సాక్షి, అమరావతి: టెట్రా ప్యాకెట్లలో మద్యం అమ్మాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. మద్యం అమ్మకాలలో అక్రమాలు అరికట్టేందుకు పాల ప్యాకెట్ల తరహాలో మద్యం ప్యాకెట్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. కొత్త టెట్రా విధానాన్ని ఎక్సైజ్ శాఖ పరిశీలిస్తోంది. ఈమేరకు మహారాష్ట్రలోని పుణేలో మద్యం ప్యాకెట్లను ఉత్పత్తి చేసే కంపెనీని పరిశీలించేందుకు అడిషనల్, జాయింట్ కమిషనర్లు ఆదివారం అక్కడికి వెళ్లారు. చీప్ లిక్కర్‌ను 180 ఎం.ఎల్ ప్యాకెట్లలో సరఫరా చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం అమలు అవుతున్న ప్యాకెట్ విధానం విజయవంతం కాకపోవడంతో మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు పాల ప్యాకెట్ తరహా టెట్రా ప్యాకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని తలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment