
సాక్షి, కాకినాడ (తూర్పుగోదావరి): ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యమాన్ని వారే నడుపుతున్నట్లుగా చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబులా వేధించి ద్రోహం చేసే ప్రభుత్వం మాది కాదని కన్నబాబు అన్నారు.
చదవండి: ఉద్యోగులకు చంద్రబాబు ఏం ఉద్ధరించారు?: మంత్రి బొత్స
‘‘ఉద్యోగులు పీఆర్సీని ఒక సమస్యగా భావిస్తున్నారు. వారి సందేహనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం వేసిన కమిటీతో చర్చిద్దామని ఉద్యోగులను కోరుతున్నాను. కాదని రోడ్డెక్కి ఆందోళనలు చేస్తే సమస్య పరిష్కారం కాదు. కావాలని కొంతమంది రెచ్చగొట్టే ధోరణీ వెళ్తున్నట్లు కనిపిస్తుంది. 2018లో చంద్రబాబు పీఆర్సీ వేసి అమలు చేయకపోయినా... అధికారంలో వచ్చిన వెంటనే ఐఆర్ ఇచ్చిన ఘన చరిత్ర సిఎం జగన్‌ది. కొంత మంది ఉద్యోగ సంఘాల నాయకులు సాక్షాత్తూ సిఎం జగన్ ను కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్దతి కాదు. ఉద్యమాన్ని వారే నడుపుతున్నట్లుగా ఒకవైపు చంద్రబాబు.. ఆయన తనయుడు లోకేష్ బిల్డప్‌లు ఇస్తున్నారని’’ మంత్రి కన్నబాబు నిప్పులు చెరిగారు.
Comments
Please login to add a commentAdd a comment