memo
-
పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు ?
-
ఆఫీస్‌లో నోటీసులు.. షాక్‌లో ఉద్యోగులు
ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీలు ఆర్ధిక మాంద్యం దెబ్బకు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. ఖర్చుల్ని తగ్గించుకునేందుకు వీలైనన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓ వైపు ఉద్యోగుల్ని తొలగిస్తూనే.. ఆఫీస్‌లో పనిచేసే ఉద్యోగుల టైం విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. అలా ఓ ఆఫీస్ మేనేజ్మెంట్ ‘టైమ్ క్లాక్ ఫ్రాడ్’ పేరుతో ఓ మెమోను జారీ చేసింది. ఇప్పుడు ఆ మెమో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఓ రెడ్డిట్ యూజర్ హెచ్ఆర్ విభాగం జారీ చేసిన మెమోని షేర్ చేశారు. ఆ మెమోలో ఇలా ఉంది. టైమ్ క్లాక్ మోసాన్ని అరికట్టేందుకు ఉద్యోగులు ఐదు నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఈ నియమాలలో భాగంగా ఆఫీస్ వర్క్ ప్రారంభించే ముందు ఉద్యోగులు వ్యక్తిగత కార్యకలాపాలు, బ్యాగ్, ఇతర వస్తువులను సర్ధడం లాంటి పనులు చేసుకోవాలి. ప్రతి ఉద్యోగి తప్పని సరిగా మెమోలోని అంశాలను పాటించాలని, లేదంటే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తున్నట్లు మెమోలో హైలెట్ చేసింది. దీంతో పాటు 10 మంది ఉద్యోగులు రోజుకు 10నిమిషాలు వృధా చేస్తే... అంటే రోజుకు వంద గంటలు నెలకు మూడు వేలగంటలు.. అలా 50 గంటల పేరోల్ లాస్ అవుతుందని తెలిపింది. దీంతో మెమోలో పేర్కొన్న నిబంధనలపై నెటిజన్లు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది తమ అఫీస్‌లో ఎదురవుతున్న అనుభవాల్ని గుర్తు చేసుకుంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. -
ఫార్ములా-ఈ రేసింగ్: ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు మెమో జారీ
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌కు సంబంధించిన వ్యహారంలో ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వం మంళవారం మెమో జారీ చేసింది. ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన ఒప్పందంలోని కొన్ని అంశాలపై పూర్తి వివరణ ఇవ్వాలని అరవింద్ కుమార్‌కు ప్రభుత్వం మెమో ఇచ్చింది. ఫార్ములా-ఈతో త్రైపాక్షిక లాంగ్ ఫారమ్ ఒప్పందం ఎందుకు నమోదు చేశారో తెలపాలని అరవింద్ కుమార్‌ను వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా రూ. 54 కోట్లను హెచ్ఎండీఏ నుంచి ఫార్ములా ఈ రేసుకు బదిలీ చేశారని ఆరోపణలు అరవింద్ కుమార్‌పై ఉన్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ కార్ రేసింగ్ పోటీలను (రేస్ రౌండ్-4) రద్దు చేసినట్లు ఇటీవల ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (ఎఫ్ ఈఓ) ప్రకటించింది. ఫిబ్రవరి 10వ తేదీన నెక్లెస్‌రోడ్డు స్ట్రీట్ సర్క్యూట్లో నిర్వహించవల్సిన ఈ అంతర్జాతీయ పోటీలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఫార్ములా-ఈ పోటీలపై గతేడాది అక్టోబర్ 30వ తేదీన ఏర్పాటు చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపించిన విషయం తెలిసిందే. చదవండి: Hyderabad: పెట్రోల్ బంకుల్లో జనం క్యూ.. పెట్రోల్‌పై పుకార్లు -
పీఆర్సీ బిల్లులు చేయని అధికారులకు ఛార్జ్ మెమోలు
సాక్షి, విజయవాడ: పీఆర్సీ బిల్లులు చెయ్యని అధికారులకు ఏపీ ప్రభుత్వం మెమోలు జారీ చేసింది. మొత్తంగా 27 మందికి మెమోలు జారీ కాగా.. అందులో ముగ్గురు డీడీలు, 21 మంది సబ్ ట్రెజరీ ఆఫీసర్లు, ఇద్దరు ఏటీఓలు ఉన్నారు. జీతాల బిల్లులు సిద్ధం చేయడంలో అలక్ష్యంగా వ్యవహరించినందుకుగానూ అధికారులు.. ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు. చదవండి: (కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు: మంత్రి బొత్స) -
మెస్సేజ్‌కి స్పందించలేదని మెమోలిచ్చిన ఎంపీడీవో
గొల్లపల్లి (బుగ్గారం): అత్యవసర అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా బుగ్గారం ఎంపీడీవో తిరుపతి వాట్సాప్ గ్రూప్‌లో పంచాయతీ కార్యదర్శులకు చేసిన సందేశానికి స్పందన లేకపోవడంతో సదరు అధికారి వారికి మెమోలు జారీ చేశారు. బుగ్గారం మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులను సత్వరం పూర్తి చేయాలని కోరుతూ మూడురోజుల క్రితం నీటి వినియోగం పనులకు సంబంధించిన ఫొటోలను పంచాయతీ కార్యదర్శుల వాట్సాప్ గ్రూపులో పంపించారు. ఆ సందేశాన్ని గ్రూపులో ఉన్న 11 మంది చూసికూడా కనీసం స్పందించలేదు. దీంతో ఉద్దేశపూర్వకంగానే తన సందేశానికి స్పందించలేదని భావించిన ఎంపీడీవో సెలవులో ఉన్న ఇద్దరిని మినహాయించి గ్రూపులోని 9మంది పంచాయతీ కార్యదర్శులకి వివరణ కోరుతూ మెమోలు జారీ చేశారు. ఈ విషయం ఆదివారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో నెటిజన్లు ఎంపీడీవో తీరును తప్పుబడుతూ మంత్రి కేటీఆర్, జగిత్యాల జిల్లా కలెక్టర్ రవికి ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు. -
ఉపాధ్యాయుల పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం
కురవి: మండల కేంద్రంలోని జెడ్పీహైస్కూల్లో విధులు నిర్వహిస్తున్న హెచ్ఎం ఎండీ వాహిద్, బయోలాజికల్ సైన్స్ బోధించే ఉపాధ్యాయురాలు గిరిజ పనితీరుపై కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కురవిలోని ఎంపీడీఓ కార్యాలయంతో పాటు జెడ్పీహైస్కూల్‌ను శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. జెడ్పీహైస్కూల్లో పదో తరగతి విద్యార్థుల గదికి వెళ్లి డిజిటల్ తరగతుల నిర్వహణ, పదో తరగతి విద్యార్థులకు బోధనపై ఆరా విద్యార్థులతో పాఠ్యాంశానికి సంబంధించిన పలు ప్రశ్నలను అడగగా వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో కలెక్టర్ ఉపాధ్యాయురాలు గిరిజపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెమో జారీ చేయాలని డీఈఓను ఆదేశించారు. ఇక పాఠశాలకు మైదానం పెద్దగా ఉండడంతో కిచెన్‌గార్డెన్‌లో భాగంగా మునగ, కరివేపాకు, తదితర మొక్కలను పెంచాలని సూచించినా పట్టించుకోకపోవడంపై హెచ్ఎం వాహిద్‌కు సైతం మెమో జారీ చేశారు. తిరిగి వారం రోజుల్లో పాఠశాలకు వస్తానని, 60 రోజుల ప్రణాళిక ప్రకారం పదో తరగతి విద్యార్థులకు బోధించాలని, వంద శాతం ఫలితాలు రావాలని, లేనట్లైతే సబ్జెక్టు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక మండలంలో 1800 ఖాతాలకు పట్టాదారు పాసుపుస్తకాలు అందచేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని బాగా చేశారని అదే విధంగా గ్రామాలాభివృద్ధికి కృషి చేయాలన్నారు. రెండు గ్రామాల్లో డంపింగ్ యార్డులు, శ్మశానవాటికలు, నర్సరీలను 7వ తేదీలోపు నిర్మాణం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సోమశేఖరశర్మ, డీపీఓ రంగాచారి, ఆర్డీఓ కొమురయ్య, ఇన్చార్జ్ తహసీల్ధార్ మాల్యా, ఎంపీడీఓ కె.ధన్సింగ్, డీపీఆర్ఓ అయూబ్‌అలీ పాల్గొన్నారు. -
డూప్లికెట్ మెమోకు లంచం డిమాండ్
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి డూప్లికేట్ మెమోకు లంచం తీసుకుంటుండగా ప్రభుత్వ పరీక్షల విభాగం సూపరింటెండెంట్ భాస్కర్‌రావు రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కాడు. తనకు డూప్లికేట్ మెమో జారీ చేయాలని అహ్మద్ అబ్దుల్ హసీబ్ అక్బర్ భాస్కర్‌రావును కోరాడు. అయితే మెమో ఇచ్చేందుకు రూ.5 వేలు లంచంగా ఇవ్వాలని భాస్కర్‌రావు డిమాండ్ చేశాడు. దీంతో హసీబ్ అక్బర్ ఏసీబీని ఆశ్రయించాడు. సోమవారం అక్బర్ వద్ద రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా భాస్కర్‌రావును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే గతంలో కూడా భాస్కర్‌రావు డూపికేట్ మెమోకు రూ.1,500 లంచం తీసుకుంటూ పట్టుబడినట్టు ఏసీబీ డైరెక్టర్ జనరల్ పూర్ణచందర్రావు తెలిపారు. మూడేళ్లలో ఇది రెండోసారని, భాస్కర్‌రావును కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్టు వెల్లడించారు. లంచం డిమాండ్ చేసే అధికారులపై టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. -
శిక్షించండి లేదా..క్షమించండి!
సాక్షి, సిటీబ్యూరో: గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్ జరిగి రెండేళ్లు కావస్తోంది... అతడితో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పలువురు పోలీసులకు తాఖీదులు జారీ చేసి ఏడాదిన్నర దాటింది... దీనికి వారు సమాధానం ఇచ్చి సంవత్సరం కావస్తోంది... అయినా ఇప్పటికీ దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సస్పెన్షన్‌కు గురైన వారిపై చర్యలు ఉపసంహరించిన అధికారులు తాఖీదుల విషయం పట్టించుకోవట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ చార్జ్మెమోలపై నిర్ణయం తీసుకోకుంటే అది తమ పదోన్నతుల ప్రక్రియపై ప్రభావం చూపుతుందని వారు గగ్గోలు పెడుతున్నారు. అనేక మందికి చార్జ్‌మెమోలు... నయీం ఎన్కౌంటర్ తర్వాత అతడి వ్యవహారాలను దర్యాప్తు చేయడం కోసం ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లోతుగా ఆరా తీసింది. ఈ నేపథ్యంలో పలువురు బడాబాబుల వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. వీరితో పాటు అనేక మంది పోలీసుల పైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. కొందరికి నయీంతో ఉన్న సంబంధాలపై పక్కా ఆధారాలు లభించగా.. మరికొందరు అతడితో దిగిన ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు ఐదుగురిని సస్పెండ్ చేయడంతో పాటు మరో 20 మందిపై విచారణ నిర్వహించారు. వీరిలో 16 మందికి నయీంతో ఉన్న సంబంధాలపై పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ చార్జ్‌మెమోలు జారీ చేశారు. సమాధానాన్ని పట్టించుకోలేదు... చార్జ్‌మెమోలు అందుకున్న వారిలో డీఎస్పీలతో పాటు ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు సైతం ఉన్నారు. వీరంతా ఆరు నెలల్లోపే వివరణ ఇచ్చారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా పని చేసిన నయీంతో విధి నిర్వహణలో భాగంగానే సంబంధాలు కొనసాగించామని, ఈ విషయంలో ఉన్నతాధికారులు ఆదేశాల ప్రకారమే వ్యవహరించినట్లు కొందరు పేర్కొన్నారు. మరికొందరు అధికారులు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అతడితో ఎలాంటి సంబంధాలు లేవని, అనుకోని పరిస్థితుల్లో కొన్ని ఫంక్షన్స్‌లో అతడు కలిశాడంటూ వివరణ ఇచ్చుకున్నారు. దాదాపు ప్రతి అధికారీ అతడితో తమకు ఎలాంటి లావాదేవీలు లేవని, సెటిల్మెంట్లతో సంబంధాలు లేకపోవడమే కాదు అప్పట్లో ఈ వివరాలు తమకు తెలియవని చెప్పారు. పట్టించుకోని ఉన్నతాధికారులు... నయీంతో సంబంధాల ఆరోపణలపై సస్పెండ్ అయిన వారిలో ఇద్దరిపై ఇటీవల చర్యలు ఉపసంహరించారు. చార్జ్‌మెమోలు అందుకున్న అధికారులు వివరణలు ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. సాధారణంగా పోలీసులపై తీవ్రస్థాయి ఆరోపణలు వస్తే వారికి చార్జ్‌మెమో జారీ చేస్తారు. సదరు అధికారి ఇచ్చిన వివరణను పరిగణలోకి తీసుకుని తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వివరణతో సంతృప్తి చెందితే చార్జ్‌మెమో ఉపసంహరించడం, లేదా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే నయీం కేసులో చార్జ్‌మెమోలు అందుకున్న వారు ఇచ్చిన వివరణల్ని అధికారులు పట్టించుకోవట్లేదు. సాధారణంగా వివరణ ఇచ్చిన మూడు నెలల్లో ఏదో ఒక చర్య తీసుకోవాల్సి ఉన్నా... డీజీపీ కార్యాలయంతో పాటు నగర పోలీసు కార్యాలయం ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదు. పదోన్నతి ప్రక్రియకు అడ్డంకిగా... పోలీసు విభాగంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల ప్రకారం పదోన్నతి ఓ ప్రహసనం. ఓ అధికారికి ఈ అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అలా అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి చార్జ్‌మెమోలు అడ్డంకిగా మారితే ప్రక్రియకు బ్రేక్ పడుతుంది. ఆ తర్వాత ఆ మెమో డ్రాప్ చేసినా.. మళ్లీ పదోన్నతి ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో, ఎన్నాళ్లకు సాకారమవుతుంతో చెప్పలేని స్థితి. ప్రస్తుతం ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీ పదోన్నతి కల్పించే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ జాబితాలో చార్జిమెమోలు అందుకున్న వారుసైతం ఉన్నారు. వారి వివరణలపై ఎలాంటి నిర్ణయం తీసుకోని నేపథ్యంలో ప్రమోషన్‌కు అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే తాము ఇచ్చిన సమాధానాలను పరిగణలోకి తీసుకోవాలని ఆయా అధికారులు కోరుతున్నారు. -
పోలీసులూ..మీకూ తప్పదు!
‘పోలీస్ అయినా...సాధారణ పౌరులైనా ట్రాఫిక్ నిబంధనల విషయంలో ఒక్కటే. ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదు’ అంటున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ఈమేరకు ట్రాఫిక్ రూల్స్ పాటించని 371 మంది పోలీస్ సిబ్బంది, అధికారులకు చార్జ్ మెమోలు జారీ చేశారు. వీరిలో 30 మందిని హెడ్–క్వార్టర్స్ సహా వివిధ విభాగాలకు ఎటాచ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. సాక్షి, సిటీబ్యూరో: సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తూ మీడియాకు చిక్కిన పంజగుట్ట ఎస్సై నర్సింహ్మ నాయక్‌పై ఆదివారం వేటు పడింది. అతడిని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్–క్వార్టర్స్‌కు ఎటాచ్ చేస్తూ కొత్వాల్ అంజినీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజుల క్రితం రాంగ్ రూట్లో వాహనం నడిపిన ఓ పోలీసు డ్రైవర్ అంశాన్ని స్వయంగా గుర్తించిన డీజీపీ ఉల్లంఘనకు జరిమానా విధించడంతో పాటు బాధ్యుడికి తాఖీదు జారీ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన సాధారణ ప్రజలకు జరిమానా మాత్రమే పడుతోంది. ఇదే పని పోలీసులు చేస్తే వారికి ఫైన్‌తో పాటు తాఖీదులు, తీవ్రమైన వాటికి పాల్పడితే వేటు తప్పట్లేదు. కొన్నాళ్ల క్రితం ప్రారంభించిన ఈ విధానాన్ని నగర పోలీసులు పక్కాగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 371 మంది పోలీసు సిబ్బంది, అధికారులకు ఉన్నతాధికారులు చార్జ్‌మెమోలు జారీ చేశారు. వీరిలో 30 మందిని హెడ్–క్వార్టర్స్ సహా వివిధ విభాగాలకు ఎటాచ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. మరోపక్క పోలీసులకు సంబంధించిన అధికారిక, వ్యక్తిగత వాహనాలపై ఉన్న జరిమానాలను తక్షణం చెల్లించాల్సిందిగా సీపీ ఆదేశాలు జారీ చేశారు. అమలు చేయాల్సిన వారే తప్పు చేస్తే... రహదారి భద్రతకు సంబంధించి అంశాలు, నిబంధనలను క్షేత్రస్థాయిలో అమలు చేసే ట్రాఫిక్, శాంతిభద్రతల అధికారులే తప్పులు చేస్తే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని హెల్మెట్ నిబంధన పక్కా చేసినప్పుడు కమిషనరేట్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)కు ద్విచక్ర వాహనాలపై వచ్చే ప్రతి అధికారి/సిబ్బంది కచ్చితంగా హెల్మెట్ ధరించాల్సిందేనని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. లేని పక్షంలో ఆయా వాహనాలను లోపలకు అనుమతించవద్దంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధానాన్ని మరింత విస్తరిస్తూ కొన్నాళ్ల క్రితం చర్యల నిర్ణయం తీసుకున్నారు. యూనిఫాంలో ఉంటే సీరియస్... నగర పోలీసు విభాగంలో పని చేస్తున్న పది వేల మందికి పైగా సిబ్బంది నిత్యం ఇళ్ల నుంచి పోలీసుస్టేషన్/కార్యాలయం మధ్య, వ్యక్తిగత/అధికారిక పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. ఈ సందర్భంగా అత్యధిక శాతం యూనిఫాంలోనే ఉంటున్నారు. ఈ సిబ్బంది/అధికారులు వినియోగిస్తున్న వాటిలో ప్రైవేట్ వాహనాలతో పాటు ప్రభుత్వవాహనాలూ ఉంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో యూనిఫాంలో ఉన్న పోలీసులతో పాటు పోలీసు వాహనాలు ఉల్లంఘనలకు పాల్పడటాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. వీరిలో మార్పు తీసుకురావడానికి కౌన్సిలింగ్ నిర్వహించిన అధికారులు ఆ తర్వాత కొన్నాళ్ల పాటు తాఖీదులు జారీ చేయడం మొదలుపెట్టారు. అయినా మార్పు రాని వారిపై మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. పక్కా ఆధారాలతో... పోలీసుల ఉల్లంఘనలకు సంబంధించి పక్కా ఆధారాలు ఉంటేనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారని ట్రాఫిక్ పోలీసులు ‘సాక్షి’కి తెలిపారు. మొత్తం నాలుగు రకాల సాధనాల ద్వారా వీటిని సేకరిస్తున్నామని తెలిపారు. ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో విధుల్లో ఉంటున్న సిబ్బంది తమ చేతిలో ఉండే కెమెరాల ద్వారా చిత్రీకరిస్తున్నారు. దీంతో పాటు బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచీ ఫొటోలు తీస్తున్నారు. ఈ రెంటితో పాటు సోషల్‌మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వాటిని, పత్రికల్లో ప్రచురితం/ప్రసారం అయిన ఫొటోలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఇలా సేకరించిన ఫొటోలను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది అధ్యయనం చేస్తున్నారు. ఆ సమయంలో వాహనాన్ని నడిపింది ఎవరు? అనేది నిర్థారించిన తర్వాత ప్రాథమికంగా సదరు పోలీసులను నుంచి జరిమానా వసూలు చేసి, ఆపై చార్జ్‌మెమో జారీ చేస్తున్నారు. ఉల్లంఘన తీవ్రతను బట్టి కొందరు అధికారులపై బదిలీ/ఎటాచ్మెంట్ వేటు కూడా వేస్తున్నారు. -
డెమోక్రాట్లతో ఎఫ్‌బీఐ కుమ్మక్కు
-
డెమొక్రాట్లతో ఎఫ్‌బీఐ కుమ్మక్కు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై జరుగుతోన్న దర్యాప్తులో డెమోక్రాట్లతో ఎఫ్‌బీఐ, న్యాయ విభాగం కుమ్మక్కయ్యాయని ఆరోపిస్తూ ట్రంప్ పార్టీకి చెందిన రిపబ్లికన్లు ఎఫ్‌బీఐపై ‘మెమో’ విడుదల చేశారు. ఎఫ్‌బీఐ వద్దని వారిస్తోన్నా వినకుండా ట్రంప్ ఈ మెమోను ఆమోదించి హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీలకు పంపారు. మెమోరాండంలో వెల్లడైన వివరాలు సిగ్గుచేటని ట్రంప్ అన్నారు. రష్యా జోక్యంపై విచారణలో ట్రంప్ ప్రచార బృందానికి చెందిన మాజీ సలహాదారుడి విషయంలో అధికారులు కోర్టును తప్పు దారి పట్టించారని మెమోలో ఆరోపించారు. అందులోని అంశాల్ని పరిశీలిస్తే న్యాయశాఖ, ఎఫ్‌బీఐలకు చెందిన ఉన్నతస్థాయి అధికారులు తీసుకున్న నిర్ణయాల నైతికతపై ఆందోళన వ్యక్తమవుతోందని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి సాండర్స్ అన్నారు. ప్రతినిధుల సభకు చెందిన ఇంటెలిజెన్స్ చైర్మన్ డెవిన్ న్యూనెస్ రూపొందించిన ఈ మెమోలో.. ‘ డెమోక్రాట్ల తరఫున బ్రిటిష్ నిఘా ప్రతినిధి క్రిస్టోఫర్ స్టీల్ రాసిన పరిశోధన వివరాల్ని దర్యాప్తులో ఎఫ్‌బీఐ వాడుకుంది’ అని ఆరోపించారు. అధ్యక్షుడి జాతీయ భద్రతా బృందం నుంచి అందిన సమాచారం ఆధారంగా దీనిని రూపొందించినట్లు శాండర్స్ తెలిపారు. రిపబ్లికన్ సభ్యుడు డానా రోహ్రబచెర్ మాట్లాడుతూ.. మెమోతో వాస్తవాలు వెలుగుచూశాయని చెప్పారు. ‘పోలీసు, నిఘా విభాగాలు కూడా కొన్నిసార్లు రాజీపడతాయి. ఎప్పటికప్పుడు అలాంటి దుర్వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అందుకే అన్ని ఫెడరల్ దర్యాప్తు విభాగాలపై అమెరికన్ చట్ట సభల పర్యవేక్షణ ఉండాలి’ అని అన్నారు. పారదర్శకత కోసం ట్రంప్ శ్రమిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ‘ఎఫ్‌బీఐ విచారణకు డెమోక్రాట్లు సాయపడ్డారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నమే ఇది. ఇది వాటర్‌గేట్ కుంభకోణంతో పోల్చదగిన స్థాయిలో ఉంది’ అని అన్నారు. ఈ వ్యవహారంపై ఎఫ్‌బీఐ మాత్రం నోరు మెదపలేదు. -
ఇద్దరు విద్యుత్ ఏఈలకు మెమోలు జారీ
కర్నూలు(రాజ్‌విహార్) : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన విద్యుత్ శాఖ ఏపీఎస్పీడీసీఎల్ ఏఈలకు ఆపరేషన్స్ ఎస్ఈ భార్గవరాముడు శనివారం సాయంత్రం మెమోలు జారీ చేశారు. కర్నూలు మండల ఏఈగా పనిచేస్తున్న నాగేంద్ర ప్రసాద్ అందుబాటులో ఉండటం లేదని వినియోగదారులు ఫిర్యాదులు చేయడంతో ఎస్ఈ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో కార్యాలయంలో లేకపోవడంతో ఆయనకు వివరణ కోరారు. ఏఈ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో మెమో జారీ చేశారు. మద్దికెరలో నవనిర్మాణ దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో అధికారుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు విచారించగా ఏఈగా పనిచేస్తున్న నారాయణ స్వామి నాయక్ పైఅధికారులు ఏడీఈ, డీఈలకు సమాచారం ఇవ్వకుండా గైర్హాజరైనట్లు తేలడంతో ఎస్ఈ మెమో జారీ చేశారు. -
‘ప్రధాని ఫొటోలు అనుమతి లేకుండా వాడొద్దు’
న్యూఢిల్లీ: తమ అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను ప్రచురించడానికి వీల్లేదని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్(కేవీఐసీ) ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) నోటీసులు పంపించింది. కేవీఐసీకి ఈ సందర్భంగా మెమోలు కూడా జారీ చేసింది. నూతన సంవత్సరం సందర్భంగా ఖాదీ సంస్థ కేవీఐసీ కొత్త డెయిరీ, క్యాలెండర్ విడుదల సందర్భంగా వాటిపై ప్రధాని నరేంద్రమోదీ ఫొటోను ముద్రించారు. ఇది ధుమారం రేగింది. ఈ సంఘటన జరిగిన నెల రోజుల అనంతరం ప్రధాని కార్యాలయం ఖాదీ కేవీఐసీకి నోటీసులు పంపించింది. ఇక నుంచి ప్రధాని మోదీ ఫొటో ప్రచురణకై మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ద్వారా పీఎంవోను సంప్రదించడం తప్పనిసరి అని కఠిన నిబంధన పెట్టింది. -
ఐదుగురు వైద్యులపై కొరడా
మెమో జారీకి కలెక్టర్ ఆదేశాలు విధులకు ఎగనామం పెట్టిన ఐదుగురు వైద్యాధికారులపై జిల్లా కలెక్టర్ కోన శశిధర్ కొరడా ఝుళిపించారు. ఆదివారం స్థానిక మెడికల్ కళాశాలలో వైద్యాధికారులతో సమీక్షించిన కలెక్టర్.. ఆస్పత్రుల్లో వంద శాతం హాజరు ఉండాలని ఆదేశించారు. సోమవారం స్వయాన∙ ఆన్లైన్లో హాజరును పర్యవేక్షిస్తానన్నారు. చెప్పినట్టుగానే జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారుల హాజరును పరిశీలించారు. సాయంత్రం డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణను పిలిపించుకుని హాజరుపై ఆరా తీశారు. మొత్తం 19 మంది డాక్టర్లు విధులకు గైర్హాజరైనట్లు బయోమెట్రిక్‌లో తేలింది. వీరిలో నలుగురు ప్రసూతి సెలవులో ఉండగా.. ముగ్గురు క్యాజువల్ లీవ్ (సీఎల్)లో ఉన్నట్లు నిర్ధారించారు. బయోమెట్రిక్ పని చేయకపోవడం.. నెట్ కనెక్షన్ లేకపోవడంతో ఏడుగురు విధుల్లో ఉన్నా హాజరు నమోదుకాలేదు. అయితే.. కనగానపల్లి, అగళి, యాడికి, రాకెట్ల, బ్రహ్మసముద్రం వైద్యులు విధులకు డుమ్మా కొట్టినట్లు తేలింది. ఈ ఐదుగురికి చార్్జమెమోలు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో రాత్రి 8.30 గంటలకు కార్యాలయానికి చేరుకున్న డీఎంహెచ్ఓ మెమోలు సిద్ధం చేశారు. మంగళవారం వీటిని జారీ చేయనున్నారు. -
‘ఓటుకు కోట్లు’ కుట్ర తేలుస్తాం
-
‘ఓటుకు కోట్లు’ కుట్ర తేలుస్తాం
- ‘ఓటుకు కోట్లు’పై ప్రత్యేక కోర్టులో ఏసీబీ మెమో - ప్రాథమికంగా నలుగురు నిందితులపై చార్జిషీట్ - దర్యాప్తు పూర్తికాగానే అనుబంధ చార్జిషీట్ సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కుట్రలో పాత్రధారులెవరో కనిపెట్టే దిశగా దర్యాప్తు చేస్తున్నామని ప్రత్యేక కోర్టుకు ఏసీబీ నివేదించింది. కుట్రను నిరూపించేందుకు అవసరమైన అన్ని ఆధారాలను సేకరిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ప్రత్యేక కోర్టులో ఏసీబీ మెమో దాఖలు చేసింది. దర్యాప్తులో వెలుగుచూసిన అంశాల ఆధారంగా అనుబంధ చార్జిషీట్ దాఖలు చేస్తామని స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రధాన పాత్ర పోషించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై దర్యాప్తు చేయాలంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలంటూ ప్రత్యేక కోర్టు ఆదేశించిందని, అయితే ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో ఉన్న నేపథ్యంలో మరో ఎఫ్ఐఆర్ జారీచేయాల్సిన అవసరం లేదని ఏసీబీ నివేదించింది. దర్యాప్తులో వెగులుచూసిన అంశాల ఆధారంగా అనుబంధ చార్జిషీట్ దాఖలు చేస్తామని స్పష్టం చేసింది. దర్యాప్తు పురోగతిని ఈ మెమో ద్వారా ఏసీబీ కోర్టు దృష్టికి తెచ్చింది. కుట్రదారుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది ఈ కేసులో పాలుపంచుకున్న కుట్రదారులందరిపైనా దర్యాప్తు సాగుతోందని, వారి పాత్రకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నామని మెమోలో వివరించింది. రేవంత్‌రెడ్డి, హ్యారీ సెబాస్టియన్, ఉదయ్ సింహల పాత్రకు సంబంధించిన ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేశామని పేర్కొంది. అలాగే వీరి స్వర నమూనాలు, ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను ఎఫ్ఎస్ఎల్కు పంపామని, వారిచ్చిన నివేదిక ఆధారంగా ఈ చార్జిషీట్ దాఖలు చేశామని మెమోలో వివరించారు. రేవంత్ సహా ముగ్గురికి సమన్లు.. 29న హాజరుకావాలని ఆదేశం ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టు విచారణకు (సీసీ నెంబర్ 15/2016...కాగ్నిజెన్స్) స్వీకరించింది. ఈ చార్జిషీట్లో నిందితులుగా ఉన్న రేవంత్‌రెడ్డి, హ్యారీ సెబాస్టియన్, ఉదయ్ సింహలకు కోర్టు సమన్లు జారీచేసింది. సెప్టెంబర్ 29న ప్రత్యక్షంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి విక్టర్ ఇమాన్యూయేల్ బుధవారం ఆదేశాలు జారీచేశారు. 14 నెలల తర్వాత మళ్లీ కదలిక ఓటుకు కోట్లు కేసులో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఈవ్యవహారంలో గత ఏడాది జూలై 28న నలుగురు నిందితులపై ఏసీబీ చార్జిషీట్ దాఖలు చేసింది. దాదాపు 14 నెలలుగా ఈ కేసు దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదు. ఇక మూసేసిన దశలో ఉన్న ఈ కేసును వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదుతో మళ్లీ దర్యాప్తు చేయాల్సి వస్తోంది. ఈ కుట్రలో చంద్రబాబునాయుడు పాత్రకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు సమర్పించిన నేపథ్యంలో...ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేయాలని ప్రత్యేక కోర్టు ఏసీబీని ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో..14 నెలలుగా మూలనపడేసిన ఈ కేసులో ఏసీబీ అనివార్యంగా దర్యాప్తును తిరిగి ప్రారంభించింది. మన వాళ్లు బ్రీఫ్డ్ మీ వాయిస్ చంద్రబాబునాయుడిదేనని ముంబాయికి చెందిన ఫోరెన్సిక్ సంస్థ నిర్ధారించిన నేపథ్యంలో ఈ కుట్రలో ఆయన పాత్ర స్పష్టమైంది. -
ఇంజనీర్లకు మెమో
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఇరిగేషన్‌శాఖలో వస్తున్న పలు ఆరోపణల నేపథ్యంలో గురువారం ఎస్ఈ వి.కోటేశ్వరరావు, సెంట్రల్ డివిజన్ సీఈ కృష్ణమోహన్‌లు సంగం, కనిగిరి రిజర్వాయర్ ప్రాంతాల్లో పర్యటించి పనులను గురువారం తనిఖీ చేశారు. సంబంధిత సంగం జేఈ, బుచ్చిరెడ్డిపాళెం డీఈ, కొడవలూరు జేఈలు గైర్హాజరు కావడంతో మెమోలు ఇచ్చినట్లు సమాచారం. క్రమశిక్షణ చర్యల కింద ఇచ్చిన మెమోలపై ఎస్ఈని వివరణ కోరగా డిపార్ట్మెంటల్ పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అధికారులు ఆయా క్షేత్రాల్లో అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. సంగం రిజర్వాయర్, సిద్దీపురం మట్టాల్లో పూడికతీతల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు స్థానికులు ఆరోపించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆయన ఎస్ఈ వివరాలు చెప్పడానికి నిరాకరించారు. -
లేదంటే ఇంటికే!
పాఠాలు చెబితేనే ఉంటారు.. పలువురు ఉపాధ్యాయులకు డీఈవో హెచ్చరిక ముగ్గురు ఉపాధ్యాయులకు మెమోలు అవనిగడ్డ: పిల్లలకు పాఠాలు చెప్పడానికే మీరు పనిచేస్తోంది. పదో తరగతి విద్యార్థులు త్రికసం«ధి, హిమాలయాలు ఎక్కడున్నాయో, పదార్థాలు ఎన్నిరకాలో చెప్పలేక పోతున్నారు. ఇదేనా మీరు చెప్పే చదువులు, పాఠాలు చెబితేనే ఉంటారు. లేదంటే ఇంటికి పంపించేస్తానని డీఈవో ఏ సుబ్బారెడ్డి పలువురు ఉపాధ్యాయులను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. గురువారం డీఈవో పలు పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేశారు. నిన్ను సస్పెండ్ చేసేస్తా? తొలుత ప్రభుత్వ ఉన్నత పాఠశాలను డీఈవో తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులను త్రిక సంధి చెప్పమనగా ఒక్కరూ సమాధానం చెప్పలేదు. ఆగ్రహించిన డీఈవో పదోతరగతి వరకూ వచ్చారు త్రిక సంధి తెలియదా? ఇంత బాగా చెబుతున్నారు మీ మాస్టార్ అన్నారు. తెలుగు ఉపాధ్యాయుడు పవన్‌కుమార్‌ని పిలిచి నీవు ఎప్పుడు ఉద్యోగంలో చేరావని ప్రశ్నించారు. 2012 డీఎస్సీకి వచ్చానని సమాధానం ఇచ్చారు. రేపో, ఎల్లుండో రిటైర్ అయ్యేవాడిలా చదువులు చెప్పడానికి అంతబద్ధకం ఎందుకు, నిన్ను సస్పెండ్ చేసేస్తాని డీఈవో హెచ్చరించారు. నోటు పుస్తకాలు దిద్దడం లేదు.. పదోతరగతి మూడు గదులను డీఈవో పరిశీలించారు. ప్రతి ఒక్క విద్యార్థిని పలుకరిస్తూ అన్ని సబ్జెక్టు నోటు పుస్తకాలను చూశారు. నోట్సు బాగానే రాస్తున్నారు. టీచర్లే దిద్దడం లేదు. హిందీ, లెక్కలు, పీఎస్, తెలుగు, సోషల్ నోట్స్ ఉపాధ్యాయులు దిద్దలేదు. ఇంగ్లిషు, ఎన్ఎస్ నామమాత్రంగా చూశారు. ఇలా అయితే ఎలా? రేపు పరీక్షల్లో తప్పులు రాస్తే ఎవరు బాధ్యులని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. డీఈవో ప్రతిసారీ వచ్చి విజిట్ చేస్తారా? ఎన్నని చూడాలన్నారు. మధ్యాహ్న భోజనం చేసిన డీఈవో సుబ్బారెడ్డి వంట బాగుందని కితాబిచ్చారు. మెమోలు ఇవ్వాలని ఆదేశం.. పాఠాలు చెప్పని, నోట్స్ చూడని తెలుగు, సోషల్, పీఎస్ ఉపాధ్యాయులకు మెమోలు ఇవ్వాలని ఎంఈవో ఎన్ శివశంకరరావును డీఈవో ఆదేశించారు. మళ్లీ వస్తాను అప్పటికీ మారకపోతే ఇంటికెళ్లి పోతారని హెచ్చరించారు. భవిత సెంటర్‌ను పరిశీలించారు. మరుగుదొడ్లు, తాగునీటి వసతి కల్పించాలని జెడ్పీటీసీ సభ్యుడు కొల్లూరి వెంకటేశ్వరరావు కోరారు. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీబీఎం బోర్డింగ్ స్కూల్‌ని పరిశీలించారు. టీచర్స్ అటెండెన్స్ రిజిస్టర్ చినిగిపోయి ఉండటాన్ని గమనించిన డీఈవో దీనిని రోడ్డుపై పారేయండి. రిజిస్టర్ కూడా సరిగా ఉంచుకోలేరా అని హెచ్ఎం సరళాదేవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో చరిత్ర గల స్కూల్లో పిల్లల సంఖ్య పెంచేందుకు కృషిచేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కొల్లూరి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యుడు గాజుల మురళీకృష్ణ, హెచ్ఎం ప్రసాద్, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
బట్టలు సరిగా ఉతకలేదని జడ్జిగారి మెమో
చెన్నై: ప్రభుత్వ ఉన్నతాధికారులు కింది ఉద్యోగులను ఇంటి పనికి వాడుకోవడం, తరచూ వేధింపులకు గురిచేయడం లోపాయికారిగా జరిగే వ్యవహారమే. అది దాచేస్తే దాగని సత్యం. కానీ తమిళనాడుకు చెందిన ఓ జడ్జిగారు మహిళా అసిస్టెంట్ కు బహిరంగంగా జారీ చేసిన మెమో అధికార దుర్వినియోగానికి అద్దం పట్టింది . బట్టలు సరిగా ఉతకలేదనే కారణంతో ఈరోడ్ జిల్లా కోర్టు కార్యాలయంలో మహిళా సబార్డినేట్ కు , సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ... మెమో జారీ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. స్థానిక భాషలో(తమిళం)లో జారీ చేసిన ఈ మెమో లో బట్టలు, ముఖ్యంగా లో దుస్తులు సరిగా ఉతకలేదంటూ మండిపడ్డారు. దీనికితోడు తమ మాటకు ఎదురు చెప్పావంటూ ఉగ్రుడయ్యారు. సమాధానం చెప్పాలంటూ మెమో జారీ చేశారు. ఆ మెమోలో ...బట్టలు..ముఖ్యంగా లోపలి వస్త్రాలు శుభ్రంగా ఉతకకపోవడం, తమ మాటలకు ఎదురు చెప్పడం, బట్టలు బైటికి విసిరేయడం.. ఎదురు సమాధానం చెప్పడం లాంటి నేరాలపై క్రమశిక్షణా చర్య ఎందుకు తీసుకోకూడదో చెప్పాలన్నారు. దీనిపై వారం రోజులుగా వివరణ ఇవ్వాలని కోరుతూ గత నెల 1న మహిళా అసిస్టెంట్ వాసంతికి ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది. దీనిపై ఆమె వివరణ ఇస్తూ భవిష్యత్తులో ఇలాంటి తప్పు మళ్లీ జరగదంటూ వివరణ ఇచ్చుకుంది. ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ ద్వారా పదేళ్ల క్రితం తాను విధుల్లో చేరానని, కార్యాలయంలో పనిచేయాలనుకున్న తాను చివరికి పనిమనిషిగా మారతాననుకోలేదని వాసంతి వాపోయింది. కొంతమంది ఉన్నతాధికారులుతమ అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై తమళనాడు జ్యుడీషియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు ఆందోళనకు సిద్ధపడుతున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ సిబ్బందిని వినియోగించుకోరాదని ప్రభుత్వ ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ.. ఈ తరహా వేధింపులు కొనసాగుతున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు కరుణాకరన్ తెలిపారు. ఈవ్యవహారంపై స్పందించడానికి మెమో జారీ చేసిన న్యాయమూర్తి అందుబాటులో లేరని సమాచారం. -
తెలంగాణ విద్యార్థులకు ఏపీ బోర్డు మెమోలు
అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులకు ఇబ్బందులు హైదరాబాద్: అందరికీ తెలంగాణ వచ్చింది. కానీ ఇంటర్ బోర్డుకు రాలేదట! అదేంటి అనుకుంటున్నారా? అలాగే ఉంది టీ ఇంటర్ బోర్డు అధికారుల నిర్వాకం. తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు పరిధిలోని కాలేజీల నుంచి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు పేరుతో మార్కుల మెమోలు ఇచ్చేశారు. దీంతో విద్యార్థులు లబోదిబోమంటూ ఇంటర్ బోర్డు వద్దకు పరుగెత్తుకొచ్చారు. దీంతో ‘ఏముందిలే.. తెలంగాణ ఇంటర్ బోర్డు పేరుతో మరో మెమో ముద్రించి ఇస్తాం.. అది ఇచ్చేయండి.. అంటూ వెనక్కి తీసుకుంటున్నారు. ఇంత జరిగినా బోర్డు అధికారులు అదేం లేదంటూ బుకాయిస్తున్నారు. అడుగడుగునా నిర్లక్ష్యం: మొన్నటి ఇంటర్ పరీక్షకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 9 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ వ్యవహారంలో అధికారులు అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సాధారణంగా ఒక విద్యార్థి మెమోను ముద్రించాక అధికారికంగానే మూడు దశల్లో పరిశీలిస్తారు. ముద్రణాలయం నుంచి వచ్చాక సంబంధిత సెక్షన్లో ఎల్డీసీ, సూపరింటెండెంట్, రీజినల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ స్థాయిల్లో పరిశీలిస్తారు. అవన్నీ దాటాకే సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ పరిశీలించి విద్యార్థులకు అందజేస్తారు. అన్ని స్థాయిల్లోనూ ఈ తప్పిదాన్ని ఎవరూ గుర్తించలేదు. దీనిపై ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్‌ను వివరణ కోరగా, అలాంటిదేమీ లేదన్నారు. విద్యార్థులకేనా శిక్ష... బోర్డుకు లేదా? మొన్నటి వార్షిక పరీక్షల్లో యాజమాన్యాలు ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను పరీక్షలకు అనుమతించబోమన్నారు. అలాగని కాలేజీ యాజమాన్యాలను శిక్షించలేదు. చివరకు ఒక్కో విద్యార్థి రూ. 10 వేల జరిమానా చెల్లించి హాల్‌టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లోనూ 200 మంది విద్యార్థులకు హాల్‌టికెట్లను నిరాకరించారు. తప్పు చేసిన కాలేజీలను మాత్రం శిక్షించలేదు. జరిమానా చెల్లిస్తామని విద్యార్థులు కోరినా ఇచ్చేది లేదని, ఫలితాల వెల్లడి ఆలస్యం అవుతుందని చెప్పుకొచ్చారు. ఆ విద్యార్థులకు ఓ విద్యా సంవత్సరం నష్టపోయే పరిస్థితి కల్పించారు. కాలేజీలు తప్పు చేస్తే విద్యార్థులను శిక్షిస్తారు.. మరి బోర్డు చేసిన తప్పులకు ఎవరు బాధ్యత వహిస్తార ని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ప్రశ్నించారు. విద్యార్థులకు న్యాయం చేయకుండా ఇలా ఇబ్బందులు పెడుతున్న అధికారులపై చర్యలు చేపట్టాలని బోర్డు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. -
సినిమా థియేటర్లలో తనిఖీలు
తిరువళ్లూరు, న్యూస్‌లై న్: జిల్లా వ్యాప్తంగా అధిక ధరలకు సినిమా టికెట్లను విక్రయిస్తున్న థియేటర్లపై తిరువళ్లూరు జిల్లా ఉన్నతాధికారులు మంగళవారం రాత్రి మెరుపుదాడి చేశారు. దాడుల్లో అధిక ధరలకు టికెట్ల విక్రయం నిర్దారణ కావడంతో మెమో జారీ చేశారు. తిరువళ్లూరులో ఆరు సినిమా థియేటర్లు ఉన్నాయి. ఈ థియేటర్లలో దీపావళికి ప్రముఖ హీరోల చిత్రాలు విడుదలయ్యూయి. ఈ క్రమంలో ఇష్టం వచ్చిన రేట్లతో టికెట్లను విక్రయించారు. దీనిపై తిరువళ్లూరు ఆర్డీవో అభిరామికి ఫిర్యాదు అందింది. దీంతో ఆర్డీవో ఆదేశాల మేరకు తిరువళ్లూరు ప్రత్యేక స్క్వాడ్ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. ప్రేక్షకుల వద్ద విచారణ జరిపారు. విచారణలో అధిక ధరలకు టికెట్లు అమ్మినట్లు నిర్దారణ కావడంతో సంబంధిత అధికారి థియేటర్ యూజమాన్యానిక మెమో దాఖలు చేశారు. -
బెయిల్ షరతులు సడలించాలని జగన్ పిటిషన్
-
మెమోపై నిర్ణయం రేపటికి వాయిదా
-
సీబీఐ కోర్టులో విజయమ్మ, భారతి మెమో దాఖలు