
సాక్షి, ప్రకాశం : జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. మంగళవారం జిల్లాలో మంత్రులు పిల్లి సుభాష్, శ్రీ రంగనాథరాజు మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యలపై అద్యయనం చేసి అక్రమాలకు చెక్ పెట్టేలా ఆన్‌లైన్లో కొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నట్లు వెల్లడించారు. పేదలకు అర్బన్‌లో ఒక సెంట్.. రూరల్‌లో ఒకటిన్నర సెంట్ స్థలాన్ని మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇళ్ల పట్టాలను ఆడపడుచుల పేరు మీద రిజిస్టర్ చేసి ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటించనున్నామని అన్నారు. గోదావరి జిల్లాలో పుట్టిన పవన్ కల్యాన్‌కు వరదలు వచ్చిన సమయంలో ఇసుక సమస్య తలెత్తుందని తెలియాదా అని ప్రశ్నించారు.