cherukuvada sriranganatharaju
-
ఆచంట నుంచే పోటీ... గెలిచి మళ్లీ మంత్రి పదవి చెప్పడుతా
పెనుగొండ: ఆచంట నుంచి నూటికి నూరు శాతం పోటీ చేస్తున్నామని, విజయం సాధిస్తా మని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. సీఎం జగన్‌ను మరోసారి సీఎం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సీఎంగా జగన్ పాలన చేపట్టి నాలుగేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా మంగళవారం కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, నాయకుల ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. పోటీని తట్టుకోలేక ప్రతిపక్ష నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని తిప్పికొట్టారు. నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచి విజయం సాధించి మరోసారి మంత్రి పదవిని చేపట్టబోతున్నామని చెప్పారు. నాలుగేళ్లలో ఆచంట నియోజకవర్గంలో రూ.601 కోట్ల అభివృద్ధి పనులు చేశామని.. దీంతో పాటు రూ. 1153 కోట్లు అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమచేశామన్నారు. అభివృద్ధిపై దుష్ప్రచారం చేస్తున్నారని.. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువ అయ్యామన్నారు. వరదల్లోనూ, కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలిచామని, గత ప్రజా ప్రతినిధులు ఏనాడైనా పైసా విదిల్చారా అని ప్రశ్నించారు. -
రంగనాథ్ అన్న చాలా అద్భుతంగా చేశారు: సీఎం వైఎస్ జగన్
-
రాష్ట్రానికి తీరని లోటు
-
ఓటీఎస్‌కు మంచి స్పందన
సాక్షి, అమరావతి: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి ఆదరణ పెరుగుతోంది. పథకం వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 8,11,697 మంది ఈ పథకం కింద లబ్ధిపొందడానికి దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాల వారీగా పరిశీలించినట్లయితే తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1.14 లక్షలు, పశ్చిమ గోదావరిలో 1.03 లక్షలు, గుంటూరు జిల్లాలో 89 వేల మంది లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. 8.11 లక్షల మందిలో 6 లక్షల మంది గడిచిన 10 రోజుల్లో ముందుకు రావడం విశేషం. రూ.10వేల కోట్ల రుణాల మాఫీ ఇక గృహ నిర్మాణ సంస్థ ద్వారా 1983 నుంచి 2011 మధ్య రుణాలు పొంది ఇళ్లు నిర్మించుకున్న వారికి ప్రభుత్వం ఈ పథకంతో భారీ ఊరట కల్పించింది. ఓటీఎస్ రూపంలో రూ.10వేల కోట్ల మేర రుణాలు మాఫీ చేసింది. దీంతోపాటు పేదలపై తలకు మించిన భారం మోపకుండా తక్కువ మొత్తంలో ధరలు నిర్దేశించి వాటిని చెల్లించిన వారికి ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తోంది. ఎటువంటి రుసుములు లేకుండా రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా రూ.6వేల కోట్లు, ఇలా మొత్తంగా రూ.16 వేల కోట్ల మేర ప్రభుత్వం పేదలకు లబ్ధి చేకూరుస్తోంది. రేపటి నుంచి పంపిణీ స్వచ్ఛందంగా పథకం వినియోగించుకోవడానికి ముందుకు వచ్చిన వారి పేర్లపై ఇళ్ల రిజిస్ట్రేషన్లను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే చేస్తున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 26,023 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం రేపటి (మంగళవారం) నుంచి రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలను రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేపట్టనుంది. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రారంభించనున్నారు. గతంలో చెల్లించిన వారికి కూడా.. 2000 నుంచి 2014 మధ్య వన్‌టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) వినియోగించుకుని, 2014–19 మధ్య ఓటీఎస్ లేకుండా రుణాలు చెల్లించిన వారికి కూడా ఇళ్లపై హక్కులు కల్పించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. 2000–2014 మధ్య 2.31 లక్షల మంది రుణాలు చెల్లించారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో వడ్డీ, అసలుతో కలిపి 43 వేల మంది లబ్ధిదారులు గృహ నిర్మాణ సంస్థకు రుణాలు చెల్లించారు. అవగాహన కల్పిస్తున్నాం పథకంతో కలిగే ప్రయోజనాలపై అర్హులకు అవగాహన కల్పిస్తున్నాం. అధికార యంత్రాంగం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. 22ఏ జాబితా నుంచి స్థలాలను తొలగించి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసిస్తోంది. దీంతో బ్యాంకుల్లో ఇళ్లను తనఖా పెట్టుకోవడానికి, అమ్మడానికి, వారసుల పేర్లపై బదిలీ చేయడానికి వీలుంటుంది. గతంలో ఏ ప్రభుత్వం చేయని మేలును వైఎస్ జగన్ ప్రభుత్వం చేస్తోంది. – చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణ సంస్థ నుంచి ఐదుసార్లు సిఫార్సు చేసినా ఓటీఎస్ కింద వడ్డీలు మాఫీ చేయడానికి చంద్రబాబు ఒప్పుకోలేదు. ప్రస్తుతం వడ్డీ, అసలు రెండింటిలో రాయితీ ఇవ్వడంతో పాటు, ఇళ్లపై సంపూర్ణ హక్కులు కల్పిస్తుంటే టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. అర్హులు దీన్ని గమనించాలి. అర్హులైన ప్రతిఒక్కరూ దీని ప్రయోజనాలను తెలుసుకుని పథకాన్ని వినియోగించుకోవాలి. – దావులూరి దొరబాబు, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ -
గ్రామీణ వ్యవస్థలో సీఎం జగన్ సమూల మార్పులు తెచ్చారు
-
ఇది పేదలకు స్థిరాస్తిని అందించే మహాయజ్ఞం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం అమలులో అధికారుల పాత్ర కీలకమని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. ఈ పథకం నిరుపేదలకు స్థిరాస్తిని అందించే మహాయజ్ఞం అని తెలిపారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంపై మంత్రి అధ్యక్షతన విజయవాడలోని ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం 13 జిల్లాల హౌసింగ్ జేసీలు, ప్రాజెక్టు డైరెక్టర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సెప్టెంబర్ నెలాఖరుకు మొదటి దశలో నిర్మింప తలపెట్టిన ఇళ్లన్నింటికి శంకుస్థాపనలు పూర్తి కావాలన్నారు. జిల్లా స్థాయి అధికారులు తమ పరిధిలోని అన్ని లే అవుట్లను సందర్శించి వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైఎస్సార్, జగనన్న కాలనీలు అన్ని వసతులతో కళకళలాడుతూ రాష్ట్రంలో మోడల్ గ్రామాలు, కాలనీలుగా నిలవాలన్నారు. సీఎం వైఎస్ జగన్‌సూచించిన విధంగా పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని చెప్పారు. గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ మాట్లాడుతూ.. మొదటి దశ శంకుస్థాపనలు జరిగిన ఇళ్ల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. సమావేశంలో మంత్రి, అధికారులు జిల్లాల వారీగా పథకం అమలు, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై సమగ్రంగా సమీక్షించారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాహుల్‌పాండే, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దావులూరి దొరబాబు, ఎండీ భరత్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
వందేళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా ఇళ్ల నిర్మాణం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా వందేళ్లు చెక్కు చెదరకుండా నిలిచి ఉండేలా.. అత్యంత నాణ్యంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చెప్పారు. వెలగపూడి అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు రూ.1,08,553 కోట్లతో 28,30,227 మంది పేదలకు 2,023 నాటికి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. తొలి దశలో ఇప్పటికే 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని, రెండో దశలో 12.70 లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. ఇళ్ల నిర్మాణాల కాలనీల్లో రూ.1,200 కోట్లతో తాగునీటి వసతి కల్పించడంతో పాటు రూ.32,909 కోట్లతో రహదారులు, విద్యుత్, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రతి జిల్లాకు ఒక జాయింట్ కలెక్టర్‌ను ప్రత్యేకంగా నియమించినట్టు చెప్పారు. ప్రతి లేఅవుట్‌కు ఒక మండల స్థాయి అధికారిని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక జిల్లా స్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించినట్టు తెలిపారు. ఒక్కో ఇంటి నిర్మాణాన్ని రూ.1.80 లక్షలతో చేపట్టామని, లబ్ధిదారులకు ప్రభుత్వం ఇసుక ఉచితంగా అందిస్తోందన్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, అధికారులు ఆయా కంపెనీలతో సంప్రదింపులు జరిపి సిమెంట్, ఇనుము, మెటల్ తదితర మెటీరియల్‌ను మార్కెట్ ధర కంటే తక్కువకు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఆగస్టు 7 లోగా నియోజకవర్గం, డివిజన్ స్థాయిలో సమావేశాలు నిర్వహించి, ఇళ్ల నిర్మాణాల్లో ఎదురవుతున్న సమస్యలపై చర్చించి.. పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. -
పేదల ఇళ్ల కోసం 30 వేల ఎకరాలు: శ్రీరంగనాథరాజు
సాక్షి, అమరావతి: పేదల కోసం సీఎం రూ.12 వేల కోట్లతో ఇళ్ల పట్టాల కోసం భూములు సేకరించామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు తెలిపారు. ఇళ్ళ నిర్మాణంపై విప్‌లు, ఎమ్మెల్యేలతో గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ, 30 వేల ఎకరాలు పేదల ఇళ్ల కోసం సేకరించామని పేర్కొన్నారు. ప్రస్తుతం లే అవుట్లుగా అభివృద్ధి చేసి మొత్తం సదుపాయాలు కల్పిస్తున్నామని, పేదలకు మంచి ఇళ్లను నిర్మించి ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారని తెలిపారు. 30 లక్షల మంది పేదలకు ఉచితంగా ఇసుక ఇస్తున్నాం. సిమెంట్, ఐరన్, మెటల్‌ను తక్కువ ధరకే అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. లక్షా 80 వేల ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వ సహకారాన్ని అందిస్తున్నాం. ఎమ్మెల్యేలతో చర్చించి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకున్నాం. వాటన్నింటిని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తామని’’ శ్రీరంగనాథరాజు తెలిపారు. మొదటగా లే అవుట్లకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. లబ్దిదారులకు నచ్చినట్లు ఇల్లు కట్టుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గతలో 240 చదరపు అడుగులు ఇచ్చేవారు.. ఇప్పుడు 340 చ.అడుగులు ఇస్తున్నామని వివరించారు. లబ్దిదారుల ప్రాధాన్యత ఆధారంగా నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. రూ.32 వేల కోట్లతో శాశ్వత డ్రైనేజీ, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నామని, కొత్తగా 17,005 కొత్త కాలనీలు నిర్మిస్తున్నామని మంత్రి శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. -
చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి చెరుకువాడ
-
లే అవుట్ల వద్దకే ఇసుక, సిమెంట్, స్టీలు
కర్నూలు(సెంట్రల్): వైఎస్సార్–జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు లే అవుట్ల వద్దకే ఇసుక, సిమెంట్, స్టీలు తెప్పించి లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. ప్రతి 20 ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించేందుకు ఓ మండల స్థాయి అధికారిని నియమించామన్నారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, శాసనమండలి విప్ గంగుల ప్రభాకరరెడ్డితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలసి ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆగస్టు మొదటి వారం నుంచి నియోజకవర్గాలవారీగా పర్యటించి.. వైఎస్సార్–జగనన్న కాలనీల్లో జరుగుతున్న పనులను పరిశీలిస్తామని తెలిపారు. రూ.32 వేల కోట్లతో డ్రెయినేజీలు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీలు, నీళ్లు, కరెంటు, రోడ్లతో పాటు ఉపాధి కల్పన యూనిట్లు స్థాపించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. మంచినీరు, విద్యుత్ సదుపాయాలను కల్పించేందుకు ఇప్పటికే రూ.1,200 కోట్లు విడుదల చేశామన్నారు. లక్షలాది మంది అక్కచెల్లెమ్మల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నిర్మాణాæత్మకమైన సలహాలు ఎవరు ఇచ్చినా తీసుకుంటామని మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. -
ఇళ్ల నిర్మాణంపై ఈ ఏడుపేంటి!
ఏలూరు (మెట్రో)/ఉండి: పేద కుటుంబాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇళ్లు నిర్మిస్తుంటే.. జీర్ణించుకోలేని ఎల్లో మీడియా విషపు రాతలతో బురద చల్లుతోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ముత్యాలమ్మ గుడి వద్ద లే–అవుట్లో నిర్మిస్తున్న గృహాలను హౌసింగ్ జేసీ సూరజ్ ధనుంజయ్‌తో కలసి శనివారం మంత్రి పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం ఏలూరులోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో పేదలకు సెంటు స్థలమైనా ఇచ్చాడా అని నిలదీశారు. ఆనాడు రామోజీరావుకు ఇది కనిపించలేదా అని ప్రశ్నించారు. ఒక్కో పేద కుటుంబానికి రూ.15 లక్షల ఆస్తి చొప్పున 31 లక్షల మంది పేదలకు ఆస్తులు ఇస్తుంటే ఓర్వలేకే విషపు రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం జరిగితే చూడగల శక్తి గానీ.. చూసి ఆనందించే శక్తి గానీ అటు రామోజీకి, ఇటు చంద్రబాబు కు, రాధాకృష్ణకు ఉందా అని నిలదీశారు. బాబు హయాంలో ఇళ్ల నిర్మాణంలో ఏపీ 27వ స్థానంలో ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు అదే ఇళ్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. కొత్తగా స్థలాలు సేకరించి వందలాది ఇళ్ల నిర్మాణాల కోసం పూడికలు చేసి రోడ్లు నిర్మిస్తే అవి మునిగిపోతున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న పత్రికలు నిజాలు తెలుసుకోవాలన్నారు. వందేళ్లకు పైగా నిలబడేలా ఇళ్ల నిర్మాణాలు గ్రేటర్ కమ్యూనిటీలకు దీటుగా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామని, రాష్ట్రంలో వైఎస్సార్ జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్లు 100 నుంచి 150 ఏళ్లపాటు దృఢంగా నిలబడేలా కడుతున్నామని మంత్రి శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు. భూసేకరణ చేసిన రెండు నెలల్లోనే రూ.12 వేల కోట్లు ఖర్చుచేసి స్థలాలను పూడ్పించి విద్యుత్, మంచినీటి సౌకర్యాలు కల్పించిందని తెలిపారు. రాష్ట్రంలో 17,500 వైఎస్సార్ జగనన్న లే–అవుట్లలో ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, దీనివల్ల అనేక మందికి ఉపాధి లభిస్తోందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో 15.60 లక్షల గృహాలు నిర్మిస్తుండగా.. లబ్ధిదారుల్లో 3.27 లక్షల మంది మూడో ఆప్షన్ ఎంపిక చేసుకున్నారని తెలిపారు. వీరిలో ప్రతి 20 మంది లబ్ధిదారులకు ఒక అధికారిని నియమించి ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోందని వివరించారు. లే–అవుట్ల వద్దకే ఇసుక, సిమెంట్, ఇనుము అందించి ఆర్థికంగా లబ్ధిదారులకు భారం కలగకుండా ప్రభుత్వం చేయూత అందిస్తోందని చెప్పారు. -
రాష్ట్రంలో 33 లక్షల ఇళ్ల నిర్మాణం : మంత్రి చెరుకువాడ
-
‘ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆరోజు ఎందుకు ప్రశ్నించలేదు?’
సాక్షి, పశ్చిమగోదావరి: ఏపీలో పెద్ద ఎత్తున పేదలకు ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. శనివారం ఆయన ఏలూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రజల్లో నమ్మకం ఉందన్నారు. ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు కట్టిస్తామన్నారు. నిర్మాణాత్మక సలహాలు ఇస్తే స్వీకరిస్తామని, అసత్య ఆరోపణలను చంద్రబాబు మానుకోవాలని మంత్రి హితవు పలికారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ఒక్క సెంటుభూమి ఇచ్చాడా?. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆరోజు ఎందుకు ప్రశ్నించలేదు అంటూ శ్రీరంగనాథరాజు దుయ్యబట్టారు. గృహ నిర్మాణాలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. 30 లక్షల కుటుంబాలకు నాణ్యమైన ఇళ్లు కట్టిస్తున్నామని మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. -
‘ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆరోజు ఎందుకు ప్రశ్నించలేదు?’
-
కేంద్రం ఇచ్చింది రూ.1.50 లక్షలే: శ్రీరంగనాథరాజు
సాక్షి, తిరుపతి: ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ఇచ్చింది కేవలం రూ.1.50 లక్షలేనని, పేదల ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల విలువైన భూమి సహా రూ.3.50 లక్షలు చొప్పున కేటాయించిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. బుధవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.13.50 లక్షలు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వ గుర్తుతోపాటు కేంద్ర ప్రభుత్వ గుర్తు కూడా వేస్తామన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం 30 వేల ఎకరాల ప్రైవేట్ భూమి సేకరించి మౌలిక సదుపాయాలు కల్పించామని మంత్రి శ్రీరంగనాథరాజు అన్నారు. -
‘ప్రతి లే-అవుట్లో పండగ వాతావరణం కనపడుతుంది’
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న ఇళ్ల నిర్మాణాలు ఒక యజ్ఞంలా జరుగుతున్నాయని ఏపీ గృహనిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుపేదల సొంతింటి కల సీఎం జగన్ వలన సాకారమైందని తెలిపారు. ఏపీలోని ప్రతి లే-అవుట్లో పండగ వాతావారణం కనపడుతోందని, అదే విధంగా, పేదలకోసం.. 5 లక్షల 7 వేల ఇళ్లకు శంకుస్థాపనలు జరుగుతున్నాయని అన్నారు. అదే సమయంలో జగనన్న కాలనీల వలన చాలా మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుందని తెలిపారు. -
గుంటూరు జీజీహెచ్‌లో నిత్యాన్నదానం
అన్నం పరబ్రహ్మ స్వరూపం.. ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం పెట్టటానికి మించిన మంచిపనిలేదని లోకోక్తి. అన్నదానం మహాయజ్ఞంతో సమానమని చెబుతారు. అటువంటి మహాకార్యం గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో పురుడుపోసుకుంటోంది. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న వారి సహాయకులకు జనవరి నుంచి రెండుపూటలా ఉచితంగా అన్నం పెట్టనున్నారు. ఇందుకు రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సంకల్పించారు. ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగటానికి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. సాక్షి, గుంటూరు: గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జీజీహెచ్) నైపుణ్యమైన వైద్యసేవలకు పెట్టింది పేరు. అవిభక్త కవలల శస్త్రచికిత్సల నుంచి గుండె శస్త్రచికిత్సల వరకు అనేక క్లిష్టమైన వైద్యసేవలను అందించిన ఘనత కలిగింది ఈ వైద్యశాల. రాష్ట్రంలోని 9 జిల్లాల నుంచి రోగులు ఈ ఆస్పత్రికి వస్తుంటారు. వీరిలో పేద, మధ్యతరగతి రోగులే అధికం. 1,500 మందికిపైగా రోగులు ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతుంటారు. వీరికి ఒకరిద్దరు కుటుంబసభ్యులో, బంధువులో సహాయంగా ఉంటారు. సహాయంగా ఉండేవారి సంఖ్య 2,500 నుంచి మూడువేల వరకు ఉంటుంది. రోగులకు చికిత్స, భోజనం బాధ్యత ఆస్పత్రిదే. సహాయకులు మాత్రం సొంత డబ్బుతో తినాల్సిందే. ఉదయం టిఫిన్, రెండుçపూటలా భోజనానికి ఒక్కొక్కరికి రూ.200 వరకు ఖర్చవుతుంది. 3 వేల మంది సహాయకులు రోజుకు రూ.6 లక్షల భోజనానికే వెచ్చించాల్సి వస్తోంది. ఈ సహాయకుల్లో పలువురు చేతిలో డబ్బులేక పస్తులుంటున్నారు. ప్రస్తుతం పొగాకు వ్యాపారి పోలిశెట్టి సోమసుందరం రోజూ మధ్యాహ్నం 500 మందికి ఉచితంగా భోజనం పెడుతున్నారు. చలించిన మంత్రి కుటుంబసభ్యులు, ఆప్తులు అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి సహాయంగా ఉంటూ.. డబ్బులేక కొందరు, సరిపోక కొందరు ఆకలితో బాధపడుతుండటాన్ని గమనించిన మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చలించిపోయారు. సాటి మనుషులు ఆకలితో బాధపడకుండా చూడాలని అనుకున్నారు. ఇందుకోసం నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. ఈ మహత్కార్యానికి కోటిరూపాయల విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆస్పత్రి ప్రాంగణంలో ఏపీఎన్జీవో సంఘం ఇచ్చిన రూ.25 లక్షలతో నిర్మిస్తున్న భవనాన్ని అన్నదాన భవనంగా ఉపయోగించనున్నారు. రెండంతస్తుల్లో ఒకేసారి 300 మంది భోజనం చేసేలా వసతులు సమకూరుస్తున్నారు. అత్యాధునిక వంటశాల రూపుదిద్దుకుంటోంది. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి ఆధునిక వంటసామగ్రిని తెప్పించారు. తరువాత ఉదయం 11 గంటల నుంచి, రాత్రి 7 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం ప్రారంభించాలని, పరిమితి లేకుండా ఎందరు సహాయకులున్నా అందరికీ భోజనం పెట్టాలని నిర్ణయించారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, దాతలు తలోచేయి వేస్తే ఈ అన్నదానయజ్ఞం నిరాటంకంగా సాగుతుంది. జనవరి మొదటి వారంలో అందుబాటులోకి వచ్చే జనవరి మొదటి వారంలో జీజీహెచ్‌లో రోగుల సహాయకులకు ఉచిత భోజన కార్యక్రమం అందుబాటులోకి తీసుకువస్తాం. ఫైవ్‌స్టార్ హోటల్‌ను తలపించేలా భవనంలో వసతులు సమకూరుస్తున్నాం. ఆస్పత్రి అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. – చెరుకువాడ శ్రీరంగనాథరాజు, జిల్లా ఇన్చార్జి మంత్రి -
చంద్రబాబుకు బాధ్యత లేదు: శ్రీరంగనాథరాజు
సాక్షి, పశ్చిమగోదావరి: ప్రతిపక్ష నేత చంద్రబాబు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని, ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం హయాంలో గుంటూరు జిల్లాలో నీరు కలుషితం అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమి చేశారని ఆయన ప్రశ్నించారు. నిత్యం రాజకీయాలు చేయడం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ కి మంచిది కాదని హితవు పలికారు. విపత్కర పరిస్థితుల్లో పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి సహకరించకుండా.. బురద చల్లుతున్నారని మంత్రి దుయ్యబట్టారు.(చదవండి: ఏలూరు వింత వ్యాధి; కీలక విషయాలు) ‘‘ఏలూరు ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తక్షణమే స్పందించి స్వయంగా బాధితులును పరామర్శించారు. మెరుగైన చికిత్సను అందించాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ నుండి ఎయిమ్స్, పూణే నుండి వైద్య బృందాలు వచ్చి బాధితుల నుండి శాంపిల్స్ సేకరించారు. త్వరలో రిపోర్ట్స్ కూడా వస్తాయని’’శ్రీరంగనాథ రాజు పేర్కొన్నారు.(చదవండి: టీడీపీ రెండు ముక్కలైంది..) -
‘ఇళ్ల పట్టాల పంపిణీ అడ్డుకుంది టీడీపీయే’
సాక్షి, విజయవాడ: పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు కమీషన్ల కోసం వాడుకున్నారని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టుని ఆ రోజు కాంట్రాక్టుల కోసం తీసుకున్నారని, విభజన చట్టం ప్రకారం కేంద్రం పూర్తి నిధులు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ‘‘ప్రాజెక్టు పనులతో పాటు పునరావాసానికి నిధులు ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టు వైఎస్సార్ సంకల్పం. (చదవండి: ‘తండ్రిని చూసి ఎవరైనా అప్పు ఇస్తారు.. కానీ’) చంద్రబాబు ఏనాడూ పోలవరం ప్రాజెక్టుని పట్టించుకోలేదు. పేదల ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్నది టీడీపీనే. చంద్రబాబు టీడీపీ నేతలతో వందల కేసులు వేయించారు. హై కోర్టు క్లియరెన్సు ఇవ్వగానే 32 లక్షల పట్టాలిస్తాం. అనుమతిచ్చిన 24 గంటల్లో పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేశాం. టీడీపీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రజలకోసం ప్రభుత్వానికి సహకరించాలని’’ మంత్రి చెరకువాడ శ్రీరంగనాథ రాజు హితవు పలికారు. (చదవండి: గత పాలకుల వల్లే విభజన అన్యాయం: సజ్జల) -
‘చంద్రబాబుది సైంధవ పాత్ర’
సాక్షి, అమరావతి: ఇళ్లపట్టాల పంపిణీలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుది సైంధవ పాత్ర అని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పేద ప్రజల ఇళ్ల పట్టాలు పంపిణీని టీడీపీ అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. ఇళ్ల స్థలాల కోసం 60 వేల ఎకరాలు సిద్దం చేశామని తెలిపారు. మొత్తం 30 లక్షల మంది పేద కుటుంబాలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారన్నారు. దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు భగ్నం చేసే ప్రయత్నం చేస్తారన్న పద్దతిలో చంద్రబాబు, ఆయన మనుషులు ఈ కార్యక్రమాన్ని పదేపదే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అయినా వారి ఆటలు సాగవని, వారు చరిత్ర హీనులు కాక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములు కలిపి 60వేల ఎకరాల సేకరణ ద్వారా అడుగు ముందుకు వేశామని తెలిపారు. ఇళ్ల స్థలాలు రెడీగా ఉన్నాయని, ఇవ్వటానికి ప్రభుత్వం కూడా సిద్దంగా ఉందని తెలిపారు. చంద్రబాబు నాయుడు, ఆయన అనుయాయులు ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు హైకోర్టుకు వెళ్లారని, కొన్ని వందల రిట్ పిటిషన్లు దాఖలు చేయించారని చెప్పారు. (కోవిడ్ కేర్ సెంటర్లలో నాణ్యమైన సేవలు) అందులో ప్రధానంగా నాలుగు రిట్ పిటీషన్లకు సంబంధించి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసిందని, వాటి ప్రకారం ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసేందుకు, రిజిస్ట్రేషన్ పట్టాలిచ్చేందుకు వీలుకాని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. దీనిని తాము సుప్రీం కోర్టులో సవాల్ చేశామని, కోవిడ్ సమయంలో సుప్రీంకోర్టుకు కూడా సెలవులు ఉన్నందున ఇప్పటికిప్పుడు ఆ స్టేలను తొలగించే పరిస్థితి లేదన్నారు. కాబట్టి స్థలాల పంపిణీకి కొద్ది సమయం పడుతుందని ఆయన చెప్పారు. ఈ అవరోధాలన్నీ తొలగి ఆగస్టు 15 నాటికి ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి అక్కచెల్లెమ్మల చేతుల్లో ఈ 30 లక్షల ఇళ్ల పట్టాలను కెటాయించిన స్థలంలోనే వారికి అందజేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంలో ఒక వజ్ర సంకల్పం ఉందన్నారు. అదే సమయంలో మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా అందరూ గమనించాలన్నారు. దీనికి అడ్డుపడుతున్నది ఎవరు..? ఎందుకు కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది..? పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వటానికి చంద్రబాబు ఎందుకు అడ్డుపడుతున్నాడో ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. తన హయాంలో 2 లక్షల ఇళ్లు కూడా కట్టించలేకపోయానన్న అవమానంతోనే బాబు ఇలా చేస్తున్నారా లేదా తమ ప్రభుత్వం 30 లక్షల ఇళ్ల పట్టాలు ఒకేసారి ఇస్తే.. ఇక తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భయంతో బాబు అడ్డుకుంటున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన హయాంలో లక్షల ఇళ్లు కట్టేశానంటూ విచిత్ర వాదన చేశారని, ఎక్కడ కట్టారో ఆయనకే తెలియాలన్నారు. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో మొదటి రెండేళ్లు ఇళ్ల నిర్మాణం ఆపేశారన్నారు. ఆ తర్వాత మూడేళ్లలో 2 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా జరిగింది లేదని పేర్కొన్నారు. అంతేగాక టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు కానీ, పునాది పడక ముందే.. మీ ఫ్లాట్ ఫలానా చోట ఉంటుందంటూ.. నేల మీద నిలబెట్టి గృహప్రవేశాలు చేయించేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు కట్టిన ఇళ్లు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు కానీ ఆయన పెట్టిన టిడ్కో బకాయిలు మాత్రం వేలల్లో ఉన్నాయిన విమర్శించారు. 3 వేల కోట్ల రుపాయలు హౌసింగ్‌కు సంబంధించి ఇతర బకాయిలు మరో 1300 కోట్ల రూపాయలు కలిసి మొత్తం 4,300 కోట్ల రూపాయలు బాకీ పెట్టి దిగిపోయారని విమర్శించారు. ఇవన్నీ నిజాలు కాదా..? ఈ డబ్బు అంతా ఎవరు కట్టాలి.. చంద్రబాబు ఎందుకు కట్టలేదని మంత్రి ప్రశ్నించారు. -
రెడ్‌జోన్‌లో మంత్రి శ్రీరంగనాథరాజు పర్యటన
సాక్షి, పశ్చిమ గోదావరి : జిల్లాలోని పెనుగొండ రెడ్‌జోన్ ఏరియాలో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటించారు. సోమవారం నాటి పర్యటనలో భాగంగా రెడ్‌జోన్‌లోని ప్రజలకు అందుతున్న నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పాల గురించి అధికారులను అడిగి తెలుసుకొన్నారు. గ్రామంలో చేసిన స్వబ్ టెస్టులకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రెడ్‌జోన్ పరిధిలో ప్రజలందరూ స్వీయ గృహనిర్బంధంలో ఉండాలని విజ్ఞప్తి చేశారు. రెడ్‌జోన్‌లోని వారికి కావలసిన నిత్యావసర వస్తువులు పోలీస్ స్టేషన్ లేదా పంచాయతీకి ఫోన్ చేసిన వెంటనే ఇంటి వద్దకు చేరేలా చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టిందని వెల్లడించారు. -
‘గోదావరి జిల్లాలో పుట్టిన పవన్‌కు అది తెలియదా’
సాక్షి, ప్రకాశం : జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. మంగళవారం జిల్లాలో మంత్రులు పిల్లి సుభాష్, శ్రీ రంగనాథరాజు మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యలపై అద్యయనం చేసి అక్రమాలకు చెక్ పెట్టేలా ఆన్లైన్లో కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. పేదలకు అర్బన్‌లో ఒక సెంట్.. రూరల్‌లో ఒకటిన్నర సెంట్ స్థలాన్ని మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇళ్ల పట్టాలను ఆడపడుచుల పేరు మీద రిజిస్టర్ చేసి ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటించనున్నామని అన్నారు. గోదావరి జిల్లాలో పుట్టిన పవన్ కల్యాన్‌కు వరదలు వచ్చిన సమయంలో ఇసుక సమస్య తలెత్తుందని తెలియాదా అని ప్రశ్నించారు. -
35 పాఠశాలల్లో ‘మధురాన్నం’
తాడేపల్లిగూడెం: గోదావరి విద్యావికాస చైతన్య సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీ నుంచి జిల్లాలోని 35 పాఠశాలల్లో మధురాన్నం పథకాన్ని ప్రారంభించనున్నట్టు సొసైటీ చైర్మన్ చెరుకువాడ శ్రీరంగనాథరాజు మంగళవారం విలేకరులకు తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతోపాటు 35 ప్రభుత్వ పాఠశాలల్లో 15 వేల మంది విద్యార్థులకు మధురాన్నం పథకంలో భాగంగా పోషకాహారం అందిస్తామనిచచెప్పారు. మధురాన్నం పేరుతో మధ్యాహ్న భోజనాన్ని నూరుశాతం నాణ్యతతో వేడిగా విద్యార్థులకు అందిస్తామన్నారు. వారంలో సోమ, బుధ, శుక్రవారాల్లో గుడ్లు అందిస్తామనిచచెప్పారు. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని భారతీయ విద్యాభవన్స్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక వంటశాల నుంచి మధురాన్నం సరఫరా చేస్తామన్నారు. స్టీమ్ కుక్కింగ్ ద్వారా పూర్తి పరిశుభ్రత గల వాతావరణంలో వంటలు వండుతామన్నారు. భోజన సరఫరా కోసం ఎనిమిది వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. పెదతాడేపల్లి విద్యాభవన్స్ నుంచి జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలలకు ఉదయం 10.30 నిమిషాల నుంచి మ«ధ్యాహ్నం 12 గంటలలోపు ఆహార పదార్థాలు సరఫరా చేస్తామని చెప్పారు. ఈ పథకం అమలుకు సంబంధించి కలెక్టర్‌తో ఒప్పందం కుదిరిందన్నారు. పథకం అమలుకోసం వంద మంది సిబ్బందిని నియమించామని చెప్పారు. మధురాన్నంతో పాటు పథకం అమలు జరిగే పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తామన్నారు. పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుల ద్వారా ఆయా పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తామని పేర్కొన్నారు. రైస్ మిల్లర్లు , దాతల సహకారంతో ఈ ప్రాజెక్టు అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలోని తాడేపల్లిగూడెం, పెంటపాడు, తణుకు, నల్లజర్ల, ఇరగవరం, అత్తిలి, భీమవరం మండలాల్లో పాఠశాలలకు తొలివిడతగా మధురాన్నరం పథకం అమలు చేస్తామని వివరించారు.