
సాక్షి, విజయవాడ: పీఆర్సీ బిల్లులు చెయ్యని అధికారులకు ఏపీ ప్రభుత్వం మెమోలు జారీ చేసింది. మొత్తంగా 27 మందికి మెమోలు జారీ కాగా.. అందులో ముగ్గురు డీడీలు, 21 మంది సబ్ ట్రెజరీ ఆఫీసర్లు, ఇద్దరు ఏటీఓలు ఉన్నారు. జీతాల బిల్లులు సిద్ధం చేయడంలో అలక్ష్యంగా వ్యవహరించినందుకుగానూ అధికారులు.. ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు.
చదవండి: (కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు: మంత్రి బొత్స)