ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కుట్రలో పాత్రధారులెవరో కనిపెట్టే దిశగా దర్యాప్తు చేస్తున్నామని ప్రత్యేక కోర్టుకు ఏసీబీ నివేదించింది. కుట్రను నిరూపించేందుకు అవసరమైన అన్ని ఆధారాలను సేకరిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ప్రత్యేక కోర్టులో ఏసీబీ మెమో దాఖలు చేసింది.