ఏసీబీ తనిఖీల్లో పట్టుబడిన మద్యం బాటిళ్లపై విచారణ
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏ-3 నిందితుడిగా చర్లపల్లి జైలులో ఉన్న రుద్ర ఉదయ్‌సింహను ఎక్సైజ్ పోలీ సులు గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఆర్‌కేపురం హరిపురికాలనీ శ్రీలక్ష్మీ వేంకటేశ్వర అపార్ట్‌మెంటులోని ఉదయసింహ ఇంటిపై ఈ నెల 9న ఏసీబీ అధికారులు సోదాలు చేసి.. 5 విదేశీ మద్యం బాటిళ్లు, 2 డిఫెన్స్ బాటిళ్లు, 5 ఇండియన్ బాటిళ్లు కలిపి మొత్తం 12 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారుల సమాచారం మేరకు సరూర్‌నగర్ ఎక్సైజ్ సీఐ వెంకటేశ్వరరెడ్డి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
గురువారం అసిస్టెంట్ ఎక్సైజ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి.రవీందర్‌రావు ఆధ్వర్యంలో చర్లపల్లి జైలు నుంచి ఉదయసింహను రెండురోజుల కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టారు. మద్యం బాటిళ్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు... ఎవరు ఇచ్చారు, అనుమతి పత్రాలు ఉన్నాయా లేవా... అనే కోణంలో మొదటిరోజు విచారణ కొనసాగింది. శుక్రవారం కూడా అతడిని విచారించనున్నట్టు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
ఎక్సైజ్ పోలీసుల కస్టడీలో ఉదయ సింహ
Published Fri, Jun 26 2015 1:33 AM | Last Updated on Thu, Jul 18 2019 2:26 PM
Advertisement