Employees Unions
-
రాజధానిని వదులుకుంటే చరిత్ర క్షమించదు..
టెక్కలి: విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని, వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని వక్తలు నొక్కి వక్కాణించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గురువారం నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో చర్చా వేదిక నిర్వహించారు. విద్యార్థి, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సామాజిక సంఘాల ప్రతినిధులు పాల్గొని విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు కావాల్సిందేనంటూ తీర్మానించారు. ప్రాంతీయ అసమానతలకు తావులేకుండా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నతాశయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖలో రాజధానికి శ్రీకారం చుట్టారని, దీనికి మనమంతా మద్దతు తెలపాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు లేకుండా సీఎం వైఎస్ జగన్ వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారని, ఈ క్రమంలో విశాఖను పరిపాలన రాజధానిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి చెప్పారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసుకునేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకుంటే భావితరాలు మనల్ని క్షమించవని ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ హెచ్చరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా విశాఖలో రాజధాని కోసం సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఎవరు అడ్డుపడినా ఊరుకోం.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ పాలన వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి కోసం విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేస్తున్నారు. అభివృద్ధి అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. ఈ విషయంలో ఎవరు అడ్డుపడినా తొక్కుకుంటూ రాజధానిని ఏర్పాటు చేసుకుంటాం. – ప్రొఫెసర్ గుంట తులసీరావు, శ్రీకాకుళం నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్. మద్దతిద్దాం.. వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో రాజధాని ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి ప్రభుత్వ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలి. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ చైతన్యవంతం కావాలి. – పేడాడ పరమేశ్వరరావు, జర్నలిస్టు సంఘం రాష్ట్ర నేత ఉత్తరాంధ్ర నుంచి వలస నివారణ విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటును ఉద్యోగ సంఘాల తరఫున పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నాం. దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వలసలను నివారించవచ్చు. విశాఖలో రాజధాని వలన కలిగే ప్రయోజనాలపై గ్రామ స్థాయిలో చర్చా వేదికలు నిర్వహించాలి. సీఎం జగన్ తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. – చౌదరి పురుషోత్తంనాయుడు, ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర నేత ఇప్పుడు వదిలేస్తే.. చరిత్ర క్షమించదు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఉత్తరాంధ్రపై అభిమానంతో విశాఖలో రాజధానిని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఓ సువర్ణావకాశం. ఇలాంటి అవకాశాన్ని విడిచి పెడితే చరిత్ర మనల్ని క్షమించదు. విశాఖ రాజధాని కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలి. – హనుమంతు సాయిరాం, ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షుడు. భావి తరాల భవిత కోసం.. విశాఖలో రాజధాని వల్ల కలిగే ప్రయోజనాలపై గ్రామ స్థాయిలో ప్రజలను చైతన్యపరచాలి. రాజధాని ఏర్పాటుతో భావి తరాల భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. విశాఖలో రాజధాని సాధన కోసం టెక్కలి నుంచే ఉద్యమాన్ని ప్రారంభించాలి. – దానేటి శ్రీధర్, వైద్యుడు, జిల్లా నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్. -
సీపీఎస్‌పై చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం
సాక్షి, విజయవాడ: సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో రేపు(బుధవారం) ప్రభుత్వం చర్చలు జరపనుంది. మంత్రుల కమిటీతో చర్చలకు రావాలని 20 ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ప్రభుత్వం ఆహ్వానం అందించింది. సీపీఎస్ రద్దు అంశంపై చర్చించేందుకు రావాలని ప్రభుత్వం పేర్కొంది. సాయంత్రం నాలుగు గంటలకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది. -
‘మాది సంక్షేమ ప్రభుత్వం.. గర్వంగా చెప్పగలం’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉద్యోగుల పట్ల ప్రేమ ఉండబట్టే 27 శాతం ఐఆర్ ఇచ్చారని.. రాష్ట్ర ఆర్థిక పరిస్ధితి వల్లే పీఆర్సీపై ఉద్యోగులతో సంప్రదింపులు చేయాల్సి వచ్చిందని మంత్రి పేర్నినాని తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ సర్ణోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, 50 ఏళ్లగా ఒక్కటే యూనియన్‌గా నడపటం అభినందనీయమన్నారు. తమ వెంట నడిచిన ఉద్యోగులను ఎప్పటికీ గుర్తించుకుంటామని చెప్పారు. మాది సంక్షేమ ప్రభుత్వం: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. దేశంలోనే ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఉన్నత స్ధితిలో ఉందని, వాణిజ్య పన్నుల శాఖకు సీఎం వైఎస్ జగన్ పూర్తి సహకారం అందించారన్నారు. 2019లో వైఎస్సార్సీపీ భారీ మెజార్టీ రావడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని కొనియాడారు. తమ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అని గర్వంగా చెప్పగలమన్నారు. ఉద్యోగుల సహకారంతోనే రాష్ట్ర అభివృద్ది జరిగిందన్న ఆయన.. ఉద్యోగుల సంఘ నాయకుడిగా సూర్యనారాయణ మంచి పనితీరు కనబరిచారని ప్రశంసించారు. అడగకుండానే 27 శాతం ఐఆర్ ఇచ్చాం: సజ్జల రామకృష్ణారెడ్డి రెండు, మూడు దశాబ్దాలుగా ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం తర్వాత మర్చిపోవడం ఒక ట్రెండ్‌గా వస్తోందని, సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం, అభివృద్ధిని ప్రజా సంక్షేమంతో కలిసి చూస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అడగకుండానే ప్రభుత్వం 27 శాతం ఐఆర్ ఇచ్చిందన్న ఆయన.. ఇవ్వగలం అనే ఉద్దేశ్యంతోనే సీపీఎస్ రద్దు వంటి హామీలు ఇచ్చామని, కానీ కోవిడ్ కారణంగా రాష్ట్ర ఆదాయం పై తీవ్ర ప్రభావం చూపించిందని చెప్పారు. ఉద్యోగుల సంక్షేమం చూడటం బాధ్యతగా భావిస్తామని సజ్జల అన్నారు. -
AP: ఉపాధ్యాయ సంఘాల బండారం బయటపెట్టిన పీఆర్సీ స్టీరింగ్ కమిటీ
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ సంఘాల బండారం పీఆర్సీ స్టీరింగ్ కమిటీ బయటపెట్టింది. హెచ్ఆర్ఏ విషయంలో తెలంగాణకు సమానంగా తెచ్చుకున్నామని.. పీఆర్సీ ఐదేళ్లకు ఒకసారి ఇచ్చేలా చూశామని పీఆర్సీ జేఏసీ నేతలు అన్నారు. అదనపు పెన్షన్, సీసీఏ కూడా వచ్చిందన్నారు. చదవండి: ఆంధ్రప్రదేశ్ కోణంలో ఇది చెత్త బడ్జెట్: విజయసాయిరెడ్డి ‘‘ఉపాధ్యాయ సంఘాలు ప్రతి అంశంలో చర్చల్లో పాల్గొన్నాయి. అప్పుడే ఉపాధ్యాయ సంఘాలు చర్చల నుంచి బయటకు రావాల్సింది. ఫిట్‌మెంట్‌పై అప్పుడే బయటకు వచ్చి చెప్పాల్సింది. సమ్మె విరమించుకుందామని కూడా ఉపాధ్యాయ సంఘాలు చెప్పాయి. ఉపాధ్యాయుల ఆందోళనలో వేరే శక్తులు ఉన్నాయని’’ పీఆర్సీ జేఏసీ నేతలు అన్నారు. ఉపాధ్యాయ ముసుగులో దుష్ఫ్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నిర్ణయంలోనూ 20 మంది అభిప్రాయం మేరకే ముందుకెళ్లామన్నారు. మెరుగైన ప్రయోజనం వచ్చింది కాబట్టే సమ్మె విరమించామన్నారు. ఉపాధ్యాయ సంఘాలు మంత్రులు పక్కన కూర్చుని మాట్లాడలేదా? గ్రాట్యుటీ, ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై చర్చ జరిగినప్పుడు మీకు తెలియదా?. అన్నింటికీ ఒప్పుకుని ఇప్పుడు ఇలా మాట్లాడతారా అంటూ ఉపాధ్యాయ సంఘాలను పీఆర్సీ జేఏసీ నేతలు నిలదీశారు. -
పీఆర్సీపై హర్షాతిరేకాలు
ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వం జరిపిన చర్చల్లో మెరుగైన పీఆర్సీ ప్రకటించడాన్ని హర్షిస్తూ రాష్ట్ర వైఎస్సార్‌టీయూ అనుబంధ జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అదనపు ప్రధాన కార్యదర్శి గొండు సీతారాం మాట్లాడుతూ.. ఊరటనిచ్చేలా పీఆర్సీ ఇవ్వడం, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఐదు డీఏలు ఒకేసారి చెల్లింపునకు అంగీకారం తెలపడం హర్షణీయమన్నారు. పీఆర్సీ పాత పద్ధతిలో ఐదేళ్లకోసారి అమలుకు అంగీకరించటం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వీలైనంత ఆర్థిక లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకోవడం, కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసుల రెగ్యులరైజేషన్, హెచ్ఆర్ఏ అంశాలు, పెన్షనర్లకు అదనపు క్వాంటం, సీపీఎస్ పునరుద్ధరణకు రూట్ మ్యాప్, పూర్తిస్థాయిలో హెల్త్ కార్డులు స్ట్రీమ్ లైన్లోకి తీసుకురావడం, కోవిడ్‌తో మరణించిన ఉద్యోగుల వారసులకు వీలైనంత త్వరితగతిన ఉద్యోగాలు కల్పించడం, పెన్షనర్లు ఎదురుచూస్తున్న మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను పొడిగించేందుకు అంగీకరించడం, పీఆర్సీ రిలేటెడ్ 9, ఇతర 4 అంశాలు తదితర డిమాండ్లపై ప్రభుత్వం నుంచి అనుకూల సంకేతాలు రావడం శుభపరిణామం అన్నారు, మంత్రివర్గ ఉప సంఘం, చీఫ్ సెక్రటరీతో జరిగిన చర్చల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అంగీకార సంతకాలు చేసి బయటకొచ్చి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు డి.పోలరావు, ఎల్లయ్య, బి.తాతారావు, వెంకునాయుడు, సత్యం, పి.ఎల్లారావు, కె.రామునాయుడు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. -
ముందు ఒప్పుకొని.. ఆపై మాట మార్చడం తగదు
సాక్షి, అమరావతి/ఏఎన్‌యూ: పీఆర్సీ విషయంలో మంత్రుల కమిటీతో అన్ని ఉద్యోగ సంఘాలతో పాటు పలు టీచర్ల సంఘాలు కూడా చర్చల్లో పాల్గొని, ఆయా అంశాల్లో ఆమోదం తెలిపాక.. బయటకొచ్చి మాటమార్చడం సరికాదని పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు హితవుపలికాయి. భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధ్యాయులకు వీలైనంత మేలు చేసేందుకు ప్రయత్నిస్తానని సీఎం వైఎస్ జగన్ చెప్పినా కూడా నిరసనల పేరుతో కొందరు ఉద్యోగ, ఉపాధ్యాయులను రెచ్చ గొట్టడం ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసమంటూ ప్రశ్నిస్తున్నాయి. ఈ మేరకు సోమవారం ప్రకటనలు విడుదల చేశాయి. కొందరు టీచర్ల తీరు చూసి సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది.. పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో చర్చలు జరిగి డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకొన్నాక కూడా మళ్లీ ధర్నాలు, నిరసనలకు దిగడం, జేఏసీ నాయకులను దుర్భాషలాడడం ఎంతవరకు సమంజసమని ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వై.వెంకటప్పారెడ్డి ప్రశ్నించారు. పది మందికి చదువులు చెప్పే ఉపాధ్యాయుల తీరు చూసి సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా నెలల తరబడి పాఠశాలలను తెరవకున్నా, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ సకాలంలో వేతనాలు అందేలా సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని గుర్తుచేశారు. నాయకులమని చెప్పుకొనే వారు రాష్ట్ర ప్రజల గురించి కూడా ఆలోచించి మసలుకోవాలని హితవుపలికారు. పీఆర్సీపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పేర్కొన్న అభ్యంతరాలు, సమస్యల్లో చాలా వాటిని సీఎం పరిష్కరింపజేసి మేలు చేశారని, యూనివర్సిటీల్లో ఉన్న బోధనేతర సిబ్బందికి హెచ్ఆర్ఏను 8 శాతం నుంచి 16 శాతం వరకూ పెంచారని గుర్తు చేశారు. గతంలో ఉద్యోగులు అడగకున్నా ఐఆర్‌ను 20 శాతం నుంచి 27 శాతానికి పెంచిన విషయాన్ని ప్రస్తావించారు. ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా అడిగినవన్నీ దాదాపుగా ఒప్పుకున్నందున సీఎం వైఎస్ జగన్‌కు వెంకటప్పారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం? మంత్రుల కమిటీతో సుదీర్ఘ చర్చల అనంతరం హెచ్ఆర్ఏ రేట్ల పెంపుతో పాటు, ఐఆర్ రికవరీ నిలుపుదల, ఐదేళ్ల కోసారి పీఆర్సీ, పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ పెన్షన్ వంటి విషయాల్లో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుందని వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.జాలిరెడ్డి తెలిపారు. ఆర్థిక పరిస్థితి కారణంగా ఫిట్మెంట్ 23 శాతం కంటే ఎక్కువ ఇవ్వలేకపోయామని స్వయంగా సీఎం చెప్పారని, కానీ కొన్ని సంఘాలు చర్చల సమయంలో అన్నింటికీ ఒప్పుకుని, బయటకొచ్చి వ్వతిరేకిస్తున్నామనడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకంటే చేయలేమని, అర్థం చేసుకోవాలని సీఎం కోరాక కూడా నిరసనలకు పిలుపునిచ్చారంటే ఎవరివో రాజకీయ ప్రయోజనాలు ఆశించే ఇలా చేస్తున్నారన్న అనుమానం కలుగుతోందన్నారు. భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధ్యాయులకు వీలైనంత మేలు చేసేందుకు ప్రయత్నిస్తానని సీఎం చెప్పినందున నిరసనల విషయంలో పునరాలోచించాలని జాలిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అందరితో సమానంగా పీఆర్సీ వర్తింపు చరిత్రాత్మకం ఇదిలా ఉండగా ఏపీ మోడల్ స్కూల్స్ సొసైటీతో పాటు ఇతర గురుకులాల సొసైటీల్లో పనిచేస్తున్న టీచర్లకూ ఇతర ప్రభుత్వ యాజమాన్య స్కూళ్ల టీచర్లతో పాటు ఏకకాలంలో 11వ పీఆర్సీని వర్తింపజేయడం సంతోషకరమని మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోషియేషన్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. దీనిపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కోమటిరెడ్డి శివశంకరరెడ్డి, ప్రధాన కార్యదర్శి గడపర్తి చంద్రశేఖర్‌లు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకముందు అందరికీ వర్తింపజేసినా ఒకటి లేదా రెండేళ్లకు గానీ సొసైటీ టీచర్లకు పీఆర్సీ అమలుచేసేవారు కాదని, ఇప్పుడు నేరుగా వర్తింపజేయడం చరిత్రాత్మకమని వారు కొనియాడారు. మిగతా టీచర్లతో పాటు మోడల్ స్కూళ్ల టీచర్లకూ మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు అవకాశం కల్పిస్తూ ఈ పీఆర్సీ జీవోలోనే పొందుపరచాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
చర్చలకు వచ్చిన 48 గంటల్లోనే సమస్య క్లోజ్: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
-
అందరినీ సంతోషంగా ఉంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: సజ్జల రామకృష్ణారెడ్డి
-
సీఎం జగన్ స్పష్టంగా చెప్పిన మాటలు: ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
-
ఉద్యోగులు విమర్శించినా మా వాళ్లే కదా అనుకున్నాం: సజ్జల
సాక్షి, అమరావతి: పీఆర్సీ విషయంలో చేయగలిగినంతా చేశామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లోనూ వారికి చేయాల్సింది చేశామని పేర్కొన్నారు. హెచ్ఆర్ఏ స్లాబుల విషయంలోనూ సానుకూలంగా చేశామన్నారు. చర్చల్లో పాల్గొన్న టీచర్ల నేతలు అప్పుడే చెప్పి ఉంటే బావుండేదన్నారు. చదవండి: మా ఆవేదనను సీఎం జగన్ అర్థం చేసుకున్నారు: ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయులు అడిగినవి కూడా చేశాం. అందరినీ సంతోషంగా ఉంచాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. కోవిడ్ పరిస్థితుల్లో కూడా రూ.10వేల కోట్లకు పైగా అదనంగా ఖర్చు పెడుతున్నాం. హెచ్ఆర్ఏ స్లాబుల వల్ల రూ.1300 కోట్ల భారం. భవిష్యత్‌లో ఉద్యోగులకు ఏ సమస్య వచ్చిన చర్చించడానికి సిద్ధం. మంత్రుల కమిటీని ప్రభుత్వం కొనసాగిస్తుంది. మేం ఉద్యోగులను ఏనాడూ ఇబ్బంది పెట్టలేదు. ఉన్నదానిలో ఉద్యోగులకు బెస్ట్ ప్యాకేజీ ఇచ్చాం. ఉద్యోగ సంఘాలు మంచిగా సహకరించాయి. సీఎం ఎన్ని స్కీములు పెట్టినా ఉద్యోగుల సహకారం అవసరం. ఉద్యోగులు విమర్శించినా మా వాళ్లే కదా అనుకున్నామని’’ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. -
సీఎం జగన్ గారిది పెద్ద చేయి.. ఆయనను చూసి మాకు చాలా బాధేసింది: వెంకటరామిరెడ్డి
-
సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు ఇవే: సూర్యనారాయణ
-
సీఎం జగన్ మాటలతో సంతోషంగా ఉన్నాం: బండి శ్రీనివాసరావు
-
పీఆర్సీ ఇష్యూకు ఈరోజు ముగింపు
-
ఏపీ: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు సఫలం..
సాక్షి, అమరావతి: దాదాపు7 గంటల పాటు మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు జరిపిన సమావేశం ముగిసింది. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. మంత్రుల కమిటీ ప్రతిపాదనలను సీఎం జగన్ అంగీకారం తెలిపారు. కాసేపట్లో మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాల నేతలు ప్రెస్ మీట్ పెట్టి చర్చల సారాంశాన్ని వివరించనున్నారు. హెచ్ఆర్ఏ స్లాబ్‌లు, పీఆర్సీ కాల పరిమితి, ఐఆర్ అడ్జస్ట్మెంట్, పెన్షనర్ల అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబ్‌లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: పా‘పాల’ పుట్ట హెరిటేజ్! కాగా, శుక్రవారం రాత్రి.. ఉద్యోగుల ఉద్యమం విరమణ దిశగా మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాలు సానుకూలంగా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. తాము కోరుతున్న ప్రధాన అంశాల్లో కొన్నింటిపై మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించినట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. చర్చలు సఫలమయ్యేలా జరుగుతున్నట్లు స్పష్టం చేశాయి. ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని, హెచ్ఆర్ఏ, ఐఆర్ రికవరీ అంశాలపై సానుకూలంగా ఉన్నట్లు మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలకు తెలిపింది. చర్చల అనంతరం మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పీఆర్సీ విషయంలో మెరుగైనది ఇచ్చినా ఉద్యోగులు ఆశించినంతగా లేదని భావించారని, అందుకే వారి అసంతృప్తి, ఆవేదన పరిష్కరించడానికి కూలంకషంగా చర్చలు జరిగాయని తెలిపారు. ప్రతి అంశంపై లోతుగా చర్చించి అందరి ఆమోదం వచ్చిందని చెప్పారు. హెచ్ ఆర్ ఏ విషయంలో వివిధ స్లాబ్స్ ఉద్యోగులతో చర్చించి పెంచినట్లు తెలిపారు. జిల్లా కేంద్రాల్లో 16 శాతం నిర్ణయించామని,హెచ్ఓడీ, సెక్రటేరియట్ వారికి జూన్ 2024 వరకు 24 శాతం హెచ్ఆర్ఏ ఉంటుంది. మారిన హెచ్ ఆర్ ఏ జనవరి 2022 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేసినా ప్రదర్శనలు చేసినా ప్రభుత్వం వైపు నుంచి సానుకూలంగానే ఉన్నామని తెలిపారు. ఆర్థికంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి వల్ల ఉన్నంతలో బెటర్ ప్యాకేజ్ ఇచ్చామన్నారు. ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని చెప్తున్నారు ►ఫిట్ మెంట్ 23 శాతం అదే కొనసాగుతుంది ►అడిషనల్ క్వాంటం 70-74 వయసు వాళ్ళకు 7 శాతం ►ఐఆర్ రికవరీ ఉపసంహరించుకుంటున్నాం ►పదేళ్లకో సారి కాకుండా 5 ఏళ్లకే పీఆర్సీ అమలు చేయాలని నిర్ణయించాం ►సీపీఎస్ రద్దు ప్రక్రియ మార్చ్ 21 కల్లా రూట్ మ్యాప్ తయారు అవుతుంది ►గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల కన్ఫర్మేషన్ జూన్ లోపు జరగాలి ►యధావిధిగా ఉద్యోగులు బాద్యతల్లోకి వెళ్తారని భావిస్తున్నాం -
నేటితో ఉద్యోగుల సమస్యకి పరిష్కారం వస్తుంది: బొత్స
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగులతో సానుకూల వాతావరణంలో శుక్రవారం చర్చలు జరిగాయని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శనివారం మధ్యాహ్నం నుంచి మళ్లీ ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామని వెల్లడించారు. నేటితో సమస్యకి పరిష్కారం ఉంటుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. 23 ఫిట్మెంట్ తర్వాత ఉద్యోగుల జీతాల నుంచి రికవరీపై అభ్యంతరాలు వ్యక్తంచేశారని అన్నారు. ఎచ్ఆర్ఏ శ్లాబులపై కూడా చర్చించామని, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వమని మరోసారి స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్ దృష్టికి శుక్రవారంనాటి చర్చల అంశాలను తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలపై సానుకూల నిర్ణయమే తీసుకుంటామని, వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తాం: పేర్ని నాని ఉద్యోగాల సంఘాల సమస్యలకు శనివారం రోజు మధ్యాహ్నం జరిగే సమావేశంలో పరిష్కారం వస్తుందని భావిస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదటి నుంచీ ఉద్యోగులకు మేలు చేస్తామని చెబుతున్నారని తెలిపారు. అందుకే మంత్రుల కమిటీ కూడా వేశారని గుర్తుచేశారు. శుక్రవారంనాడు సానుకూలంగా చర్చలు జరిగాయని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఈరోజు పూర్తి స్థాయిలో పరిష్కారం వస్తుందని, ఉద్యోగులకు నష్టం జరిగేలా తాము ఏ పని చేయమని అన్నారు. సమస్యలు ఏమున్నా పరిష్కారం చేస్తామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా కొంత ఇబ్బంది వచ్చిందని, హెచ్ఆర్ఏ సమస్య పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు. -
AP: ఉద్యోగుల ర్యాలీలో రాజకీయ సందడి
సాక్షి, అమరావతి: పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం పోలీసులు సంయమనం ప్రద ర్శించడంతో సాఫీగా జరిగిపోయింది. ఐదు వేల మందితో కార్యక్రమం నిర్వహణకు అనుమతి కోరిన ఉద్యోగ సంఘాల నేతలు కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున తరలించినట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇందులో సీపీఎం, సీపీఐ పార్టీల నేతలు పాల్గొనడమే కాకుండా కార్యక్రమాన్ని ఆసాంతం నడిపిం చారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున హాజరు కావడంతోపాటు జన సమీకరణ కూడా చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై రాజకీయ, వ్యక్తిగత విమర్శలకు దిగినట్లు స్పష్టమవుతోంది. టీడీపీ కార్యకర్త ఇప్పుడు గెజిటెడ్ అధికారి అయ్యాడంటూ చలో విజయవాడపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి. రెండు రోజుల ముందే.. వివిధ ప్రాంతాల నుంచి చలో విజయవాడకు హాజరైన ఉద్యోగులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంఘాలవారీగా ఉద్యోగులు బ్యానర్లతో గాంధీనగర్ చేరుకుని అక్కడి నుంచి బీఆర్టీఎస్ రోడ్డు వైపు ర్యాలీలుగా వెళ్లారు. ఫుడ్ జంక్షన్ నుంచి భానునగర్ వంతెన వరకు నిలుచుని ప్రదర్శన చేపట్టారు. పీఆర్సీ సాధన సమితి నేతలు ఓ వాహనంపైకి ఎక్కి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేకపోయినా ప్రణాళిక ప్రకారం తరలి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఉద్యోగ సంఘాల నేతలు ఒక వ్యూహం ప్రకారం రెండు రోజుల ముందే ఉద్యోగులు నగరానికి చేరుకునే ఏర్పాట్లు చేశారు. ఉద్యోగులు బీఆర్టీఎస్ రోడ్డులోకి చేరుకున్నాక కూడా పీఆర్సీ సాధన సమితి నేతలు రాకపోవడంతో అయోమయం నెలకొంది. చివరికి అప్పటికప్పుడు ఒక వాహనంపైకి చేరుకుని పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రసంగించారు. ఒకవైపు పీఆర్సీ సాధన సమితి నేతలు తాము ప్రభుత్వంతో యుద్ధం చేయడం లేదని చెబుతుంటే మరోవైపు యుద్ధానికి సిద్ధమంటూ యూటీఎఫ్ నాయకులు ప్రకటించారు. సీఎంను ఇంటికి పంపుతామని, ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని ఫ్యాప్టో అధ్యక్షుడు జోసెఫ్ సుధీర్‌బాబు హెచ్చరించారు. -
‘ఉద్యమాన్ని వారే నడుపుతున్నట్లుగా.. చంద్రబాబు బిల్డప్’
సాక్షి, కాకినాడ (తూర్పుగోదావరి): ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యమాన్ని వారే నడుపుతున్నట్లుగా చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబులా వేధించి ద్రోహం చేసే ప్రభుత్వం మాది కాదని కన్నబాబు అన్నారు. చదవండి: ఉద్యోగులకు చంద్రబాబు ఏం ఉద్ధరించారు?: మంత్రి బొత్స ‘‘ఉద్యోగులు పీఆర్సీని ఒక సమస్యగా భావిస్తున్నారు. వారి సందేహనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం వేసిన కమిటీతో చర్చిద్దామని ఉద్యోగులను కోరుతున్నాను. కాదని రోడ్డెక్కి ఆందోళనలు చేస్తే సమస్య పరిష్కారం కాదు. కావాలని కొంతమంది రెచ్చగొట్టే ధోరణీ వెళ్తున్నట్లు కనిపిస్తుంది. 2018లో చంద్రబాబు పీఆర్సీ వేసి అమలు చేయకపోయినా... అధికారంలో వచ్చిన వెంటనే ఐఆర్ ఇచ్చిన ఘన చరిత్ర సిఎం జగన్‌ది. కొంత మంది ఉద్యోగ సంఘాల నాయకులు సాక్షాత్తూ సిఎం జగన్ ను కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్దతి కాదు. ఉద్యమాన్ని వారే నడుపుతున్నట్లుగా ఒకవైపు చంద్రబాబు.. ఆయన తనయుడు లోకేష్ బిల్డప్‌లు ఇస్తున్నారని’’ మంత్రి కన్నబాబు నిప్పులు చెరిగారు. -
‘చలో’కి అనుమతి లేదు
సాక్షి ప్రతినిధి, విజయవాడ, సాక్షి, అమరావతి: కోవిడ్ నిబంధనలు, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని చలో విజయవాడ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. మెరుగైన పీఆర్సీ, కొత్త జీవో ఉపసంహరణ డిమాండ్‌తో ఉద్యోగ సంఘాలు 5 వేల మందితో గురువారం చలో విజయవాడ కార్యక్రమ నిర్వహణకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. విజయవాడలో నేడు బీఆర్టీఎస్ రోడ్డులో వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాకపోకలకు అనుమతి లేదని, వాహనదారులు మళ్లింపు మార్గాల్లోనే ప్రయాణించాలని సూచించారు. బీఆర్టీఎస్ వైపు వాహనాల రాకపోకల్ని నివారిస్తూ ప్రత్యామ్నాయంగా ఆరు ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను ఏర్పాటు చేశారు. బీఆర్టీఎస్ రోడ్డులో వందకుపైగా కెమెరాలతో నిఘా ఉంచారు. డ్రోన్లు, ఫాల్కన్ వాహనాలతో పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ముఖ్య కూడళ్లలో తనిఖీ చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలు, 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ఉద్యోగులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్టీరింగ్ కమిటీ నేతల ఇళ్లకు వెళ్లి నోటీసులు ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఉద్యోగ సంఘాలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అయినా సరే.. ఆగేది లేదు: తమపై చర్యలు తీసుకున్నా సరే చలో విజయవాడ నిర్వహిస్తామని పోలీసు కమిషనర్‌కు తెలియచేసినట్లు పీఆర్సీ సాధన సమితి నేతలు మీడియాతో పేర్కొన్నారు. కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో స్టీరింగ్ కమిటీ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి, బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ బుధవారం రాత్రి సీపీని కలిశారు. తమ ఉద్యమ కార్యాచరణ నోటీసును గతంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చామని, అందులో భాగంగానే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనుమతి లేదు.. సహకరించండి చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి నిరాకరిస్తున్నాం. ఉద్యోగులు 5 వేల మంది తరలి రావాలని పిలుపునిచ్చారు. కోవిడ్ నిబంధనల ప్రకారం అవుట్ డోర్ లోకేషన్లలో 200, ఇండోర్‌లో వంద మందికి మించరాదు. అసాంఘిక శక్తులు చొరబడి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశముంది. నగరంలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, 144 సీఆర్పీసీ ప్రొసీడింగ్స్ అమలులో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కార్యక్రమానికి అనుమతి ఇవ్వటం లేదు. ఉద్యోగులు సహకరించాలి. –టి.కె.రాణా,విజయవాడ పోలీస్ కమిషనర్ -
సమ్మెకు ముందే ఉద్యోగుల సహాయ నిరాకరణ సరికాదు..
సాక్షి, విజయవాడ: చర్చలతో ఉద్యోగులు సమస్యలు పరిష్కరించుకోవాలని ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి హితవు పలికారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సమ్మెకు ముందే ఉద్యోగుల సహాయ నిరాకరణ సరికాదన్నారు. కొత్త పీఆర్సీతో ఏ ఒక్క ఉద్యోగికి కూడా జీతం తగ్గలేదన్నారు. పే స్లిప్‌లో ఉద్యోగుల జీతం వివరాలు స్పష్టంగా ఉన్నాయని.. కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని గౌతమ్‌రెడ్డి అన్నారు. చదవండి: ఉద్యోగులు, ప్రభుత్వం వేర్వేరు కాదు: ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి -
సమ్మె పరిష్కారం కాదు
సాక్షి, అమరావతి: కొత్త వేతన సవరణకు సంబంధించిన పిటిషన్ న్యాయస్థానం ముందు పెండింగ్‌లో ఉండగా సమ్మెకు వెళ్లడమేమిటని ఉద్యోగ సంఘాలను రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. ప్రతీ సమస్యకూ సమ్మె పరిష్కారం కాదని చెబుతూ.. కోర్టు ముందు పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే సమ్మెకు వెళ్లడం అంటే కోర్టుపై ఒత్తిడి తీసుకురావడమేనని.. ఇలాంటి ఎత్తుగడలను తాము అనుమతించబోమని స్పష్టంచేసింది. చట్టానికి లోబడి ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ అందరికీ ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమ వినతుల ఆధారంగా మళ్లీ వేతనాలను సవరించి, ఆ మేర ఉత్తర్వులు జారీచేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ గెజిటెడ్ అధికారుల జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) తదితర అంశాల జోలికి తామిప్పుడు వెళ్లడంలేదని, ఈ దశలో వాటిపై విచారణ అవసరంలేదని ధర్మాసనం స్పష్టంచేసింది. అలాగే, ఏ ఒక్క ప్రభుత్వోద్యోగి జీతం నుంచి ఎలాంటి మొత్తాలను రికవరీ చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పీఆర్సీ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కూడా తెలిపింది. ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వోద్యోగులు ఇక సమ్మెకు వెళ్లరనే భావిస్తున్నామని ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. బెంచ్ హంటింగ్‌ను ప్రోత్సహించబోం ఈ సందర్భంగా సీజే స్పందిస్తూ.. ఈ వ్యాజ్యం ధర్మాసనం ముందుకే వస్తుందని మొదట ఈ వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్ అమానుల్లా ధర్మాసనం దృష్టికి ఎందుకు తీసుకురాలేదని అడ్వొకేట్ జనరల్ (ఏజీ)ను ప్రశ్నించారు. అలాగే, అధికరణ 309 కింద జారీచేసిన జీఓను సవాలు చేశామన్న సంగతి ఎందుకు ధర్మాసనానికి చెప్పలేదని అడిగారు. అనంతరం, ఏజీ శ్రీరామ్ సమాధానమిస్తూ.. ‘నిబంధనల గురించి నేను ఆ ధర్మాసనానికి చెప్పాను. దానిపై చర్చ కూడా జరిగింది. ఆ ధర్మాసనం సైతం ఈ వ్యాజ్యాన్ని మొదటి కోర్టే విచారించాలని అభిప్రాయపడింది. అయితే, పిటిషనర్ తరఫు న్యాయవాదే ఈ వ్యాజ్యం పునర్విభజన చట్ట నిబంధనల కిందకు వస్తుందని చెప్పారు. తరువాత సింగిల్ జడ్జి వద్ద కూడా నేను నిబంధనల గురించి వివరించాను’.. అని చెప్పారు. ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలపై తాము ఎంతమాత్రం సంతోషంగా లేమన్న ధర్మాసనం, బెంచ్ హంటింగ్‌ను తాము ప్రోత్సహించబోమని వ్యాఖ్యానించింది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతానని, అది కూడా ఓపెన్ కోర్టులోనే మాట్లాడతానని, అది తనకున్న చెడ్డ అలవాటని సీజే జస్టిస్ మిశ్రా అన్నారు. ప్రతీ ఉద్యోగి వాదనను ప్రభుత్వం వినలేదు కదా? పిటిషనర్ తరఫు న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపిస్తూ.. వేతన సవరణ కోసం నియమించిన అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదికను ప్రభుత్వం ఇప్పటివరకు బహిర్గతం చేయలేదని.. కొత్త వేతన సవరణ జీఓ ఏకపక్షంగా ఇచ్చారన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ‘ప్రభుత్వం ప్రతీ ఉద్యోగి వాదన వినలేదు కదా? అందుకే జాయింట్ యాక్షన్ కమిటీతో మాట్లాడింది. వివిధ తేదీల్లో చర్చలు జరిపారు కదా. జేఏసీతో మాట్లాడిందంటే ఉద్యోగులందరితో మాట్లాడినట్లే.’ అని స్పష్టంచేసింది. పిటిషనర్‌ను కొత్త వేతన సవరణ ఏ విధంగా ప్రభావితం చేస్తోందని ధర్మాసనం ప్రశ్నించింది. కొత్త వేతన సవరణవల్ల పిటిషనర్ జీతం తగ్గిందని, ఎలా తగ్గిందో వివరిస్తూ మెమో దాఖలు చేశానని రవితేజ తెలిపారు. జనవరిలో ఎంత వచ్చింది? ఫిబ్రవరిలో ఎంత వచ్చింది? అని ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషనర్ జీతం రూ.22,432లు పెరిగింది ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ జోక్యం చేసుకుని.. పిటిషనర్ పే స్లిప్పుతో సహా అన్ని వివరాలతో తాము ఓ మెమో దాఖలు చేశామని చెప్పారు. పిటిషనర్ బేసిక్ పే డిసెంబర్లో రూ.51,230 ఉండగా, వేతన సవరణ తరువాత జనవరిలో అది రూ.78,820కి పెరిగిందన్నారు. మొత్తంగా అతని స్థూల జీతంలో రూ.22,432 పెరుగుదల ఉందని వివరించారు. ప్రభుత్వోద్యోగుల్లో వివిధ హోదాలకు గతంలో వచ్చిన జీతం, ఇప్పుడు పొందుతున్న జీతం వివరాలను ఆయన ధర్మాసనం ముందుంచారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ.. కరువు భత్యం, ఇంటి అద్దె భత్యం, సీసీఏ ఉపసంహరించారు కదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. వేతన సవరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే అనుసరించామని ఏజీ శ్రీరామ్ చెప్పారు. గతంలో ఇచ్చిన మధ్యంతర భృతి, తాజాగా నిర్ణయించిన ఫిట్‌మెంట్‌కు మధ్య ఎంత మొత్తం తేడా ఉందో దాన్ని రికవరీ చేస్తామని ప్రభుత్వం అంటోందని, దీనిపైనే ఉద్యోగులు ప్రధానంగా ఆందోళన చెందుతున్నారని, ఈ విషయంలో తాము తగిన ఆదేశాలిస్తామని ధర్మాసనం తెలిపింది. ఉద్యోగులకు నోటీసులు ఇవ్వకుండా ఎలా రివకరీ చేస్తారని ప్రశ్నించింది. తాము హెచ్ఆర్ఏ, డీఏల జోలికి వెళ్లడంలేదని, వాటిపై ప్రస్తుతానికి విచారణ అవసరంలేదంది. ఈ వ్యవహారంలో చాలా సున్నిత అంశాలున్నాయని, వాటన్నింటిపై తరువాత లోతుగా విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. జీతం తగ్గుదల లేదు.. రికవరీ లేదు.. ఇక 2021–2022 మధ్య జీతాల్లో తగ్గుదల లేనప్పుడు ప్రభుత్వోద్యోగులు ఎందుకు ఆందోళన చెందుతున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఉద్యోగులు దురభిప్రాయంతో ఉన్నారని, అందువల్లే వారు అనవసర ఆందోళనకు గురవుతున్నారని ఏజీ చెప్పారు. 2021 డిసెంబర్లో తీసుకున్న జీతంతో పోలిస్తే ఏ ఒక్క ఉద్యోగి జీతం కూడా తగ్గడంలేదని ఆయన పునరుద్ఘాటించారు. ఏ ఒక్కరి జీతం నుంచి ఎలాంటి మొత్తం రికవరీ ఉండదన్నారు. ఈ వివరాలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీఓ–1 అమల్లో భాగంగా పిటిషనర్‌తో సహా ఏ ఉద్యోగి జీతం నుంచి ఎలాంటి మొత్తాలను రికవరీ చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేసింది. ఉద్యోగులూ.. చట్టం ఏం చెబుతుందో చూడండి.. ఈ సందర్భంగా జీతాల విషయంలో ఉద్యోగుల హక్కుల గురించి మాట్లాడటానికి ధర్మాసనం సిద్ధమైంది. ఆన్లైన్లో చాలామంది ఉద్యోగులు ఈ కేసులో ఏం జరుగుతుందో చూస్తున్నారని, వారంతా కూడా జీతాలకు సంబంధించి చట్టం ఏం చెబుతుందో చూడాలని కోరింది. ఇంతకుమించి తాము ఈ విషయంలో మాట్లాడబోమంది. ఉద్యోగుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని జీతాల రికవరీ విషయంలో తాము మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చామని, ఈ ఉత్తర్వుల తరువాత కూడా ఉద్యోగులు సమ్మెకు వెళ్తారని తాము అనుకోవడంలేదని ధర్మాసనం తెలిపింది. అనంతరం ఏజీ స్పందిస్తూ.. కేసు మొదలు కావడానికి ముందు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. అవన్నీ మనస్సులో పెట్టుకోవద్దని, తనకు ఏదీ లోపల దాచుకోవడం అలవాటులేదని, ఉన్నది ఉన్నట్లు బయటకు మాట్లాడేస్తానని సీజే జస్టిస్ మిశ్రా చెప్పారు. రిజిస్ట్రీలో ఏమేం జరుగుతున్నాయో కూడా తనకు బాగా తెలుసునన్నారు. -
కరోనా పరిస్థితుల్లో సమ్మెతో ఇబ్బంది
సాక్షి, అమరావతి: ‘ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఉద్యోగులు సమ్మెకు వెళితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో ప్రతి ఉద్యోగి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కోవిడ్ అనంతర పరిస్థితుల్లో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఆసుపత్రుల నుంచి బయటికి వచ్చే కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. కోవిడ్ ఇబ్బందుల నుంచి ఇప్పుడిప్పుడే ఊపం దుకుంటున్న వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు భంగం కలుగుతుంది. సమ్మె వల్ల రాష్ట్రం మీద తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుంది. అర్థం చేసుకోండి’ అని ఉద్యోగులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. సమీర్‌శర్మ ఉద్బోధించారు. సమస్యలు ఉంటే చర్చించి పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. ఉద్యోగ సంఘాలతో మాట్లాడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకునేందుకు ఆందోళన విరమించేలా సంఘాలను ఒప్పించాలని చెప్పారు. సోమవారం అమరావతి సచివాలయం నుండి ఆయన ఆర్థిక శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. మనమంతా ఒక కుటుంబమని ఉద్యోగులకు చెప్పారు. అందరం ప్రభుత్వంలో భాగమని, మెరుగైన సేవల ద్వారా సమాజాభివృద్ధికి కృషి చేయాల్సి ఉందని తెలిపారు. ఉద్యోగులుగా మనకు ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వంలో ప్రత్యేక యంత్రాంగం ఉందని ఉద్యోగ సంఘాలకు తెలపాలని కలెక్టర్లకు చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగుల వెంటే ఉందనే విషయాన్ని తెలియజేసి అందరూ కలిసి పని చేద్దామని చెప్పాలన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ కూడా పాల్గొన్నారు. -
జీతాలు, పెన్షన్ల చెల్లింపులో నిర్లక్ష్యంపై సర్కారు కన్నెర్ర
సాక్షి, అమరావతి: కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్లకు బిల్లులు రూపొందించి, ప్రాసెస్ చేయడం, ఆమోదించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై రాష్ట్ర ఆర్థిక శాఖ కొరఢా ఝళిపించింది. ఎన్ని సార్లు ఆదేశాలు జారీ చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీడీవోలు, ట్రెజరీ అధికారులపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లను, విభాగాధిపతులను ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ శనివారం సర్క్యులర్ మెమో జారీ చేశారు. కొత్త పే స్కేళ్ల ప్రకారం వేతనాలు, పెన్షన్లు చెల్లించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. జీతాలు పెరగలేదని ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున చేస్తున్న ప్రచారం సరికాదని నిరూపించాలని ప్రభుత్వం ఈ విషయంలో పట్టుదలతో వ్యవహరిస్తోంది. జనవరి 1న తీసుకున్న వేతనం, ఫిబ్రవరి 1న తీసుకునే వేతనంతో పోల్చి చూసుకోవడం ద్వారా ఉద్యోగులు వాస్తవాలు గ్రహిస్తారని భావిస్తోంది. అందరికీ జీతాలు పెరిగాయన్న ప్రభుత్వ వాదన నిజమేనని ఉద్యోగులు తెలుసుకోవడం ద్వారా అసంతృప్తి తగ్గుతుందని ఈ ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా ఉద్యోగ సంఘాల వెనుక ఉన్న రాజకీయ ప్రమేయం, వాళ్లను రాజకీయంగా వాడుకోవాలని చూస్తుండటం తదితర విషయాలన్నీ ఉద్యోగులు గ్రహిస్తారని.. అందుకోసమే ఎలాగైనా ఫిబ్రవరి 1న జీతాలు చెల్లించేలా చూడాలని ప్రభుత్వం తాపత్రయ పడుతోంది. రెండు నెలల మధ్య జీతంలో తేడా ఎంత ఉందో తెలుసుకోవడం ద్వారా అత్యధిక శాతం ఉద్యోగులు వాస్తవాలు గ్రహిస్తారని భావిస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం జారీ అయిన మెమోలోని వివరాలు ఇలా ఉన్నాయి. ► ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి నుంచి పెరిగిన వేతనాలను ఫిబ్రవరి 1వ తేదీన చెల్లించాలి. ► ఇందుకోసం కొత్త పీఆర్సీ ప్రకారం పే స్కేళ్లు నిర్ధారించి ప్రాసెస్ చేసి.. వేతనాలు, పెన్షన్ బిల్లులను ఆమోదించడానికి పలు సార్లు నిర్ధిష్ట టైమ్‌లైన్‌తో ఆదేశాలు జారీ చేశాం. అయినా అందుకు అనుగుణంగా విధులు నిర్వహించడంలో చాలా మంది డీడీవోలు నిర్లక్ష్యంగా వ్యవహరించి బిల్లులు రూపొందించలేదు. వేతన బిల్లులను ఎస్టీవోలు ఆమోదించ లేదు. ఇలాంటి వారందరినీ ఉపేక్షించేది లేదు. ► కోవిడ్ క్లిష్ట సమయంలో ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పూర్తి, పార్ట్ టైమ్ కంటింజెంట్ ఉద్యోగులు, రోజు వారీ వేతన కార్మికులు, హోంగార్డులు, ఆశా కార్యకర్తలు, అంగన్ వాడీ వర్కర్లు, మధ్యాహ్న భోజన సర్వీస్ ప్రొవైడర్లకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి కల్పించిన అధికారులు, ఉద్యోగులపై సీసీఏ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలి. ► శనివారం సాయంత్రం 6 గంటల వరకు వేచి చూసి, విధి నిర్వహణలో వైఫల్యం చెందిన డీడీవోలు, ట్రెజరీ అధికారులపై జిల్లా కలెక్టర్లు, విభాగాధిపతులు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి వేతనాలను ఫిబ్రవరి 1వ తేదీన చెల్లించేందుకు అవసరమైతే ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్, పే అండ్ అకౌంట్ ఆఫీసర్ ప్రతిపాదించాలి. -
ఉద్యోగ సంఘాలొస్తేనే చర్చలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పీఆర్సీపై స్పష్టంగా మాట్లాడేందుకు ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించినా వారు రాలేదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉద్యోగ సంఘాలు ఎప్పుడు వస్తే అప్పుడు పీఆర్సీపై స్పష్టత కోసం చర్చలు ఉంటాయని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా పిరిడి వద్ద తోటపల్లి పిల్ల కాలువలు, మిగులు పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కోటి ఎకరాలకు సాగు నీరివ్వాలన్న జలయజ్ఞంలో భాగంగా తోటపల్లి ప్రాజెక్టు పనులను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 85 శాతం పూర్తి చేశారని చెప్పారు. తర్వాత అంచనాలు పెంచేసి, మిగిలిన కొద్దిపాటి పనులనూ పూర్తి చేయకుండానే అంతా తామే చేశామని బుకాయించడం చంద్రబాబుకు, అతని తఫేదార్లకే చెల్లిందన్నారు. వారి పాలనా కాలమంతా ప్రచారార్భాటాలకు, ప్రతిపక్షంపై విమర్శలకే సరిపోయిందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యత తీసుకుని తోటపల్లి ప్రాజెక్టు మిగులు పనులు, పిల్ల కాలువల పనులు రెండు ప్యాకేజీల కింద చేపట్టేందుకు రూ.120 కోట్లు మంజూరు చేశారన్నారు. ఇందులో బొబ్బిలి ప్రాంతం వద్ద రూ.58.59 కోట్లతో చేపట్టే మొదటి ప్యాకేజీ పనులకు శంకుస్థాపన చేశామని చెప్పారు. రెండో ప్యాకేజీ నెల్లిమర్ల వద్ద మరో రూ.60 కోట్ల పైచిలుకు నిధులతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధి పరుగులు తోటపల్లి ప్రాజెక్టు ద్వారా 1.20 లక్షల ఎకరాలకు సాగు నీరిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి బొత్స తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తయితే విజయనగరం జిల్లాలో 4.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్ అల్లకల్లోలం చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో రెండేళ్లలో లక్షా 30 వేల కోట్ల రూపాయల మేర సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, అలజంగి జోగారావు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టరు ఎ.సూర్యకుమారి, జలవనరుల శాఖ నార్త్ కోస్ట్ సీఈ శంబంగి సుగుణాకరరావు పాల్గొన్నారు. -
సమ్మెలోకి మమ్మల్ని లాగొద్దు
సాక్షి, అమరావతి/గాంధీనగర్ (విజయవాడ): స్వార్థ రాజకీయాలకు వంతపాడబోమని, అందుకే తామెవ్వరం సమ్మెలో పాల్గొనడం లేదని ఆర్టీసీ ఉద్యోగులు స్పష్టం చేశారు. పీఆర్సీ సాధన సమితి చేస్తున్న రాజకీయాలకు ప్రజా రవాణా విభాగం (పీటీడీ) వంత పాడదని చెప్పారు. సమ్మెను ఎదుర్కొంటామని తెలిపారు. పీటీడీలో అతిపెద్ద సంఘాల్లో ఒకటైన వైఎస్సార్ ఈఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. రాష్ట్ర, జోనల్, డివిజనల్, నాన్ ఆపరేషన్ నాయకులు అధిక సంఖ్యలో సమావేశంలో పాల్గొన్నారు. సమ్మె ఆవశ్యకత, జేఏసీల తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లేది లేదని సంఘం 13 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు తేల్చి చెప్పారు. పీఆర్సీ సాధన సమితికి పలు ప్రశ్నలు సంధించారు. ఈ వివరాలను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు డీఎస్పీ రావు, ప్రధాన కార్యదర్శి ఎం.అబ్రహాం, ముఖ్య ఉపాధ్యక్షుడు జేఎం నాయుడు మీడియాకు తెలిపారు. పీటీడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎల్లవేళలా సిద్ధమని చెప్పారు. చర్చల ద్వారా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని, సమ్మెలో పాల్గొనవద్దని ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఆర్టీసీని వాడుకోవాలని జేఏసీ చూస్తోంది ‘ఆర్టీసీ రూ.6,900 కోట్ల నష్టంలో ఉంది. ప్రతి నెలా రూ.150 కోట్లు అప్పు చేస్తే కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఆర్టీసీ ఏమవుతుందో అనుకున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవదూతలా వచ్చి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశారు. ఉద్యోగులు ఎవరూ కోరలేదు. పోరాటాలు చేయలేదు. అయినా ఇచ్చిన మాట కోసం ప్రభుత్వంలో విలీనం చేసి చరిత్ర సృష్టించారు. 54 వేల మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చారు. ఆర్టీసీ నుంచి రూపాయి ఆదాయం రాకపోయినా రూ.6 వేల కోట్లు జీతభత్యాలు చెల్లించి ఉద్యోగులను ఆదుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి ఎటువంటి మెమోరాండం ఇవ్వకుండా, చర్చలు జరపకుండా కొందరు హఠాత్తుగా బస్సులు నిలిపివేస్తామనడం సరికాదు. ఆర్టీసీ బస్సులు ఆగిపోతే ఎన్జీవోల సమ్మెకు ఉపయోగం. ఆర్టీసీ ఉద్యోగులను వాడుకోవాలని జేఏసీ చూస్తోంది. మనకు సంబంధం లేని సమ్మెలోకి వెళ్లొద్దు. అడుగడుగునా సమ్మెను అడ్డుకోవాలి’ అని ఆర్టీసీ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సమావేశంలో మాట్లాడుతున్న ఆర్టీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చల్లా చంద్రయ్య పీఆర్సీ సాధన సమితికి సంధించిన ప్రశ్నలివీ ► పీఆర్సీ సాధన సమితి ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో పీటీడీ ఉద్యోగుల అంశాలు ఏమైనా ఉన్నాయా? ► మీరు పెట్టిన 75 డిమాండ్లలో పీటీడీ ఉద్యోగులకు సంబంధించినవి ఎన్ని? ఎన్నింటిపై చర్చించారు? ఎన్ని సాధించారు? ► పీటీడీ ఉద్యోగులకు వేతన స్థిరీకరణ, క్యాడర్, ఫిట్మెంట్, ఇళ్ల స్థలాలు ఏ మేరకు ఇస్తారో తెలియక ముందే మీ స్వార్థం కోసం సమ్మెకు ఉసిగొల్పడం ఎంత వరకు సమంజసం? ► ఈ ఉద్యమం నాయకుల మనుగడ కోసమా? ఉద్యోగుల మేలు కోసమా? అనేది అర్థంకాని పరిస్థితి ఉద్యోగుల్లో ఉంది. ►పీఆర్సీ సాధన సమితి స్వార్థ రాజకీయాలకు పీటీడీలోని సంఘాలు ఎందుకు వంత పాడుతున్నాయి? దీని ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకొంటున్నాయి? ఇదీ మా వినతి ‘పీటీడీ ఉద్యోగులకు క్యాడర్, వేతన స్థిరీకరణ, ఫిక్సేషన్ అమలు చేయాలి. పాత పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు, పీటీడీ ఉద్యోగుల జీత భత్యాల్లో వ్యత్యాసం ఉన్న 19 శాతం ఫిట్‌మెంట్‌ను వర్తింపజేయాలి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇవ్వాలి. బకాయిలు చెల్లించాలి. ఇహెచ్ఎస్ ద్వారా మెరుగైన వైద్య సదుపాయం అందించాలి. కారుణ్య నియామకాలు 2016 నుంచి చేపట్టాలి’ అని ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. -
ఉద్యోగ సంఘాలను ఆహ్వానించిన మంత్రుల కమిటీ
సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాల నాయకులతో సంప్రదింపులకు మంత్రుల కమిటీ ఆహ్వానించింది. రేపు(సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయం రెండో బ్లాక్‌కు రావాలంటూ ఉద్యోగ సంఘాల నాయకులకు సమాచారం ఇచ్చింది. ఉద్యోగులతో సంప్రదింపులకు, వారికి నచ్చజెప్పడానికి మంత్రులు బుగ్గన, బొత్స, పేర్నినాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్ సమీర్ శర్మలతో ఒక కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఢిల్లీ పర్యటనలో మంత్రి బుగ్గన, సీఎస్ ఉన్నందున మిగిలిన ముగ్గురూ.. ఉద్యోగులతో సంప్రదింపులకు అందుబాటులో ఉండనున్నారు. చదవండి: గ్రామ వలంటీర్లకు ప్రమాద బీమా -
సీఎంపై వ్యక్తిగత విమర్శలేంటి?
సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాలు సీఎంతో చర్చించిన తర్వాతే ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించిందని.. కానీ, ఆందోళన చేస్తున్న ఉద్యోగులు మాట్లాడుతున్న మాటలు ఏమాత్రం సరికాదని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం తెలిపారు. విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇలా అయితే రాజకీయ పక్షాలకు, ఉద్యోగ సంఘాలకు తేడా ఏముంటుందని ప్రశ్నించారు. ఒక ఛానల్లో కొందరు ఉద్యోగుల మాట్లాడిన భాష సరిగ్గాలేదన్నారు. వారిని ఉద్యోగ సంఘాల నాయకులు క్రమశిక్షణలో పెట్టాలన్నారు. ఉద్యోగులు తమ న్యాయమైన హక్కులు కోరవచ్చని.. వాటిని చర్చల ద్వారా సాధించుకోవాలి కానీ.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే ప్రభుత్వం తమది కాదని స్పష్టంచేశారు. అయినా.. ప్రభుత్వోద్యోగులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం ఏమిటి? ప్రభుత్వంపైన, సీఎంపైన వ్యక్తిగత విమర్శలేమిటని బొత్స ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాంటి వారిని నాయకులు అదుపులో పెట్టాలన్నారు. సీఎం జగన్ ఉద్యోగుల బాగుకోసం తపన పడుతున్నారని, అయితే.. ఆర్థిక పరిస్థితివల్ల ఉద్యోగులు ఆశించినంతగా చేయలేకపోతున్నారనీ, ఉద్యోగ సంఘాల నాయకులే చెప్పారని ఆయన గుర్తుచేశారు. మున్సిపల్ ఎంప్లాయీస్ క్యాలెండర్ ఆవిష్కరణ అంతకుముందు.. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రి బొత్స ఆవిష్కరించారు. రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల కార్మికులకు ఆప్కాస్ ద్వారా చెల్లింపులు జరుగుతున్నప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాలతో కొద్దిమందికి అందడంలేదని, ఆ సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. -
నిరసనలొద్దు.. వెంటనే విధుల్లో చేరండి
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ ఎలాంటి నిరసనలు చేపట్టకుండా మంగళవారం నుంచి విధులకు హాజరు కావాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. సోమవారం వెలగపూడిలోని రాష్ట్ర తాత్కాలిక సచివాలయంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై, ప్రొబేషన్ ప్రకటన తదితర సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడానికి చాలా దారులున్నాయి. మీరు ఇంకా 30 ఏళ్లు ఉద్యోగాలు చేయాలి. మొదట్లోనే ఇలా చేస్తే మీపై తప్పుడు భావనలు వెళతాయి. మీరంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి అభిప్రాయం ఉంది. కానీ, ఈ మూడు రోజుల పరిణామాలు తప్పు దారిలో వెళ్తున్నాయి. ఎలాంటి వినతులు లేకుండా విధులకు హాజరుకాకపోవడం, అధికారిక గ్రూపుల నుంచి వైదొలగడం, రోడ్లపైకి వచ్చి స్లోగన్లు వంటివి ఉద్యోగులకు కుదరదు. మీరు ఆశిస్తున్నవి కొంతవరకైనా జరగాలంటే మంచి వాతావరణం తేవాలి. పరిస్థితులు చక్కబడితేనే మీరు చెప్పిన అంశాలు సీఎం దృష్టికి తీసుకెళ్లగలను. 13 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై 2018 నుంచి చర్చలు జరుగుతున్నాయి. వాళ్లు అన్నిసార్లూ చర్చలు, వినతుల ద్వారా డిమాండ్లు ప్రభుత్వం ముందుంచారు. మీరు మంచిగా అడిగితే సీఎం ఒకటికి రెండు చేసే అవకాశం ఉంటుంది. తలకు బులెట్ పెట్టి ఇవ్వాలని కోరితే ఇచ్చేది కూడా ఇవ్వరు’ అని స్పష్టం చేశారు. అధికారులు అక్టోబరన్నా, సీఎం జూన్ కల్లా ఇవ్వాలన్నారు గతంలో ప్రొబేషన్‌పై జరిగిన సమావేశంలో 60 వేల మంది ఉద్యోగులే డిపార్టమెంట్ పరీక్షలు పాసయ్యారని అధికారులు సీఎంకు చెప్పారు. ఈ ఏడాది అక్టోబరుకల్లా అందరికీ ఒకేసారి ప్రొబేషన్ డిక్లేర్ చేద్దామని సూచించారు. కానీ, ముఖ్యమంత్రి జూన్ 30వ తేదీ ప్రొబేషన్ ప్రకటనకు చివరి తేదీ కావాలని చెప్పారు. ఉద్యోగులు మంచిగా అడిగితే ఇంకా ముందే వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరూ అడగకుండా ఒకేసారి 1.34 లక్షల మందికి ఉద్యోగాలిచ్చిన ముఖ్యమంత్రి.. మంచి విధానంలో అడిగితే మీ మాట వినే అవకాశం ఎందుకు ఉండదు? అందరికీ ఒకే రోజు సీఎం గారి చేతుల మీదుగా ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని అనుకున్నారు. అది అర్ధం చేసుకోకుండా తప్పు దారిలో వెళితే చట్ట ప్రకారం చర్యలకు అవకాశం ఉంది. ప్రభుత్వం ఆ ఉద్దేశంతో లేదు. ఆ పరిస్థితులు మీరు తెచ్చుకోకూడదు. ఎవరన్నా మీకు ప్రొబేషన్ ప్రకటించరంటే నమ్మకండి. ఈ సీఎం ఉండగా మీ ప్రొబేషన్ని ఎవరూ ఆపలేరు. కాకపోతే ఇలాంటివి చేసుకొని మీకు మీరే ప్రొబేషన్‌ను ఆపుకొనే అవకాశం ఉంటుంది’ అని చెప్పారు. ఇందుకే ప్రొబేషన్ ఐఏఎస్ అధికారిగా 30 ఏళ్ల సర్వీసులో ఏ ముఖ్యమంత్రికి నేరుగా మెసేజ్ చేయలేదని, కానీ, కొందరు సచివాలయ ఉద్యోగులు సోషల్ మీడియా ద్వారా నేరుగా మేసేజ్‌లు పంపారని జైన్ తప్పుపట్టారు. తాము ఏ సమాచారాన్నయినా సీఎంవో అధికారులు, సీఎస్ ద్వారా సీఎంకు చేరవేస్తామన్నారు. ఇలాంటి సర్వీసు రూల్స్‌పై అవగాహన కలిగించి, విధుల్లో శిక్షణ ఇవ్వడానికి ప్రొబేషన్ ఉంటుందని చెప్పారు. 77 వేల మంది విధులకు హాజరు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉదయం నిర్ణీత సమయానికే 55,515 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విధులకు హాజరయ్యారని ఆ శాఖ ప్రధాన కార్యాలయం వర్గాలు తెలిపాయి. సాయంత్రానికి మొత్తం 77,409 మంది విధుల్లో పాల్గొన్నట్టు వెల్లడించాయి. సీఎం జగన్‌పై మాకు నమ్మకం ఉంది: అంజన్‌రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పూర్తి న్యాయం చేస్తారన్న నమ్మకం ఉందని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రతి నిధి అంజన్‌రెడ్డి చెప్పారు. అజయ్‌జైన్‌తో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆందోళన వెనుక కొన్ని శక్తులు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఉద్యోగులు వాటి జోలికి పోకుండా వెంటనే విధుల్లో చేరాలని కోరారు. ఎవరికీ నష్టం జరగదు: జానీ పాషా ప్రొబేషన్ విషయంలో సచివాలయ ఉద్యోగులెవరికీ ఎలాంటి నష్టం జరగదని అజయ్‌జైన్ హామీ ఇచ్చారని ఉద్యోగుల మరో ప్రతినిధి జానీ పాషా చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులెవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అందోళనలు చేయవద్దని సూచించారు. -
క్షేత్రస్థాయి ఉద్యోగులకు బయోమెట్రిక్‌లో వెసులుబాటు
సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయి విధులకు హాజరయ్యే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విషయంలో కొంత వెసులుబాటు కల్పించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ప్రొబేషనరీ సహా ఉద్యోగుల ఇతర సమస్యలపై చర్చించేందుకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ బుధవారం పలు ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించింది. విజయవాడలోని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, డైరెక్టర్ షాన్‌మోహన్‌లతోపాటు ఆరు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. అర్హులైన సచివాలయ ఉద్యోగుల ప్రొబేషనరీ ప్రకటన ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, వీలైనంత త్వరలో పూర్తవుతుందని అజయ్‌జైన్ తెలిపారు. ప్రత్యేక సందర్భాల్లో వెసులుబాటు సచివాలయాల్లో పనిచేసే కొంతమంది ఉద్యోగులు ఉదయాన్నే క్షేత్ర స్థాయిలో విధులకు హాజరు కావాల్సి ఉంటుందని సంఘాల నేతలు ఈ సందర్భంగా ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. బయోమెట్రిక్ హాజరు వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ఏఎన్ఎంలతో పాటు ప్రత్యేకించి వ్యవసాయ అసిస్టెంట్, సర్వేయర్ తదితర క్షేత్రస్థాయి విధులలో పాల్గొనే ఉద్యోగులు సంబంధిత రోజుల్లో ఉదయమే కచ్చితంగా బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు చేయాల్సిన అవసరం లేదని, అయితే అలాంటి రోజుల్లో ఆయా ఉద్యోగులు సాయంత్రం 3–5 గంటల మధ్య తప్పనిసరిగా హాజరై వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు బయోమెట్రిక్ వేసేలా వెసులుబాటు కల్పిస్తామని అజయ్ జైన్ ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఏఎన్ఎం లాంటి ఉద్యోగులు సాయంత్రం పూట ప్రసూతి విధులకు హాజరైతే అన్‌డ్యూటీకి అనుమతిస్తామని హామీ ఇచ్చారు. గ్రేడ్–5 గ్రామ కార్యదర్శులకు పూర్తి స్థాయిలో అధికారులు కల్పించే అంశంతో పాటు ఉద్యోగుల జాబ్ చార్టు రూపొందించని సెరికల్చర్ అసిస్టెంట్ తదితరులపై శాఖాధిపతులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ప్రభుత్వ అనుమతి తీసుకొని డిజిటల్ అసిస్టెంట్ కేటగిరి ఉద్యోగుల పేరును డిజిటల్ సెక్రటరీగా మార్పు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మూడు నెలలకు భేటీ.. ప్రతి మూడు నెలలకొకసారి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించనున్నట్టు అజయ్‌జైన్ చెప్పారు. ప్రమోషన్ చానల్‌పై స్పష్టత కోరాం ఉద్యోగుల ప్రమోషన్ చానల్‌ను స్పష్టం చేయాలని సమావేశంలో కోరినట్లు గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అంజనరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొన్ని శాఖలకు ఇప్పటికీ సర్వీస్ రూల్స్ లేని విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తెచ్చామన్నారు. సెరికల్చర్, ఏఎన్ఎం, మహిళా పోలీస్ కేటగిరీ ఉద్యోగాలకు సంబంధించి సర్వీస్ రూల్స్ వెంటనే రూపొందించాలని కోరామన్నారు. కోవిడ్‌తో మృతి చెందిన వారి కుటుంబాలలో ఒకరికి ఉద్యోగ అవకాశం క ల్పించాలని కోరామన్నారు. -
ప్రభుత్వం.. మీ వెంటే: సమీర్‌శర్మ
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం విశాల దృక్పథంతో సానుకూలంగా పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల వెంటే ఉందన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం సమీర్ శర్మ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 70 అంశాలపై కార్యదర్శుల సమావేశంలో చర్చించామని, త్వరలోనే వీలైనన్ని పరిష్కరిస్తామని చెప్పారు. పీఆర్సీ, ఫిట్మెంట్, పెండింగ్ బిల్లుల చెల్లింపు అంశాలను మరోసారి పరిశీలించి మళ్లీ సంఘాలను పిలుస్తామన్నారు. ఆర్థికేతర అంశాలను పరిష్కరించాలి ఆర్థికేతర అంశాలను నిర్దిష్ట సమయంలోగా పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. కార్యదర్శుల కమిటీ నివేదికను పక్కనపెట్టి 11వ పీఆర్సీ నివేదికను అమలు చేయాలన్నారు. సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్.. ఆర్ధిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు(ఉద్యోగుల సేవలు) పి.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారుల లెక్కలు తప్పని చెప్పాం కేంద్ర ప్రభుత్వ పీఆర్సీ 14.28 శాతం అని అధికారులు వేసిన లెక్కలు తప్పని చెప్పాం. లెక్కలతో సహా తప్పుడు అంచనాలు వేశారని తెలియచేశాం. 14.29 శాతం ఫిట్మెంట్ వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. 34 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేయాలని అడిగాం. – వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు మార్చి లోపు పరిష్కరిస్తామన్నారు ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలను మార్చి లోపు పరిష్కరిస్తామన్నారు. రూ.1,600 కోట్ల ఉద్యోగుల నిధులకు సంబంధించి బెనిఫిట్స్ త్వరలో ఇస్తామని చెప్పారు. పీఆర్సీపై అన్ని సంఘాలు ఒకే మాటపై ఉన్నాయి. ఫిట్‌మెంట్‌ను ముఖ్యమంత్రి వద్దే తేల్చాలని కోరాం. – బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ చైర్మన్ పీఆర్సీ అంశానికి ముగింపు పలకాలి ఉద్యోగుల పీఆర్సీ అంశానికి వెంటనే ముగింపు పలకాలని కోరాం. పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఫిట్‌మెంట్‌పై ప్రభుత్వం క్లారిటీతోనే ఉంది. – సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సుదీర్ఘంగా చర్చించాం.. రెండు గంటల పాటు దాదాపు 70 డిమాండ్లపై చర్చించాం. రూ.వెయ్యి కోట్ల జీపీఎఫ్, రూ.300 కోట్ల ఏపీజీఎల్ఐ కొంత విడుదల చేయాలని కోరాం. మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు రూ.21 కోట్లు, నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.42 కోట్లు ఇస్తామన్నారు. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ -
ఉద్యోగుల ఆందోళన వాయిదా
సాక్షి, అమరావతి: పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీపై ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి. ప్రభుత్వం హామీ ఇచ్చినందున తమ ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు ప్రకటించాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఉద్యోగ సంఘాలతో గురువారం చర్చలు జరిపారు. రెండు జేఏసీల ప్రతినిధి బృందం, సచివాలయ ఉద్యోగుల సంఘం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధి బృందంతో వేర్వేరుగా చర్చించారు. పెండింగ్‌లో ఉన్న 71 డిమాండ్లను ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. వీటిలో చాలా డిమాండ్లు ఆర్థికేతర అంశాలే. అన్ని సమస్యలు ఒక్క రోజులో పరిష్కారం అయ్యేవి కావని, చాలా సమస్యలు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని ఉద్యోగ సంఘాలకు ఆర్థిక మంత్రి బుగ్గన వివరించారు. ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి చర్చలు జరపడం నిరంతర ప్రక్రియ అని, దాన్ని కొనసాగిస్తూ పరిష్కారానికి చర్యలు చేపడతామని ఆర్థిక మంత్రి ఇచ్చిన హామీకి ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి. డిమాండ్ల సాధనకే ఆందోళన చేపట్టామని, అవన్నీ పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పాక ఇంకా ఆందోళన చేయాల్సిన అవసరం లేదని, ఆందోళనను వాయిదా వేస్తామని, ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమిస్తామని భేటీలో ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఆర్థికేతర అంశాలపై వచ్చే బుధవారం మళ్లీ చర్చలకు పిలుస్తామని ప్రభుత్వం తెలియచేసింది. అన్ని శాఖల కార్యదర్శులు, ఉద్యోగ సంఘాల నేతలతో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంశాలపై చర్చిద్దామని, సమస్యలకు పరిష్కారం అన్వేషిద్దామని ఆర్థిక మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రభుత్వ స్పందన పట్ల ఉద్యోగ సంఘాలు సంతృప్తి వ్యకం చేశాయి. పీఆర్సీపై సోమవారానికి తేల్చాలని ఉద్యోగ సంఘాలు కోరగా తాము అదే పనిలో నిమగ్నమైనట్లు సీఎస్ తెలిపారు. సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన, ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి చర్యలు: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోంది. కోవిడ్ కారణంగా కొంత ఆలస్యమైంది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు 71 అంశాలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తాం. ఆర్థికేతర అంశాల పరిష్కారానికి సీఎస్ అన్ని విభాగాల సెక్రటరీలతో బుధవారం సమావేశం ఏర్పాటు చేస్తారు. సుహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా సత్ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వం అనే కుటుంబంలో ఉద్యోగులు కూడా భాగమే. రెండు జేఏసీల్లోని 9 సంఘాలు చేస్తున్న ఉద్యమాన్ని విరమించాలని కోరాం. అందుకు వారు అంగీకరించారు. ప్రభుత్వం, ఉద్యోగులు బాగుంటేనే ప్రజా సేవలు సక్రమంగా అందుతాయి. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరాం: వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పెండింగ్ సమస్యల పరిష్కారంపై ఆర్థిక మంత్రి, సీఎస్‌తో చర్చించాం. సచివాలయంలో పోస్టుల సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశాం. ఏపీ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి 11 అంశాలు, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్‌కు సంబంధించి 85 అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఖాళీగా ఉండే ఏఎస్‌వోలు, స్టెనోగ్రాఫర్ల పోస్టుల భర్తీతో పాటు ఆర్థిక శాఖలో ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయడం, గ్రేడ్–5 సెక్రటరీలకు జాబ్ చార్ట్ అమలు, వీఆర్ఏ నుంచి వీఆర్వోలుగా ప్రమోషన్ పొందిన వారికి డైరెక్ట్‌గా గ్రేడ్–1 వీఆర్వో ఇవ్వాలని అడిగాం. సచివాలయ ఉద్యోగులకు ఇంటి స్థలాలు, రాష్ట్ర ఉద్యోగులకు జిల్లా హెడ్ క్వార్టర్లో 50 ఎకరాలు కేటాయించాలి. మోడల్ స్కూళ్లు, గ్రంథాలయాల ఉద్యోగులకు 010 పద్దు కింద జీతాలు, మ్యూచువల్ బదిలీలకే కాకుండా జనరల్ ట్రాన్స్ఫర్లకు అవకాశం కల్పించాలని కోరాం. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది. తాత్కాలికంగా విరమిస్తున్నాం: బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ చైర్మన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇచ్చినందున ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నాం. ఉద్యోగుల ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆర్థికేతర డిమాండ్లను కార్యదర్శుల కమిటీ ద్వారా పరిష్కరిస్తామని రాతపూర్వక హామీ ఇచ్చారు. సానుకూల స్పందన: బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ ప్రభుత్వం ఆదేశించినా ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అంశాలతో పాటు 11వ పీఆర్సీ అమలుపై ప్రభుత్వంతో జరిగిన సుదీర్ఘ చర్చల్లో సానుకూలత వ్యక్తమైంది. ఇక పెండింగ్ సమస్యలు పరిష్కారమవుతాయని విశ్వసిస్తున్నాం. ప్రధాన అంశాలపై చర్చించాం: సూర్యనారాయణ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు నిబంధనలకు సంబంధించిన అంశాలు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి పరిష్కారాన్ని చూపాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ విషయంలో చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిలిచారు. మా సమస్యలను మూడు అంశాలుగా విభజించి సీఎస్‌కు వివరించాం. వాటిలో ప్రధాన అంశాలపై చర్చించారు. అన్ని డిపార్ట్మెంట్ల ప్రిన్సిపల్ సెక్రటరీలతో వచ్చే బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించి దీనిపై చర్చిస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. -
పది రోజులు ఆగలేకపోయారా?
సాక్షి, అమరావతి/అనంతపురం శ్రీకంఠం సర్కిల్/నెల్లూరు(పొగతోట): ఏపీ జేఏసీవి అవకాశవాద ఉద్యమాలని.. ఇంతకాలం ఆగినవాళ్లు పది రోజులు ఆగలేకపోయారా అని రాష్ట్ర గ్రంథాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కళ్లేపల్లి మధుసూదనరాజు మండిపడ్డారు. తమ అభిప్రాయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏపీ జేఏసీ నాయకులపై ఉద్యోగులు నమ్మకం కోల్పోయారన్నారు. సీఎం జగన్ హామీ ఇచ్చిన తర్వాత కూడా నిరసనలెందుకని ప్రశ్నించారు. బుధవారం అనంతపురంలో నిర్వహించిన జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకోబోతున్న తరుణంలో ఇది జేఏసీ విజయమని చెప్పుకోవడానికే ఇలా చేస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్ మీద నమ్మకంతో జేఏసీ ఆందోళనల్లో గ్రంథాలయ ఉద్యోగులెవరూ పాల్గొనడం లేదని తెలిపారు. సమావేశంలో నాయకులు «శివశంకరప్రసాద్, నరసింగరావు, శివారెడ్డి, కమ్మన్న తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల ముసుగులో రాజకీయం వద్దు.. ఉద్యోగ సంఘాల ముసుగులో రాజకీయాలు చేయొద్దని, ఉద్యోగుల్లో గందరగోళం సృష్టించవద్దని ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్సోర్స్డ్ సర్వీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అంజనాయక్, ఎన్ఆర్కే రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రభుత్వం ప్రతి ఉద్యోగికి న్యాయం చేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏనాడు సకాలంలో జీతాలు చెల్లించలేదని చెప్పారు. నిరసనలకు మేము దూరం.. పీఆర్సీ గురించి సీఎం జగన్ ఇచ్చిన హామీపై తమకు పూర్తిస్థాయిలో నమ్మకముందని ఏపీ రెవెన్యూ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మొలతాటి గిరీష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరసనలు తెలుపుతున్న వారికి సీఎం మాటపై గౌరవం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి సమయమివ్వకుండా అనాలోచిత ఆందోళనలేమిటని నిలదీశారు. రెండు జేఏసీల నిరసనల్లో తమ అసోసియేషన్ ఉద్యోగులెవరూ పాల్గొనరని స్పష్టం చేశారు. -
ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించాలి
సాక్షి, అమరావతి: 11వ పీఆర్సీని వారం రోజుల్లో ఇస్తామని సీఎం వైఎఎస్ జగన్ చెప్పిన నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి కోరారు. విజయవాడ ఆర్ అండ్ బీ భవనంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారిన పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. సీఎం ఇప్పటికే పీఆర్సీ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. ఉద్యోగుల పట్ల ఆయన సానుకూలంగా ఉన్నారని చెప్పారు. పీఆర్సీని చూపించి కొన్ని ఉద్యోగ సంఘాలు నిరసనలు చేపట్టాయని, వీటిపై ఆలోచించాలన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని.. ప్రభుత్వానికి, ఉద్యోగులకు వారధిగా పనిచేస్తానని చెప్పారు. బకాయి ఉన్న డీఏలో ఒక డీఏను జనవరిలో ఇచ్చేందుకు ఇప్పటికే ఉత్తర్వులిచ్చారని తెలిపారు. ఉద్యోగులు అడక్కుండానే ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని.. 15 ఏళ్లుగా ఎప్పుడు జరగని జాయింట్ స్టాఫ్‌కౌన్సిల్ సమావేశాలను నిర్వహించి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. శాఖల వారీగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారని చెప్పారు. -
'ఆ ఇద్దరు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు'
సాక్షి, ఒంగోలు: జేఏసీ పేరుతో బండి శ్రీనివాసరావు, బొప్పారాజు వెంకటేశ్వర్లు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు వినుకొండ రాజారావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి పీఆర్సీ 10 రోజుల్లో ఇస్తానని చెప్పినా వినకుండా ప్రభుత్వాన్ని కూలుస్తాము, పేలుస్తాము అంటూ మాట్లాడటంలో అంతర్యమేమిటి అని ప్రశ్నించారు. ఇలా మాట్లాడే జేఏసీ నేతల వెనుక ఎవరున్నారో చెప్పాలన్నారు. గత ప్రభుత్వంతో అంట కాగిన ఈ నేతలు, మళ్లీ అదే ప్రభుత్వం వస్తే బెర్త్‌లు కోసం పాకులాడుతున్నట్టుగా ఉందని రాజారావు ఆరోపించారు. ప్రభుత్వంలో ఉద్యోగులు భాగమన్న విషయాన్ని మర్చిపోయి పరిధిదాటి మాట్లాడుతున్నారని వినుకొండ రాజారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ('రాష్ట్రంలో కొత్త నగరం రావాలంటే అది రాయలసీమకే రావాలి') సీఎం జగన్‌పై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది విశాఖపట్నం: బొప్పరాజు, బండి శ్రీనివాస్ బ్లాక్మెయిల్ రాజకీయాలపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ మండిపడింది. 'వారివురు పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాల్లో మేము పాల్గొనం. వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. సీఎం జగన్ పీఆర్సీపై ప్రకటన చేసిన తర్వాత నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో అర్థం లేదు. సీఎంపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. సీఎం జగన్ ఉద్యోగుల సమస్యలన్నింటిని పరిష్కరిస్తారు' అని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ పేర్కొంది. చదవండి: (Polavaram Project: బయటపడుతున్న చంద్రబాబు అక్రమాలు) -
బీఎస్పీలోకి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్!?
సాక్షి, హైదరాబాద్: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బహుజన సమాజ్‌పార్టీ (బీఎస్పీ)లో చేరతారన్న చర్చ ఊపందుకుంటోంది. స్థానిక మీడియాతోపాటు జాతీయ చానళ్లలోనూ ఈ వార్త ప్రముఖంగా వినిపిస్తోంది. బీఎస్పీ జాతీయస్థాయి నేతలతో ఆయన సంప్రదింపులు జరిపారని, అందులో చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మంగళవారం పలువురు స్వేరో ప్రతినిధుల పేరిట సోషల్‌మీడియాలో సందేశాలు వైరల్‌గా మారాయి. ఆగస్టు 8న నల్లగొండ జిల్లాలోని ఎన్జీ కాలేజ్ మైదానంలో ఐదు లక్షలమందితో భారీ బహిరంగసభ ఏర్పాటుచేసి, ప్రవీణ్ బీఎస్పీలో చేరతారన్నది వీటి సారాంశం. మరోవైపు తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల వారీగా ప్రవీణ్‌కుమార్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఎస్పీలో చేరాలా? లేదా స్వతంత్ర వేదిక ఏర్పాటు చేయాలా? అనే దానిపై సమాలోచనలు సాగిస్తున్నారు. ప్రవీణ్‌కుమార్ ఏ నిర్ణయం తీసుకున్నా వెంట నిలుస్తామని స్వేరో, పలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. పీడిత వర్గాలకు ఏకవచన సంబోధనా: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అగ్రవర్ణాల నాయకులను గారు అని సంబోధించి, పీడితవర్గాల నాయకులను ఏకవచనంతో సంబోధించారంటూ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రగతిభవన్‌లో జరిగిన దళిత సాధికారికత సమావేశంలో వేదికపైకి హుజూరాబాద్ నాయకులకు స్వాగతం పలుకుతూ కౌశిక్‌రెడ్డి వ్యవహరించిన తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ మంగళవారం ట్వీట్‌చేశారు. ఇలాంటి దురహంకార భావజాలం వల్లనే జనాలు బహుజన రాజ్యం రావాలంటున్నారని పేర్కొన్నారు. దీనిపై కౌశిక్‌రెడ్డి కూడా ట్వీట్చేస్తూ.. ఎడిట్ చేసిన వీడియోను చూసి విమర్శలు చేయడం మీ స్థాయికి తగదని బదులిచ్చారు. త్వరలోనే రాజకీయ కార్యాచరణ భానుపురి(సూర్యాపేట): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో త్వరలో బహిరంగసభ నిర్వహించి భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని గురుకుల పాఠశాలల మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. మంగళవారం సూర్యాపేటలో నిర్వహించిన బహుజన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తన వద్ద డబ్బుల్లేవని, తన రాజకీయ కార్యాచరణకు ప్రతి ఒక్కరూ చందాలు వేసుకుని ముందుకు రావాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి గౌరవిస్తున్నారని, కానీ, ఎస్సీ ఉద్యోగుల ప్రమోషన్లు ఆపి అగౌరవ పర్చుతున్నారన్నారు. -
పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ ఏర్పాటు
సాక్షి, అమరావతి/బస్‌స్టేషన్ (విజయవాడ వెస్ట్): దాదాపు లక్షన్నర మంది ఉద్యోగులు పనిచేస్తున్న పంచాయతీరాజ్ శాఖలో అన్ని విభాగాల ఉద్యోగులు ఒకే సంఘంగా ఏర్పడి ‘ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్’ ఆవిర్భావానికి నాంది పలికారు. సోమవారం ఆర్టీసీ క్లాంపెక్స్‌లోని సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రావిురెడ్డి నేతృత్వంలో అసోసియేషన్‌ను ఎన్నుకున్నారు. ఎంపీడీవో అసోసియేషన్, ఈవోపీఆర్డీ ఉద్యోగుల సంఘం, ఏపీ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్, ఏపీ పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్, ఏపీ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం, ఏపీపీఆర్ ఇంజనీరింగ్ మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్, ఏపీ పీఆర్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, ఏపీ డీఎల్డీవో అసోసియేషన్లు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడుగా వెంకట్రావిురెడ్డిని, అధ్యక్షుడిగా కె. శ్రీనివాసరెడ్డిని, ప్రధాన కార్యదర్శిగా బి.శ్రీనివాస్‌ను, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా వైవీడీ ప్రసాద్‌ను, కన్వీనర్‌గా జె.సుబ్బారెడ్డిని ఎన్నుకున్నారు. అలాగే తొమ్మిది మంది సభ్యులతో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశారు. జాయింట్ కౌన్సిల్లో సభ్యత్వం దక్కేలా.. పంచాయతీరాజ్ శాఖలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉన్నప్పటికీ అందరూ ఏకతాటిపై లేకపోవడం వలన ప్రభుత్వ ఉద్యోగుల విధానపరమైన నిర్ణయాల్లో వీరి భాగస్వామ్యం లేకుండా పోయిందని అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు వెంకట్రావిురెడ్డి అన్నారు. అసోషియేషన్ ఏర్పాటుపై ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అత్యుత్తమ వేదిక అయిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో అసోసియేషన్ సభ్యత్వం పొందే దిశగా తమ కార్యాచరణ ఉంటుందని తెలిపారు. -
‘హక్కు’ కోసం.. ‘ఉక్కు’ సంకల్పం
సాక్షి, విశాఖపట్నం/ఉక్కునగరం: విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు ఉద్యమంతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయివేటు పరం కానిచ్చేది లేదంటూ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది ఎంతోమంది ప్రాణత్యాగ ఫలమని, వారి త్యాగాన్ని వృథాకానివ్వం అంటూ తెగేసి చెబుతున్నాయి. అన్ని వర్గాల మద్దతు కూడగట్టి భవిష్యత్ తరాలకు ప్లాంట్‌ను అప్పగిస్తామంటున్నాయి. ఒకప్పుడు 10%, 20% షేర్లు.. డిజిన్వెస్ట్‌మెంట్ అంటూ భయపెట్టిన కేంద్రం.. ఈసారి వ్యూహాత్మక అమ్మకం(స్ట్రాటజికల్ సేల్) పేరిట ప్లాంట్‌ను ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ఆరాటపడుతోంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయాన్ని ఉద్యోగ, కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గనుల కేటాయింపులో వివక్ష దేశంలోని ప్రయివేటు ప్లాంట్లకు గనులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేటాయించడంలోమాత్రం వివక్ష చూపుతూ వస్తోంది. ఫలితంగా ఇతర ప్లాంట్లలో టన్నుకు 40 శాతం ముడి పదార్థాలకు వ్యయమవుతుండగా, సొంత గనుల్లేని విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 65 శాతం వ్యయం అవుతోంది. దీనివల్ల కొన్నిసార్లు ఉత్పత్తి వ్యయం కంటే తక్కువకే ఉత్పత్తులను అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ కారణంగా గత నాలుగేళ్లలో మూడేళ్ల పాటు నష్టాలు చవిచూసింది. ఈ పరిస్థితుల్లో ప్లాంట్ రుణాలు రూ.20 వేల కోట్లు పైనే అయ్యాయి. అయితే స్టీల్ ప్లాంట్ గత 30 ఏళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల రూపేణా రూ.40 వేల కోట్లు చెల్లించడం గమనార్హం. సరళీకృత విధానాల పేరుతో.. ఆర్థిక సరళీకృత విధానాల పేరిట అప్పటి యూపీఏ, ఆ తర్వాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వాలు చాలా కాలంగా స్టీల్ ప్లాంట్ నుంచి 10 శాతం, 20 శాతం షేర్లు ఉపసంహరించాలని నిర్ణయించాయి. కార్మిక సంఘాలు ఆందోళన, కొన్ని సార్లు, మార్కెట్లో సరైన ధర రాకపోవడం వల్ల ఆ నిర్ణయాలు వాయిదా పడ్డాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ.. దక్షిణ కొరియాకు చెందిన ‘పోస్కో’ సంస్థకు రెడ్ కార్పెట్ పరుస్తూ స్టీల్ ప్లాంట్ భూమిలో ప్రత్యేక ప్లాంట్ ఏర్పాటుకు ఎంవోయూ చేసింది. దానిపై ఆందోళన కొనసాగుతుండగానే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (డీఐపీఏఎం) స్ట్రాటజికల్ సేల్‌ను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్లాంట్ ఆధీనంలో ఉన్న అనుబంధ సంస్థలను వ్యూహాత్మక అమ్మకంలో చేర్చాలా, ప్రత్యేకంగా ఉంచాలా అనే అంశంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రికి అప్పగించారు. దీనిపై ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రత్యేక కమిటీ వేసినట్టు స్టీల్ ప్లాంట్ వర్గాలు చెబుతున్నాయి. కమిటీ కూడా ఆమోదం తెలిపితే ఈ స్టీల్ ప్లాంట్ ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదముందని ఉద్యోగ, కార్మిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. స్టీల్‌ప్లాంట్‌లో కన్వేయర్ బెల్టుల దగ్ధం స్టీల్‌ప్లాంట్ రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (ఆర్ఎంహెచ్పీ) విభాగంలో గురువారం రెండు కన్వేయర్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన వల్ల ఉత్పత్తికి స్వల్ప అంతరాయం ఏర్పడింది. విభాగంలోని 67వ నంబర్ కన్వేయర్‌కు గురువారం ఉదయం షట్‌డౌన్ పనులు చేస్తున్నారు. పనులు చేస్తుండగా అక్కడ బెల్టుకు మంటలు అంటుకున్నాయి. మంటలు ఆ పక్కనే ఉన్న 66వ కన్వేయర్‌కు అంటుకున్నాయి. వెంటనే సీఐఎస్ఎఫ్ ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలు అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో సుమారు 150 మీటర్ల బెల్టు దగ్ధం కావడంతో పాటు చూట్ సెన్సార్లు, బెల్ట్ స్కేల్స్ కూడా కాలిపోయాయి. దీంతో 67వ నంబర్ కన్వేయర్ ద్వారా సింటర్ ప్లాంట్‌కు ముడిపదార్థాల రవాణా నిలిచిపోయింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు. రాత్రి షి‹ఫ్ట్ట్కల్లా పునరుద్ధరణ పనులవుతాయని అధికార వర్గాల సమాచారం. ఎంతటి ఆందోళనకైనా సిద్ధం స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించాలని కేంద్రం చేస్తున్న కుట్రను అడ్డుకుంటాం. ఇందుకోసం కార్మిక వర్గాన్ని సమాయత్తం చేస్తున్నాం. ఈ అంశంపై ఎంతటి ఆందోళనకైనా సిద్ధంగా ఉన్నాం. –జె.అయోధ్యరామ్, గుర్తింపు సంఘం అధ్యక్షుడు త్యాగాలను వృథా కానివ్వం.. ఎంతో మంది ప్రాణత్యాగంతో స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. వారి త్యాగాలను వృథా కానివ్వం. అన్ని వర్గాల మద్దతు కూడగట్టి విశాఖ ఉక్కును కాపాడుకుంటాం. – డి.ఆదినారాయణ, స్టీల్ ప్లాంట్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ప్రజాప్రతినిధుల ద్వారా ఒత్తిడి తెస్తాం స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకునేందుకు ప్రజాప్రతినిధులను కలిసి, వారి మద్దతుతో కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం. దివంగత సీఎం వైఎస్సార్ వల్లే ప్లాంట్ నిలిచింది. – వై.మస్తానప్ప, స్టీల్ ప్లాంట్ వైఎస్సార్ టీయూసీ ప్రధాన కార్యదర్శి -
సీఎస్ ఆదిత్యనాథ్‌ను కలిసిన ఉద్యోగ సంఘాలు
సాక్షి, విజయవాడ: సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌ను ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు కలిశారు. ఎన్నికల నిర్వహణ విషయంలో ఉద్యోగ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఉద్యోగ సంఘాలతో సీఎస్ చర్చించారు. అనంతరం ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల విధులకు సహకరించాలని సీఎస్ కోరారని తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కరోనా వ్యాప్తి ఎక్కువవుతుందని.. ఎస్ఈసీ ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపుతోందని చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. త్వరలో వ్యాక్సిన్ ఇస్తామని సీఎస్ హామీ ఇచ్చారన్నారు. ఎన్నికల విధుల్లో కరోనాతో చనిపోతే రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని కోరామని తెలిపారు. సీఎస్ హామీ మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొంటామని చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. చదవండి: ‘ఎస్ఈసీ అలా ఎందుకు చెప్పలేదు..? సీఎస్ సానుకూలంగా స్పందించారు.. ఉద్యోగుల సమస్యల పట్ల సీఎస్ సానుకూలంగా స్పందించారని ఏపీ ఎన్జీవో సెక్రటరీ బండి శ్రీనివాస్ తెలిపారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా ఎన్నికల్లో పాల్గొంటామని చెప్పారు. ఉద్యోగులకు ఏమీ జరిగినా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌దే బాధ్యత అని తెలిపారు. చదవండి: ‘అప్పుడు బీజేపీని ఓడించాలని టీడీపీ చెప్పలేదా?’ పీపీఈ కిట్లు ఇవ్వాలి.. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇచ్చే విధంగా ఎన్నికలను రీ షెడ్యూల్ చేయాలని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు కోరారు. రేపటి భేటీలో ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లాలని సీఎస్‌ను కోరామని చెప్పారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పీపీఈ కిట్లు ఇవ్వాలని ఆయన కోరారు. -
రేపు తేలనున్న తెలంగాణ పీఆర్సీ అంశం
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ), పదవీ విరమణ వయసు పెంపు, ఇతర సమస్యలపై ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ.. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపే అవకాశముంది. తక్షణమే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం సీఎస్‌కు ఆదేశించిన విషయం తెలిసిందే. సోమేశ్‌కుమార్ సోమవారం టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ను బీఆర్కేఆర్ భవన్‌కు పిలిపించి చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఉద్యోగ సంఘాలు చర్చలకు ఎప్పుడు వస్తాయో తేదీ నిర్ణయించుకుని చెప్పాలని కోరారు. అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించి తేదీ తెలుపుతామని ఆయన సీఎస్‌కు చెప్పారు. వేతన సవరణ, పదవీ విరమణ వయసు పెంపు తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. ఈ నెల 27న త్రిసభ్య కమిటీతో సమావేశమై చర్చలు జరపాలని ఉద్యోగ సంఘాల భావిస్తున్నాయి. అదే రోజు సీఎస్ సోమేశ్‌కుమార్ ఉద్యోగ సంఘాల చేతికి పీఆర్సీ నివేదికను అందజేసే అవకాశాలున్నాయి. 27న చర్చలు విజయవంతంగా ముగిస్తే, సీఎస్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ వెంటనే సీఎం కేసీఆర్‌కు చర్చల సారంపై నివేదిక సమర్పించనుంది. ఈ నెలాఖరులోగా సీఎం కేసీఆర్ ఉద్యోగులకు పీఆర్సీ, పదవీ విరమణ వయసు పెంపుపై కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. పీఆర్సీపై త్రిసభ్య కమిటీ భేటీ పీఆర్సీపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సోమవారం బీఆర్కేఆర్ భవన్లో సమావేశమైంది. వేతన సవరణ నివేదికతో పాటు ఉద్యోగులకు నిర్ధిష్ట కాల వ్యవధిలో పదోన్నతులు, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పొడిగింపు, సర్వీసు నిబంధనల సరళీకరణ తదితర అంశాలపై చర్చించింది. త్వరలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని నిర్ణయించింది. ఉద్యోగ సంఘాలతో సమావేశాల షెడ్యూల్‌ను సైతం రూపొందించినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. సమావేశంలో త్రిసభ్య కమిటీ సభ్యులు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ పాల్గొన్నారు. -
‘కరోనాకు బలి చేయవద్దని కోరుతున్నాం’
సాక్షి, అమరావతి: ఎన్నికలు వద్దని తాము ఎప్పుడూ చెప్పలేదని, తమకు వ్యాక్సిన్ ఇచ్చాక జరపాలని కోరామని ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులను ఇబ్బంది పెట్టవద్దని, కరోనాకు బలి చేయవద్దని మొదటి నుంచి కోరుతున్నామన్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుపుతున్నప్పుడు ఇక్కడ ఇబ్బంది ఏమిటని ఎస్ఈసీ ప్రశ్నించారని, ఆ రాష్ట్రాల్లో వ్యాక్సిన్ రాకముందు ఎన్నికలు జరిపారని, ఇక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎన్నికలు పెడుతున్నారని తెలిపారు. ఎన్నికలకు ఎలాంటి ఏర్పాట్లు లేకుండా నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు. ఎన్నికల విధులు వద్దన్న ఉద్యోగుల్ని వదిలేసి, చేస్తామని ముందుకొచ్చిన వారితో ఎన్నికలు నిర్వహించాలన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. మంగళవారం తమ సంఘం అత్యవసర సమావేశం నిర్వహిస్తామని, అందులో ఎలా ముందుకెళ్లాలో నిర్ణయిస్తామన్నారు. మాకు రక్షణ ఎవరు కల్పిస్తారు: బొప్పరాజు ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇచ్చి, పీపీఈ కిట్లు ఇచ్చి ఎన్నికల్లో పనిచేయిస్తామని ఎస్ఈసీ చెప్పారని, అవి ఏమయ్యాయని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, అమరావతి ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియ నెల రోజులు ఉంటుందని, ఇప్పటివరకూ పోలింగ్ కేంద్రాలను పరిశీలించలేదని, కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాల్లో మరమ్మతులు జరుగుతున్నాయని, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయలేదని, బ్యాలెట్ పేపర్ల ముద్రణ వంటి అంశాలు చాలా ఉన్నాయని ఇవేమీ పట్టించుకోకుండా ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇచ్చారని తెలిపారు. ఉద్యోగుల భద్రత గురించి మాట్లాడేందుకు ఎన్నికల కమిషనర్‌ను అపాయింట్మెంట్ అడిగినా మూడురోజులుగా ఇవ్వలేదన్నారు. మా ప్రాణాలకు బాధ్యత వహిస్తారా..?: చంద్రశేఖర్‌రెడ్డి పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తామని, అదే సమయంలో ఎన్నికల విధుల్లో కరోనా వల్ల తమకు ప్రాణహాని జరిగితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ బాధ్యత వహిస్తుందా అని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. తమ ప్రాణాలు పణంగా పెట్టి ఎన్నికల్లో పనిచేయమంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సంఘం జిల్లాలు, మండలాల యూనిట్ల నుంచి ఎన్నికలు బహిష్కరించాలని తీవ్ర ఒత్తిడి వస్తోందని చెప్పారు. ఉద్యోగులు ఎవరూ తమ ప్రాణాలు పోగొట్టుకునేలా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు సిద్ధంగా లేరని, అవసరమైతే సమ్మెకు వెళ్లాలని కిందిస్థాయి నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోందన్నారు. ఈ అంశంపై చర్చించేందుకు మంగళవారం సమావేశమవుతున్నామని తెలిపారు. -
సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌తో ఉద్యోగ సంఘాల భేటీ
సాక్షి, విజయవాడ: సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్‌తో ఉద్యోగ సంఘాలు శుక్రవారం భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా సీఎస్‌కు ఉద్యోగ సంఘాల జేఏసీ వినతిపత్రం ఇచ్చారు. ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసేంత వరకు ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని సీఎస్‌కు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. చదవండి: గ్రామాల్లో అన్ లిమిటెడ్ ఇంటర్నెట్: సీఎం జగన్ ‘‘గత 10 నెలలుగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. కరోనా విపత్కర పరిస్థితుల్లో మేం ముందు వరుసలో ఉండి పనిచేశాం. వ్యాక్సినేషన్ ఇస్తున్న సమయంలో ఎన్నికలకు ఎస్ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. ఉద్యోగుల పట్ల ఎస్ఈసీ నిమ్మగడ్డ కఠినంగా వ్యవహరిస్తున్నారు. వ్యాక్సినేషన్ పొందే సమయంలో ఎన్నికలు పెట్టడం సరికాదు. వ్యాక్సినేషన్, ఎన్నికలు రెండూ ఒకే సమయంలో ఎలా సాధ్యం. మేం వ్యాక్సినేషన్ తీసుకుని ఎన్నికల విధుల్లో పాల్గొనడం సాధ్యం కాదు. మాకు వ్యాక్సిన్ రెండు డోస్‌లు ఇచ్చాక.. ఎన్నికల విధుల్లో పాల్గొంటామని’’ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి.చదవండి: విశాఖ భూ కుంభకోణం: సిట్ గడువు పొడిగింపు -
ఉద్యోగుల అంతర్గత చర్చలతో మాకేం సంబంధం లేదు
సాక్షి, అమరావతి: రాజధానిని విశాఖపట్నానికి తరలించే విషయంలో ఉద్యోగ సంఘాల అంతర్గత చర్చలతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఉద్యోగ సంఘాల చర్చల ఆధారంగా న్యాయస్థానాలు ఓ నిర్ణయానికి రావడానికి వీల్లేదని పేర్కొంది. దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. రాజధాని తరలింపు విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిని విశాఖపట్నానికి తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, ఇందులో జోక్యం చేసుకోవాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు దాఖలు చేసిన వ్యాజ్యంపై శుక్రవారం త్రిసభ్య ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. -
సీఎం సహాయ నిధికి ఉద్యోగ సంఘాల విరాళం
సాక్షి నెట్వర్క్: కోవిడ్19 నియంత్రణకు ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక రోజు జీతం విరాళంగా ప్రకటించాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం క్యాంపు కార్యాలయంలో కలిసి ఉద్యోగ సంఘాల నేతలు లేఖలు సమర్పించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి, అదనపు కార్యదర్శి కత్తి రమేష్, ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు వై.వి.రావు, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమేశ్వర్రావు తదితరులు ఉన్నారు. ఒకరోజు జీతం విరాళం ద్వారా దాదాపు రూ.100 కోట్లు సమకూరుతాయని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి అన్నారు. కోవిడ్ –19 నివారణ కోసం సీఎం తీసుకుంటున్న చర్యలు పటిష్టంగా ఉన్నాయని ప్రశంసించారు. గ్రంథాలయ సంస్థల ఉద్యోగులు విరాళం ముఖ్యమంత్రి సహాయనిధికి రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా అందజేయనున్నట్లు ప్రకటించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి విరాళాన్ని అందిస్తా మని ఆ సంఘం రాష్ట్ర నాయకులు కోన దేవదాసు, కళ్లేపల్లి మధుసూదనరాజు ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ ఉద్యోగుల వితరణ కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ విద్యుత్ ఉద్యోగులు బాసటగా నిలిచారు. మార్చి నెలలో ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర బాబు ఈ విషయాన్ని గురువారం మీడియాకు వెల్లడించారు. విరాళంగా పోగయ్యే మొత్తం రూ. 20 కోట్ల వరకూ ఉంటుందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి సీఎం సహాయనిధికి విరాళాల లేఖలను అందజేస్తున్న సచివాలయ ఉద్యోగుల సంఘం, ఏపీ జేఏసీ, రిటైర్డ్ ఉద్యోగుల సంఘాల నేతలు -
రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు మీడియా ముందుకు రానున్నారు. కాగా కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తెచ్చేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ బుధవారం అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలపై తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.(కరోనా అలర్ట్ : ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి) సీఎం సహాయ నిధికి ఉద్యోగ సంఘాల విరాళం కోవిడ్-19 సహాయక చర్యలకై ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక రోజు జీతం విరాళం ప్రకటించాయి. ఈ మేరకు సీఎం జగన్‌ను కలిసి ఉద్యోగ సంఘాల నేతలు లేఖలు సమర్పించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, కార్యదర్శి రమేష్, ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ వై.వి.రావు, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సోమేశ్వర్రావు తదితరులు ఉన్నారు. ఉద్యోగ సంఘాల ద్వారా ఒకరోజు జీతం విరాళంగా ప్రకటించడం ద్వారా దాదాపు రూ. 100 కోట్లు సమకూరుతాయని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. కోవిడ్ –19 నివారణ కోసం సీఎం తీసుకుంటున్న చర్యలు పటిష్టంగా ఉన్నాయని ప్రశంసించారు. ముందు చూపుతో సీఎం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు కరోనా విపత్తును ఎదుర్కోవడంలో ముందుంటున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో చేపడుతున్న చర్యలు బాగున్నాయని.. ఈ పరిస్థితుల్లో అండగా ఉండేందుకు ఒకరోజు జీతాన్ని విరాళంగా ఇచ్చామని పేర్కొన్నారు. -
పర్మినెంట్ అన్నారు.. మోసం చేశారు..
సాక్షి, విజయవాడ: కాంట్రాక్ట్ ఉద్యోగులను మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పర్మినెంట్ చేస్తామన్న మాయమాటలతో ఐదేళ్లు కాలయాపన చేశారని ధ్వజమెత్తారు. మాట ఇస్తే మడమ తిప్పని క్రెడిబిలీటీ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని అన్నారు. కాంట్రాక్ట్ వర్కర్లను పర్మినెంట్ చేస్తానని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారన్నారు. సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. కొత్తగా మహిళా, రిటైర్డ్ ఉద్యోగుల విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ‘దిశ చట్టం’తో మహిళలకు సీఎం జగన్ అండగా నిలిచారని సూర్యనారాయణ తెలిపారు. -
తమది ఉద్యోగుల ప్రభుత్వం: మలాది విష్ణు
-
‘ఎస్మా చట్టాలు సమ్మెను ఆపలేవు’
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు ఆటంకం కలిగించే విధంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల సమస్యలపై, సంస్థ పరిరక్షణ కోసం సమ్మె నోటీసులు ఇచ్చిన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం ఎస్మా చట్టాలను బయటకు తెచ్చి ఆరునెలలు సమ్మె నిషేధమంటారని విమర్శించారు. ఈ మేరకు ఎపీఎస్ ఆర్టీసీ కార్మిల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు లేఖను విడుదల చేశారు. ఎస్మా చట్టాలు సమ్మెను ఆపలేవని, ఈనెల 20 తర్వాత ఎప్పుడైనా సమ్మె ఉండొచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వం కార్మికులను భయపెట్టే ప్రయత్నం చేస్తోందని, ప్రభుత్వం బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదనన్నారు. ఆర్టీసీ యాజమాన్య సిబ్బంది కుదింపుపై తీసుకున్న చర్యలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. కాగా ఏపీఎస్ఆర్టీసీలో కార్మిక సంఘాలు సమ్మెకు సన్నద్ధమైన విషయం తెలిసిందే. మొత్తం 19 డిమాండ్లతో కూడిన పత్రాన్ని ఇటీవల ఆర్టీసీ ఎండీకి అందించారు. ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు ప్రభుత్వంలో విలీనం చేయాలని, సిబ్బంది కుదింపు చర్యలు ఆపేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
సమ్మెకు రెడీ..!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)లో కార్మిక సంఘాలు సమ్మెకు సన్నద్ధమయ్యాయి. కార్మికసంఘాలు పోటాపోటీగా ఆర్టీసీ ఎండీ ఎన్వీ సురేంద్రబాబుకు సమ్మె నోటీసులు అందించనున్నాయి. బుధవారం నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) నాయకులు ఆర్టీసీ ఎండీని కలిసి సమ్మె నోటీసు అందించారు. ఎన్ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి నేతృత్వంలో ఆ యూనియన్ నాయకులు సమ్మెకు సిద్ధమని ప్రకటించారు. మొత్తం 19 డిమాండ్లతో కూడిన పత్రాన్ని ఎండీకి అందించారు. ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు ప్రభుత్వంలో విలీనం చేయాలని, సిబ్బంది కుదింపు చర్యలు ఆపేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీకి ఉన్న అప్పులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈక్విటీ కింద మార్పు చేయాలని, ఎంవీ ట్యాక్స్‌ను పదేళ్ల పాటు హాలిడే ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్టీసీలో గుర్తింపు సంఘంగా ఉన్న ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) గురువారం ఎండీకి మరోసారి సమ్మె నోటీసు ఇవ్వనుంది. గతంలో ఈయూ సమ్మె నోటీసిచ్చిన సందర్భంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో చర్చలు జరిపి సమ్మె నోటీసును ఉపసంహరించుకున్నారు. ఆర్టీసీ సమ్మెకు ఏఐటీయూసీ మద్దతు ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన నిరవధిక సమ్మెకు ఏఐటీయూసీ పూర్తి మద్దతు ప్రకటించింది. గత నవంబర్‌లో ఎంప్లాయీస్ యూనియన్‌తో ఆర్టీసీ యాజమాన్యం చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయడంలో విఫలమైందని పేర్కొంది. ఈయూ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం జరిగిన యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ.. సమ్మెకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అన్ని యూనియన్లు కలిసి సమ్మె నోటీసు ఇవ్వనున్నాయని, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఏప్రిల్ 5వ తేదీలోపు ఇవ్వాల్సిన బకాయిలను, క్రెడిట్ సొసైటీకి చెల్లించాల్సిన రూ. 250 కోట్లు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒప్పందాన్ని అమలు చేయడానికి ఎన్నికల నిబంధనావళి అడ్డంగా ఉందని ఆర్టీసీ ఎండీ చెప్పడం సరికాదన్నారు. కార్మికులు సమ్మెకు దిగితే అందుకు ఆర్టీసీ యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్, ఈయూ అధ్యక్షుడు వైవీ రావు, కార్యదర్శి పి.దామోదరరావు తదితరులు ప్రసంగించారు. -
ఆ రెండు సంఘాలు ప్రభుత్వానికి అమ్ముడుపోయాయి
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఎన్నో కష్టాలు పడుతున్నా ఉద్యోగ సంఘ నాయకులు మాత్రం సన్మానాలు, సంబరాలు చేసి సమస్యలన్నీ తీరినట్టు వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ సంఘాల సమాఖ్య కన్వీనర్ వెంకటరామిరెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటానికే కొత్తగా ఉద్యోగ సంఘాన్ని ఏర్పాటు చేశామని విజయవాడ ఏలూరు రోడ్డులోని ఐఎమ్ఏ హాల్లో గురువారం ఉద్యోగ సంఘ ఆవిర్భావ సమావేశంలో పేర్కొన్నారు. ఇప్పుడున్న రెండు సంఘాలు ప్రభుత్వానికి అమ్ముడుపోయాయని, వాటికి ప్రత్యామ్నాయంగా ఉద్యోగుల శ్రేయస్సే ప్రధాన అజెండాగా రాష్ట్రంలోని అన్ని సంఘాలను కలుపుకొని ఉమ్మడి పోరాటాలకు సిద్ధమయ్యామన్నారు. ఆ రెండు సంఘాలు ఎప్పుడూ ఉద్యోగుల సమస్యలపై స్పందించలేదని, రాజకీయ నాయకులకు అనుకూలంగా వ్యవహరించాయన్నారు. ఉద్యోగులకు 20 శాతం ఐఆర్, ఇళ్ల స్థలాలకు చెందిన రెండు జీఓలను గొప్పగా చూపే ప్రయత్నం చేస్తూ సీఎంకు సన్మానాలు చేయటం ఆక్షేపనీయమన్నారు. ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబు ఎమ్మెల్సీ పదవికోసం ఉద్యోగుల భవిష్యత్తును తాకట్టుపెట్టారని సంఘ కో– కన్వీనర్ అరవపాల్ ఆరోపించారు. ఇప్పుడు ఉద్యోగ సంఘమనే ముసుగు తీసి తను పనిచేసిన పార్టీ కండువా కప్పుకున్నాడన్నారు. మరో సంఘ నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కూడా అదే తోవలో పయనిస్తున్నారన్నారు. 54 సంఘాల మద్దతు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ సంఘాల సమాఖ్యకు 54 ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయని కన్వీనర్ వెంకటరామిరెడ్డి తెలిపారు. సీపీఎస్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయయాదవ్, వీఆర్ఓ సంఘం అధ్యక్షుడు ప్రసన్న కుమార్, పంచాయతీరాజ్ సంఘం వెంకటస్వామి, మున్సిపల్ ఉపాధ్యాయుల సంఘం రామకృష్ణ, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ అసోసియేషన్, వ్యవసాయాధికారుల సంఘం, పీఎస్టీయూ, గెజిటెడ్ ఫోరం ఉద్యోగుల సంఘం, మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్, ఆల్ యూనివర్శిటీస్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఫారెస్ట్ రేంజ్ అధికారుల సంఘం, మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం, వాణిజ్య పన్నుల గెజిటెడ్ అధికారుల సంఘం, వ్యవసాయ విస్తరణాధికారుల సంఘం, ఏపీ టీచర్స్ గిల్డ్, డివిజన్ అకౌంట్స్ అధికారుల సంఘం, పీఆర్ సైట్ ఇంజనీర్ సంఘం, నాగార్జున యూనివర్సిటీ ఎంప్లాయిస్ యూనియన్, హిందీ ఉపాధ్యాయుల సంఘం, పారా మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం, సహకార శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం, ఫ్యాక్టరీల ఉద్యోగుల సంఘంతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తాత్కాలిక కార్యవర్గం ఎన్నిక.. కాగా, తక్షణ కార్యకలాపాల నిమిత్తం తాత్కాలికంగా ఒక కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘ కన్వీనర్‌గా వెంకటరామిరెడ్డి, కో–కన్వీనర్ అరవపాల్, సభ్యులుగా కమలాకర్‌శర్మ, జమాల్‌రెడ్డి, ఏవీ పటేల్, ఎం రమేష్‌కుమార్, ఖాదర్‌బాబాను ఎన్నుకున్నారు. ఉద్యోగులను మోసం చేస్తున్న నాయకుల గురించి అప్రమత్తం చేసేందుకు మార్చి 3వ వారంలో ఉద్యోగ చైతన్య యాత్ర చేపట్టాలని తీర్మానించారు. సీపీఎస్ రద్దు చేయాలని, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని.. జనవరి నుంచి 27 శాతం ఐఆర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
ఎన్ని పోరాటాలు చేసినా సీఎం తమను పట్టించుకోలేదు
-
విజయవాడ: ‘ఛలో అసెంబ్లీ’ ఉద్రిక్తం
-
మహిళా ఉద్యోగుల్ని ఈడ్చి పడేశారు
సాక్షి, విజయవాడ: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గురువారం చేపట్టిన ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కార్యక్రమంలో భాగంగా బీసెంట్ రోడ్డులో ధర్నా చేస్తున్న ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. మహిళా ఉద్యోగుల్ని ఈడ్చి పడేశారు. 13 జిల్లాల నుంచి అమరావతి తరలి వస్తున్న ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. విజయవాడలోని యూటిఎఫ్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. యూటీఎఫ్ కార్యాలయం వద్ద ప్యాప్టో చైర్మన్ సహా పలువురు ఉపాధ్యాయ, ఉద్యోగులను అరెస్టు చేసి బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని ఉద్యోగులు మండిపడ్డారు. గత మూడు సంవత్సరాలనుండి లక్షా ఎనభైవేల మంది రోడ్లపైకొచ్చి ఉద్యమాలు చేస్తున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనలకు పిలుపునిచ్చిన ఉద్యోగులను దొంగలు, దోపిడీ దారుల మాదిరిగా ఇళ్లకు, స్కూళ్లకు వెళ్లి బైండోవర్ చేయడం దారుణమన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయకపోతే టీడీపీకి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. -
నినాదాలతో హోరెత్తిన పోలీస్‌స్టేషన్
-
సీపీఎస్ విధానంపై ‘ఛలో అసెంబ్లీ’ ఉద్రిక్తం
సాక్షి, విజయవాడ: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గురువారం ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొనేందుకు 13 జిల్లాల నుంచి అమరావతి తరలి వస్తున్న ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. విజయవాడలోని యూటిఎఫ్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఉపాధ్యాయ, ఉద్యోగులు ఛలో అసెంబ్లీకి వెళ్లేందుకు బయటకు వస్తే అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు హెచ్చరికలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ఛలో అసెంబ్లీకి అనుమతి లేదంటూ... విజయవాడ రైల్వే స్టేషన్, బస్టాండ్లలో పలువురిని అరెస్ట్ చేశారు. అలాగే ఉద్యోగుల ‘ఛలో అసెంబ్లీ’ పిలుపు నేపథ్యంలో గుంటూరు, విజయవాడ, మంగళగిరి నుంచి అసెంబ్లీకి వచ్చే ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అసెంబ్లీ, సచివాలయం వద్ద మూడెంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఐడీ కార్డు ఉంటేనే వాహనాలను అటువైపు అనుమతిస్తున్నారు. అలాగే ప్యాఫ్టో యూనియన్ నాయకులను, ఉపాధ్యాయులను అనంతపురం జిల్లా పామిడి పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 25 మందిని ఆరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌లో నిర్భందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, ప్యాఫ్టో నేతల నినాదాలతో పోలీస్‌స్టేషన్ హోరెత్తింది. (సీపీఎస్ రద్దు కోరుతూ... కదం తొక్కిన ఉద్యోగులు) సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని మూకుమ్మడిగా నినదించారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. హక్కుల కోసం పోరాడుతుంటే అరెస్టులు చేయడం దారుణమన్నారు. ఇదిలాఉండగా.. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో సీపీఎస్ రద్దు తీర్మానం చేయాలని, ఎన్ఎస్డీఎల్ రికవరీలను ఆపాలని, 653, 654, 655 జీవోలను రద్దు చేయాలన్న డిమాండ్లతో ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఫిబ్రవరి నెలాఖరులో పీఆర్సీ నివేదిక!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదురుచూస్తున్న పీఆర్సీ నివేదికను ఫిబ్రవరి నెలాఖరులో ఇచ్చేందుకు కమిషన్ కసరత్తు చేస్తోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇప్పటికే వివిధ ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన కమిషన్ గత నెల రోజులుగా పలు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం ఆ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇందులో భాగంగా ప్రధాన సంఘాలైన టీఎన్జీవో, టీజీవో తదితర ఉద్యోగ సంఘాలతో గురువారం పీఆర్సీ చైర్మన్ సీఆర్ బీస్వాల్, సభ్యులు మహ్మద్ రఫత్‌అలీ, ఉమా మహేశ్వర్‌రావు సమావేశమై చర్చించారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన ఫిట్మెంట్, కనీస మూల వేతనం, ఇంటి అద్దె అలవెన్సులపై చర్చించారు. ఉద్యోగ సంఘాలు భారీ మొత్తంలో ఫిట్మెంట్ డిమాండ్ చేస్తున్నా దానికి సంబంధించిన ప్రతిపాదన పీఆర్సీ నివేదికలో ఉండే అవకాశం కన్పించట్లేదు. సాధారణంగా వేతన స్కేళ్లు, విభాగాల వారీగా ఉద్యోగులు, వారి వేతనాలు, వారు చేస్తున్న పని, వారికి ఇవ్వాల్సిన విభాగాల వారీ వేతనాలే పీఆర్సీ నివేదికలో పొందుపరుస్తారు. ముఖ్యమంత్రి ఆమోదం తర్వాతే ఫిట్మెంట్ నిర్ణయించి దానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేస్తారు. ప్రస్తుత కమిషన్ కూడా అదే బాటలో కసరత్తు చేస్తోంది. శాఖల వారీగా, కేడర్ వారీగా కనీస మూల వేతనం, గరిష్ట వేతనాలను, అలవెన్సులను పొందుపరిచేందుకు చర్యలు చేపడుతోంది. ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన వినతులన్నింటినీ క్రోఢీకరించి, నివేదిక సిద్ధం చేసి ఫిబ్రవరి నెలాఖరులో ప్రభుత్వానికి అందజేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం 43 శాతం మధ్యంతర భృతి (ఐఆర్), 63 శాతం ఫిట్మెంట్, రూ.24 వేల కనీస మూల వేతనాన్ని సిఫారసు చేయాలని కోరుతున్నాయి. తెలంగాణ మొదటి పీఆర్సీలో ఉద్యోగులకు ఫిట్మెంట్ 63 శాతం ఇవ్వాలని పీఆర్సీకి టీఎన్జీవో, టీజీవోలు విజ్ఞప్తి చేశాయి. సమావేశంలో టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కారెం రవీందర్‌రెడ్డి, మామిళ్ల రాజేందర్, టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.మమత, సత్యనారాయణ, ఎ.జగన్మోహన్రావు పాల్గొన్నారు. ఇవీ ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు.. ఉద్యోగుల కనీస మూల వేతనాన్ని రూ.24 వేలుగా, గరిష్ట మూల వేతనం రూ. 2.19 లక్షలుగా నిర్ణయించాలి. మొదటి పీఆర్సీలో 43 శాతం ఐఆర్ మంజూరు చేసి, 63 శాతం ఫిట్మెంట్ ఇచ్చేలా సిఫారసు చేయాలి. పీఆర్సీని 2018 జూలై 1 నుంచి అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలి. ఇంటి అద్దె అలవెన్సులు హైదరాబాద్‌లో 30 శాతం, జిల్లా కేంద్రంలో 25 శాతం, మండల/మున్సిపల్ కేంద్రాల్లో 20 శాతం, గ్రామాల్లో 15 శాతం సిఫారసు చేయాలి. రవాణా అలవెన్సులు, ఉచిత బస్‌పాస్ సదుపాయం కల్పించాలి. ఆటోమెటిక్ అడ్వాన్స్మెంట్ స్కీంలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి స్పెషల్ గ్రేడ్ మంజూరు చేయాలి. వార్షిక ఇంక్రిమెంట్ మూల వేతనంపై 3 శాతం చెల్లించాలి. పెన్షనర్లకు కనీస పెన్షన్ నెలకు రూ.12 వేలు ఉండాలి. గ్రాట్యుటీ రూ.12 లక్షలు చేయాలి. కమ్యుటేషన్ పీరియడ్‌ను 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించాలి. కమ్యుటేషన్ శాతాన్ని 40 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి. కుటుంబ పెన్షన్‌ను 30 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి. 20 ఏళ్ల సర్వీసు పూర్తయిన వారికి చివరగా పొందిన వేతనంలో 50 శాతాన్ని పెన్షన్‌గా ఇవ్వాలి. అడ్వాన్స్‌లు రెట్టింపు చేయాలి. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆ కేడర్‌లో ఉద్యోగులతో సమానంగా వేతనం, అలవెన్సులు చెల్లించాలి. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లకు పెంచాలి. -
జననేతకు నీరాజనం పలికిన లక్కవరపుకోట
సాక్షి, ఎస్.కోట(విజయనగరం): ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 271వ రోజు పాదయాత్రను బుధవారం ఉదయం ఎస్.కోట నియోజకవర్గంలోని లక్కవరపు కోట మండలం రంగరాయపురం నుంచి ప్రారంభించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఎస్. కోట అధికార పార్టీ ఎమ్మెల్యే లలిత కుమారి సొంత ఊరు లక్కవరపుకోటలో జననేతకు జననీరాజనం పలికారు. అడుగడుగున్న హారతులతో స్వాగతం మహిళలు స్వాగతం పలికారు. అభిమాన నాయకున్ని కలవటానికి, సమస్యలు విన్నవించుకోవటానికి జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా మహిళలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్‌ను ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు కలిశారు. సీపీఎస్ విధానం రద్దు చేయాలని జననేతకు వినతిపత్రం సమర్పించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేస్తానని హామీ ఇవ్వడంతో.. ఉద్యోగులు జననేతకు కృతజ్ఞతలు తెలపారు. అంతేకాకుండా ఉద్యోగులు తమ కుటుంబాలతో కలిసి ఐదు లక్షల మంది రాజన్నబిడ్డ వెంట ఉంటామని స్పష్టం చేశారు. అభిమాన నాయకుడితో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడగా... వారందరితో జననేత ఆత్మీయంగా చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీలకు సహకరించారు. వైఎస్ జగన్‌ను కలిసిన సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి జగన్ ను కలుసుకున్నారు. వైఎస్. జగన్ ప్రజా సంకల్పయాత్రకు వీరిద్దరూ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్ వీరితో కొద్దిసేపు ముచ్చటించారు. చదవండి: చరిత్రాత్మక ఘట్టం: ప్రజాసంకల్పయాత్ర @3000 కి.మీ. నడిచేది నేనైనా.. నడిపించేది మీ అభిమానమే -
వాహనాల బంద్.. ప్రయాణికుల పాట్లు
-
వాహనాల బంద్.. ప్రయాణికుల పాట్లు
సాక్షి, హైదరాబాద్ : మోటారు వాహన చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది. వాహనాలు లేకపోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్ బస్టాండ్లలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో రహణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది. రాష్ట్రా వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమైయాయి. ఇదే అదునుగా భావించిన ప్రయివేటు వాహనాలు ఇష్టారీతిలో రేట్లు పెంచి దోచుకుంటున్నాయి. బంద్‌కు సంఘీభావంగా సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద రైల్వే కార్మికులు బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. 11 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్ర నుంచి ఇందిరా పార్క్ వరకు ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించి, అనంతరం బహిరంగ సభను నిర్వహించనున్నారు. బిల్లు ఉపసంహరణతో పాటు కనీసం వేతనం రూ. 15 వేలు పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం దేశవ్యాప్త వాహనాల బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సమ్మెకు దేశ వ్యాప్తంగా రవాణారంగ అనుబంధ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. -
నేడు ఆర్టీసీ సమ్మె
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. మోటారు వాహన చట్టం సవరణ బిల్లు–2016కు వ్యతిరేకంగా మంగళవారం బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బిల్లుకు వ్యతిరేకంగా భారత రోడ్డు రవాణా సంస్థల సమన్వయ కమిటీ దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చిన విష యం తెలిసిందే. ఇందులో భాగంగా ఆగస్టు 7న సమ్మె చేస్తున్నట్లు యాజమాన్యానికి జూలై 24న గుర్తింపు యూనియన్ తెలంగాణæ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) నోటీసులిచ్చింది. ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ), నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) తదితర 9 ఆర్టీసీ యూనియన్లు కూడా సమ్మెకు మద్దతు ప్రకటించాయి. అన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించిన దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిచిపోనున్నాయి. లారీల సంఘాలు కూడా బంద్‌కు మద్దతునిచ్చాయి. ఆటోరిక్షాలు, క్యాబ్ సర్వీసులు కూడా బంద్‌లో పాల్గొనే అవకాశం ఉంది. కోటిమందికి ఇబ్బందులు.. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 97 లక్షల మందిని ఆర్టీసీ గమ్యస్థానాలకు చేరుస్తోంది. 24 గంటల సమ్మెకు అన్ని యూనియన్లు మద్దతు ప్రకటించిన దరిమిలా.. రాష్ట్రంలోని 98 డిపోల వద్ద నిరసన ప్రదర్శనలకు కార్మికులు సిద్ధమవుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆర్టీసీ ఇంతవరకూ ప్రకటన చేయలేదు. సమ్మె డిమాండ్లు రాష్ట్రం పరిధిలోనివి కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమూ ఏమీ చేయలేని పరిస్థితి. కానీ బిల్లు వల్ల ఆర్టీసీ కార్మికుల, సంస్థ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని రవాణామంత్రి మహేందర్‌రెడ్డి గతంలోనే కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే రూ. 2,600 కోట్లు అప్పుల్లో ఉన్న ఆర్టీసీకి నేటి సమ్మెతో మరోసారి నష్టం తప్పేలా లేదు. డిమాండ్లు ఇవే! కొత్త మోటారు వాహన సవరణ బిల్లు–2016 ప్రకారం.. ప్రైవేటు వారు ప్రయాణ మార్గాలను కొనుక్కోవచ్చు. అంటే లాభాలొచ్చే.. బిజీగా ఉండే.. రూట్లను ఏ ప్రైవేటు కంపెనీ వారు కొనుక్కున్నా ఆ మార్గంలో ఆర్టీసీ బస్సు కనిపించకూడదు. దీనిపై అన్ని ప్రభుత్వ రవాణా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే టోల్ గేట్ల నుంచి ఆర్టీసీకి మినహాయింపు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ తగ్గింపు, కార్మికుల కనీస వేతనం రూ.24,000, డీజిల్‌పై అదనపు సుంకాలు తగ్గించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ‘గ్రేటర్’ రవాణా బంద్ గ్రేటర్ హైదరాబాద్‌లో రవాణా బంద్‌ను విజయవంతం చేసేందుకు కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ అనుబంధ రవాణా కార్మిక సంఘాలు, తెలంగాణ ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘం, తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్, జై డ్రైవరన్న క్యాబ్స్ అసోసియేషన్ తదితర కార్మిక సంఘాలు బంద్‌లో పాల్గొననున్నాయి. దీంతో సుమారు 3,560 సిటీ బస్సులు, 1.4 లక్షల ఆటోరిక్షాలు, 2 లక్షల క్యాబ్‌లు, ట్యాక్సీలు నిలిచిపోనున్నాయి. స్కూలు బస్సులు, వ్యాన్లు, ఆటోరిక్షాలనూ నిలిపివేయనున్నట్లు వివిధ సంఘాల నేతలు ప్రకటించారు. దీంతో నగర వ్యాప్తంగా రవాణా స్తంభించనుంది. సుమారు 50 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురికానున్నాయి. ఎంఎంటీఎస్, మెట్రో అదనపు సర్వీసులు బంద్ వల్ల నగర ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అదనపు సర్వీసులు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే, హైదరాబాద్ మెట్రో రైల్ చర్యలు చేపట్టాయి. నాగోల్–సికింద్రాబాద్–అమీర్‌పేట్–మియాపూర్ మార్గంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లు నడుపనున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఫలక్‌నుమా–సికింద్రాబాద్, నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్–లింగంపల్లి, సికింద్రాబాద్–ఫలక్‌నుమా తదితర మార్గాల్లో ప్రస్తుతం 121 ఎంఎంటీఎస్ సర్వీసులు నడుస్తుండగా.. ప్రయాణికుల రద్దీ మేరకు సర్వీసులు పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సమ్మెకు సహకరించండి దేశంలోని అన్ని ఆర్టీసీల మనుగడకు మోటారు వాహన సవరణ బిల్లు–2016 ముప్పుగా మారింది. ఈ బిల్లు ఆర్టీసీ ఉనికికే ప్రమాదం. బిల్లు ఆమోదం పొందితే పేద విద్యార్థులకు రవాణా భారమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పడిపోతుంది. కాబట్టి కేంద్రం వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి. ఆటో, లారీలు, ఇతర రవాణా సంఘాలన్నీ మాతో కలసి రావాలని కోరుతున్నాం. – అశ్వథ్థామరెడ్డి, టీఎంయూ అధ్యక్షుడు, థామస్‌రెడ్డి, టీఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్ -
ఏడేళ్లు ఎక్కడ చదివితే అక్కడే లోకల్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానికతను నిర్ధారించేందుకు 4 నుంచి 12వ తరగతి వరకు ఎక్కడ చదివారన్న అంశాన్నే ప్రామాణికంగా తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. కడియం శ్రీహరి కమిటీ సిఫారసు చేసిన విధంగా ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువును పరిగణనలోకి తీసుకోవద్దని పేర్కొంది. 4 నుంచి 12 దాకా వరుసగా ఏడేళ్ల పాటు ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లాకు లోకల్‌గా పరిగణించాలని సూచించింది. 4 నుంచి 12వ తరగతిని పరిగణనలోకి తీసుకునే క్రమంలో ఒకవేళ విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో చదివితే వారి తల్లిదండ్రుల స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. బుధవారం టీఎన్జీవో భవన్లో చైర్మన్ కారెం రవీందర్‌రెడ్డి అధ్యక్షతన ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం జరిగింది. ఇందులో జేఏసీ సెక్రటరీ జనరల్ వి.మమత, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పి.మధుసూదన్‌రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోనల్ విధానం, స్థానికతపై పలు తీర్మానాలు ఆమోదించారు. అనంతరం జోనల్ విధానం ఉండాల్సిన తీరుపై ప్రతిపాదనలను సిద్ధం చేశారు. 4 జోన్ల విధానం వల్ల విద్యార్థులకు, నిరుద్యోగులకు నష్టం వాటిల్లుతుందని, కనీసం 5 జోన్లు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. 6 జోన్లు ఉన్నా ఓకేనని పేర్కొంది. పాత జిల్లా ప్రకారం ప్రస్తుతం ఉన్న రెండు జోన్లను రెండు మల్టీ జోన్లుగా చేయాలని ప్రతిపాదించింది. అలాగే అన్ని కేటగిరీల పోస్టుల్లో 80% లోకల్, 20% ఓపెన్ కేటగిరీ (రాష్ట్ర పరిధిలోని వారికే) విధానం ఉండాలని, లేదంటే 70:30 నిష్పత్తిన ఉండాలని పేర్కొంది. ఈ మేరకు వివిధ సంఘాల అభిప్రాయాలు, సమావేశ తీర్మానాలతో రూపొందించిన ప్రతిపాదనలను సమన్వయకర్త దేవీప్రసాద్‌కు జేఏసీ నేతలు అందజేశారు. వాటిపై గురువారం లేదా శుక్రవారం సీఎంతో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఐదు జోన్లు ఉంటేనే సమస్యలు ఉండవని దేవీ ప్రసాద్ వద్ద జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ఒకవేళ ప్రభుత్వం ఐదు వద్దనుకుంటే ఆరు జోన్లు చేసినా అంగీకారమేనని వెల్లడించారు. జోన్లపై ఇవీ ప్రతిపాదనలు.. జోన్లపై జేఏసీ రెండు రకాల ప్రతిపాదనలు చేసింది. ఒకటి ఐదు జోన్ల విధానం.. అది వద్దనుకుంటే ఆరు జోన్ల విధానం. ఐదు జోన్లలో.. పాత జిల్లాల ప్రకారం ఆదిలాబాద్, కరీంనగర్ ఒక జోన్‌గా, వరంగల్, ఖమ్మం ఒక జోన్‌గా, మహబూబ్‌నగర్, నల్లగొండ ఒక జోన్‌గా, మెదక్, నిజామాబాద్ ఒక జోన్‌గా, హైదరాబాద్, రంగారెడ్డి ఒక జోన్‌గా మొత్తం ఐదు జోన్లు ఉండాలి. పాత జిల్లాల పరిధిలోని ఆయా జిల్లాలన్నీ ఆయా జోన్ల పరిధిలోకి వస్తాయి. ఐదు జోన్లు వద్దనుకుంటే హైదరాబాద్ ఒక జోన్‌గా, రంగారెడ్డి మరో జోన్‌గా చేసి ఆరో జోన్లు ఏర్పాటు చేయాలి. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లోని నిరుద్యోగ యువతకు సమానంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఇది అవసరమని పేర్కొంది. ఇప్పుడున్న రెండూ మల్టీ జోన్లుగా... ప్రస్తుతమున్న 5వ జోన్‌ను మల్టీ జోన్–1గా చేయాలని, 6వ జోన్‌ను మల్టీ జోన్–2గా చేయాలని పేర్కొంది రాష్ట్ర స్థాయి పోస్టుల భర్తీ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉండకూడదు. పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాలి. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి పోస్టులుగా ఉన్న గ్రూప్–1 తరహా పోస్టులన్నీ మల్టీ జోన్ పరిధిలో నే భర్తీ చేయాలని సూచించింది. తద్వారా ఇతర రాష్ట్రాల వారిని నిరోధించవచ్చని తెలిపింది పోస్టుల భర్తీలో 70% పదోన్నతుల ద్వారా, 30% డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా చేయాలి. అవీ జిల్లా, జోన్, మల్టీ జోన్లోనే ఉండాలని పేర్కొంది జూనియర్ అసిస్టెంట్, అంతకంటే కిందిస్థాయి పోస్టులన్నీ జిల్లా స్థాయిలోనే భర్తీ చేయాలని వెల్లడించింది సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ జిల్లా కేడర్‌లో, గెజిటెడ్ హెడ్ మాస్టర్, మండల విద్యాధికారి జోనల్ కేడర్‌లో, డిప్యూటీ ఈవో మల్టీ జోన్ కేడర్‌లో, అంతకంటే పైస్థాయి పోస్టులన్నీ స్టేట్ కేడర్‌లో ఉండాలని జేఏసీ ప్రతిపాదించింది. -
ముగిసిన ఉద్యోగ సంఘాల బేటీ
-
ఉద్యోగ సంఘాలతో రేపు సీఎం భేటీ!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు, డిమాండ్లపై శుక్రవారం సీఎం కేసీఆర్ ఆయా సంఘాలతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశం ఉంటుందని, దీనికి హాజరు కావాలంటూ ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. మొత్తం 25 డిమాండ్లు, సమస్యలను ఇదివరకే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జేఏసీలు ప్ర భుత్వం ముందుంచాయి. ముఖ్యంగా సీపీఎస్ రద్దు, ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలు, కొత్త పీఆర్సీ ఏర్పాటు, ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకురావడం, ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వుల రద్దు, కొత్త జిల్లాల్లో ఉద్యోగుల శాశ్వత కేటాయింపులు జరపడం, టీచర్ల ఏకీకృత సర్వీసు రూల్స్‌కు చర్యలు చేపట్టడం, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సమాన వేతనాలు చెల్లించడం, రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్లకు పెంచడం వంటి అంశాలను ప్రభుత్వం ముందుంచారు. 10 రోజుల్లో తగిన చర్యలు చేపడతామని అప్పట్లో సీఎస్ చెప్పార ని, నెల రోజులు కావస్తున్నా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఉద్యోగ సంఘాలు భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ఉద్యోగ సంఘాల జేఏసీ 4న సమావేశం నిర్వహించాలని భావించింది. ఈ నేపథ్యంలో సమావేశానికి రావాలని సీఎంవో నుంచి సంఘాలకు ఆహ్వానం అందింది. దీంతో తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ముఖ్యంగా బదిలీలు, వయోపరిమితి పెంపు, కొత్త పీఆర్సీ ఏర్పాటు వంటి కీలక అంశాలపై గ్రీన్ సిగ్నల్ వస్తుందని సంఘాలు భావిస్తున్నాయి. సీపీఎస్ రద్దుపైనా చర్చించి కార్యాచరణకు ఏంచేయాలన్న దానిపైనా స్పష్ట త వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. -
డైరీలను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరం తొలిరోజు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రగతిభవన్‌లో పలు విభాగాలకు చెందిన డైరీలను (2017) ఆవిష్కరించారు. తెలంగాణ తహసీల్దార్ సంఘం, తెలంగాణ రెవెన్యూ విభాగం, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘంకు చెందిన డైరీలను ఆవిష్కరించిన సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..కొత్త జిల్లాల నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగులు ప్రజలకు చేరువగా ఉండి వారి సమ స్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నేతలతోపాటు తహసీల్దార్ సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డి, కోశాధికారి చంద్రకళ, గోపీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆదిలాబాద్ లో కార్మిక సంఘాల ఆందోళన
ఆదిలాబాద్: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం ఉదయం నుంచి అదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట కార్మిక సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఆర్టీసీ కార్మికులంతా స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనడంతో డిపో నుంచి బస్సులు బయటకు రాలేదు. దీంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ ధర్నాలో సీపీఎం, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
43 శాతం ఫిట్మెంట్ ఇవ్వకుంటే వెనక్కితగ్గం
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ యాజమన్యం, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. కార్మిక సంఘాలు 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని కోరగా, 28 శాతం ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమన్యం సుముఖత వ్యక్తం చేసింది. 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చేవరకు సమ్మెపై వెనక్కితగ్గేదిలేదిన కార్మిక సంఘాలు తేల్చిచెప్పాయి. జూలై వరకు సమ్మె వాయిదా వేయాలని ఆర్టీసీ యాజమన్యం కోరింది. చర్చల అనంతరం ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లారు. రవాణ మంత్రి మహేందర్ రెడ్డితో కార్మిక సంఘాల నాయకులు ఈ రోజు మరోసారి చర్చలు జరపనున్నారు. -
'మాకూ సమాన వేతనాలు ఇవ్వండి'
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకూ వేతనాలు ఇవ్వాలని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. బస్‌భవన్‌లో ఆర్టీసీ యాజమాన్యం కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరుపుతోంది. ఈయూ, టీఎంయూ నేతలు ఈ చర్చల్లో పాల్గొన్నారు. -
పీఆర్సీ వెంటనే ప్రకటించాలి: ఉద్యోగ సంఘాలు
హైదరాబాద్: పీఆర్సీని తక్షణం ప్రకటించి తమకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశాయి.. ప్రదీప్ చంద్ర కమిటీ కాలయాపన కోసం వేసిన కమిటీలా కనిపిస్తోందని ఆరోపించాయి. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మంచి ఫిట్ మెంట్ ఇచ్చి పీఆర్సీని అమలుచేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. -
అసెంబ్లీ ఉద్యోగుల విభజన: ఉద్యోగ సంఘాలు అభ్యంతరం
రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి అసెంబ్లీలో ఉద్యోగులను ప్రభుత్వం శుక్రవారం విభజించింది. అసెంబ్లీలోని ఐదుగురు డిప్యూటీ సెక్రటరీలలో ముగ్గురుని ఆంధ్రప్రదేశ్‌కు, ఇద్దరిని తెలంగాణకు కేటాయించారు. అలాగే అసెంబ్లీలోని 15 మంది అసిస్టెంట్ సెక్రటరీలలో ఐదుగురిని ఆంధ్రకు, 10 మంది తెలంగాణకు విభజించారు. అయితే అసెంబ్లీలో ఉన్నతాధికారుల విభజనపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. -
మధ్యంతర భృతి 22శాతం మించి ఇవ్వలేం
-
మధ్యంతర భృతి 22శాతం మించి ఇవ్వలేం
హైదరాబాద్: మధ్యంతర భృతిపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఉద్యోగ సంఘాల నేతలతో ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి జరిపిన చర్చలు ముగిశాయి. ఉద్యోగ సంఘాలకు ఇచ్చే మధ్యంతర భృతిపై 22శాతం మించి ఇవ్వలేమని ప్రభుత్వం పేర్కొంది. ఈ చర్చల్లో ఉద్యోగసంఘాలు 32శాతమైనా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. దీంతో ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో 32శాతం మధ్యంతర భృతి ఇవ్వలేమని చెప్పినట్టు తెలిసింది. అయితే రేపు ఉదయం 11.30 గంటలకు క్యాంప్ ఆఫీస్‌లో మధ్యంతర భృతిపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు జరపనున్నట్టు సమాచారం. కాగా, మధ్యంతర భృతిపై చర్చించేందుకు మంత్రి ఆనంతో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు బుధవారం సమావేశమైన సంగతి తెలిసిందే. -
స్టీరింగ్ కమిటీయే
సాక్షి, హైదరాబాద్: స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తేనే హెల్త్‌కార్డుల సంబంధిత సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశారుు. హెల్త్‌కార్డుల పథకంలో ఉన్న లోపాలు సవరించకుంటే తమకు హెల్త్కార్డులే అక్కర్లేదని ప్రభుత్వానికి తేల్చి చెప్పాయి. ఇప్పటివరకు 27 సమావేశాలు జరిగినా ఫలితం లేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. హెల్త్‌కార్డుల పథకంలో ఉన్న లోపాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఆదివారం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. ఆర్థిక, జీఏడీ, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు, దాదాపు 25 సంఘాల నేతలు పాల్గొన్నారు. కేవలం సమావేశాలతో కాలం గడిపేయకుండా సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు కోరారుు. స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నాయి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని భాగస్వామ్య సంఘాలతో పాటు ఇరుప్రాంతాల గెజిటెడ్ అధికారులు, పెన్షనర్ల సంఘాలకూ స్టీరింగ్ కమిటీలో చోటు కల్పించాలని సూచించాయి. కమిటీలో 60 శాతం ఉద్యోగులు, 40 శాతం అధికారులు ఉండే విధంగా కూర్పు ఉండాలన్నాయి. స్టీరింగ్ కమిటీ ఏర్పాటుకు సీఎస్ సూత్రప్రాయంగా అంగీకరించారు. అన్ని విషయాలను ముఖ్యమంత్రికి వివరించిన తర్వాత స్పష్టమైన ప్రకటన చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పీఆర్టీయూ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి కత్తి నరసింహారెడ్డి, టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, టీజీవో అధ్యక్షుడు శ్రీనివాసగౌడ్, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరావు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, కార్యదర్శి పద్మాచారి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. రెండు గంటలకుపైగా ఈ భేటీ కొనసాగింది. ఇదీ చర్చల తీరు.. ఉద్యోగ సంఘాలు: అన్ని రెఫరల్ ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ (ఓపీ) సౌకర్యం కల్పించాలి. అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు మందులు ఇవ్వాలి. సీఎస్: ఓపీ సౌకర్యం కల్పించడం వల్ల ప్రైవేటు ఆసుపత్రుల్లో అనవసర పరీక్షలు చేసి భారీగా బిల్లులు సమర్పిస్తారు. అందుకనే కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఓపీ సౌకర్యం కల్పించాం. అత్యవసర పరిస్థితుల్లో ఏ రెఫరల్ ఆసుపత్రిలో అయినా వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఉంది. 25 దీర్ఘకాలిక వ్యాధులకు మందులు ఇస్తేనే ఏటా రూ.70 కోట్లకుపైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతకు మించితే భారం ఎక్కువవుతుంది. అన్ని జబ్బులకు మందులు ఇవ్వడం సాధ్యం కాదు. సంఘాలు: 750 రెఫరెల్ ఆసుపత్రుల్లో చికిత్సకు అవకాశం కల్పిస్తామని గతంలో పలు సమావేశాల్లో అధికారులు చెప్పారు. తీరా పథకం అమల్లోకి వచ్చే సమయంలో 457 ఆసుపత్రులే జాబితాలో ఉన్నాయి. అందులో 152 ప్రభుత్వాసుపత్రులే. 347 రకాల చికిత్సలను ప్రభుత్వాసుపత్రుల్లోనే చేయించుకోవాలనే నిబంధన పెట్టారు. కాన్పులు కూడా అక్కడే చేయించుకోవాలనడం అన్యాయం. సీఎస్: రెఫరల్ ఆసుపత్రుల సంఖ్య పెంచడానికి చర్యలు చేపడతాం. 23 ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులు ప్యాకేజీలు నచ్చక ఈ పథకంలో చేరలేదు. వాటితో చర్చిస్తున్నాం. సంఘాలు: ఉద్యోగుల డేటా నమోదుకు ఆరోగ్యశ్రీ, ఆర్థిక శాఖ వేర్వేరుగా పోర్టల్స్ ఏర్పాటు చేశాయి. దేంట్లో నమోదు చేసుకోవాలనే విషయంలో ఉద్యోగుల్లో అయోమయం ఉంది. ఆరోగ్యశ్రీ పోర్టల్‌లో ఎస్ఆర్ స్కాన్ కాపీలను జత చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులను ప్రభుత్వం దొంగలుగా చూస్తోంది. సీఎస్: ఏ పోర్టల్‌లో అయినా నమోదు చేసుకోవచ్చు. డేటా బదిలీ చేసుకొనే అవకాశం ఉంది. సంఘాలు: దంపతులు ఇద్దరూ ఉద్యోగులైతే తల్లిదండ్రులతో పాటు అత్తమామలకూ పథకం వర్తిస్తుందని 174 జీవోలో పేర్కొన్నారు. ఆర్థిక శాఖ జారీ చేసిన 331, 334 జీవోల్లో ఒకరి తల్లిదండ్రులకే అవకాశం అని పేర్కొన్నారు. అత్తమామలకూ వర్తింపజేయాలి. సీఎస్: ఇద్దరూ ప్రీమియం చెల్లిస్తే వారికీ వర్తింపజేస్తాం. సంఘాలు: హెల్త్‌కార్డుల పథకం పూర్తిస్థాయిలో అమలయ్యే వరకు మెడికల్ రీయింబర్స్మెంట్నూ కొనసాగించాలి. సీఎస్: రీయింబర్స్మెంట్ కొనసాగుతుంది. సంఘాలు: డిప్యుటేషన్, సస్పెన్షన్‌లో ఉన్న ఉద్యోగుల డేటా నమోదుకు అవకాశం లేదు. ఈ ఏడాది మార్చి తర్వాత పదవీ విరమణ చేసిన ఉద్యోగుల డేటా నమోదు కూడా సాధ్యం కావడం లేదు. సర్వీసు రిజిస్టర్లో ఉన్న పేరు కంటే ఆధార్ కార్డులో భిన్నంగా ఉంటే డేటా తీసుకోవడం లేదు. పలు జిల్లాల్లో డీడీవో కోడ్స్ పోర్టల్‌లో కనిపించడం లేదు. సీఎస్: అన్ని రకాల సాంకేతిక సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం.