సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం ప్రారంభమైన తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 15 గంటలుగా రేవంత్ రెడ్డితో వన్ టు వన్‌గా ఐటీ అధికారులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా ‘ఓటుకు కోట్లు కేసు’లో మరో నిందితుడైన ఉదయ్ సింహతో కలిపి ఇద్దరిని ఒకేసారి విచారించారు. కొన్ని కీలక డాక్యుమెంట్లకు సంబంధించి ఉదయ్‌ను కూడా ప్రశ్నించేందుకు పిలిచినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం ఐటీ అధికారులు రేవంత్ రెడ్డి భార్య గీతను రహస్యప్రదేశానికి తీసుకెళ్లి విచారించారు. అనంతరం గీతను బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయడానికి తీసుకెళ్లారు. అయితే రేవంత్ రెడ్డి నివాసం వద్ద భారీ పోలీసు బలగాలను మోహరించారు. దీంతో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుండంతో ఆయన నివాసం వద్దకు కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున చేరుకుంటున్నారు. అయితే అరెస్టు చేయడానకి రాలేదని కేవలం భద్రత కోసమే వచ్చామని పోలీసు ఉన్నతవర్గాలు తెలిపాయి. (రేవంత్ ఇంట్లో సోదాలు)
రెండో రోజు కూడా రేవంత్ రెడ్డిపై ఐటీ, ఈడీ దాడులు కోనసాగుతండటంతో కాంగ్రెస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. శుక్రవారం ఉదయమే కాంగ్రెస్ నేతలు డికే అరుణ, సీతక్కతో సహా పలువురు నాయకులు, కార్యకర్తలు రేవంత్ ఇంటికి చేరుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూరితంగానే ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment