
సాక్షి, రాజమండ్రి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి కో ఆర్డినేటర్ శివరామ సబ్రహ్మణ్యం కుమార్తె వివాహానికి రాజమండ్రి మంజీరా ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై నూతన వధూవరులు అమృతవల్లి, శ్రీరంగనాథ్‌లను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, విశ్వరూప్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ భరత్, కాపు కార్పోరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా తదితరులు హాజరయ్యారు.
తణుకులో సందడి వాతావరణం..
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత కుమార్తె వివాహం తణుకులో అంగరంగ వైభవంగా జరుగుతోంది. తణుకు బెల్ వెదర్ స్కూల్ అవరణలో జరుగుతున్న ఈ వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు భారీగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పలువురు రాజకీయ ప్రముఖులతో తణుకు సందడి వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment