిలైట్ సిటీలుగా వైఎస్సార్ జగనన్న నగరాలు
సాక్షి, అమరావతి: పట్టణ పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న టిడ్కో గృహాలు కొత్త పట్టణాలను తలపిస్తున్నాయి. నగరాలు, పట్టణాలకు సమీపంలోని అనువైన ప్రాంతాల్లో జీ+3 విధానంలో నిర్మిస్తున్న అపార్ట్మెంట్లు అన్ని వసతులతో అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలోని 88 యూఎల్బీలలో పేదల కోసం 2,62,212 ఇళ్లను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 163 ప్రాంతాల్లో ఉన్న వీటికి ‘వైఎస్సార్ జగనన్న నగరాలు’గా నామకరణం చేశారు. ప్రాంతాన్ని బట్టి ఒక్కోచోట వెయ్యి నుంచి 12 వేల వరకు ఉన్న ఈ ఇళ్లు శాటిలైట్ సిటీలుగా మారబోతున్నాయి. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లోని టిడ్కో ఇళ్లలో 40 వేలకు పైగా యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అన్ని వసతులతో ఆధునిక ఇళ్లు చక్కటి రోడ్లు, తాగునీరు, మురుగు కాలువలు, ఇళ్లకు విద్యుత్ సౌకర్యం, ఎస్టీపీలు వంటి సకల వసతులతో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తుండటం గమనార్హం. ప్రాంతాన్ని బట్టి ఈ గ్రూప్ హౌస్‌లు వెయ్యి నుంచి 12 వేల వరకు ఉన్నాయి. గుడివాడ, నంద్యాల, కర్నూలు, నెల్లూరు యూఎల్బీల పరిధిలో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లు 10 వేల నుంచి 12 వేల వరకు ఉండటం విశేషం. ఒక్క నెల్లూరు పరిధిలోనే (అల్లిపురం, వెంకటేశ్వరపురం) రెండుచోట్ల మొత్తం 27 వేల ఇళ్లు నిర్మిస్తున్నారంటే అవి ఎంత పెద్ద స్థాయిలో ఉన్నాయో అంచనా వేయవచ్చు. త్వరలో ఈ ప్రాంతాలు శాటిలైట్ సిటీలుగా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. కాగా, గత నెలలో కొందరు యజమానులు వారికి కేటాయించి ఇళ్లలో చేరగా, వచ్చే నెలలో మంచి ముహూర్తాలు ఉండటంతో మిగిలినవారు చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వచ్చే మార్చి నాటికి మొత్తం 2.62 లక్షల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేసే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి అవసరాలను తీర్చేందుకు అవసరమైన సిబ్బంది నియామకం, సరఫరా వంటి పనుల కోసం మునిసిపాలిటీల్లోని ఆయా శాఖల అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎస్టీపీల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గేటెడ్ కమ్యూనిటీలను తలపిస్తున్న ఈ 163 ప్రాంతాల్లోని ఇళ్ల అంతర్గత నిర్వహణకు నివాసితులతో సంక్షేమ సంఘాలను సైతం ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. ఇక నగరాల పరిధి దాటి పంచాయతీల్లో మరో 38 చోట్ల టిడ్కో ఇళ్లు నిర్మించగా, వాటి అవసరాలను తీర్చేందుకు మునిసిపల్ శాఖ పంచాయతీ విభాగంతో సంప్రదింపులు చేపట్టింది. ఇవన్నీ కొద్దిరోజుల్లో కొలిక్కి రావడంతో పాటు ఆయా కొత్త టిడ్కో పట్టణాల అవసరాలను తీర్చేందుకు మార్గం సుగమం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. -
గుంకలాంలో పారని పాచిక
సాక్షి ప్రతినిధి, విజయనగరం/గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విజయనగరంలో ఆదివారం జరిపిన పర్యటన పవన్‌కళ్యాణ్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. స్వయంగా జగనన్న కాలనీని చూసి అక్కడి లబ్ధిదారులతో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించాలని ఆయన వేసిన పాచిక పారలేదు. ‘జగనన్న ఇళ్లు–పేదలకు కన్నీళ్లు’ నినాదంతో ఆ కాలనీలపై సోషల్ ఆడిట్ చేస్తామంటూ విజయనగరం శివారు గుంకలాంలోని జగనన్న కాలనీకి మధ్యాహ్నం 1.30కు వచ్చిన పవన్‌కు అక్కడి లబ్ధిదారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం.. సోషల్ ఆడిట్‌కు ఎవరూ హాజరుకాకపోవడంతో ఆయన కేవలం రోడ్‌షోకే పరిమితమయ్యారు. ఫలితంగా దాదాపు రెండు గంటలపాటు విజయనగరం ప్రధాన రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. చివరకు గుంకలాంలో జగనన్న కాలనీకి చేరుకున్నా, అక్కడ లబ్ధిదారులెవరూ లేకపోవడంతో ఒకటీ రెండు ఇళ్లను మాత్రమే పవన్ మొక్కుబడిగా పరిశీలించారు. తర్వాత కొద్దిమంది పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వంపై, వైఎస్సార్సీపీ నేతలపై ఆరోపణలు చేశారు. యువతను తప్పుదారి పట్టించేలా, రెచ్చగొట్టేలా మాట్లాడారు. ‘గడపగడపకు వచ్చే వైఎస్సార్సీపీ నాయకులను, పనిచేయని నేతలను చొక్కా పట్టుకుని నిలదీయండి. వాళ్లకూ మనకూ సెపరేటు రక్తం ఏమైనా ఉంటుందా? లక్షల మందిని అరెస్టు చేయగలరా? స్వచ్ఛందంగా జైళ్లను నింపేద్దాం. అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించేసి జనసేన జెండాను స్థాపిద్దాం. గుంకలాం జగనన్న కాలనీలో లబ్ధిదారులకు స్థలాలిచ్చేందుకు రైతుల దగ్గర తక్కువ ధరకే కొనుగోలు చేసి ఎకరాకు రూ.30 లక్షల చొప్పున చూపించి రూ.పది వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్ల వరకూ దోచేశారు. దీనిపై మోదీకి స్వయంగా నివేదిక అందజేస్తా. మోదీపై అపార గౌరవం ఉన్నవాడిని. నా మీద కేసులు పెట్టినా భయపడను. నేను చాలా బలంగా ఉంటాను. ఓడిపోయిన వాణ్ణి.. గాయపడ్డవాణ్ణి. దెబ్బతిన్న పులిలా నిలబడ్డాను. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చూపిస్తాను. ఓట్లు రాకపోయినా నామినేషన్ వేస్తాం. నామినేషన్లు వేయకుండా ఆపినా.. బెదిరించినా తాటతీస్తాం. పరిశ్రమలు ఎందుకు రావడంలేదని అడగండి. పిచ్చిపిచ్చి సమాధానాలు చెబితే తిరగబడండి. 2024కు వైసీపీ ప్రభుత్వం పోవాలి, జనసేన ప్రభుత్వం రావాలి. బొత్స జేబులో డబ్బులు ఏమీ ఇవ్వడంలేదు. మనం కట్టిన పన్నుల డబ్బులతో పథకాలు పెడుతున్నారు.’ అని పవన్ అన్నారు. అనంతరం 3.30 గంటలకు పవన్ విశాఖకు బయల్దేరారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో 4.20 గంటలకు హైదరాబాద్ వెళ్లారు. -
మా కాలనీల్లోకి రావొద్దు.. మా ఇళ్లు మాకు కాకుండా చెయ్యొద్దు
మంగళగిరి/కశింకోట/పెంటపాడు: వైఎస్సార్ జగనన్న కాలనీలలో పర్యటించి రాజకీయాలు చేయాలనుకున్న జనసేన నాయకులకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురైంది. తమ నివాసాలలో ఎవరు పర్యటించాల్సిన అవసరంలేదని వెంటనే వెనక్కి వెళ్లాలని కరాఖండిగా చెప్పారు. ఇంకోసారి తమ కాలనీల్లోకి వస్తే మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెబుతామని ముక్తకంఠంతో లబ్ధిదారులు హెచ్చరిస్తున్నారు. ఎక్కడికక్కడ లబ్ధిదారుల నుంచి ఇలా వ్యతిరేకత వస్తుండడంతో జనసేన నేతలు చేసేదిలేక వెనుదిరుగుతున్నారు. రాజకీయాల కోసం రావొద్దు.. వెళ్లిపోండి గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్‌లో నిర్మించిన వైఎస్సార్ జగనన్న కాలనీ (టిడ్కో) ఇళ్లను పరిశీలించేందుకు వచ్చిన జనసేన శ్రేణులకు చేదు అనుభవం ఎదురైంది. వీరి పర్యటనను ముందుగానే తెలుసుకున్న లబ్ధిదారులు సమావేశమై జనసేన నాయకులను అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ పార్టీ నేత చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు టిడ్కో ఇళ్ల సముదాయానికి చేరుకున్నారు. వీరి రాకను గమనించిన లబ్ధిదారులు అనుకున్నట్లుగానే వారిని అడ్డుకున్నారు. తమ ఇళ్లకు అన్ని వసతులు కల్పించి అత్యాధునికంగా తీర్చిదిద్దారని.. గృహప్రవేశాలు కూడా చేసుకున్నామని చెప్పారు. అసలు జనసేన నాయకులు ఎందుకు వచ్చారని నిలదీశారు. రాజకీయాల కోసం ఎవరూ తమ దగ్గరకు రావాల్సిన అవసరంలేదని వెంటనే వెనక్కి వెళ్లాలని కరాఖండిగా చెప్పారు. దీంతో జనసేన శ్రేణులు తాము సమస్యలేమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకే వచ్చామని చెప్పారు. అంతేకాక.. ప్రజాస్వామ్యంలో తమకు ఇలా వచ్చే హక్కు ఉందని కొందరు జనసేన కార్యకర్తలు లబ్ధిదారులైన మహిళలతో వాగ్వాదానికి దిగారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన లబ్ధిదారులు సమస్యలుంటే తమ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్తామని మీరు వెళ్లిపోవాలంటూ మండిపడ్డారు. అలాగే, రాజకీయం చేసి మా పొట్ట కొట్టొద్దని కోరారు. దీంతో ఏంచేయాలో పాలుపోని జనసేన నేతలు లబ్ధిదారులకు దండం పెట్టి వెనుదిరిగారు. అనంతరం.. సి–3 బ్లాక్‌లో ఎఫ్ఎఫ్–8 ప్లాట్‌లో నివాసముంటున్న జనసేన కార్యకర్త ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఇది గమనించిన లబ్ధిదారులు మళ్లీ అక్కడకు చేరుకుని అసలు ఏ ఇంటినీ పరిశీలించాల్సిన అవసరంలేదని వెంటనే వెళ్లిపోవాలని కోరడంతో మరోసారి వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో పట్టణ ఎస్ఐ మహేంద్ర అక్కడకు చేరుకోవడంతో చేసేదిలేక జనసేన శ్రేణులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత పలువురు లబ్ధిదారులు మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల కోసం ఏ పార్టీ పర్యటించినా అడ్డుకుంటామన్నారు. రాజకీయాల కోసం జగనన్న ఇళ్ల వద్దకు వస్తే మాటలతో కాకుండా చేతలతోనే సమాధానం చెబుతామని హెచ్చరించారు. సంతృప్తికరంగానే ఉంటున్నాం.. అలాగే, అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలోని తాళ్లపాలెం శివారు బంగారయ్యపేట, తేగాడ గ్రామాల వద్ద నిర్మిస్తున్న వైఎస్సార్ జగనన్న గృహ నిర్మాణ లేఅవుట్లను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను సమస్యలు చెప్పమని అడిగారు. అయితే, ఇళ్ల స్థలం, ఇళ్లు మంజూరు చేయడంతో సంతృప్తికరంగా నిర్మించుకుంటున్నామని వారు బదులిచ్చారు. తేగాడ లేఅవుట్లో కూడా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం సంతృప్తికరంగా సాగుతుందని బదులివ్వడంతో తాము ఆశించిన ఫలితం రాలేదంటూ జనసేన శ్రేణులు నిరాశతో వెనుదిరిగారు. గోబ్యాక్ నినాదాలతో తోకముడిచిన జనసేన ‘జగనన్న కాలనీలో జనసేన జెండాల ప్రదర్శన తగదు.. మమ్మల్ని సంప్రదించకుండా కాలనీలోకి రావడాన్ని సహించం.. మాకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయి.. జనసేన నేతలు వచ్చి ఇక్కడ కిరికిరీలు పెట్టొద్దు.. జగనన్న ప్రభుత్వం మాకెంతో మేలు చేస్తోంది.. గతంలో ఏ ప్రభుత్వం మాకు ఇళ్లు ఇవ్వలేదు’.. అంటూ పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం దర్శిపర్రు శివారు బిళ్లగుంట జగనన్న కాలనీవాసులు జనసేన శ్రేణులకు అడ్డుతగిలారు. జనసేన గోబ్యాక్ అంటూ మహిళలు నినదించారు. తమకు సీఎం జగనన్న, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నిరకాలుగా అండగా నిలుస్తుంటే ఓర్వలేకపోతున్నారా అని ప్రశ్నించారు. దీంతో జనసేన శ్రేణులు తమ జెండాలను ముడిచి వెనుదిరిగారు. -
మా ఇళ్ల వద్ద ఫొటోలు ఎలా దిగుతారు?: జనసేన నాయకులకు షాక్
పెడన/రాజమహేంద్రవరం రూరల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుపేదల పక్షాన నిలబడి అర్హులకు స్థలాలిచ్చి, ఇళ్లను నిర్మిస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారా? అంటూ జనసేన నేతలను లబ్ధిదారులు నిలదీశారు. రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలోని జనసేన నేతలు రామ్‌సుధీర్, రమాదేవి తదితరులు శనివారం ఉదయం పట్టణ శివారులోని పల్లోటి లేఅవుట్–2 వద్దకు వెళ్లి ఫొటోలు దిగుతున్నారు. అదే సమయంలో అక్కడ ఇళ్లను నిర్మించుకుంటున్న పలువురు లబ్ధిదారులు ఫొటోలు ఎందుకు దిగుతున్నారని ప్రశ్నించారు. దీనిపై జనసేన నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ.. ఇక్కడ వైఎస్సార్సీపీ నాయకులకు, కౌన్సిలర్లకు మాట్లాడే పనిలేదని, మీకు ఇక్కడ ఏం సంబంధం అంటూ నల్లా నాగలక్ష్మి, షాహినాబేగంలను ప్రశ్నించారు. దీంతో వారిద్దరూ ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ‘మీరేం మాట్లాడుతున్నారు.. మేం ఎవరని ప్రశ్నిస్తున్నారేంటి? అసలు మీరెవరు? మా ఇళ్ల దగ్గరకు ఎందుకొచ్చారు? ఫొటోలు ఎందుకు దిగుతున్నారు? లబ్ధిదారులైన మమ్మల్ని ప్రశ్నిస్తున్నారేంటి’ అంటూ ఎదురుతిరిగి గట్టిగా నిలదీశారు. దీంతో.. సమస్యలుంటే చెప్పాలని జనసేన నేతలు కోరారు. సమస్యలేమి లేవని లబ్ధిదారులు గట్టిగా బదులివ్వగా చేసేదిలేక వారు వెనుదిరిగారు. అనంతరం ఒకటో వార్డులోని పైడమ్మ లేఅవుట్ వద్దకు కూడా వారు వెళ్లి తాపీ పనివారితో వాగ్వాదానికి దిగారు. తోపులాట జరగడంతో స్థానికుల జోక్యంతో సద్దుమణిగింది. రాజమహేంద్రవరంలో ఇలా.. మరోవైపు.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బొమ్మూరు టిడ్కో గృహ సముదాయం వద్ద కూడా జనసేన నేతలు ఓవరాక్షన్ చేశారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, సిటీ ఇన్చార్జి అనుశ్రీ సత్యనారాయణ, అర్బన్ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు శనివారం ఉదయం టిడ్కో గృహ సముదాయంలోని కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడున్న మహిళలను ఉద్దేశించి జనసేన నేతలు ‘మిమ్మల్ని ఇప్పుడే పిలిచారా అంటే.. వెంటనే ఆ మహిళలు తమకు ఆగన్టులోనే ఇళ్లు అందజేశారని, కానీ.. తామే ఇంకా దిగలేద’న్నారు. అయినా ఇళ్లను ఎందుకు అప్పగించలేదంటూ అధికారులతో జనసేన నేతలు వాదనకు దిగారు. అక్కడ కొద్దిసేపు నినాదాలుచేసి సీ–బ్లాకు వద్దకు వచ్చారు. అక్కడ ఆ పార్టీ అభిమాని లలితను ఆమె ఫ్లాట్ కాని జీఎఫ్8 వద్ద నిలబెట్టి సమస్యలున్నాయంటూ ఎలక్ట్రానిక్ మీడియాకు చెప్పించారు. తీరా చూస్తే ఇంటి ప్లాన్‌లోనే లేని బాల్కని కావాలని ఆమె సమస్యగా పేర్కొంది. ఆ తర్వాత.. ట్విట్టర్లో పెట్టేందుకు అంటూ మళ్లీ అనుశ్రీ సత్యనారాయణ అక్కడకొచ్చి లలితతో మళ్లీ అదే సమస్య చెప్పించి షూట్ చేశారు. ప్రభుత్వాన్ని అప్రదిష్టపాల్జేస్తున్నారు వారు స్థలాలివ్వరు. ఇచ్చిన వాటిని సక్రమంగా చూపడంలేదు. పక్కనే చెరువులను చూపి ఫొటోలు దిగుతూ చెరువుల్లో స్థలాలు ఇచ్చారంటూ టీవీలకు చెబుతున్నారు. ఇలా ప్రభుత్వాన్ని ఆప్రదిష్టపాలు చేయాలని చూస్తున్నారు. – నల్లా నాగలక్ష్మీ, లబ్ధిదారురాలు, పెడన వారికేంటి సంబంధం? మా స్థలాల వద్దకు వచ్చి మీకు సంబంధంలేదని ఎలా అంటారు? పార్టీలకు అతీతంగా అందరికి ఇళ్ల స్థలాలిస్తే వీరికి వచ్చిన బాధ ఏమిటో? మరీ ఇంత అన్యాయంగా ఫొటోలు దిగి టీవీలకు ఫోజులిస్తుంటే వారిని ఏమనాలి? – షాహినాబేగం, లబ్ధిదారురాలు, పెడన -
YSR Jagananna Colonies: గూడు కట్టిన అభిమానం
అద్దె కట్టే స్థోమత లేదు..సొంతిళ్లు కట్టించారు నా పేరు లక్ష్మీ దేవి, మాది కడప నగరం నానాపల్లె. నెలకు రూ. 5వేలు అద్దె కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. పిల్లలను రెక్కల కష్టంపై పోషించుకుంటూ ఉండేవాళ్లుం. మాకు సొంతిళ్లు సమకూరుతుందా అని అనుకునే వాళ్లం. జగనన్న నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇంటి స్థలం మంజూరు చేశారు. అందులో ఇళ్లు కట్టుకొని అనందంగా ఉన్నాం. జగనన్న మేలు మరిచిపోలేం నాపేరు రేష్మా. మాది కడపలోని బిస్మిలా నగర్. నా భర్త కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తు.. భారమైనా ఇంటికి అద్దె కట్టుకుంటూ వచ్చాం. జగనన్న పుణ్యమా అని లక్షల విలువ చేసే స్థలం ఇచ్చారు. ప్రభుత్వం రూ. 1.80 లక్షలు మంజూరు చేసింది. ఎస్ఆర్జీఈఎస్ ద్వారా రూ.30 వేలు, డ్వాక్రా సంఘం నుంచి రూ. లక్ష వడ్డీ రాయితీపై రుణం ఇచ్చారు. ఈ నగదుతో ఇళ్లు కట్టుకున్నాం. దాదాపు రూ. 10 లక్షల విలువైన ఇంటికి యజమానిని చేసిన జగనన్న మేలు మరచిపోలేం. జగననన కాలనీల్లో సౌకర్యాలు బాగున్నాయి నాపేరు అయేషా. మాది కడప నగరం, బిస్మిల్లా నగర్ .ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద ప్రజలకు ఇంటి స్థలం ఇచ్చి అదుకున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పటికీ మరచిపోలేం. అన్ని రకాల సౌకర్యాలతో జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి అదుకున్నారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: చిరు సంపాదనతో అద్దె చెల్లిస్తూ అవస్థలు పడే పేద వాడి గుండెలో సంబరం గూడు కట్టుకుంది. వారి సొంతింటి కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజం చేశారు.జిల్లాలోని 529 జగనన్న కాలనీలో పేదల ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే కొందరు లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీటి సౌకర్యం, విద్యుత్ లైన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసి పేద ప్రజల సొంతింటి కలను సాకారంచేసేలా కృషి చేస్తోంది.దీంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 529 జగనన్న కాలనీల్లో 1,18,605 మందికి ఇంటి స్థలాలు జిల్లాలో ఏర్పాటైన 529 జగనన్న కాలనీల్లో దాదాపు 1,18,605 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 68,808 గృహాలను రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోగా, 37,625 బేస్మెంట్ దశలో ఉన్నాయి. 25,625 గృహాలు బేస్మెంట్ పూర్తి చేసుకోగా,రూఫ్ లెవెల్లో 2789, రూఫ్ లెవెల్ పూర్తయినవి 2094 ఉన్నాయి. 595 గృహాలు పూర్తయ్యాయి. సొంత స్థలంలో ఇంటి నిర్మాణాన్ని చేపట్టిన వారిలో మొత్తం లబ్ధిదారులు 30,210 మంది ఉండగా, 7586 గృహాలు బేస్‌మెంట్‌లోపు ఉన్నాయి. 4676 బేస్మెంట్ పూర్తి చేసుకున్నాయి. రూఫ్ లెవెల్లో 3010, రూఫ్ పూర్తయిన గృహాలు 5354 ఉన్నాయి. అలాగే 6129 గృహాలు పూర్తయ్యాయి. కొత్త ఊర్లను తలపిస్తున్న గృహ సముదాయాలు జగనన్నకాలనీలోని గృహసముదాయాలు కొత్త ఊర్లను తలపిస్తున్నాయి. ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటిస్థలాలు అందజేయడంతో వాటిని నిర్మించుకునే పనిలో లబ్ధిదారులు నిమగ్నమయ్యారు. అంతేకాకుండా ప్రభుత్వం విలువైన స్థలాలను అందజేయడంతో ప్రజలు ఆనందంగా తమ ఇళ్లను నిర్మించుకుంటున్నారు. పేదల కళ్లలో కనిపిస్తున్న అనందం ఇన్నాళ్లు అద్దె ఇళ్లలో బాడుగకు ఉంటూ కాలాన్ని వెళ్లదీస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేశారు. ఇంటి నిర్మాణానికి రూ. 1.80 లక్షలు ఉచితంతోపాటు స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ. 30 వేలు, డ్వాక్రా రుణం కింద మరో రూ. లక్ష రుణాన్ని వడ్డీ రాయితీతో మంజూరు చేశారు. దీంతో ప్రజలు తమకు కావాల్సిన రీతిలో ఇంటి నిర్మించుకుంటున్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. -
AP: గృహ యజ్ఞం.. పేదల సొంతింటి కల సాకారం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గూడు లేని లక్షల మంది పేదలు సొంతింటి యజమానులు అవుతున్నారు. రెండు దశల్లో 21.25 లక్షలకుపైగా (టిడ్కో ఇళ్లతో కలిపి) గృహ నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. పేదల ఆవాసాల కోసం దాదాపు రూ.1.06 లక్షల కోట్లను వ్యయం చేస్తూ అక్క చెల్లెమ్మల చేతికి విలువైన స్థిరాస్తిని కానుకగా అందచేస్తోంది. ఇది ఎంత పెద్ద యజ్ఞమంటే.. 30.25 లక్షల మంది పేదలకు 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.56,102.91 కోట్లు వెచ్చించింది. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.36,026 కోట్లు ఖర్చు చేస్తుండటంతో ఏకంగా కొత్త పట్టణాలే తయారవుతున్నాయి. ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర వాటా కింద చెల్లింపులతోపాటు ఇతర రాయితీల రూపంలో రూ.13,758 కోట్లను ప్రభుత్వమే భరిస్తోంది. సకల సదుపాయాలతో నిర్మిస్తున్న ఒక్కో ఇంటి విలువ సగటున కనీసం రూ.10 లక్షల వరకు ఉంటుందని అంచనా. కొన్ని చోట్ల ఖరీదైన ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను అందిస్తున్న నేపథ్యంలో వీటి విలువ మరింత అధికంగా ఉండే అవకాశం ఉంది. మొత్తమ్మీద పేదల గృహ నిర్మాణాల ద్వారా రూ.2.5 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల మేర సంపదను సృష్టిస్తోంది. మరోవైపు పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలను కొనసాగించి పనులు కల్పించడం ద్వారా కోవిడ్ సమయంలోనూ ఆర్థిక కార్యకలాపాలు మందగించకుండా ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించింది. డిసెంబర్‌కు ఐదు లక్షల ఇళ్లు.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం నిరుపేద కుటుంబాలకు వరంగా మారింది. దశాబ్దాలుగా గూడు లేక అవస్థలు పడుతున్న లక్షల మందికి ఊరటనిస్తోంది. పథకం కింద రెండు దశల్లో 21.25 లక్షల ఇళ్లను మంజూరు చేయగా 17.24 లక్షల గృహ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి నిర్మాణం 2024 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ఏడాది డిసెంబర్ 21 కల్లా ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, టిడ్కో ఇళ్లు 1.5 లక్షలు ఈ గడువులోగా పూర్తి చేసేలా గృహ నిర్మాణ శాఖ కసరత్తు చేస్తోంది. ఒకవైపు ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతూనే మరోవైపు కనీస సదుపాయాల కల్పన పనులను ప్రభుత్వం కొనసాగిస్తోంది. నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లకు చకచకా కరెంట్, నీటి సరఫరా కనెక్షన్లు సమకూరుస్తోంది. మనిషికి కనీస అవసరాలైన కూడు, గూడు, దుస్తులు లాంటి కనీస అవసరాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అయితే స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా రాష్ట్రంలో లక్షల కుటుంబాలకు నిలువ నీడ లేదు. ఆ నిరుపేదల గోడును 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా విన్నారు. నేను ఉన్నానని హామీ ఇచ్చారు. మాట మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. పథకం ద్వారా ఏకంగా 30.25 లక్షల మంది నిరుపేదలకు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో ఏకంగా ఊళ్లనే నిర్మిస్తూ ఓ మహాయజ్ఞాన్ని తలపెట్టారు. దీన్ని చూసి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబులో ఆందోళన మొదలైంది. ఆయన అధికారంలో ఉండగా రాష్ట్రంలో పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. పారదర్శకంగా పక్కా ఇళ్లను నిర్మించిన పాపాన పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ మహాయజ్ఞం పూర్తయితే ఇక తనకు రాజకీయ భవిష్యత్తే ఉండదని ఓ నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలు, నాయకుల ద్వారా కోర్టులకెక్కి పలు అడ్డంకులు సృష్టించారు. అయితే ప్రభుత్వ దృఢ సంకల్పం ముందు ఆ పాచికలు పారలేదు. దీంతో తాజాగా దత్తపుత్రుడిని రంగంలోకి దింపి డిజిటల్ క్యాంపెయిన్ పేరిట పేదల ఇళ్లపై బురద జల్లే మరో కార్యక్రమానికి టీడీపీ తెర తీసింది. దర్జాగా ఉంటున్నాం నా భర్త, నేను వ్యవసాయ కూలీలం. ఇద్దరు పిల్లలు. సొంతిల్లు లేదు. అద్దె కట్టే స్తోమత లేక బంధువుల ఇంట్లో ఉండేవాళ్లం. ఇల్లు పైకప్పు సరిగా లేక వర్షాలు పడినప్పుడు అవస్థలు ఎదుర్కొన్నాం. టీడీపీ హయాంలో ఇంటి స్థలం కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా రాలేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మొదటి దరఖాస్తుకే స్థలం, ఇంటిని కూడా మంజూరు చేశారు. రూ.1.80 లక్షలు ఇచ్చారు. ఇంటి నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు దర్జాగా సొంతింట్లో ఉంటున్నాం. – షేక్ ఫాతిమాబీ, ఫణిదం, సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా సదుపాయాలన్నీ కల్పించారు.. సొంతిల్లు లేక చాలా ఏళ్లు ఇబ్బంది పడ్డాం. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద దరఖాస్తు చేసుకోవడంతో గ్రామం వెలుపల స్థలం కేటాయించారు. ఊరికి దూరంగా ఇవ్వడంతో భయపడ్డాం. ఇంటి నిర్మాణానికి చేయూత ఇవ్వడంతో పాటు కాలనీలో విద్యుత్, తాగు నీరు తదితర సదుపాయాలన్నీ సమకూర్చారు. మా జగనన్న లేఅవుట్లో 400 మందికిపైగా పేదలు ఇళ్లు కట్టుకున్నారు. – పి. దుర్గాదేవి, జేగురుపాడు, కడియం మండలం, తూర్పుగోదావరి రూ.3 లక్షల విలువైన స్థలం జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మాకు రూ.3 లక్షల విలువైన స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల యూనిట్‌కు గానూ ఇప్పటి వరకు రూ.48వేల బిల్లు వచ్చింది. కాలనీలో వసతులు కల్పిస్తున్నారు. – కొల్లి కనకమ్మ, కొత్తమూలకుద్దు, అనకాపల్లి జిల్లా గతంలో ఎన్నడూ చూడలేదు పేదలకు పక్కా ఇళ్ల కోసం సీఎం జగన్ తీసుకున్న చర్యలు గతంలో ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు. జగనన్న కాలనీలో నాకు స్థలం కేటాయించారు. నిర్మాణ బిల్లులు కూడా సకాలంలో అందించారు. ఇప్పటికే ఇల్లు పూర్తి కావచ్చింది. జగనన్న ప్రభుత్వంలో అర్హతే కొలమానంగా లబ్ధి చేకూరుతోంది. కాలనీలో విద్యుత్, రహదారులతోపాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పన వేగంగా చేపడుతున్నారు. – మండల్ క్రిష్ణ, నగర పంచాయతీ పాలకొండ మూడు దశాబ్దాల కల మూడు దశాబ్దాలుగా అద్దె ఇళ్లలో ఉంటున్నాం. సీఎం జగన్ ప్రభుత్వం మా సొంత ఇంటి కలను నెరవేరుస్తోంది. రూఫ్ లెవల్ వరకు నిర్మాణం పూర్తయ్యింది. రూ.50 వేల వరకు బిల్లు కూడా వచ్చింది. – జంగం అన్నపూర్ణ, మంత్రాలయం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే మాది పశ్చిమ గోదావరి జిల్లా. 30 ఏళ్ల కిందట పుట్టపర్తికి వలస వచ్చాం. మూడు దశాబ్దాలు అద్దె ఇంట్లోనే ఉన్నాం. ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ సొంతింటి కల మాత్రం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాతే నెరవేరింది. పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లి వద్ద జగనన్న కాలనీలో ఇల్లు ఇచ్చారు. నిర్మాణం పూర్తయింది. – కె. భానుమతి, పుట్టపర్తి ఇన్నాళ్లకు కల నెరవేరింది ఉప్పలూరు గ్రామానికి 13 ఏళ్ల క్రితం వచ్చాం. సొంత స్థలం లేదు. ఎన్నో సార్లు అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ స్థలం కోసం తిరిగినా రాలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఉప్పలూరు లే అవుట్‌లోనే స్థలం కేటాయించారు. ఇంటి నిర్మాణం పూర్తి చేసి గృహ ప్రవేశం కూడా చేశాం. ఎన్నో ఏళ్లకు సొంతింటి కల తీరింది. చాలా ఆనందంగా ఉంది. కాలనీలో తాగునీటి సరఫరా సమృద్ధిగా ఉంది. – పోసిన శివనాగమల్లేశ్వరి, ఉప్పలూరు, కంకిపాడు మండలం, కృష్ణాజిల్లా పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం చేస్తున్న వ్యయం ఇలా ► 30.25 లక్షల మందికి 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పంపిణీకి– రూ.56,102.91 కోట్లు ► వైఎస్సార్ జగనన్న కాలనీల్లో సదుపాయాల కల్పన కోసం రూ.36,026 కోట్లు (ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి వీలుగా తాత్కాలిక సదుపాయాలకు రూ.3,117 కోట్లు, శాశ్వత సదుపాయాల కోసం రూ.32,909 కోట్లు) ► లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా కింద చెల్లింపులు, ఇతర రాయితీల రూపంలో రూ.13,758 కోట్లు (రూ.15 వేల విలువ చేసే ఇసుకను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. రూ.40 వేల విలువైన సిమెంట్, ఇనుము, ఇతర నిర్మాణ సామగ్రిని మార్కెట్ ధరల కన్నా తక్కువకు రాయితీతో సరఫరా చేస్తోంది.) జగనన్న కాలనీల్లో శాశ్వత సదుపాయాల కల్పన వ్యయం రూ.కోట్లలో నీటి సరఫరా– 4,128 విద్యుత్, ఇంటర్నెట్– 7,989 డ్రైనేజీ, సీవరేజ్– 7,227 రోడ్లు, ఆర్చ్‌లు– 10,251 పట్టణ ప్రాంత లేఅవుట్లలో వసతుల కల్పన – 3,314 ఇళ్ల నిర్మాణాలకు చేసిన ఖర్చు (2021–22, 2022–23 ఆర్థిక సంవత్సరాలకు గానూ ఇప్పటి వరకూ) లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు– రూ.6149,10,54,963 నిర్మాణ సామగ్రి– రూ.1629,99,83,047 ఇతర ఖర్చు– రూ. 656,68,14,937 మొత్తం– రూ.8435,78,52,947 రూ.10 లక్షల ఇంటికి యజమాని అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన తాకాసి దేవీ సత్యనారాయణ కుటుంబం చాలా ఏళ్లుగా అద్దె ఇంట్లో జీవనం సాగిస్తోంది. టీడీపీ హయాంలో ఎన్నిసార్లు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా కనికరించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి అర్జీ పెట్టుకున్నారు. ఏ ఆఫీస్ చుట్టూ తిరగలేదు. కొద్ది రోజులకే స్థలం మంజూరై ఇంటి పట్టా అందింది. ఇప్పుడు ఇంటి నిర్మాణం కూడా పూర్తైంది. రూ.10 లక్షల విలువ చేసే ఆస్తిని సీఎం జగన్ అందించారని ఆ కుటుంబం సంతోషంగా చెబుతోంది. ఫిబ్రవరిలో గృహప్రవేశం అంబేడ్కర్ కోనసీమ జిల్లా బుల్లియ్యరేవుకు చెందిన వి.రమాదుర్గ వాలంటీర్ కాగా ఆమె భర్త కార్పెంటర్. ఇద్దరి సంపాదన నెలకు రూ.20 వేల లోపే. ఇంటి అద్దె, పిల్లల చదువులు, ఇతర అవసరాలకు సంపాదన సరిపోక అవస్థలు ఎదుర్కొన్నారు. అక్కడ సెంటు స్థలం రూ.3 లక్షల పైమాటే ఉండటంతో సొంతిల్లు కలేనని రమాదుర్గ వేదనకు గురయ్యేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ద్వారా ఆమెకు ఉచితంగా ఇంటి స్థలం అందింది. గృహ నిర్మాణానికి ఆర్థిక సాయం అందడంతో వేగంగా కొనసాగుతోంది. ఇటీవల స్లాబ్ కూడా వేశారు. ప్రస్తుతం గోడలకు ప్లాస్టింగ్, ఇతర పనులు జరుగుతున్నాయి. వచ్చే ఫిబ్రవరికి ఇంటి నిర్మాణం పూర్తవుతుందని, ఆ నెలలో మంచి రోజులు ఉన్నందున గృహ ప్రవేశం చేస్తామని రమాదుర్గ చెబుతోంది. ఆమెతో పాటు బుల్లియ్యరేవులోని వైఎస్సార్ జగనన్న లేఅవుట్లో పేదలకు ప్రభుత్వం 170 ఇళ్లను మంజూరు చేసింది. 60 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి కాగా మిగిలినవి వేగంగా కొనసాగుతున్నాయి. -
కొల్లేరు గ్రామాల్లో సరికొత్త మార్పు..
కైకలూరు: కొల్లేరు గ్రామాల్లో ఇప్పుడు అభివృద్ధి పరుగులు పెడుతోంది. గతంలో ఇక్కడి ప్రజల అమయాకత్వాన్ని ఆసరా చేసుకుని టీడీపీ నాయకులు అభయారణ్యాన్ని అందినకాడికి దోచుకున్నారు. అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారు. దీంతో కొల్లేరు లంక గ్రామాలు సంపూర్ణ వైఎస్సార్ జగనన్న గ్రామాలుగా ప్రకటించుకుని కృతజ్ఞత తెలుపుతున్నాయి. భారీ ఎత్తున వైఎస్సార్సీపీలోకి చేరుతున్నారు. రాష్ట్రంలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 12 మండలాల పరిధిలో 2,22,300 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. దాదాపు మూడున్నర లక్షల మంది జీవిస్తున్నారు. కొల్లేరు అభయారణ్యంగా 5 కాంటూరు వరకు 77,138 ఎకరాలు గుర్తించారు. వీటి పరిధిలో 122 పరివాహక గ్రామాలు ఉన్నాయి. జిల్లాల పునర్విభజనతో కొల్లేరు గ్రామాలన్నీ ఏలూరు జిల్లా గూటికి చేరాయి. కొల్లేరు ప్రజలు ముఖ్యమంత్రి జగన్ మూడేళ్ళ పాలన చూసి తమ గ్రామాలను సంపూర్ణ వైఎస్సార్ జగనన్న గ్రామాలుగా ప్రకటించుకుంటున్నాయి. ఇందుకు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం నాంది పలికింది. కైకలూరు మండలం శృంగవరప్పాడు, చటాకాయి, పందిరిపల్లిగూడెం, మండవల్లి మండలం కొవ్వాడలంక, చింతపాడు, పులపర్రు గ్రామాలు జగనన్న గ్రామాలుగా మారాయి. ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్)కు గ్రామంలో ఘన స్వాగతం పలికి, ముకుమ్మడిగా వైఎస్సార్సీపీలో చేరారు. ఇటీవల జరిగిన నియోజకవర్గ ప్లీనరీకి కూడా వేలాదిగా కొల్లేరు ప్రజలు హాజరవడం విశేషం. గడప గడపకు కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది. కొల్లేరు ప్రజలకు మేలు ఇలా.. స్వచ్ఛ కొల్లేరు సాకారంలో భాగంగా ఉప్పుటేరుపై రూ.412 కోట్లతో మూడు రెగ్యులేటర్లు నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. ఇదే జరిగితే సముద్రపు ఉప్పునీరుని అరికట్టడంతో పాటు కొల్లేరులో నిత్యం నీరు ఉంటూ చేపల వేటకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర వడ్డీలు వెల్ఫేర్ డెవలప్మెంటు కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్‌పర్సన్‌గా సైదు గాయత్రీ సంతోషికి అవకాశం కల్పించారు. రూ.4 కోట్లతో కొల్లేరు రీ సర్వేకు సిద్ధం చేశారు. కొల్లేరు కాంటూరు వారిగా సర్వే పూర్తయితే 70 వేల ఎకరాలు మిగులు భూమిగా వెల్లడవుతుంది. ఇక బాహ్యప్రపంచానికి కొల్లేరు గ్రామాలను అనుసంధానం చేసే కొల్లేటికోట పెద్దింట్లమ్మ వారధిని రూ.14.70 కోట్లతో చేపట్టారు. కులమతాలకు అతీతంగా పథకాల లబ్ధి పార్టీలు, కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను కొల్లేరు లంక గ్రామాల్లో అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వాలు కొల్లేరు ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయి. కొల్లేరుకు అది చేస్తాం.. ఇది చేస్తాం అంటూ మోసం చేశాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారు. సంపూర్ణ వైఎస్సార్ జగనన్న గ్రామాలుగా మరిన్ని మారడానికి సిద్ధంగా ఉన్నాయి. – దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) ఎమ్మెల్యే కొల్లేరుకు న్యాయం సీఎం జగన్‌తోనే సాధ్యం కొల్లేరు ప్రాంత ప్రజలకు నిజమైన న్యాయం ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డితోనే సాధ్యమవుతుంది. ఒక మహిళగా నాకు రాష్ట్ర వడ్డీలు కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు. గతంలో ఈ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యే మా సామాజికవర్గం అయినా కనీసం గ్రామాలను పట్టించుకోలేదు. రానున్న రోజుల్లో అన్ని కొల్లేరు గ్రామాలు జగనన్న గ్రామాలుగా మారతాయి. – సైదు గాయత్రీ సంతోషి, రాష్ట్ర వడ్డీలు వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్పర్సన్ వైఎస్సార్సీపీపై పూర్తి నమ్మకం ఉంది సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయి. ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కొల్లేరు గ్రామాల్లో పర్యటించి మా సమస్యలు తెలుసుకుంటున్నారు. మా గ్రామల్లో అందరికి పథకాలు చేరుతున్నాయి. ఇటీవల కొల్లేరులో వేటకు కొత్త లైసెన్సు ఇచ్చారు. సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ అందించారు. వైఎస్సార్సీపీపై పూర్తి నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నాం. – జయమంగళ తిరుపతి వెంకన్న, సర్పంచ్, కొవ్వాడలంక, మండవల్లి మండలం -
టిడ్కో ఇళ్లకు సంక్షేమ సంఘాలు
సాక్షి, అమరావతి: పట్టణ పేద ప్రజల కోసం నిర్మిస్తున్న టిడ్కో ఇళ్ల మెరుగైన నిర్వహణకు ‘రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు’ ఏర్పాటు చేయనున్నారు. సొసైటీల చట్ట నిబంధనలకు అనుగుణంగా ఇవి ఏర్పాటు కానున్నాయి. మొత్తం 88 యూఎల్బీల్లో 2,62,212 ఇళ్లను జీ+3 అంతస్తులతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 163 ప్రాంతాల్లో ఉన్న వీటిని వైఎస్సార్ జగనన్న నగరాలుగా వ్యవహరిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి ఒక్కోచోట వెయ్యి నుంచి 11,500 ఇళ్ల వరకు నిర్మిస్తున్నారు. ఇవి అపార్టుమెంట్లే అయినప్పటికీ ఒక్కో ప్రాంగణం చిన్న తరహా పట్టణాన్ని తలపిస్తోంది. దీంతో ప్రతి వెయ్యి నివాసాలకు ఒక కమిటీ చొప్పున సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చెత్త సేకరణ, వీధిలైట్లు, తాగునీటి సరఫరా, ఎస్టీపీల నిర్వహణ లాంటి పనులను స్థానిక మున్సిపాలిటీలే నిర్వర్తిస్తాయి. అంతర్గత నిర్వహణను యజమానులకే అప్పగిస్తారు. అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో మాదిరిగా టిడ్కో ఇళ్లకు సంక్షేమ సంఘాల కమిటీలు ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇళ్లకు ఈ తరహా కమిటీల ఏర్పాటు ఇదే తొలిసారి. ఈ మేరకు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ కమిషనర్లతో పాటు ఆర్జేడీలకు ఏపీ టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ లేఖ పంపారు. కమిటీల విధులపై నివాసితులతో చర్చించి ఈనెల 10లోగా నివేదిక ఇవ్వాలని సూచించారు. గృహ నిర్మాణ రంగంపై ఇటీవల గుజరాత్లో నిర్వహించిన సదస్సుకు హాజరైన టిడ్కో అధికారులు అక్కడ అపార్ట్మెంట్ల నిర్వహణను పరిశీలించి ముసాయిదా సిద్ధం చేశారు. కాగా, అక్టోబరు చివరి నాటికి 40,575 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మెరుగ్గా అంతర్గత నిర్వహణ.. కమిటీలు ఉంటే అంతర్గత నిర్వహణ సులభతరమవుతుంది. కారిడార్లు, ప్రాంగణాల నిర్వహణ, మోటార్ల నిర్వహణ లాంటివి ఇళ్ల యజమానులే పర్యవేక్షించేందుకు కమిటీలు ఉంటే మంచిది. ఇవి ఏకరీతిన ఉండాలని భావిస్తున్నాం. రాష్ట్రంలో 2.62 లక్షలకు పైగా టిడ్కో ఇళ్లు నిర్మిస్తున్నాం. ప్రతి వెయ్యి నివాసాలకు ఒక కమిటీ చొప్పున మొత్తం 262 రెసిడెన్షియల్ వెల్ఫేర్ కమిటీలు ఏర్పాటవుతాయి. తద్వారా దేశంలో ఈ తరహా కమిటీలను నియమించిన తొలి రాష్ట్రం ఏపీ అవుతుంది. – చిత్తూరి శ్రీధర్, టిడ్కో ఎండీ -
డిసెంబర్ 23 నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి
కర్నూలు(సెంట్రల్): రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీల్లో డిసెంబర్ 23 నాటికి 5 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతాయని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. కర్నూలు కలెక్టరేట్లో గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 21 లక్షల ఇళ్లు మంజూరు చేసినట్టు తెలిపారు. మూడో ఆప్షన్ కింద ఇళ్లు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకొస్తే లబ్ధిదారులతో ఎంవోయూ చేయిస్తామన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.15 లక్షలు ఖర్చుచేస్తుండగా.. ఇందులో రూ.1.80 లక్షలు సబ్సిడీ పోగా, మిగిలిన రూ.35 వేలను లబ్ధిదారుడికి పావలా వడ్డీ కింద ఇప్పిస్తామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కింద ప్రజా ప్రతినిధులు 15 వేల సచివాలయాల పరిధిలో తిరిగి వివిధ పనుల కోసం ప్రతిపాదనలు పంపారని, వాటిలో 3,344 పనులకు ఆమోదం తెలిపామని, ఇందులో 2,317 పనులు ప్రారంభమయ్యాయని కూడా చెప్పారు. -
ఇళ్ల నిర్మాణాలకు రోజుకు రూ.23 కోట్ల ఖర్చు
కర్నూలు(అర్బన్): రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ జగనన్న లేఅవుట్లలో గృహ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రోజు రూ.23 కోట్లు ఖర్చు చేస్తున్నదని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతిని సమీక్షించేందుకు ఆయన బుధవారం కర్నూలు వచ్చారు. జిల్లా కలెక్టర్ పీ కోటేశ్వరరావుతో కలిసి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణాల్లో పురోగతి చూపితే రోజుకు రూ.50 కోట్లు కూడా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత ఏడు నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ‘నవరత్నాలు–పేదలందరికి ఇళ్లు’ కార్యక్రమంలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలను వచ్చే ఎనిమిది నెలల్లోపు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇంటి పట్టాలను ఇవ్వడం జరిగిందని, ఇందులో మొదటి విడతలో 18 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామని వివరించారు. -
కోలాహలంగా టిడ్కో గృహప్రవేశాలు
కర్నూలు (సెంట్రల్): వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని పట్టణ పేదలకు రూపాయికే 300 చదరపు అడుగుల టిడ్కో గృహాలను మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేసి కానుకగా ఇస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1.45 లక్షల గృహాలకు రాష్ట్ర ఖజానాపై అదనంగా రూ.10,400 కోట్ల భారం పడిందన్నారు. అయినా వైఎస్ జగన్ సర్కారు పేదల కోసం ఈ భారాన్ని భరిస్తోందని తెలిపారు. ఇప్పటివరకు 30 వేల గృహాలను అందజేసినట్లు చెప్పారు. సోమవారం కర్నూలులో వైఎస్సార్ జగనన్న నగర్లో టిడ్కో గృహ ప్రవేశాల కార్యక్రమం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కార్మిక శాఖ మంత్రి జయరాం ముఖ్యఅతిథులుగా హాజరై దాదాపు 5 వేల మంది లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ టిడ్కో గృహాల్లో 300 చదరపు అడుగులకు టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదట రూ.500 కడితేనే రిజిస్ట్రేషన్ చేసే వారని తెలిపారు. తరువాత ఆ ఇంటికి రూ.2.62 లక్షలు అప్పు ఇప్పించే వారన్నారు. దీనిని 20 ఏళ్లపాటు లబ్ధిదారులు నెలకు రూ.3 వేల చొప్పున మొత్తం రూ.12 లక్షలు చెల్లించాల్సి వచ్చేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పేదలపై మోపిన ఈ భారాన్ని ప్రభుత్వం తనపై వేసుకుందని అన్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు కేవలం ఒక్క రూపాయికే టిడ్కో గృహాన్ని పేద మహిళలకు ఆస్తిగా ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కోసం చంద్రబాబు 2018లో టిడ్కో గృహాల నిర్మాణం ప్రారంభించగా ఎక్కడా పూర్తి కాలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.4,500 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ టీడీపీ నేతలు, ఎల్లో మీడియా తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. గ్యాస్, పెట్రోలు, నిత్యావసరాల ధరలు పెరగడానికి, తమ ప్రభుత్వానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ బాదుడే బాదుడుకు బదులుగా ఏడుపే ఏడుపు కార్యక్రమాన్ని చేపడితే మంచిదని సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ రామయ్య, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, సుధాకర్, వై.సాయిప్రసాద్‌రెడ్డి, కలెక్టర్ పి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఫుల్ స్పీడ్‌తో ఇళ్లు
రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలందరికీ పక్కా ఇళ్లను నిర్మించి అందచేసే నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ నిధులు సక్రమంగా విడుదల చేస్తున్నాం. పేదల గృహ నిర్మాణ పనులను వేగంగా కొనసాగించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల నిర్మాణాల్లో వేగం మరింత పెరగాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. విశాఖలో ఇప్పటికే ఇళ్ల స్థలాలు ఇచ్చిన నేపథ్యంలో గృహ నిర్మాణాలను త్వరగా చేపట్టాలని నిర్దేశించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో కనీస సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. అర్హులందరికీ ఇవ్వాల్సిందే.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇప్పటికే 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఇటీవలే విశాఖలో 1.24 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం. ఈ ఇళ్ల నిర్మాణాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలి. ఇళ్ల నిర్మాణంతోపాటు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో సమాంతరంగా కనీస సదుపాయాల కల్పన పనులపై దృష్టి పెట్టాలి. డ్రైనేజీ, నీరు, విద్యుత్తు లాంటి కనీస సదుపాయాలు కల్పించాలి. ప్రతి దశలోనూ నాణ్యతపై దృష్టి పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దు. కాలనీల్లో ఇంకా ఎక్కడైనా ల్యాండ్ లెవలింగ్, ఫిల్లింగ్, అంతర్గత రోడ్లు, గోడౌన్ల నిర్మాణ పనులు మిగిలిపోతే వేగంగా పూర్తి చేయాలి. ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్లు లేఅవుట్లలో ఇటుకల తయారీ యూనిట్లు, ఇతర ఏర్పాట్లు చేసుకున్నారో లేదో పర్యవేక్షించాలి. లబ్ధిదారుల సహాయార్థం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి. ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుపేదలకు కేటాయించిన స్థలాన్ని నిర్దిష్టంగా చూపించి పట్టా, సంబంధిత డాక్యుమెంట్లన్నీ అందచేయాలి. ఇళ్ల పట్టాల మంజూరులో ఎలాంటి జాప్యం జరగటానికి వీల్లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలం మంజూరు కావాల్సిందే. సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్వ సదుపాయాలతో టిడ్కో ఇళ్లు పట్టణ పేదల కోసం నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లను పూర్తి సదుపాయాలతో లబ్ధిదారులకు అందించాలి. లబ్ధిదారుల పేర్లతో ఇళ్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలి. ఇప్పటికే 75 వేల ఇళ్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. మరో 73 వేల ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాలి. మొత్తం 1.48 లక్షల ఇళ్లను లబ్ధిదారుల పేర్లతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు త్వరగా మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలి. నిర్మాణాల్లో పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేస్తాం. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలి. టిడ్కో ఇళ్ల నిర్వహణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. నిర్వహణ మెరుగ్గా ఉండేలా మార్గదర్శకాలు రూపొందించాలి. వేగంగా ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణం విశాఖలో పేదల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, అక్టోబరు చివరి నాటికి మొదలవుతాయని అధికారులు తెలిపారు. మరోవైపు ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పనుల ప్రగతిపై సమీక్ష, సందేహాల నివృత్తికి వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని అక్కడ నుంచే కల్పించినట్లు తెలిపారు. 15 నుంచి 20 రోజుల్లోగా 1.4 లక్షల టిడ్కో ఇళ్లు అన్ని సదుపాయాలతో సిద్ధమవుతాయని వెల్లడించారు. ఇళ్ల స్థలాల కోసం అందిన దరఖాస్తులను పరిష్కరించి 2,03,920 మందిని అర్హులుగా నిర్ణయించి ఇప్పటికే లక్ష మందికి పట్టాలు అందచేసినట్లు వెల్లడించారు. మిగతా వారికీ ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దొరబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక, ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్షి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ భరత్ గుప్తా, సీసీఎల్ఏ కార్యదర్శి ఏ.బాబు తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. -
పేదల పొదరిల్లు
జిల్లాలో ప్రతిష్టాత్మకంగా సకల సౌకర్యాలతో జగనన్న ఇళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. గతంలో పేదలకు ఇంటి స్థలాలు నివాస యోగ్యం కాని కొండలు, గుట్టల ప్రాంతాల్లో ఇచ్చే వారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాలమైన రోడ్లు, పార్కులు, పాఠశాలలు, ఆస్పత్రులు, ఇతర సామాజిక అవసరాల కోసం స్థలాలు కేటాయించి.. అభివృద్ధి పరిచిన ప్లాట్లలో స్థలాలు ఇచ్చింది. పేదల కోసం కట్టిన ఇళ్లు చూస్తే అవి బలహీన వర్గాల ఇళ్లని తెలిసి పోయేవి. జగనన్న కాలనీల్లో ఇళ్లు పేదల పొదరిల్లు తలపిస్తున్నాయి. ఏకంగా ఊళ్లే ఆవిష్కృతమవుతున్నాయి. నెల్లూరు (అర్బన్): వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పేదలందరికీ పక్కా ఇళ్లు పథకం ద్వారా నిర్మితమవుతున్న కలల సౌధాలతో కొత్త ఊళ్లు వెలుస్తున్నాయి. జిల్లాలో తొలిదశలో సకల సౌకర్యాలతో 282 లేఅవుట్లు నిర్మించారు. 58,070 ఇళ్లు మంజూరు అయ్యాయి. అయితే లేఅవుట్ల స్థలాలపై కొంత మంది కోర్టులకు వెళ్లడం, నవంబర్ నుంచి జనవరి వరకు భారీ వర్షాలు కురవడం, వరదలు రావడం వల్ల ఇళ్ల నిర్మాణాలకు కొంత అంతరాయం కలిగింది. ప్రస్తుతం కోర్టు కేసులు తొలగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. అధికారులు దగ్గరుండి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు సాయపడుతున్నారు. జగనన్న లే అవుట్లలో పూర్తి సౌకర్యాలు టీడీపీ పాలనలో సొంత నివేశన స్థలం ఉన్న వారికే ఇళ్లు మంజూరు చేసేది. ప్రజలకు ఎక్కడా నివేశన స్థలాలు ఇచ్చిన పాపాన పోలేదు. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థలం మంజూరుతో పాటు ఇంటిని కూడా మంజూరు చేసింది. ఇందు కోసం లే అవుట్లను ఏర్పాటు చేశారు. లే అవుట్లంటే సాదా.. సీదాగా కాకుండా అక్కడ సకల సౌకర్యాలు కల్పించారు. చెట్టూ, పుట్టా తొలగించి భవిష్యత్ అవసరాల కోసం బడి, గుడి వంటి వాటి కోసం కొంత రిజర్వు స్థలాన్ని సిద్ధం చేశారు. విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి కరెంట్ సౌకర్యం కల్పించారు. తాగునీటి ఇబ్బంది లేకుండా ముందస్తుగా పైపులైన్లు ఏర్పాటు చేశారు. రోడ్లకిరువైపులా మొక్కలు నాటి జగనన్న కాలనీలు (లేఅవుట్లు)ను అందంగా తీర్చిదిద్దారు. రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల ఆస్తి సొంతం జిల్లాలో 282 లేఅవుట్లకు సంబంధించి మొత్తం రూ.1,320 కోట్ల ఆస్తిని ప్రజలకు జగనన్న ఇళ్ల రూపంలో అందిస్తున్నారు. ప్రభుత్వం నివేశన స్థలం ఇవ్వడమే కాకుండా అక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో ఆ స్థలానికి డిమాండ్ పెరిగింది. నెల్లూరు నగరం, కోవూరు కావలి, ఆత్మకూరు, కందుకూరు తదితర పట్టణాల్లో ఏర్పాటు చేసిన స్థలం, ఇంటి నిర్మాణం విలువ కలుపుకుంటే రూ.15 లక్షల ఆస్తి లబ్ధిదారుడి సొంతమవుతోంది. పట్టణాలకు కొంచెం దూరంగా ఉన్న చోట జగనన్న ఇంటి విలువ రూ.10 లక్షల వరకు లబ్ధిదారుడికి సొంతమవుతోంది. కోవూరు సమీపంలో నిర్మాణం పూర్తయిన ఇల్లు లబ్ధిదారుల ఖాతాల్లో రూ.223 కోట్లు జమ ఇప్పటి వరకు లబ్ధిదారులు పూర్తి చేసిన నిర్మాణాలకు రూ.228 కోట్లు బిల్లులు రావాల్సి ఉండగా రూ.223 కోట్లు చెల్లించారు. ఆప్షన్ 3 కింద లబ్ధిదారుల ప్రమేయం లేకుండా కాంట్రాక్టర్లు ఇళ్ల నిర్మాణాలు చేపట్టే దగ్గర కొంత మంది బ్యాంకు ఖాతాలు తెరవకపోవడంతో మరో రూ.5 కోట్లు మాత్రమే జమ కావాల్సి ఉంది. ఇంటి నిర్మాణాలకు పొదుపు మహిళలకు మెప్మా, డీఆర్‌డీఏల ద్వారా రూ.35 వేలు బ్యాంకు రుణాలు అందిస్తున్నారు. ఇంటి నిర్మాణాలకు ఉచితంగా ఇసుక, తక్కువ ధరకే సిమెంట్, స్టీల్ ఇవ్వడంతో సుమారుగా అదనంగా రూ.44 వేల లబ్ధి చేకూరుతోంది. దీంతో లబ్ధిదారుడి కష్టం, ప్రభుత్వ సాయంతో ఇళ్లను వడి వడిగా పూర్తి చేసుకుంటున్నారు. సొంతింటి కల తీరనుంది నేను అద్దె ఇంట్లో ఉంటున్నాను. సొంతిల్లు లేదు. ఎన్నో ఏళ్లుగా స్థలం కోసం దరఖాస్తు చేసుకుంటున్నప్పటికీ గత ప్రభుత్వాలు నాకు స్థలం ఇవ్వలేదు. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం ఇంటి స్థలం పట్టా ఇవ్వడమే కాకుండా, ఇంటిని సైతం మంజూరు చేశారు. నిర్మాణం పూర్తి కావస్తోంది. సొంతిల్లు కల నెరవేరబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. – ప్రమీల, పండ్ల వ్యాపారి, గాంధీ గిరిజన సంఘం వేగంగా ఇళ్లు పూర్తి చేస్తున్నాం ప్రస్తుతం కోర్టు అడ్డంకులు తొలగిపోయాయి. జూన్, జూలై నెలల్లోనే వేగంగా ఇంటి నిర్మాణాలు పూర్తి చేస్తాం. లబ్ధిదారుల ఖాతాల్లో వారం, వారం బిల్లులు జమ అవుతున్నాయి. బిల్లులు పెండింగ్ లేవు. దీంతో లబ్ధిదారులు మరింత ఉత్సాహంగా ఇంటి నిర్మాణం చేస్తున్నారు. – నరసింహం, ప్రాజెక్టు డైరెక్టర్, హౌసింగ్ కార్పొరేషన్ -
AP: జగనన్న కాలనీ ఇళ్లకు.. ఉదారంగా రుణాలు
సాక్షి, అమరావతి: నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు నిర్మాణానికి ఎటువంటి షరతుల్లేకుండా రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకులు ముందుకు వచ్చాయి. ఈ పథకం కింద ఇంటి రుణం తీసుకునే వారికి సిబిల్ స్కోర్ (రుణం తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది) నుంచి కూడా మినహాయిస్తూ రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) తాజాగా నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ జగనన్న కాలనీల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 30.75 లక్షల మంది పేదలకు సొంతింటి కలను నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. కానీ, దీనికి గృహ రుణం మంజూరులో కీలకమైన సిబిల్ స్కోర్ అడ్డంకిగా మారింది. ఇదే విషయాన్ని గత ఎస్ఎల్బీసీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల దృష్టికి తీసుకెళ్లింది. ప్రైవేటు బ్యాంకులతో సహా అన్ని బ్యాంకులు జగనన్న కాలనీలకిచ్చే ఇంటి రుణాలను సిబిల్ స్కోర్ నుంచి మినహాయించాలని కోరింది. ఈ అంశాన్ని పరిశీలించిన ఎస్ఎల్బీసీ.. ఏపీ టిడ్కో, పీఎంఏవై, వైఎస్సార్ జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్లకు ఇచ్చే రుణాలను సిబిల్ స్కోర్ నుంచి మినహాయింపునిస్తూ ఆదేశాలు జారీచేసింది. కానీ, అప్పటికే బ్యాంకుకు రుణం ఎగ్గొట్టిన వారికి ఈ మినహాయింపు వర్తించదు. 1.20 లక్షల మందికి లబ్ధి పేద ప్రజల ఇంటి రుణాలకు సిబిల్ స్కోర్ నుంచి మినహాయింపు ఇవ్వడంతో 1,19,968 మందికి ప్రయోజనం చేకూరనుంది. ఏపీ టిడ్కో పథకం కింద 2.62 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉండగా అందులో 300 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉన్న ఇంటిని ప్రభుత్వం ఒక రూపాయికే అందిస్తోంది. 365, 435 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇళ్లకు బ్యాంకులు రుణం మంజూరు చేస్తున్నాయి. ప్రస్తుతం 1,19,968 ఇళ్లు బ్యాంకుల ఆర్థిక సహాకారంతో నిర్మాణంలో ఉన్నట్లు ఎస్ఎల్బీసీ అధికారులు వెల్లడించారు. ఒక్కో ఇంటికి సగటున రూ.2.65 లక్షల చొప్పున మొత్తం రూ.4,107.93 కోట్ల రుణాన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటివరకు 87,756 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 46,330 మందికి రూ.1,389.90 కోట్ల రుణాలను మంజూరయ్యాయి. ఇప్పుడు సిబిల్ స్కోర్ మినహాయింపు ఇవ్వడంతో రుణ మంజూరు వేగంగా జరుగుతుందని బ్యాంకు అధికారులు తెలిపారు. మరోవైపు.. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించుకునే ఇళ్లకు ప్రభుత్వం రూ.35,000 వరకు పావలా వడ్డీకే రుణం మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. -
సొంతింటి కల సాకారం
బాపట్ల ప్యాడిసన్‌పేటలో 50 ఎకరాల కుపైగా విస్తీర్ణంలో 1,865 ప్లాట్లతో ఏర్పాటైన వైఎస్సార్ జగనన్న కాలనీ లేఅవుట్ అది. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో అందమైన ఇంటిని కట్టుకున్న పి.సుకన్య కుటుంబం ఇటీవలే గృహ ప్రవేశం కూడా చేసింది. కత్తిపూడి – ఒంగోలు హైవే పక్కనే ఉండటంతో ఇక్కడ భూముల ధరలు చుక్కల్లో ఉన్నాయి. కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్న ఆమె భర్త జీతం పిల్లల చదువులకే చాలక ఇన్నాళ్లూ అద్దె ఇంట్లో ఎంతో ఇబ్బంది పడ్డారు. ఖరీదైన ప్రాంతంలో ప్రభుత్వం ఆమెకు ఉచితంగా ఇంటిని అందచేయడంతో ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు తమ ఇంటికి ఆడుకునేందుకు స్నేహితులు వస్తున్నారని ఆమె కుమారుడు ఆనందంగా చెప్పాడు. సాక్షి, అమరావతి: అద్దె ఇళ్లలో ఏళ్ల తరబడి అవస్థలు పడ్డ అక్కచెల్లెమ్మలకు రూ.లక్షల విలువైన స్థిరాస్తి ఉచితంగా సమకూరుతోంది. పేదలకు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలిచ్చి గృహాలను కూడా నిర్మిస్తుండటంతో అద్దె ఇళ్ల కష్టాలకు శాశ్వతంగా తెరపడుతోంది. విలువైన ప్రాంతాల్లో కలల సౌధాలను ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శరవేగంగా సాకారం చేస్తుండటంతో హర్షం వ్యక్తమవుతోంది. దేశంలోనే తొలిసారిగా 31 లక్షలకుపైగా ఇళ్ల స్థలాలను అందచేసి గృహ నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. మొదటి దశలో రూ.28,084 కోట్లతో 15,60,227 ఇళ్ల నిర్మాణం చేపట్టగా వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మరోపక్క సొంతిల్లు లేని పట్టణ పేదలు సగర్వంగా జీవించేలా అన్ని వసతులతో దాదాపు 2.62 లక్షల టిడ్కో ఇళ్లను ప్రభుత్వం సమకూరుస్తోంది. మూడేళ్లలో రూ.5,646.18 కోట్లతో పనులు చేపట్టడమే కాకుండా ఇటీవల మరో రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. ఉచితంగా రిజిస్ట్రేషన్లను సైతం చేస్తోంది. గత మూడేళ్లలో 1,13,324 టిడ్కో ఇళ్లు పూర్తికాగా మరో 63 వేలకు పైగా యూనిట్ల పనులు 75శాతం పూర్తయ్యాయి. ఖరీదైన ప్రాంతాల్లో కలల సౌధాలు జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన బాపట్లలో ప్యాడిసన్‌పేట లే అవుట్‌కు అర కి.మీ దూరంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఏర్పాటు కానుంది. ఎన్‌హెచ్ 216 విస్తరణ జరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడ ప్రైవేట్ లేఅవుట్లలో సెంటు స్థలం రూ.7 లక్షల వరకూ పలుకుతోంది. బాపట్ల పరిధిలోనే మూలపాలెం వద్ద 1,054 ప్లాట్లు, వెస్ట్ బాపట్లలో 658 ప్లాట్లతో మరో రెండు వైఎస్సార్ జగనన్న లేఅవుట్లు ఉన్నాయి. ఇవి జమ్ములపాలెం వద్ద నూతనంగా నిర్మిస్తున్న బాపట్ల మెడికల్ కళాశాలకు 2 కి.మీ.లోపే ఉంటాయి. ఇక్కడ సెంటు స్థలం రూ.5 లక్షల పైమాటే. విలువైన ప్రాంతాల్లో స్థలాలను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు, పొదుపు సంఘాల ద్వారా పావలా వడ్డీ రుణాలు ఇప్పిస్తోంది. డిసెంబర్ నాటికి అన్నీ అందించేలా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే 300 చ.అ. విస్తీర్ణంలో నిర్మిస్తున్న 1.43 లక్షలకుపైగా టిడ్కో ఇళ్లను నిరుపేదలకు ఒక్క రూపాయికే అందించి రిజిస్ట్రేషన్ సైతం ఉచితంగానే చేసిచ్చారు. 365, 430 చ.అడుగుల ఇళ్లను 50 శాతం సబ్సిడీకే అందిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వంపై మరో రూ.4,250 కోట్లు అదనపు భారం పడుతున్నా వెనుకాడలేదు. డిసెంబర్ నాటికి మొత్తం ఇళ్లను లబ్ధిదారులకు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తోంది. 30 ఏళ్లు గుడిసెలోనే.. పూరిగుడిసెలో 30 ఏళ్లు గడిపాం. ఎండాకాలం అగ్ని ప్రమాదం జరగడంతో తీవ్రంగా నష్టపోయాం. మా దుస్థితి చూసి బంధువులు కూడా వచ్చేవారు కాదు. ఇప్పుడు ప్రభుత్వం ఆ కష్టాల నుంచి విముక్తి కల్పించింది. నేడు మాకంటూ ఓ సొంత ఇల్లు ఉంది. – క్రిష్ణమ్మ, శెట్టిపల్లె, చిత్తూరు జిల్లా రూపాయికే రిజిస్ట్రేషన్ చేసిచ్చారు మాకు టిడ్కో ఇల్లు మంజూరైంది. గతంలో రూ.2.55 లక్షలు కట్టమన్నారు. జగన్ బాబు వచ్చాక ఆ డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా రూపాయికే రిజిస్ట్రేషన్ చేసిచ్చారు. ఇక్కడ అన్ని వసతులున్నాయి. – అట్ల విజయలక్ష్మి, నెల్లూరు అదే ఇల్లు ఉచితంగా.. గత ప్రభుత్వ హయాంలో 300 చ.అ టిడ్కో ఇంటికి రూ.2.65 లక్షలు కట్టమన్నారు. జగనన్న వచ్చాక అదే ఇంటిని రూపాయికే ఇవ్వడంతో పాటు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేశారు. అన్ని వసతులు కల్పించారు. – కాకుమాను వరలక్ష్మి, శ్రీకాకుళం అర్హులందరికీ ఇళ్లు స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా నిలువ నీడ లేని పేదలు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు. అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటిని సమకూర్చటాన్ని సీఎం జగన్ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. – జోగి రమేశ్, గృహ నిర్మాణ శాఖ మంత్రి -
ఇళ్లు కాదు.. ఊళ్లు: అవధులు లేని సంతోషం.. సీఎం జగన్ మేలు మరిచిపోలేం..
ఒకప్పుడు పేదల కోసం ఇళ్లు నిర్మిస్తున్నారని అనేవారు.. ఇప్పుడు ఆ వాక్యం మారిపోయింది. వైఎస్ జగన్ పాలన ప్రారంభమైన తర్వాత పేదల కోసం ఇళ్లు కాదు.. ఏకంగా ఊళ్లు నిర్మిస్తున్నారు.. ఆ ఊళ్లు కూడా వేయి కాదు రెండు వేలు కాదు.. ఏకంగా 17 వేల దాకా రాబోతున్నాయి. దీన్నే పేదలందరికీ ఇళ్ల పథకం అంటారు.. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా వాటిలో ఉచితంగా ఇళ్లు కట్టిస్తున్నారు. దాంతో ఈ పథకం రెండు దశలు పూర్తయ్యేలోగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 31 లక్షల కుటుంబాల సొంత ఇంటి కల నెరవేరబోతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ప్రతి విషయంలోనూ నాణ్యత వుండేలా చూస్తున్నారు. ఎక్కడికక్కడ చకచకా పనులు జరిగిపోతున్నాయి. చదవండి: ఏపీ ప్రభుత్వ సంకల్పం.. పింఛను నుంచి ఇంటి పట్టాల దాకా ప్రజా సంకల్ప యాత్రలో ఇల్లులేని నిరు పేదల కష్టాలు చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తాను అధికారంలోకి వస్తే అర్హులైన వారందరికీ ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ.. అధికారంలోకి రాగానే పేదలందరికీ ఇళ్ల పథకం మొదలుపెట్టారు. ఇప్పటికే ప్రభుత్వం లక్షలాది మంది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చింది. కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం పనులు జరిగిపోతున్నాయి. అద్దె ఇళ్లలో వుంటూ నెల నెలా అద్దెలు కట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నవారు, గుడిసెల్లో నివసిస్తూ పక్కా ఇంటి కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నవారు ఇప్పుడు తమ తమ ఇంటి నిర్మాణాల్లో బిజీ అయిపోయారు. నిర్మాణం పూర్తి కాగానే శుభ ఘడియలు చూసుకొని గృహ ప్రవేశం చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా పల్లపు ఆనందపురంలో ఇంతకాల అద్దె ఇంట్లో నివసిస్తున్న ప్రసాద్ దంపతులు ఈ మధ్యనే ఈ ఇంట్లోకి వచ్చారు. మేస్త్రీ పని చేసే ప్రసాద్ ఆ పని ద్వారా పది మందికి ఇళ్లు కట్టిస్తున్నారు తప్ప ఇంతకాలం ఈయనకంటూ సొంత ఇళ్లు వుండేది కాదు. ఇదే గ్రామంలో వేయి రూపాయలు అద్దె చెల్లిస్తూ అద్దె ఇంట్లో నివసిస్తూ వుండేవాడు. ఒక వైపు అద్దె బాధలు, మరో వైపు అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ ఇక సొంతంగా ఇళ్లు కట్టుకోవడం కష్టమనుకుంటున్న దశలో వీరికి శుభవార్త అందింది. చదవండి: విప్లవాత్మక నిర్ణయం.. వారి కళ్లలో ఆనందం వివాహమైన తర్వాత ఎనిమిదేళ్లుగా నానా ఇబ్బందులు పడ్డ ఈ జంట ఇప్పుడు కాస్త ధైర్యంగా సంతోషంగా వుంది. పేదలు అందరికీ ఇళ్ల పథకం కింద గ్రామంలో ప్రధాన రహదారికి ఆనుకొని విలువైన స్థలం కేటాయించారని ...అందులో ఇళ్లు కట్టుకోవడానికి సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు అందరూ కలిసి చక్కగా సహకరించారని నాగిని చెబుతున్నారు. ప్రసాద్ స్వయంగా మేస్త్రీ కావడంతో నిర్మాణ పని కూడా చాలా సులువుగా, అందంగా జరిగిపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న పథకాలు సమాజంలోని పేదలకు చక్కగా ఉపయోపడుతున్నాయని మహిళలు మరింత బాగా లబ్ధి పొందుతున్నారని నాగిని చెబుతోంది. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మంచాల గ్రామంలో వీర్ల వెంకయ్య, సామ్రాజ్యం దంపతులు జీవిస్తున్నారు. వీరిని చూస్తే తెలుస్తుంది. వీరు ఎంత పేదవారో.. ఈ పేద దంపతులు ప్రస్తుతం నివసిస్తున్న ఈ గుడిసె శిథిలావస్థకు చేరుకుంది. కూలీ పనులు చేసుకునే వీరయ్య దంపతులు చెరువుకట్ట పక్కనే గుడిసె వేసుకొని దశాబ్దాలుగా ఇక్కడే జీవిస్తున్నారు. ఇదే గుడిసెలోనే కొడుకు కోడలు మనుమడు మనుమరాలు కూడా వీరితోనే వుంటున్నారు. వర్షం వస్తే గడిసెలోకి నీరు వస్తుంది. గట్టిగా గాలి వస్తే పై కప్పు ఎగిరిపోతుంది..అయినా సరే గత్యంతరం లేని పరిస్థితుల్లో నలభైసంవత్సరాలుగా ఇలాగే కాలం గడిపిన వీరయ్య దంపతులకు వైఎస్ జగన్ పాలనలో మంచిరోజులు వచ్చాయి. ఎందుకంటే వీరికోసం ఇదిగో మనం చూస్తున్న ఈ నాణ్యమైన విలువైన పక్కా గృహం సిద్దమవుతోంది. గ్రామవార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత ఇలాంటి పేదల జీవితాలు మారిపోతున్నాయనడానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాలంటీర్లు స్వయంగా వీరి దగ్గరకు వచ్చి వీరికొచ్చే పథకాలను వివరించి వీరికి మార్గదర్శనం చేస్తున్నారు. వీర్ల వెంకయ్య విషయంలో కూడా ఇదే జరిగింది.. మీకు స్థలమొస్తోంది. అందులో ఇళ్లు కడతారు అని గతంలో చెప్పినప్పుడు ఈ పేద దంపతులు నమ్మలేదు. కానీ చేతికి పట్టా రావడం, ఆ పట్టా తాలూకా స్థలంలో ఇళ్లు కడుతుండడం చూసేసరికి వీరికి ఇది కలా నిజామా అనిపిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఎంతో ఉన్నతమైన పథకం పేదలందరికీ ఇళ్ల పథకం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడున్నరదశాబ్దాలు అవుతున్న ఈ తరుణంలో ఇంకా గుడిసెల్లోనే నివసించే పేదలు కనిపించడం దురదృష్టకరం. వీరి జీవితాల్లో మార్పులు తేవాలని వీరు నాణ్యమైన జీవితాలు గడపాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహా సంకల్పం. ఈ మంచాల గ్రామాన్నే తీసుకుంటే ఈ గ్రామంలో ఇళ్లు లేని పేద కుటుంబాలు 76 వున్నాయి. వీరికోసం కోటి రూపాయలు ఖర్చు చేసి ఎకరం 86 సెంట్ల భూమిని కొనుగోలు చేసి ఆ తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ ఇళ్లు నిర్మించారు. ప్రస్తుతం మౌలిక సదుపాయాలను కల్పించే పనిని చేస్తున్నారు. త్వరలో వీర్ల వెంకయ్య కుటుంబంతోపాటు ఇతర లబ్ధిదారులు ఈ ఇళ్లలో గృహ ప్రవేశం చేయనున్నారు. కూలీ పనులు చేసుకునేవారు సంపాదించే కూలీడబ్బులు ఏ రోజుకు ఆ రోజు పొట్టపోసుకోవడానికే సరిపోతోంది.. ఎంతో కొంత మిగిలితే ఆ మిగిలిన డబ్బు అత్యవసర సమయాల్లో ఖర్చయిపోతుంటుంది. దాంతో ఇలాంటి వేలాది కుటుంబాలు సొంతంగా ఇళ్లు కట్టుకోవడమనేది కలలో జరిగే విషయమే. ఇలాంటప్పుడే ప్రభుత్వం అండదండలందించి పథకాలందించి వీరిని అన్ని విధాలా బలోపేతం చేయాలి. వీరి తలరాతలు మార్చాల్సి వుంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అదే పని జరుగుతోంది. లక్షలాది కుటుంబాలు అభివృద్ధి బాటలో పడ్డాయి. అటు పథకాల ద్వారా ఇటు సొంతిళ్ల ద్వారా వేలాది కుటుంబాలు దారిద్య్ర రేఖను దాటబోతున్నాయి. ఇంతకాలం పడ్డ కష్టాలు ఒక్కటొక్కటిగా తొలగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా లక్షలాది రూపాయల విలువైన ఆస్తికి మహిళలు యజమానులవుతున్నారు. మహిళా సాధికారతకు సరికొత్త నిర్వచనం ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ సర్కార్ వేస్తున్న అడుగులు లక్షలాది కుటుంబాల్లో వెలుగు దీపాలవుతున్నాయి. ఇది పైలా అప్పారావు, భవాని దంపతుల ఇల్లు. పేదలందరికీ ఇళ్ల పథకం కింద వీరు నిర్మించుకున్న గృహమిది. విశాఖనగరం శ్రీనివాసనగర్‌లో రోడ్డు పక్కనే ఈ ఇల్లు వుంది. ఇంతకాలం అద్దె ఇంట్లో వున్న అప్పారావు దంపతులు ఇప్పుడు తమకంటూ సొంత ఇల్లు సంపాదించుకున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఇల్లు కట్టుకోలేమో అనే బెంగతో చాలా కాలంపాటు తీవ్ర మానసిక వేదన అనుభవించిన వీరు ఇప్పుడు సంతోషంగా వున్నారు. విశాఖలాంటి మహానగరంలో ఒక చిన్న గూడు లభించదనే ఆనందం ఈ చిన్న కుటుంబంలో స్పష్టంగా కనిపిస్తోంది. అప్పారావు భవానీలది కులాంతర వివాహం. దాంతో వీరు కొంతకాలంపాటు తమ పెద్దవాళ్ల కోపానికి గురయి ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఇరు వైపు కుటుంబాలనుంచి సమస్యలు లేవు. అదే సమయంలో ఈ జంటకు సొంత ఇల్లు సమకూరింది. పిల్లలకు అమ్మ ఒడి పథకం కూడా అందుతోంది. ఇంటినిర్మాణ సమయంలో వచ్చిన సమస్యల్ని వైఎస్సార్ సీపీ నేతలు, గ్రామవార్డు సచివాలయాల సిబ్బంది అందరూ కలిసి పరిష్కరించారని భవానీ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. విశాఖ జిల్లా నుంచి చిత్తూరు జిల్లాకు వద్దాం..మనం చూస్తున్న ఈ జగనన్న ఇళ్ల కాలనీ తవణంపల్లి మండలం అరగొండలో వుంది. ఎటు చూసినా చకచకాఇళ్ల నిర్మాణం జరిగిపోతోంది. స్థానికంగా ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న నూరుల్లా చాలా కాలంగా అద్దె ఇంట్లోనే వుండేవాడు. ఆటో మీద వచ్చే ఆదాయంనుంచే అద్దె కట్టుకుంటూ మిగిలిన డబ్బుతో కుటుంబాన్ని పోషించేవాడు. ఈ పేద కుటుంబం బతకడమే కష్టంగా వున్న తరుణంలో పేదలందరికీ ఇళ్ల పథకం అందుబాటులోకి వచ్చింది. నూరుల్లా భార్య హసీనా పేరు మీద స్థలం, ఇళ్లు వచ్చాయి. అరగొండలోనే జయరాజ్, వనిత దంపతులు తమ ఇంటిని నిర్మించుకుంటూ కనిపించారు. వీరిది కూడా పేద కుటుంబమే ..జయరాజ్ పెయింటర్‌గా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్లు రావడంతో ఈ దంపతులిద్దరూ కలిసి తామే దగ్గరుండి కట్టుకుంటున్నారు. కుదిరిన మేరకు పనులన్నీ చకచకా చేసుకుంటున్నారు. ఇక్కడ ఇళ్ల నిర్మాణం పండగలాగా కొనసాగుతోంది. ప్రభుత్వం అన్నీ సమకూరుస్తుండడంతో, నిర్మాణానికి కావాల్సిన నీటి సౌకర్యం కూడా కల్పించడంతో ఎక్కడికక్కడ పనులు సులువుగానే జరిగిపోతున్నాయి. ఇక్కడ ఇళ్లు కట్టుకుంటున్న వారిలో కవిత కుటుంబం కూడా వుంది. కవిత భర్త సతీష్ తోపుడు బండి పెట్టుకొని ఉపాధిపొందుతున్నారు. ఇలాంటి ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షలదాకా నిర్మాణమవుతున్నాయి. వీటిని కట్టడంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇతర ముఖ్య అధికారులు సమన్వయంతో పని చేస్తూ ఈ పనులు నాణ్యంగా కొనసాగేలా చూస్తున్నారు. వేలాది జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కల్పన కూడా చకచకా సాగిపోతోంది. ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున మొదలుపెట్టిన ఈ మహాయజ్ఞం కారణంగా వేలాది కుటుంబాలకు సొంత ఇళ్లు రావడమే కాకుండా లక్షలాదిమందికి ఉపాధి పనులు కూడా లభిస్తున్నాయి. -
‘హౌసు’ ఫుల్లు..!
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది నిరుపేద అక్క చెల్లెమ్మల సొంతింటి కలలు నెరవేరుతున్నాయి. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో తొలిదశ ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ‘నవరత్నాలు–పేదలం దరికీ ఇళ్లు’ పథకం కింద 31 లక్షల మందికిపైగా పేదలకు ప్రభుత్వం పక్కా గృహాలను నిర్మిస్తోంది. తొలిదశలో 15.60 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఈ ఏడాది పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ.13,100 కోట్లు వెచ్చిం చనుండటంతో నిర్మాణాలు జోరందుకున్నాయి. ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా 1.54 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా కోసం రూ.1,121.12 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రాయితీ కింద ఇచ్చే 3.46 లక్షల మెట్రిక్ టన్నుల స్టీల్ కోసం రూ.2,425.50 కోట్లు, 35 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్ సరఫరాకు రూ.1,575.27 కోట్లు వ్యయం కానుంది. మిగిలిన నిధులను బిల్లుల చెల్లింపులు, ఇతర అవసరాలకు వెచ్చించనున్నారు. రాయితీపై నిర్మాణ సామగ్రి ఒక్కో ఇంటి నిర్మాణానికి ఉచితంగా 20 టన్నుల ఇసుక సరఫరా చేస్తున్నారు. రాయితీపై మార్కెట్ ధర కన్నా తక్కువకు 140 బస్తాల సిమెంట్, 480 కిలోల ఐరన్ సహా ఇతర సామగ్రిని ప్రభుత్వమే సమకూరుస్తోంది. గతంలో 90 బస్తాల సిమెంట్ ఇవ్వగా ఇప్పుడు అదనంగా మరో 50 బస్తాలు ఇస్తున్నారు. అదనపు చేయూత సొంతిళ్లు నిర్మించుకునే అక్క చెల్లెమ్మలకు అదనంగా చేయూతనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకుల ద్వారా స్వయం సహాయక బృందాల మహిళలకు పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేస్తున్నారు. రూ.35 వేల నుంచి ఆ పైన రుణ సాయం అందుతోంది. ఇప్పటివరకూ 3,59,856 మంది లబ్ధిదారులకు రూ.1,332.09 కోట్ల రుణం మంజూరైంది. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అత్యధికంగా చిత్తూరులో 69,170, అనంతపురంలో 49,918, తూర్పు గోదావరిలో 36,462 మంది రుణాలు పొందారు. లబ్ధిదారులపై భారం తగ్గించేలా ఊరికి దూరంగా ఉండే లేఅవుట్లలోకి సిమెంట్, ఐరన్, ఇతర సామాగ్రి తరలింపు భారం లబ్ధిదారులపై పడకుండా స్థానికంగా గోడౌన్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. 66 పెద్ద లేఅవుట్లలో గోడౌన్ల నిర్మాణం చేపట్టగా ఇప్పటికే 47 అందుబాటులోకి వచ్చాయి. ఇటుకల తయారీ యూనిట్లు కూడా లే అవుట్లలోనే ఏర్పాటు చేసి తక్కువ ధరలకు సరఫరా చేసేలా చర్యలు చేపట్టారు. ఆప్షన్–3 ఇళ్లపై పర్యవేక్షణ.. ప్రభుత్వమే నిర్మించే ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. 3.27 లక్షల మంది లబ్ధిదారులు ఆప్షన్–3ను ఎంచుకోగా గ్రూపులుగా విభజించి కాంట్రాక్టర్ల ద్వారా నిర్మాణాలు చేపడుతున్నారు. మొత్తం 25,430 గ్రూపులు ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రూపులో కనీసం పదిమంది లబ్ధిదారులు ఉంటారు. వెయ్యి ఇళ్లకు ఒక వార్డు అమెనిటీ సెక్రటరీని కేటాయించి ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తున్నారు. లేఅవుట్ల నుంచే హాజరు నమోదుకు వీరికి అవకాశం కల్పిస్తున్నారు. రుణాల మంజూరుకు బ్యాంకులు, ఇతర అధికారులతో సమన్వయంతో వ్యవహరించే బాధ్యత అప్పగించారు. నున్నలో నిర్మిస్తున్న పాపాయమ్మ ఇల్లు వేగంగా నిర్మాణాలు పేదల ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లబ్ధిదారుల కోసం లే అవుట్లలోనే ఇటుకల తయారీ యూనిట్లతో పాటు సామగ్రి రవాణా భారం లేకుండా గోడౌన్లు నిర్మించాం. ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి వెయ్యి ఇళ్లకు అమెనిటీ సెక్రటరీ, లే అవుట్‌కు డిప్యూటీ ఈఈలను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తున్నాం. – అజయ్‌జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కష్టాలు తీరాయి.. కూలి పనులు చేసుకుంటూ మా అమ్మతో కలసి ఎన్నో ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నా. గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్తు దరఖాస్తు చేసుకున్నా నిరాశే ఎదురైంది. ఇప్పుడు ఇంటి స్థలం రావడంతోపాటు నిర్మాణం కూడా పూర్తైంది. సుదీర్ఘ కల నెరవేరుతోంది. నా కష్టాలు తీరాయి. – ఇందూరి మంగతాయమ్మ, చెరువుకొమ్ముపాలెం, ఎన్టీఆర్ జిల్లా మరో 40 రోజుల్లో.. శ్రీకాళహస్తిలో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నా. సంపాదనలో చాలావరకు అద్దెలకే ఖర్చవుతోంది. గతంలో ఇంటిపట్టా కోసం ఎంతో ప్రయత్నించినా రాలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక వలంటీర్ మా ఇంటికే వచ్చి వివరాలు నమోదు చేసుకున్నాడు. మాకు స్థలం, ఇల్లు మంజూరైంది. మరో 40 రోజుల్లో ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. – రెడ్డిపల్లి సుబ్రహ్మణ్యం, ఊరందూరు, తిరుపతి జిల్లా సొంతింట్లోకి దర్జీ కుటుంబం.. దర్జీగా పనిచేసే నా భర్త సంపాదనతో ఇద్దరు పిల్లలను చదివించి అద్దెలు కట్టేందుకు ఎంతో అవస్థ పడేవాళ్లం. మాకు స్థలంతో పాటు ఇల్లు మంజూరైంది. తక్కువ ధరకే సిమెంటు, ఐరన్, ఇతర సామాగ్రి ఇవ్వడంతో ఇంటిని నిర్మించుకున్నాం. – రహీమా, బైరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లా గృహ ప్రవేశం చేశాం ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు మంజూరు చేశారు. రాయితీపై సిమెంట్ అందించారు. గృహ ప్రవేశం కూడా చేశాం. చాలా సంతోషంగా ఉంది. సీఎం జగన్ మాకు సొంత గూడు సమకూర్చారు. – ఇస్సాకుల శేషారత్నం, నేమాం, కాకినాడ జిల్లా రేకుల షెడ్డు నుంచి.. చక్కెర కర్మాగారంలో కూలీగా పనిచేసే నా భర్త సంపాదనలో నెలకు రూ.4 వేలు ఇంటి అద్దెకు ఖర్చయ్యేవి. ఒకదశలో అద్దె భారాన్ని భరించలేక ఫ్యాక్టరీ సమీపంలోని రేకుల షెడ్డులో తలదాచుకున్నాం. ఇప్పుడు మాకు ప్రభుత్వం సొంత గూడు కల్పించింది. ఈ ఏడాది జనవరిలో ఇంటి నిర్మాణం పూర్తైంది. తొమ్మిది నెలల్లో సొంతిల్లు కట్టుకున్నాం. బిల్లులు సక్రమంగా అందాయి. ఇటీవలే కొత్త ఇంట్లోకి వచ్చాం. – మామిని పాడి, పాలకొండ అర్బన్, పార్వతీపురం మన్యం జిల్లా అదనంగా 50 బస్తాల సిమెంట్ .. బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసి లెంటల్ లెవెల్ వరకు ఇంటిని నిర్మించుకున్నాం. ఉచితంగా ఇసుక, రాయితీపై సిమెంటు, స్టీలు ఇస్తున్నారు. ఇప్పటి వరకూ 90 బస్తాల సిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు అదనంగా మరో 50 బస్తాలు ఇస్తున్నట్లు తెలిసింది. ఇది మాకెంతో ఉపయోగపడుతుంది. – ఖైరున్నిసాబీ, పార్నపల్లె, నంద్యాల జిల్లా సొంతిల్లు కడుతున్న మేస్త్రి విజయవాడలోని నున్నలో నివసించే భూలక్ష్మి మిషన్ కుడుతూ.. భర్త శ్రీనివాసరావుకు తోడుగా నిలుస్తోంది. వీరు 20 ఏళ్లకుపైగా అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. చాలాసార్లు ఇంటి నిర్మాణానికి ప్రయత్నించినా అక్కడ సెంటు స్థలం రూ.10 లక్షల వరకు పలుకుతుండటంతో ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఇంటి స్థలం మంజూరైంది. శ్రీనివాసరావు తాపీ మేస్త్రీ కావడంతో తనే స్వయంగా దగ్గరుండి ఇంటిని నిర్మించుకుంటున్నాడు. ఇటీవల స్లాబ్ వేశారు. స్థలంతో పాటు రూ.1.80 లక్షలు ఆర్థిక సాయం అందిందని, పొదుపు సంఘం ద్వారా రూ.50 వేలు లోన్ తీసుకున్నానని.. ఇంటి నిర్మాణం పూర్తి కావచ్చిందని భూ లక్ష్మి ఆనందంగా చెబుతోంది. తరతరాల కోరిక తీరింది.. విజయవాడ నున్న ప్రాంతంలో ఇళ్లలో పనులకు వెళ్లే పాపాయమ్మ కొద్ది నెలల క్రితం పక్షవాతం బారిన పడటంతో మంచానికే పరిమితమైంది. భర్త అప్పారావు రిక్షా కార్మికుడు. వీరికి తరతరాలుగా సొంతిల్లే లేదు. ఇంటి స్థలం, ఇల్లు కోసం ఎన్నోసార్లు విఫలయత్నం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక చివరి ప్రయత్నంగా వలంటీర్ ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో పాపాయమ్మకు రూపాయి ఖర్చు లేకుండా సొంతిల్లు మంజూరైంది. ఇల్లు నిర్మించుకుంటున్నారు. త్వరలో గృహ ప్రవేశం చేయనున్నారు. -
YSR Jagananna Colonies: కావాల్సినంత ఇసుక
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పేదలందరికీ పక్కా ఇంటి భాగ్యం కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం ‘పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని ఆచరణలోకి తెచ్చింది. జిల్లావ్యాప్తంగా లే అవట్లను వేసింది. వైఎస్సార్ జగనన్న కాలనీలుగా నామకరణం చేసి స్థలాలను కేటాయించింది. విశాలమైన రోడ్లు, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు కల్పించింది. కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలకు కావాల్సిన సామగ్రిని విరివిగా సమకూర్చుతోంది. అందులో భాగంగా ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తోంది. దీనికోసం ప్రతి మండలంలోనూ ఒక్కొక్కటి చొప్పు న స్టాక్ పాయింట్‌ను జిల్లా అధికారులు ప్రారంభించారు. సమీప ఇసుక డిపోల నుంచి వాటికి ఇసుకను చేరవేస్తున్నారు. ఇళ్ల నిర్మాణం కోసం గృహనిర్మాణ శాఖ ద్వారా జారీ అయిన బిల్లుల ఆధారంగా ఇప్పటివరకూ 17 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా గృహాల లబ్ధిదారులకు సమకూర్చారు. ఆ బిల్లులపై హాలోగ్రామ్ ఉండడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడింది. 77 రీచ్‌లలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. జిల్లాలోని నాలుగు డిపోల్లో మంగళవారం నాటికి 41,850 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉంది. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయడమే తరువాయి!. ఇళ్ల మంజూరు ఇలా... పేదలకు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 80,547 ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో చాలా ఇళ్ల నిర్మాణ పను లు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని ఇళ్ల నిర్మాణం పూర్తయింది. దాదాపు 17వేల ఇళ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు ప్రారంభించాల్సి ఉంది. వారికి అవసరమైన అన్ని మౌలిక వసతులు సమకూర్చడంతో పాటు పనులు వేగవంతం కావడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చింది. గృహనిర్మాణ శాఖ అధికారులు ప్రతి లేఅవుట్‌లోనూ ఇళ్ల నిర్మాణాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకూ ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించలేనివారితో మాట్లాడి వారికి సహాయ సహకారాలు అందజేస్తున్నారు. సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సక్రమంగా ఇసుక అందేలా... ఒక్కో ఇంటి నిర్మాణానికి 20 టన్నుల ఇసుకను లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. గతంలో ఇసుక సరఫరాలో ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నూతన ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. జేపీ పవర్ కన్స్ట్రక్ష న్స్‌కు ఇసుక సరఫరా బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రీచ్‌ల నుంచి లారీల్లో ఇసుక జిల్లాలోని నాలుగు డిపోలకు వస్తోంది. అక్కడి నుంచి లబ్ధిదారులకు సులువుగా చేరవేసేందుకు వీలుగా మండలానికి ఒకటి చొప్పున స్టాక్ పాయింట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలో ప్రస్తుతం 77 ఇసుక రీచ్‌లు ఉన్నా యి. వీటిలో ఒక్కోచోట వెయ్యి నుంచి రెండు వేల క్యూబిక్ మీటర్ల ఇసుక లభ్యమవుతోంది. ఆ ఇసుకను డిపోలకు, అక్కడి నుంచి స్టాక్ పాయింట్లకు తీసుకొస్తున్నారు. అక్కడ ఇళ్ల లబ్ధిదారులకు హాలోగ్రామ్ ఉన్న బిల్లుల ఆధారంగా ఇసుకను సరఫరా చేస్తున్నామని జేపీ పవర్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధి హర్షవర్దన్ ప్రసాద్ చెప్పారు. ఇసుక పక్కదారి పట్టకుండా... గ్రామ/వార్డు సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ జనరేట్ చేసి ఇచ్చిన బిల్లును లబ్ధిదారులు స్టాక్ పాయింట్‌కు తీసుకెళ్లి చూపిస్తే ఇసుక ఇస్తున్నారు. చేతిరాతతో ఇస్తే కుదరదు. హలోగ్రామ్ బిల్లులతో ఇసుక పక్కదారి పట్టకుండా నిరోధించగలుగుతున్నారు. సత్వరమే బిల్లుల చెల్లింపు.. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు గృహనిర్మాణ శాఖ ద్వారా బిల్లులను వారంలోగా జనరేట్ చేస్తున్నారు. ప్రతీ మండలం నుంచి ఆయా ఏఈలు, డీఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ స్థాయిని బట్టి బిల్లులు వారి వ్యక్తిగత ఖాతాలకు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇసుక, సిమెంట్ కొరత లేదు. జిల్లాలో ఇళ్ల నిర్మాణం జోరందుకుంది. ఇనుము కోసం చర్చలు జరుగుతున్నాయి. ప్రతి లబ్ధిదారునికీ వారంలోగా బిల్లులు వారి ఖాతాల్లోకి జమవుతున్నాయి. – ఎస్వీ రమణమూర్తి, ప్రాజెక్టు డైరెక్టర్, గృహనిర్మాణ శాఖ, విజయనగరం -
ఇళ్ల యజ్ఞం పూర్తి చేస్తాం
చరిత్ర ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం వల్ల 30 రకాల వృత్తుల వారికి ఉపాధి లభిస్తోంది. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి 71 లక్షల టన్నుల సిమెంట్, 7.56 లక్షల టన్నుల స్టీల్, 312 లక్షల టన్నుల ఇసుక, 1,250 కోట్ల ఇటుకలు అవసరం. కార్మికులకు 21.4 కోట్ల పని దినాల ఉపాధి లభిస్తుంది. వృత్తి నైపుణ్య కార్మికులకు అదనంగా మరో 10.60 కోట్ల పని దినాలు లభిస్తాయి. ఇవన్నీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఎంతగానో దోహద పడతాయి. రాష్ట్ర జీఎస్డీపీ పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎవరెన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు సొంతం చేసి తీరతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. వివిధ దశల్లో ఈ మహాయజ్ఞాన్ని పూర్తి చేసి, నిరుపేదలందరినీ ఇంటి యజమానులు చేయాలన్న లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పారు. ‘పేదలందరికీ ఇళ్లు’ పథకంపై శాసనసభలో గురువారం జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ‘దాదాపు 30.76 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశాం. 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో దశల వారీగా ఇళ్ల నిర్మాణం సాగుతుంది. తొలి దశలో 10,067 కా>లనీల్లో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలైంది. రూ.28 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి. పేదవాళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కలిసికట్టుగా ఒక మహాయజ్ఞం చేశాం. ఇందుకోసం 71,811 ఎకరాల భూమిని వివిధ రూపాల్లో సేకరించాం. ఈ భూమి విలువే కనీసం రూ.25 వేల కోట్లు ఉంటుంది. పూర్తి నాణ్యత ప్రమాణాలతో నిర్మిస్తున్న 17,005 కాలనీల్లో మౌలిక వసతుల కోసమే రూ.32,909 కోట్లు వెచ్చించనున్నాం. నిర్మాణాలు పూర్తయితే రూ.4 లక్షల కోట్ల సంపద పేదల చేతుల్లో ఉంటుంది. ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల విలువైన ఆస్తి సమకూరుతుంది’ అని తెలిపారు. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా సరే ఈ మిషన్‌ను పూర్తి చేస్తామని చెప్పారు. అక్కచెల్లెమ్మల ఫొటోతో సహా పట్టాను ఇస్తున్నప్పుడు వారి కళ్లల్లో కనిపించే ఆనందమే తమకు శక్తినిస్తుందని, తమను ముందుకు నడిపిస్తుందని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. సొంతింటితో సామాజిక హోదా ► త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక సొంత ఇల్లుతో అక్కచెల్లెమ్మలకు సామాజిక హోదా వస్తుంది. భద్రతతో పాటు భరోసా వస్తుంది. ► ఇటువంటి భద్రత ప్రతి అక్క, చెల్లెమ్మకు ఇవ్వాలని, ఆత్మ విశ్వాసం పెంచే గొప్ప ఆస్తిని వారి చేతిలో పెట్టాలని మా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలకు కూడా మేలు జరుగుతుంది. ఎమ్మెల్యేలు గర్వపడే పరిస్థితి ► ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తిరిగితే పెన్షన్ రాలేదనో.. ఇల్లు లేదనో.. ఫలానా పథకం అందలేదనో.. అర్హత ఉన్నా ఇవ్వలేదనో ఇలా.. గతంలో రకరకాల ఫిర్యాదులు వినిపించేవి. ► ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోకి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉండేవి. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి ఎమ్మెల్యే సగర్వంగా, కాలర్ ఎగరేసుకునే పరిస్థితులు తీసుకువచ్చాం. ప్రతి పథకం పారదర్శకంగా అమలు చేస్తూ లంచాలు, వివక్షకు తావు లేకుండా అందిస్తున్నాం. ► అర్హత ఉంటే చాలు మన పార్టీయా, మరో పార్టీయా అని ఎక్కడా చూడటం లేదు. కులం, ప్రాంతం, మతం, పార్టీ చూడకుండా అర్హులు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తున్నాం ► 30.76 లక్షల ఇళ్లలో టిడ్కోకు సంబంధించినవి 2.62 లక్షల ఇళ్లు ఉన్నాయి. అందులోనూ అన్ డివైడెడ్ షేర్ అప్ ల్యాండ్ లబ్ధిదారులకు వస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 13 వేల పంచాయతీలు ఉంటే.. మా ప్రభుత్వం కొత్తగా 17,005 కాలనీలు నిర్మిస్తోంది. ► కొన్ని చోట్ల ఆ కాలనీలు చూస్తే.. మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, మేజర్ పంచాయితీల సైజులో కనిపిస్తున్నాయి. ఇవాళ మేం కడుతోంది ఇళ్లు కాదు.. ఊళ్లు కడుతున్నాం అని చెబుతున్నా. ► ఈ స్థాయిలో ఇళ్ల స్థలాలు సేకరించగలిగాం కాబట్టే కేంద్రం నుంచి కూడా మనకు సహాయం అందుతుంది. అందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. 17,005 కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, ఇంటర్నెట్.. తదితర మౌలిక సదుపాయాలతో పాటు పాఠశాలలు, ఆస్పత్రులు, సచివాలయాలు, ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ► ఈ మౌలిక సదుపాయాల కోసమే రాబోయే రోజుల్లో రూ.32,909 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. కొన్ని సంవత్సరాల పాటు ఈ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసే కార్యక్రమాలు నిర్వహిస్తాం. సకల వసతులు, నాణ్యతతో నిర్మాణం ► గతంలో చంద్రబాబు హయాంలో ఇంటి విస్తీర్ణం గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 215 చదరపు అడుగులు. ఇవాళ మనం కడుతున్న ఇంటి విస్తీర్ణం 340 చదరపు అడగులు. ప్రతి ఇంట్లో బెడ్ రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, బాత్రూమ్ కమ్ టాయ్‌లెట్, వరండా.. ఇవన్నీ ఉంటాయి. ► ప్రభుత్వమే దగ్గరుండి తొలుత 20 ఇళ్లు కట్టించింది. ఎంత ఖర్చవుతుందో లెక్క వేసేందుకు ఆ పని చేశాం. ఆ తర్వాత నిర్మాణ వ్యయాన్ని ఏ విధంగా అయినా తగ్గించగలిగితే పేదలకు మెరుగ్గా ఇళ్లు కట్టంచగలుగుతామని రకరకాల ఆలోచనలు చేసి ఒక కార్యాచరణ రూపొందించాం. ► సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా ఇంటి తలుపులు, పెయింటింగ్, శానిటరీ, ఎలక్ట్రికల్ పరికరాలు వంటి 14 రకాల నాణ్యమైన సామగ్రిని తీసుకువచ్చాం. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ అయితే రివర్స్ టెండరింగ్‌కు ఆస్కారం ఉంటుంది. నాణ్యత కూడా ఉంటుంది. సామగ్రిని పెద్ద ఎత్తున కొనుగోలు చేయడంతో ధరలు కూడా తగ్గుతాయి. ► ఒక్కో ఇంటికి 90 బస్తాల సిమెంట్ పడుతుంది. మార్కెట్లో సిమెంట్ బస్తా రూ.350 నుంచి రూ.400 ఉంది. సిమెంట్ కంపెనీలతో మాట్లాడి పేదల ఇళ్లకు మాత్రం పీపీసీ సిమెంట్ బస్తా రూ.225, ఓపీసీ బస్తా రూ.235కే సరఫరా చేసేట్లు ఒప్పించాం. ప్రతి లబ్ధిదారుడికి అవసరమైన 20 టన్నుల ఇసుకను కూడా ఉచితంగా డోర్ డెలివరీ చేస్తున్నాం. దాదాపు 7.50 లక్షల టన్నుల స్టీల్‌ను రివర్స్ టెండరింగ్ ద్వారా మార్కెట్ రేటు కన్నా తక్కువకే కొనుగోలు చేశాం. 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లు ఉచితం ► టిడ్కో ద్వారా 2.62 లక్షల ఇళ్లను జీ ప్లస్ త్రీ పద్ధతిలో మూడు కేటగిరీల్లో నిర్మిస్తున్నాం. 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆ ఇళ్లు కడుతుండగా, వాటిలో 300 చదరపు అడుగుల ఇంటిని పేదలకు పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాం. ► ఇవే ఇళ్లకు చంద్రబాబు హయాంలో.. ఒక చదరపు అడుగుకు రూ.2 వేల చొప్పున ఒక్కో ఇంటి వ్యయం రూ.6 లక్షలుగా లెక్కేశారు. అందులో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.1.50 లక్షలు పోగా, మిగిలిన రూ.3 లక్షలు బ్యాంకు రుణం ఇప్పించే వారు. ఆ రుణం తీర్చేందుకు పేద కుటంబం నెలకు రూ.3 వేల చొప్పున ఏకంగా 20 ఏళ్ల పాటు వాయిదాలు కట్టాల్సి వచ్చేది. ఇవాళ మన ప్రభుత్వం అవే ఇళ్లకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి పేదలకు ఇస్తోంది. ► 365 చదరపు అడుగుల ఇళ్లకు రూ.25 వేల చొప్పున, 430 చదరపు అడుగుల ఇళ్లకు రూ.50 వేల చొప్పున సబ్సిడీ ఇస్తున్నాం. ఆ విధంగా వారికి కూడా మేలు చేస్తున్నాం. టిడ్కో ఇళ్లలో ఇప్పటికే 1,07,814 ఇళ్లు పూర్తి కాగా, మరో 63,306 ఇళ్లు పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఈ ఇళ్ల పంపిణీని గత జనవరిలో మొదలు పెట్టాం. వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం. ఎప్పటికప్పుడు బిల్లులు ► ప్రభుత్వ పని అంటే నాసిరకం అని గతంలో పేరు ఉండేది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏ పని చేసినా పూర్తి నాణ్యత ఉంటుందనే పేరు తెచ్చుకున్నాం. పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాం. ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ కోసమే ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా ఒక జాయింట్ కలెక్టర్‌ను నియమించాం. ► అధికారులు, సచివాలయాల్లో ఉన్న ఇంజనీర్లు ఎప్పటికప్పుడు ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించాలని నిర్దేశించాం. గతంలో ఇళ్లు కట్టిన తర్వాత బిల్లులు రావడం కాదు కదా.. చివరకు ఆ బిల్లులు తయారు చేయడం కూడా గగనమై పోయేది. ఇవాళ సచివాలయాల్లో ఆ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇంటి నిర్మాణం పురోగతిని బట్టి ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఎప్పటికప్పుడు బిల్లులు జనరేట్ చేస్తున్నారు. ఆ వెంటనే సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నాం. పుట్టగతులు ఉండవనే టీడీపీ కుట్ర ఈ యజ్ఞం పూర్తయితే రాజకీయంగా పుట్టగతులు ఉండవనే ఆందోళనతోనే టీడీపీ ఈ పథకాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతోందని విమర్శించారు. ► ఈ మహాయజ్ఞానికి ఆటంకం కలిగించేందుకు తెలుగుదేశం పార్టీ శాయశక్తులా ప్రయత్నించింది. ఈ ఇళ్ల నిర్మాణం పూర్తయితే జగన్‌కు ఇంకా మంచి పేరు వస్తుంది.. దీంతో తమ అడ్రస్ పూర్తిగా గల్లంతు అవుతుందన్న భయంతో ఏవేవో కారణాలు చూపుతూ కోర్టులను ఆశ్రయించారు. ► నా నియోజకవర్గం పులివెందులతో పాటు విశాఖపట్నం, ఇతర చోట్ల ఇళ్ల పట్టాల పంపిణీ ఆగిపోయింది. ఆ విధంగా ఏడాది పాటు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ► విశాఖపట్నంలో భూముల సేకరణకు హైకోర్టు ఇటీవలే క్లియరెన్స్ ఇచ్చింది. దాంతో ఇళ్ల పట్టాల పంపిణీకి సన్నాహాలు చేయండని అధికారులను ఆదేశించాం. ఏప్రిల్‌లో విశాఖపట్నం వెళ్లి 1.80 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా వెంటనే ఇళ్ల నిర్మాణం మొదలు పెడతాం. -
జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ. 32 కోట్లు ఖర్చు
-
6 వేలకు పైగా ఎకరాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు: మంత్రి అవంతి శ్రీనివాస్
-
Andhra Pradesh: ఇళ్ల నిర్మాణాలు వేగవంతం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వైఎస్సార్ జగనన్న కాలనీల్లో వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 15.65 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో ఇప్పటికే 10.87 లక్షల ఇళ్ల శంకుస్థాపనలు పూర్తయ్యాయి. వాటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. గత ఏడాది కోర్టు కేసుల కారణంగా కొద్దినెలలపాటు వీటి పనులు నిలిచిపోయాయి. ఇటీవల ఆ అడ్డంకులు తొలగిపోవడంతో డిసెంబర్ నుంచి నిర్మాణాలు తిరిగి గాడినపడ్డాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు రూ.30 కోట్లకు పైగా విలువైన పనులు జరుగుతున్నాయి. మిగిలిన ఇళ్ల శంకుస్థాపనకు చర్యలు తొలిదశలో శంకుస్థాపనలు కాని ప్లాట్లలో ఇళ్ల నిర్మాణానికీ గృహ నిర్మాణ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు లేఅవుట్లలో రీలెవలింగ్, గోడౌన్ల నిర్మాణం, నీటి సరఫరా, ఇతర సౌకర్యాల కల్పన నిమిత్తం రూ.228.6 కోట్ల పనులకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ మొత్తంలో రూ.62.81 కోట్లు అప్రోచ్ రోడ్లు, లేఅవుట్లలోని ఎలక్ట్రికల్ లైన్లు మార్చడానికి రూ.6.60 కోట్లు, లేఅవుట్లలో లెవలింగ్ కోసం రూ.132 కోట్లు, గోడౌన్ల నిర్మాణానికి రూ.3.25 కోట్లు, ఇతర పనుల కోసం రూ.23.94 కోట్లు కేటాయించారు. ఇప్పటికే రూ.30 కోట్ల నిధులను జిల్లాలకు విడుదల చేశారు. అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రెండు జిల్లాలకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాం. వీరు అక్కడ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు కలెక్టర్లు, జేసీలతో సమీక్షలు నిర్వహిస్తున్నాం. తొలి నుంచి చిత్తూరు జిల్లా ఇంటి నిర్మాణాల్లో ముందంజలో ఉంది. ఇటీవల రూ.228 కోట్లతో లేఅవుట్లలో వసతుల కల్పనకు అనుమతులిచ్చాం. – అజయ్ జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జర్మనీ సంస్థ ఆసక్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకం అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోంది. పేదలకు నిర్మించే ఇళ్లలో అత్యుత్తమ ఇంధన ప్రమాణాలు అమలు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని జర్మనీకి చెందిన అంతర్జాతీయ బ్యాంక్ కేఎఫ్‌డబ్ల్యూ అధికారులు అభినందించారు. ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఇళ్లలో ఇంధన సామర్థ్య ప్రమాణాలు అమలు చేసేందుకు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు కేఎఫ్‌డబ్ల్యూ ఆసక్తిని వ్యక్తం చేసింది. రాష్ట్ర గృహ నిర్మాణ, ఇంధన శాఖ అధికారులతో ఆదివారం వర్చువల్‌గా జరిగిన సమావేశంలో కేఎఫ్‌డబ్ల్యూ అధికారులు ఈ ప్రతిపాదన చేశారు. 152 మిలియన్ యూరోల సాయం కేఎఫ్‌డబ్ల్యూ ఎనర్జీ ఎఫిషియెన్సీ విభాగం అధిపతి మార్టిన్ లక్స్ మాట్లాడుతూ.. గృహ నిర్మాణ పథకంలో నిర్మించే ఇళ్లలో ఇంధన సామర్థ్య ప్రమాణాల అమలుకు సంబంధించి ప్రాజెక్ట్ తయారీ, అధ్యయనం తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్‌పై అధ్యయనం అనంతరం ఇంధన సామర్థ్య ప్రమాణాలతో కూడిన ఇళ్ల నిర్మాణ కోసం 150 మిలియన్ యూరోలు , సాంకేతిక సహకారం కోసం మరో 2 మిలియన్ యూరోలు అందచేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతేకాకుండా జగనన్న కాలనీల్లో విద్యుత్ పంపిణీ మౌలిక సదుపాయాలు, విద్యుత్ సరఫరా నెట్వర్క్ బలోపేతానికి కూడా ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. -
AP: బండారుపై తిరగబడ్డ జనం.. వెళ్లవయ్యా.. వెళ్లు!
పెందుర్తి: ప్రభుత్వం చేపట్టిన ఒక మంచి కార్యక్రమాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేస్తే జనం ప్రతిఘటన ఎలా ఉంటుందో విశాఖ ప్రజలు టీడీపీ నేతలకు రుచి చూపించారు. వారికి గట్టిగా బుద్ధి చెప్పి, అక్కడి నుంచి పారిపోయేలా చేశారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, ఆయనతోపాటు వచ్చిన వారికి విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతగట్ల పంచాయతీ ఇప్పిలివానిపాలెంలో సోమవారం ఎదురైన భంగపాటిది. నిరుపేదలకు ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని కుట్రపూరితంగా అడ్డుకోవాలన్న వారి దుర్మార్గపు ఆలోచనకు ప్రజలు తీవ్ర స్థాయిలో బదులిచ్చారు. ప్రజలంతా తిరగబడ్డంతో ›‘40’ ఏళ్ల అనుభవం అక్కడి నుంచి పారిపోయింది. పారని ‘పచ్చ’ పాచిక ఇప్పిలివానిపాలెం సర్వే నెంబర్ 81/2లో ప్రభుత్వం నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద పేదలకు జగనన్న కాలనీలో ఇంటి స్థలాలు కేటాయించింది. మొత్తం 90 మంది లబ్ధిదారులు ఈ లేఅవుట్లో స్థలాలు పొందారు. వారిలో కొందరు ఇళ్ల నిర్మాణం చేపట్టారు. పునాదులు నింపేందుకు çసమీపంలోని కొండవాలు ప్రాంతం నుంచి మట్టిని సేకరిస్తున్నారు. దీన్ని రాజకీయం చేయాలన్న కుట్రతో టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే బండారుకు సమాచారం ఇచ్చారు. వెంటనే బండారు సత్యనారాయణమూర్తి, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ తమ అనుచరులను వెంటేసుకుని లేఅవుట్ వద్దకు వచ్చారు. ఇక్కడి మట్టిని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు అమ్ముకుంటున్నారని, ఎవరూ తవ్వడానికి వీల్లేదని అంటూ వీరంగం వేశారు. ఇళ్ల కోసం మట్టిని తవ్వుకుంటున్నామని పేదలు చెప్పినా వినలేదు. తీవ్రస్థాయిలో అక్కడ రచ్చ చేసే ప్రయత్నం చేశారు. దీంతో చిర్రెక్కిన పేదలు టీడీపీ మూకపై తిరగబడ్డారు. మట్టిని ఎవరు అమ్ముకుంటున్నారో నిరూపించాలని నిలదీశారు. ‘మీ ప్రభుత్వ హయాంలో ఒక్క నిరుపేదకైనా ఇళ్లు ఇచ్చారా? జగన్‌బాబు (సీఎం వైఎస్ జగన్) వచ్చిన తరువాత మాకందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేసి ఇళ్లు కట్టిస్తున్నాడు. మా బతుకులు మేం బతుకుతుంటే మీరెందుకు మా బతుకుల్లో నిప్పులు పోయాలని చూస్తారు? మీ రాజకీయాల కోసం మాలాంటి వాళ్లను ఇబ్బంది పెడతారా?’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. మరోసారి ఇలాంటి కుట్రలు చేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ‘మీరు పేదల గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా? మంచి పనిని కూడా ఇలా చెడగొడతారా? మీకు సిగ్గూ శరం లేదా?’ అంటూ మహిళలు మండిపడ్డారు. పేదల ఆగ్రహావేశాలను చూసిన బండారు బృందానికి నోట మాట రాలేదు. అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని పేదలు మరోసారి హెచ్చరించడంతో బండారు, పీలా తదితరులు వెనక్కి మళ్లారు. ఏం చేయాలో పాలుపోని బండారు లే అవుట్ సమీపంలో ఓ చెట్టు కిందకు వెళ్లి కాసేపు మౌనంగా ఉండిపోయారు. కాసేపటికి తర్వాత తేరుకొని, యథావిధిగా ప్రభుత్వంపై విమర్శలు చేసి ఇంటి దారి పట్టారు. బండారు, టీడీపీ నేతల దిగజారుడు రాజకీయాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
జగనన్న కాలనీల్లో ఇం‘ధన’ ఆదా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో ఏటా రూ.539.7 కోట్ల విలువైన విద్యుత్‌ను ఆదా చేయొచ్చని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు తెలిపారు. స్టార్ రేటెడ్ ఉపకరణాలు అమర్చడం ద్వారా భారీగా విద్యుత్ ఆదా చేయడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను కూడా మరింత మెరుగుపరచవచ్చన్నారు. ఇంధన శాఖను సమన్వయం చేసుకుంటూ ఇందుకు అవసరమైన ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, హౌసింగ్ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ నారాయణ్ భరత్ గుప్తా తదితరులతో మంత్రి ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడమే కాకుండా.. రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ, విద్యుదీకరణ, తాగు నీరు, పాఠశాలలు, ఆస్పత్రులు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమేనన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తోందని మంత్రి చెప్పారు. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. వీటిలో 10.72 లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి మొత్తం తొలి దశ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల ఆమోదంతో ఫైవ్ స్టార్ రేటెడ్ విద్యుత్ ఉపకరణాలు అందజేస్తామని మంత్రి చెప్పారు. ప్రతి ఇంటికి నాలుగు ఎల్ఈడీ బల్బులు, రెండు ట్యూబ్ లైట్లు, రెండు ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్లు అందించాలనుకుంటున్నట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. వీటి వల్ల ప్రతి ఇంటికి ఏటా రూ.3,598 విలువైన విద్యుత్ ఆదా అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. 15 లక్షల ఇళ్లలో ఇంధన సామర్థ్య ఉపకరణాలు అమర్చడం వల్ల ఏడాదికి 1,674 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఆదా అవుతుందని చెప్పారు. కేంద్ర సంస్థలైన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ, ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సహకారంతో ఏపీ ఇంధన సంరక్షణ మిషన్ ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తోందని అజయ్ జైన్ తెలిపారు. -
ఆకర్షణీయంగా పేదల కాలనీలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద వైఎస్సార్– జగనన్న కాలనీల్లో శాశ్వత మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. అన్ని వసతులతో పేదల కాలనీలను ఆదర్శంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో 17,005 వైఎస్సార్–జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్ల నిర్మాణాలను రెండు దశల్లో చేపడుతున్న విషయం తెలిసిందే. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్(ఏపీఎస్ఎఫ్ఎల్), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు రూ.32,909 కోట్లు ఖర్చు చేయనుంది. మౌలిక వసతుల కల్పన పనులకు సంబంధించి డీపీఆర్‌లు సిద్ధం అయ్యాయి. తొలి దశలో ఇళ్ల నిర్మాణానికి ఎంపిక చేసిన 10 వేల లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.24 వేల కోట్లు ఖర్చు చేయనుంది. విశాలమైన రోడ్లు.. ఇంటర్నెట్ సదుపాయం.. ► కాలనీల్లో ఇళ్ల సంఖ్య, లేఅవుట్ విస్తీర్ణాన్ని బట్టి 20, 30, 40 అడుగుల రోడ్లు నిర్మించనున్నారు. 40 అడుగుల రోడ్లు నిర్మించిన చోట రోడ్డు మధ్యలో డివైడర్లు ఏర్పాటు చేస్తారు. ► 1,500 లోపు ఇళ్లు ఉన్న కాలనీలో సీసీ డ్రైన్లు, ఆపైన ఇళ్లు ఉన్న చోట అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు వర్షపు నీరు బయటకు వెళ్లేలా ఏర్పాటు చేస్తారు. ► కాలనీలో 550 ఇళ్ల లోపు ఉన్న చోట ఓవర్ హెడ్ ఎలక్ట్రిఫికేషన్, 550 ఇళ్లు పైబడి ఉంటే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిఫికేషన్ చేపట్టనున్నారు. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ సదుపాయం కల్పించనున్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కింద పారిశుధ్యం, పరిశుభ్రత, గ్రీనరీ కోసం కూడా చర్యలు తీసుకోనున్నారు. నాణ్యత పట్ల ప్రత్యేక శ్రద్ధ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు సన్నాహాలు చేస్తున్నాం. డీపీఆర్‌లు పూర్తయ్యాయి. డీపీఆర్‌లు సమర్పించడం, నిధుల సమీకరణ, ఇతర పనులు చేపడుతున్నాం. నాణ్యతపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాం. – ఎం.శివప్రసాద్, మౌలిక వసతుల ప్రత్యేక అధికారి, గృహ నిర్మాణ శాఖ వచ్చే ఏడాది డిసెంబర్లో పనులు పూర్తి ఇళ్ల నిర్మాణ అవసరాలకు వీలుగా బోర్లు, మోటార్లు, విద్యుత్ కనెక్షన్లు, నీటి నిల్వ వసతులకు ప్రభుత్వం ఇప్పటికే రూ.1200 కోట్లు ఖర్చు పెట్టింది. శాశ్వత మౌలిక వసతుల కల్పనకు రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి నిధుల సమీకరణ, టెండర్లు పిలవడం, ఇతర సాంకేతిక పరమైన పనులు పూర్తి చేస్తాం. 2022 డిసెంబర్ నెలాఖరుకు తొలి లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పన పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నాం. – అజయ్ జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ -
Andhra Pradesh: ఇళ్లకు సుముహూర్తం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పేదలకు పెద్ద ఎత్తున ఇంటి పట్టాలు అందచేయడంతోపాటు గృహాలను కూడా నిర్మించి ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలని మూడో ఆప్షన్ కింద కోరుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ పనులను అక్టోబర్ 25వతేదీ నుంచి ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈలోగా అందుకు అవసరమైన సన్నాహాలను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కొత్తగా అర్హులైన పేదలకూ ఇళ్ల పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ ద్వారా పట్టణాలు, నగరాల్లో మధ్య తరగతి ప్రజలకు లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకే ఇళ్ల స్థలాలు (ప్లాట్లు) ఇచ్చేందుకు అవసరమైన భూములను గుర్తించడంతోపాటు సమీకరణ పూర్తి చేసి విజయదశమి నాటికి కార్యాచరణ సిద్ధం చేసి అమలు తేదీని ప్రకటించాలని సీఎం ఆదేశించారు. పేదల ఇళ్ల నిర్మాణాలు, వైఎస్సార్ జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాల మంజూరు, ఎంఐజీ లే అవుట్లు తదితరాలపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. చదవండి: Andhra Pradesh: వెనకబాటు నుంచి వెన్నెముకగా..! లబ్ధిదారులకు నాణ్యమైన సామగ్రి పేదల ఇళ్ల నిర్మాణ సామగ్రిని సమకూర్చడంలో నాణ్యతా ప్రమాదదణాలు తప్పకుండా పాటించాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. విద్యుదీకరణకు కూడా నాణ్యమైన సామగ్రిని అందుబాటులో ఉంచాలని సూచించారు. గ్రూపుల ఏర్పాటు ఆప్షన్ 3 కింద ప్రభుత్వమే గృహాలను నిర్మించి ఇవ్వాలని కోరుకున్న లబ్ధిదారులకు ఇళ్లు కట్టించి ఇచ్చే పనులు అక్టోబరు 25 నుంచి ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్న చోట లబ్ధిదారులతో కలిసి గ్రూపులు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పేదల కాలనీల్లో ఇంటర్నెట్ పేదల కోసం నిర్మిస్తున్న వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉండాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి డీపీఆర్‌లు సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. పేదల ఇళ్ల నిర్మాణాలు, వైఎస్సార్ జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాల మంజూరు, ఎంఐజీ లే అవుట్లు తదితరాలపై క్యాంప్ కార్యాలయంలో సమీక్షిస్తున్న సీఎం వైఎస్ జగన్ కొత్తగా అర్హులైన పేదలకూ ఇళ్ల పట్టాలు కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన పేదలకు 90 రోజుల్లోగా ఇళ్ల పట్టాలపై కూడా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఆగస్టు 22 వరకు ఇళ్ల పట్టాల కోసం కొత్తగా 3,55,495 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 1,99,201 అర్హత ఉన్నవని అధికారులు పేర్కొన్నారు. మరో 9,216 దరఖాస్తులు వెరిఫికేషన్ కోసం పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. చదవండి: త్వరలోనే థర్డ్ వేవ్! మధ్య తరగతికి ప్లాట్లపై దసరాకు కార్యాచరణ లాభాపేక్ష లేకుండా పట్టణాలు, నగరాల్లో మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకే జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్‌లో ప్లాట్లు ఇచ్చే పథకంపై కూడా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. దాదాపు 3.94 లక్షల ప్లాట్లకు డిమాండ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. 150, 200, 250 చదరపు గజాల విస్తీర్ణంలో ప్లాట్ల కోసం వివిధ రకాల భూములను గుర్తించి సమీకరణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విజయదశమి నాటికి కార్యాచరణ సిద్ధం చేసి అమలు తేదీలను ప్రకటించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. టిడ్కో ఇళ్లపైనా సీఎం సమీక్ష ఫేజ్ –1లో భాగంగా 85,888 టిడ్కో ఇళ్ల పనులు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కాలనీల్లో మౌలిక వసతుల పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు చెప్పారు. డిసెంబర్ 2021 నాటి కల్లా ఈ ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామన్నారు. ఫేజ్ –2 ఇళ్లు జూన్ 2022 నాటికి, ఫేజ్ –3 ఇళ్లు డిసెంబర్ 2022 నాటికి పూర్తవుతాయని అధికారులు పేర్కొన్నారు. నిర్దేశిత సమయంలోగా ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామన్నారు. రివర్స్ టెండర్లతో నిర్మాణ సామగ్రిలో భారీగా ఆదా తొలి దశ పేదల ఇళ్లకు సంబంధించి నిర్మాణ సామగ్రికి రివర్స్ టెండర్లు నిర్వహించడం ద్వారా రూ.5,120 కోట్లు ఆదా చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఒక్కో ఇంటి నిర్మాణ సామగ్రిలో దాదాపుగా రూ.32 వేల చొప్పున ఆదా అయిందని తెలిపారు. లబ్ధిదారుల కోరిక మేరకే వారికి నిర్మాణ సామగ్రిని పంపిణీ చేస్తున్నామని, దీనికోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించామని చెప్పారు. ప్రజాప్రతినిధుల నుంచి ఫీడ్ బ్యాక్ వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులు, ఇతరత్రా అంశాలపై ముఖ్యమంత్రి ఆదేశించిన విధంగా స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిర్మించనున్న ఇళ్ల మ్యాపింగ్, రిజిస్ట్రేషన్, జాబ్‌కార్డుల జారీ, జియో ట్యాగింగ్ దాదాపుగా పూర్తైందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా కాలనీల్లో 80 శాతానికిపైగా ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని అధికారులు వెల్లడించారు. ప్రతి నగరం, మున్సిపాలిటీ వాటర్ ప్లస్ స్థాయికి చేరాలి రాష్ట్రంలోని మూడు పెద్ద నగరాలైన విజయవాడ, విశాఖ, తిరుపతి మురుగునీరు, వ్యర్థ జలాలను నిర్దేశిత ప్రమాణాల మేరకు శుద్ధి చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వాటర్ ప్లస్ సర్టిఫికెట్లు సాధించడంపై అధికారులను ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. ఉత్తమ తాగునీటి సరఫరా విధానాలు, మురుగునీటి నిర్వహణపై మార్గదర్శకాలను కలెక్టర్లు, కమిషనర్లకు పంపాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీలలో ఇవి అమలయ్యేలా చూడాలని, తద్వారా పట్టణాలు ఉన్నత ప్రమాణాల దిశగా అడుగులు వేయాలన్నారు. ప్రతి నగరం, మున్సిపాల్టీ సర్టిఫికెట్ పొందిన నగరాల స్ధాయిని చేరుకునేలా కృషి చేయాలని సూచించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్, గృహ నిర్మాణశాఖ కార్యదర్శి రాహుల్ పాండే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నారాయణ భరత్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ‘వాటర్ ప్లస్’ నగరాల్లో విజయవాడ, విశాఖ, తిరుపతి – దేశవ్యాప్తంగా 9 నగరాల ఎంపిక స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్‌లో భాగంగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ అందించే వాటర్ ప్లస్ సర్టిఫికేషన్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు నగరాలకు చోటు లభించింది. దేశవ్యాప్తంగా కేవలం 9 నగరాలు మాత్రమే వాటర్‌ప్లస్ సర్టిఫికెట్ పొందగా అందులో 3 నగరాలు రాష్ట్రం నుంచి అర్హత సాధించినట్లు సీఎం నిర్వహించిన సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లు వాటర్ ప్లస్ సర్టిఫికెట్ పొందాయని చెప్పారు. ఇళ్లు, వాణిజ్య సముదాయాల నుంచి డ్రైన్లు, నాలాలతో పాటు ఇతర వ్యర్ధ జలాల శుద్ధి, నిర్వహణ, పునర్వినియోగాన్ని నిర్దేశిత ప్రమాణాల మేరకు సమర్ధవంతంగా నిర్వహించే నగరాలకు వాటర్ ప్లస్ సర్టిఫికెట్‌ను కేంద్ర ప్రభుత్వం అందచేస్తోంది. -
ఇళ్ల నిర్మాణానికి ఇబ్బందుల్లేకుండా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. ఇళ్లు నిర్మించే సమయంలో నీటి అవసరాలు తీర్చేందుకు వీలుగా బోర్లు వేస్తోంది. అంతటితో సరిపెట్టకుండా వాటికి మోటార్లు సైతం బిగించడం.. అందుకు విద్యుత్ సరఫరా సమకూర్చడం.. ప్లాట్ల వద్ద కుళాయిల ఏర్పాటుకు సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ పనులు తుదిదశకు చేరుకున్నాయి. 76 శాతం లేఅవుట్లలో బోర్లు తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 9,112 లేఅవుట్లలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. వీటిలో 8,830 లేఅవుట్లలో నీటి సౌకర్యాన్ని కల్పించాలని అధికారులు గుర్తించారు. ఇందుకోసం ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో రూ.920 కోట్లు కేటాయించింది. గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖ రూ.641 కోట్లు, మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ రూ.279 కోట్లను కేటాయించి పనులను అప్పజెప్పింది. మొత్తం 8,830 లేఅవుట్లకు గాను ఇప్పటివరకు 8,096 లేఅవుట్లలో నీటి సరఫరా పనులు ప్రారంభించారు. వీటిలో 6,687 (76 శాతం) లేఅవుట్లలో ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా.. స్థానిక పరిస్థితులు, అందుబాటులో ఉన్న నీటి వనరుల ఆధారంగా బోర్లు వేయడం, పక్కనున్న చెరువులు, కాలువల నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. 10–20 ఇళ్లకు చేతి బోరింగ్లు, 50–60 ఇళ్లకు రోటరీ బోర్లు, 100–200 ఇళ్లకు డీటీహెచ్ బోర్లు వేస్తున్నారు. ప్లాట్లు ఎక్కువగా ఉండి నీటి వినియోగం ఎక్కువ ఉన్నచోట విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు ఇబ్బందుల్లేకుండా నీటి నిల్వ కోసం స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా బోర్ల నుంచి లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలకు నీటిని వినియోగించుకునేందుకు అనుగుణంగా కుళాయి పాయింట్లు అందుబాటులో ఉంచుతున్నారు. ఇబ్బందులకు తావివ్వం వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పేదలకు ఎలాంటి ఇబ్బందులకు తావివ్వం. లబ్ధిదారులకు అన్ని వసతులను ప్రభుత్వం సమకూరుస్తుంది. నీటి సౌకర్యం లేకపోతే నిర్మాణాలకు ఇబ్బందులు తలెత్తుతాయని సీఎం వైఎస్ జగన్ ముందే భావించారు. లబ్ధిదారులు ఆ ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వమే బోర్లువేసి, మోటార్లు బిగించి, విద్యుత్ సరఫరా అందిస్తోంది. – చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, గృహనిర్మాణ శాఖ మంత్రి ఎప్పటికప్పుడు ఇబ్బందుల్ని పరిష్కరిస్తున్నాం లేఅవుట్లలో నీటి సరఫరా పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ 76 శాతం లేఅవుట్లలో పనులు పూర్తయ్యాయి. మిగిలిన లేఅవుట్లలో ఈ నెలాఖరులోపు నీటి సరఫరా, విద్యుత్ కనెక్షన్ పనులు పూర్తిచేస్తాం. ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తున్నాం. – నారాయణ భరత్‌గుప్తా, ఎండీ హౌసింగ్ కార్పొరేషన్ -
ఆగష్టు 15న ప్రాపర్టీ కార్డుల పంపిణి
-
లే అవుట్ల వద్దకే ఇసుక, సిమెంట్, స్టీలు
కర్నూలు(సెంట్రల్): వైఎస్సార్–జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు లే అవుట్ల వద్దకే ఇసుక, సిమెంట్, స్టీలు తెప్పించి లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. ప్రతి 20 ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించేందుకు ఓ మండల స్థాయి అధికారిని నియమించామన్నారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, శాసనమండలి విప్ గంగుల ప్రభాకరరెడ్డితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలసి ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆగస్టు మొదటి వారం నుంచి నియోజకవర్గాలవారీగా పర్యటించి.. వైఎస్సార్–జగనన్న కాలనీల్లో జరుగుతున్న పనులను పరిశీలిస్తామని తెలిపారు. రూ.32 వేల కోట్లతో డ్రెయినేజీలు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీలు, నీళ్లు, కరెంటు, రోడ్లతో పాటు ఉపాధి కల్పన యూనిట్లు స్థాపించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. మంచినీరు, విద్యుత్ సదుపాయాలను కల్పించేందుకు ఇప్పటికే రూ.1,200 కోట్లు విడుదల చేశామన్నారు. లక్షలాది మంది అక్కచెల్లెమ్మల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నిర్మాణాæత్మకమైన సలహాలు ఎవరు ఇచ్చినా తీసుకుంటామని మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. -
జోరుగా ఇళ్ల నిర్మాణం
సాక్షి, అమరావతి: ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టిన వైఎస్సార్–జగనన్న కాలనీల్లో పేదల ఇళ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఇప్పటికే పది లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు శంకుస్థాపనలు పూర్తిచేశారు. అంతకుముందు ఇళ్ల శంకుస్థాపనలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం మెగా గ్రౌండింగ్ మేళాను నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రోజుకు రూ.పది కోట్ల విలువైన ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ధారించిన గడువులోగా తొలిదశ నిర్మాణాలను పూర్తిచేయాలని అధికార యంత్రాంగం పట్టుదలతో కృషిచేస్తోంది. దీంతో రెండు నెలల్లో రూ.597.94 కోట్ల విలువైన పనులు జరిగాయి. మరోవైపు.. తొమ్మిది లక్షలకు పైగా ఇళ్ల పనులు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. ఇందుకు స్టీలు, సిమెంట్, ఇసుక, కూలీలకు మాత్రమే ప్రస్తుతం వ్యయమవుతోంది. బేస్మెంట్ స్థాయి దాటితే రోజు వారీ వ్యయం మరింత పెరుగుతుందని గృహ నిర్మాణ శాఖ చెబుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్–జగనన్న కాలనీల్లో సాగుతున్న ఇళ్ల నిర్మాణ పనులు, శ్రీకాకుళం జిల్లాలో పనులను పరిశీలిస్తున్న అధికారులు కాలనీల వద్దే నిర్మాణ సామగ్రి గోదాములు ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన సామగ్రిని గృహ నిర్మాణ శాఖ కాలనీలకు సమీపంలోనే అందుబాటులో ఉంచడంతో లబ్ధిదారులు ఉత్సాహంగా ఇళ్ల నిర్మాణాలను కొనసాగిస్తున్నారు. గ్రామ, మండల స్థాయిల్లో గోదాములను అద్దెకు తీసుకుని వీటిని నిల్వ ఉంచారు. అలాగే.. ► పేదల ఇళ్ల నిర్మాణాల నిమిత్తం ఇప్పటికే 1.57 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంట్‌ను కొనుగోలు చేయడమే కాకుండా 89,379.30 మెట్రిక్ టన్నుల సిమెంట్‌ను గోదాములకు తరలించి లబ్ధిదారులకు అందుబాటులో ఉంచారు. ► 24,022.68 మెట్రిక్ టన్నుల స్టీలు కొనుగోలు చేసి 3,930.557 మెట్రిక్ టన్నులను గోదాముల్లో ఉంచారు. ► ఇక 1,09,774 మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ ఉంచారు. దీంతో జాప్యం లేకుండా ఇళ్ల నిర్మాణ సామగ్రిని లబ్ధిదారులకు సరఫరా చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలను నిర్ధారించిన గడువులో పూర్తిచేసేందుకు సీఎం జగన్ జిల్లాకో జేసీని ప్రత్యేకంగా నియమించిన విషయం తెలిసిందే. వీరు క్షేత్రస్థాయిలో పనులు వేగంగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 15కల్లా బేస్మెంట్లు పూర్తి సీఎం ఆదేశాల మేరకు సెప్టెంబర్ 15కల్లా బేస్మెంట్ స్థాయికి ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం రోజుకు రూ.పది కోట్ల విలువగల పనులు జరుగుతున్నాయి. బేస్మెంట్ స్థాయి దాటిన తరువాత రోజుకు రూ.50 కోట్ల పనులు జరుగుతాయి. – అజయ్ జైన్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ -
YS Jagan: పరిశుభ్రతకు పెద్దపీట
గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థాలను సమీపంలోని ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలించే ఏర్పాటు చేయాలి. ఇందుకోసం ఒక ప్రత్యేక నంబర్‌ను డిస్ప్లే చేయాలి. కాల్ చేయగానే సంబంధిత వాహనం ద్వారా వ్యర్థాలను సేకరించి, ట్రీట్మెంట్ ప్లాంట్‌కు తరలించాలి. మురుగు నీటి కాల్వల శుద్ధిపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. డ్రెయిన్లను తరచూ శుభ్రం చేయాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్రతకు పెద్ద పీట వేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. బలమైన పారిశుధ్య కార్యక్రమాల వల్లే ప్రజారోగ్యం మెరుగు పడుతుందని చెప్పారు. ప్రధానంగా పల్లెలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో 14 వేల ట్రై సైకిళ్లు, పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న పల్లెల్లో 1,034 ఆటోలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పలు కార్యక్రమాల అమలుపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లెల్లో ఎంత స్వచ్ఛత పాటిస్తే అంత ఎక్కువగా రోగాల వ్యాప్తిని నిరోధించవచ్చని స్పష్టం చేశారు. డోర్ టు డోర్ వ్యర్థాల సేకరణ కోసం ఇప్పటికే విధుల్లో 23,747 మంది గ్రీన్ అంబాసిడర్స్, 4,482 గ్రీన్ గార్డ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా మరో 11,453 మంది గ్రీన్ అంబాసిడర్స్, 5,551 మంది గ్రీన్ గార్డ్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. వ్యర్థాల నిర్వహణకు భారీగా యంత్రాలను వినియోగించాలని, పట్టణాలతో పాటు పల్లెల్లోనూ వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ఇంకా ఏమన్నారంటే.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పలు కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు వాహనాల నిర్వహణ పైనా ధ్యాస పెట్టాలి వ్యర్థాల సేకరణతో పాటు వాహనాల నిర్వహణ పైనా ధ్యాస పెట్టాలి. పీపీఈ కిట్స్ డిస్పోజల్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను పక్కాగా చేపట్టాలి. ఈ అంశంలో మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల మధ్య సమన్వయం ఉండాలి. అప్పుడే క్లీన్ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుంది. – ఫోన్ చేయగానే వ్యర్థాలను తొలగించడానికి అనుసరించాల్సిన విధానంపై పురపాలక, గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య సమన్వయం కోసం ఒక ప్రోటోకాల్ ఉండాలి. 6 లక్షల మంది మహిళలకు సుస్థిర జీవనోపాధి కింద లబ్ధి వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల ద్వారా సుస్థిర జీవనోపాధి కింద ఈ ఏడాది 6 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. మహిళల ఉత్పాదనలు, వారి వ్యాపారాలకు మార్కెటింగ్ సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి. టై అప్ చేస్తున్న కంపెనీలు కచ్చితంగా ప్రతిష్ట ఉన్నవి, మంచి పనితీరు కలిగినవిగా చూసుకోవాలి. మార్కెటింగ్ సామర్థ్యాలు విస్తృతంగా ఉన్న కంపెనీలతోనే ఒప్పందం చేసుకోవాలి. సమగ్ర భూ సర్వే, ఉపాధి పనులు వేగవంతం సమగ్ర సర్వేను ఉద్ధృతంగా చేపట్టడంపై దృష్టి పెట్టాలి. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. ఇందుకోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక పట్టణాభివృద్ధి, రెవెన్యూ మంత్రులతో త్రిసభ్య కమిటీ చేయాలి. ఈ ఏడాది ఉపాధి హామీ కింద చేపట్టిన గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు అన్నీ కూడా పూర్తి కావాలి. వీటి నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. నిర్మాణాలు సరిగ్గా జరుగుతున్నాయా? లేదా? అన్నదానిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి. జియో ట్యాగింగ్ చేసి.. నిర్మాణాల తీరుపై సమీక్ష చేయాలి. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలి. ఇళ్ల నిర్మాణం పూర్తి కాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, రోడ్లు.. ఇలా ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. వైఎస్సార్ జలకళ ప్రాజెక్టుపై మరింతగా దృష్టి సారించాలి. భూగర్భ జలాలను పెంపొందించడంలో భాగంగా చిన్న చిన్న నదులపై ఉన్న వంతెనల వద్ద చెక్‌డ్యాం తరహా నిర్మాణాలు చేపట్టాలి. ప్రగతిపథంలో పనులు.. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఉపాధి హామీ కింద చేపట్టిన పనుల ప్రగతిని, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో చేపడుతున్న పనుల ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం వివరాలు తెలిపారు. నాడు–నేడులో భాగంగా పనులు చేపడుతున్న ఆస్పత్రులు, స్కూళ్లలో కూడా మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వైఎస్సార్ బీమా, జలజీవన్ మిషన్, గ్రామీణ రహదారుల నిర్మాణ పనుల ప్రగతిని వివరించారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా 9,148 ఇన్సినిరేటర్స్ (బూడిదగా మార్చేవి), 3,279 మిస్ట్ బ్లోయర్స్ (పిచికారి చేసేవి), 3,197 బ్రష్ కట్టర్స్ (గడ్డి కత్తిరించేవి), 3130 హైప్రెషర్ టాయ్‌లెట్ క్లీనర్లు, 165 పోర్టబుల్ థర్మల్ ఫాగింగ్ మిషన్లు, 157 షడ్డింగ్ మిషన్లు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. గ్రీన్ అంబాసిడర్, గ్రీన్ గార్డ్స్ అందరికీ పీపీఈ కిట్లు పంపిణీ చేశామని చెప్పారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.వి.సత్యనారాయణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్, సెర్ప్ సీఈఓ పి.రాజాబాబు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ పి.సంపత్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా వైఎస్సార్ జగనన్న కాలనీల్లో తొలి దశలో చేపట్టిన ఇళ్ల నిర్మాణంపై గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈనెల 1, 3, 4 తేదీల్లో ‘మెగా ఇళ్ల శంకుస్థాపన’ కార్యక్రమాన్ని చేపట్టి.. రికార్డు స్థాయిలో గృహాల నిర్మాణానికి భూమిపూజలు చేయించారు. రెండ్రోజుల నుంచి లబ్ధిదారులుకు బిల్లులు చెల్లించడానికి వీలుగా వారి వివరాలను గృహనిర్మాణ శాఖ వెబ్సైట్లో నమోదు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. శనివారం రాత్రి 8 గంటలకు 7,87,917 మంది లబ్ధిదారుల వివరాలను వెబ్సైట్లో నమోదు చేశారు. ఈ కార్యక్రమాన్ని గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, గృహనిర్మాణ సంస్థ ఎండీ నారాయణభరత్ గుప్తా పర్యవేక్షించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, సిమెంట్, స్టీల్ వంటి వాటిని లేఅవుట్లకు చేర్చాలని అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలకు ఎన్.కమలాకరబాబు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఎం.శివప్రసాద్, కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సీఈ శ్రీరాములును ప్రత్యేక అధికారులుగా నియమించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్దేశించిన మేరకు 2022 జూన్ నాటికి తొలి దశ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అజయ్‌జైన్ అధికారులను ఆదేశించారు. -
కేంద్రం ఇచ్చింది రూ.1.50 లక్షలే: శ్రీరంగనాథరాజు
సాక్షి, తిరుపతి: ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చింది కేవలం రూ.1.50 లక్షలేనని, పేదల ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల విలువైన భూమి సహా రూ.3.50 లక్షలు చొప్పున కేటాయించిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. బుధవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.13.50 లక్షలు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వ గుర్తుతోపాటు కేంద్ర ప్రభుత్వ గుర్తు కూడా వేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం 30 వేల ఎకరాల ప్రైవేట్ భూమి సేకరించి మౌలిక సదుపాయాలు కల్పించామని మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. -
ఉత్సాహంగా జగనన్న కాలనీల్లో ఇళ్ల శంకుస్థాపనలు
-
ఏపీ: మెగా గ్రౌండింగ్ రెట్టింపు విజయవంతం
సాక్షి, అమరావతి: చిత్తశుద్ధితో పనిచేస్తే మంచి ఫలితాలొస్తాయనే విషయాన్ని అధికార యంత్రాంగం వలంటీర్లు, పేదవర్గాల భాగస్వామ్యంతో మరోమారు నిరూపించింది. ఇటీవలే దేశంలో ఎక్కడాలేని విధంగా ఒకేరోజు 13.50 లక్షలకు పైగా కోవిడ్ టీకాలు వేసి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. పేదల సొంతింటి కలను సాకారం చేసే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో మూడు రోజులపాటు నిర్వహించిన పేదల ఇళ్ల ‘మెగా గ్రౌండింగ్ మేళా’ గ్రాండ్ సక్సెస్ అయింది. వైఎస్సార్–జగనన్న కాలనీల్లో తొలి దశలో నిర్దేశించిన ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత కాల వ్యవధిలోగా పూర్తి చేయాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం మేరకు రికార్డు స్థాయిలో ఆదివారం సాయంత్రానికి 6 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు జరిగాయి. మూడు రోజుల్లో 6,05,833 శంకుస్థాపనలు గృహ నిర్మాణ శాఖ రోజుకు లక్ష చొప్పున మూడు రోజుల్లో మూడు లక్షల ఇళ్ల శంకుస్థాపనలు చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. జిల్లా స్థాయి యంత్రాంగాలు 3.85 లక్షల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభింప చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే, రాజకీయ నాయకత్వ మార్గదర్శకత్వం సరిగా ఉంటే ఏదైనా సాధించగలమని రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు గల ప్రభుత్వ యంత్రాంగం నిరూపించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సరైన మార్గనిర్దేశం చేయడంతో రాష్ట్ర, జిల్లాస్థాయి యంత్రాంగం నుంచి గ్రామ వలంటీర్ల వరకు పేదల ఇళ్ల నిర్మాణాల ప్రారంభంలో సమష్టిగా పనిచేయడంతో ఈ కార్యక్రమం రికార్డు సృష్టించింది. గురువారం, శనివారం, ఆదివారం మూడు రోజుల్లో 3,85,714 ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయించాలని జిల్లాల యంత్రాంగాలు లక్ష్యంగా నిర్ణయించుకోగా.. మొత్తంగా 6,05,833 ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజలు పూర్తయ్యాయి. ఇక నిర్మాణాలపైనే దృష్టి: అజయ్ జైన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గనిర్దేశంతో రాష్ట్ర, జిల్లా స్థాయి యంత్రాంగంతో పాటు గ్రామ, వార్డు వలంటీర్లు సమష్టిగా పనిచేయడంతో పాటు పేదలు కూడా ఉత్సాహంతో ఇళ్ల నిర్మాణాలకు ముందుకు రావడంతో మూడు రోజుల్లో 6 లక్షలకు పైగా ఇళ్లకు శంకుస్థాపనలు సాధ్యమయ్యాయని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ పేర్కొన్నారు. ఇకనుంచి ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయడంపైనే దృష్టి సారిస్తామని చెప్పారు. శంకుస్థాపనలు చేసిన లబ్ధిదారులకు ఎటువంటి జాప్యం లేకుండా సిమెంట్, ఇసుక, స్టీలు, ఇతర మెటీరియల్ సరఫరా చేస్తామన్నారు. ఇళ్ల శంకుస్థాపనల ఉద్యమ స్ఫూర్తిని నిర్మాణాలు పూర్తిచేసే వరకు కొనసాగించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మిగతా లబ్ధిదారుల చేత కూడా ఇళ్ల నిర్మాణాలకు త్వరగా శంకుస్థాపనలు చేయించి, నిర్మాణాలు చేపట్టడం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని చెప్పారు. -
మూడో రోజు ‘మెగా ఇళ్ల శంకుస్థాపన’ కార్యక్రమం
-
మూడో రోజు ‘మెగా ఇళ్ల శంకుస్థాపన’ కార్యక్రమం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మెగా ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగుతోంది. తొలి రోజు గురువారం 2,11,413 ఇళ్లకు శంకుస్థాపన చేసి సృష్టించిన రికార్డును రెండో రోజు అధిగమించారు. రెండో రోజు శనివారం 1.28 లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేయాలని గృహనిర్మాణ శాఖ లక్ష్యంగా నిర్దేశిస్తే.. దాన్ని అధిగమించి ఏకంగా 2,90,907 గృహాలకు చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యం కంటే 227 శాతం అధికంగా శంకుస్థాపన చేసి రికార్డు సృష్టించారు. నెల్లూరు జిల్లా: వెంకటాచలం మండల కేంద్రంలోని సామూహిక గృహ నిర్మాణాలకు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వెంకట శేషయ్య, సర్పంచ్ రాజేశ్వరి పాల్గొన్నారు. విశాఖ జిల్లా: విశాఖలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. మూడో రోజు రికార్డు స్థాయిలో 12 వేల ఇళ్లకు లబ్ధిదారులు శంకుస్థాపన చేశారు. జిల్లాలో 37 వేల మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేయగా, నిన్నటి వరకు 20 వేల మంది ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. జగనన్న ఇళ్ల కాలనీల్లో సందడి వాతావరణం నెలకొంది. పశ్చిమ గోదావరి జిల్లా: దెందులూరు నియోజకవర్గం ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి, శ్రిపర్రు గ్రామాల్లో సామూహిక ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి పాల్గొన్నారు. భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, సర్పంచ్ షేక్ రహేమా బేగం హాసేనా పాల్గొన్నారు. 179మందికి ఇండ్లపట్టాలు పంపిణీ చేశారు. వీరవాసరం మండలం తల తాడితిప్ప గ్రామంలో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, ఎమ్మెల్సీ కొయ్యే మోసేనురాజు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా: ఉయ్యురు మండలం నాగన్నగుడం లో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేశారు. తోట్ల వల్లూరు మండలం చాగంటిపాడులో వైఎస్సార్ జగనన్న కాలనీలో లబ్ధిదారులతో కలసి ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ భూమి పూజ చేశారు. మండవల్లి మండలం గన్నవరం లో వైఎస్సార్ జగనన్న కాలనీలో నూతన ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. బందరు మండలం మేకవానిపాలెం లేఅవుట్లో ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని, జిల్లా కలెక్టర్ జె. నివాస్ పాల్గొన్నారు. ఆగిరిపల్లి మండలం కనసానపల్లి, ఆగిరిపల్లి మండలాల్లో వైఎస్సార్ జగనన్న ఇళ్ల కాలనీల్లో సామూహిక శంకుస్థాపనల కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు పాల్గొన్నారు. మైలవరం మండలం చంద్రాలలో జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శంకుస్థాపన చేశారు. -
‘ప్రతి లే-అవుట్లో పండగ వాతావరణం కనపడుతుంది’
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న ఇళ్ల నిర్మాణాలు ఒక యజ్ఞంలా జరుగుతున్నాయని ఏపీ గృహనిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుపేదల సొంతింటి కల సీఎం జగన్ వలన సాకారమైందని తెలిపారు. ఏపీలోని ప్రతి లే-అవుట్లో పండగ వాతావారణం కనపడుతోందని, అదే విధంగా, పేదలకోసం.. 5 లక్షల 7 వేల ఇళ్లకు శంకుస్థాపనలు జరుగుతున్నాయని అన్నారు. అదే సమయంలో జగనన్న కాలనీల వలన చాలా మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుందని తెలిపారు. -
రెండురోజుల్లో జరిగిన శంకుస్థాపనలు ఒక రికార్డ్: సజ్జల
సాక్షి, గుంటూరు: ‘మెగా ఇళ్ల శంకుస్థాపన’ కార్యక్రమంలో భాగంగా రెండ్రోజుల్లో జరిగిన శంకుస్థాపనలు ఒక రికార్డ్ అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గృహ శంకుస్థాపనల్లో లబ్ధిదారులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తండ్రికి మించిన తనయుడు అని సీఎం వైఎస్ జగన్ నిరూపించుకున్నారని కొనియాడారు. ఆనాడు వైఎస్ఆర్ తలపెట్టిన గృహనిర్మాణం అసాధ్యం అనుకున్నామని, దివంగత మహానేత వైఎస్ఆర్ ఇళ్ల నిర్మాణాన్ని సుసాధ్యం చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మరో ముందడుగు వేశారని తెలిపారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఇళ్ల నిర్మాణాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారని, నివాస యోగ్యం లేని ఇళ్లను నిర్మించి బాబు చేతులు దులుపుకున్నారని సజ్జల దుయ్యబట్టారు. అయితే సీఎం వైఎస్ జగన్ ఒక యజ్ఞంలా ఇళ్ల నిర్మాణాలను చేపట్టారని తెలిపారు. రాష్ట్రంలోని 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమితోపాటు 25 వేల ఎకరాల ప్రైవేట్ ల్యాండ్ కొని పేదలకు ఇళ్లు ఇవ్వడం జరిగిందని చెప్పారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేశామని, నేడు ప్రతి లబ్ధిదారుడి కళ్లలో నిజమైన ఆనందం కనబడుతోందని తెలిపారు. ఇళ్ల స్థలాలపై కొన్ని పత్రికలు వక్రీకరించి వార్తలు రాస్తున్నాయని సజ్జల మండిపడ్డారు. విషం కక్కుతూ సీఎం జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి విష పత్రికలను ప్రజలెవరూ నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. జగనన్న కాలనీల వల్ల చాలామందికి పరోక్ష ఉపాధి దొరకుతోందని,15 లక్షల ఇళ్ల నిర్మాణం వల్ల లక్షలాదిమందికి పని సృష్టించబడుతుందని గుర్తుచేశారు. కరోనా సమయంలో దాదాపు 16 లక్షల పనిదినాలు కల్పించడం జరిగిందని సజ్జల వెల్లడించారు. -
కలల సౌధానికి ‘మెగా’ శంకుస్థాపన
సాక్షి, అమరావతి: సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి లబ్ధిదారులు పోటీపడ్డారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా తమ కలల సౌధం నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ జగనన్న కాలనీల్లో శనివారం ‘మెగా ఇళ్ల శంకుస్థాపన’ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. తొలి రోజు గురువారం 2,11,413 ఇళ్లకు శంకుస్థాపన చేసి సృష్టించిన రికార్డును రెండో రోజు అధిగమించారు. రెండో రోజు శనివారం 1.28 లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేయాలని గృహనిర్మాణ శాఖ లక్ష్యంగా నిర్దేశిస్తే.. దాన్ని అధిగమించి ఏకంగా 2,90,907 గృహాలకు చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యం కంటే 227 శాతం అధికంగా శంకుస్థాపన చేసి రికార్డు సృష్టించారు. విజయనగరం సమీపంలోని గుంకలాం లే అవుట్లో భూమి పూజ చేస్తున్న లబ్ధిదారులు దేశ చరిత్రలో ఒకే రోజున స్వయంగా లబ్ధిదారులే 2,90,907 ఇళ్లకు భూమిపూజ చేసి.. శంకుస్థాపన చేయడం ఇదే ప్రథమమని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలెవరూ ఉండకూడదనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద తొలి దశలో 8,905 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో రూ.28,084 కోట్ల వ్యయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని గత నెల 3న వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ ఇళ్లను జూన్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం సమిష్టిగా పనిచేస్తోంది. రెండు రోజుల్లో మొత్తం 2.56 లక్షల గృహాలను లక్ష్యంగా నిర్దేశిస్తే 5,02,320 ఇళ్లకు శంకుస్థాపన చేశారు. మెగా ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగనుంది. గుంటూరు జిల్లా తెనాలి మండలం శిరిపురంలో ఇళ్ల శంకుస్థాపన పనుల్లో లబ్ధిదారులు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సమీక్ష.. మెగా ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, గృహనిర్మాణ సంస్థ ఎండీ నారాయణ్ భరత్ గుప్తాలు అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సూచనలు, సలహాలు ఇచ్చారు. లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ‘తమకు ఇంటి స్థలంతోపాటూ ఇంటిని మంజూరు చేసి.. తక్కువ ధరకే నిర్మాణ సామగ్రి అందించిన సీఎం వైఎస్ జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం’ అని తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనపల్లికి చెందిన దువ్వూరు భవాని చెప్పారు. ఇదే స్ఫూర్తితో వేగంగా ఇళ్ల నిర్మాణం రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలెవరూ ఉండకూడదన్నది సీఎం జగన్ సంకల్పం. అందరికీ ఇళ్లు అందించే దిశగా భారీ ఎత్తున ఇంటి స్థలాలు పంపిణీ చేశారు. ఆ స్థలాల్లో తొలి దశలో 15.60 లక్షల ఇళ్లను జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. రెండు రోజుల్లో 2.56 లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేయాలని లక్ష్యంగా నిర్దేశిస్తే.. లబ్ధిదారులు పోటీ పడి 5.02 లక్షల ఇళ్లకు భూమి పూజ చేసుకున్నారు. ఇదే స్ఫూర్తితో వేగంగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం. – అజయ్ జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గృహనిర్మాణ శాఖ -
‘తూర్పు’న జగనన్న ఇచ్చిన పొదరిల్లు
రంగంపేట: మేడంటే మేడా కాదు.. గూడంటే గూడూ కాదు.. పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది.. అంటూ దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన గీతం గుర్తొస్తుంది ఈ దంపతుల ఆనందం చూస్తుంటే. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం పెదరాయవరానికి చెందిన ఈ భార్యాభర్తల పేర్లు ఇళ్లపు సత్తిబాబు, దుర్గాభవాని. ఇద్దరూ వ్యవసాయ కూలీలు. కుమారులిద్దరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. సొంతిల్లు లేక ఈ కుటుంబం నానా అవస్థలు పడేది. పోరంబోకు స్థలంలో పూరిగుడిసెలో తలదాచుకునేవారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద పెదరాయవరంలో 195 మందికి ప్రభుత్వం ఇంటిపట్టాలు, ఇళ్లు మంజూరు చేసింది. వీటిలో దుర్గాభవాని పేరిట కూడా పట్టా, ఇల్లు మంజూరయ్యాయి. ఈ కాలనీలో 71 మంది ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సత్తిబాబు, దుర్గాభవాని దంపతులు ఎంతో ఉత్సాహంతో సొంతింటి కలను సాకారం చేసుకోడానికి వెంటనే నిర్మాణానికి పూనుకున్నారు. నిర్మాణానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో అధికారులు చేదోడువాదోడుగా నిలిచారు. ఇప్పటివరకు రూ.1.01 లక్షలు, డ్వాక్రా ద్వారా మరో రూ.50 వేలు మంజూరయ్యాయి. 50 బస్తాల సిమెంట్, ఇసుక ఉచితంగా అందజేశారు. దీంతో కొద్దిరోజుల్లోనే ఇంటి నిర్మాణం పూర్తిచేశారు. అంతేకాదు.. శనివారం (ఈ నెల 3న) గృహప్రవేశం చేయనున్నారు. జిల్లాలోని జగనన్న కాలనీల్లో మొదటగా జరుగుతున్న వీరి గృహప్రవేశానికి అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, జిల్లా జాయింటు కలెక్టర్ (హౌసింగ్) ఎ.భార్గవ్‌తేజ్ హాజరుకానున్నారు. ఇళ్ల లబ్ధిదారులంతా ఈ దంపతుల మాదిరిగా త్వరితగతిన ఇళ్లు నిర్మించుకుంటే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశించిన కొత్త ఊళ్లు త్వరలోనే సాక్షాత్కారమవుతాయి. ఇప్పటివరకు సత్తిబాబు, భవానీ ఉన్న ఇల్లు జగనన్న దయతో.. ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లులేక ఇబ్బందులు పడుతున్నాం. ఇద్దరు పిల్లలతో రోడ్డు పక్కన పూరి గుడిసెలో జీవనం సాగిస్తున్నాం. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్న తరుణంలో సొంత ఇల్లు ఉంటే బాగుంటుందని అనుకునేవాళ్లం. గత ప్రభుత్వంలో అర్జీలు పెట్టుకున్నాం. సెంటు భూమి కూడా ఇవ్వలేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలందరికీ ఇళ్లు ఇస్తామన్న మాట నెరవేర్చి మాలాంటి వాళ్ల బతుకుల్లో ఆనందం నింపారు. – సత్తిబాబు, దుర్గాభవాని, పెదరాయవరం సౌకర్యాల నిలయాలు పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు సందడిగా సాగుతున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా జాతీయ స్థాయి ప్రమాణాలకు మించి లోగిళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. గత సర్కారు హయాంలో కంటే అదనంగా 116 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్లను కడుతున్నారు. ఉచితంగా గృహోపకరణాలు, కాలనీల్లో మెరుగైన మౌలిక వసతులు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇళ్ల నిర్మాణం ద్వారా వైఎస్సార్ – జగనన్న కాలనీల్లో పేదలకు ఉత్తమ జీవన ప్రమాణాలు సమకూరనున్నాయి. దేశ చరిత్రలోనే తొలిసారిగా పేదలందరికీ 30.76 లక్షల ఇళ్ల పట్టాలను అక్క చెల్లెమ్మల పేరుతో పంపిణీ చేసి, రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణంలోనూ అంతే వేగంగా ముందుకు వెళుతోంది. ఇళ్ల స్థలాలు పొందిన వారికి రెండు దశల్లో మొత్తం 28,30,227 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నాడు అలా ► టీడీపీ సర్కారు హయాంలో 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు, 24 చదరపు అడుగుల్లో టాయిలెట్ నిర్మించారు. ► ఒక బెడ్ రూం, వంటగదితో కూడిన లివింగ్ రూమ్ నిర్మించారు. ► 2014–19 మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.8,082.89 కోట్లతో 6,03,986 ఇళ్లను మాత్రమే నిర్మించారు. ► మౌలిక సదుపాయాల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. నేడు ఇలా ► ఉత్తమ జీవన ప్రమాణాలతో ఇళ్లు నిర్మించేలా డిజైన్. ► 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం. ► ఒక బెడ్రూం, లివింగ్ రూం, కిచెన్, టాయిలెట్, వరండా. ► ఉచితంగా రెండు ఫ్యాన్లు, రెండు ట్యూబ్ లైట్లు, నాలుగు బల్బ్‌లు, సింటెక్స్ ట్యాంక్. ► కాలనీల్లో రహదారులు, డ్రైనేజీ, ఇతరత్రా సౌకర్యాల కల్పన -
సంతోషానికి 'పునాది'
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జగనన్న కాలనీల్లో గురువారం చేపట్టిన ‘మెగా ఇళ్ల శంకుస్థాపన’ కార్యక్రమం విజయవంతమయ్యింది. తొలి రోజు 13 జిల్లాల కలెక్టర్లు లక్ష ఇళ్లకు శంకుస్థాపనలు చేయించాలని లక్ష్యం నిర్ధేశించుకోగా, లబ్ధిదారులు కలసి రావడంతో 158 శాతం అధికంగా ఇళ్లకు శంకుస్థాపన జరిగింది. దేశ చరిత్రలో ఒకే రోజున ఒక రాష్ట్రంలో 2,02,190 ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులే స్వయంగా భూమి పూజ చేసుకోవడం ఇదే తొలిసారి. మెగా ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం శనివారం, ఆదివారం కూడా కొనసాగనుంది. సాక్షి, అమరావతి: సొంతింట్లో ఉండాలనేది అందరి కల. ఇది పెద్దోళ్లకు సుసాధ్యమైనా, పేదోళ్లకు మాత్రం కష్టసాధ్యం. సొంతింటి కల విషయంలో ఇక పేదోళ్లు దిగులు పడాల్సిన అవసరమే లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వారి చేయి పట్టుకుని నడిపిస్తోంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా తొలి విడతలోనే ఏకంగా 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గురువారం చేపట్టిన ‘మెగా ఇళ్ల శంకుస్థాపన’ కార్యక్రమం తొలి రోజు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. రాష్ట్రంలో సొంతింటి స్వప్నాన్ని సాకారం చేసుకోవడానికి నిరుపేదలు పోటీపడ్డారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో గృహాల నిర్మాణానికి కుటుంబ సభ్యులతో కలిసి పోటాపోటీగా శంకుస్థాపనలు చేయడంతో రాష్ట్రం అంతటా పండుగ వాతావరణం నెలకొంది. తొలి రోజు 13 జిల్లాల కలెక్టర్లు నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ఎక్కువగా.. 157 శాతం ఇళ్లకు శంకుస్థాపన జరగడం గమనార్హం. దేశ చరిత్రలో ఒకే రోజున ఒక రాష్ట్రంలో 2,02,190 ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులే స్వయంగా భూమి పూజ చేసుకోవడం ఇదే తొలిసారని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. మెగా ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమం శని, ఆదివారాల్లో కూడా కొనసాగనుంది. అనంతపురం జిల్లా ఉరవకొండలోని లేఅవుట్ వద్ద లబ్ధిదారులు పేదోళ్లందరికీ సొంతిల్లు రాష్ట్రంలో సొంతిల్లు లేని పేదలెవరూ ఉండకూడదనే లక్ష్యంతో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ పథకం కింద మొదటి దశలో 8,905 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో రూ.28,084 కోట్ల వ్యయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని గతనెల 3న సీఎం వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ గృహాలను 2022 జూన్ నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు. జగన్ దృఢ సంకల్పాన్ని సాకారం చేసేందుకు అధికార యంత్రాంగం సమష్టిగా ముందుకు కదిలింది. ఈనెల 1, 3, 4న మూడు రోజుల్లో రోజుకు లక్ష చొప్పున మూడు లక్షల ఇళ్లకు లబ్ధిదారులతో శంకుస్థాపన చేయించాలని నిర్దేశించుకుంది. ఈ మూడు రోజులూ యజ్ఞంలా పేదల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం.. గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 13 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. మెగా ఇళ్ల శంకుస్థాపనలో తొలి రోజున 1.28 లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. రికార్డు స్థాయిలో శంకుస్థాపనలు లబ్ధిదారులు గురువారం ఉదయమే వైఎస్సార్ జగనన్న కాలనీల్లో తమకు కేటాయించిన స్థలంలో.. సొంతింటి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడానికి కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా చేరుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. అధికారుల సమక్షంలో ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పోడూరు మండలం పండిత విల్లూరులోని వైఎస్సార్ జగనన్న కాలనీలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కృష్ణా జిల్లా పెనమలూరులోని కాలనీలో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ మెగా ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం.. గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు, 13 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించడం, ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులు పోటాపోటీగా కదలిరావడంతో గురువారం రాత్రి 7 గంటల సమయానికి 2,02,190 గృహాలకు శంకుస్థాపనలు జరిగాయి. ప్రత్యేక జాయింట్ కలెక్టర్ ద్వారా పర్యవేక్షణ దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒకేసారి 68,381 ఎకరాల భూమిని 30.76 లక్షల మంది నిరుపేద మహిళలకు ఇళ్ల స్థలాల రూపంలో పంపిణీ చేసి, రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇళ్ల నిర్మాణం కోసం గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు చొప్పున స్థలాలను పంపిణీ చేసి గృహాలను కూడా మంజూరు చేసింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో రూ.50,944 కోట్లతో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఈ కాలనీల్లో తాగునీరు, విద్యుత్, రహదారులు, భూగర్భ మురుగునీటి కాలువల వ్యవస్థ తదితర మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.32,909 కోట్లను ఖర్చు చేస్తోంది. తొలి దశలో 8,905 కాలనీల్లో 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని జూన్ నాటికి పూర్తి చేసేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా జాయింట్ కలెక్టర్–హౌసింగ్ పదవి సృష్టించి, యువ ఐఏఎస్ అధికారులను నియమించింది. పనులను పరుగులు పెట్టిస్తోంది. కృష్ణాజిల్లా నున్న గ్రామంలో ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన పనుల్లో లబ్ధిదారులు యజ్ఞంలా ఇళ్ల శంకుస్థాపన మెగా ఇళ్ల శంకుస్థాపనలో తొలి రోజు లబ్ధిదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పండుగ వాతావరణంలో 2.02 లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేసుకున్నారు. దేశ చరిత్రలో ఇదివరకెన్నడూ ఒకే రోజున లబ్ధిదారులే ఇంత భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్న దాఖలాలు లేవు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో తొలి దశ కింద 15.60 లక్షల ఇళ్లను జూన్‌లోగా పూర్తి చేయాలన్నది సీఎం వైఎస్ జగన్ దృఢ సంకల్పం. ఆలోగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం సమష్టిగా కృషి చేస్తున్నాం. తొలి రోజున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, జేసీలు, అధికారులు, లబ్ధిదారులకు కృతజ్ఞతలు. – అజయ్ జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గృహ నిర్మాణ శాఖ -
‘జగనన్న కాలనీలు’ సీఎం జగన్ మానసపుత్రికలు: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: జగనన్న కాలనీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానస పుత్రికలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇళ్లు మెగా గ్రౌండింగ్ డ్రైవ్‌లో భాగంగా గురువారం పుంగనూరులో జగనన్న కాలనీల నిర్మాణానికి పెద్దిరెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా జగనన్న కాలనీల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడు ఆనందపడేలా నివాస గృహాలు ఉంటాయని తెలిపారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని పెద్దరెడ్డి పేర్కొన్నారు. అనంతపురం: ఉరవకొండ జగనన్న కాలనీల్లో మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా, ఇళ్ల నిర్మాణాలకు మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గంగాధర్‌గౌడ్ పాల్గొన్నారు. ► రాయదుర్గం పట్టణ బిటిపి లేఅవుట్లో జగనన్న కాలనీల్లో మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళాలో భాగంగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ► ఆలమూరు లేఅవుట్లో జగనన్న ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి భూమి పూజ చేశారు. విశాఖపట్నం: పెందుర్తి మండలం గుర్రంపాలెంలో జగనన్న కాలనీల నిర్మాణానికి మంత్రి అవంతి శ్రీనివాస్ భూమి పూజ చేశారు. కర్నూలు: ఎమ్మిగనూరు మండలం బోడబండ గ్రామంలో జగనన్నకాలనీలో గృహ నిర్మాణాల్లో భాగంగా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి భూమి పూజ చేశారు. కృష్ణా: మచిలీపట్నం మండలం రుద్రవరం గ్రామంలో మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న 600 ఇళ్ల నిర్మాణ పనులకు మంత్రి పేర్నినాని శంకుస్థాపన చేశారు. విజయవాడ రూరల్ మండలం నున్నలో వైఎస్సార్ జగనన్న మోడల్ లేఅవుట్లో లబ్ధిదారులతో కలసి ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భూమిపూజ చేశారు. పశ్చిమగోదావరి: ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని భీమడోలులో జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు పాల్గొని భూమి పూజ చేశారు. వైఎస్సార్ కడప: కడప నియోజకవర్గ పరిధిలో పలు జగనన్న లేఅవుట్లలో మెగా గ్రౌండింగ్ మేళా కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాష, మేయర్ సురేష్ బాబు పాల్గొన్నారు. ప్రకాశం: జరుగుమల్లి మండలం కె బిట్రగుంటలో జగన్న కాలనీలో ఇళ్లకు నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ మాదాశి వెంకయ్య శంఖుస్థాపన చేశారు. విజయనగరం: కొమరాడ మండలం గుణానుపురం గ్రామంలో మెగా హౌసింగ్ మేళాను సబ్ కలెక్టర్ వేంకటేశ్వరులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు. చీపురుపల్లి అగ్రహారంలో జగనన్న ఇళ్లు నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఏపీలో పేదలందరికీ ప్రభుత్వం ఇళ్లు మెగా గ్రౌండింగ్ డ్రైవ్‌ను చేపట్టింది. గురువారంతోపాటు, ఈ నెల 3, 4 తేదీల్లో అన్ని జిల్లాల్లో పెద్దఎత్తున గృహనిర్మాణ శంకుస్థాపనలు జరగన్నాయి. రోజుకు లక్ష ఇళ్ల చొప్పున మూడు రోజుల్లో 3 లక్షల ఇళ్లకు శంకుస్థాపనలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని జిల్లాల్లో పెద్దఎత్తున గృహనిర్మాణ శంకుస్థాపనలు జగరనున్నాయి. వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో శంకుస్థాపన కార్యక్రమాల్లో ఇన్ఛార్జ్, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొనున్నారు. చదవండి: వైఎస్సార్ స్వప్నం పోలవరం.. జగన్ హయాంలో సాకారం -
ఏపీలో నేటి నుంచి పేదలందరికీ ఇళ్లు మెగా గ్రౌండింగ్ డ్రైవ్
-
సామూహిక ఇళ్ల శంకుస్థాపనలకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల’ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం తలపెట్టిన సామూహిక ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అధికారులను ఆదేశించారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న సామూహిక ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంపై మంత్రి బుధవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈనెల 1, 3, 4వ తేదీల్లో జరిగే సామూహిక శంకుస్థాపన కార్యక్రమాలతో పాటు ఈనెల 10 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల గృహాలకు శంకుస్థాపన పూర్తికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. సెప్టెంబర్ నాటికి మొదటి దశలో 15.6 లక్షల గృహాలకు శంకుస్థాపనలు పూర్తి చేసి, 2022 జూన్ నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. గ్రామ స్థాయి సిబ్బంది వరకు సమన్వయం చేసుకుంటూ నిర్దేశిత లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, చీఫ్ ఇంజనీర్ పి.శ్రీరాములు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
Andhra Pradesh: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర రైతన్నలకు ప్రయోజనం కలిగేలా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తూ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని జూలై 8వతేదీన రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులకు మేలు చేకూర్చే పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. వ్యవసాయ రంగంలో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, పంటలకు మెరుగైన ధర కల్పించే విధంగా కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ విధానానికి ఆమోదం తెలిపింది. వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలను అందించే ఏకీకృత వ్యవస్థను నెలకొల్పేందుకు ‘ఈ–మార్కెటింగ్’ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్ రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తుండటాన్ని మంత్రివర్గం తీవ్రంగా ఖండించింది. దీనిపై కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశం నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) మీడియాకు తెలిపారు. ఆ వివరాలు ఇవీ.. రైతు పథకాలకు శ్రీకారం.. వైఎస్సార్ జయంతి సందర్భంగా జూలై 8న రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన 1,898 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల శాశ్వత భవనాలను ప్రారంభిస్తారు. వాటితో పాటు ఇంకా ప్రారంభించేవి.. – రూ.79.50 కోట్లతో నిర్మించిన 100 వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్, ఆక్వా, సీఏడీడీఎల్ ల్యాబ్స్.. – రూ.96.64 కోట్లతో నిర్మించిన 645 తొలి విడత కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు.. – రూ.31.74 కోట్లతో నిర్మించిన 53 వెటర్నరీ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, రూరల్ లైవ్ స్టాక్ యూనిట్లు – పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం రూ.7.53 కోట్లతో నిర్మించిన టెలీ మెడిసిన్ కాల్ సెంటర్ – పశు – మత్స్యదర్శిని మ్యాగజైన్ – ఆర్బీకేల ద్వారా పశు సంవర్థక, ఆక్వా రంగాలకు ఇన్పుట్స్ పంపిణీ.. వీటికి శంకుస్థాపన... – ఆర్బీకేల స్థాయిలో 1,262 గోడౌన్ల నిర్మాణానికి శంకుస్థాపన. – ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒకటి చొప్పున ‘పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంటర్ల’ నిర్మాణానికి శంకుస్థాపన. రూ.200.17 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. అనకాపల్లి బెల్లం, రాజమండ్రి అరటి, శ్రీకాకుళం జీడిపప్పు, చిత్తూరు మామిడి, బాపట్ల చిరుధాన్యాలు, వైఎస్ఆర్ కడప అరటి, హిందూపురం వేరుశనగ, కర్నూలులో టమాట ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణం. – రూ.212.31 కోట్లతో మార్కెట్ యార్డుల్లో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు. – రూ.45 కోట్లతో కొత్తగా రైతు బజార్ల నిర్మాణానికి శంకుస్థాపన. 6 నూతన రైతు బజార్ల ప్రారంభం. ఫుడ్ ప్రాసెసింగ్ విధానానికి ఆమోదం పంటలకు మెరుగైన ధర కల్పిస్తూ రైతు కేంద్రంగా కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పంటల సాగుకు తోడ్పాటు అందించి ప్యాకేజింగ్ పరిశ్రమను ప్రోత్సహిస్తారు. రైతుల ఆదాయాలను పెంచాలన్నది లక్ష్యం. తద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల రంగాన్ని బలోపేతం చేస్తారు. నాణ్యమైన, మెరుగైన వంగడాలను సాగు చేసేలా పంటల ప్రణాళిక అమలు చేస్తారు. అతి పెద్ద కంపెనీలతో ఒప్పందాల ద్వారా విస్తారమైన మార్కెటింగ్ అవకాశాలను అందుబాటులోకి తెస్తారు. పంటలు పండే ప్రాంతాలకు సమీపంలోనే ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్ నెలకొల్పి నైపుణ్యాలను పెంపొందిస్తారు. ముడి పదార్థాల కొరత లేకుండా ఆర్బీకేలతో అనుసంధానం చేసి పంటలు సాగు చేసేలా, మంచి ఉత్పత్తులు వచ్చేలా చర్యలు చేపడతారు. ఉటుకూరులో కడక్‌నాథ్ కోళ్ల పౌల్ట్రీ కడప జిల్లా ఉటుకూరులో కడక్‌నాథ్ జాతి కోళ్ల పౌల్ట్రీ ఫాం ఏర్పాటును మంత్రివర్గం ఆమోదించింది. ఇప్పటికే అక్కడున్న పౌల్ట్రీఫాంను దీనికి అనుగుణంగా తీర్చిదిద్దుతారు. నాటుకోడి మాంసం, నాటుకోడి గుడ్లకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జూలై 8న శంకుస్థాపన చేస్తారు. 20 వేల కడక్‌నాథ్ జాతి కోడిపిల్లలను ఉత్పత్తి చేసేలా మౌలిక సదుపాయాల కల్పిస్తారు. మొబైల్ వెటర్నరీ అంబులెన్స్‌లు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 175 మొబైల్ వెటర్నరీ అంబులెన్స్‌లను ప్రవేశపెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. 108, 104 తరహాలో ఈ అంబులెన్స్‌ల ద్వారా పశువైద్యం అందిస్తారు. మొబైల్ వాహనాల్లో హైడ్రాలిక్ లిఫ్ట్‌తోపాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. నిపుణులైన సిబ్బందిని నియమిస్తారు. కొత్త వాహనాలకు రూ.63 కోట్లతోపాటు నిర్వహణ ఖర్చులు కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ. 89.95 కోట్లు వెచ్చిస్తుంది. రైతులు కాల్ సెంటర్ల ద్వారా వెటర్నరీ డాక్టర్లుకు నేరుగా ఫోన్ చేసి పశువుల అనారోగ్య సమస్యలపై వివరాలు పొందవచ్చు. ఏపీ ఫార్మర్స్ ఇ–విక్రయ కార్పొరేషన్ లిమిటెడ్ రైతులు,కొనుగోలుదారులు, వ్యాపారులను అనుసంధానించేందుకు ఇ–మార్కెటింగ్ ప్లాట్‌ఫాం ‘ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ ఇ–విక్రయ కార్పొరేషన్ లిమిటెడ్’ (ఏపీఎఫ్‌ఈవీసీఎల్) ఏర్పాటును మంత్రివర్గం ఆమోదించింది. రైతుల ఉత్పత్తులను అంతర్రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వ్యాపారులతో ఇ–ప్లాట్‌ఫాం అనుసంధానిస్తుంది. ఫైనాన్స్, ఇన్సూరెన్స్, వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్, రియల్‌టైమ్ ప్రొడక్షన్ అప్డేట్స్, మిగులు నుంచి డిమాండ్ వరకూ మ్యాపింగ్, మార్కెట్ లింకేజీ, ట్రేడ్ ఫెసిలిటేషన్ తదితర అవసరాలను తీరుస్తారు. వైఎస్సార్ బీమా పథకానికి ఆమోదం దారిద్య రేఖకు దిగువనున్న కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆదుకునేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ బీమా’ పథకాన్ని మంత్రివర్గం ఆమోదించింది. పథకం నుంచి కేంద్ర ప్రభుత్వం వైదొలగిన నేపథ్యంలో పూర్తి బాధ్యతలు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్సార్ జగనన్న కాలనీల నిర్మాణం వేగవంతం పేదలందరికీ ఇళ్ల నిర్మాణం పథకం పనులు వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ పథకం కింద మొత్తం 28.30 లక్షల ఇళ్లతో ప్రభుత్వం 17,005 వైఎస్ఆర్ జగనన్న కాలనీలను నిర్మిస్తోంది. ప్రత్యేక క్యాంపెయిన్‌గా జూలై 1, 3, 4 తేదీల్లో ఈ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. జూలై 10 కల్లా 7 లక్షలు, ఆగస్టు 31లోగా 3 లక్షల ఇళల్లో నిర్మాణ పనులు ప్రారంభం కావాలన్నది లక్ష్యం. ఆగస్టు 10 – సెప్టెంబరు 30 మధ్య మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఒక్కో ఇంటిలో 340 చదరపు అడుగుల్లో లివింగ్ రూమ్, బెడ్రూమ్, కిచెన్, టాయిలెట్, వరండా ఉంటాయి. 2 ఫ్యాన్లు, 2 ట్యూబ్‌లైట్లు, 4 బల్బులు ఏర్పాటు చేస్తారు. మొదటి విడతలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని జూన్ 2022 కల్లా పూర్తి చేయాలని నిర్ణయించారు. రెండో విడతలో మిగిలిన 12.70 లక్షల ఇళ్లను నిర్మిస్తారు. పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. జూన్ 3న ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించగా ఇప్పటికే 3.36 లక్షల ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయి. అమ్మ ఒడి, వసతి దీవెన కింద ల్యాప్‌టాప్‌లు జగనన్న అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెనల కింద లబ్ధిదారుల సమ్మతితో నగదుకు బదులుగా ల్యాప్‌టాప్‌ల పంపిణీని మంత్రివర్గం ఆమోదించింది. 9 నుంచి 12వ తరగతి విద్యార్థుల్లో 8,21,655 మంది ల్యాప్‌టాప్‌లు కావాలని కోరారు. జగనన్న వసతి దీవెన లబ్ధిదారుల్లో 1,10,779 మంది ల్యాప్‌టాప్‌లు కోరారు. డ్యుయల్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్ డిస్క్, 14 అంగుళాల స్క్రీన్, విండోస్ 10 (ఎస్టీఎఫ్ మైక్రోసాఫ్ట్), ఓపెన్ ఆఫీస్ (ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్) సదుపాయాలున్న లెనోవా, డెల్, ఏసర్, హెపీ ల్యాప్‌టాప్‌లను మూడేళ్ల వారంటీతో పంపిణీ చేస్తారు. మరమ్మతులు అవసరమైతే గ్రామ/ వార్డు సచివాలయాల ద్వారా ఫిర్యాదు చేసి సేవలు పొందవచ్చు. కొత్తగా రెండు విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో కొత్తగా రెండు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదించింది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట వద్ద ఆంధ్రకేసరి మల్టీ డిసిప్లినరీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తారు. మొదటి దశలో రూ.339కోట్లు వెచ్చిస్తారు. ప్రస్తుతం ఉన్న పీజీ సెంటర్‌ను మరోచోటకు మారుస్తారు. 19 డిపార్ట్మెంట్లతో ఏర్పాటయ్యే ఈ వర్శిటీలో 50 మంది టీచింగ్, 50 మంది నాన్ టీచింగ్ సిబ్బందిని నియమిస్తారు. తొలుత వెయ్యిమంది విద్యార్థులతో విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తారు. విజయనగరంలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ(జేఎన్టీయూ–కే) కాలేజీని జేన్టీయూ– విజయనగరం యూనివర్శిటీగా మారుస్తారు. ఉత్తరాంధ్ర విద్యార్థులకు ప్రయోజనం కలిగించే ఈ విశ్వవిద్యాలయానికి అదనంగా 24 టీచింగ్ పోస్టులు, 17 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేశారు. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ నిర్మాణానికి ఆమోదం పట్టణాలు, నగరాల్లో మధ్యతరగతి ప్రజలకు లాభాపేక్ష లేకుండా అభివృద్ధి చేసిన ఇళ్ల స్థలాల ఏర్పాటుకు ఉద్దేశించిన ‘జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్’ పథకాన్ని మంత్రివర్గం ఆమోదించింది. 150, 200, 240 చదరపు గజాల విస్తీర్ణంలో మూడు రకాలుగా ప్లాట్లు అందించే ఈ పథకానికి సంబంధించి విధివిధానాలను ఖరారు చేశారు. ఒక కుటుంబానికి ఒకటే ప్లాటు కేటాయిస్తారు. దరఖాస్తుదారుడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. ఆదాయం ఏడాదికి గరిష్టంగా రూ.18 లక్షల లోపు ఉండాలి. 18 ఏళ్ల పైబడి వయసు ఉండాలి. లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. 60 అడుగుల బీటీ రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, తాగునీటి సరఫరా, భూగర్భ మురుగునీటి పారుదల సదుపాయం, పార్కులు, ఓపెన్ స్పేస్ లాంటి అన్ని వసతులతో స్మార్ట్‌టౌన్లు ఏర్పాటవుతాయి. ఇప్పటికే స్మార్ట్ టౌన్‌షిప్స్‌కు విశేష స్పందన వచ్చింది. 3.79 లక్షల దరఖాస్తులు అందాయి. టిడ్కో నిధుల సమీకరణకు అనుమతి ఏపీ టిడ్కో ఇళ్ల నిర్మాణానికి నిధుల సమీకరణకు మంత్రివర్గం అనుమతించింది. రూ.5,990.30 కోట్ల రుణ సేకరణకు బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. మొత్తం రూ.12,101 కోట్ల ఖర్చుతో 2,62,216 ఇళ్లను ప్రభుత్వం పూర్తి చేయనుంది. ఐటీ విధానానికి ఆమోదం 2021– 2024 ఐటీ విధానాన్ని మంత్రివర్గం ఆమోదించింది. మౌలిక సదుపాయాలను గణనీయంగా అభివృద్ధి చేస్తారు. 3 కాన్సెప్ట్ సిటీలు, గ్రామ పంచాయతీ స్థాయిలో డిజిటల్ లైబ్రరీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. గ్రామాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పిస్తుంది. ఎక్కడనుంచైనా పనిచేసే వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ విధానంలో నైపుణ్యాలను మెరుగుపరచడానికి పెద్దపీట వేశారు. ఇందుకోసం విశాఖపట్నంలో హై ఎండ్ స్కిల్స్‌లో భాగంగా ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రీసెర్చ్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తారు. ఎస్ఐపీబీ ప్రతిపాదనలకూ ఆమోదం లభించింది. సచివాలయాల్లోనే భూ వినియోగ మార్పిడి వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకునే దరఖాస్తులను గ్రామ సచివాలయాల ద్వారా పరిష్కరించేలా చట్ట సవరణలను మంత్రివర్గం ఆమోదించింది. భవనాలు, లే–అవుట్ల అనుమతులతో వీటిని ఏకీకృతం చేస్తారు. ఏకీకృత కన్వర్షన్ రేటును కంప్యూటర్ ద్వారా ధర లెక్కించే విధానాన్ని తెస్తున్నారు. ఏపీఐఐసీ ద్వారా భూమి పొందే పరిశ్రమలకు ఈ విధానం నుంచి మినహాయింపు ఇస్తారు. వాటికి ఎప్పటికప్పుడు ప్రకటించే విధానాలు వర్తిస్తాయి. ఆక్వా కల్చర్, డెయిరీ, పౌల్ట్రీ రంగాలకు దీన్నుంచి మినహాయింపునిస్తారు. వ్యవసాయేతర భూములపై నిరంతర వివరాల సేకరించి రికార్డులు తయారు చేస్తారు. కాకినాడలో ఎల్ఎన్జీ టెర్మినల్ కాకినాడ డీప్ సీ వాటర్ పోర్టులో ఈపీసీఎల్ ఎల్ఎన్జీ టెర్మినల్‌కు మంత్రివర్గం అనుమతినిచ్చింది. రూ.1, 600 కోట్లతో టెర్మినల్ అభివృద్ధి. రూ.200 కోట్లతో ఎల్ఎన్జీ స్టేషన్ల ఏర్పాటు. మొదటి విడతలో రూ.3,600 కోట్ల ఖర్చుతో దాదాపు 700 మందికి ఉపాధి అవకాశాలు. సీమ కరువు నివారణ పథకానికి రూ.864.18 కోట్లు పుట్టపర్తిలో చెరువులు నింపే రూ.864.18 కోట్ల ప్రాజెక్టును మంత్రివర్గం ఆమోదించింది. రాయలసీమ కరవు నివారణ పథకం కింద పుట్టపర్తి నియోజకవర్గంలో హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి గ్రావిటీ, లిఫ్ట్ ద్వారా 195 చెరువుల్లో నీరు నింపేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఇతర కీలక నిర్ణయాలు.... ► కాకినాడ ఎస్ఈజెడ్లో 2,180 ఎకరాల భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం. రైతులకు మేలు జరిగేలా స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి మినహాయింపు ఇచ్చేందుకు అనుమతి. ► సమగ్ర భూ సర్వే కోసం చట్ట సవరణలకు ఆమోదం. వ్యవసాయేతర భూమికి యాజమాన్య హక్కు పత్రాలు ఇచ్చేలా సవరణలు. ఆస్తిపరమైన వివాదాలు, కేసులకు చెక్ పెట్టేలా హక్కు పత్రాల జారీ. ► గ్రామ కంఠాల్లో నివసిస్తున్న వారికి పట్టాలు ఇచ్చేలా పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు ఆమోదం. ► కొత్తగా 104 వాహనాలు 539 కొనుగోలు, నిర్వహణకు అనుమతి. ఇందుకోసం ఈ ఏడాది రూ.165.09 కోట్లు వ్యయం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు చర్యలు. ► ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం వద్ద కిడ్నీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, మెడికల్ కాలేజీ నిర్మాణానికి 50.33 ఎకరాల భూమి కేటాయిస్తూ నిర్ణయం. ► ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం మామిడిపాలెం వద్ద సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి కోసం 6.17 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించాలని నిర్ణయం. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిర్మించి వైద్య కళాశాలకు అనుసంధానం. ► జిల్లా పరిషత్ సమావేశాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల కార్పొరేషన్ల ఛైర్మన్లు శాశ్వత ఆహ్వానితులుగా హాజరయ్యేందుకు మంత్రివర్గం ఆమోదం. జిల్లా పరిషత్‌లలో రెండో వైస్ ఛైర్మన్ పదవికి అవకాశం కల్పిస్తూ చట్ట సవరణలకు ఆమోదం. ► 25 బీసీ కార్పొరేషన్ల స్థానంలో 56 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు బైలాస్కు మంత్రివర్గం ఆమోదముద్ర. ► చిత్తూరు జిల్లా పుంగనూరులో కొత్తగా వ్యవసాయ పాలిటెక్నిక్ ఏర్పాటుకు ఆమోదం. ఏటా 40 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తూ రెండేళ్ల కోర్సు నిర్వహణ. ► కడప జిల్లా బి.కోడూరు మండలం ప్రభలవీడులో వెటర్నరీ డిస్పెన్సరీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం. ► శ్రీకాకుళం జిల్లా పలాసలో కొత్త డిగ్రీ కాలేజీకి 27 టీచింగ్ పోస్టులు, 14 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు. ► కడప జిల్లా రాయచోటి డిగ్రీ కాలేజీకి 29 టీచింగ్ పోస్టులు, 14 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు. ► కర్నూలు జిల్లా బేతంచర్లలో కొత్తగా ఏర్పాటైన ఐటీఐకి 27 పోస్టులు, నంద్యాల ఐటీఐకి 29 పోస్టులు మంజూరు. మొత్తం 56 పోస్టుల మంజూరుకు అనుమతి. ► అనంతపురం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో 28 పోస్టుల భర్తీకి ఆమోదం. ► తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు అనుమతి, 19 పోస్టులు మంజూరు. ► విజయవాడ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, తిరుపతి కళ్యాణి డ్యాం పీటీసీ, గ్రే హౌండ్స్, విజయనగరం పీటీసీ ప్రిన్సిపల్, విజయవాడ సిటీ సెక్యూరిటీ వింగ్, మంగళగిరి పీటీఓ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయం. ► విజయవాడలోని గుణదలలో కొత్తగా శాంతిభద్రతల పోలీస్ స్టేషన్ ఏర్పాటు. మాచవరం, సత్యనారాయణపురం స్టేషన్ల పరిధిలోని కొన్ని ప్రాంతాలను కొత్త పోలీస్‌స్టేషన్ పరిధిలోకి మార్పు. ఈ పోలీస్ స్టేషన్‌కు ఒక సీఐ, 15 మంది కానిస్టేబుల్ పోస్టులు మంజూరు. ► రెడ్డి, కమ్మ, క్షత్రియ కార్పొరేషన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం. ► కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్ కార్యక్రమానికి మంత్రివర్గం ఆమోదం.