pilli subhash chandra bose
-
మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యలపై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆగ్రహం
-
పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలివే.
-
‘సోషల్ మీడియా నిర్బంధాలపై పార్లమెంట్లో చర్చిస్తాం’
సాక్షి, తాడేపల్లి: ఈ నెల 25 నుంచి ప్రారంభం కాబోతున్న శీతాకాల సమావేశాల సందర్భంగా.. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులు, నిర్బంధాలపై పార్లమెంటులో చర్చిస్తామని చెప్పారు. 41a నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు చేయటంపై గట్టిగా నిలదీస్తామన్నారు. చట్టాలను అమలు చేయనప్పుడు ఇక ఆ చట్టాలు ఎందుకని గట్టిగా ప్రశ్నిస్తామని అన్నారు..గురువారం వైఎస్ జగన్‌తో వైఎస్సార్సీపీ రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు గురువారం సమావేశం అయ్యారు. ఈ భేటీ అనంతరం ఎంపీ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. పోలవరం ఎత్తును తగ్గించాలనే కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, పోలవరం ఎత్తు తగ్గిస్తే ఆందోళన చేస్తామని తెలిపారు. పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెలిపారు. దాన్ని ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని, అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పారు. ప్రత్యేక హోదాపై గట్టిగా పోరాటం చేస్తామన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించమని, ఆ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. బలం ఉందని పార్లమెంటులో బిల్లును పాస్ చేస్తే న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే సహించేదిలేదని స్పష్టం చేశారు. పార్లమెంటును స్తంభింపచేయటానికి కూడా వెనుకాడమన్నారు. -
జగన్ వెంటే మేమంతా: వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, గుంటూరు: మేం పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మేం వైఎస్ జగన్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు.వైఎస్సార్సీపీలోనే ఉంటా: పిల్లి సుభాష్ చంద్రబోస్వైస్సార్సీపీ ఆవిర్భావం నుంచి జగన్‌తో ఉన్నా.. నా వ్యక్తిత్వం ఏంటో అందరికి తెలుసు. నన్ను వైఎస్సార్ రాజకీయాల్లో ప్రోత్సహించారు. రఘునాధరెడ్డి, గొల్ల బాబూరావు కూడా రావాల్సి ఉంది. ఇతర కారణాల వలన రాలేకపోయారు. కానీ వారిద్దరు కూడా వైఎస్ జగన్ నాయకత్వంలో పని చేస్తామని చెప్పమన్నారు. జగన్ నాకు ఎలాంటి అన్యాయం చేయలేదు. కానీ నా మీద కూడా ఎల్లోమీడియా వార్తలు రాస్తోంది. నాకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని కూడా జగన్ అన్నారు. అంతగా వైఎస్ జగన్ నన్ను గౌరవించారు....కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కూడా వైఎస్సార్ వెంటే ఉన్నాను. అప్పట్లో టికెట్ గురించి కూడా ఎవర్నీ అడిగేవాడిని కాదు. వైఎస్సారే నాకు అర్ధికంగా, రాజకీయంగా అండగా నిలిచారు. ఆ తర్వాత కూడా జగన్ అలాగే అండగా నిలిచారు. ఆర్థికంగా పేదవాడినే అయినా విధేయతలో సంపన్నుడునే. నాకు వ్యాపారల్లేవు, ఎప్పుడూ ప్రజల్లోనే ఉన్నాను. నా మీద వార్తలు రాసేటపుడు ఒకసారి మాట్లాడితే సరిపోయేది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు ఎల్లోమీడియా వార్తలు రాస్తోంది. ఇలా చేయటం రాజకీయ హననం చేసినట్లే. నైతికత ఉన్న నాయకుడిని నేను...మేము రాజీనామా చేస్తే మరొకరిని నియమించే అవకాశం లేదు. అలాంటప్పుడు మేము రాజీనామా చేస్తే పార్టీకి వెన్నుపోటు పొడిచినట్టే. అలాంటి కృతజ్ఞ హీనులం మేము కాదు. పార్టీని హత్య చేసే పని నేను చేయను. పార్టీ నుండి వెళ్లేవారు ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే మంచిది. ఏ పార్టీ ఐనా ఓడుతుంది, గెలుస్తుంది. అధికారం శాశ్వతం కాదు, జయాపజయాలు సహజమే. వైఎస్సార్సీపీ ఇవాళ ఓడిపోయినంత మాత్రాన నేను పార్టీ వీడి వెళ్లను. నూటికి నూరుపాళ్లు వైఎస్ జగన్ నాయకత్వంలోనే పని చేస్తా. రాజకీయాల్లో ఉన్నంతకాలం వైఎస్సార్సీపీలోనే ఉంటా’’ అని పిల్లి సుభాష్ చంద్రబోస్ తేల్చి చెప్పారు.ఊహాజనిత కథనాలను ఖండిస్తున్నాం: ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డిమాపై కొన్ని మీడియా సంస్థలు ఊహాజనిత కథనాలు రాస్తున్నాయి. పార్టీ వీడుతున్నట్టు వారు రాస్తున్న వార్తలను ఖండిస్తున్నాం. మేము పార్టీ చెప్పిన బాధ్యతలను నిర్వర్తిస్తాం. ఈ రోజు పార్టీలను నడపటం చాలా కష్టంతో కూడుకున్న పని. రాజకీయ పార్టీలు పటిష్టంగా ఉంటే గట్టి నాయకులు తయారవుతారు. మేము ఎంపీలుగా బాధ్యతతో పని చేస్తున్నాం. జగన్ సామాన్య ప్రజల గురించి ఆలోచిస్తారు. అందుకే ఆయనతో కలిసి రాజకీయాల్లో నడుస్తున్నాను...పదేళ్ల క్రితమే నేను వ్యాపారాలు మానేశాను. పార్టీ ఓడిపోయినంత మాత్రాన బాధ పడాల్సిన పనిలేదు. రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్‌తోనే నడుస్తాం. మోపిదేవి రమణ అంటే జగన్‌తో సహా మా అందరికీ ఇష్టం. ఆయన పొజిషన్ ని స్ట్రాంగ్ చేసే పనిలో జగన్ ఉన్నారు. కొందరు పర్సనల్ వ్యవహారాల వలన పార్టీ వీడుతున్నారు. నన్ను కూడా పార్టీలోకి రమ్మని కొందరు ఆహ్వానించారు. కానీ జగన్‌ని కాదని నేను ఎటూ వెళ్లను. రేటింగ్స్ కోసం మా గురించి ఇష్టానుసారం వార్తలు ప్రసారం చేయొద్దని మనవి -
వెన్నుపోటు పొడవలేను: ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్
రామచంద్రపురం: ‘నాకు రాజకీయ విలువలు ఉన్నాయి. వైఎస్సార్సీపీని విడిచి వెళ్లి వెన్నుపోటు పొడవలేను. నేను వైఎస్సార్సీపీలోనే కొనసాగుతాను...’ అని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టంచేశారు. ఆయన గురువారం రాత్రి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మీడియాతో మాట్లాడుతూ తనకు కలలో కూడా పార్టీ మారే ఆలోచన లేదని చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే పని చేస్తానని, వైఎస్సార్సీపీలోనే ఉంటానని స్పష్టంచేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాసి నైతిక విలువలను దెబ్బతీయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నైతిక విలువలను కాçపాడే విధంగా పత్రికలు వార్తలు ప్రచురించాలని పేర్కొన్నారు. తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేయవద్దని హితవుపలికారు. -
ఎన్నికల ఫలితాలపై పిల్లి సుభాష్ చంద్రబోస్ షాకింగ్ రియాక్షన్
-
చట్టసభల్లో ఓబీసీలకూ రిజర్వేషన్లు కల్పించాలి
సాక్షి, న్యూఢిల్లీ : చట్టసభల్లో ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు ఎలాగైతే రిజర్వేషన్లు కల్పిస్తు న్నారో అదేవిధంగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అందులో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదే శాల మేరకు మహిళా బిల్లుకు మద్దతిస్తు న్నామ న్నారు. రాజ్యసభలో గురువారం మహిళ బిల్లు పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బిల్లు కార్యరూపం దాల్చిన ఏడేళ్ల తర్వాత అమలు చేయడం అంటే పంచభక్ష్య పరమాన్నం ముందుపెట్టి ఎప్పుడో తినమన్నట్లు ఉందన్నారు. సామాజిక, విద్య, ఆర్థిక అంశాల్లో వెనుకబాటు తనంతో ఉన్న ఓబీసీలకు రిజర్వే షన్లు ఎందుకు కల్పించరని బోస్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభు త్వం దీనిపై ఆలోచించి త్వరలోనే ఓబీసీ బిల్లు తీసుకురావాలని ఎంపీ బోస్ విజ్ఞప్తి చేశారు. లింగ వివక్ష తగ్గుతుంది : ఆర్. కృష్ణయ్య చర్చలో ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. మహిళా బిల్లు స్వాగతించదగినదన్నారు. దేశంలో లింగ, కుల వివక్షలు ఉన్నాయని.. మహిళ బిల్లుతో లింగ వివక్ష తగ్గుతుందని.. అయితే, కుల వివక్ష తగ్గించాలంటే బిల్లులో ఓబీసీ సబ్‌కోటా పెట్టాలని కోరారు. సబ్‌కోటా కుదరకపోతే బీసీ బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. అన్ని రంగాల్లోనూ బీసీల పాత్ర చాలా తక్కువగానే ఉంటోందని కృష్ణయ్య తెలిపారు. రాజ్యాధికారం వస్తేనే వారికి గౌరవం దక్కుతుందన్నారు. -
అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం
రామచంద్రపురం: ‘పార్టీ అభివృద్ధికి, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం. వైఎస్సార్సీపీ నా సొంత పార్టీలా భావిస్తాను. ఇటీవల కొన్ని పత్రికలు, చానల్స్‌లో నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. నేను వైఎస్సార్సీపీని వీడేది లేదు...’ అని వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ స్పష్టంచేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తనకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా అదేవిధంగా తనకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయనే బాధతోనే ఎంపీ పదవికి రాజీనామా చేసి అసెంబ్లీకి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని చెప్పానని వివరించారు. ఇది బాధాకరమైన విషయమన్నారు. ఈ అంశంపై మీడియా ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి క్షమాపణ చెబుతున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలో అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుని పార్టీ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా మంచి నిర్ణయం తీసుకుంటామని అధిష్టానం చెప్పిందని వెల్లడించారు. నియోజకవర్గంలో పరిపూర్ణమైన సర్వేలు జరిగాక సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. అంతవరకు పార్టీ అభివృద్ధికి పాటుపడాలని సూచించిందని తెలిపారు. పార్టీ నిర్ణయం మేరకు ఇక్కడ పని చేస్తానన్నారు. నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త పార్టీ కోసం పనిచేయాలని కోరారు. కార్యకర్తల్లో ఎవరికి అన్యాయం జరిగినా అండగా ఉంటానన్నారు. పార్టీ నిర్మాణం, ఓదార్పుయాత్రలో తాను ప్రముఖ పాత్ర పోషించానన్నారు. త్వరలోనే తమ పార్టీ అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇంతటితో ఈ ఎపిసోడ్‌ను ముగించాలని మీడియాకు బోస్ విజ్ఞప్తి చేశారు. -
ఎల్లో మీడియాకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్
-
పిల్లిలంకలో రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన ఎంపీ బోస్
-
ప్రజల ప్రాణాలను బలితీసుకోవడంలో చంద్రబాబుకు ఆనందం ఉంది: ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్
-
‘వట్టి వసంతకుమార్ నాకు మంచి మిత్రుడు’
ఏలూరు: మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ అకాల మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్. వట్టి వసంత కుమార్ మరణ వార్త తెలుసుకున్న అనంతరం పూళ్ల గ్రామానికి వెళ్లిన సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘ వట్టి వసంతకుమార్ నాకు మంచి మిత్రుడు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. దివంగత మహానేత వైఎస్సార్‌తో అత్యంత సన్నిహిత ఉన్న వ్యక్తి వట్టి వసంత కుమార్. వితౌట్ అపాయింట్ లేకుండా వైఎస్సార్‌ను కలిసే వ్యక్తుల్లో ఉండవల్లి తరువాత వట్టి వసంత కుమార్ ఒకరు. రాజకీయంలో నా ఎదుగుదలకు ఎంతో సహకరించారు వట్టి వసంత కుమార్’ అని తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి వట్టి వసంత కుమార్ వట్టి వసంత కుమార్ మరణం రాష్ట్రానికి తీరని లోటన్నారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి. నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తి వట్టి వసంత కుమార్ అని, నాకు అన్నతో సమానమని, నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రంగం అభివృద్ధికి వట్టి ఎంతో కృషి చేశారన్నారు. ఆక్వా రంగంలో ట్యాక్స్ మినహాయింపునకు వసంత కుమార్ చేసిన కృషి మరవలేనిదన్నారు రఘువీరా. ఉభయ గోదావరి జిల్లాలో మంచి నాయకుడు వట్టి వసంత కుమార్ వైఎస్సార్‌కు మంచి స్నేహితుడు వట్టి వసంత కుమార్ అని మంత్రి దాడిశెటట్టి రాజా పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో మంచి నాయకుడు వట్టి వసంత కుమార్ అని, ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నానని దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో వసంతకుమార్ అంత్యక్రియలు ఏలూరు ఎంఎం పురంలో వట్టి వసంతకుమార్ అంతిమ యాత్రలో మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యే వాసుబాబు, కాంగ్రెస్ నేతలు, సినీ నిర్మాత అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో వట్టి వసంతకుమార్ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ కన్నుమూత -
రాజధానిపై మోసగించింది బాబే
జంగారెడ్డిగూడెం: రాజధాని విషయంలో ప్రజలను, రైతులను మోసగించిన విపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్‌పై నిందలు మోపుతున్నారని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందన్నారు. సీఎం జగన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికే మూడు రాజధానులను ప్రకటించినట్లు చెప్పారు. బుధవారం జంగారెడ్డిగూడెంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోర్టుకు ఆ అధికారం ఉందా..? రాష్ట్ర ప్రభుత్వ అధికారాల్లో జోక్యం చేసుకునేందుకు కోర్టుకు ఉన్న హక్కులు ఏమిటి? న్యాయమూర్తుల తీర్పును నేను వ్యతిరేకించడం లేదు. ఒకసారి ఆలోచించాలి. రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయమా? కోర్టులు చేసే నిర్ణయమా? రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వానిదే. పరిపాలనా విధుల్లో కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం లేదు. మూడు నెలల్లో రాజధానిని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించే అధికారం కూడా లేదు. నిధులను బట్టి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయి. ఈ రెండింటిపై విరుద్ధమైన తీర్పులు ఇచ్చాయి. తీర్పుపై కచ్చితంగా కామెంట్ చేస్తాం. న్యాయమా.. కాదా? అని కామెంట్ చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. న్యాయమూర్తులను మేము కామెంట్ చేయడం లేదు. తీర్పును మాత్రమే కామెంట్ చేస్తున్నాం. అంబేడ్కర్ చెప్పినట్లు రెండు రాజధానులు, మూడు రాజధానులు పెట్టుకోవడం తప్పేమీ కాదు. అంబేడ్కర్ ఆనాడే దక్షిణాదిలో హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేయాలని సూచించారు. రాజధానుల విషయంలో రాజ్యాంగంలో సవివరంగా పేర్కొన్నారు. 33 వేల ఎకరాలు అవసరమా..? రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు అవసరమా? హైదరాబాద్ లాంటి రాజధానిని సుమారు 5 వేల ఎకరాల్లో నిర్వహిస్తుండగా రాష్ట్రంలో రాజధానికి 33 వేల ఎకరాలు అవసరమా? చంద్రబాబు ఆయన కోటరీకి మేలు చేయడానికి, భూములతో వ్యాపారం చేసేందుకే పెద్ద ఎత్తున సేకరించారు. చంద్రబాబుకు దళితులు, పేదలంటే చులకన. అమరావతి ప్రాంతంలో 29 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలని ప్రభుత్వం భావిస్తే అందుకు అడ్డుపడి స్టే తెచ్చారు. బాబు కుటిల రాజకీయాలు.. చంద్రబాబు కుటిల రాజకీయాన్ని ప్రజలు గమనించాలని చింతలపూడి ఎమ్మెల్యే వీఆర్ ఎలీజా సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి, ఉభయ గోదావరి జిల్లాల బూత్ కమిటీ కన్వీనర్ బీవీఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
'వైఎస్సార్సీపీ కోసం అహర్నిశలు పాటుపడుతుంది కార్యకర్తలే'
సాక్షి, తూర్పుగోదావరి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడుతుంది అంటే అందులో కార్యకర్తల కష్టం ఎంతో ఉందని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ప్లీనరీలో మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. దేశం కోసం అహర్నిశలు పాటుపడుతుంది ఆర్మీ అయితే వైఎస్సార్సీపీ కోసం అహర్నిశలు పాటుపడుతుంది కార్యకర్తలే. కార్యకర్తలు ఉన్నారనే మనోధైర్యంతోనే సీఎం వైఎస్ జగన్ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా దిగ్విజయంగా పాలన సాగిస్తున్నారు. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్లే ఇవాళ గడపగడపకు మన ప్రభుత్వం పేరిట ప్రజల ముందుకు వెళ్లగలుగుతున్నాం. అద్భుతమైన ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై సైతం ప్రతిపక్షాలు బురద చల్లడం దారుణం. 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి స్థానంలో మరోసారి కూర్చోబెట్టేందుకు కృషి చేయాలి అని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఇచ్చిన హామీల్లో 97% నెరవేర్చారు వైఎస్సార్సీపీ ఎంపీ, రీజనల్ కో ఆర్డినేటర్ పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ప్రజల ఆమోదంతోనే 2019లో 151 స్థానాలు గెలవగలిగారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రతిపక్షాలు ఈర్ష్యతో మాట్లాడటం సరికాదు. సీఎం వైఎస్ జగన్ తాను ఇచ్చిన హామీల్లో 97% నెరవేర్చారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 210 హామీలు ఇచ్చారు.. పదో, పదిహేనో నెరవేర్చి మిగిలినవన్నీ గాలికొదిలేశారు. ప్రస్తుత ప్రభుత్వంపై చంద్రబాబు రూ.80 వేల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్లారు. కోవిడ్‌లో సైతం ప్రజలకు అన్ని రంగాల్లో సహకారం అందించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని సాక్షాత్తు ప్రధానమంత్రి పార్లమెంట్లో చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనారిటీలకు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ అనడంలో సందేహం లేదు అని ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. చదవండి: (సీఎం వైఎస్ జగన్ బీసీ కులాలకు శ్రీరామరక్ష: ఆర్ కృష్ణయ్య) -
పచ్చని కోనసీమలో విధ్వంసాలు సృష్టించొద్దు: పిల్లి సుభాష్‌చంద్రబోస్
న్యూఢిల్లీ: ప్రజల విజ్ఞప్తి మేరకే కోనసీమకు డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టారని ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని సంఘవిద్రోహ శక్తులు అశాంతిని రేకేత్తించాయి. ఈ ఘటనలతో నేను సిగ్గుపడుతున్నా. చంద్రబాబు సైతం అంబేడ్కర్ జిల్లా పేరు పెడతా అని చెప్పారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ మీడియా ముందుకు రావాలి. వెనక ఉండి రెచ్చగొట్టడం మానుకోవాలి. బయట ఒక మాట లోపల ఒక మాట చెప్పకూడదు. పచ్చని కోనసీమలో విధ్వంసాలు సృష్టించొద్దు. అంబేడ్కర్ పేరు పెట్టుకోవడం మన అదృష్టం. ఉద్యమకారులు సంయమనం పాటించండి. అంబేడ్కర్ వల్లనే మన దేశంలో ప్రజాస్వామ్యం వర్దిల్లుతోంది. మనతో పాటు స్వాతంత్ర్యం వచ్చిన పాకిస్తాన్లో రాజ్యాంగం ఫెయిల్ అయిందని ఎంపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. చదవండి 👇 ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. స్పందించిన మంత్రి విశ్వరూప్ అమలాపురానికి అదనపు బలగాలు కోనసీమ: అమలాపురంలో విధ్వంసం కొనసాగుతోంది. ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు అమలాపురం చేరుకుని, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాజమండ్రి, కాకినాడ, కృష్ణా జిల్లాల నుంచి అదనపు బలగాలు తరలిస్తున్నారు. ఇంకా రోడ్లపై వేలాదిమంది ఆందోళనకారులు ఉన్నారు. ఆందోళన విరమించి వెళ్లి పోవాలని నిరసనకారులను పోలీసులు కోరుతున్నారు. చదవండి 👇 (Konaseema: కోనసీమ ఉద్రిక్తతలపై స్పందించిన సజ్జల రామకృష్ణారెడ్డి) -
ఈనాడు విషపు రాతలపై కోర్టును ఆశ్రయిస్తాం: మంత్రి కారుమూరి
సాక్షి, అమరావతి: ఈనాడు విషపు రాతలపై కోర్టుని ఆశ్రయించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు తెలిపారు. ధాన్యం కొనుగోలులో దోపిడీ అంటూ ఈనాడు పత్రికలో వచ్చిన వార్త హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆర్బీకే ద్వారా రైతులకు మేలు చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించారని పేర్కొన్నారు. ఈనాడు కథనం పూర్తి అవాస్తవమని, ఆర్బీకేలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తడిసిన ధాన్యమైనా కొనుగోలు చేయాలని సీఎం అధికారులకి స్పష్టమైన ఆదేశాలిచ్చారని పేర్కొన్నారు. ‘పొలమే లేని వ్యక్తి ఆర్బీకేకు ధాన్యం అమ్మడానికి వెళ్లగా తిరస్కరించినట్లు ఈనాడు పత్రిక సృష్టించింది. తనకి పొలమే లేదని, తాను రైతునే కాదని, అదంతా అబద్దమని ఆ వ్యక్తే చెబుతున్నారు. రైతులే కాని వారిని రైతులగా చూపిస్తూ తప్పుడు వార్తలతో విషప్రచారం చేస్తున్నారు. రైతులకి మేలు చేయడానికే ఈ ప్రభుత్వం ఉంది. ఈనాడు విషప్రచారంపై కోర్టుని ఆశ్రయించనున్నాం. దిగజారుడు వార్తలతో మీ పత్రిక విలువ మరింత దిగజార్చుకుంటున్నారు. రాజ్యసభ ఎంపీ సుభాష్ చంద్రబోస్ చెప్పిన మాటలకు.. ఈనాడు వార్తకు సంబంధం లేదు’ అని మంత్రి అన్నారు. ఈ కేవైసీ త్వరగా చేయకపోవడం వల్ల తప్పులు జరిగే అవకాశాలున్నాయని మాత్రమే ఎంపీ సుభాష్ చంద్రబోస్ చెప్పినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ స్పష్టం చేశారు. 68 వేల రైతులు తూర్పుగోదావరిలో ఉంటే 51 వేల మంది నమోదు చేస్తుకున్నారని, ఇంకా 17 వేల మంది రైతులు ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉందన్నారు. ప్రత్యేక మేళా ద్వారా ఈ కేవైసీ త్వరగా నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ కేవైసీ నమోదు ద్వారా అక్రమాలకి ఆస్కారం ఉండదన్నారు. మిల్లర్లు, అదికారులు తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
చంద్రబాబు వల్లే ఖజానా దివాలా..
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ఖజానా దివాలా తీయడానికి చంద్రబాబే కారణమని వైఎస్సార్సీపీ ఎంపీలు ఆరోపించారు. రాష్ట్ర పరువు, ప్రతిష్టలు దిగజార్చడమే బాబు పని అని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ఇవ్వాలని టీడీపీ నేతలు కోరుతున్నారని, అలాచేస్తే టీడీపీ బండారమే బయటపడుతుందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి సీఎం జగన్ ఎంతదూరమైనా వెళతారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలు నిర్మాణాత్మకపాత్ర పోషించాలేగానీ దిగజారుడు వ్యాఖ్యలు చేయకూడదని చెప్పారు. గురువారం పార్లమెంటు సమావేశాలు ముగిసిన అనంతరం వైఎస్సార్సీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, మార్గాని భరత్‌రామ్, పిల్లి సుభాష్‌చంద్రబోస్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలు, విభజన హామీలతోపాటు పెండింగ్‌లో ఉన్న అంశాలపై ఉభయ సభల్లోను పార్టీ ఎంపీలు చర్చించారు. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ కూడా తీసుకున్నాం. ప్రధాని మోదీతో సీఎం వైఎస్ జగన్ పోలవరం, కడప ఉక్కుపరిశ్రమ, తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు ఇలా అన్ని అంశాలు చర్చిస్తే.. దానిపైనా టీడీపీ దుష్ప్రచారం చేయడం శోచనీయం. బాబు లాంటి ప్రతిపక్ష నేత దొరకడం ప్రజల దౌర్భాగ్యం. వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేనాటికే రాష్ట్ర ఖజానా దివాలా తీసిన విషయం ప్రజలకు తెలిసిందే. బాబు స్వప్రయోజనాల కోసం పాలనను అస్తవ్యస్తం చేస్తే కరోనా సమయంలోను జగన్ సంక్షేమ పథకాలు అందించారు. బాబు చేసిన అప్పుల్ని జగన్ తీరుస్తున్నారు.. చంద్రబాబు ఖజానాను ఖాళీచేసి వెళ్తే.. ఆ అప్పులను ప్రభుత్వం తీరుస్తోంది. ఏపీలో ఏవో నేరాలు, ఘోరాలు జరిగిపోతున్నాయంటూ కేంద్రానికి టీడీపీ ఎంపీలు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. బాబు వెళ్తూవెళ్తూ రూ.100 కోట్లు ఉంచి మిగతా ఖజానా అంతా ఊడ్చేశారు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామనడం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించడం, భోగాపురం పనులు ముందుకు తీసుకెళ్లడం, దక్షిణ కోస్తా జోన్ తీసుకురావడం.. ఇవన్నీ టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడికి ఉత్తరాంధ్రకు చేసిన ద్రోహంలా కనిపిస్తున్నాయి. శ్రీలంక తరహాలో ఏపీ ఆర్థికంగా కుప్పకూలిపోతోందని టీడీపీ, పవన్‌కల్యాణ్ బోగస్ ప్రచారాలు చేస్తున్నారు. ప్యాకేజీల కోసం ప్రత్యేకహోదా తాకట్టుపెట్టిన చంద్రబాబు ముందు ప్రజలకు క్షమాపణలు చెప్పి ఆ తర్వాత మాట్లాడాలి’ అని వారు పేర్కొన్నారు. -
చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. న్యాయవ్యవస్థలోను రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్సీపీ ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు, అయోధ్యరామిరెడ్డి బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓబీసీలకు జరుగుతున్న నష్టాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎంపీలు బోస్, వెంకటరమణారావు ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడారు. చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, న్యాయవ్యవస్థలోను అమలు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. తొలుత బీసీ జనగణన చేయాలని, లేకుంటే రాజ్యాంగ సవరణకు అవకాశం ఉండదని చెప్పామన్నారు. ఇంకా వారేమన్నారంటే.. ► న్యాయవ్యవస్థలోను రిజర్వేషన్లు అమలు చేయాలని కోరాం. సుప్రీంకోర్టులో ఇప్పటివరకు ఎస్సీ వర్గానికి చెందిన ఐదుగురు మాత్రమే న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. 14 హైకోర్టుల్లో 75 ఏళ్లలో ఒక ఎస్సీ వర్గానికి చెందిన న్యాయమూర్తి కూడా లేరు. మేజిస్ట్రేట్ కోర్టు నుంచి ఆ రిజర్వేషన్లు అమలు చేయాలని విజ్ఞప్తి చేశాం. బీసీలకు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గుర్తింపు రాలేదని తెలిపాం. ► కాకినాడ–అమలాపురం రోడ్డును కత్తిపూడి నుంచి ద్రాక్షారామం, కోటిపల్లి మీదుగా అమలాపురం వరకు నిర్మించాలని, దీనికి గోదావరిపై వంతెన నిర్మించాలని కోరాం. -
అటు పెగసస్.. ఇటు ‘ప్రెసిడెంట్ మెడల్’
సాక్షి, న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్‌ను ఉపయోగించుకున్నందున చంద్రబాబు చేసింది ముమ్మాటికీ దేశద్రోహమేనని వైఎస్సార్సీపీ ఎంపీలు ఆరోపించారు. మరోవైపు ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్స్ రిజర్వ్ వంటి మద్యం బ్రాండ్లు కూడా చంద్రబాబు హయాంలోనే వచ్చాయని చెప్పారు. న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, తలారి రంగయ్య, ఎన్.రెడ్డెప్ప మాట్లాడారు. నాటి ఏపీ సీఎం చంద్రబాబు పెగసస్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణను తీవ్రంగా పరిగణించాలన్నారు. ‘నాడు ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఏబీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో కొనుగోలు చేసిన పెగసస్‌పై కేంద్రం చూసీచూడనట్టుగా ఉండడం సరికాదు. దేశ అంతర్గత వ్యవహారాలు, భద్రత గురించి ప్రమాదం పొంచి ఉన్న విషయం కేంద్రం దృష్టికి తీసుకొస్తున్నాం. మమత చేసిన వ్యాఖ్యలు సుమోటోగా స్వీకరించి దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని కేంద్రాన్ని, రాష్ట్రపతిని కోరుతున్నాం. ఎంపీలందరం ప్రధాని, రాష్ట్రపతిని కలిసి ఈ అంశంపై డిమాండ్ చేస్తాం. సీఎం జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. హైఓల్టేజీ బీరు, బ్రిటిష్ ఎంపరర్ తదితర బ్రాండ్లు కూడా టీడీపీ హయాంలో వచ్చినవే. దేశద్రోహం కింద చంద్రబాబును అరెస్టు చేయాలి. సుమోటోగా తీసుకుని సుప్రీం కోర్టు దర్యాప్తు చేయాలి. పెగసస్ స్పైవేర్ నాడు కొనుగోలు చేయాలని కోరారంటూ తేలుకుట్టిన దొంగలా లోకేశ్ ఇప్పుడు చెబు తున్నారు. ఈ నేపథ్యంలో మరింత లోతుగా విచారణ జరపాలి. -
రఘురామ రాజీనామా పై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కామెంట్స్
-
టీడీపీ నీచ, దుష్ట రాజకీయాలు చేస్తోంది: ఎంపీ సుభాష్ చంద్రబోస్
సాక్షి, న్యూఢిల్లీ: అభివృద్ధి పనులకు టీడీపీ అడ్డుపడుతుందని వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధికి రావాల్సిన నిధులను అడ్డుకుని.. టీడీపీ నీచ, దుష్ట రాజకీయాలు చేస్తోందని నిప్పులు చెరిగారు. పేదల ఇళ్ల స్థలాలకు అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నీచ రాజకీయాలతో ఏపీలోని పేదలకు అన్యాయం జరుగుతుందన్నారు. చదవండి: సమస్యలకు శుభం కార్డు.. సీఎం జగన్‌కు ధన్యవాదాలు: చిరంజీవి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి సైతం సముచిత పాత్ర ఉందని.. నిర్మాణాత్మక సూచనలు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదని సుభాష్ చంద్రబోస్ హితవు పలికారు. చంద్రబాబు నేతృత్వంలోని ప్రతిపక్షం అభివృద్ధికి అడ్డుపుల్ల వేయడమే పనిగాపెట్టుకుందని మండిపడ్డారు. ఇందుకు పావుగా ఎంపీ రఘురామకృష్ణరాజును ఉపయోగించుకుంటున్నారన్నారు. ‘‘హడ్కో రుణాల మంజూరు నిలుపుదల చేయించాలంటూ ఆయనతో ఒక పిటిషన్ పెట్టించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను ఎలాగైనా ఆపించాలని ప్రయత్నిస్తున్నారు. గృహ నిర్మాణానికి రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకోవడంలోనూ ప్రధాన పాత్ర పోషించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిన ఉద్దేశం ఉపాధి కల్పన, మనీ సర్క్యులేషన్లో ఉంచడమే. ఇందులో ఎంతమందికి పని కల్పించామన్నదే ముఖ్యం తప్ప, ఎంత పని జరిగిందన్నది ముఖ్యం కాదు. పేదవాడి ఇంటిస్థలాన్ని చదును చేయడానికి ఈ పథకాన్ని ఒప్పుకోకపోవడం దురదృష్టకరం. చంద్రబాబు, రఘురామకృష్ణ రాజు ఇద్దరూ కలిసి పిటిషన్లు పెట్టి స్టే తీసుకొచ్చారు. పేదవారిపై వీరికున్న చిత్తశుద్ధి ఏంటో దీన్నిబట్టి అర్థమవుతుందని’’ సుభాష్ చంద్రబోస్ అన్నారు. -
వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు అస్వస్థత
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంట్లో కళ్లు తిరిగిపడిపోయారు. ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. షుగర్ లెవల్స్ తగ్గడంతో కళ్లు తిరిగి పడిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు. చదవండి: రాజ్యసభలో టీడీపీ విషప్రచారం.. తిప్పికొట్టిన ఎంపీ విజయసాయిరెడ్డి -
'ఆ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబును ఏం చేసినా పాపం లేదు'
న్యూఢిల్లీ: చంద్రబాబు సొంత ఎజెండాతోనే అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేశారని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'బాబు తన బినామీలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అన్ని ప్రాంతాలలో అభివృద్ధి జరగాలనే ఆలోచనతో వైఎస్ జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి అవసరం లేదా..?. సీఎం తీసుకున్న నిర్ణయాలను కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారు. పేదలకు ఇల్లు దక్కకుండా కేసులు వేశారు. సీఎం జగన్ మన ఇల్లు- మన పట్టా ద్వారా న్యాయమైన హక్కు కల్పిస్తామని అంటే దానికి అడ్డుపడ్డారు. ఇంగ్లీష్ మీడియం చదువులు పేదలకు అందకుండా ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు పేదలపై సామాజిక దాడి చేస్తున్నారు. జస్టిస్ చంద్రుపై చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన అహంభావానికి నిదర్శనం. కుప్పం ఎన్నికలలో చంద్రబాబును ఛీత్కరించారు. మూడు లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత చంద్రబాబుదని' మోపిదేవి వెంకటరమణ అన్నారు. చదవండి: (రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొనే పీఆర్సీ: సజ్జల) ప్రజల్ని రెచ్చగొట్టేందుకు రాజధాని పాదయాత్రలు అమరావతిలో పేదలకు పట్టాలు ఇస్తే జనాభాలో అసమతుల్యత జరుగుతుందని చంద్రబాబు అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన బాబును ఏం చేసినా పాపం లేదు. వైఎస్ జగన్ పవిత్రమైన లక్ష్యంతో పరిపాలన చేస్తున్నారు. బాబు ఇకనైనా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.. భూముల కోసం రాజధాని పెట్టాలా..? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసమే అమరావతి. రాజధానికి 33వేల ఎకరాలు అనవసరం. మూడు వేల ఎకరాలకంటే ఎక్కువ అవసరం లేదు. రైతులను మోసం చేసి ముంచిన ఘనుడు బాబు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి విఘాతం కలిగిందని బాబు ఏడుపు. పరిపాలన వికేంద్రీకరణ వైఎస్ జగన్ ప్రభుత్వ లక్ష్యం. వికేంద్రీకరణతో మరోసారి రాష్ట్ర విభజన రాదు. ఏపీ ప్రజలను రెచ్చగొట్టేందుకు రాజధాని పాదయాత్రలు చేస్తున్నారు. కార్పొరేషన్లపై రూ.13 వేల కోట్ల నుంచి రూ.58 వేల కోట్లకు అప్పుల భారం పెంచారు. దీనిపై వడ్డీలకు వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆర్థిక మాంద్యం, కరోనా వల్ల రాష్ట్రానికి ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. ఈ పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు రెచ్చగొట్టే విధానాలను మానుకోవాలని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సూచించారు. -
బీసీలు పోరాడి సాధించుకోవాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జనగణనతో పాటు కులగణన చేయాలని ఎన్నో ఏళ్లుగా పోరాటాలు జరుగుతున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ విమర్శించారు. బీసీ జనగణన చేపట్టాలన్న డిమాండ్‌తో మూడు రోజులపాటు తెలంగాణ, ఏపీ బీసీ సంక్షేమ సంఘాల అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, కేశ న శంకర్రావు నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో మంగళవారం వైఎస్సార్సీపీ ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, మార్గాని భరత్, గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, రెడ్డప్ప, టీడీపీ ఎంపీలు కేశినేని శ్రీనివాస్, రామ్మోహన్నాయుడు, గల్లా జయదేవ్, రవీంద్రకుమార్ పాల్గొని సంఘీభావం ప్రకటించారు. పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ బీసీల కులగణనతో మాత్రమే బీసీలకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ బీసీ జనగణన చేపట్టాలని పార్లమెంట్ వేదికగా పోరాడతామని చెప్పారు. బీసీలకు వైఎస్సార్సీపీ ప్రాధాన్యం ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, చిన్నచిన్న కులాలకు సైతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. బీసీల అభ్యున్నతికి ఏపీ ముఖ్యమంత్రి అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. బీసీల అభ్యున్నతికి, వారికి దశదిశ చూపించే బీసీ జనగణన చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీసీలు బలమైన సామాజికవర్గమని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ అగ్రకులాల వారిని పల్లకిలో మోసిమోసి బీసీల భుజాలు అరిగిపోయాయని చెప్పారు. అలాంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా బీసీలకు సీట్లు ఇచ్చి గెలిపించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. బీసీల సమస్యల పరిష్కారానికి, జనగణన చేపట్టేవరకు ఏమాత్రం విశ్రమించకుండా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. -
ప్రత్యేక హోదా ఎందుకివ్వరు?
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎందుకివ్వరని మంగళవారం పార్లమెంటులో వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. లోక్‌సభలో వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత పి.వి.మిథున్‌రెడ్డి, రాజ్యసభలో పార్టీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్సింగ్ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని కోరారు. లోక్‌సభలో డిమాండ్స్, గ్రాంట్స్‌పై జరిగిన చర్చలో మిథున్‌రెడ్డి మాట్లాడుతూ యూపీఏ, ఎన్డీయే కలిసి రాష్ట్రాన్ని విభజించాయని గుర్తుచేశారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని నాటి ప్రధాని మన్మోహన్, ప్రస్తుత ప్రధాని మోదీ సభలోను, బయట ఇచ్చిన హోదా హామీ నెరవేర్చాలని కోరారు. విభజన సమయంలో తెలంగాణ కన్నా ఏపీ తలసరి ఆదాయం తక్కువగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. విభజన చట్టం అమలు పదేళ్ల కాలంలో ఇప్పటికి ఎనిమిదేళ్లు ముగిసిందని చాలా హామీలు నెరవేర్చాల్సి ఉందని చెప్పారు. విభజన హామీల అమలు తీరు.. ఒక రాష్ట్రానికి సాయం చేయడానికి ఓ రాజు పలువురు తెలివైనవారి సలహాలు తీసుకుని పులిని చేయబోయి పిల్లిని ఆవిష్కరించినట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్లు గడిచినా పోలవరం ప్రాజెక్టు, పెట్రోకారిడార్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, వెనకబడిన జిల్లాల గ్రాంటు ఇలా పలు అంశాల్లో రాష్ట్రం పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందన్నారు. విభజన సమయంలో ఎన్డీయే, యూపీఏ రెండూ రాష్ట్రానికి హామీలిచ్చాయని గుర్తుచేశారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో కేంద్రం రాష్ట్రానికి సహకరించాలని కోరారు. పోలవరాన్ని ఇరిగేషన్, తాగునీరు..అంటూ వేరుచేయడం సరికాదు పోలవరం ప్రాజెక్టుకు నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే 194 టీఎంసీలతో డిజైన్ రూపొందించారని గుర్తుచేశారు. ప్రాజెక్టును విభజన చట్టం రాకముందే మొదలు పెట్టారన్నారు. విభజన చట్టంలో పోలవరానికి జాతీయ హోదా ప్రకటిస్తూ.. కేంద్రమే పూర్తిచేస్తుందని, అన్ని అనుమతులు ఇచ్చి పునరావసం పరిహారం సహా అన్నింటినీ నెరవేరుస్తామని చెప్పి ఇప్పుడు చేయకపోవడం బాధాకరమని చెప్పారు. సవరించిన అంచనాలకు సాంకేతిక కమిటీ ఆమోదం తెలిపిందని, దీన్ని కేబినెట్ ఆమోదించాలని కోరారు. నాడు ఎన్డీయే ప్రభుత్వం, టీడీపీల మధ్య ఏం జరిగిందో అనవసరమని రాష్ట్రానికి నిర్మాణ బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తిగాక ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. ఏపీ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇరిగేషన్, తాగునీరు కాంపొనెంట్ అంటూ వేరుచేయడం సరికాదన్నారు. సవరించిన అంచనా రూ.55 వేల కోట్లకు అనుమతించినప్పుడే ప్రాజెక్టు సకాలంలో పూర్తవుతుందన్నారు. ఇవ్వాల్సిన రూ.1,700 కోట్లు వెంటనే విడుదల చేయాలి ఏపీలో పౌరసరఫరాలకు ఇవ్వాల్సిన రూ.1,700 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ విషయంలో కాగ్ ఆడిట్ చేసి చెప్పిన విధంగా రాష్ట్రానికి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంపై ఇటీవల భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయని, తక్షణ సాయంగా రూ.వెయ్యికోట్లు విడుదల చేయాలని కోరారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలని, కేంద్ర ప్రభుత్వమే ఈ పరిశ్రమను నడిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన 13 వైద్య కళాశాలలకు సాయం చేయాలని కోరారు. నియోజకవర్గంలో అభివృద్ధి నిమిత్తం సభ్యులకు ఎంపీలాడ్స్ నిధులు పెంచాలని మిథున్‌రెడ్డి కోరగా పలువురు సభ్యులు బల్లలు చరిచి మద్దతు తెలిపారు. విభజన హామీల అమలుకు గడువు రెండేళ్లే ఉన్నందున ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం సానుభూతి చూపించాలని ఆయన కోరారు. ఏపీ ఆర్థికంగా నష్టపోయింది రాజ్యసభ జీరో అవర్‌లో ఎంపీ సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ.. విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా చాలా నష్టపోయిందని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు.