ఏపీ: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు సఫలం.. | AP Employees Union Meet With Committee Of Ministers | Sakshi
Sakshi News home page

ఏపీ: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు సఫలం..

Published Sat, Feb 5 2022 4:13 PM | Last Updated on Sun, Feb 6 2022 8:50 AM

AP Employees Union Meet With Committee Of Ministers - Sakshi

సాక్షి, అమరావతి: దాదాపు7 గంటల పాటు మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు జరిపిన సమావేశం ముగిసింది. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. మంత్రుల కమిటీ ప్రతిపాదనలను సీఎం జగన్‌ అంగీకారం తెలిపారు. కాసేపట్లో మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాల నేతలు ప్రెస్‌ మీట్‌ పెట్టి చర్చల సారాంశాన్ని వివరించనున్నారు. హెచ్‌ఆర్‌ఏ స్లాబ్‌లు, పీఆర్సీ కాల పరిమితి, ఐఆర్‌ అడ్జస్ట్‌మెంట్‌, పెన్షనర్ల అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ స్లాబ్‌లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. 

చదవండి: పా‘పాల’ పుట్ట హెరిటేజ్‌!

కాగా, శుక్రవారం రాత్రి.. ఉద్యోగుల ఉద్యమం విరమణ దిశగా మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాలు సానుకూలంగా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. తాము కోరుతున్న ప్రధాన అంశాల్లో కొన్నింటిపై మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించినట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. చర్చలు సఫలమయ్యేలా జరుగుతున్నట్లు స్పష్టం చేశాయి. ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని,  హెచ్‌ఆర్‌ఏ, ఐఆర్‌ రికవరీ అంశాలపై సానుకూలంగా ఉన్నట్లు మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలకు తెలిపింది.

చర్చల అనంతరం మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..

పీఆర్సీ విషయంలో మెరుగైనది ఇచ్చినా ఉద్యోగులు ఆశించినంతగా లేదని భావించారని, అందుకే వారి అసంతృప్తి, ఆవేదన పరిష్కరించడానికి కూలంకషంగా చర్చలు జరిగాయని తెలిపారు. ప్రతి అంశంపై లోతుగా చర్చించి అందరి ఆమోదం వచ్చిందని చెప్పారు. హెచ్ ఆర్ ఏ విషయంలో వివిధ స్లాబ్స్ ఉద్యోగులతో చర్చించి పెంచినట్లు తెలిపారు. జిల్లా కేంద్రాల్లో 16 శాతం నిర్ణయించామని,హెచ్ఓడీ, సెక్రటేరియట్ వారికి జూన్ 2024 వరకు 24 శాతం హెచ్ఆర్ఏ ఉంటుంది. మారిన హెచ్ ఆర్ ఏ జనవరి 2022 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేసినా ప్రదర్శనలు చేసినా ప్రభుత్వం వైపు నుంచి సానుకూలంగానే ఉన్నామని తెలిపారు. ఆర్థికంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి వల్ల ఉన్నంతలో బెటర్ ప్యాకేజ్ ఇచ్చామన్నారు. ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని  చెప్తున్నారు 

►ఫిట్ మెంట్ 23 శాతం అదే కొనసాగుతుంది 

►అడిషనల్ క్వాంటం 70-74 వయసు వాళ్ళకు 7 శాతం 

►ఐఆర్ రికవరీ ఉపసంహరించుకుంటున్నాం 

►పదేళ్లకో సారి కాకుండా 5 ఏళ్లకే పీఆర్సీ అమలు చేయాలని నిర్ణయించాం 

►సీపీఎస్ రద్దు ప్రక్రియ మార్చ్ 21 కల్లా రూట్ మ్యాప్ తయారు అవుతుంది 

►గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల కన్ఫర్మేషన్ జూన్ లోపు జరగాలి 

►యధావిధిగా ఉద్యోగులు బాద్యతల్లోకి వెళ్తారని భావిస్తున్నాం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement