Kerala Court Banned Use of Varaha Roopam Song in Theatres and OTT Platforms - Sakshi
Sakshi News home page

Kantara Movie: కాంతార చిత్రాబృందానికి షాకిచ్చిన కేరళ హైకోర్టు

Published Fri, Apr 14 2023 7:22 PM | Last Updated on Fri, Apr 14 2023 7:37 PM

Kerala court bannned use of Varaha Roopam in theatres and OTT Platforms - Sakshi

కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం 'కాంతార'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అయితే ఈ చిత్రంలోని సూపర్‌ హిట్ సాంగ్ వరాహ రూపం పాటపై వివాదం వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సాంగ్ బాణీని కాపీ కొట్టారంటూ కేరళకు చెందిన 'తైకుడం బ్రిడ్జ్' అనే మ్యూజిక్​ బ్యాండ్ ఆరోపించింది. అంతేకాకుండా న్యాయపోరాటానికి కూడా దిగింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు కాంతారా చిత్ర బృందానికి షాకిచ్చింది. 

పాటపై నిషేధం

వరాహ రూపం సాంగ్‌ను థియేటర్స్‌, డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల్లో ఉపయోగించడంపై నిషేధం విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పాట విషయంలో చిత్రబృందం ప్రాథమిక కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించిందని పేర్కొంది. తైకుడం బ్రిడ్జ్‌కు చెందిన నవరసం నుంచి కాపీ కొట్టారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు మే 4లోగా అందజేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. అయితే గతంలో సినిమా నుంచి పాటను తొలగించాలన్న కేరళ హైకోర్టు ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. 

అసలేం జరిగిందంటే ?

కాంతార సినిమాలో వరాహ రూపం ఓ రేంజ్‌లో హిట్‌ అయింది. అయితే ఆ సాంగ్ బాణీని తాము రూపొందించిన 'నవరసం' నుంచి కాపీ కొట్టారంటూ కేరళకు చెందిన 'తైకుడం బ్రిడ్జ్' అనే మ్యూజిక్​ బ్యాండ్ కోర్టును ఆశ్రయించింది. పాట ప్రదర్శన నిలివేయాలని పిటిషన్​ దాఖలు చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement