
మే 1 లోపు కొత్త మద్యం పాలసీ
కొత్త మద్యం పాలసీపై తాము అధ్యయనం చేస్తున్నామని, మే ఒకటో తేదీలోపే కొత్త పాలసీని ఖరారు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మే 4, 5 తేదీల్లో తాము కేరళ వెళ్లి అక్కడ అమలు చేస్తున్న విధానాన్ని కూడా అధ్యయనం చేస్తామన్నారు.
పాత విధానాన్నే కొనసాగించాలా.. లేదా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించాలా అన్న విషయమై నిర్ణయం తీసుకోలేదని కొల్లు రవీంద్ర చెప్పారు. మే 6వ తేదీన బీసీ ఫెడరేషన్ నాయకులతో విజయవాడలో బీసీ సంక్షేమ శాఖ సంస్కరణలపై ఓ సదస్సు నిర్వహిస్తామన్నారు.