
సాక్షి, తూర్పుగోదావరి : రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన చక్కగా సాగుతోందని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ పేర్కొన్నారు. గుంటూరులో సోమవారం సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జిల్లాలో పిల్లి సుభాష్ మాట్లాడుతూ.. పేదవారికి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం వరం లాంటిదని ప్రశంసించారు. వైద్య విధానంలో పోస్ట్ ఆపరేటివ్ కేర్ చాలా ముఖ్యమని తెలిపారు. వైద్యంలో పేదలకు మనోధైర్యాన్ని తెచ్చేందుకు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని సీఎం జగన్ తీసుకు వచ్చారన్నారు. ఈ పథకం దేశంలోనే వినూత్నమైన సంస్కరణ అని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. గత టీడీపీ పాలనలో ఆర్యోగ్య శ్రీని నిర్వీర్యం చేసిందని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు దుయ్యబట్టారు. మళ్లీ ఈ పథకాన్ని సీఎం వైఎస్ జగన్ బలోపేతం చేశారని ఆయన స్పష్టం చేశారు.