
కేరళ హైకోర్టు
కొచ్చి: కేరళలోని 418 బార్లను మూసివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను కేరళ హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానం ప్రకటించిన నేపధ్యంలో ఆ రిట్కు విలువలేదని కోర్టు తెలిపింది.
బార్ యజమానులు దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ కెటి శంకర్, జస్టిస్ పిడి రాజన్లతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ పరిశీలించింది. ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానం ప్రకటించినందున ఆ పిటిషన్కు విలువలేదని బెంచ్ కొట్టివేసింది.
**