new excise policy
-
మందుబాబులకు గుడ్ న్యూస్, భారీగా తగ్గనున్న ధరలు
చండీగఢ్: పంజాబ్ రాష్ట్రం మద్యం బాబులకు గుడ్ న్యూస్ చప్పింది. పంజాబ్‌లోని ఆమ్ఆద్మీ సర్కార్ సరికొత్త ఎక్సైజ్ పాలసీ 2022-23ని విడుదల చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పంజాబ్ క్యాబినెట్ ఆమోదించింది, ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 40 శాతం అధికంగాఆమోదించింది. జులై 1వ తేదీ నుంచి ఈ సరికొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ముఖ్యంగా 35 నుంచి 60 శాతం వరకు ధరలను తగ్గించేలా సరికొత్త మద్యం పాలసీని ప్రకటించింది. ఈ కొత్త విధానం వల్ల 2021-22లో రూ.6,158 కోట్ల ఆదాయం రాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.9,647.85 కోట్లకు చేరుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. పంజాబ్‌లో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సారథ్యంలోని ఆప్ సర్కార్ మద్యం పాలసీని తీసుకురావడమేకాదు, కొన్నినిర్మాణాత్మక చర్యలను ప్రతిపాదించింది. లాట్ల ద్వారా మద్యం విక్రయాలను కేటాయించే బదులు, టెండర్లను ఆహ్వానించడంద్వారా వేలం వేయనుంది. అలాగే డిస్టిల్లర్లు, మద్యం పంపిణీదారులు, మద్యం రిటైలర్లు డీలింక్ చేయనుంది. అంతేకాదు రాష్ట్రంలో కొత్త డిస్టిలరీల ప్రారంభంపై నిషేధాన్ని కూడా ప్రభుత్వం ఎత్తివేసింది. పంజాబ్ మీడియం లిక్కర్ (పిఎంఎల్) మినహా అన్ని రకాల మద్యంపై ఒక శాతం ఎక్సైజ్ సుంకం వసూలు చేయనుంది. హర్యానా నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని అరికట్టడమే దీని లక్ష్యమని పంజాబ్ ప్రభుత్వం చెబుతోంది. మద్యం ధరల తగ్గుదలతో ఎక్సైజ్ ఆదాయాన్ని 40 శాతం పెంచుకోవాలని భావిస్తోంది. ఈ పాలసీ తొమ్మిది నెలల పాటు 2023, 31 మార్చి వరకు అమల్లో ఉంటుంది. మద్యం కల్తీ, స్మగ్లింగ్, అక్రమ డిస్టిలరీలను అరికట్టేందుకు డిపార్ట్మెంట్లోని ఎన్ఫోర్స్మెంట్ వింగ్‌ను పటిష్టం చేస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ వరుణ్ రూజం తెలిపారు. ఇందుకోసం పోలీసు శాఖకు రెండు అదనపు బెటాలియన్లు కేటాయించనున్నామన్నారు. ఫలితంగా హర్యానా కంటే10-15 శాతం తక్కువగా ధరలు ఉండ నున్నాయి. కొన్ని బ్రాండ్ల ధరలు పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఉంటాయి. అదేవిధంగా ఎక్కువగా వాడే ఇండియన్ ఐఎంఎఫ్ఎల్ ధర కూడా భారీగా తగ్గనుంది. తాజాగా ప్రకటించిన మద్యం పాలసీ ప్రకారం పంజాబ్‌లో ఐఎంఎఫ్ఎల్ ధర 400 రూపాయలకు దిగిరానుంది. -
కొత్త ఆబ్కారీ పాలసీకి నేడు సీఎం ఆమోదం!
సాక్షి, హైదరాబాద్ : రానున్న రెండేళ్లకుగాను రూపొందించిన ఎక్సైజ్ పాలసీకి నేడు గ్రీన్‌సిగ్నల్ లభించనుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు సమర్పించిన ఫైలును పరిశీలించి సీఎం కేసీఆర్ నేడు సంతకం చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. 2017–19 సంవత్సరాలకుగాను రూపొందించిన పాలసీలో కొన్ని మార్పులు చేసి కొత్త పాలసీకి సంబంధించిన ఫైలును ఎక్సైజ్ అధికారులు సీఎంకు పంపారు. రెండు, మూడు ప్రతిపాదనలతో కూడిన ఈ ఫైలుపై సీఎం సంతకం తర్వాత, ఆయన సూచనలకు అనుగుణంగా మార్పులుచేసి కొత్త పాలసీని ఎక్సైజ్ శాఖ విడుదల చేయనుంది. కాగా, నవంబర్ 1 నుంచి రాష్ట్రంలో ఈ పాలసీ అమల్లోకి రావడంతోపాటు కొత్త మద్యం షాపులు ఏర్పాటు చేయాల్సి ఉంది. దీంతో కొత్త షాపుల ఏర్పాటుకుగాను దసరా తర్వాత వారం రోజులకు నోటిఫికేషన్ విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈనెల 22 లేదా 23 తేదీల్లో డ్రాలు ఉండే విధంగా టెండర్ నోటిఫికేషన్ రూపొందిస్తారని, టెండర్ ఫీజు రూ.2 లక్షలకు పెంచనున్నారని సమాచారం. -
‘మందు’కు మందు
సాక్షి, అమరావతి : దశలవారీగా మద్య నిషేధం అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా నిబంధనలు రూపొందించింది. తొలి ఏడాదిలోనే 800కుపెగా షాపుల్ని తగ్గిస్తూ మద్యంపై రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రకటించింది. తాగుడు వ్యసనాన్ని దూరం చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ సహకారంతో జిల్లాకు ఒకటి చొప్పున డీ–అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యపానం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఏజెన్సీల్లో గ్రామసభ అనుమతిస్తేనే... రాష్ట్రంలో 3,500 ప్రభుత్వ మద్యం షాపుల ఏర్పాటుకు సంబంధించి 2019–20 నూతన పాలసీని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం రెండు వేర్వేరు జీవోలను జారీ చేసింది. మద్యం షాపులను ఎక్కడ ఏర్పాటు చేయాలి? మద్యం ఎవరికి అమ్మకూడదు? ఎక్సైజ్ అధికారుల అధికారాలు, లైసెన్సు ఫీజు తదితర వివరాలతో సమగ్ర నోటిఫికేషన్ వెలువడింది. గిరిజన ప్రాంతాల్లో మద్యం షాపులు ఏర్పాటు చేయాలంటే సంబంధిత ఊరిలో గ్రామసభ నిర్వహించి నిరభ్యంతర ధ్రువపత్రాలు పొందాలని స్పష్టం చేశారు. మద్యం నూతన విధానంపై మద్యపాన నియంత్రణ కమిటీలు, ప్రజా, మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. లైసెన్సు కాలపరిమితి ఏడాదే ప్రభుత్వం తరఫున ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎలాంటి లాభాపేక్ష లేకుండా మద్యం దుకాణాలను నిర్వహిస్తుంది. ఏపీఎస్‌బీసీఎల్‌కు ఎక్సైజ్ కమిషనర్ లైసెన్సు మంజూరు చేస్తారు. ఏడాదికి రూ.వెయ్యి లైసెన్సు ఫీజు చెల్లించాలి. లైసెన్సు కాలపరిమితి ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. ఆదాయం కోసం రహదారులను డీ నోటిఫై చేసిన గత సర్కారు గత ప్రభుత్వ హయాంలో మద్యం ఆదాయం కోసం ఏకంగా హైవేలను డీ నోటిఫై చేసింది. జాతీయ/రాష్ట్ర రహదారుల వెంట మద్యం దుకాణాలు ఉండరాదని సుప్రీంకోర్టు ఆదేశించడంతో టీడీపీ సర్కారు మద్యం ఆదాయం కోసం అప్పటికప్పుడు రాష్ట్ర రహదారుల్ని ఏకంగా జిల్లా రహదారులుగా డీ నోటిఫై చేసింది. సుప్రీం తీర్పు ప్రకారం జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం షాపులు ఏర్పాటు చేయకూడదు. 20 వేలు లేదా అంతకన్నా తక్కువ జనాభా కలిగిన గ్రామం/మండల కేంద్రం మీదుగా హైవే వెళుతుంటే 220 మీటర్ల లోపు మద్యం షాపులు ఉండకూడదు. పట్టణ/నగర ప్రాంతాల్లో ఈ నిబంధన వర్తించదు. విధివిధానాల్లో ముఖ్యాంశాలు.. మద్యంపై నూతన విధానం ప్రకారం జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం దుకాణాల ఏర్పాటును అనుమతించరు. పాఠశాలలు, విద్యాసంస్ధలు, ఆస్పత్రులు, ప్రార్థనా మందిరాలకు వంద మీటర్ల లోపు మద్యం షాపులు ఏర్పాటు చేయకూడదు. ఏజెన్సీ ప్రాంతాల్లో మద్యం షాపులు ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా గ్రామసభ అనుమతి ఉండాల్సిందే. ఏజెన్సీల్లో మద్యం షాపుల ఏర్పాటుకు గ్రామసభ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం పొందాలి. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు వయా ఆర్టీసీ బస్టాండ్, లీలామహల్ సెంటర్, నంది సర్కిల్, విష్ణునివాసం, శ్రీనివాసం, ఎస్వీఆర్ఆర్ ఆస్పత్రి, స్విమ్స్ రోడ్డులో మద్యం షాపుల ఏర్పాటుకు వీలు లేదు. 21 ఏళ్ల లోపు వారికి, మద్యం మత్తులో ఉన్నవారికి, యూనిఫాంలో ఉన్న సైనికులకు, శాంతిభద్రతలకు విఘాతం కల్గించే అనుమానితులకు మద్యం అమ్మకూడదు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే మద్యం వ్యాపారానికి అనుమతి. మద్యం దుకాణాల ఎదుట గరిష్ట విక్రయ ధరల బోర్డులు ఏర్పాటు చేయాలి. ప్రజారోగ్యాన్ని కాపాడటం, తాగుడు మానిపించడం, వ్యసనపరులకు కౌన్సెలింగ్ కోసం వైద్య, ఆరోగ్య శాఖ సహకారంతో ప్రతి జిల్లాలో డీ–అడిక్షన్ సెంటర్ ఏర్పాటు. -
మరింత కిక్కు..!
సాక్షి, యాదాద్రి : రాష్ట్ర ఖజానాకు ప్రధాన ఆదా య వనరు మద్యం వ్యాపారం. దీని ద్వారా ప్రభుత్వం మరింత ఆదాయం పెంచుకునే దిశగా నూతన పాలసీ ఉండబోతోందన్న వాదన విన్పిస్తోంది. ప్రస్తుతం ఉన్న మద్యం షాపుల సంఖ్య పెంచడం, బార్లకు అనుమతులు ఇవ్వడం, లైసెన్స్ ఫీజు పెంచే దిశగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. విధివిధానాలు రూపొందిస్తోన్న ఎక్సైజ్ యంత్రాంగం 2017 అక్టోబర్ 1తేదీ నుంచి ప్రారంభమైన మద్యం దుకాణాల కాలపరిమితి సెప్టెంబర్31తో ముగియనుంది. కాలపరిమితి ముగిసిన వెంటనే నూతన పాలసీని అమల్లోకి తేవడం కోసం అధికార యంత్రాంగం ఇప్పటి నుంచే తమ విధివిధానాలను రూపొందిస్తోంది. ప్రభుత్వం తీసుకురానున్న నూతన మద్యం పాలసీపై లిక్కర్ వ్యాపారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పడున్న మద్యం దుకాణాల నిర్వాహకులకు వరుస ఎన్నికలు రావడంతో ఆర్థికంగా కలిసొచ్చింది. దీంతో మరో సారి మద్యం దుకాణాలను దక్కించుకోవాలన్న తపన వారిలో పెరిగింది. దీంతోపాటు కొత్తగా మద్యం వ్యాపారంలోకి వచ్చేందుకు చాలా మంది ఉత్సాహం చూపుతున్నారు. లాభసాటి బిజినెస్ కావడంతో వారి కన్ను మద్యం దుకాణాలపై పడింది. పోటీ పెరిగే అవకాశం ప్రస్తుతం నడుస్తున్న మద్యం దుకాణాల కోసం రెండేళ్ల కిత్రం నిర్వహించిన టెండర్లకు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. జిల్లాలో 15 మండలాల్లో 67మద్యం షాపులకు 1,130మంది దరఖాస్తు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ రుసుం రూపేణా రూ.11.30కోట్ల ఆదాయం ప్రభుత్వానికి అప్పట్లో సమకూరింది. భువనగిరి, ఆలేరు, రామన్నపేట, మోత్కూర్ సర్కిళ్లలో మద్యం దుకాణాలు ఉన్నాయి. 2015లో మద్యం దుకాణం దరఖాస్తు రుసుం రూ.50వేలు ఉండగా 2107లో రూ.1లక్షకు పెంచారు. అయినా దరఖాస్తులు భారీగా వచ్చాయి. ఈ సారి మద్యం దుకాణాల సంఖ్యతోపాటు మద్యం రెంటల్ కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయినప్పటికీ మద్యం వ్యాపారంలోకి వచ్చే వారి సంఖ్య పెరగనుంది. డ్రా ద్వారా.. గతంలో వేలం పాటల్లో ఎవరు ఎక్కువ పాట పడితే వారికి దుకాణాలను కేటాయించే వారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల వేలంపాటల విధానాన్ని రద్దు చేసి లక్కీడ్రా ద్వారా మద్యం దుకాణాలను కేటాయించారు. ప్రభుత్వం లైసెన్స్ ఫీజును నిర్ణయించి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లక్కీడిప్ ద్వారా మద్యం దుకాణాలను కేటాయిస్తుంది. ఈ సారి పాత రెండు పద్ధతుల్లో దేన్ని అమలు చేస్తారన్నది ఇంకా నిర్ణయం కాలేదు. లక్కీడిప్ పద్ధతి ద్వారానే దుకాణాలను కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. మద్యం దుకాణాల లైసెన్స్‌ఫీజును మాత్రం పెంచడం ఖాయంగా కన్పిస్తోంది. మున్సిపాలిటీల్లో బార్లు.. ప్రస్తుతం జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో భువనగిరి మున్సిపాలిటీ గతంలోనే ఉండగా, యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరు, భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్ కొత్తగా ఏర్పడ్డాయి. గతంలో మండల కేంద్రాలుగా ఉన్న ఈ మున్సిపాలిటీ కేంద్రాల్లో ఒక్కో మద్యం దుకాణం లైసెన్స్ ఫీజు రూ. 1లక్ష ఉండగా ప్రస్తుతం పెరిగే అవకాశం ఉంది. అలాగే మున్సిపాలిటీల్లో ప్రస్తుతం ఉన్న దుకాణాలకు అదనంగా పెరగనున్నాయి. అంతేకాకుండా బార్లకు అనుమతి ఇవ్వనున్నారు. ఇప్పటికే నూతన మున్సిపాలిటీల్లో బార్లకు లైసెన్స్‌లు ఇవ్వాలని ఉన్నా అమలు కాలేదు. ఈ సారి తప్పకుండా బార్లకు అనుమతి వస్తుందని అధికారులు చెబుతున్నారు. అలాగే నూతన మండల కేంద్రాల్లో మద్యం దుకాణాలను ఏర్పాటు చేయనున్నారు. అడ్డగూడురు మండల కేంద్రంలో ఇప్పటి వరకు మద్యం దుకాణం ఏర్పాటు కాలేదు. జనగామ జిల్లా నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో కలిసిన గుండాల మండలం మద్యం దుకాణాలు అదనం కానున్నాయి. పెరిగిన మద్యం అమ్మకాలు 2017–2019 రెండు సంవత్సరాలకు మద్యం షాపుల నిర్వహణ లాభసాటిగా ఉంటుందని వ్యాపారులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. అందుకు అనుగుణంగానే వరుస ఎన్నికలు మద్యం వ్యాపారులకు సిరులు కురిపించాయి. గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఈరెండేళ్ల కాలంలోనే జరిగాయి. ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున మద్యం విక్రయించారు. దీంతో అనుకున్న దానికన్నా ఎక్కువ మద్యం విక్రయాలు జరిగాయి. దీంతో లిక్కర్ వ్యాపారంలో అడుగుపెట్టడానికి చాలా మంది ప్రయత్నాలు ప్రాంరంభించారు. -
పాల ప్యాకెట్ల తరహాలో మద్యం ప్యాకెట్లు!
-
పాల ప్యాకెట్ల తరహాలో మద్యం ప్యాకెట్లు!
సాక్షి, అమరావతి: టెట్రా ప్యాకెట్లలో మద్యం అమ్మాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. మద్యం అమ్మకాలలో అక్రమాలు అరికట్టేందుకు పాల ప్యాకెట్ల తరహాలో మద్యం ప్యాకెట్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. కొత్త టెట్రా విధానాన్ని ఎక్సైజ్ శాఖ పరిశీలిస్తోంది. ఈమేరకు మహారాష్ట్రలోని పుణేలో మద్యం ప్యాకెట్లను ఉత్పత్తి చేసే కంపెనీని పరిశీలించేందుకు అడిషనల్, జాయింట్ కమిషనర్లు ఆదివారం అక్కడికి వెళ్లారు. చీప్ లిక్కర్‌ను 180 ఎం.ఎల్ ప్యాకెట్లలో సరఫరా చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం అమలు అవుతున్న ప్యాకెట్ విధానం విజయవంతం కాకపోవడంతో మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు పాల ప్యాకెట్ తరహా టెట్రా ప్యాకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని తలుస్తోంది. -
అమ్మో.. లక్ష రూపాయలా!
► ఔత్సాహికులకు కష్టంగా కొత్త ఎక్సైజ్ విధానం ► మద్యం దుకాణాలకు దరఖాస్తు ఫీజు పెంపుపై ఆందోళన ► చిన్న సిండికేట్లకూ కష్టకాలమే ► పెద్ద సిండికేట్లు, లిక్కర్ మాఫియాకు అనుకూలం సాక్షి, హైదరాబాద్ : ‘గతంలో రెండు మద్యం షాపులకు దరఖాస్తు చేస్తే రూ.లక్ష నష్టపోయే వాళ్లం. ఇప్పుడు ఒక్క దుకాణానికే రూ లక్షంట! ఇద్దరం ముగ్గురం కలసి మనిషికి రూ 50 వేలు వేసుకుని రెండు, మూడు దుకాణాలకు టెండర్లు వేసే వాళ్లం. ఇప్పుడు ప్రతి దుకాణానికి రూ.లక్ష పోగొట్టుకోవాల్సి వస్తోంది. అందుకే ఈసారి నేను మద్యం లాటరీలో పాల్గొనడం లేదు’ – ఓ మధ్యతరగతి వ్యాపారి మనోగతమిదీ ‘అబ్బో.. లక్ష రూపాయలా? పోయిన సారి 20 షాపులకు టెండర్లు వేస్తే రూ.10 లక్షలు పోయినా ఓ షాపు తగిలింది. కానీ ఈసారి అన్ని వద్దు. ఐదు నుంచి 10 దుకాణాలకు మించొద్దు.. దుకాణం తగలక పోతే లక్షలకు లక్షలు నష్టపోతాం. అందుకే షాపులు తగ్గిద్దాం’ – ఇది ఓ చిన్నతరహా లిక్కర్ సిండికేట్ ప్రాథమిక నిర్ణయం ఈ సారి మద్యం దుకాణాల టెండర్‌కు దరఖాస్తు ఫీజును రూ.లక్షగా నిర్ణయించటం వ్యాపారులను బెంబేలేత్తిస్తోంది. నూతన మద్యం పాలసీలో ఎవరూ ఊహించని విధంగా దరఖాస్తు ధరను రెట్టింపు చేయడం, లాటరీలో షాపు రాకుంటే రూ.లక్షలు నష్టపోయే పరిస్థితి ఉండడంతో ఔత్సాహిక, దిగువ స్థాయి వ్యాపారులు ఈసారి మద్యం లాటరీల్లో పాల్గొనేందుకు వెనుకంజ వేస్తున్నారు. అయితే ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని సాధ్యమైనన్ని ఎక్కువ దుకాణాలు సొంతం చేసుకోవటానికి పెద్ద లిక్కర్ సిండికేట్లు మంత్రాంగం మొదలు పెట్టాయి. పాత లిక్కర్ మాఫియాకు జీవం... ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక దశలో మద్యం వ్యాపారం పూర్తిగా లిక్కర్ మాఫియా, సిండికేట్ల చేతిలోకి వెళ్లిపోయింది. ఈ నేపధ్యం లో అప్పటి ఎక్సైజ్ కమిషనర్ సమీర్ శర్మ పక్కా కసరత్తుతో మద్యం పాలసీని రూపొందిం చారు. ఔత్సాహిక వ్యాపారులను ఆకర్షించి సిండికేట్లకు, లిక్కర్ మాఫియాకు అవకాశం లేకుండా చేశారు. ఆయన రూపొందించిన పాలసీనే కొద్దిగా మార్పులు చేర్పులు చేసి కొనసాగిస్తూ వచ్చారు. కానీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త ఎక్సైజ్ పాలసీ పాత లిక్కర్ మాఫియాకు జీవం పోసే విధంగా ఉందని ఎక్సైజ్ వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దరఖాస్తు ఫీజు రూ.లక్షగా నిర్ణయించడం, ఈ సొమ్ము తిరిగి రాకపోవటంతో ఈ సారి టెండర్లు వేయటానికి యువ, దిగువ శ్రేణి వ్యాపారులు ఆసక్తి చూపటం లేదు. దీంతో పాత సిండికేట్లు మళ్లీ జీవం పోసుకుంటున్నాయి. అప్పటి కమిషనర్ సమీర్‌శర్మ దెబ్బకు ముక్కలు ముక్కలుగా విడిపోయిన ఈ సిండికేట్ల సభ్యులు ఒకే గొడుగు కిందకు వచ్చి భారీగా మద్యం దుకాణాలను చేజిక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. రాబడి తగ్గదు కానీ.... నూతన ఎక్సైజ్ పాలసీతో ప్రభుత్వానికి రాబడి ఏమాత్రం తగ్గదు. గతంలో కంటే ఇంకా ఎక్కువగానే వస్తుంది. గత పాలసీలో దరఖాస్తుల ద్వారా రూ.150 కోట్లు వస్తే ఈ సారి రూ.250 కోట్లకుపైగానే ఆదాయం రావొచ్చని అంచనా వేస్తున్నారు. కానీ ఆ తరువాతే అసలు కథ మొదలవుతుంది. పాత లిక్కర్ మాఫియా చేతిల్లోకి ఎక్కువగా మద్యం దుకాణాలు వెళ్తే మళ్లీ పాత జమానా మొదలయ్యే అవకాశం ఉందని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రతి పాలసీ ద్వారా కనీసం 40 శాతం మంది యువ వ్యాపారులు మార్కెట్లోకి వస్తేనే వ్యాపారం ఎక్సైజ్ శాఖ కనుసన్నల్లో సాగుతుందని వారు చెప్తున్నారు. ప్రస్తుత పాలసీని చూస్తే మాత్రం యువ వ్యాపారులు వచ్చే పరిస్థితి కనిపించటం లేదని పేరు చెప్పటానికి ఇష్టపడని ఓ అధికారి చెప్పారు. మాఫియా రంగంలోకి దిగితే మొదటి, రెండు టర్మ్‌ల వరకు అంటే మొదటి ఆరు నెలల వరకు టీఎస్‌బీసీఎల్ మద్యాన్నే తీసుకొని విక్రయిస్తారని, ఆ తరువాత అక్రమాలకు తెగబడే ప్రమాదం ఉందని అంటున్నారు. అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా ఎన్డీపీఎల్ మద్యం దిగుమతి చేసుకొని విక్రయించే అవకాశం ఉంది. అదే జరిగి ప్రజారోగ్యం ప్రమాదంలో పడటంతో పాటు, ప్రభుత్వానికి మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. కొత్త వాళ్లు రారు దరఖాస్తు ఫీజు లక్ష రూపాయలు చేయటం వల్ల కొత్త వాళ్లు వ్యాపారంలోకి దిగటానికి భయపడుతున్నారు. మద్యం దుకాణం టెండర్ వేయాలని మా ఊరులోనే నలుగురు యువకులు ప్లాన్ చేసుకున్నారు. కానీ రూ.లక్ష లైసెన్స్ ఫీజుకు భయపడి వెనుకడుగు వేశారు. – శ్రీనివాస్, బెజ్జంకి టెండర్లు తగ్గించుకుంటాం కనీసం 10 దుకాణాలకైనా టెండర్ వేద్దామనుకున్నాం. పదింటిలో ఒక్క దుకాణం వచ్చినా చాలు. కానీ దరఖాస్తు ఫీజు రూ.లక్ష పెట్టడంతో వెనుకడుగు వేశాం. రెండు , లేదా మూడు దుకాణాలకు మాత్రమే టెండర్లు వేస్తాం. – ప్రభాకర్, కొమురవెల్లి -
నూతన మద్యం విధానికి నేడు నోటిఫికేషన్
-
రూ.15కే మద్యం!
గుడుంబాకు విరుగుడుగా సర్కారు నిర్ణయం * 90 ఎం.ఎల్. సీసాల్లో అందుబాటులోకి.. * మండలం యూనిట్‌గా కొత్త మద్యం పాలసీ * గ్రామ గ్రామానికి చౌకమద్యం చేరేలా ప్రతిపాదనలు * గ్రేటర్ హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి మద్యం * కల్తీ కల్లు నివారణకు ఈత, తాటి చెట్లు పెంచడమే మార్గం * ఎక్సైజ్ శాఖ సమావేశంలో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం * మూడు రోజుల్లో సమగ్ర విధానం రూపొందించాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గుడుంబాను అరికట్టేందుకు చౌకమద్యం అందించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం... కేవలం రూ.15కే 90 మిల్లీలీటర్ల మద్యం అందేలా చర్యలు చేపడుతోంది. అంతేగాకుండా పల్లెపల్లెనా ఈ చౌకమద్యం అందుబాటులో ఉండేలా కొత్త మద్యం పాలసీని రూపొందిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ‘కాయకష్టం చేసుకునే పేదలు సేద తీరేందుకు మద్యానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు దాన్ని మార్చలేం. ప్రాణాలకు హాని కలగని విధంగా చవకగా మద్యాన్ని అందుబాటులోకి తేవాలి. పది రూపాయలకు గుడుంబా ప్యాకెట్ దొరుకుతున్నప్పుడు రూ.40 పెట్టి చీప్ లిక్కర్ ఎందుకు కొంటారు. వారి కోసం రూ.15కే 90 ఎం.ఎల్. మద్యం సీసాలు అందుబాటులో ఉండేలా చూడాలి..’’ అని సూచించినట్లు తెలిసింది. నూతన మద్యం విధానంపై సీఎం కేసీఆర్ శుక్రవారం సచివాలయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావుగౌడ్, రెవెన్యూ(ఎక్సైజ్, సీటీ) ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి.చంద్రవదన్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఇతర అధికారులతో సమీక్షించారు. నూతన మద్యం విధానం ఎలా ఉండాలనే దానిపై కేసీఆర్ ఈ సమావేశంలో స్పష్టత ఇచ్చారు. గుడుంబాను అరికట్టేందుకు ఇప్పటివరకు చేపట్టిన చర్యలేవీ సత్ఫలితాలివ్వడం లేదని.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లతోనే సమస్యకు పరిష్కారం చూపాలని పేర్కొన్నారు. ‘‘గుడుంబా తయారీలో అవలంబించే పాడు పద్ధతుల వల్ల అది విషంతో సమానమవుతుంది. గుడుంబా వల్ల ఇంటి యజమానులు చిన్నవయసులోనే ప్రాణాలు కోల్పోవడంతో మహిళలు వితంతువులుగా మారుతున్నారు. గుడుంబా అనేదే లేకుండా చేయడానికి అవలంబించాల్సిన విధానాన్ని ఖరారు చేయాలి..’’ అని ఎక్సైజ్ అధికారులకు కేసీఆర్ ఆదేశించారు. రూ.15కే హానికలగని రీతిలో 90 ఎం.ఎల్ మద్యం సీసాలను అందుబాటులో ఉంచాలని ఆయన సూచించినట్లు తెలిసింది. మండలం యూనిట్‌గా.. ఇప్పటివరకు జిల్లాను యూనిట్‌గా తీసుకొని మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతిలో లెసైన్సులు జారీ చేస్తున్నారు. కానీ కొత్త మద్యం విధానంలో మండలాన్ని యూనిట్‌గా తీసుకొని ఆ మండలంలోని జనాభా, గతంలో జరిగిన మద్యం అమ్మకాల రికార్డుల ఆధారంగా ఎ-4 మద్యం దుకాణాలను ఖరారు చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. అయితే మండలంలో ఒకటి లేదా రెండు మద్యం దుకాణాలకే అవకాశం ఉండడంతో.. పల్లెలకు కూడా సర్కారీ చీప్‌లిక్కర్ ఎలా చేరాలో అధ్యయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీనిపై మూడు రోజుల్లో ప్రతిపాదనలు రూపొందించి, అందించాలని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్‌కు సూచించినట్లు తెలిసింది. మండలంలో లెసైన్సు పొందిన మద్యం దుకాణదారుడే అనుబంధంగా బి-లెసైన్స్ పొంది ఆయా గ్రామాల్లో చౌక మద్యం విక్రయించేలా పాలసీని రూపొందించే అవకాశమున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. గ్రేటర్‌కు ప్రత్యేక పాలసీ దేశంలోని మెట్రో నగరాల సరసన చేరిన గ్రేటర్ హైదరాబాద్‌కు విడిగా మద్యం పాలసీని తీసుకురావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ‘పారిశ్రామిక, పర్యాటక రంగాలతో పాటు ఐటీలో దూసుకుపోతున్న హైదరాబాద్‌కు ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. వారికి అవసరమైన విదేశీ మద్యం స్టార్ హోటళ్లలో అందుబాటులో ఉండాలి. వైన్లోని మేలిమి రకం ఇక్కడ లభించడం లేదని పలువురు విదేశీ ప్రతినిధులు నాతో అన్నారు. అంతర్జాతీయ స్థాయి నగరంలో అదే ప్రమాణాలతో కూడిన మద్యం కూడా అందుబాటులోకి తేవాలి..’’ పేర్కొన్నారు. చెరువుల గట్లపై ఈతచెట్లు.. గత పాలకులు అవలంబించిన విధానాల వల్ల స్వచ్ఛమైన కల్లు స్థానంలో కల్తీకల్లు, మందు కల్లు మొదలైందని... మంచి కల్లు అందించాలంటే తాటి, ఈత వనాలు పెంచడమే మార్గమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో కల్తీకల్లు వల్ల ప్రజల మానసిక స్థితి దెబ్బతినే పరిస్థితి నెలకొంది. కల్తీకల్లు లేకుండా చేయాలి.. చెరువుల చుట్టూ, చెరువు కట్టల కింద విరివిగా ఈత చెట్లు పెంచాలి. వచ్చే ఏడాది చెరువుల వద్ద ఐదు కోట్ల ఈత మొక్కలు నాటి పెంచాలి. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలోనే నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలి. ఎక్సైజ్ శాఖకు ప్రత్యేకంగా ఇద్దరు డీఎఫ్‌వోలను కేటాయిస్తాం’’ అని తెలిపారు. రాష్ట్రంలో వినియోగమయ్యే మద్యం ఇక్కడే తయారయ్యేలా డిస్టిలరీస్ ఉండాలని, దాంతో ఇక్కడివారికి ఉద్యోగావ కాశాలు, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని కేసీఆర్ చెప్పారు. -
స్వచ్ఛమైన కల్లు అందిస్తాం: సీఎం కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కల్లు కాంపౌండ్ల ద్వారా కల్తీలేని స్వచ్ఛమైన కల్లు అందిస్తామని సీఎం కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ఇందుకోసం అవసరమైన చర్యలు చేపట్టవలసిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నూతన మద్యం విధానంపై శుక్రవారం సచివాలయంలో ఉన్నతస్థాయి అధికారులతో సీఎం సమీక్షాసమావేశం నిర్వహించారు. వచ్చే అక్టోబర్ నుంచి నూతన ఎక్సైజ్ పాలసీని అమలుచేయనున్నట్లు సీఎం ప్రకటించారు. గుడుంబాను అరికట్టడంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కొనసాగుతున్న మద్యం అక్రమ రవాణాపై దృష్టిసారించి, అరికట్టాలన్నారు. రాష్ట్రంలోని అన్ని చెరువుల గట్లమీద ఐదు కోట్ల ఈత చెట్లను నాటాలని నిర్ణయించినట్లు చెప్పారు. హైదరాబాద్ భిన్న సంస్కృతులకు నిలయమని, నగరంపై ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నామని వివరించారు. -
మద్యం రక్కసిపై మండిపడ్డ మహిళ
తాటిచెట్లపాలెం(విశాఖ): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఎక్సైజ్ పాలసీని వ్యతిరేకిస్తూ అఖిలభారత ప్రజాతంత్ర మహిళాసంఘం(ఐద్వా), ఏపీ మహిళా సమాఖ్య, పలు మహిళా సంఘాలు సోమవారం పెద్దఎత్తున నిరసన తెలిపాయి. స్థానిక పోర్టు హాస్పిటల్ నుంచి సాలగ్రామపురం పోర్టు హైస్కూల్ మీదుగా డీఎల్బీ కళ్యాణమండపం వరకు ప్రదర్శన నిర్వహించాయి. ‘షాపింగ్‌మాల్స్‌లో మద్యం అమ్మకాలా.. సిగ్గు సిగ్గు’ అంటూ మహిళలు ప్లకార్డులతో నినాదాలు చేశారు. ‘మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దు.. మాకు మంచి నీళ్లు ఇవ్వు బాబూ.. మద్యం దుకాణాలు కాదు’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ తరుణంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి సహా ఆందోళనలో పాల్గొన్న పలు మహిళా సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బి.ప్రభావతి మాట్లాడుతూ మద్యం వల్ల తల్లి, పిల్ల, చెల్లి అనే ఇంగితం లేకుండా మహిళలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈతరహా పాలసీకి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం దారుణమన్నారు. ఏపీ సమాఖ్య జిల్లా కార్యదర్శి విమల మాట్లాడుతూ మహిళల ఆగ్రహం చవిచూసిన ఏ ఒక్క నాయకుడూ ఎంతో కాలం అధికారంలో నిలవలేదని చంద్రబాబుని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నగర అధ్యక్ష, కార్యదర్శులు బి.పద్మ, ఆర్.ఎన్.మాధవి, ఎం.వి.పద్మావతి, సుజాత, పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పోలీసుల అత్యుత్సాహం మహిళా సంఘాల నేతలను అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు పలువురిపై చేయిచేసుకున్నారు. అరెస్ట్ చేసిన మహిళలను పోలీస్ వాహనాలలో పూర్తిగా ఎక్కించకుండానే వాహన డోర్లను గట్టిగా అదమడంతో కొందరు గాయాలపాలయ్యారు. తోపులాటలో కిందపడిన వారిని సైతం పోలీసులు వదిలిపెట్టలేదు. వారికి దెబ్బతగిలి రక్తస్రావం అవుతున్నా పట్టించుకోకుండా అలానే వారిని బలవంతంగా వాహనాల్లోకి నెట్టి తరలించారు. -
జూలై నుంచే అతిచౌక మద్యం!
♦ గుడుంబా స్థానంలో జిల్లాల్లో ప్రయోగాత్మక విక్రయాలకు ప్రణాళిక ♦ రూ. 30కే 180 ఎంఎల్ మద్యం అందించే ప్రయత్నం ♦ టెట్రా ప్యాక్, ప్లాస్టిక్ బాటిల్స్‌లో అందుబాటులోకి ♦ చీపెస్ట్ లిక్కర్ అందించేలా డిస్టిలరీలతో ఎక్సైజ్‌శాఖ ఒప్పందాలు ♦ సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఎక్సైజ్ నూతన విధానం ఖరారు సాక్షి, హైదరాబాద్ : పేదల జీవితాల్లో చిచ్చుపెడుతున్న గుడుంబా మహమ్మారిని తరిమికొట్టేందుకు సిద్ధమైన ఎక్సైజ్‌శాఖ అందుకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు రంగం సిద్ధం చేసింది. గుడుంబా తయారీ, విక్రయాలపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేస్తున్న అధికారులు... జూలై 1 నుంచి గుడుంబా స్థానంలో అతి చౌక మద్యాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో లభిస్తున్న చీప్ లిక్కర్ ధర 180 ఎంఎల్ సీసాకు రూ. 60కిపైగా ఉండగా, అందులో సగం ధరకే గుడుంబాకు ప్రత్యామ్నాయ మద్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. మహారాష్ట్రలో అక్కడి ఎక్సైజ్‌శాఖ ద్వారా విక్రయిస్తున్న దేశీదారు తరహాలో తక్కువ ధరకు మద్యం అందుబాటులోకి తెస్తే గుడుంబా తయారీ, విక్రయాలు నిలిచిపోతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు అధికార యంత్రాంగం ఈ విషయాన్ని తెలియజేసింది. ఆయన సూచన మేరకు చీపెస్ట్ లిక్కర్‌ను రాష్ట్రంలో ప్రవే శపెట్టే ఉద్దేశంతోనే జూలై 1 నుంచి అమలు కావాల్సిన నూతన మద్యం విధానాన్ని అక్టోబర్‌కు వాయిదా వేసిన ఎక్సైజ్‌శాఖ ఈ మూడు నెలల కాలంలో ప్రయోగాత్మకంగా చీపెస్ట్ లిక్కర్ రుచిని మందుబాబులకు చూపించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే కొన్ని డిస్టిలరీ కంపెనీలతో ఎక్సైజ్‌శాఖ, టీఎస్‌బీసీఎల్ అధికారులు చర్చలు జరిపారు. జూలై నుంచి మద్యం డిపోలకు చీపెస్ట్ లిక్కర్ సరఫరా అయ్యే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. గుడుంబా ప్రభావిత ప్రాంతాల్లో ప్రయోగం రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 2,111 మద్యం దుకాణాలు కొనసాగుతున్నాయి. వీటిలో జిల్లాలవారీగా గుడుంబా వినియోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా మండలాల పరిధిలోని మద్యం దుకాణాల్లో ఈ చీపెస్ట్ లిక్కర్‌ను అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఆ మండలాల పరిధిలో గుడుంబా ఉత్పత్తి కేంద్రాలన్నింటినీ పూర్తిగా తొలగించడంతోపాటు గ్రామాల్లో నిల్వ ఉన్న గుడుంబాను స్వాధీనం చేసుకొని ఈ చీపెస్ట్ లిక్కర్‌ను ప్రవేశపెడతారు. హాని కలిగించే గుడుంబాకు బానిసైన వారు ‘ఆరోగ్యకరమైన’ పద్ధతుల్లో డిస్టిలరీల్లో తయారైన ఈ మద్యాన్ని ఎలా ఆదరిస్తారనే విషయాన్ని సెప్టెంబర్ మొదటి వారంలోగా పరిశీలిస్తారు. ఈ చీప్ లిక్కర్ వల్ల మద్యం అమ్మకాల్లో తేడాలు, రెవెన్యూల్లో హెచ్చుతగ్గులతోపాటు మందుబాబుల ‘ఆరోగ్యాన్ని’ కూడా పరిగణనలోకి తీసుకొని సెప్టెంబర్ రెండో వారంలో నూతన మద్యం పాలసీని ఖరారు చేసే అవకాశం ఉందని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. చీపెస్ట్ లిక్కర్‌ను ప్రవేశపెట్టినా... గుడుంబా విక్రయాలు ఆగట్లేదని తేలితే ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించే అవకాశం ఉందని తెలుస్తోంది. కోల్‌బెల్ట్ ఏరియా... కార్మిక వర్గాలు నివసించే ప్రాంతాలు గుడుంబా విక్రయాలు అధికంగా సాగే ప్రాంతాల్లో సింగరేణి కోల్‌బెల్ట్ ఏరియా ముందు వరుసలో ఉంది. ఆ తరువాత వరుసలో ఇతర పారిశ్రామిక ప్రాంతాలు, గిరిజన తాండాలు, ఏజెన్సీ ఏరియాలు ఉన్నాయి. మంచిర్యాల, గోదావరిఖని, జగిత్యాల, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, రాజేంద్రనగర్, నల్లగొండ, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, గద్వాల, ధూల్‌పేట ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిల్లో గుడుంబా విక్రయాలు అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లోని వైన్‌షాపుల్లో తొలుత చీపెస్ట్ లిక్కర్‌ను అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. టెట్రా ప్యాక్, ప్లాస్టిక్ బాటిల్స్ ద్వారా 90 ఎంఎల్, 180 ఎంఎల్ పరిమాణాల్లో అందించాలని నిర్ణయించారు. -
అదే చుక్క.. అదే కిక్కు
‘కొత్తసీసా.. పాత సారా’ చందంగా నూతన మద్యం పాలసీ షాపుల కాలపరిమితి ఏడాది నుంచి రెండేళ్లకు పెంపు కార్పొరేషన్ పరిధిలో మైక్రో బ్రేవరీల ఏర్పాటు మెడికల్ అండ్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో జిల్లాకో డీ-ఎడిక్షన్ సెంటర్ గుంటూరు: ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం పాలసీని పరిశీలిస్తే ‘ కొత్త సీసాలో పాత సారా’ అన్న చందంగా కనిపిస్తోంది. నిన్నమొన్నటి వరకు తమిళనాడు, కర్ణాటక తరహా మద్యం విధానాన్ని తెస్తామని చెపుతూ వచ్చిన ప్రభుత్వం అకస్మాత్తుగా నిర్ణయాన్ని మార్చుకోవడం వెనుక అధికార పార్టీకి చెందిన మద్యం సిండికేట్ల ఒత్తిడి ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నూతన మద్యం విధానం మేరకు ఇక పల్లెల్లో మద్యం ఏరులై పారనుంది. గతంలో ఐదు శ్లాబ్లుగా విభజించి మద్యం దుకాణాలకు లెసైన్స్ ఫీజులు నిర్ణయించగా, ఈసారి ఏడు శ్లాబ్‌లకు పెంచి లెసైన్స్ ఫీజులు నిర్ణయించారు. గతంలో మాదిరిగానే లాటరీ విధానంలో షాపులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గత ఏడాది షాపు దక్కించుకున్న వారికి ఒక్క సంవత్సరం మాత్ర మే సమయం ఉండేది, ఈ సారి కాలపరిమితిని రెండేళ్లకు పెంచింది. ప్రతి కార్పొరేషన్ పరిధిలో మైక్రోబ్రేవరీలు ఏర్పాటుకు వీలుంటుంది. ఇది తెలుగు తమ్ముళ్లకు వరంగా మారనుందని భావిస్తున్నారు. లెసైన్స్ దుకాణాలను బట్టి 10 శాతం వరకు ప్రభుత్వ దుకాణాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీన్ని బట్టి చూస్తే జిల్లాలో ప్రభుత్వం 34 మద్యం దుకాణాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వ్యాపారులు సిండికేట్‌గా మారకుండా ఉండేలా ప్రతి మూడు దుకాణాల మధ్య ప్రభుత్వం ఓ మద్యం దుకాణం ఏర్పాటు చేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. మరో వైపు ప్రతి జిల్లా కేంద్రంలో మద్యానికి బానిసలు అయ్యే వారి కోసం మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ తరఫున ఉచిత డీ-ఎడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లాలో 342 మద్యం దుకాణాలు ఉండగా, ప్రస్తుతం అందులో 250 దుకాణాల వరకు అధికార పార్టీ నేతలకు చెందినవి కావడం, మిగతా వాటిని కూడా నయానో భయానో తమ సొంతం చేసుకుని మద్యం సిండికేట్ల హవా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఇందులో 29 దుకాణాలకు ఎవరూ దరఖాస్తు చేసుకోకపోవడంతో ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని గుంటూరు, నరసరావుపేట, తెనాలి పట్టణాల్లోని మద్యం డిపోల వద్ద ప్రభుత్వ అవుట్లెట్లు పెట్టి మద్యం విక్రయాలు జరపాల్సి ఉండగా, మద్యం సిండికేట్ దారుల ఒత్తిళ్లకు తలొగ్గి వాటిని తెరిచిన దాఖలాలు లేవు. మూడు దుకాణాలను తెరవలేని ఎక్సైజ్ అధికారులు జిల్లాలో 34 ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎలా నడపగలరో వేచి చూడాల్సిందే. -
మద్యం కొత్త పాలసీకి తాత్కాలిక బ్రేక్!
* 3 నెలల పాటు పాత విధానమే * అక్టోబర్ 1 నుంచి కొత్త విధానం సాక్షి, హైదరాబాద్: జూలై 1 నుంచి అమలు కావాల్సిన నూతన ఎక్సైజ్ విధానానికి బ్రేక్ పడింది. గుడుంబాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకొని, ప్రజల ఆరోగ్యానికి హాని కలగని రీతిలో మద్యం విధానం రూపొందించాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ మరో మూడు నెలల పాటు వాయిదా వేసింది. దీంతో కొత్త మద్యం విధానాన్ని అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. దీనికి సీఎం కూడా ఆమోదముద్ర వేశారు. ఈ నేపథ్యంలో జూన్ 30తో ముగియనున్న ప్రస్తుత మద్యం దుకాణాల లెసైన్స్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించాలని నిర్ణయించారు. గుడుంబాకు ప్రత్యామ్నాయంపై కసరత్తు గుడుంబాను రాష్ట్రం నుంచి తరిమేయాలనేది సీఎం సంకల్పం. గుడుంబాకు బానిసలైన పేద, మద్యతరగతి వర్గాలు, కార్మికుల ఆరోగ్యానికి హాని కలిగించని రీతిలో అధికారికంగా ప్రభుత్వం ద్వారానే తక్కువ ధరకు మద్యం అందించే అవకాశాలను పరిశీలించాలని సీఎం గతంలోనే అధికారులను ఆదేశించారు. దీంతో ఎక్సైజ్ అధికారులు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి మూడు నివేదికలు తయారు చేశారు. అందులో మొదటిది మహారాష్ట్ర తరహాలో ‘దేశీదారు’ తక్కువ ధర మద్యాన్ని దుకాణాల ద్వారా విక్రయించడం. రెండోది సారాయిని మళ్లీ ప్రవేశపెట్టి, వేలం ద్వారా 20 ఏళ్ల క్రితం నాటి విధానానికి అంకురార్పణ చేయడం. మూడోది ఇప్పుడున్న విధానాన్ని కొనసాగిస్తూ, గుడుంబా తయారీని అరికట్టి, పీడీ చట్టాలను ప్రయోగించడం. ఈ మూడు విధానాల వల్ల ప్రజలకు ఉపయోగం, రెవెన్యూ లాభనష్టాలపై కూడా నివేదికలు రూపొందించారు. ఈ మూడు విధానాల్లోనూ లోపాలు ఉండడంతో సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే ముందుగా గుడుంబా, అక్రమ మద్యాన్ని తరిమికొట్టి కొత్త విధానంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గుడుంబాపై సమరం షురూ! సీఎంతో సమావేశం తరువాత ఎక్సైజ్ అధికారులు మంత్రి పద్మారావుతో భేటీ అయి గుడుంబాను అరికట్టేందుకు తీసుకోవాల్కిన చర్యలపై చర్చించారు. ఎక్సైజ్, పోలీసు శాఖలకు సమాచారం లేకుండా గుడుంబా అమ్మకాలు సాగడం లేదని నిర్ధారణకు వచ్చిన ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి నుంచే గుడుంబా తయారీని అరికట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి ఆదేశాలు ఇవ్వడంతో ఎక్సైజ్ క మిషనర్ ఆర్.వి. చంద్రవదన్ గురువారం అన్ని జిల్లాల ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు, సూపరింటెండెంట్లతో సమావేశమయ్యారు. పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారంతో గుడుంబా, కల్తీమద్యంపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. -
మే 1 లోపు కొత్త మద్యం పాలసీ
కొత్త మద్యం పాలసీపై తాము అధ్యయనం చేస్తున్నామని, మే ఒకటో తేదీలోపే కొత్త పాలసీని ఖరారు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మే 4, 5 తేదీల్లో తాము కేరళ వెళ్లి అక్కడ అమలు చేస్తున్న విధానాన్ని కూడా అధ్యయనం చేస్తామన్నారు. పాత విధానాన్నే కొనసాగించాలా.. లేదా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించాలా అన్న విషయమై నిర్ణయం తీసుకోలేదని కొల్లు రవీంద్ర చెప్పారు. మే 6వ తేదీన బీసీ ఫెడరేషన్ నాయకులతో విజయవాడలో బీసీ సంక్షేమ శాఖ సంస్కరణలపై ఓ సదస్సు నిర్వహిస్తామన్నారు. -
బార్ల యజమానుల పిటిషన్‌ను కొట్టివేసిన కేరళ హైకోర్టు
కొచ్చి: కేరళలోని 418 బార్లను మూసివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కేరళ హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానం ప్రకటించిన నేపధ్యంలో ఆ రిట్‌కు విలువలేదని కోర్టు తెలిపింది. బార్ యజమానులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ కెటి శంకర్, జస్టిస్ పిడి రాజన్‌లతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ పరిశీలించింది. ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానం ప్రకటించినందున ఆ పిటిషన్‌కు విలువలేదని బెంచ్ కొట్టివేసింది. **