Cash for vote case
-
TG: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
హైదరాబాద్, సాక్షి: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడింది. బుధవారం విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు తదుపరి విచారణను నవంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది. జడ్జీ లీవ్‌లో ఉండటంతో కోర్టు కేసును వాయిదా వేసింది. ఇవాళ.. విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర నిందితులను గత నెల 24న కోర్టు ఆదేశించింది. గత నెల 24న విచారణకు మత్తయ్య హాజరుకాగా, మిగతా నిందితులు గైర్హాజరు అయ్యారు. నేటి విచారణకు సీఎం రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్లు హాజరు కావాల్సి ఉండగా.. కేవలం సండ్ర వెంకట వీరయ్య మాత్రమే హాజరయ్యారు. మరోవైపు.. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరు కాకపోతే.. కోర్టు ముందు నిరాహార దీక్ష చేస్తానని మంగళవారం మత్తయ్య మీడియాతో అన్నారు.ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఈ కేసు దర్యాప్తు అయ్యే అవకాశం ఉందని, కాబట్టి కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌పై ఇటీవల సుప్రీం కోర్టు కీలకత తీర్పు వెల్లడించింది. ‘‘కేవలం అనుమానం పైనే పిటిషన్ వేశారు. అందుకే ఈ పిటిషన్లో మేం జోక్యం చేసుకోలేం. భవిష్యత్తులో సీఎం గనుక జోక్యం చేసుకుంటే మళ్ళీ కోర్టును ఆశ్రయించండి’’ అని స్పష్టం చేసింది.చదవండి: బాబు, రేవంత్ మరోసారి కుమ్మక్కయ్యారు: ఎమ్మెల్యే ఆర్కే -
16న విచారణకు హాజరుకండి
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు కోట్లు’కేసు విచారణకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గైర్హాజరు కావడంపై నాంపల్లి కోర్టు అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ జరిగే అక్టోబర్ 16న న్యాయస్థానం ఎదుట తప్పకుండా హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో మంగళవారం జరిగిన విచారణకు మత్తయ్య ఒక్కరే హాజరయ్యారు. రేవంత్‌రెడ్డి, వేం కృష్ణ కీర్తన్, ఉదయ్ సింహ, సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ హాజరుకాలేదు. ఒకరోజు విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ నిందితులు వేసిన పిటిషన్లను కోర్టు అనుమతించింది. అయితే అభియోగాల నమోదుపై విచారణ కోసం వచ్చే నెల 16న మాత్రం హాజరుకావాల్సిందేనని రేవంత్ సహా నిందితులందరికీ స్పష్టం చేసింది. ఏసీబీ, ఈడీ విచారణలతో.. 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను టీడీపీ అభ్యరి్థకి మద్దతు ఇవ్వాలంటూ రూ.కోట్లు ఆశచూపిన ఆరోపణలపై నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. స్టీఫెన్సన్ ఇంట్లో రేవంత్ డబ్బు సంచులతో ఉన్న వీడియోలు అప్పట్లో తీవ్ర సంచలనంగా మారాయి. ఈ కేసులో రేవంత్ జైలుకు వెళ్లి, తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చారు. రేవంత్‌ను అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన వద్ద రూ.50 లక్షల నగదును ఏసీబీ స్వా«దీనం చేసుకుంది.ఈ నగదు అక్రమ మార్గాల్లో వచి్చందన్న ఏసీబీ ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేసు నమోదు చేసింది. ఏసీబీ, ఈడీ రెండు విచారణలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారంలో నిందితులు మంగళవారం విచారణకు గైర్హాజరవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. తదుపరి విచారణకు హాజరు కా వాలని రేవంత్‌తో పాటు సెబాస్టియన్, ఉదయ్ సింహ, మత్తయ్య జెరూసలేం, సండ్ర వెంకట వీరయ్య, వేం కృష్ణ కీర్తన్‌లను ఆదేశించింది. -
ఓటుకు నోటు కేసు.. విచారణకు రావాలని సీఎం రేవంత్‌కు కోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు వ్యవహారానికి సంబంధించిన ఈడీ కేసులో విచారణ జరిగింది. ఈ కేసులో అక్టోబర్ 16న విచారణకు హాజరుకావాలని సీఎం రేవంత్‌రెడ్డిని న్యాయస్థానం ఆదేశించింది. నేటి విచారణకు ముత్తయ్య మినహా మిగతా నిందితులందరూ గైర్హాజరు అయ్యారు. సీఎం రేవంత్, ఉదయ్ సింహా, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ గైర్హాజరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది.అయితే ఇవాళ్టి విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న నిందితుల అభ్యర్థనకు అంగీకరించిన కోర్టు.. అక్టోబరు 16న విచారణకు హాజరు కావాలని రేవంత్ సహా నిందితులందరికీ నాంపల్లి కోర్టు ఆదేశించింది.చదవండి: పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండే : కేటీఆర్ -
ఓటుకు నోటు కేసులో జోక్యం చేసుకోవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసు విచారణలో ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోవద్దని ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణకు సంబంధించి ఏసీబీ డైరెక్టర్ జనరల్ ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వరాదని, ఆయనకు రిపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టు పారదర్శకంగా విచారణ జరపాలని సూచించింది.ఈ కేసు విచారణను తెలంగాణ నుంచి భోపాల్‌కు బదిలీ చేసేందుకు నిరాకరించింది. ఓటుకు నోటు కేసు విచారణను హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌లోని భోపాల్ కోర్టుకు బదిలీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. నిష్పక్షపాత విచారణ సాధ్యం కాదన్న పిటిషనర్లు రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణలో ఈ కేసుపై నిష్పక్షపాత విచారణ సాధ్యం కాదని పిటిషనర్లు పేర్కొన్నారు. వారి తరఫున సీనియర్ న్యాయవాది సీఏ సుందరం వాదనలు వినిపిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హోం శాఖ బాధ్యతలు కూడా చూస్తున్నందున ఏసీబీ కేసులు నేరుగా ఆయన అ«దీనంలోనే ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కేసు విచారణను తెలంగాణ నుంచి భోపాల్‌కు మార్చాలని విన్నవించారు.సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి దీనిని పర్యవేక్షించేలా ఆదేశాలివ్వాలని కోరారు. అయితే ఈ పిటిషన్ రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని రేవంత్‌రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణ సగంలో ఉందని.. విచారణను గత ప్రభుత్వంలో నియమించిన ప్రాసిక్యూటరే నిర్వహిస్తున్నారని చెప్పారు. సుప్రీం విశ్రాంత జడ్జి పర్యవేక్షణకు నో వాదనల అనంతరం కేసు విచారణపై సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి పర్యవేక్షణను జస్టిస్ గవాయ్ ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసులో విధంగానూ జోక్యం చేసుకోకూడదని రేవంత్‌రెడ్డిని ఆదేశించిన ధర్మాసనం..భవిష్యత్తులో ఈ కేసు విచారణలో రేవంత్‌రెడ్డి జోక్యంపై ఆధారాలుంటే కోర్టుకు వెళ్లొచ్చునని సూచించింది. రాష్ట్ర హోంశాఖ బాధ్యతలు కూడా చూస్తున్న రేవంత్‌రెడ్డికి ఏసీబీపై ప్రత్యక్ష నియంత్రణ ఉంటుందని, బ్యూరో డైరెక్టర్ నేరుగా ఆయనకు జవాబుదారీగా ఉంటారన్న పిటిషనర్ల ఆందోళనను పరిగణనలోకి తీసుకుంటున్నామని, ప్రాసిక్యూషన్ పనితీరులో ఏ విధంగానూ జోక్యం చేసుకోవద్దని రెండవ ప్రతివాదికి ఆదేశిస్తున్నామని బెంచ్ తెలిపింది. ఒక విచారణను ఉపసంహరించుకోవాలని ఆయన (రేవంత్‌రెడ్డి) ప్రాసిక్యూషన్‌ను ఆదేశిస్తే, అప్పుడు తాము జోక్యం చేసుకుంటామని స్పష్టం చేసింది.కోర్టు ఆదేశాలపై వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలిఅంతకుముందు ఈ కేసును విచారిస్తున్న సమయంలోనే, ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసినప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలను తాము గమనించామని ధర్మాసనం పేర్కొంది. అయితే ఈ విషయంలో రేవంత్‌రెడ్డి ఇప్పటికే తమ ముందు క్షమాపణలు చెప్పినందున ఈ అంశంలో మ రింత ముందుకు వెళ్లాలని తాము భావించడం లేదని తెలిపింది. రాజ్యాంగంలోని మూడు విభాగాలు ఒకరి పనితీరు పట్ల మరొకరు పరస్పర గౌరవాన్ని చూపించాలని సూచించింది. తీర్పులపై న్యాయమైన విమర్శలను ఎప్పుడూ స్వాగతించవచ్చని, అయితే పరిమితులను అతిక్రమించరాదని స్పష్టం చేసింది. కోర్టులు జారీ చేసే ఆదేశాలపై వ్యాఖ్యలు చేసేటప్పుడు తగినంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. -
సర్వోన్నత న్యాయస్థానం అంటే గౌరవం లేదా?
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా.. కవిత బెయిల్ తీర్పుపై ఆయన చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం ప్రస్తావించింది.ముఖ్యమంత్రి బాధ్యతగా ఉండాలి కదాఇలా ఎలా మాట్లాడతారు ?రాజకీయ నాయకులను సంప్రదించి మేము ఆదేశాలు ఇస్తామా ?మేము ఎవరి వ్యాఖ్యలు పట్టించుకోంమేము మా విధి నిర్వహిస్తాంమేము ప్రమాణ పూర్వకంగా పని చేస్తాంమేము ఎవరి పనుల్లో జోక్యం చేసుకోంసర్వోన్నత న్యాయస్థానం అంటే గౌరవం లేదా ?వ్యవస్థల పట్ల గౌరవంగా ఉండాలిఇలాంటి ప్రవర్తన ఉంటే ఓటుకు నోటు విచారణ రాష్ట్రం బయటే నిర్వహిద్దాం.. అని జస్టిస్ గవాయ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది.అంతకు ముందు.. తెలంగాణ ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిందితుడిగా ఉన్నఈ కేసులో సుప్రీం కోర్టు కీలకాదేశాలు జారీ చేసింది. ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ గవాయి ధర్మాసనం.. విచారణకు స్పెషల్ ప్రాసిక్యూటర్‌ను నియమిస్తున్నట్లు తెలిపింది. మధ్యాహ్నాం మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం.. స్వతంత్ర ప్రాసిక్యూటర్‌ను నియమించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే రేవంత్ తాజా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు విచారణ సోమవారానికి సెప్టెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.కవిత బెయిల్‌పై రేవంత్ ఏమన్నారంటే..ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ పరిణామంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ‘‘కవిత బెయిల్ కోసం ఎంపీ సీట్లు బీఆర్ఎస్ త్యాగం చేసింది నిజం. బీఆర్ఎస్ – బీజేపీ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చింది. సిసోడియా, కేజ్రీవాల్‌కు రాని బెయిల్ 5 నెలల్లోనే కవితకు ఎలా వచ్చింది? మెదక్, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌లో బీజేపీకి మెజారిటీ ఇచ్చింది నిజం కాదా? ఏడు చోట్ల డిపాజిట్ కోల్పోయి, 15 చోట్ల మూడవ స్థానం వచ్చేంత బలహీనంగా బీఆర్ఎస్ ఉందా?” అని రేవంత్ అన్నారు. ఓటుకు నోటుపై పిటిషన్లో..తెలంగాణలో 2015 ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఓటుకు నోటు వ్యవహారం నడిచింది. ఈ కేసులో పట్టుబడ్డ రేవంత్ రెడ్డి అరెస్టై జైలుకు వెళ్లారు కూడా. అయితే.. రేవంత్ ఇప్పుడు సీఎంగా ఉండడంతో ఈ కేసు విచారణను మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ వాదనలుకేసులో నిందితుడు రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ సీఎంగా ఉన్నారని, దర్యాప్తు సంస్థ ఏసీబీ చూసే హోం శాఖ కూడా ఆయన వద్దే ఉందని జగదీష్ రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా మహబూబ్ నగర్లో జరిగిన ర్యాలీల్లో పలుమార్లు పోలీసులపై బెదిరింపు ధోరణి ప్రదర్శించారని జగదీష్ రెడ్డి తరుఫు న్యాయవాది తెలిపారు. సీఎంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తేనే కేసుపై ప్రభావం ఎలా ఉందో తెలుస్తుందని, ప్రభుత్వం దాఖలు చేసే కౌంటర్ అఫిడవిట్లో కూడా వైఖరి మారిందన్నారు. జస్టిస్ గవాయ్ ఏమన్నారంటే..కేవలం అపోహలతో విచారణ బదిలీ చేస్తే మన న్యాయ వ్యవస్థపై నమ్మకం లేదన్నట్టే అవుతుంది. ట్రయల్ జరిగే విషయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున.. ఈ కేసు విచారణకు ఇండిపెండెంట్ ప్రాసిక్యూటర్ ని నియమిస్తాం. విశ్వసనీయతను పెంచేందుకే స్వతంత్ర ప్రాసిక్యూటర్‌ను నియమిస్తాం. 2024 ఎన్నికల తర్వాతే మీరు కోర్టుకు వచ్చారు.. ఎందుకు?. మా న్యాయ వ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. అందరి అనుమానాలను నివృత్తి చేసేందుకు స్పెషల్ ప్రాసిక్యూటర్ నియమిస్తాం. ఏపీ లేదంటే తెలంగాణ నుంచి ఒకరిని స్పెషల్ ప్రాసిక్యూటర్‌గా నియమిస్తాం. ప్రతి ఒక్కరి మనస్సులో విశ్వాసం ఉండేలా, మీకు అభ్యంతరం లేకుండా ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమిస్తాం. తెలంగాణకు చెందిన మా సహచరులను సంప్రదించి.. ఈ నియామకాన్ని మేమే పర్యవేక్షిస్తాం. ప్రత్యేక ప్రాసిక్యూటర్ని నియమించే వ్యవహారాన్ని సుప్రీం కోర్టు నిర్ణయిస్తుందని జస్టిస్ గవాయ్ అన్నారు. కుదరని ఏకాభిప్రాయంఓటుకు నోటు పిటిషన్‌పై మధ్యాహ్నాం మరోసారి విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రత్యేక ప్రాసిక్యూటర్ నియామకం కోసం ప్రయత్నించింది. ఇరు వర్గాల నుంచి ఇద్దరి పేర్లను తీసుకుంది. అయితే ఉమామహేశ్వర్రావు, అశోక్ దేశాయ్ పేర్లపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో సోమవారం విచారణ నాడే ఆ ప్రక్రియను ధర్మాసనం పర్యవేక్షించే అవకాశం ఉంది. -
ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
న్యూఢిల్లీ, సాక్షి: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్‌లతో కూడిన ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో నిందితుడైన ఎనుముల రేవంత్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని, కాబట్టి ఈ కేసు విచారణ వేరే (వీలైతే మధ్యప్రదేశ్)కు బదిలీ చేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ పిటిషన్‌పై సుప్రీం నుంచి నోటీసులు అందుకున్న తెలంగాణ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డి.. తాజాగా కౌంటర్ దాఖలు చేశారు. ఈ కౌంటర్‌ను ఇవాళ పరిశీలించిన కోర్టు.. రిజాయిండర్ దాఖలు చేసేందుకు పిటిషనర్‌కు రెండు వారాల సమయం ఇచ్చింది. -
ఓటుకు కోట్లు కేసులో సీఎం రేవంత్‌కు సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందున, కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ దాఖ లైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తదితరులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలుకు ఆదేశించింది. బీఆర్ఎస్ మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ల తరఫున అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ పి.మోహిత్‌రావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఓటుకు కోట్లు సంబంధిత కేసులను తెలంగాణలోని ఏసీబీ కోర్టు విచారణ జరుపుతోందని తెలిపారు. రేవంత్‌రెడ్డి సీఎంగా ఉన్నందున రాష్ట్రంలో న్యాయపరమైన విచారణ సాధ్యం కాదని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ లేదా ఛత్తీస్‌గఢ్‌ల్లోని తత్సమాన కోర్టుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్ధ దవే, దామా శేషాద్రినాయుడులు వాదనలు విన్పించారు. ...వారినే విచారించాల్సిన పరిస్థితి తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అనుకూలంగా ఓటు వేసేందుకు గాను నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రేవంత్‌రెడ్డి రూ.కోట్లు లంచం ఆశ చూపి అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇవ్వజూపారనేది ప్రధాన ఆరోపణ అని తెలిపారు. రేవంత్‌రెడ్డి మాజీ బాస్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. అయితే స్టీఫెన్సన్కు లంచం ఇస్తుండగా తెలంగాణ పోలీసులు, ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా రేవంతర్‌రెడ్డి తదితరుల్ని పట్టుకున్నారని, స్టీఫెన్సన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కాగా తదనంతర పరిణామాల్లో భాగంగా రేవంత్‌రెడ్డి 2017లో కాంగ్రెస్ పార్టీ లో చేరారని తెలిపారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, ఈ కేసులో నిందితుడైన రేవంత్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని, కీలకమైన హోంశాఖ కూడా ఆయన వద్దే ఉందని వివరించారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో న్యాయపరమైన విచారణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఏసీబీ అధికారులు ఎవరి నియంత్రణలో ఉంటారో, ఎవరికి సమాధానం చెప్పాలో వారినే విచారించాల్సిన పరిస్థితి ఉందన్నారు. రేవంత్‌పై పెండింగ్‌లో 88 కేసులు తెలంగాణలోని వేర్వేరు కోర్టుల్లో రేవంత్‌రెడ్డిపై 88 కేసులు విచారణలో ఉన్నాయని, ఆయన నేర నేపథ్యం ఎక్కువగా ఉన్నట్లు వీటిని బట్టి స్పష్టమవుతోందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక తేల్చుకుంటామంటూ తెలంగాణలోని సీనియర్ పోలీసు అధికారుల్ని రేవంత్‌రెడ్డి అనేక సందర్భాల్లో బెదిరించారని కోర్టు దృష్టికి తెచ్చారు. అంతేకాకుండా విచారణ జాప్యం చేయడానికి నిందితులు ఏదో ఒక సాకుతో 2015 నుంచి పలు పిటిషన్లు వేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఓటుకు కోట్లు కేసు విచారణను తెలంగాణ వెలుపల మధ్యప్రదేశ్ లేదా ఛత్తీస్‌గఢ్‌లకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలమని, రేవంత్ మాజీ బాస్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా ఈ కేసులో ఆరోపణలు ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఈ పిటిషన్ ఎందుకు విచారించకూడదో తెలియజేయాలంటూ సీఎం రేవంత్‌సహా ఇతర ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. -
ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామం
సాక్షి, ఢిల్లీ: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాలు సమాధానం చెప్పాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి , ప్రతివాదులను సర్వోన్నత న్యాయస్థానం నోటీసుల్లో పేర్కొంది. ఓటుకు కోట్లు కేసును తెలంగాణ ఏసీబీ కోర్టు నుంచి పొరుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ లేదంటే ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. బీఆర్ఎస్ నేతలైన గుంతకండ్ల జగదీష్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోథ్, మహమ్మద్ అలీలు ఈ పిటిషన్ వేశారు. రేవంత్‌రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నందున.. దర్యాప్తు పారదర్శకంగా జరగదనే అనుమానాల్ని పిటిషన్లో వ్యక్తం చేశారు. శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. తెలంగాణ ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నేటి తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. 2015లో టీడీపీలో ఉండగా ఈ కేసు నమోదు అయ్యింది. చంద్రబాబు ఆదేశాల మేరకు ఎల్విస్ స్టీఫెన్సన్కు రూ.50లక్షల లంచం ఇస్తుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇదిలా ఉంటే.. తన ‘మాజీ బాస్’, మాజీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే ఈ తతంగం నడిచిందంటూ బీఆర్ఎస్ నేతలు సైతం పిటిషన్లో ప్రస్తావించడం గమనార్హం. -
నాడు ద్రోహం.. నేడు మోసం
సాక్షి, అమరావతి: ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టి రైతులకు ద్రోహం చేసిన చంద్రబాబు ఇప్పుడు సాగు, తాగునీళ్లు దక్కకుండా ప్రాజెక్టులపై ఎన్జీటీలో కేసులు దాఖలు చేయించి అఖిలపక్షం డిమాండ్‌తో మరో నాటకానికి సిద్ధమయ్యారు. నాడూ నేడూ రైతులకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు కృష్ణా జలాల వివాదంపై ప్రధాని మోదీ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేయడాన్ని నీటిపారుదలరంగ నిపుణులు తప్పుబడుతున్నారు. ఈ వివాదం ఏర్పడటానికి మూలకారకుడు చంద్రబాబేనని గుర్తు చేస్తున్నారు. ఈ పాపం ఎవరిది బాబూ? విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా కృష్ణా బోర్డును ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం బోర్డు పరిధి, వర్కింగ్ మ్యాన్యువల్‌ను ఖరారు చేయలేదు. ప్రాజెక్టుల నిర్వహణకు మధ్యంతర ఏర్పాట్లు చేసింది. ఎవరి భూ భాగంలో ఉన్నవాటిని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించుకునేలా ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలాన్ని ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్‌ను తెలంగాణ సర్కార్ నిర్వహించేలా 2014లో ఏర్పాటు చేసింది. దీని ప్రకారం నాగార్జునసాగర్ ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ పూర్తిగా తన అధీనంలోకి తీసుకుంది. ఏపీ భూభాగంలో ఉన్న సాగర్ కుడి కాలువకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్‌ను కూడా తెలంగాణ ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది. మరోవైపు శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తన భూభాగంలో ఉందంటూ దాన్ని కూడా తెలంగాణ సర్కార్ తన నియంత్రణలోకి తీసుకుంది. ఏపీ ప్రభుత్వ అధీనంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టులో జలవిద్యుత్కేంద్రం తమ భూభాగంలో ఉందనే సాకుచూపి దాన్ని కూడా తెలంగాణ సర్కార్ స్వాధీనం చేసుకుంది. కొబ్బరి చిప్పల సిద్ధాంతంతో.. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఉనికిని కాపాడుకునేందుకు రెండు కళ్లు, కొబ్బరిచిప్పల సిద్ధాంతంతో ఈ అక్రమంపై నాటి సీఎం చంద్రబాబు నోరుమెదపలేదు. దీంతో అప్పటి నుంచి ఇప్పటిదాకా కృష్ణా బోర్డు ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం బేఖాతర్ చేస్తూ యథేచ్ఛగా ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం దిగువకు నీటిని వదిలేస్తోంది. ఫలితంగా శ్రీశైలంలో నీటి మట్టం అడుగంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందించలేని దుస్థితి నెలకొంది. బలగాలను వెనక్కి రప్పించిన బాబు.. నాగార్జునసాగర్ కుడి కాలువకు కృష్ణా బోర్డు కేటాయించిన జలాలు పూర్తి స్థాయిలో విడుదల కాకున్నా 2015 ఫిబ్రవరి 12న తెలంగాణ సర్కార్ అర్థాంతరంగా ఆపేసింది. ఈ క్రమంలో ఆంధప్రదేశ్ భూ భాగంలో ఉన్న సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకుని రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు నాటి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, అధికారులు పోలీసు బలగాలతో మరుసటి రోజు నాగార్జునసాగర్ వద్దకు చేరుకున్నారు. తెలంగాణ సర్కార్‌ను అస్థిరపరిచేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయిన నాటి సీఎం చంబ్రాబుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓటుకు నోటు కేసు నమోదు చేసింది. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వా«ధీనం చేసుకోవడానికి వెళ్లిన రాష్ట్ర అధికారులను చంద్రబాబు వెనక్కి రప్పించారు. దీంతో సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ తెలంగాణ సర్కార్ అధీనంలోనే ఉండిపోయింది. కృష్ణా బోర్డు నీటిని కేటాయించినా తెలంగాణ సర్కార్ సాగర్ కుడి కాలువకు నీటిని సక్రమంగా విడుదల చేయకపోవడం వల్ల రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో విఫలం.. శ్రీశైలంలో 800 అడుగుల నుంచే రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 90, రోజుకు 0.5 టీఎంసీ చొప్పున 30 టీఎంసీలు తరలించేలా డిండి ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్ అక్రమంగా చేపట్టింది. వీటితోపాటు కేసీ కెనాల్‌కు నీళ్లందించే సుంకేశుల బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతం నుంచి 5.44 టీఎంసీలు తరలించేలా తుమ్మిళ్లను, పాలేరు రిజర్వాయలోకి 5.54 టీఎంసీల ఎత్తిపోతలకు భక్త రామదాస, మిషన్ భగీరథ ప్రాజెక్టులను అక్రమంగా తెలంగాణ చేపట్టింది. నెట్టెంపాడు, ఎస్సెల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం పెంచింది. ఈ ఎనిమిది ప్రాజెక్టుల ద్వారా 178.93 టీఎంసీలను అక్రమంగా తరలించేలా 2015లోనే పనులు ప్రారంభించింది. ఈ అక్రమ ప్రాజెక్టులను నిరసిస్తూ 2016లో మే 16 నుంచి 18 వరకూ కర్నూలులో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి జలదీక్ష చేశారు. నాటి సీఎం చంద్రబాబు దీనిపై స్పందించలేదు. చివరకు తెలంగాణ అక్రమంగా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలను అడ్డుకోవాలని కృష్ణా డెల్టా రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో 2016 సెప్టెంబరు 21న నాటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అపెక్స్ కౌన్సిల్ తొలి సమావేశాన్ని నిర్వహించారు. కేటాయింపులకు మించి ఒక్క చుక్క నీటిని కూడా అదనంగా పాలమూరు–రంగారెడ్డి, డిండి ద్వారా వాడుకోబోమని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ సమావేశంలో చెప్పారు. కానీ తెలంగాణ అప్పటికే కేటాయించిన నీటి కంటే ఎక్కువగా వాడుకుంటోందని, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండా చేపట్టిన ఆ ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని డిమాండ్ చేయడంలో నాటి సీఎం చంద్రబాబు విఫలమయ్యారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికే అపెక్స్ కౌన్సిల్లో రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ సర్కార్‌కు చంద్రబాబు తాకట్టు పెట్టారని స్పష్టమవుతోంది. ఫలితంగా పాలమూరు–రంగారెడ్డి, డిండి తదితర అక్రమ ప్రాజెక్టులను తెలంగాణ నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది. తుమ్మిళ్ల, భక్తరామదాస, కల్వకుర్తి, నెట్టెంపాడు, మిషన్ భగీరథలను ఇప్పటికే పూర్తి చేసింది. సొంత జిల్లా ప్రజలకు వెన్నుపోటు.. కండలేరు జలాలను తరలించి చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతాన్ని, గాలేరు–నగరి, హంద్రీ–నీవాలను అనుసంధానం చేసి పశ్చిమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాగునీటి ప్రాజెక్టుల పనులను చేపట్టారు. అయితే ఈ ప్రాజెక్టులను నిలుపుదల చేయాలంటూ టీడీపీ నేత, చిత్తూరు జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు జి.గుణశేఖర్‌నాయుడుతోపాటు మరో 13 మంది పార్టీ నేతలతో ఎన్జీటీలో చంద్రబాబు కేసు వేయించి తన నైజాన్ని చాటుకున్నారు. హక్కుల పరిరక్షణకు నిర్మాణాత్మక చర్యలు.. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను పరిరక్షించేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్మాణాత్మక చర్యలు చేపట్టారని నీటిపారుదలరంగ నిపుణులు పేర్కొంటున్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రాయలసీమ ఎత్తిపోతల చేపట్టారని, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులను వినియోగించుకునేందుకే ఆర్డీఎస్ కుడి కాలువ పనులను చేపట్టారని స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వివాదాన్ని పరిష్కరించేందుకు గతేడాది అక్టోబర్ 6న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశాన్ని నిర్వహించారు. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా తెలంగాణ చేపట్టిన 8 ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని అపెక్స్ కౌన్సిల్లో సీఎం వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని స్పష్టం చేశారు. తక్షణమే కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేసి అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చి రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని కోరారు. శ్రీశైలంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తితో కృష్ణా జలాలు వృథాగా కడలిలో కలిసేలా చేస్తూ తెలంగాణ సర్కార్ సాగిస్తోన్న అక్రమాన్ని అడ్డుకోవాలని ఇప్పటికే రెండు సార్లు ప్రధాని మోదీ, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్‌లకు లేఖ రాశారు. -
ఏసీబీ స్పెషల్ కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ
సాక్షి, హైదరాబాద్ : ఏసీబీ స్పెషల్ కోర్టులో సోమవారం ఓటుకు కోట్లు కేసు విచారణ జరిగింది. ఉదయ్‌సింహా, సెబాస్టియన్ విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా ఏసీబీ కోర్టు స్టీఫెన్సన్ గన్మెన్ల వాంగ్మూలాన్ని నమోదు చేసింది. రేపు రేవంత్‌రెడ్డి అప్పటి గన్మెన్లను విచారించనుంది. -
తుది దశకు ఓటుకు కోట్లు కేసు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ నెల 8న తుది విచారణ నేపథ్యంలో ఈ కేసులో ఫిర్యాదుదారైన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్, అతడి మిత్రుడు, కేసులో ప్రధాన సాక్షి మాల్కం టేలర్లు సోమవారం ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. తెలంగాణలో బలం లేకున్నా 2015 మేలో ఎమ్మెల్సీ బరిలో దిగిన టీడీపీ.. పలువురు ఎమ్మెల్యేల కొనుగోలుకు తెరలేపింది. ఈ విషయం కాస్తా ఏసీబీకి లీకవడంతో రహస్యంగా సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. మే 31న ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఆయన మిత్రుడు మాల్కం టేలర్ ఇంట్లో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలు లంచం ఇస్తుండగా రెడ్ çహ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇది అప్పట్లో జాతీయ రాజకీయాలను కుదిపేసింది. మొదట అలాంటిదేమీ లేదంటూ బుకాయించిన టీడీపీ నేతలు.. రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలిస్తూ స్టీఫెన్సన్ను మభ్యపెడుతున్న వీడియోలు, స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులు బయటికి రావడంతో ఆత్మరక్షణలో పడిపోయారు. ఈ కేసులో రేవంత్‌రెడ్డి, హ్యరీ సెబాస్టియన్, ఉదయసింహా, జెరుసలేం మత్తయ్యలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. కొంతకాలం దర్యాప్తు బాగానే సాగినా.. తర్వాత ఈ కేసుపై తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. అయితే నేతలపై ఉన్న కేసుల విచారణ వేగవంతం చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈ కేసు విచారణ తిరిగి ప్రారంభమైంది. ఐదున్నర గంటలపాటు మాక్ డ్రిల్ స్టీఫెన్సన్, మాల్కం టేలర్లు మంగళవారం ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అధికారులు వీరికి పలు సూచనలు ఇచ్చారు. ఆ రోజు ఏం జరిగింది? ప్రత్యర్థి లాయర్లు ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశముంది తదితర అంశాలపై క్రాస్ ఎగ్జామినేషన్‌లో లాయర్లు ప్రశ్నించే అవకాశముంది. ఆ సమయంలో స్టీఫెన్సన్, మాల్కం టేలర్ తడబడకుండా.. తగిన సూచనలు ఇచ్చారు. దీనిపై మాక్ డ్రిల్ నిర్వహించినట్లు సమాచారం. ఈ మాక్‌డ్రిల్‌లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అశోక్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్‌రావు పాల్గొన్నట్లు తెలిసింది. ఈ కేసులో మొత్తం 418 పేజీల చార్జిషీటును ఏసీబీ దాఖలు చేసింది. కేసు దర్యాప్తు అధికారితో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఫిర్యాదుదారులు, ప్రధాన సాక్షులు ప్రభావితం కూడా వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు మాక్‌డ్రిల్స్ చేపడుతున్నారు. బాబే సూత్రధారి అని మత్తయ్య వాంగ్మూలం ఈ వ్యవహారంలో ఈడీ కూడా విచారణ చేస్తోంది. స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ.50 లక్షలు ఎవరు సమకూర్చారన్న దానిపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ విషయంలో టీడీపీ నేత వేం నరేందర్‌రెడ్డిని గతంలోనే విచారించిన ఈడీ గతేడాది డిసెంబర్లో ఓటుకు కోట్లు కేసు లో ఏ–4 నిందితుడిగా ఉన్న మత్తయ్య వాంగ్మూలం తీసుకుంది. తాను ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని మత్తయ్య మీడియాకు విడుదల చేశాడు. అందులో మొత్తం వ్యవహారానికి సూత్రధారి అప్పటి ఏపీ సీఎం చంద్రబాబేనని, గండిపేటలో మహానాడు వేదిక వెనుక గదిలో రేవంత్‌రెడ్డి, చంద్రబాబును కలిశానని, స్టీఫెన్సన్ను టీడీపీకి అనుకూలంగా ఓటేసేలా ఒప్పిస్తే.. రూ.50 లక్షలు ఇస్తామని ఆశ జూపారని అందుకే, ఈ పనికి అంగీకరించానని పేర్కొన్నాడు. -
ఓటుకు కోట్లు కేసు: రేవంత్‌రెడ్డికి వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రత్యేక కోర్టు విచారణకు సోమవారం హాజరు కాకపోవడంపై న్యాయమూర్తి సాంబశివరావునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులపై కేసులను సత్వరం విచారించాలన్న సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కోర్టు విచారణకు నిందితులు తప్పనిసరిగా హాజరుకావాల్సిందే నని తేల్చిచెప్పారు. మంగళవారం నిందితులపై అభియోగాలు నమోదు చేయనున్న నేపథ్యంలో నిందితులంతా తప్పనిసరిగా హాజరుకావాలని, లేకపోతే అరెస్టు వారంట్ జారీ చేస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మంగళవారం రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, రుద్ర ఉదయసింహాతో పాటు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు ప్రత్యేక కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది. వాదనలు వినిపించాలని కోరే హక్కు లేదు.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమాస్తులపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దివంగత ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్లో వాదనలు వినిపించేందుకు తమకు అనుమతివ్వాలంటూ చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ఏసీబీ ప్రత్యేక కోర్టు సోమవారం తిరస్కరించింది. వాదనలు వినిపిస్తామని కోరే హక్కు (లోకస్) చంద్రబాబుకు లేదని న్యాయమూర్తి సాంబశివరావునాయుడు స్పష్టం చేశారు. అయితే ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను సత్వరం విచారించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు కోరుతూ లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్‌పై ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది అభ్యర్థించారు. ఇప్పటికే పలు పర్యాయాలు ఉత్తర్వులు ఇస్తామంటూ గత ఏడాదిన్నరగా న్యాయస్థానం వాయిదా వేస్తుండటంపై తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని, ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు స్పందించిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేశారు. చదవండి: రేవంత్ పిటిషన్ కొట్టివేత.. -
ఏసీబీ కోర్టులో రేవంత్‌రెడ్డికి చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: ఏసీబీ కోర్టులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు కోట్లు కేసు ఏసీబీ పరిధిలోకి రాదన్న రేవంత్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఓటుకు కోట్లు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందన్న కోర్టు.. ఇప్పటికే మరో ముగ్గురు నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టేవేసింది. గతంలో హైకోర్టు.. సండ్ర, ఉదయసింహా, సెబాస్టియన్ పిటిషన్లను కొట్టివేయగా, ఇప్పుడు రేవంత్‌రెడ్డి పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. చదవండి: పార్టీ మారడం లేదు: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఓటుకు కోట్లుకు సంబంధించి అన్ని ఆధారాలున్న ఉన్నాయని ఏసీబీ తెలిపింది. ఆడియో, వీడియో టేపులతో సహా అన్ని ఆధారాలున్నాయని పేర్కొంది. రూ.50లక్షలు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా నిందితులు పట్టుబడ్డారని ఏసీబీ తెలిపింది. ఏసీబీ వాదనలతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. అభియోగాల నమోదు కోసం విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. ఫిబ్రవరి 8న నిందితులు హాజరుకావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. చదవండి: బీజేపీ, టీఆర్ఎస్పై ఉత్తమ్ ధ్వజం -
ఓటుకు కోట్లు కేసు విచారణ నేటికి వాయిదా..
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసును విచారించే పరిధి ఈ కోర్టుకు లేదని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఏసీబీ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ప్రజాప్రతినిధులపై నమోదు చేసే కేసులను విచారించే పరిధి ఈ కోర్టుకు లేదంటూ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు సోమవారం మరోసారి విచారించారు. ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదు చేసిన ఈ కేసును విచారించే పరిధి ఎన్నికల కమిషన్‌కు మాత్రమే ఉంటుందని సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. తదుపరి విచారణను న్యాయమూర్తి మంగళవారానికి వాయిదా వేశారు. -
ఓటుకు కోట్లు కేసులో ప్రమాణానికి సిద్ధమా?
పొందూరు: ‘ఓటుకు కోట్లు కేసులో ఫోన్ రికార్డ్‌లో నీ గొంతు కాదని దబాయిస్తే.. కాణిపాకంలోని విఘ్నేశ్వరుని ముందు ప్రమాణం చేద్దాం రా?’ అని చంద్రబాబుకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సవాల్ విసిరారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని నందివాడలో ఇళ్ల పట్టాల పంపిణీలో ఆయన మాట్లాడారు. మనుషుల్లో దేవుడిని చూసే గొప్ప మానవతావాది సీఎం జగన్ అని, అలాంటి వ్యక్తిపై నిందలు మోపడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల, మతాల మధ్య చిచ్చురేపే స్వార్థ, నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. -
కీలక పరిణామం; బాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో నిందితుడైన జెరూసలేం మత్తయ్య ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చాడు. చంద్రబాబు సమక్షంలోనే ఒప్పందం కుదిరిందని స్పష్టం చేశాడు. స్టీఫెన్సన్కు రూ.5 కోట్లు ఇస్తామని అడ్వాన్స్‌గా రూ.50లక్షలు ఇస్తానని.. చంద్రబాబు తనతో చెప్పారని పేర్కొన్నాడు. టీడీపీ మాజీ నేత, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్‌రెడ్డి నోట్లకట్టలతో కనిపించిన వీడియో, ఈ కేసుకు సంబంధించి పలు ఆడియో రికార్డులను సైతం ఈడీ ముందు ధృవీకరించాడు. అదే విధంగా ఓట్లుకు కేసు విషయంలో తనకేమీ కాకుండా, ఏసీబీ అధికారులను మేనేజ్ చేస్తానని చంద్రబాబు తనయుడు నారా లోకేష్ హామీ ఇచ్చారని, వెంటనే విజయవాడకు వెళ్లిపోవాలని తనకు సలహా ఇచ్చినట్లు మత్తయ్య ఈడీకి చెప్పాడు.(చదవండి: ‘ఓటుకు కోట్లు’ కేసులో కీలక పరిణామం) ఈ మేరకు.. ‘‘నేను చాలాకాలంగా చంద్రబాబుకు తెలుసు. టీడీపీకి అనుకూలంగా పనిచేశాను. పలు సందర్భాలలో చంద్రబాబును కలిశాను. అయితే 2015 మహానాడు సందర్భంగా చంద్రబాబు, రేవంత్‌రెడ్డి నన్ను కలవాలనుకుంటున్నారని.. జిమ్మీబాబు నాకు చెప్పాడు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి.. కీలకమైన విషయం మాట్లాడటానికి వాళ్లిద్దరు నన్ను రమ్మన్నారు. దీంతో హిమాయత్‌సాగర్‌లో జరుగుతున్న మహానాడుకు వెళ్లాను. జిమ్మీబాబు నన్ను చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్లాడు. మహానాడు జరుగుతుండగానే చంద్రబాబునాయుడిని కలిశాను. అక్కడే ఆయన సమక్షంలోనే రేవంత్‌రెడ్డి నాతో ఈ డీల్ మాట్లాడారు. స్టీఫెన్సన్ టీడీపీకి అనుకూలంగా ఓటు వేసేవిధంగా ఒప్పించే బాధ్యత నాకు అప్పజెప్పారు. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే.. స్టీఫెన్సన్కు రూ.5కోట్లు ఇస్తామని చంద్రబాబు సమక్షంలో రేవంత్‌రెడ్డి చెప్పారు. ఓటింగ్‌కు గైర్హాజరైతే రూ.3కోట్లు ఇస్తామని చెప్పమన్నారు. ఈ ఒప్పందం కుదిరిస్తే నాకు రూ.50లక్షలు ఇస్తామని చంద్రబాబు సమక్షంలో రేవంత్ చెప్పాడు. డీల్‌కు స్టీఫెన్సన్ ఒప్పుకుంటే.. ముందుగా రూ.50లక్షలు అడ్వాన్స్ ఇస్తామని చంద్రబాబే చెప్పారు. ఈ విషయంలో నేను వెళ్లి స్టీఫెన్‌సెన్‌తో మాట్లాడాలని నాకు చెప్పారు. అతడిని ఒప్పిస్తే నన్ను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు నేను వెళ్లి స్టీఫెన్‌సన్‌తో చర్చించాను. వాళ్లిద్దరు ఆఫర్ చేసిన డీల్ గురించి స్టీఫెన్సన్కు చెప్పాను, అయితే తాను రేవంత్‌రెడ్డితో నేరుగా కలుస్తానని స్టీఫెన్సన్ నాతో చెప్పారు. ఈ విషయం రేవంత్‌రెడ్డికి చెప్పాలని సెబాస్టియన్‌కు చెప్పాను. చంద్రబాబు ఆదేశాలతో రేవంత్‌రెడ్డి డబ్బులతో స్టీఫెన్సన్ దగ్గరు వెళ్లారు. ఆ తరువాత రేవంత్‌రెడ్డి నేరుగా వెళ్లి స్టీఫెన్సన్కు బ్యాగులో డబ్బులు ఇచ్చారు. రేవంత్‌రెడ్డి డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్హాండెడ్గా అరెస్టు చేశారు. రేవంత్‌రెడ్డి అరెస్టు అయిన రెండో రోజు రహస్యంగా బంజారాహిల్స్‌లోని టీడీపీ కార్యాలయానికి వెళ్లాను. హైదరాబాద్‌లోని టీడీపీ కార్యాలయంలో నారా లోకేష్‌ను కలిశాను. నీకేమీ కాదని ఏసీబీ అధికారులను మేనేజ్ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. విజయవాడకు వెళ్లిపొమ్మని నాకు సూచించారు’’ అని మత్తయ్య తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో ఈడీ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. కాగా, 2015లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
‘ఓటుకు కోట్లు’ కేసులో కీలక పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు నాయుడిని ముద్దాయిగా చేర్చాలంటూ దాఖలైన పిటిషన్‌ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. వేసవి సెలవుల తర్వాత వచ్చే ఏడాది జూలై 14న దీన్ని విచారణ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ‘ఓటుకు కోట్లు కేసు ఛార్జ్‌షీట్‌లో చంద్రబాబు పేరును 37 సార్లు ప్రస్తావించారు. అయినా ఆ కేసులో ఏసీబీ చంద్రబాబును ముద్దాయిగా చేర్చలేదు’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు పేరు చేర్చి సీబీఐ దర్యాప్తు జరపాలని కోర్టును అభ్యర్ధించారు. రాజకీయ నేతల కేసులను త్వరితగతిన విచారణ జరపాలని ఇటీవలే సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. (ఓటుకు కోట్లు కేసు: ఉదయ్‌సింహ అరెస్టు) -
ఓటుకు కోట్లు కేసు: ఉదయ్‌సింహ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ఏళ్లుగా నలుగుతున్న ఓటుకు కోట్లు కేసులో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ-3 గా ఉన్న ఉదయ్‌సింహను ఏసీబీ అధికారులు నేడు అరెస్టు చేశారు. ఇప్పటికే పలువురు నిందితుల డిశ్చార్జ్ పిటీషన్లు కొట్టివేసిన ఏసీబీ ప్రత్యేక కోర్టు అభియోగాలపై విచారణ ప్రారంభించింది. విచారణకు హాజరుకాని మరో నిందితుడు ఉదయ్‌సింహపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్‌ను అమలు చేసిన ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. ఏసీబీ కోర్టులో ఉదయ్‌సింహను గురువారం హాజరుపరచనున్నారు. కాగా, ఈ కేసులో ఆడియో, వీడియో టేపుల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కీలకం కానుంది. నిందితులపై నమోదైన అభియోగాలపై విచారణ ప్రారంభం కావటంతో కీలక సూత్రదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. (చదవండి: ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ..) -
ఓటుకు కోట్లు కేసుపై విచారణ
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో సెబాస్టియన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై ఏసీబీ కౌంటరు దాఖలు చేసింది. సెబాస్టియన్ ఫోన్‌తో కుట్రలో కీలక వివరాలు బయటపడ్డాయని ఏసీబీ తెలిపింది. సెబాస్టియన్ డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేయాలని ఏసీబీ కోర్టును కోరింది. విచారణ జాప్యం చేసేందుకే ఒకరి తర్వాత ఒకరు పిటిషన్లు దాఖలు చేశారని ఏసీబీ పేర్కొంది. ఓటుకు నోటు కేసుపై శుక్రవారం మరో సారి కోర్టులో వాదనలు జరగనున్నాయి. -
ఓటుకు కోట్లు కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. బుధవారం ఏసీబీ న్యాయస్థానంలో ఈ కేసు విచారణకు రాగా.. డిశ్చార్జ్ పిటిషన్లపై హైకోర్టును ఆశ్రయించినందున గడువు ఇవ్వాలని సండ్ర వెంకటవీరయ్య, రుద్ర ఉదయ్‌సింహా కోరారు. అయితే వారి అభ్యర్థనపై ఏసీబీ అభ్యంతరం తెలిపింది. డిశ్చార్జ్ పిటిషన్లపై అప్పీల్ పేరుతో గడువు ఇవ్వొద్దని కోర్టును కోరింది. ఈ నేపథ్యంలో ఈ నెల 16న ఓటుకు కోట్లు కేసులో అభియోగాల నమోదు ప్రక్రియ ప్రారంభించాలని కోర్టు నిర్ణయించింది. అభియోగాల నమోదుకు మరింత గడువు ఇవ్వాలని నిందితులు కోరగా కోర్టు నిరాకరించింది. ఈ నెల 16న నిందితులు రేవంత్ రెడ్డి, సండ్ర, ఉదయ్ సింహా, సెబాస్టియన్లు కచ్చితంగా విచారణకు హాజరు కావాలని ఏసీబీ న్యాయస్థానం ఆదేశింది. చదవండి : ‘ఓటుకు కోట్లు’ కుట్రకు ఆధారాలున్నాయి -
‘ఓటుకు కోట్లు’ కుట్రకు ఆధారాలున్నాయి
సాక్షి, హైదరాబాద్: 'ఓటుకు కోట్లు' కేసులో కుట్రకు ప్రాథమిక ఆధారాలున్నాయని ఏసీబీ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ దశలో నిందితులను కేసు నుంచి తొలగించలేమని (డిశ్చార్జ్) చేయలేమని, తుది విచారణ (ట్రయల్) చేపట్టాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో నిందితులు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, రుద్ర ఉదయసింహలు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టేసింది. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఉద్దేశపూర్వకంగా తమను ఇరికించారన్న వారిద్దరి వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తి సాంబశివరావునాయుడు సోమవారం తీర్పునిచ్చారు. నిందితులపై అభియోగాల నమోదు కోసం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఈ కేసు విచారణలో భాగంగా రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య తదితరులు సోమవారం ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. మహానాడు వేదికగా కుట్ర... టీడీపీ 2015లో నిర్వహించిన మహానాడులో ఓటుకు కోట్లు కుట్ర జరిగిందని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు నివేదించింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను డబ్బుతో ప్రలోభపెట్టి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డిని గెలిపించేందుకు కుట్ర చేశారని తెలిపింది. రేవంత్‌రెడ్డి, మత్తయ్య తదితరులతో కలసి సండ్ర కూడా కుట్రలో భాగస్వామిగా మారారని, శంషాబాద్ నోవాటెల్‌లో ఇదే అంశంపై రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, సండ్ర సమావేశమయ్యారని పేర్కొంది. రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహ ఫోన్‌కాల్స్, వాయిస్ కాల్స్‌లోనూ సండ్ర ప్రమేయం స్పష్టమైందని వివరించింది. సండ్ర పాత్రను నిరూపించేందుకు అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని తెలిపింది. రేవంత్ అనుచరుడు ఉదయ్‌సింహకు కూడా ఈ కుట్రలో కీలకపాత్ర ఉందని ఏసీబీ తెలిపింది. స్టీఫెన్సన్ సూచించిన అపార్ట్‌మెంట్‌కు 2015 మే 31న మధ్యాహ్నం 4:40 గంటలకు రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్ ఒకే కారులో వచ్చారని, కొద్దిసేపటికి ఉదయసింహ వెర్నా కారులో రూ. 50 లక్షలున్న డబ్బు సంచి తీసుకొని అదే అపార్ట్‌మెంట్‌కు వచ్చారని ఏసీబీ వివరించింది. సీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు వేం కృష్ణకీర్తన్‌రెడ్డి నుంచి సికిం ద్రాబాద్ సమీపంలోని మెట్టుగూడ చౌరస్తా వద్దకు వెళ్లి రూ. 50 లక్షలు నగదు తీసుకురావాలని రేవంత్‌రెడ్డి ఉదయ్‌సింహకు సూచించారని తెలిపింది. ఈ కేసులో ఉదయసింహ పాత్రను నిరూపించేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని వివరించింది. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి... వారిద్దరి డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేశారు. -
ఓటుకు కోట్లు కేసు: ‘నాకు ప్రాణహాని’
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో పెనుదుమారం రేపిన ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కోర్టు మంగళవారం విచారణ కొనసాగించింది. వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది. ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న సెబాస్టియన్ కోర్టుకు హాజరయ్యారు. (తెరపైకి మరోసారి ఓటుకు కోట్లు కేసు) కోర్టుకు హాజరయిన అనంతరం సెబాస్టియన్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించి.. అసలు దోషులను వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణ ఉందని.. రక్షణ కల్పించాలని కోరారు. బెదిరింపులు, దాడులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. టీడీపీ తనను ఈ కేసులో ఇరికించిందన్నారు. ఆడియో టేపుల ఫోరెన్సిక్ రిపోర్ట్‌పై విచారణ జరిగితే కీలక వ్యక్తులు వెలుగులోకి వస్తారని చెప్పారు. స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన నగదు ఎక్కడ నుంచి వచ్చిందో విచారణ జరగాలన్నారు. ఈ కేసులో అసలు సూత్రధారి ఎవరో ప్రజలందరికి తెలుసన్నారు. నిజనిజాలన్ని కోర్టుకు తెలుపుతానని అందుకే సూత్రధారులతో ప్రాణహాని ఉందని సబాస్టియన్ పేర్కొన్నారు. (రేవంత్ మెడ చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు) -
తెరపైకి మరోసారి ఓటుకు కోట్లు కేసు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులు కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈ కేసులో ఏ1 గా ఉన్న రేవంత్‌రెడ్డి డ్రోన్ కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉండటంతో ఆయనను నేడు ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తారా? లేదా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. 2015లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.(రేవంత్ మెడ చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు) ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన ఏసీబీ.. మొత్తం 960 పేజీలతో చార్జిషీట్ దాఖలు చేసింది. అందులో ఈ కేసులో నిందితుల పాత్ర, అసలు సూత్రధారుల సంబంధించి కీలక విషయాలను పొందుపరిచారు. స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది. ఎవరు సమకూర్చారు అనే అంశం కీలకంగా మారింది. ఇప్పటికే కోర్టుకు ఆడియో టేపుల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు చేరాయి. ఓటుకు కోట్లు కేసు విచారణ ఏసీబీ కోర్టులో వేగంగా సాగుతుంది. త్వరలోనే ఈ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. (చర్లపల్లి జైలుకు రేవంత్..) (రేవంత్ నేరాల పుట్ట బయటపడింది) -
తెరపైకి మరోసారి ఓటుకు కోట్లు కేసు
-
మరోసారి తెరపైకి ఓటుకు కోట్లు కేసు
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి మంగళవారం ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈ కేసులో ఏ1 గా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉండటంతో ఆయనను రేపు ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తారా? లేదా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన ఏసీబీ.. మొత్తం 960 పేజీలతో చార్జిషీట్ దాఖలు చేసింది. అందులో ఈ కేసులో నిందితుల పాత్ర, అసలు సూత్రధారుల సంబంధించి కీలక విషయాలను పొందుపరిచారు. త్వరలోనే కీలక పరిణామాలు..! మరోవైపు ఈ కేసుకు సంబంధించిన ఆడియో టేపుల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కోర్టుకు చేరింది. ఈ కేసులో స్టీఫెన్సన్కు రేవంత్‌రెడ్డి ఇవ్వజూపిన డబ్బు ఎక్కడినుంచి వచ్చిందనేది కీలకం కానున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ కేసులో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా, 2015లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
ఓటుకు కోట్లు కేసును శీఘ్రంగా విచారించాలి
ఇది వినాల్సిన కేసు (ఓటుకు కోట్లు). పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం. త్వరితగతిన విచారణకు వచ్చేలా చూస్తాం.. – 2017 మార్చి 6న జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్య సాక్షి, న్యూఢిల్లీ: ‘ఓటుకు కోట్లు’ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయాల్సిందిగా అభ్యర్థిస్తూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించారు. కేసును 2019 ఫిబ్రవరిలో విచారిస్తామంటూ 2018 నవంబర్‌లో సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చినా ఇప్పటివరకు కేసు విచారణకు రాలేదని, శీఘ్రగతిన విచారించాలని అభ్యర్థించారు. ఆళ్ల తరపున న్యాయవాది అల్లంకి రమేష్ సోమవారం ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఏడాది క్రితం సుప్రీం ఉత్తర్వులు.. ఓటుకు కోట్లు కేసుకు సంబంధించి ప్రధాన పిటిషన్లో ప్రతివాదులైన నాటి సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు, తెలంగాణ ప్రభుత్వానికి 2017 మార్చి 6న సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. తర్వాత ఈ పిటిషన్ విచారణకు రాలేదు. త్వరగా విచారించాలని కోరుతూ ఆళ్ల తొలిసారి శీఘ్ర విచారణ పిటిషన్ దాఖలు చేయగా 2019 ఫిబ్రవరిలో విచారణ జరుపుతామని జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ రామయ్యగారి సుభాష్‌రెడ్డితో కూడిన ధర్మాసనం 2018 నవంబరు 2న ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు పిటిషన్ విచారణకు రాలేదు. 2017లో నోటీసులు జారీ చేసినా... ‘ఓటుకు కోట్లు’ కేసులో ఏసీబీ దర్యాప్తు సక్రమంగా లేదని, చంద్రబాబు పాత్రపై అధికారులు దర్యాప్తు చేయడం లేదని పేర్కొంటూ 2016 ఆగస్టు 8న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై లోతైన దర్యాప్తు జరపాలని అదే ఏడాది ఆగస్టు 29న ఏసీబీని ఆదేశిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు 2016 సెప్టెంబర్ 1న హైకోర్టును ఆశ్రయించగా ఏసీబీ న్యాయస్థానం ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆళ్ల సుప్రీం కోర్టును ఆశ్రయించగా జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం 2017 మార్చి 6న ప్రతివాదులైన తెలంగాణ ప్రభుత్వం, నాటి సీఎం చంద్రబాబుకు నోటీసులిచ్చింది. ఇది వినాల్సిన కేసని.. త్వరితగతిన విచారణకు వచ్చేలా చూస్తామని పేర్కొంటూ ఆ సమయంలో నోటీసులు జారీ చేసింది. విచారణకు రాని పిటిషన్ 2017 మార్చి 6న సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చిన నాటి నుంచి చంద్రబాబు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయలేదని, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసుపై తగినంత ఆసక్తి చూపడంలేదని, ప్రతివాదులు పలుకుబడి కలిగిన వారైనందున ఆలస్యమైతే సాక్షులను ప్రభావితం చేయవచ్చని పిటిషనర్ తొలిసారి శీఘ్ర విచారణ కోరిన సమయంలో నివేదించారు. వీటితోపాటు మరో కొన్ని అంశాలను జోడిస్తూ తాజాగా రెండోసారి శీఘ్ర విచారణ పిటిషన్ దాఖలుచేశారు. 2019 ఫిబ్రవరిలో విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసినా ఇప్పటివరకు కేసు లిస్ట్ కాలేదని... పిటిషనర్, ఆయన తరపు న్యాయవాదులు రిజిస్ట్రీలో విచారించినా ఫలితం లేదన్నారు. దీన్ని విచారణ కేసుల జాబితాలో చేర్చకపోవడానికి కారణాలు తెలియడం లేదని నివేదించారు. -
ఓటుకు కోట్లు: తాజా వీడియోపై ఈడీ ప్రశ్నలు..!
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ మిత్రుడు మాల్కం టేలర్‌ను శుక్రవారం విచారించింది. ఈ కేసుకు సంబంధించి వెలుగుచూసిన మరో వీడియో క్లిప్పింగ్‌పై ఈడీ ప్రశ్నలు సాగినట్లు సమాచారం. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మాల్కం టేలర్‌ను తమ ఎదుట హాజరుకావాలంటూ ఈడీ ఈ నెల 5న నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి హాజరైన మాల్కం టేలర్‌ను అధికారులు దాదాపుగా 3.30 గంటలపాటు విచారించారు. రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసిన సమయంలో ఇస్తానన్న రూ. 50 లక్షలు ఎక్కడ నుంచి తెచ్చారు? మిగిలిన రూ. 4.50 కోట్లు ఎక్కడ నుంచి తీసుకురావాలనుకున్నారు? వాటిని ఎక్కడ పెట్టారు? అని అడినట్లు తెలిసింది. వీడియోలో ‘బాబు’ప్రస్తావనపైనా ఈడీ అధికారులు ఆరా తీశారు. ‘బాబు’డబ్బులు ఎందుకు ఇస్తానన్నారు? అని ఆరా తీసినట్లు సమాచారం. (‘ఓటుకు కోట్లు’ కేసులో మరో సంచలన వీడియో..!) ఏసీబీ వీడియోలతో కలిపి పరిశీలన... రేవంత్‌రెడ్డిని అరెస్టు చేసే సమయంలో పలుచోట్ల రహస్య కెమెరాలతో ఏసీబీ పోలీసులు చిత్రీకరించిన వీడియోలను, మరోవైపు మాల్కం టేలర్ మొబైల్ నుంచి బయటకు వచ్చిన వీడియోను ఈడీ పరిశీలించినట్లు తెలుస్తోంది. ఇంతకాలం ఈ వీడియోను ఎందుకు బయటపెట్టలేదు? అని ప్రశ్నించినట్లు సమాచారం. ఏపీ పోలీసుల సంచారం.. ఈడీ కార్యాలయం వద్ద ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు శుక్రవారం ఉదయం నుంచే తచ్చాడుతూ కనిపించారు. మాల్కం టేలర్ ఈడీ విచారణకు హాజరై తిరిగి వెళ్లే దాకా అక్కడే నిఘా పెట్టారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేయడం కనిపించింది. లోపల ఏం జరిగింది? ఏం ప్రశ్నలు వేశారు అంటూ పలువురు మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇవి చదవండి : దొరికిన దొంగ చంద్రబాబు; సంచలనం ‘ఓటుకు కోట్ల’కు.. ‘మే’ ముహూర్తం! -
ఓటుకు కోట్లు : ఏది జరిగినా మీరే బాధ్యులు..!
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో గురువారం మరో వీడియో బయటపడింది. స్పై కెమెరాలకు సమాంతరంగా ఏసీబీ ఏర్పాటు చేసిన ఫోన్ కెమెరాలో తాజా వీడియో రికార్డయింది. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చేందుకు టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే, ఆంగ్లో ఇండియన్ ఎల్విస్ స్టీఫెన్సన్ను కొనుగోలు చేసేందుకు రూ.5 కోట్లకు బేరం కుదిరినట్టు ఈ వీడియో లో స్పష్టమైంది. టీడీపీ నేత సెబాస్టియన్, స్టీఫెన్‌సన్‌తో.. ‘తొలుత బాబు గారు 3.5 కోట్లు ఇవ్వడానికే ఒప్పుకున్నారు. నా ఒత్తిడి మేరకు రూ. 5 కోట్లు ఇవ్వడానికి సరేనన్నారు’ అని మాట్లాడారు. అదే సమయంలో.. రేవంత్‌రెడ్డి బయటకు వెళ్లిన తర్వాత స్టీఫెన్సన్కు ముట్టజెప్పే సొమ్ములో తన కొచ్చే కమీషన్ గురించి కూడా సెబాస్టియన్ మాట్లాడినట్టు తెలుస్తోంది. (సార్ ఎవరు? ) ఈ వ్యవహారంలో మధ్యవర్తులు ఉన్నట్టు వారి మధ్య జరిగిన సంభాషణ ద్వారా వెల్లడైంది. అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు రేవంత్‌ను అదుపులోకి తీసుకోవడంతో ఈ వీడియో ముగుస్తుంది. కాగా, ఈ డీల్ సమయంలో స్టీఫెన్సన్కు ఇచ్చిన రూ.50 లక్షల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందనేది తేలాల్సి ఉంది. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెండ్ డెరెక్టరేట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కొనుగోలు వ్యవహారంలో మధ్యవర్తిత్వం వహించినది ఎవరేనేది కూడా విచారణలో తేలనుంది. గత నాలుగేళ్లుగా నలుగుతున్న ఈ కేసులో తాజా వీడియోతో విచారణ వేగం కావొచ్చని పలువురు భావిస్తున్నారు. (‘ఓటుకు కోట్లు’ కేసులో మరో సంచలన వీడియో..!) కాగా,‘ఓటుకు కోట్లు’ కేసులో ఈడీ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వేం నరేందర్ రెడ్డిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ. 50 లక్షలతో పాటు మరో నాలుగున్నర కోట్లు ఎక్కడ అంటూ నరేందర్ రెడ్డిపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్ రెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి కూడా టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. (ఆ 50 లక్షలు హవాలా సొమ్మా?) తాజా వీడియో ఆధారంగా సంభాషణ.. స్టీఫెన్సన్ : లెటస్ గో టు ది డీల్.. సెబాస్టియన్ : నిజానికి బాబు ముందు 3.5 కోట్లు మాత్రమే ఇస్తానని చెప్పారు. నా ఒత్తిడి మేరకు రూ.5 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. రేవంత్ రెడ్డిని మీరు నమ్ముతున్నారు. బాబు నన్ను నమ్ముతున్నారు. మీరు రేవంత్ రెడ్డిని నమ్మడంతో ఆయన తెరమీదకు వచ్చారు. ఏది జరిగినా మీరే బాధ్యులు.. ఓకే సార్. సంబధిత వార్తలు.. దొరికిన దొంగ చంద్రబాబు; సంచలనం ‘ఓటుకు కోట్ల’కు.. ‘మే’ ముహూర్తం! ఓటుకు కోట్లు కేసు; సుప్రీం ఆదేశాలు -
ఆడియోలో ఉన్నది చంద్రబాబు గొంతే..
-
ఆ కేసులో చంద్రబాబే ప్రధాన ముద్దాయి
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు వ్యవహారం దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మఅన్నారు. ఈ కేసులో చంద్రబాబే ప్రధాన ముద్దాయని ఆరోపించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి చంద్రబాబు నాయుడు బేరసారాలకు దిగారని, ఈ విషయం ఈ రోజు బయటపడ్డ వీడియోలో స్పష్టంగా కనబడుతుందన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడినా..నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు. టీడీపీ చేసిన తప్పులను ఏపీ, తెలంగాణ సమస్యగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. (‘ఓటుకు కోట్లు’ కేసులో మరో సంచలన వీడియో..!) ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో, వీడియోలో అడ్డంగా దొరికినా.. ఆ విషయంపై ఇప్పటికీ చంద్రబాబు సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శించారు. రూ.కోట్లు కుమ్మరించి రేవంత్ టీమ్ ఎమ్మెల్యేను కొనేందుకు చూశారన్నారు. తన స్వార్థం కోసం చంద్రబాబు దేనికైనా తెగబడతారని ఆరోపించారు. చివరకు ఏపీ ప్రజల ఓట్లు కొనేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దీనికి ఐటీ గ్రిడ్స్ డేటా చోరీయే నిదర్శనమన్నారు. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యలను తారుమారు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలను, కుంభకోణాలను ప్రజలు గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో ఆయనను కచ్చితంగా ఓడిస్తారని ధీమా వ్యక్తం చేశారు. (దొరికిన దొంగ చంద్రబాబు) -
‘ఓటుకు కోట్లు’ కేసులో మరో సంచలన వీడియో..!
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు విచారణ కీలక మలుపు తిరుగుతోంది. ఓటుకు కోట్లు కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయని ఇంగ్లిష్ డెయిలీ డెక్కన్ క్రానికల్ ప్రచురించిన కథనం సంచలనం రేపుతోంది. ఈ కేసులో అసలు సూత్రధారులు ఎవరన్న కోణంలో దర్యాప్తు సాగుతున్న నేపథ్యంలో.. తార్నాకలోని మాల్కం టేలర్ అనే వ్యక్తి ఇంట్లో తీసిన వీడియో బయటికొచ్చింది. 11 నిముషాల నిడివి గల ఈ వీడియోలో టీడీపీ నేత సెబాస్టియన్, టీఆర్ఎస్ నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను రూ.5 కోట్లకు కొనుగోలు చేసేందుకు బేరసారాలు నడిపారు. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు సెబాస్టియన్ స్టీఫెన్‌సన్‌తో బేరం మాట్లాడినట్టు ఈ వీడియో ద్వారా తెలిసింది. (సార్ ఎవరు?) అడ్వాన్స్‌గా రూ.50 లక్షలు ఇవ్వడానికి నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వస్తాడని సెబాస్టియన్ చెప్పినట్టు ఈ వీడియోలో స్పష్టమైంది. తొలుత 3.5 కోట్లకే బాబు ఒప్పుకున్నారని, కానీ తన సిఫారసుతో 5 కోట్లకు డీల్ ఓకే అయిందని సెబాస్టియన్ స్టీఫెన్ సన్తో చెప్పిన విషయం వెల్లడైంది. మిగతా సొమ్ముకు తనదే బాధ్యత అంటూ సెబాస్టియన్ హామీయిచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ వీడియో ఓటుకు కోట్లు కేసులో ప్రధాన సూత్రధారి ఎవరనే విషయం తెలియనుంది. ఇప్పటికే ఈ కేసులో ఏ1 రేవంత్‌రెడ్డి, ఏ2 సెబాస్టియన్, ఉదయసింహ, వేం నరేందర్‌రెడ్డి విచారణ ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలకమైన చంద్రబాబు– స్టీఫెన్సన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ టేపును ప్రఖ్యాతి గాంచిన చండీగఢ్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది చంద్రబాబేనని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా నిర్ధారించింది. అయినా ఇప్పటివరకు ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు. నాలుగేళ్లుగా నలుగుతున్న ఈ కేసులో తాజాగా బయటపడిన వీడియో ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి..! (ఆ 50 లక్షలు హవాలా సొమ్మా?) సంబధిత వార్తలు : దొరికిన దొంగ చంద్రబాబు; సంచలనం ‘ఓటుకు కోట్ల’కు.. ‘మే’ ముహూర్తం! ఓటుకు కోట్లు కేసు; సుప్రీం ఆదేశాలు -
మిగిలిన రూ. 4.5 కోట్లకు ఎవరు హామీ ఇచ్చారు?
-
ఆ 50 లక్షలు హవాలా సొమ్మా?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏ–1 నిందితుడైన రేవంత్‌రెడ్డిని మంగళవారం 8 గంటలపాటు విచారించి ప్రశ్నలవర్షం కురిపించింది. ఉదయం 11.30కు ఈడీ కార్యాలయానికి హాజరైన రేవంత్‌ను రాత్రి 7.30 దాకా విచారించింది. ఈ వ్యవహారంలో హవాలా జరిగిందా అనే విషయాలపై అధికారులు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ఈ కేసులో వేం నరేందర్‌రెడ్డి, ఆయన కుమారులు, ఉదయసింహాను విచారించిన ఈడీ.. వారి సమాచారం ఆధారంగా రేవంత్ కోసం ప్రత్యేక ప్రశ్నావళిని రూపొందించినట్లు తెలిసింది. రేవంత్ చెప్పే సమాధానాలను సరిపోల్చుకునేందుకు ఐటీతోపాటు గతంలో ఈ కేసును విచారించిన ఏసీబీ అధికారులు విచారణకు హాజరయ్యారు. వారూ రేవంత్‌ను డబ్బు విషయంపై ప్రశ్నలు అడిగారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇవ్వజూపిన రూ.50 లక్షలు ఎక్కడ నుంచి సేకరించారు? ఎవరిచ్చారు? ఆ డబ్బు హవాలా డబ్బా? లేక స్థానికంగా ఎవరైనా సర్దుబాటు చేశారా? అనే విషయాలపైనే ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. మిగిలిన రూ. 4.5 కోట్లకు ఎవరు హామీ ఇచ్చారు? ఒకవేళ ఆ డబ్బు ముందుగానే సిద్ధం చేసి ఉంటే.. దాన్ని ఎవరి వద్ద ఉంచారు? అంత డబ్బు ఇచ్చేందుకు ఒకరే సహకరించారా? ఒకరికన్నా ఎక్కువమంది సహకరించారా? అనే విషయాలపై రేవంత్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. తెలియదు.. గుర్తులేదు.. ఈ కేసులో చాలా విషయాలకు రేవంత్ సరైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. చాలా ప్రశ్నలకు తనకు గుర్తులేదని, తెలియదని, మిగిలిన విషయాలు తన లాయర్ మాటాడతారని సమాధానమిచ్చారని తెలిసింది. రేవంత్‌కు సహకరించేందుకు పలువురు చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆయన వెంట వచ్చారు. ఇదంతా కక్ష సాధింపే: విచారణ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. ‘అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చా. రేపు కూడా రమ్మన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాయి. శాసనసభ ఎన్నికల సమయంలో ఐటీని పంపారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈడీని ప్రయోగిస్తున్నారు. ఇది వరకే ఏసీబీ విచారణ పూర్తి చేసిన కేసుపై ఈడీ విచారణ ఎందుకు? నాపై పోటీ చేసిన నరేందర్‌రెడ్డి వద్ద రూ. 51 లక్షలు దొరికినా ఈడీ, సీబీఐకి ఎందుకు ఇవ్వడంలేదు.’అని రేవంత్ ఆరోపించారు. కాగా బుధవారం మరోసారి విచారణకు రావాలని రేవంత్‌ను అధికారులు ఆదేశించారు. -
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయకూడదు
-
కేసీఆర్ నన్ను ప్రలోభపెట్టారు..
విజయవాడ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జరుసలెం మత్తయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటుకు కోట్లు కేసులో రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడిన చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలని అన్నారు. మత్తయ్య శనివారం విజయవాడలో మాట్లాడుతూ..ఈ కేసుపై ఎన్నికలకు ముందే దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో తనను బలవంతంగా ఇరికించారని, అంతేకాకుండా రాజకీయంగా తనకు న్యాయం జరగలేదని అన్నారు. హైకోర్టు కూడా తనను నిర్దోషిగా పేర్కొందన్న ఆయన.. సుప్రీంకోర్టులో తాను వేసిన కేసులో ఉదయసింహ ఎలా ఇంప్లీడ్ అవుతారని ప్రశ్నించారు. అయితే ఉదయసింహాతో పాటు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కూడా ఇంప్లీడ్ అవ్వాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను ప్రలోభాలకు గురి చేశారని మత్తయ్య ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసును సీబీఐ, ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఈ నెల 11వ తేదీన ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. -
సుప్రీం కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ
-
సుప్రీం కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసుపై సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ కేసులో నిందితుడైన ఉదయ్ సింహ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన జస్టిస్ లావునాగేశ్వర్ రావు ధర్మాసనం.. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. అయితే వ్యక్తిగత కారణాలతో తాను నేడు కోర్టుకు హాజరు కాలేనని, తనకు రెండు వారాల పాటు సమయం కావాలని ఉదయ్ సింహ తరపు న్యాయవాది సిద్దార్థ లూత్రా న్యాయమూర్తికి లేఖ రాశారు. సిద్దార్థ అభ్యర్థనను సమ్మతించిన ధర్మాసనం కేసు విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. మరోవైపు ఉదయసింహ దాఖలుచేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఈ పిటిషన్‌తో కేసు విచారణ ఆలస్యం చేయాలనే రకరకాల ఎత్తుగడులను ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ సీనియర్ న్యాయవాది హరేన్ ధావల్ వాదించారు. మరో నిందితుడైన మత్తయ్య పేరును ఈ కేసు నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ఏసీబీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో.. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. 2015 మే 30న వెలుగులోకి వచ్చిన ‘ఓటుకు కోట్లు’ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా స్టీఫెన్‌సన్‌తో సాగిన సంభాషణల్లోని గొంతు చంద్రబాబుదేనని ధ్రువీకరిస్తూ చండీగఢ్‌కు చెందిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక కూడా ఇచ్చింది. అయితే రాజకీయ అవసరాల కోసమే ఈ కేసును ఆలస్యం చేస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
‘ఓటుకు కోట్లు’ తర్వాత బాబు నోరు మెదపలేదు
సాక్షి, అమరావతి: ‘ఓటుకు కోట్లు’ కేసులో ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ రాజీ పడ్డారని రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు వెళ్లకుండా, బ్రీఫ్డ్ మి కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకు వెళ్లకుండా పరస్పరం అంగీకారానికి వచ్చారని చెప్పారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతోపాటు గవర్నర్ నరసింహన్ ఇద్దరు సీఎంల మధ్య రాజీ కుదిర్చారని, కేసీఆర్ షరతులకు చంద్రబాబు అంగీకరించాల్సి వచ్చిందని వెల్లడించారు. ‘నవ్యాంధ్రతో నా నడక’ పేరుతో రచించిన పుస్తకంలో ‘అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మి..’ అధ్యాయం పేరుతో అప్పటి పరిస్థితులను ఐవైఆర్ వివరించారు. అందులోని అంశాలపై ‘సాక్షి’ అందిస్తున్న సిరీస్ కథనాల్లో భాగమిది. గొంతు బాబుది కాదంటూనే ట్యాపింగ్ అక్రమమన్నారు.. ‘2015 జూన్ 1వతేదీ సాయంత్రం టీవీ చూస్తుండగా ‘‘అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మి..’’ ఉదంతం ప్రసారమమవుతోంది. ఈ సంభాషణ వినగానే నాకు మతిపోయినట్లయింది. ఒక సీఎం ఎన్నికల అక్రమాలను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు రావడం, రుజువుగా గొంతు కూడా వినిపించడంతో ఆయన ప్రతిష్ట దెబ్బ తింటుందనే అనిపించింది. నాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డి.. స్టీఫెన్సన్ ఇంటికి వెళ్లి శాసనమండలి ఎన్నికల్లో తమ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసేందుకు డబ్బులు ఇవ్వజూపినట్లు అప్పటికే టీవీల్లో చూపించారు. తరువాత ఏకంగా ముఖ్యమంత్రే ఫోన్లో మాట్లాడినట్లు చూపించారు. సాయంత్రానికల్లా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ టీవీల ముందుకు వచ్చి జరిగిన దాన్ని ఖండించారు. దీనిపై రాజ్యాంగపరమైన, చట్టపరమైన, న్యాయపరమైన, రాజకీయపరమైన అన్ని చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ఆడియో టేపులో వినిపిస్తున్న గొంతు చంద్రబాబుది కాదన్నారు. ఒకవైపు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన గొంతు చంద్రబాబుది కాదంటూనే మరోవైపు ట్యాపింగ్ అక్రమమని అన్నారు. ఇది జరిగిన రెండో రోజు జూన్ 2న విజయవాడలో మహాసంకల్ప దీక్షకు ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు లోకేశ్, పరకాల ప్రభాకర్‌తో కలసి ప్రత్యేక విమానంలో వెళ్లాం. ఆ సమయంలో ముఖ్యమంత్రి ముఖంలో నెత్తుటి చుక్క లేనట్లు కనిపించింది. ఆయన మౌనంగా ఏదో ఆలోచిస్తూ కనిపించారు. విమానంలో పరకాలను లోకేశ్ అభినందించారు. అనంతరం మహా సంకల్ప దీక్షలో పాల్గొన్న సీఎం పరధ్యానంగానే కనిపించారు. అక్కడి నుంచి స్టేట్ గెస్ట్ హౌస్‌కు వెళ్లి అధికారులను కలిశాం. డీజీపీ, నేను, కొంతమంది ముఖ్యులు అందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కూడా సీఎం ఇంకా తేరుకోనట్లు కనిపించారు. ఆయన ముఖంలో చాలా అలసట, బడలిక కనిపించాయి. అంతా కలిసి చర్చించిన తర్వాత తమ ఫోన్ల ట్యాపింగ్ జరిగిందనే అంచనాకు వచ్చారు. ఫోన్ ట్యాపింగ్‌పై కేసు వేసి వారిని ముద్దాయిలుగా చేస్తే అవతలి పక్షం ఆత్మరక్షణలో పడుతుందని భావించారు. విజయవాడలో కేసు ఫైల్ చేయాలని నిర్ణయించారు. రెండు విషయాల్లో సీఎంల మధ్య అవగాహన.. మహా సంకల్ప దీక్ష బహిరంగ సభలో మాత్రం కేసీఆర్ కయ్యానికి కాలు దువ్వుతున్నారని, కేసులు పెడితే భయపడేది లేదని చంద్రబాబు చెప్పారు. తాను నిప్పులాంటి మనిషినన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, కేసీఆర్‌కు తమను విమర్శించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. కేసీఆర్, జగన్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మర్నాడు కేసీఆర్ కూడా గట్టిగా సమాధానం ఇచ్చారు. కేసుల్లో చంద్రబాబును తాము ఇరికిస్తే ఇరికేంత అమాయకుడు కాదని, ఆయన గోతులు తీయగల సమర్ధుడని వ్యాఖ్యానించారు. ‘‘పట్టపగలు దొరికిన దొంగ.. నిన్నెవరూ కాపాడలేరు’’ అని చంద్రబాబును హెచ్చరించారు. ఇద్దరు సీఎంల మధ్య యుధ్ధం ఢిల్లీ దాకా వెళ్లింది. ఫోన్ ట్యాపింగ్ అక్రమమంటూ కౌంటర్ దాఖలు చేయడం, రచ్చ చేయడంతో చంద్రబాబుకు ప్రయోజనం చేకూరింది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య రాజీ కుదర్చాలని భావించడం వల్ల ఓటుకు కోట్లు కేసు ప్రాముఖ్యం కోల్పోయింది. విషయాన్ని అక్కడికక్కడే ముగించి ఇద్దరి మధ్య అవగాహన కుదర్చాలని కేంద్రం నిర్ణయించినట్లు కనిపించింది. గవర్నర్ నరసింహన్ కూడా ఢిల్లీ వెళ్లి జరిగిన విషయాలను హోంమంత్రికి వివరించారు. సీఎంల మధ్య సంధి కుదర్చమని కేంద్రం కోరే ఉంటుంది. ఇద్దరి మధ్య రెండు విషయాల్లో మాత్రం అవగాహన ఏర్పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు కొంత వెసులుబాటును కేసీఆర్ కల్పిస్తారు. టెలిఫోన్ ట్యాపింగ్ అంశంపై చంద్రబాబు న్యాయస్థానంలో ముందుకు వెళ్లరు. కేసీఆర్ మరికొన్ని షరతులు కూడా విధించి ఉంటారు. ‘‘మీరు (టీడీపీ సర్కారు) హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలి. మొత్తం సచివాలయాన్ని తరలించి కట్టుబట్టలతో వెళ్లాలి. తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. మిగిలినవి నేను చూసుకుంటా. వెళ్లిపోండి..’’ అని కేసీఆర్ చెప్పి ఉంటారు. కౌంటర్ కేసు వేయటం చంద్రబాబుకు ఉపయోగపడింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ఆయన తదుపరి చర్యలు తీసుకోలేదు. దానికి కాలదోషం పట్టింది. ఇక ఓటుకు కోట్లు కేసు కూడా తెరమరుగవుతుందనే అనుకుంటున్నా. తెలంగాణలో టీడీపీ నాయకత్వాన్ని కేసీఆర్ తన వైపు తిప్పుకున్నారు. హైదరాబాద్‌లో టీఆర్ఎస్ బలపడేలా చేసుకున్నారు. ఇక ఆ తరువాత బాబు నోరు మెదపలేదు... ఓటుకు కోట్లు కేసు తర్వాత చంద్రబాబు చాలా బలహీనపడ్డారు. ఆయన మొదట్లో కేసీఆర్ గురించి తేలికగా మాట్లాడేవారు. 2015 జూన్ 2 తర్వాత ఇక నోరు విప్పలేదు. జూన్ 2కు ముందు చంద్రబాబు ఒక మనిషి కాగా ఆ తర్వాత ఆయన మరో మనిషిలా మారారు. ఓటుకు కోట్లు కేసు చంద్రబాబు ఆత్మవిశ్వాసం, మనోస్థైర్యం, విషయాలను డీల్ చేసే విధానాన్ని పూర్తిగా దెబ్బ తీసింది. ఈ కేసులో విచారణ వెంటనే సాగి ఉంటే సాక్ష్యాధారాలు మరింత బయటపడేవి. ఎక్కడి నుంచి ఎక్కడకు డబ్బు వెళ్లింది? ఎవరు విత్ డ్రా చేశారు? ఎవరు ఎవరికి డబ్బులు చెల్లించారు? అనే విషయాలు అంతా తెలిసేవి. మనీ ట్రయిల్ కూడా బయటపడేది. ముఖ్యమంత్రిదే కాకుండా మరికొందరు ముఖ్యుల ఫోన్ సంభాషణలు కూడా రికార్డు చేశారని విన్నా. ఏమైనా విచారణ ఆగిపోయింది. ఫోరెన్సిక్ నివేదిక మాత్రం ఒక కొలిక్కి వచ్చిందని సమాచారం. అదే సమయంలో ఫోరెన్సిక్ నిపుణుడు గాంధీని సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో నియమించుకున్నారు. ఓటుకు కోట్లు కేసు వెలుగు చూసిన సమయంలోనే గాంధీ అవసరం ఎందుకు గుర్తుకొచ్చిందో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి’ -
చంద్రబాబు స్వార్థానికి రాష్ట్రం బలి
సాక్షి, అమరావతి: ఓటుకు నోటు కేసుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గొంతు జీరబోయిందని, ఆయన బలహీన పడి బతుకు జీవుడా అంటూ హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలివచ్చారని, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దెబ్బతీశారని విభజన అనంతరం రాష్ట్ర తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా పనిచేసిన ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఎదురైన సమస్యలు, వాటిని పరిష్కరించడానికి అవలంభించిన విధానాలతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహార శైలిని ‘నవ్యాంధ్రతో నా నడక’ పేరిట తాను రచించిన పుస్తకంలో ఐవైఆర్ కృష్ణారావు వివరించారు. ఆదివారం విడుదల చేసిన ఈ పుస్తకంలో ఆయన ఇంకా ప్రస్తావించారంటే... ‘‘హైదరాబాద్‌లోనే ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడుతానని తొలుత చెప్పిన చంద్రబాబు తెలంగాణలో కేసీఆర్ సర్కారును దెబ్బతీసేందుకు తెరవెనుక పన్నాగాలు పన్ని దొరికిపోయారు. ఓటుకు నోటు వ్యవహారం బయటపడడంతో బతుకు జీవుడా అంటూ విజయవాడకు తరలివచ్చారు. తరువాత హైదరాబాద్‌కు వెళ్లడం తగ్గించేశారు. విజయవాడలో రాజధాని గురించి భారీ ఎత్తున ప్రచారం చేసి, ఒక ఊపు సృష్టించి దానిపై బిల్డప్ ఇవ్వడం మొదలు పెట్టారు. హైదరాబాద్‌లో ఉండలేని తన నిస్సహాయత బయటపడకుండా విజయవాడలోనే ఉండిపోవడానికి రాజధాని పేరుతో బలమైన కారణాలు సృష్టించుకోవడం ప్రారంభించారు. ఒక ప్రతికూల పరిస్థితిని తన మీడియా సహాయంతో అనుకూలంగా మలుచుకున్నారు. ఇలాంటివి చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. సొంత గడ్డపై నుంచే పరిపాలన ఉత్తమం అనే కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇదంతా ఓటుకు నోటు కేసు మహత్యమేనని వేరే చెప్పనక్కరలేదు. ఈ కేసు తరువాత చంద్రబాబు ఆత్మరక్షణలో పడటంతో విభజన సమస్యలపై సీఎస్‌గా నేను ముఖ్యమంత్రికి పంపించిన ఫైళ్లు తిరిగి వచ్చేవి కావు. తెలంగాణ ప్రభుత్వంతో సంఘర్షణకు పూనుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదని అప్పుడు నాకు తెలిసింది. ఒక వ్యక్తి సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినడం స్పష్టంగా కనిపించింది. ఓటుకు నోటు కేసుతో కేంద్ర ప్రభుత్వం దృష్టిలోనూ ఏపీ ప్రభుత్వం చులకనగా మారింది. ఓటుకు నోటు కేసు తరువాత ముఖ్యమంత్రి ఆగమేఘాలపై విజయవాడకు వెళ్లిపోవడంతో సచివాలయ ఉద్యోగులు పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఓటుకు నోటు కేసు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. చంద్రబాబుకు సమస్య వచ్చినందు వల్లే సచివాలయ ఉద్యోగులందరికీ తీవ్ర సమస్య తెచ్చిపెట్టారు. అసలు ఏమాత్రం సన్నాహాలు చేయకుండానే సచివాలయాన్ని అమరావతికి తరలించారు. ఇది మరీ ఘోరం. తెలంగాణకు విద్యుత్‌ను ఏకపక్షంగా నిలిపేశారు చంద్రబాబు తొలుత హైదరాబాద్‌లోనే ఉండిపోవాలన్న బలమైన ఆకాంక్షను వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పట్ల ప్రత్యర్థి వైఖరిని అవలంభించారు. రెండు రాష్ట్రాలకు వర్తించే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను గౌరవించే బదులు వాటిని రద్దు చేసి అదనపు విద్యుత్‌ను తెలంగాణతో పంచుకోకూడదని నిర్ణయించారు. ఒప్పందాలను రద్దు చేసి, ఏపీ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరా కాకుండా చూశారు. ఈ ఒక్క నిర్ణయమే రెండు రాష్ట్రాల మధ్య ఎక్కువ అగాథాన్ని సృష్టించింది, సంబంధాలను దెబ్బతీసింది’’ అని ఐవైఆర్ కృష్ణారావు తన పుస్తకంలో వివరించారు. -
ఓటుకు కోట్లు కేసు; సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
ఓటుకు కోట్లు కేసు: ఫిబ్రవరి నుండి పూర్తిస్తాయి విచారణ
-
ఓటుకు కోట్లు కేసు; సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. టీడీపీ అధికార దాహానికి ప్రతీకగా నిలిచిన ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేపట్టి, త్వరితగతిన పూర్తి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాజకీయ శత్రుత్వంతోనే రామకృష్ణా రెడ్డి పిటిషన్ వేశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది సిద్ధార్థ వాదించారు. ఇరువర్గాల వాదనలు పరిశీలించిన అనంతరం ఈ కేసును ఫిబ్రవరిలో విచారణకు లిస్ట్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో.. ఫిబ్రవరి, మార్చిలో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ఉంటాయని సిద్దార్థ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన జస్టిస్ మదన్‌బీ లోకూర్.. ఆ విషయంలో తామేమీ చేయలేమని, ఫిబ్రవరిలో విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. సుప్రీం ఆదేశాలను స్వాగతిస్తున్నాం : ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఓటుకు కోట్లు కేసులో సత్వర విచారణ కోసం తాను చేసిన విఙ్ఞప్తిని సుప్రీం కోర్టు అంగీకరించిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికలు ఉన్నాయని, విచారణను వాయిదా వేయాలన్న చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది సిద్దార్థ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చిందని తెలిపారు. కాగా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో.. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. 2015 మే 30న వెలుగులోకి వచ్చిన ‘ఓటుకు కోట్లు’ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా స్టీఫెన్‌సన్‌తో సాగిన సంభాషణల్లోని గొంతు చంద్రబాబుదేనని ధ్రువీకరిస్తూ చండీగఢ్‌కు చెందిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక కూడా ఇచ్చింది. -
సిట్.. ఒక కీలుబొమ్మ
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిన ప్రతీసారి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) తెరపైకి తీసుకొస్తోంది. అధికార పార్టీ పెద్దలు, ప్రజాప్రతినిధుల అవినీతి, అక్రమాలు.. నేరాలపై చర్యలు తీసుకోకుండా ‘సిట్’ పేరిట కాలయాపన చేస్తూ తప్పించుకుంటోంది. కుంభకోణాలు, సంచలన çఘటనలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడం.. ఆ తర్వాత నివేదికలను బుట్టదాఖలు చేయడం, విచారణను అటకెక్కించడం పరిపాటిగా మారింది. విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై విచారణకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే, ఈ ఘటన జరిగిన ఆరు రోజులు గడిచినా ఇప్పటిదాకా ‘సిట్’ తేల్చిందేమీ లేకపోవడం గమనార్హం. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కూలీల కాల్చివేత, విశాఖలో భూ కుంభకోణం, కాల్‌మనీ సెక్స్ రాకెట్, విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై భూకబ్జా కేసు, హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబుపై ఓటుకు కోట్లు కేసులో ఫోన్ ట్యాపింగ్, తాజాగా విశాఖ మన్యంలో మావోయిస్టులు చేసిన జంట హత్యలు వంటి కీలక ఘటనలపై సిట్ దర్యాప్తులతో ఎలాంటి ఫలితంలేదు. ప్రత్యేక దర్యాప్తు బృందాలు ప్రభుత్వ పెద్దల చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (కాల్‌డేటాను దాటని విచారణ) ► శేషాచలం అడవుల్లో 2015 ఏప్రిల్ 7న ఏపీ టాస్క్‌ఫోర్స్ పోలీసుల కాల్పుల్లో 20 మంది ఎర్రచందనం కూలీలు మరణించారు. ఈ ఘటనపై పౌరహక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో రాష్ట్ర సర్కారు 2015 ఏప్రిల్ 24న సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్.రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు అసలు నేరస్తుల పాత్ర బయటపడలేదు. ► తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఓటును టీడీపీ అభ్యర్థికి వేయించుకోవడానికి రూ.50 లక్షలు ఇస్తుండగా, 2015 మే నెలలో అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఏసీబీ అధికారులు ఆధారాలతో సహా పట్టుకున్నారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు పలువురిపై ఏపీలో 88 ఫోన్ ట్యాపింగ్ కేసులు నమోదు చేయించింది. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణకు 2015 జూన్ 17న సిట్ ఏర్పాటు చేసింది. ఈ విచారణ అడ్రసు లేకుండా పోయింది. ► విశాఖపట్నం రూరల్‌లో అధికార టీడీపీ ముఖ్యనేతల కనుసన్నల్లోనే భూ కుంభకోణం జరగిందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీంతో గతేడాది జూన్‌లో గ్రేహౌండ్స్ డీఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. భూ కుంభకోణంలో టీడీపీ మంత్రులు, నేతలదే ప్రధాన పాత్ర అని తేలడంతో ‘సిట్’ విచారణ అటకెక్కేసింది. ► విశాఖ ఏజెన్సీలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మట్టుబెట్టేందుకు మావోయిస్టులకు స్థానిక టీడీపీ నేతలే ఉప్పందించారని పోలీసులు నిర్ధారించి అరెస్టులు కూడా చేశారు. కానీ, సిట్ అధికారులు ఎక్కడా బహిరంగంగా మాట్లాడకుండా, నివేదిక ఇవ్వకుండా అర్ధంతరంగా వదిలేశారు. ► విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై భూ కబ్జా కేసుతో టీడీపీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఈ నేపథ్యంలోనే విశాఖ తరహాలోనే విజయవాడ, గుంటూరులలో భూ వివాదాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసి, అసలు వివాదాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేసింది. ► రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడలోని కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ చేసిన దర్యాప్తు మూడేళ్లు దాటినా అతీగతీ లేదు. థర్ట్‌పార్టీ దర్యాప్తు ఎందుకంటే.. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే పని చేసే ప్రత్యేక దర్యాప్తు బృందాలపై నమ్మకం సన్నగిల్లుతోంది. అధికార పార్టీ నేతల అరాచకాలను ఇప్పటివరకు ఏ ఒక్క సిట్ కూడా తేల్చలేకపోయింది. ఒక్కరికైనా శిక్ష పడేలా ఆధారాలను సంపాదించలేదు. తాజాగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర డీజీపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఘటన జరిగిన రోజే వారు చేసిన వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని ఏదైనా కేంద్ర దర్యాప్తు సంస్థతో(థర్డ్ పార్టీ) విచారణ జరిపిస్తేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. -
ఐటీ అధికారుల ముందుకు రేవంత్‌రెడ్డి ..!
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసు, ఆదాయానికి మించిన ఆస్తులు, డొల్ల కంపెనీల లావాదేవీలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, అతని సన్నిహితుల నివాసాలపై ఐటీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. సోదాల అనంతరం పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు విచారణకు హాజరవాల్సిందిగా వారికి నోటీసులు జారీచేశారు. ఇప్పటికే రేవంత్‌ను ఐటీ అధికారులు రెండుసార్లు సుదీర్ఘంగా విచారించారు. కాగా, ఈ విచారణ రెండో దశకు చేరుకుంది. ఇప్పుడు మరోసారి రేవంత్‌కు ప్రశ్నలు సంధించనున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన ఐటీ అధికారుల ముందు హాజరుకానున్నట్లు సమాచారం. మరోవైపు రేవంత్ రెడ్డితో పాటు పద్మనాభరెడ్డి, ఉదయసింహ, శ్రీసాయి మౌర్యా సంస్థ డైరెక్టర్లు, ఆడిటర్లు, కేఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ సంస్థ ప్రతినిధులు కూడా విచారణకు హాజరు కానున్నారని తెలిసింది. -
‘ఓటుకు కోట్లు కేసు’లో ఇరుక్కున్నా సిగ్గులేదా?: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉన్న ఆంధ్రా వాళ్ల పాలిట శని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడేనని టీఆర్ఎస్ అధినేత, ఆపద్దర్మ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో మంగళవారం ఎన్నికల ప్రణాళిక కమిటీతో సమావేశం అనంతరం మీడియా సమావేశంలో పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించారు. పూర్తి మేనిఫెస్టో సిద్ధమయ్యేలోగా ఇప్పటికే నిర్ణయించిన కొన్ని ముఖ్యమైన హామీలతో ప్రజల దగ్గరికి వెళ్లాలని టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మేనిఫెస్టో ప్రకటించిన అనంతరం టీడీపీ-కాంగ్రెస్ కూటమిపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయడు వైఖరిని ఎండగట్టారు. ఇంకా ఏమన్నామరంటే ఆయన మాటల్లోనే.. వాళ్లు తెలంగాణ పౌరులే ‘తెలంగాణలో చంద్రబాబు పార్టీకి డిపాజిట్లు వస్తాయా? చంద్రబాబు తెలంగాణలో రాజ్యమేలుతాడా? ఇప్పటికే ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్నా సిగ్గులేదా? నువ్వు వ్యక్తివి, రాజకీయ నేతవి కాబట్టి బరాబర్ అంటాం. చంద్రబాబునంటే ఆంధ్రా వాళ్లను అన్నట్టు కాదు. చంద్రబాబు పోతే కబ్జాలు, జూదాలు, పేకాటక్లబ్‌లు పోయాయి. తెలంగాణలో ఉన్న ఆంధ్రా వాళ్ల పాలిట శని చంద్రబాబు. ఆంధ్రా నుంచి ఎప్పటి నుంచో వచ్చి ఇక్కడ ఉంటున్నారు. మేం 15 మందికి కార్పొరేట్ టికెట్లు ఇస్తే 12 మంది ఆంధ్రా వాళ్లు గెలిచారు. ఏడెనిమిది ఆంధ్రావాళ్లకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాం. ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. వాళ్లు తెలంగాణ పౌరులే. మాకైతే పొత్తు అవసరం లేదు. పోయి పోయి చంద్రబాబుతో పొత్తా? (టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టో ఇదే) ఆయనకు వయసు పైబడింది డిసెంబర్లో చాలా పెద్ద పరిణామాలు ఉంటాయి. గడ్డం ఉంచుకునేవారెవరో..గీసుకునేవారెవరో తెలస్తుంది. అన్ని సర్వేలు టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తున్నాయి. సుస్థిరమైన రాజకీయ వ్యవస్థ తెలంగాణకు అవసరం. వంద సీట్లు దాటడమే మా టార్గెట్. గతంలో ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే అన్ని స్ధానాలు గెలుచుకున్నాం. ఇప్పుడు ఐదారు జిల్లాలో అన్ని స్థానాలు కైవసం చేసుకుంటాం. గతంలో హైదరాబాద్, ఖమ్మంలో ఒకో సీటు వచ్చాయి. ఇప్పుడు పుంజుకున్నాం. ఎమ్మెల్యే టికెట్ ఆశించడం తప్పుకాదు. ఒక్క అభ్యర్థిని కూడా మార్చేది లేదు. జైపాల్‌రెడ్డి వయసు పైబడి బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారు. నూటికి నూరు శాతం గెలుస్తాం. గతంలో జరిగిన అవినీతిని బయటపెడతాం’అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. (కేసీఆర్‌పై గద్దర్ పోటీ) -
రేవంత్ రెడ్డి విచారణపై ఏపీ ప్రభుత్వం ఆరా!
సాక్షి, అమరావతి : ‘ఓటుకు కోట్లు కేసు’ లో ఏ1 నిందితుడు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఆదాయపు పన్ను శాఖ అధికారుల బుధవారం విచారించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారన దాదాపు ఐదు గంటల పాటు కొనసాగింది. ఈ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా సంబంధం ఉన్న విషయం తెలిసిందే. దీంతో రేవంత్ విచారణ పరిణామాలపై ఏపీ ప్రభుత్వం ఆరా తీసుస్తోంది. ఐటీ కార్యాలయ పరిసరాల్లో ఏపీ ఇంటలిజెన్స్, ఎస్బీ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఐటీ సోదాలు, విచారణను గమనిస్తున్న ఏపీ ప్రభుత్వ పెద్దలు భయాందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
ముగిసిన రేవంత్ విచారణ
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు కేసు’లో ఏ1 నిందితుడు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారణ ముగిసింది. బుధవారం ఉదయం 11 గంటలకు ఐటీ కార్యాలయంలో ప్రారంభమైన విచారణ దాదాపు ఐదు గంటల పాటు కోనసాగింది. రేవంత్‌తో పాటు ఈ కేసులో మరో నిందితుడు ఉదయ్ సింహాలను కలిపి ఐటీ అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు ఇవ్వజూపిన రూ.50 లక్షలతో పాటు, ఇస్తామని ఆఫర్ ఇచ్చిన నాలుగున్నర కోట్ల రూపాయల గురించి అధికారులు ఆరా తీస్తున్నారని సమాచారం. అంతేకాకుండా ఈ కేసు గురించి ఏం చెప్పదల్చుకున్నాడో లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని రేవంత్‌ను కోరారు. ఆదాయ వ్యయాలు, వ్యాపార లావాదేవీలు, ఆస్తుల డాక్యుమెంట్లు, ఎన్నికల అఫిడవిట్స్‌లు ఐటీ అధికారులు రేవంత్ ముందుంచి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రేవంత్‌తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని కూడా ఐటీ అధికారులు విచారిస్తున్నారు. (గుట్టు తేలితే బాబుపైనే నజర్!) చదవండి: ఓటుకు ‘కోట్లు’ ఎక్కడివి? రేవంత్‌పై.. నేనే ఫిర్యాదు చేశా -
ఓటుకు కోట్లు కేసులో దూకుడు పెంచిన అధికారులు
-
రేవంత్ రెడ్డి మామను విచారించిన ఐటీ అధికారులు
సాక్షి, హైదరాబాద్: గత కొద్ది రోజులుగా రాజకీయ నాయకుల ఇళ్లపై ఐటీ దాడులు పొలిటికల్‌గా హాట్ అండ్ హీట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘ఓటుకు కోట్లు కేసు’ కు సంబంధించి జరిగిన సోదాల్లో పలు కీలకపత్రాలు, సమాచారం లభించిందని ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం తెలిపింది. ఇప్పటికే ఈ కేసులో ఏ1 గా ఉన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో సహా, అయన బంధవులకు, అనుచరులకు నోటీసులు జారీ చేసింది. దీనిలో భాగంగా రేవంత్ రెడ్డి మామ పద్మనాభ రెడ్డి సోమవారం ఐటీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘గత నెల 28న నా ఇంటిపై అధికారులు సోదాలు చేసి ఐటీ కార్యాలయాలకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. దానిలో భాగంగా విచారణ నిమిత్తం ఐటీ అధికారులు ముందు హాజరయ్యాను. రేవంత్ రెడ్డి ఆస్తులకు సంబంధించిన వివరాలు అడిగారు. దీంతో పాటు ‘ఓటుకు కోట్లు కేసు’ వివరాలు అడిగారు. ఆ వివరాలు నాకు తెలియదని చెప్పాను. రేవంత్ రెడ్డికి మా కూతురును ఇవ్వక ముందే నేను ఐటీ రిటర్న్స్ కట్టేవాడిని. ప్రస్తుతం రేవంత్ ఉంటున్న ఇల్లు నా కూతురుదే. మళ్లీ కొన్ని ప్రశ్నలతో కూడిన నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులపై ఈ నెల 20లోపు వివరణ ఇవ్వాలని ఐటీ అధికారులు కోరారు’అంటూ విచారణ వివరాలను పద్మనాభ రెడ్డి మీడియాకు తెలిపారు. -
క్షీణ సంస్కృతికి ఆనవాళ్లు!
మన వైఖరి మనం ఎక్కడున్నామనే అంశంపైన ఆధార పడి ఉంటుందని దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర సమరయోధుడు నెల్సన్ మండేలా అనేవారు.'Where you stand depends on where you sit.' కొంతకాలంగా రాజకీయా లను పరిశీలిస్తున్నవారికి మండేలా మాటలు అక్షరసత్యా లుగా అగుపిస్తాయి. ప్రధాని నరేంద్రమోదీ గురించి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్డీఏ భాగ స్వామిగా ఉండగా ఏమని అన్నారో, ఎన్డీఏ నుంచి నిష్క్రమించిన తర్వాత ఏమంటున్నారో గమనిస్తే మండేలా ఆంతర్యం సులభంగా అర్థం అవుతుంది. ఎన్డీఏ భాగస్వా మిగా ఇద్దరు టీడీపీ మంత్రులు కేంద్ర ప్రభుత్వంలో, ఇద్దరు బీజేపీ మంత్రులు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నంత కాలం మోదీ సమర్థుడైన నేత. తెగతెంపులు చేసుకున్నట్టు ప్రపంచాన్ని నమ్మించాలి కనుక ఇప్పుడు మోదీ ఆంధ్రులకు ఎనలేని ద్రోహం చేసిన పరమదుర్మార్గుడు. కేంద్రస్థాయిలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహారావు, రాష్ట్ర స్థాయిలో బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు ప్రభృతులు చంద్రబాబు నిజస్వరూపం ఇప్పుడే తెలుసుకున్నట్టు విమర్శలు గుప్పిస్తున్నారు. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ‘మోదీ దొంగ’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అభివర్ణిస్తే ‘రాహుల్ అబద్ధాలకోరు’ అంటూ మోదీ జవాబు చెప్పారు. దిగజారిన రాజకీయ సంస్కృతి అన్ని రాష్ట్రాలలో మాదిరే తెలుగు రాష్ట్రాలలోనూ కనిపిస్తున్నది. కంపరం కలిగి స్తున్నది. ఇప్పుడు వార్తలలోని వ్యక్తి రేవంత్‌రెడ్డి ఎవరు? ఒక మాజీ శాసనసభ్యుడు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడు. రేవంత్‌రెడ్డి పేరు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ మార్మోగడానికి ఆయన చేసిన ఘన కార్యం ఏమిటి? ‘ఓటుకు కోట్లు’ కేసులో టీఆర్ఎస్ శాసన సభ్యుడు ఎల్విస్ స్టీఫెన్సన్కు రూ. 50 లక్షల నగదు లంచంగా ఇస్తూ కెమేరాకు దొరికిపోయారు. కుమార్తె వివా హానికి ముహూర్తం పెట్టుకున్న తరుణంలో ఈ అనైతిక వ్యవహారంలో ఇరుక్కొని జైలుకు వెళ్ళవలసి వచ్చింది. శాసనమండలి ఎన్నికలలో వేం నరేంద్రరెడ్డి అనే టీడీపీ అభ్యర్థిని గెలిపించుకునే వ్యూహంలో భాగంగా మొత్తం అయిదు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి బయానాగా రూ. 50 లక్షలు చెల్లించిన సందర్భం. ఈ వ్యవహారంలో వ్యూహకర్త, సూత్రధారి చంద్రబాబే అన్నది బహిరంగ రహస్యం. ఏసీబీ ద్వారా రేవంత్‌ని పట్టించింది, స్టీఫె న్సన్తో ‘మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ’ అంటూ చంద్రబాబు ఫోన్లో మాట్లాడిన మాటలను రికార్డు చేయించిందీ తెలం గాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) అనే విషయంలో సైతం ఎవ్వరికీ అనుమానాలు లేవు. ఇద్దరు చంద్రుల మధ్య జరిగిన ఆధిపత్యపోరులో కేసీఆర్ విజయం సాధించారు. చంద్రబాబు హైదరాబాద్ నుంచి పలాయనం చిత్తగించారు. టేపులో గొంతు తనది కాదని చెప్పలేదు (ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా అది చంద్రబాబు స్వర మేనంటూ ధ్రువీకరించింది). ‘మీకు పోలీసులు ఉంటే మాకూ పోలీసులు ఉన్నారు. మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటే మాకూ ఉన్నది’ అంటూ ‘ఓటుకు కోట్లు’ వ్యవహా రాన్ని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మార్చి దబాయిం చడానికి ప్రయత్నించారు. రేవంత్‌రెడ్డిపైన తెలంగాణ ఏసీబీ అభియోగపత్రం దాఖలు చేసింది. అందులో చంద్ర బాబు పేరు అనేక విడతలు రాశారు. తన ఫోన్ సంభాష ణను ట్యాప్ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వంపైన చంద్రబాబు కేసు పెట్టారు. ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఏసీబీని ఆదేశించారు. రేవంత్ కుమార్తె వివాహానికి సకుటుంబ సమేతంగా హాజరై తన శిష్యుడికి పూర్తి మద్దతు ప్రకటించారు. రేవంత్‌కి సీబీఐ కోర్టు బెయిల్ నిరాకరించింది. హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రద్దు చేయవలసిందిగా తెలంగాణ ఏసీబీ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత రేవంత్ విజయోత్సవ సభ నిర్వహించారు. కేసీఆర్‌పైన తీవ్రపదజాలంతో దాడి చేశారు. ఆయన మళ్ళీ వెనక్కు తిరిగి చూడలేదు. పని చేయని చట్టం నిగూఢమైన కారణాలు వల్ల ‘ఓటుకు కోట్లు కేసు’ ఒక దశలో ఆగిపోయింది. ఎవరో పెద్దలు చంద్రబాబుకీS, కేసీఆ ర్కీ మధ్య రాజీ కుదిర్చారని వదంతులు వినిపించాయి. యదార్థంగా ఏమి జరిగిందో తెలియదు. చట్టం తన పని తాను చేసుకొనిపోవడం లేదని మాత్రం తెలుసు. లేకపోతే స్పష్టమైన దృశ్యశ్రవణ ఆధారాలు ఉన్న ఈ కేసులో రేవంత్ రెడ్డికీ, మరికొందరికీ శిక్షలు పడేవి. చంద్రబాబు అభిశం సన అనివార్యమయ్యేది. కథ అంత దూరం వెళ్ళలేదు. ఈ లోగా టీడీపీ టిక్కెట్టుపైన తెలంగాణ శాసనసభకు గెలిచిన వారిలో చాలామంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. రేవంత్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోకి అట్టహాసంగా ప్రవేశిం చారు. ఒక కేసులో ప్రథమ నిందితుడిగా ఉన్న రాజకీయ నాయకుడికి కాంగ్రెస్ ఎర్రతివాచీ పరిచి ఎందుకు ఘన స్వాగతం చెప్పింది? ఆ పార్టీకి విలువల పట్ల గౌరవం లేదు. కనీసం గౌరవం ఉన్నట్టు నటించాలన్న స్పృహసైతం లేదు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి ప్రభుత్వానికి దూరంగా ఉన్న మేధావులూ, వివిధ వృత్తు లలో పని చేసినవారూ, రాజకీయాలలో ఆసక్తి ఉన్నవారూ చాలా మంది ఉన్నారు. వారిలో ఒక్కరిని కూడా పార్టీలో చేర్చుకునే ప్రయత్నం కాంగ్రెస్ నేతలు చేయలేదు. యువ తీయువకులకు పార్టీలోకి స్వాగతం చెప్పి వారికి ప్రాధా న్యం ఇవ్వాలన్న ఆలోచన కూడా లేదు. పదేళ్ళు కాంగ్రెస్ పాలనలో వివిధ పదవులు అనుభవించి, అందినంత సంపాదించుకున్నవారు గత నాలుగున్నర సంవత్సరాలుగా పార్టీని బలోపేతం చేసేందుకు ఒక్క రూపాయి ఖర్చు చేయ డానికి ముందుకు రాలేదు. చంద్రబాబుకి కాంగ్రెస్‌తో రహస్యానుబంధం తొలి నుంచీ కొనసాగుతూనే ఉన్నది. రాహుల్‌గాంధీకి సలహాదారులుగానో, సన్నిహితులుగానో చెలామణి అవుతున్నవారితో మాట్లాడి దేనికైనా ఒప్పించ గల సౌలభ్యం ఉంది. చంద్రబాబుతో కలసి పని చేయాలని కోరుకునే కాంగ్రెస్ నాయకులు ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలం గాణలో ఎక్కువ ఉన్నారు. వారికి సహచరులపైన విశ్వాసం లేదు. ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించడానికి మరొకరు ఇష్టపడరు. అందుకు తాము మాత్రమే సమర్థుల మంటూ త్రికరణశుద్ధిగా భావిస్తున్నవారు కనీసం అరడ జను మంది ఉన్నారు. రేవంత్‌ను పార్టీలోకి ఆహ్వానించడం అంటే చంద్రబాబు అండదండలు అందుకోవడమే అన్న అవగాహన తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఉంది. టీఆర్ఎ స్ను ఎదుర్కోవడంలో నిధుల కొరతతో బెంగటిల్లుతున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు చంద్రబాబుతో స్నేహం కొండంత బలం. ఆయన అన్ని విధాలా ఆదుకుంటారన్న ఆశ. తమ పార్టీని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా ఆవి ర్భవించిన టీడీపీతో ఎన్నికల పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ నాయకులు సంకోచించలేదు. తమ అధినేత సోనియాగాంధీని అనరాని మాటలు అంటూ కాంగ్రెస్‌ను ముక్కలు ముక్కలుగా నరకాలంటూ టీడీపీ శ్రేణులను ప్రేరేపించిన చంద్రబాబు పరిష్వంగం వారికి అభ్యంతర కంగా తోచలేదు. ఎట్లాగైనా టీఆర్ఎస్ను ఓడించి అధి కారం హస్తగతం చేసుకోవాలి. అందుకోసం అడ్డదారులు తొక్కినా పర్వాలేదు. ఇదే సూత్రాన్ని రాహుల్‌తో చెప్పి ఒప్పించి ఉంటారు. అందుకే రేవంత్‌రెడ్డిని టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. ఆ విధంగా చంద్ర బాబుకి ‘మహాకూటమి’లో నిర్ణాయక పాత్ర ఇచ్చారు. సుమన్ ధ్వజం సీట్ల సర్దుబాట్లు చేసుకొని, ఎన్నికల ప్రణాళిక రూపొందిం చుకొని సమరశంఖం పూరించేందుకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో గురువారంనాడు రేవంత్‌రెడ్డి నివాసంపైనా, ఆయన బంధువుల ఇళ్ళపైనా, వ్యాపార సంస్థలపైనా ఆదా యంపన్ను శాఖ అధికారులు దాడులు ఆరంభించారు. శనివారం సాయంత్రం వరకూ సోదాలు సాగాయి. అధికా రులు ఎటువంటి ప్రకటన చేయకపోయినా రకరకాల కథ నాలు మీడియాలో వస్తున్నాయి. సోదాలలో లభించే నిధులు చంద్రబాబువేన నీ, రేవంత్ టీడీపీ అధినేత బినామీ అనీ వ్యాఖ్యలు వినిపించాయి. ప్రధానినీ, ముఖ్యమంత్రినీ, మీడియానూ దుయ్యపడుతూ రేవంత్ చెలరేగిపోయారు. అంతే కటువుగా, అంతకంటే మొరటుగా టీఆర్ఎస్ లోక్ సభ సభ్యుడు బాల్క సుమన్ స్పందించారు. ఎంత రెచ్చ గొట్టినా కేసీఆర్ రేవంత్‌తో ముఖాముఖికి దిగరు. అది తన స్థాయి కాదని ఆయన అభిప్రాయం. అందుకని సుమన్‌ను ప్రయోగించారు. ఆదాయంపన్ను అధికారులు దాడులు చేయడాన్ని కాంగ్రెస్ నాయకులు ఖండించారు. ఇది మోదీ, కేసీఆర్ కలిసి కుట్రపన్ని చేసిన పని అంటూ దుయ్య పట్టారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఇదే విధంగా చేస్తున్నా రనీ, ఉత్తరప్రదేశ్‌లో, తమిళనాడులో, కర్ణాటకలో ఇదే మాదిరి దాడులు జరిపించారనీ చంద్రబాబు మోదీని నిందిస్తూ రేవంత్‌రెడ్డికి తన మద్దతు మరోసారి స్పష్టంగా ప్రకటించారు. ‘ఓటుకు కోటు’ కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయాలని కొంతకాలం విజ్ఞప్తి చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఆ కేసులో పాత్రధారికి పార్టీలో పెద్దపీట వేసి సూత్రధారితో గొంతుకలుపుతున్నారు. మండేలా చెప్పి నట్టు కాంగ్రెస్, టీడీపీలు దగ్గరైన నేపథ్యంలో ‘ఓటుకు కోట్లు’ కేసులో నిందితులు కాంగ్రెస్‌కు మిత్రులైనారు. ఈ దాడులకు మరోకోణం ఉంది. గుజరాత్, కర్ణాటక శాసన సభ ఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్‌కి నిధులు సమకూర్చినట్టు మోదీకి సమాచారం ఉందట. ఆ నిధులను రేవంత్ సంబంధీకుల ద్వారా చేరవేసినట్టు తెలు సుకున్నారట. ఈ నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసే ఉద్దేశం తోనే దాడులు జరిగాయంటూ ఒక కథనం ప్రచారంలో ఉంది. అంతులేని నిధులు చంద్రబాబు చేతుల్లోకి ఎట్లా వచ్చాయో తెలుసుకోవాలన్న అభిలాష మోదీకి ఉన్నట్టు లేదు. బీజేపీ సైతం ఎన్నికలలో అపారమైన నిధులు ఖర్చు చేసింది. చేయబోతోంది. అంతలేసి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో ఊహించడం కష్టం కాదు. ఎన్నికల వేళ తమని విమర్శించినా ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత చంద్ర బాబు సహకారం అవసరం కావచ్చుననే ముందు చూపుతో మోదీ, అమిత్‌షాలు వ్యవహరిస్తున్నట్టు చెబుతున్నారు. రియల్‌పొలిటిక్ (అధికార రాజకీయం)లో అందెవేసిన చెయ్యి కనుక ఇప్పుడు విమర్శిస్తున్న బీజేపీతో ఎన్నికల తర్వాత మళ్ళీ స్నేహం చేసేందుకు చంద్రబాబుకి ఎటు వంటి అభ్యంతరం, సంకోచం ఉండబోవని బీజేపీ అధిష్ఠా నానికి తెలుసు. క్షీణ సంస్కృతి చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రకాశం జిల్లాలోని దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి పెద్దఎత్తున అధికార దుర్వినియోగం చేసి, భారీ ఖర్చు చేసి ఎన్నికలలో ధనప్రభావం విపరీ తంగా పెరగడానికి కారకులైనారు. డబ్బు ఉన్నవారికే టిక్కెట్టు. ఎన్నికైన చట్టసభ సభ్యులు ఎన్నికలలో ఖర్చు చేసిన మొత్తాన్నీ, రాబోయే ఎన్నికలలో ఖర్చు చేయవలసిన మొత్తాన్నీ సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కడం రివాజుగా మారింది. పార్టీలూ, నాయకులూ ఎవరైనా దాదాపుగా అదే సంస్కృతి దేశం అంతటా కొనసాగు తోంది. ఈ సంస్కృతికి ప్రతినిధి రేవంత్‌రెడ్డి. యువకుడూ, ఉత్సాహవంతుడూ, ధైర్యవంతుడూ, ధాటిగా మాట్లాడే శక్తి కలిగినవాడూ అయిన రేవంత్ ఈ కాలపు రాజకీయ ప్రతి నిధి. కండబలం, ధనబలం, కులబలం ఉంటేనే రాజకీయా లలో మనుగడ సాధ్యమని విశ్వసించే రాజకీయులకు ప్రతీక. రేవంత్పైన ఆదాయంపన్ను శాఖ దాడులను ఖండించిన చంద్రబాబు వైఎస్ జగన్మోహన్రెడ్డిపైన కాంగ్రెస్ నేతలతో షరీకై బూటకపు కేసులు బనాయింప జేశారు. అప్పుడు చట్టం తన పని తాను చేసుకొనిపోతుం దంటూ గడుసుగా వ్యాఖ్యానించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రేవంత్‌ని చూసి విలవిలలాడుతున్నారు. చంద్ర బాబుని మెప్పించేందుకు రేవంత్ జగన్మోహన్రెడ్డి గురించి ఎంత దారుణంగా మాట్లాడారో అందరికీ తెలుసు. పరిస్థితులు మారినప్పుడు వైఖరులూ మారుతాయి. తనను అరెస్టు చేస్తారంటూ చంద్రబాబు బేలగా మాట్లా డటం కూడా ఆయన మానసిక స్థితికి అద్దం పడుతుంది. తాను చేసిన అక్రమాలు ఏమిటో ఆయన అంతరాత్మకు తెలుసు. చట్టం నిజంగానే తన పని తాను చేస్తుందనే భయం చంద్రబాబుని అప్పుడప్పుడు అశాంతికి గురి చేస్తున్నది. రేవంత్‌కి శిక్ష పడితే తన పరిస్థితి ఏమిటనే ప్రశ్న నిరంతరం వేధిస్తున్నది కాబోలు. కె. రామచంద్రమూర్తి -
నేరగాడైన ముఖ్యమంత్రికి శిక్ష ఉండదా?
సాక్షి, హైదరాబాద్: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి, అరాచకాలకు అంతేలేదు. చంద్రబాబు గొప్ప అవినీతి చక్రవర్తిగా మారిపోయారు. ఆయన రాష్ట్రంలో రూ. నాలుగున్నర లక్షల కోట్లు దోచుకున్నారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డిపై జరుగుతున్న దాడుల్లో బయట పడుతున్న ఆస్తులు ఎవరివని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి సీఎం చంద్రబాబు బినామీ అని ఆరోపించారు. భూమన శుక్రవారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశ విదేశాల్లో చంద్రబాబు దాచుకున్న సొమ్ము ఇంకా ఎంత ఉందోనని ఆశ్చర్య వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి పార్టీ మారడం డ్రామా అని అన్నారు. నేరగాడైన ముఖ్యమంత్రికి శిక్ష ఉండదా? అతడు చట్టానికి అతీతుడా? అని నిలదీశారు. ‘రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు జరిగితే ఎల్లో మీడియా హడావుడి చేస్తూ చంద్రబాబును కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపులతో సహా దొరికిపోయిన దొంగలను రక్షించేందుకు ఎందుకంత తాపత్రయపడుతున్నారు? రేవంత్‌రెడ్డిని ఎందుకు సమర్థిస్తున్నారు? ఇలాంటి ఐటీ దాడులు ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ జరగలేదా? ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ పోలీసులు చంద్రబాబును ఎందుకు విచారణకు పిలవడం లేదు? దీనివెనుక ఉన్న మతలబు ఏమిటి? నేరగాడైన సీఎంకు శిక్ష ఉండదని వదిలేస్తున్నారా? (ముగిసిన సోదాలు.. మూడు సూట్‌కేసుల్లో డాక్యుమెంట్లు..!) బాబుకు ఆ ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది ఏపీలో 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను సంతలో పశువులను కొన్నట్లుగా కొనడానికి చంద్రబాబు ఆయనకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? తాను ఏం చేసినా ప్రశ్నించేవారు లేరని బాబు అనుకుంటున్నారు. దేశంలో అమల్లో ఉన్న చట్టం, న్యాయం, రాజ్యాంగం అన్నవి చంద్రబాబుకు వర్తించవా? ఆయన ఎన్ని అక్రమాలు చేసినా, ఆస్తులు కూడబెట్టినా, ప్రజల సొమ్మును ఎంతగా దోచుకున్నా, విదేశాల్లో ఎంతైనా దాచుకున్నా విచారణ ఉండదా? చంద్రబాబు కోసం కొత్త చట్టం ఏదైనా వచ్చిందా? ఓటుకు కోట్లు వ్యవహారం బయటపడి మూడేళ్లవుతున్నా చంద్రబాబును ఎందుకు అరెస్టు చేయట్లేదు? అడిగేవారు లేరనుకుంటున్నారు చంద్రబాబు లాంటి గజదొంగను వదిలేస్తున్నారు. అందుకే ఈ రోజు కొలంబియా విశ్వవిద్యాలయం, ఐక్యరాజ్యసమితి అంటూ అమెరికాలో నానా చెత్త మాట్లాడే ధైర్యం ఆయనకు వచ్చింది. చేయని పనులన్నీ తానే చేశానంటూ విర్రవీగి మాట్లాడుతున్నారు. చంద్రబాబు భార్య పేరిట అధికారికంగా రూ.1,200 కోట్ల ఆస్తులు, ఆయన కుమారుడు లోకేశ్ పేరిట అధికారికంగా రూ.500 కోట్లు, మనవడి పేరిట ఉన్న రూ.కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఎన్ని అక్రమాలు చేసినా తమను ప్రశ్నించే నాథుడే లేడన్న ధీమా చంద్రబాబులో అణువణువునా జీర్ణించుకుపోయింది. ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేసుకునే సామర్థ్యం తనకుందని, ఎన్ని తప్పులు చేసినా, దోపిడీ చేసినా, రాష్ట్రాన్ని లూటీ చేసినా ఆక్షేపించేవారు లేరని అనుకుంటున్నారు. (‘ఓటుకు కోట్లు’ కొలిక్కి వచ్చేనా?) పచ్చ చొక్కాలకు ఇంటెలిజెన్స్ ఊడిగం ఓటుకు కోట్లు కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులందరినీ వెంటనే హైదరాబాద్ వదిలి అండర్ గ్రౌండ్‌కు వెళ్లమని మంత్రి లోకేశ్ చెబుతున్నాడు. తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరినైనా అవినీతిపరులను చేయడానికి వెనుకంజ వేయని వ్యక్తి చంద్రబాబు. రాష్ట్రంలో ప్రభుత్వ ఇంటెలిజెన్స్ అధికారులు కేవలం పచ్చ చొక్కాలకు ఊడిగం చేయడానికే పనికొస్తున్నారు. చంద్రబాబు దుర్మార్గాలను కాపాడడానికే ఇంటెలిజెన్స్ విభాగం పని చేస్తోంది. చంద్రబాబు సాగిస్తున్న గనుల దోపిడీ వల్లే గిరిజన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యకు గురయ్యారు. బాబు అరాచకాలు అంతం కాక తప్పదు. చంద్రబాబు పాలన ముగింపు దశకు చేరుకోవడం వల్లే రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది’ అని భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. (రేవంత్‌పై.. నేనే ఫిర్యాదు చేశా) -
రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
-
రేవంత్ రెడ్డి ఇంటి వద్ద టెన్షన్.. టెన్షన్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. గురువారం ఉదయం నుంచి రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఓటుకు కోట్లు కేసుతో పాటు, అక్రమాస్తుల ఆరోపణలపై ఐటీ అధికారులు నిన్న సాయంత్రం నుంచి రేవంత్‌ను విచారిస్తున్నారు. రెండో రోజు కూడా రేవంత్ ఇంట్లో సోదాలు జరుగుతుండటంతో శుక్రవారం ఉదయం నుంచి ఆయన ఇంటివద్దకు అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. వారిని అదుపు చేయడం కోసం రేవంత్ నివాసం వద్ద భారీ పోలీసు బలగాలను మొహరించారు. దీంతో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరగడంతో.. తాము అరెస్టు చేయడానికి రాలేదని కేవలం భద్రత కోసమే వచ్చామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. (చదవండి: రేవంత్ ఇంటి వద్ద భారీ పోలీసు భద్రత) కాగా, శుక్రవారం సాయంత్రం వరకు కూడా రేవంత్ విచారణ కొనసాగడంతో.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు ఆయనకు లోపల ఏం జరుగుతోందని నినాదాలు చేయడం ప్రారంభించారు. రేవంత్‌ను మీడియా ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకురాలు సీతక్క మాట్లాడుతూ.. రేవంత్‌కు ప్రాణహాని ఉందని.. విచారణను లైవ్ టెలికాస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్‌పై ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు. కార్యకర్తలు ఒక్కసారిగా పోలీసులను దాటుకోని ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో వారి మధ్య తోపులాటు చోటుచేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్యకర్తలను శాంతపరచడానికి పోలీసులు రేవంత్‌ను బయటకు తీసుకువచ్చారు. గేట్ ముందుకు వచ్చిన రేవంత్ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేసి వెంటనే ఇంట్లోకి వెళ్లిపోయారు. సీతక్కతోపాటు పలువురి అరెస్ట్: రేవంత్ నివాసం వద్ద ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ మహిళ నేతలు సీతక్క, హరిప్రియ నాయక్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ అధికారులు రేవంత్‌కు మద్దతుగా నినాదాలు చేస్తున్న కార్యకర్తలను, అభిమానులను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. రేవంత్ నివాసం వద్ద మీడియా మినహా మిగతా వారినందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
దుర్మార్గపు పనులకు కేరాఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి
-
‘రేవంత్ రెడ్డి దేశ ద్రోహి’
సాక్షి, హైదరాబాద్: హవాలా దందా చేసి వేల కోట్లు సంపాదించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దేశ ద్రోహి అంటూ టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డిపై ఐటీ దాడుల గురించి ఆయన మాట్లాడారు. తెలంగాణ వనంలో రేవంత్ రెడ్డి కలుపు మొక్కని అభివర్ణించారు. ‘ఓటుకు కోట్లు కేసు’లో రేవంత్ అడ్డంగా దొరికాడని, అక్కడ దొరికిన 50 లక్షలపై ఆరా తీస్తే డొంకంత కదిలిందని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడుగు జాడల్లో నడిచి రేవంత్ వేల కోట్లు సంపాదించారన్నారు. దేశ భక్తుడినని చెప్పుకునే ఉత్తమ్.. హవాలా మార్గంలో డబ్బులు సంపాదించిన రేవంత్‌ను ఎందుకు సమర్థిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. (రేవంత్ ఇంట్లో సోదాలు) రేవంత్ రెడ్డిపై ఐటీ దాడుల విషయంలో కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్నారు. రేవంత్‌ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించి రాహుల్ గాంధీ తన సచ్చీలతను నిరూపించుకోవాలన్నారు. తెలంగాణ కాంగ్రెస్ స్టువర్ట్ పురం దొంగల ముఠాగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలవి అని కుంభకోణాలమయమని దుయ్యబట్టారు. 40 ఏళ్లుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న జానారెడ్డి, జైపాల్ రెడ్డి మీద సోదాలు జరగడం లేదని.. కేవలం అక్రమంగా సంపాదించిన రేవంత్ రెడ్డిపైనే ఐటీ దాడులు జరుగుతున్న విషయాన్ని కాంగ్రెస్ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఐటీ దాడులకు టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధంలేదని టీఆర్ఎస్ ఎంపీ స్పష్టం చేశారు. చదవండి: రేవంత్‌కు అరెస్ట్ భయం..! ఐటీ దాడులు: ‘ఓటుకు కోట్లు’కేసు లెక్క తేలేనా? -
రేవంత్ ఇంటి వద్ద భారీ పోలీసు భద్రత
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం ప్రారంభమైన తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 15 గంటలుగా రేవంత్ రెడ్డితో వన్ టు వన్‌గా ఐటీ అధికారులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా ‘ఓటుకు కోట్లు కేసు’లో మరో నిందితుడైన ఉదయ్ సింహతో కలిపి ఇద్దరిని ఒకేసారి విచారించారు. కొన్ని కీలక డాక్యుమెంట్లకు సంబంధించి ఉదయ్‌ను కూడా ప్రశ్నించేందుకు పిలిచినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం ఐటీ అధికారులు రేవంత్ రెడ్డి భార్య గీతను రహస్యప్రదేశానికి తీసుకెళ్లి విచారించారు. అనంతరం గీతను బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయడానికి తీసుకెళ్లారు. అయితే రేవంత్ రెడ్డి నివాసం వద్ద భారీ పోలీసు బలగాలను మోహరించారు. దీంతో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుండంతో ఆయన నివాసం వద్దకు కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున చేరుకుంటున్నారు. అయితే అరెస్టు చేయడానకి రాలేదని కేవలం భద్రత కోసమే వచ్చామని పోలీసు ఉన్నతవర్గాలు తెలిపాయి. (రేవంత్ ఇంట్లో సోదాలు) రెండో రోజు కూడా రేవంత్ రెడ్డిపై ఐటీ, ఈడీ దాడులు కోనసాగుతండటంతో కాంగ్రెస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. శుక్రవారం ఉదయమే కాంగ్రెస్ నేతలు డికే అరుణ, సీతక్కతో సహా పలువురు నాయకులు, కార్యకర్తలు రేవంత్ ఇంటికి చేరుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూరితంగానే ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. చదవండి: ఓటుకు కోట్లు కేసులో బాబును ఎందుకు వదిలేస్తున్నారు? రేవంత్ ఇంట్లో కీలకపత్రాలు స్వాధీనం -
లోకేష్ పేరున 500 కోట్ల ఆస్తులెక్కడివి?
-
ఓటుకు కోట్లు కేసులో బాబును ఎందుకు వదిలేస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌రెడ్డి, అతని సన్నిహితుల నివాసాలపై ఐటీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఈ కేసులో ఇంతగా హడావుడి చేస్తున్న అదికారులకు చంద్రబాబు నాయుడు కనబడడం లేదా అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌పై జరుగుతున్న దాడుల్లో బయటపడుతున్న ఆస్తులు ఎవరివని.. అనుమానం వ్యక్తం చేశారు. రేవంత్‌పై ఐటీ అధికారుల దాడులపై హడావుడి చేస్తున్న ఎల్లో మీడియా.. చంద్రబాబుపై మౌనం వహించడానికి కారణాంలేటని నిలదీశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి మతలబు ఏమిటని ప్రశ్నించారు. నేరగాడైన మఖ్యమంత్రికి శిక్షలు ఉండవా అని ధ్వజమెత్తారు. చంద్రబాబు చట్టానికి అతీతుడా అని ధ్వజమెత్తారు. అమెరికా వెళ్లి చంద్రబాబు అనర్గళంగా అబద్ధాలు చెప్తున్నారనీ, చేయని పనులు తానే చేశానని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు భార్య పేరుమీద రూ.1200 కోట్ల ఆస్తులు ఎక్కడివి? లోకేష్ పేరుమీద రూ.500 కోట్ల ఆస్తులు ఎక్కడివి? ఓటుకు కోట్లు కేసులో ఉన్న నిందితులను హైదరాబాద్ వదిలి.. అండర్ గ్రౌండ్‌కు వెళ్లాలని లోకేశ్ చెప్పారనే ప్రచారం జరుగుతుంది చంద్రబాబు బినామా ఆస్తులు రేవంత్‌రెడ్డి వద్ద ఉన్నాయి. రాష్ట్రంలో దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయలు టీడీపీ పాలకులు దోచుకున్నారని విమర్శలు గుప్పించారు. అవినీతి డబ్బుతోనే 23 మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను చంద్రబాబు కొనుగోలు చేశారని ఆరోపించారు. చంద్రబాబు మైనింగ్ దోపిడివల్లే కిడారి సర్వేశ్వరరావు, శివేరి సోమ బలయ్యారని ధ్వజమెత్తారు. (చదవండి: రేవంత్ ఇంట్లో సోదాలు) (చదవండి : ఐటీ దాడులు: ‘ఓటుకు కోట్లు’కేసు లెక్క తేలేనా?) -
ఐటీ సోదాలు: రేవంత్ ఇంట్లో కీలకపత్రాలు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు’, మనీలాండరింగ్ కేసులలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం తనిఖీలు చేస్తోంది. నిన్న ఉదయం ప్రారంభమైన తనిఖీలు శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డిని 10 గంటలకు పైగా విచారించారు. ఐటీ అధికారులు రేవంత్ రెడ్డి ఇంటి నుంచి కోటి రూపాయలు, కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి బంధువుల, సన్నిహితులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ, ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. (రేవంత్‌కు అరెస్ట్ భయం..!) కొండాల్ రెడ్డి ఇంట్లో ముగిసిని సోదాలు: రేవంత్ రెడ్డి తమ్ముడు కొండాల్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు మగిసాయి. కొండాల్ రెడ్డి భార్యను ఏడు గంటలకుపైగా రహస్య ప్రదేశంలో విచారించారు. పలు కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చదవండి: రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు -
ఓటుకు కోట్లు కేసు: సెబాస్టియన్, ఉదయ్‌లకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు కేసు’ కు సంబంధించిన నిందితుల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు కొనసాగుతునే ఉన్నాయి. గురువారం ఉదయం ప్రారంభమైన తనిఖీలు 23 గంటలుగా కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఏ2గా ఉన్న సెబాస్టియన్‌కు ఐటీ యాక్ట్ కింద నోటీసులు జారీ చేశారు. అక్టోబర్ 1లోగా బషీర్‌బాగ్‌లోని ఆయకార్ భవన్లో వ్యక్తిగతంగా హాజరుకావాలని అధికారులు ఆదేశించారు. ఇచ్చిన గడువులోగా హాజరకాకపోతే సెక్షన్ 271ఏ ఐటీ యాక్ట్ కింద జరిమాన విధిస్తామని నోటీసులో పేర్కొన్నారు. (రేవంత్ ఇంట్లో సోదాలు) ఉదయ్ సింహ ఇంట్లో ముగిసిన సోదాలు: ఓటుకు నోటు కేసులో మరో నిందితుడు ఉదయ్ సింహ ఇంట్లో నిన్న సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన సోదాలు శుక్రవారం ఉదయం ఐదు గంటల వరకు కొనసాగాయి. ఉదయ్ సింహా ఇళ్లు, కార్యాలయాలు, ఆయన బంధువులకు సంబంధించిన మూడు నివాసాల్లోనూ ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇస్తూ పట్టుబడ్డ 50 లక్షలతో పాటు డీల్ భాగంగా ఇతరు నగదు ఎలా సమీకరించాలనుకున్నారని ఉదయ్ సింహను ప్రశ్నించారు. అంతేకాకుండా ఉదయ్‌కు చెందిన ఆస్తులు, ఆదాయం, రాబడుల వ్యవహారాలపై కూడా ఐటీ అధికారులు కూపీ లాగారు. సెక్షన్ 131 ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం ఉదయ్‌కు ఐటీ అధికారులు నోటీసుల ఇచ్చారు. అక్టోబర్ 1ను విచారణ సిద్దంగా ఉండాలని నోటీసులో పేర్నొన్నారు. చదవండి: రేవంత్‌కు అరెస్ట్ భయం..! కదులుతున్న డొంక -
దమ్ములేకనే.. కేసులు పెడుతున్నారు
-
దమ్ములేకనే.. కేసులు పెడుతున్నారు : డీకే అరుణ
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ అవినీతి పాలనను ప్రశ్నించిన వారిని, ప్రజల్లోకి తీసుకెళ్లిన వారిని కేసులు పెట్టి వేధిస్తున్నారని కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసులో ఏ-1గా నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి, అతని సన్నిహితుల ఇళ్లలో గురువారం ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం జూబ్లిహిల్స్‌లోని రేవంత్ ఇంటికి చేరుకున్న అరుణ ఆయనకు మద్దతుగా నిలిచారు. రాజకీయంగా రేవంత్‌ను ఎదుర్కొనే దమ్ము లేకనే కేసులు పేరుతో కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని టీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. (చదవండి : రేవంత్ ఇంట్లో సోదాలు) -
ఓటుకు నోటు కేసు: ఉదయ్ సింహా ఇంట్లో సోదాలు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఉదయ సింహ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. చైతన్యపురి పరిధిలోని హరిపురి కాలనీలో ఉన్న ఆయన నివాసంలో ఐదుగురు సభ్యుల ఐటీ శాఖాధికారుల బృందం తనిఖీలు చేస్తున్నారు. అధికారులు ఆయన ఇంటికి వచ్చినపుడు ఉదయ సింహ తల్లి మాత్రమే ఉంది. దీంతో అధికారులు ఉదయ సింహాకు ఫోన్ చేసి ఇంటి రావాలని చెప్పారు. దీంతో ఆయన హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న వెంటనే ఆయన సమక్షంలోనే ఐటీశాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
రేవంత్‌కు అరెస్ట్ భయం..!
సాక్షి, కోస్గి(వికారాబాద్): టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకున్నట్టుగా కనబడుతోంది. ఓటుకు కోట్లు కేసులో ఏ-1గా ఉన్న రేవంత్ రెడ్డి, ఏ-2 సెబాస్టీయన్ ఇళ్లతోపాటు, రేవంత్ సన్నిహితుల ఇళ్లలో గురువారం ఉదయం నుంచి ఐటీ అధికారు సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐటీ సోదాలు నిర్వహిస్తున్నా.. రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో అధికారులు ఆయనకు ఫోన్ చేసి వెంటనే హైదరాబాద్‌కు రావాలని చెప్పారు. కుటుంబ సభ్యులతో సహా హైదరాబాద్‌కు రావాలని ఆదేశించారు. దీంతో కోస్గిలో కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో ఉన్న రేవంత్ అక్కడి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. హైదరాబాద్‌కు బయలుదేరే ముందు రేవంత్ తన అనుచరులతో మాట్లాడుతూ.. ‘ఓటుకు కోట్లు కేసులో ఇప్పటికే 32 రోజులు జైల్లో పెట్టారు. మీరు అండగా ఉన్నారనే ధైర్యంతోనే హైదరాబాద్‌కు వెళ్తున్నాను. నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇదే నా అఖరి ప్రసంగం కావొచ్చ’ని తన సన్నిహితుల వద్ద ఆందోళనను వ్యక్తపరిచారు. ఒకవేళ అరెస్ట్ చేస్తే జైలు నుంచే నామినేషన్ దాఖలు చేస్తానని రేవంత్ తెలిపారు. తనను ఏమీ చేయలేకే.. ఐటీ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ‘జైల్లో తిన్న చిప్పకుడు మీద ఒట్టేసి చెబుతున్న.. కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించేవరకు నిద్రపోన’ని శపథం చేశారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత కొడంగల్ ప్రజలదేనని అన్నారు. గతంలో రాజకీయాల్లో కలకలం రేపిన ఓటుకు కోట్లు కేసులో అప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి ముద్దాయిగా ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు 50 లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ-1గా ఉన్న రేవంత్‌కు 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై ఐటీ శాఖకు తెలంగాణ ఏసీబీ ఈ నెల 13వ తేదీన లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం గమనార్హం. -
రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు
-
మరికాసేపట్లో రేవంత్‌రెడ్డి మీడియా సమావేశం
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అక్రమాల కేసు, ఓటుకు కోట్లు కేసు ఉచ్చు బిగుస్తున్నట్టు కనిపిస్తోంది. గురువారం ఉదయం నుంచి రేవంత్ రెడ్డికి సంబంధించిన సన్నిహితులు, బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం రేవంత్ రెడ్డికి సంబంధించని అన్ని పత్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. అనుమానం ఉన్న ప్రతి విషయం, పత్రాలపై అందుబాటులో ఉన్నవారి నుంచి ఆరా తీస్తోంది. రేవంత్ రెడ్డికి సంబంధించిన పాత ఇంటి తాళాలు పగలగొట్టి కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈడీ అధికారులు రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి భార్యను కార్లో ఎక్కించుకొని వెళ్లి రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. అయితే ప్రచారంలో భాగంగా సొంత నియోజకవర్గానికి వెళ్లిన రేవంత్ రెడ్డిని కుటుంబసభ్యులతో సహా వెంటనే తమ ముందు హాజరుకావాలని ప్రత్యేక అధికారుల నుంచి ఫోన్ వెళ్లినట్టు సమాచారం అందుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మరికాసేపట్లో రేవంత్‌రెడ్డి మీడియా ముందుకువచ్చి మాట్లాడే అవకాశముందని తెలుస్తోంది. దీంతో కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రేవంత్‌రెడ్డి మరికాసేపట్లో విలేకరుల సమావేశం నిర్వహించబోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. రేవంత్ మరికాసేపట్లో అధికారుల ముందు హాజరుకానున్నారు. (ఐటీ దాడులు: ‘ఓటుకు కోట్లు’కేసు లెక్క తేలేనా?) రేవంత్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు ‘ఓటుకు కోట్లు’కేసులో ఏ2 నిందితుడు సెబాస్టియన్ ఐటీ అధికారుల సోదాల అనంతరం మీడియాతో మాట్లాడారు. మౌర్య కేసుకు, రేవంత్ రెడ్డికి తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. ఓటుకు కోట్లు కేసులో ముద్దాయిగా ఉన్న కేసులోనే ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేస్తున్నారని వివరించారు. తన సంస్థలకు సంబంధించిన అన్ని పత్రాలు క్లియర్‌గా ఉన్నాయని, ఐటీ రిటర్స్న్ కూడా క్లియర్‌గా ఉన్నాయన్నారు. ఈ రకంగా ప్రభుత్వం దాడులు చేయించడం భావ్యం కాదన్నారు. చదవండి: బ్రేకింగ్: రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు రేవంత్ రెడ్డి ఇంటి ముందు తీవ్ర ఉద్రిక్తత -
‘ఆయన గాడ్సే కంటే దుర్మార్గుడు’
సాక్షి, తిరుపతి : మహాత్మాగాంధీని హత్యచేసిన గాడ్సే కంటే దారుణమైన వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తో పాటు ఆయన వెనుకున్న ప్రతి ఒక్కరినీ చంపించిన చరిత్ర చంద్రబాబుదంటూ ఆరోపించారు. చిత్తూరు పర్యటనలో ఉన్న మోత్కుపల్లి తిరుపతిలో గురువారం మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు మహానేత ఎన్టీఆర్ గుర్తురారని, నందమూరి కుటుంబం చంద్రబాబు చుట్టు తిరగాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబుకు ఎన్టీఆర్ బొమ్మ గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఓటు వేయకుండా చంద్రబాబుకు ఏపీ ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో చంద్రబాబు బతికిపోయాడు.. తెలంగాణలో తనను అడ్డం పెట్టుకుని చంద్రబాబు బతికిపోయాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కాలుపెట్టిన ప్రాంతం నాశనమేనని చెప్పారు. తాను పెద్ద మాదిగ అని చెప్పిన చంద్రబాబు నోటివెంట దళితుల మాటే లేదన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. కాపులు, బీసీల మధ్య చంద్రబాబు చిచ్చుపెట్టి పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. ఎస్సీలు, ఎస్టీలు ఎవరూ జడ్జీలు ఎందుకు కాకుడదో చెప్పాలని ఏపీ సీఎంను డిమాండ్ చేశారు. దళితుడ్ని కాబట్టే నన్ను అవమాన పరిచాడని.. చంద్రబాబుది నోరా.. తాటిమట్టా అంటూ మండిపడ్డారు. తనకు ఎవరి సపోర్ట్ లేదని, అందరికీ నేనే సపోర్ట్ చేస్తున్నానని మోత్కుపల్లి అన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని పేర్కొన్నారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అప్పటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డికి డబ్బులిచ్చి పంపింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఆ కేసులో ఇద్దరు ఉన్నారు కాబట్టి పార్టీ నుంచి రేవంత్‌ను సస్పెండ్ చేయలేదని అభిప్రాయపడ్డారు. జీవితం అంతా నీ కోసం త్యాగం చేశాను, మరి నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశావ్ అని చంద్రబాబును ప్రశ్నించారు. తాను తప్పు చేస్తే చెప్పాలని, ముక్కును నేలకు రాసుకుంటానని సవాల్ విసిరారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టడానికే అన్నా క్యాంటీన్లను చంద్రబాబు ప్రారంభించారని మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. -
చంద్రబాబు ఉంటే ప్రత్యేక హోదా రానేరాదు
-
దొరికిన దొంగ చంద్రబాబు; సంచలనం
సాక్షి, హైదరాబాద్: పట్టపగలు నేరం చేస్తూ నగ్నంగా దొరికిన దొంగ చంద్రబాబు నాయుడును చట్టపరంగా శిక్షించడంలో జాప్యం చోటుచేసుకుంటున్నది. ‘‘మనవాళ్ళు అదే దే బ్రీఫ్డ్ మీ..’’ అంటూ ఆయన అమలు చేసిన ఓటుకు కోట్లు కుట్ర అమలు జరిగి నేటికి సరిగ్గా మూడేళ్లు. 31మే, 2015న... తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకుగానూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్వయంగా రూ.50 లక్షలు ఇస్తూ పోలీసులకు దొరికిపోయి, జైలుపాలయ్యారు. కొద్ది గంటల్లోనే స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు కోట్లు కేసులో ఉమ్మడి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న చంద్రబాబు అనంతర కాలంలో హైదరాబాద్‌పై ఉన్న 10ఏళ్ల హక్కును వదులుకుని పారిపోయే పరిస్థితి తలెత్తింది.అసలేం జరిగింది?: శాసన సభ్యుల ఎమ్మెల్సీ స్థానం కోసం జరిగిన ఎన్నికల్లో బలం లేకపోయినప్పటికీ టీడీపీ తన అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డిని బరిలో నిలిపింది. అక్రమంగా ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రధాన సూత్రధారిగా ఓటుకు కోట్లు కుట్ర రూపొందింది. ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఇంటికి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.. రూ.50లక్షల రూపాయిల నోట్ల కట్టలను అందించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో రేవంత్ మాట్లాడిన మాటలు కూడా అత్యంత కీలకంగా మారాయి. ‘‘ఓటు వేసిన తర్వాత మిగతా డబ్బు అందజేస్తామని చెప్పి మమ్మల్ని బాస్(చంద్రబాబు) పంపించాడు. కావాలంటే మీరు మా బాస్‌తో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. ఇక్కడ తెలంగాణాలో మీకు ఎలాంటి ప్రాబ్లం వున్నా నేన్ను చూసుకుంటాను..’’ అని రేవంత్ చెప్పడం స్పష్టంగా వినిపిస్తాయి. అప్పటికే కుట్ర సమాచారం అందుకున్న తెలంగాణ ఏసీబీ అధికారులు.. టీడీపీ నేతల్ని రెడ్ హ్యాండెడ్‌గా దొరకబుచ్చుకున్నారు. స్టీఫెన్సన్-చంద్రబాబుల సంభాషణ స్టీఫెన్సన్ : హలో చంద్రబాబు మనిషి : ఆ యా బ్రదర్ స్టీఫెన్సన్ : సర్ చంద్రబాబు మనిషి : అవర్ బాబు గారు గోయింగ్ టు టాక్ టూ యు , బి ఆన్ ద లైన్ స్టీఫెన్సన్ : ఒకే సర్ చంద్రబాబు : హలో స్టీఫెన్సన్ : సర్ గుడ్ ఈవినింగ్ సర్ చంద్రబాబు : ఆ గుడ్ ఈవినింగ్ బ్రదర్ హౌ ఆర్ యు స్టీఫెన్సన్ : ఫైన్ సర్ థ్యాంక్ యు చంద్రబాబు : మనవాళ్ళు అదే దే బ్రీఫ్డ్ మీ స్టీఫెన్సన్ : యా సర్ చంద్రబాబు : ఐ యాం విత్ యు డోంట్ బాదర్ స్టీఫెన్సన్ : రైట్ చంద్రబాబు : ఫర్ ఎవ్రీ థింగ్ ఐ యాం విత్ యు , వాట్ ఆల్ దే స్పోక్ విల్ హానర్ స్టీఫెన్సన్ : యా సర్ రైట్ చంద్రబాబు : ఫ్రీలి యు కెన్ డిసైడ్ నో ప్రాబ్లం అట్ ఆల్ స్టీఫెన్సన్ : ఎస్ సర్ చంద్రబాబు : దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ వి విల్ వర్క్ టుగెదర్ స్టీఫెన్సన్ : రైట్ చంద్రబాబు : థ్యాంక్ యు ఏపీకి ఆపాదించే కుట్ర: చంద్రబాబు సంభాషణల వీడియో బయటికి రావడం, ఓటుకు కోట్లు కేసులో ’దొరికిన దొంగ చంద్రబాబు’ అని తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడం లాంటి పరిణామాలతో బెంబేలెత్తిపోయిన చంద్రబాబు.. ఢిల్లీ వెళ్లి అక్కడి పెద్దల కాళ్లావేళ్లాపడి కాపాడాల్సిందిగా వేడుకున్నారు. అటుపై కోర్టును ఆశ్రయించారు. ఈలోపే తన కుట్రలకు మరింత పదునుపెట్టిన చంద్రబాబు.. హైదరాబాద్‌లో ఆంధ్రులకు రక్షణలేదని, ఉమ్మడి రాజధానిలో సెక్షన్ 8ని అమలుచేయాలని నాటకాలు మొదలుపెట్టారు. టీడీపీ అక్రమ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేశారు. ముఖ్యమంత్రిగా ఉండి అవినీతి వ్యవహారంలో చంద్రబాబు పట్టుబడిన వైనం సంచలనం సృష్టించింది. -
చంద్రబాబును రక్షించాలా? శిక్షించాలా?
-
‘ఓటుకు కోట్ల’కు.. ‘మే’ ముహూర్తం!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు కోట్లు’కేసుకు, ఆ కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన రేవంత్‌రెడ్డికి మే నెలతో వివాదాస్పద అనుబంధం ఉందంటూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు పన్నిన కుట్ర మొత్తం మే నెలలోనే సాగినట్టు ఏసీబీ వర్గాలు ధ్రువీకరించాయి. టీడీపీ అభ్యర్థికి ఓటువేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది 2015, మే 30వ తేదీనే. ఈ కేసు దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతూ మూడేళ్ల తర్వాత.. అంటే 2018 మే నెలలోనే మళ్లీ తెరపైకి వచ్చింది. స్టీఫెన్‌సన్‌తో సాగి న సంభాషణల్లోని గొంతు చంద్రబాబుదేనని ధ్రువీకరిస్తూ చండీగఢ్‌కు చెందిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక ఈ నెలలోనే ఏసీబీకి చేరింది. అటు ఏసీబీ కూడా ఈ నెలలోనే తుది చార్జిషీటు దాఖలు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. మొత్తంగా ‘ఓటుకు కోట్లు’వ్యవహారంలో మే నెల కీలకంగా మారుతోంది. మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడైన రేవంత్‌రెడ్డికి కూడా మే నెల అచ్చివచ్చి నట్టు కనిపించడం లేదు. ఆయనకు రాజకీయంగా 2015 మే 30న తీరని దెబ్బ పడింది. ఇప్పుడదే నెలలో ఆయన ఏకంగా సీఎం అవడం తన లక్ష్యమం టూ వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీలో దుమారం లేపింది. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. ఆయన రాజకీయ భవిష్యత్‌ను ఎటువైపునకు తీసుకెళుతుందోనని రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుండటం గమనార్హం. -
దొంగగా తేలినా... అరెస్టు చేయరెందుకు?
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో సీఎం చంద్రబాబే అసలు ముద్దాయని, చార్జిషీట్లో తక్షణమే ఆయన పేరు చేర్చి అరెస్టు చేయాలని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. చండీగఢ్ ఫోరెన్సిక్ లేబొరేటరీ స్పష్టమైన ఆధారాలిచ్చినా చంద్రబాబును కనీసం విచారణకు కూడా పిలవకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో భూమన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఫోన్లో మాట్లాడిన వాయిస్ చంద్రబాబుదేనని దేశమంతా నమ్ముతోందని, ఈ కేసులో ఆయనకు శిక్ష పడకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముందన్నారు. మూడేళ్లపాటు మూలన పడేసిన ఓటుకు కోట్లు కేసును తెలంగాణ ప్రభుత్వం బయటకు తీసిందని, అయితే ఇది చంద్రబాబును రక్షించేందుకు కాదనే విషయంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సీబీఐ విచారణ వైపు వెళ్లకుండా చేసే లక్ష్యంతో కాకుండా, చిత్తశుద్ధితో కేసులో భాగస్వామ్యులైన వారికి శిక్షలు పడేలా చూడాలని కోరారు. చంద్రబాబుని ఆ దేవుడు కూడా రక్షించలేరంటూ గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్రతిజ్ఞను ఈ సందర్భంగా భూమన గుర్తుచేశారు. చంఢీగడ్ ల్యాబ్ ఇచ్చిన నివేదిక ఆధారంగానైనా కట్టుదిట్టమైన చర్యలు తీసుకువాలని డిమాండ్ చేశారు. దొంగ పట్ల ఉదాశీనతా..! ఒక ఎమ్మెల్యేను కొనేందుకు రూ.5 కోట్లకు బేరమాడి, 50 లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిపోయినా కూడా కేసులు పెట్టకపోవడం అన్యాయన్నారు. ఇది కేసీఆర్ నిబద్ధతను ప్రశ్నించేలా ఉందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబును ముద్దాయిగా చేర్చి అరెస్టు చేయాలన్నారు. లేకుంటే ప్రజల్లో సామాన్యుడికి ఒకన్యాయం, చంద్రబాబుకు మరో న్యాయమా? అన్న అభిప్రాయం కలుగుతుందన్నారు. చంద్రబాబు అవినీతి 15 ఏళ్ల క్రితమే వెలుగు చూసిందని, అప్పట్లో తెహల్కా ఆయన అత్యంత అవినీతి పరుడని నిగ్గుతేల్చిందని భూమన గుర్తు చేశారు. ఇప్పుడు కూడా విచారణ జరగకపోతే.. తనను ఎవరూ ఏమీ చేయలేరని.. తనకు అనేక మంది అండదండలున్నాయంటూ చంద్రబాబు అవినీతిని ఏరులై పారిస్తాడన్నారు. -
ఓటుకు కోట్లు కేసు సీబీఐకి అప్పగించాలి
-
‘ప్రధానులనూ విచారించి.. చంద్రబాబును వదిలేస్తారా’
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు కోట్లు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్ధసారధి కోరారు. ఎమ్మెల్యే ఓటు కొనేందుకు రూ.50 లక్షలు చంద్రబాబు ఇప్పించారని, ఆపై ఆడియో టేపుల్లో వాయిస్ ఆయనదేనని తేలిందన్నారు. చంద్రబాబు రాజకీయాలను చూసిన తర్వాత ప్రజలకు రాజ్యాంగంపై నమ్మకం పోయిందన్నారు. విజయవాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ వ్యవస్థలు ఏం చేయలేవనే ధీమాతో టీడీపీ నేతలున్నారని, రాజ్యాంగాన్ని ఖూనీ చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పార్ధసారధి కోరారు. ఓటుకు కోట్లు కేసులో సీబీఐ లేదా ఉన్నత స్థాయి సంస్థతో విచారణ జరపాలన్నారు. ఓటుకు కోట్లు కేసు రెండు రాష్ట్రాల సమస్య కాదని, కానీ ఈ కేసు కారణంగా ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరకడం వల్లే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మోకరిల్లి హైదరాబాద్‌ను వదిలిపెట్టి విజయవాడకు పారిపోయి వచ్చారని గుర్తుచేశారు. కేవలం ఈ కేసు భయంతోనే పదేళ్ల రాజధాని హైదరాబాద్‌ను చంద్రబాబు వదులుకున్నారని తెలిపారు. 5 కోట్ల మంది ఆంధ్రుల హక్కును చంద్రబాబు తాకట్టు పెట్టారని, అనవసరమైన ఆర్థిక భారాన్ని ప్రజలపై ఏపీ సీఎం వేశారని విమర్శించారు. తెలంగాణ అక్రమం ప్రాజెక్టులను కూడా చంద్రబాబు అడ్డుకోలేక పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానులుగా ఉన్నవారిపై ఆరోపణలు వచ్చినప్పుడు కూడా విచారణ చేశారు. అలాంటిది సీఎం చంద్రబాబుపై ఎందుకు విచారణ చేయట్లేదదని ప్రశ్నించారు. కోర్టు చంద్రబాబుకి క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పడం సిగ్గు చేటన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్ర ఉందని స్టీఫెన్సన్ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో స్పష్టంగా చెప్పారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సీబీఐ కేసులు పెట్టి తనను అరెస్ట్ చేస్తుందనే భయంతోనే నాలుగేళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి బీజేపీకి చంద్రబాబు ఊడిగం చేశారని పేర్కొన్నారు. రాజ్యాంగం అంటే చంద్రబాబుకు పిచ్చిరాతగా ఉంది. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను అధికారంలో ఉన్న చంద్రబాబు కొన్నారని, ఎందుకంటే ఈ రాజ్యాంగం తనను ఏం చేయలేదని ఏపీ సీఎం భావిస్తున్నారని పార్ధసారధి వివరించారు. -
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబే ముద్దాయి
-
‘అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు’
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే ముద్దాయి అని దేశమంతా నమ్ముతోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. ఫోన్లో మాట్లాడిన వాయిస్ టేపు రికార్డులో ఉన్న గొంతు చంద్రబాబుదే అన్నది స్పష్టమైందని తెలిపారు. చంద్రబాబును అప్పుడే అరెస్ట్ చేయాల్సి ఉండే, కానీ ఇలా తప్పుడు పనులు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం వల్ల చట్టాలపై ప్రజలకు నమ్మకం పోతుందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు ఉండటం వల్లే ప్రజాస్వామ్యంపై విశ్వాసం సన్నగిల్లుతోందని మండిపడ్డారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ విచారణకు తెలంగాన పోలీసులు చేపట్టిన విచారణ అడ్డుకారాదని పేర్కొన్నారు. ఓటు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు అని, ఛార్జిషీటులో ఆయన పేరు ఇంతవరకూ ఎందుకు చేర్చలేదని భూమన ప్రశ్నించారు. ఇందులో తెలంగాణ సీఎం కేసీఆర్ నిబద్ధతను ప్రశ్నించాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు పేరు చేర్చకుంటే వారు కూడా చట్ట వ్యతిరేకులే అన్నారు. సామాన్యుడైనా, సీఎం అయినా చట్టాలు ఒకే తీరుగా ఉంటాయని, దీన్ని అందరూ సమ్మతిస్తారని చెప్పారు. అయినా ఏళ్లు గడుస్తున్నా కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్యేల ఓట్లు కొనేందుకు చూసి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన చంద్రబాబును విచారణకు పిలవకపోవడం దారుణమన్నారు. కేసుకు భయపడ్డ చంద్రబాబు.. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ వద్ద సాగిలపడ్డారో.. లేక తెలంగాణలో కేసీఆర్ వద్ద సాగిల పడ్డారోనని, అందుకే ఇన్నాళ్లు ఈ కేసులో నిర్లిప్తత కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. ఒక ఎమ్మెల్యేకి రూ.50 లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిన కేసులు పెట్టరా అని ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసు గురించి భయపడే చంద్రబాబు విజయవాడకు పారిపోయారని ఆరోపించారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు అకస్మాత్తుగా అమరావతికి మకాం మార్చడం వెనక అసలు ఉద్దేశం ఓటుకు కోట్లు కేసు భయమేనని భూమన కరుణాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. -
చిత్తశుద్ధి ఉంటే బాబును దోషిగా నిరూపించు
హైదరాబాద్: ఓటుకు కోట్లు వ్యవహారంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు తనను బలిపశువుని చేస్తున్నారని, పావుగా వాడుకుంటున్నారని ఈ కేసులో ఏ–5 ముద్దాయి జెరూసలేం మత్తయ్య ఆరోపించారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్లో మాట్లాడింది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడే అన్న విషయం యావత్ ప్రపంచానికి తెలుసన్నారు. మంగళవారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి, దమ్మూధైర్యం ఉంటే ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి దోషిగా నిరూపించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో తనను ఏ–5గా చేర్చడం బాధ కలిగించిందన్నారు. తాను సుప్రీంకోర్టులో వేసిన అప్రూవ్ పిటిషన్‌ను కూడా అణగదొక్కే కుట్రలు ఇరు ప్రభుత్వాలు చేస్తున్నాయని ఆరోపించారు. ‘‘గుంటూరు, విజయవాడ వెళ్లినప్పుడు నాకు బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయి. దీనిపై అక్కడి పోలీసులకు చెబితే వాళ్లు స్పందించారు. అక్కడి పీఎస్‌లో కేసు పెట్టించారు. ‘నిన్ను బెదిరించినట్లు కేసీఆర్‌పై కేసు పెట్టు’అని ఒత్తిడి చేశారు. ఏపీ ప్రభుత్వం, అధికారులు నన్ను ఆర్నెల్లపాటు అండర్‌గ్రౌండ్‌లో ఉంచి వారికి అనుకూలంగా వాడుకున్నారు’’అని మత్తయ్య పేర్కొన్నారు. -
నిప్పు బాబుకు నిద్రలేని రాత్రులే!
ఓటుకు కోట్లు కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్ సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. ఏపీలో జరిగిన అవినీతి మీద సీబీఐ విచారణ కావాలని అక్కడి బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్న సమయంలో ఇప్పుడు కేసీఆర్ ఓటుకు కోట్లు కేసు దస్త్రాలను మళ్ళీ ఒకసారి దులిపి బయటకు తీసి చంద్రబాబుకు రాత్రుళ్ళు నిద్ర పూర్తిగా కరువు అయ్యేట్టు చేశారు. పలు కేసులలో స్టేలు తెచ్చుకుని కాలం గడుపుతూ కూడా నా మీద ఒక్క కేసూ లేదు, నేను నిప్పును అని చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఓటుకు కోట్లు కేసు వల్ల రానున్న రోజుల్లో నిద్రలేని రాత్రులే శరణ్యం. తెలంగాణా సీఎం కల్వ కుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం నాడు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులతో కొన్ని కేసులకు సంబంధించి సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. అందులో ప్రధానమయిన కేసు మూడేళ్ళ కింద ఓటుకు కోట్లు కేసుగా బాగా ప్రచారం పొందింది. ఏపీ సీఎం చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారన్న అభియోగం ఎదుర్కొం టున్న కేసు కావడంతో ఇది బాగా ప్రచారంలోకి వచ్చింది. అంతే కాదు రాష్ట్ర విభజన చట్టంలో కల్పిం చిన వెసులుబాటు ఆధారంగా పదేళ్ళ పాటు హైదరాబాద్‌ను తమ రాజధానిగా కూడా ఉపయోగించుకునే పరిస్థితి ఉన్నా, హడావుడీ లేకుండా ప్రశాంతంగా కొత్త రాజధాని నిర్మించుకునే పరిస్థితి ఉన్నా రాత్రికి రాత్రి చంద్రబాబు పరిపాలనను విజయవాడకు తరలించడం వల్ల కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది. గాలివానకు ఊగే నిర్మాణాలే రాజధానా? తెలంగాణాలో తనను నమ్ముకుని నివసిస్తున్న ఆంధ్ర ప్రాంత ప్రజలను నట్టేట ముంచి, అపార అనుభవంతో తమను ఉద్ధరిస్తాడనుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను నానా అగచాట్ల పాలుచేసే విధంగా అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి మకాం ఎత్తెయ్యడానికి సరయిన కారణం ఇప్పటి వరకూ ఆయన చెప్పలేక పోయారు. పోనీ ఈ మూడేళ్ళలో గొప్ప రాజధాని నిర్మాణానికి ఏమయినా పని జరిగిందా అంటే అదీ లేదు. కట్టిన తాత్కాలిక భవనాలు కూడా ఒక్క గాలి వానకు గందరగోళం అయ్యే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణాలో ఒక్క శాసనమండలి స్థానాన్ని గెలుచుకోవాలన్న కక్కుర్తితో ఒక నామినేటెడ్ ఎంఎల్ఏని 5 కోట్ల రూపాయలకు కొనడానికి ప్రయత్నించి అందులో భాగంగా 50 లక్షలు అడ్వాన్స్ ఇవ్వబోయి దొరికిపోయిన కేసుకు మూడేళ్ళు. ఈ మూడేళ్ళ కాలంలో అనేక సంఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలూ ముక్కున వేలేసుకుని చూస్తుండిపోయారు. ఒక్కసారి మూడేళ్ళ క్రిందటి రాజకీయ పరిణామాలను గుర్తు చేసుకుంటే ఆ తరువాత జరిగిన పరిణామాలన్నీ ముక్కున వేలేసుకునే విధంగానే ఉన్నాయి మరి. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నామినేటెడ్ శాసన సభ్యుడు స్టీఫెన్సన్కు 50 లక్షల రూపాయలు లంచం ఇస్తూ అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికి జైలుకు వెళ్ళిన సమయంలోనే బయటపడింది చంద్రబాబు అదే స్టీఫెన్‌సన్‌తో జరిపిన ఫోన్ సంభాషణ. ‘మనవాళ్ళు బ్రీఫ్ద్ మీ’ అన్న చంద్రబాబు మాటలు బాగా ప్రచారంలోకి వచ్చాయి ఈ మూడేళ్ళలో. వీడియో, ఆడియో సాక్ష్యాల ఆధారంగా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబునాయుడు బయటికి తాను నిప్పు అని బుకాయిస్తూ వచ్చినా ఓటుకు కోట్లు కేసు నెత్తి మీద కత్తిలా వేలాడుతున్నదనే భయం వెంటాడుతూనే ఉంది. అవినీతి నిరోధక శాఖ పెట్టిన ఈ ఓటుకు కోట్లు కేసు వివిధ కోర్టుల్లో విచారణ జరగవలసి ఉన్న ఈ సమయంలో ఎందుకు తెలంగాణా ముఖ్య మంత్రి హటాత్తుగా ఈ కేసును సమీక్షించారు అన్న విషయంలో సోమవారం నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఓటుకు నోట్లు కేసులో ఇరుక్కున్నట్లే! తెలంగాణా ముఖ్యమంత్రి ఇప్పుడు ఓటుకు కోట్లు కేసు మీద సమీక్ష జరపడానికి సంబంధించి పలు వాదనలు వినిపిస్తున్నాయి. ఎంఎల్ఏ స్టీఫెన్‌సన్‌తో జరిపిన ఫోన్ సంభాషణలో గొంతు తనది కాదని ఈ నాటి వరకూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా చెప్పనప్పటికీ ఆ గొంతు ఆయనదా కాదా తేల్చుకునేందుకు జరిపించిన ఫోరెన్సిక్ పరీక్షా ఫలితం వచ్చి, ఆ గొంతు చంద్రబాబుదేనని నిర్ధా రణ జరిగింది కాబట్టి తదుపరి చర్యలను గురించి సమీక్ష జరిపారన్నది ఒక వాదన. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లా మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇదివరకే ప్రైవేటు ఫోరెన్సిక్ పరీక్ష జరిపించి అది చంద్రబాబు గొంతేనని తేల్చి న్యాయస్థానాల దృష్టికి తీసుకువెళ్ళిన విషయం తెలిసిందే. కాగా చంద్రబాబు ఈ కేసు నుండి రక్షించడం కోసం దాన్ని నీరు కార్చి ఆయనను విముక్తుడిని చెయ్యడం కోసం కేసీఆర్ మిత్ర ధర్మంలో భాగంగా ఈ సమీక్ష జరిపారన్నది రెండవ వాదన. విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల బాగు కోసం ఇద్దరూ కలిసి చెయ్యాల్సిన పని ఒక్కటీ చెయ్యక పోయినా ఇతరేతర అవసరాల కోసం ఇద్దరు చంద్రుల మధ్య స్నేహ బంధం తిరిగి నెలకొన్నదని ప్రచారం. ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగానే ఉన్నాయి ఈ మూడేళ్ళలో జరిగిన పరిణామాలు. తెలంగాణా ముఖ్యమంత్రి తన వ్యవసాయ క్షేత్రంలో మహా చండీ యాగం తలపెడితే Sఏపీ ముఖ్యమంత్రి దానికి హాజరు అవుతారు. ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నిర్మాణం పేరిట ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణా ముఖ్యమంత్రి వెళతారు. ఇవన్నీ మామూలు పరిస్థితుల్లో జరిగితే ఎవరూ అభ్యంతర పెట్టాల్సిన పనిలేదు. ఇరుగు పొరుగు రాష్ట్రాల, అందునా కొత్తగా విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యంగా ఉండకూడదని ఎవరయినా ఎందుకు అనుకుంటారు? అయితే ‘‘చంద్రబాబూ నిన్ను బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు, ఓటుకు కోట్లు కేసులో నువ్వు జైలుకు పోవ డం ఖాయం అని కేసీఆర్.. నాకూ ఏసీబీ ఉంది, నాకూ పోలీసులు ఉన్నారు నీ అంతు చూస్తా అని చంద్రబాబు ఒకరి మీద ఒకరు విరుచుకుపడ్డ కొద్ది రోజులకే ఇవన్నీ జరగడం విడ్డూరం. అంతేకాదు హటాత్తుగా ఓటుకు కోట్లు కేసు మరుగునపడిపోవడం, ఎవరయినా గుర్తు చేస్తే చట్టం తన పని తానూ చేస్తుంది అన్న రొటీన్ డైలాగ్ వినిపించడం అనేక అనుమానాలకు తావు ఇచ్చాయి. తెలంగాణాలో టీడీపీని ఖాళీ చేసినా చంద్రబాబు నోరు మెదపకపోవడం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే జాతీయ పార్టీగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం కూడా ఆ అనుమానాలకు తోడయ్యాయి. అక్కడి నుండి ‘‘బాబు నాకు మంచి మిత్రుడు ఆయనతో నేను మాట్లాడుతాను’’ అని చంద్రశేఖర్‌రావు ఇటీవల తాను సారథ్యం వహిస్తానని చెపుతున్న కొత్త రాజకీయ కూటమిలోకి బాబును తీసుకొస్తానని చెప్పడం కూడా ఇద్దరు చంద్రుల మధ్య మైత్రి కొనసాగుతున్న సంకేతాలనే పంపుతున్నది. ఈ మైత్రికి మరో కారణం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఉద్యమం ఒత్తిడి కారణంగా బీజేపీని వీడి కాంగ్రెస్ పంచన చేరాలని చూస్తున్న చంద్రబాబు తెలంగాణాలో కూడా ఆ పని చేస్తే వచ్చే ఎన్నికల్లో తమకు అదనంగా జరగబోయే నష్ట నివారణ కోసం కూడా కేసీఆర్ ఈ ఓటుకు కోట్లు కేసు ఫైల్ దుమ్ము దులిపారని కూడా చర్చ జరుగు తోంది. తెలుగుదేశం శాసన సభ్యులందరూ తన పంచన చేరినా తెలంగాణాలో ఆ పార్టీ రేపు 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిస్తే తనకు నష్టం తప్పదన్న విషయం కేసీఆర్‌కు బాగా తెలుసు. ఇప్పటికే టీఆర్ఎస్కు రానున్న ఎన్నికలు గడ్డు కాలమే అని సొంత నివేదికలే చెపుతున్న కారణాన టీడీపీని కట్టడి చెయ్యడానికి కేసీఆర్ వచ్చే ఏడాది పాటు ఈ కేసును వార్తల్లో సజీవంగా ఉంచుతారని అర్థం అవుతున్నది. ఓటుకు కోట్లు కేసు సమీక్ష మతలబు! హటాత్తుగా సోమవారం నాడు కేసీఆర్ ఓటుకు కోట్లు కేసును సమీక్షించడం గురించి మరో చర్చ కూడా జరుగుతున్నది. ఈ కేసును సిబీఐకి అప్పగించాలన్న పిటిషన్ సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. ఒక వేళ అత్యున్నత న్యాయస్థానం ఆ మేరకు ఆదేశాలు జారీ చేస్తే ఇక ఇద్దరు చంద్రుల చేతుల్లో చెయ్యడానికి ఏమీ ఉండదు కాబట్టి ఈ కేసును రాష్ట్ర స్థాయిలో మేమే డీల్ చెయ్యగలమని నివేదించే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉండొచ్చు. అసలే బీజేపీతో తెగతెంపులు చేసుకున్నప్పటి నుంచి వరుసగా ఏపీలో జరిగిన అవి నీతి మీద సీబీఐ విచారణ కావాలని అక్కడి బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్న సమయంలో ఇప్పుడు కేసీఆర్ ఓటుకు కోట్లు కేసు దస్త్రాలను మళ్ళీ ఒకసారి దులిపి బయటకు తీసి చంద్రబాబుకు రాత్రుళ్ళు నిద్ర పూర్తిగా కరువు అయ్యేట్టు చేశారు. తమ సహాయంతో ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చి, కేంద్రంలో దాదాపు నాలుగేళ్ళు అధికారం అనుభవించి ఇప్పుడు బీజేపీని ఓడించండంటూ కర్ణాటక ఎన్నికల్లో బహిరంగంగా ప్రచారం చేయిస్తున్న, బావమరిదితో ప్రధానమంత్రిని అసభ్యంగా తిట్టించిన చంద్రబాబునాయుడు ఓటుకు కోట్లు కేసు సీబీఐ చేతుల్లోకి పోతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇంకా ఏం కావాలి? కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు బీజేపీ వారి కోరిక కేసీఆర్ లేదా సుప్రీం కోర్టు తీర్చవచ్చునేమో. పలు కేసులలో స్టేలు తెచ్చుకుని కాలం గడుపుతూ కూడా నా మీద ఒక్క కేసూ లేదు, నేను నిప్పును అని చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఓటుకు కోట్లు కేసు వల్ల రానున్న రోజుల్లో నిద్రలేని రాత్రులే శరణ్యం. దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
‘ఓటుకు కోట్లు’ కేసులో చంద్రబాబే ఏ–1
-
రేవంత్‌ను నేను జైలుకు పంపిస్తే..
సాక్షి, వరంగల్ అర్బన్ : కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని తాను జైలుకు పంపిస్తే టీడీపీలో ఉన్నప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. వరంగల్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తన ఇంటికి ఆ సమయంలో రేవంత్ ఎందుకు వచ్చారని అడిగారు. టీడీపీ నుంచి తాను పార్టీ మారలేదని, టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేశానని చెప్పుకొచ్చారు. తనపై ఆరోపణలు చేయడానికి రేవంత్ అనే బ్రోకర్‌ను, బఫూన్‌ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సినిమాల్లో మాదిరిగా ఒక ఐటెం సాంగ్ వేస్తున్నట్లు కాంగ్రెస్ సభల్లో రేవంత్ స్వీచ్‌లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు విచక్షణ మరచి స్పీకర్‌పై, తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్రాలలో అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసింది ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. కండ్లు తెరిచి చూస్తే పాలకుర్తిలో అభివృద్ధి కాంగ్రెస్ నేతలకు కనిపిస్తుందని అన్నారు.