PRC
-
మొదటికొచ్చిన ఏఎన్ఎంల పంచాయితీ
సాక్షి, హైదరాబాద్/సుల్తాన్ బజార్: రెండో ఏఎన్ఎంల ఆందోళన వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసి అధికారుల హామీతో విరమించిన ఏఎన్ఎంలు... హామీలు నెరవేరకపోవడంతో తిరిగి సమ్మె చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్ ప్రజారోగ్య సంచాలకుడి కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. గత కొన్నాళ్లుగా ఏఎన్ఎంలు ఆందోళనలు, నిరసనలు చేస్తుండటం తెలిసిందే. అందులో భాగంగా ఆగస్టు 16 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమవగా ప్రభుత్వం నాలుగుసార్లు వారితో చర్చలు జరిపింది. సెప్టెంబర్ ఒకటిన యూనియన్ నేతలతో జరిగిన చర్చల్లో ఏఎన్ఎంల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ వేయాలని నిర్ణయించింది. దీంతో ఒప్పందం ప్రకారం అదే నెల నాలుగో తేదీ నుంచి ఏఎన్ఎంలు సమ్మె విరమించారు. ఒప్పందంలో భాగంగా సెపె్టంబర్ నెల 15గా పీఆర్సీ బకాయిలతోపాటు సమ్మె కాలపు వేతనాన్ని ఈ నెల జీతంతో చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. కానీ సమ్మె విరమించి నెల రోజులైనా ఇప్పటివరకు తమ డిమాండ్లను పరిష్కరించలేదని ఏఎన్ఎంలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఆందోళనకు దిగారు. ఇవీ ప్రధాన డిమాండ్లు... ♦ నోటిఫికేషన్లో ఇచ్చిన బేసిక్ పేతో 100 శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలి. పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. రూ. 10 లక్షల ఆరోగ్య బీమా, ఏఎన్ఎంలు దురదృష్టవశా త్తూ మరణిస్తే రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేíÙయాను అందించడంతోపాటు వారి కుటుంబంలో ఒకరికి 6 నెలల్లోగా కారుణ్య నియామకం కింద కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని ఇవ్వాలి. ♦ కాంట్రాక్ట్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత పూర్తి కాలానికి గ్రాట్యుటీ చెల్లించాలి. ♦ సమ్మె కాలానికి సంబంధించిన జీతం విడుదల చేయాలి. ♦ కరోనాకాలంలో మరణించిన రెండో ఎఎస్‌ఎంలను గుర్తించి వారి కుటుంబాలకు రూ. 5 లక్ష ల ఎక్స్‌గ్రేíÙయా చెల్లించడంతోపాటు వారి కుటుంబంలో ఒకరికి అర్హతను బట్టి కాంట్రాక్ట్ బేసిక్ లోనైనా సరే కారుణ్య నియామకం చేపట్టాలి. ♦ యూపీహెచ్‌సీల్లో పనిచేసే వారికి కూడా íపీహెచ్సీ వాళ్లకు ఇచ్చినట్లే రెండు మార్కుల వెయిటేజీ ఇవ్వాలి. ♦ నవంబర్ 10న జరిగే పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుగా అక్టోబర్ 10 నుంచి నవంబర్ 10 వరకు వేతనంతో కూడిన ప్రిపరేషన్ హాలిడేస్ ఇవ్వాలి. ♦ పీహెచ్‌సీల్లో ఫస్ట్ ఏఎస్‌ఎంలు లేని సబ్ సెంటర్లలో పనిచేస్తున్న రెండో ఏఎస్‌ఎంకు రూ. 10 వేల అదనపు వేతనాన్ని అందించాలి. ♦ 8 గంటల పని విధానాన్ని అమలు చేస్తూ సాయంత్రం 6 గంటల తర్వాత ఏదైనా రిపోర్టు పంపాలని ఒత్తిడి చేయకూడదు. ♦ యూనిఫాం అలవెన్స్ కింద రూ. 4,500 ఇవ్వాలి. ♦ లక్ష్యాలను నిర్దేశిస్తూ జీతాలను నిలిపే ప్రక్రియను ఆపాలి. ♦ సమ్మె సందర్భంగా ఇచ్చిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలి. ♦ వివాహం కాకముందు ఉద్యోగంలో నియమితులైన ఏఎస్‌ఎంలను వారి భర్తల సొంత మండలాలకు బదిలీ చేయడానికి అవకాశం కల్పించాలి. ∙పరీక్షను ఆఫ్‌లైన్‌లోనే ఓఎంఆర్ షీట్‌తో నిర్వహించాలి. -
Telangana: కొత్త పీఆర్సీ
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీపి కబురు అందించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్.శివశంకర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర రెండో వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బి.రామయ్య కమిటీ సభ్యుడిగా వ్యవహరించనున్నారు. వేతన సవరణ సంఘం నివేదిక సమర్పించే వరకు ఉద్యోగులు, పెన్షనర్ల మూలవేతనం/మూల పెన్షన్‌పై 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్)ని చెల్లించాలని కూడా సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుత అక్టోబర్ నెల నుంచే ఐఆర్‌ను వర్తింపజేయనున్నారు. ఈ మేరకు కొత్త పీఆర్సీ ఏర్పాటు, మధ్యంతర భృతి చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు నెలల్లోగా నివేదికను సమర్పించాలని కమిటీని ఆదేశించారు. వేతన సవరణ సిఫారసుల కోసం దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలపై మార్గదర్శకాలు జారీ చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తుత వేతనాలను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగుల వేతన సవరణపై సిఫారసులు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వృద్ధి, రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత, భవిష్యత్తు మూలధన పెట్టుబడి అవసరాలు/ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి..’ అని సూచించారు. 5% ఐఆర్‌తో రూ.2 వేల కోట్లకు పైగా భారం! ప్రస్తుతం అమల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర తొలి వేతన సవరణ గడువు గత జూన్ 30తో ముగిసింది. జూలై 1 నుంచి ఉద్యోగులకు కొత్త వేతన సవరణ వర్తింపజేయాల్సి ఉంది. తాజాగా ఏర్పాటైన రాష్ట్ర రెండో పీఆర్సీ.. వేతన సవరణ ఫిట్మెంట్ శాతాన్ని సిఫారసు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపి కొత్త పీఆర్సీ అమలుపై నిర్ణయం తీసుకుంటుంది. అప్పటివరకు 5 శాతం మధ్యంతర భృతిని ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించనుంది. వేతన సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత అప్పటివరకు చెల్లించిన ఐఆర్‌ను సర్దుబాటు చేసి ఉద్యోగులకు రావాల్సిన మిగిలిన వేతన సవరణ బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుంది. కాగా 5 శాతం ఐఆర్ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2 వేల కోట్లకు పైగా భారం పడనుందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. దీనికి ముందు 2018 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీని వర్తింప చేయాల్సి ఉండగా.. కోవిడ్ కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది. 2020 ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు 30 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రయోజనాలను అమలు చేసింది. ఐఆర్ వీరికి వర్తిస్తుంది.. ► రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, స్థానిక సంస్థల ఉద్యోగులు, వర్క్ చార్జ్డ్ ఉద్యోగులు, ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ అందుకుంటున్న సంస్థల ఉద్యోగులకు మాత్రమే ఐఆర్‌ను వర్తింపజేయనున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు వర్తించదు.. ► తెలంగాణ ఉన్నత న్యాయ సేవలు, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవలు, అఖిల భారత సర్వీసు అధికారులు, యూజీసీ/ఏఐసీటీఈ/ఐసీఏఆర్/ కేంద్ర ప్రభుత్వ వేతనాలు/పెన్షన్లు అందుకుంటున్న ఉద్యోగులు/పెన్షనర్లతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు, సొసైటీల ఉద్యోగులు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఐఆర్ వర్తించదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. -
పీఆర్సీ కమిటీ నియమించిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపుకోసం పే రివిజన్ కమిటీని( పీఆర్సీ) నియమించారు. ఇద్దరు సభ్యులతో మొదలైన ఈ కమిటీ చైర్మన్ గా ఎన్. శివశంకర్(రిటైర్డ్ ఐఎఎస్), సభ్యులుగా బి. రామయ్య(రిటైర్డ్ ఐఎఎస్) లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 శాతం మధ్యంతర భృతి(ఐఆర్)ని చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కమిటీ 6 నెలల్లోపు నివేదికను ప్రభుత్వానికి అందచేయాలని ఆదేశించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. పీఆర్సీకి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిందిగా ఆర్థిక శాఖను ఆదేశించారు. ఇది కూడా చదవండి: చదువు మాని.. చపాతీల తయారీ.. గురుకులంలో విద్యార్థుల వంటావార్పు -
అంగన్వాడీలకూ పీఆర్సీ ఫలాలు
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాన్ని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా స్థిరీకరిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటిస్తామని, ఇందులో భాగంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలు పెరుగుతాయన్నారు. ఆదివారం అంగన్వాడీ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు, సీఐటీయూ, ఏఐటీయూసీ ప్రతినిధులు మంత్రి హరీశ్‌రావును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల డిమాండ్లు, ఇతర సమస్యలను మంత్రి ముందు ఉంచారు. దీనిపై హరీశ్ సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు త్వరలో ప్రభుత్వం ఇవ్వనున్న పీఆర్సీలో అంగన్వాడీలను చేర్చుతామని,ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జీతాలను కూడా పెంచుతామని భరోసానిచ్చారు. ఇతర డిమాండ్లపై సానుకూలంగా స్పందించి వాటిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, ఈ డిమాండ్లపై నివేదికను సమర్పించాల్సిందిగా మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి భారతి హోలికేరినీ ఆయన ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన పథకం బిల్లులను కూడా ప్రభుత్వం విడుదల చేసిందని, రెండు రోజుల్లో ఆయా ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి హరీశ్ వెల్లడించారు. -
ఏపీ విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీపై కుదిరిన ఏకాభిప్రాయం
సాక్షి, విజయవాడ: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) ఖరారైంది. కొత్తగా అమల్లోకి రానున్న సింగల్ మాస్టర్ స్కేలుతో కూడిన పీఆర్సీ ఒప్పందంపై ఏపీజెన్కో, ఏపీట్రాన్స్కో, ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీఎస్‌పీఈజేఏసీ) ప్రతినిధులు, పలు యూనియన్ల నాయకులు సంతకాలు చేసి పరస్పరం ఒప్పందాలను ఖరారు చేసుకున్నారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం కొత్త పీఆర్సీ గత ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ అగ్రిమెంట్ ప్రకారం విద్యుత్ సంస్థలు ఉద్యోగులకు 12 వాయిదాల్లో పీఆర్సీ బకాయిలు చెల్లిస్తాయి. కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులకు 8 శాతం ఫిట్మెంట్ లభిస్తుంది. సింగల్ మాస్టర్ స్కేలు అనే కొత్త విధానం అమల్లోకి తేనున్న నేపథ్యంలో అధికారులు లోతుగా అధ్యయనం చేసి కొత్త స్కేళ్లు రూపొందించారు. పేస్కేళ్లలో అనామలీస్ ఉంటే సరిచేసేందుకు ట్రాన్స్‌కో జేఎండీ నేతృత్వంలో మూడు డిస్కంల సీఎండీలతో హెచ్ఆర్ కమిటీ ఏర్పాటు చేసినట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తెలిపారు. దీంతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేస్తూ పీఆర్సీ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు. పెరిగిన పీఆర్సీతో 28 వేలకి పైగా ఉద్యోగులకి లబ్ధి చేకూరనుంది. -
త్వరలో పీఆర్సీ, ఐఆర్‌పై స్పష్టత
సాక్షి, హైదరాబాద్: రెండో వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి మధ్యంతర భృతిని ప్రకటించా లని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమి టీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి వి.మమత తదితరు లు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చాంబర్లో కేసీఆర్‌ను కలిశారు. పీఆర్సీ ఏర్పాటు, మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటన ద్వారా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా న్యాయం జరిగేలా చూడాలని ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రిని కోరారు. అలాగే సిబ్బంది ఆరోగ్య భద్రత కోసం ఉద్యోగుల చందాతో కూడిన ట్రస్టును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. తాము సమర్పించిన వినతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని, రెండు మూడు రోజుల్లో ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారని మామిళ్ల రాజేందర్ ‘సాక్షి’కి వెల్లడించారు. సీఎంను కలిసిన వారిలో టీజీఓల సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.సత్యనారాయణ, టీఎన్జీఓల యూనియన్ ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, అసోసియేట్ ప్రెసిడెంట్ సత్యనారాయణగౌడ్ ఉన్నారు. -
కొత్త పీఆర్సీ ఏర్పాటు చేయాలి
సాక్షి, హైదరాబాద్: పాలకులు తక్షణమే కొత్త వేతన సవరణ సంఘాన్ని నియమించాలని, జూలై ఒకటో తేదీతో వర్తించేలా కరువు భత్యం ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ( యూయూఎస్పీసీ) డిమాండ్ చేసింది. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల కోసం పోరుబాట పట్టాలని నిర్ణయించింది. దశల వారీగా పోరాట కార్యాచరణను స్టీరింగ్ కమిటీ ప్రకటించింది. ఈనెల 18, 19 తేదీల్లో మండలాల్లో బైక్ ర్యాలీలు. ఆగస్టు 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు చేపడతామని, సెపె్టంబర్ 1 న చలో హైదరాబాద్ పేరిట రాష్ట్రస్థాయి ఆందోళన నిర్వహిస్తామని వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాలు ఉంటాయని పేర్కొంది. శనివారం టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో యూయూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి నెల మొదటి తేదీనే వేతనాలు ఇవ్వాలని, ట్రెజరీల్లో ఆమోదం పొంది ప్రభుత్వం వద్ద నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న సప్లిమెంటరీ బిల్లులు, సెలవు జీతాలు, జీíపీఎస్, జీఎస్ జిఎల్‌ఐ క్లైములు, పెన్షనరీ బెనిఫిట్స్, బీఆర్సీ బకాయిలు తదితర బిల్లులు వెంటనే విడుదల చేయాలని, ఇహెచ్ఎస్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని యూయూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. తక్షణమే ఉద్యోగాలు.. పదోన్నతులివ్వాలి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వేలాది ఉపాధ్యాయ పోస్టులను బదిలీలు, పదోన్నతులు, నియామకాల ద్వారా వెంటనే భర్తీ చేయాలని, తాత్కాలిక ప్రయోజనాల కోసం హడావుడిగా అప్ గ్రేడ్ చేసిన పండిట్, పీఈటీ పోస్టులపై నెలకొన్న వివాదాన్ని త్వరగా పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరారు. పర్యవేక్షణాధికారుల పోస్టులను అవసరం మేరకు మంజూరు చేసి రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని, పాఠశాలల్లో సర్విస్ పర్సన్స్ ను నియమించాలని, మౌలిక వసతులు కల్పించాలని, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శ్రమకు తగిన వేతనాలు ఇవ్వాలని కోరారు. జీఓ 317 అమలు కారణంగా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులను వారి స్వంత జిల్లాలకు బదిలీ చేయాలని స్టీరింగ్ కమిటీ సభ్యులు కె జంగయ్య, చావ రవి (టీఎస్ యూటీఎఫ్), వై అశోక్ కుమార్, పి నాగిరెడ్డి(టీపీటీఎఫ్), ఎం సోమయ్య, టి లింగారెడ్డి(డీటీఎఫ్), యు పోచయ్య, డి సైదులు (ఎస్టీఎఫ్ టీఎస్), సయ్యద్ షౌకత్ అలీ (టీఎస్ పిటిఎ), కొమ్ము రమేష్, ఎన్ యాదగిరి (బీటీఎఫ్), బి కొండయ్య (టీఎస్ ఎంఎస్టీఎఫ్), ఎస్ హరికృష్ణ, వి శ్రీను నాయక్ (టీటీఎ), జాదవ్ వెంకట్రావు (ఎస్సీ ఎస్టీ టీఎ), వై విజయకుమార్ (ఎస్సీ ఎస్టీ యూయస్ టీఎస్) డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనూ సిపిఎస్ రద్దు చేయాలని, 2004 సెపె్టంబర్ 1కి ముందు నియామక ప్రక్రియ ప్రారంభమై ఆ తర్వాత నియామకాలు జరిగిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని స్టీరింగ్ కమిటీ సభ్యులు కోరారు. -
అందరికీ ఆమోదయోగ్యంగా ‘పీఆర్సీ’పై నిర్ణయం
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీపై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. వీరు విద్యుత్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో బుధవారం భేటీ అయ్యారు. సంఘాల ప్రతినిధులు పే రివిజన్‌పై ఉద్యోగుల డిమాండ్లను మంత్రులకు వివరించారు. ప్రస్తుత విధానాన్ని కొనసాగిస్తూ సింగిల్ మాస్టర్ స్కేల్ అమలు చేయాలని కోరారు. జెన్కో ఉద్యోగులకు అలవెన్స్‌లు, ఇతర అలవెన్స్‌లను యథాతథంగా కొనసాగించాలని, వెయిటేజీతో పాటు ఫిట్మెంట్లను అలానే ఉంచాలని, అలాకాని పక్షంలో అధిక ఫిట్మెంట్ ఇవ్వాలని కోరారు. ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ మాట్లాడుతూ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగానే పరిశీలిస్తోందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల డిమాండ్లను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళతామని, వారం రోజుల్లో మరోసారి ఉద్యోగసంఘాల ప్రతినిధులతో భేటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే వన్ మెన్ కమిషన్ నివేదికపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో దానిని పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకోవడం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఏపీ జెన్కో ఎండీ, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్ బాబు, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వితేజ్, ట్రాన్స్ కో విజిలెన్స్ జేఎండీ మల్లారెడ్డి పాల్గొన్నారు. -
ఇచ్చిన మాట నిలుపుకున్న సీఎం
సాక్షి, అమరావతి: అడగకుండానే 12వ పీఆర్సీని ఏర్పాటు చేసినందుకు.. సీపీఎస్ ఉద్యోగులకు ఊరటనిస్తూ జీపీఎస్ విధానాన్ని తెచ్చి నందుకు.. పది వేలకుపైగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించినందుకు.. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్‌ను ప్రభుత్వంలో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వారు సీఎంతో సమావేశమైన అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగుల సంక్షేమం కోసం కూడా సీఎం పాటుపడుతున్నారని ప్రశంసించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. ఉద్యోగుల కోసం పరితపిస్తున్న సీఎం జగన్ ప్రజలతో పాటు ఉద్యోగుల సంక్షేమానికీ పెద్దపీట వేస్తున్నారు. అడగకుండానే 12వ పీఆర్సీ ఏర్పాటు చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు 25 ఏళ్లుగా పనిచేసినా.. చనిపోతే మట్టి ఖర్చులు ఇవ్వలేని పరిస్థితి గతంలో ఉంది. ఇప్పుడు ఒక్క నిర్ణయంతో వారి ఉద్యోగాలను క్రమబద్దీకరించారు. ఏపీవీపీని ప్రభుత్వంలో విలీనం చేసి... ఆ శాఖలో పనిచేసే ఉద్యోగులకు 010 ద్వారా వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను 36 విడతల్లో ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. అన్ని జిల్లాల్లో ఒకే హెచ్ఆర్ఏ ఇచ్చారు. సీపీఎస్ ఉద్యోగులకు జీపీఎస్ ద్వారా 50 శాతం ఫిట్మెంట్తో పెరిగే ధరలకు అనుగుణంగా డీఏలు ఇచ్చి పెన్షన్ ఇస్తామని చెప్పడం ద్వారా భవిష్యత్‌కు భరోసా ఇచ్చారు. మా కోసం ఇంతగా పరితపిస్తున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. జగన్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తాం. సీఎం వైఎస్ జగన్‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు భారీ ఎత్తున పాలాభిషేకాలు చేస్తున్నారు. – బండి శ్రీనివాసరావు, అధ్యక్షుడు, ఏపీఎన్జీవో సంఘం మానవతామూర్తి సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ 2008లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. 2014 ఎన్నికల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధికరిస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మోసం చేశారు. సీఎం జగన్ ఇచ్చి న మాట మేరకు 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపిన మానవతామూర్తి. గతంలో పీఆర్సీ కోసం రోడ్డెక్కితే టీడీపీ సర్కార్ గుర్రాలతో ఉద్యోగులను తొక్కించింది. ఇప్పుడు ఎవరూ అడగకుండానే సీఎం వైఎస్ జగన్ పీఆర్సీని ప్రకటించి.. ఉద్యోగుల పట్ల తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు. – శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఏపీఎన్జీవో సంఘం ఎప్పటికీ రుణపడి ఉంటాం.. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ఎప్పటికీ రుణపడి ఉంటాం. – రత్నాకర్ బాబు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం నేత జీపీఎస్‌తో మేలు జరుగుతుందని భావిస్తున్నాం జీపీఎస్‌లో పది శాతం ఉద్యోగి షేర్, ప్రభుత్వ షేర్ కొనసాగుతుందని సీఎం జగన్ చెప్పారు. ఉద్యోగి రిటైర్ అయ్యాక గ్యారెంటీ పింఛన్ వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. జీపీఎస్‌తో ఉద్యోగులకు 60 శాతం ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నాం. – మురళీ మోహన్, సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేత 15 ఏళ్ల సమస్యకు సీఎం పరిష్కారం ఆస్పత్రుల్లో 15 ఏళ్లుగా ఉన్న సమస్యలను సీఎం జగన్ పరిష్కరించారు. రెగ్యులర్ ఉద్యోగులమైనా మాకు జీతాలు రావటం లేదు. కానీ సీఎం జగన్ దృష్టికి రాగానే ఒకే ఒక్క సంతకంతో సమస్య తీర్చారు. వైద్య విధాన పరిషత్ ద్వారా అత్యంత మెరుగైన సేవలు అందిస్తాం. – సురేష్ కుమార్, ఏపీవీపీ సంఘం నేత నా 23 ఏళ్ల సర్విసులో ఇది అద్భుతం నా 23 ఏళ్ల సర్విసులో ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల పరీక్షలకు సంబంధించి పరికరాలు ఏర్పాటు చేయడం అద్భుతం. కాంట్రాక్టు ఉద్యోగులమైన మమ్మల్ని రెగ్యులరైజ్ చేసినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు. – వీఏవీఆర్ కిశోర్, ఏపీ కాంట్రాక్టు ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
విద్యుత్ ఉద్యోగుల చర్చలు సఫలం.. పీఆర్సీ ఎంత శాతమంటే?
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో విద్యుత్ ఉద్యోగుల చర్చలు సఫలమయ్యాయి. ఈ క్రమంలో ఏడు శాతం పీఆర్సీకి విద్యుత్ ఉద్యోగులు అంగీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, సీఎండీ ప్రభాకర్ రావుకు విద్యుత్ ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం, ఏడు శాతం పీఆర్సీ ఒప్పందంపై విద్యుత్ ఉద్యోగులు సంతకం చేశారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 17 నుంచి తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్పీఈ జాక్) తలపెట్టిన సమ్మె విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి. దీంతో, రేపటి నుంచి తలపెట్టిన సమ్మె విరమించుకున్నారు. -
తెలంగాణ: త్వరలో ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్): టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలో పీఆర్సీ అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఆర్టీసీ కళ్యాణ మండపంలో శుక్రవారం భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాజిరెడ్డి గోవర్థన్ మాట్లాడుతూ...ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఈ విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కూడా సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల భద్రత విషయంలో సంస్థ అన్ని రకాల చర్యలు చేపడుతుందన్నారు. రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లు అమలు కాకుండా కొంతమంది కుట్ర చేస్తున్నారని, అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సంస్థ జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్‌సింగ్ పాటిల్, చీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ జి.రవీందర్, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ.కృష్ణ, గడ్డం శ్రీనివాస్, ఈడీ మునిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
వారంలోగా విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌తో మాట్లాడి వారంరోజుల్లో విద్యుత్ ఉద్యోగులకు వేతన సవరణపై ప్రకటన చేస్తామని విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చారు. విద్యుత్ ఉద్యోగ సంఘాలన్నీ కలిసి సోమవారం ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీతో చర్చించి ఓ ఫిట్మెంట్ శాతాన్ని నిర్ణయించుకోవాలని సూచించారు. అనంతరం ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు సమర్పించే నివేదికపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. తెలంగాణ విద్యుత్ జేఏసీ నేతలు శనివారం జగదీశ్‌రెడ్డిని మింట్ కాంపౌండ్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి పీఆర్సీ ప్రకటించాలని వినతిపత్రం అందజేశారు. ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యుత్ వేతన సవరణ సంప్రదింపుల కమిటీ విద్యుత్ ఉద్యోగులకు 5 శాతం, ఆర్టిజన్లకు 10 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని సిఫారసు చేయగా, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు జేఏసీ నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంచి ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక జాప్యం చేయకుండా వారంలో పీఆర్సీ ప్రకటిస్తామని, ఆందోళనలు విరమించుకోవాలని జగదీశ్‌రెడ్డి వారికి సూచించారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ కె.ప్రకాశ్, కన్వీనర్ శివాజీ, వైస్‌చైర్మన్ అంజయ్య, జేఏసీ నేతలు నాసర్ షరీఫ్ పాల్గొన్నారు. -
పీఆర్సీ కోసం ఉద్యమాలు ఉధృతం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ సాధన కోసం ఆందోళనలను తీవ్రం చేస్తున్నట్లు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించింది. 1004 యూనియన్ కార్యాలయంలో సోమవారం సమావేశమై ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయడంతో పాటు ఇందుకు సంబంధించిన నోటీసులను యాజమాన్యానికి అందజేసినట్లు జేఏసీ చైర్మన్ జి.సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. గతేడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త పీఆర్సీ విషయంలో యాజమాన్యం నుంచి ఇంకా స్పష్టత రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కార్యాచరణలో భాగంగా ఈనెల 21, 22 తేదీల్లో సర్కిల్ స్థాయిల్లో సమావేశాలు, 24, 25, 28 తేదీల్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన, మార్చి 1, 2న డివిజన్ కార్యాలయాలు, జనరేటింగ్ స్టేషన్ల వద్ద భోజన విరామ సమయంలో ప్రదర్శన, మార్చి 3, 4న సర్కిల్ కార్యాలయాలు, కార్పొరేట్ కార్యాలయాలు, జనరేటింగ్ స్టేషన్ల వద్ద భోజన విరామ సమయంలో ప్రదర్శన, మార్చి 8 నుంచి 23 వరకు సర్కిల్ కార్యాలయాలు, కార్పొరేట్ కార్యాలయాలు, జనరేటింగ్ స్టేషన్ల వద్ద రిలే నిరాహార దీక్షలు, మార్చి 14న కేటీపీఎస్ ప్లాంట్ వద్ద, 17న వరంగల్‌లో, 21న శంషాబాద్‌లో నిరసన సభలు, 24న విద్యుత్ సౌధలో మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయినా, యాజమాన్యం స్పందించని పక్షంలో 24న అత్యవసర సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు. సమావేశంలో జేఏసీ కో చైర్మన్ శ్రీధర్, కో కన్వీనర్, బీసీ రెడ్డి, వైస్ చైర్మన్ వజీర్ పాల్గొన్నారు. -
పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలి: ఎస్టీయూటీఎస్
సాక్షి, హైదరాబాద్: పీఆర్సీ కమిటీని తక్షణమే నియమించి, పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ బకాయిలను విడుదల చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం, తెలంగాణ (ఎస్టీయూటీఎస్) రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంఘం అధ్యక్షుడు బి.సదానందంగౌడ్ అధ్యక్షతన ఎస్టీయూటీఎస్ రజతోత్సవ వేడుకలు ఆదివారం హైదరాబాద్‌లో ముగిశాయి. ఈ సందర్భంగా సమావేశం పలు తీర్మానాలు చేసింది. టీచర్ల పదోన్నతులు, బదిలీలకు షెడ్యూల్ ఇవ్వాలని, వేతనేతర, మెడికల్ బిల్లులు మంజూరు చేయాలని, తొలిమెట్టు కార్యక్రమాన్ని సరళతరం చేయాలని, టీచర్లను బోధనకే పరిమితం చేయాలని, 317 జీవో వల్ల నష్టపోయిన టీచర్లకు న్యాయం చేయాలని, స్పౌజ్ కేసులను పరిష్కరించాలని కోరింది. ఎమ్మెల్సీగా బరిలోకిదిగిన భుజంగరావుకు ఉపాధ్యాయులు బాసటగా నిలవాలని పిలుపునిచ్చింది. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి పర్వతరెడ్డి పాల్గొన్నారు. -
AP: సీఎం జగన్‌ను కలిసిన ఆర్టీసీ ఉద్యోగులు
సాక్షి, తాడేపల్లి: ఆర్టీసీ ఉద్యోగులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం కలిశారు. తమకు పీఆర్సీ అమలు చేయడంపై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకున్నారని ప్రస్తావించారు. కరోనా సమయంలోనూ ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు ఇబ్బంది లేకుండా చేశారని గుర్తు చేశారు. తాజాగా అక్టోబర్ 1 నుంచి వారికి పీఆర్సీ అమలు చేయబోతున్నట్లు తెలిపారు. గురుకుల, ఎయిడెడ్, యూనివర్సిటీ ఉద్యోగుల వయోపరిమితి పెంచే విషయంపై సీఎం సానుకూలంగా స్పందించారని వెంకట్రామిరెడ్డి తెలిపారు. 52 వేల మంది ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది అని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ (ఏపీపీటీడీ) వైఎస్సార్ ఎంప్లాయ్ అసోసియేషన్ నేత చల్లా చంద్రయ్య కొనియాడారు. తమకు 10 వేల కోట్ల జీతాలు చెల్లించి ఆర్టీసీ భవిష్యత్తును కాపాడినట్లు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి కొత్త పే స్కేల్ అమలు చేయబోతున్న క్రమంలో సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు ముఖ్యమంత్రికి రుణపడాల్సి ఉందన్నారు. పెన్షన్ విషయాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లామని, దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. పదోన్నతుల ఫైల్ కూడా ప్రభుత్వానికి పంపినట్లు, ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. చదవండి: ఆర్గానిక్ పాల ఉత్పత్తిపై దృష్టి సారించాలి: సీఎం జగన్ -
ఆర్టీసీలో పీఆర్సీకి రైట్ రైట్
కర్నూలు(రాజ్‌విహార్): ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 2020 జనవరి 1 నుంచి రోడ్డు రవాణా సంస్థ కార్మికులను ప్రజా రవాణ శాఖలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. తాజాగా పీఆర్సీ(పేరివిజన్ స్కేల్) జీతాలు అక్టోబర్ 1వ తేదీ నుంచి చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాల నాటి కల నెరవేరిందని, సాహసవంతమైన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తీసుకున్నారని, తాము ఆయనకు రుణపడి ఉంటామని ఉద్యోగులు, సంఘాల నాయకులు అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి జిల్లాలో 4,037 మంది ఉద్యోగుల ఇళ్లలో ఆనందం నెలకొంది. ఆర్టీసీ చరిత్ర ఇదీ.. 1932లో 27 బస్సులతో ఈ సంస్థ ప్రారంభమైంది. ముందుగా నిజాం రోడ్ ట్రాన్స్‌పోర్టు పేరుతో ఆవిర్భవించిన సంస్థ 1951 నవంబరు 1న హైదరాబాద్ రాష్ట్ర రవాణా సంస్థగా, 1958లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా ఏర్పడింది. ప్రపంచంలో ప్రభుత్వ రంగం ఆధ్వర్యంలో నడపబడుతున్న అతిపెద్ద సంస్థగా 1999లో గిన్నీస్ బుక్‌లో స్థానం పొందింది. రాష్ట్రం విడిపోయాక 2015 మే 14వ తేదీన ఆర్టీసీ తెలంగాణలో సేవలను నిలిపివేయడంతో టీఎస్ ఆర్టీసీ ఏర్పడింది. హామీలు.. అమలు ఆర్టీసీ కష్టాలను తొలగించాలని కార్మిక సంఘాలు చేసిన విన్నపాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారు. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అందులో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆర్టీసీ విలీనానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. వంద రోజుల్లోపు నివేదికలు తెప్పించుకొని మంత్రివర్గంలో, అసెంబ్లీలో ఆమోదం కల్పించి, 2020 జనవరి 1వ తేదీన ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేశారు. దీంతో కార్మికులతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారడంతో పాటు అన్ని బెనిఫిట్స్, అలవెన్స్‌కు అర్హత సాధించారు. ఉద్యోగుల భద్రత, సంక్షేమం, పదవీ విరమణ పొందాక పెన్షన్ అందుకునేందుకు అర్హత కల్పించారు. ఆక్టోబర్ 1 నుంచి ట్రెజరీ ద్వారా కొత్త పీఆర్సీ వేతనాలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ప్రకటించి మరోసారి మాట నిలుపుకున్నారు. 4,037 మంది ఉద్యోగులకు లబ్ధి కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని 12 డిపోల్లో 4,037 మంది ఆర్టీసీ ఉద్యోగులున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో వీరంతా లబి్ధపొందనున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల్లో డ్రైవర్లు 1,677 మంది, కండక్టర్లు 1,286 మంది, అధికారులు, సూపర్వైజర్లు 258 మంది, అకౌంట్స్, పర్సనల్ అధికారులు 103 మంది ఉన్నారు. అలాగే నిర్వహణ విభాగంలో 607 మంది, స్టోర్స్‌లో ముగ్గురు, సెక్యూరిటీ గార్డులుగా 72 మంది, వైద్య విభాగంలో ఏడుగురు, సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆరుగురు పనిచేస్తున్నారు. అక్టోబర్ 1వ తేదీ నంఉచి కొత్త పీఆర్సీ వేతనాలు ఇస్తుండడంతో వీరంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో వచ్చే నెల నుంచి ట్రెజరీ ద్వారా కొత్త పీఆర్సీ జీతాలు చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల ఇళ్లలో దసరాకు ముందే పండుగ వాతావరణం నెలకొంది. చాలా గొప్ప నిర్ణయం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా పీఆర్సీ జీతాలు చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఉద్యోగుల్లో సంతోషం నెలకొంది. ఆయన నిర్ణయం గొప్పగా ఉంది. ఇచి్చన హామీలను అమలు చేస్తున్న సీఎంకు ఉద్యోగుల తరఫున అభినందనలు. – మద్దిలేటి, ఎన్ఎంయూ రీజినల్ కార్యదర్శి నిజమైన పండగ ఆర్టీసీ బాగు కోసం వైఎస్సార్ ఎంతో కృషి చేశారు. అదే తరహాలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని ప్రజా రవాణ శాఖలో విలీనం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ జీతాలు చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది ఉద్యోగులకు నిజమైన పండగ. మాట నిలబెట్టుకున్న సీఎంకు ఆర్టీసీ ఉద్యోగులు రుణపడి ఉంటారు. – నాగన్న, వైఎస్ఆర్ ఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అభినందనీయం ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు పీఆర్సీ వేతనాలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచి్చన తరువాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇప్పుడు పీఆర్సీ వేతనాలు ఇవ్వడం చాలా సంతోషం. – ఏవీ రెడ్డి, ఈయూ రీజినల్ కార్యదర్శి ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఆర్టీసీని ప్రజా రవాణా శాఖలో విలీనం చేసి కార్మికులను ఉద్యోగులుగా మార్చారు. దీంతో మాకు ఉద్యోగ భద్రత కలిసింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని అలవెన్స్‌లు అందుకుంటున్నాం. ఇప్పుడు పీఆర్సీ వేతనాలు చెల్లించేందుకు ఆదేశాలు ఇచ్చారు. సీఎం నిర్ణయం అభినందనీయం. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు. – జె. రబ్బాని, కర్నూలు–2డిపో డ్రైవర్ -
ఎన్నాళ్లో వేచిన ఉదయం
రాజమహేంద్రవరం సిటీ: ఆర్టీసీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఉద్యోగులకు అక్టోబర్ నుంచి పీఆర్సీ అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటనతో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. పీఆర్సీ అమలు ప్రకటనను స్వాగతిస్తున్నామంటూ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న పీఆర్సీతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో (ప్రస్తుత తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలు) సుమారు 3,600 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ (ఏపీఎస్‌పీటీడీ)గా మార్చారు. కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పదోన్నతి కల్పించారు. కార్మికుల సంబరాలు అక్టోబర్ నుంచి పీఆర్సీ అమలు కానుండడంతో ఆర్టీసీ ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సమయంలో ఆర్టీసీని అప్పుల ఊబిలో నుంచి కొంతమేర బయటకు తీసుకువచ్చి, ఆర్టీసీ కార్మికులకు అనేక రాయితీలు కల్పించి అండగా నిలిచారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆర్టీసీపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మరిన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయింది. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత 2020 జనవరిలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్లు ప్రకటించారు. అయితే సంస్థాగత, సాంకేతిక, విధాన పరంగా కొన్ని చిక్కులు రావడంతో ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిష్కరించారు. అనంతరం అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. పెరగనున్న జీతాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ, రావులపాలెం, రామచంద్రపురం, రాజోలు, ఏలేశ్వరం, తుని, గోకవరం, కొవ్వూరు, నిదడవోలు ఆర్టీసీ డిపోలున్నాయి. ఈ డిపోల్లోని సుమారు 3600 మంది ఉద్యోగులకు నూతన పీఆర్సీ ప్రకారం కొత్త జీతాలు అందనున్నాయి. వీరిలో పర్యవేక్షణ అధికారులు, సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, క్లీనర్లు, ఎల్రక్టీíÙయన్లు ఉన్నారు. వీరికి వారి ఉద్యోగ స్థాయి ప్రకారం రూ.2 వేల నుంచి 6 వేల వరకు అదనంగా జీతాలు పెరగనున్నాయి. ప్రతిరోజు ఉమ్మడి జిల్లాలో 2 లక్షల నుంచి 3 లక్షల మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. రోజుకు సుమారు రూ.కోటి వరకు ఆదాయం వస్తుంది. దీంతో పాటు కార్గో ద్వారా ఆదాయం సమకూరుతోంది. పీఆర్సీని స్వాగతిస్తున్నాం మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తరువాత మొదటిసారి అమలు చేస్తున్న పీఆర్సీని స్వాగతిస్తున్నాం. ముఖ్యమంత్రి నిర్ణయం ఆనందాన్ని నింపుతోంది. పాత బకాయిలు సైతం విజయదశమి నాటికి అందజేస్తే ఉద్యోగులకు మరింత ఊరట కలుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. – గిడ్ల చిరంజీవి, ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ, రాజమహేంద్రవరం సీఎం జగన్‌కు ధన్యవాదాలు ఇప్పటివరకూ చిన్నపాటి మొత్తంలో జీతాలు తీసుకుంటున్న మాకు కొత్త పీఆర్సీ ద్వారా వచ్చే జీతాలు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నాం. మా దశాబ్దాల కల నెరవేరింది. ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారు. మా ఉద్యోగులు అందరి తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. – సీహెచ్ఎన్ లక్ష్మీ, ఏపీపీటీడీ ఎంప్లాయూస్ యూనియన్, మహిళా కమిటీ కోశాధికారి, రాజమహేంద్రవరం చాలా సంతోషం ఆర్టీసీ కార్మికులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మార డం సంతోషంగా ఉంది. ఇప్పుడు అన్ని రాయితీలు మాకు అందుతున్నాయి. కొత్త పీఆర్సీ అమలుతో జీతాలు కూడా పెరుగుతాయి. మేము ప్రభుత్వ ఉద్యోగులమని గర్వంగా చెప్పుకుంటున్నాం. మాకు సమాజంలో గౌరవం పెరిగింది. సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం. – పోలిశెట్టి లక్ష్మణరావు, ఏపీపీటీడీ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు, రాజమహేంద్రవరం సాహసోపేతం ఆరీ్టసీని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్ మెంట్‌గా మార్చి ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేయడం సాహసోపేత నిర్ణయం. ఎన్ని అవరోధాలు ఏర్పడినా సీఎం జగన్ తాను ఇచ్చిన హామీని నెరవేర్చారు. ఉద్యోగుల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పీఆర్సీ అమలుతో కొత్త జీతాలు రావడం ఆనందంగా ఉంది. – వీరమల్లు శివ లక్ష్మణరావు, డ్రైవింగ్ స్కూల్ కోచ్, రాజమహేంద్రవరం -
AP: లక్ష ఇళ్లలో పెద్ద పండుగ
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త. సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేయడంతో పాటు వారికి 2022 జనవరిలో ప్రకటించిన పే రివిజన్(11 పీఆర్సీ) ప్రకారం పే స్కేళ్లను నిర్ధారిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు లక్ష మంది ఉద్యోగులు ప్రొబేషన్ ఖరారుకు అర్హత పొందుతారని అధికారులు తెలిపారు. తద్వారా వారి జీతాలు దాదాపు రెట్టింపు కానున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల కేటగిరీ ఉద్యోగులు పని చేస్తుండగా, ప్రొబేషన్ ఖరారైన గ్రేడ్–5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల పే–స్కేలును రూ.23,120 – 74,770గా నిర్ధారించారు. వీరి వేతనం డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకుని రూ.29,598 ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. మిగిలిన 17 రకాల కేటగిరి ఉద్యోగుల పే–స్కేలును రూ. 22,460– 72,810గా నిర్ధారించారు. అంటే, ఆ కేటగిరి ఉద్యోగుల డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకొని రూ.28,753 ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న వారికి 8 శాతం హెచ్ఆర్ఏ స్లాబ్ ప్రకారం ఈ వేతనాలు అందుతాయి. పట్టణ ప్రాంతాలలో పని చేసే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ స్లాబు మేరకు ఆయా చోట్ల పని చేసే ఉద్యోగులకు మరికొంత అధిక వేతనం దక్కుతుంది. పెరిగిన వేతనాలు జూలై 1 నుంచి (అంటే ఆగస్టు 1న ఉద్యోగుల చేతికి అందే జీతం) అమలులోకి రానున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సచివాలయ ఉద్యోగులు ప్రస్తుతం రూ.15 వేలు వేతనం పొందుతున్న విషయం విదితమే. 2022 పే– రివిజన్‌కే సీఎం జగన్ ఆమోదం 2018లో వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటు నాటికి సచివాలయ ఉద్యోగుల కేడర్ లేదు. ఈ నేపథ్యంలో పీఆర్సీ కమిటీ కూడా ప్రొబేషన్ ఖరారు అనంతరం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యగులకు ఉద్యోగ నోటిఫికేషన్లో పేర్కొన్న 2015 పే రివిజన్ ప్రకారమే వేతనాలు చెల్లించాలని సిఫార్సు చేసింది. ఈ ఏడాది జనవరి విడుదలైన పీఆర్సీ జీవోలలోనూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పే – స్కేలును నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం ఉదహరించారు. ఆ ప్రకారం.. గ్రేడ్ –5 పంచాయతీ సెక్రటరీలు, వార్డు ఆడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల వేతనం డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకున్న తర్వాత కూడా రూ.19,241 ఉంటుంది. మిగిలిన 17 రకాల కేటగిరి ఉద్యోగుల వేతనం డీఏ, హెచ్ఆర్ఏ కలుపుకున్న తర్వాత కూడా రూ.18,691 ఉంటుంది. అయితే ఈ పాత పే – స్కేళ్లకు బదులుగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న మాదిరే 11 పీఆర్సీ (2022 పే రివిజన్) ప్రకారం లెక్క కట్టి కొత్త పే – స్కేళ్లు అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా ఒక్కో సచివాలయ ఉద్యోగి వేతనం దాదాపు రూ.10 వేలు పెరిగింది. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాల వారీగా అర్హుల జాబితాలు ప్రభుత్వం ప్రొబేషన్ ఖరారు ఉత్తర్వులు విడుదల చేసిన చేసిన నేపథ్యంలో రానున్న మూడు, నాలుగు రోజుల్లో 26 జిల్లాల్లో వేర్వేరుగా ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అర్హులైన ఉద్యోగుల జాబితాలతో కూడిన ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ జారీ చేసిన జీవో నెంబరు 5 జతచేసి.. కమిషనర్ షాన్మోహన్ వివిధ శాఖాధిపతులు, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ప్రకారం రెండేళ్ల సర్వీసు పూర్తి, డిపారెంట్ టెస్టు ఉత్తీర్ణత, ఎటువంటి నేర చరిత్ర లేదన్న పోలీసు రిపోర్టులకు అనుగుణంగా జిల్లాల కలెక్టర్లు ప్రొబేషన్ ఖరారుకు అర్హులైన ఉద్యోగుల జాబితాలను ఇప్పటికే సిద్ధం చేశారు. ఇందుకు అనుగుణంగా 19 రకాల కేటగిరి ఉద్యోగులకు సంబంధించి ఆయా జిల్లాల్లో కేటగిరీ వారిగా అర్హుల పేర్లతో కూడిన జాబితాలతో వేర్వేరుగా ప్రోసీడింగ్స్ జారీ చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రొబేషన్ డిక్లేర్ చరిత్రాత్మకం రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు లక్షన్నర నూతన ఉద్యోగాలు సృష్టించి శాశ్వత ఉపాధి కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే సాధ్యమైంది. సీఎం ఇచ్చిన మాట మేరకు పరీక్ష పాస్ అయిన వారందరి సర్వీసులు క్రమబద్ధీకరిస్తూ, వారికి కొత్త పీఆర్సీ ప్రకారం పే స్కేల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇవ్వడం శుభ పరిణామం. ప్రొబేషన్ డిక్లరేషన్ చరిత్రాత్మకం. లక్షలాది మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబాలలో వెలుగులు నింపిన సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు. – ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) అనంతపురం జిల్లా గుత్తి 11వ వార్డు సచివాలయంలో గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డితో కలసి సంతోషం పంచుకుంటున్న సచివాలయ ఉద్యోగులు కొత్త పీఆర్సీ ప్రకారం సంతోషం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయడంతో పాటు వారికి కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. – కాకర్ల వెంకటరామి రెడ్డి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్. థ్యాంక్యూ సీఎం సార్.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ చేసిన మేలు మరవలేనిది. థ్యాంక్యూ సీఎం సార్. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ రాబోయే రోజుల్లో సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మరింత పారదర్శకంగా సేవలు అందిస్తాం. – జాని పాషా, మనోహర్, బి.శ్వేతా, గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్‌కు సంబంధించి జీఓ విడుదల చేసినందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. చెప్పిన మాట చెప్పినట్లు అమలు చేశారు. లక్షలాది మంది కుటుంబాల్లో సంతోషం నింపినందుకు ధన్యవాదాలు. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు – గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ నేతలు సాయినాథ్‌రెడ్డి, అర్లయ్య, సమీర్ హుస్సేన్, సల్మాన్ బాషా, రాజశేఖర్‌బాబు కాకినాడ మూడో డివిజన్ సురేష్‌నగర్‌లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్న సచివాలయ ఉద్యోగులు మాలో సీఎం ధైర్యాన్ని నింపారు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆశలను నెరవేరుస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతూ ఒకేసారి లక్ష మంది ప్రొబేషన్ ఖరారు చేసినందుకు సీఎం జగన్మోహన్రెడ్డికి, ప్రభుత్వానికి హృదయ పూర్వక ధన్యవాదాలు. – అంజన్‌రెడ్డి, బత్తుల అంకమ్మరావు, బి.ఆర్.ఆర్.కిషోర్, గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్ మరింత ఉత్సాహంగా పని చేస్తాం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అందరి తరఫున ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అర్హులైన కుటుంబాలకు పారదర్శకంగా అందించడంలో కీలక పాత్ర పోషిస్తాం. – గునిపే రాజేష్, షేక్ అబ్దుల్ రజాక్, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం. -
విద్యుత్ ఉద్యోగుల ‘పీఆర్సీ’ గడువు పెంపు
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల ఉద్యోగుల జీతభత్యాలు, అలవెన్సులు, ఇతర ప్రయోజనాలపై అధ్యయనం చేసేందుకు ఏర్పడ్డ పే రివిజన్ కమిషన్(పీఆర్సీ) ఈ నెల 30 వరకూ వినతులు స్వీకరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీసీపీడీసీఎల్) సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఆపరేషన్స్) సర్కిల్ కార్యాలయంలో ఫిబ్రవరి 15 నుంచి వినతులు స్వీకరించడం మొదలెట్టిన పీఆర్సీ.. తొలుత ఫిబ్రవరి నెలాఖరు వరకూ షెడ్యూల్ ఇవ్వగా, అనంతరం ఈ నెల 13 వరకూ గడువు పొడిగించుకుంటూ వచ్చింది. అయినప్పటికీ ఇంకా వినతులు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించి ఈ నెలాఖరు వరకూ అవకాశం కల్పిస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఏపీ ట్రాన్స్ కో, ఏపీ జెన్ కో, మూడు డిస్కంల ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వివిధ యూనియన్ల నుంచి మంగళవారం నుంచి శుక్రవారం వరకూ రోజూ ఉదయం 11 గంటలకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు నేరుగా స్వీకరిస్తారు. అయితే స్వయంగా వెళ్లి వినతులిచ్చే అవకాశం లేనివారి కోసం ఈ–మెయిల్ prc2022 powerutilities@gmail.com, వాట్సప్ నంబర్ 8500676988 సదుపాయాలను కూడా ఈసారి పీఆర్సీ అందుబాటులోకి తెచ్చింది. -
విద్యుత్ పీఆర్సీ ఏడాది వాయిదా !
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులకు కొత్త వేతన సవరణ వాయిదా ఖాయమైంది. ఏప్రిల్ నుంచే కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా, నష్టాల నేపథ్యంలో ఏడాది వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నట్టుగా విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఇప్పటికే సంకేతాలిచ్చాయి. వేతన సవరణ వ్యయభారాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) సైతం 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టారిఫ్ ఉత్తర్వులను ప్రకటించడంతో.. పీఆర్సీ వాయిదాపై స్పష్టత వచ్చింది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు రూ.5,596 కోట్ల మేర చార్జీలను పెంచడానికి ఇటీవల ఈఆర్సీ అనుమతించిన సంగతి తెలిసిందే. విద్యుత్ కొనుగోళ్ల వ్యయం, సరఫరా, పంపిణీ వ్యయం, ఇతర ఖర్చులతోపాటు సిబ్బంది ప్రస్తుత జీతభత్యాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని కొత్త చార్జీలను ఖరారు చేశారు. కొత్త పీఆర్సీ అమలుతో పడే అదనపు భారాన్ని డిస్కంలు కూడా తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)లో ప్రతిపాదించలేదు. మరోవైపు, ప్రస్తుత పీఆర్సీ గడువు గత నెలతో ముగిసినా.. విద్యుత్ సంస్థలు ఇప్పటివరకు కొత్త వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయలేదు. ఉన్న వేతనాలు చెల్లించడానికి సతమతమవుతున్న పరిస్థితుల్లో పీఆర్సీ అమలు పట్ల యాజమాన్యాలు విముఖతతో ఉన్నాయి. 8 ఏళ్లలో 147% పెరుగుదల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లకోసారి వేతన సవరణ అమలు చేస్తుండగా.. విద్యుత్ ఉద్యోగులకు మాత్రం నాలుగేళ్లకోసారే అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే.. విద్యుత్ సిబ్బంది వేతనాలు ఎక్కువే. విద్యుత్ ఉద్యోగుల జీతాలు తమకన్నా ఎక్కువగా ఉన్నాయని పలువురు ఐఏఎస్ అధికారులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తుంటారు. గత రెండు పీఆర్సీలు, డీఏలను కలుపుకొంటే ఎనిమిదేళ్లలో ఏకంగా 147 శాతం వరకు విద్యుత్ ఉద్యోగుల జీతభత్యాలు పెరిగిపోయాయి. భారీ ఫిట్మెంట్తో భారం 2018లో చివరి పీఆర్సీ కమిటీ 27 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేయగా, సీఎం కేసీఆర్ దానిని ఏకంగా 35 శాతానికి పెంచారు. తెలంగాణ వచ్చాక విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయడంలో ఉద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడ్డారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రాన్స్‌కో, జెన్కో, ఉత్తర/దక్షిణ తెలంగాణ డిస్కంలలో 25 వేల మంది ఉద్యోగులు, 22 వేల మంది ఆర్టిజన్లు, 25 వేల మంది పెన్షనర్లు ఉన్నారు. జీతాలు, పెన్షన్లకు విద్యుత్ సంస్థలు ప్రతి నెలా రూ.600 కోట్ల చొప్పున ఏటా రూ.7,200 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఈ సమయంలో భారీ ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వడంతో విద్యుత్ సంస్థలపై ఆర్థిక భారం బాగా పెరిగింది. వ్యయంతో పోల్చితే ఆదాయం తగ్గి నష్టాలు పేరుకుపోతుండటంతో.. ప్రస్తుతం పీఆర్సీ అమలు సాధ్యం కాదని యాజమాన్యాలు భావిస్తున్నాయి. -
పీఆర్సీకి చట్టబద్ధత లేదు
సాక్షి, అమరావతి: వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ)కు ఎలాంటి చట్టబద్ధత లేదని, అది సిఫారసులు మాత్రమే చేయగలదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. పీఆర్సీ నివేదికను ఆమోదించాలా? తిరస్కరించాలా? అన్నది ప్రభుత్వ విచక్షణ అని వివరించింది. ఏ ఉద్యోగి జీతం నుంచి ఎలాంటి మొత్తాలను రికవరీ చేయలేదని, జీతాలను తగ్గించలేదని తెలిపింది. ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు 30 శాతం హెచ్ఆర్ఏను ప్రతి ఏడాది పొడిగిస్తున్నామని, ఇది తాత్కాలిక నిర్ణయమని చెప్పింది. హెచ్ఆర్ఏ పెంపు పూర్తిగా ప్రభుత్వ విధాన, కార్యనిర్వాహక నిర్ణయమని చెప్పింది. 30 శాతం హెచ్ఆర్ఏ కొనసాగించాలని కోరడం సమర్థనీ యం కాదంది. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ప్రజలందరికీ అందుబాటులో ఉంచినట్లు తెలి పింది. 11వ వేతన సవరణ కమిషన్ చేసిన 18 కీలక సిఫారసుల్లో 11 సిఫారసులను పూర్తిగా, ఐదింటిని సవరణలతో కార్యదర్శుల కమిటీ ఆమోదించిందని వివరించింది. రెండింటిని మాత్రమే ఆమోదించలేదని చెప్పింది. కార్యదర్శుల కమిటీ సిఫారసులను యథాతథంగా ఆమోదించామంది. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం – ఉద్యోగుల మధ్య వివాదం సమసినందున జీవో 1పై దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టివేయాలని కోరింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ బుధవారం కౌంటర్ దాఖలు చేశారు. వేతన సవరణపై ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏపీ గెజిటెడ్ అధికారుల జేఏసీ చైర్మన్ కేవీ కృష్ణయ్య దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం విచారణ జరుపుతోంది. కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు అవకాశమివ్వాలని పిటిషనర్ న్యాయవాది పదిరి రవితేజ కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 6కి వాయిదా వేసింది. కేంద్ర వేతన సవరణ కమిషన్ సైతం హెచ్ఆర్ఏను సవరించింది వేతన సవరణపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం పలుమార్లు చర్చలు జరిపిందని, ప్రభుత్వానిది ఏకపక్ష నిర్ణయం కాదని రావత్ ఆ కౌంటర్లో పేర్కొన్నారు. వేతన సవరణ ఉత్తర్వులు 2018 నుంచి అమలు చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర విభజన తరువాత 2015 పీఆర్సీని ప్రభుత్వం ఏపీ పునర్విభజన చట్ట నిబంధనలకు అనుగుణంగా అమలు చేసిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న విధంగానే 30 శాతం హెచ్ఆర్ఏ, సీసీఏ ఇస్తున్నట్లు చెప్పారు. వేతన సవరణ తరువాత హెచ్ఆర్ఏ సవరణ సర్వ సాధారణమన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6వ వేతన సవరణ కమిషన్ 50 లక్షలకు పైబడిన జనాభా ఉన్న నగరాల్లో హెచ్ఆర్ఏను 30 శాతం, 50 లక్షల వరకు ఉన్న చోట 20 శాతం, 5 లక్షలకు లోబడి ఉన్న చోట 10 శాతం సిఫారసు చేసిందన్నారు. 7వ వేతన సవరణ కమిటీ హెచ్ఆర్ఏను 24 శాతం, 16 శాతం, 8 శాతానికి సవరించిందని వివరించారు. కేంద్ర వేతన సవరణ కమిషన్ సవరణలను ప్రభుత్వం అనుసరించిందని తెలిపారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే ఐఆర్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) నిర్ణయించామన్నారు. పే అండ్ డీఏ బకాయిలకన్నా ఎక్కువ మధ్యంతర భృతి పొందుతున్న వారి నుంచి ఆ మొత్తాన్ని భవిష్యత్తులో డీఏ బకాయిల్లో సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. కమిషన్ సిఫారసులకు మించి ఉద్యోగులకు ఎక్కువ లబ్ధి చేకూర్చినట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆధారంగా వేతన సవరణ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ వేతన సవరణపై చర్చల అనంతరం ఉద్యోగ సంఘాలు సమ్మె విరమించాయని చెప్పారు. హెచ్ఆర్ఏను 24 శాతంగా నిర్ణయించి, గరిష్టంగా రూ.25 వేలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. -
ప్రభుత్వోద్యోగులకు ఏపీ సర్కార్ మరో తీపికబురు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు సర్కారు మరో తీపికబురు చెప్పింది. 11వ పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) సిఫార్సుల ఆధారంగా పిల్లల దత్తత, పిల్లల సంరక్షణ, వికలాంగులకు స్పెషల్ క్యాజువల్ సెలవులు, పలు వ్యాధులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షమీర్ సింగ్ రావత్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ జీఓ ప్రకారం ఉద్యోగులకు లభించే ప్రయోజనాలివీ.. ► పిల్లలను దత్తత తీసుకున్న ఉద్యోగి 180 రోజుల వరకూ సెలవు తీసుకోవచ్చు. సెలవు రోజులకు కూడా పూర్తి జీతం పొందొచ్చు. అలాగే, ఈ సెలవులను ఇతర సెలవులతో కలిపి కూడా ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. దత్తత శిశువు వయసు నెలరోజుల్లోపు ఉంటే ఏడాది వరకూ కూడా సెలవు ఇస్తారు. బిడ్డ వయసు ఆరు నెలల నుంచి ఏడు నెలలలోపు ఉంటే ఆరు నెలలు సెలవు తీసుకోవచ్చు. తొమ్మిది నెలలు, ఆ పైన వయస్సుంటే మూడు నెలలు సెలవు దొరుకుతుంది. ఇవన్నీ ఇతర సెలవులకు అదనంగా వస్తాయి. అయితే, దత్తత తీసుకునే వారికి అప్పటికే ఇద్దరు పిల్లలుంటే ఇవేవీ వర్తించవు. ► పిల్లల సంరక్షణ సెలవులను 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచుతూ పీఆర్సీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి తన సర్వీసు కాలంలో ఎప్పుడైనా ఈ సెలవులను వినియోగించుకోవచ్చు. ఈ అవకాశం ఒంటరి (అవివాహితుడు, విడాకులు పొందిన వారు, భార్య చనిపోయిన వారు) పురుషులకూ వర్తిస్తుంది. ► వికలాంగులైన ఉద్యోగులు తమ కృత్రిమ అవయవాలను మార్చుకునేందుకు ఏటా ఏడు రోజుల పాటు స్పెషల్ క్యాజువల్ సెలవులను పొందవచ్చు. హైరిస్క్ వార్డుల్లో పనిచేసే నర్సింగ్ ఉద్యోగులు కూడా ఈ సెలవులు తీసుకోవచ్చు. ► ఇక ప్రాణాంతక వ్యాధులకు చికిత్స పొందుతున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. బేసిక్ పే లిమిట్ రూ.35,570గా ఉన్న నాన్ గెజిటెడ్ ఉద్యోగులు రూ.11,560 నుంచి, రూ.17,780 వరకూ, లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయిస్ రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ ప్రతినెలా పొందవచ్చు. అలాగే, ఆర్జిత సెలవులు, సగం జీతం సెలవులు ముగిసిన తరువాత కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ సెలవులు తీసుకోవచ్చు. -
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీ అమలు జీవో విడుదల
-
AP: పీఆర్సీ సవరణ జీవోలు విడుదల
సాక్షి, అమరావతి: ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పీఆర్సీ అమలుకు సంబంధించి సవరించిన జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. మంత్రుల కమిటీతో జరిగిన చర్చల్లో ఉద్యోగ సంఘాలు చేసుకున్న ఒప్పందం ప్రకారం హెచ్ఆర్ఏ, సీసీఏ, పెన్షనర్ల అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌లో మార్పులు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఆదివారం ఐదు వేర్వేరు జీవోలు జారీ చేశారు. ఇంటి అద్దె అలవెన్స్‌ల శ్లాబులను 10, 12, 16, 24 శాతానికి సవరిస్తూ తాజా ఉత్తర్వులు ఇచ్చారు. పెన్షనర్లకు అదనపు పెన్షన్‌ను 70 సంవత్సరాల నుంచే ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత జీవోల్లో రద్దు చేసిన సీసీఏ (సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్)ను మంజూరు చేశారు. తాజా జీవోలన్నీ ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చర్చల్లో అంగీకారం మేరకు మార్పులు 11వ పీఆర్సీ ప్రకారం 2022 పే స్కేల్స్ అమలుకు సంబంధించి గత నెలలో ప్రభుత్వం ఇచ్చిన ఉత్త్వర్వులపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో వారు లేవనెత్తిన అంశాలను ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం మంత్రుల కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కూడిన ఈ కమిటీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యులుగా ఉన్న ఉద్యోగ సంఘాల నేతలతో రెండు రోజులపాటు విస్తృతంగా చర్చలు జరిపింది. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ ఉద్యోగులకు ఇంకా ప్రయోజనాలు చేకూర్చాలని సీఎం ఆలోచిస్తున్నా, చేయలేని పరిస్థితి ఉందని ఈ కమిటీ ఉద్యోగ సంఘాలకు క్షుణ్ణంగా వివరించింది. ఉద్యోగ సంఘాల నేతలు లేవనెత్తిన ప్రతి అంశాన్ని చర్చించింది. ఉద్యోగులకు మేలు జరిగేలా హెచ్ఆర్ఏ శ్లాబులు, సీసీఏ పునరుద్ధరణ, అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌లో ప్రభుత్వానికి పలు మార్పులు చేయాలని సూచించింది. సీఎం జగన్ ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. వీటిపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉద్యోగ సంఘాల నాయకులు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత సీఎం వైఎస్ జగన్ ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై ఉద్యోగులకు ఇంకా ఎక్కువ మేలు చేయాలని ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల కారణంగా చేయలేని పరిస్థితి ఉందని, ఈ ప్రతిపాదనలకు ఒప్పుకున్నందుకు వారిని అభినందించారు. ఈ నేపథ్యంలో 11వ పీఆర్సీ అమలుకు సంబంధించి సవరించిన జీవోలు జారీ అయ్యాయి. మార్పుల అమలు ఇలా.. కొత్త పీఆర్సీ ప్రకారం ఇప్పటికే జీతాలు చెల్లించడంతో ఈ సవరణల ఆధారంగా ఉద్యోగుల జీతాల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్లు ఇచ్చే నోటిఫికేషన్ ప్రకారం ఆ పట్టణాలు, నగరాల్లోని 8 కిలోమీటర్ల పరిధి వరకు సవరించిన హెచ్ఆర్ఏ రేట్లు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతోపాటు స్థానిక సంస్థలు, ఎయిడెడ్ సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్ సంస్థలకు సవరించిన హెచ్ఆర్ఏ రేట్లు వర్తిస్తాయని పేర్కొన్నారు. సచివాలయ, హెచ్ఓడీ కార్యాలయ ఉద్యోగులకు 2024 జూన్ వరకు సవరించిన హెచ్ఆర్ఏ అమలవుతుందని స్పష్టం చేశారు. సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాలు, విశాఖ, విజయవాడ నగరాలు, 11 మున్సిపల్ కార్పొరేషన్లలో సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్ (సీసీఏ)ను పునరుద్ధరించింది. ఇది 2022 జనవరి 1 నుంచి అమలవుతుంది. 70 ఏళ్లు దాటిన వారికి 7 శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 12 శాతం, 80 ఏళ్లు పైన 20 శాతం, 85 ఏళ్లు దాటితే 25 శాతం, 90 ఏళ్లు దాటితే 30 శాతం, 95 ఏళ్లు దాటితే 35 శాతం, 100 ఏళ్లు దాటితే 50 శాతం అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. మానిటరీ బెనిఫిట్స్ 2020 ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తాయి. -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
సాక్షి, నెట్వర్క్: పీఆర్సీని వర్తింపజేసి జీతాలు పెరిగేలా చేయడంతో మినిమమ్ టైం స్కేల్(ఎంటీఎస్) ఉపాధ్యాయులు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలోని పలు జిల్లా కలెక్టరేట్ల ఎదుట బుధవారం ర్యాలీలు, సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆ జిల్లాలో పనిచేస్తోన్న ఎంటీఎస్ ఉద్యోగులందరూ సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎంటీఎస్ ఉద్యోగుల సమన్వయ సంఘం నాయకుడు షేక్ పాషావలి మాట్లాడుతూ 6 నెలల క్రితం తమను ఎంటీఎస్ కింద ఉపాధ్యాయులుగా నియమించి రూ.21,230 జీతం కేటాయించారని, తాము అడగకుండానే సీఎం వైఎస్ జగన్ 11వ పీఆర్సీని వర్తింపజేశారని, తద్వారా జీతం రూ.11 వేలకుపైగా పెరిగి రూ.32,670కు చేరిందన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎంటీఎస్ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఏపీ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఏలూరు కలెక్టరేట్ వద్ద సీఎం ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. విశాఖ కలెక్టరేట్ ఎదుట ఎంటీఎస్ ఉపాధ్యాయులు ప్రదర్శన నిర్వహించగా, గుంటూరు కలెక్టరేట్ వద్ద క్షీరాభిషేం చేశారు. -
ఫోన్ వచ్చింది.. మాట మారింది
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ సంఘాల పేరుతో జరుగుతున్న ఆందోళనల వెనుక బయట శక్తుల ప్రమేయం ఉన్నట్లు పీఆర్సీ సాధన సమితి స్పష్టం చేసింది. వారి వెనుక రాజకీయ అజెండా దాగుందని, ఆ సంఘాలపై కొందరు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నారని వెల్లడించింది. ఫిట్మెంట్ మినహా మిగిలిన పీఆర్సీ అంశాలన్నీ సానుకూలంగా ఉన్నాయని ఒప్పుకున్నాక ముగ్గురు ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఫోన్లు రావడంతో మాట మార్చారని బహిర్గతం చేసింది. పీఆర్సీ అంశంపై తమకు వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారం, కొందరి ప్రోద్బలంతో జరుగుతున్న ఆందోళనలపై ఉద్యోగ సంఘాల నేతలు బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో ఏపీటీఎఫ్, ఎస్టీయూ అధ్యక్షులు మాట్లాడిన వీడియోను విడుదల చేశారు. సీఎంతో జరిగిన సమావేశంలో సమ్మె విరమణకు అంగీకరిస్తున్నామని తెలియచేసి బయటకు వచ్చాక ఉపాధ్యాయ సంఘాల నేతలు మాట మారుస్తున్నారని తెలిపారు. ఫోన్లు రావడంతో వెళ్లిపోయారు: వెంకట్రామిరెడ్డి ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీతో చర్చల సందర్భంగా ఫిట్మెంట్ మినహా మిగిలిన అన్ని అంశాలపై సానుకూల నిర్ణయాలు వచ్చాయని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి తెలిపారు. హెచ్ఆర్ఏను దాదాపు తెలంగాణతో సమానంగా సాధించామన్నారు. కొంతమంది ప్రతి అంశంలోనూ చర్చల్లో పాల్గొని ఇప్పుడు తమను మాట్లాడనివ్వలేదని ఆరోపించడం సరికాదన్నారు. ఫిట్మెంట్ వారికి ప్రధాన అంశమైనప్పుడు మిగతా అంశాలపై చర్చల్లో ఎందుకు పాల్గొన్నారని ప్రశ్నించారు. మంత్రుల కమిటీతో చర్చలు ముగిసిన తర్వాత జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఫిట్మెంట్ మినహా అన్నీ బాగా జరిగాయని వారే అన్నారని గుర్తు చేశారు. సమ్మె విరమిద్దామంటే సరేనన్నారని చెప్పారు. ఒకరిద్దరు ప్రెస్మీట్లో కూర్చుని ఫోన్లు రావడంతో వెళ్లిపోయారని తెలిపారు. దీన్నిబట్టి ఎవరు, ఎవరి వల్ల ప్రభావితమవుతున్నారో ఉపాధ్యాయులు గుర్తించాలని కోరారు. కొందరికి సమ్మె జరగలేదనే అసంతృప్తి ఉందని, వారే రకరకాల ప్రచారాలు చేయిస్తున్నారని తెలిపారు. బాధ్యత గల ఉద్యోగులైతే మా శవయాత్రలు చేస్తారా? అని ప్రశ్నించారు. తమపై దుష్ప్రచారాలు, ట్రోలింగ్లు చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. ఒప్పుకున్నాక ఫోన్లు చేసిందెవరు?: బొప్పరాజు హెచ్ఆర్ఏ, అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను తామే సాధించామని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెప్పుకుంటున్నారని, అదే సమయంలో చర్చల్లో తమను మాట్లాడనీయడంలేదని చెబుతున్నారని, దీన్నిబట్టే వారు ఎంత గందరగోళంలో ఉన్నారో తెలుస్తోందని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్టీరింగ్ కమిటీ మినిట్స్ చూస్తే ఎంత పారదర్శకంగా చర్చలు జరిపామో తెలుస్తుందని స్పష్టం చేస్తూ ఆ పుస్తకాన్ని చూపారు. హెచ్ఆర్ఏ, సీసీఏ తామే సాధించామని చెప్పుకుంటున్నప్పుడు వారిని మాట్లాడకుండా ఆపిందెవరని ప్రశ్నించారు. అన్నీ ఒప్పుకున్నాక ఎవరి నుంచి ఒత్తిడి వచ్చింది? ఎవరి నుంచి వారికి ఫోన్లు వచ్చాయో చెప్పాలన్నారు. తమతోపాటు ప్రెస్‌మీట్‌కు వస్తూ మధ్యలో ఫోన్ మాట్లాడుతూ హృదయరాజు వెళ్లిపోయారని వెల్లడించారు. చర్చలు పూర్తయ్యాక ఉపాధ్యాయ సంఘాల నాయకులపై ఒత్తిడి వచ్చిందని, ఈ విషయాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు గుర్తించాలన్నారు. సంతకాలు చేసి బయటకు వెళ్లాక మాట మార్చారన్నారు. ప్రతి విషయాన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించే నిర్ణయాలు తీసుకుంటామని స్వయంగా సీఎం చెప్పారన్నారు. సానుకూల వాతావరణం ఏర్పడిన తర్వాత రాజకీయ అజెండాలతో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై కొందరు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. ఉపాధ్యాయులను ఒత్తిడి చేయవద్దని వారి వెనుక ఉన్న పెద్దలను కోరుతున్నానన్నారు. ఉద్యోగులతో సంబంధం లేదని శక్తులు ఇందులో జొరబడుతున్నాయన్నారు. ఐక్య ఉద్యమాల్లో పని చేసినప్పుడు ఏది జరిగినా సమష్టి బాధ్యత తీసుకోవాలన్నారు. ఇతరులపై నిందలు మోపడం ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఎవరు నేర్పారని ప్రశ్నించారు. ప్రతి ఉద్యోగికీ లాభమే: బండి కొందరు ఉపాధ్యాయులు తమ ఫొటోలకు దండలు వేయడం, శ్రద్ధాంజలి ఘటించడం, దహన సంస్కారాలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సరికాదని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు సూచించారు. తమ కుటుంబ సభ్యుల్ని కూడా బూతులు తిట్టడం ఏమిటని ప్రశ్నించారు. ప్రతి ఉద్యోగికి జీతంలో రూ.6 నుంచి రూ.7 వేల నష్టాన్ని నివారించి రూ.6 నుంచి రూ.8 వేల లాభం వచ్చేలా చేశామన్నారు. తాము ఏమీ చేయలేదనడం సరికాదన్నారు. తాము ప్రభుత్వానికి అమ్ముడు పోలేదని చెప్పారు. తాము ఉద్యోగులకే విశ్వాసంగా ఉన్నామని తెలిపారు. చేతిలో సెల్‌ఫోన్ ఉందని ఇష్టం వచ్చిన్లు ట్రోల్ చేయడం మర్యాద కాదన్నారు. తమపై చెడుగా ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయుల ముసుగులో ఇదంతా ఎవరు చేస్తున్నారో తేల్చాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు పోరాటం చేసి ఎక్కువ ఫిట్మెంట్ సాధిస్తే వారి కాళ్లకు దండం పెడతామన్నారు. అంత జనాభా లేకున్నా సాధించాం: సూర్యనారాయణ ఉద్యోగులతో సంబంధం లేనివారు తమ నలుగురిని దోషులుగా చిత్రీకరిస్తూ సొంత అజెండాతో వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ చెప్పారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలాంటి చర్యలకు పాల్పడరని భావిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ అంత జనాభా లేకపోయినా వెలగపూడికి 24 శాతం హెచ్ఆర్ఏ సాధించటాన్ని బట్టి పెరిగినట్లా.. తగ్గినట్లా? అనేది ఉద్యోగులు ఆలోచించాలన్నారు. పదేళ్లకు ఒకసారి వేతన సవరణ చేయాలని విధానపరంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఐదేళ్లకు వెనక్కి తీసుకురావడం గొప్ప విజయమన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర అనుబంధ ఉద్యోగులకు తమతోపాటు పీఆర్సీ అమలు చేసేలా చేయడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. సీఎంతో సమావేశంలో టీచర్ల సంఘాల నేతలు ఏమన్నారంటే రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలను చాలా భేషుగ్గా అమలు చేస్తున్నారనేది వాస్తవం సర్. అమ్మఒడి, ఆసరా లాంటి సంక్షేమ పథకాలు లేనివారు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు. మీకు ఏదైనా అవకాశం ఉంటే ఈ ఐదు సంవత్సరాలే మా వర్గానికి చేసే అవకాశం ఉంటుంది. పీఆర్సీ అమలులో ఒక్కొక్కసారి ఒక్కో జీవోలో కొంతమందిని విస్తరిస్తున్నారు. పబ్లిక్ సెక్టార్‌కు, గురుకుల టీచర్లకు వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఇచ్చారు. గత సంవత్సరం ఇవ్వలేదు. ఇవ్వని కారణంగా 5 సంవత్సరాల నుంచి ఆలస్యమవుతోంది. వాళ్ల బడ్జెట్లో, వాళ్ల బోర్డుకి సంబంధించి ఇచ్చే జీవోలోనే ఇవ్వాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇప్పుడు ఇచ్చే జీవోలోనే అందరు ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసేలా చూడాలి. అశోతోష్ మిశ్రా కమిటీ నివేదిక బయటకు రాకపోతే చాలా అంశాల్లో మాస్టర్ స్కేల్స్ లాంటివి బయటకురావు. అవి బయటకు వస్తేనే కొన్ని అంశాల్లో ముందుకుపోయే పరిస్థితి ఉంటుంది. అదనపు పెన్షన్ అలాగే ఉండేలా చూడాలి. హెచ్ఆర్ఏ, సీసీఏ కొత్తగా ఇవ్వకపోయినా, అలాగే ఉంచినా సరిపోతుంది. ఫిట్‌మెంట్‌పై మీరే ఆలోచన చేసి చేయాలని కోరుకుంటున్నాను. అనామలిస్ కమిటీ మీ ద్వారానే వేయాలని కోరుతున్నా. – హృదయరాజు, ఏపీటీఎఫ్ నేత సీఎంతో నాటి సమావేశంలో టీచర్ల సంఘం నేత ఏమన్నారంటే.. (వీడియో సాక్ష్యంతో) స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎన్నడూలేని సంస్కరణలు విద్యాశాఖలో తీసుకొచ్చిన సీఎంకు మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు స్వయంగా పరిశీలించి విద్యార్థులకు షూలు, యూనిఫామ్స్, బ్యాగ్‌తో సహా ఇస్తూ విద్యాభివృద్ధిని ఎంతో ముందుకు తీసుకువెళుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మావి 2 సమస్యలున్నాయి. సర్వీసు రూల్స్ లేకపోవడంతో ఒక ఉపాధ్యాయుడు చేరిన దగ్గర నుంచి 35, 40 సంవత్సరాలు ఒకే సర్వీసులో రిటైర్ అవుతున్నారు. మీరు తప్పనిసరిగా విద్యా శాఖ సర్వీసు రూల్సు రూపొందించి పదోన్నతులకు శ్రీకారం చుట్టాలి. ప్రతి సంవత్సరం సాధారణ బదిలీలు చేయాలి సర్. మాకు బల్క్‌గా సాధారణ బదిలీలు ఇస్తే బాగుంటుంది. పీఆర్సీ, ఫిట్‌మెంట్‌పై మా అందరికీ న్యాయం చేస్తారని తెలియజేస్తున్నా. ధన్యవాదాలు సర్.. – ఎస్టీయూ నేత జోసెఫ్ సుధీర్‌బాబు -
AP: ఉపాధ్యాయ సంఘాల బండారం బయటపెట్టిన పీఆర్సీ స్టీరింగ్ కమిటీ
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ సంఘాల బండారం పీఆర్సీ స్టీరింగ్ కమిటీ బయటపెట్టింది. హెచ్ఆర్ఏ విషయంలో తెలంగాణకు సమానంగా తెచ్చుకున్నామని.. పీఆర్సీ ఐదేళ్లకు ఒకసారి ఇచ్చేలా చూశామని పీఆర్సీ జేఏసీ నేతలు అన్నారు. అదనపు పెన్షన్, సీసీఏ కూడా వచ్చిందన్నారు. చదవండి: ఆంధ్రప్రదేశ్ కోణంలో ఇది చెత్త బడ్జెట్: విజయసాయిరెడ్డి ‘‘ఉపాధ్యాయ సంఘాలు ప్రతి అంశంలో చర్చల్లో పాల్గొన్నాయి. అప్పుడే ఉపాధ్యాయ సంఘాలు చర్చల నుంచి బయటకు రావాల్సింది. ఫిట్‌మెంట్‌పై అప్పుడే బయటకు వచ్చి చెప్పాల్సింది. సమ్మె విరమించుకుందామని కూడా ఉపాధ్యాయ సంఘాలు చెప్పాయి. ఉపాధ్యాయుల ఆందోళనలో వేరే శక్తులు ఉన్నాయని’’ పీఆర్సీ జేఏసీ నేతలు అన్నారు. ఉపాధ్యాయ ముసుగులో దుష్ఫ్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నిర్ణయంలోనూ 20 మంది అభిప్రాయం మేరకే ముందుకెళ్లామన్నారు. మెరుగైన ప్రయోజనం వచ్చింది కాబట్టే సమ్మె విరమించామన్నారు. ఉపాధ్యాయ సంఘాలు మంత్రులు పక్కన కూర్చుని మాట్లాడలేదా? గ్రాట్యుటీ, ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై చర్చ జరిగినప్పుడు మీకు తెలియదా?. అన్నింటికీ ఒప్పుకుని ఇప్పుడు ఇలా మాట్లాడతారా అంటూ ఉపాధ్యాయ సంఘాలను పీఆర్సీ జేఏసీ నేతలు నిలదీశారు. -
పీఆర్సీపై ప్రభుత్వ వైఖరి సరైనదే
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సంతోషాన్ని నింపుతోందని, ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పష్టం చేసింది. పీఆర్సీ కాలపరిమితిని పదేళ్ల నుంచి ఐదేళ్లకు కుదించటం, ఐఆర్ రికవరీ నిబంధన తొలగింపు, హెచ్ఆర్ఏ పెంపు వంటి నిర్ణయాలు తీసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి, మంత్రుల కమిటీకి అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది. మంగళవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో అసోసియేషన్ సమావేశం జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడు కేవీ రమణ మాట్లాడుతూ.. పీఆర్సీ విషయంలో ఉద్యోగుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఎంతమేరకు చేయాలో అంతవరకూ చేసిందన్నారు. బంద్‌లు, సమ్మెలు చేస్తే ఎక్కువగా నష్టపోయేది బడుగు, బలహీన వర్గాలేనని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నమ్ముతున్నామన్నారు. అవకాశం ఉన్నంత మేరకు ఉద్యోగులకు భవిష్యత్‌లో కూడా మంచి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రుల కమిటీ చెప్పిన మాటను విశ్వసిస్తున్నామన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సునిల్‌కుమార్ మాట్లాడుతూ.. 23 శాతం ఫిట్‌మెంట్‌ను తమ అసోసియేషన్ స్వాగతిస్తోందన్నారు. అమరావతి ఏరియా అధ్యక్షుడు సుధాకర్, కృష్ణా జిల్లా కార్యదర్శి రాఘవ, ఉపాధ్యక్షుడు శశిభూషణ్, అసోసియేషన్ నేతలు ఎం.రాఘవులు, యు.నవీన్, డాక్టర్ నాగరాజు, కె.రమణ, కొత్తపల్లి వెంకటరమణ పాల్గొన్నారు. -
పీఆర్సీపై హర్షాతిరేకాలు
ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వం జరిపిన చర్చల్లో మెరుగైన పీఆర్సీ ప్రకటించడాన్ని హర్షిస్తూ రాష్ట్ర వైఎస్సార్‌టీయూ అనుబంధ జీవీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అదనపు ప్రధాన కార్యదర్శి గొండు సీతారాం మాట్లాడుతూ.. ఊరటనిచ్చేలా పీఆర్సీ ఇవ్వడం, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ఐదు డీఏలు ఒకేసారి చెల్లింపునకు అంగీకారం తెలపడం హర్షణీయమన్నారు. పీఆర్సీ పాత పద్ధతిలో ఐదేళ్లకోసారి అమలుకు అంగీకరించటం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వీలైనంత ఆర్థిక లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకోవడం, కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసుల రెగ్యులరైజేషన్, హెచ్ఆర్ఏ అంశాలు, పెన్షనర్లకు అదనపు క్వాంటం, సీపీఎస్ పునరుద్ధరణకు రూట్ మ్యాప్, పూర్తిస్థాయిలో హెల్త్ కార్డులు స్ట్రీమ్ లైన్లోకి తీసుకురావడం, కోవిడ్‌తో మరణించిన ఉద్యోగుల వారసులకు వీలైనంత త్వరితగతిన ఉద్యోగాలు కల్పించడం, పెన్షనర్లు ఎదురుచూస్తున్న మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను పొడిగించేందుకు అంగీకరించడం, పీఆర్సీ రిలేటెడ్ 9, ఇతర 4 అంశాలు తదితర డిమాండ్లపై ప్రభుత్వం నుంచి అనుకూల సంకేతాలు రావడం శుభపరిణామం అన్నారు, మంత్రివర్గ ఉప సంఘం, చీఫ్ సెక్రటరీతో జరిగిన చర్చల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అంగీకార సంతకాలు చేసి బయటకొచ్చి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు డి.పోలరావు, ఎల్లయ్య, బి.తాతారావు, వెంకునాయుడు, సత్యం, పి.ఎల్లారావు, కె.రామునాయుడు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. -
రామోజీరావుకు ముద్దుబిడ్డ... చంద్రబాబు దత్తపుత్రుడు
-
సద్దుమణిగితే సహించలేరా?
సాక్షి, అమరావతి: ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకుని ప్రభుత్వం సకాలంలో సమస్యలు పరిష్కరించడాన్ని టీడీపీ, వామపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఉద్యోగులు సమ్మె చేయకపోవడం వల్ల రాజకీయంగా పేలాలు ఏరుకోలేకపోయామనే దుగ్ధతో విపక్షాలు నిస్పృహలో కూరుకుపోయాయన్నారు. మంత్రుల కమిటీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి సంతకాలు చేసి సమ్మెను స్వచ్ఛందంగా విరమించుకుంటున్నట్లు పీఆర్సీ సాధన సమితి ప్రకటించిందని గుర్తు చేశారు. వామపక్షాలకు అనుబంధంగా వ్యవహరించే ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆ ప్రతిపాదనలకు తాము అంగీకరించడం లేదని, దశలవారీగా సమ్మె చేస్తామని చెప్పడం సబబు కాదన్నారు. చర్చలకు ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఉపాధ్యాయ సంఘాల నేతలకు సూచించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అధికారం నుంచి దించి చంద్రబాబును పీఠంపై కూర్చోబెట్టేందుకు తాపత్రయపడుతున్న ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ 5 లాంటి టీడీపీ అనుకూల మీడియా లేని సమస్యను ఉన్నట్లు చిత్రీకరిస్తోందని మండిపడ్డారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్థిక పరిస్థితి వల్లే.. రాష్ట్ర సొంత ఆదాయం రూ.85 వేల కోట్లకు బదులు కోవిడ్‌తో రూ.62 వేల కోట్లకు తగ్గిపోయింది. మరోవైపు ఉద్యోగుల వేతనాల వ్యయమే రూ.70 వేల కోట్లు (111 శాతం) దాటిపోయింది. అందువల్ల ఇంతకంటే చేయలేని నిస్సహాయత. పేదల సంక్షేమానికి నేరుగా నగదు బదిలీతో మేలు చేకూరుస్తున్నాం. సంక్షేమ పథకాలకు వ్యయం చేయడం తప్పా? దుబారానా? ధైర్యం ఉంటే చెప్పండి? ఫిట్మెంట్ 30 శాతానికిపైగా ఇవ్వాలనుకున్నా కానీ ప్రస్తుతం పరిస్థితులు అందుకు తగ్గట్టుగా లేవు. సమంజసమేనా? అన్ని సంఘాలు సమ్మె విరమించుకుంటున్నామని ప్రకటించాక వామపక్షాలకు అనుబంధంగా ఉండే ఉపాధ్యాయ సంఘాలు 27 శాతం ఫిట్మెంట్, 12 శాతం హెచ్ఆర్ఏ కావాలని కోరడం సమంజసమేనా? ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారంటూ టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది. 3.10 లక్షల మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి గత సర్కారు ఏటా రూ.1,198 కోట్లు వెచ్చిస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.3,187 కోట్లకు పెరిగింది. కేరళలో హెచ్ఆర్ఏ ఎంత? కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి మినిమమ్ టైమ్ స్కేల్‌ను ఇప్పటికే అమలు చేస్తున్నాం. సీపీఎస్ రద్దుకు రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని చెప్పాక కూడా కొందరు ఉద్యమం చేస్తామనడంలో అర్ధ రహితం. వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళలో హెచ్ఆర్ఏ ఎంత శాతం ఉంది? కేరళలో ఇస్తున్న హెచ్ఆర్ఏ కేవలం 4–6–8 శాతం మాత్రమే. తెలుగు రాష్ట్రాలే ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఎక్కువ ఇస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలి. బెదిరింపులు.. బాబు లక్షణమే ఉద్యోగులను ఎందుకు బెదిరిస్తాం? మాకెందుకు అంత అవసరం? బెదిరించింది ఎవరు? బెదిరేవాళ్లు ఎవరు? అవన్నీ చంద్రబాబు లక్షణాలే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నçప్పుడు ఉద్యోగులను ఏవిధంగా బెదిరించారో అందరికి తెలిసిందే. బాలిక చనిపోతే స్పందనేది పవన్? ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఆధిపత్య ధోరణితో వ్యవహరించిందంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేయడం విడ్డూరం. విజయవాడలో టీడీపీ నాయకుడు వినోద్ జైన్ లైంగిక వేధింపులకు తాళలేక ఓ బాలిక చనిపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? సమ్మె జరగలేదనే బాధ, దుగ్ధ, టీడీపీకి ఉపయోగపడలేదనే ఆక్రోశంతో ఆయన అలా మాట్లాడుతున్నట్లున్నారు. అభివృద్ధికే వెచ్చిస్తాం అమరావతి భూములను చంద్రబాబు సర్కారు ఏకంగా విక్రయించాలనే చూసింది. మేం అవసరం కోసం వినియోగిస్తూ వచ్చిన నిధులతో అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఏది మేలు అనేది వాళ్లే ఆలోచించుకోవాలి. గుడివాడలో జరిగిన సంక్రాంతి కార్యక్రమాలను టీడీపీ ఎంపీలు పార్లమెంట్ వరకూ తీసుకెళ్లడం హాస్యాస్పదం. -
‘కొందరు ఉద్యోగులు రాజకీయ పార్టీలతో కలవడం దురదృష్టకరం’
-
‘కొందరు ఉద్యోగులు రాజకీయ పార్టీలతో కలవడం దురదృష్టకరం’
సాక్షి, అమరావతి: సమ్మె వరకూ వెళ్లకుండా సమస్యను పరిష్కరించామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఉద్యోగ సంఘాలతో తరచూ చర్చలు జరిపామన్నారు. చదవండి: వైఎస్సార్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు అస్వస్థత ‘‘ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా వారికి న్యాయం చేశాం. ఉన్నంతలో ఉద్యోగులకు మంచి చేశాం. కొందరు ఉద్యోగులు రాజకీయ పార్టీలతో కలవడం దురదృష్టకరం. పీఆర్సీ సాధన సమితిలో ఉపాధ్యాయ సంఘాలూ భాగమే. మంత్రుల కమిటీ ప్రతిపాదనలకు ఉపాధ్యాయ సంఘాలు సరేనన్నారు. తర్వాత బయటకెళ్లి సంతృప్తిగా లేదనడం సరికాదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. -
AP: పీఆర్సీ జీవో అంశాలు.. తాజా మార్పులు ఇలా..
సాక్షి, అమరావతి: ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పీఆర్సీ, దానికి సంబంధించిన పలు అంశాల్లో ప్రభుత్వం రెండ్రోజులపాటు ఆయా ఉద్యోగ సంఘాలతో సుదీర్ఘంగా చర్చలు జరిపి మార్పులు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో ఆదివారం జరిగిన మర్యాదపూర్వక భేటీలో ఉద్యోగులకు ఎంతో భరోసా కల్పించారు. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలూ హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. గత నెలలో ఇచ్చిన జీఓల ప్రకారం ఉద్యోగులకు కలిగే లబ్ధి ఎలా ఉంది.. సీఎం వైఎస్ జగన్ ఆమోదంతో తాజాగా చేసిన మార్పులు తర్వాత ఎలా ఉందంటే.. గత నెలలో పీఆర్సీ జీఓ ప్రకారం.. ► 23 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని నిర్ణయించారు. హెచ్ఆర్ఏ శ్లాబులు.. ► 50 లక్షల జనాభా దాటితే : 24 శాతం ► 5 నుంచి 50 లక్షల జనాభా ఉంటే : 16 శాతం (సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాల్లో పనిచేసే వారికి ఇది వర్తింపు) ► 5 లక్షల జనాభా వరకు : 8 శాతం పెన్షనర్ల అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ (కేంద్ర వేతన సవరణ ఆధారంగా..) ► 80 ఏళ్లు దాటిన వారికి : 20 శాతం ► 85 ఏళ్లు దాటితే : 30 శాతం ► 90 ఏళ్లు దాటితే : 40 శాతం ► 95 ఏళ్లు దాటితే : 50 శాతం ► 100 ఏళ్లు దాటితే : 100 శాతం ► సవరించిన పే స్కేల్స్ అమలుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయిన తేదీ నుంచి గ్రాట్యుటీ చెల్లింపు ► 2019 జూలై నుంచి 2021 డిసెంబర్ వరకు చెల్లించిన మధ్యంతర భృతిని డీఏ బకాయిల నుంచి సర్దుబాటు ► వేతన సవరణ కాల పరిమితి కేంద్ర వేతన సవరణ కమిషన్ ప్రకారం వర్తింపు ► కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమమ్ టైమ్ స్కేల్ అమలు.. ఉద్యోగాల క్రమబద్ధీకరణకు చర్యలు ► ఉద్యోగులు, పెన్షనర్ల అంత్యక్రియల ఖర్చులు రూ.25 వేలు ► కార్యదర్శుల కమిటీ సిఫారసుల ప్రకారం ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సీసీఏ అవసరంలేదని భావించి ఉపసంహరణ ► సీసీఏ అంశాన్ని త్వరితగతిన పరిష్కరించాలని నిర్ణయం ► మెడికల్ రీయింబర్స్మెంట్ ఎక్స్‌టెన్షన్‌పై త్వరితగన నిర్ణయం ► ఈహెచ్ఎస్ హెల్త్ స్కీమ్ క్రమబద్ధీకరణకు చర్యలు ► గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను 2022 జూన్ 30లోపు ఖరారు. అప్పటి నుంచి స్కేల్స్ వర్తింపు తాజా చర్చల్లో ప్రభుత్వం ఆమోదించిన అంశాలు.. ► గతంలో ప్రకటించిన విధంగా ఫిట్మెంట్ 23 శాతం కొనసాగింపు మారిన హెచ్ఆర్ఏ శ్లాబులు ► 50 వేలలోపు జనాభా ఉంటే : 10 శాతం, రూ.11 వేలు సీలింగ్ ► 50 వేల నుంచి 2 లక్షల జనాభా ఉంటే : 12 శాతం, రూ.13 వేలు సీలింగ్ ► 2 లక్షల నుంచి 50 లక్షల జనాభా : 16 శాతం, రూ.17 వేలు సీలింగ్ (13 జిల్లా కేంద్రాలకు ఇదే శ్లాబు వర్తింపు) ► 50 లక్షలకు పైబడి జనాభా ఉంటే 24 శాతం, రూ.25 వేల సీలింగ్ ► సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాల్లో 24 శాతం హెచ్ఆర్ఏ (2022 జూలై నుంచి 2024 జూన్ వరకు) రిటైర్డ్ ఉద్యోగుల అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్.. ► 70–74 ఏళ్ల వయసు వారికి : 7 శాతం ► 75–79 ఏళ్ల వయసు వారికి : 12 శాతం ► గ్రాట్యుటీ గతంలోలా కాకుండా 2022 జనవరి నుంచి అమలు ► 2019 జూలై 1 నుంచి 2020 మార్చి 31 వరకు (9 నెలలు) ఉద్యోగులకు ఇచ్చిన మధ్యంతర భృతిని సర్దుబాటు చేయరు. ► వేతన సవరణ పరిమితి ఐదేళ్లు. కేంద్ర వేతన సవరణ కమిషన్‌ను రాష్ట్ర ఉద్యోగులకు వర్తింపజేయరు. ► ఉద్యోగులు, పెన్షనర్ల అంత్యక్రియల ఖర్చులు రూ.25 వేలు ► పాత పద్ధతి ప్రకారం సీసీఏ కొనసాగింపు ► మారిన హెచ్ఆర్ఏ శ్లాబులు ఈ ఏడాది జనవరి నుంచి అమలు. ► ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి ప్రత్యేక జీఓ విడుదల. ► సీపీఎస్ అంశాన్ని పరిశీలించేందుకు ఒక కమిటీ ఏర్పాటు. 2022 మార్చికల్లా దీనిపై రోడ్ మ్యాప్ రూపకల్పన ► కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కమిటీ ఏర్పాటు. ఎన్ఎంఆర్ ఉద్యోగుల అంశం దీనిలోనే పరిశీలన ► మెడికల్ రీయింబర్స్మెంట్ ఎక్స్టెన్షన్కు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో విడుదల ► ఈహెచ్ఎస్ హెల్త్ స్కీమ్ క్రమబద్ధీకరణకు చర్యలు ► గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ 2022 జూన్ 30లోపు ఖరారు. అప్పటి నుంచి స్కేల్స్ వర్తింపు ► పీఆర్సీ నివేదిక విడుదల అంశం పరిశీలిస్తాం -
స్నేహపూర్వక ప్రభుత్వమిది
సాక్షి, అమరావతి: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులతో స్నేహ పూర్వక సంబంధాలు నెరిపే ప్రభుత్వమిదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులను సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులుగా పరిగణించి.. వారి సంక్షేమం కోసం పాటుపడతారని చెప్పారు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా.. ఉద్యోగులకు చేయగలిగినంత మేలు చేశారన్నారు. మంత్రుల కమిటీతో జరిపిన చర్చల్లో సమస్యల పరిష్కారానికి చేసిన ప్రతిపాదనలకు సమ్మతి తెలిపి.. ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాల నేతలు భిన్నంగా మాట్లాడటం సరి కాదన్నారు. ఆదివారం పీఆర్సీ సాధన సమితి నేతలతో సీఎం వైఎస్ జగన్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఉద్యోగుల హక్కులను గౌరవించాం ► గత నెల 7న పీఆర్సీ ప్రకటన తర్వాత ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో అసంతృప్తి వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమంలో వారి హక్కులను గౌరవించాం. వారి సమస్యలపై చర్చించేందుకు మంత్రుల కమిటీని సీఎం వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. ► రెండు రోజులపాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలతో మంత్రుల కమిటీ చర్చించి.. సమస్యలు పరిష్కరించింది. పీఆర్సీ ప్రకటన వల్ల రూ.10,247 కోట్ల భారం పడింది. హెచ్ఆర్ఏ స్లాబులు పెంచడం, సీసీఏ కొనసాగించడం, అడిషనల్ పెన్షన్ క్వాంటమ్ ఇచ్చేందుకు అంగీకరించడం వల్ల అదనంగా మరో రూ.1,330 కోట్ల భారం పడుతుంది. ► అయినా సీఎం వైఎస్ జగన్ బాధ్యతగా భావిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా ఉంటే.. ఉద్యోగులు ఆశించిన దాని కంటే అధికంగా ప్రయోజనం చేకూర్చేవారు. అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే ఎవరూ అడగకుండానే 27 శాతం ఐఆర్ ఇచ్చారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు సహకరించినంత మేరకు ఉద్యోగులకు చేయగలిగినంత చేశారు. బెస్ట్ ప్యాకేజీ ఇచ్చారు. అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడేంటిలా? ► మంత్రుల కమిటీతో జరిపిన చర్చల్లో ఉపాధ్యాయ సంఘాల నేతలు సూచించిన మేరకు హెచ్ఆర్ఏ స్లాబులు పెంచాం. ఏవైనా సమస్యలు ఉంటే అప్పుడు ఎత్తిచూపి ఉంటే.. వాటిని పరిష్కరించేవారం. మంత్రుల కమిటీ సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆమోదం తెలిపి.. ఇప్పుడు భిన్నంగా మాట్లాడటం సరికాదు. ► ప్రభుత్వంలో ఉద్యోగులు భాగం. ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా సీఎం వైఎస్ జగన్ భావిస్తారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది ఉద్యోగులే. వారు సమర్థవంతంగా పనిచేస్తేనే ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తాయి. అలాంటి ఉద్యోగులతో పాటు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలనూ సంతోషంగా ఉంచాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఉద్దేశం. ► ఎవరూ అడగకుండానే పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచారు. ఉద్యోగులు విమర్శించినా మా వాళ్లే కదా అనుకున్నాం. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సమస్యల పరిష్కారంలో పీఆర్సీ సాధన సమితి నేతలు సమర్థవంతంగా పని చేశారు. ► రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు సహృదయంతో అర్థం చేసుకుని, సహకరించాలి. ఉద్యోగులపై ప్రభుత్వం ఎక్కడా ఆధిపత్య ధోరణితో వ్యవహరించలేదు. ► పవన్ కళ్యాణ్ విమర్శలకు అర్థం లేదు. ఆయన ఆరోపించినట్లుగా ఆధిపత్య ధోరణి ప్రదర్శించి ఉంటే.. ఛలో విజయవాడ కార్యక్రమంలో ఏ ఒక్క ఉద్యోగినైనా ప్రభుత్వం ఏమైనా అనిందా? పవన్ కళ్యాణ్, ఆయన గురువు చంద్రబాబు రాజకీయం కోసం లేని సమస్యలను సృష్టిస్తారు. చౌక బారు విమర్శలు చేస్తారు. -
AP: ఇది మీ ప్రభుత్వం: సీఎం వైఎస్ జగన్
ఈ ప్రభుత్వం ఎప్పుడూ మీతో ఉంటుంది. మీ కోసం శ్రద్ధ తీసుకునే, మీరు చెప్పేది వినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే ప్రభుత్వం ఇది. మీ సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం మీకు ఉందన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి. ఒకచోట కాకపోతే మరో చోట మేలు చేయాలన్న ఆలోచనతో పలు నిర్ణయాలు తీసుకున్నామనే విషయాన్ని గమనించండి. మీరు రిటైర్ అయ్యాక కూడా బాగా జీవించేందుకు ఏం చేస్తే బావుంటుందో లోతుగా అధ్యయనం చేస్తున్నాం. ఆ విషయాలన్నీ మీతో చర్చించాకే అడుగులు ముందుకు వేస్తాం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘ఈ ప్రభుత్వం మీది.. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోండి.. మీరు లేకపోతే నేను లేను’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులనుద్దేశించి వ్యాఖ్యానించారు. పీఆర్సీకి సంబంధించి తాము లేవనెత్తిన పలు అంశాలకు ప్రభుత్వం అంగీకరించటంతో ఆందోళనను విరమించిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు... ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. మీ అందరినీ సంతోషంగా చూడటం చాలా ఆనందం కలిగించిందన్నారు. ‘‘మీ అందరికీ వినయపూర్వకంగా మరోసారి ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ ప్రభుత్వం మీది. ఆ విషయం మనసులో ఉంచుకోండి. ప్రజలకు మంచి చేయడానికి ఈ రోజు నేను నాలుగడుగులు ముందుకు వేయగలుగుతున్నానంటే మీ అందరి సహకారంతోనే. ఎందుకంటే కరోనా ప్రభావం వల్ల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసు. ఇప్పుడున్న ఒమిక్రాన్ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలో మీరు ఆశించిన రీతిలో ఇవ్వలేకపోయి ఉండొచ్చు. కానీ మనసా.. వాచా.. కర్మణా.. ఎంత మేర మేలు చేయగలుగుతామో అన్ని రకాలుగా చేశాం. మొత్తంగా మీ పక్షాన నిలబడటానికి అన్ని రకాలుగా తాను సన్నద్ధంగా ఉన్నానన్నది కచ్చితంగా గుర్తు పెట్టుకోండి’’ అని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు రాజకీయాలకు తావు ఉండకూడదు ఉద్యోగుల్లోకి, ఉద్యమాల్లోకి రాజకీయాలు వస్తే, ఉన్న వాతావరణం చెడిపోతుంది. రాజకీయాలకు తావుండకూడదు. ఏ సమస్య ఉన్నా రండి. అనామలీస్ కమిటీ కూడా ఉంది. ఉద్యోగుల సమస్యలపై ముగ్గురు మంత్రులు, సీఎస్, రామకృష్ణారెడ్డి, చంద్రశేఖర్‌తో ఏర్పాటయిన హైపవర్ కమిటీ భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ఏ సమస్య ఉన్నా, వారికి చెప్పుకోవచ్చు. ప్రభుత్వం అంటే మనది. ఉద్యోగులూ ఇందులో భాగమే. ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకునే మార్గం ఉంది. అంత దూరం పోవాల్సిన అవసరం లేకుండా కూడా పరిష్కారం చేయొచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. మీ అందరికీ ఇదే నా అభ్యర్థన. మొత్తంగా రూ.11,577 కోట్లు భారం ► నిన్న చర్చల సమయంలో మంత్రుల కమిటీ నాతో టచ్‌లో ఉంది. నా ఆమోదంతోనే వాటన్నింటినీ కూడా మంత్రుల కమిటీ మీకు చెప్పింది. ఆ నిర్ణయాలు మీకు సంతృప్తినిచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ► ఐఆర్ ఇచ్చిన 30 నెలల కాలానికి గాను, 9 నెలల కాలాన్ని సర్దుబాటు నుంచి మినహాయించాం. అలా చేయటం వల్ల ప్రభుత్వంపై రూ.5,400 కోట్లు అదనంగా భారం పడుతోంది. హెచ్ఆర్ఏను జనవరి నుంచి వర్తింపజేయడం వల్ల అదనంగా మరో రూ.325 కోట్లు భారం పడుతోంది. మొత్తం రూ.5,725 కోట్లు అదనపు భారం. ► ఇది కాకుండా ప్రతి సంవత్సరం రికరింగ్ వ్యయం రూపేణా మార్పు చేసిన హెచ్ఆర్ఏ వల్ల రూ.800 కోట్లు, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వల్ల మరో రూ.450 కోట్లు, సీసీఏ రూపంలో మరో రూ.80 కోట్లు ఈ మొత్తం కలిపితే రూ.1,330 కోట్లు భారం పడుతోంది. ► ఇంతకు ముందు పీఆర్సీ ప్రకారం రూ.10,247 కోట్లు ఏటా పెరుగుతుందనుకుంటే.. దానికి ఈ రూ.1,330 కోట్లు రికరింగ్. అంటే మొత్తంగా రూ.11,577 కోట్లు భారం. ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఇంకా భారం పడుతుంది. పరిస్థితులు మీకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ వివరాలు చెబుతున్నాను. ఆర్థిక పరిస్థితి బాగుంటే మరింత సంతోష పెట్టేవాడిని రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రూ.5,725 కోట్లు మీ పోస్ట్ రిటైర్మెంట్కు ఇస్తున్నాం. మీరు ఈ ప్రతిపాదనలకు అంగీకరించినందుకు ధన్యవాదాలు. ఇంత పెద్ద మొత్తం ఒక్కసారి ఇవ్వాలంటే చాలా కష్టం. మనమంతా ఒక్కటిగా కలిసి ముందుకెళదాం. పరిస్థితులు ఇలా ఉండకపోయి ఉంటే.. మీ అందర్నీ మరింత సంతోషపెట్టేవాడిని. మీరంతా నా దగ్గరకు చాలా సంతోషంగా వచ్చే పరిస్థితులుండేవి. దురదృష్టవశాత్తు అలాంటి పరిస్థితులు లేవు. సీపీఎస్‌పై గట్టిగా పని చేస్తున్నాం భావోద్వేగాలకు ఎప్పుడూ దయచేసి తావు ఇవ్వకండి. ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకుందాం. సీపీఎస్ మీద అన్ని వివరాలు తీసుకుని గట్టిగా పని చేస్తున్నాం. ఇవాళ మీరు కొత్త పద్ధతిలో తీసుకుంటున్న పెన్షన్ బాగా పెరిగేలా చూస్తాను. ఒక ఉద్యోగస్తుడు రిటైర్ అయ్యాక.. గతంలో ఎవ్వరూ చేయని విధంగా జగన్ గొప్ప మేలు చేశాడు అనే పరిస్థితి రావాలి. అదే జగన్ ప్రభుత్వం మీకు చేయబోయే గొప్ప మేలు. అంత దూరం ఆలోచిస్తూ ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. ప్రస్తుతం సీపీఎస్‌లో ఉన్న పరిస్థితికి భిన్నంగా మీకు ఏ విధంగా మంచి చేయాలనే దానిపై చాలా అధ్యయనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు మీకు జరిగిపోతుంది. రిటైర్ అయ్యాక ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ఆ పరిస్థితి రాకుండా ఒక మంచి పరిష్కారంతో వస్తాం. ఇందులో మిమ్మల్ని భాగస్వాములను చేస్తాను. ఏ రకంగా మేలు చేయగలుగుతాం అన్నది చర్చిస్తాం. అన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాం. రోస్టర్ విధానంలో ఎవరిని నియమించామో వాళ్లందరి పట్ల సానుకూలంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశాం. దీనిపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాం. 30 వేల మంది టీచర్లకు పదోన్నతులు 30 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇస్తున్నాం. ఈ జూన్ నాటికి ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తున్నాం. పిల్లలు బాగా చదవాలంటే మొత్తం అన్ని సబ్జెక్టులు ఒకే టీచర్ చెప్పే ఇవాళ్టి పరిస్థితి మారాలి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్స్ ఉండేలా చూస్తున్నాం. సబ్జెక్టుల వారీగా టీచర్లను తీసుకువస్తున్నాం. దీనివల్ల ఒక టీచర్ ఒక సబ్జెక్ట్ మీద తన ధ్యాస అంతా పెట్టగలుగుతాడు. ప్రిపేర్ అయి బాగా చెప్పగలుగుతాడు. ఇంగ్లిష్ మీడియం వైపు అడుగులు వేశాం. బైలింగువల్ టెక్స్›్ట బుక్స్.. అంటే ఒకపేజీ తెలుగు, పక్క పేజీలో అదే ఇంగ్లిష్‌లో ఉండటం వల్ల పిల్లలు సులభంగా అర్థం చేసుకుంటారు. టీచర్ల కెపాసిటీ పెరుగుతుంది. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పొడిగింపు ► ఒక మంచి సానుకూల వాతావరణం దిశగా అడుగులు పడుతున్నాయి. అందరు కలిసికట్టుగా భావితరాలకు మంచి రాష్ట్రాన్ని అందిద్దాం. ఎక్కడైనా తక్కువ చేస్తున్నాం అనిపించినప్పుడు.. అలా ఉండకూడదని కొన్ని చర్యలు తీసుకున్నాం. దీంట్లో భాగంగానే రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం. దానివల్ల 24 నెలల జీతం రూపేణా మరో చోట మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మీరు అడగకపోయినా చేశాం. ఎంఐజీ ఇళ్ల స్థలాల విషయంలో కూడా మీరు అడగకపోయినా నిర్ణయం తీసుకున్నాం. ► ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణా రెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ఆర్థిక శాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదాయం పెరగకపోగా పడిపోయింది రాష్ట్ర ఆదాయాలు బాగా పడిపోయాయి. 2018–19లో రాష్ట్ర ఆదాయం రూ.62 వేల కోట్లు. మామూలు పరిస్థితుల్లో అయితే 2019–20లో అది 15 శాతం పెరిగి రూ.72 వేల కోట్లు అయ్యుండాలి. కానీ ఒక్కశాతం కూడా పెరగకపోగా తగ్గి రూ.60 వేల కోట్లకు పడిపోయింది. 2020–21లో మళ్లీ 15%పెరిగితే అంటే రూ.72 వేల కోట్ల మీద మరో 15 శాతం పెరిగితే రూ.84 వేల కోట్లు కావాలి. అలాంటి పరిస్థితులు ఉండి... అప్పుడు మన చర్చలు సాగుతుంటే పరిస్థితి మరోరకంగా ఉండేది. కానీ 2020–21లో కూడా ముందటి సంవత్సరంకన్నా ఒక్క రూపాయి కూడా పెరగకుండా రాష్ట్రాదాయం రూ.60 వేల కోట్లలోపే ఉండిపోయింది. మరోవైపు జీతాల బిల్లు మాత్రం ఏటేటా పెరుగుతూ వస్తోంది. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమమ్ టైం స్కేలు వర్తింపచేశాం. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, హోంగార్డులు, శానిటేషన్ వర్కర్ల జీతాలు అన్ని రకాలుగా పెంచాం. వీటన్నింటి వల్ల 2018–19లో ఉన్న రూ.52 వేల కోట్ల శాలరీ బిల్లు ఈ ఏడాది రూ.67 వేల కోట్లకు పెరిగింది. తాజా నిర్ణయాలతో ఇప్పుడు మళ్లీ సుమారు రూ.11 వేల కోట్లు అదనంగా పడుతోంది. అంటే రూ.78వేల కోట్లకు చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో మన చర్చలు జరిగాయన్నది ప్రతి ఒక్కరం గుర్తుంచుకోవాలి. నా అంత ఉదారంగా ఎవరూ ఉండరు. నేను మనస్ఫూర్తిగా నమ్మేది ఒక్కటే. మీరు లేకపోతే నేను లేను అని. అనేక పథకాలు పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్ నొక్కి ప్రజలకు ఇవ్వగలుగుతున్నామంటే అది మీ వల్లే సాధ్యపడుతోంది. మీరు చేయలేకపోతే వ్యవస్థలో సాధ్యం కాదు. మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా జరుగుతుంది. -
చర్చలకు వచ్చిన 48 గంటల్లోనే సమస్య క్లోజ్: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
-
అందరినీ సంతోషంగా ఉంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: సజ్జల రామకృష్ణారెడ్డి
-
సీఎం జగన్ స్పష్టంగా చెప్పిన మాటలు: ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
-
ఉద్యోగులు విమర్శించినా మా వాళ్లే కదా అనుకున్నాం: సజ్జల
సాక్షి, అమరావతి: పీఆర్సీ విషయంలో చేయగలిగినంతా చేశామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లోనూ వారికి చేయాల్సింది చేశామని పేర్కొన్నారు. హెచ్ఆర్ఏ స్లాబుల విషయంలోనూ సానుకూలంగా చేశామన్నారు. చర్చల్లో పాల్గొన్న టీచర్ల నేతలు అప్పుడే చెప్పి ఉంటే బావుండేదన్నారు. చదవండి: మా ఆవేదనను సీఎం జగన్ అర్థం చేసుకున్నారు: ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయులు అడిగినవి కూడా చేశాం. అందరినీ సంతోషంగా ఉంచాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. కోవిడ్ పరిస్థితుల్లో కూడా రూ.10వేల కోట్లకు పైగా అదనంగా ఖర్చు పెడుతున్నాం. హెచ్ఆర్ఏ స్లాబుల వల్ల రూ.1300 కోట్ల భారం. భవిష్యత్‌లో ఉద్యోగులకు ఏ సమస్య వచ్చిన చర్చించడానికి సిద్ధం. మంత్రుల కమిటీని ప్రభుత్వం కొనసాగిస్తుంది. మేం ఉద్యోగులను ఏనాడూ ఇబ్బంది పెట్టలేదు. ఉన్నదానిలో ఉద్యోగులకు బెస్ట్ ప్యాకేజీ ఇచ్చాం. ఉద్యోగ సంఘాలు మంచిగా సహకరించాయి. సీఎం ఎన్ని స్కీములు పెట్టినా ఉద్యోగుల సహకారం అవసరం. ఉద్యోగులు విమర్శించినా మా వాళ్లే కదా అనుకున్నామని’’ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. -
సీఎం జగన్ గారిది పెద్ద చేయి.. ఆయనను చూసి మాకు చాలా బాధేసింది: వెంకటరామిరెడ్డి
-
సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు ఇవే: సూర్యనారాయణ
-
సీఎం జగన్ మాటలతో సంతోషంగా ఉన్నాం: బండి శ్రీనివాసరావు
-
సీఎం మా ఆవేదన అర్థం చేసుకున్నారు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల ఆవేదనను సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసుతో అర్థం చేసుకుని, సమస్యలను సానుకూలంగా పరిష్కరించారని పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రశంసించారు. మంత్రివర్గ ఉప సంఘంతో శుక్ర, శనివారాల్లో జరిపిన చర్చలు సఫలీకృతమవడంతో శనివారం రాత్రి పీఆర్సీ సాధన సమితి సమ్మెను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. ఆదివారం పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, కె.వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కె.సూర్యనారాయణ, ప్రసాద్ తదితరులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంతో సమావేశమై కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. మంత్రుల కమిటీ సిఫార్సుల మేరకు సీఎం హెచ్ఆర్ఏ శ్లాబులను పెంచారని, సీసీఏ (సిటీ కాంపెన్సేటరీ అలవెన్సు) కొనసాగించడంతో పాటు పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఇవ్వడానికి అంగీకరించారని తెలిపారు. దీని వల్ల రూ.1,330 కోట్ల భారం ఖజానాపై పడుతుందన్నారు. పీఆర్సీ ప్రకటనతో రూ.10,247 కోట్లు.. తాజాగా మంత్రుల కమిటీ ప్రతిపాదనలను సీఎం ఆమోదించడం ద్వారా అదనంగా రూ.1,330 కోట్లు వెరసి రూ.11,577 కోట్ల భారం ఖజానాపై పడుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా ఉన్నప్పుడు ఎవరూ అడగకుండానే సీఎం 27% ఐఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. కరోనా ప్రభావం వల్ల రాష్ట్ర ఆదాయం ఏటా రూ.20 వేల కోట్ల మేర తగ్గిందని.. దానివల్ల ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ను 23%కి మించి ఇవ్వలేకపోతున్నామని సీఎం ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు అర్థం చేసుకోవాలని కోరారు. ఉద్యోగుల మనోభావాలను సీఎం గౌరవించారు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల మనోభావాలను సీఎం గౌరవించి.. సమస్యలను సానుకూలంగా పరిష్కరించినందుకు కృతజ్ఞతలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించినంత మేరకు సీఎం చేయగలిగినంత చేశారు. ఫిట్మెంట్ మినహా మిగతా సమస్యలను పరిష్కరించారు. భవిష్యత్‌లో ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చించి.. పరిష్కరించడానికి మంత్రుల కమిటీని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తామని చెప్పడం అభినందనీయం. మేము మంత్రుల కమిటీతో చర్చించేందుకు అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో కలిసి కమిటీని ఏర్పాటు చేస్తాం. ప్రతి నెలా ఒక రోజున ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై.. సమస్యలపై చర్చిస్తానని సీఎం చెప్పారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే నిర్ణయాల్లో సంఘాల నేతలకు భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పారు. మంత్రుల కమిటీ సిఫార్సులను ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆమోదించి.. ఇప్పుడు భిన్నంగా మాట్లాడటం తగదు. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, రెవెన్యూ సర్వీసెస్ అసోషియేషన్ అధ్యక్షుడు సీఎం చేయగలిగినంత చేశారు గత నెల 7న సీఎం వైఎస్ జగన్ పీఆర్సీ ప్రకటన చేశాక ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు ఉద్యమం చేయడం వెనుక ఆవేదనను అర్థం చేసుకున్నందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. పీఆర్సీ సాధన సమితితో చర్చించి.. మంత్రుల కమిటీ చేసిన సిఫార్సులను సీఎం ఆమోదించారు. హెచ్ఆర్ఏ శ్లాబులు పెంచారు. అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఇచ్చేందుకు అంగీకరించారు. రూ.5,400 కోట్లకుపైగా ఐఆర్ రికవరీని రద్దు చేశారు. సీపీఎస్ రద్దుకు మార్చి 31 నాటికి రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడంపై స్పష్టత ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించేందుకు మంత్రుల కమిటీని శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి నెలా ఒక రోజు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమవుతానని సీఎం చెప్పారు. కరోనా మహమ్మారి ప్రభావం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్లే ఉద్యోగులు ఆశించిన మేరకు ప్రయోజనం చేకూర్చలేకపోతున్నానని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించిన మేరకు ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ చేయగలిగినంతా చేశారు. మంత్రుల కమిటీ సిఫార్సులకు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆమోదం తెలిపి, సంతకాలు కూడా చేసి.. ఇప్పుడు భిన్నంగా మాట్లాడటం సరి కాదు. కష్టకాలంలోనూ సమస్యలను సానుకూలంగా పరిష్కరించిన అంశాన్ని గుర్తించాలి. –బండిశ్రీనివాసరావు,ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి నేత వేతనాలు పెరిగే పీఆర్సీ ఇది.. సమస్యలను పరిష్కరించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. గత నెల 7న పీఆర్సీ ప్రకటన చేసినప్పటి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు ఆవేదనతో ఆగ్రహం వ్యక్తం చేసినందుకు సీఎం వైఎస్ జగన్‌కు క్షమాపణలు చెబుతున్నాం. తెలంగాణతో సమానంగా హెచ్ఆర్ఏ శ్లాబ్‌లను పెంచారు. సీసీఏ కొనసాగించారు. ఐఆర్ రికవరీని రద్దు చేశారు. ప్రతి ఉద్యోగి వేతనం పెరుగుతుంది. సమస్యల పరిష్కారం కోసం చేసిన సమ్మెలు ఇప్పటిదాకా ఫలవంతమైన దాఖలాలు లేవు. 1986లో 53 రోజులకుపైగా ఉద్యోగులు సమ్మె చేసినా సమస్యలు పరిష్కారం కాకపోగా.. సమ్మె కాలాన్ని రెగ్యులరైజ్ చేయాలని కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది. 1999లో ఉపాధ్యాయుల అప్రెంటీస్‌పై 23 రోజులు చేసిన సమ్మె కూడా ఫలవంతం కాలేదు. ఇప్పుడు సమ్మెకు వెళ్లాల్సిన పరిస్థితి ఉత్పన్నం కానివ్వకుండా.. కేవలం రెండు రోజుల్లోనే మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి.. సమస్యను సానుకూలంగా పరిష్కరించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. సీపీఎస్ రద్దుపై రోడ్ మ్యాప్ ప్రకటిస్తామని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీ్దకరణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించారు. మంత్రుల కమిటీ సిఫార్సులను ఆమోదించిన ఉపాధ్యాయ సంఘాల నేతలు.. ఇప్పుడు భిన్నంగా మాట్లాడటం సరి కాదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఇరు పక్షాల తరఫున మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు. – కె.వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఈ పరిస్థితిలో ఇది బెస్ట్ ప్యాకేజీ దేశంలో ఎక్కడా లేని రీతిలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. కేంద్రం తరహాలో పదేళ్లకు ఓ సారి కాకుండా ఐదేళ్లకు ఓ సారి వేతన సవరణ సంఘాన్ని (పీఆర్సీ) ఏర్పాటు చేయడానికి సీఎం అంగీకరించారు. దీని వల్ల 2023లో కొత్త పీఆర్సీని ఏర్పాటు చేస్తారు. సీపీఎస్ రద్దుకు రోడ్ మ్యాప్‌ను మార్చి 31లోగా ప్రకటిస్తామని సీఎం చెప్పారు. జగన్ ప్రభుత్వం చేసిందనే రీతిలో సీపీఎస్ సమస్యను పరిష్కరిస్తామని సీఎం చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై స్పష్టత ఇస్తామన్నారు. హెచ్ఆర్ఏ శ్లాబులను పెంచడంతో పాటు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఇచ్చేందుకు అంగీకరించారు. సీసీఏను కొనసాగించేందుకు ఆమోదం తెలిపారు. ఐఆర్ రికవరీని రద్దు చేయడం ప్రశంసనీయం. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు ఎవరూ అడగకుండానే 27 శాతం ఐఆర్ ఇవ్వడం వల్ల.. ఫిట్మెంట్ అంతకంటే ఎక్కువ ఇస్తారని ఉద్యోగులు ఆశించారు. కరోనా ప్రభావం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినింది. అందువల్ల ఫిట్మెంట్ 23 శాతానికి మించి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించిన మేరకు చేయగలిగినంత చేసిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. ఇది ఉద్యోగులకు ఇచ్చిన బెస్ట్ ప్యాకేజీ. ఉపాధ్యాయ సంఘాల నేతలు మంత్రల కమిటీ సిఫార్సులను అంగీకరించి, ఇప్పుడు తద్భిన్నంగా మాట్లాడటం తగదు. – కె.సూర్యనారాయణ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి నేత మాకు మంచి చేయాలనే కసి ముఖ్యమంత్రిలో ఉంది రాష్ట్రంలో ఇప్పటికే 1.80 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు 1.30 లక్షలు, ఆర్టీసీ ఉద్యోగులు 60 వేల మంది కలిపితే మొత్తం 3,70 లక్షల మంది సీపీఎస్ కిందకు వస్తారు. మొత్తం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల్లో 70 శాతం సీపీఎస్ ఉద్యోగులే. 2019 ఎన్నికల ప్రచారంలో సీపీఎస్‌ను రద్దు చేస్తానని సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చినప్పుడు ఉన్న చిత్తశుద్ధే ఇప్పుడూ కన్పిస్తోంది. మార్చి 31 నాటికి సీపీఎస్ రద్దుకు రోడ్ మ్యాప్‌ను ప్రకటిస్తామని సీఎం చెప్పారు. ఇచ్చిన హామీని అమలు చేయాలనే కసి సీఎం వైఎస్ జగన్‌లో బలంగా ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల మనోభావాలను గౌరవించి, చేయగలిగినంతా చేసిన సీఎంకు కృతజ్ఞతలు. – ప్రసాద్, సీపీఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి నేత -
ఈ ప్రభుత్వం మీది: ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పీఆర్సీ సాధన సమితి సమావేశమైంది. మంత్రివర్గ ఉప సంఘంతో రెండు రోజులపాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలు ఫలించడంతో పీఆర్సీ సాధన సమితి సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ప్రభుత్వం తమ కోరికలను మన్నించడంతో సమ్మెలోకి వెళ్లడం లేదని నేతలు ప్రకటించారు. చర్చలు సఫలం కావడంతో ఆదివారం సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాలు ప్రత్యేకంగా భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా.. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఇంత మేలు చేసినందుకు సీఎం వైఎస్ జగన్‌కు ఉద్యోగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగ సంఘాలతో సీఎం ►ఈ ప్రభుత్వం మీది. మీ సహకారంతో మంచి చేయగలుగుతున్నాను ►ఆర్థిక పరిస్థితుల వల్ల, కరోనా ప్రభావం వల్ల మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చు ►కాని ఎంతమేర మేలు చేయగలుగుతామో అన్నిరకాలుగా చేశాం ►రాజకీయాలు ఇందులోకి వస్తే.. వాతావరణం దెబ్బతింటుంది ►రాజకీయాలకు తావు ఉండకూడదు ►ఏదైనా సమస్య ఉంటే.. అనామలీస్ కమిటీకూడా ఉంది ►ఎప్పుడైనా మీరు మీ సమస్యలను చెప్పుకోవచ్చు ►ఉద్యోగ సమస్యలపై మంత్రుల కమిటీ కొనసాగుతుంది ►ఏ సమస్య ఉన్నా.. వారికి చెప్పుకోవచ్చు ►ప్రభుత్వం అంటే ఉద్యోగులది ►అంత దూరం పోవాల్సిన అసరం లేకుండా కూడా పరిష్కారం చేయొచ్చు ►ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి ►నిన్న మంత్రుల కమిటీ నాతో టచ్‌లోనే ఉంది ►నా ఆమోదంతోనే వీటన్నింటినీ కూడా మీకు చెప్పడం జరిగింది ►ఐ.ఆర్. ఇచ్చిన 30 నెలల కాలానికి గానూ, 9 నెలల ఐ.ఆర్‌ను. సర్దుబాటు నుంచి మినహాయింపు వల్ల రూ.5400కోట్లు భారం పడుతోంది ►హెచ్.ఆర్.ఏ రూపంలో అదనంగామరో రూ.325 కోట్లు భారం పడుతోంది ►అదనంగా భారం పడేది కాకుండా రికరింగ్ వ్యయం రూపేణా హెచ్.ఆర్.ఏ వల్ల రూ.800 కోట్లు, అడిషనల్‌క్వాంటమ్‌పెన్షన్, సీసీఏ రూపంలో మొత్తంగా రూ.1330 కోట్లు భారం పడుతోంది. ►మొత్తంగా రూ.11,500 కోట్లు రికరింగ్‌గా భారం పడుతోంది. ఆర్థికంగా పడే భారం ఇది ►మీకు తెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ వివరాలు చెప్తున్నాను ►రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా... మీరు ఈ ప్రతిపాదనలకు అంగీకరించినందుకు ధన్యవాదాలు. మనం ఒక్కటిగా కలిసి ముందుకు సాగుదాం ►ఈ పరిస్థితులు ఈ మాదిరిగా ఉండకపోయి ఉంటే... మీ అందర్నీ మరింత సంతోషపెట్టేవాడిని ►దురదృష్టవశాత్తూ అలాంటి పరిస్థితులు లేవు. రాష్ట్ర ఆదాయాలు బాగా పడిపోయాయి ►మినిమం టైం స్కేలు వర్తింపు చేశాం, అన్నిరకాలుగా ఆయా జీతాలు పెంచాం ►ఇలాంటి పరిస్థితుల్లో ఈ చర్చలు జరిగాయి ►మీరు లేకపోతే నేను లేను. పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్ నొక్కి ప్రజలకు ఇవ్వగలుగుతున్నాను. ఇది మీ వల్లే సాధ్యపడుతోంది ►భావోద్వేగాలకు పెద్దగా తావు ఇవ్వకండి. ఏదైనా సమస్య ఉంటే.. మీరు చెప్పుకోండి ►రాబోయే రోజుల్లో సీపీఎస్‌మీద గట్టిగా పనిచేస్తున్నాం ►అన్ని వివరాలూ తీసుకుని గట్టిగా పనిచేస్తున్నాం ►వివరాలు ఖరారైన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులతో వాటిని పంచుకుంటాను ►ఇవాళ మీరు కొత్తపద్దతిలోతీసుకుంటున్న పెన్షన్ మంచిగా పెరిగేలా చూస్తాను ►ఉద్యోగులకు ఎవ్వరూ చేయని విధంగా జగన్ చేశాడు అనే పరిస్థితిలోకి వెళ్లేలా.. రిటైర్ అయిన తర్వాత మీకు మంచి జరిగేలా ఆ దిశగా అడుగులు వేస్తున్నాం ►భిన్నంగా ఎలా చేయాలో కూడా గట్టిగా ఆలోచనలు చేస్తున్నాం ►అందులో మిమ్మల్ని భాగస్వాములను చేస్తాను ►కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాం. దీనిపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాం. అన్ని విషయాలు కూడా మీకు తెలియజేస్తాను ►30వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇస్తున్నాం ►సబ్జెక్టుల వారీగా టీచర్లను తీసుకువస్తున్నాం ►అందరూ కలిసికట్టుగా భావితరాలకు మంచి రాష్ట్రాన్ని అందిద్దాం ►ఎక్కడైనా కూడా తక్కువ చేస్తున్నాం అనిపించినప్పుడు.. అలా ఉండకూడదని కొన్ని చర్యలు తీసుకున్నాం ►దీంట్లో భాగంగానే రిటైర్‌మెంట్‌వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం ►24 నెలల జీతం రూపేణా మరోచోట మంచి జరుగుతుందనే ఉద్దేశంతోమీరు అడగకపోయినా మేం చేశాం ►అలాగే ఇళ్లస్థలాల విషయంలోకూడా మీరు అడగకపోయినా నిర్ణయం తీసుకున్నాం ►ప్రభుత్వం ఎప్పుడూ మీతో ఉంటుంది. ఏ సమస్యపైనైనా చర్చకు సిద్ధం ►మీరు చెప్పేవి వినడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది చదవండి: రాష్ట్ర ప్రభుత్వంతో పీఆర్సీ స్టీరింగ్ కమిటీ నేతల చర్చలు సఫలం -
అందరిముందు రిబ్బన్లు తీసేసిన ఉద్యోగులు
-
సంతకాలు పెట్టి.. బయటకు వెళ్లాక మాట మారుస్తారా?
సాక్షి, అమరావతి: చర్చల్లో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘాలు అన్ని అంశాలు అంగీకరించాక బయటకు వెళ్లి వ్యతిరేకంగా మాట్లాడడం సరికాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. పీఆర్సీ సాధన సమితితో కలిసి ఉమ్మడి మీడియా సమావేశం ముగిసిన తర్వాత కొందరు ఉపాధ్యాయ సంఘాలు చర్చలను తప్పుపట్టడంపై ఆయన స్పందించారు. స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ఉన్న ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రతి అంశంపైనా మాట్లాడారు. ఉపాధ్యాయుల గురించి వారు అడగడంవల్లే గ్రామాల్లో హెచ్ఆర్ఏను 9 శాతం నుంచి 10 శాతానికి పెంచి రూ.10 వేల సీలింగ్‌ను రూ.11 వేలకు పెంచామని తెలిపారు. ఫిట్మెంట్ ఇంకా పెంచాలని అడిగినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి వారందరినీ ఒప్పించామన్నారు. ఆ సమయంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులుగా ఉన్న స్టీరింగ్ కమిటీ సభ్యులు కూడా అంగీకారం తెలిపారు. ఫిట్‌మెంట్‌పై అప్పుడే అభ్యంతరం చెప్పి ఉంటే దానిపైనా చర్చించే వారమని సజ్జల తెలిపారు. చివరి నిమిషం వరకు చర్చల్లో ఉండి అన్నింటికీ ఒప్పుకుని మినిట్స్‌లో సంతకాలు కూడా పెట్టి సమ్మె విరమిస్తామని చెప్పారని తెలిపారు. అంతా అయిపోయాక సంతకాలు పెట్టి బయటకు వెళ్లిన కొందరు ఉపాధ్యాయ సంఘ నేతలు చర్చలకు వ్యతిరేకంగా మాట్లాడడం మంచి సంప్రదాయం కాదన్నారు. బయటకు వెళ్లి వ్యతిరేకంగా మాట్లాడడాన్ని బట్టి ఏవో రాజకీయ శక్తులు వారిని బయట నుంచి నడిపిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. -
AP: ఆందోళన విరమణ
ఒప్పంద వివరాలివీ.. ► ప్రత్యేక జీవో ద్వారా త్వరలో పీఆర్సీ నివేదిక విడుదల.. గతంలో ప్రకటించిన విధంగా ఫిట్మెంట్ 23 శాతం కొనసాగింపు ► 50 వేల లోపు జనాభా ఉంటే రూ.11 వేల సీలింగ్‌తో 10 శాతం హెచ్ఆర్ఏ ► 50 వేల నుంచి 2 లక్షల జనాభా ఉంటే రూ.13 వేల సీలింగ్‌తో 12 శాతం హెచ్ఆర్ఏ ► 2 లక్షల నుంచి 50 లక్షల జనాభా ఉంటే రూ.17 వేల సీలింగ్‌తో 16 శాతం హెచ్ఆర్ఏ ► 13 జిల్లా కేంద్రాలకు ఇదే స్లాబు వర్తింపు.. ఈ జనవరి నుంచి అమలు ► 50 లక్షలకు పైబడి జనాభా ఉంటే రూ.25 వేల సీలింగ్‌తో 24 శాతం హెచ్ఆర్ఏ ► సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాల్లో 2024 జూన్ వరకు 24 శాతం హెచ్ఆర్ఏ ► రిటైర్డ్ ఉద్యోగుల అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70–74 ఏళ్ల వారికి 7 శాతం, 75–79 ఏళ్ల వారికి 12 శాతం ► 2022 జనవరి నుంచి గ్రాట్యుటీ అమలు.. మధ్యంతర భృతి రికవరీ ఉపసంహరణ ► వేతన సవరణ పరిమితి ఐదేళ్లే.. అంత్యక్రియల ఖర్చు రూ.25 వేలు ► పాత పద్ధతి ప్రకారం సీసీఏ కొనసాగింపు ► ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీకి సంబంధించి ప్రత్యేక జీఓ విడుదల ► సీపీఎస్‌ను పరిశీలించేందుకు కమిటీ ఏర్పా టు.. 2022 మార్చి 31 నాటికి రోడ్ మ్యాప్ ► కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కమిటీ ఏర్పాటు.. ఎన్ఎంఆర్ ఉద్యోగుల అంశంపై ఇందులోనే పరిశీలన ► మెడికల్ రీయింబర్స్మెంట్ ఎక్స్టెన్షన్కు సంబంధించి త్వరలో ఉత్తర్వులు ► ఈహెచ్ఎస్ హెల్త్ స్కీమ్ క్రమబద్ధీకరణకు చర్యలు ► 2022 జూన్ 30లోపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు. అప్పటి నుంచి స్కేల్స్ వర్తింపు. సాక్షి, అమరావతి: మంత్రివర్గ ఉప సంఘంతో రెండు రోజులపాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలు ఫలించడంతో పీఆర్సీ సాధన సమితి సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ప్రభుత్వం తమ కోరికలను మన్నించడంతో సమ్మెలోకి వెళ్లడం లేదని నేతలు ప్రకటిస్తూ.. చొక్కాలకు పెట్టుకున్న నల్ల బ్యాడ్జీలను తొలగించారు. తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం సీఎంను కలిసి ధన్యవాదాలు తెలుపుతామని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల కోరికలపై సీఎం వైఎస్ జగన్ సూచనలకు అనుగుణంగా మంత్రివర్గ ఉప సంఘం రెండు రోజులపాటు విస్తృతంగా చర్చలు జరిపింది. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తుది విడత చర్చలు జరిపారు. చర్చల సారాంశాన్ని ఎప్పటికప్పుడు టెలిఫోన్లో సీఎంకు వివరిస్తూ ఆయన సూచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు పూర్తయ్యాక మంత్రుల కమిటీ ప్రతిపాదనలను సీఎంకు ఫోన్లో వివరించగా ఆయన ఆమోదించారు. ఆ తర్వాత మంత్రుల కమిటీ, పీఆర్సీ సాధన సమితి సంయుక్తంగా వెలగపూడి సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. చర్చోప చర్చలు.. తొలుత ఉదయం మంత్రుల కమిటీలో ఉన్న సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సలహాదారు చంద్రశేఖర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్, జీఏడీ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌లు పలు అంశాలపై ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. అనంతరం సీఎం వైఎస్ జగన్‌ను కలిసి శుక్రవారం జరిగిన చర్చల వివరాలను తెలిపారు. ఆ తర్వాత మధ్యాహ్నం సచివాలయానికి చేరుకుని ఉద్యోగులు కోరిన మార్పులు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం గురించి ఆర్థిక శాఖాధికారులతో చర్చించారు. అనంతరం 4 గంటలకు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై రాత్రి 10 గంటల వరకు చర్చలు జరిపారు. ఏకాభిప్రాయంతో సానుకూలంగా ఉద్యోగ సంఘాలను ఒప్పించడంతో వారు సమ్మె విరమించడానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డిలతో కలిసి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఉద్యోగుల ఆవేదన గుర్తించాం.. పీఆర్సీ తదనంతర పరిణామాలపై నిన్న (శుక్రవారం), ఈరోజు (శనివారం) సుదీర్ఘంగా చర్చలు జరిపాం. ఉద్యోగులు ఆశించిన మేర పీఆర్సీ లేకపోవడం వల్ల వారిలో ఉన్న ఆవేదన, అసంతృప్తిని ప్రభుత్వం గుర్తించి మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రతి అంశాన్ని లోతుగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నాం. సానుకూలంగా స్పందించిన ఉద్యోగ సంఘాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉంది. అందుకే అడక్కుండానే సీఎం ఐఆర్ ఇచ్చారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేశారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని సీఎం మొదటి నుంచి చెబుతున్నారు. ఒకేసారి ఐదు డీఏలు ఇచ్చారు. పీఆర్సీ కూడా వారికి బాగా ఇవ్వాలని భావించారు. కానీ కోవిడ్ పరిస్థితులు దృష్ట్యా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కోలుకోలేని విధంగా దెబ్బతింది. అందుకే అనుకున్న మేరకు, ఉద్యోగులు ఆశించిన విధంగా పీఆర్సీ ఇవ్వలేకపోయారు. వారికి ఇంకా మేలు చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితి. ఎంత వరకు చేయాలో అంతవరకు పీఆర్సీ ఇచ్చారు. ఆందోళనల సందర్భంగా కొందరు ఉద్యోగులు ఇబ్బందికరంగా మాట్లాడినా ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించింది. త్వరగా సమస్య పరిష్కారం అవడానికి చర్చలే దోహదం చేశాయి. – సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు నిజంగా ఇది గుడ్ డీల్ ఈ రోజు ఉద్యోగులకు గొప్ప శుభదినం. వ్యవస్థలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య కొన్ని సందర్భాల్లో భిన్నాభిప్రాయాలుంటాయి. వాటిని నేర్పుతో, ఓర్పుతో సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకోవాలి. కోవిడ్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి బాగుండి ఉండే మంచి బెనిఫిట్స్ వచ్చి ఉండేవని ఆశించేవాళ్లం. కానీ ఉన్నంతలో మంచి పీఆర్సీ ఇచ్చారు. కొన్ని అంశాలలో అన్యాయం జరగడంతో రోడ్డెక్కాల్సి వచ్చింది. ఈరోజు చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకోగలిగాం. పీఆర్సీ కోసం ఏర్పాటైన అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్టు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మేము లేవనెత్తిన డిమాండ్లలో ప్రధానమైన ఐఆర్ రికవరీ నిలిపి వేయడం, హెచ్ఆర్ఏ స్లాబ్‌లు సరిచేయడం, పెన్షనర్స్‌కు అదనపుæ క్వాంటంను పునరుద్దరించడం, ఐదేళ్ల కోసారి పీఆర్సీ ఏర్పాటు చేసే అంశాన్ని కొనసాగిస్తామని హామీ ఇవ్వడం పట్ల సంతోషంగా ఉంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీలు, ఆర్టీసీలో పీఆర్సీ అమలుకు ప్రత్యేక ఉత్తర్వులిస్తామన్నారు. సీపీఎస్ అంశంపై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను కేబినెట్ సబ్ కమిటీ పరిగణనలోకి తీసుకోవడంతో మార్చి 31వ తేదీలోగా రోడ్‌మ్యాప్ డిక్లేర్ చేస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు, 1993 నవంబర్ 25కు ముందున్న ఎన్ఎంఆర్ కంటిజెంట్ ఎంప్లాయిస్ను కూడా ఆ పరిధిలోకి తీసుకురావాలన్న హామీని కూడా అంగీకరించారు. విలేజ్, వార్డు సచివాలయ సిబ్బందికి జూన్ 30లోగా ప్రొబెషన్ డిక్లేర్ చేసి పే స్కేల్ అమలు చేస్తామని చెప్పారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ స్టీమ్‌లైన్ చేసే వరకు మెడికల్ రీయింబర్స్మెంట్ కొనసాగిస్తామని చెప్పారు. పీఆర్సీ రిలేటెడ్ అంశాలు 9, ఇతర సమస్యలు 4 అంశాలు తాము లేవనెత్తగా, తాము డిమాండ్ చేయని మరో నాలుగు అంశాలు కలిపి..17 అంశాలపై సానుకూలంగా స్పందించారు. ఆ మేరకు ఒప్పందం చేసుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం అభినందనీయం. నాలుగు జేఏసీల తరఫున పీఆర్సీ సాధన సమితి ఏకగ్రీవంగా ఈ డిమాండ్లను ఆమోదిస్తూ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటిస్తున్నాం. మంత్రులు, సీఎస్, ముఖ్యమంత్రి పట్ల అమర్యాదగా మాట్లాడి ఉంటే మన్నించగలరు. – సూర్యనారాయణ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి నేత సీఎం చొరవతోనే సమస్య పరిష్కారం రెండు రోజులు సుదీర్ఘంగా చర్చించిన మీదట సమస్యలు పరిష్కరించేలా నిర్ణయం తీసుకున్నాం. ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఒత్తిళ్లు, ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఉద్యోగులతో చర్చించి వారి సమస్యలు పరిష్కరించాలని, ఏవైనా ఇబ్బందులు ఉంటే మనమే తిప్పలు పడదామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. సీఎం చొరవతోనే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గంటల కొద్దీ చర్చించాం. చివరిలో కావాలని చేసినట్టు ఒకరిద్దరు ఇబ్బందిగా మాట్లాడారు. అయినప్పటికీ ఉద్యోగ సంఘాలు చర్చలపై సానుకూలంగా స్పందించి సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించాయి. సీఎం వైఎస్ జగన్ చొరవతోనే సమస్య పరిష్కారమైంది. రాష్ట్రం ఇంత ఆర్థిక పరమైన ఒడిదుడుకులు పడినా వాటిని అధిగమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. – మంత్రి పేర్ని నాని ప్రభుత్వానికి కృతజ్ఞతలు రెండు రోజులుగా చీఫ్ సెక్రటరీ, మంత్రి మండలి ఉప సంఘంతో జరిపిన చర్చలు అందరికీ ఆమోద యోగ్యమైన రీతిలో సాగాయి. మంత్రుల కమిటీ నిన్న రాత్రి ఒంటిగంట వరకు చర్చలు జరిపి.. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల్ల పట్ల ప్రేమాభిమానాలను స్పష్టం చేసింది. మాకు జరిగిన అన్యాయాన్ని పెద్ద మనసుతో గ్రహించి, మేము లేవనెత్తిన డిమాండ్లపై కూలంకషంగా చర్చించి వాటి పరిష్కారం పట్ల సానుకూలంగా స్పందించిన ప్రభుత్వానికి పీఆర్సీ సాధన సమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము అడక్కుండానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాకు 27 శాతం ఐఆర్ ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఆశా వర్కర్ల జీతాలు పెంచారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చారు. ఇలా ఎన్నో చేశారు. అందువల్లే మరింత మెరుగైన పీఆర్సీ ఇస్తారని ఆశించాం. అదే స్థాయిలో చాలా వరకు ఇచ్చారు కూడా. అయితే కొన్ని అంశాల్లో మాకు జరిగిన అన్యాయం దృష్ట్యా ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఛలో విజయవాడలో కొంత మంది మాకేదో ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్న ఆవేదనతో ముఖ్యమంత్రి పట్ల చేసిన వ్యాఖ్యల విషయంలో అన్యధా భావించవద్దు. ప్రభుత్వం వేరు.. ఉద్యోగులు వేరు కాదు.. ఉద్యోగులూ మా కుటుంబ సభ్యులని ముఖ్యమంత్రి చెబుతుంటారు. ఏది ఏమైనా మా డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ఐదు డీఏలు ఒకేసారి ఇవ్వడంతో పాటు మేము కోరుకున్నట్టుగా హెచ్ఆర్ఏ, పెన్షనర్లకు అదనపు క్వాంటం, సీసీఎస్‌ను పునరుద్దరించడం కోసం రూట్‌మ్యాప్ వంటి ప్రధాన డిమాండ్లు పరిష్కారం కావడంతో 6వ తేదీ అర్ధరాత్రి నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నాం. ఆదివారం ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తాం. – బండి శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీఓ సంఘ అధ్యక్షులు, పీఆర్సీ సాధన సమితి సభ్యుడు సీఎం చొరవ అభినందనీయం ముఖ్యమంత్రికి ఉద్యోగుల పట్ల ఎంత అభిమానం ఉందో మరోసారి చూపించారు. 3వ తేదీన భారీ సంఖ్యలో ఉద్యోగులు రోడ్డుమీదకొచ్చి తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసి.. 24 గంటలు గడవక ముందే సీఎం స్పందించి మా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రెండ్రోజులుగా ఇదే అంశంపై ముఖ్యమంత్రి సూచనలతో మంత్రుల కమిటీ మాతో సుదీర్ఘంగా చర్చించింది. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గాలను కనుక్కోవడంలో ముఖ్యమంత్రి చూపిన చొరవ అభినందనీయం. ముఖ్యమంత్రికి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు. మేము ఎక్కువగా రాజీకి వచ్చే అవకాశం లేకుండానే మేము పెట్టిన చాలా డిమాండ్లలో ఒకటి రెండు తప్ప అన్ని డిమాండ్ల పరిష్కారం పట్ల సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులకు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఉన్న హెచ్ఆర్ఏ కొనసాగించాలనే డిమాండ్ మేరకు 24 శాతం హెచ్ఆర్ఏ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు. సీసీఎస్ కొనసాగేలా అంగీకరించినందుకు కృతజ్ఞతలు. 10 ఏళ్ల పీఆర్సీ ప్రతిపాదనను వెనక్కి తీసుకొని ఐదేళ్లకోసారి పీఆర్సీ అమలుకు నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. వార్డు, గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది ప్రొబేషన్ డిక్లేర్ అయ్యాక కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు ఇస్తామన్నారు. ఐదు డీఏలు ఒకేసారి అమలు చేయడం గొప్ప నిర్ణయం. దాంతో పాటు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు..అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వీలైనంత ఎక్కువ సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. సమ్మెకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని సమస్యలు పరిష్కరించారు. మా ఆవేదనలో హద్దుమీరి ఒకరిద్దరు మాట్లాడి ఉంటారు. వారి తరఫున ముఖ్యమంత్రికి క్షమాపణలు చెబుతున్నాం. – కె వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, పీఆర్సీ సాధన సమితి నేత మా సమస్యలు పరిష్కారం ఊహించని రీతిలో మంత్రులు కమిటీ ముందుకొచ్చి మా డిమాండ్ల పరిష్కార దిశగా సానుకూలంగా స్పందించడం అభినందనీయం. ఒకేసారి ఐదు డీఏలు ఇవ్వడంతో జీతం పెరుగుతుందన్న ఆలోచనతో హెచ్ఆర్ఏ, సీసీఏలు, పెన్షనర్ల బెనిఫిట్లు పూర్తిగా తొలగించడం, కొన్ని తగ్గించడం వంటి చర్యలు వలన ఆందోళనకు దిగాల్సి వచ్చింది. ఈరోజు చర్చలనంతరం ప్రధానంగా మేము కోరుతున్న పీఆర్సీ నివేదికను ఉత్తర్వులతో పాటు ఇస్తామని చెçప్పడం మాకు చాలా సంతోషం కల్గించింది. హెచ్ఆర్ఏ స్లాబ్‌లలో సవరణ, ఐఆర్ రికవరీ చేయడాన్ని నిలుపుదల చేయడం, గతంలో మాదిరిగా పీఆర్సీ 5 ఏళ్ల కోసారి ఏర్పాటు చేయాలని నిర్ణయించడం ఆనందంగా ఉంది. పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయిస్, యూనివర్సిటీ, గురుకులాలకు పీఆర్సీ అమలుకు ఉత్తర్వుల జారీ విషయంలో చాలా రోజులు పట్టేది. వీరికి కూడా తక్షణమే పీఆర్సీ అమలయ్యేలా ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా సపరేట్గా ఉత్తర్వులు ఇవ్వడానికి అంగీకరించారు. పీఆర్సీతో పాటు అనుబంధంగా ఉన్న సీపీఎస్ రద్దు అంశం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, వార్డు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఒక రోడ్ మ్యాప్ ద్వారా పరిష్కరించే దిశగా సిద్ధం చేస్తామని చెప్పడం చాలా సంతోషం కలిగించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్న మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను పొడిగించడానికి ఒప్పుకున్నారు. ఈలోగా ఎంప్లాయిస్ హెల్త్ కార్డు పూర్తి స్థాయిలో స్ట్రీమ్‌లైన్‌లోకి తీసుకొచ్చేందుకు హామీ ఇవ్వడం సంతోషం. కోవిడ్ వల్ల చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాల కల్పన వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఉద్యమ సందర్భంగా సీఎం వైఎస్ జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిని పలు సందర్భాల్లో విమర్శించినందుకు అన్యధా భావించవద్దని కోరుతున్నాం. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, పీఆర్సీ సాధన సమితి నేత -
పీఆర్సీ ఇష్యూకు ఈరోజు ముగింపు
-
ఏపీ: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు సఫలం..
సాక్షి, అమరావతి: దాదాపు7 గంటల పాటు మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు జరిపిన సమావేశం ముగిసింది. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. మంత్రుల కమిటీ ప్రతిపాదనలను సీఎం జగన్ అంగీకారం తెలిపారు. కాసేపట్లో మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాల నేతలు ప్రెస్ మీట్ పెట్టి చర్చల సారాంశాన్ని వివరించనున్నారు. హెచ్ఆర్ఏ స్లాబ్‌లు, పీఆర్సీ కాల పరిమితి, ఐఆర్ అడ్జస్ట్మెంట్, పెన్షనర్ల అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబ్‌లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: పా‘పాల’ పుట్ట హెరిటేజ్! కాగా, శుక్రవారం రాత్రి.. ఉద్యోగుల ఉద్యమం విరమణ దిశగా మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాలు సానుకూలంగా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. తాము కోరుతున్న ప్రధాన అంశాల్లో కొన్నింటిపై మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించినట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. చర్చలు సఫలమయ్యేలా జరుగుతున్నట్లు స్పష్టం చేశాయి. ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని, హెచ్ఆర్ఏ, ఐఆర్ రికవరీ అంశాలపై సానుకూలంగా ఉన్నట్లు మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలకు తెలిపింది. చర్చల అనంతరం మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పీఆర్సీ విషయంలో మెరుగైనది ఇచ్చినా ఉద్యోగులు ఆశించినంతగా లేదని భావించారని, అందుకే వారి అసంతృప్తి, ఆవేదన పరిష్కరించడానికి కూలంకషంగా చర్చలు జరిగాయని తెలిపారు. ప్రతి అంశంపై లోతుగా చర్చించి అందరి ఆమోదం వచ్చిందని చెప్పారు. హెచ్ ఆర్ ఏ విషయంలో వివిధ స్లాబ్స్ ఉద్యోగులతో చర్చించి పెంచినట్లు తెలిపారు. జిల్లా కేంద్రాల్లో 16 శాతం నిర్ణయించామని,హెచ్ఓడీ, సెక్రటేరియట్ వారికి జూన్ 2024 వరకు 24 శాతం హెచ్ఆర్ఏ ఉంటుంది. మారిన హెచ్ ఆర్ ఏ జనవరి 2022 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేసినా ప్రదర్శనలు చేసినా ప్రభుత్వం వైపు నుంచి సానుకూలంగానే ఉన్నామని తెలిపారు. ఆర్థికంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి వల్ల ఉన్నంతలో బెటర్ ప్యాకేజ్ ఇచ్చామన్నారు. ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని చెప్తున్నారు ►ఫిట్ మెంట్ 23 శాతం అదే కొనసాగుతుంది ►అడిషనల్ క్వాంటం 70-74 వయసు వాళ్ళకు 7 శాతం ►ఐఆర్ రికవరీ ఉపసంహరించుకుంటున్నాం ►పదేళ్లకో సారి కాకుండా 5 ఏళ్లకే పీఆర్సీ అమలు చేయాలని నిర్ణయించాం ►సీపీఎస్ రద్దు ప్రక్రియ మార్చ్ 21 కల్లా రూట్ మ్యాప్ తయారు అవుతుంది ►గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల కన్ఫర్మేషన్ జూన్ లోపు జరగాలి ►యధావిధిగా ఉద్యోగులు బాద్యతల్లోకి వెళ్తారని భావిస్తున్నాం -
ఉద్యోగుల సమస్యలపై సానుకుల నిర్ణయమే తీసుకుంటాం..
-
సాయంత్రానికి శుభంకార్డు?
-
సానుకూలంగా చర్చలు
సాక్షి, అమరావతి: ఉద్యోగుల ఉద్యమం విరమణ దిశగా మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాలు సానుకూలంగా చర్చలు జరిపాయి. తాము కోరుతున్న ప్రధాన అంశాల్లో కొన్నింటిపై మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించినట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. చర్చలు సఫలమయ్యేలా జరుగుతున్నట్లు స్పష్టం చేశాయి. ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని, శనివారం కల్లా ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రుల కమిటీ తెలిపింది. హెచ్ఆర్ఏ, ఐఆర్ రికవరీ అంశాలపై సానుకూలంగా ఉన్నట్లు మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలకు తెలిపింది. శనివారం మరోసారి పూర్తి స్థాయి చర్చలు జరపాలని నిర్ణయించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో మంత్రుల కమిటీ సభ్యులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, జీఏడి ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌లు పీఆర్సీ సాధన కమిటీ స్టీరింగ్ కమిటీ సభ్యులైన బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ, కే వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు మరో 16 మందితో ఆరు గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు 6 గంటలపాటు చర్చలు జరిగాయి. తొలుత మంత్రుల కమిటీ తమ అభిప్రాయాలను ఉద్యోగ సంఘాల ఎదుట ఉంచి వాటిపై మాట్లాడాలని సూచించింది. ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయంలోనే విడిగా సమావేశమై చర్చించి.. ఆ తర్వాత మళ్లీ మంత్రులతో సమావేశమయ్యారు. సుహృద్భావ వాతావరణంలో చర్చలు చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి. పీఆర్సీ అమలుపై ఉద్యోగుల్లో ఉన్న అపోహలు, అనుమానాలు తొలగించి, వారి అసంతృప్తికి కారణాలను సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు ప్రయత్నించాం. వారు చెప్పిన కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని చర్చించాం. ఉద్యోగులకు చాలా ఉదారంగా మేలు చేద్దామనుకున్నా, కోవిడ్ వల్ల వాళ్లు ఆశించిన స్థాయిలో ఇవ్వలేకపోయాం. దీంతో వారిలో ఏర్పడిన అసంతృప్తిని సరిదిద్దే ప్రయత్నం చేశాం. ఈ అంశాలపై శనివారం మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకుంటాం. ఉద్యోగులతో ప్రభుత్వానికి ఉన్న స్నేహ పూర్వక వాతావరణాన్ని భవిష్యత్తులో కొనసాగిస్తాం. – సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం సీఎం జగన్ ఉద్యోగ సంఘాలతో మాట్లాడిన తర్వాత మిగిలిపోయిన హెచ్ఆర్ఏ, ఇతర అంశాలను అధికారులతో మాట్లాడుకోవాలని సూచించారు. వాటిపై ఏర్పడిన అసంతృప్తిని సరిదిద్దే ప్రయత్నం చేశాం. హెచ్ఆర్ఏ, ఫిట్మెంట్ రికవరీ అంశాలను ఉద్యోగ సంఘాలు ప్రస్తావించాయి. వాటిపై సానుకూలంగా చర్చలు జరిగాయి. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా శనివారం సాయంత్రం లోపు తుది నిర్ణయం తీసుకుంటాం. – బొత్స సత్యనారాయణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి చర్చలు సఫలమవుతాయనే విశ్వాసం మంత్రుల కమిటీతో మంచి వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి అవి సఫలమవుతాయనే విశ్వాసం ఉంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇంకా చాలా విషయాలు చర్చించాల్సి ఉంది. ఉద్యోగుల ఆశలు వమ్ముకాకుండా స్టీరింగ్ కమిటీ నేతలం ప్రభుత్వంతో చర్చలు జరిపాం. మంత్రుల కమిటీ నష్ట నివారణకు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చింది. – బండి శ్రీనివాసరావు, పీఆర్సీ సాధన సమితి నేత తుది ఫలితం వచ్చేదాకా పెన్‌డౌన్ మంత్రుల కమిటీతో చర్చలు సంతృప్తికరంగా సాగాయి. ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని సరిదిద్దేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. శనివారం మరోసారి పూర్తి స్థాయిలో చర్చిస్తాం. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఐదు ప్రధాన డిమాండ్లతో పాటు వాటికి అనుబంధంగా మరో 9 డిమాండ్లు, ఇతరత్రా డిమాండ్లపై చర్చించాం. ఆర్థిక అంశాలు ముడిపడి ఉండడంతో మంత్రుల కమిటీతో మరోసారి చర్చలకు రావాలని కోరింది. పూర్తి స్థాయిలో చర్చలు జరిగి, ఫలితం వచ్చే వరకు పెన్ డౌన్, సహాయ నిరాకరణ యధావిధిగా కొనసాగుతుంది. – సూర్యనారాయణ, ఉద్యోగ సంఘం నేత పూర్తి స్పష్టత రావాలి ఉద్యోగుల ఆకాంక్షలను ప్రభుత్వం గుర్తించింది. కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. మరికొన్నింటిపై ఏకాభిప్రాయం రావాల్సి ఉంది. అన్ని విషయాలపై ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత తుది నిర్ణయం ప్రకటిస్తాం. చర్చలు సానుకూలంగా జరుగుతున్నందున సమ్మె వాయిదా వేసుకోవాలని మంత్రుల కమిటీ కోరింది. అన్ని అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాతే దాని గురించి ఆలోచిస్తామని చెప్పాము. – వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఉద్యోగ సంఘాల నేతలు -
AP: మంత్రుల కమిటీతో ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ
సాక్షి, విజయవాడ: ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. సమస్య పరిష్కారం దిశగా చర్చలు కొనసాగినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మంత్రుల కమిటీ చర్చిస్తోంది. పలు డిమాండ్లపై ఇరుపక్షాలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చించిన ఉద్యోగ సంఘాలు చర్చించాయి. దాదాపు నాలుగున్నర గంటల పాటు సమావేశం కొనసాగింది. ఈ భేటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పేర్నినాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సీఎస్ సమీర్ శర్మ, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు. స్టీరింగ్ కమిటీ తరపున 20 మంది ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. చదవండి: (సీఎం వైఎస్ జగన్ సమక్షంలో మంత్రుల కీలక చర్చ) -
సీఎం వైఎస్ జగన్ సమక్షంలో మంత్రుల కీలక చర్చ
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు కీలక చర్చలు జరిపారు. ఉద్యోగుల సమ్మె నోటీస్ నేపథ్యంలో సమాలోచనలు జరిపారు. చర్చలకు రాకుండా సమ్మెకు వెళితే ప్రత్యామ్నాయం ఎలా అనే అంశంపై చర్చించారు. ఈ భేటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. చదవండి: (సీఎం జగన్‌ను కలిసిన ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ థియరీ బెర్దెలాట్) -
'ఇబ్బందులు ఉంటాయి.. చర్చల ద్వారానే పరిష్కారం’
సాక్షి, తాడేపల్లి: ప్రతి పీఆర్సీ అమలులో ఇబ్బందులు ఉంటాయని అవి చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఈ మేరకు ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. 'నేను ఉద్యోగిగా 6 పీఆర్సీలు చూశా. అప్పుడూ ఇలాంటి సమస్యలు వచ్చాయి. ఉద్యోగులకు సమస్యలు రావడం సర్వసాధారణం. గెజిటెడ్ అధికారులకి సమస్యలు ఉన్నా రోడ్లు ఎక్కి ఆందోళన చెయ్యరు. గౌరవంగా మాట్లాడి పరిష్కరించుకుంటారు. గతంలో దళిత అధికారులు అంటే చులకన భావం ఉండేది. పోస్టింగ్, ప్రమోషన్లలో అన్యాయం జరిగేది. ఇప్పుడు పరిస్థితి మారింది. ఇలాంటి అసోసియేషన్ వల్ల న్యాయం జరుగుతుంది. సీఎం జగన్ దళిత పక్షపాతి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించారు. మంచి స్థానాల్లో దళిత అధికారులకు సీఎం జగన్ అవకాశం ఇచ్చారు' అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. చదవండి: (CM YS Jagan: విశాఖ పర్యటనకు సీఎం జగన్) -
రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా సమస్య జఠిలం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: రెచ్చగొట్టే వ్యాఖ్యల ద్వారా సమస్య జఠిలం అవుతుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగులు బలప్రదర్శన చేద్దామని చూడ్డం సరికాదన్నారు. చర్చలకు ప్రభుత్వం ఎప్పుడైనా సిద్ధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనన్నారు. బయటి శక్తుల ప్రమేయంతో ఉద్యోగులకు ఇబ్బందులొస్తాయన్నారు. చదవండి: సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ముద్రగడ సంబంధం లేని ఇష్యూలు హైలెట్ చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఉద్యోగులు నియంత్రణ కోల్పోయి వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్తున్నారు. ఉద్యోగ సంఘాలతో మాట్లాడేందుకు మేం ఎప్పుడూ సిద్ధం. ఆందోళనలు, సమ్మెల వల్ల ఉపయోగం ఉండదన్నారు. ప్రభుత్వ సమస్యలను ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. -
ఐఆర్ ఇవ్వడం వల్లే సమస్య!
సాక్షి, అమరావతి: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులు అడగకుండానే రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీలో 30 నెలలపాటు 27 శాతం ఐఆర్ (మధ్యంతర భృతి) ఇచ్చిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ తెలిపారు. దాదాపు రూ.17,918 కోట్ల మేర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించిందన్నారు. గురువారం గుంటూరు జిల్లా వెలగపూడిలోని సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఐఆర్ అనేది వడ్డీ లేని రుణం అని.. దాన్ని సర్దుబాటు చేయకతప్పదన్నారు. అసలు ఐఆర్ ఇవ్వకుండా డీఏ ఇచ్చి పీఆర్సీ ప్రకటించి ఉంటే సర్దుబాటు సమస్య ఉండేది కాదని చెప్పారు. పరిస్థితులు ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఐఆర్‌ను ప్రకటించేందుకు ప్రభుత్వాలు భయపడతాయన్నారు. తెలంగాణ మాదిరి తాము కూడా అప్పట్లోనే డీఏ ఇస్తే ప్రభుత్వానికి రూ.10 వేల కోట్లు మిగిలేవని తెలిపారు. డీఏ, హెచ్ఆర్ఏ, ఐఆర్ వంటి దాదాపు పది అంశాలను కలిపి చూసినప్పుడే వేతనాల్లో పెరుగుదల కనిపిస్తుందన్నారు. కోవిడ్‌తో రాష్ట్ర ఆదాయం గత మూడేళ్లలో 15 శాతం కూడా పెరగలేదని చెప్పారు. ఈ పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఉద్యోగులకు చేయగలిగినంత చేసిందన్నారు. ఇప్పుడు ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రభుత్వం భారీగా నిధులను వెచ్చించాల్సిన పరిస్థితులున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. సమ్మె వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు.. ఉద్యోగులు సంయమనం పాటిస్తూ చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సీఎస్ కోరారు. కొత్త పీఆర్సీ అమలు అంశంలో సమ్మెకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. సమ్మెలు, నిరసనలు, ఆందోళనలతో ఎవరికీ ప్రయోజనం ఉండదనే విషయాన్ని ఉద్యోగులు గుర్తించాలని కోరారు. పీఆర్సీకి సంబంధించి ఉద్యోగుల సందేహాలను తీర్చేందుకే ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఉద్యోగులతో చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. పీఆర్సీ ఆలస్యమవుతుంటే ముందస్తు సర్దుబాటుగా ఐఆర్ ఇస్తారన్నారు. కొత్త పీఆర్సీ వల్ల ఎవరి జీతాలు తగ్గలేదని తేల్చిచెప్పారు. ఐఆర్‌తో కొత్త పీఆర్సీని పోల్చిచూడటం సరికాదన్నారు. పాత పీఆర్సీతో కొత్త పీఆర్సీని పోల్చి చూడాలని సూచించారు. ఎవరికీ జీతం తగ్గలేదు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ.. ఓ పత్రికలో ఉద్యోగుల జీతం తగ్గుతుందంటూ కథనం వచ్చిందని.. అందులో బేసిక్ వేతనాన్ని తక్కువవేయడంతో తగ్గుదల కనిపించిందన్నారు. కొత్త పీఆర్సీతో ఎవరికీ జీతం తగ్గలేదన్నారు. ‘ప్రతి ఉద్యోగికి ఏటా ఇంక్రిమెంట్‌తో 3 శాతం పెరుగుదల ఉంటుంది. ఐఆర్ కలిపినా, కలపకపోయినా జీతం పెరుగుతుంది. ఐఆర్ కేవలం తాత్కాలిక ప్రయోజనం’ అని వివరించారు. ఐఆర్ ప్రకటించేటప్పుడే పీఆర్సీ ఫిట్మెంట్లో హెచ్చుతగ్గులు ఉంటే ఆ వ్యత్యాసాన్ని సర్దుబాటు చేస్తామని సంబంధిత జీవోలో స్పష్టంగా పేర్కొన్నామన్నారు. -
AP: ఉద్యోగుల ర్యాలీలో రాజకీయ సందడి
సాక్షి, అమరావతి: పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం పోలీసులు సంయమనం ప్రద ర్శించడంతో సాఫీగా జరిగిపోయింది. ఐదు వేల మందితో కార్యక్రమం నిర్వహణకు అనుమతి కోరిన ఉద్యోగ సంఘాల నేతలు కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున తరలించినట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇందులో సీపీఎం, సీపీఐ పార్టీల నేతలు పాల్గొనడమే కాకుండా కార్యక్రమాన్ని ఆసాంతం నడిపిం చారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున హాజరు కావడంతోపాటు జన సమీకరణ కూడా చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై రాజకీయ, వ్యక్తిగత విమర్శలకు దిగినట్లు స్పష్టమవుతోంది. టీడీపీ కార్యకర్త ఇప్పుడు గెజిటెడ్ అధికారి అయ్యాడంటూ చలో విజయవాడపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి. రెండు రోజుల ముందే.. వివిధ ప్రాంతాల నుంచి చలో విజయవాడకు హాజరైన ఉద్యోగులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంఘాలవారీగా ఉద్యోగులు బ్యానర్లతో గాంధీనగర్ చేరుకుని అక్కడి నుంచి బీఆర్టీఎస్ రోడ్డు వైపు ర్యాలీలుగా వెళ్లారు. ఫుడ్ జంక్షన్ నుంచి భానునగర్ వంతెన వరకు నిలుచుని ప్రదర్శన చేపట్టారు. పీఆర్సీ సాధన సమితి నేతలు ఓ వాహనంపైకి ఎక్కి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేకపోయినా ప్రణాళిక ప్రకారం తరలి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఉద్యోగ సంఘాల నేతలు ఒక వ్యూహం ప్రకారం రెండు రోజుల ముందే ఉద్యోగులు నగరానికి చేరుకునే ఏర్పాట్లు చేశారు. ఉద్యోగులు బీఆర్టీఎస్ రోడ్డులోకి చేరుకున్నాక కూడా పీఆర్సీ సాధన సమితి నేతలు రాకపోవడంతో అయోమయం నెలకొంది. చివరికి అప్పటికప్పుడు ఒక వాహనంపైకి చేరుకుని పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రసంగించారు. ఒకవైపు పీఆర్సీ సాధన సమితి నేతలు తాము ప్రభుత్వంతో యుద్ధం చేయడం లేదని చెబుతుంటే మరోవైపు యుద్ధానికి సిద్ధమంటూ యూటీఎఫ్ నాయకులు ప్రకటించారు. సీఎంను ఇంటికి పంపుతామని, ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని ఫ్యాప్టో అధ్యక్షుడు జోసెఫ్ సుధీర్‌బాబు హెచ్చరించారు. -
దయచేసి ఉద్యోగులు సమ్మె విరమించాలి: సీఎస్ సమీర్ శర్మ
సాక్షి, అమరావతి: ఉద్యోగుల సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ఏపీ సీఎస్ సమీర్ శర్మ పేర్కొన్నారు. చర్చలు జరపకపోతే సమస్యలెలా తీరుతాయని ప్రశ్నించారు. నిరసనలు, ఆందోళనలతో ఉపయోగం ఉండదని, ఉద్యోగులతో చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. ఉద్యోగులకు కావాల్సింది ఏంటో చెబితే కూర్చొని మాట్లాడతామని తెలిపారు. ఐఆర్ అంటే ముందస్తు సర్దుబాటు అని, పీఆర్సీ ఆలస్యం అయితే ఇస్తారని పేర్కొన్నారు. దయచేసి ఉద్యోగులు సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త పీఆర్సీ వల్ల ప్రభుత్వంపై రూ.10 వేల కోట్ల రూపాయల భారం పడుతుందని, డీఏ మాత్రమే పెంచితే 10 వేల కోట్లు మిగిలేవని సీఎస్ తెలిపారు. కొత్త పీఆర్సీ వల్ల ఎవరి జీతాలు తగ్లేదని, ఐఆర్‌తో కొత్త పీఆర్సీని పోల్చి చూడటం సరికాదన్నారు. పాత పీఆర్సీతో కొత్త పీఆర్సీని పోల్చి చూడాలన్నారు. ఉద్యోగులకు సమస్యలు ఉంటే మంత్రుల కమిటీ ఉందని, ఏదైనా రిపోర్ట్ తయారు చేసి పరిష్కారం ఆలోచిద్దామని సూచించారు. చదవండి: సమస్యను మరింత జఠిలం చేసేలా ఉద్యోగుల తీరు: సజ్జల ఎవ్వరికీ జీతం తగ్గలేదు: ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఉద్యోగుల జీతం తగ్గిందని ఓ పత్రిక రాసిందని, వాస్తవానికి ఎవ్వరికీ జీతం తగ్గలేదని ప్రిన్సిపాల్ సెక్రెటరీ శశిభూషన్ కుమార్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి ఉద్యోగికి ఇంక్రిమెంట్ వస్తుంది. దాని వలన 3 శాతం పెరుగుతుంది. ఐఆర్ కలిపినా, కలపకపోయిన జీతం పెరుగుతుంది. ఐఆర్ కేవలం తాత్కాలిక ప్రయోజనం. ఇప్పటి వరకు అన్ని పీఆర్సీల కంటే అత్యధిక ఐఆర్ ఈ ప్రభుత్వం ఇచ్చింది. అది కూడా అత్యధికంగా 30 నెలలు ఐఆర్ ఇచ్చారు.’’ అని ప్రిన్సిపాల్ సెక్రెటరీ వివరించారు. చదవండి: ‘ఉద్యమాన్ని వారే నడుపుతున్నట్లుగా.. చంద్రబాబు బిల్డప్’ -
సమస్యను మరింత జఠిలం చేసేలా ఉద్యోగుల తీరు: సజ్జల
సాక్షి, అమరావతి: ఉద్యోగులతో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఉద్యోగ సంఘాలను అనేక సార్లు చర్చలకు పిలిచామని తెలిపారు. సమస్యను మరింత జఠిలం చేసేలా ఉద్యోగుల తీరు ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న మేరకు మంచి నిర్ణయం తీసుకున్నామని సజ్జల పేర్కొన్నారు. చదవండి: ‘ఉద్యమాన్ని వారే నడుపుతున్నట్లుగా.. చంద్రబాబు బిల్డప్’ ‘‘పీఆర్సీ నిర్ణయం గురించి అన్నీ వివరించాం. మా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగుల సంఖ్య పెరిగింది. బల ప్రదర్శన చేయడం ద్వారా సమస్య జఠిలం అవుతుంది. పీఆర్సీ ఏ విధంగా రూపొందించారో ప్రభుత్వం వివరించింది. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో జీతాలు ఇస్తున్నాం. కాంట్రాక్టు సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాం. కోవిడ్ వల్ల రెండేళ్లుగా ఆర్థిక పరిస్థితి కుదేలైంది. ఉన్న పరిస్థితుల్లో చేయాల్సిందంతా చేశాం. ఉపాధ్యాయులకు చాలా మేలు చేశాం. సర్వీస్ సంబంధిత అంశాలెన్నింటినో పరిష్కరించామని ’’ సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. -
‘ఉద్యమాన్ని వారే నడుపుతున్నట్లుగా.. చంద్రబాబు బిల్డప్’
సాక్షి, కాకినాడ (తూర్పుగోదావరి): ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యమాన్ని వారే నడుపుతున్నట్లుగా చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబులా వేధించి ద్రోహం చేసే ప్రభుత్వం మాది కాదని కన్నబాబు అన్నారు. చదవండి: ఉద్యోగులకు చంద్రబాబు ఏం ఉద్ధరించారు?: మంత్రి బొత్స ‘‘ఉద్యోగులు పీఆర్సీని ఒక సమస్యగా భావిస్తున్నారు. వారి సందేహనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం వేసిన కమిటీతో చర్చిద్దామని ఉద్యోగులను కోరుతున్నాను. కాదని రోడ్డెక్కి ఆందోళనలు చేస్తే సమస్య పరిష్కారం కాదు. కావాలని కొంతమంది రెచ్చగొట్టే ధోరణీ వెళ్తున్నట్లు కనిపిస్తుంది. 2018లో చంద్రబాబు పీఆర్సీ వేసి అమలు చేయకపోయినా... అధికారంలో వచ్చిన వెంటనే ఐఆర్ ఇచ్చిన ఘన చరిత్ర సిఎం జగన్‌ది. కొంత మంది ఉద్యోగ సంఘాల నాయకులు సాక్షాత్తూ సిఎం జగన్ ను కించపరుస్తూ మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్దతి కాదు. ఉద్యమాన్ని వారే నడుపుతున్నట్లుగా ఒకవైపు చంద్రబాబు.. ఆయన తనయుడు లోకేష్ బిల్డప్‌లు ఇస్తున్నారని’’ మంత్రి కన్నబాబు నిప్పులు చెరిగారు. -
ఉద్యోగులకు చంద్రబాబు ఏం ఉద్ధరించారు?: మంత్రి బొత్స
సాక్షి, విజయవాడ: ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మొదటి నుంచి చర్చలకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జీతాలు ప్రాసెస్ చేశాక ఆపమని చెప్పడం భావ్యం కాదన్నారు. పీఆర్సీ అమలులో సమస్యలుంటే చర్చిస్తామని తెలిపారు. చదవండి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్‌పై సుబ్రమణ్యస్వామి మరో పిటిషన్ ఉద్యోగుల ఆందోళనపై ప్రభుత్వం సంయమనంగా వ్యవహరించిందన్నారు. కోవిడ్ జాగ్రత్తలు పాటించమని చెప్పాం. ఉద్యోగులతో పోలీసులు సంయమనంగానే వ్యవహరించారని’’ బొత్స అన్నారు. ఉద్యోగులకు చంద్రబాబు ఏం ఉద్ధరించారు. ఉద్యోగులకు చంద్రబాబు కంటే ఎక్కువగానే మేలు చేశామని’’ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
సమ్మెకు ముందే ఉద్యోగుల సహాయ నిరాకరణ సరికాదు..
సాక్షి, విజయవాడ: చర్చలతో ఉద్యోగులు సమస్యలు పరిష్కరించుకోవాలని ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి హితవు పలికారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సమ్మెకు ముందే ఉద్యోగుల సహాయ నిరాకరణ సరికాదన్నారు. కొత్త పీఆర్సీతో ఏ ఒక్క ఉద్యోగికి కూడా జీతం తగ్గలేదన్నారు. పే స్లిప్‌లో ఉద్యోగుల జీతం వివరాలు స్పష్టంగా ఉన్నాయని.. కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని గౌతమ్‌రెడ్డి అన్నారు. చదవండి: ఉద్యోగులు, ప్రభుత్వం వేర్వేరు కాదు: ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి -
ఉద్యోగులు, ప్రభుత్వం వేర్వేరు కాదు: ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి
సాక్షి, తాడేపల్లి: పదకొండవ పీఆర్సీపై అనేకసార్లు చర్చించిన తర్వాతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటన చేశారని ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగ సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను మొన్నటి వరకూ ఎన్జీవో అధ్యక్షుడిగా, జేఏసీ ఛైర్మన్‌గా ఉన్నాను. కొంత మంది ఉద్యోగ నాయకులు హెచ్ఆర్ఏ తగ్గిందని అంటున్నారు. దీనిపై ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై కమిటీ కూడా వేసింది. నిన్న (మంగళవారం) జరిగిన సమావేశంలో మూడు విషయాలను పట్టుబడుతున్నారు. పాత శాలరీ ఇవ్వాలని, పీఆర్సీ రిపోర్ట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పెరిగిన జీతాలకు అనుగుణంగా కొత్త జీవో ప్రకారం నిన్న జీతాలు వేశారు. ఇప్పుడు మార్చడానికి వీల్లేదు. ఐఆర్ రికవరీ లేకుండా, హెచ్ఆర్ఏ పెంచాలని అడుగుతున్నారు. కానీ ఆ విషయాన్ని మంత్రుల కమిటీ వద్ద చర్చిస్తే బాగుండేది. కోవిడ్ వల్ల ఆర్థిక పరిస్థితి సరిగాలేక ఉద్యోగులు కోరిన మేర పీఆర్సీ ఇవ్వలేకపోతున్నాం. ఏది ఏమైనా జీతాలు పడ్డాయి కాబట్టి జీవోలు వెనక్కి తీసుకోలేము. ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిపై సంప్రదింపులతో సాదించుకోవాలి. లేదంటే ఆ గ్యాప్ అలానే ఉంటుంది. సమ్మె నోటీస్ ఇచ్చి ఆందోళనకు వెళ్తామని చెప్తున్నారు. అనేక సార్లు చర్చలకు ఆహ్వానించి మంత్రుల కమిటీ వేచి చూసింది. ఉద్యోగులు, ప్రభుత్వం వేరు వేరు కాదు. వారు మరోమారు ఆలోచన చేయాలి. చదవండి: (ఆస్తుల విభజనకు తీసుకున్న చర్యలేమిటి?: విజయసాయిరెడ్డి) సమ్మె వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతోంది. మా ఉద్యోగ మిత్రులను రిక్వెస్ట్ చేస్తున్నా చర్చలతో పరిష్కరించుకుందాం. కార్యాచరణ వాయిదా వేయాలని, చర్చలకు రావాలని కోరుతున్నా. ప్రస్తుత పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా ముఖ్యమంత్రి 23 శాతం ఫిట్మెంటు ఇచ్చారు. వచ్చిన జీతాల్లో ఎవరెవరికి ఎంత పెరిగిందో వాళ్ళకే తెలుసు. సామరస్యంతోనే సమస్యను పరిష్కరించుకోవాలి. ఉద్యోగులు ఒకేసారి విజయవాడ రావడం వల్ల కొంత అసౌకర్యం కలుగుతుంది. అసాంఘిక శక్తులు కూడా మన మధ్య దూరాన్ని పెంచే ప్రయత్నం చేయవచ్చు. కోవిడ్ వల్ల ఇబ్బంది ఉంది. 200 మంది కంటే ఎక్కువ గుమికూడి ఉండకూడదు. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కూడా ఉద్యోగులు ఆలోచించాలి అని ప్రభుత్వ సలహాదారు ఎన్. చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. -
సమ్మెకు దిగి ఉద్యోగులు ఏం సాధిస్తారు?: సజ్జల
సాక్షి, తాడేపల్లి: సమస్యల పరిష్కారానికి నేరుగా చర్చలు జరుపుదామని ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సమస్యలుంటే పాయింట్ల వారీగా చెప్పాలని.. మీరు చెప్పే వాటిని పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. చదవండి: ఏపీ ప్రయోజనాలు విస్మరించిన కేంద్రం ‘‘సమ్మె అవసరం లేకుండా సమస్య పరిష్కారం చేద్దామని చెప్పాం. ఉద్యోగ సంఘాలు మూడు డిమాండ్లపైనే పట్టుబడుతున్నాయి. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. సమస్యలను జఠిలం చేసుకోవద్దని చెప్పాం. కరోనా నేపథ్యంలో ఆందోళన వద్దని’’ సజ్జల విజ్ఞప్తి చేశారు. బల ప్రదర్శన చేద్దామని చూడ్డం సరికాదన్నారు. కొత్త పీఆర్సీతో ఎవ్వరి జీతాలు తగ్గలేదని.. ఉద్యమాలతో ఉద్యోగులకు నష్టం చేయవద్దని సజ్జల కోరారు. సమ్మెకు దిగి ఉద్యోగులు ఏం సాధిస్తారు?. ఉద్యోగుల కార్యాచరణను పక్కన పెట్టాలని చెప్పాం. సమ్మెకు వెళ్లకముందే రోడ్డు ఎక్కడం సరికాదని’’ సజ్జల రామకృష్ణారెడ్డి హితవు పలికారు. -
సమ్మె పరిష్కారం కాదు
సాక్షి, అమరావతి: కొత్త వేతన సవరణకు సంబంధించిన పిటిషన్ న్యాయస్థానం ముందు పెండింగ్‌లో ఉండగా సమ్మెకు వెళ్లడమేమిటని ఉద్యోగ సంఘాలను రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. ప్రతీ సమస్యకూ సమ్మె పరిష్కారం కాదని చెబుతూ.. కోర్టు ముందు పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే సమ్మెకు వెళ్లడం అంటే కోర్టుపై ఒత్తిడి తీసుకురావడమేనని.. ఇలాంటి ఎత్తుగడలను తాము అనుమతించబోమని స్పష్టంచేసింది. చట్టానికి లోబడి ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ అందరికీ ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమ వినతుల ఆధారంగా మళ్లీ వేతనాలను సవరించి, ఆ మేర ఉత్తర్వులు జారీచేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ గెజిటెడ్ అధికారుల జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) తదితర అంశాల జోలికి తామిప్పుడు వెళ్లడంలేదని, ఈ దశలో వాటిపై విచారణ అవసరంలేదని ధర్మాసనం స్పష్టంచేసింది. అలాగే, ఏ ఒక్క ప్రభుత్వోద్యోగి జీతం నుంచి ఎలాంటి మొత్తాలను రికవరీ చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పీఆర్సీ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కూడా తెలిపింది. ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వోద్యోగులు ఇక సమ్మెకు వెళ్లరనే భావిస్తున్నామని ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. బెంచ్ హంటింగ్‌ను ప్రోత్సహించబోం ఈ సందర్భంగా సీజే స్పందిస్తూ.. ఈ వ్యాజ్యం ధర్మాసనం ముందుకే వస్తుందని మొదట ఈ వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్ అమానుల్లా ధర్మాసనం దృష్టికి ఎందుకు తీసుకురాలేదని అడ్వొకేట్ జనరల్ (ఏజీ)ను ప్రశ్నించారు. అలాగే, అధికరణ 309 కింద జారీచేసిన జీఓను సవాలు చేశామన్న సంగతి ఎందుకు ధర్మాసనానికి చెప్పలేదని అడిగారు. అనంతరం, ఏజీ శ్రీరామ్ సమాధానమిస్తూ.. ‘నిబంధనల గురించి నేను ఆ ధర్మాసనానికి చెప్పాను. దానిపై చర్చ కూడా జరిగింది. ఆ ధర్మాసనం సైతం ఈ వ్యాజ్యాన్ని మొదటి కోర్టే విచారించాలని అభిప్రాయపడింది. అయితే, పిటిషనర్ తరఫు న్యాయవాదే ఈ వ్యాజ్యం పునర్విభజన చట్ట నిబంధనల కిందకు వస్తుందని చెప్పారు. తరువాత సింగిల్ జడ్జి వద్ద కూడా నేను నిబంధనల గురించి వివరించాను’.. అని చెప్పారు. ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలపై తాము ఎంతమాత్రం సంతోషంగా లేమన్న ధర్మాసనం, బెంచ్ హంటింగ్‌ను తాము ప్రోత్సహించబోమని వ్యాఖ్యానించింది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా తాను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతానని, అది కూడా ఓపెన్ కోర్టులోనే మాట్లాడతానని, అది తనకున్న చెడ్డ అలవాటని సీజే జస్టిస్ మిశ్రా అన్నారు. ప్రతీ ఉద్యోగి వాదనను ప్రభుత్వం వినలేదు కదా? పిటిషనర్ తరఫు న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపిస్తూ.. వేతన సవరణ కోసం నియమించిన అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదికను ప్రభుత్వం ఇప్పటివరకు బహిర్గతం చేయలేదని.. కొత్త వేతన సవరణ జీఓ ఏకపక్షంగా ఇచ్చారన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ‘ప్రభుత్వం ప్రతీ ఉద్యోగి వాదన వినలేదు కదా? అందుకే జాయింట్ యాక్షన్ కమిటీతో మాట్లాడింది. వివిధ తేదీల్లో చర్చలు జరిపారు కదా. జేఏసీతో మాట్లాడిందంటే ఉద్యోగులందరితో మాట్లాడినట్లే.’ అని స్పష్టంచేసింది. పిటిషనర్‌ను కొత్త వేతన సవరణ ఏ విధంగా ప్రభావితం చేస్తోందని ధర్మాసనం ప్రశ్నించింది. కొత్త వేతన సవరణవల్ల పిటిషనర్ జీతం తగ్గిందని, ఎలా తగ్గిందో వివరిస్తూ మెమో దాఖలు చేశానని రవితేజ తెలిపారు. జనవరిలో ఎంత వచ్చింది? ఫిబ్రవరిలో ఎంత వచ్చింది? అని ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషనర్ జీతం రూ.22,432లు పెరిగింది ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ జోక్యం చేసుకుని.. పిటిషనర్ పే స్లిప్పుతో సహా అన్ని వివరాలతో తాము ఓ మెమో దాఖలు చేశామని చెప్పారు. పిటిషనర్ బేసిక్ పే డిసెంబర్లో రూ.51,230 ఉండగా, వేతన సవరణ తరువాత జనవరిలో అది రూ.78,820కి పెరిగిందన్నారు. మొత్తంగా అతని స్థూల జీతంలో రూ.22,432 పెరుగుదల ఉందని వివరించారు. ప్రభుత్వోద్యోగుల్లో వివిధ హోదాలకు గతంలో వచ్చిన జీతం, ఇప్పుడు పొందుతున్న జీతం వివరాలను ఆయన ధర్మాసనం ముందుంచారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ.. కరువు భత్యం, ఇంటి అద్దె భత్యం, సీసీఏ ఉపసంహరించారు కదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. వేతన సవరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే అనుసరించామని ఏజీ శ్రీరామ్ చెప్పారు. గతంలో ఇచ్చిన మధ్యంతర భృతి, తాజాగా నిర్ణయించిన ఫిట్‌మెంట్‌కు మధ్య ఎంత మొత్తం తేడా ఉందో దాన్ని రికవరీ చేస్తామని ప్రభుత్వం అంటోందని, దీనిపైనే ఉద్యోగులు ప్రధానంగా ఆందోళన చెందుతున్నారని, ఈ విషయంలో తాము తగిన ఆదేశాలిస్తామని ధర్మాసనం తెలిపింది. ఉద్యోగులకు నోటీసులు ఇవ్వకుండా ఎలా రివకరీ చేస్తారని ప్రశ్నించింది. తాము హెచ్ఆర్ఏ, డీఏల జోలికి వెళ్లడంలేదని, వాటిపై ప్రస్తుతానికి విచారణ అవసరంలేదంది. ఈ వ్యవహారంలో చాలా సున్నిత అంశాలున్నాయని, వాటన్నింటిపై తరువాత లోతుగా విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. జీతం తగ్గుదల లేదు.. రికవరీ లేదు.. ఇక 2021–2022 మధ్య జీతాల్లో తగ్గుదల లేనప్పుడు ప్రభుత్వోద్యోగులు ఎందుకు ఆందోళన చెందుతున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ఉద్యోగులు దురభిప్రాయంతో ఉన్నారని, అందువల్లే వారు అనవసర ఆందోళనకు గురవుతున్నారని ఏజీ చెప్పారు. 2021 డిసెంబర్లో తీసుకున్న జీతంతో పోలిస్తే ఏ ఒక్క ఉద్యోగి జీతం కూడా తగ్గడంలేదని ఆయన పునరుద్ఘాటించారు. ఏ ఒక్కరి జీతం నుంచి ఎలాంటి మొత్తం రికవరీ ఉండదన్నారు. ఈ వివరాలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీఓ–1 అమల్లో భాగంగా పిటిషనర్‌తో సహా ఏ ఉద్యోగి జీతం నుంచి ఎలాంటి మొత్తాలను రికవరీ చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేసింది. ఉద్యోగులూ.. చట్టం ఏం చెబుతుందో చూడండి.. ఈ సందర్భంగా జీతాల విషయంలో ఉద్యోగుల హక్కుల గురించి మాట్లాడటానికి ధర్మాసనం సిద్ధమైంది. ఆన్లైన్లో చాలామంది ఉద్యోగులు ఈ కేసులో ఏం జరుగుతుందో చూస్తున్నారని, వారంతా కూడా జీతాలకు సంబంధించి చట్టం ఏం చెబుతుందో చూడాలని కోరింది. ఇంతకుమించి తాము ఈ విషయంలో మాట్లాడబోమంది. ఉద్యోగుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని జీతాల రికవరీ విషయంలో తాము మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చామని, ఈ ఉత్తర్వుల తరువాత కూడా ఉద్యోగులు సమ్మెకు వెళ్తారని తాము అనుకోవడంలేదని ధర్మాసనం తెలిపింది. అనంతరం ఏజీ స్పందిస్తూ.. కేసు మొదలు కావడానికి ముందు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. అవన్నీ మనస్సులో పెట్టుకోవద్దని, తనకు ఏదీ లోపల దాచుకోవడం అలవాటులేదని, ఉన్నది ఉన్నట్లు బయటకు మాట్లాడేస్తానని సీజే జస్టిస్ మిశ్రా చెప్పారు. రిజిస్ట్రీలో ఏమేం జరుగుతున్నాయో కూడా తనకు బాగా తెలుసునన్నారు. -
ఎవ్వరికీ జీతాలు తగ్గలేదు.. ఆ ఆలోచనను విరమించుకోండి: సీఎస్ సమీర్ శర్మ
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు సీఎం ఏమి చెయ్యగలరో అన్నీ చేస్తారని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అన్నారు. ఈ మేరకు సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐఆర్ ఉన్నా.. ఐఆర్ లేకున్నా ఉద్యోగుల జీతం పెరుగుతుంది. ఎవ్వరికీ జీతం తగ్గకూడదని సీఎం చెప్పారు. గత పీఆర్సీ నుంచి ఇప్పటి పీఆర్సీ వరకు చూస్తూ ఎక్కువ పెరుగుదల ఉంది. ఐఆర్‌తో కలిపినా పెరుగుదల ఉంది. ఎవ్వరికీ జీతాలు తగ్గలేదు. ఈ రోజు రాత్రికి అందరికీ జీతాలు వచ్చాక తెలుస్తుంది. ఉద్యోగులు ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. వాస్తవానికి ప్రతి ఏటా 15 శాతం ఆదాయం పెరగాలి. పీఆర్సీకి అదనంగా గ్రాట్యుటీ, హౌసింగ్ స్కీమ్ వలన అదనపు ప్రయోజనం ఉంది. ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగం. ప్రతి పీఆర్సీ అప్పుడు చర్చల కమిటీ ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగులు ఏ సమస్య ఉన్నా చర్చించుకుందాం. సమ్మె ఆలోచనను విరమించుకోండి. మనమంతా ఒక కుటుంబం. హెచ్ఆర్ఏ లాంటివి మాట్లాడుకుందాం రండి. ఉద్యోగులను చర్చలకు రమ్మని కోరుతున్నాను' అని సీఎస్ సమీర్ అన్నారు. చదవండి: (కేంద్ర బడ్జెట్ నిరుత్సాహపరిచింది: ఎంపీ విజయసాయిరెడ్డి) ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్ మాట్లాడుతూ.. ఆర్థిక శాఖ నుంచి ఉద్యోగులను.. మంత్రులు, అధికారులతో చర్చలకు రమ్మని కోరుతున్నాను. ఉద్యోగులకు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాం. ఒకటో తేదీన జీతాలు వెయ్యడం ప్రభుత్వ బాధ్యత. 3.69లక్షల సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు జీతాలు వేశాము. 1.75 లక్షల ఇతర ఉద్యోగులకు జీతాలు వేశాము. 94,800 ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు జమచేశాము. 3.3 లక్షల మంది పెన్షనర్లకు జమచేశాము. 3,97,564 రెగ్యులర్ ఉద్యోగుల జీతాలు కూడా వేశాము. వారికి శాలరీ బ్రేక్ అప్ కూడా పంపాము. ప్రతి ఉద్యోగి వారి జీతాల పెరుగుదలను తెలుసుకునేలా బ్రేక్ అప్ ఇచ్చాము అని ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్ అన్నారు. -
ఉద్యోగులతో మంత్రుల కమిటీ సమావేశం
తాడేపల్లి: మంత్రుల కమిటీతో చర్చలకు హాజరు కాబోమని పట్టుబట్టిన ఉద్యోగ సంఘాలు పట్టువిడుపు ప్రదర్శించాయి. ఈ మేరకు మంగళవారం మంత్రుల కమిటీతో పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు చర్చల్లో పాల్గొన్నారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణలతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు ఈ సమవేశంలో పాల్గొనగా, పీఆర్సీ స్టీరింగ్ కమిటీ నుంచి వెంకట్రామిరెడ్డి, కె ఆర్ సూర్యనారాయణ, బొప్పరాజు, బండి శ్రీనివాస్ చర్చల్లో పాల్గొన్నారు. -
AP: చర్చలకు సరే
సాక్షి, అమరావతి: పీఆర్సీ జీవోలను రద్దు చేస్తే కానీ మంత్రుల కమిటీతో చర్చలకు హాజరు కాబోమని పట్టుబట్టిన ఉద్యోగ సంఘాలు పట్టువిడుపు ప్రదర్శించాయి. మంత్రుల కమిటీ నుంచి తమకు లిఖిత పూర్వకంగా ఆహ్వానం వస్తే చర్చలకు వెళతామని సోమవారం పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించారు. ఆ తరువాత కొద్దిసేపటికే మంత్రుల కమిటీ నుంచి వారికి లిఖితపూర్వక ఆహ్వానం అందడంతో ప్రతిష్టంభనకు తాత్కాలికంగా తెరపడింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో చర్చలకు రావాలని మంత్రుల కమిటీ తరఫున జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఆహ్వానించారు. పీఆర్సీ సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ, కె. వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, కేవీ శివారెడ్డి, సీహెచ్ కృష్ణమూర్తి తదితర 20 మంది పేర్లను లేఖలో పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలోని రెండో బ్లాకు ఆర్థిక శాఖ కాన్ఫరెన్స్ హాలులో సమావేశానికి రావాలని పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీకి పంపిన ఆహ్వానంలో సూచించారు. చర్చలకు సిద్ధమే: స్టీరింగ్ కమిటీ మంత్రుల కమిటీతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన కమిటీ సమావేశంలో ప్రస్తుత పరిణామాలు, కార్యాచరణ, ప్రభుత్వంతో ఎలా వ్యవహరించాలనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పాత జీతాలే ఇవ్వాలని కోరతాం: బొప్పరాజు ఈనెల 3వ తేదీన చలో విజయవాడ నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు, స్టీరింగ్ కమిటీ సభ్యుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు నుంచి అల్లూరి సీతారామరాజు వంతెన మీదుగా భాను నగర్ చేరుకుని సభ నిర్వహిస్తామన్నారు. 7వతేదీ నుంచి సమ్మె తలపెట్టిన నేపథ్యంలో న్యాయపరమైన అంశాలను ఎదుర్కొనేందుకు ఇద్దరు హైకోర్టు సీనియర్ న్యాయవాదులు వైవీ రవి ప్రసాద్, సత్యప్రసాద్‌లను నియమించుకున్నామని తెలిపారు. కొత్త జీవోలను నిలిపివేసి పాత జీతాలే చెల్లించాలని చర్చల్లో కోరతామన్నారు. మేం రాలేదనడం సరికాదు: బండి ఉద్యోగ సంఘాలు చర్చలకు రావడం లేదని మంత్రుల కమిటీ పేర్కొనడం సరికాదని ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు చెప్పారు. స్టీరింగ్ కమిటీలోని 9 మంది సభ్యులంతా చర్చలకు సంబంధించిన అంశంపై సంతకాలు చేసి పంపినట్లు తెలిపారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదో అర్ధం కావడం లేదన్నారు. రివర్స్ పీఆర్సీతో గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు. భయపెట్టేలా మెమోలు: సూర్యనారాయణ తమపై తప్పుడు ప్రచారం చేయవద్దని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ కోరారు. జీతాల చెల్లింపుపై అధికారులు భయపెట్టే విధంగా ఖజానా శాఖ ఉద్యోగులకు మెమోలు జారీ చేస్తున్నారని చెప్పారు. ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం ఆటవిక చర్యని విమర్శించారు. ఆర్ధికశాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. బెదిరింపులకు లొంగేది లేదని, అవసరమైతే న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. ఆర్థిక శాఖలోని ఐఏఎస్ అధికారులపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రింటెడ్ చార్జీ మెమోలకు ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. నిబంధనల ప్రకారం సీసీఏ రూల్ 20 ప్రకారం మాత్రమే చర్యలు తీసుకోవాలన్నారు. సర్వీస్ రిజిస్టర్ లేకుండా పే ఫిక్సేషన్ ఎలా చేస్తారని ప్రశ్నించారు. చలో విజయవాడ సభ నిర్వహించనున్న ప్రాంతాన్ని స్టీరింగ్ కమిటీ సభ్యులు పరిశీలించారు. -
పీఆర్సీ బిల్లులు చేయని అధికారులకు ఛార్జ్ మెమోలు
సాక్షి, విజయవాడ: పీఆర్సీ బిల్లులు చెయ్యని అధికారులకు ఏపీ ప్రభుత్వం మెమోలు జారీ చేసింది. మొత్తంగా 27 మందికి మెమోలు జారీ కాగా.. అందులో ముగ్గురు డీడీలు, 21 మంది సబ్ ట్రెజరీ ఆఫీసర్లు, ఇద్దరు ఏటీఓలు ఉన్నారు. జీతాల బిల్లులు సిద్ధం చేయడంలో అలక్ష్యంగా వ్యవహరించినందుకుగానూ అధికారులు.. ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు. చదవండి: (కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు: మంత్రి బొత్స) -
ఉద్యోగ సంఘాలొస్తేనే చర్చలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: పీఆర్సీపై స్పష్టంగా మాట్లాడేందుకు ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించినా వారు రాలేదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉద్యోగ సంఘాలు ఎప్పుడు వస్తే అప్పుడు పీఆర్సీపై స్పష్టత కోసం చర్చలు ఉంటాయని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా పిరిడి వద్ద తోటపల్లి పిల్ల కాలువలు, మిగులు పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కోటి ఎకరాలకు సాగు నీరివ్వాలన్న జలయజ్ఞంలో భాగంగా తోటపల్లి ప్రాజెక్టు పనులను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 85 శాతం పూర్తి చేశారని చెప్పారు. తర్వాత అంచనాలు పెంచేసి, మిగిలిన కొద్దిపాటి పనులనూ పూర్తి చేయకుండానే అంతా తామే చేశామని బుకాయించడం చంద్రబాబుకు, అతని తఫేదార్లకే చెల్లిందన్నారు. వారి పాలనా కాలమంతా ప్రచారార్భాటాలకు, ప్రతిపక్షంపై విమర్శలకే సరిపోయిందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యత తీసుకుని తోటపల్లి ప్రాజెక్టు మిగులు పనులు, పిల్ల కాలువల పనులు రెండు ప్యాకేజీల కింద చేపట్టేందుకు రూ.120 కోట్లు మంజూరు చేశారన్నారు. ఇందులో బొబ్బిలి ప్రాంతం వద్ద రూ.58.59 కోట్లతో చేపట్టే మొదటి ప్యాకేజీ పనులకు శంకుస్థాపన చేశామని చెప్పారు. రెండో ప్యాకేజీ నెల్లిమర్ల వద్ద మరో రూ.60 కోట్ల పైచిలుకు నిధులతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధి పరుగులు తోటపల్లి ప్రాజెక్టు ద్వారా 1.20 లక్షల ఎకరాలకు సాగు నీరిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి బొత్స తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తయితే విజయనగరం జిల్లాలో 4.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్ అల్లకల్లోలం చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో రెండేళ్లలో లక్షా 30 వేల కోట్ల రూపాయల మేర సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, అలజంగి జోగారావు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టరు ఎ.సూర్యకుమారి, జలవనరుల శాఖ నార్త్ కోస్ట్ సీఈ శంబంగి సుగుణాకరరావు పాల్గొన్నారు. -
సమ్మెలోకి మమ్మల్ని లాగొద్దు
సాక్షి, అమరావతి/గాంధీనగర్ (విజయవాడ): స్వార్థ రాజకీయాలకు వంతపాడబోమని, అందుకే తామెవ్వరం సమ్మెలో పాల్గొనడం లేదని ఆర్టీసీ ఉద్యోగులు స్పష్టం చేశారు. పీఆర్సీ సాధన సమితి చేస్తున్న రాజకీయాలకు ప్రజా రవాణా విభాగం (పీటీడీ) వంత పాడదని చెప్పారు. సమ్మెను ఎదుర్కొంటామని తెలిపారు. పీటీడీలో అతిపెద్ద సంఘాల్లో ఒకటైన వైఎస్సార్ ఈఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. రాష్ట్ర, జోనల్, డివిజనల్, నాన్ ఆపరేషన్ నాయకులు అధిక సంఖ్యలో సమావేశంలో పాల్గొన్నారు. సమ్మె ఆవశ్యకత, జేఏసీల తీరుపై సుదీర్ఘంగా చర్చించారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లేది లేదని సంఘం 13 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు తేల్చి చెప్పారు. పీఆర్సీ సాధన సమితికి పలు ప్రశ్నలు సంధించారు. ఈ వివరాలను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు డీఎస్పీ రావు, ప్రధాన కార్యదర్శి ఎం.అబ్రహాం, ముఖ్య ఉపాధ్యక్షుడు జేఎం నాయుడు మీడియాకు తెలిపారు. పీటీడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పీటీడీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎల్లవేళలా సిద్ధమని చెప్పారు. చర్చల ద్వారా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని, సమ్మెలో పాల్గొనవద్దని ఉద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఆర్టీసీని వాడుకోవాలని జేఏసీ చూస్తోంది ‘ఆర్టీసీ రూ.6,900 కోట్ల నష్టంలో ఉంది. ప్రతి నెలా రూ.150 కోట్లు అప్పు చేస్తే కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఆర్టీసీ ఏమవుతుందో అనుకున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేవదూతలా వచ్చి సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశారు. ఉద్యోగులు ఎవరూ కోరలేదు. పోరాటాలు చేయలేదు. అయినా ఇచ్చిన మాట కోసం ప్రభుత్వంలో విలీనం చేసి చరిత్ర సృష్టించారు. 54 వేల మంది కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చారు. ఆర్టీసీ నుంచి రూపాయి ఆదాయం రాకపోయినా రూ.6 వేల కోట్లు జీతభత్యాలు చెల్లించి ఉద్యోగులను ఆదుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి ఎటువంటి మెమోరాండం ఇవ్వకుండా, చర్చలు జరపకుండా కొందరు హఠాత్తుగా బస్సులు నిలిపివేస్తామనడం సరికాదు. ఆర్టీసీ బస్సులు ఆగిపోతే ఎన్జీవోల సమ్మెకు ఉపయోగం. ఆర్టీసీ ఉద్యోగులను వాడుకోవాలని జేఏసీ చూస్తోంది. మనకు సంబంధం లేని సమ్మెలోకి వెళ్లొద్దు. అడుగడుగునా సమ్మెను అడ్డుకోవాలి’ అని ఆర్టీసీ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సమావేశంలో మాట్లాడుతున్న ఆర్టీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చల్లా చంద్రయ్య పీఆర్సీ సాధన సమితికి సంధించిన ప్రశ్నలివీ ► పీఆర్సీ సాధన సమితి ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో పీటీడీ ఉద్యోగుల అంశాలు ఏమైనా ఉన్నాయా? ► మీరు పెట్టిన 75 డిమాండ్లలో పీటీడీ ఉద్యోగులకు సంబంధించినవి ఎన్ని? ఎన్నింటిపై చర్చించారు? ఎన్ని సాధించారు? ► పీటీడీ ఉద్యోగులకు వేతన స్థిరీకరణ, క్యాడర్, ఫిట్మెంట్, ఇళ్ల స్థలాలు ఏ మేరకు ఇస్తారో తెలియక ముందే మీ స్వార్థం కోసం సమ్మెకు ఉసిగొల్పడం ఎంత వరకు సమంజసం? ► ఈ ఉద్యమం నాయకుల మనుగడ కోసమా? ఉద్యోగుల మేలు కోసమా? అనేది అర్థంకాని పరిస్థితి ఉద్యోగుల్లో ఉంది. ►పీఆర్సీ సాధన సమితి స్వార్థ రాజకీయాలకు పీటీడీలోని సంఘాలు ఎందుకు వంత పాడుతున్నాయి? దీని ద్వారా ప్రభుత్వానికి ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకొంటున్నాయి? ఇదీ మా వినతి ‘పీటీడీ ఉద్యోగులకు క్యాడర్, వేతన స్థిరీకరణ, ఫిక్సేషన్ అమలు చేయాలి. పాత పెన్షన్ సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు, పీటీడీ ఉద్యోగుల జీత భత్యాల్లో వ్యత్యాసం ఉన్న 19 శాతం ఫిట్‌మెంట్‌ను వర్తింపజేయాలి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇవ్వాలి. బకాయిలు చెల్లించాలి. ఇహెచ్ఎస్ ద్వారా మెరుగైన వైద్య సదుపాయం అందించాలి. కారుణ్య నియామకాలు 2016 నుంచి చేపట్టాలి’ అని ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. -
‘చర్చలకు వచ్చేవరకూ ఎదురుచూస్తాం’
సాక్షి, అమరావతి: ఉద్యోగులు చర్చలకు వచ్చే వరకూ ఎదురుచూస్తామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులని, 3 రోజులు కాదు.. 30 రోజులైనా ఎదురుచూస్తామన్నారు. ‘చర్చలకు వచ్చుంటే ఈపాటికే సమస్య పరిష్కారం అయ్యేదేమో. జీవోలు రద్దు చేసేంత వరకూ చర్చలకు రామని చెప్పడం సమంజసం కాదు. జిల్లాల ఏర్పాటు చంద్రబాబుకి హఠాత్తుగా కనిపించొచ్చు. కానీ మేము రెండేళ్లుగా ఈ ప్రక్రియ చేస్తున్నాం. ఎన్టీఆర్ పేరు పెట్టేసరికి చంద్రబాబు షాక్‌కి గురయ్యారు. అందుకే ఎన్టీఆర్ పేరు పై స్పందించడం లేదు. ఎన్టీఆర్ కుటుంబీకులు పురందేశ్వరి, రామకృష్ణ స్వాగతించినందుకు సంతోషం’ అని అన్నారు. -
‘వాళ్లు శత్రువులు కాదు... మా ఉద్యోగులే’
సాక్షి, అమరావతి: ఉద్యోగులతో చర్చల కోసం ఎదురుచూశామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్టారెడ్డి తెలిపారు. ఉద్యోగులను పిలిచి చర్చల కోసం ఎదురు చూసినా వారు రాకపోవడం దురదృష్టకరమన్నారు. ఈరోజు(గురువారం) ఏపీ సచివాలయం నుంచి మీడియాతో మాట్లాడిన సజ్జల.. ‘ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకూ ఉద్యోగుల కోసం ఎదురు చూసాం. వ్యక్తిగతంగా కూడా రమ్మని పిలిచాం. ఎప్పుడైనా చర్చల ద్వారానే పరిష్కారం ఉంటుంది. టీవీల ద్వారా పరిష్కారం జరగదు. సమ్మె చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పింది. రేపటి నుండి కూడా మేము అందుబాటులో ఉంటాము. ఉద్యోగ సంఘాలకు చెందిన వారు ఎవరొచ్చినా చర్చిస్తాం. వాళ్ళు శత్రువులు కాదు.. మా ఉద్యోగులే’ అని సజ్జల తెలిపారు. -
కాసే చెట్టుకే... రాళ్ల దెబ్బలా!
ఒక పక్క కరోనా సమస్యతో ఆర్థిక సంక్షోభం. మరో వైపు ఉద్యోగులు తమ జీతాలు మరింత పెంచాల్సిందేనన్న డిమాండ్‌తో ఆందోళన. గత కొద్ది దశాబ్దాలలో ఇంత చిత్రమైన సమ్మె ఆలోచన జరిగి ఉండకపోవచ్చని అనుభవజ్ఞుల వ్యాఖ్య. కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం హెచ్ఆర్ఎ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయిస్తే, దానిపై సమ్మెకు వెళ్లడమా? ప్రస్తుత ప్రభుత్వం హామీ మేరకు ఇంటరిమ్ రిలీఫ్ ఇచ్చిందనీ, దేశంలో బాగా జీతాలు ఇచ్చే రాష్ట్రాలలో ఏపీ ఒకటి అనీ ఇదే ఎన్జీవో నేతలు అంగీకరిస్తూనే సమ్మె చేస్తామనడం విడ్డూరం. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు డిమాండ్లు ఉండ వచ్చు. వేతన సవరణలో తమకు నష్టం జరిగిందని లెక్కలు వేసుకుని ఉండవచ్చు. ఉద్యోగులకు జీతాలు ఇరవైశాతం పెరుగుతాయని చీఫ్ సెక్రటరీతో సహా ఆర్థిక శాఖ ఉన్నతా ధికారులు చెబుతున్నారు. అయినా ఉద్యోగ సంఘాల నేతలు కన్విన్స్ కాలేదు. ఏకంగా సమ్మె నోటీసు ఇచ్చారు. పీఆర్సీ జీఓలు రద్దు చేసేవరకు తాము మంత్రుల కమిటీతో చర్చలు జరపబోమని వారు అంటున్నారు. వాళ్ల సమస్యలను ప్రభుత్వానికి చెప్పవచ్చు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే. వారి సహకారం లేకుండా ఏ ప్రభుత్వం తాను అనుకున్న పనులు సజావుగా పూర్తి చేయ లేదు. ఇంటి అద్దె అలవెన్స్‌లో కొంత తగ్గిందన్నది వారి భావన. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీని వల్ల ఉద్యోగులకు ఏడాదికి ఇరవై, ముప్పై వేల నష్టం కలిగి ఉండవచ్చు. అదే సమయంలో వీరికి రెండేళ్ల రిటైర్మెంట్ వయసు పెంచడం వల్ల ఇరవై లక్షల నుంచి పాతిక లక్షల ప్రయోజనం కలుగుతుంది. దీని గురించి ఆలోచించరా! ఇప్పుడు రిటైరయ్యే ఉద్యోగులు తప్ప మిగిలినవారు తాము ప్రమోషన్లు కోల్పోతామని బాధ పడుతున్నారని కొందరు చెబుతున్నారు. రెండేళ్ల తర్వాతైనా ప్రమోషన్లు వస్తాయి కదా! అదే సమయంలో లక్షల రూపాయల అద నపు జీతం లభిస్తుంది కదా! కొందరు ఎన్జీవో నేతలు మరికొద్ది నెలల్లో రిటైర్ కావాల్సి ఉంది. వారు ప్రభుత్వం ఇచ్చిన రెండేళ్ల పొడిగింపును వాడుకోకుండా వదిలేస్తారా? ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగుల పట్ల అభిమానంతో ఇరవై శాతం తాత్కాలిక భృతిని ఇరవై ఏడు శాతం చేశారు. గతంలో మాదిరి కాకుండా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు వారి పని వారు చేసుకుని టైమ్ ప్రకారం ఇళ్లకు వెళ్లిపోవచ్చు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత పనిభారం తగ్గింది. టీడీపీ ప్రభుత్వ కాలంలో జన్మభూమి, ఇతర కార్యక్రమాల పేరుతో ఒక టైమ్ లేకుండా ఉద్యోగులను ఇబ్బంది పెట్టిన విషయాలను కొందరు గుర్తు చేస్తున్నారు. సమ్మెకు వెళితే మీ సంగతి చూడవలసి వస్తుందని కూడా అప్పటి ప్రభుత్వ పెద్దలు హెచ్చరించిన ఘట్టాలు ఉన్నాయి. చంద్రబాబు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు రాసిన ‘మనసులో మాట’ పుస్త కంలో లక్ష మంది ఉద్యోగులు అదనంగా ఉన్నారనీ, వారిని ప్రూన్ చేయాలనీ రాసిన విషయాన్ని తెలంగాణ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో చదివి వినిపించారు. చంద్రబాబు యాభైకి పైగా ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేశారు. పైగా అది గొప్ప సంస్కరణగా ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా మాట్లాడు తుండవచ్చు. ఇక తెలుగుదేశానికి మద్దతిచ్చే మీడియా వీలైనంతగా ఉద్యోగులను రెచ్చగొడుతోంది. ఇవే పత్రికలు తమ సంపాదకీయాలలో ఉద్యోగ వ్యయం తగ్గించాలని రాసిన విషయం మర్చిపోకూడదు. అప్పుడు చంద్రబాబు నాయుడు కార్మిక సంఘాలను రద్దు చేస్తామని హెచ్చరిం చినా, ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేస్తామని అన్నా ఆయనలోని సంస్కరణలు ఈ పత్రికలకు కనిపించేవి. ఇప్పుడు జీతాలు పెరుగుతున్నా, పెద్ద సంఖ్యలో ఉద్యో గాలు ఇచ్చినా ఈ ప్రభుత్వాన్ని ఉద్యోగ వ్యతిరేక ప్రభు త్వంగా చిత్రీకరించే యత్నం చేస్తున్నాయి. కరోనా కాలంలో ఆర్థిక పరిస్థితి క్షీణించింది. సుమారు ముప్పైవేల కోట్ల ఆదాయం తగ్గిందనీ, అయినా ఉద్యోగు లకు ఇరవై శాతం జీతాలు పెరుగుతున్నాయనీ అధికారులు చెబుతున్నారు. ఈ నెలలో కొత్త జీతాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత తమకు జీతాలు ఇంకా పెంచాలని అడిగితే బాగుంటుంది. అదే సమ యంలో సంక్షేమ కార్యక్రమాలను అప్పు చేసి అమలు చేయడం లేదా అని ప్రశ్నించవచ్చు. రెక్కాడితే గానీ డొక్కా డని బడుగు జీవులతో వీరిని పోల్చరాదు. కరోనాలో ఉపాధి కోల్పోయి, నానా తంటాలు పడుతున్న పేదలకు ప్రభుత్వ స్కీములు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నది వాస్తవం. గ్రామ, సచివాలయ వ్యవస్థల ద్వారా లక్షన్నర మందికి జగన్ ఉపాధి కల్పించారు. వారికి కూడా స్కేల్ వర్తింపజేయవలసి ఉంది. ఆ వ్యయాన్ని కూడా పరిగణన లోకి తీసుకోవాలి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు పెంచారు. ఉద్యోగులకు పెరిగిన జీతాల వల్ల 10,700 కోట్ల అదనపు భారం పడనుండగా, అవుట్ సోర్సింగ్ వారికి వేతనాలు పెంచడంతో మరో 780 కోట్ల అదనపు వ్యయం అవుతుందని లెక్కగట్టారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసేవారికి ఉద్యోగులు సహకరిస్తే అంతిమంగా వీరికే నష్టం జరుగుతుంది. వీటన్నిటి గురించి, ప్రస్తుత పరిస్థితుల గురించి కూడా ఉద్యోగులు ఆలోచించాలి. తెలుగుదేశం, బీజేపీ, వామపక్షాలు డబుల్ గేమ్ ఆడుతూ ఉద్యోగులకు మద్దతు ఇస్తున్నట్లు నటించ వచ్చు. కానీ ఉద్యోగులు భ్రమలలోకి వెళ్లకుండా ఉండాలి. అంతిమంగా ఒక మాట చెప్పాలి. లక్ష ఉద్యోగాలు తొలగిం చాలని చెప్పినవారికి మద్దతు ఇస్తారా? లక్ష ఉద్యోగాలు ఇచ్చినవారికి మద్దతు ఇస్తారా అన్నది ఉద్యోగ సంఘాలు తేల్చుకోవాలి. -కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
27న చర్చిద్దాం.. అందరూ కలిసి రండి
సాక్షి, అమరావతి: పీఆర్సీపై చర్చించడానికి స్టీరింగ్ కమిటీ సభ్యులందరూ కలిసి 27వ తేదీన చర్చలకు రావాలని కోరినట్లు ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. ఏ ఒక్కరికీ ఒక్క రూపాయి కూడా జీతం తగ్గకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పీఆర్సీపై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ సచివాలయంలో వరుసగా రెండో రోజు మంగళవారమూ సమావేశమైంది. అంతకు ముందే సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ మధ్యాహ్నం 12 గంటలకు పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీని చర్చలకు ఆహ్వానించారు. స్టీరింగ్ కమిటీ విజయవాడలో సమావేశమై.. నాలుగు జేఏసీల నుంచి తొమ్మిది మందితో కూడిన ప్రతినిధుల బృందాన్ని పంపింది. ఆలస్యంగా వచ్చిన ప్రతినిధుల బృందం మంత్రుల కమిటీతో గంటన్నరకు పైగా భేటీ అయింది. తాము చర్చలకు రాలేదని, ప్రభుత్వం ప్రధానమైన మూడు డిమాండ్లపై స్పష్టత ఇస్తేనే చర్చలకొస్తామని చెప్పింది. 24న సీఎస్‌కు ఇచ్చిన సమ్మె నోటీసులోని అంశాలనే మరోసారి పేర్కొంది. అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదికను బయటపెట్టాలని, కొత్త పీఆర్సీ జీవోలను అబయన్స్‌లో ఉంచాలని, పాత పీఆర్సీ ప్రకారం జనవరి నెల జీతాలు చెల్లించాలంటూ లిఖితపూర్వక వినతిని సమర్పించింది. సమస్యల పరిష్కారం కోసమే మంత్రుల కమిటీ అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీ పని చేస్తోందన్నారు. తమ పరిధిలో లేని అంశాలపై ఉన్నత స్థాయిలో చర్చించి సానుకూలంగా పరిస్థితి చక్కబెడతామని చెప్పారు. ఒకసారి జారీ చేసిన జీవోలను ఆపమనడం సరికాదని హితవు పలికారు. ‘ఇది మీ ప్రభుత్వం. ఫ్రెండ్లీ ప్రభుత్వం. అడిగినా, అడక్కపోయినా చేయగలిగినంత చేస్తోంది. ఇప్పుడు కూడా అపోహలు తొలగించడానికి, నష్టం జరుగుతుంటే సరిదిద్దడానికి ప్రయత్నిస్తోంది. ఇంత కాలం జరిగిన దానిని తిరగదోడమనడం సమంజసం కాదు. సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడకపోతే బాధపడాలి. ప్రజా సంక్షేమంతో పాటుగానే ఉద్యోగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి బాధ్యతతో వ్యవహరిస్తున్నారు. అడగకుండానే 27 శాతం ఐఆర్ ఇచ్చారు. అతి తక్కువ వేతనాలున్న అంగన్వాడీలకు జీతాలు పెంచారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. వారికి ప్రొబేషన్ ఖరారు చేయాలని ఆదేశించారు. ఇలా ఎన్నో అంశాలపై సుదీర్ఘంగా కసరత్తు చేసి నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు వాటిని వద్దంటే ఎలా? ఉద్యోగులు విశాల దృక్పథంతో ఆలోచించాలని ప్రతినిధుల బృందానికి చెప్పాం. ఇదే విధంగా అన్ని స్థాయిల్లోని ఉద్యోగులను కోరుతున్నాం. ఉద్యోగ సంఘాలతో అంతుకు ముందు చర్చించిన అంశాలపై ఇప్పుడు ఆందోళన జరుగుతోంది. వీటిల్లో కొన్ని విషయాలు వారికి తెలియదంటున్నారు. వాటిని నివృత్తి చేసేందుకు మళ్లీ పిలిచాము’ అని రామకృష్ణారెడ్డి తెలిపారు. ఫిట్మెంట్ సమస్య కాదు పీఆర్సీ ఎప్పటికైనా ఇవ్వక తప్పదని, కొత్త పీఆర్సీ వచ్చిన తర్వాత పాత వేతనం ఇవ్వాలని ఉద్యోగులు అడగడానికి లేదన్నారు. ఈ విషయం అందరికీ తెలుసునని విలేకరుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. ఇప్పడు ఫిట్మెంట్ సమస్య కాదని, ఇతర అంశాలుంటే కూలంకషంగా చర్చించి సానుకూలంగా పరిష్కరిస్తామని తెలిపారు. మంత్రుల కమిటీ ఉదయం 11.30 గంటలకే సచివాలయానికి చేరుకుని ఉద్యోగ సంఘాల ప్రతినిధుల కోసం వేచిచూసిందన్నారు. కమిటీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), జీఏడీ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ ఉన్నారు. చర్చలకు వ్యతిరేకం కాదు : స్టీరింగ్ కమిటీ సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్చలకు కమిటీ వేయడం శుభ పరిణామమని పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సభ్యుడు జి.ఆస్కార్ రావు అన్నారు. మంగళవారం సచివాలయంలో మంత్రుల కమిటీతో భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. స్ట్రగుల్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను అనుసరించి ప్రభుత్వంతో చర్చలకు మూడు ప్రధాన డిమాండ్లను నివేదించామన్నారు. వీటిని అంగీకరిస్తేనే చర్చల్లో పాల్గొంటామని చెప్పడానికే వచ్చామన్నారు. షరతులకు అంగీకరిస్తే జేఏసీల చైర్మన్ల స్థాయిలో స్టీరింగ్ కమిటీ సభ్యులు అందరం కలిసి చర్చలకు వస్తామని చెప్పారు. తాము చర్చలకు వ్యతిరేకం కాదన్నారు. మరో సభ్యుడు వైవీ రావు మాట్లాడుతూ.. పీఆర్సీ విషయంలో తాము ఒకే స్టాండ్‌పై ఉన్నామన్నారు. ప్రభుత్వం స్టీరింగ్ కమిటీ డిమాండ్లను అంగీకరించాల్సిందేనన్నారు. కేవీ శివారెడ్డి, కె.రాజేష్, జె.హృదయరాజ్, అరవపాల్, వీవీ మరళీకృష్ణ నాయుడు, ఎం.కృష్ణయ్య, సీహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు కూడా ప్రతినిధుల బృందంలో ఉన్నారు. -
‘అది అధికారికం కాకుండా ఎలా ఉంటుంది’
సాక్షి, అమరావతి: పీఆర్సీ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని గుర్తించబోమని ఉద్యోగ సంఘాలు చెప్పడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఆ కమిటీని అధికారిక కమిటీ కాదనడం సరైనది కాదన్నారు. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీతో చర్చలకు ఆహ్వానం పంపాక అధికారికం కాకుండా ఎలా ఉంటుందని బొత్స ప్రశ్నించారు. ఉద్యోగులు తమ ప్రభుత్వంలో భాగమని, ఉద్యోగులతో చర్చలకు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నామని బొత్స తెలిపారు. కాగా, జీఏడీ ప్రిన్పిపల్ సెక్రటరీ శశిభూషణ్‌ను ఉద్యోగ సంఘాలు కలిసి సమ్మె నోటీసు ఇచ్చాయి. ఇక్కడ చదవండి: ‘ఉద్యోగులు ఎప్పుడూ ప్రభుత్వంలో భాగమే’ పీఆర్సీపై పిటిషన్.. కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు -
ఉద్యోగులకు ఆహ్వానం
సాక్షి, అమరావతి: ఉద్యోగులతో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని, అనవసర ప్రతిష్టంభన సృష్టించొద్దని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. పీఆర్సీపై ప్రభుత్వం నియమించిన కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశమైన సందర్భంగా సజ్జల విలేకరులతో మాట్లాడారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య కమిటీ వారధిలా పని చేస్తుందని చెప్పారు. చెప్పడానికైనా రావాలి కదా? ‘సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ ద్వారా ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించాం. కానీ వారు జీవోలను రద్దు చేస్తేనే చర్చలకు వెళ్తామని మీడియాకు చెబుతున్నారు. అదే విషయాన్ని కమిటీకి చెప్పడానికైనా రావాలి కదా? ఉద్యోగులు చర్చలు జరపాలన్నా.. బాధలు వినిపించాలన్నా.. ఈ కమిటీకే నివేదించాలని ప్రభుత్వం అధికారికంగా చెప్పింది. దీన్ని గుర్తించం అంటే ఎలా? అపోహలు ఉంటే తొలగిస్తాం. సరైన కారణం ఉంటే పునఃసమీక్షిస్తాం. గతంలో ఉద్యోగులను సంతృప్తి పరిచాం. ఇప్పుడు చిన్నచిన్న అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తాం. ఈరోజు రాలేదు.. రేపు వస్తారేమో చూస్తాం. ఉద్యోగులకు కమిటీ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది’ అని సజ్జల పేర్కొన్నారు. ఉద్యోగులు, ప్రభుత్వం ఒకటే ఉద్యోగుల ఆందోళనల వెనుక జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని కొన్ని వర్గాలు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు తాపత్రయపడుతున్నాయని సజ్జల మండిపడ్డారు. కోవిడ్, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనూ ప్రజలకు ఎంత మంచి చేశామో ప్రభుత్వం చెబుతోందన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమైనప్పుడు వారి గురించి ఇంకొకరి వద్దకు వెళ్లి చెప్పాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. కొత్త జీవోల ప్రకారం జీతాల చెల్లింపు ప్రక్రియ చేపట్టబోమని ట్రెజరీ ఉద్యోగులు పేర్కొనడంపై స్పందిస్తూ మెడ మీద కత్తి పెట్టేలా వ్యవహరిస్తే ఉద్యమ కార్యాచరణకు అర్థం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం, ఉద్యోగులు వేర్వేరు కాదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకే కమిటీ ఏర్పాటైనట్లు చెప్పారు. సమావేశంలో మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పాల్గొన్నారు. కమిటీ సభ్యులైన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఢిల్లీ పర్యటనలో ఉన్నందున హాజరు కాలేదు. మంత్రుల కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు పీఆర్సీపై ఉద్యోగులలో నెలకొన్న అపోహలను తొలగించి సందేహాల నివృత్తికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో సీఎస్ సమీర్ శర్మ ఈమేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కమిటీలో ఉన్నారు. కమిటీ సభ్య కన్వీనర్‌గా సీఎస్ ఉంటారు. కమిటీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై పీఆర్సీపై అపోహలను తొలగించడంతో ఏవైనా సమస్యలుంటే పరిష్కరిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పీఆర్సీపై పిటిషన్.. కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు -
పీఆర్సీపై పిటిషన్.. కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు
Latest Updates: పీఆర్సీపై దాఖలైన పిటిషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదని, అదే సమయంలో విభజన చట్టానికి సంబంధించిన పిటిషన్ కూడా కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది వ్యక్తిగత సర్వీస్‌కు సంబంధించిన మేటర్ కాబట్టి ఈ కోర్టులో విచారించలేమని తేల్చి చెప్పింది. ఈ పిటిషన్‌ను వేరొకరికి రిఫర్ చేయాలంటూ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అమానుల్లా, జస్టిస్ భానుమతి తెలిపారు. హైకోర్టులో మళ్లీ ప్రారంభమైన వాదనలు పీఆర్సీ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు మధ్యాహ్నం 2:15కి తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. కోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తికి రూ.28 వేల జీతం పెరిగిందన్నారు. ప్రభుత్వంపై రూ.10,860 కోట్ల భారం పడుతుందని పేర్కొన్నారు. 2018లో ఉద్యోగుల జీతాల కోసం రూ.50వేల కోట్లు ఖర్చు చేస్తే.. ఇప్పుడు ఆ ఖర్చు రూ.68 వేల కోట్లకు చేరిందన్నారు. ఉద్యోగులకు ఇవ్వకూడదన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని, పునర్విభజన చట్టంలో హెచ్ఆర్ఏ ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలని పేర్కొనలేదని పేర్కొన్నారు. పీఆర్సీపై ఏపీ జేఏసీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సోమవారం విచారించింది. ఈసందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గాయా? పెరిగాయా? చెప్పండని పిటిషన్ దారులను హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి సమాచారం లేకుండా పిటిషన్ ఎలా వేస్తారని, అయినా పీఆర్సీని సవాల్ చేసే హక్కు ఉద్యోగులకు లేదని స్పష్టం చేసింది. పీఆర్సీ నివేదిక బయటకు రాకుంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించింది. తదుపరి విచారణను మధ్యాహ్నం 2:15కి వాయిదా వేసింది. ఉద్యోగ సంఘాల నేతలు తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. అంతకుముందు కోర్టులో ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించాయి. విభజన చట్టం ప్రకారం పీఆర్సీ ఇవ్వలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విభజన చట్టం ప్రకారం హెచ్ఆర్ఏ ఇవ్వలేదని అన్నారు. ఇక ఏపీ అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. పీఆర్సీపై ఉద్యోగులు ప్రభుత్వాన్ని ఎలా బెదిస్తారని వాదించారు. సమ్మెకు వెళ్తామని ఉద్యోగులు ప్రభుత్వాన్ని బెదిరించడమే కాకుండా కోర్టులో రిట్ పిటిషన్ ఎలా వేస్తారని ప్రశ్నించారు. అంగన్వాడీ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఏజీ కోర్టుకు దృష్టికి తెచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిందని, అయితే, చర్చలను రాబోమని చెప్తున్నారని కోర్టుకు తెలిపారు. (చదవండి: ‘మీ కుమారుడు చనిపోయినట్లు ఆన్లైన్లో చూపుతోంది.. మేమేం చేయలేం’ )