సాక్షి, తిరుపతి: ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చింది కేవలం రూ.1.50 లక్షలేనని, పేదల ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల విలువైన భూమి సహా రూ.3.50 లక్షలు చొప్పున కేటాయించిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. బుధవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.13.50 లక్షలు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వ గుర్తుతోపాటు కేంద్ర ప్రభుత్వ గుర్తు కూడా వేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం 30 వేల ఎకరాల ప్రైవేట్ భూమి సేకరించి మౌలిక సదుపాయాలు కల్పించామని మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment