Uday simha
-
ఓటుకు కోట్లు కేసు: ఉదయ్‌సింహ అరెస్టు
సాక్షి, హైదరాబాద్: ఏళ్లుగా నలుగుతున్న ఓటుకు కోట్లు కేసులో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ-3 గా ఉన్న ఉదయ్‌సింహను ఏసీబీ అధికారులు నేడు అరెస్టు చేశారు. ఇప్పటికే పలువురు నిందితుల డిశ్చార్జ్ పిటీషన్లు కొట్టివేసిన ఏసీబీ ప్రత్యేక కోర్టు అభియోగాలపై విచారణ ప్రారంభించింది. విచారణకు హాజరుకాని మరో నిందితుడు ఉదయ్‌సింహపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. నాన్ బెయిలబుల్ వారెంట్‌ను అమలు చేసిన ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. ఏసీబీ కోర్టులో ఉదయ్‌సింహను గురువారం హాజరుపరచనున్నారు. కాగా, ఈ కేసులో ఆడియో, వీడియో టేపుల ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కీలకం కానుంది. నిందితులపై నమోదైన అభియోగాలపై విచారణ ప్రారంభం కావటంతో కీలక సూత్రదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. (చదవండి: ఏసీబీ కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ..) -
ఒటుకు నోట్లు కేసు: ఈడీ విచారణకు ఉదయ్‌సింహ
-
సుప్రీం కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ
-
సుప్రీం కోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసుపై సుప్రీం కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ కేసులో నిందితుడైన ఉదయ్ సింహ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన జస్టిస్ లావునాగేశ్వర్ రావు ధర్మాసనం.. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. అయితే వ్యక్తిగత కారణాలతో తాను నేడు కోర్టుకు హాజరు కాలేనని, తనకు రెండు వారాల పాటు సమయం కావాలని ఉదయ్ సింహ తరపు న్యాయవాది సిద్దార్థ లూత్రా న్యాయమూర్తికి లేఖ రాశారు. సిద్దార్థ అభ్యర్థనను సమ్మతించిన ధర్మాసనం కేసు విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. మరోవైపు ఉదయసింహ దాఖలుచేసిన ఇంప్లీడ్ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఈ పిటిషన్‌తో కేసు విచారణ ఆలస్యం చేయాలనే రకరకాల ఎత్తుగడులను ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ సీనియర్ న్యాయవాది హరేన్ ధావల్ వాదించారు. మరో నిందితుడైన మత్తయ్య పేరును ఈ కేసు నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ఏసీబీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో.. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. 2015 మే 30న వెలుగులోకి వచ్చిన ‘ఓటుకు కోట్లు’ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా స్టీఫెన్‌సన్‌తో సాగిన సంభాషణల్లోని గొంతు చంద్రబాబుదేనని ధ్రువీకరిస్తూ చండీగఢ్‌కు చెందిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక కూడా ఇచ్చింది. అయితే రాజకీయ అవసరాల కోసమే ఈ కేసును ఆలస్యం చేస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
ఐటీ అధికారుల ముందుకు రేవంత్‌రెడ్డి ..!
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసు, ఆదాయానికి మించిన ఆస్తులు, డొల్ల కంపెనీల లావాదేవీలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, అతని సన్నిహితుల నివాసాలపై ఐటీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. సోదాల అనంతరం పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు విచారణకు హాజరవాల్సిందిగా వారికి నోటీసులు జారీచేశారు. ఇప్పటికే రేవంత్‌ను ఐటీ అధికారులు రెండుసార్లు సుదీర్ఘంగా విచారించారు. కాగా, ఈ విచారణ రెండో దశకు చేరుకుంది. ఇప్పుడు మరోసారి రేవంత్‌కు ప్రశ్నలు సంధించనున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన ఐటీ అధికారుల ముందు హాజరుకానున్నట్లు సమాచారం. మరోవైపు రేవంత్ రెడ్డితో పాటు పద్మనాభరెడ్డి, ఉదయసింహ, శ్రీసాయి మౌర్యా సంస్థ డైరెక్టర్లు, ఆడిటర్లు, కేఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ సంస్థ ప్రతినిధులు కూడా విచారణకు హాజరు కానున్నారని తెలిసింది. -
ఆ డబ్బు ఎక్కడిది?
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. వారం రోజుల క్రితం ఆయన ఇంట్లో సోదాలు చేసిన అధికారులు ఇచ్చిన నోటీసు మేరకు రేవంత్‌రెడ్డి బుధవారం ఉదయం 11.30 గంటలకు ఆయ్కార్ భవన్లో విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇచ్చేందుకు తీసుకెళ్లిన రూ.50 లక్షల నగదును ఎవరు ఇచ్చారు? ఎక్కడి నుంచి వచ్చాయన్న అంశాలపైనే ప్రధానంగా అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అంత మొత్తాన్ని ఎవరి ఖాతా నుంచి డ్రా చేశారు, ఆ డబ్బును సంబంధిత వ్యక్తి ఆదాయపు పన్ను కింద చూపించారా లేదా అన్న అంశాల్లో క్లారిటీ ఇవ్వాలని రేవంత్‌ను అడిగినట్లు తెలిసింది. ఏసీబీ అధికారులు రాసిన లేఖపైనే తాము విచారణ జరుపుతున్నామని, రూ.50 లక్షలతో పాటు మిగతా రూ.4.5 కోట్ల సంగతి కూడా చెప్పాలని పదే పదే ప్రశ్నించినట్లు సమాచారం. అలాగే డొల్ల కంపెనీలకు సంబంధించిన అంశాలపై రేవంత్ వివరణ ఇచ్చినట్లు ఐటీ వర్గాల ద్వారా తెలిసింది. తనకెలాంటి కంపెనీలు లేవని, తాను దాఖలు చేసిన అఫిడవిట్‌తో పాటు ఐటీ రిటర్నులపై ఆడిటర్‌తో కలసి ఐటీ అధికారులకు రేవంత్ వివరించారని సమాచారం. మీ ఖాతాలోవేనా..? స్టీఫెన్సన్కు ఇచ్చేందుకు తీసుకెళ్లిన రూ.50 లక్షల నగదు ఎక్కడి నుంచి వచ్చిందని రేవంత్‌తో పాటు ఉదయ్‌సింహాను ఎదురెదురుగా కూర్చోబెట్టి ఐటీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఏసీబీ నుంచి ఒక డీఎస్పీ, మరో ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం. ఆ డబ్బు మీ ఖాతా నుంచి డబ్బు డ్రా చేస్తే దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలని కోరినట్లు తెలిసింది. ఒకవేళ ఉదయ్‌సింహా ద్వారానే వస్తే ఆ డబ్బు ఎవరిచ్చారో చెప్పాలని అతన్ని ప్రశ్నించినట్లు ఐటీ అధికార వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై వివరణ ఇచ్చేందుకు మరింత సమయం కావాలని రేవంత్, ఉదయ్‌సింహా కోరినట్లు తెలిసింది. దీంతో ఓటుకు కోట్లు విచారణ ఆపి మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2.15 గంటల వరకు భోజన విరామం ఇచ్చారు. 2.15 గంటల తర్వాత తన పాత ఇంట్లో ఉన్న కంపెనీలకు రేవంత్‌కు సంబంధం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. తన పేరిట ఎలాంటి కంపెనీలు లేవని, అవసరమైతే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చని రేవంత్ దీటుగానే బదులిచ్చినట్లు తెలుస్తోంది. ఇలా సాయంత్రం 4.50 గంటల వరకు రేవంత్, ఉదయ్‌సింహాను విచారించిన అధికారులు మళ్లీ ఈ నెల 23న విచారణకు హాజరవ్వాలని చెప్పడంతో 5.00 గంటల సమయంలో వారు ఆయకార్ భవన్ నుంచి బయటకు వచ్చారు. అధికారుల ముసుగులో కేసీఆర్ సైన్యం: రేవంత్‌రెడ్డి విచారణ అనంతరం బయటకు వచ్చిన రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనను విచారిస్తున్న అధికారులతో పాటు అధికారుల ముసుగులో కేసీఆర్ ప్రైవేట్ సైన్యం కూడా ఉందని ఆరోపించారు. ఐటీ అధికారుల పేరు చెప్పి డీఐజీ ప్రభాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు తమ ఇంట్లో అర్ధరాత్రి దాడులు చేసి భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. తనను వేధించేందుకు కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు విభాగాలను ఉపయోగించుకుంటున్నారని, తాను ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తేలేదని.. న్యాయబద్ధంగా, రాజకీయంగా వీటన్నింటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇంట్లో సోదాలు చేసిన సమయంలో, ఇప్పుడు విచారణలో అధికారులకు అన్ని వివరాలు డాక్యుమెంట్లతో సహా సమాధానమిచ్చానన్నారు. తమతో పరిచయం లేని రణధీర్‌రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులమని చెప్పి అర్ధరాత్రి దాడులు చేసి వేధించిన విషయంపై ఆదాయపు పన్ను కమిషనర్‌కు ఫిర్యాదు చేశానన్నారు. దీనిపై నగర కమిషనర్‌తో పాటు డీజీపీకి ఫిర్యాదు చేస్తానని, ఇలాంటి వేధింపులకు భయపడే ప్రసక్తేలేదన్నారు. ఐటీ అధికారులు లేవనెత్తిన మరిన్ని అంశాలపై వివరణ ఇచ్చేందుకు 23న రావాలన్నారని, తాను విచారణకు హాజరవుతానని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ప్రతీక్షణం ఏపీ ఇంటెలిజెన్స్ అప్డేట్... ఐటీ అధికారులు రేవంత్‌రెడ్డిని విచారిస్తున్న ఆయ్కార్ భవన్ వద్ద ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు తచ్చాడారు. 8 మందితో కూడిన అధికార బృందం రేవంత్ విచారణ అంశాలను ఎప్పటికప్పుడు ఏపీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులకు అప్డేట్ చేశారు. విచారణలో వెల్లడిస్తున్న అంశాలపై కూడా ఆరా తీసి సాయంత్రానికల్లా పూర్తి నివేదిక ఏపీ సీఎం చంద్రబాబుకు పంపించేలా బృందాలు పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఐటీ సోదాల దెబ్బతో ఏపీలోని పలువురు నేతలు, మంత్రులు వణికిపోతున్న సంగతి తెలిసిందే. -
ముగిసిన రేవంత్ విచారణ
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు కేసు’లో ఏ1 నిందితుడు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారణ ముగిసింది. బుధవారం ఉదయం 11 గంటలకు ఐటీ కార్యాలయంలో ప్రారంభమైన విచారణ దాదాపు ఐదు గంటల పాటు కోనసాగింది. రేవంత్‌తో పాటు ఈ కేసులో మరో నిందితుడు ఉదయ్ సింహాలను కలిపి ఐటీ అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు ఇవ్వజూపిన రూ.50 లక్షలతో పాటు, ఇస్తామని ఆఫర్ ఇచ్చిన నాలుగున్నర కోట్ల రూపాయల గురించి అధికారులు ఆరా తీస్తున్నారని సమాచారం. అంతేకాకుండా ఈ కేసు గురించి ఏం చెప్పదల్చుకున్నాడో లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని రేవంత్‌ను కోరారు. ఆదాయ వ్యయాలు, వ్యాపార లావాదేవీలు, ఆస్తుల డాక్యుమెంట్లు, ఎన్నికల అఫిడవిట్స్‌లు ఐటీ అధికారులు రేవంత్ ముందుంచి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రేవంత్‌తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని కూడా ఐటీ అధికారులు విచారిస్తున్నారు. (గుట్టు తేలితే బాబుపైనే నజర్!) చదవండి: ఓటుకు ‘కోట్లు’ ఎక్కడివి? రేవంత్‌పై.. నేనే ఫిర్యాదు చేశా -
రేవంత్ గుట్టంతా ఆ హార్డ్‌డిస్క్‌లో ఉందా?
సాక్షి, హైదరాబాద్ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇంట్లో ఐటీ సోదాల్లో భాగంగా పలువురికి నోటీసులిచ్చిన అధికారులు విచారణను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రేవంత్ అనుచరుడు, ఓటుకు కోట్లు కేసు నిందితుడు ఉదయ్ సింహ బంధువు రణధీర్ రెడ్డి వద్ద దొరికిన హార్డ్‌డిస్క్ హాట్ టాపిక్ అయింది. రెండు రోజుల క్రితం ఐటీ అధికారులమంటూ రణదీర్ రెడ్డిని తీసుకెళ్లిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. అతన్ని రాత్రి 12 గంటలకు తన నివాసం వద్ద వదిలివెళ్లారు. రణధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉదయ సింహ ఇళ్లు ఖాళీ చేస్తున్న సమయంలో తనకు ఓ కవర్ ఇచ్చాడని, అందులో ఒక హార్డ్ డిస్క్, అతని తల్లి బ్యాంక్ కీ ఉందని చెప్పారు. ఇక తనను తీసుకెళ్లింది టాస్క్‌ఫోర్స్ పోలీసులని, ఏ కేసు విషయంలో తనని తీసుకెళ్లారో తెలియదన్నారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని, ఆ విషయాలు పోలీసులే మీడియాకు తెలియజేస్తారన్నారు. ఉదయ్ సింహా తనకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని, అతను ఇచ్చిన హార్డ్ డిస్క్‌లో ఏముందో తనకు తెలియదన్నారు. పోలీసులు తనకు నోటీసులు ఇచ్చారని, మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని చెప్పారని, ఆ నోటీసులు అక్కడే మర్చిపోయానన్నారు. ఇప్పుడు స్టేషన్‌కు వెళ్లి తీసుకుంటానని తెలిపారు. ఆ హార్డ్ డిస్క్‌లో ఏముంది? రేవంత్ ప్రధాన అనుచరుడైన ఉదయసింహా ఇచ్చిన ఆ హార్డ్‌డిస్క్‌లో ఏముంది? అని, మూడు నెలల ముందే ఆ హార్డ్‌డిస్క్ రణదీర్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు, రేవంత్ సంబంధించిన వ్యవహారాలు ఏమన్నా అందులో ఉన్నాయా? అనే అనుమానం కలుగుతోంది. ప్రస్తుతం ఈ కేసు ఈ హార్డ్‌డిస్క్ చుట్టే తిరుగుతోంది. -
ఓటుకు కోట్లు కేసులో దూకుడు పెంచిన అధికారులు
-
ఉదయసింహా బంధువు ఇంట్లో ఫేక్ ఐటి సోదాలు
-
ఉదయసింహా బంధువు కిడ్నాప్
సాక్షి, హైదరాబాద్ : తన బంధువు రణధీర్ రెడ్డిని ఐటీ అధికారులమని చెప్పి గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి అనుచరుడు ఉదయసింహ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. చైతన్యపురి లిమిట్స్, జైపురి కాలనీలో నివసించే తన బంధువు రణధీర్ రెడ్డి ఇంట్లో ఆదివారం కొంతమంది సోదాలు నిర్వహించారన్నారు. ఈ సోదాల పేరిట సెల్ ఫోన్లు, నగదు, బంగారంతో పాటు రణధీర్ రెడ్డిని కూడా తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఐటీ అధికారుల దృష్టికి తీసుకు రాగా.. తాము ఎలాంటి సోదాలు చేయలేదని, తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారన్నారు. నిన్నటి నుంచి రణధీర్ రెడ్డి ఆచూకీ లేదని, మరోవైపు ఐటీ అధికారులు తమకు సంబంధం లేదంటున్నారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ ఘటనపై ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రేవంత్ ఇంటి వద్ద భారీ పోలీసు భద్రత
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం ప్రారంభమైన తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 15 గంటలుగా రేవంత్ రెడ్డితో వన్ టు వన్‌గా ఐటీ అధికారులు విచారిస్తున్నారు. విచారణలో భాగంగా ‘ఓటుకు కోట్లు కేసు’లో మరో నిందితుడైన ఉదయ్ సింహతో కలిపి ఇద్దరిని ఒకేసారి విచారించారు. కొన్ని కీలక డాక్యుమెంట్లకు సంబంధించి ఉదయ్‌ను కూడా ప్రశ్నించేందుకు పిలిచినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం ఐటీ అధికారులు రేవంత్ రెడ్డి భార్య గీతను రహస్యప్రదేశానికి తీసుకెళ్లి విచారించారు. అనంతరం గీతను బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయడానికి తీసుకెళ్లారు. అయితే రేవంత్ రెడ్డి నివాసం వద్ద భారీ పోలీసు బలగాలను మోహరించారు. దీంతో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుండంతో ఆయన నివాసం వద్దకు కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున చేరుకుంటున్నారు. అయితే అరెస్టు చేయడానకి రాలేదని కేవలం భద్రత కోసమే వచ్చామని పోలీసు ఉన్నతవర్గాలు తెలిపాయి. (రేవంత్ ఇంట్లో సోదాలు) రెండో రోజు కూడా రేవంత్ రెడ్డిపై ఐటీ, ఈడీ దాడులు కోనసాగుతండటంతో కాంగ్రెస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. శుక్రవారం ఉదయమే కాంగ్రెస్ నేతలు డికే అరుణ, సీతక్కతో సహా పలువురు నాయకులు, కార్యకర్తలు రేవంత్ ఇంటికి చేరుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూరితంగానే ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. చదవండి: ఓటుకు కోట్లు కేసులో బాబును ఎందుకు వదిలేస్తున్నారు? రేవంత్ ఇంట్లో కీలకపత్రాలు స్వాధీనం -
ఓటుకు కోట్లు కేసు: సెబాస్టియన్, ఉదయ్‌లకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు కేసు’ కు సంబంధించిన నిందితుల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు కొనసాగుతునే ఉన్నాయి. గురువారం ఉదయం ప్రారంభమైన తనిఖీలు 23 గంటలుగా కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఏ2గా ఉన్న సెబాస్టియన్‌కు ఐటీ యాక్ట్ కింద నోటీసులు జారీ చేశారు. అక్టోబర్ 1లోగా బషీర్‌బాగ్‌లోని ఆయకార్ భవన్లో వ్యక్తిగతంగా హాజరుకావాలని అధికారులు ఆదేశించారు. ఇచ్చిన గడువులోగా హాజరకాకపోతే సెక్షన్ 271ఏ ఐటీ యాక్ట్ కింద జరిమాన విధిస్తామని నోటీసులో పేర్కొన్నారు. (రేవంత్ ఇంట్లో సోదాలు) ఉదయ్ సింహ ఇంట్లో ముగిసిన సోదాలు: ఓటుకు నోటు కేసులో మరో నిందితుడు ఉదయ్ సింహ ఇంట్లో నిన్న సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమైన సోదాలు శుక్రవారం ఉదయం ఐదు గంటల వరకు కొనసాగాయి. ఉదయ్ సింహా ఇళ్లు, కార్యాలయాలు, ఆయన బంధువులకు సంబంధించిన మూడు నివాసాల్లోనూ ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు ఇస్తూ పట్టుబడ్డ 50 లక్షలతో పాటు డీల్ భాగంగా ఇతరు నగదు ఎలా సమీకరించాలనుకున్నారని ఉదయ్ సింహను ప్రశ్నించారు. అంతేకాకుండా ఉదయ్‌కు చెందిన ఆస్తులు, ఆదాయం, రాబడుల వ్యవహారాలపై కూడా ఐటీ అధికారులు కూపీ లాగారు. సెక్షన్ 131 ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం ఉదయ్‌కు ఐటీ అధికారులు నోటీసుల ఇచ్చారు. అక్టోబర్ 1ను విచారణ సిద్దంగా ఉండాలని నోటీసులో పేర్నొన్నారు. చదవండి: రేవంత్‌కు అరెస్ట్ భయం..! కదులుతున్న డొంక -
ఓటుకు నోటు కేసు: ఉదయ్ సింహా ఇంట్లో సోదాలు
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఉదయ సింహ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. చైతన్యపురి పరిధిలోని హరిపురి కాలనీలో ఉన్న ఆయన నివాసంలో ఐదుగురు సభ్యుల ఐటీ శాఖాధికారుల బృందం తనిఖీలు చేస్తున్నారు. అధికారులు ఆయన ఇంటికి వచ్చినపుడు ఉదయ సింహ తల్లి మాత్రమే ఉంది. దీంతో అధికారులు ఉదయ సింహాకు ఫోన్ చేసి ఇంటి రావాలని చెప్పారు. దీంతో ఆయన హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న వెంటనే ఆయన సమక్షంలోనే ఐటీశాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
ఎక్సైజ్ పోలీసుల కస్టడీలో ఉదయ సింహ
ఏసీబీ తనిఖీల్లో పట్టుబడిన మద్యం బాటిళ్లపై విచారణ హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏ-3 నిందితుడిగా చర్లపల్లి జైలులో ఉన్న రుద్ర ఉదయ్‌సింహను ఎక్సైజ్ పోలీ సులు గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఆర్కేపురం హరిపురికాలనీ శ్రీలక్ష్మీ వేంకటేశ్వర అపార్ట్మెంటులోని ఉదయసింహ ఇంటిపై ఈ నెల 9న ఏసీబీ అధికారులు సోదాలు చేసి.. 5 విదేశీ మద్యం బాటిళ్లు, 2 డిఫెన్స్ బాటిళ్లు, 5 ఇండియన్ బాటిళ్లు కలిపి మొత్తం 12 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారుల సమాచారం మేరకు సరూర్‌నగర్ ఎక్సైజ్ సీఐ వెంకటేశ్వరరెడ్డి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. గురువారం అసిస్టెంట్ ఎక్సైజ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి.రవీందర్రావు ఆధ్వర్యంలో చర్లపల్లి జైలు నుంచి ఉదయసింహను రెండురోజుల కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. మద్యం బాటిళ్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు... ఎవరు ఇచ్చారు, అనుమతి పత్రాలు ఉన్నాయా లేవా... అనే కోణంలో మొదటిరోజు విచారణ కొనసాగింది. శుక్రవారం కూడా అతడిని విచారించనున్నట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.