kerala high court
-
ఫిరాయిపులపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఫిరాయింపు రాజకీయాలపై కేరళ ఉన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక పార్టీపై గెలిచి.. మరో పార్టీలోకి వెళ్లాలనుకుంటే గనుక ముందుగా తమ పదవులకు రాజీనామా చేయాలని రాజకీయ నేతలకు సూచించింది.కూథట్టుకులమ్ మున్సిపల్ కౌన్సిలర్ కళా రాజును అపహరించి, దాడి చేసిన కేసులో ఐదుగురికి ఆ రాష్ట్ర హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా.. జస్టిస్ పివి కున్హికృష్ణన్ ఫిరాయింపులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులు వారిని ఎన్నుకున్న ప్రజల అభీష్టానికి కట్టుబడి ఉండాల్సిందేనని వ్యాఖ్యానించారాయన.‘‘ఒక ప్రతినిధి రాజకీయ విధేయతను మార్చుకోవాలనుకుంటే(పార్టీ మారాలనుకుంటే).. ఆ వ్యక్తి మొదట రాజీనామా చేయాలి. ఇది ప్రజాస్వామ్యంలో నైతిక కోణం. అప్పుడే ఓటర్ల నమ్మకాన్ని ఏకపక్షంగా విచ్ఛిన్నం చేయకుండా ఉంటారు. అలా జరగకుంటే.. ప్రజల ప్రజల అభీష్టాన్ని అవమానించడమే అవుతుంది. అలాంటి ప్రజాప్రతినిధిని తర్వాతి ఎన్నికల్లో ఓడించం ద్వారా ప్రజలు తమ సత్తా చాటగలరు. ప్రజాస్వామ్యానికి ఉన్న అందం అదే కూడా’’ అని న్యాయమూర్తి అన్నారు.ప్రస్తుత కేసులో.. ప్రజాస్వామ్యబద్ధంగా సమస్యను పరిష్కరించుకోకుండా ఇరు వర్గాలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రజాప్రతినిధిని ఓడించాలంటే అది ఎన్నికల ద్వారానే.. హింస ద్వారా కాదు అని కోర్టు వ్యాఖ్యానించింది.తెలంగాణలో బీఆర్ఎస్ మీద నెగ్గిన ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన వ్యహారం సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలకు ఇంకెంత టైం కావాలంటూ తెలంగాణ స్పీకర్‌పై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. అదే సమయంలో ఇటు.. కేరళ హైకోర్టు కూడా ఫిరాయింపులపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం విశేషం.కేసు ఏంటంటే..సీపీఎం కౌన్సిలర్‌గా నెగ్గిన కళా రాజు ఆ తర్వాత యూడీఎఫ్‌లో చేరారు. అయితే అవిశ్వాస తీర్మానం వేళ.. ఓటేయకుండా తనను అడ్డుకున్నారని, బలవంతంగా ఎత్తుకెళ్లి మరీ దాడికి పాల్పడ్డారని సీపీఎం నేతల మీద ఆరోపణలకు దిగారామె. ఆ ఆరోపణలను సీపీఎం ఖండించింది కూడా. అయితే ఈ ఘటనపై కళా రాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో 45 మందిపై కేసు నమోదు చేశారు. వాళ్లలో ఐదుగురు ముందస్తు బెయిల్ కోరగా.. షరతులతో మంజూరు చేసింది కేరళ హైకోర్టు. -
శరీరాకృతిపై వ్యాఖ్యలూ లైంగిక వేధింపులే
కొచ్చి: మహిళ రూపురేఖలను వర్ణిస్తూ ద్వంద్వార్థం ధ్వనించేలా వ్యాఖ్యలు చేసినా, ఎస్ఎంఎస్ సందేశాలు పంపినా లైంగిక వేధింపుల సెక్షన్ల కింద అవి నేరంగా పరిగణించబడతాయని కేరళ హైకోర్టు స్పష్టంచేసింది. ఒకే కార్యాలయంలో పనిచేసిన కాలంలో తోటి మహిళా ఉద్యోగిపై తాను చేసిన వ్యాఖ్యల కుగాను నమోదైన లైంగిక వేధింపుల కేసులను కొట్టేయాలంటూ కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డ్ మాజీ ఉద్యోగి చేసిన అభ్యర్థనను జస్టిస్ ఏ.బధారుద్దీన్ సారథ్యంలోని ధర్మాసనం కొట్టేసింది. ఎర్నాకులం జిల్లాలో కేఎస్ఈబీ ఆఫీస్‌లో పనిచేసిన కాలంలో 2013 ఏడాది నుంచి తనతో అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని, 2016–17 కాలంలో మొబైల్ ఫోన్‌కు తన రూపురేఖలను వర్ణిస్తూ ఎస్ఎంఎస్లు పంపారని, వాయిస్ కాల్స్ చేశారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఆ తర్వాత సైతం అతని నుంచి ఎస్ఎంఎస్లు, ఫోన్‌కాల్స్ ఆగలేదు. దీంతో భారత శిక్షాస్మృతిలోని 354(ఏ)(1)(4), 509 సెక్షన్లతోపాటు కేరళ పోలీస్ చట్టంలోని 120(ఓ) సెక్షన్ కింద సదరు ప్రభుత్వ ఉద్యోగిపై కేసు నమోదైంది. అందంగా ఉందని మాత్రమే ఎస్ఎంఎస్లు పంపానని, ఆ సందేశాల్లో ఎలాంటి తప్పుడు ఉద్దేశంలేదని అతని తరఫు న్యాయవాది చేసిన వాదనలను కోర్టు తిరస్కరించింది. లైంగిక వేధింపుల సెక్షన్లను తొలగించాలంటూ ఆ ఉద్యోగి వేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ జడ్జి తీర్పు చెప్పారు. -
‘సహజీవనంలో భాగస్వామిని అలా విచారించలేం’
సహజీవనంలో భాగస్వామిపై 498 కేసుకు సంబంధించి కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లివ్ ఇన్ రిలేషన్షిప్లో మహిళతో సహజీవనం చేసే వ్యక్తిని భర్తగా పరిగణించలేమని పేర్కొంది. మహిళ రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తిని భర్తగా భావించి సెక్షన్ 498 ప్రకారం క్రూరత్వం కింద విచారించలేమని స్పష్టం చేసింది.చట్టబద్ధంగా వివాహం చేసుకోని మహిళ తనతో రిలేషన్లో ఉంటున్న వ్యక్తి క్రూరత్వానికి పాల్పడినందుకు ఐపీసీ సెక్షన్ 498A కింద కేసు పెట్టలేమని హైకోర్టు వెల్లడించింది. ఈ మేరకు ఫిర్యాదు చేసిన మహిళతో రిలేషన్లో ఉన్న వ్యక్తిపై విచారణను రద్దు చేస్తూ గురువారం కోర్టు తీర్పునిచ్చింది.కాగా 2023 మార్చి నుంచి 2023 ఆగస్టు వరకు తాము లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న సమయంలో తన భాగస్వామి మానసికంగా, శారీరంగా వేధించాడని మహిళ ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించిన కేరళ హైకోర్టు భర్త అనే పదానికి నిర్వచనాన్ని చెబుతూనే, లివ్ ఇన్ పార్ట్నర్ని భర్తగా చూడలేమని చెప్పింది.సెక్షన్ 498A కింద నేరాన్ని నమోదు చేయాలంటే. భర్త లేదా భర్త బంధువులు క్రూరత్వానికి పాల్పడి ఉండాలని కోర్టు సూచించింది. మహిళతో చట్టబద్దంగా వివాహం జరిగిన వ్యక్తిని భర్తగా పరిగణిస్తారని తెలిపింది. చట్టబద్ధమైన వివాహం లేకుండా స్త్రీ భాగస్వామిని సెక్షన్ 498 ఏ క్రూరత్వం కింద విచారించలేమని చెప్పింది. -
ఎన్సీపీ ఎంపీ ఫైజల్‌పై అనర్హత వేటు
తిరువనంతపురం: లక్షద్వీప్ ఎంపీ ముహమ్మద్ ఫైజల్‌పై మరోసారి అనర్హత వేటు వేస్తూ కింద కోర్టు విధించిన తీర్పు ప్రకారం శిక్షను ఖరారు చేసింది కేరళ హైకోర్టు. కేంద్ర మాజీ మంత్రి సయ్యద్ అల్లుడు మహ్మద్ సలేహ్ హత్యాయత్నం కేసులో దోషిగా తేలడంతో ఈ ఉత్తర్వులపై స్టే విధించాలని మహ్మద్ ఫైజల్ హైకోర్టును కోరగా హైకోర్టు ఆయన అభ్యర్ధనను తిరస్కరించింది. జనవరి 11న ఎంపీ ఫైజల్ ఈ కేసులో దోషిగా తేలిన నాటి నుంచి ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటించింది. హత్యాయత్నం కేసులో మహ్మద్ ఫైజల్‌పై ప్రాథమిక సాక్ష్యాధారాలున్న నేపథ్యంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. శిక్ష అమలుపై స్టే విధించాలన్నది ఫైజల్ డిమాండ్. ఇప్పటికే ఈ కేసులో కవరతి సెషన్స్ కోర్టు పదేళ్ల శిక్ష విధించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం, ప్రజాప్రతినిధికి ఏదైనా నేరంలో రెండేళ్లకు మించి జైలుశిక్ష విధిస్తే ఆయన చట్టసభల సభ్యత్వానికి అనర్హుడవుతాడు. ఇది కూడా చదవండి: ట్రిపుల్ ఇంజిన్ సర్కార్‌లో ట్రబుల్ షురూ: సుప్రియా సూలే -
కోర్టులో నామకరణం
కొచ్చి: ఆ.. పేరులో ఏముందిలే అని కొందరు అనుకుంటారు కానీ ఆ పేరు కూడా ఒక ప్రహసనంగా మారిందని కేరళలో జరిగిన ఒక ఘటన నిరూపించింది. కన్నబిడ్డకు పేరు పెట్టడంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయిన తల్లిదండ్రులు కోర్టుకెక్కడంతో మూడేళ్ల వయసున్న వారి కుమార్తెకు కేరళ హైకోర్టు పేరు పెట్టాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కేరళకి చెందిన దంపతులు విభేదాలతో విడి విడిగా ఉంటున్నారు. తల్లి సంరక్షణలో వారి మూడేళ్ల వయసున్న కుమార్తె ఉంటోంది. ఆ పాప బర్త్ సర్టిఫికెట్లో పేరు లేదు. ఆ తల్లి కూతురికి పేరు పెట్టి సర్టిఫికెట్లో చేర్చాలని సదరు అధికారుల్ని సంప్రదిస్తే తల్లిదండ్రులిద్దరూ ఒకేసారి హాజరై పేరు చెబితే రిజిస్టర్ చేస్తామన్నారు. అప్పటికే విభేదాలతో దూరమైన దంపతులు పేరు విషయంలో కూడా రాజీకి రాలేకపోయారు. భార్య చెప్పిన పేరు భర్తకి, భర్త చెప్పిన పేరు భార్యకి నచ్చలేదు. కూతురు తన వద్దే ఉండడంతో తల్లి కోర్టుకెక్కింది. చివరికి కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బెచు కురియన్ థామస్ ఆ పాపకు పేరు పెట్టారు. పాప శ్రేయస్సు, తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలు, వారి సంస్కృతి, సామాజిక పరిస్థితులు అన్నీ పరిగణనలోకి తీసుకొని పేరు పెట్టినట్టు న్యాయమూర్తి వెల్లడించారు. కానీ ఏం పేరు పెట్టారో మాత్రం ఆయన బయటపెట్టలేదు. -
కోర్టులో ప్రియుడికి షాకిచ్చిన ప్రియురాలు
నాకు అతని మీద ఎలాంటి రొమాంటిక్ ఫీలింగ్స్ లేవు. కేవలం ఓ అన్నలాంటోడు. నేను వెళ్లిపోతే చచ్చిపోతాడేమోనని అతనితో ఇంతకాలం కలిసి ఉన్నా.. అంటూ కోర్టులో ఆ యువతి ఇచ్చిన స్టేట్మెంట్ షాక్‌తో ఆ ప్రియుడికి దిమ్మతిరిగిపోయింది. ఆ షాక్‌లోనే జడ్జి ఛాంబర్లోకి వెళ్లి కత్తితో మణికట్టు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సోమవారం కేరళ హైకోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. త్రిస్సూర్ జిల్లాకు చెందిన విష్ణు(31).. నెల రోజులుగా 23 ఏళ్ల యువతితో ఒకే గదిలో ఉంటూ సహజీవనం చేస్తున్నాడు. తమ ప్రేమకు పేరెంట్స్ ఒప్పుకపోవడంతో తాను ఇంటి నుంచి వచ్చేశానని ఆమె అతనితో చెప్పిందట. అయితే తన కూతురు కనిపించకుండా పోయిందంటూ ఆమె తండ్రి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. తన కూతురిని అక్రమంగా విష్ణు బంధించాడని పిటిషన్లో ఆరోపించాడాయన. దీంతో.. సోమవారం ఆ జంటను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే అప్పటిదాకా విష్ణు లేనిదే తాను ఉండలేనంటూ పోలీసులతో, మీడియా ముందు చెప్పుకొచ్చిన ఆ యువతి.. జడ్జి ముందు మాట మార్చింది. తనకు తన పేరెంట్స్ ముఖ్యమని, తాను తన కుటుంబంతోనే వెళ్లిపోతానని.. కేవలం విష్ణు మీద ఒక అన్నలా ఆప్యాయత ఉందేతప్ప మరేయితర ఫీలింగ్ లేదని, అతను బాగుండాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది. దీంతో డివిజన్ బెంచ్ యువతిని ఇష్టప్రకారంగా వెళ్లిపోవచ్చని సూచిస్తూ.. విష్ణుని మందలించింది. అయితే ఆ ఊహించని పరిణామంతో బోరున విలపిస్తూ బయటకు వెళ్లిపోయిన విష్ణు.. ఓ కత్తితో జస్టిస్ అను శివరామన్ ఛాంబర్‌కు వెళ్లాడు. తన మణికట్టు కోసుకుని ఏడ్వసాగాడు. న్యాయమూర్తి అప్రమత్తం చేయడంతో పోలీసులు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఎపిసోడ్లో ఇంకో కొసమెరుపు ఏంటంటే.. విష్ణుకు అప్పటికే వివాహం అయ్యింది. అయితే.. సదరు యువతితో రిలేషన్షిప్లో ఉన్నాడని తెలిశాక భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. -
కలిసి జీవిస్తే సరిపోతుందా?.. విడాకులెలా కోరతారు?
మన దేశ చట్టాల్లో భూతద్దం పెట్టి చూసిన దొరకని ‘సహజీవనం’ అనే బంధం గురించి ఆసక్తికరమైన తీర్పు ఒకటి వెలువడింది. సహజీవనంలో ఉన్న ఓ జంట విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కింది. అయితే చట్టం ప్రకారం అది పెళ్లి కానప్పుడు.. విడాకుల ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుందని ఓ జంటను ప్రశ్నించింది కేరళ హైకోర్టు. ఏ చట్టంలోనూ కలిసి ఉంటే పెళ్లి అని లేదు. ఇద్దరి మనసులు కలిసాయని సహజీవనం చేసేవాళ్లకు విడాకులు అడిగే హక్కే లేదు. కేవలం పర్సనల్, సెక్యులర్ చట్టం ప్రకారం వివాహం జరిగినప్పుడే దానికి గుర్తింపు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం కలిసి జీవించినా.. అది వివాహం కిందకు రాదని, విడాకులకు ఆస్కారం ఉండదని స్పష్టం చేసింది బెంచ్. చట్టం ప్రకారం ఒక్కటైన జంటలకు మాత్రమే విడాకులు తీసుకునే హక్కు మన చట్టాలు కల్పించాయని ఈ సందర్భంగా పిటిషనర్లకు కోర్టు గుర్తుచేసింది. 2006 నుంచి వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. పైగా తమ బంధానికి సంబంధించి ఒప్పంద పత్రం కూడా రాసుకున్నారు. ఓ బిడ్డనూ కన్నారు. ఈ క్రమంలో మనస్పర్థలతో విడిపోవాలని నిర్ణయించుకున్న ఆ జంట స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే.. చట్ట ప్రకారం వివాహం కానప్పుడు విడాకులు ఎలా ఇస్తామని ప్రశ్నిస్తూ పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు కొట్టేసింది. దీంతో ఫ్యామిలీ కోర్టు ఆదేశాల్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది ఆ జంట. చట్టం ప్రకారం సహజీవనానికి గుర్తింపు లేదు. కలిసి ఉండడానికి మీకు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. ఇప్పుడు విడిపోవడానికి చట్టం ప్రకారం ముందుకెళ్తున్నారు. ఇది వీలుకాని విషయం. చట్టంలోనూ అందుకు వెసులుబాటు లేదు అని జస్టిస్ ముహమ్మద్ ముస్తాఖ్, జస్టిస్ సోఫీ థామస్ నేతృత్వంలోని బెంచ్ తీర్పు ఇచ్చింది. ఇక ఈ కేసులో ఫ్యామిలీ కోర్టు తీరుపైనా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టం ద్వారా గుర్తించబడిన వివాహాలకు సంబంధించిన దావాలను మాత్రమే స్వీకరించే పరిధి ఫ్యామిలీ కోర్టులకు ఉందని, పై పిటిషన్‌ను విచారణకు తీసుకుని కొట్టేసే బదులు.. పిటిషన్ నిర్వహణ సాధ్యం కాదని ముందుగానే పిటిషన్‌ను తిరస్కరించి ఉండాల్సిందని, తద్వారా కోర్టు సమయం వృథా కాకుండా ఉండేదని హైకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఇది రూ.10 మర్డర్ కేసు.. చదివేయండి! -
నిజమెంత? నిజాయతీ ఎంత?
‘నిజజీవిత ఘటనల నుంచి ప్రేరణ పొంది తీశామ’ని అంటున్న సినిమాలో నిజాలు ఉంటాయనే ఆశిస్తాం. నిజాయతీగా ఉంటుందనే భావిస్తాం. కానీ అవే లోపిస్తే? శుక్రవారం విడుదలవుతున్న హిందీ చిత్రం ‘ది కేరళ స్టోరీ’ సరిగ్గా అవే ఆరోపణల్ని ఎదుర్కొంటోంది. విషయం మద్రాస్, కేరళ హైకోర్ట్‌ల మొదలు సర్వోన్నత న్యాయస్థానం దాకా వెళ్ళాల్సి వచ్చింది. దాదాపు 10 కట్స్‌తో సెన్సార్ బోర్డ్ పచ్చజెండా ఊపిన ఈ వివాదాస్పద చిత్ర ప్రదర్శనను ఆపడానికి కానీ, కనీసం ‘కల్పిత పాత్రలతో అల్లుకున్న కథ’ అని టైటిల్స్‌లో వేయడానికి కానీ గడచిన మూడు రోజుల్లో 3 సార్లు సుప్రీమ్ ససేమిరా అనడంతో, బంతి ఇప్పుడు థియేటర్లలోని ప్రజాకోర్టులో పడింది. ‘సంఘ్ పరి వార్ వారి అసత్యాల కర్మాగారంలో తాజా ఉత్పత్తి’ అంటూ కేరళ సీఎం ఈ చిత్రాన్ని గర్హించారు. కేరళలో జెండా పాతాలని ప్రయత్నిస్తున్న బీజేపీ మినహా ప్రతిపక్షాలూ ఆ మాటే అంటున్నాయి. బహిష్కరణ పిలుపుతో సహా కేరళ సర్కార్ వివిధ మార్గాలు అన్వేషిస్తున్న నేపథ్యంలో కల్పనను నిజమని నమ్మించే ప్రమాదభరిత సృజనాత్మక స్వేచ్ఛ విపరిణామాలపై కచ్చితంగా చర్చ అవసరం. ఏప్రిల్ ద్వితీయార్ధంలో ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ‘కేరళ స్టోరీ’ వివాదాలకు కేంద్రబిందువైంది. తీవ్రవాద ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రభావం పతాకస్థాయిలో ఉన్నవేళ కేరళ నుంచి ‘దాదాపు 32 వేల మంది స్త్రీలు’ కనిపించకుండాపోయారనీ, వారి తెర వెనుక కథల్ని ‘బహిర్గతం’ చేసే యత్నమే మత మార్పిడి అంశం ఇతివృత్తమైన ఈ చిత్రమనీ దర్శక, నిర్మాతల మాట. ‘లవ్ జిహాద్’లో భాగంగా 32 వేల మందినీ ముస్లిమ్‌లుగా మార్చి, అత్యధికులను ఐఎస్ పాలనలోని సిరియాకు తీసుకువెళ్ళారనేది ఈ చిత్ర వాదన. సాక్ష్యాధారాలు లేని ఈ కాకుల లెక్కతో కేరళను తీవ్రవాదానికి పట్టుగొమ్మ అన్నట్టు చిత్రించడంపై సహజంగానే అభ్యంతరాలు వెల్లువెత్తాయి. ఇది ముస్లిమ్‌లపట్ల ద్వేషం పెంచే దుర్మార్గ ప్రయత్నమనే వాదన బలపడింది. ‘లవ్ జిహాద్’ లేదని నాటి కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రే పార్లమెంట్లో చెప్పినప్పుడు కేరళపై బురద చల్లేలా ఇలాంటి సినిమా ఎలా తీస్తారన్నది ప్రశ్న. కేరళలో హిందువుల జనాభా దాదాపు 55 శాతమైతే, ఆ తర్వాత అత్యధికంగా ముస్లిమ్‌లు 26 శాతం పైగా, క్రైస్తవులు 18 శాతం ఉన్నట్టు లెక్క. దశాబ్దాల క్రితమే సంపూర్ణ అక్షరాస్యత సాధించి, నిత్యం చైతన్యం నిండిన ఆలోచనాపరుల సమాజంగా దేశంలో మలయాళ సీమది ప్రత్యేక స్థానం. సాహిత్యం, సంస్కృతి, కళలు, సినిమాలు సహా అనేక రంగాల్లో దిక్సూచిగా నిలిచిన ఘనత దానిది. మానవాభివృద్ధి సూచిలో ముందుంది. అలాంటి రాష్ట్రాన్ని పచ్చి తీవ్రవాదానికి పట్టుగొమ్మ అన్నట్టు చిత్రించడం కించపరచడమే. విమర్శలు పెరిగి, వివాదం ముదిరేసరికి సినీరూపకర్తలు సైతం సర్దు కోవాల్సి వచ్చింది. కేరళలోని ‘32 వేల మంది మహిళల కథల ఆధారంగా తీశా’మంటూ మొదట ట్రైలర్లో తొడకొట్టినవాళ్ళు చివరకు మే మొదట్లో దాన్ని ముగ్గురంటే ‘ముగ్గురు యువతులు’గా మార్చేశారు. కడుపులో ఏదో పెట్టుకొని కథ రాసుకున్నప్పటికీ కోట్లు పెట్టి సినిమా తీసినవారికి మూడుకూ, 32 వేలకూ తేడా తెలీదా? ఒకటీ అరా ఘటనలు జరిగాయేమో తెలీదు కానీ దాన్ని పట్టుకొని కేరళలోని ప్రబలమైన ధోరణి అన్నట్టు చిత్రించాలనుకోవడం ఏ రకంగా సమర్థనీయం? మొత్తం కేరళ కథ అన్నట్టు సినిమాకు పేరు పెట్టి, బురద జల్లడం ఎవరిచ్చిన సృజనాత్మక స్వేచ్ఛ? భావప్రకటన స్వేచ్ఛను కాపాడాల్సిందే. సృజనాత్మక స్వాతంత్య్రం కావాల్సిందే! కానీ ట్రైలర్‌ను బట్టి చూస్తే... వాస్తవాలను చూపుతున్నామనే పేరుతో, నిజాలను వక్రీకరించి సంచలనాత్మకం చేయడం ‘కేరళ స్టోరీ’లోని అతి పెద్ద ఇబ్బంది. ఇలా లెక్కలతో సహా అన్నిటినీ అతి చేస్తున్నప్పడు ఈ చిత్ర రూపకల్పన వెనుక ఉన్న ఉద్దేశాలపై, సాధించదలచిన లక్ష్యాలపై తప్పక అనుమానాలు తలెత్తుతాయి. పైగా, కేరళలో ముస్లిమ్, ముస్లిమేతరులుగా ప్రజలను రెండు ప్రత్యర్థి వర్గాలుగా ఏకీకృతం చేసే ప్రయత్నాలు పెరుగుతున్న సమయంలో సినిమా రావడం సందేహాల్ని పెంచుతోంది. ఆ మధ్య ‘పద్మావత్’ నుంచి ఇటీవలి ‘పఠాన్’ దాకా సినిమాలపై నిషేధపు డిమాండ్లు, కోర్టు కేసులు చూశాం. అప్పుడైనా ఇప్పుడైనా నిషేధాలు పరిష్కారం కావు. కానీ సెంటిమెంట్లను దెబ్బతీసి, ఉద్రి క్తత సృష్టించి, విద్వేషాన్ని పెంచే ప్రయత్నాలను తప్పక అడ్డుకోవాల్సిందే. శాంతిభద్రతలకు భంగం వాటిల్లినప్పుడు భావప్రకటన స్వేచ్ఛపై నిర్బంధాలు తప్పవని ఆర్టికల్ 19 (2) అనుమతిస్తోంది. శాంతిభద్రతలేమో కానీ, మనోఫలకంపై నిలిచి ఆలోచనల్లోకి ఇంకిపోయే భావోద్వేగాల ప్రభావమే అర్ధసత్య చిత్రాలతో అతి ప్రమాదం. బ్రిటిష్ వారి వద్దే మన్యం వీరుడు అల్లూరి పోలీసుగా పని చేశాడని భావితరాలు నమ్మేలా సినిమా తీసి, ఆస్కార్ల దాకా వెళ్ళిన మన కథలే అందుకు సాక్ష్యం. ‘కేరళ స్టోరీ’కీ కనీసం కల్పితపాత్రల కథనమని పేర్కొనమంటూ పిటిషనర్లు కోరిందీ అందుకే. సెకనుకు 24 ఫ్రేమ్‌ల చొప్పున తెరపై చూపే సత్యం సినిమా అనే సూక్తికి ‘కేరళ స్టోరీ’ లాంటివి నిలబడతాయా అన్నది సందేహమే! సామాన్య ప్రజలు తాము తెరపై చూసేదంతా సత్యమని భ్రమ పడితే, సమాజంలో పెచ్చరిల్లే విద్వేషాగ్నికి బాధ్యులెవరు? ‘కశ్మీర్ ఫైల్స్’తో దేశం ఆ చివరన మొద లైన అర్ధసత్య, అసత్య ప్రచార చిత్రాలు ఇప్పుడు ‘కేరళ స్టోరీ’తో ఈ చివరన కన్యాకుమారికి విస్తరించడం దేనికి సంకేతం? భావప్రకటన స్వేచ్ఛ ఓకే కానీ, నిజాన్ని వక్రీకరించి చూపడంపై గళమెత్తా ల్సిందే! ఈ రొచ్చుకు అడ్డుకట్ట ఏమిటో కనిపెట్టాల్సిందే! రాజకీయ ప్రయోజనాల కోసం సినిమాను వాడుకొనేందుకు పెరుగుతున్న ప్రాపగాండా ప్రయత్నాలను గమనించాలి. గత తొమ్మిదేళ్ళలో ఎన్నికల ముందే ఇలాంటి చిత్రాలు ఎందుకు, ఎవరి ప్రాపుతో వస్తున్నాయో ఆలోచించాలి. -
కాంతారకు బిగ్ షాక్ ఇచ్చిన కేరళ హైకోర్ట్
-
కాంతార టీంకు భారీ షాక్.. వరాహ రూపం సాంగ్‌పై నిషేధం!
కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం 'కాంతార'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ వరాహ రూపం పాటపై వివాదం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ బాణీని కాపీ కొట్టారంటూ కేరళకు చెందిన 'తైకుడం బ్రిడ్జ్' అనే మ్యూజిక్ బ్యాండ్ ఆరోపించింది. అంతేకాకుండా న్యాయపోరాటానికి కూడా దిగింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు కాంతారా చిత్ర బృందానికి షాకిచ్చింది. పాటపై నిషేధం వరాహ రూపం సాంగ్‌ను థియేటర్స్, డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ల్లో ఉపయోగించడంపై నిషేధం విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాట విషయంలో చిత్రబృందం ప్రాథమిక కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని పేర్కొంది. తైకుడం బ్రిడ్జ్‌కు చెందిన నవరసం నుంచి కాపీ కొట్టారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు మే 4లోగా అందజేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. అయితే గతంలో సినిమా నుంచి పాటను తొలగించాలన్న కేరళ హైకోర్టు ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అసలేం జరిగిందంటే ? కాంతార సినిమాలో వరాహ రూపం ఓ రేంజ్లో హిట్ అయింది. అయితే ఆ సాంగ్ బాణీని తాము రూపొందించిన 'నవరసం' నుంచి కాపీ కొట్టారంటూ కేరళకు చెందిన 'తైకుడం బ్రిడ్జ్' అనే మ్యూజిక్ బ్యాండ్ కోర్టును ఆశ్రయించింది. పాట ప్రదర్శన నిలివేయాలని పిటిషన్ దాఖలు చేసింది. -
కేరళ హైకోర్టులో మోహన్ లాల్‌కు చుక్కెదురు!
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌కు కోర్టులో చుక్కెదురైంది. కొంతకాలంగా ఆయనను ఏనుగు దంతాల కేసు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో పెరుంబవూరు మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మోహన్ లాల్ కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. బుధవారం ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు తనపై వేసిన ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకోవాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన పెరుంబవూరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును కొట్టివేయాలని కోరుతూ నటుడు మోహన్‌లాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. వివరాలు.. గతంలో ఐటీ శాఖ అధికారులు మోహన్ లాల్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో రెండు ఏనుగు దంతాలను గుర్తించారు. దాంతో వన్యప్రాణుల చట్టం ప్రకారం మోహన్ లాల్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్రమంగా ఏనుగు దంతాలను ఇంట్లో అలంకరణకు పెట్టుకొని చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. అయితే తాను చట్టప్రకారమే అనుమతులు తీసుకుని ఏనుగు దంతాలను ఇంట్లో పెట్టుకున్నట్లు ఇప్పటికే మోహన్ లాల్ కోర్టుకు వివరణ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసులో తమ అభిప్రాయాన్ని వెల్లడిచింది. ఆయన చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఆయన ఇంట్లో ఉన్నవి చనిపోయిన ఏనుగు దంతాలని చెప్పింది. ఆయన వాటిని చట్టప్రకారమే ఇంట్లో పెట్టుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం విచారణలో వెల్లడించింది. అయితే ప్రభుత్వ వైఖరిని మేజిస్ట్రేట్ కోర్టు తప్పుబట్టింది. అదే ఓ సామన్యుడు ఏనుగు దంతాలను కోనుగులు చేసి ఉంటే అతడికీ ఇలాంటి మినహాయింపే ఇస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మరోసారి వివరణ ఇవ్వాలని మేజిస్ట్రేట్ కోర్టును ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మేజిస్ట్రేట్ కోర్టుకు వ్యతిరేకంగా మోహన్ లాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. చదవండి: మరోసారి ఆ డైరెక్టర్‌కు అనుష్క గ్రీన్ సిగ్నల్? విశ్వనాథ్‌గారు నాపై అలిగారు, చాలా రోజులు మాట్లాడలేదు: జయసుధ -
లైంగిక వేధింపుల కేసులో ‘యశోద’ నటుడికి షాక్!
యశోద మూవీ నటుడు, మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్‌కు కేరళ హైకోర్టు షాకించ్చింది. లైంగిక వేధింపులు కేసులో అతడికి స్టే ఆర్డర్‌ను విత్ డ్రా చేస్తూ తాజాగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఉన్ని ముకుందన్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ యువతి 2018లో ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంఓ ఉన్ని ముకుందన్ తరపు న్యాయవాది ఈ కేసులో బాధిత యువతి సంతకం చేసినట్లు తప్పుడు పత్రాలను కోర్టుకు సమర్పించడంతో హైకోర్టు ఆమె ఫిర్యాదును కొట్టిపారేసింది. చదవండి: సరిగమప విన్నర్ యశస్వి కొండెపూడి మోసం.. స్పందించిన స్వచ్చంద సంస్థ అంతేకాదు ఈ కేసులో ఉన్ని ముకుందన్‌కు స్టే ఇచ్చింది. అయితే ఈ కేసులో తాను ఎలాంటి పత్రాలపై సంతకం చేయలేదని బాధిత యువతి కోర్టుకు స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో ఈ కేసులో ఉన్ని ముకుందన్‌కు ఇచ్చిన స్టే ఆర్డర్‌ను తాజాగా హైకోర్ట్ విత్ డ్రా చేసుకుంది. అంతేకాదు కోర్టుకు తప్పుడు పత్రాలను చూపించి కేసును తప్పుదోవ పట్టించాలని చూసిన వివాదాస్పద లాయర్ సాయిబీ జోస్ కిడంగూర్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది తీవ్రమైన చర్య అని, ఈ ఆరోపణలపై సమాధానాలు చెప్పాలని న్యాయవాదిని ఆదేశించింది. చదవండి: ఆ కామెంట్ నన్ను తీవ్రంగా బాధిస్తోంది: జాన్వీ కపూర్ ఆవేదన ఈ కేసులో ప్రత్యుత్తర అఫిడవిట్ దాఖలు చేయాలని ఉన్ని కృష్ణన్‌ను ఆదేశిస్తూ ఈ కేసు విచారణను ఈనెల 17కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది. కాగా ఈ కేసును కోర్టు బయటే పరిష్కరించేందుకు సదరు బాధిత యువతి అంగీకరిస్తున్నట్లుగా ఆమె సంతకం చేసిన పత్రాన్ని న్యాయవాది సాయిబీ జోస్ కోర్టు ఫేక్ డాక్యూమెంట్స్ సమర్పించినట్లు సమాచారం. దీంతో కోర్టు ఉన్ని కృష్ణన్‌కు ఈ కేసులో స్టే ఆర్టర్ ఇచ్చింది. అయితే తాను ఎలాంటి పత్రాలపై సంతకం చేయలేదని, అవి తప్పుడు పత్రాలని సదరు యువతి కోర్టుకు వాంగ్మూలంతో ఇవ్వడంతో కేరళ హైకోర్టు ఉన్ని కృష్ణన్, సదరు న్యాయవాదిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. -
కేరళ: విజయన్ సర్కార్‌కు ఎదురు దెబ్బ
తిరువనంతపురం: కేరళలో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వ వ్యవహారం మరో మలుపు తిరిగింది. హైకోర్టులో పినరయి విజయన్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఫిషరీస్ మరియు ఓషన్ స్టడీస్ యూనివర్సిటీకి వీసీని నియమించడాన్ని తప్పుబడుతూ ప్రభుత్వ ఆదేశాలను సోమవారం పక్కపెట్టింది ఉన్నత న్యాయస్థానం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) రెగ్యులేషన్స్ 2018 ను ఉల్లంఘించేదిగా ఆ నియామకం ఉందన్న హైకోర్టు డివిజన్ బెంచ్.. ఈ మేరకు యూజీసీ మార్గదర్శకాల ప్రకారం కొత్త వీసీని నియమించాలని ఛాన్స్లర్ ఆఫ్ వర్సిటీస్ అయిన గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్‌ను ఆదేశించింది. కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ మరియు ఓషన్ స్టడీస్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా ఈమధ్యే డాక్టర్ రిజీని నియమించింది కేరళ ప్రభుత్వం. అయితే ఆ నియామకం చెల్లుబాటు కాదని, యూజీసీ మార్గదర్శకాలను ఉల్లంఘించేదిగా ఉందని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ మణికుమార్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ఇక.. ఏపీజే అబ్దుల్ కలాం టెక్నాలజీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ నియామకాన్ని సైతం సుప్రీంకోర్టు తన దేశాలతో రద్దు చేసింది. యూజీసీ రూల్స్ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ కమిటీ మూడు పేర్లను గవర్నర్‌కు ప్రతిపాదనగా పంపాల్సి ఉంటుంది. అయితే కలాం యూనివర్సిటీకి మాత్రం ఒకే ఒక్క పేరు ప్రతిపాదించింది కేరళ ప్రభుత్వం. ఆపై తొమ్మిది యూనివర్సిటీల వీసీలను తప్పుకోవాలని గవర్నర్ ఆరిఫ్ ఖాన్ ఆదేశించడం.. కేరళ ప్రభుత్వంతో జరుగుతున్న జగడం తెలిసిందే. ఈ నెల ప్రారంభంలో, గవర్నర్‌ను విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా తొలగించడానికి ఆర్డినెన్స్ తీసుకురావడానికి కేరళ రాష్ట్ర కేబినెట్ ఓటు వేసింది. -
రాహుల్ గాంధీకి భారీ షాక్.. ‘భారత్ జోడో యాత్ర’పై పిటిషన్!
తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీని తిరిగి గాడినపెట్టేందుకు ‘భారత్ జోడో యాత్ర’ పేరిట పాదయాత్ర చేపట్టారు రాహుల్ గాంధీ. కొద్ది రోజులుగా కేరళలో యాత్రకు మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీకి షాక్ తగిలింది. భారత్ జోడో యాత్ర వల్ల రాష్ట్రంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని, నియంత్రించాలంటూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేరళలో ఈనెల 11వ తేదీన మొదలైన యాత్ర 18 రోజుల పాటు సాగనుంది. భారత్ జోడో యాత్రను రోడ్డుకు ఒకేవైపు ఉండేలా రెగ్యూలేట్ చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు పిటిషనర్, న్యాయవాది కే విజయన్. యాత్రను రోడ్డుకు ఒకవైపు అనుమతించి, రెండోవైపు ట్రాఫిక్ వెళ్లేలా చూడాలన్నారు. భారత్ జోడో యాత్ర కారణంగా ఇటీవల జాతీయ రహదారిని నాలుగు గంటల పాటు మూసివేశారని, దాంతో సామాన్య ప్రాయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే.. ఈ యాత్ర కోసం భారీగా పోలీసులను మోహరించారని, ఆ ఖర్చు మొత్తం కాంగ్రెస్ పార్టీ బరించాలని, ప్రజల సొమ్మును వినియోగించకుండా చూడాలని కోరారు. కేరళ ప్రజా రహదారుల చట్టం 2011ను ఈ యాత్ర ఉల్లంఘిస్తోందని సూచించారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి. ఇదీ చదవండి: దేశ ప్రజల్లో బీజేపీ విద్వేషాన్ని వ్యాపింపజేస్తోంది: రాహుల్ -
‘భార్యంటే.. వాడుకుని వదిలేసే వస్తువు కాదు’
ఆయనకు పెళ్లైంది. ముగ్గురు పిల్లలు. కానీ, మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను మానసికంగా హింసించాడు. అయితే ఇది ఇంతటితో ఆగలేదు. భార్యను శాశ్వతంగా వదిలించుకుని ప్రియురాలికి దగ్గరయ్యేందుకు ‘విడాకుల’నే మాస్టర్ ప్లాన్ వేశాడు. పైగా భార్య తనపై దాడి చేసిందంటూ ‘వైవాహిక క్రూరత్వం’ కారణంగా చూపించాడు. మరి న్యాయస్థానం ఈ కేసులో ఎలాంటి తీర్పు ఇచ్చిందంటే.. వివాహ బంధం.. ఏదో వస్తువును కొనుక్కున్నట్లు కాదు. భార్యంటే వాడుకుని వదిలేసే వస్తువు కాదు. మన సంప్రదాయం అది కానే కాదు. ఇప్పటి యువతరం మనస్తత్వాన్ని, పాటిస్తున్న ఆచార వ్యవహారాలను, సంప్రదాయపు అంశాలను పరిగణనలోకి తీసుకునే మేం ఈ వ్యాఖ్యలు చేస్తున్నాం. కొత్త తరం దాదాపుగా.. పెళ్లంటే ఒక అరిష్టంగా భావిస్తోంది. సహజీవన సంప్రదాయం పెరిగిపోతోంది. ఇది సమాజపు మనస్సాక్షిని ఇబ్బందికి గురి చేస్తోంది. WIFE అంటే.. ఈరోజుల్లో.. అంతా పెళ్లిని ఒక ‘చేదు’ అనుభవంగా భావిస్తున్నారు. వ్యక్తిగతంగా స్వేచ్ఛ జీవితానికి, బాధ్యతలకు, విధులకు పెళ్లి ఒక ఆటంకంగా మారిపోయినట్లు ఫీలైపోతున్నారు. ఒకప్పుడు వైఫ్ అంటే Wise Investment For Ever అనే అర్థం ఉండేది. ఇప్పుడది Worry Invited For Everగా మారిపోయింది. 'యూజ్ అండ్ త్రో' అనే వినియోగదారుల సంస్కృతి మన వివాహ సంబంధాలను కూడా ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది. విడిపోయినప్పుడు వీడ్కోలు చెప్పుకోవడానికే.. లివ్-ఇన్-రిలేషన్షిప్స్ అన్నచందాన మారిపోయింది పరిస్థితి. విడాకులతో నాశనం కాబడ్డ కుటుంబాల ఆర్తనాదాలు మొత్తం సమాజం మనస్సాక్షిని కదిలించే శక్తి ఉంది. విడాకుల కోసం కోర్టుకెక్కిన జంటలు, విడాకుల తర్వాత పిల్లలను విడిచిపెడుతున్నవాళ్లు, విడాకులు తీసుకున్నవారు.. పెరిగిపోతున్నప్పుడు.. కచ్చితంగా అది సామాజిక జీవితంలోని ప్రశాంతతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు అని కేరళ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేసు ఏంటంటే.. కేరళ అలపుజ్జాకు చెందిన జంటకు సౌదీ అరేబియాలో స్థిరపడింది. 2009లో వివాహం జరగ్గా.. 2018లో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకు వెళ్లాడు భర్త. తన భార్య తనపై దాడి చేసిందని, క్రూరత్వం కింద తనకు విడాకులు ఇప్పించాలని కోరాడతను. అయితే.. 2017 నుంచి ఓ మహిళతో తన భర్త వివాహేతర సంబంధం నడిపిస్తున్నాడని, ప్రశ్నించినందుకే ఇలా తన నుంచి విడిపోవాలనుకుంటున్నాడని సదరు భార్య వాదనలు వినిపించింది. ఈ క్రమంలో భార్య క్రూరత్వాన్ని నిరూపించే సాక్ష్యాలు, ఆధారాలు లేకపోవడంతో క్ట్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్.. డైవోర్స్ యాక్ట్ 1869 ప్రకారం.. ఫ్యామిలీ కోర్టు ఆ భర్త దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఆ భర్త హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ట్విస్ట్ ఏంటంటే.. అతని తల్లి మాత్రం కోడలి వైపే నిలబడింది. తన కొడుకు కోడలు, వాళ్ల పిల్లలతో మంచిగా బతకాలని పోరాడింది. మరోవైపు భార్య(38) కూడా తన భర్త వివాహేతర సంబంధాన్ని వదులకుని తనతో సంతోషంగా ఉంటే చాలనుకుంటోంది. దీంతో ఈ మొత్తం అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేరళ హైకోర్టు బెంచ్.. పైన చెప్పిన విధంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్న విషయాన్ని నొక్కి మరీ చెప్పి.. విడాకుల పిటిషన్‌ను తిరస్కరించింది. అంతేకాదు.. భార్యతో సజావుగా కాపురం చేసుకోవాలని సదరు భర్తకు సూచిస్తూ డివిజన్ బెంచ్ జస్టిస్ ముహమ్మద్ ముస్తాక్యూ, జస్టిస్ సోఫీ థామస్‌లు కీలక వ్యాఖ్యలతో ఆగస్టు 24వ తేదీన తీర్పు ఇచ్చారు. ఇదీ చదవండి: డాక్టర్ కోసం పడిగాపులు.. కన్నతల్లి ఒడిలోనే పసికందు మృతి -
తాజా తీర్పు: పోల్చి తిడితే ఇంతే సంగతులు
భర్తల నోటికి తాళం. భార్యల వేదనకు ఈ తీర్పు ఒక అవసరం. ఇరుగింటామెతోనూ పొరుగింటామెతోనూ సినిమా హీరోయిన్‌తోనూ పోల్చి భార్యను చులకన చేస్తే సూటిపోటి మాటలంటే అది ‘మానసిక క్రూరత్వం’ కిందకే వస్తుందని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అటువంటి భర్తతో కాపురం చేయనవసరం లేదని విడాకులు మంజూరు చేసింది. గతంలో ముంబై ఫ్యామిలీ కోర్టు కూడా ‘ఆ నువ్వు పెద్ద మగాడివని’ లాంటి గుచ్చే మాటలు మాట్లాడే భార్య నుంచి విడాకులు ఇప్పించింది. భార్యాభర్తలు ఇలాంటి మాటలు అనుకోవడం ఎందుకు? భార్యను చులకన చేయడం భర్తకు సమాజం నుంచి కుటుంబం నుంచి అంగీకారం పొందిన విషయంగా అనిపిస్తుంది. సినిమాల్లో పాత్రలు, టీవీల్లో స్కిట్లు భార్యను భర్త నానా విధాలుగా హేళన చేయడం చూపిస్తూనే ఉంటాయి. ‘మసిబొగ్గులా ఉన్నావు’, ‘బోండాంలా ఉన్నావు’, ‘నిన్ను చేసుకునే బదులు అడవిలో మొద్దును చేసుకుని ఉంటే నయం’, ‘ఏదో ఒక మాయలో పడినట్టుగా నిన్ను చేసుకున్నాను. కాని నీలో ఏ ఆకర్షణ లేదు’, ‘ఆ ఎదురింటామెను చూడు ఎంత అందంగా ఉందో’, ‘ఇదంతా నా ఖర్మ’... ఇలాంటి మాటలు భర్త మాట్లాడితే భార్య లోలోపల బాధ పడటమో తిరిగి తగాదా పడటమో చేస్తూ ఉంటుంది. కాని ‘ఇది అవసరమా నాకు’ అని భార్య అనుకుంటే విడాకులు మంజూరు చేయడానికి ఈ కారణం సరిపోతుందని తాజాగా కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కేరళ హైకోర్టు బెంచిలో జస్టిస్ కె.నరేంద్రన్, సి.ఎస్.సుధ ఈమేరకు తీర్పు వెలువరించారు. ఏమిటి కేసు? కేరళలో ఒక జంట 2009లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు ఆమెకు 26. అతనికి 29. పెళ్లయిన తర్వాత భర్త కొత్త పెళ్లికూతురు అని కూడా చూడక వెంటనే ఇతర స్త్రీలతో పోల్చసాగాడు. ‘నీకన్నా ఆమె బాగుంది’, ‘ఆమెకున్న మంచి జుట్టు నీకు లేదు’ లాంటి కామెంట్లు చేసేవాడు. అతని తమ్ముడు పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే పెళ్లిచూపులకు అన్నగా హాజరయ్యి భార్యతో ‘నా తమ్ముడు అదృష్టవంతుడు. మంచి అమ్మాయిలను వెతుకుతున్నాడు’ లాంటి కామెంట్లు చేసేవాడు. దాంతో ఆమె కనీసం ఆరునెలలు కూడా అతనితో కాపురం చేయలేకపోయింది. జనవరిలో పెళ్లయితే నవంబర్‌లో విడాకులకు ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసింది. ఫ్యామిలీ కోర్టు ‘లైంగిక దూరాన్ని’ కారణంగా చూపుతూ విడాకులు మంజూరు చేసింది. దాని మీద భర్త హైకోర్టుకు అప్లయి చేశాడు. కేరళ హైకోర్టు కూడా తాజాగా విడాకులే సబబైనవిగా తీర్పు ఇచ్చింది. మానసిక క్రూరత్వం ఈ కేసులో విడాకులకు కనిపించే సగటు కారణాల కన్నా భర్త తన భార్యను ఇతర స్త్రీలతో పోల్చుతూ చిన్నబుచ్చడాన్నే హైకోర్టు ప్రధాన కారణంగా తీసుకుంది. దానిని ‘మానసిక క్రూరత్వం’గా వ్యాఖ్యానించింది. అలాంటి క్రూరత్వంతో బంధం నిలవదు అని చెప్పింది. ‘వారు మంచి వయసులో ఉన్న జంటే అయినా ఈ కేసు కొనసాగిన ఇన్నేళ్లుగా తిరిగి కలవలేదు. భాగస్వాములలో ఒకరు విడాకులకు దరఖాస్తు చేసి, ఏళ్ల తరబడి ఇద్దరూ విడిగా ఉండగా ఆ పెళ్లి కుటుంబాలకు, సంఘానికి చెప్పుకోవడానికి ఉంటుందిగాని నిజంగా మనలేదు’ అని విడాకులు మంజూరు చేసింది. భర్తను చిన్నబుచ్చినా అంతే! అయితే 2013లో ముంబై ఫ్యామిలీ కోర్టులో భర్త తరఫు నుంచి ఇటువంటి తీర్పే ఇచ్చింది. భార్య భర్తను ‘నువ్వు పెద్ద మగాడివిలే’, ‘నేను సరిగా ఏడ్చి ఉంటే మావాళ్లు నీకంటే తెలివైన, మంచి కుటుంబం నుంచి కుర్రాణ్ణి వెతికి ఉండేవారు’, ‘నాకు నువ్వు ఏమాత్రం సరి తూగవు’ లాంటి మాటలతో బాధించేది. అప్పటికి వారికి పెళ్లయి పదేళ్లు. ఇద్దరు పిల్లలు. కాని భర్త అలసిపోయి ఆఫీసు నుంచి వస్తే ‘ఒక ముద్దు ముచ్చట లేదు. మగాడివైతేగా’ వంటి మాటలతో బాధించేది. ఏమైనా అంటే ‘ఉరేసుకుని చస్తా’ అని బెదిరించేది. ఈ మాటలన్నింటినీ కోర్టు ‘మానసిక క్రూరత్వం’గా పరిగణించి విడాకులు ఇచ్చింది. ముఖ్యంగా ‘ఆత్మహత్య బెదిరింపులు’ భర్తకు నరక ప్రాయం అవుతాయని వ్యాఖ్యానించింది. ఎందుకు ఈ మాటలు? భార్యాభర్తల మధ్య ప్రేమ, స్నేహం, గౌరవం, సర్దుబాటు ధోరణి, అవగాహన, అర్థం చేసుకోవడం, బలహీనతలను గుర్తించడం, ఎదుటివారికి ఏ పని నచ్చదో దానిని వదలిపెట్టడం... ఇవన్నీ ఉంటే తప్ప కాపురం సజావుగా సాగదు. పెళ్లయ్యాక ఒకరికొకరు సరిపడరు అని అనుకుంటే విడిపోవడం లేదా మౌనంగా కొనసాగడం మేలు. కాని మాటలు చాలా గాయం చేస్తాయి. నిజానికి అవి వంటి మీద పడే దెబ్బల కంటే తీవ్రమైనవి. మాటలతో హింసించి సంతృప్తి పడదామంటే కాలక్రమంలో ఆ బంధం మరింత పలుచనవుతుంది తప్ప గట్టి పడదు. కాబట్టి తిడితే ఏమవుతుందిలే అని భార్య/భర్త అనుకోవద్దు. విడాకులకు అవి చాలు. -
Kerala High Court: ఆమె పేరు చాలదా!
ఇది చరిత్రాత్మక ఆదేశం. కంటికీ, మనసుకూ ఉన్న పొరలు తొలగించుకొని, అందరినీ సమానంగా చూడమని కోర్టు మరోసారి చెబుతున్న ఉపదేశం. కుంతీపుత్రులంటూ చిన్నచూపు చూస్తూ, బురద జల్లడం అమానవీయమన్న సామాజిక సందేశం. అవును. కేరళ హైకోర్ట్ గత వారమిచ్చిన ఉత్తర్వులు ఇలా అనేక విధాల ఆదర్శప్రాయమైనవి, అనుసరణీయమైనవి. పెళ్ళి కాని తల్లుల, లైంగిక అత్యాచార బాధితుల సంతానానికి సైతం ఈ దేశంలో స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సగౌరవంగా, వ్యక్తిగత గోప్యతకు భంగం లేకుండా జీవించే ప్రాథమిక హక్కులు ఉన్నాయని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. జనన ధ్రువీకరణ పత్రం, వ్యక్తిగత గుర్తింపు, తదితర పత్రాలన్నిటిలో తల్లి పేరు రాస్తే చాలనీ, తండ్రి పేరు రాయాల్సిన అవసరం లేదనీ ఒకరికి అనుమతినిస్తూ, ఇలాంటి వారిని ‘నవ యుగ కర్ణులు’గా పేర్కొంది. పౌరుల హక్కులను మరోసారి గుర్తు చేస్తూ హైకోర్ట్ ఇచ్చిన ఈ ఆదేశం కొత్తది కాకున్నా కీలకమైనది. సమాజపు ఆలోచనలో రావాల్సిన మార్పు పట్ల ఆలోచన రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు చేసిన తప్పుతో నిగూఢ పరిస్థితుల్లో మైనర్‌గా ఉన్నప్పుడే తాను గర్భవతినయ్యాననీ, పెళ్ళి కాని తల్లిగా, తనకు పుట్టిన బిడ్డగా తాను, తన కుమారుడు ఇవాళ తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నామంటూ ఒక అమ్మ వెలిబుచ్చిన ఆవేదనకు ఫలితమిది. తండ్రి ఎవరో తెలియని అనిశ్చితితో కుమారుడి గుర్తింపు పత్రాల్లో తండ్రి పేరు మూడు చోట్ల మూడు రకాలుగా ఉందనీ, దాని బదులు తనను సింగిల్ పేరెంట్‌గా గుర్తించాలనీ, తమకు ఈ మానసిక క్షోభ నుంచి రక్షణ కల్పించాలనీ ఆమె కోర్టు మెట్లెక్కారు. ఈ కుంతీ విలాపం కోర్టు విన్నది. బర్త్ రిజిస్టర్లో తండ్రి పేరు తొలగించి, ఒంటరి తల్లిగా అమ్మ పేరుతోనే తనకు బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలన్న ఆ కొడుకు వాదన న్యాయమేనంది. ఆ కేసులో జూలై 19న కేరళ హైకోర్ట్ ఆదేశం ఇవాళ దేశవ్యాప్త వార్త అయింది. కుంతీపుత్రులైనంత మాత్రాన పిల్లల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించ లేరనీ, వారి వ్యక్తిగత జీవితంలోకి జొరబడరాదనీ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ కుండ బద్దలు కొట్టారు. అందుకు 2015 నాటి సుప్రీమ్ కోర్ట్ చరిత్రాత్మక తీర్పునూ ఆసరాగా చేసుకున్నారు. నిజానికి, పిల్లల కన్నతండ్రి ఎవరో బహిర్గతం చేయాలంటూ ఒంటరి తల్లులను నిర్బంధించరాదు. 2015లోనే భారత సర్వోన్నత న్యాయస్థానం ఆ మేరకు అపూర్వమైన తీర్పు ఇచ్చింది. తదనుగుణంగా ఒంటరి తల్లులకూ, పెళ్ళి కాని తల్లులకూ పుట్టిన సంతానానికి బర్త్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నప్పుడు వారి తండ్రి ఎవరో చెప్పమంటూ బలవంతం చేయరాదని కేంద్ర హోమ్ శాఖ చాలాకాలం క్రితమే జనన, మరణ ధ్రువీకరణ జారీ చేసే రిజిస్ట్రార్లు అందరికీ లేఖ కూడా రాసింది. ఒంటరి తల్లుల అఫిడవిట్ చాలు... నిరభ్యంతరంగా బర్త్ సర్టిఫికెట్ జారీ చేయవచ్చని స్పష్టం చేసింది. అయితే, క్షేత్రస్థాయిలో ఈ ఆదేశాలు ఏ మేరకు అమలవుతున్నాయన్నది ప్రశ్నార్థకమే. కేరళ హైకోర్ట్ ఇప్పుడు మళ్ళీ ఆ సుప్రీమ్ కోర్టు తీర్పునూ, హోమ్ శాఖ లేఖనూ ప్రస్తావిస్తూ తాజా ఆదేశాలివ్వడం గమనార్హం. అలాగే, తండ్రి పేరు, వివరాలు చెప్పాల్సిన ఆవశ్యకత లేకుండా, అలాంటి గడులేమీ లేని పత్రాన్ని విడిగా తీసుకురావాలని కేరళ ప్రభుత్వానికి గతంలోనే కోర్ట్ ఉత్తర్వులిచ్చింది. వీటన్నిటినీ గుర్తు చేస్తూ, పిల్లల, తల్లుల తీవ్ర మానసిక వేదనను అర్థం చేసుకుంటూ కేరళ హైకోర్ట్ ధర్మాసనం తాజా కేసులో ఆదేశాలివ్వడం విశేషం. ఒంటరి తల్లులకూ, వారి పిల్లలకూ ఇది మరోసారి ఊరట! పౌరులందరినీ సంరక్షించడం, వారందరినీ గౌరవంగా, సమభావంతో చూసేలా చూడడం దేశం భుజస్కంధాలపై ఉంది. కానీ, చాలా సందర్భాల్లో అటు ప్రభుత్వం, ఇటు సమాజంలో చక్రం తిప్పేవారందరూ ఆ వాగ్దానాన్నీ, బాధ్యతనూ విస్మరించడమే విషాదం. అలనాటి మహాభారత ఇతిహాసంలోని కర్ణుడి కథ నుంచి నేటి నవయుగ కుంతీకుమారుల వరకు అందరిదీ ఇదే అనుభవం. పెళ్ళి కాని తల్లులకూ, లైంగిక అత్యాచార బాధితులకూ పుట్టిన పిల్లలంటే దురదృష్టవశాత్తూ ఇవాళ్టికీ సమాజానికే కాదు... ప్రభుత్వానికీ లోకువే. ఆ తల్లులపై, పిల్లలపై కళంకితులనే ముద్ర వేయడం అందరికీ అలవాటే. ఈ సమస్యను గుర్తించింది గనకే, తండ్రి పేరు చెప్పాలంటూ ప్రభుత్వ సంస్థలు బలవంతం చేయరాదని 2015లోనే సుప్రీమ్ కోర్ట్ తీర్పు చెప్పింది. అయినా, ఇవాళ్టికీ అది పకడ్బందీగా ఆచరణలోకి రాకపోవడం విషాదం. అమ్మను మించిన దైవం లేదనే సంస్కృతికి వారసులమంటాం. తీరా అమ్మ పేరు రాస్తే చాలదని, తండ్రి పేరూ చెప్పాల్సిందే అనడం ఎలా సమర్థనీయం? ఏళ్ళు గడిచినా, తరాలు మారినా పితృస్వామ్య భావజాలంలోనే మునిగితేలే మానసిక రుగ్మతకు ఇది ప్రతీక. మహాభారత కుంతీ కుమారి కాలం నాటి భావాలకే దాస్యం చేయడం ఆధునిక సమాజానికి నప్పని అంశం. అభ్యుదయాన్ని కాంక్షించేవారెవరూ ఒప్పుకోని విషయం. అవతలివారి వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూసి, వారిని లోకువగా జమకట్టే హక్కు ఎవరికీ లేదు గాక లేదు. కేరళ హైకోర్ట్ ఆదేశం కొత్తదేమీ కాకపోయినా, తల్లుల, పిల్లల హక్కులను ప్రభుత్వానికీ, సమాజానికీ మళ్ళీ గుర్తు చేసింది. జన్మకు కారణమైన తండ్రి కన్నా, నవమాసాలూ మోసి, జన్మనిచ్చిన అమ్మ ఎప్పుడూ ఒక మెట్టు పైనే అని మాటలు చెప్పే మనం ఇకనైనా మారాలి. కనిపెంచిన అమ్మను కనిపించే దేవతగా గుర్తింపు పత్రాల్లోనూ అంగీకరించాలి. దానికి ఇంకెన్ని కోర్టులు ఆదేశాలివ్వాలంటారు!? -
చిక్కుల్లో నటుడు దిలీప్.. హైకోర్టు షాక్
మలయాళ స్టార్ నటుడు దిలీప్‌కు కేరళ హైకోర్టు షాక్ ఇచ్చింది. తనకు వ్యతిరేకంగా దాఖలైన హత్య కుట్ర కేసును కొట్టేయాలంటూ దిలీప్ దాఖలు చేసిన అభ్యర్థన పిటిషన్‌ను మంగళవారం కొట్టేసింది. మలయాళ ప్రముఖ నటి లైంగిక వేధింపుల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దిలీప్ తాజా అభ్యర్థనను హైకోర్టు జస్టిస్ జియాద్ రెహమాన్ తోసిపుచ్చారు. ఈ కేసులో విచారణ జరిపిన ఓ అధికారి ఫిర్యాదు మేరకు.. క్రైమ్ బ్రాంచ్ ఈ ఏడాది జనవరి 9వ తేదీన మరో కేసు నమోదు చేసింది. విచారణ అధికారులను హత్య చేయాలని దిలీప్ కుట్ర పన్నాడంటూ అందులో అభియోగం నమోదు చేశారు. హత్య చేయాలనే.. దిలీప్ గొంతుగా భావిస్తున్న ఆడియో క్లిప్ ఒకటి ఆ మధ్య ఓ టీవీ ఛానెల్లో టెలికాస్ట్ అయ్యింది. దానిని ఆయన సన్నిహితుడు బాలచంద్ర కుమార్ బయటపెట్టడం విశేషం. అందులో ఈ కేసులో విచారణ చేపట్టిన అధికారులకు హాని తలపెట్టాలన్న ఆలోచనతో దిలీప్ ఉన్నట్లు స్పష్టమైంది. దీంతో క్రైమ్ బ్రాంచ్ హత్య కుట్ర నేరం మీద కేసు నమోదు చేశారు. అంతేకాదు.. దిలీప్ మాజీ భార్య, నటి మంజు వారియర్‌ను సైతం క్రైమ్ బ్రాంచ్ వాయిస్ కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించింది. ఆ ఫోన్ సంభాషణల్లో దిలీప్‌తో పాటు దిలీప్ కుటుంబ సభ్యులకు చెందిన మరో ఇద్దరి గొంతులను మంజు గుర్తుపట్టింది. ఈ తరుణంలో ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. హత్య కుట్ర కేసు కొట్టేయాలంటూ దిలీప్ దాఖలు చేసిన అభ్యర్థనను కొట్టేసింది. మరోవైపు దిలీప్ బెయిల్ రద్దు చేయాలని, దిలీప్ బయట ఉంటే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కేరళ క్రైమ్ బ్రాంచ్, కేరళ పోలీసులు కోర్టును కోరుతున్నారు. ఈ పిటిషన్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. 2017 కేరళ నటి దాడి కేసు 2017, ఫిబ్రవరి 17వ తేదీ రాత్రిపూట మలయాళంతో పాటు సౌత్‌లోని పలు భాషల్లో నటించిన ఓ హీరోయిన్ను బలవంతంగా ఎత్తుకెళ్లి, కారులోనే రెండు గంటలపాటు వేధింపులకు పాల్పడ్డారు కొందరు దుండగులు. ఆపై ఆ వేధింపుల పర్వాన్ని ఫోన్లలో రికార్డు చేసి.. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడాలని చూశారు. ఈ కేసులో దిలీప్‌తో పాటు పది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆపై బెయిల్‌పై విడుదల చేశారు. -
చట్టం ఉంది... కమిటీలేవి?
కేరళ హైకోర్టు ఈ నెల 17వ తేదీన ఓ కేసులో తీర్పునిస్తూ సినిమా రంగానికి ఒక ఆదేశం జారీ చేసింది. ఆ ఆదేశం ప్రకారం ప్రతి మూవీ ప్రొడక్షన్ హౌస్‌లోనూ తప్పనిసరిగా ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ ఉండి తీరాలి. అక్కడి సినిమారంగంలో ఉన్న మహిళల సమాఖ్య ‘ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ చేసిన న్యాయపోరాటంలో భాగంగా ఈ ఆదేశాన్ని జారీ చేసింది హైకోర్టు. మహిళా చైతన్యం మెండుగా ఉన్న కేరళ రాష్ట్రంలో మహిళలు న్యాయపోరాటంతో సాధించుకున్న విజయం అనే చెప్పాలి. సాధికారత సాధనలో పరుగులు తీస్తున్న మహిళలు ఇంకా జెండర్ వివక్ష నుంచి తప్పించుకోవడానికి పెనుగులాడాల్సిన పరిస్థితి. లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఉంది. కానీ చట్టం అమలుకు ఇంకా ఎన్నాళ్లు? ఓ మూడున్నర దశాబ్దాల వెనక్కి, ఈ చట్టం లేని రోజుల్లోకి వెళ్తే... ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ల కేసు గుర్తుకు వచ్చి తీరుతుంది. ∙∙ రూపన్ డియోల్ బజాజ్, ఐఏఎస్ ఆఫీసర్. ఒక మహిళ ఎంత పెద్ద ఆఫీసర్ అయినప్పటికీ పితృస్వామ్య సమాజంలో కేవలం మహిళ మాత్రమేనా! అని సమాజం నివ్వెర పోయిన సంఘటన ఆమె జీవితంలో ఎదురైంది. ఐపీఎస్ ఆఫీసర్ కేపీఎస్ గిల్ నుంచి లైంగికవేధింపును ఎదుర్కోవాల్సి వచ్చిందామె. లైంగిక వేధింపుకు గురయ్యానంటూ న్యాయం చేయమంటూ మనదేశంలో చట్టాన్ని ఆశ్రయించిన తొలి మహిళాధికారి ఆమె. అత్యున్నత స్థాయి అధికారి కావడం వల్లనే ఆమె కనీసం చట్టాన్ని ఆశ్రయించడం అనే సాహసమైనా చేయగలిగారు. అంతకు ముందు ఎంతో మంది చిన్న ఉద్యోగినులు సాటి పురుష ఉద్యోగుల నుంచి వేధింపులు ఎదుర్కొంటూ కూడా నోరు మెదపడానికి ధైర్యం లేని స్థితిలో నలిగిపోయారు. నోరు విప్పిన వాళ్లకు కెరీర్ ప్రశ్నార్థకంగా మారుతూనే వచ్చింది. ఈ నేపథ్యంలో స్త్రీలు ఎదుర్కొంటున్న ఈ వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి 2013లో ‘సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ యట్ వర్క్ ప్లేస్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్) యాక్ట్, 2013’ వచ్చింది. ఈ చట్టం ప్రకారం పదిమంది ఉద్యోగులు పని చేస్తున్న పని ప్రదేశంలో వారిలో కనీసం ఒక్క మహిళ ఉన్నా సరే... ఈ చట్టం ప్రకారం ఒక కమిటీ ఉండాలి. సంఘటిత రంగాల్లోనే కాక అసంఘటిత రంగాల్లో కూడా ఇలాంటి కమిటీల ఏర్పాటుకు చట్టాలు ఉన్నాయని, సినిమా రంగం గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఇందులో తప్పనిసరి... చెబుతున్నారు ప్రముఖ న్యాయవాది పార్వతి. ∙∙∙ ఇదే విషయం మీద ప్రముఖ నటి, గతంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో క్రియాశీలకంగా బాధ్యతలు నిర్వర్తించిన జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ ‘‘మీటూ ఉద్యమ సమయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని ఒక కమిటీ వేసింది. పోలీసు ఉన్నతాధికారులు, యాక్టివిస్టులు, సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమందితో రూపొందిన కమిటీ అది. ఈ కమిటీ విస్తృతి చాలా పెద్దది. లైంగిక వేధింపుల నివారణ మాత్రమే కాదు. ఆడవాళ్లు పని చేసే చోట వాళ్లకు అనువైన వాతావరణం ఉండేటట్లు చూడడం కూడా కమిటీ బాధ్యతే. పెద్ద ఆర్టిస్టులకు సొంత కారవాన్ వంటి ఏర్పాట్లు ఉంటాయి. జూనియర్ ఆర్టిస్టులకు అలాంటివేవీ ఉండవు. వాళ్లు షూటింగ్ సెట్లో దుస్తులు మార్చుకోవడానికి గదులు, టాయిలెట్ వసతుల వంటివి ఉండేటట్లు చూడాలి. ఆడిషన్ జరిగేటప్పుడు కెమెరా ఉండి తీరాలి. ఈ చట్టం చెప్పిన నియమాలను ఒక చార్ట్ మీద రాసి ప్రొడక్షన్ హౌస్‌లో తగిలించాలి. మొత్తానికి ఉమెన్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కల్పించడం ఈ చట్టం ఉద్దేశం. అయితే మీటూ సమయంలో పెద్ద కదలిక వచ్చింది. కానీ ఆ తర్వాత కరోనా కారణంగా షూటింగ్‌లు జరగకపోవడం వంటి అనేక కారణాలతో ఈ నియమావళి ప్రాధాన్యం కొంత తగ్గిందనే చెప్పాలి. అయితే ‘మా’ నుంచి నేను ఒక మహిళగా నా దృష్టికి వచ్చిన అనేక కేసులను పరిష్కరించాను. అలాగే ఫిలిమ్ చాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా తమ దృష్టికి వచ్చిన వాటిని పరిష్కరిస్తుంటాయి’’ అన్నారు. సమాజం అభివృద్ధి చెందుతోంది. ఆలోచన స్థాయులు ఆకాశాన్ని అంటుతున్నాయి. మహిళ విషయంలో... మహిళ అయిన కారణంగా ఆమె ఎదుర్కొంటున్న వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి చట్టాలు రూపొందుతున్నాయి. అయితే మనిషి ఆలోచనలను మార్చడంలో వీటి పాత్ర పరిమితంగానే ఉంటోంది. నిజంగా మారాల్సింది మనిషి ఆలోచన. చట్టం వచ్చి దశాబ్దకాలమవుతోంది. ఇంకా కమిటీల నిర్మాణమే పూర్తిస్థాయిలో జరగలేదు. ‘అణచివేత’ అనే దురాలోచనను రూపుమాపగలిగిన సమాజం రావాలి. అది వివేచనతోనే సాధ్యం. కమిటీ ఉంటే కెమెరా ఉన్నట్లే! సర్వేలియన్స్ కెమెరా నిఘాలో ఉన్నామని తెలిస్తే మనిషి ఎంత బాధ్యతగా వ్యవహరిస్తాడో... పని ప్రదేశంలో ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతగా వ్యవహరిస్తాడు. ప్రొడక్షన్ హౌస్‌లో ఈ కమిటీ ఉంటే... అది మహిళలకు భరోసానిస్తుంది. కమిటీ ఉందనే ధైర్యం మహిళలకు ఉంటుంది, కమిటీ ఉందనే భయం మగవాళ్లలో ఉంటుంది. – జీవిత రాజశేఖర్, సీనియర్ నటి ఇంకా విస్తరించాలి! పని ప్రదేశంలో మహిళల భద్రత కోసం రూపొందిన ఈ చట్టం ఇంకా విస్తరించాల్సి ఉంది. ఆఫీసుల్లో కొంతవరకు ఉన్నాయి. సినిమా రంగం కూడా దీని అవసరాన్ని గుర్తించింది. అలాగే ఇళ్లలో పని చేసే డొమెస్టిక్ వర్కర్లు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తారు. వాళ్లు ‘లోకల్ కంప్లయింట్స్ కమిటీ’లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారులుండాలి. ఇవి ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పడలేదు. అలాగే చట్టసభల మహిళాసభ్యులు ఈ చట్టం పరిధిలోకి రావడం లేదు. వాళ్లు ఐపీసీననుసరించి పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేయాల్సిందే. ఈ చట్టాన్ని వాళ్లకు కూడా వర్తింప చేస్తూ అసెంబ్లీలో ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. – ఇ. పార్వతి, సీనియర్ న్యాయవాది – వాకా మంజులారెడ్డి -
ఆమె అతడిలా.. అతడు ఆమెలా మారిన జంట ఇది!
సమాజం.. ముఖ్యంగా మన చట్టాలు అంగీకరించని వ్యవహారం ఇది. ఆమె అతడిలా, అతడు ఆమెలా మారిన ట్రాన్స్ జెండర్లు వీరిద్దరి. ప్రేమించుకున్నారు. పెళ్లితో ఒక్కటి కావాలనుకున్నారు. కానీ, ఇలాంటి వాటిని నిందించే సమాజం కదా. అయినా పెద్దలు ధైర్యం చేశారు. స్నేహితులు తోడుగా నిలిచారు. వేద మంత్రాల సాక్షిగా ప్రేమికుల దినోత్సవం నాడే మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. కేరళ తిరువనంతపురంలో ఫిబ్రవరి 14న ఘనంగా జరిగింది ఈ ట్రాన్స్ జంట వివాహం. త్రిస్సూర్ కు చెందిన వరుడు మనూ కార్తీక టెక్నోపార్క్ లోని ఓ ఐటీ సంస్థలో జాబ్ చేస్తున్నాడు. ఇక వధువు శ్యామా ఎస్. ప్రభ కేరళ సోషల్ జస్టిస్ డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేసిన ట్రాన్స్ జెండర్ విభాగంలో విధులు నిర్వర్తిస్తోంది. 2010లో క్వీర్ ఉద్యమం సందర్భంగా ఇద్దరూ కలుసుకున్నారు. అప్పటి నుంచి పరిచయం కాస్త స్నేహంగా.. ఆపై ప్రేమగా మారింది. 2017లో తొలిసారిగా మనూ, శ్యామకు ప్రపోజ్ చేశాడట. వీళ్ల శరీరతత్వాల గురించి తెలిసిన పెద్దలు.. వీళ్ల ప్రేమకి, పెళ్లికి సైతం అడ్డుచెప్పలేదు. అయితే.. వాళ్లిద్దరూ వాళ్ల వాళ్ల ఇంట్లో పెద్దవాళ్లు. దీంతో కొన్ని బాధ్యతలు పెళ్లికి అడ్డుపడ్డాయి. అవి తీరాక ఇప్పుడు సంప్రదాయ బద్ధంగా పెద్దల సమక్షంలోనే ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి గురించి ముందుగా ప్రచారం జరగడంతో ట్రాన్స్జెండర్లు సైతం భారీ ఎత్తున్న హాజరై.. ఈ జంటను ఆశీర్వదించి వెళ్లారు. ఇప్పుడున్న వివాహ చట్టాల ప్రకారం వీళ్ల వివాహం ఆమోదయోగ్యం కాదు. అందుకే తమ వివాహాన్ని చట్టబద్ధం చేసుకునేందుకు కేరళ హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ట్రాన్స్‌జెండర్ గుర్తింపు కింద తమ వివాహానికి చట్టబద్ధత కల్పించాలని కోరనున్నారు వీళ్లు. ఇందుకు సంబంధించిన అన్ని పత్రాలను సిద్ధం చేసుకున్నామని ఈ జంట చెబుతోంది. ఈ సందర్భంగా తమకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. -
జంట పేలుళ్ల కేసులో నజీర్, షఫాస్ నిర్దోషులు
కొచ్చి: కోజికోడ్ జంట పేలుళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా (ఎల్ఈటీ) కార్యకర్త తడియంతెవిడ నజీర్, షఫాస్‌లను నిర్దోషులుగా పేర్కొంటూ కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కోజికోడ్ కేఎస్ఆర్టీసీ, మొఫుసిల్ బస్టాండ్లలో జరిగిన బాంబు పేలుళ్లకు నజీర్, ఇతర నిందితులు కుట్ర చేశారని, ప్రణాళికతో పాటు అమలు చేసినట్లు వీరిపై అభియోగాలున్నాయి. 2011లో ఎన్ఐఏ కోర్టు వీరిని దోషులుగా తేల్చింది. నజీర్, షఫాస్ ఇద్దరూ చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, 1967(ఉపా)లోని వివిధ సెక్షన్ల కింద నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విధించిన జీవిత ఖైదును సవాలు చేస్తూ మొదటి నిందితుడు నజీర్, నాలుగో నిందితుడు షఫాస్ దాఖలు చేసిన అప్పీలును కేరళ హైకోర్టు అనుమతించింది. న్యాయమూర్తులు కె.వినోద్ చంద్రన్, జియాద్ రెహమాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం తుదితీర్పు వెల్లడించింది. ఘట న జరిగిన నాలుగు సంవత్సరాల తరువాత ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్న ఈ కేసు దర్యాప్తు సంక్లిష్టతను తాము అర్థం చేసుకున్నామని చెప్పిన ధర్మాసనం వారే నేరం చేశారనేందుకు నమ్మదగిన ఆధారాలేవీ లేవని పేర్కొన్నది. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎన్ఐఏ దాఖలు చేసిన అప్పీలును కూడా ధర్మాసనం తిరస్కరించింది. -
'పార్కింగ్ ఫీజు వసూలు చేస్తే మాల్స్‌కే ప్రమాదం'
పార్కింగ్ రుసుము వసూలు చేసే హక్కు ప్రాథమికంగా మాల్స్‌కు లేదని కేరళ హైకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు పార్కింగ్ ఫీజుల వసూళ్లను నిలిపివేయాలని ఆదేశించటం లేదు కానీ అలా వసూల్ చేస్తే మాల్స్‌కే ప్రమాదం అని కేరళ హైకోర్టు న్యాయమూర్తి కున్హి కృష్ణన్ పేర్కొన్నారు. ఈ మేరకు కలమస్సేరి మునిసిపాలిటీ ఎర్నాకులంలోని లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్‌కు ఏదైనా లైసెన్స్ జారీ చేసిందా అని కూడా ప్రశ్నించింది. "బిల్డింగ్ రూల్స్ ప్రకారం, భవనం నిర్మించడానికి పార్కింగ్ స్థలం కోసం తగినంత స్థలం అవసరం. పార్కింగ్ స్థలం భవనంలో భాగం. పార్కింగ్ స్థలం ఉండాలనే షరతులతో భవన నిర్మాణ అనుమతి జారీ చేయబడుతుంది. కాబట్టి భవనం యజమాని పార్కింగ్ రుసుము వసూలు చేయడం సమంజసం కాదని భావిస్తున్నాం అని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే మాల్స్ తమ పూర్తి రిస్క్‌తో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చు అని కోర్టు పేర్కొంది. ఈ మేరకు వడక్కన్ అనే వ్యక్తి డిసెంబర్ 2న లులు మాల్‌ను సందర్శించినప్పుడు అతని నుండి పార్కింగ్ ఫీజు రూ. 20 వసూలు చేసినందుకు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పైగా ఆయన తాను డబ్బు చెల్లించేందుకు నిరాకరించడంతో మాల్ సిబ్బంది ఎగ్జిట్ గేట్లను మూసివేసి బెదిరించారని కూడా ఆరోపించారు. ఈ మేరకు కోర్టు ఈ సమస్యకు సంబంధించిన వివరణను దాఖలు చేయవల్సిందిగా మున్సిపాలిటీని కోరడమే కాక ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
నటుడు దిలీప్‌కు ఊరట.. అప్పటివరకు అరెస్ట్ చేయొద్దని
Kerala High Court Restrains Police From Arresting Actor Dileep: ప్రముఖ మలయాళ నటుడు దిలీప్‌కు కాస్త ఊరట లభించింది. స్టార్ హీరోయిన్‌పై లైంగిక దాడి కేసును విచారిస్తున్న దర్యాప్తు అధికారులను బెదిరించిన కేసులో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా దిలీప్‌ను జనవరి 18 వరకు అరెస్ట్ చేయకుండా కేరళ హైకోర్టు ఆ రాష్ట్ర పోలీసులపై నిషేధం విధించింది. అలాగే దిలీప్‌పై ఇచ్చిన సినీ దర్శకుడు బాలాచంద్ర కుమార్ వాంగ్మూలాన్ని పరిశీలిస్తామని జస్టిస్ గోపీనాథ్‌తో కూడిన సింగిల్ బెంచ్ ధర్మాసనం పేర్కొంది. ఇటీవల దర్యాప్తు అధికారులను బెదిరించారనే ఆరోపణలతో దిలీప్‌తో పాటు మరో ఐదుగురిపై కొత్తగా కేసు నమోదు చేశారు కేరళ క్రైం బ్రాంచ్ పోలీసులు. ఈ ఆరోపణలకు సంబంధించి ఆడియో క్లిప్‌లు బయటకు రావడంతో వీరిపై ఐపీసీ సెక్షన్లు 116, 118, 120B, 506, 34 కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో దిలీప్‌ను మొదటి నిందితుడిగా పేర్కొన్నారు. అలాగే విచారణ అధికారులు బైజు పౌలోస్, సుదర్శన్, సంధ్య, సోజన్లు ఇబ్బంది పడతారని దిలీప్ బెదిరించినట్లు కోర్టుకు సమర్పించిన ఎఫ్ఐఆర్లో ఉన్నట్లు సమాచారం. సుదర్శన్‌తో పాటు మరో దర్యాప్తు అధికారి చేతిని నరికేందుకు దిలీప్ కుట్ర పన్నాడని అందులో ఆరోపించారు. ఫిబ్రవరి 17, 2017 రాత్రి మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో గుర్తింపు పొందిన ప్రముఖ నటిని కిడ్నాప్ చేసి, వేధింపులకు గురి చేసిన కేసులో దిలీప్ ఎనిమిదో నిందితుడిగా ఉన్నాడు. ఇదీ చదవండి: స్టార్ హీరోపై నాన్ బెయిలబుల్ కేసు.. మరో ఐదుగురిపై -
4 వారాల తర్వాత కోవిషీల్డ్ రెండో డోస్‌కు చాన్సివ్వండి
కొచ్చి: కోవిడ్ నుంచి ముందస్తు రక్షణలో భాగంగా తొలి కరోనా టీకా తీసుకున్న కేవలం 4 వారాల తర్వాత రెండో డోస్ కోవిషీల్డ్ టీకా కోరే పౌరులకు ఆ అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి కేరళ హైకోర్టు ఆదేశాలిచ్చింది. కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం దేశంలోని పౌరులు మొదటి డోస్ కరోనా టీకా తీసుకున్న కనీసం 12 వారాల (84 రోజుల) తర్వాతే రెండో డోస్ తీసుకోవాలి. ఆలోపు రెండో డోస్ ఇవ్వరు. అయితే, తొలి డోస్ తీసుకున్న కేవలం 4 వారాల తర్వాత రెండో డోస్ కోవిషీల్డ్ తీసుకోవాలనుకునే వారు కోవిన్ పోర్టల్ ద్వారా వ్యాక్సినేషన్‌ను షెడ్యూల్ చేసుకునేందుకు అనుమతించాలని ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు సూచించింది. తమ సంస్థలో పనిచేసే 5,000 మందికిపైగా ఉద్యోగులకు తొలి డోస్ కోవిషీల్డ్ టీకా ఇప్పించామని, ప్రభుత్వ నిబంధనల కారణంగా 84 రోజుల్లోపే రెండో డోస్ ఇవ్వడం కుదరడం లేదని, 4 వారాల టీకా గ్యాప్ తర్వాత రెండో డోస్‌కు అనుమతించాలని కైటెక్స్ గార్మెంట్స్ అనే సంస్థ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును జస్టిస్ పీబీ సురేశ్ కుమార్ విచారించారు. ‘విద్య, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లే వారికి ముందస్తు టీకా అనుమతులు ఇస్తున్నారు. భారత్‌లోనే ఉంటూ ఇక్కడే ఉద్యోగం, విద్య కోసం ఇల్లు దాటే పౌరులు తమకూ ముందస్తు టీకా అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. స్వదేశంలో ఉండే వారికీ ఈ వెసులుబాటు ఎందుకు ఇవ్వడం లేదు? అనే ప్రశ్నకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సమాధానం రావట్లేదు’ అని జడ్జి అన్నారు. -
గోల్డు స్మగ్లింగ్ ఉగ్రవాద చర్యే, వారికి బెయిల్ ఇవ్వొద్దు
కొచ్చీ: బంగారాన్ని అక్రమంగా దిగుమతి చేయడం దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వానికి ముప్పేనని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కేరళ హైకోర్టుకు తెలియజేసింది. 2019 నవంబర్ నుంచి 2020 జూన్ వరకు స్వప్నా సురేష్‌తోపాటు మరికొందరు యూఏఈ నుంచి 167 కిలోల బంగారాన్ని భారత్‌లోకి అక్రమంగా రవాణా చేశారని, వారిది ముమ్మాటికీ ఉగ్రవాద చర్యేనని తేల్చిచెప్పింది. గోల్డు స్మగ్లింగ్ కోసం ‘దౌత్య’ మార్గాలను ఉపయోగించుకున్నారని, ఈ వ్యవహారం భారత్–యూఏఈ మధ్య సంబంధాలను దెబ్బతీస్తుందని తెలిసి కూడా తప్పుడు పనికి పాల్పడ్డారని ఆక్షేపించింది. ఈ నేరం చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం(యూఏపీఏ) కిందకు వస్తుందని ఎన్ఏఐ స్పష్టం చేసింది. స్వప్నాసురేష్‌తోపాటు ఇతర నిందితులకు ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్ మంజూరు చేయొద్దని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. స్వప్నా సురేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఎన్ఐఏ కోర్టు గతంలోనే కొట్టివేసింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ స్వప్నాసురేష్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఎన్ఐఏ శుక్రవారం కేరళ హైకోర్టులో తన వాదనలు వినిపించింది. బంగారం స్మగ్లింగ్ కోసం నిందితురాలు పెద్ద కుట్ర పన్నారని, కొందరు వ్యక్తులను నియమించుకొని, ఉగ్రవాద ముఠాను తయారు చేశారని ఆక్షేపించింది. నిధులు సేకరించి మరీ 167 కిలోల బంగారాన్ని యూఏఈ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్నారని గుర్తుచేసింది. ఇందుకోసం తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్ జనరల్ కార్యాలయ దౌత్యవేత్తల పేర్లను వాడుకున్నారని తెలిపింది. నిందితులను బెయిల్‌పై విడుదల చేస్తే దర్యాప్తుపై అది తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని వెల్లడించింది. గత ఏడాది జూలై 5న తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో 15 కిలోల బంగారం పట్టుబడిన సంగతి తెలిసిందే. యూఏఈ కాన్సులేట్ చిరునామాతో వచ్చిన సంచిలో ఈ బంగారం దొరికింది. అధికారులు తీగ లాగడంతో స్వప్నా సురేష్‌తో సహా మొత్తం ఏడుగురు నిందితులు మొత్తం 167 కిలోల బంగారాన్ని యూఏఈ నుంచి స్మగ్లింగ్ చేసినట్లు తేలింది. -
దేశద్రోహం కేసులో ఆయేషాకు బెయిల్
కొచ్చి: లక్షద్వీప్ పోలీసులు నమోదు చేసిన దేశద్రోహం కేసులో సినీనటి, దర్శకురాలు ఆయేషా సుల్తానాకు ఊరట లభించింది. ఈ కేసులో ఒకవేళ అమెను అరెస్టు చేస్తే వారంరోజులపాటు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని లక్షద్వీప్‌లోని కవరత్తి పోలీసులను కేరళ హైకోర్టు ఆదేశించింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయేషా సుల్తానా దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం గురువారం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ కోసం జూన్ 20న తమ ఎదుట హాజరు కావాలంటూ లక్షద్వీప్‌లోని కవరత్తి పోలీసులు జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని ఆయేషా సుల్తానాకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అశోక్ మీనన్ సూచించారు. రూ.50 వేల పూచీకత్తు, ఇద్దరి హామీతో ఆయేషా సుల్తానాకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వొచ్చని తెలిపారు. లక్షద్వీప్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం జీవాయుధాలను ప్రయోగిస్తోందని జూన్ 7న ఆరోపించిన ఆయేషా సుల్తానాపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. చదవండి: మాజీ ఎన్కౌంటర్ స్పెషలిస్టు ప్రదీప్ శర్మ అరెస్టు -
‘లక్షద్వీప్’ కేసులో కేరళ హైకోర్టుకు ఆయేషా
కొచ్చి: లక్షద్వీప్‌లో కోవిడ్ విజృంభణకు లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ కారణమని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వివాదంలో అరెస్ట్ నుంచి బయటపడేందుకు ఫిల్మ్ మేకర్ అయేషా సుల్తానా సోమవారం కేరళ హైకోర్టును ఆశ్రయించారు. కవరట్టికి తిరిగి వెళ్తే తనను అరెస్ట్‌చేస్తారని, ముందస్తు బెయిల్ కోరుతూ ఆమె కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ‘ ఒకప్పుడు కరోనా పాజటివ్ కేసులులేని లక్షద్వీప్‌లో ప్రఫుల్ పటేల్ వచ్చాక కోవిడ్ పరిస్థితులు దారుణంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం సంధించిన జీవాయుధం ఆయన’ అంటూ ఇటీవల ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ఆయేషా వ్యాఖ్యానించారు. ఆయేషా కేంద్రప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీశారంటూ లక్షద్వీప్ బీజేపీ చీఫ్ అబ్దుల్ ఖాదర్ ఆమెపై పోలీసు ఫిర్యాదుచేశారు. దీంతో పదో తేదీన దేశద్రోహం ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైంది. ప్రఫుల్‌కు ‘బ్లాక్ డే’ స్వాగతం లక్షద్వీప్‌లో సంస్కరణల పేరిట అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ అమల్లోకి తెచ్చిన విధానాలపై అక్కడి ప్రజల నుంచి వ్యక్తమవుతోన్న నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. సోమవారం ప్రఫుల్ లక్షద్వీప్‌కు విచ్చేసిన నేపథ్యంలో నిరసనలు ప్రస్ఫుటంగా కనిపించాయి. చాలా చోట్ల జనం నల్లటి మాస్కులు ధరించి, వారి ఇళ్లపై నల్ల జెండాలను ఎగరేశారు. ప్రఫుల్ వ్యతిరేక నినాదాలిచ్చారు. -
కొడకారా దోపిడీ కేసు.. రాజకీయ చిత్తులు-జిత్తులు
కేరళ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన బీజేపీకి ‘హవాలా మనీ’ ఆరోపణలు కొత్త తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి. కార్యకర్తల స్థాయి నుంచి కీలక నేతల దాకా ప్రతీ ఒక్కరి మధ్య ఈ స్కామ్ చిచ్చుపెడుతోంది. ఎన్నికలకు ముందు త్రిస్సూరు కొడకారా హైవేపై దోపిడి జరగడం.. ఈ కేసులో బాధితుడు ఫిర్యాదు చేసిన సొమ్ముకంటే ఎక్కువ సొమ్మును పోలీసులు రికవరీ చేస్తుండడం, ఆ సొమ్ముతో రాజకీయ నేతలకు లింకులు.. వెరసి పొలిటికల్ థ్రిల్లర్ మూవీని తలపిస్తున్నాయి అక్కడి రాజకీయాలు. త్రిస్సూరు: ఎన్నికల్లో గెలుపు కోసం కేరళ బీజేపీ డబ్బులు పంచాలని ప్రయత్నించిందని, కానీ బీజేపీ నేతలే ఆ డబ్బు కోసం దోపిడీ డ్రామాలు ఆడారనే ఆరోపణలు.. ప్రస్తుతం ఆ పార్టీని ఇరకాటంలో పడేస్తున్నాయి. అయితే ఇదంతా ఎల్డీఎఫ్(సీపీఐ-ఎం) రాజకీయ కుట్రలో భాగమేనని బీజేపీ ప్రత్యారోపణలకు దిగింది. ప్రభుత్వంతో కుమ్మక్కై పోలీసులు కుట్రకు పాల్పడుతున్నాయని ఆదివారం బీజేపీ పక్ష నేతలంతా మీడియా సమావేశం నిర్వహించి ఆరోపణలకు దిగారు. ఈ సమావేశంలో బీజేపీ కేరళ అధ్యక్షుడు సురేంద్రన్‌తో పాటు కేంద్ర మంత్రి మురళిధరన్, పార్టీ మాజీ అధ్యక్షులు కుమ్మనం రాజేంద్రన్, కృస్ణదాస్ ఇంకా సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఇలా మొదలైంది.. ఏప్రిల్ 7న త్రిస్సూరుకు చెందిన షమ్జీర్ శామ్సుదీన్ అనే వ్యక్తి కొడకారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం మొదలైంది. ఏప్రిల్ 3న రాత్రి.. అంటే అసెంబ్లీ ఎలక్షన్లకు మూడు రోజుల ముందు షమ్జీర్ తన కారులో కొచ్చివైపు వెళ్తున్నాడు. ఆ టైంలో కొడకారా ఫ్లైఓవర్ వద్ద తొమ్మిది మంది దుండగులు ‘ఫేక్ యాక్సిడెంట్’తో తనను ఆపారని, బెదిరించి ల్యాండ్ సెటిల్మెంట్ కోసం తీసుకెళ్తున్న పాతిక లక్షల రూపాయలు దోచుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అతను ఒంటరిగా వెళ్లి ఫిర్యాదు చేయలేదు. అతని కూడా వ్యాపారవేత్త ఏకే ధర్మరాజన్ కూడా ఉన్నాడు. ధర్మరాజన్ ఆరెస్సెస్ సభ్యుడు. ఆయన ఆ డబ్బును చాలామంది దగ్గరి నుంచి అప్పుగా తీసుకున్నానని చెప్పడం, సరిగ్గా దోపిడీ జరిగింది ఎన్నికల టైం కావడంతో పోలీసులకు అనుమానం మొదలైంది. డొంక కదిలింది.. ఈ కేసులో దీపక్ అనే వ్యక్తి పోలీసులు మొదటగా అరెస్ట్ చేశారు. అతనిచ్చిన సమాచారంతో ఈ దోపిడీలో పాల్గొన్న మరో 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు పాతిక లక్షల కంటే ఎక్కువ సొమ్మును రికవరీ చేయడంతో అసలు ట్విస్ట్ మొదలైంది. దీంతో పోలీసులు ధర్మరాజన్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. యువ మోర్చా నేత సునీల్ నాయక్ తనకు ఆ డబ్బు ఇచ్చాడని ధర్మరాజన్ చెప్పాడు. దీంతో కొడకారా పోలీసులు సునీల్ పిలిపించుకుని విచారించారు. తనకు ఆ డబ్బు బయటి నుంచి వచ్చిందని, ధర్మరాజన్తో తనకున్న లావాదేవీల కారణంగానే ఆ డబ్బు ఇచ్చానని చెప్పాడు. దీంతో కొడకారా పోలీసులు మరోసారి ధర్మరాజన్‌ను ఇంటరాగేషన్ చేయడంతో.. ఆ సొమ్ము బీజేపీ నేతల కోసమేనని ధర్మరాజన్ చెప్పడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. బీజేపీతో లింకులు! త్రిస్సూరులోని ఓ హోటల్లో బీజేపీ కీలక నేత ఒకరు తనకోసం రూమ్ బుక్ చేశారని ధర్మరాజన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది నిజమేనని ఒప్పుకున్న బీజేపీ కార్యదర్శి అనీష్ కుమార్.. కేవలం ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మెటీరియల్ ఇంఛార్జిగా ఉన్న ధర్మరాజన్ కోసం ఆ పని చేయాల్సి వచ్చిందని చెప్పాడు. ఆ సొమ్ము బీజేపీకి చెందిన మరో ముగ్గురు నేతలకు అందించాల్సి ఉందని ధర్మరాజన్ చెప్పగా, వాళ్లు మాత్రం ఆ డబ్బుతో తమకేం సంబంధం లేదని పోలీసుల ఎదుట స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ఈ కేసులో అరెస్టయిన దీపక్.. దోపిడీ జరిగిన తెల్లారే బీజేపీ ఆఫీస్‌కు వెళ్లాడన్న విషయం వెలుగులోకి రావడంతో కథ కొత్త మలుపు తిరిగింది. పైగా రికవరీ సొమ్ము దగ్గర దగ్గర మూడున్నర కోట్ల రూపాయలు ఉండొచ్చని పోలీసులు అంచనాకి వచ్చారు. ప్రత్యేక దర్యాప్తు బృందం రంగప్రవేశంతో ఇప్పటిదాకా జరిగిన సోదాల్లో కోటి రూపాయల దాకా సొమ్ము రికవరీ అయినట్లు తెలుస్తోంది. సొంత నేతల పనేనా? ఈ దోపిడీలో ప్రధాన నిందితుడిగా ఉన్న దీపక్.. దోపిడీ తర్వాత బీజేపీ ఆఫీస్‌కు వెళ్లిన విషయాన్ని పార్టీ కూడా ధృవీకరించింది. అయితే దోపిడీకి సంబంధించి సొంత నేతలపైనే అధిష్టానానికి అనుమానం వచ్చిందని, ఆ కోణంలోనే దర్యాప్తు కోసం కొందరిని ఆఫీస్‌కు పిలిపించుకున్నామని, అందులో కార్యకర్త దీపక్ కూడా ఉన్నాడని బీజేపీ కార్యదర్శి అనీష్ కుమార్ చెప్పాడు. దీంతో ఈ దోపిడీ స్కెచ్ బీజేపీలోని సొంత నేతల పనే అని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అంతేకాదు కొడాకరా దోపిడీ గురించి బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా వ్యతిరేక ప్రచారం చేసుకున్నారనే విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో కేరళ బీజేపీలో అంతర్గత కుమ్ములాట వల్లే ఇదంతా జరిగి ఉండొచ్చని పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. అయితే ఈ కాంట్రవర్సీకి బీజేపీ కేరళ అధిష్టానం దూరంగా ఉండాలని ప్రయత్నిస్తూనే.. ఇదంతా ఎల్డీఎఫ్ కుట్రలో భాగమేనని వాదిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుల్ని పట్టుకోవాల్సింది పోయి.. బీజేపీ నేతలతో ముడిపెట్టాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపణలను దిగింది. నిందితుల్లో లెఫ్ట్ నేత కూడా?! పోలీసులు నిందితుల కాల్ లిస్టులను పరిశీలించాల్సింది పోయి.. వ్యాపారవేత్త అయిన ధర్మరాజన్ కాల్ లిస్ట్‌ను జల్లెడ పడుతోందని బీజేపీ మండిపడింది. ఈ కేసులో ఆరెస్ట్ చేయాల్సిన నిందితుడు మరోకడున్నాడని, అతను లెఫ్ట్ పార్టీ యూత్ వింగ్ లీడర్ మాత్రమే కాదని, త్రిస్సూరుకు చెందిన ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేకు దగ్గరి బంధువని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సురేంద్రన్ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు ఆ నిందితుడు ఈ కేసు నుంచి తప్పించునేందుకు వామపక్ష ఉద్యమవేత్త ఎన్ఎన్ పురం సాయం కూడా తీసుకున్నాడని చెప్పాడు. సీపీఎం నేత కొడియారి బాలకృష్ణన్ కొడుకును బెంగళూరులో డ్రగ్స్ ట్రాఫికింగ్ కేసులో అరెస్ట్ చేయగా, ప్రతీకారంగానే తన కొడుకు హరికృష్ణన్‌ను విచారణపేరుతో ఇబ్బంది పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని సురేంద్రన్ ఆరోపణలకు దిగారు. సిట్ ముందుకు నేతలు కొడకారా దారి దోపిడీ కేసు వ్యవహారంలో కేరళ బీజేపీ కీలక నేతల్ని ప్రశ్నిస్తోంది సిట్. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సురేంద్రన్ ఎన్నికల టైంలో ఇద్దరికి లంచాల ప్రలోభం చూపెట్టాడన్న ఆరోపణలపై కూడా దర్యాప్తు చేయాలని నిర్ణయించుకుంది. అంతేకాదు ఆయన డ్రైవర్‌తో పాటు ముఖ్య అనుచరుల్ని సిట్ ప్రశ్నించింది కూడా. ఇక సురేంద్రన్ తనయుడు హరికృష్ణన్.. దోపిడీ జరిగిన రోజు ధర్మరాజన్తో పలుమార్లు ఫోన్‌కాల్స్ మాట్లాడినట్లు పోలీసులకు ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. దీంతో హరికృష్ణన్‌కు సిట్ నోటీసులు పంపింది. మరోవైపు బీజేపీ నేత, నటుడు సురేష్ గోపీని కూడా(హెలికాఫ్టర్ల ప్రచారంపై) ప్రశ్నించాలని సిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కొడకారా కేసులో న్యాయవిచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ కేరళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఈడీ దృష్టి కొరకాడ హవాలా మనీ కేసు అని, ఇందులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జోక్యం చేసుకోవాలని కోరుతూ లోక్‌తంత్రిక్ జనతా దళ్ యువ విభాగం జాతీయాధ్యక్షుడు సలీం మడావూర్ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఈ కేసులో జోక్యం చేసుకుంటుందో లేదో తెలపాల్సిందిగా ఈడీ ఏజెన్సీని ధర్మాసనం కోరింది. అయితే ఈడీ వారం గడువు కోరగా.. కోర్టు పదిరోజుల గడువు మంజూరు చేసింది. ఈ క్రమంలో ఈడీ ఇప్పటికే ఈ కేసు ఫైల్స్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
సోలార్ స్కాం: సరితా నాయర్‌కు 6 ఏళ్ల జైలు
కోజికోడ్: సోలార్ ప్యానెల్ కుంభకోణం కేసులో దోషిగా నిర్ధారణ అయిన సరితా నాయర్‌కు కేరళ న్యాయస్థానం 6 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కుదిపేసిన ఈ కుంభకోణంలో సరిత రెండో నిందితురాలు. మూడో నిందితుడైన బి.మణిమోన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్–3 కె.నిమ్మి మంగళవారం తీర్పు వెలువరించారు. మొదటి నిందితుడైన బిజు రాధాకృష్ణన్ ప్రస్తుతం కోవిడ్‌తో క్వారంటైన్లో ఉండటంతో జడ్జి అతడికి సంబంధించిన తీర్పును తర్వాత వెలువరించనున్నారు. ఈ కేసులో మోసం సహా నాలుగు నేరాలకు గాను కోర్టు జైలు శిక్షలతోపాటు, రూ.10వేల చొప్పున రూ.40 వేల జరిమానా కూడా విధించింది. కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో గత వారమే పోలీసులు సరితను అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించా రు. కంపెనీ ఫ్రాంచైజీ ఇప్పించడంతోపాటు తన నివాసం, కార్యాలయాల్లో సోలార్ ప్యానెళ్లను అమరుస్తామంటూ సరితా నాయర్, బిజు రాధాకృష్ణన్ రూ.42.70 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ మజీద్ 2012లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విధంగా, నిందితులిద్దరూ రాష్ట్రంలోని పలువురి నుంచి కోట్లాది రూపాయలను మోసపూరితంగా వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. -
ఒంటరి తల్లులకు భరోసా ఏదీ?
‘నేను కేవలం స్త్రీని. నాకు పురుషుని తోడు అన్ని వేళలా అవసరం అని స్త్రీ అనుకుంటూ ఉంటే కనుక ఆమెకు స్వయం జీవనం కల్పించడంలో వ్యవస్థ విఫలమైనట్టే. ప్రభుత్వ పథకాలు స్త్రీలకు ముఖ్యం గా ఒంటరి స్త్రీలకు లేదా ఒంటరి తల్లులకు తగిన భరోసా కల్పించడంలో విఫలమైనట్టే’ అని మొన్న శనివారం కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. దత్తత ఇచ్చిన తన బిడ్డను తిరిగి వెనక్కు తెచ్చుకోవడానికి ఒక మహిళ హైకోర్టును ఆశ్రయించగా ఆమె వాదనల సమయంలో న్యాయమూర్తులు ముహమ్మద్ ముష్టాక్, కౌసర్ ఎడప్పగత్ ఈ వ్యాఖ్య చేశారు. కేసు ఏమిటి? కేరళలో ఒక మహిళ తన సహచరునితో లివ్ - ఇన్ రిలేషన్లో ఉండేది. దానివల్ల వారికి సంతానం కలిగింది. అయితే ఆ తర్వాత వాళ్లు విడిపోయారు. ఆ సంతానం తల్లి దగ్గర ఉండిపోయింది. ఒంటరి తల్లిగా బిడ్డను పెంచడం ఈ సంఘంలో చాలా పెద్ద సవాలు అని భావించిన ఆ తల్లి ఆ బిడ్డను దత్తతకు ఇచ్చేసింది. ఇప్పుడు ఆ తండ్రి తిరిగి వచ్చాడు. వారు మళ్లీ కలిసి జీవించదలిచి దత్తత ఇచ్చిన బిడ్డ కోసం కోర్టు మెట్లెక్కారు. ఆ కేసు వాదనలు వింటూ న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యానం చేశారు. ఇంత ఆందోళన ఎందుకు? ‘తన బిడ్డను దత్తత ఇచ్చే ముందు ఆ తల్లి ఒక సామాజిక కార్యకర్తతో చేసిన చాట్స్ చూశాం. అందులో ఆమె ఎంత ఒత్తిడికి లోనయ్యిందో తెలుస్తోంది. ఆర్థికంగా, సామాజికంగా ఏ మద్దతు ఒంటరి తల్లులకు లభించదని, కనుక బిడ్డను పెంచలేనని ఆ తల్లి భావించింది. జన్మనిచ్చిన బిడ్డను దత్తత ఇచ్చేసింది. ఈ విధంగా చూసినట్టయితే ఒక ఒంటరి తల్లి ధైర్యంగా బతికేలా చేయడంలో ఈ వ్యవస్థ విఫలమైనట్టే. ప్రభుత్వం సింగిల్ మదర్స్ కోసం ఏం ఆలోచనలు చేస్తున్నట్టు? వారు ఆర్థికంగా, సామాజికంగా తగిన గౌరవంతో బతకడానికి ఎటువంటి చైతన్యం కలిగిస్తున్నట్టు’ అని కోర్టు అంది. మగతోడు లేకుండా బతకలేమా? అయితే ఒక రకంగా చూస్తే ఇది ‘మధ్యతరగతి’ సమస్యా? అనిపిస్తుంది. ఆర్థికంగా దిగువ వర్గాల్లో ఒంటరి తల్లులు ధైర్యంగా బతకడం చూడొచ్చు. సంపన్న వర్గాల్లో పెళ్లిని నిరాకరించి మరీ సింగిల్ మదర్స్ అవుతున్నవారు ఉన్నారు. అందరికీ తెలిసిన ఉదాహరణలు ఏక్తా కపూర్, సుస్మితాసేన్. దీనికి చాలా ఏళ్ల ముందు సింగిల్ మదర్‌గా తాను జీవించగలనని నీనా గుప్తా నిరూపించింది. మరోవైపు దిగువ వర్గాల్లోగాని, ఉన్నత వర్గాల్లో కాని విడాకులు ఒక సమంజసమైన పరిష్కారంగా భావించి విడిపోయే జంటలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత పిల్లలతో మిగిలిన తల్లులు ధైర్యంగా బతకడం కనిపిస్తూనే ఉంటుంది. ఎటొచ్చి మధ్యతరగతి మర్యాదలలో ‘మగతోడు’ ఒక తప్పనిసరి సాంఘిక చిహ్నంగా, భద్రతగా, రక్షణగా భావించే పరిస్థితితులు ఉన్నాయి. మధ్యతరగతి సమాజం లిఖించుకున్న విలువలు చాలామటుకు స్త్రీని ప్రశ్నించే, నిలదీసే, సరిదిద్దడానికే ప్రయత్నించేలా ఉంటాయి. అందుకే విడాకులకు వెరచి గృహహింసను భరించే స్త్రీలు, ఒంటరి స్త్రీలుగా ఉంటూ పిల్లలను పెంచడానికి భయపడే స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. చుట్టూ సవాళ్లు ఒకసారి భర్తతో లేదా సహజీవనం నుంచి విడిపోయాక స్త్రీలు ఒంటరిగా జీవించడానికే ఇష్టపడి తమ పిల్లలను ఒంటరిగానే పెంచుకుందామని అనుకున్నా వారికి సవాళ్లు చాలానే ఉంటాయి. ముఖ్యంగా వీరికి అద్దెకు ఇళ్లు దొరకడం ఒక సమస్య. ఇంటిపని, సంపాదన చూస్తూ పిల్లల అవసరాల గురించి సమయం పెట్టాలంటే వీలు కాదు. నమ్మకమైన బేబి సిట్టర్స్ దొరకడం ఒక సమస్య. సమాజం నుంచి మద్దతు దొరకదు. ఆర్థిక ఆలంబన ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఏమీ అందదు. మరో పెళ్లి చేసుకోమని సమాజం నుంచి వచ్చే వొత్తిడి. అవకాశంగా తీసుకుని అడ్వాన్స్ అయ్యే పురుషులతో సమస్య. ఇన్ని సమస్యలు ఉన్నాయి. అందుకే బహుశా ఆ కేరళ తల్లి తన బిడ్డను దత్తతకు ఇచ్చి ఉండవచ్చు. కోర్టు ఈ వ్యాఖ్యానాలు చేయడం వెనుక ఈ నేపథ్యం అంతా ఉంది. సమాజంలో చట్ట పరిధికి లోబడి తమకు నచ్చిన రీతిలో బతికే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. సింగిల్ మదర్‌గా ఎవరైనా జీవించదలిస్తే వారిని సమాజం లో భాగంగా చేసుకోవడం. గౌరవించడం, మద్దతు గా నిలవడం చేయవలసిన వ్యవస్థ సంపూర్ణంగా తయారు కాలేదని కేరళ ఉదంతం తెలియచేస్తోంది. - సాక్షి ఫ్యామిలీ -
సీఎం విజయన్‌కు తలబొప్పి
కొచ్చి: ఎన్నికల నేపథ్యంలో, బంగారం అక్రమ రవాణా కేసు తాజా పరిణామాలు కేరళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించేలా ఉన్నాయి. ప్రధానంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఇది పెద్ద తలనొప్పిలా తయారైంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్, అసెంబ్లీ స్పీకర్ పి శ్రీరామకృష్ణన్, మరో ముగ్గురు మంత్రులను గురించి ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేశ్ కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించినట్టు కస్టమ్స్ చీఫ్ కేరళ హైకోర్టుకి సమర్పించిన రిపోర్టులో తెలిపారు. ముఖ్యమంత్రి, స్పీకర్ సహా మరో ముగ్గురు మంత్రులు అక్రమ ఆర్థిక లావాదేవీలకు పాల్పడినట్టు స్వప్నా సురేశ్ దర్యాప్తులో వెల్లడించిన విషయం రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు కీలక ప్రచార అస్త్రంగా మారనుంది. అయితే అధికార సీపీఎం మాత్రం రానున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వ ఎత్తుగడగా ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్, స్పీకర్ శ్రీరామకృష్ణన్‌లు యుఏఈ కాన్సుల్ జనరల్ సహాయంతో అక్రమ ఆర్థిక లావాదేవీలకు పాల్పడినట్టు కీలక నిందితురాలు స్వప్న సురేశ్ స్పష్టం చేశారని, కస్టమ్స్ కమిషనర్ సుమిత్ కుమార్, కేరళ హైకోర్టుకి సమర్పించిన ఒక రిపోర్టులో తెలిపారు. తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్ మాజీ ఫైనాన్స్ చీఫ్, ఒమన్‌లోని మస్కట్‌కు 1,90,000 అమెరికన్ డాలర్లను(1.30 కోట్ల రూపాయలను) అక్రమ రవాణా చేసినట్లు డాలర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బంగారం స్మగ్లింగ్ కేసులో సహ నిందితులుగా ఉన్న స్వప్నా సురేశ్, సరిత్ పిఎస్‌లను, డాలర్ కేసుతో సంబంధం ఉన్నదన్న కారణంగా కస్టమ్స్ అధికారులు ఇప్పటికే అరెస్టు చేశారు. విజయన్‌కి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే హక్కులేదని, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చెన్నితాల అన్నారు. ఏప్రిల్ 6న జరిగే ఎన్నికల్లో కేరళలో తిరిగి లెఫ్ట్ ప్రభుత్వం వస్తుందని రూఢీ కావడంతోనే బీజేపీ ఆందోళనలో పడిందని సీపీఎం ఆరోపించింది. సీఎం విజయన్, ప్రధాన కార్యదర్శి, ఆయన వ్యక్తిగత సిబ్బందితో తనకు సన్నిహిత సంబంధాలున్నట్టు స్వప్న సురేశ్ పేర్కొన్నట్టు కస్టమ్స్ అధికారి తెలిపారు. ముఖ్యమంత్రి, స్పీకర్ ఆదేశాల మేరకు విదేశీ కరెన్సీని అక్రమంగా రవాణా చేసిన విషయం తనకు తెలుసునని స్వప్న అంగీకరించినట్లు కస్టమ్స్ కమిషనర్ వెల్లడించారు. ‘‘కాన్సులేట్ సాయంతో, ముఖ్యమంత్రి, స్పీకర్లు, విదేశీ కరెన్సీ అక్రమ రవాణా చేసిన విషయం తెలుసునని ఆమె స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గంలోని ముగ్గురు మంత్రులు, స్పీకర్ల అసంబద్ధమైన, అక్రమ కార్యకలాపాలను గురించి ఆమె బహిరంగపరిచారు’’అని కస్టమ్స్ అధికారులు హై కోర్టుకి సమర్పించిన రిపోర్టులో పేర్కొన్నారు. గత ఏడాది జూలై 5న తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్‌కు వస్తోన్న పార్శిల్స్‌లో 30 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో ఈ స్మగ్లింగ్ రాకెట్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత కేసుతో సంబంధం ఉన్న స్వప్నా సురేశ్ సహా 15 మందిని అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. -
కేరళ హైకోర్టులో సన్నీలియోన్‌కు ఊరట
తిరువనంతపురం : కేరళ హైకోర్టులో బాలీవుడ్ నటి సన్నీ లియోన్‌కు భారీ ఊరట లభించింది. చీటింగ్ కేసులో ఆమెను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. 2019లో కొచ్చిలో జరిగిన వేలంటైన్స్ డే ఫంక్షన్లో పాల్గొంటానని సన్నీలియోన్ రూ. 29 లక్షలు తీసుకున్నారని, కానీ రాలేదంటూ ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఆమెపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈవెంట్ కంపెనీ ఫిర్యాదు మేరకు సన్నీలియోన్‌పై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసిన పోలీసులు..ఇటీవల తిరువనంతపురంలో టీవీ షో కోసమని వచ్చిన సన్నీ లియోన్‌ను ప్రశ్నించి వాంగ్మూలం తీసుకున్నారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను బాలీవుడ్ బ్యూటీ ఖండించింది. ఈ కేసుపై ఆమె మంగళవారం కేరళ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన కేరళ హైకోర్టు.. సన్నీలియోన్‌ను అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. ముందుగా సన్నీలియోన్‌కు నోటీసులు ఇవ్వాలని సూచించింది. -
శబరిమల: హైకోర్టు ఆదేశాలు సుప్రీంలో సవాల్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోన్న తరుణంలో శబరిమలను దర్శించే భక్తుల సంఖ్యను పెంచుతూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. శబరిమల సందర్శనకు వచ్చే భక్తుల సంఖ్యను రోజుకి 3000 నుంచి 5000కు పెంచడం పోలీసులు, వైద్య అధికారులపై పెనుభారాన్ని మోపుతుందని కేరళ ప్రభుత్వం అభిప్రాయపడింది. డిసెంబర్ 20 నుంచి జనవరి 14 మకర సంక్రాంతి వరకు శబరిమల ఆలయ ఉత్సవాల సీజన్ కావడంతో కోవిడ్ ప్రబలే ప్రమాదాన్ని నివారించేందుకు భక్తుల సంఖ్యను నిర్ధారించేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నిర్ణయం మేరకు ప్రస్తుతం ప్రతి రోజూ 2000 మంది భక్తులను, వారాంతాల్లో 3,000 మంది భక్తులను అనుమతిస్తున్నారు. భక్తుల సంఖ్యను పెంచాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అవడంతో, డిసెంబర్ 18న కేరళ హైకోర్టు రోజుకి 5000 మంది భక్తులు ఆలయ సందర్శనకు అనుమతించొచ్చంటూ ఉత్తర్వులు జారీచేసింది. -
అర్థనగ్నంగా పెయింటింగ్స్.. అరెస్ట్ ఆలస్యం
తిరువనంతపురం : అర్ధనగ్న శరీరంపై పెయింటింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసులో సామాజిక కార్యకర్త రెహానా ఫాతిమాను అరెస్టు చేయడంలో ఆలస్యం జరుగుతోందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ముందస్తు బెయిల్ కోసం ఫాతిమా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసినప్పటికీ రెహనాను అరెస్టు చేయడంలో అధికారి విఫలమయ్యారని తిరువల్లాకు చెందిన న్యాయవాది ఏవీ అరుణ్ బుధవారం దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా రెహనా ఫాతిమా మంచం మీద అర్థనగ్నంగా చిన్నపిల్లలతో తన శరీరంపై పెయింటింగ్ వేయించుకోవడమే కాకుండా ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమెపై కేసు నమోదైన విషయం తెలిసిందే. చిన్నపిల్లలతో అర్థనగ్నంగా పెయింటింగ్స్ వేయించుకున్నందుకు ఆమెపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. (అర్థనగ్నంగా పెయింటింగ్, సోషల్ మీడియాలో దుమారం) పిటిషనర్ మాట్లాడుతూ.. జూన్ 25న రెహానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ పోలీసులు ఆమెను అరెస్టు చేయడంలో విఫలమయ్యారన్నారు. నిందితురాలిని అరెస్టు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్న దర్యాప్తు అధికారిని మార్చాలని దర్యాప్తును అసిస్టెంట్ కమిషనర్‌కు అప్పగించాలని కోర్టును షిటిషనర్ కోరారు. తన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిన 10 నిమిషాల్లోనే న్యాయవ్యవస్థను విమర్శిస్తూ ఫాతిమా ఓ వీడియోను అప్లోడ్ చేసిందని పిటిషనర్ ఆరోపించారు. ఆమె తన వీడియోలో మొత్తం న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నట్లు కనిపింస్తోందని పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కేరళ హైకోర్టు నిరాకరించడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఇది పెండింగ్‌లో ఉంది. (ఇల్లు ఖాళీ చెయ్) -
పిల్లి కోసం పోలీసులపై హైకోర్టులో పిటిషన్
కొచ్చి : కరోనావైరస్ నేపథ్యంలో దేశం మొత్తం లాక్డౌన్ పాటిస్తున్న వేళ కేరళ పోలీసుపై హైకోర్టులో వింత పిటిషన్ దాఖలైంది. తన పెంపుడు పిల్లులకు ఆహారం కొనేందుకు వాహన పాస్ నిరాకరించారని హైకోర్టును ఆశ్రయించారు ఓ వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. కొచ్చి ప్రాంతానికి చెందిన ఎన్ ప్రకాశ్ అనే ఓ వ్యక్తి మూడు పిల్లులను పెంచుకుంటున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో వాటికి ఆహారం కొనేందుకు వాహన పాస్ ఇవ్వాలంటూ ఏప్రిల్ 4న ఆన్లైన్ ద్వారా పోలీసులకు దరఖాస్తు పెట్టుకున్నారు. తాను శాకాహారినని, తన పిల్లులను ఇష్టమైన మియో పెర్సియన్ బిస్కెట్ల ఇంట్లో తయారు చేయలేనని, కోనేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులుకు విజ్ఞప్తి చేశారు. (చదవండి : మాస్క్‌లు ధరించకపోతే జరిమానా) అయితే ప్రకాశ్ చెప్పిన కారణం అత్యవసరమైనది కాదని భావించిన పోలీసులు ఆయనకు పాస్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో పోలీసుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రకాశ్ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జంతు హింస నిరోధక చట్టంలోని 3, 11 సెక్షన్ల ప్రకారం పెంపుడు జంతువులకు ఆహారం, వసతి పొందే హక్కు ఉందని ఆయన వాదిస్తున్నారు.కాగా, కేరళలో కరోనా బాధితుల సంఖ్య 314కు చేరింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు మృతి చెందారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య నాలుగు వేలు దాటింది. 109 మంది మరణించారు. -
మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. హైకోర్టు స్టే
తిరువనంతపురం : కేరళ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది. మద్యం అమ్మకాలకు షరతులతో కూడిన అనుమతులు ఇస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీసుకున్న నిర్ణయాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. మద్యం అమ్మకాలపై మూడు వారాల పాటు స్టే విధిస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జయశంకర్ నంబియార్, శజ్జీ పీ చాలేతో కూడిన ధర్మాసనం గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీర్పును వెలువరించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరపొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా దేశంలో కరోనా వైరస్ విజృభిస్తున్న తరుణంలో ప్రభుత్వం మద్యం అమ్మకాలకు అనుమతులు ఇవ్వడం సరికాదంటూ కాంగ్రెస్ ఎంపీ టీఎన్ ప్రతాపన్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపడుతూ.. న్యాయస్థానం స్టే విధించింది. కాగా దేశ వ్యాప్త లాక్డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూసి వేయడంతో మందుబాబులు మద్యం కోసం అల్లాడుతున్నారు. మందు దొరక్క ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు దేశ వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణ, కేరళలో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మందు బాబుల ఆర్తనాదాలు విన్న కేరళ ప్రభుత్వం మద్యం కావాల్సిన వాళ్లు వైద్యుడి దగ్గర నుంచి ప్రిస్క్రిప్షన్ లెటర్ తీసుకు వచ్చిన వారికి అనుమతి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆన్లైన్ ద్వారా ఇంటింటికీ మద్యం సరఫరా చేసే విధంగా కూడా కేరళ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో హైకోర్టు స్టే విధించింది. హైకోర్టు తీర్పుపై మందుబాబులు తీవ్ర నిరాశ చెందారు. (మందుబాబులకు కేరళ ప్రభుత్వం గుడ్‌న్యూస్) -
ప్రభుత్వానికి ఆ హక్కు ఉందా?
సాక్షి, న్యూఢిల్లీ : ఇంటర్నెట్ మా జన్మహక్కు అంటూ యంగ్ జనరేషన్ నినదిస్తోంది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామంటూ యువత ప్రభుత్వాలకు సవాలు విసురుతోంది. ఇంటర్నెట్ను పౌరుల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ కేరళ హైకోర్టు ఇటీవల సంచలన తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే దేశంలో తాజాగా నెలకొన్న పరిస్థితుల కారణంగా కేంద్ర ప్రభుత్వం అంతర్జాల సేవలను తొలగిస్తోంది. దీనిపై యువత తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి అల్లర్లు, ఆందోళనలు చోటుచేసుకున్నా.. ప్రభుత్వం వెంటనే చేపడుతున్న అత్యవసర చర్య ఇంటర్నెట్ నిలిపివేత. ముఖ్యంగా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో అత్యధికంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన ఘటనలు అందరికీ తెలిసిందే. ఆర్టికల్ 370తో మొదలుకొని ఎన్ఆర్సీ, పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజాగ్రహం కారణంతో ప్రభుత్వం ఇంటర్నెట్ను నిలిపివేస్తోంది. 2012 నుంచి దేశ వ్యాప్తంగా 374 సార్లు ఈ సేవలను ప్రభుత్వం కట్‌చేసింది. ముఖ్యంగా గడిచిన ఏడాదిలో కాలంలో (2019) వివిధ ప్రాంతాల వారిగా చూస్తే 100 సార్లకుపైగా ఇంటర్నెట్ సేవల నుంచి పౌరులను దూరం చేసింది. ఆర్టికల్ 370 రద్దుతో ఆగస్ట్ 5న కశ్మీర్ వ్యాప్తంగా అంతర్జాల సేవలను అక్కడి పౌరులకు ప్రభుత్వం నిరాకరించింది (కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది). ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతుండటం, సోషల్ మీడియా వేదికగా అల్లర్లకు పిలువునివ్వడం వంటి చర్యలను నివారించడానికే ఈ నిర్ణయమని ప్రభుత్వం చెబుతోంది. తాజాగా ఎన్ఆర్సీ, సీఏఏకు ఆందోళనల నడుమ ఎక్కడ నిరసనలు వినిపించినా ప్రభుత్వం వెంటనే ఇంటర్ నెట్‌ను నిలిపివేస్తోంది. ఉత్తర ప్రదేశ్ వ్యాప్తంగా సీఏఏపై ఆందోళనలు కొనసాగుతున్న క్రమంలో శుక్రవారం ప్రార్థనల దృష్ట్యా యూపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని నిలిపివేసింది. నిరసనలను పర్యవేక్షించేందుకు డ్రోన్లను రంగంలోకి దింపింది. పశ్చిమ యూపీలోని బిజ్నోర్, బులంద్ షహర్, ముజఫర్‌నగర్, మీరట్, ఆగ్రా, ఫిరోజాబాద్, సంభల్, అలీగఢ్, ఘజియాబాద్, రాంపూర్, సీతాపూర్, కాన్పూర్ జిల్లాల్లో ఇంటర్నెట్ను కట్‌చేశారు. దీంతో ప్రభుత్వ చర్యలపై పౌరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు కల్పించిన హక్కులను పాలకులు కాలరాస్తున్నారని మండిపడుతున్నారు. ఇంటర్నెట్ సేవలకు పౌరుల ప్రాథమిక హక్కు అని 2016లో ఐక్యరాజ్యసమితి ప్రకటించిన విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా పలువురు గుర్తుచేస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నష్టం కూడా చేకూరుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు.. కాగా ఇంటర్ నెట్ పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కుగా కేరళ హైకోర్టు ఇటీవల సంచలన తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఇంటర్ నెట్ నిలిపివేయడం అంటే పౌర హక్కులకు విఘాతం కల్పించడమే అని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం 20 లక్షల మంది పేద కుటుంబాలకు ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తున్నట్లు ప్రకటించింది. రూ.1548 కోట్ల ఖర్చుతో చేపట్టిన కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ప్రాజెక్టు 2020 డిసెంబరు నాటికి పూర్తికానుంది. కాగా 2018 నాటికి దేశంలో 48 కోట్ల మందికిపైగా ప్రజలు ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. 2023 నాటికి ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 68 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. అంటే దేశంలో సగానికిపైగా జనాభా ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తుంది. ఈ నేపథ్యంలో కేరళ హైకోర్టు తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎవరికైనా ఎక్కడైనా ఇంటర్నెట్ నిరాకరించడం అంటే..పౌరుల ప్రాథమిక హక్కును కాలరాయడమే అని పేర్కొంది. భవిష్యత్తులో దేశంలోని ప్రతి రాష్ర్ట ప్రభుత్వం ఇంటర్నెట్ సేవల్ని ప్రాథమిక హక్కుగా గుర్తించాల్సి ఉంటుందని సంకేతాలిచ్చింది. కాగా ఇంటర్నెట్ను ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తించిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది. -
బీజేపీ నేత దారుణ హత్య.. సంచలన తీర్పు
సాక్షి, తిరువనంతపురం: పదేళ్ల క్రితం జరిగిన బీజేపీ నేత దారుణ హత్య కేసులో కేరళ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పును వెలువరించింది. హత్య కేసులో ఐదుగురిని దోషులుగా తేల్చుతూ.. జీవితఖైదు శిక్షను విధించింది. వివరాలు.. కేరళలోని కాన్నూర్ జిల్లాలో తలసిరై వద్ద 2008లో బీజేపీ నేత కేవీ సురేంద్రన్ స్థానిక సీపీఎం కార్యకర్తల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో భార్య కళ్లముందే ఆయనను వేట కొడవళ్లతో నరికి చంపారు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తొలుత ఏడుగురిని అరెస్ట్ చేశారు. అయితే ఐదుగురికి సంబంధించిన సాక్ష్యాలను మాత్రమే కోర్టు స్వీకరించడంతో.. ఇద్దరికి కేసు నుంచి విముక్తి లభించింది. పదేళ్లకు పైగా సాగిన కేసు విచారణలో న్యాయమూర్తి శుక్రవారం తుది తీర్పును వెలువరించారు. బీజేపీ నేతను హత్య చేసిందుకు ఐదుగురికి జీవిత ఖైదుతో పాటు.. ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధించారు. ఈ డబ్బంతా సురేంద్రన్ భార్య ఖాతాలో జమచేయాలని కోర్టు ఆదేశించింది. కాగా ఘటన జరిగే ముందు కాన్నూర్ ప్రాంతంలో బీజేపీ, సీపీఎం కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చేటుచేసుకున్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకునే ఆయనను హత్య చేసినట్లు స్థానికులు చెపుతున్నారు. తాజా తీర్పు పట్ల ఆయన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. -
ఆమెకు 40, ఈమెకు 24.. సహజీవనం చేయొచ్చు
తిరువనంతపురం : స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు చట్టబద్దం చేయడంతో కేరళ హైకోర్టు మంగళవారం మరో సంచలన తీర్పును వెలువరించింది. ఓ 40 ఏళ్ల మహిళ, 24 యువతితో కలిసి జీవించవచ్చని అనుమతినిచ్చింది. సీకే అబ్దుల్ రహీమ్, నారయణలతో కూడిన డివిజన్ బెంచ్ ఇద్దరు మహిళలు సహజీవనం చేయవచ్చని తీర్పునిచ్చింది. కొల్లామ్‌లోని వెస్ట్ కల్లాడకు చెందిన శ్రీజ(40) తన పార్టనర్ అరుణ(24)ను కోర్టు ముందు హాజరుపరచాలని హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు అరుణతో కలిసి జీవించాలని ఉందని, దీనికి ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని, బలవంతంగా తన నుంచి ఆమెను దూరం చేశారని పేర్కొన్నారు. గత ఆగస్టు నుంచి తామిద్దరం కలిసే ఉంటున్నామని, అరుణ పేరేంట్స్ మాత్రం మిస్సింగ్ కేసు నమోదు చేసి తన నుంచి దూరం చేశారని తెలిపారు. అరుణను బలవంతంగా పిచ్చాసుపత్రిలో చేర్పించారని, ఎలాగోలా ఆమెను అక్కడ కలిసానని, కానీ ఆసుపత్రి వారు తనతో తీసుకెళ్లడానికి అనుమతినివ్వలేదన్నారు. దీంతో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశానన్నారు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు అరుణను తమ ముందు హాజరు పరచాలని పోలీసులను ఆదేశించింది. దీంతో వారు అరుణను మంగళవారం కోర్టు ముందు హాజరుపరిచారు. శ్రీజతో కలిసుండటంలో తన ఉద్దేశం ఏమిటో కోర్టుకు అరుణ వివరించింది. అలాగే పిటిషనర్ శ్రీజ ఇటీవల స్వలింగ సంపర్కం నేరం కాదంటూ.. సెక్షన్ 377ను సవరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. దీంతో ఈ ఇద్దరు సహజీవనం చేయవచ్చని కోర్టు తీర్పునిచ్చింది. -
మృగాళ్లలా ప్రవర్తించారు.. వదిలిపెట్టొద్దు
సంచలనం సృష్టించిన కొట్టాయం మహిళ గ్యాంగ్‌రేప్ కేసుపై కేరళ హైకోర్టు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నిందితులైన నలుగురు మత గురువులను తక్షణమే అరెస్ట్ చేయాలని బుధవారం పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిందితుల్లో ఒకరు లొంగిపోగా.. మరో ముగ్గురి కోసం పోలీసులు రాష్ట్రాన్ని జల్లెడ పడుతున్నారు. కొట్టాయం: గత నెలలో 34 ఏళ్ల తన భార్యపై నలుగురు మత గురువులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని చర్చి మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేస్తూ.. ఆమె భర్త ఓ ఆడియో క్లిప్ విడుదల చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావటంతో దుమారం చెలరేగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధిత మహిళ నుంచి ఫిర్యాదు నమోదు చేశారు. ‘20 ఏళ్ల క్రితం సదరు చర్చి ఫాదర్ లోబర్చుకున్నాడని, వివాహం చేసుకుంటానని నమ్మబలికి పలుమార్లు అత్యాచారం చేశాడని తెలిపింది. ఆపై పాపపరిహారం కోసం ముగ్గురు మత గురువులను ఆశ్రయించగా.. వాళ్లు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడి మరీ వాళ్లు కూడా తనపై అత్యాచారం చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. కాగా, 2006లో మహిళకు వివాహం కాగా, వాళ్ల వేధింపులు మాత్రం ఆగలేదంట. దీంతో జరిగిన విషయాన్ని భర్తకు వివరించగా.. ఆయన మత గురువుల ఆరాచకాలను వెలుగులోకి తెచ్చాడు. మృగాళ్లలా ప్రవర్తించారు.. కాగా, ఈ కేసులో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘మత గురువులు మృగల్లా ప్రవర్తించారు. ఓ మహిళపై 20 ఏళ్లుగా లైంగికదాడికి పాల్పడుతున్నారంటే వారిని మనుషులు పరిగణించాల్సిన అవసరం లేదు’ అని పేర్కొంది. అంతేకాదు వాళ్లు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చిన కోర్టు.. తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖను ఆదేశించింది. దీంతో నిందితుల్లో ఒకడైన ఫాదర్ జాబ్ మాథ్యూ పోలీసులకు గురువారం లొంగిపోయాడు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే కేరళలో గత 18 నెలలుగా.. మొత్తం 12 మంది మత గురువులను లైంగిక దాడుల కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. మేమేం రక్షించట్లేదు.. కాగా, ఈ వ్యవహారంలో చర్చి అధికారులపైనా విమర్శలు చెలరేగాయి. వారిని రక్షిస్తున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. ఫిర్యాదు అందగానే వారిని తొలగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశాం. ఇప్పుడు వారికి-చర్చికి ఎలాంటి సంబంధం లేదు’ అని ఓ ప్రకటనలో చర్చి మేనేజ్మెంట్ పేర్కొంది. -
యూట్యూబ్ వీడియోలతో రూ. 500 కోట్ల నష్టం...!
తిరువనంతపురం : సోషల్ మీడియాలో తమ బ్రాండ్ గురించి నకిలీ వార్తలు ప్రసారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రసిద్ధ ఆభరణాల సంస్థ కళ్యాణ్ జువెల్లర్స్ కేరళ హైకోర్టును ఆశ్రయించింది. నకిలీ ఆభరణాలు అమ్ముతున్నారంటూ జరుగుతున్న దుష్ప్రచారం వల్ల సుమారు 500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు కళ్యాణ్ జువెల్లర్స్ కేరళ బ్రాంచ్ పేర్కొంది. ఈ మేరకు కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపింది. వివరాలు... నకిలీ బంగారు ఆభరణాలు అమ్ముతున్న కారణంగా కళ్యాణ్ జువెల్లర్స్‌ను సీజ్ చేశారంటూ యూట్యూబ్‌లో వీడియోలు ప్రసారం కావడంతో కంపెనీ యాజమాన్యం కంగుతింది. కళ్యాణ్ జువెల్లర్స్ కువైట్ బ్రాంచ్‌లో జరిగిన సాధారణ తనిఖీలకు సంబంధించిన వీడియోలను ఎడిట్ చేసి ఈవిధంగా దుష్ప్రచారానికి పాల్పడుతున్నట్లు గుర్తించింది. దీంతో నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సాధారణ తనిఖీలను అవినీతి నిరోధక దాడులుగా చిత్రీకరించి ప్రత్యర్థి కంపెనీలు దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయని కళ్యాణ్ జువెల్లర్స్ ఆరోపించింది. తమ బ్రాండ్ విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా కళ్యాణ్ జువెల్లర్స్ లోగోతో యూట్యూబ్ చానల్లో నకిలీ వీడియోలను అప్లోడ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరింది. సోషల్ మీడియాపై సరైన నిఘా లేనందు వల్లే ఇలాంటి నకిలీ వార్తలు, వీడియోలు ప్రసారం అవుతున్నాయని ఆరోపించింది. కళ్యాణ్ జ్యువెల్లర్స్ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు.. సోషల్ మీడియా నకిలీ వార్తలు అదుపు చేసేందుకు క్రమబద్దీకరణలు ప్రవేశపెట్టాల్సిందిగా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా గతంలో కూడా కళ్యాణ్ జ్యువెల్లర్స్‌పై సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం జరిగింది. కళ్యాణ్ జువెల్లర్స్‌లో అమ్ముతున్న బంగారు ఆభరణాలు నకిలీవని ఐదుగురు వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీంతో గతేడాది నవంబర్‌లో కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దుబాయ్ పోలీసులు వారిని అరెస్టు చేశారు. అరెస్టయిన ఐదుగురు వ్యక్తులకు భారత మూలాలున్నాయని దుబాయ్ పోలీసులు అన్నారు. వీరిపై సైబర్ క్రైమ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. -
ఆ ఫొటోలో అశ్లీలత లేదు: హైకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: పసి పిల్లలకు చనుబాలు ఇచ్చేందుకు తల్లులు మొహమాటం వీడాలనే ఉద్దేశంతో కేరళకు చెందిన ‘గృహలక్ష్మి’ మేగజీన్ చేసిన ప్రయత్నం మంచిదేనని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. తల్లి బిడ్డ ఆకలి తీర్చుతున్న కవర్ ఫోటోపై అభ్యంతరాలు లేవని తెలిపింది. భారతీయ సంప్రదాయంలో మానవ దేహానికి ఎంతో ప్రాధాన్యం ఉందనీ, ప్రాచీన కళలు, బొమ్మల్లో మానవ దేహ సౌందర్యాన్ని వర్ణించారని తెలిపింది. అయితే, చూసే కళ్లను బట్టి దాని అంతరార్థం బోధ పడుతుందని పేర్కొంది. అజంతా చిత్రాలు, రవివర్మ పేయింటింగ్స్‌లో అశ్లీలతను చూసేవారు కొందరైతే, అద్భుత కళా సౌందర్యాన్ని చూసేవారు మరి కొందరని వివరించింది. విషయం.. దేశ వ్యాప్తంగా ప్రతియేడు తల్లిపాలు సరిపడా అందక దాదాపు లక్ష మంది శిశువులు డయేరియా, న్యూమోనియా బారినపడి చనిపోతున్నారు. విదేశాల్లో మాదిరిగా మన దేశంలో పిల్లలకు పాలు ఇవ్వడానికి సదుపాయాలు లేవు. జన సమూహ ప్రదేశాల్లో, బహిరంగంగా చిన్నారుల ఆకలి తీర్చడానికి తల్లులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తల్లులకు అవగాహన కల్పించాలనే సదాశయంతో గృహలక్ష్మి మేగజీన్ తన మార్చి సంచిక కవర్ ఫోటోపై మోడల్ గిలు జోసెఫ్ బిడ్డకు చనుబాలు ఇస్తున్న చిత్రాన్ని ప్రచురించింది. అయితే, స్త్రీ జాతిని అవమానిస్తున్నారని కొందరు, మోడల్ చేతిలో ఉన్న శిశువు హక్కులను కాలరాస్తున్నారని మరికొందరు సోషల్ మీడియాలో విమర్శించారు. కేరళకు చెందిన వినోద్ మాథ్యూ విల్సన్ మేగజీన్ నిర్వాహకులు, జోసెఫ్‌పై కేసు పెట్టారు. పిటిషన్లను విచారించిన హైకోర్టు కవర్ ఫోటోలో అశ్లీలత ఏమీ లేదని పేర్కొంటూ పై విధంగా తీర్పు వెలువరించింది. -
సంచలన తీర్పు: పెళ్లి చేసుకోకపోయినా కలిసుండొచ్చు
కొచ్చి: పెళ్లి చేసుకోకపోయినా ఓ 18 ఏళ్ల యువకుడు, 19 ఏళ్ల యువతి కలిసి ఉండవచ్చని కేరళ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. సహ జీవనాన్ని తప్పుబట్టలేమని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. యుక్త వయసులో ఉన్న యువతీ యువకులకు చట్టబద్ధంగా పెళ్లి చేసుకునే వయసు రాకపోయినా సహ జీవనం చేసే హక్కు ఉంటుందని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు వెలువడిన నెల రోజుల్లోనే కేరళ హైకోర్టు ఈ తీర్పు చెప్పింది. జస్టిస్ వీ చితంబరేష్, జస్టిస్ కేపీ జ్యోతీంద్రనాథ్లతో కూడిన ధర్మాసనం ఆ యువతి తండ్రి వేసిన హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్‌ను విచారించి కొట్టేసింది. ఈ పిటిషన్‌తో వాళ్లను విడదీయలేమని ఈ సందర్బంగా స్పష్టం చేసింది. ఇది సమాజ సాంప్రదాయాలకు విరుద్ధంగా అనిపించినా.. మేజర్లు కావడంతో రాజ్యాంగబద్ధంగా వాళ్లకు సంక్రమించిన హక్కులను గౌరవించాల్సిన అవసరం ఉన్నదని కోర్టు తెలిపింది. సదరు యువకుడికి చట్టబద్ధంగా పెళ్లి చేసుకొనే వయసు వచ్చే వరకు అతనితో స్వేచ్ఛగా జీవించే హక్కు ఆ యువతికి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. -
వైద్య వివరాలు ఇవ్వకపోవడం నేరం
ప్రయివేటు డాక్టరయినా ప్రభుత్వ డాక్టరయినా చికిత్సా వివరాల పత్రాలు ఇవ్వకపోతే వైద్యలోపం ఉందని భావిస్తారు. చికిత్సాపత్రాలు నిరాకరిస్తే అది వైద్యంలో నిర్లక్ష్యమే. వైద్యలోపానికి నష్టపరిహారం చెల్లించకతప్పదు. కేరళ హైకోర్టు రాజప్పన్ వర్సెస్ శ్రీ చిత్ర తిరునాల్ ఇన్సిటిట్యూట్ ఫర్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐ ఎల్ ఆర్ 2004 (2) కేరళ 150) కేసులో రోగుల సమాచార హక్కును చాలా స్పష్టంగా నిర్దేశించింది.‘‘మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ 1.3.1 ప్రకారం రోగ నిర్ధారణ, పరిశోధన, వాటిపైన సలహా, పరిశోధన తరువాత రోగ నిర్ధారణ జరిగితే ఆ వివరాలు, రోగికి ఇవ్వాలి. రెగ్యులేషన్ చివర ఇచ్చిన మూడో అనుబంధంలో పేర్కొన్న ప్రకారం కేస్ షీట్ ఇవ్వాలి. ఒకవేళ వ్యక్తి మరణిస్తే అన్ని కారణాలు తెలియజేసే వివరాలు అందులో ఉండాలి, డాక్టర్ ఏ మందులు ఎప్పుడు వాడాలో నర్సింగ్ సిబ్బందికి చెప్పిన సూచనలు కేస్ షీట్లో తేదీల వారీగా ఉండాలి. చికిత్స వివరాలు చాలా సమగ్రంగా ఉండాలి. రోగి గానీ అతని బంధువులు గానీ మెడికల్ రికార్డులు కావాలని అడిగిన తరువాత 72 గంటల్లో మొత్తం కేస్ షీట్ తదితర వివరాలు అందించాలి. ఈ రెగ్యులేషన్ల ద్వారా రోగికి తన రికార్డు కోరే హక్కును చట్టం గుర్తించింది. పొందే మార్గాలను కూడా నిర్దేశించింది.’’ రోగికి రికార్డు ఇవ్వకుండా మెడికల్ ప్రాక్టీషనర్కు ఏ మినహాయింపూ లేదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. కేస్ షీట్, మూడో అనుబంధపు వివరాలతో పాటు సంబంధిత పత్రాలు ఇంకేమయినా ఉంటే వాటినీ ఇవ్వాలి. ఏ చట్టంలోనూ దీనికి మినహాయింపు లేదనీ కనుక మొత్తం చికిత్స వివరాల ఫోటో కాపీలు ఇవ్వక తప్పదని కేరళ హైకోర్టు వివరించింది. హాస్పటల్ ఇచ్చిన ఈ మెడికల్ రికార్డును తమకు వ్యతిరేక సాక్ష్యంగా రోగులు వాడుకుంటారని వైద్యశాల యజమానులు వాదించారు. కాని ఈ కారణంపై వైద్యులకు మినహాయింపు ఇచ్చే అవకాశమే లేదని హైకోర్టు తెలిపింది. ఒకవేళ వైద్యులు సక్రమంగా వైద్యం చేసి ఆ వివరాలే నమోదు చేసి ఉంటే డాక్టర్లకు అది అనుకూల సాక్ష్యమవుతుంది. డాక్టర్లు తప్పు చేసి ఉంటే అందువల్ల నష్టపోయిన రోగులు సాక్ష్యంగా వాడుకోవలసిందే. మంచి చికిత్స చేసిన వారు కేసులు వస్తాయని భయపడాల్సిన పనే లేదు. తప్పుడు చికిత్స నిరోధించాలంటే రోగులకు చికిత్సచేసిన వివరాలకు సంబంధించి పూర్తి పారదర్శకత ఉండాల్సిందే. ఈ కేసులో న్యాయార్థికి తన కూతురికి చేసిన చికిత్సవివరాలు తీసుకునే హక్కు ఉందనీ, ఇచ్చే బాధ్యత డాక్టర్లపైన హాస్పటల్ పైన ఉందని హైకోర్టు వివరించింది. ఈ వైద్యవివరాలను నిరాకరించడం అంటే తన బాధ్యతానిర్వహణలో అది లోపమో నిర్లక్ష్యమో అవుతుందని అనేక హైకోర్టులు వినియోగదారుల హక్కుల న్యాయస్థానాలు వివరించాయి. కన్హయ్యాలాల్ రమణ్ లాల్ త్రివేది వర్సెస్ డాక్టర్ సత్యనారాయణ విశ్వకర్మ (1996, 3 సి.పి.ఆర్ 24 గుజరాత్) కేసులో ఆస్పత్రి అధికారులు, వైద్యులు రోగికి రికార్డులు ఇవ్వలేదు. దీన్ని వైద్య లోపంగానూ, నిర్లక్ష్యంగానూ నిర్ధారించింది. వారు మెడికల్ రికార్డులను కోర్టుకు సమర్పించడానికి కూడా నిరాకరించారు. నివేదికలను నిరాకరించడం వల్ల ఆ వైద్యులు అందించిన చికిత్సలో ప్రమాణాలు లోపించాయని భావించడానికి ఆస్కారం ఏర్పడింది. వారు రోగికి నష్టపరిహారం కూడా చెల్లించాల్సి వచ్చింది. పైగా రికార్డులలో ప్రస్తావించవలసిన వివరాలు కూడా తప్పనిసరిగా ఉండాలి. ఒక హాస్పటల్ వారు కేస్‌షీట్‌లో అనస్థటిస్ట్ పేరును తమ ఆపరేషన్ నోట్స్‌లో వెల్లడించలేదు. ఆకేసులో ఇద్దరు అనస్థటిస్టులు రోగికి అనస్థీషియా ఇచ్చారు. ఒకే రోగికి రెండు రకాల ప్రోగ్రెస్ కార్డులు ఉన్నాయని తేలింది. రెండు పత్రాలు విడిగా సమర్పించారు. దీన్ని బట్టి హాస్పటల్ వర్గాలు రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాయని మీనాక్షి మిషన్ హాస్పటల్ అండ్ రిసర్చ్ సెంటర్ వర్సెస్ సమురాజ్ అండ్ అనదర్ [I(2005) CPJ(NC)] కేసులో జాతీయ కమిషన్ తీర్పు చెప్పింది. (కేంద్ర సమాచార కమిషన్ నిర్వహించిన జాతీయ సదస్సులో వైద్యరంగం పారదర్శకతపై రచ యిత సమర్పించిన పరిశోధనా పత్రంలో భాగం). వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
‘ప్రపంచంలో ఎవరూ మమ్మల్ని విడదీయలేరు’
సాక్షి, న్యూఢిల్లీ : ‘మేము చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లిని కేరళ హైకోర్టు కూడా ధ్రువీకరించినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఇక ఈ ప్రపంచంలో ఎవరూ మమ్మల్ని విడదీయలేరు. నేను చచ్చేవరకు హిందువుగానే జీవిస్తాను. ఇక అనీస్ హమీద్ కూడా జీవితాంతం ముస్లింగానే జీవిస్తాడు’ అని 24 ఏళ్ల శృతి మెలెడత్ వ్యాఖ్యానించారు. అనీస్ హమీద్‌తో జరిగిన వివాహాన్ని అక్టోబర్ 19వ తేదీన హైకోర్టు ధ్రువీకరించాక ఆమె మీడియా ముందుకు రావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆమె ఎర్నాకులంలోని ‘శివశక్తి యోగ విద్యా కేంద్రం’లో అనుభవించిన నరకయాతనను, తనను పెళ్లి చేసుకోవడం కోసం ఆరు నెలలపాటు కోర్టుల చుట్టూ తిరుగుతూ హమీద్ అనుభవించిన బాధను మీడియాతో పంచుకున్నారు. కన్నూర్ యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న పిలాతర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శృతి, హమీద్‌లు 2010 నుంచి 2013 వరకు కలసి చదువుకున్నారు. అప్పుడే వారి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆ తర్వాత ఫిజిక్స్‌లో మాస్టర్ డిగ్రీ కోసం శృతి, కన్నూర్ యూనివర్శిటీకే అనుబంధంగా ఉన్న తాలిపరంబ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చేరారు. డిగ్రీ తర్వాత కోజికోడ్‌లో ప్రొఫెషనల్ సర్టిఫికెట్ కోర్సు చేసిన హమీద్ ఎంబీఏ కరస్పాండెన్స్ కోర్సు కూడా పూర్తి చేసి 2015లో ఢిల్లీలోని ఓ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా చేరారు. పీజీ పూర్తి చేసిన శృతిని పెళ్లి చేసుకోమంటూ తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తుండడంతో అప్పటికీ టచ్‌లో ఉన్న హమీద్‌తో విషయం చెప్పింది. తనను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటంతో హమీద్, శృతి ఇంటికి తన తల్లిని తీసుకొని వచ్చి పెళ్లి ప్రతిపాదన చేశారు. అందుకు శృతి తల్లిదండ్రులు ససేమిరా అంగీకరించలేదు. ఇక ఎప్పటికీ తమ పెళ్లిని శృతి తల్లిదండ్రులు ఒప్పుకోరని గ్రహించిన శృతి, హమీద్‌లు గత మే 16వ తేదీన ఢిల్లీకి పారిపోయారు. అక్కడి సోనెపట్‌లో కొన్ని రోజులు కలసి జీవించారు. ఇంతలో శృతి తలిదండ్రులు హమీద్‌కు వ్యతిరేకంగా క్రిమినల్ కేసు దాఖలు చేయడంతో కేరళ పోలీసులు వచ్చి శృతి, హమీద్‌లను అరెస్ట్‌చేసి తీసుకెళ్లారు. శృతిని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పిన పోలీసులు మే 21వ తేదీ ఉదయం 10.30 గంటలకు జుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఇంట్లో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్‌కు ‘లవ్ జిహాద్’ కేసని వివరించారు. శృతిని తల్లిదండ్రులకు అప్పగించాల్సిందిగా మేజిస్ట్రేట్ ఆదేశించారు. పోలీసులు అలాగే చేశారు. తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లాక ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవద్దంటూ శృతికి నయాన, భయాన చెప్పి చూశారు. ఎంతకు వినిపించుకోకపోవడంతో ఆమెను ఎర్నాకులంలోని శివశక్తి యోగా విద్యా కేంద్రంలో చేర్చారు. అక్కడ నరకాన్ని చూశాను! ఇతర మతంలోకి మారిన హిందువులను లేదా ఇతర మతాల వారిని పెళ్లి చేసుకున్న హిందూ మహిళలను హితబోధ ద్వారా మళ్లీ హిందూ మతంలోకి తీసుకరావడం ఈ యోగా విద్యా కేంద్రం ప్రధాన లక్ష్యం. కేరళలో ఇలాంటి కేంద్రాలు ఇంకా మూడు, నాలుగు పనిచేస్తున్నాయి. ఆ కేంద్రంలో తనతో అరవ చాకిరి చేయించారని, ఉదయం 4 గంటలకు ముఖాన నీళ్లు చల్లి బలవంతంగా లేపేవారని, వంట పాత్రలను కడగడంతోపాటు వంట చేయడం, యోగా కేంద్రాన్ని ఊడవడంతో సహా రాత్రి పది గంటల వరకు ఎడతెగని పని చేయించేవారని శృతి వివరించారు. తాను కేంద్రానికి వెళ్లినప్పుడు తనతోపాటు ఇతర మతాల యువకులను ప్రేమించిన 60 మంది యువతులు ఉన్నారని, వారందరితోని కూడా చాకిరి చేయించారని ఆమె చెప్పారు. హిత బోధనలు చేయడం కన్నా మతం మారినా, మతాంతర వివాహం చేసుకున్నా చంపేస్తామనే ఎక్కువ బెదిరించారని ఆమె తెలిపారు. జూన్ 26 నుంచి ఆగస్టు 22వ తేదీ వరకు అందులో నరకం అనుభవించానని చెప్పారు. కోర్టు జోక్యంతో న్యాయం హమీద్ తనను పెళ్లి చేసుకోవడం కోసం హెబియస్‌కార్పస్ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా న్యాయపోరాటం మొదలుపెట్టి విజయం సాధించారని శృతి తెలిపారు. కోర్టు జోక్యంతో తాము తిరిగి కలుసుకునే అవకాశం లభించడంతో అక్టోబర్ 9వ తేదీన ‘స్పెషల్ మారేజెస్ యాక్ట్’ కింద పెళ్లి చేసుకున్నాం. ఆ మరుసటి రోజే హైకోర్టుకు హాజరయ్యాం. సిరియాలో ఐఎస్ టెర్రరిస్టుల తరఫున యుద్ధం చేయడం కోసమే హమీద్ తనను పెళ్లి చేసుకున్నారని ప్రాసిక్యూటర్ వాదించారన్నారు. దాన్ని తాను తీవ్రంగా ఖంచించానని, కాలేజీ రోజుల నుంచి తమ మధ్యనున్న అనుబంధం గురించి వివరించానని చెప్పారు. చచ్చేవరకు హిందువుగానే జీవిస్తానని కూడా చెప్పానని ఆమె అన్నారు. తన ధైర్యానికి కోర్టు కూడా మెచ్చుకున్నదని తెలిపారు. తమ పెళ్లి చెల్లుతుందని కోర్టు ప్రకటించిందని చెప్పారు. అత్తా మామలను కూడా కోరుకుంటున్నాను మీడియాతోని శృతి మాట్లాడుతున్నంత సేపు మౌనంగా ఉన్న హమీద్, తాను అత్తామామలతో కూడా కలిసి ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. వారు మనసు మార్చుకునే వరకు తన ప్రయత్నాలను కొనసాగిస్తానని అన్నారు. వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడపండంటూ మీడియా విష్చేయగా, ఇంకా తమ కష్టాలు తీరలేదని, ఈ పాటికి తన ఉద్యోగం పోయే ఉంటుందని హమీద్ అన్నారు. తనకు ఐఎస్ టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ తనను అరెస్ట్ చేయడానికి ఢిల్లీ వచ్చిన కేరళ పోలీసు అధికారి తన బాస్‌తో చెప్పారని, అది బాస్ నమ్మి ఉంటే ఉద్యోగం పోవడం ఖాయమన్నారు. (ఇప్పటికీ మతతత్వ శక్తుల నుంచి శృతి, హమీద్ ప్రాణాలకు ముప్పు ఉండడంతో వారి ఫొటోలను గుర్తించేలా ప్రచురించడం లేదు) -
ఊరట.. ఇంతలోనే భారీ షాక్!
సాక్షి, కొచ్చి: క్రికెటర్ ఎస్ శ్రీశాంత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో శ్రీశాంత్‌పై విధించిన జీవితకాల నిషేధాన్ని పునరుద్ధరిస్తూ.. కేరళ హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు వెలువరించింది. శ్రీశాంత్‌పై భారత క్రికెట్ సంఘం (బీసీసీఐ) విధించిన జీవితకాల నిషేధాన్ని హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇటీవల ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఏకసభ్య ధర్మాసనం తీర్పును బీసీసీఐ ఉన్నత ధర్మాసనం ముందు సవాల్ చేసింది. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో దొరికిపోయిన శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేయడం సరికాదని బీసీసీఐ వాదనలు వినిపించింది. 2013 జూలైలో ఐపీఎల్-6 సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం భారత క్రికెట్‌ను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాపై బీసీసీఐ జీవితకాలం నిషేధించింది. ఊరట.. ఇంతలోనే షాక్! తనపై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ అవిశ్రాంతంగా పోరాడుతున్న శ్రీశాంత్‌కు గత ఆగస్టు నెలలో ఊరట లభించింది. శ్రీశాంత్‌పై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తివేస్తూ కేరళ హైకోర్టు ఆగస్టు 7న తీర్పునిచ్చింది. నిషేధాన్ని తొలగించాలంటూ బీసీసీఐ క్రమశిక్షణా కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. 2013లో జరిగిన ఐపీఎల్-6లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్ ప్రయత్నించినా బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా కేరళ హైకోర్టును శ్రీశాంత్ ఆశ్రయించాగా.. అతనికి ఊరట లభించింది. అయితే, కేరళ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ బీసీసీఐ.. ఉన్నత ధర్మాసనాన్ని ఆశ్రయించింది. అతడికి వ్యతిరేకంగా ఆధారాలు ఉండటంతోనే తాము నిషేధం విధించామని పేర్కొంటూ.. గతనెల పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ జరిపిన ఉన్నత ధర్మాసనం.. బీసీసీఐ వాదనను సమర్థిస్తూ.. అతడిపై నిషేధాన్ని పునరుద్ధరించింది. -
సూపర్ స్టార్ రిలీజ్: జైలువద్ద ఫ్యాన్స్ సందడి!
సాక్షి, కొచ్చి : ప్రముఖ మలయాళ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన నటుడు దిలీప్ జైలు నుంచి విడుదలవుతారని తెలియగానే ఆయన అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. తమ అభిమాన హీరో, సూపర్ స్టార్ దిలీప్ విడుదల కోసం అలువా జైలుకు ఆయన మద్ధతుదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మరోవైపు దాదాపు మూడు నెలల పోరాటం తర్వాత ఎట్టకేలకు మంగళవారం దిలీప్‌నకు కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. నటి కేసు విషయంలో 85 రోజుల తర్వాత జైలు నుంచి దిలీప్ విడుదల కానున్నారు. గత జూలైలో దిలీప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అలువా జైలుకు తరలించి విచారణ చేపట్టారు. గతంలో రెండు పర్యాయాలు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటీషన్లను కోర్టులు తిరస్కరించాయి. జూలై 24న తొలిసారి, ఆగస్టు 10న మరోసారి దిలీప్‌నకు బెయిల్ విషయంలో చుక్కెదురైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సునీని నటుడు దిలీప్ పురమాయించాడని పోలీసులు భావించారు. తమవద్ద ఈ కేసులో తగిన ఆధారాలున్నాయని, ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశముందని ప్రాసిక్యూషన్ వాదనతో న్యాయస్థానం ఏకీభవించి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. తాజాగా బెయిల్ కోసం దిలీప్ చేసుకున్న అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. తమ హీరో దిలీప్ జైలు నుంచి విడుదలకానున్నాడని తెలుసుకున్న ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. దిలీప్ విడుదల కోసం ఆయన ఉన్న అలువా జైలు వద్దకు భారీ సంఖ్యలో సూపర్ స్టార్ అభిమానులు తరలివస్తున్నారు. కొందరు హీరో కటౌట్లను జైలు వద్దకు తీసుకొచ్చి హడావుడి చేస్తున్నారు. -
నాలుగోసారి.. ఆయనకు సారీ!
సాక్షి, కోచి: ప్రముఖ మలయాళ నటిపై కారులో లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నటుడు దిలీప్‌కు మరోసారి చుక్కెదురైంది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు సోమవారం అంగమలై మేజిస్ట్రేట్ కోర్టు నిరాకరించింది. ఆయన బెయిల్ అభ్యర్థనను న్యాయస్థానాలు తిరస్కరించడం ఇది నాలుగోసారి. ఇప్పటికే ఆయన 71 రోజులు కస్టడీలో గడిపారు. గతంలో మూడుసార్లు ఆయన చేసుకున్న బెయిల్ అభ్యర్థనలను కోర్టులు తిరస్కరించాయి. దిలీప్ తాజా సినిమా 'రామాలీల' సెప్టెంబర్ 28న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన దిలీప్‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. నటిపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న దిలీప్‌కు వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాలు బలంగా ఉన్నాయని హైకోర్టు గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు తుదిదశలో ఉందని, చార్జ్‌షిట్ కూడా సిద్ధమవుతోందని, ఈ దశలో దిలీప్‌కు బెయిల్ ఇస్తే.. ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని హైకోర్టు వ్యాఖ్యానించింది. గత ఫిబ్రవరి 17న మలయాళ నటిని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అరెస్టయిన దిలీప్ జూలై 24న బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే, కేసులో కీలక మొబైల్‌ఫోన్ లభ్యం కాకపోవడంతో హైకోర్టు అప్పట్లో బెయిల్ నిరాకరించింది. -
సీఎంకు ఊరట, ఆధారాలు లేవన్న హైకోర్టు
తిరువనంతపురం: అవినీతి కేసులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. 1995 నాటి ఎస్ఎన్సీ-లావలీన్ అవినీతి కేసు నుంచి ఆయనకు విముక్తి కల్పించింది. ఈ కేసులో సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు లేవని.. పలువురు విద్యుత్ మంత్రులు ఎస్ఎన్సీ-లావలీన్‌తో సంప్రదింపులు సాగించారని కానీ సీబీఐ మాత్రం విజయన్ ఒక్కరినే నిందితుడిగా చేర్చిన అంశాన్ని కోర్టు లేవనెత్తింది. 2013, నవంబర్ 5న విజయన్‌తో పాటు ఆరుగురిని సీబీఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. వీరికి వ్యతిరేకంగా ఆధారాలు సమర్పించడంలో సీబీఐ విఫలం కావడంతో న్యాయస్థానం వీరికి విముక్తి ప్రసాదించింది. దీంతో సీబీఐ.. హైకోర్టును ఆశ్రయించింది. 1995లో సంకీర్ణ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన విజయన్ రూ.374 కోట్లతో మూడు జల విద్యుత్ ప్రాజెక్టుల ఆధునీకరణ పనులు చేపట్టినప్పుడు కెనడా కంపెనీ ఎస్ఎన్సీ-లావలీన్ కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారని ఆయనపై సీబీఐ అభియోగాలు మోపింది. -
శ్రీశాంత్ కు తప్పని తిప్పలు!
కొచ్చి:తనపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) విధించిన జీవితకాల నిషేధాన్నిఇటీవల కేరళ హైకోర్టు ఎత్తివేసినా క్రికెటర్ శ్రీశాంత్ కు తిప్పలు తప్పడం లేదు. తాను స్కాట్లాండ్ లీగ్ ఆడటానికి ఎన్ఓసీ ఇచ్చే క్రమంలో బీసీసీఐ నుంచి ఎటువంటి స్పందనా లేదంటూ మరోసారి కేరళ హైకోర్టును ఆశ్రయించాడు శ్రీశాంత్. ఆ ఎన్ఓసీని స్కాట్లాండ్ క్రికెట్ అధికారులకు ఇవ్వాల్సిన అవసరముందని, ఆ మేరకు బీసీసీఐ చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని శ్రీశాంత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. స్కాట్లాండ్ లీగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చేసిందని, తనకు తొందరగా ఎన్ఓసీ ఇవ్వకపోతే ఆ లీగ్ లో ఆడే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతానని శ్రీశాంత్ పిటిషన్ లో పేర్కొన్నాడు. ఇదిలా ఉంచితే,శ్రీశాంత్ పై జీవితకాల నిషేధాన్ని కేరళ హైకోర్టు ఆగస్టు 7వ తేదీన ఎత్తివేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తీర్పుపై న్యాయపోరాటానికి సిద్ధమైంది బీసీసీఐ. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసే యోచనలో బీసీసీఐ ఉంది.ఒకవేళ బీసీసీఐ కోర్టుకు వెళితే మాత్రం స్కాట్లాండ్ లీగ్ కు సంబంధించి శ్రీశాంత్ కు ఎన్ ఓసీ రావడం కష్టమే. -
మతమార్పిడులపై హైకోర్టు సీరియస్
బలవంతపు మత మార్పిడులు, లవ్ జీహాద్ కేసుల వ్యవహారం జాతి ప్రయోజనాలకు భంగకరంగా ఉందని కేరళ హైకోర్టు మండిపడింది. దీనిపై వెంటనే సమగ్రంగా విచారణ జరపాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. తన ముందుకు వచ్చిన రెండు కేసుల విషయంల కోర్టు తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ఘటనల్లో డీజీపీ స్వయంగా విచారణను పర్యవేక్షించి, దోషులను కఠినాతి కఠినంగా శిక్షించాలని తెలిపింది. 24 ఏళ్ల వయసున్న హిందూ యువతిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్పించి, ఆమెకు ఓ ముస్లిం వ్యక్తితో 2016 డిసెంబర్ నెలలో చేసిన పెళ్లి చెల్లుబాటు కాదని చెబుతూ, ఇలాంటి విషయాలపై తక్షణం దృష్టి పెట్టాలని డీజీపీని ఆదేశించింది. మతమార్పిడులను ప్రోత్సహిస్తున్న సంస్థల పాత్రపై విచారణ జరపాలని, మొత్తం రాష్ట్రమంతా డీజీపీ పరిధిలోనే ఉంటుంది కాబట్టి ఆయన వీటిని పర్యవేక్షించాలని జస్టిస్ కె. సురేంద్రమోహన, జస్టిస్ అబ్రహం మాథ్యూలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. లవ్ జీహాద్, మతమార్పిడుల కోసం ప్రత్యేకంగా కొన్ని సంస్థలే ఉండటం దారుణమని వ్యాఖ్యానించింది. ముందుగా హిందూ యువతులను ప్రేమలోకి దించి తర్వాత వారిని బలవంతంగా మతమార్పిడి ద్వారా ఇస్లాం మతంలోకి మార్చి అప్పుడు వారిని పెళ్లి చేసుకోవడాన్నే లవ్ జీహాద్ అంటున్నారు. కేరళలో ఇందుకోసం ఏకంగా కొన్ని సంస్థలే ఏర్పాటయ్యాయి. తన కూతురిని కొన్ని సంస్థలు బలవంతంగా మతం మార్పించి, ఒక ముస్లిం వ్యక్తితో ఆమె పెళ్లి చేస్తున్నాయని ఓ యువతి తండ్రి 2016 ఆగస్టులో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమెను బలవంతంగా సిరియా పంపి, ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలలో చేర్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాను మేజర్‌నని, తన ఇష్టం మేరకే మతం మారి పెళ్లి చేసుకున్నానని ఆమె కోర్టులో చెప్పినా, కోర్టు మాత్రం ఆ వివాహాన్ని చట్టపరంగా రద్దుచేసి, ఆమెను తల్లిదండ్రులకు అప్పగించింది. హోమియోపతి వైద్యవిద్య చదువుతున్న 24 ఏళ్ల యువతి అన్నీ వదిలిపెట్టి ఉన్నట్టుండి మతం మారి వేరే వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందని, దాని వెనక కొంతమంది బలవంతం ఉందన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
శ్రీశాంత్‌పై నిషేధాన్ని ఎత్తివేయండి
బీసీసీఐకి కేరళ హైకోర్టు నోటీసు న్యూఢిల్లీ: తనపై విధించిన జీవితకాల నిషేధం తొలగింపుపై అవిశ్రాంతంగా పోరాడుతున్న పేస్ బౌలర్ ఎస్.శ్రీశాంత్‌కు ఇది ఊరటనిచ్చే విషయమే. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విధించిన ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ బుధవారం అతడు కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ విచారణలో 34 ఏళ్ల కేరళ స్పీడ్‌స్టర్‌కు హైకోర్టు సాంత్వన కలిగించింది. వెంటనే అతడిపై ఉన్న జీవితకాల నిషేధాన్ని ఎత్తేయాల్సిందిగా బీసీసీఐకి కోర్టు నోటీస్ పంపింది. 2013లో జరిగిన ఐపీఎల్–6 సీజన్లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్ ప్రయత్నించినా బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది. గత నెల 16న శ్రీశాంత్ లీగల్ నోటీస్ పంపినా బీసీసీఐ పట్టించుకోలేదు. అయితే స్కాటిష్ క్లబ్ తరఫున లీగ్ క్రికెట్ ఆడేందుకు అతను ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతకంటే ముందుగా ఏప్రిల్‌లో జరిగే ఈ టోర్నీలో ఆడేందుకు బోర్డు నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తీసుకోవడం తప్పనిసరి. కానీ బోర్డు నుంచి స్పందన కనిపించకపోవడంతో శ్రీశాంత్ కోర్టుకెక్కాడు. -
శ్రీశాంత్‌కు భారీ ఊరట!
న్యూఢిల్లీ: తనపై విధించిన జీవితకాల నిషేధం తొలగింపుపై అవిశ్రాంతంగా పోరాడుతున్న టీమిండియా పేసర్ ఎస్.శ్రీశాంత్‌కు ఇది ఊరటనిచ్చే విషయమే.. బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని సవాల్ చేస్తూ బుధవారం అతడు కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ విచారణలో 34 ఏళ్ల కేరళ స్పీడ్‌స్టర్‌కు హైకోర్టు స్వాంతన కలిగించింది. వెంటనే అతడిపై ఉన్న జీవితకాల నిషేధాన్ని ఎత్తేయాల్సిందిగా బీసీసీఐకి నోటీసులు పంపింది. 2013లో జరిగిన ఐపీఎల్-6 సీజన్లో శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్ ప్రయత్నించినా బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది. గత నెల 16న శ్రీశాంత్ లీగల్ నోటీస్ పంపినా బీసీసీఐ పట్టించుకోలేదు. అయితే స్కాటిష్ క్లబ్ తరఫున లీగ్ క్రికెట్ ఆడేందుకు తను ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతకంటే ముందుగా ఏప్రిల్‌లో జరిగే ఈ టోర్నీలో ఆడేందుకు బోర్డు నుంచి ఎన్ఓసీ తీసుకోవడం తప్పనిసరి. కానీ బోర్డు నుంచి స్పందన కనిపించకపోవడంతో శ్రీశాంత్ కోర్టుకెక్కాడు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ తనకు వ్యతిరేకంగా ఈ కేసును రూపొందించిందని, అప్పట్లో బోర్డు ప్యానెల్ కూడా ఉద్దేశపూర్వకంగానే వ్యతిరేక విచారణ చేపట్టిందని తన అఫిడవిట్లో శ్రీశాంత్ పేర్కొన్నాడు. -
'నాపై నిషేధం ఎత్తివేయమని ఆదేశాలివ్వండి'
కొచ్చి: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)చే జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న కేరళ పేసర్ శ్రీశాంత్ తన ప్రయత్నాల్ని ముమ్మరం చేశాడు. ఇటీవల తనపై నిషేధం ఎత్తివేయాలని బీసీసీఐ కొత్త పరిపాలన కమిటికీ లేఖ రాసిన శ్రీశాంత్ కు అక్కడ నిరాశే ఎదురుకావడంతో తాజాగా కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై విధించిన జీవితకాల నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేరళ హైకోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. స్కాట్లాండ్ లీగ్ తరపున ఆడేందుకు శ్రీశాంత్ ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో అతనికి క్లియరెన్స్ లభించాల్సి ఉంది. ఏప్రిల్ తొలి వారంలో స్కాట్లాండ్ ప్రీమియర్ లీగ్ ఆరంభం కానున్నతరుణంలో తనకు ఎన్ఓసీ కావాలంటూ బీసీసీఐకి శ్రీశాంత్ విన్నవించాడు. అయితే దీనికి బీసీసీఐ నిరాకరించడంతో శ్రీశాంత్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాడు. దీనిలో భాగంగా కేరళ హైకోర్టును శ్రీశాంత్ ఆశ్రయించాడు. 2013లో శ్రీశాంత్ పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో అతనిపై జీవితకాలం నిషేధం విధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే 2015లో అతడు ఏ తప్పు చేయలేదంటూ ఢిల్లీ కోర్టులో క్లీన్చిట్ లభించింది. కాగా, అతనికి కోర్టు నుంచి క్లీన్ చిట్ లభించినా,బీసీసీఐ పెద్దలు మాత్రం అతనిపై నిషేధాన్ని కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా పలుమార్లు బీసీసీఐకి శ్రీశాంత్ విజ్ఞప్తి చేసి విఫలమయ్యాడు. కొన్ని రోజుల క్రితం బీసీసీఐ పాలన వ్యవహారాలను చూస్తున్న వినోద్ రాయ్ కు శ్రీశాంత్ ఓ లేఖ రాసినా ఉపయోగం లేకుండా పోయింది. దాంతో శ్రీశాంత్ కోర్టు మెట్లెక్కాడు. -
మీడియా - లాయర్లు డిష్యుం డిష్యుం
కేరళలో ఇప్పుడు మీడియాకు, లాయర్లకు మధ్య ఒకరకమైన యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ ఇద్దరూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. దాంతో ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ను కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ వివాదానికి వీలైనంత త్వరగా ఫుల్స్టాప్ పెట్టాలని ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితాల అన్నారు. కోర్టు తీర్పులను కోర్టు కార్యాలయం నుంచి పొందేవరకు ఊరుకోవాలని.. అప్పటివరకు అసౌకర్యాన్ని భరించాలని మీడియాకు కేరళ హైకోర్టు అధికారులు మంగళవారం నాడు చెప్పారు. హత్యకేసులో తీర్పు వెల్లడించే సమయంలో మీడియాను కోర్టు హాల్లోకి అనుమతించబోమని లాయర్లు కొల్లాం జిల్లా కోర్టుకు చెప్పారు. తమను లోనికి అనుమతించడం లేదు కాబట్టి, పోలీసులు అందించే సమాచారం మీదే ఆధారపడాల్సి ఉంటుందని పాత్రికేయులు అంటున్నారు. ఈ గొడవ అంతా కేరళ హైకోర్టులోనే మొదలైంది. అక్కడ ఇరువర్గాల వారు దాదాపు కొట్టుకున్నంత పనైంది. తిరువనంతపురం జిల్లాకోర్టు గేట్లను లాయర్లు మూసేసి.. బయట ఉన్న జర్నలిస్టులపై రాళ్లు విసిరారు. దాంతో ఐదుగురు జర్నలిస్టులు గాయపడ్డారు. దాంతో ఈ విషయం ఏంటో చూడాలని జస్టిస్ కురియన్ జోసెఫ్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ తెలిపారు. చివరకు కేరళ హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో సమావేశమై, వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇరు వర్గాల ప్రతినిధులతో సమావేశమైన సీఎం పినరయి విజయన్ కూడా.. గొడవ పెద్దది కాకుండా చూసుకోవాలన్నారు. కోర్టులలోకి తమను రానివ్వకపోవడంపై పాత్రికేయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
అప్పుల వసూలుకు వస్తాదులొద్దు
కొచ్చి: రుణగ్రహీతల నుంచి అప్పులు వసూలు చేసేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కండలుతిరిగిన వస్తాదులను నియమించడం అనైతికం, అన్యాయమని కేరళ హైకోర్టు పేర్కొంది. వస్తాదులను పంపి రుణగ్రహీతలను వేధించి, భయపెట్టి అప్పులు రాబడుతున్నారని, దీనికి డిటెక్టివ్ ఏజన్సీలనూ వాడుతున్నారని జడ్జి జస్టిస్ సురేశ్ అన్నారు. ఇది చట్టప్రకారం నేరమన్నారు. ఓ ప్రైవేట్ డిటెక్టివ్ సంస్థ ఒక బ్యాంకుపై వేసిన పిటిషన్‌ను జడ్జి విచారించారు. -
చాందీకి ఉపశమనం
సోలార్ కుంభకోణంలో ఎఫ్ఐఆర్ నమోదుపై హైకోర్టు స్టే విజిలెన్స్ జడ్జి తప్పుకోవాలని ఆదేశం తిరువనంతపురం: కేరళ ప్రభుత్వాన్ని కుదిపేసిన సోలార్ స్కాంలో సీఎం ఊమెన్ చాందీకి కేరళ హైకోర్టు తీర్పు ఉపశమనం కలిగించింది. చాందీపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ.. విజిలెన్స్ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. దీంతో పాటు సీఎం, మంత్రిపై ఎఫ్ఐఆర్కు ఆదేశాలిచ్చిన సదరు జడ్జిని విధులనుంచి తప్పుకోవాలని అధికారులను ఆదేశించింది. ‘జడ్జి తన పరిధిని తెలుసుకోకుండా, వాస్తవాలు గుర్తించకుండా న్యాయపరమైన తప్పిదాలు చేశారు’ అని హైకోర్టు మండిపడింది. హైకోర్టు తీరుపై నిరసన తెలిపిన విజిలెన్స్ జడ్జి ఎస్ఎస్ వాసన్.. స్వచ్ఛంద పదవీ విరమణ (మే, 2017లో రిటైర్మెంట్ ఉంది)కు అనుమతివ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ను కోరారు. కాగా, చాందీ స్పందిస్తూ.. ‘ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది. నాపై ఆరోపణలన్నీ రాజకీయ కుట్రలో భాగమని ప్రజలకు అర్థమైంది. నిర్దోషిగా బయటికొస్తా’ అని అన్నారు. లిక్కర్ లాబీ, సీపీఎం కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రపన్నుతున్నాయన్నారు. సరిత తాజా ఆరోపణలు.. స్కాంలో.. సీఎంపై ఆరోపణలు చేసిన సరిత నాయర్ శుక్రవారమూ సోలార్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. సీఎంతో పాటు ఆయన కుమారుడు చాందీ ఊమెన్‌పై తాజాగా ఆరోపణలు చేశారు. ‘కేరళ పునరుత్పాదక శక్తి సహకార సొసైటీ స్థాపించమని సీఎం చెప్పారు. ఇందులో ఆయన కుమారుడితోపాటు పలువురు కుటుంబ సభ్యులనూ చేర్చుకోమన్నారు. ఇప్పటికే ఓ అమెరికా కంపెనీలో భాగస్వామిగా ఉన్న సీఎం కుమారుడు.. అక్కడ తయారైన సోలార్ ప్లేట్లను ఈ కంపెనీ దిగుమతి చేసుకోవాలన్నారు’ అని ఆరోపించారు. కాగా, చాందీ రాజీనామా చేయాలని విపక్ష ఎల్డీఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టింది. డీవైఎఫ్ఐ కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. -
నక్సలైట్ కావడం నేరం కాదు: కేరళ హైకోర్టు
కొచ్చి: మావోయిస్ట్ కావడం నేరం కాదని కేరళ హైకోర్టు తేల్చి చెప్పింది. ఒక వ్యక్తిని నక్సలైట్ అనే ఏకైక కారణంతో అరెస్ట్ చేయడం కుదరదని స్పష్టం చేసింది. మన రాజ్యాంగ విధానాలతో వారి రాజకీయ సిద్ధాంతాలకు వైరుధ్యం ఉన్నప్పటికీ.. మావోయిస్టుగా ఉండటాన్ని నేరంగా పరిగణించలేమంది. ఆకాంక్షల ఆధారంగా ఆలోచించడం మానవుల మౌలిక హక్కని పేర్కొంది. ఒకవేళ వ్యక్తి కానీ, సంస్థ కానీ భౌతిక హింసకు పాల్పడటం లాంటి చర్యలకు పాల్పడితే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, చట్టపర చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. నక్సల్‌గా పేర్కొంటూ శ్యామ్ బాలకృష్ణన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం తీర్పు ఇస్తూ న్యాయమూర్తి జస్టిస్ మొహమ్మద్ ముస్తాఖ్ పై వ్యాఖ్యలు చేశారు. నేరం చేశాడనేందుకు ఆధారాలు లేకుండానే, కేవలం అనుమానిత మావోయిస్ట్ అనే ఏకైక కారణంతో బాలకృష్ణన్‌ను అరెస్ట్ చేశారని నమ్ముతున్నట్లు తెలిపారు. అరెస్ట్ చేయడం ద్వారా బాలకృష్ణన్ వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించారని పేర్కొంటూ.. బాలకృష్ణన్‌కు రెండు నెలల్లోగా రూ.లక్ష పరిహారంగా అందించాలని, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో పదివేలు ఇవ్వాలని తీర్పునిచ్చారు. -
'మావోయిస్టు కావడం నేరం కాదు'
కేవలం మావోయిస్టు కావడం ఏమాత్రం నేరం కాదని కేరళ హైకోర్టు భావించింది. ఓ కేసులో తీర్పు ఇచ్చే సమయంలో న్యాయమూర్తి ఈ వ్యాఖ్య చేశారు. దేశంలో ఉన్న చట్టాలను ఉల్లంఘించినప్పుడు మాత్రమే అవి చట్టవ్యతిరేక కార్యకలాపాలు అవుతాయని కోర్టు రూలింగ్ ఇచ్చింది. కేవలం మావోయిస్టు అయినంత మాత్రాన ఏ ఒక్క వ్యక్తినీ రిమాండుకు లేదా కస్టడీకి పంపడానికి వీల్లేదని జస్టిస్ ఎ. ముస్తాఖ్ తెలిపారు. శ్యాం బాలకృష్ణన్ అనే వ్యక్తిని మావోయిస్టుగా అనుమానించి అతడిని అదుపులోకి తీసుకున్న కేసు విచారణ అనంతరం తీర్పు ఇచ్చే సమయంలో ఆయనీ విషయాలు చెప్పారు. ఈ కేసులో శ్యాం బాలకృష్ణన్‌కు లక్ష రూపాయలకు పైగా పరిహారం ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. ఇలాంటి కేసుల్లో ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా కేరళ హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. -
ప్రభుత్వ మద్యం విధానానికి హైకోర్టు సమర్ధన
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వ మద్యం విధానాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు సమర్ధించింది. కేరళలోని బార్ యజమానులకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువడింది. ఫైవ్ స్టార్ హోటల్స్, అనుమతించిన బార్లలో మాత్రమే మద్యం విక్రయించాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఫైవ్ స్టార్ హోటళ్లలో తప్ప మిగిలిన చోట్ల మద్యం విక్రయించడాన్ని నిషేధిస్తూ కేరళ ప్రభుత్వం గత సంవత్సరం సెప్టెంబరులో ఆదేశాలు జారీ చేసింది. కొత్త విధానంతో రాష్ట్రంలోని దాదాపు 730 బార్లను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్య వివక్షతతో కూడినదిగా వుందని బార్ యజమానులు విమర్శిం చారు. దీనివల్ల తాము చేసే వ్యాపారం కోల్పోవడమే కాకుండా, పర్యాటక రంగం కూడా దెబ్బతింటుం దని అన్నారు. ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ బార్ యజమానులు హైకోర్టుని, ఆ తరువాత సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. బార్ యజమానులు పెట్టుకున్న పిటిషన్‌ను విచారించేందుకు కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ అంగీకరించింది. హైకోర్టు దీన్ని పరిష్కరించేవరకు దీనిఅమలుపై స్టే విధించాలని కోరుతూ బార్ యజమానులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త మద్యం విధానం వెనుక గల తార్కికతను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రవ్యాప్తంగా గల 730 బార్లు నాసిరకం ప్రమాణాలతో వున్నాయని ముద్ర వేస్తూ, ఫైవ్ స్టార్ హోటళ్ళలో మాత్రం ఎలాంటి ఆంక్షలు లేకుండా వదిలివేయడాన్ని కోర్టు ప్రశ్నించింది. ''ఇందులో ఎలాంటి లాజిక్ లేదు. అసలు నాసిరకం ప్రమాణాలంటే మీ అర్ధం ఏంటి? నేను ఆల్కహాల్ తాగను. అయినా ఇందులో నాకు లాజిక్ కనపడడం లేదు. మీరు దీన్ని ఎలా సమర్ధిస్తారు?'' అని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ, మద్యం అమ్మడం బార్ యజమానుల ప్రాధమిక హక్కేమీ కాదన్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. ఏ సమయంలోనైనా బార్ లైసెన్సులు రద్దు చేస్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్వర్తులపై స్టే విధిస్తూ కొత్త మద్య విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను వేగంగా పరిష్కరించాలని కేరళ హైకోర్టును సుప్రీం ఆదేశించింది. వాదప్రతివాదనలు విన్న అనంతరం కేరళ హైకోర్టు ప్రభుత్వ విధానాన్ని సమర్ధిస్తూ తీర్పు చెప్పింది. -
జస్టిస్ కృష్ణయ్యర్‌కు న్యూడెమోక్రసీ నివాళి
సాక్షి, హైదరాబాద్ : తన జీవితమంతా ప్రజల పక్షం వహించి, ప్రజల ప్రయోజనాల కోసమే నిలబడి, దేశంలో సామ్యవాద సమాజ స్వప్నాన్ని సాకారం చేయాలని గాఢంగా కోరుకున్న జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్‌కు సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి రాయల సుభాష్ చంద్రబోస్ నివాళులర్పించారు. కేరళ హైకోర్టు న్యాయవాదిగా పనిచేసిన ఆయన, 1957లో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలో కేరళలో ఏర్పడిన మొదటి కమ్యూనిస్టు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారన్నారు. భూసంస్కరణల అమలుకు, ఇంకా అనేక ప్రజా అనుకూల చర్యల అమలుకు కృషి చేశారన్నారు. మొదట హైకోర్టు న్యాయమూర్తిగా, ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రాజ్యాంగాన్ని, చట్టాలను ప్రజలకు అనుకూలంగా వ్యాఖ్యానించి, వారికి అనుకూలంగా తీర్పునిచ్చేందుకు కృషిచేశారని పేర్కొన్నారు. -
'లిక్కర్ షాపులను హైవేల నుంచి తొలగించండి'
కొచ్చి:జాతీయ రహదారులపై ఉన్న మద్యం షాపులను వేరే చోటుకి తరలించాలని కేరళ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మద్యం షాపులు హైవేలపై ఉండటం వల్ల ప్రమాదాలు అధికమవుతున్నాయనే ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్)ను స్వీకరించిన హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. హైవే మార్గంలో మద్యం షాపులు ఉండటం వల్ల వాహన డ్రైవర్లు సులువుగా మద్యాన్ని సేవించి ప్రమాదాలు కారణమతున్నారని ఆ పిటీషన్ లో పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న 169 లిక్కర్ షాపులను వేరే చోటకి తరలించాలని ప్రభుత్వానికి సూచించింది. దీనిపై ప్రభుత్వం రెండు వారాల్లో నివేదిక అందజేయాలని జస్టిస్ అశోక్ భూషణ్ ప్రసాద్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. -
'కిస్ ఆఫ్ లవ్'పై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు!
కొచ్చి:'నైతిక పోలీసింగ్’కు నిరసనగా పిలుపునిచ్చిన ‘కిస్ ఆఫ్ లవ్’ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించి తీరుతామని నిర్వాహకులు శనివారం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి పోలీసులు ఇంకా అనుమతి ఇవ్వనప్పటికీ ప్రజల్లో నైతిక పోలీసింగ్‌కు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు దీన్ని జరుపుతామని ‘ఫ్రీ థింకర్స్’ అనే ఫేస్బుక్ స్నేహితుల బృందం తెలిపింది. సుమారు వెయ్యి మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు కేరళ హైకోర్టు శుక్రవారం నిరాకరించడం తెలిసిందే. మోరల్ పోలీసుంగ్ను నిరసిస్తూ నవంబర్ రెండో తేదీన నిర్వహించాలని తలపెట్టిన 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమం విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే.. చట్ట విరుద్ధంగా ఏ కార్యక్రమం చేపట్టినా తాము తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కొంతమంది ఫేస్బుక్ యూజర్ల గ్రూపు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడాన్ని నిషేధించాలంటూ రెండు పిటిషన్లు కేరళ హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ కార్యక్రమంలో చట్టవిరుద్ధంగా ఏ కార్యక్రమం జరిగినా.. దాన్ని అడ్డుకోడానికి తగినంత స్థాయిలో పోలీసు బలగాలను మోహరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ఆ ముద్దుల వ్యవహారంలో మేం వేలు పెట్టం!
మోరల్ పోలీసుంగ్ను నిరసిస్తూ నవంబర్ రెండో తేదీన నిర్వహించాలని తలపెట్టిన 'కిస్ ఆఫ్ లవ్' కార్యక్రమం విషయంలో తాము జోక్యం చేసుకునేది లేదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. అయితే.. చట్ట విరుద్ధంగా ఏ కార్యక్రమం చేపట్టినా తాము తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కొంతమంది ఫేస్బుక్ యూజర్ల గ్రూపు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడాన్ని నిషేధించాలంటూ రెండు పిటిషన్లు కేరళ హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ కార్యక్రమంలో చట్టవిరుద్ధంగా ఏ కార్యక్రమం జరిగినా.. దాన్ని అడ్డుకోడానికి తగినంత స్థాయిలో పోలీసు బలగాలను మోహరిస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. దీంతో ఎర్నాకులం ప్రభుత్వ న్యాయకళాశాల, శ్రీ సత్యసాయి అనాథల ట్రస్టులకు చెందిన ఇద్దరు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎం షఫీక్‌లతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. ఐపీసీలోని నిబంధనలను ఈ కార్యక్రమం ఉల్లంఘిస్తోందని, ఇది భారతీయ సంస్కృతికి కూడా విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశంలో అసభ్యతను నిరోధించాల్సిందిగా ఎర్నాకులం జిల్లా కలెక్టర్, నగర పోలీసు కమిషనర్లను ఆదేశించాలని కోరారు. నిరసన తెలపడం ప్రాథమిక హక్కు అని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అణగదొక్కడానికి వీల్లేదని కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితాల ఓ ఫేస్బుక్ పోస్టులో వ్యాఖ్యానించారు. అయితే నిరసనకారులు మాత్రం శాంతిభద్రతల సమస్యను సృష్టించకూడదని ఆయన అన్నారు. గతవారం కోజికోడ్‌లోని ఓ హోటల్లో అసభ్య కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ కొంతమంది భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు అక్కడ విధ్వంసం సృష్టించారు. దీనికి నిరసనగానే నవంబర్ రెండో తేదీ ఆదివారం నాడు కౌగిలింతలు, ముద్దులతో బహిరంగ నిరసన నిర్వహించాలని వివిధ పక్షాలు నిర్ణయించాయి. -
బార్ల యజమానుల పిటిషన్‌ను కొట్టివేసిన కేరళ హైకోర్టు
కొచ్చి: కేరళలోని 418 బార్లను మూసివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కేరళ హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానం ప్రకటించిన నేపధ్యంలో ఆ రిట్‌కు విలువలేదని కోర్టు తెలిపింది. బార్ యజమానులు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ కెటి శంకర్, జస్టిస్ పిడి రాజన్‌లతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ పరిశీలించింది. ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానం ప్రకటించినందున ఆ పిటిషన్‌కు విలువలేదని బెంచ్ కొట్టివేసింది. ** -
కేరళ గవర్నర్‌గా సదాశివం ప్రమాణ స్వీకారం
తిరువనంతపురం: కేరళ గవర్నర్‌గా పి.సదాశివం శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని రాజ్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పి.సదాశివం చేత కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అశోక్ భూషణ్ ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, ఆయన మంత్రివర్గ సహాచరులు, ఉన్నతాధికారులతోపాటు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పి.జె.కురియన్, కేరళ అసెంబ్లీ స్పీకర్ జి.కార్తీకేయన్లు హాజరయ్యారు. అయితే కేరళ గవర్నర్‌గా యూపీఏ హాయాంలో నియమితులైన షీలా దీక్షిత్ రాజీనామా చేయడంతో... బీజేపీ ప్రభుత్వం పి.సదాశివంను ఆ పదవిలో నియమించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించిన సదాశివం ఈ ఏడాది ఏప్రిల్‌లో పదవి విరమణ చేసిన సంగతి తెలిసిందే. -
రేప్‌లపై హైకోర్టు ముందు అర్ధనగ్న నిరసన
ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అత్యాచారాలపై కేరళ మహిళలు తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. ఐదుగురు మహిళా కార్యకర్తలు తొలుత నగ్నంగా మారి, తర్వాత కేవలం ఒక వస్త్రాన్ని తమ ఒంటిచుట్టూ కప్పుకొన్నారు. అది కూడా కేరళ హైకోర్టు ఎదురుగా!! 'స్త్రీ కూటైమ' (మహిళా గ్రూప్) అనే దళానికి చెందిన ఐదుగురు మహిళలు దేశ జాతీయ పతాకంలోని మూడువర్ణాలకు ప్రతీకగా ఆకుపచ్చ, తెలుపు, కాషాయరంగు వస్త్రాలను కప్పుకొని అత్యాచారాలను నిరోధించాలంటూ నినాదాలు చేశారు. ఈ దళంలో మొత్తం 30 మంది మహిళలున్నారు. వీరిలో ఐదుగురు అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేయగా, మిగిలినవారు నినాదాలు ఇచ్చారు. అయితే, కోర్టు ముందు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారని, అసభ్యంగా ప్రవర్తించారని, బహిరంగ ప్రదేశంలో న్యూసెన్స్ సృష్టించారని పోలీసులు ఈ ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకుని, తర్వాత వారిని బెయిల్ మీద విడిచిపెట్టారు. -
పార్టీల ఆఫీసుల్లో పెళ్లిళ్లు చేయొద్దు: కేరళ హైకోర్టు
కొచ్చి: రాజకీయ పార్టీల కార్యాలయాల్లో జరిగే పెళ్లిళ్లను చట్టప్రకారమైనవిగా అంగీకరించబోమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ఆంటోనీ డొమినిక్, జస్టిస్ అనిల్ కె నరేంద్రన్‌లతో కూడిన బెంచ్ ఈ మేరకు రూలింగ్ ఇచ్చింది. తన కూతురి ఆచూకీ కోసం ఓ తండ్రి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ ఆదేశాలు వెలువరించింది. ఫిర్యాదుదారుడి కుమార్తె ఫిబ్రవరి 10 నుంచి కనిపించకుండా పోయింది. కుట్టానాడ్ ప్రాంతంలోని నెడిముడిలో ఉన్న స్థానిక సీపీఎం పార్టీ కార్యాలయంలో 19న ఆమె పెళ్లి చేసుకుంది. దీనిపై యువతి తండ్రి కోర్టును ఆశ్రయించారు. రాజకీయ పార్టీల ఆఫీసుల్లో జరిగే వివాహాలను అంగీకరించబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది. వీటిని చట్టవిరుద్ధమైనవిగా పరిగణిస్తామని పేర్కొంది. -
రేపిస్టుకు మరణ శిక్ష విధించిన కేరళ హైకోర్టు
కొచ్చి: అత్యాచార నిందితుడికి మరణ శిక్షను ఖరారు చేస్తూ కేరళ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కింది కోర్టు విదించిన అదే శిక్షను సమర్ధించింది. తమిళనాడుకు చెందిన గోవిందా చామియా అనే యువకుడు ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనపై విచారించిన పీ.ఆర్.రామచంద్రన్ నాయర్ మరియు పి. కమల్ పాషాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును ప్రకటించింది. అత్యాచార నిందితుడు చామియాకు మరణ శిక్షతో పాటు రూ.లక్ష చెల్లించాలని తెలిపింది. ట్రైన్లో రేప్‌లకు గురౌతున్న వారిని రక్షించడానికి భారత రైల్వేలు, న్యాయవాదులు, తోటి ప్రయాణికులు ముందుకు రాకపోవడం చాలా బాధాకరమని పేర్కొంది. 2011 వ సంవత్సరం, ఫిబ్రవరి 1 వ తేదీన ట్రైన్లో ప్రయాణిస్తున్న 23 ఏళ్ల యువతి వద్ద ఓ యువకుడు ప్రేమ ప్రస్తావన తెచ్చి, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. కాగా దీనికి ఆ యువతి నిరాకరించడంతో కదులుతున్న ట్రైన్ లోంచి ఆమెను తోసేసిన అనంతరం అతను కూడా దూకేశాడు. అప్పటికే తీవ్రంగా గాయపడిన ఆ యువతి ప్రతిఘటించడంతో ఆమెను రాయితో తలపై బలంగా మోది అత్యాచారం చేశాడు.ఆమె చికిత్స పొందుతూ అదే సంవత్సరం ఫిబ్రవరి ఆరవ తేదీన మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు కావడంతో కింది కోర్టు చామియాకు మరణశిక్షను ఖరారు చేసింది. ఈ తీర్పును హైకోర్టు సమర్ధిస్తూ అతనికి మరణశిక్ష పబబేనని తెలిపింది. ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు తోటి ప్రయాణికులు అండగా నిలవకపోవడాన్ని కేరళ హైకోర్టు తప్పుబట్టింది. ఇటువంటి సంఘటనలపై భారతీయ రైల్వేలు కూడా సరైన చర్యలు చేపట్టకపోవడాన్ని విమర్శించింది.